Friday, August 12, 2016

ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో కష్టే ఫలే కబుర్లు ధారావాహిక ! జిలేబీయం

ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో కష్టే ఫలే కబుర్లు ధారావాహిక !

గురుడు కన్యారాశి లో ప్రవేశిస్తున్న ఈ శుభ దినాన బ్లాగు లోకపు వారి సౌలభ్యం కోసం ప్రైవేట్ అయిన బ్లాగు నించి కష్టే ఫలే వారి టపాలు జిలేబి బ్లాగు ఓ ఫ్యాన్ ఆర్ట్ విత్ జేకే జిలేబీయం లో ధారా వాహిక గా రాబోతోందని తెలియ జేయడానికి సంతోషిస్తున్నా !

తెలుగు వారి పంచ దశ లోకమనబడు ఈ బ్లాగు లోకం లో కష్టే ఫలే వారి ని వారి టపా మాధుర్యాన్ని తెలియని వాళ్ళు ఉండరని అంటే అతి శయోక్తి కాదు; కాని ఈ మధ్య వారి బ్లాగు సెలెక్టివ్ ఇంటలిజెంషియా వారికి మాత్రమె పరిమిత మై పోవడం తో వారి టపాలని తెలుగు వాళ్ళందరూ చదవడానికి సౌకర్యం లేకుండా పోయింది (ముఖ్యం గా జిలేబి చదవడానికి :))

కాబట్టి వారి టపా మాధుర్యాన్ని గూగల్ సెర్చ్ లో మళ్ళీ కనబడేలా చేయడానికి ఈ పునర్బ్లాగీకరణం చేయడం జరుగుతోంది; వారి పేరు మీదనే ఈ టపాలన్నీ ప్రచురించ బడతాయి  ;

అందరికి ఉపయోగ పడుతందని ఆశిస్తో !

మొదటి టపా కై ఓ ఫ్యాన్ ఆర్ట్ విత్ జేకే జిలేబీయం లో వచ్చిన టపా !


— శర్మ కాలక్షేపం కబుర్లు—
Posted on సెప్టెంబర్ 23, 2011 

గురు, దైవ వందనం

 కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు.
అడుక్కునైనా చదువుకోమన్న శ్రీ దేవరభట్ల రామా రావు గారికి నమస్కారాలు. శ్రీ. చెఱుకుపల్లి హనుమత్ కవిరాట్ లక్ష్మణశాస్త్రిగారికి, జోస్యుల వేకట నరసింహంగారికి, సమయపాలన నేర్పిన వర్రె అప్పలరాజు మాస్టరికి, తెలుగు మాస్టారు సుబ్రహ్మణ్యంగారికి, జాన్ మాస్టారికి వందనములు.

నేటి కాలంలో బోధగురువులు శ్రీచాగంటి కోటేశ్వర రావుగారికి నమస్కారం. తెలుగు వ్రాయడానికి తన బ్లాగు ద్వారా సహకారం అందించిన శ్రీభైరవభట్ల కామేశ్వర రావు గారికి నమస్కారం. నాలుగు తెలుగు అక్షరాలు తప్పులేకుండా వ్రాయడం వచ్చినంతనే బ్లాగు వ్రాయమని ప్రొత్సహించిన భమిడిపాటి ఫణిబాబుగారికి వందనం. ఏందరో మహానుభావులు అందరికీ వందనం.

పూర్తి గా చదవడానికి రాబోవు టపాలు చదవడానికి ఈ లింకు నొక్కవలె


శుభోదయం
జిలేబి
 

55 comments:

 1. ఈ ప్రయత్నం సరికాదు.
  కష్టేఫలీశర్మగారు కావాలనుకుంటే తమటపాలను బ్లాగులో ఉంచలేరా? వారు ఇకచాలు వద్దు అనుకున్నారు. మధ్యలో జిలేబీగారు దూరి వారిబ బ్లాగుటపాలను నేను ప్రకటిస్తాను అనటం అక్రమం అనైతికం. ఇది ఆయన్ను క్షోభపెట్టాలన్న దురుద్దేశం తప్ప మరేమీ కాదు. చాలించండి దుండగాలు.

  ReplyDelete
 2. దీనినే ఆంగ్లమున sabotage అందురు. శ్యామలీయం గారి అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నాను.

  ReplyDelete
 3. జిలేబీగారూ ! మీరు ఈ పని చేయ సంకల్పించడం తెలుగు బ్లాగర్లకు ఎవరికీ సంతృప్తి కాదు, ఆమోదం కాదు . మీరేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లు ఫీల్ అవకండి .
  ఇది నిజంగా ఎదుటివారి బెడ్ రూమ్ లో దొంగతనంగా చూసి వేరేవారికి చెప్పడం అంత మహా పాపం.
  ఈ శుభదినాల్లో ఇటువంటి చెడుకార్యం చేయతలపెట్టడం మహా పాపం అని నా అభిప్రాయం ..
  వెంటనే క్షమాపణలు వేడుకుంటే మేలు !

