Monday, November 7, 2016

సంధ్యావందన మాచరింప వలయున్ చౌశీతి బంధమ్ములన్!






సంధ్యావందన మాచరింప వలయున్ చౌశీతి బంధమ్ములన్!
 
వింధ్యారణ్యములందు భక్తజనుడై విద్వత్తు మేల్గాంచ భ
ద్రం,ధ్యాతవ్యమునిగ్గు తేల వలయున్; దాంపత్య సంసార మో
హం ధ్యానీయము మానవాళి కిచటన్ హాసంబు లావణ్యమై
సంధ్యా, వందన మాచరింప వలయున్ చౌశీతి బంధమ్ములన్!


సావేజిత
జిలేబి  


201 comments:

  1. నింద్యం బేమియు గాదు దంపతులకున్ - నిర్ణిద్ర సంధత్త సం
    బంధ్యామోహ రతీ పరీత సుఖ పారమ్య సంసార సౌ
    గంధ్యారామ రమా విలాసముల రాకా హేలలన్ దేల, ని
    స్సంధ్యావందన మాచరించ వలదా చౌశీతి బంధమ్ములన్

    ReplyDelete


  2. ఏదైనా యెగతాళి చేసినటు వంటేల్ముద్రలే నేడు మ
    ళ్ళీ దాపుల్ గనవచ్చె బో మనలపాలించంగ ! సందేహ మే
    లా! దామ్మా మనబొట్టు పెట్ట తెరచున్ లాకర్లు చల్లంగన
    న్నాధారంబిదియే జిలేబి మనమాన్యంబైసమాళించగన్ !

    జిలేబి

    ReplyDelete

  3. ఐదొందల్మన దేశమందిక సమస్యైగాన రాదోయి మీ
    జూదంబెల్లను చెల్లవోయి ఘనమై జొత్తిల్లు కార్యంబు మా
    మోదీగారిదిదీ జిలేబి ! జనులామోదంబు లెట్లుండునో,
    కాదేదీ మన భాజపా కిట జనాకర్షంబు లన్జేయగన్ !

    జిలేబి

    ReplyDelete


  4. ఒగ్గాళంబుల కాలకర్ణి మన భావోద్వేగ రూపంబు గన్
    మగ్గించంగ, మనోహరంబుగను మేల్మాణిక్య సౌశీల్య యై
    సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడు
    న్నిగ్గుల్తేల్చగ, మానవాళి మనసున్నీమంబు తేల్చంగ నౌ!


    జిలేబి

    ReplyDelete


  5. చాలౌ రాత్రికిరాత్రి నోట్లనటు మార్చంగాను సౌకర్య లో
    పాలే కారణమౌచు దుస్థితికి శాపాలట్లు పీడించెడిన్
    వేళాపాళయులేక, నిమ్మ దిగనన్ వేగంబు వేగంబు గా
    బాలారిష్టముబోవ మోడి మము గాపాడంచు వేడెన్జనుల్ !

    జిలేబి

    ReplyDelete


  6. ఛిన్నాభిన్నములాయె జీవితము యోచింపంగ పాగెమ్ము లే
    కన్నర్తించిరిగాద కోరికల సాకారంబు గావింపగ
    న్నన్నా మిన్నగు, నేటికాల మున మిన్నాగైన మోహంబులన్
    తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రహ్యమౌ !

    జిలేబి

    ReplyDelete


  7. దొంగేడ్పేచ్చు సముచ్చయంబు మరి వాదూలమ్ము నాడన్, నమో
    గంగమ్మోరటు బూనినట్లు సమతా గానమ్ము లాడంగ, మా
    బంగారమ్ముల నెల్ల దోచెను సదా భాజ్పా యటంచౌ గుడా
    రంగట్టండని కాంగిరేసు జనసారధ్యమ్ము గావించె బో !


    జిలేబి

    ReplyDelete


  8. ఆధారంబును కోలుపోయె జనులున్నాంగ్లమ్ము నాడంగనౌ
    ఖేదంబాయెను రాజపోషకులు తాకీదివ్వ సీ పో యన
    న్రాదారుల్గనె మాతృభాష, సిలికానాంధ్రాన సన్మానియై ,
    మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్రమీ భూమిపై!

    జిలేబి

    ReplyDelete


  9. మాడావీధిని నాల్గుమార్లు రమణీ మాన్యంబు గాచుట్టి రా
    వే డాయింబవలున్ జిలేబి ఘనమై వెల్గంగ జీవమ్ము లౌ
    మూఢాచార మొసంగులే మురిపెమున్ బూఁబోఁడికిన్, వేడుకన్,
    గూడారంబుల నిన్నుబెట్టి గొలువం గూడంగ వీలౌను బో !

    జిలేబి

    ReplyDelete

  10. తొల్లిన్ దండ్రికి వందనమ్మిడెను మేల్దోదుమ్మిదారిన్గొనెన్,
    తల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె జగతిన్, ధర్మాత్ముఁ డెంతేనియు
    న్నుల్లంబంతయు పొంగ తల్లి యసువుల్నూత్నంబు గావింపగ
    న్నల్లంతన్గురువున్వరమ్ము బడసెన్నా భార్గవుండే, భళా !


    జిలేబి

    ReplyDelete


  11. మిత్రుండా యముడౌ ? జిలేబి యుసురుల్ మిన్నౌ ?సహాయంబులన్
    చాత్రంబుల్ గొనిసేవకుండు సలుపో ? ఛాయా శరీరంబు నీ
    సత్రంబో ? వినవే లతాంగి నిజవాసంబున్, నవాత్మన్గనన్
    పాత్రత్వమ్మును గాంచుమమ్మ రమణీ ప్రాణంబు నీశున్గనన్

    జిలేబి

    ReplyDelete



  12. ఆత్మార్థంబు ధనంబు ధాన్యమును నాత్మార్థంబు పశ్వాదికం
    బాత్మార్థంబు హితాప్త బంధు జన మాత్మార్థంబు గేహొఛ్ఛృయం
    బాత్మార్థంబు పరిత్యజింప దగు రాజ్యం బైన నస్పంద మై
    'యాత్మార్థాత్ పృథివీంత్యజే' త్త నెడు వాక్యం బశ్రుతం బే నృపా ?

    కాశీ ఖండం

    ReplyDelete


  13. ఏ దేశంబుల కేగినా తెలుగువారే గొప్ప, రారమ్మ రో!
    మాదేశంబున గాంచుడమ్మ సినిమా, మావాళ్ల తీరున్ భళా,
    రాదే యీ యవకా శమిట్ల తమ కాళ్లాటల్ రుమాళ్ళన్ గనన్
    మేధాజీ వులటా బడాయి గదవే మేజోళ్ల రౌడీలు బో :)

    జిలేబి

    ReplyDelete



  14. ఓ పన్నీరు! జయమ్మ కేను గద యబ్బోడా సుబేదారునౌ !
    యోపన్నీరు గదయ్యరో! పలికి వాయోడారు పేరోలగం
    స్థాపించన్, తమిళమ్మ నేను, సరిచేస్తానర్ర మీతిక్క! నా
    గీపెట్టన్వెను కాడ మీ పదవులన్ గీటింప చిన్నమ్మ నౌ !



    జిలేబి

    ReplyDelete


  15. విద్యాసాగర రావులొత్తురట సువ్వీ!వీరి తీర్పేమి యో !
    సాధ్యంబో యిక రాట్టు తీరు బడిగా సాగున్నొ ? చిన్నమ్మ సా
    న్నిధ్యంబున్ గనునో ! జిలేబి, పదవీ నిర్వాక మెవ్వారిదో !
    యద్యత్వంబికతేలునా తమిళ భయ్యా! వొచ్చునో భామినీ !

    జిలేబి

    ReplyDelete
  16. కంటికి నిద్రవచ్చునె సుఖం బగునే రతికేళి జిహ్వకున్
    వంటక మిందునే యితర వైభవముల్ పదివేలు మానసం
    బంటునె మానుషంబుగలయట్టి మనుష్యున కెంతవానికిన్
    గంటకుడైన శాత్రవు డొకండు తనంతవాడు గల్గినన్

    కాశీఖండము

    ReplyDelete


  17. రాజస్థానపు పిల్ల నందిత యటన్ రాణించె భాసించె తా
    రాజువ్వై వెలుగొందె! బాల సమతారాగంబు, నాట్యంబు లన్
    సాజాత్యంబుల మాచనయ్య వలె, తా సాఫ్ట్వేరు గూడన్నటా !
    తాజా పుష్పముగా జిలేబి మనసంతా నిండెనమ్మా, భళా !

    జిలేబి

    ReplyDelete


  18. మింటన్బోవగ సెంటు భూమి ధరలౌ మేల్గాంచి రైతన్న వె
    న్వెంటన్నా యమరావతీ నగర నైవేద్యంబు గావింప గా
    గంటారావము జేయ, జైట్లి సమతా గానంబు జేర్చెన్ భళీ
    పంటల్ పండని భూమి రైతుల కిడున్ బంగారమున్ చిత్రమే

    జిలేబి

    ReplyDelete
  19. జయలలిత సమాధి దగ్గర చిన్నమ్మ మొర:-

    ఓ యమ్మ నీ పన్నీరుడు
    మా బోంట్లను కుర్చీనెక్కనీయడమ్మ
    పోయెదము ఢిల్లీ కైనను
    నీ మెరీనా సమాధి యాన తలైపురచ్చీ ।।

    (యతిప్రాసలు వగైరా గురించి మనకి తెలియదు)

    ReplyDelete
    Replies
    1. वह्वा
      हवा चल रही है

      Delete
    2. నాకేనా మీ "వహ్వా" శర్మ గారూ? థాంక్యూ థాంక్యూ 🙂.

      Delete


  20. ఆత్మన్యూనతయున్యసూయ లను నానారీతులన్గాన గ
    న్నాత్మజ్ఞానము లెస్సగాన నదిగో నాగారి మాచన్న ట
    న్నాత్మార్థంబుగ భారతంబు కథలన్నా వాహనల్గాంచుచు
    న్నాత్మానాత్మ వివేకమార్గమును తానాడెన్ జిలేబుల్గనన్ !

    జిలేబి

    ReplyDelete


  21. నారీశక్తి జిలేబి గాన మనకీ నాడే మహానాడు సా
    వేరీ రాగములాలపించు రమణీ వేగమ్ము శౌర్యంబు లన్
    భారీగా తెలుపన్ శుభాంగి మన రూపంబెల్ల వర్ధిల్ల గన్
    పేరుల్నాగుదెసల్ మనంగ కరుణన్ పేర్మిన్ గనండమ్మరో!

    జిలేబి

    ReplyDelete


  22. తానూ విద్యలనేర్చెనంచు మదమత్తంబైన కర్ణుండు హా !
    హా! నీవే మొనగాడివంచు దుడుకున్ హాసంబులే? పాండుపు
    త్రా! నోడించెదనోయినిన్ననగ , మారంకమ్ము పార్థుండనెన్ ,
    రీ! నిన్నెవ్వరిటన్బిబిల్చె, గనుమా రించోళి మర్యాదలన్ !

    జిలేబి

    ReplyDelete


  23. ఓ యమ్మమ్మో నీ యో
    పీయెసు, చిన్నమ్మ గద్దె ఫేరాయించెన్ ,
    పోయెద మమ్మా డిల్లీ
    నీయాన సమాధి యాన నిక్కము గానన్ !

    జిలేబి

    ReplyDelete


  24. తాతా! ఫాంట్లవిబాగుబాగు ! గనలేదాకళ్ళ చెక్కప్ సుమా
    మాతా !'తప్పును కాయుమమ్మ ! లలితా మాతా! జిలేబీ ! సదా!
    యేదో తాతని నొగ్గు మమ్ము! తెలుగున్ యేదో కబుర్లన్నలా
    బాతాఖాని యనంగజేయు నరుడన్ పారుండ నంతే సుమా :)

    జిలేబి

    ReplyDelete

  25. ఓదేవీ! కలహంపు నారద సఖీ యోయార మెంతెంతయో,
    కాదమ్మా లలితమ్మ తల్లి నలవేకాదమ్మ చెప్పన్ సుమా !
    వాదంబుల్, పిడివాద ముంపులలరన్వ్యంగ్యంబు, కోణంగి స
    మ్మాదమ్ముల్,కలబోతయమ్మ మరి సామాన్యమ్ముకాదమ్మరో !



