Wednesday, September 28, 2016

పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !


పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !
 
 
 
తరచూ హరి తానొక్కటి
ని రమించుచు కోరుచు కమనీయంబుగన
న్నరసియు సొలసియు వేరొక
పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !
 
 
చీర్స్
జిలేబి

157 comments:



  1. అంసము బరువును మోయగ
    సంశయ మసలు వలదోయి శక్తియు బోవున్ !
    సంసారంబున వైరా
    గ్యం సాయంబుగ జిలేబి గమ్యము గనుమా !

    జిలేబి

    ReplyDelete

  2. మన యూరి చెరువు మామం
    చి నిచ్చు మహిలో జిలేబి చిన్ముద్రగొనూ !
    ఘనమైన వాడిని గనగ
    మనమున జేయుము ప్రశస్త మగు పూజలనూ !

    జిలేబి

    ReplyDelete


  3. అర్ధ నారియగుచు గౌరి తా ధరించె
    హరుని, వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి
    హరిని నుద్ధరించి, చదువు లమ్మ తా వ
    రించె నాబ్రహ్మ ను!నమస్కృతించు రమణి !

    జిలేబి

    ReplyDelete


  4. మేకింగు చార్జి లేదోయ్!
    పాకిందమ్మా జిలేబి ఫారిన్ కల్చర్!
    షోకేసులందు సెల్ఫీ
    వేగము లందున మహాకవి కనబడుటలే :)

    జిలేబి

    ReplyDelete


  5. అతలా కుతలంబయ్యెను
    బతుకులు, నగరంబునందు బండ్లూ యిండ్లూ
    గతుకుల రహదారిన బడి
    నతుకుల బొంతయ్యెనోయి నవజీవనమూ

    జిలేబి

    ReplyDelete


  6. వైరాగ్యంబుల విధముల
    సారము నంతయు జిలేబి చక్కగ చెప్పెన్
    భారము వలదోయి మన మ
    కారణముగ చింతజేయ కాగలదేదీ ?

    జిలేబి

    ReplyDelete


  7. దురద సహజమై పోయెను
    సరిగద నాబాధయున్ను సరిసమ మయ్యెన్
    పరదేవత వైద్యంబులు
    నరులకు పనిజేయలేదు నరసింహన్నా !

    జిలేబి

    ReplyDelete


  8. గీతా కారుడు చెప్పెను
    గా తా మరి సంభవామిగ నవతరించు
    న్నేతా వాతా నట్లా
    నే తా మరి జెప్పెనోయి నెట్కథలన్నూ !


    జిలేబి

    ReplyDelete


  9. గుండ్రా యినైన గురువుగ
    వేండ్రముగ గొలిచె జిలేబి విధవిధములనన్
    బండ్రాళ్లకున్ను మొక్కుచు
    నాండ్రాయిడు ఫోన్లకున్ను నమనము జేసెన్ :)


    జిలేబి

    ReplyDelete


  10. మిమ్ముల మామూలు జిలే
    బమ్మ వలెను జూడ గోరె పారుడు వినుమా
    యమ్మణ్ణీ రూపం బే
    లమ్మా మార్చితివి గోల లయ్యెన్ బ్లాగ్లో :)

    జిలేబి

    ReplyDelete


  11. చలనం లో చూపబడిన
    కలలన చిత్రము జిలేబి‌ కనులను దోచెన్
    పలుచగ మారుచు పరిపరి
    కలువల వోలెను గనంగ కన్నులు జాలవ్ :)


    జిలేబి

    ReplyDelete

  12. జరిగిన జ్వరంబు మేలగు
    వరమ్ము ! వినుమా జిలేబి వగచుట వలదే !
    పరిచర్యలను పడిపడి యొ
    నరిచి మన కుశలములెల్ల నరయుదురు సుమీ !

    జిలేబి

    ReplyDelete


  13. చింతలను దూరము గనన్
    కొంత జపించెను జిలేబి కోరిక దీరన్ !
    యెంతయు కోరగ రాముం
    డంతగ నిచ్చును సుఖంబు డంగగు రీతిన్ !

    జిలేబి

    ReplyDelete


  14. వానొచ్చిన వరదొచ్చిన
    నే నీరొదలక జిలేబి నేమగు నీ చె
    ట్టూ ! నను నమ్మెను ! గావున
    నే నీరిడకున్న జచ్చునే, నను నమ్మూ !

    జిలేబి

    ReplyDelete


  15. నిద్దుర మత్తున నొక్కితి
    యద్దరి ప్రచురణ జిలేబి యయ్యెన్ ! స్వామీ
    బద్దకమూ నీదే! నే
    నొద్దిక గా నీ మహిమ యనుచు పాడెదనూ :)


    జిలేబి

    ReplyDelete


  16. మన చిరుతిళ్ళన్నీ మో
    టనుచు రుచికరంబు గాదటంచు జిలేబీ
    లని పిజ్జా బర్గర్లని
    కనిపించిన దెల్ల తినుచు కస్మలమయ్యెన్ !

    జిలేబి

    ReplyDelete


  17. రాముని తత్వము తెలియ
    న్నా ముని వర్యుల పలుకుల నంతయు నరయన్
    యోమాం పశ్యసి, సర్వ
    త్రా మయి పశ్యసి, జిలేబి తారక మంత్రం !