  ReplyDelete

 4. ఆదరణ కోల్పోతూ ఒక పల్లెటూరి భాషగా మిగిలిపోతున్న ప్రపంచ భాషలలో కెల్లా గొప్పదైన తేనే లాంటి మన తెలుగును అంతరించిపోయే ప్రమాదం నుండి కాపాడుదాం. మన తెలుగు భాష మాధుర్యాన్ని, మన తెలుగు జాతి గొప్పదనాన్ని దశ దిశలా చాటుదాం.

  జిలేబి

  ReplyDelete
 5. కామెంట్లు తొలగించడం మేము ఏవిధంగా అర్ధం చేసుకోవాలి "జిలేబీ" గారూ (సారీ మీ అసలు పేరు తెలీదు)

  ReplyDelete

 6. మాచన వారికి నమస్సులు


  కందకు లేని దురద లీ
  చిందుల రాయుళ్లకేల చెప్పు జిలేబీ ?
  డెందము నింపెడు మాచన
  సుందర సొబగగు టపాల సొమ్మందిరిదీ

  జిలేబి

  ReplyDelete


 7. ప్రాణంబుల నెవరిచ్చెన్?
  జ్ఞానంబుల నిచ్చెనెవరు జగదంబ కదూ ?
  గానంబు మీ టపా మధు
  రానందంబుల నిలుపక వ్రాయుము యొజ్జా !

  జిలేబి

  ReplyDelete
 8. జిలేబిగారు,
  నమస్కారం.
  నమస్కారం తెలుగు సంస్కృతికి నిదర్శనం.
  ''ఆదరణ కోల్పోతూ ఒక పల్లెటూరి భాషగా మిగిలిపోతున్న ప్రపంచ భాషలలో కెల్లా గొప్పదైన తేనే లాంటి మన తెలుగును అంతరించిపోయే ప్రమాదం నుండి కాపాడుదాం. మన తెలుగు భాష మాధుర్యాన్ని, మన తెలుగు జాతి గొప్పదనాన్ని దశ దిశలా చాటుదాం.''


  మీకు తెనుగు భాష పట్ల ఉన్న మక్కువకు ఆనందం.
  ''కందకు లేని దురద లీ
  చిందుల రాయుళ్లకేల చెప్పు జిలేబీ ?
  డెందము నింపెడు మాచన
  సుందర సొబగగు టపాల సొమ్మందిరిదీ''

  తప్పుచేస్తూ దొరికినవాడు చివరిగా మాటాడేమాట ఇదే కదూ

  నా బ్లాగు టపాలను సంస్కరించి మరల ప్రచురించడం లేదా పుస్తకరూపంలో తీసుకురావడం కోసం ప్రైవేట్ చేశా. ”నాకేదీ ఆహ్వానం, కాదు, నా కోరిక ఎందుకు మన్నించలేదనేదే” మీ మనసులోబాధ. మీరు ప్రతి విషయాన్నీ సంచలనం చేయాలనుకుంటారు, అది నాకు నచ్చదు అందుకే మీకు ఆహ్వానం పంపలేదు, మీరు బ్లాగు దర్శించడానికి కోరితే సమ్మతించలేదు.

  మీరు నా బ్లాగు టపాలు చదవక ఉండలేనట్టుగా మీ మాటలవల్ల తెలుస్తోంది, చాలా సంతసం.
  ప్రాణంబుల నెవరిచ్చెన్?
  జ్ఞానంబుల నిచ్చెనెవరు జగదంబ కదూ ?
  గానంబు మీ టపా మధు
  రానందంబుల నిలుపక వ్రాయుము యొజ్జా !

  మీకు తెనుగు భాష పట్ల ఉన్న మక్కువకీ సంతసం. అందుకుగాను నా బ్లాగును ఇప్పటివరకు ఉన్న టపాలను సంసరించి ఇచ్చేస్తా! పుస్తకం/పుస్తకాలుగా వేసుకోండి, తెనుగు పట్ల మక్కువను అలా చాటండి. ''పేకాట పేకాటే పెద్దన్నయ్య పెద్దన్నయ్యే! వ్యాపారం వ్యాపారమే!'' నా బ్లాగులో టపాలు మీకివ్వడానికి,

  ౧. మీరు ఎన్ని భాగాలుగా వేసుకుంటే అన్ని భాగాలకూ ఒక్కొక భాగానికి ౨౫౦ కాపీల వంతున ఇవ్వండి, నాకు. మిగిలిన ౭౫౦ కాపీలు అమ్ముకోండి. తరవాత ప్రచురణల్లో ౨౦౦ కాపీలివ్వండి. మొత్తానికిప్పుడు ఒక ఐదువేల రూపాయలివ్వండి.
  లేదా
  ౨.ఏక మొత్తంగా ౩౦,౦౦౦/- ఇచ్చి బ్లాగులో టపాలు స్వంతం చేసుకోండి.
  లేదా
  ౩. నాకు ౧౫౦౦౦/- రూపాయలివ్వండి, ౧౫౦ కాపీలివ్వండి ఈ ప్రచురణకి.
  లేదా
  ౪.మీకెలా లాభమో ఆలోచించుకుని చెప్పండి.
  నేనడిగినది రోజుకూలి రెండు రూపాయలు కూడా కిట్టలేదు.