    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  26. శ్రీలా! కర్ణుఁడు చచ్చుటన్ విజయలక్ష్మిన్‌ బొందె రారా జనిన్
    వేళాకోళముగాద !మిత్రుడు మనోవేగంబు నాయానలన్
    కాలాతీతముగాక సల్పి నను సౌకర్యంబులన్దేల్చి నా
    డౌ! లావుల్విడె నన్ను నేడు వెనుకాడన్ సూవె యుద్ధంబునన్!

    జిలేబి

    ReplyDelete


  27. నాలో నేనిక సేదతీరు గదులన్ నారాత లన్నింట నిన్
    బాలా! నేనిక మాటలన్ తెలిపి నా భావంబు లన్బేర్చదన్
    చాలౌ జన్మన సార్థకత్వ మిదియే ! సావేరి పద్మార్పితా !
    నీ లోకంబున నీవు నిర్మలముగా నీమంబు సాధించె బో !

    జిలేబి

    ReplyDelete


  28. ఆలోచిస్తారా ! మీరేమన్నా జోకేస్తున్నారా ? స్వామీ
    లోలా!సందేహంబేలా ! యేదోలా ప్రశ్నించేనౌ మామీ!
    కోలాటంబే మేలౌ రాజ్యం బేలన్ కష్టం బేలా స్వామీ !
    మాలా తో కర్మేఫిర్ హోవే లాలా సుమ్రన్ మన్మే మామీ :)

    హరిగతి రగడ
    జిలేబి

    ReplyDelete

  29. ఏలా గూగులు బీకె ఫీచరున హో ! యేమైన వారే గదా
    లైలా మజ్నులవోలె మమ్మి టన గుల్లామల్ల జేసెన్ సుమీ !
    బేలా! యేమిటి జేతు నేను దినమున్ వేసారి పోతిన్గదా !
    ఫాలోయప్పు కమింట్ల బోయె గదవే భామా జిలేబీ గనన్ !

    శార్దూలా! బిజి? లే !
    జిలేబి

    ReplyDelete
  30. తగినమగవాని కౌగిట దగిలినట్టి
    యలిచికుర యౌవనమ్మది యౌవనమ్ము
    తగనిమగవాని కౌగిట దగిలినట్టి
    యలిచికురయౌవన్నమ్మది యౌ వనమ్ము

    ReplyDelete


  31. అమ్మల్ పోయిరి పైకి, జైలుకు భళా, తమ్ముండ్లు పాలింతురౌ,
    మిమ్మే లంగను మీకిటన్ పళని సామీరుల్, వినండోయి మేల్
    రొమ్ముల్ జీల్చెదరోయి వారు ఘనులై రోసమ్ము మీసమ్ము లన్,
    కొమ్ముల్ మొల్వగ గుల్కుచున్ నడచెరా కుందేలు నల్దిక్కులన్!

    ReplyDelete

  32. శార్దూల మగడు మరీ "గండర" గోళం గా ఉన్నాడు :)


    మేలౌ రీతిగ నింతి సేవ గనుటన్ మెల్లంగ కాల్నొత్తుటల్
    చాలీచాలనిజీవనమ్ము న సదాచారంబు పాటింపులున్
    కాలాకాలములన్‌ జిలేబి లలనా గానమ్ము లాస్వాదము
    న్నాలిన్ వీడిన పూరుషుండెపుడు బ్రహ్మానందముంబొందురా ?


    జిలేబి

    ReplyDelete


  33. కాలం ధాటిగ పల్కె సత్య ములనౌ కర్తారుడై బ్లాగునన్
    వేలంవెర్రిగ లోకులెల్ల గనిరౌ వేదమ్ము వోలెన్నిటన్
    మూలాధారము నింటగాంచె ఘనుడై మూలంబు లన్గాంచెనౌ
    కాలక్షేప మహానుభావులు గదా కష్టేఫలీశర్మ యౌ !


    జిలేబి

    ReplyDelete


  34. మీలాంటోళ్ళటు నిగ్గు దేల్చ తగు సుమ్మీ మాచనార్యా గన
    న్నీలాకాశపు తేజపుంజము వలెన్నీ బ్లాగు లోకంబునన్
    మాలాంటోళ్ళకు బుద్ధి గూర్చు నలుమోమయ్యా! దృశానా! గురో!
    కాలక్షేప జిలేబి హాలికులు మా కష్టేఫలీశర్మయౌ !


    జిలేబి

    ReplyDelete


  35. షాకోలాడెవలెన్ కమాలు గనుచున్ షాకింగు లైకింగులన్
    మీ కోసం గనవచ్చెనయ్య భళి రా మాగాయ రించోళి గ
    న్నాకాశంబున భాస్కరుండు భువిలోనౌ బండి రావుల్ జిలే
    బీ కోటల్ గన రండునేడు‌ తవికై బీటుల్సు పాటల్సు లై :)

    జిలేబి

    ReplyDelete


  36. పాటల్లో దిగి పోయెనే మన జిలేబమ్మా ! షకీలా వలెన్
    ఘాటైపోయెను గాద దుండి పలుకుల్ గప్సాలు గప్పాలనన్
    ఝాటీ తిప్పి తుపాకి కుర్ర తనమున్ సారించె బండీశ ! తా
    తా టాటా యని పోదుమయ్య మనమంతా సాగిపోదామయా

    జిలేబి

    ReplyDelete


  37. జోగీజోగిణి రాచుకున్న మనసా జోగేంద్రు లౌతారటే?
    యాగీలేల యరాచకంబు వలదే యజ్ఞమ్ము సాగింపగన్
    యోగీశుండట సూక్ధ్మమై యగుపడున్ యోచింప వమ్మా మదిన్
    రాగాతీతము జేయుమమ్మ సఖియా రాకేందు బింబాననా !

    జిలేబి

    ReplyDelete

  38. విశ్వామిత్రుని వారసుల్లట జిలేబీ యాంధ్రులెల్లన్ భళా !
    విశ్వాసంబును గల్గియుందురుగదా, వీరుల్సమీరుల్, భళా,
    యాశ్వాసింతురు మిమ్ము వీరు రమణీ, యానంద గానంబులన్
    విశ్వంవిష్ణురమాలయంబు గదవే వీక్షింప వీరుల్కథల్ !

    జిలేబి

    ReplyDelete


  39. శార్దూలమ్మున దేలు రాజసమణిన్ సాహిత్య భావంబు వా
    క్స్పర్ధా రాగములెల్ల గాంచ వలయున్ కావ్యమ్ము గంభీర యం
    తర్దాహంబుగ వెల్గు నివ్వ వలెనౌ తాదాత్మ్యతల్గాంచి యం
    తర్దుఃఖంబుల దోలి వేయ వలె సత్యాన్వేషణామార్గమై !

    జిలేబి

    ReplyDelete


  40. పల్లెల్లో గల చెత్తలెల్ల విఫలంబై వెల్గు పంచాయితి
    న్నుల్లంఘ్యంబుల కార్య భారముగదా బొక్కంగ దస్కంబులన్
    యెల్లందున్నిది రీతి యయ్యె కని పించెన్నోయి దాస్యంబుగన్
    తెల్లోళ్లెల్లరుబోయె యింటి వటరుల్ తేరంగ జొచ్చెన్నిటన్ !

    జిలేబి

    ReplyDelete


  41. నాపై కన్నను మీరు వేడుకల పై నన్దృష్టి బెట్టంగ నౌ
    మీపార్టీ సమతుల్యమై జరిగి యీ మీయిక్కటైనన్ సుమా
    లోపాలేవియు లేక చక్కగను యీ లోకంబు చూడంగ నౌ
    యేపాట్లున్గనకన్వెలుంగి తమకీ యెద్దేవ తప్పేది గా !

    జిలేబి

    ReplyDelete


  42. యూపీలో యిక మూడువందలకు పై యూకించు సీట్లన్ జయా
    లాపంబుల్గని మేము గద్దె క్షణమున్ లంఘింప రాష్ట్రంబు నన్
    మాపార్టీ బలమైన శోభ గను, సామర్థ్యంబు గానన్ తయా
    రై పాలించుట తధ్యమౌ యమిత షా రావం జిలేబీ భళా !

    జిలేబి

    ReplyDelete


  43. రాజారా వుల పద్యమెల్లె నవతా రాగంబు లొల్కంగ జో
    రై జాల్వారుగదా జిలేబి గగనా రామంబు లన్ దేల్చుచున్
    పూజాద్రవ్యములై వెలుంగు సుమకర్పూరంబు వూదొత్తులన్
    రోజాపుష్పముతావియూరు జయహో రుస్తుంబహార్రాజసా !

    జిలేబి

    ReplyDelete

  44. షెర్లాకోమలుడాయనమ్మ వినవే సింగారి బీకేర్ఫులౌ
    సర్లే, మాచన తాతయేగద యనన్, సారించు బాణంబు, యం
    తర్లీనంబగు మాటగాంచును భళా తాటల్వదుల్చున్, మన
    య్యోర్లేనౌ యన, యోజ్జయే యనుకొనన్,యోగానుపాతంగనున్ :)



    జిలేబి

    ReplyDelete


  45. సల్లాపంబసలేలరా వినయ, వాసంతీ కుమారా గన
    న్నుల్లంబెల్లర జూడగాను తెలియున్నూత్నంబు గాదేదియున్
    మల్లాటంబులు గూడదయ్య, మనమున్, మాన్యుల్, సుబుధ్ధల్ గన
    న్నల్లా క్రీస్తులు రామచంద్రు, సుతులే యాశ్చర్య మే మిందులో
    ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. సల్లీలన్ సతి క్రిష్టినాను బుడియా సాహేబు పెండ్లాడగా
      నల్లా, క్రీస్తులు బుట్టి , దంపతుల ప్రాణాల్బోయె , రాముండనే
      పెళ్ళీ పిల్లలు లేని బాపడు తగన్ బెంచెన్ బ్రియంబొప్పగా
      నల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే , యాశ్చర్య మేమిందులో ?

      Delete


    2. రాజారావు గారి శార్దూలమదురహో !


      జిలేబి

      Delete


  46. హ్యాపీగా నిట పద్యమాలికల యాహాయాహు యాహూ యనన్
    జీపీయెస్సుల పాదపంక్తులు భళా జివ్వాడె శార్దూలమై ,
    మా పీఠమ్మున కొత్తగా ఖరగపూర్ మాష్టారు యేతెంచినా
    రౌ! పట్టారిట మేలుగాను విధమౌ రయ్యంచు రీతిన్ సుమా

    జిలేబి

    ReplyDelete


  47. తాంబూలమ్మను సేవగాంచుదురు తాతల్సుమ్మి, బామ్మల్ భళా
    రంభారావిడితో మగండటు సభారంగమ్ము జేరంగనౌ
    భంభంభం యని పూర్వకాలమునటన్ భక్తిన్ నమస్కారముల్
    గుంభించన్ యడకత్తెరంచునటు పోగుల్బెట్టు పోకల్వలెన్ :)

    జిలేబి

    ReplyDelete


  48. మీ హోళీ రసకేళి యందు నను తమ్మీ ముంచినారౌ భళా!
    నాహార్యంబుగ నిత్తు మీకు రమణా నామంబు దీర్చంగ సా
    మీ హోరంగుల బుక్యరాయ వినుమా మేలైన గీతమ్ములన్
    బాహాటంబుగ బండిగట్టి వి‌నతుల్ భాసిల్ల జేతున్ హరీ

    జిలేబి

    ReplyDelete


  49. మత్తేభమ్ముల మత్తకోకిలలతో మాతల్లి శార్దూలము
    న్నత్తారింట జిలేబి వీడ దగునా ! నాకోరికన్గాంచ వే
    మత్తున్వీడి శుభాంగి దీక్షితులకై మాతంగి మామీ భళీ
    బెత్తంబున్గొని రావె ! ధీరులటు బెంబేలెత్తి పారన్వలెన్ :)

    జిలేబి

    ReplyDelete


  50. పాలక్కాడును జేరుచుంటి నిచటన్ పద్యంబులన్జూచుచు
    న్నీలావణ్య మయూఖమెల్ల గనుచున్నీ కేరళమ్మున్ భళా !
    చాలాసంతసమన్నచాలదు సుమీ సాధించె నేకాగ్రతన్
    లాలిత్యంబుల పద్యమాలికలనెల్లన్నాదరించెన్ సదా !