    జిలేబి

    ReplyDelete

  18. కలబోతల రాతలతో
    తెలుగుకు నాంగ్లమును జేర్చి తెంపరి తనమై
    పలుకుల మణిప్రవాళము
    నలరగ గలగల జిలేబి నడయాడెను బో :)

    జిలేబి

    ReplyDelete


  19. ఉమ్మడి కుటుంబ మందున
    నెమ్మది గన సాక్షిగాను నీవుండవలె
    న్నమ్ముము , నేటి దినంబులు
    కమ్మగ నుండగ జిలేబి కలతలు బోవన్


    జిలేబి

    ReplyDelete


  20. కుర్రో డొకండి కిచ్చితి
    నర్రా యా పూతరేకు నన్నడిగెను బో !
    హుర్రే పేపరు తినవలె ?
    జర్రా చెప్పుము జిలేబి చకచక తినెదన్ :)


    జిలేబి

    ReplyDelete


  21. జెట్లా గంటే యేమిటి?
    అట్లా యెట్లా జిలేబి అద్దరి నేతల్
    పాట్లు పడకుండ చట్టని
    గట్లా తయ్యా రవుతరు గగనము లోనన్

    జిలేబి

    ReplyDelete


  22. బస్సూ రైలూ తప్పిం
    చస్సలు పయ‌నంబు చేయ చక్కగ గాలే !
    విస్సన్న కు తెలియని మే
    ధస్ససలుందా జిలేబి ధరణిని జూడన్ :)

    ReplyDelete


  23. చూసితిని సిటీ లైఫును
    హూసైన్సాగరు జిలేబి హుష్కాకవగన్
    మూసీ నదిలో నీదితి
    నోసీ జవరాలనేడు నోముఫలించెన్ :)

    జిలేబి

    ReplyDelete

  24. నేనెర్రబస్సు నొకటిని
    దా నెక్కితి శర్మగారు ! తక్దీరు గనన్
    ప్లేనెక్కి యైటి మానవు
    డై నేడుంటిని వినమ్రుడై చెప్పెనుగా !

    జిలేబి

    ReplyDelete


  25. కొన్ని యసంకల్పితమై
    మన్నిక జేర్చును జిలేబి మహిలో మాయల్
    మిన్నగ జేకూర్చుమనకు
    యెన్నిక గానౌ యనంగ యేతావాతా !

    జిలేబి

    ReplyDelete


  26. గాలిని నెగురుతు జూచితి
    జాలీ జాలీ ఫ్లయిటులు చాలిక వలదోయ్ !
    లోలా! విమాన యానము
    వీలవ లేదోయి జేయ విదురుడు చెప్పెన్ :)


    జిలేబి

    ReplyDelete
  27. చాలా నా మాటలు పద్యాలుగా రాసేస్తున్నారు
    గణ యతి ప్రాసలు సరిపోతున్నాయా?
    కిట్టించేస్తున్నారా? :)

    ReplyDelete
    Replies


    1. చాలా నా మాటల ప
      ద్యాలుగ రాసెను జిలేబి! తరుణి, యతిగణం
      బెల్లెడ గాంచెన్నో, కో
      కొల్లలు కిట్టించెనోయి కొండల రాయా !

      జిలేబి

      Delete


  28. ముసలాళ్ళు వీళ్ళకేమి తె
    లుసు నను కోవద్దు సుమ! తెలుసుకొంటిని నే
    ను సవాలుగ కంప్యూటరు
    ను! సత్తును టపాల బేర్చి నుడివితిని సుమీ !

    జిలేబి

    ReplyDelete


  29. వలసొచ్చిన కూలీలము !
    కళామ తల్లి యయిటీల గట్టిగ గాపా
    డ,లకారంబుల దస్కము
    లలర , లలాట లిఖితపు కలగలపు దరువున్ :)

    జిలేబి

    ReplyDelete

  30. పనిరాక్షసుండు గాగన్
    ఘనముగ సాధించగలము ఘనతయు గూడున్ !
    మనమా యేకాగ్రత,రా
    వణుని గని తెలుసుకొనవలె వనితా రమణీ !

    జిలేబి

    ReplyDelete


  31. అంత సులభతరమా మరు
    పంత సులభమా జిలేబి పరువపు వేళన్,
    పంతము వలదే ప్రియునిన్,
    కొంతయు జూడన్ లలామ గోముగ నిలుపూ :)

    జిలేబి

    ReplyDelete


  32. నేటి నేపథ్యం లో !

    సంతాప సభలే మైనా స్వాంతనము కలుగ జేస్తాయే మో నవాజు షరీఫు కి :)


    పంతముగ యూరిని కలహ
    వంతము జేసితి ప్రభుత్వ మంత మటాషో ?
    చింత గొనె షరీఫూ, మన
    సంతాప సభల్ జనులకు సంతసమొసగున్ !

    జిలేబి

    ReplyDelete


  33. అరచూపు! వాలుచూపు బె
    దురు చూపు కొరకొర చూపెదురుచూపు జిలే
    బి రుసరుస చూపు తా కను
    లెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)

    జిలేబి

    ReplyDelete

  34. అరచూపు! వాలుచూపు బె
    దురు చూపు కొరకొర చూపెదురుచూపు జిలే
    బి రుసరుస చూపు తా కను
    ల రసికతనుచూపు, కొంప లార్చును చూపున్ :)

    జిలేబి

    ReplyDelete

  35. దుష్ట సమాసము వలె సం
    తుష్టుడు పని రాక్షసుండు తురగము వోలెన్
    కష్టపడును తా మేలుగ
    పుష్టిని గాంచును జిలేబి పూర్ణంబగునూ :)

    జిలేబి

    ReplyDelete


  36. సమయంబు రాగ వైరా
    గ్యము పరిపరివిధము లగుచు గర్వంబణచున్ !
    గమనించవలె జిలేబీ
    సుమనస్సు వలయు సుమధుర సుఖముల గానన్ !

    జిలేబి

    ReplyDelete


  37. వరములు చిలకస్వరములు
    కరమున చిలుకక లదాన కరుణను జూపన్
    నిరతము నమ్మితి నిన్నున్
    త్వరితము రమ్మా యటంచు తరుణియు బిలిచెన్ !

    జిలేబి

    ReplyDelete


  38. ఎన్నెన్నోజూచితి నే
    మన్నున మిన్నున జిలేబి మదినరసితి ని
    న్నెన్నడు గన లేదోయీ
    చిన్నగ హృదయంబునందు చిక్కితి వీవూ !