  కాదు నేను ప్రచురిస్తా బ్లాగులో మళ్ళీ అంటే మీరింత నష్టం నాకు కలగజేస్తున్నట్టే! ఆలోచించండి.''మాచన వారికి నమస్సులు''
  ఉత్తి నమస్కారాలతో కడుపులు నిండవు. అందుకే మనకవులు,కళాకారులు ఇలా అయిపోతున్నారు గమనించండి.
  కాదు నేను ప్రచురిస్తానంటారా? ''అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టూ'', ''నువ్వు పప్పు పట్రా, నేను పొట్టు తెస్తా! గుళ్ళో కూచుని సమానంగా పంచుకు తిందామన్నట్టు లేదూ!'' నాకు నష్టం కలగజేయడమే తమ అభిమతమా?


  ReplyDelete

 9. శర్మ గారికి

  నెనర్లు మీరు మౌనం వీడి మీ మనస్సు విప్పినందులకు .

  మీ మాటే వేదం

  ప్రచురించను ; మీ రా ప్రయత్నం లో ఉన్నప్పుడు దానికి ఆటంకమూ రానివ్వను ; ఆ ముందు టపా తో సహా డిలీట్ :)

  కుశలమేనా ?

  మాచన ! వివేక ముల మూ
  టై చదువరులకు జిలేబి టైమ్సుగ యుండెన్
  యోచన చేయుము యొజ్జా
  ఆ చదువులతల్లి యాన అలసత వలదోయ్

  చీర్స్
  జిలేబి

  ReplyDelete

 10. చదువరు లందరికీ (చిందుల రాయుళ్లు చేసిన హంగామా కి చీర్సు తో వారిలో ఒకరు ఈ టపాల నిచ్చి సహకారం చేసినందులకు ) మా మాచన వారి కోరిక మీద ఈ ధారావాహిక రాదు.

  భవదీయ
  సావేజిత
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. కథ సుఖాంతమయ్యె గౌరవ ప్రదముగ
   తప్పు నొప్పు కొనుట తమరి గొప్ప ,
   తప్పు చేసి కూడ తప్పించుకో జూచు
   ఘనుల యశము తమది కాదు గనుక .

   Delete


 11. పార్థసారథి పలుకులు


  సారథి నేనై యుండగ
  భారత యుద్ధమున నోడి పార్థుఁడు సచ్చెన్
  పోరాడలేక యనునది
  కారాదు జనుల పలుకులు కదనము సలుపూ

  జిలేబి

  ReplyDelete
 12. డబ్బుకు ఠా జిలేబీ ముఠా ...
  అమ్మయ్య కాపీ రైటు చట్టాన్ని
  మాతాశ్రీ గుర్తించేట్లుగా చేయగలిగారు
  శర్మ గారు. ఎట్టకేలకు.
  "మీరా ప్రయత్నంలో లేరు గనుకా" ...
  అంటూ రెడ్డి గారి చాటున మళ్ళీ
  నాటకానికి తెర తీయకండి పెద్దమ్మా ...

  ReplyDelete


 13. మార్వాడీ లెక్కలు యే
  లార్వాచీనంబు తల్లి లాలన మేలౌ
  సర్వాంగ భూషిత మయపు
  పర్వపు దినమందు యేల పయిసల బేరాల్ :)

  జిలేబి

  ReplyDelete

 14. ఈ కార్యక్రమమునకు తమ వంతు జిలేబీయంగా సహాయ సహకారాలందించి ఈ టపా ద్వారా మా మాచన వారు మససు విప్పి పలుకుటకు వీలు కలిగించిన మా గురువులుంగారు శ్యామలీయం మాష్టారు వారికి నెనర్లు