    జిలేబి

    ReplyDelete


  51. మీలో యెన్ని యపూర్వ భావనలు సుమ్మీ! మాతలారా గన
    న్నీలాంబోధరసుందరుల్ మమతలన్నిన్జొప్పు సామర్థ్యముల్
    కాలాతీతము గాని వేయి పడగల్ కారుణ్య మొప్పారు భా
    మా లావణ్యములున్ రమా రమణులౌ మత్తుంగ మూర్తుల్వలెన్

    జిలేబి

    ReplyDelete


  52. ఈశుండాతడు విప్ర గోసురులనన్ యీడేర్ప ధర్మార్థముల్
    భాసింపన్నతడాయె గాలి వలె శోభాప్రావ సర్వమ్ము గ
    న్నాసంగంబగు నిర్గుణాధిపుడు నానాభంగి యీ లోకమున్
    దా సంజాతుడు, మీన రూపమిచటన్ దాల్చెన్ జిలేబీ గనన్

    జిలేబి

    ReplyDelete


  53. కాలుష్యంబొనరించి సంస్కృతిని నొగ్గాళంబు మార్గంబునన్
    మేళాలాడిరిగాాద పండితులటన్ మేధావి వర్గంబులున్
    గోళీలాడిరి తప్పిదమ్ములకు నల్గోజాల రాగంబు భూ
    పాళంబుల్ జత జేసి దేశమున గప్పాల్గొట్టె విద్వత్తులన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ప్చ్, అర్ధం కాలే. భూపాల రాగం ఏం చేసింది!?

      Delete


  54. భోగంబన్నయిదే జిలేబి, మజ! యాబోరుల్ సదాదక్కునౌ
    హా గంభీరుడ! విన్నకోట నరసింహారావు వర్యా! భళా
    బ్లాగేలేని మహానుభావులు సదా పారించు కామింట్లనౌ !
    యోగంబన్న యిదే సుమా జనుల కుయ్యోమొర్రొ తప్పెన్ గదా :(



    జిలేబి

    ReplyDelete
  55. బ్లాగడం ఓ యోగం, కామెంటడం ఓ భోగం. ��

    అసూయగా ఉందా జిలేబి గారూ? "సాగరసంగమం" మూవీలో కమల్ హాసన్ అన్నట్లు "ప్చ్, దేనికైనా ....... ఉండాలండీ" ��.

    ReplyDelete
    Replies

    1. ఏమండోయ్ విన్నకోటవారు

      మీరు మరీ "చిక్కి" పోతున్నారెందుకో స్పామ్ లో :)


      జిలేబి

      Delete
  56. డైటింగండీ, డైటింగు, "చిక్కి"పోకేం చేస్తారట 🙂 !
    అయినా కావలసిన వారి (🤔 ?!) వ్యాఖ్యలు "స్పామ్" లో పడిపోకుండా తగు సెట్టింగులు మీరే చెయ్యాలి కదా 👌. పోన్లెండి, ఇప్పటికైనా నా వ్యాఖ్య ప్రచురించారు థాంక్స్.
    మీకు, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు 🌷 (సంవత్సరం పేరు మాత్రం చెప్పదలుచుకో లేదు 😀😀).

    ReplyDelete


  57. స్పాముల్జూడవలెన్జిలేబి దినమూ సారంగ రాగంబన
    న్నామూలాగ్రము విన్నకోట నరసింహారావు కామింట్లన
    న్నోమారైన నిడంగ వత్తురు సుమా! నొచ్చేరు గాదే మరి
    న్నూమన్నింపరు గావునన్విషయమున్తూర్ణంబుగా గాంచ వే !

    జిలేబి

    ReplyDelete


  58. అచ్చొచ్చెన్ గద యమ్మ వారనుకొనన్ నాతాట దీసెన్ గదా!
    బుచ్చబ్బాయట యిచ్చ గాన సబలల్ బుర్రల్ తినన్ పంచులన్
    గిచ్చన్, సూవె జిలేబి యిచ్చ గనుచున్ గీకెన్ తనూ గట్టిగన్
    సొచ్చెంపొచ్చెము పొందె పిచ్చుక భళా సోగ్గాడు బండయ్యె బో :)

    జిలేబి

    ReplyDelete


  59. సబ్బంటే మరి వాడకమ్ము న మనింటన్నుండు సబ్బా ! యహో
    తబ్బిబ్బైతిని మాచనార్య ! యెరువున్ దానంగ కోరంగ యో
    రబ్బో యేమిజనమ్ములయ్య చదివెన్ రాయల్గ పేపర్ల నౌ
    పబ్బమ్మిద్ది జిలేబి "నుచ్చెన" యనన్ పాపమ్మ లేడర్ను బో :)

    జిలేబి

    ReplyDelete


  60. మా కుల్లూరని రావుగారు సుమముల్ మాకంద జేసెన్ గదా!
    యీ కూర్మిన్ గనుచున్ శుభాంగి మదియయ్యెన్గూడ సౌమ్యంబుగన్
    మీ కార్యంబుల మేల్మి పిల్లలకటన్ మించారు జేర్చెన్ సదా
    ఓ కారుణ్య గురో ! జిలేబి కొణిగెల్ ! ఓ కర్మవీరా ! నమో !

    జిలేబి

    ReplyDelete

  61. కుమ్మేద్దాము పదండి వారి ననుచున్ గుమ్మంబు లెక్కించి, హా ,
    వామ్మో! యీజనులెల్లబోవ మనకై వానంత మొప్పన్ యికన్
    యమ్మోరుల్ యెవరౌదురమ్మ ! వలదీ యాటల్ జిలేబీ లకై
    సమ్మానమ్ములనివ్వ మేలు గదవే సమ్మోహనంబుల్గనన్ !

    జిలేబి

    ReplyDelete


  62. రెండో యత్తవలెన్ కుమారి యచటన్ రెండాకు లెక్కించి యే
    మండో యమ్మ దుబార జేయ వలదే మా యయ్య దస్కంబనెన్
    బండారంబు నెరుంగకన్ మగడనెన్ పాపల్లటెట్లందురో
    గుండమ్మా !వెనువెంటనే గనెను బో గుండయ్య చేష్టల్ భళీ !

    ReplyDelete

  63. నేటికి గిట్టుబాటు రెండు శార్దూలములు :)


    యేతావున్ గలవే జిలేబి రమణీ ! యేవూరు మీదమ్మ యీ
    రాతల్లెక్కడ నేర్చినావు కవితా రావంబు పేర్పుల్ వెతల్
    కోతల్ గాన బిలేజి లేమ నిజమే ? కొంగీడ్చ వచ్చెన్ గదా !
    సీతాదేవికి సందియంబు యువిదే? శీఘ్రంబు గా జెప్పవే :


    జిలేబి

    ReplyDelete


  64. ఓనామాలను నేర్వ లేదు, యువిదన్నో శంకరార్యా! వశా,
    శ్రీనాథుండు రచించి మించె మనుచారిత్రమ్మునున్ బ్రీతితో
    ఓనా తల్లి యనన్, జిలేబి, సరియేమో, శంకరుల్ పల్కు లే
    మానాదంబని నేర్చునయ్య వినుచున్ మారెప్పుడున్జెప్పదౌ !

    జిలేబి

    ReplyDelete


  65. ఓంకారం బన నేది లేదనె నటన్బో శుంఠ సద్గుర్వటన్
    ఘీంకారంబుల యోగి చట్టని యటన్గీటించె కోపంబున
    న్నంకాళమ్మ జిలేబి జూడనచటన్దాతూగె తోడై భళీ
    కైంకర్యంబిడె పద్య మొక్కటిచటన్ కయ్యంబు శార్దూలమై !

    జిలేబి

    ReplyDelete


  66. సాంబా! రుగ్మత గాద నీదు పనులౌ ! శాపంబిదే నీకు రో
    షంబుల్ కారణ మౌత వంశ హృతికిన్ ! చారుక్షయంబయ్యె, వై
    రంబుల్ యీరసముల్ తొడంగె కరవీరంబుల్ తరస్సున్ గొనన్
    బింబం కైపులు సుళ్వు యిఱ్ఱి యగుతన్ వీకమ్ము గూల్చెన్ హరిన్ !

    జిలేబి

    ReplyDelete


  67. మీరూ జిలేబి లాగై
    నారుగదా యంతరంగ నాదము గని వై
    వీరా ! భళిభళి యనెదన్
    మా రాజ ! కవితలు గూర్చి మాటాడుడికన్ :)

    జిలేబి

    ReplyDelete


  68. వైయామై ? యని యంతరంగ మథనంబయ్యెన్ జిలేబీ! సదా
    జాయాజీవిగ మారుచుంటి మనసున్ సాధింప లేకన్గదా !
    సాయంకాలపు జీవితాని కెవరే సాయంబు, సావిత్రి గా
    దే, యీబండిని సాగదీయ గననౌ, దేవీ నమో! శాంభవీ !

    జిలేబి

    ReplyDelete

  69. మా బాస్ మూడటు నేడు చక్క గననౌ మత్తేభ శార్దూలము
    ల్లీ భామామణి కంద తీట పలుకుల్మీదున్ టపాబెట్టె ద
    న్బో ! బాకా గనుడోయి మాన్య సుకవీ ఓ మాచనార్యా యిదే
    మాబెట్టౌర, జిలేబికిన్ సరిగనున్ మా యత్నముల్ నిక్కమౌ

    జిలేబి

    ReplyDelete


  70. పేరొచ్చే సరికిన్ హ! గర్వ మటు తప్పేటట్లు లేదౌ జిలే
    బీ! రోగం బిది నేటి కాలమున దుర్భేద్యంబు గానయ్యె భా
    మా రిమ్మల్ తెగులొప్పె కీడు గనుచున్, మాన్యంబు గాదమ్మ యీ
    సారంబొప్పనిజీవితమ్ము తుదకున్ సాధించు దేనిన్ గదా !

    జిలేబి

    ReplyDelete


  71. మా చంద్రన్నకు నేడు జన్మ దినమమ్మా జోత లిమ్మా జిలే
    బీ ! చయ్యంచును సంత సమ్ము గన, శోభిల్లంగ రాష్ట్రంబు, భా
    మా,చాతుర్యతతో,వినూత్న ప్రగతిన్ మా మోది యాశీస్సుల
    న్మా చిత్తూరు సినబ్బ, యేర్పరచగన్నవ్యాంధ్ర స్వర్గంబు నౌ !
    జిలేబి

    ReplyDelete

  72. శ్రీ కష్టే ఫలి శర్మ ! యద్భుతముగన్ శ్రీమాన్యుడై వెల్గ యా
    రాకా కాంతిని జూడవమ్మ కథలన్ రమ్యంబుగా వించి తా
    వీకాశమ్మును గాంచె నొప్పు విధమై విద్వత్తు మాణిక్య కై,
    దూకో! కష్టమునోర్చినావు గద! శార్దూలా !విహారీ భళా !

    జిలేబి

    ReplyDelete

  73. ***
    మావూళ్ళో గల నుయ్యి సి
    వా! వానలు లేక యింకె ; వరమై వేల్ప
    మ్మా! వూరావల చూరి భ
    వా! వీవిధ గట్టి నీళ్ళు వనితల్ చేదన్ !


    మా వూళ్ళో గల నుయ్యి సిత్రమిదియే మాన్యంబు గాగ్రోల లే
    వే! వా! వానలు లేక యింకె ;వరమై వేల్పయ్యె సుబ్బమ్మ !య
    మ్మా వూరావల చూరి భవ్యముగనన్ మాకిన్ని నీళ్ళిచ్చి గా
    చేవా! వీవిధ గట్టి నీళ్ళు వనితల్ చేదన్నుపాయంబుగా!