    జిలేబి

    ReplyDelete


  39. చాలా నా మాటల ప
    ద్యాలుగ రాసెను జిలేబి! తరుణి, యతిగణం
    బెల్లెడ గాంచెన్నో, కో
    కొల్లలు కిట్టించెనోయి కొండల రాయా !

    జిలేబి

    ReplyDelete


  40. మాట్లాట లనుచు తెలుగున
    మాట్లాడిరిగా జిలేబి మనబడి వారూ :)
    జట్లుగ పదరంగపు తిర
    కాట్లను పిల్లలకు నేర్ప కష్టపడిరిగా !


    జిలేబి

    ReplyDelete


  41. అవునండి! చాల సులభము
    గవున్న ది ! గురుడిక పాట గట్టిగ గూర్చు
    న్నవునవు ననిరిగ దాయని
    కవనము జేయించునోయి కవితల పదముల్ :)

    జిలేబి

    ReplyDelete


  42. లయబద్ధంబుగ పాడ స
    రియన దగు కవితలు మేలు రిథమును గనెనూ !
    పయిదలి పలుకుల నగిషీ
    సయితము ధీటుగ జిలేబి చకచక నడిచెన్ :)

    జిలేబి

    ReplyDelete


  43. కొనసాగుతున్న కవ్విం
    పునకు మనము నప్రమత్తపు నిఘా సాగిం
    ప నగరములన్నియు తయా
    రనుచుండిరి భరతదేశ రక్షణ గానన్!

    జిలేబి

    ReplyDelete


  44. రాహులుడు మెచ్చె మోడీ
    యాహూ యని మెరుపు దాడి యాక్షన్ జేయన్ !
    ఓహో యెలక్షను సమయ
    మా హేట్సాఫిది జిలేబి మాటల జూడూ :)

    జిలేబి

    ReplyDelete


  45. సర్జిక లాప్రేషన్లన్
    గర్జించెను, భరతదేశ ఘనతయు గూడన్
    తర్జని జూపగ మోడీ,
    ఫర్జు నిభాయించెను భళి భళియన నార్మీ !

    జిలేబి

    ReplyDelete


  46. హిమవారి శంకరాభర
    ణము వాట్సాపుల సువాసనలు వెద జల్లెన్ !
    నమనంబు,శంకరార్యుల
    గమకము సెహభేషుగాను గాంచె జిలేబీ !

    జిలేబి

    ReplyDelete

  47. మీనము వోలెను నీవే
    యానము కూర్మాకృతివలె యగుపించితి వీ
    వే! నాటి కిటివి నరసిం
    హా! నను గాపాడ రమ్ము హారతి నిడుదూ !

    జిలేబి

    ReplyDelete


  48. ఒక చోట నస్తమించె మ
    రొక చోట నుదయము! గానరో భాస్కరునిన్ !
    సకలము పూర్ణంబయ్యెను !
    వికాస పథమున జిలేబి విధిరాతయనన్ !

    జిలేబి

    ReplyDelete


  49. చలచల్లగ మెలమెల్లగ
    నలవో కగనూ జిలేబి నయగారములా
    కలలో నామది తాకెను
    నలసెను సొలసెను లలామ ననుకోరెను బో :)

    జిలేబి

    ReplyDelete


  50. భయభక్తులులే వోయి, న
    భయంబు గోరిరి జిలేబి భక్తులు కాకా
    మయముగ జేసెరనంతుని!
    స్వయంభు నాతడు వినండి సకలంబతడౌ !

    జిలేబి

    ReplyDelete


  51. నీటిని మించిన వైద్యము
    నేటి దినంబుల తనువుకు నెమ్మది నిచ్చున్ !
    పాటిగ గొనుము జిలేబీ !
    బాటిలు వాటరు గొనంగ బతుకులు బోయెన్ :)

    జిలేబి

    ReplyDelete


  52. ఇటువచ్చిన వీడెవ్వడు
    నటనలు జేసెను! జిలేబి నాటక రంగం
    బట మన బతుకులు, భువిలో
    చిటపట లాడించు నిన్ను , చింతన గొనుమా !

    జిలేబి

    ReplyDelete


  53. అప్పన్నా ! వినుమన్నా !
    గొప్పగనను కోకు తనువు ! గోరీ చేరున్ !
    గప్పున నీశుని మనమున
    నెప్పుడు నుంచుచు జిలేబి నెమ్మది గొనుమా !

    జిలేబి

    ReplyDelete


  54. చాలా తక్కువ పరిమిత
    కాలములో జరిపె సైనిక కసరతు గదా !
    గోలగ పరిగెత్తె ను తా
    కూలబడి లబలబలాడె కోరుచు సాయం‌!

    జిలేబి

    ReplyDelete

  55. వలదోయి వకీలులతో
    కలలోను పరాచికములు కట్టవలెను ఫీ
    జుల మెండుగను జిలేబీ !
    కలహము వలదూ కటింగు ఖర్చులు వలదూ :)

    జిలేబి

    ReplyDelete


  56. మెరుపుల చమక్కు హాయ్ హాయ్ !
    నురిమెను మేఘము జిలేబి నూతన రీతిన్ !
    కురిసెను వానయు వెను వెం
    ట! రణగొణపు శబ్దభేరి టప్పున నాగెన్ :)

    జిలేబి

    ReplyDelete


  57. గుండమ్మనింట గరిటెలు
    మెండుగ తలపగులగొట్టె మేష్టారు నటన్ :)
    గండర గండల గొట్టెను
    పిండిగ జేసెను జిలేబి పిడిపిడి గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  58. మళ్ళీ వేషా లేస్తే
    మళ్ళీ తోలును నొలుచును ! మక్కెలిరుగునోయ్
    కాళ్ళూ, సింధూ నీళ్ళకు
    భళ్ళన గొళ్ళెమును బెట్టు పారీకరుడూ !