  చిందులు జేసిరి అయ్యలు
  యిందులకు నెనర్లు మీకు, యీ ప్రహసనమున్
  అందముగ తీర్చి దిద్దిరి
  గంధము బూయుము జిలేబి గట్టి గురువుకున్ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. కథ సుఖాంతం. సర్వేజనాః సుఖినో భవంతు.
   మీరు గురువు నంటున్నారు కాబట్టి తప్పులు దిద్దక తప్పదు నాకు. గురువునకున్ అన్నది సరైన ప్రయోగం. రామునకు అనే కాని రాముకు అని వ్రాయకూడదు. సంప్రదాయకకవిత్వం వ్రాస్తున్నప్పుడు తగిన భాషామర్యాదలు కూడా మనం‌ పాటించాలి. కాబట్టి చెప్పటం. అంతే. సంధులను గౌరవించకతీరదు ఈ విధానంలో. పద్యం మధ్యలో అచ్చులు వచ్చే అవకాశం సాధారణంగా ఉండదు. చేసిరి అన్నపదాన్ని మీరు జేసిరి చేసారే, అది పొరపాటు. అక్కడ ఏ సంధీ లేదు. రాదు. అలాగే చేసిరి + అయ్యలు -> చేసి రయ్యలు అనే అవుతుందనీ గమనించాలి. ప్రహసనమున్ + అందముగ అన్నప్పుడు చచ్చినట్లు సంధి జరుగుతుంది ప్రహసము నందముగ అని వ్రాయక తీరదు. మీరు కొంచెం కొంచెంగా కందం అల్లటంలో పట్టుని పెంచుకుంటున్నా రన్నది తెలుస్తోంది. ఇంకా పరిశ్రమ చేయాలి. బాగా గ్రంథ భాషలో కావ్యాదులు పఠించటం ఒక మంచి ఉపాయం. వ్యావహారికంలో వ్రాయటం తప్పుకాదు. అలా కూడా ఒప్పించగలిగేలా భేషుగ్గా వ్రాయవచ్చును. నేను కూడా కొన్ని అలా వ్రాసినవీ ఉన్నాయి. అటు గ్రంథభాషాకాదు, ఇటు వ్యావహారికభాషా కాదు అన్నట్లుగా వ్రాస్తే అందగించదు. కాదూ మా చిత్తం మాది, అందిగిస్తోంది పొండి అనే పక్షంలో నాకు ఇబ్బంది లేదు. నేనేమీ యశస్వినీ కాదు ఏవిధంగానూ ఘనుణ్ణీ‌ కాదు కాబట్టి నా మాటలకు విలువ ఇవ్వవలసిన అవసరమూ వత్తిడీ‌ మీకు ఉందవలసిన అగత్యమూ లేదు.

   Delete

  2. ధన్యవాదాలండీ శ్యామలీయం వారు ; కథ ఇంకా పూర్తి సుఖాంతం కాలేదు ; మీ బ్లాగులో జీకెకె వారు చెప్పినట్టు మాచన వారు స్వయం ప్రకటిత అౙ్నాత వాసం నించి బయటకు వచ్చినప్పుడే అది అవుతుంది

   కాబట్టి మరి కొన్నాళ్లు వేచి చూద్దామనుకుంటున్నా !


   జిలేబి

   Delete
  3. జిలేబీగారు పొరపాటు పడుతున్నారు. మాచనవారు తమ ఇష్టప్రకారం తమ బ్లాగును నడిపించుకొనే స్వేఛ్ఛను కలిగి ఉన్నారని మరిచిపోతున్నారు. దుడుకుపనులు ప్రయోజనాన్నీ కలిగించవు, యశస్సునీ కలిగించవు. సముదాచారాన్ని మీరవద్దని మరొకసారి మీకు విజ్ఞప్తి.

   Delete
 15. జిలేబీ(??) గారూ!
  మీ ఆలోచనను శాశ్వతంగా మానుకోండి...
  -ఓ చిందులరాయుడు

  ReplyDelete

 16. పై యిద్దరికి

  ధన్య వాదాలండీ మీ యిద్దరి సలహాలకి ;

  కాని కుదరదండీ

  జిలేబి

  ReplyDelete


 17. గురువర్యుల కేక్సస్సుం
  డరుగున నుండగు జిలేబి డబలేక్ససు ! ఓ
  నరసింహ రాయ ! చిందుల
  పరమావధి నెరుగు మోయి పండిత పుత్రా :)

  జిలేబి

  ReplyDelete
  Replies

  1. విన్నకోటవారి సందేహ నివృత్తి :)

   సందేహం :- శర్మ గారి ప్రైవేట్ బ్లాగుకి "జిలేబీ" గారిని "దేవిడీ మన్నా" చేసినట్లు శర్మ గారి వ్యాఖ్య ద్వారా తెలుస్తోంది, మరి పునఃప్రచురణ చేయాలనుకున్న "జిలేబీ" గారికి ఆ బ్లాగుటపాలు ఎలా లభ్యమయ్యాయి?

   Delete

  2. యిప్పటికీ అర్థం కాక పోతే జిలేబి ఏమీ చేయలేదు :)

   జిలేబి

   Delete
  3. జిలేబీగారూ,
   పండితపుత్రా ఏమిటండీ? తప్పు.
   ఆ మాట అర్థం తెలిసే ప్రయోగించారా?
   కొంపదీసి పండితుని పుత్రుడు అని పొరబడుతున్నారా?
   " విద్య యొసగును వినయంబు "
   పై సూక్తిని మరువకండి.