    జిలేబి

    ReplyDelete

  74. ***

    దండాలమ్మ జిలేబి కి!
    డాండూం బని నావు గాద డమరున్ రావన్
    గండాగొండివి సూకము
    డండీ గొని నావు గాద డవులున్ దమ్మున్!

    --

    దండాలమ్మ జిలేబి కిత్తి కమరిందమ్మా విశాలాక్షి స
    ర్వం!డాండూం బని నావు గాద డమరున్ రావంగ పాకంబవన్ !
    గండాగొండివి సూకమున్ను గననౌ కందంబిటన్ దాగె యం
    దం! డండీ గొనినావు గాద డవులున్ దమ్మున్ సెబాసౌ సుమీ !

    జిలేబి

    ReplyDelete

  75. ***

    శ్రీ చక్రంబును తీరు గ
    చాచేటును గాక నీవు చనమున్ తాకన్
    గాచారంబులు దప్పు శు
    చీ చెందగనౌ జిలేబి చిరమై మించన్


    శ్రీ చక్రంబును తీరు గట్టి వనితా శ్రీమన్మహారాజ్ఞి ధీ
    తా,చాచేటును గాక నీవు చనమున్ తాకన్ శుభంబౌను నీ
    గాచారంబులు దప్పు శుభ్రముగనన్ కామాక్షి యీశాని సా
    మీచిన్చెందగనౌ జిలేబి చిరమై మించారు సౌభాగ్యముల్ !

    జిలేబి

    ReplyDelete


  76. బంగారమ్మకు నేడు వీడె తనువున్ బాల్యంబు వాసంతి గ్రో
    లంగా లేచిన తన్వి ఱిచ్చపడియెన్, లాంగూలదర్శంబునన్
    సింగారింపులయమ్మ కాంతిమతి భాసింపన్ సమాళించి నీ
    మంగానెల్లపనుల్ యొనర్చి మనసా మాన్యంబు గాంచెన్ సదా !

    *లాంగూలము - అభినయ హస్త ముద్రిక
    జిలేబి

    ReplyDelete


  77. ***

    ఐదూళ్ళే! మము నమ్ముము
    దూతా!కుదరంగమేలు దురదల్ మాయున్
    భ్రాతల్యుద్దముజే యన
    తాతల్ సమ గూర్చినట్టి ధనముల్ దావన్!

    --

    ఐదూళ్ళే! మము నమ్ము ముచ్చటగనన్నార్తిన్గొనేమయ్యరో
    మా దూతా!కుదరంగమేలు దురదల్ మాయున్ గదయ్యా ! వినన్
    భ్రాతల్యుద్దముజేయ నప్పదుగదా భారీ పటాటోపమం
    దౌ తాతల్ సమ గూర్చినట్టి ధనముల్ దావన్ సుమా సంజయా !


    జిలేబి

    ReplyDelete


  78. కాశీనాథుని విశ్వనాథునికి మా కైమోడ్పు ! జేజేలు‌ ! దా
    దాసాహెబ్ బిరుదొందె! యాంధ్రులకు మోదంబయ్యె నమ్మా జిలే
    బీ! శోభస్కరమయ్యె గాద సినిమా ఫీల్డున్ సుమాళించగ
    న్నీశానిన్ కృప యెల్ల వేళ కలుగున్మీకున్ శుభాశీస్సులౌ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీరైనా ఆలోచించారు విశ్వనాధ్ గారి గురించి. ఎక్కడ హెడ్ లైనులో కూడా వార్త వెయ్యలేదు మన ఘనత వహించిన తెలుగు పత్రికలు. ఆలస్యంగానైనా గుర్తించారని మనం ఆనందపడాలేమో?

      Delete
  79. కె.విశ్వనాథుడి మీద సరళంగా చక్కటి పద్యం చెప్పారు 👏. అసలు మీరు దీన్ని వేరే / ప్రత్యేక టపా చేస్తే సందర్భానికి తగినట్లుగా వుంటుంది.

    ReplyDelete


  80. పూబోడీ! పడతీ ! జిలేబి !యబలా! పువ్వారు బోడీ! లతాం
    గీ!బింబోష్ఠి! శుభాంగి! హేమ! సరసాంగీ! రూప సీ! హంస యా
    నా!బోటీ! కమలాక్షి !యవ్వ! కమలా! నాంచారు! యిందీవరా
    క్షీ!బింబాధర! నారి! లేమ! వనజాక్షీ! ముద్దుగుమ్మా! చెలీ !

    జిలేబి

    ReplyDelete
  81. ***

    నీ శౌర్యంబును జూచి తిప్ప లు బడన్నీలాంబరీ!కేశినీ !
    ధీ! శాసించుటమానుమమ్మ చమకుల్ దీరన్ బడాయీ ! యిట
    న్నీశానీ కృప మేలు గల్గవలయున్ నీకున్ సదా సుందరీ
    రా!సాశూకముగప్పుతాను సరసీ రావే ! జిలేబీ ! చెలీ !

    ---

    నీశౌర్యంబునుజూచితి
    శాసించుటమానుమమ్మ చమకుల్ దీరన్
    ఈశానీకృపమేలుగ
    సాశూకముగప్పుతాను సరసీ రావే !

    జిలేబి

    ReplyDelete

  82. ---

    మా మాచన్న కథాంజలిన్ గనుడసామాన్యంబు గా చెప్పె గా
    దా! మా ముచ్చటగాను తవ్వె మహిలో దానిన్ సమాళించెనౌ
    భామా! శ్రీమతులెల్ల సువ్వి చదువన్ పారాహుషారై చెలం
    గేమా!మానము గావ నేర్వ మరిసాగేమా జిలేబీలమై !


    మా మాచన్న కథాంజలి !
    మాముచ్చటగానుతవ్వె మహిలో దానిన్
    భామా!శ్రీమతులెల్ల సు
    మా!మానముగావ నేర్వ మరి సాగేమా !

    జిలేబి

    ReplyDelete



  83. కాశీనాథుని విశ్వనాథునికి మా కైమోడ్పు ! జేజేలు‌ ! దా
    దాసాహెబ్ బిరుదొందె! యాంధ్రులకు మోదంబయ్యె నమ్మా జిలే
    బీ! శోభస్కరమయ్యె గాద సినిమా ఫీల్డున్ సుమా ! శ్రీకరం
    బౌ!సంకల్పబలంబు మేలు బడసెన్ భావాటులన్దీర్చెనౌ !

    ReplyDelete


  84. మా యుత్సాహముగాంచిరయ్య పదముల్మాన్యంబుగాదేల్చిరౌ
    మాయా!యీ కవిశంకరుండు యనఘా మారన్ జిలేబమ్మ మా
    మీ యుద్యానవ నంబునందు, సుమమై మించారుగావించిర
    య్యా యీ యున్నతిగాన పద్య యిభమైయామున్ కవీశా భళా !

    ---

    మాయుత్సాహము గాంచిర
    యా యీ కవి శంకరుండు యనఘా మారన్
    మీ యుద్యానవనంబున
    యీ యున్నతిగాన పద్య యిభమై యామున్ !

    జిలేబి

    ReplyDelete

  85. క గ శా వి !

    బాధాతప్తజనమ్ములమ్మి నిజమౌ భాగ్యంబు లన్ బొంద ధా
    తౌ, దాదాత సుమా జిలేబి దరువై తాకున్ సదా జీవమై
    మేధా జీవులు మేలు సుమ్మ మహిలో మించారులన్ గూర్చుచు
    న్నాధా,ధారలజేర్చువారు ధరణిన్వారే భళారే యనన్ !

    ---

    బాధాతప్తజనమ్ముల
    దాదాత సుమా జిలేబి దరువై తాకున్
    మేధా జీవులు మేలు సు
    ధా,ధారలజేర్చువారు ధరణిన్వారే !

    జిలేబి

    ReplyDelete


  86. సీతాదేవి సెబాసు కుందనముగన్ సిద్ధించె శార్దూలమై
    ఖాతా! తెమ్మరజేర్చి జూడ తరమై కందంబు గూడన్ సదా
    తాతందానయనెన్ సుదర్శనపు వృత్తంబుల్! జిలేబీ భళీ
    భాతీ! తీ రుగవచ్చెనమ్మ తిరమై ప్రాసల్లిటన్నుజ్వలా !


    ---
    సీతాదేవి సెబాసుకు
    తాతెమ్మర జేర్చి జూడ తరమై కందం
    తాతందానయనెన్ సుద
    తీ తీరుగవచ్చెనమ్మ తిరమై ప్రాసల్ !

    జిలేబి

    ReplyDelete


  87. క గ శా వి


    గోలీవారి జిలేబి కిన్ పదములన్ గోళమ్ము జేసెన్నిటన్
    భో! లాలిత్యము గూర్చి బేర్చ లసితంబొప్పెన్ సుధాధారయై
    మాలావృత్తపు కందమున్నిట సుమా మాన్యంబుగన్ బేర్చ యో
    షా, లాలాటము తీరుగాంచె లయమై శాస్త్రీ ! భళీ భారతీ !

    ---

    గోలీవారి జిలేబికి
    లాలిత్యము గూర్చి బేర్చ లసితంబొప్పెన్
    మాలావృత్తపు కందము
    లాలాటము తీరుగాంచె లయమై శాస్త్రీ !

    జిలేబి

    ReplyDelete

  88. క గ శా వి

    జీవాధారము దేవ రౌత ! వినవే సిద్ధించు ధన్యంబు గా
    గా !వావాదములేలమాకు, వరమై గావన్ సదా స్వామియై
    వావృత్తంబును గాన గట్టి గను ! దైవాధీన మై యెల్ల యై
    రావా! వేళయిదే జిలేబి వనితా రమ్మా ! నిత్తు హారతీ !

    ---

    జీవాధారము దేవర !
    వావాదములేలమాకు వరమై గావన్ !
    వావృత్తంబును గానగ
    వా! వేళయిదే జిలేబి వనితా రమ్మా !

    జిలేబి

    ReplyDelete

  89. హోరెత్తెన్నటు గాద బాహుబలి ఓహోహో బలేగుంది! సా
    హోరేయన్న,దుమారమేను సినిమా హోంబట్టు గట్టన్ తగున్ !
    పోరీ!డప్పులు! రాజమౌళి సినిమా ! పోరాడు వీరాంగణల్ !
    మారామారి సుమా ! జిలేబి ! గనవే మా హాలివుడ్డౌ భళా !

    జిలేబి

    ReplyDelete

  90. క గ శా వి

    ఓ మా మాచన వర్య! సత్యమిదియే బ్రోచన్ మహాభారత
    మ్మౌ మా మేయి సుయోధనుండు మదిరన్ మాగెన్, సుధాధారలన్
    తామత్తున్నటు తూగె సుమ్మి, మగువన్ తాకన్ సమస్యన్ బడెన్,
    భామా! మామయు జూదమందు మలకన్ బాయన్ సమాధానమై !

    ---

    ఓ మా మాచన వర్య! స
    మా!మేయి సుయోధనుండు మదిరన్ మాగెన్
    తామత్తున్నటు తూగె సు
    మా! మామయు జూదమందు మలకన్ బాయన్ !

    జిలేబి

    ReplyDelete

  91. క గ శా వి

    సీసమ్ముల్ గన వమ్మ ரொம்ப சுலபம் స్మీ ! రా! జిలేబీ రవం
    బై సాసించగనన్ వెలుంగ శరముల్ బాయున్ శుభాంగీ భళీ
    మీ సొమ్ముల్ బెరుగన్ మదిన్ సుమములై మించారు శోభిల్లు! వా
    ణీ! సీసాలనుగట్టి తూగు శివమై నీవున్నిటన్ సర్వదా !

    ---

    సీసమ్ముల్ గన వమ్మరొ!
    సాసించగనన్ వెలుంగ శరముల్ బాయున్ !
    మీసొమ్ముల్ బెరుగన్ మది
    సీసాలను గట్టి తూగు శివమై నీవున్


    ಜಿಲೆಬಿ

    ReplyDelete


  92. క గ శా వి

    నోవాచేరన నేమి రంపు తెలియన్ ఓ వైవియార్ శ్రీనివా
    సా! వా! వేడి దినమ్ములాయె వలయై సాగెన్ గదా వ్యాఖ్యలౌ !
    సావంతుండట వేచెనౌత కథకై సామీ సవాలాయె రా
    జా వేవెల్గుల చెప్పుమయ్య విదురా జాలున్ రహస్యంబులున్ !