    జిలేబి

    ReplyDelete


  59. బుద్ధి గల మేక బెదురక
    నొద్దికగా యోచనగొనెను హరిని గానన్ !
    పెద్దగ కోరికను తెలిపి
    గద్దువ చూపన్ మృగేంద్రు గడగడ వణికెన్ !

    జిలేబి

    ReplyDelete


  60. భండన భీముడు రాముని
    కొండన నండగ గనంగ కోమలమగుచున్
    కొండల రాయుని వేడుచు
    నిండగు మనమున జిలేబి నిడెను నమనముల్ !

    జిలేబి

    ReplyDelete

  61. పుస్తకముల తా మోసెను
    మస్తిష్కములకది పీఠ మయ్యెను నేర్వ
    న్నస్తిత్వము పెరుగంగ
    న్నాస్తిగ నిలచుచు జిలేబి నాదరణ గొనెన్ !


    జిలేబి

    ReplyDelete


  62. జాతిపిత మహాత్మా గాం
    ధీ ! తీరుడగు మన శాస్త్రి ! ధీశాలి‌ నమో !
    జోతలు జిలేబి తెలిపె
    ప్రాతహ్సాహితి నమనము భళిరా యనుచున్


    జిలేబి

    ReplyDelete


  63. భావంబులంత నటునిటు
    తావగ భవభావముద్ర తాకగ నిచట
    న్నా వంతుగ సంభావన
    గావించుకొనెద జిలేబి కందము గొనుడూ

    జిలేబి

    ReplyDelete


  64. క్షణమౌ నిరాశయు మరు
    క్షణమున నుత్సాహముగొని కవితల గనిరీ !
    ప్రణతులు తెలిపె జిలేబీ
    ఘనమౌ కవివర్య మీదు కవితా ప్రతిభల్!

    జిలేబి

    ReplyDelete


  65. నేనెవ రోయని యడుగుచు
    తానెవరో తెలియ లేక తరుణము బోయెన్!
    మేనిని మేలౌ గాంచుచు
    మానవుని సమయము బోయె మహిలో సుమతీ !

    జిలేబి

    ReplyDelete


  66. ఆ కాలపు కవుల రచన
    లే కాపీరయిటు లేక లెస్సగు రీతిన్
    తా కాపీ చేయు కవుల్
    బ్లాగున కాపీకి బందు బాగుగ గనిరీ :)

    జిలేబి

    ReplyDelete


  67. అహరహము భవమున హరిని
    సహాయమా శశివదనుని సపదిని గొనుమా
    బెహతరు ద్రష్టగ హృదయపు
    కుహురంబా లచ్చిమగని గుణముల గానన్

    జిలేబి

    ReplyDelete


  68. జీవన పయనమున తనకు
    కావలసిన సమయమున్న కాలము నందున్
    కోవెలకెళ్లు హడావిడి
    లో వరుస పనులన చిక్కి లోనుపడె విధీ !

    జిలేబి

    ReplyDelete


  69. నరుడవు కాదుర దేవా
    నర నారాయణుల కూర్పు నగుమోము దొరా !
    పరమును గాంచన వరముగ
    నరులకనుచు నవతరించిన విభుడవు గదా !

    జిలేబి

    ReplyDelete


  70. నేనెవ రైతే నేమి ర
    మా నాథా నిను కొలిచెద మంచిని నరయన్
    నీనా బేధము లేకయు
    నానా విధపరి మళముగ నమ్మితి నిన్నూ !


    జిలేబి

    ReplyDelete
  71. ప్రైవేట్ బ్లాగ్ చేసారని, వాకిలి తెరవమనీ మీరేదో 'కష్టేఫలే' శర్మ గారిని తరచూ అంటుంటారు (మధ్యలో ఒకటి రెండు సార్లు నా మీద కూడా విసుర్లు 🙂), కానీ తమ బ్లాగులో వ్యాఖ్యలు పెట్టడం మరో రకంగా కొందరికే పరిమితం చెయ్యడం కొన్ని చోట్ల కనిపిస్తోంది (ప్రైవేట్ బ్లాగ్ చెయ్యడం కాదు, అది వేరు. అటువంటి బ్లాగుల్లో అసలు ప్రవేశమే ఆహూతులకి కదా. అలాగే నేను చెప్పేది వ్యాఖ్యల మోడరేషన్ గురించీ కాదు).
    మీరూ గమనించే ఉంటారు - ఇప్పుడు కొత్తగా "సుశ్రీ" బ్లాగ్ లో అటువంటి పరిస్ధితే (ఏవిటో, ' పరిస్ధితి ' అంటూ నాక్కూడా టీవీ ఛానెళ్ళ రిపోర్టర్ల భాష వచ్చేస్తోంది ☹️☹️). ఈ బ్లాగ్ ఓనర్ శ్రీనివాసరావు గారు మంచి ' కొసమెరుపులు ' వ్రాస్తుంటారు కదా, నాకు నచ్చే బ్లాగుల్లో ఒకటి. కానీ వ్యాఖ్య పెడదామనుకుంటే వారి 'team members' (?) కి మాత్రమే పరిమితమని అక్కడ హెచ్చరిక కనిపిస్తోంది 🙁.
    ఏతావాతా చెప్పేదేమిటంటే ఎవరి బ్లాగ్ వారిష్టం.

    ReplyDelete


  72. షావోలిను సన్యాసులు !
    కావక మగు చర్యకాదు, కఠినపు తేజో
    భావపు మానశ్శారీ
    రావవయ పరిశ్రమ యిది రావపు కుంగ్ఫూ !

    జిలేబి

    ReplyDelete


  73. చీరలు పరిచిరి మేలౌ
    మా రమణీ మణుల కిష్టమగు చీరలునూ !
    భారము తొలగెను పర్సుకు
    జోరుగ షాపింగుజేయ జోటి జిలేబీ !