   Delete

  4. శ్యామలీయం వారు

   పండితపుత్రా కాదండి.

   పండిత పుత్రా

   రెండింటికీ తేడా మధ్యలో శూన్యం :)


   చీర్స్
   జిలేబి

   Delete

  5. ఈ పండిత పుత్రా మరీ కొంపలు దీసే వ్యవహారం గా ఉంది :) కాబట్టి పండిత మిత్రా అని చదువు కోవలసినది !


   జిలేబి

   Delete
  6. సవరించిన పద్యం

   గురువర్యుల కేక్సస్సుం
   డరుగున నుండగు జిలేబి డబలేక్ససు ! ఓ
   నరసింహ రాయ ! చిందుల
   పరమావధి నెరుగు మోయి పండిత మిత్రా !


   పండిత పుత్ర్రీ !
   జిలేబి


   Delete
 18. ఆంగ్లాన్ని తెలుగున కలవోకగా చేర్చి
  మాటల పేటల్లు మహిత శైలి
  ప్రాచీన నూతన ప్రముఖ సాహిత్యాల
  వైదుష్యమున్న సంపన్న శైలి
  ఎంతటి బుధులను వింత వంతలు బెట్టి
  నీళ్లు దాగించు పదునైన శైలి
  వంకర ఘనులకు పుంఖాను పుంఖాలు
  బిట్టుగా వాతలు బెట్టు శైలి

  ఎదిరి నొడ్డి పోరాడు ప్రావీణ్య శైలి _
  ప్రతిభ లన్నియు నొక్కచో పరిమళించు
  పరమ ధీశాలి కలగుండువడి , కనలియు -
  కరము శాంతము బూనుట ఘన హితమ్ము .

  ReplyDelete
 19. ఆంగ్లాన్ని తెలుగున కలవోకగా చేర్చి
  మాటల పేటల్లు మహిత శైలి
  ప్రాచీన నూతన ప్రముఖ సాహిత్యాల
  వైదుష్యమున్న సంపన్న శైలి
  ఎంతటి బుధులను వింత వంతలు బెట్టి
  నీళ్లు దాగించు పదునైన శైలి
  వంకర ఘనులకు పుంఖాను పుంఖాలు
  బిట్టుగా వాతలు బెట్టు శైలి

  ఎదిరి నొడ్డి పోరాడు ప్రావీణ్య శైలి _
  ప్రతిభ లన్నియు నొక్కచో పరిమళించు
  పరమ ధీశాలి కలగుండువడి , కనలియు -
  కరము శాంతము బూనుట ఘన హితమ్ము .

  ReplyDelete

 20. లక్కాకుల వారు

  నమో నమః !

  మీ ప్రోత్సాహమే మాకు పూర్తి బలం !


  చీర్స్
  జిలేబి

  ReplyDelete
 21. నిరాశ కలుగుతోంది.
  ఇటువంటి బ్లాగుప్రపంచంలో ఉండకపోతేనే మంచిదేమో.
  జిలేబీగారూ, రాజారావు గారి వంటి వారు భళీభళీ అనవచ్చును కాక, మీ తెంపరితనం జుగుప్స కలిగిస్తోంది.

  ReplyDelete
 22. స్వాతంత్ర్య దిన శుభాభినందనలు.

  ఫ్లాష్! ఫ్లాష్!!ఫ్లాష్!!!

  నా పాత టపాలు చదవక ఉండలేనివారి కోరికపై ఈ కింది కొత్త బ్లాగులో నా పాత టపాలు ధారావాహికగా ప్రచురిస్తున్నాను.
  https://kastephali.wordpress.com
  ధన్యవాదాలు.

  ReplyDelete
  Replies
  1. కాగల కార్యం గంధర్వులే తీర్చినారు

   Delete
  2. శర్మగారు పొరబడ్డారని నా అభిప్రాయం. చదువలేక ఉండలేని వారా ఈ గోల చేసినవారు? తమకు ఆహ్వానం రాలేదని కక్షసాధింపు కోసం చేసినవారు కాక? దానికి తోడు ఇటువంటి వారిని ఆకాశానికి ఎత్తుతూ భజసచేసేవారు కూడా బయలుదేరారండి. కలికాలం కాకపోతే చోరత్వాన్నీ వీరత్వంగా ప్రశంసించటమేనా? దౌర్జన్యాన్ని సౌజన్యంగా ప్రశంసించటమేనా? దురాచారాన్ని ప్రతిభావంతమైన కొత్త సదాచారంగా భావించటమేనా? ఈ తెలుగుబ్లాగులోకం ఇంత దిక్కుమాలిన దైపోతున్నదా?