    నోవాచేరన నేమిర?
    వా! వేడి దినమ్ములాయె వలయై సాగెన్
    సావంతుండట వేచెను
    వేవెల్గుల చెప్పుమయ్య విదురా జాలున్ 🙂

    జిలేబి

    ReplyDelete

  93. క గ శా వి

    సాహోరే ! భళి తేజమున్న సినిమా సాధ్యంబు జేసెన్ గద
    ర్రా హాహాయని యెల్లలెల్ల హవళార్భాటుల్లటన్జేసెనౌ !
    ఓహోహో మన రాజ మౌళి గదరా పోరాడె బో గట్టిగన్
    హాహా హర్మ్యమిదే శుభాంగి హలమై హా! రమ్యకృష్ణాయనన్ !

    ---

    సాహోరే ! భళి తేజము!
    హాహాయని యెల్లలెల్ల హవళార్భాటుల్ !
    ఓహోహో మన రాజ మ
    హా హర్మ్యమిదే శుభాంగి హలమై హారమ్ !

    జిలేబి

    ReplyDelete


  94. ఆయత్తా తను కోడ లేయొకపుడన్నాయంచు తానెప్పుడై
    నాయాలోచనజేయునయ్య గురువా ! న్యాయంబుగా జూడనౌ
    మాయాలోకమునందు యెల్లరు శుభమ్మై కర్మబద్ధుల్‌‌ సదా
    న్యాయాన్యాయము చూడ రయ్య గనుమా నాడున్నిటన్నేడునౌ‌

    జిలేబి

    ReplyDelete


  95. ఉప్పా! హే లవణంబ! నీళ్ళ వరుగుల్ !ఓహ్ ! నో! జిలేబీ నెవర్ !
    యప్పాయేలభయమ్ము లేల రమణీ యంబైన సౌవర్చలన్
    నిప్పైజూడగనేల వైద్యు లిట హా! నీచంబు గా జూతురే !
    గప్పాకాదిది నేట్రమూరు గన బాగౌ మంచి మందౌ నయా !

    జిలేబి

    ReplyDelete

  96. అయ్యారే సరిజోదు గారు రమణుల్, నారుల్, జిలేబీలకు
    న్నయ్యారే మనువాడు వారు వినురన్నా! మేలు మేలైనవా
    రయ్యారయ్యని కాలు ద్రువ్వు వనితల్, రావంబు గానన్ భళా
    గయ్యాళిన్ దగఁ బెండ్లియాడి నపుడే కల్గున్ గదా సౌఖ్యముల్

    జిలేబి

    ReplyDelete
  97. *** నేల - నీరు - అగ్గి - గాలి
    పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ మహాభారతార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యం



    క గ శా వి - కంద గర్భిత శార్దూల విక్రీడితం

    ఏలన్ బో రుచిరమ్ములౌ పురమునన్నేలన్ భళారే యనన్
    గీ లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్లటన్ గానకన్
    నేలన్ కాలటు జారనౌర పడతుల్ నేజెల్ల! నవ్వుల్ గనన్
    బో,లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్ రొ దుర్యోధనా!

    ---

    ఏలన్ బో రుచిరమ్ముల
    లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్ !
    నేలన్ కాలటు జారన
    లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్

    జిలేబి

    ReplyDelete


  98. హే! యువ్వార్యెవిజర్డ్ జిలేబి ! తరుణీ ! హే మాలినీ!భేష హో!
    మీయాసక్తిని జూడ ముచ్చ టగుతమ్మీ ! చాల బాగున్నదీ !
    యీయయ్యర్రెవరో గదమ్మ వనితా యీలోక మందున్ భళీ
    మీయవ్వారము తాళ గాను దొరికెన్ మీమాట లెల్లన్ గనన్ :)

    జిలేబి

    ReplyDelete


  99. స్పందింపన్ మరి చాను మాచ నవరుల్ పారుల్ క్షమింపన్ దగున్
    బిందాసౌ గురుడొచ్చెనౌర కథలన్ బింబోష్ఠులన్ దాటె తా
    కందాయమ్ముల లెక్క గాంచె గదవే కందర్ప బాణమ్ములౌ
    వందారంబని కొత్త గా విషయమున్ వాహ్యంబు గావించెనౌ

    జిలేబి

    ReplyDelete


  100. ఓయీ!వామనరావు!యేమి కతలన్పోకంతనౌమాటకున్
    సాయించేనయ వైవియారెసిట! మాచన్నా! గురో మీరు భా
    జాయించన్ దగు మీ కథన్నిటన సజ్జల్గట్టి జూడంగనౌ!
    మీ,యీ గాథల వేరుబాటు గన,సామీ రమ్ము వేగమ్ము గన్ !

    జిలేబి

    ReplyDelete


  101. సాలోక్యంబు తపస్సుచేత యగునౌ సామీప్యమౌ భక్తితోన్
    సారూప్యంబగు ధ్యాన మార్గముననౌ సాయుజ్యమౌ జ్ఞానమున్
    నీలో హెచ్చుగ జేయనౌత రమణీ! నీలాంబరీ శాంభవీ
    కాలాకాలమునందు యెల్లరికినౌ కాంతిన్ ప్రసాదించుమా !

    జిలేబి

    ReplyDelete


  102. ఔరా! హాలికు లార! రావ లెనిటన్నౌయాల్క హాలిక్లటన్
    మీరంతా మన మాచనార్యు లనిరౌ ! మిన్నైన మన్నైన మీ
    రేరాయాంధ్రముగావ నేడు బలియై రేయింబవళ్ళున్ తులా
    భారమ్మున్నట తూగినారు జనసౌభాగ్యంబులేతప్పగన్ !

    జిలేబి

    ReplyDelete


  103. బాలాసుందరిరమ్మనన్ మనసు లబ్జౌయంచు, నాట్యంబులా
    డేలావణ్యవతీ జిలేబి గనుమా ! డెందంబు బోవంగనౌ
    లోలాక్షీ సఖుడేగదా నెరయునౌ లోకమ్ము, మేల్వెల్గుగన్,
    మా లావై మణిమాల గాను రమణీ మాన్యంబు గా రౌతుగన్ !

    జిలేబి

    ReplyDelete


  104. కర్ణుండాతడు సప్తవర్ణముల యొక్కండై జిలేబీగ యా
    కర్ణంబై సుడి జుట్టె నౌర! భళి కొల్కత్తాపురిన్ యుగ్రుడై
    చూర్ణంబుల్ గన సాధికారమగు గిచ్చుళ్ళంచు సాధించెనౌ
    జీర్ణంబయ్యెనహో వ్యవస్థ మరియున్ జీండ్రంబటన్న్యాయమున్

    జిలేబి

    ReplyDelete


  105. విద్దెల్లాడుచు చుప్పనాతి మెలపున్ వేగించె రామున్నెటుల్ ?
    ముద్దుల్లాడెడి యిఱ్రి మైకమున రామున్ కోరె నెవ్వారటన్ ?
    హద్దుల్దాటగ నెవ్వరిన్నడచెనౌ యంకంబునన్ రాముడౌ ?
    ముద్దిమ్మంచు; ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్; రావణున్!

    జిలేబి

    ReplyDelete


  106. మా యానందము చెప్ప లేనిది సుమా ! మా వూరి శ్రీపాద వా
    రాయే! యాయనుభూతి యేమనుచు‌ నే రాయన్ దగున్నన్యగా
    మీ! యీనాటి జిలేబు లెల్ల చదువన్ మించారుగా వారటన్
    సాయాహ్నమ్ముల సేద దీర తనివిన్ సాధ్యమ్ముగావింతురౌ !

    జిలేబి

    ReplyDelete


  107. అప్పాజోస్యుల విష్ణుభొట్ల సయిటున్ గానన్నటన్ భారతీ
    యొప్పారెన్నట బో జిలేబులవలెన్ యోగ్యంబుగా పొత్తముల్
    చొప్పిల్లెన్ గద మేలు బొక్కసముగా జ్యోతుల్లతల్ వెల్గులన్!
    విప్పారెన్ కనులెల్ల పండుగయనన్ వీక్షింప వాటిన్నటన్ !

    జిలేబి

    ReplyDelete


  108. అమ్మా! నిర్భయ! ఛిద్రమయ్యె బతుకౌ! నాదేశమే? భారతీ !
    వమ్మాయెన్గద నమ్మకమ్ము వనితల్ వ్యాజమ్ము లన్నోడి నా
    రమ్మా! యీ నవనాగరీక మనుజుల్ రాదీయు రీతిన్గనన్
    నమ్మమ్మా వలయున్ లతాంగులకు నానారీతి సంత్రాణముల్

    ReplyDelete


  109. వస్తావా వరుడా! తుపాకి యెరగా వాయించ మంటావ !హా !
    చస్తావోయ్ తృటిలో సుమా ప్రియతమా ! చట్టున్నిటన్రార చూ
    పిస్తానోయ్ మరి రాక పోయిన పవర్! పిస్తోలు జూపెన్ భళీ
    పిస్తాలాంటిది పిల్ల వాజినము జూపించెన్గదా సూటిగన్ !

    జిలేబి

    ReplyDelete


  110. అయ్యో ! చంద్రిక గారు ! బాహుబలియై నారమ్మ మీరున్ భళీ
    హయ్యయ్యో ! మన విన్నకోట నరసింహారావు యన్లేదు సూ !
    వయ్యారమ్ముల చిత్ర లోక మును రవ్వాడించె నంతే సుమా!
    సయ్యాటల్నట వారు వేయు చతురుల్ సామర్థ్యశాలీ‌యహో !

    జిలేబి

    ReplyDelete


  111. పన్నారమ్మ జిలేబి ? మాచన వరుల్ వాక్యమ్ము జూడంగ హా!
    విన్నాణమ్ములు వెల్లువయ్యె నిట సువ్వీ విన్న కోటన్నరో !
    పన్నుల్లయ్యెను సూవె తెమ్మరవలెన్ పారెన్ భళారే భళా!
    సిన్నబ్బా! వినవయ్య చిత్ర కతలౌ జిల్ జిల్ జిలేబమ్మవీ !

    జిలేబి

    ReplyDelete


  112. మోసేవారెవరమ్మ యెల్లరునటన్ ముందంజ గానౌ భళా
    వ్యాసంగంబులజేయ‌నౌ !వలయు కవ్వంబున్ మధింపన్, సభన్
    సాసించంగ జిలేబులై వెలుగగన్, సాధించి పట్టుల్గొన
    న్నాసంగంబును మేలు చర్చలనిటన్గావింప కామింటరుల్ !

    జిలేబి

    ReplyDelete

  113. సంచారమ్ముల విన్నకోట నరసింహారావు పల్కుల్ భళా !
    సోంచాయింతురు గాక యెల్లరుజనుల్ సోంబేరులై బోవకన్ !
    మించారన్ సినిమా కథల్ నలుగురన్ మెచ్చంగ నాణ్యంబుగా
    కుంచెన్చిత్రములన్ జిలేబి చెలమై గూర్చంగ మేలౌనహో !


    జిలేబి

    ReplyDelete


  114. మూడేళ్ళాయెను మోడికిన్ గద నమో మూర్తీభ వించెన్ జనుల్
    పాడన్ పాటల రూపమందున భళీ భాజ్పా! జిలేబీయమై
    యీడేర్చంగ జనావళిన్నలతలన్నిక్కట్ల నౌ, దేశమున్
    గాడిన్బెట్టతగున్నమో రవమునన్ గాడించు రీతిన్ భళా!

    జిలేబి

    ReplyDelete
  115. చాలా రోజులు రాయ లేదు గదవే శార్దూలమున్ హా జిలే
    బీ! లెమ్మా ! యొక యత్నమున్ సరిగనన్ భీరుత్వ మేలన్ సుమా !
    వీలవ్వంగను రాయ రాయ కుదురున్ విశ్వాసమున్ గాంచవే,
    యేలాగైన నికన్ పదమ్ము లనిటన్ యేర్పాటు జేయన్ భళీ !