    జిలేబి

    ReplyDelete

  74. మాణిక్యమును కనుగొనును,
    జాణల మనమును జిలేబి చక్కగ గానున్
    కోణము వేర్వేరరయున్
    నాణెపు నిరువైపు జూపు నయగారియునూ !

    జిలేబి

    ReplyDelete

  75. అహమే బ్రహ్మాస్మియనుచు
    నహరహము తపించెనోయి నరుడు, హరిని హృ
    త్కుహురమున గాన సోహం
    బృహత్కరంబౌ యనంగ ఋజుమార్గమునన్ !

    జిలేబి

    ReplyDelete


  76. వడవడ వణికిరి జనులూ
    గడగడ చెప్పుచు జిలేబి గర్జించ గనన్
    చెడగను పద్యం బిచటన్
    యెడాపెడా వరుసబెట్టి యేకిరి రమణిన్ :)

    జిలేబి

    ReplyDelete


  77. వీడే వీడే రాముడు
    పాడే నోయీ జిలేబి పరమును గానన్
    గూడార్థంబు సులభముగ
    జోడించె సుళువు పదములు జొత్తిల్లుగనన్ !

    జిలేబి

    ReplyDelete


  78. వైనా టీజ్ మై క్వొశ్చెన్ !
    ఐనో బట్యిఫ యిటెల్యు ఐవిల్ బీకిల్డ్ :)
    ఫైనర్ దస్కిల్ గోస్ సర్
    ఫైనర్ యుబికం ద తెలుగు ఫైర్బ్రాండ్ దట్జ్ వై :)

    జిలేబి

    ReplyDelete
    Replies


    1. నాలుగు కొచ్చెను మార్కుల
      మేలుగ కామింటు లిచ్చె మేష్టరు గారూ
      చాలా బాగున్నది ! సువి
      శాల మనస్సౌ జిలేబి సకలము పబ్లిష్ :)

      జిలేబి

      Delete
    2. నా "కొచ్చెను మార్కుల" వ్యాఖ్య పబ్లిష్ చేసిన మీ "సువిశాల మనస్సు" కి 👏. దాని తర్వాత ఈ రోజు మీరు వ్రాసిన "వై నాటీజ్ మై క్వొశ్చెన్!" టపా చూస్తే నా "కొచ్చెను మార్కుల" కి జవాబు దొరికింది. కాస్త ముందూ వెనకా అంతే. 🙂

      Delete


  79. నారాయణుడు గలండు సు
    మా రాముని రూపమై నమనము లిడు జిలే
    బీ రాముడతండే బా
    లా, రక్షకుడు మన తోడు లచ్చిమి మగడూ !


    జిలేబి

    ReplyDelete


  80. జాకీచానుడి చిత్రము
    బాకీ లేకుండ జూడ బంచికి భంభం,
    నాకీవేళ కలిగెనిది
    కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!

    జిలేబి

    ReplyDelete


  81. కేరళ దేశపు బస్టాప్ !
    సారము, కమ్యూ నిజమును చక్కగ బోవన్
    భారముగా నిలిచె జిలే
    బీ! రెడ్డుకలరు కొడవలి భీతిని గొనుచూ !

    జిలేబి

    ReplyDelete


  82. కోతలు భక్తుల మని రా
    మా తలపులు బోడులవక మనుజులు మనిరీ
    మాతల రాతల మార్చగ
    నీ తరుణము రమ్ము మమ్ము నీదరి గొనుమా

    జిలేబి

    ReplyDelete


  83. యోగాసనంబులను సర
    దాగ విమర్శించినాను, దండించిరిగా
    బ్లాగు జనులెల్లరు జిలే
    బీ! గాన టపాలకున్ను బీగము నిడితీ :)

    జిలేబి

    ReplyDelete

  84. రమణ యడవల్లి గారూ
    నమరిరి కందమున! చక్కనమ్మ జిలేబీ
    గమనిక! ముఖపుస్తకమున
    కు మీరు మారగను వంచకులయిరనిరిగా :)

    జిలేబి

    ReplyDelete


  85. తెలుగుబ్లాగర్లందర
    సలు కనిపించక జిలేబి సకలము గోల్పో
    యె! లుకలుకలుకలను గనక
    కలతల చౌదరి టపాన కన్నీరిడెనూ :)

    జిలేబి

    ReplyDelete


  86. బతిమాలించుకొనుటకును
    నతుకుల సరిదిద్దుకొనను నహమును నణచన్
    గతుకుల బండిని సరిజే
    యతగిన సమయము బతుకు పయనమున బుక్యా !

    జిలేబి

    ReplyDelete


  87. పరిమళము మనసు పల్లవి
    సరాగముల గాంచెనోయి చక్కని దానా!
    దరిచే రావోయి, యెలా
    గరళము నోర్చితిని తెలియగను రాలేదోయ్ !


    జిలేబి

    ReplyDelete


  88. గ్రహముల పయనము లను తా
    నహరహముగను పరిశోధనలు జేసె నహో !
    ప్రహరీ జ్యోతిష్యము! నవ
    మిహిరుడు నావిష్కరించె మేధా శక్తీ !

    జిలేబి

    ReplyDelete


  89. తలగొరిగిరి నిండుగ సుజ
    న లక్ష ణముగాను నన్ను నట్టేటన ముం
    చె! లకారంబుల దస్కము
    నలవోకగ ఖర్చు జేసి నాడ జిలేబీ !

    జిలేబి

    ReplyDelete

  90. ఆశ్వయుజము! మార్గశిరము
    నాస్వాదించెను జిలేబి నమ్మికగా తే
    జస్వియగు రీతి గాంచుచు
    భాస్వంతుడుగ నలరారె భళిభళి యనగన్ !