   Delete
  3. ఒకచో నవోన్మేష ముదయించు ధిషణకు
   అక్షర రూప హృద్యంగమమ్ము
   ఒకచోట దర్శించి వికలమై హృదయమ్ము
   స్పందించి వ్రాసిన భావ చిత్ర
   మొకచో మనోల్లాస చకిత జీవన మధుర
   రమణీయ భావనా రస విశేష
   మొక్కచో బ్లాగర్ల కొక్కింత మార్గ ద
   ర్శనము శాయంగల ప్రతిభ లున్న

   అనుభవ జ్ఞాని , జగమెరిగిన బుధుండు ,
   నియతి 'కష్టే ఫలే' బ్లాగు నిర్వహించు
   హితుడు 'భాస్కర శర్మ' మాకిష్టు -డరయ
   బ్లాగు లోకాన వెలసిన భాస్కరుండు

   వట్టి కబురులు గావు - చేవ గల జీవి
   తానుభవ సత్యములు – నేటి మానవులకు
   మార్గ దర్శకము-లప్రతిమాన ప్రతిభ
   రూపు దాల్చిన శర్మగారూ ! నమస్సు .


   Delete
  4. ఒకచో నవోన్మేష ముదయించు ధిషణకు
   అక్షర రూప హృద్యంగమమ్ము
   ఒకచోట దర్శించి వికలమై హృదయమ్ము
   స్పందించి వ్రాసిన భావ చిత్ర
   మొకచో మనోల్లాస చకిత జీవన మధుర
   రమణీయ భావనా రస విశేష
   మొక్కచో బ్లాగర్ల కొక్కింత మార్గ ద
   ర్శనము శాయంగల ప్రతిభ లున్న

   అనుభవ జ్ఞాని , జగమెరిగిన బుధుండు ,
   నియతి 'కష్టే ఫలే' బ్లాగు నిర్వహించు
   హితుడు 'భాస్కర శర్మ' మాకిష్టు -డరయ
   బ్లాగు లోకాన వెలసిన భాస్కరుండు

   వట్టి కబురులు గావు - చేవ గల జీవి
   తానుభవ సత్యములు – నేటి మానవులకు
   మార్గ దర్శకము-లప్రతిమాన ప్రతిభ
   రూపు దాల్చిన శర్మగారూ ! నమస్సు .


   Delete

  5. ఈ శ్యామలీయం వారు మళ్ళీ ఇట్లా చిచ్చు పెట్టటం లో అంతరార్థం ఏమన్నా ఉందా ?


   జిలేబి

   Delete

 23. మా మాచన వఝ్జుల వారికి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు‌!

  స్వాతంత్ర దినము నాడు మీరు శృంఖలాల నుంచి తెలుగు బ్లాగు లోకాని కి విముక్తి నివ్వడం ముదావహమైన విషయం


  జగదంబ మాటలను వినె
  ను గదా మా మాచనుండు నూరేళ్లాయుష్ !
  జగముల మేల్కొలుపుము యొ
  జ్జగాను పంచదశలోక జగదానందా !


  జేజేలు
  జిలేబి

  ReplyDelete


 24. మాచన వారికి


  ఇక దేవిడి మన్నా కి విముక్తి/ ప్రవేశము కోసం మీ అప్రూవల్ కి ఎదురు చూస్తున్నా !


  ఇట్లు
  భవ ధీశాలి

  జిలేబి

  ReplyDelete


 25. మాచన వారికి


  ఇక దేవిడి మన్నా కి విముక్తి/ ప్రవేశము కోసం మీ అప్రూవల్ కి ఎదురు చూస్తున్నా !


  ఇట్లు
  భవ ధీశాలి

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఆహా| ’భవదీయుడు‘ అను పదమునకు స్త్రీ వాచకము భవ ధీశాలి!
   సంచలన తీర్థ స్వామిని వారూ, ఎవ్వడూ పుట్టించకపోతే పదాలెలా పుడతాయ్?
   చిన్నమయా, వేయ్ వీరికి రెండు జిలేబీ చుట్టలు!

   Delete
 26. ఖ్యాతి వహించి నట్టి ఘను లక్కట నా పలు పద్య మాలికల్
  వ్రాతలు తస్కరించి తమ బ్లాగున వేసిరి , ముందనుఙ్ఞ లే
  దే! తమ చేతలేమొ ఘనతే , పెర వారివి తప్పిదా లగున్ ,
  నీతులు జెప్పు కోవిదుల నీమము లిట్టివి , చూడ ముచ్చటౌ .

  ReplyDelete
  Replies
  1. భాష జనుల కొరకు
   --------------------------
   జన వ్యవహారము కొరకా
   ఘన పండిత సుష్టు కొరకు గలవా భాషల్?
   జన భాష నుండి విడివడి
   ఘన పండితు లుంట వారి ఘనతా ! అహమా?

   పండితుల మాట సుష్టువు!
   దండిజనుల నుండి పుట్టి తల్లి పలుకు గా
   మెండుగ వ్యవహారము నం
   దుండు పలుకు సుష్టువు నకు దూరంబగునా?