    సావేజిత
    జిలేబి

    ReplyDelete


  116. ఓ! నీహారిక! నీలవేణి !ప్రమదా ! బ్రువ్వంచు డామ్మంచు బ్లా
    గ్లో నీపాదము మోపి కొట్టు ! మనుజుల్ గొల్లంచు యుద్ధంబులన్
    తేనీరుల్ గొనుచున్ జిలేబు లకటా త్రేన్పంగ వీలౌను సు
    మ్మా! నీ వ్యాఖ్యల కారముల్ మరిచి నామమ్మా సుదీర్ఘంబు గా !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete

  117. తాళంబుల్, యవనారిగాథ ల నహో , తాతయ్య రాహుల్కిటన్
    తాళింపుల్ గురి! రాజనాథుడటనో , తాయ్లాండు కెట్లా గనెన్
    మేళమ్ముల్ కథలే మిటంచు వివరమ్మేమంచు ప్రశ్నల్లహో !
    కాలమ్ముల్ సరిలేక బోయె గదవే కాంగ్రెస్సుకున్ గడ్డుగన్ !

    జిలేబి

    ReplyDelete

  118. శ్రీవెంకయ్య! ఉషాపతీ! భళి భళీ ! స్వీకారమున్ జేసెనౌ!
    ఆవెంకన్న దయన్ పదోన్నతిని గొన్నావయ్య కొల్వన్! సదా
    నీవాక్ప్రాబలమున్ స్వదేశ మిక మాణిక్యంబు గా వెల్గుచున్
    సావాసమ్మగుగాక మోడి ప్రభకున్ సారధ్యమున్నిచ్చుచున్!

    జిలేబి

    ReplyDelete


  119. జోహారుల్ కవి! శంకరాభరణ తేజోమూర్తి ! శ్రీ శంకరా
    ర్యా ! హారమ్ముగ నిచ్చటన్, పసిగొనన్ యావత్కవుల్ సర్వదా,
    బాహాస్ఫాలనమాచరించి, జనులన్ పద్యమ్ములన్ వ్రాయను
    త్సాహంబుల్ నెలగొల్పి నెక్కొన, భళీ స్తైమిత్యమై నిల్చిరే!

    జిలేబి

    ReplyDelete

  120. --

    చూద్దారీయని గోడమీది వృషదంశున్వోలె నాకాశము
    న్నద్దాల్మేడన దాగురించి నరుడా నాట్యమ్ములేలా! పదా
    యిద్దారీ మన నేతకున్నెరవు,ఆయిందా సహాయమ్ములన్
    చేద్దామోయ్! జనులెల్ల జాగుకొని రాజేయింప జైహిందగున్ !

    జిలేబి

    ReplyDelete


  121. మావా కొత్తటి కోక నిచ్చి సరి సామ్రాజ్యమ్ము నన్ నిల్పినా
    వే! వారాంతములో న నాకు ధర వే వేలన్ సమాళించి నా
    వే! వాహ్వా మన మూర్తి సోకు! సరి పోవే నీకు బైబ్యాకనన్
    కోవామాదిరి గాంచినాను సఖుడా! కోయంచు సైయంచునూ

    జిలేబి

    ReplyDelete
  122. --

    నారదా ! ఎక్కడెక్కడ కొంపలు తేలిపోతున్నాయో !

    బారా ! రారా ! కావుమా !

    వైవీయారు,జిలేబి, మీరిరువురన్ వార్నీ యనన్నొక్కరో ?
    కావేవీ మన తాత కల్పనకు జోకమ్ముల్లహో ! దూరవా
    ణీ వారాయెను మాచనార్యుడు గదా, నీవాడ తానాడునౌ !
    సావేరీ ! వలయున్ నిదానము సుమా ! సారంగ రాగమ్మునన్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  123. భావోద్వేగపు మానవుండతడహో భామామణీ మోడియౌ !
    తావుర్రూతల నూగు చుండు జనులన్ తారాపథంబందునన్
    జాపాన్స్పీడగు రైలులోన జొనుపన్; జాగ్రత్త కాంగ్రెస్సు, పై
    లాపచ్చీసుగ మీరు బోవు దరహో లావుల్లికన్ బోవ గన్ :)

    జిలేబి

    ReplyDelete


  124. కొట్టాలమ్మి ఘనంబుగాను పదముల్ కొంకర్లు బోవన్ జనుల్
    చెట్టూపుట్టల వారు బట్ట వలెనౌ చెంగావి రంగుల్ గన
    న్నట్టాయిట్టని పూనకమ్ము ల భళీ నాట్యంబులాడన్ వలెన్
    పట్టమ్మా విను ఛాచిఛీ యనుచు రాపాడన్ దగున్ సర్వదా

    జిలేబి

    ReplyDelete




  125. పన్నారీ! మజ! బామ్మ కందమునకున్ పాదమ్ము జేర్చన్ సదా
    విన్నాణంబధికమ్మగున్ సరసమై వీనుల్ జిలేబుల్ గనున్ !
    కన్నా! నీ పదముల్ మహత్వములు గంగాళమ్ము గుంపించునౌ!
    పొన్నారీ ! గొను యమ్మ దీవెన భళీ భోగమ్ము మించారగన్ !

    జిలేబి

    ReplyDelete


  126. హౌలయ్యా ! ధనమూలమౌ జగమనన్,హాలాహలమ్మున్నిటన్
    చాలామట్టుకు జేర్చినావు గదవోయ్ ! చాలాకి గాదోయి మూ
    లాలన్గొట్టితి వీవు గాద గురువా లాలూచి యేలన్ప డే
    వో? లావై నిలిచేవు నాడు బరిలో వోడేవు కంచెన్విడన్ !

    జిలేబి

    ReplyDelete


  127. ఆహా! యేమి రుచీ యనన్నెలతుకా ఆకాంక్ష! ప్చ్! చెప్పలే
    న్నోహోహో మధుమేహమాయె గదవే ! నోరూరె నమ్మా గనన్
    బాహాటమ్ముగ చెప్పలేము గదవే బాధల్ప్రకోపమ్ములన్
    స్వాహాచేయవలెన్ జిలేబి చడియున్ చప్పుళ్ళు గాకన్నహో :)

    జిలేబి

    ReplyDelete


  128. రౌడీ రాజ్యపు మాలికుండదురహో రయ్యంచు వచ్చెన్ గదా!
    తేడా వచ్చిన తాటవొల్చుదురు పత్తేదారు లైయందరిన్
    మేడాటంబులకున్నికన్ భళి భళీ మేగాపులౌవారు! పూ
    బోడీ! బ్లాగుల తీరమున్నిక గనున్ బొంకప్పలెల్లన్నహో ?

    జిలేబి

    ReplyDelete


  129. కొంతైనన్ యతనమ్ము గాంచి మృగముల్ క్షోణీజముల్లా మహా
    కాంతాసేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్!
    శాంతాకారముగా జిలేబి మనుజుల్, సర్వంసహాలోకము
    న్నెంతైనన్ పరిరక్షజేయ దగునౌ నేర్పైన రీతిన్ సదా!

    జిలేబి

    ReplyDelete


  130. పోరాటమ్ముల జేసినాను ! వినునా బోధల్! ధనుష్పాణిని
    న్నీరేడుర్విని గెల్వ లేరు జనులౌ నిక్కంబిదే" , చెప్పుచున్
    మారీచుండు, "ధరాత్మజాపతిని దుర్మార్గుండునై చంపె రా
    పుల్రీఢమ్ములు వీడ" గోరె భళి కోపుల్నాటి ఘాతమ్ము లౌ !


    సావేజిత
    జిలేబి

    రాపుల్రీఢమ్ములు వీడ" గోరె భళి కోపుల్నాటి ఘాతమ్ము లౌ !
    *రాముడి తో రాపిడి, రీఢము వీడ మనెను, కారణము (కోపు) నాటి రాముడి శరఘాతముల్ :)


    ReplyDelete


  131. ఆంధ్రభారతి



    శా. ఎట్రా శేషుఁడు పోతరించి సభలో నెగ్గాడెనారత్నమీఁ, డట్రావాసుకితక్షకాది ధృతరాష్ట్రామాత్యకర్కోటకుల్‌, చుట్రానిల్తురుగాక నన్ను సమరక్షోణిన్‌ విజృంభించి యా, గట్రాచూలి విభుం డెదిర్చిన నహంకారంబు వారించెదన్‌." జై. ౭, ఆ.

    ReplyDelete


  132. కాళ్ళావేళ్ళపడంగ నాడు సినిమా కైదుడ్డు లిచ్చేరు మా
    నోళ్ళన్నానినపాటలే భళిభళీ నోచెన్ జిలేబీయమై!
    కాళ్లావేళ్ళను పిల్లలన్ పడితిమీ కాలమ్ము జూపన్ సుమా
    మళ్ళీచిత్రజగత్తులన్, బుడతలే మాపెన్నిధీ, హా! బలీ :)

    జిలేబి

    ReplyDelete


  133. కందమ్మా! మజ! కందపద్యముల సౌగంధమ్ము లన్ దీర్చి నా
    వందంబైనటి కైపులన్ జనులలో పంతమ్ములన్ పెంచుచున్
    ఛందంబంతయు నేర్చుచున్ గమకమున్ సాధింప యత్నమ్ముతో
    క్రిందామీదపడన్ జనావళి యికన్, కిర్రెత్తి బేజారవన్ :)

    జిలేబి

    ReplyDelete


  134. వందే కంద వశేష ఛాంధస రతే ! వందారు కందప్రియే !
    వందే నారద శారదా విలసితే ! వందారు భేద ప్రియే !
    వందే బ్లాగు వరూధినీ విరచితే ! వందారు హాస్యప్రియే !
    వందే గుండు జిలేబి నామ విహితే ! వందారు వ్యాఖ్య ప్రియే !

    శ్రీలక్కాకుల రాజారావు గారు :)

    ReplyDelete
    Replies
    1. పద్యం 👌👌👌👌బ్రహ్మాండం,కానీ మధ్యలో ఈ గుండు ఏంటండీ? 🤔😃

      Delete

    2. వందే పూర్ణ జిలేబి అంటే దుష్ట సమాసమవు తుందేమో :)


      చీర్స్
      జిలేబి

      Delete
    3. వందే,వందే అని నొక్కి చెప్పేరు వందకంటే ఎక్కువివ్వడం కుదరదన్నారు :) ఆ తరవాత వందారు (వంద+ఆరు=నూటారు)కి పెంచారే :)

      Delete

    4. అది అరవం వందారు :) వచ్చినారు అని ...

      :)


      జిలేబి

      Delete
    5. మేమో కార్యార్థ మరసి
      మామిని స్తోత్రంబు సేయ మధ్యన తవరీ
      'రామా'యణములు వలుకుట
      క్షేమంకరమా ? మహాత్మ ! చెపుమా ! గురువా !

      Delete
    6. అయ్యో! అలానాండీ!! నేనలా అనుకోలేదు సుమండీ!!!
      మొత్తానికి వందారుకి పాట కొట్టేసినట్టేనంటారా? :)

      Delete


  135. శ్రీలక్కాకుల రాజ! కట్టిరిగదా శ్రీశర్మ బాలాగునన్
    చాలా చక్కటి పద్యమున్ భళిభళీ ! శార్దూల ! కుల్లూరు వా
    సా!లాగించితి మీ జిలేబులనహో సామీ శుభాకాంక్షలౌ
    భోలానాథుడి యాదరమ్ము గలుగన్, భూయిష్ఠ మై సర్వదా

    జిలేబి

    ReplyDelete



  136. పాకంబయ్యెను నారికేళపు వహిన్, పద్యమ్ము, కందమ్ములున్
    పాకంబయ్యెను నారి, కేల బడగన్ పాంజేబు పట్టీలుగన్!
    పాకంబయ్యెను నారి ! కేళిక, మజా, పాటల్ కవాలీ లహో !
    పాకంబయ్యెను "నారికేళఫలముల్" బామ్మా ! జిలేబీ భళీ !