    జిలేబి

    ReplyDelete

  91. ఇంత వరకు చిత్రము భా
    వం తగినట్టు గలదంటి ! వచనంబుల సా
    వంతుడు బుక్యా శ్రీధరు
    డెంతగ రసవత్తరముగ డెందము గొనెనూ !

    జిలేబి

    ReplyDelete


  92. ముక్కంటి మీద మన్మధు
    డక్కస ముగ పుష్ప బాణుడై పార్వతినిన్
    చక్క గను కాల మప్పటి
    లెక్కలు గద, సర్జికల్లు! లెస్స జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  93. పూమాలగ పూజించెను
    రాముని కువలయ ములన్ని! రాఘవుని గనన్
    నోములు ఫలించె ననుకొని
    భామలు గూడిరి జిలేబి భవ్యము గానన్ !

    జిలేబి

    ReplyDelete


  94. శేషూ నీ కుక్క కరుచు ?
    భేషుగ్గా పట్టు కొనుము బెదురగ నేలా !
    తా సోకు మాడి కరువగ
    శోషిలితిని తనది కాదు శునకము సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  95. పద్యపు కామెంటులతో
    గద్యముల నలంకరించి కమనీయంబౌ
    హృద్యమగు పలుకులలరగ
    సేద్యమ్మిడి భాష నేర్చు చీర్సు జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  96. బంధాలనుబంధాలను
    బాంధవ్యాల మన శర్మ బాగు తెలిపిరీ !
    కిందా మీదా పడినా
    నందరికి సులభము గాదు నరయన్నదియౌ !

    జిలేబి

    ReplyDelete


  97. గరుడ గమనుడా రమణుడు
    నరుదగు పలుకుల జిలేబి నందరి కిచటన్
    పరుగిడి వచ్చి తెలిపెనూ
    పురజనులు గనిరిట మేలు పొత్తము వోలెన్ !

    జిలేబి

    ReplyDelete

  98. కుర్రాడు కోరిక తెలిపె
    నర్ర, కలుపుగోలు భార్య నచ్చును తనకున్
    యెర్రా బుర్ర జిలేబీ
    బర్రని జీవితము జొచ్చ బతుకే మౌనో :)

    జిలేబి

    ReplyDelete


  99. లింకుల వీరుల సమయం
    బింక మొదలగును జిలేబి బిరబిర నిచటన్
    టెంకల వెదజల్లుచు చా
    లింకనునంత వరకున్ను లింకులటుకులూ :)

    జిలేబి

    ReplyDelete


  100. గోవిందుడా యని బిలువ
    నా వరదుండు వెనువెంట నాకము దిగెనూ
    నా వెనుక రాముని బిలిచి
    గావుమన కలియుగ సామి గప్పున బోయెన్

    జిలేబి

    ReplyDelete


  101. పనిలేని జిలేబీ బ్లా
    గున పద్యంబులను రాసుకొనునట్లట తు
    స్సనునా మీటింగ్లెల్లను
    గనుమా సిరిలేనివాస గమ్యము లేదోయ్‌!

    జిలేబి

    ReplyDelete


  102. ఓల్డేజొచ్చిన రమణులు
    బోల్డుగ భువి రాజకీయ భోక్త లగుదురౌ!
    గోల్డగు వోటు నిడెద ! డో
    నాల్డా హిల్లరి హవాయొ ! నమ్మెద నోటున్ :)

    జిలేబి

    ReplyDelete


  103. తాబేలుకు తా బలముగ
    తా భళిరా జీవమిచ్చె తాబేలచటన్ !
    మా బరువగు మానవుడా!
    ఆ బంధము నిలుపు మోయి అందము గానన్ !

    జిలేబి

    ReplyDelete

  104. ఆటలు పాటలు రాతలు
    మేటిగ పలుకులు జిలేబి మేధా శక్తీ
    చాటువులు బాటసారుల
    గీటుల నిచ్చు ఘన శక్తి గీష్పతి వీవే !

    జిలేబి

    ReplyDelete


  105. మీ యభినందనలకునూ
    మా యభివాదము గొనవలె మాచన వర్యా !
    మాయందరికీ మీరూ
    మాయా నగరి మహరాజు మా మంచిగనూ !

    జిలేబి

    ReplyDelete


  106. వసుధైక కుటుంబముగ వ
    లస కూలీలై ప్రవాసు లందరు బుధులై
    దెసదెసల భరత దేశ
    ప్రశస్తి చాటిరి జిలేబి వగచెద వేలా !

    జిలేబి

    ReplyDelete


  107. చొల్లు కబుర్లను తా మెల
    మెల్లగ చెప్పగ జిలేబి మేధను గాంచ
    న్నల్లన పరుగిడి వచ్చిరి
    యెల్లరు చదువరులు తాము యిష్టము గొనుచున్

    జిలేబి

    ReplyDelete


  108. అలకల కొలికి నదిరెడు యధరములను
    చనువుగ పెనిమిటి గొనంగ చక్కగు నొద
    కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు
    వేడుకల దీర్చుము జిలేబి మేళమాడి :)

    ReplyDelete


  109. గాంధీజీ మోడీజీ
    బాంధవ్యాలన జిలేబి నారద వాణీ !
    పందెము లక్షిత దాడిగ
    నందరిని కలిపెను తానున నవాజు, షరీఫ్ :)

    జిలేబి

    ReplyDelete


  110. జయహో ! మాచన ! భాస్కరు
    డ!యొజ్జ ! దీక్షగొని పారుడై నడయాడూ !
    నయగారి, యంబ జగదం
    బ యండ మెండగు జిలేబి భవ్యము గానన్ !


    జిలేబి

    ReplyDelete


  111. మానస మదియే తానై
    వేణువు నూద పయిదలికి వేండ్రము తీరు
    న్నౌనని నేనంటా న
    మ్మూ ! నినునమ్మితి జిలేబి ముద్దుల గుమ్మా !