   భాష జనుల కొరకు , పండితులకు గాదు ,
   ప్రజలు మాటలాడు పలుకు సుష్టు ,
   పదము మారు , దాని పరమార్థమును మారు
   మార్పు లేని భాష మరణమొందు.

   ఎరుకగల వారమందురు ,
   అరమరికలు లేని జనుల వ్యవహారములో
   విరిసిన తాజా మల్లెల
   పరిమళ పదసంపద లకు పరిహాసములా!

   ప్రజల నాల్కల పయి బ్రతుకును భాషలు ,
   పండితుల మెదళ్ళ పైన కాదు,
   ప్రజల నాల్కల పయి పరవశించు పలుకు
   జీవ గుళిక , గొప్ప చేవ కలది .
   ----- అనే ఈ నా పోస్టును
   మొత్తంగానూ , యథాతథంగానూ తమ పోష్టులో
   వేశారు.
   పై పోష్టులో రాసింది భాషపై నాకున్న ఖచ్చితమైన అబిప్రాయం. వారి మీద విసుర్లవుతాయా?
   సదరు పోష్టులో నా ఇంటి పేరును హేళన చేస్తారా?
   నేనెన్నడూ వారి పేరు మీద వ్రాయలేదు. కానీ
   నా పేరు మీద మూడు పోస్టులు వేసి, నానా యాగీ చేశారు.
   నేనేది రాసినా జనరల్ గా రాస్తాను. అన్నింటినీ వారి మీద విసుర్లనుకోవడం వారి భ్రమ.

   'ఘను'లని నేనెవ్వరినీ
   అనలేదే పేరు బెట్టి , యటులెవరైనన్
   తనువుబ్బ గింజు కొనిరా
   వినయముగా నవ్వు కొందు , విధినేమందున్ ?

   నా పద్యాలలో ఒకటో అరో జన వ్యవహారము లోని పదాలుండడం నా కభిమతం.
   వారు దీనిని నిరసించి, తమ బ్లాగులో నా వ్యాఖ్యలు ప్రకటించనన్నారు. కానీ, అపార్థాలకు
   తెర దించడానికి నేడు నా వ్యాఖ్యను సమాధానంగా వారి బ్లాగు లో ప్రకటించ వలసి వచ్చింది. క్షంతవ్యుడను .
   నాకు ఎవ్వరి తోనూ విభేదాలు లేవు. భాష విషయంలో అభిప్రాయ భేదా లుండడం తప్పు కాదు. నా అభిప్రాయం నాది . ఒకరి చేత చెప్పించు కోవలసిన అగత్యం రాదు . ఇతరుల పై రుద్దాల్సిన అవసరమూ లేదు .


   Delete

  2. సెగ భేషు లక్కాకుల వారు !

   శ్యామలీయం వారు మన మీద టపా కడతారు ; మనమేమన్నా దానికి రిటార్టిస్తే కామెంట్లని ప్రచురించరు ; సో ఒన్ సైడ్ స్టోరీ లనే ఎప్పుడూ చూడాల్సి వస్తొంది

   సరి యైన జవాబు

   జిలేబి

   Delete
 27. మాచన వారికి


  దేవిడి మన్నా చెప్పిరి
  ఓ విదురా! మీ హవేలి ఓజము జనులన్
  ఠీవిగ తాకవలె, వినుము
  మా వినతి తలుపుల తెరువు మాచన వర్యా

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మాతా,
   దేవిడి మన్నా అనగానేమి? ఈ జాతీయములోని మర్మమేమి? తెలిసీ చెప్పనిచ్చగించనిచో జిలేబీ బీ లేజీ అగుగాక|

   Delete
  2. ఎట్లా గమనించటం వీలవుతుందండీ :)

   జిలేబి ఏమి రాసినా వెంటనే పొలో మని గురువులుంగారి తో సహా వచ్చి డబడబ‌ అని జిలేబి కి నాలుగు అక్షింతలు వేసేసి మాయమై పొతారు :)

   ****ఎప్పుడైనా తీరిగ్గా ఆలోచించి జిలేబి యిట్లా ఎందుకు రాసేరబ్బా‌ అని తీరిగ్గా ఆలోచించి కొంత "సపోటా" చేసి ఉంటే తెలిసి ఉండేది :)***

   జిలేబీ మాతా!
   అంత తీవ్రంగా ఆలోచించవలసిన గొప్ప మహత్తర తాత్త్విక రహస్యం ఏముంటుంది? తమ వ్యంగ్య వైభవంలో తత్త్వం కప్పబడిపోయిందేమో|
   అయినా, ఏ తాత్త్విక భూమికా లేకుండా మహత్తర సత్యాలను తమరు ఎలా ఆవిష్కరిస్తారో ఊహించలేకున్నాం. కతిపయ దినములకు పూర్వం నేను ఈ విషయమై మీకు ఒక ఉచిత సళహా కూడా ఇచ్చియుంటిని.