    జిలేబి


    జిలేబి

    ReplyDelete


  137. హా! వింజోవిని పాదముల్గనుచు హాహాహాయనన్ మెత్తురే
    మో వీరెల్ల యనంగ హాళినిగనన్ మోగించగన్ పాకముల్
    మోవుల్దీర్చి యటన్, జిలేబి గనవే మోదమ్ము బోవంగ, హా !,
    వైవీయారుకు మంగళమ్మని జనుల్ వయ్యారముల్బోయిరే :)


    జిలేబి :)

    ReplyDelete


  138. కందమ్మా! వలదే విలాపమకటా కన్నీరు మున్నీరులన్
    చిందించన్ వలదే జిలేబి ! మహిలో సింగారి వీవే సుమా
    బందీ గానిను బెట్టిరే కవులిటన్ భాగ్యమ్ము జేర్చన్ భళా
    వందారుల్లిడి నేర్చుకొంటినిగదా వంద్యమ్ముగా‌ నీ జతిన్ :)


    జిలేబి

    ReplyDelete


  139. తబ్బిబ్బుల్పడుచున్ జిలేబులనిటన్ తాంతమ్ము ధూంధామనన్
    జొబ్బిల్లంగన ఆంధ్ర భారతినటన్ శోధించి గాలించుచున్
    జబ్బల్బట్టి తెలుంగు నేర్చు సరదా సావేజితల్మేమహో
    రుబ్బన్మాకు కవీ నిఘంటు వదియే రూఢమ్ము గానన్ సుమా!

    హమ్మయ్య ! రాజారావు గారి ఉభయం ఇవ్వాళ రెండు శార్దూలాలు :)

    ReplyDelete


  140. ఝాడూబట్టుచు వాయగొట్టి కనిపించన్ కాన రాలేదయా!
    గోడల్మీదన గోడలన్నిలిపెగా గుబ్బెమ్మ బుర్రల్ దినన్
    బాడబ్యమ్ముల బ్లాగులోకమున తా బాటింగు చేసెన్ గదా
    యాడబ్బా హరిబాబు మానెనట సయ్యాటల్ జిలేబుల్గనన్ !

    జిలేబి

    ReplyDelete


  141. వేగమ్మే తమ జీవితమ్ముగ భళీ వేర్వేరు పారీంద్రముల్
    రాగంబెల్లగనన్, మనోహరముగా రంజిల్లగన్, నందనో
    ద్యోగాభ్రాంతులు సేదదీరి మదిలో దోబూచులాడంగగన్
    మేఘానందపు రెక్కలార్చు విధమై మేధన్ విభూతిన్గనెన్!


    జిలేబి

    ReplyDelete


  142. మేధాజీవులు గట్టివారు ధరణిన్ మేల్గాంచి నారమ్మి యే
    వేదమ్ముల్ పఠియించిరో తెలియదే వేగమ్ము వేగంబుగా
    గోదారిన్ తమ యిల్లుగాన తపముల్ గుప్పించెరేమో సుమా!
    జోదాభాయి జిలేబియా విను కథల్ జోరుల్ గనన్ గూర్చిరే :)

    జిలేబి

    ReplyDelete


  143. అప్పా! అప్పిదిగో దొరంకునిట సాయమ్ముల్లనన్, వడ్డి య
    ప్పప్పాలేదనగన్, జిలేబి వెడలెన్ బారుల్, విమానమ్ములన్,
    గప్పాల్కొట్టెను డబ్బుతో విరివిగన్! గాలమ్ము లోచిక్కగన్
    గప్పాటుల్మొదలవ్వగాను తెలిసెన్ గాదే యురిత్రాడదే !

    జిలేబి

    ReplyDelete


  144. అన్నా ! నీవు గదయ్య అండ! జనమంతా కావుమన్నా యనన్
    ఉన్నాడండగ పాదయాత్రలని వూరూరన్ సదా సేవలో,
    కన్నీరుల్ వడ గళ్ళు గా జగనుడే కాపాడ వచ్చే నయా
    చిన్నారిన్ గని సాక్షి పత్రికయటన్ చిందింప బాక్సైటమున్
    కన్నారీ సయి భాస్కరన్న పదముల్ గాదే జిలేబీయమై !


    కందోత్సవ శార్దూలోత్సవ ...

    జిలేబి :)

    ReplyDelete


  145. వైయస్సారు కుమారుడా ! జగనుడా ! వైవిధ్యమైనట్టిదౌ
    నీయాత్రన్ జను లెల్ల మేలు గనగా నిక్కమ్మెలక్షన్లలో
    చేయూతల్ జను లివ్వటమ్ము ,పదవిన్ చేబట్ట గానన్, భళా
    ఓయబ్బో! తనయుండుమించె జనకున్ ఓటేసి నామే యనన్ :)

    ReplyDelete


  146. నిండాడబ్బులుకావలెన్ కరుణ తో నిండంగ గుండెల్ భళా
    కొండారెడ్డినిబిల్చె! అండ గనుమా కొండంత బిడ్డోడికై!
    జండాబట్టుదురెల్లరున్ననుజ ! భాజాయింత్రుమేళమ్ములన్
    అండాదండగయబ్బవోలె మనకున్ ఆంధ్రప్రజానీకముల్ !

    జిలేబి

    ReplyDelete


  147. రాకా చంద్రుని రాత్రులెల్ల మదిలో రాగమ్ము గావింపగన్
    శాకంబై వెలయున్నదే గద వయస్యా నీకు రమ్యంబుగన్
    వీకాశమ్ముల దేలగన్ మజ జిలేబీలన్ సమాళింపగన్
    పైకూలన్ వదులంగ మాకు రమణీ వైద్యమ్మదేనమ్మరో !

    జిలేబి

    ReplyDelete


  148. అన్నార్తుల్,యువకుల్,యతుల్,నెలతుకల్లాశీస్సులన్ గోరెర
    న్నన్నన్నా తిరువేంకటేశ! జనులన్ నర్తింప జేసాడు శ్రీ
    మన్నారాయణ! తావియబ్బి పదముల్ మట్టాడ, జీరాడి స
    య్యన్నారయ్య జనాళియెల్లరు భళా యజ్ఞమ్మిదే యెన్నగన్

    జిలేబి

    ReplyDelete


  149. మీ పద్యాలు జిలేబిగారు, మజ సుమ్మీ !ధన్యవాదాలయా !
    కాపాడారుగ మంచిమార్కు లను మా కైవేసి మీరున్న హో !
    రాపాడంగను మేలుగాంచు ప్రతిదీ, రాయంగ రాయంగ మా
    మీ పద్యమ్ములిటన్భళీయని సదా మించారు కైపున్నహో !

    జిలేబి

    ReplyDelete


  150. సౌజన్యానికి పూలపోగిది ప్రవాసాంధ్రుల్ భళారేయనన్
    ఆ జంపాలకుటుంబమెల్లరికి సన్నాహమ్ములన్ జేసి మా
    రాజుల్ కైపులటన్ జిలేబులయిరే! రమ్యాతి రమ్యమ్ము, చా
    లా చక్కంగను మంచి పద్ధతి, భళా లావణ్యముల్ దీర్చుచున్ !


    జిలేబి

    ReplyDelete


  151. హోరాహోరులయెన్ జిలేబులిటనోహోహో యనన్వేసిరే !
    మారామారియదేలరా మనుజుడా మత్తేభ మై సవ్వడుల్
    పారాడించగ నేలనోయిట గదా బాబూ ! సమాళించుకో !
    మీరీవైపున వత్తురా యనుట తమ్మీ స్వేచ్చ మీదే సుమా :)


    జిలేబి

    ReplyDelete


  152. రాటుల్దేలిన రాజులే విడిచిరే రాద్ధాంతముల్ జేయుచున్
    మాటల్బల్కగ వచ్చునర్ర! నగుమోమాయెన్ గదా, బాలుడ
    ర్రా! టారెత్తుచు పారిపోవునితడున్ ?రవ్వంత కాలంబునన్
    మీటన్విల్లును రాముడే,భళి భళీ మించారు రావమ్మటన్ !

    జిలేబి

    ReplyDelete


  153. అర్థమ్ముల్ సరిగానలేక పదముల్ యావత్తు భావంబుగన్
    వర్ధిల్లంగ జిలేబివేచె నచటన్ వైవీ! సజావైగనన్
    మర్దించంగను మేలురీతి పదముల్ మాన్యంబుగావేయగన్
    శార్దూల్యోత్పలకందచంప కములన్ సాయంబుగానన్ సుమా!

    జిలేబి

    ReplyDelete


  154. ముత్యాలమ్మ కొమరుడు కాటికాపరి పరిచయం :)


    ముత్యాలమ్మ కుమారుడీతడు సుమా ! ముమ్మాటి కిన్బల్కడే
    సత్యమ్మున్! గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్
    సత్యమ్మున్ విడువంగవేరొకటయా ! సాధించి రే యిర్వురన్
    జాత్యమ్మౌ శివపాడు నందు పని ! సాజాత్యంబిదేనయ్యరో :)

    జిలేబి

    ReplyDelete


  155. నిమ్మాటాయిగ దీర్చునోయి మన మేనిన్ తీరుగా గాచుచున్,
    నమ్మమ్మా మన భారతీయ ససి వైనమ్ముల్, నిదానమ్ములన్ ,
    బామ్మల్నేర్పిన యింటివైద్యము జిలేబమ్మా కషాయమ్ము ! సా
    రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్!

    జిలేబి

    నిమ్మాటాయి - గట్టిశరీరము గలవాడు
    ససి - ఆరోగ్యము

    ReplyDelete


  156. శార్దూలము

    . తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
    గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
    దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
    గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా! మను.5.17


    మనుచరిత్రలోనిది

    పోచిరాజు కామేశ్వరరావు గారు చేర్చారు శంకరాభరణం బ్లాగులో నిన్న


    జిలేబి

    ReplyDelete


  157. హోరాహోరి యదేలనో! పెనిమిటిన్ హోంబట్టుతో గట్టిగా
    యేరాలమ్ముగ కట్టివేసుకొనుమా! యే మానవుండైన బా
    లా,రాధాయని వెంబడించును ధనీ! లావణ్యమే జఘ్నియౌ,
    పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా యనిన్!

    జిలేబి

    ReplyDelete


  158. మాన్యంబెయ్యది కాదు ? రావడి, సభామర్యాద లేకుండనౌ
    జన్యంబే గద; కార్య సాధకము సౌజన్యాగ్ర గణ్యాళికిన్
    విన్యాసమ్ముగదా! సచేతనులకున్ విన్నాణ వీధిన్ భళా
    సన్యాసాశ్రమమేలయమ్మ రమణీ సాహిత్య లోకంబునన్!


    జిలేబి

    ReplyDelete


  159. శ్రీమాన్యంబగు హస్తవాసియనగన్ శ్రీవారి పాకమ్మహో
    మామాటల్వలె చిత్రమయ్యెను సుమా మావారి భోజ్యమ్మహో
    తోమాలిత్తునువారికిప్పుడిటనే తొంగిళ్ళ తో స్వాతియై!
    యామూలాగ్రముగా జిలేబి కవితా సారస్వతంబై సదా!


    జిలేబి

    ReplyDelete


  160. ఆర్భాటమ్ములవేలరామ!మనసున్ ధారాళమైవెల్గుమా
    దౌర్భాగ్యంబుల నిచ్చి ప్రోవగదరా దామోదరా సత్కృపన్
    దుర్భిక్షమ్ములనిమ్మ రామ! సయి హద్దుల్మీర కన్నే దృష
    ద్గర్భమ్మై నిను గొల్వ మేలు మదిసత్సంగమ్ములన్జేయగన్!


    జిలేబి

    ReplyDelete


  161. మాయిల్లాలికి నాణెమన్న సరదా మాదగ్గి రెన్నో గలవ్!
    మాయీభాండము పెద్దదండి నరసింహారావు గారూ; భళా
    వేయన్వేలము మాకు దస్కములనన్ వేల్వేలు గిట్టున్ సుమా!
    ఓయమ్మమ్మ!జిలేబియా!వినదగున్! ఓలమ్మి ఓలమ్మియా

    జిలేబి

    ReplyDelete


  162. ఈనాణేలు రకాని కొక్కటి యనన్ మీదగ్గరున్నాయి! మీ
    యీ నాణేల కలెక్షనూ భళిభళీ ! వీటన్నిటిన్జూడగన్
    చానాబాగుగయుండె మాచనవరా! సాగించిరే మేల్గవన్
    నానా రీతులజీవనమ్ము మజ మాన్యంబౌసమాహారమై !