    జిలేబి

    ReplyDelete


  112. మిరకిలు వైబ్రేటింగౌ
    నురసిజముల మేల్గనొచ్చు నూతన రీతిన్
    కురచవచంటి జని పయో
    ధరములిక బిరుసగునోయి ధరణిన్ రమణీ :)

    జిలేబి

    ReplyDelete


  113. పనిచెయ్యడము నలవరచు
    కొనవలె భువిలో జిలేబి కొంచెము నైనన్
    మనసును జేర్చుచు జేయన్
    ఘనమగు జీవనము వినుము కర్తవ్యంబౌ !

    జిలేబి

    ReplyDelete


  114. లక్షిత దాడుల ఫలితము
    లక్షర మాలగ జిలేబి లాభము గాంచెన్
    పక్షపు సప్తమి‌ నాట గ
    వాక్షము తెరిచిరి సరసిజ వందన మిడుమూ !


    జిలేబి

    ReplyDelete


  115. చేపను గాంచెను నరడూ
    తా పరిణితి గొనిన తీరు తాత్పర్యముల
    న్నా పరిణామము లంతయు
    చాపాకృతి కనులనందు సతతము గాంచెన్

    జిలేబి

    ReplyDelete


  116. శారద పండుగ రోజున
    సారము గా బ్లాగులోన జపమాలగనూ
    నారద స్మరణను జేసితి
    వారిజ! పుల్లనిడకమ్మ, వయ్యారివిగా :)

    జిలేబి

    ReplyDelete


  117. మాడుగులవారి యనిలకు
    మారుని పద్యములయందు మధురిమ గనుమా
    పాడుట కనుకూలముగా
    సారము నొప్పుచు జిలేబి చక్కగ నుండెన్

    జిలేబి

    ReplyDelete


  118. ఇదియే ఆత్మానందము
    మదిలో మదియై జిలేబి మర్మము గాంచెన్
    హృదయము తురీయ మవ్వగ
    సదనము చేరిన మనుజుడు సపదిని గాంచెన్

    జిలేబి

    ReplyDelete

  119. ఏది సుఖంబౌ? తలపుల
    నేది గలదు? రామునిమది నెలగొలుపుము భా
    మా! దివి సుఖంబు గాన
    న్నాదరి జేరన్ జిలేబి నారాముగనన్ !

    జిలేబి

    ReplyDelete


  120. బ్లాగుల మార్పులు జేయుచు
    మాగురు డటునిటు తిరిగెను మళ్ళీవొచ్చెన్
    పాగలు ఖానా యిదియే
    సాగిల పడినాము నీకు సాష్టాంగముగన్ !

    జిలేబి

    ReplyDelete


  121. బాగా చెప్పా రండీ !
    బ్లాగు చదువు వారలు! యిది బాగౌ సినిమా
    భోగము తెలుంగు వారల
    కై గలిగిన యోగమోయి కైవల్యమనన్ :)

    జిలేబి

    ReplyDelete


  122. ఆ హరిని నమ్మగ గలుగు
    సౌహార్ద్రంబులు జిలేబి సౌభాగ్యములున్
    గేహంబన నాతనిదౌ
    స్నేహంబన రాములోరి చెంగట యొకటే !

    జిలేబి

    ReplyDelete


  123. "ఇష్టపది" గా పయనమున
    కష్టముల నెదుర్కొనుచును గమ్యము గానన్
    స్ప్రష్టంబగును జిలేబీ
    యిష్ట సఖుండై విభుండు యిడుములు దీర్చెన్

    జిలేబి

    ReplyDelete


  124. సినిమా చూడను నే చూ
    డను లలితాజీ ! తెనుంగు డబ్బా సినిమా
    లన భయము హింది చిత్రా
    లను చూసేవాణ్ణి యా యెలమియును బోయెన్

    జిలేబి

    ReplyDelete


  125. పట్టిన పట్టును విడువక
    తట్టని వరదాభయామృతకరీ దుర్గన్
    గట్టిగ పట్టు జిలేబీ
    చట్టని మెరియును పదములు చక్కగవనమై !

    జిలేబి

    ReplyDelete


  126. వడియా లెందుకు నాక
    ప్పడాలుగ జిలేబి గలదు భడవా! అయ్యర్
    నుడివిన పలుకుల వినుమా
    వడివడి వడ్డించుమోయి వందన మిడుచున్ :)

    జిలేబి

    ReplyDelete

  127. అభిమానమలా యుండి య
    నుభూతిని మిగుల్చును సుజనులకెల్ల భువిన్ !
    ప్రభవిల్లు గురువులను చూ
    డ భవ్యముగ వచ్చినారు రాజీ గోజీ :)

    జిలేబి

    ReplyDelete


  128. శర్మ పలుకు‌ చక్కెరొలుకు
    మర్మంబెల్లను జిలేబి మంచిగ తెలుపున్
    కర్మ పథము నాతనిదౌ
    నిర్మల మైన మనసు గల నిండు మనీషీ

    జిలేబి

    ReplyDelete

  129. గెలుపూ వోటమి ! చూడగ
    నలుపో తెలుపో తెలియని నలవిది గాదా
    కలిగిన కాలము గెలుపని
    నలుగగ నోడెననుకొని మనంబున వగచెన్ !

    జిలేబి

    ReplyDelete


  130. స్వాగత సన్నా హాలను
    మాకా లమునందు యెదురు మర్యాదగన
    న్నీకా లమందు మామూ
    లే కదవే గొప్పలను భలే తెలుపుటకున్

    జిలేబి

    ReplyDelete


  131. ముస్తాబు నలుగ కుండా
    హస్తముల నటునిటు చూపి యమ్మను గౌరిన్
    పుస్తెల కోసము పూజల
    జేస్తూన్నటనల్ జిలేబి చేయగ తగునా !

