Monday, August 29, 2016

The Mathematics of కందం !

The Mathematics of కందం !

ఈ మధ్య  "A Beautiful Question" (Finding Nature's Deep Design- by Frank Wilczek-winner of the nobel prize in Physics) పుస్తకం చదువుతూంటే ఔరా ప్రకృతి గణిత మయం మాయం అనిపించే సింది !




ఈ మధ్య ముప్పావు సంవత్సరం పాటు ఊపులో శంకరాభారణ బ్లాగు లో చేస్తున్న సవారి , నేర్చుకుంటున్న (అనుకుంటున్నా :) వి, ఆ పై గురుళ్ళ సైడు కిక్కులు, (అకటా వికటాలు :) , అనానిమస్సు ల చీవాట్లు, చింపిరి హవా జుట్లు  , దాంతో బ్లాగు లోకం లో 'గండర' గోళం మీద పడి రచ్చ చేయటం అన్నింటి మధ్యా నెవర్ గివ్ అప్ జిలేబి అనుకుంటూ ఈ కంద పద్యం తెలుగు లో ఎందు కంత పాప్యులర్ అయిపోయిందబ్బా అని ఒకింత దాంతో తలే ఉంగలీ దబాయించ కుండా ఉండక పోయా !


పై పుస్తకం చదువుతూంటే కందం లో ని మేథమేటిక్స్ దీనికి కారణ మయి ఉంటుందే మో అనిపించింది.

ఛందస్సు లో గణితం తప్పక ఉంది. (మూలం లోకి వెళితే ) కందం కూడా అందులో భాగమే  ; కాని దీనికి గలిగినంత ప్రాముఖ్యత మిగిలిన వాటికి లేక పోవడం అనడం కన్నా ఇందులో ఉన్న సౌలభ్యం మిగిలిన వాటి లో లేక పోవడం ( ఆటవెలది, తేట గీతి కి ఉన్న సౌలభ్యం వదిలేస్తే ) మూల కారణం అరవై నాలుగు అన్న మేజిక్ నంబర్ అనుకున్నా !

గురు లఘు మాత్రలు మొత్తం వెరసి కందం లో అరవై నాలుగు . ఈ అరవై నాలుగు మధురగతి రగడ లో కూడా కనిపిస్తుంది. అయినా కందం టాప్స్ అండ్ రాక్స్ :)

మొదటి, మూడవ పాదం లో పన్నెండు మాత్రలు , రెండు నాల్గవ పాదం లో ఇరవై మాత్రలు మొత్తం కలిపి 12+20+12+20 = 64.

ఈ పన్నెండు ఇరవై కి 3:5 నిష్పత్తి మరో విశేషం ( సమత లేక పోవడం );

మధుర గతి రగడ లో అయితే సమతుల్యత దీనికన్నా ఎక్కువ ప్రతి పాదం లోనూ 16 ! అయినా దానికి ఇంత ప్రాచుర్యం లేదు !

ఈ అరవై నాలుగు ఒక మేజిక్ సంఖ్యే ! అరవై నాలుగు కళలు అంటాం ;

కందం లో ఉన్న not so even distribution (12,20) కూడా ఈ ప్రాముఖ్యత కి కారణం అయ్యుంటుందేమో మరి !

ఆ పై ఈ అరవై నాలుగు మాత్రలకి కొంత యతి ప్రాస కలిపి, ఆ పై జగణం పొజిషన్ ఖచ్చితం గా ఎక్కడ ఉండాలో చెప్పటం లాంటి నిర్దుష్టత తో  పటిష్టం చేయటం  (మధుర గతి రగడ లో దీనికన్నా ఇంకొంచెం పటిష్టత ఎక్కవే - అంత్యానుప్రాస కూడా ఉంది ) దీనికి సొబగు దక్కినట్టుంది !

మొత్తం మీద నాటి చందోకారుల మేథస్సు తీక్షణత కి యిది ప్రతీక అనుకోవచ్చు. కందం పొందిక దీనికి ఉదాహరణ !

సో నేటి కందం కందం :)

అరుబది నాల్గు కళలవలె
అరుబది నాల్గనగ మాత్ర లా కందంబూ !
పరిపరి విధముగ పదముల
సరితూకంబు గణితంబు చక్కగ కలిసెన్!



ముప్పది రెండుకు రెండుగ
నొప్పిన కందము జిలేబి నొకపరి గనుమా
అబ్బురమగు పదబంధము
అప్పటి కవుల గణితంబు అద్భుతము గదా !

చీర్స్
జిలేబి

11 comments:

  1. ఇదిగదా టపా అంటే, ఎన్నాళ్ళకి..చూశాను, మళ్ళీ మీ బ్లాగులో మంచి టపా చూస్తాననుకోలేదు.

    ”కందం కట్టినవాడే కవీ పందిని పొడిచినవాడే బంటూనూ” ఇది జన నానుడి. కందం కట్టడం తేలికేం కాదు.

    కందంలో నైనా ఇటుకలు పేర్చినట్టు లఘువులు గురువులు చేర్చుకుంటూ పోడం కాదు, అందమైన కందం కాలానికి నిలబడుతుంది, అది ప్రయత్నం చెయ్యండి.

    ReplyDelete
    Replies

    1. ధన్యవాదాలండి శర్మ గారు,

      మీ ప్రాతః ప్రోత్సాహమే మాకు పూర్తి బలము !

      డ్యూటీ రోస్టరు జిలేబి బదిలీ :) అందుకే సరికొత్త టపా :)
      జేకే !


      నెనర్లు

      జిలేబి

      Delete
  2. అసలు ఛందస్సుకు లఘువు,గురువులకు నేటి ౦,1 డిజిటల్ కి సంబంధం కలదా?

    ReplyDelete
    Replies

    1. శర్మ గారికి,

      ఛందస్సు లో మేథ్సు ఉంది ; డిజిటల్ జీరో వన్ లోనూ మేథ్సు ఉంది; జ్యోతిష్యం లోనూ మేథ్సు ఉంది

      మేధా మే మేథ్సు :)

      జిలేబి

      Delete
    2. You want to know more about this visit
      http://www.shrivedabharathi.in/dravadhanulu.html

      Delete
  3. కందానికి లెక్కలకును
    బంధము వివరించినారు బాగుందండీ !
    గంధపు చెక్కకు పరిమళ
    బంధము విడదీయరాని భాగ్యము వోలెన్ .

    ReplyDelete
    Replies

    1. లక్కాకుల వారికి

      నెనర్లు ! మీరు ఒక సాధారణ వాక్యాన్నే కందం లో ఇమడ్చ గల నేర్పు గలవారు ! (మొదటి రెండు పాదాలు గురించి ఈ మాట !)

      నెనర్లు
      జిలేబి

      Delete
  4. కందం , కవిత్వానికది
    అందం చందం; కుదిరితే
    ఛందం, మురిపించును
    డెందం
    YVR's అం'తరంగం'

    ReplyDelete
    Replies

    1. అం త రంగం వారికి !

      మీ చురుకు పద్యం అరవై మూడు శాతం కందం లో ఉంది;(ఫస్ట్ క్లాస్ ప్యాసయ్యేరు :)

      ఇంకొంచెం లాగారంటే పూర్తి గా వంద షాట్ !

      చీర్స్
      జిలేబి

      Delete
  5. ఎదో అలా వర్కౌట్ అయిపోయినట్లుందండి.😃👍

    ReplyDelete
  6. ఎదో అలా వర్కౌట్ అయిపోయినట్లుందండి.����
    YVR's అం'తరంగం'

    ReplyDelete