    జిలేబి

    ReplyDelete


  163. మా యిల్లాలిట ముప్పదేండ్లు లలితమ్మా చేర్చె నీమూట ! పా
    యే యిళ్లన్ సయి మార్చు కాలమునబో! యెట్లో సమాళించె మ
    ళ్ళీ యీ నాణెములన్గదమ్మ!సరదా లివ్వే సుమా మంచివ
    మ్మా యీ నాటికి మేలుజేయు నివియే మావంటి వారల్గనన్!

    జిలేబి

    ReplyDelete

  164. లక్కాకుల వారి శార్దూలము

    కంటే ! భాస్కరు లెన్ని మాట లనియెన్ ! ' కందమ్మ ' నింతేసి ! మా
    ఘంటం బట్టి నిఘంటులన్ గనున ? హేమా హేమి యుద్దండులే
    వెంటం బట్టి మహా మహా బిరుదుకా భీలంబు లిప్పింతురే !
    తంటా లియ్యవి , నప్ప , వెయ్యెడల , తాతా ! మానుకో మీదటన్


    శ్రీ రాజారావు

    ReplyDelete


  165. చావన్చావడు!మంచమున్నివడుగాచారంబిదమ్మా జిలే
    బీ!వారానికి రెండు మార్లు నుసురున్ పీకున్ గదా కోడలా!
    నీవేసర్దుకొనమ్మ!యంతరమునన్నీల్గుళ్ల నాపున్నతం
    డే!వార్ధక్యము తీరిబోవు సుదతీ రేపాడియో!మాపటో!

    జిలేబి

    ReplyDelete


  166. నేతాన్యాహుడు రాగ భారతమునన్ నేతల్వుదాత్తుల్ బిజీ
    గా తేనీరును ద్రావి తేగడల బాగా గట్టిగా కౌగలిం
    చే తీరుల్ గని కాంగిరేసు విహసించేనంటగా! దేశమే
    మో దారుల్ విడిచేనటా,తెలియదే మోడీ మొగిల్వేరనీ :)

    జిలేబి

    ReplyDelete


  167. నేతాన్యాహుడు రాగ భారతమునన్ నేతల్వుదాత్తుల్ బిజీ
    గా తేనీరును ద్రావి తేగడల బాగా గట్టిగా కౌగలిం
    చే తీరుల్ గని కాంగిరేసు విహసించేరంట బో! దేశమే
    మోదీ మాయన మోసబోయెనని ట్వీట్మ్రోతల్లటన్ వేసిరే

    జిలేబి

    ReplyDelete


  168. వేసా ప్రశ్నను చార్జరెక్కడ యనన్ వేగంబుగా వచ్చె బో
    వే సారంగి జవాబు! యింటిన మరే వేరెక్కడో దాగె బో
    రా సామీ యని! తొంగొనన్ నిశినటన్ రక్షించె తెల్లారి బో
    వే సైడ్జిప్పున గాన్పడేను వినవే వేణీ జిలేబీ యిదే :)

    జిలేబి

    ReplyDelete


  169. ఆద్యంతంబుల నర్థముల్గన ప్రభూ ఆ యాయవారమ్ము నా
    రాద్యంబై జనులెల్లరిన్ తెలచుచున్ రాభస్యమున్గాంచు నీ
    సద్యోగమ్మదియే గదా మలిచెనిన్సత్ప్రేరణల్గానగన్!
    విద్యాదానము జేయు మయ్య నృప! సేవింపన్ జనాళిన్ సదా!

    జిలేబి

    ReplyDelete


  170. పర్వంబద్ది! మహాసభన్ గురువులన్ ప్రార్థించి పద్యంబులన్
    సర్వోత్కృష్టముగా తెలుంగు పలుకుల్ జవ్వాదులన్నద్దుచున్
    గర్వంబెంతయు లేక గౌరవముతో కాల్మొక్కగానీతడే
    సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుఁడై

    జిలేబి

    ReplyDelete


  171. పంహస్సున్మది జేర్చి మేలు గలుగన్ ప్రార్థించి దుష్టావళిన్
    సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్
    హంహో!మీకిది! మాన్యమై వెలుగ సంహారమ్ము గా రండయా
    బంహిష్ఠమ్ముగనేడు గావలయు కాపాడంగ లోకంబునే!



    సావేజిత
    జిలేబి

    ***

    బంహిష్ఠము - మిక్కిలి బహువు
    బహువు - అధికము; పెక్కు

    పంహస్సు - వేగము
    హంహో ఆహ్వానము

    సంహారము - సమూహము

    ఆంధ్రభారతి ఉవాచ :)

    ReplyDelete


  172. పద్యంబెవ్వడిసొత్తురా నరుడ! రాపాడించి నెట్టేవుగా
    సాధ్యంబియ్యది కాదు మీకనుచు యే సాయమ్ములన్ సేయకన్
    విద్యార్థుల్ మనకేలరొచ్చు యనుచున్ వీడంగ జేసేవుగా
    హృద్యంబై వెలుగియ్యలేక తెలుగే హృత్కాష్ఠమయ్యెన్ గదా!

    జిలేబి

    ReplyDelete


  173. నాదేహంబను జాలమున్ విడుమయా! నాదేశ పాశంబు నీ
    దై దారుఢ్యమవన్ వినాశముల నీదౌ కైపులన్ ద్రోలుచున్
    వేదమ్మే మన కోశమై ప్రజలకున్ విద్యావిధానమ్ముగా
    సాధించన్దగు శాంతి సౌఖ్యము నిలన్ శార్దూలమై నిల్చుచున్!

    జిలేబి

    ReplyDelete


  174. అల్లా క్రీస్తులు రామచంద్రు సుతులయ్యా శాస్త్రి! సేవించుమా!
    ఇల్లామల్లియదేలనమ్మ రొ జిలేబీ! ఓ వయారీ! యిలా
    అల్లాటమ్ములవేల శంకరు సభాప్రాంగమ్ము నన్ వెళ్ళవే
    పిల్లా! వెళ్ళుసుమా!యిలా పదములన్ బేర్చంగ మాకే సఖీ !

    జిలేబి

    ReplyDelete


  175. రమణ రాజు గారి బ్లాగు చిత్రకవితా ప్రపంచం నించి +



    రోజూ మనం చూచే వార్తాపత్రుకల్లోని
    రెండుమూడురోజుకకొకసారైనా కనిపించే
    సాధారణ శీర్షికలతో చామర్తి కృష్ణమూర్తిగారు
    ఒక శార్దూల పద్యం మలిచారు
    ఆ పద్యం -

    లారీఢీ, పదిమంది ఠా, పడవ బోల్తా, యాత్రావాసుల్ హరీ,
    సారాబాబుల పట్టివేత, ఒక కబ్జాదారుపై కేసు, రా
    స్తారాకో, అధికారి ఇంట ధరనా, సర్పంచి కిడ్నాపుతో
    చోరీ - అంచు పత్రికా ప్రకటనల్ శోభిల్లు ముప్పొద్దులన్
    (పద్యారామం, బేతవోలు రామబ్రహ్మం పుట. 82)



    ReplyDelete


  176. ఆ మర్కుండును భాస్కరుండు భువియున్నాకాశమే మాయగా
    బ్లూమూన్రెడ్డుల నొజ్జ చిత్రముగనన్ ఫోన్లోన ఫోటోగ బ
    ట్టే!మాలావగు మాలికై నిలిపె; కట్టేయమ్మ శార్దూలము
    న్నామూలాగ్రముగా జిలేబి వలె సన్నాయిన్ ఝమాయించుచున్!

    జిలేబి

    ReplyDelete


  177. నీ వంపుల్ విరహమ్ముపెంచె నొడలున్వేసారె కవ్వింపులొ
    ల్కే వేణీ !అధరామృతమ్ము మనసున్ కెంజాయ కెంపుల్ వలెన్
    వావాతన్పిలిచెన్ జిలేబి వలె రావంబాయె పద్మార్పితా!
    ఆవేశమ్మది నేడ్వలేక నగువై నాట్యంబు జేసెన్ గదా

    జిలేబి

    ReplyDelete


  178. తేజోమూర్తులు పెద్దవారు వలదీ తీరుల్ సుమా మాచనా
    ర్యా! జైకొట్టుడయా జిలేబికి సుతారంబై సరే యంచు మీ
    కైజారుల్ సయి యప్పుడప్పుడు భళా కైవాట మై కొట్టుడీ
    బేజారై పరుగెత్తి పోవలెనయా బెంబేలు గా బామ్మయున్

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మత్త కోకిల బాగుందని చెప్పడం తప్పా? ఇక ముందు చెప్పం లెండి :)

      Delete


  179. అల్లాటప్ప కథల్ జిలేబి పలుకుల్మాస్టారు! భారూపమీ
    యల్లా క్రీస్తులు! రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి,సేవింపుమా,
    విల్లమ్ముల్ ధరియించి జానకి కథన్ వింజోవిగన్ వీధుల
    న్నుల్లాసమ్ముగ పాడి రాముని హృదిన్నుంపార దేలించిరే

    జిలేబి

    ReplyDelete


  180. మల్లాటమ్ములవేల! నెల్ల ప్రభువుల్ మా స్వాములే దైవ మే!
    లొల్లిన్సేయనదేల!లాభము కదా లోకజ్ఞుడా ముఖ్యమౌ!
    గల్లాపెట్టిని డబ్బులాడ వలయున్ కాదే!జగత్సాక్షులీ
    యల్లా క్రీస్తులు, రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి,సేవింపుమా!

    జిలేబి
    దురదస్య దురదః శార్దూలానామ్యాః :)

    ReplyDelete


  181. ఫర్మానా వినుడోయి ! కంది వర! సౌభాగ్యంబు గాదక్కిరే
    నిర్మాణాత్మక పద్యపాటవములన్ నేర్పింప బ్లాగ్లోకమున్
    జుర్మానానిక వేతు పూరణల నన్జూడంగ! విశ్రామమున్
    ధర్మాధ్యక్షుడ కంటికైన నిడుమా ధర్నా యిదే‌ మాదయా

    జిలేబి

    ReplyDelete


  182. వర్మంబై వెలిగారు శిష్యులకు సావాసమ్ము లన్జేర్చుచున్ !
    శర్మా !శాస్త్రి ! జిలేబి! యేమనిరి ! కాస్తాతెల్పుడీ! యేలనో
    దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా? శిష్యులే
    మర్మంబై నను గాంచిరే గురువులన్ మన్నింపకన్ చెప్పుడీ !

    జిలేబి

    ReplyDelete


  183. మర్మం బెల్లను నేర్వగన్ చదువులన్ మాన్యంబుగా చేరగన్
    శర్మా!బట్టల గుంజు జేయ మనుచున్ సంసేవలన్ కోరగన్
    నిర్మా పౌడరు గుమ్మరించి‌ యుతుకన్నీ పాశ గూలా యనన్
    దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే

    జిలేబి

    ReplyDelete


  184. దుర్మార్గం బిసుమంత లేదు; గురులన్ దూషింపగా శిష్యు లే
    కర్మల్బట్టుదురో జిలేబి గనుమా!కాష్ఠంబులో గాల్చి నీ
    చర్మంబున్ పెకలించి కింకరులటన్ చాగొట్టి మాడింతురే
    ధర్మస్థానములోన ఖాయమిక నీ దాష్టీకమున్ద్రుంచగన్ !


    జిలేబి

    ReplyDelete


  185. కూర్మంబయ్యె!వరాహమయ్యె! భువిలో గుర్తింప నాచార్యుడై
    మర్మంబెల్లను నేర్పె!ముక్తి పథమున్ మార్గంబుగా జేసె తా
    నైర్మల్యుండు జిలేబి! మాటపెళుసౌ నైజంబులేలా! యెలా
    దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యు లే?


    జిలేబి

    ReplyDelete