   Delete

  3. సిరి లేని వాసులు గారు

   మనదంతా స్ట్రైట్ ఫ్రమ్ ది సోర్స్ అండీ !

   దానికి తాత్విక భూమిక ఉండదు :)

   అదే ఆ పై తాత్వికత కి భూమిక అవుతుంది :)


   జిలేబి

   Delete


  4. దేవిడి మన్నా అంటే నాకూ తెలీదండీ ! అది చెప్పింది మా విన్న కోట వారు. వారు చెబ్తే సరిగ్గా ఉండే ఉంటుందని నేనూ ఉపయోగించేసా :)


   జిలేబి

   Delete
 28. మాతా, మరకత శ్యామా, మాతంగీ, మధుశాలినీ!!!!
  మూలవాసుల కడగండ్లను తీర్చడానికి మీలాంటి స్ట్రెయిట్ ఫ్రమ్ సోర్స్ (నేరుగా మూలంనుండి ఉద్భవించిన) భూమిక, దానిపై ఏర్పడిన తాత్త్వికత ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?

  మూల అనగా కార్నర్ అని కాదు సుమా? సోర్స్ అనే అర్థం.
  పోనీ, కార్నర్ అనే అర్థం తీసుకున్నా మూలకి నెట్టబడిన జీవుల ఆర్తరవాలను ఆలకించే మీ ఫిలసాఫికల్ గ్రౌండ్ ఏమి?
  ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
  దేవిడిమన్నాచెప్పు అనగా ‘ఉద్యోగము నుండి తీసివేయు’

  పంచుకొనుచున్నందుకు పెరుగుచున్నది పాశ్చాత్య విజ్ఞానము.
  దాచుకున్నందుకు కాలగర్భంలో కలసిపోయెను ప్రాచ్య విజ్ఞానము.

  ReplyDelete
  Replies
  1. సిరి లేని వాసా !

   ఫిలాసఫీ గ్రౌండ్ అంటూ ఏమీ లేదు . అవన్నీ గురువుల ఇలాఖా .

   ఇక ఉపయోగం గురించి అంటారా మీ ఈ వ్యాఖ్య కి ఎంత ఉపయోగామున్నదో అంతే 'ఉప' యోగం గలదు సోర్సు కి :)

   చీర్స్
   జిలేబి

   Delete
  2. జిలేబీ మాతా!
   హథ్యంథ హుఫయోఘఖఱమైన యగు నొక వీడియో ళంఖెనిచ్చుచ్చుంటిని.
   ధీనినిగని అనేక తవికలను వ్రాయవలసినదిగా మనవి.
   https://www.youtube.com/watch?v=GsWDwHYI9jQ

   It happens only in India.

   Delete


 29. భారత కాలపు కథలను
  నారాధించుచు జిలేబి నవనవ సుజనా
  సారాంశములను మరువకు
  కారా గారపు స్రవంతి కనకన గనదోయ్ !

  జిలేబి

  ReplyDelete 30. మాచన వారికి


  ఉయ్యా లాటల మాచన
  సయ్యా లాటగ జిలేబి చక్కగ జెప్పెన్
  వియ్యాల మాట వినవలె
  నయ్యా యెల్లరికి మీరు నవ్యపు యొజ్జౌ !


  జిలేబి

  ReplyDelete
 31. జిలేబిగారు,
  నమస్కారం.
  మీరెందుకు మొదలు పెట్టేరో! పునః ప్రచురణ తెలియదుగాని, ఆ సావకాశాన్ని నేను అందిపుచ్చుకుని అప్పటికే మొదలుపెట్టి ఉంచిన బ్లాగులో ధారావాహికను మొదలుపెట్టేను. https://kastephali.wordpress.com నాకా ఓపికా తగ్గింది. ఒకప్పుడు రోజూ ఎందుకురాయడం? అంటే సమాధానం చెప్పేను, నాకా ఉన్న సమయం తక్కువా,డెభ్భై ఏళ్ళ వయసులో మొదలెట్టా, అందుకేరోజో రాస్తున్నానని.

  ఇంకా ప్రైవేట్ బ్లాగులో రాస్తున్నా! దానికీ చివరకొచ్చినట్టే ఉంది, వారసులు బయలుదేరారు, కూడా.ప్రైవేట్ బ్లాగును బాగానే ఆదరిస్తున్నారు, ఇప్పటికి అరవైమంది చేరారు.ఆ బ్లాగులో రాయడం మానేసిన రోజు దానిని పబ్లిక్ బ్లాగ్ చేస్తాను

  అన్నట్టు చెప్పడం మరచా!
  ధారావాహిక బ్లాగు పేరు కష్టేఫలి నుంచి https://kastephali.wordpress.com కష్టేఫలే(పునః ప్రచురణ) గా మార్చాను, గమనించగలరు.
  ధన్యవాదాలు. :)

  ReplyDelete