    జిలేబి

    ReplyDelete


  132. లాకేత్వమిచ్చు వారల
    మే కాదు సుమీ! జిలేబి మెచ్చెను సుమ్మీ!
    ఓ కవి రాయా సారం
    బాకారంబై టపాల పారించుమయా !

    జిలేబి

    ReplyDelete


  133. అవివేకముగా విద్యను
    నవసర మదిలేని చోట నలుగురి లోనన్
    నవి చూపగా జిలేబీ
    నవకతవకలు నగుపాటు నవగొను నిన్నూ !

    జిలేబి

    ReplyDelete


  134. చాదస్తముగల వారము
    పాదముల విరామచిహ్నపలవాటసలే
    లేదు జిలేబి! చదువ వీ
    లేదీ యంటే విభజన లేయిక శరణూ :)

    జిలేబి

    ReplyDelete


  135. అంతటయు నిండి తనయం
    దంతయు యుండగ మహత్వ ధామం బగుచున్
    చెంతన చైతన్యంబగు
    నెంతయు కరుణా కటాక్ష నేత్రీం భజరే !

    జిలేబి

    ReplyDelete


  136. దశరథ రామయ్య వెడలె
    దశకంఠుని మీద విజయదశమి దినమునన్
    వశమయ్యెనోయి లంకయు
    నశించె నా రావణుండు నవలీలగనన్ !

    జిలేబి

    ReplyDelete


  137. పదియన యవతారంబుల
    కుదిరి యనంతుడు విభుండు కుండలి నందున్
    పదిలముగా దాగుచు తా
    సదనంబయ్యెను జిలేబి శక్తియు నయ్యెన్


    జిలేబి

    ReplyDelete


  138. మీ దర్శన భాగ్యంబెపు
    డో దారిటెపుడని తెలుపరో నరసింహా !
    రాదారిని బోవుచు గన
    రాదా మమ్మని జిలేబి రాగము జేర్చెన్ :)

    జిలేబి

    ReplyDelete

  139. నా దర్శన భాగ్యంబా !
    మాదే భాగ్యంబుగాద మాచన వర్యా !
    యేదో జిలేబి కి తెలుసు!
    యేదో కాదండి మాట యేదో కాపీ :)

    జిలేబి

    ReplyDelete


  140. నేనూ మీయందరిలా
    తానై జీవన గమనము తరియించినవా
    ణ్ణే!నా కెదురై నవియే
    నేనూ రాస్తున్నవాణ్ణి నిజమిది సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  141. ఎంతటి యభిమానమ్ములు
    వింతగ యిచ్చిరి జిలేబి విదురుని జూడన్ !
    కొంతయు నేర్వుము జీవన
    మంతయు సౌభాగ్యవంత మగునౌ నీకున్!

    జిలేబి

    ReplyDelete


  142. కోళ్ళ కొకప్పుటి యిండ్లూ !
    భళ్ళన కాలంబు మారి బంగ్లా లయ్యెన్ !
    మళ్ళ వివేకానందుడు
    మెల్లగ మూర్తీభవించె మేలనపర్తీ !

    జిలేబి

    ReplyDelete


  143. రొట్టెల పండుగ దినముల
    గట్టున కోరికలు తీర గట్టిగ యత్నం
    బిట్టిరి సర్వమత జనులు
    చట్టని పదవే జిలేబి చకచక నెల్లూర్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నెట్టన మా నెల్లూరికి
      గుట్టుగ పోజూచినార ? కోర్కెలు దీరా
      రొట్టెలు పట్టుటకు , మరల
      రొట్టెలు వదలాలి కోర్కెలు ఫలించంగా .

      Delete

  144. లాలించుచు బాటిల్లున
    పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్
    కూలీకేగుచు బేలా!
    హేల నగరజీవనమ్మిదేల జిలేబీ‌!


    జిలేబి

    ReplyDelete


  145. గురువూ దేవుడు నొక మా
    రిరువురు రాగన్ కబీరు రీతి జిలేబీ
    గురువునకు తొలుత నమనము !
    నెరుక తెలిపెనతడు నీకు నేర్పుగ రమణీ !

    జిలేబి

    ReplyDelete


  146. ఏమని చెప్పుదు మనుజుని
    కామక్రోధమదలోభ మాత్సర్యములన్ !
    వామనుడొచ్చె జిలేబీ
    తా మార్పునకై బలిని హతముజేసెనుగా !

    జిలేబి

    ReplyDelete


  147. కోరిటు చేరి నుతించుచు
    పారిజములటు నలరించె పద్మావతినీ !
    వారిజ నేత్రీ రమణీ
    చేరిటు మంగళముగనుము చేతన గొనుచూ !

    జిలేబి

    జిలేబి

    ReplyDelete


  148. వెర్రాడోయ్బ్రాహ్మడనుచు
    వెర్రాటలువేసెనోయి విఖరుం డతనిన్
    బిర్రగు మూడడుగులు తా
    నర్రులు దాటికబళించె నభమును దాటెన్

    జిలేబి

    ReplyDelete


  149. ముద్దుమురిపాల లోనన్
    విద్దెగ బలపాలలోను విధవిధ పాలన్
    పద్దెముల బేర్చిరిగదా
    నద్దరి గుండుమధుసూధనార్యుల్యనఘా !

    జిలేబి

    ReplyDelete


  150. పద్యంబదిరె జిలేబీ
    గద్యములను బేర్చుచుండ గమకము కుదిరెన్
    విద్యను మంచిగ నేర్వుము
    నాద్యంతంబులు ప్రశస్త నాదంబగునూ‌!

    జిలేబి

    ReplyDelete


  151. జంట కవుల్న్యస్తాక్షరి
    గంటల లెక్కలు సమస్య ఘన వర్ణనలున్
    వెంట నిషిద్దాక్షరినిన్
    గుంటల యప్రస్తుతముల గుబ్బల గనిరీ !

    జిలేబి

    ReplyDelete