Saturday, December 31, 2016

అదిగో భీముడొస్తున్నాడు :)


అదిగో  భీముడొస్తున్నాడు :)

వడివడి గా భీముండొ
చ్చు డిజిధన జిలేబి యాపు చూడండర్రా
కుడిచేతి బొటన వేలిక
నడయాడగ దస్కములటు పారున్నర్రా !

చీర్స్
జిలేబి

203 comments:

  1. కోరల రాకాసి జిలేబి అమ్మోయ్,
    ఇది సదివినావా? భీమ్ యాప్ తో వచ్చే ప్రమాదాలు కూడా చూడు.

    ఆన్ లైన్ షాపింగ్ చేసిన ఆరేళ్ల చిచ్చరపిడుగు!
    Fri, Dec 30, 2016, 07:18 PM
    అమెరికాలోని ఆర్కన్సాస్‌ కి చెందిన ఆష్‌ లిండ్‌ హోవెల్‌ అనే ఆరేళ్ల చిన్నారి తన తల్లికి తెలియకుండా ఆన్ లైన్ షాపింగ్ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తింది. క్రిస్మస్ సందర్భంగా తనకు ఎంతో ఇష్టమైన పోకేమాన్ బొమ్మలు కొనుక్కోవాలని ఆ చిన్నారి భావించింది. అందుకు ఆన్ లైన్ షాపింగ్ ఎంచుకుంది. దాంతో‌, అమ్మ ఎప్పుడెప్పుడు నిద్రలోకి జారుకుంటుందా? అని ఎదురు చూసింది.

    కాసేపయ్యాక ఆమె అలా నిద్రకు ఉపక్రమించిన తరువాత ఆమె ఐఫోన్ తీసుకుని, ఆమె వేలి ముద్రతో ఫోన్‌ అన్‌ లాక్‌ చేసింది. అందులో ఉన్న షాపింగ్‌ యాప్‌ అమెజాన్‌ లో తనకు కావాల్సిన 13 పోకెమాన్‌ బొమ్మలు ఆర్డర్‌ చేసింది. ఆ తర్వాత ఆర్డర్‌ ఇచ్చినట్లు, డెలివరీకి వస్తున్నట్టు నోటిఫికేషన్లు రావడం చూసిన బెథానీ తన ఫోన్ హ్యాకింగ్ కు గురైందని భావించింది. ఇంతలో ఆష్ లిండ్ అమ్మకు అసలు విషయం చెప్పేసింది. అది వినగానే ముందు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత ఇకపై కూతురుతో జాగ్రత్తగా ఉండాలని బెథానీ నిర్ణయించుకుంది. తాను ఆర్డర్ చేసిన పోకేమాన్ బొమ్మల్లో నాలుగు వెనక్కి ఇచ్చేసి, 9 తనవద్దే ఆష్ లిండ్ ఉంచుకుంది.

    ReplyDelete


  2. పోకే మానుల కోసము
    జోగగ తల్లియు కిరికిరి జోరుగ జేయన్
    వేగము గావచ్చె జిలే
    బీ, గిర గిరతిరు గుబొమ్మ భీంబాయ్ మహిమన్ !

    జిలేబి

    ReplyDelete


  3. మల్లన్న యిచ్చె సలహా
    మెల్లగ క్రొంగొత్తనోట్ల మీరిక మళ్ళీ
    చల్లగ లాగుడు మోడీ
    యెల్లరకు గలుగును మేలు యిక్కట్లున్నా :)

    జిలేబి

    ReplyDelete


  4. అనపర్తీశా ! చాగం
    టిని తలపించితివి, నీదు టిప్పణి రాతల్
    ఘనమై వెలిగెను పంచద
    శ నగర వాటికన సొబగు చందనములనన్ !

    జిలేబి

    ReplyDelete


  5. మా యమెరికాన యిట్లా
    మీ యాగీ యిండియాన మిడతం బొట్లౌ :)
    సోయగముల నయగారము
    లౌయజ్ఞము ప్రతిదినమది లౌక్యము గానన్ :)

    జిలేబి

    ReplyDelete
  6. నూతన సంవత్సర శుభాకాంక్షలు జిలేబి గారు.

    ReplyDelete
    Replies

    1. ధన్య వాదాలండీ జ్యొతిర్మయీ వారు ! మీకున్నూ
      నూతన సంవత్సర శుభాకాంక్షలు !

      చీర్స్
      జిలేబి

      Delete
  7. బహు ముఖ ప్రఙ్ఞా యుతులకు
    సహసా నూతన వసంత సంబర మొదవన్
    విహిత శుభాకాంక్ష లొలుక
    మహిత హితాభి భాషణముల మాలిక లిడుదున్ .

    ReplyDelete
    Replies

    1. లక్కా కుల వారు

      నమో నమః నెనర్లు మీకున్నూ నూతన వత్సర శుభా కాంక్షలు


      జిలేబి

      Delete


  8. భార్యాజ్ఞాబద్ధుండై
    చర్యల ‌‌‌‌‌‌గై కొనెను గాద చక్కగ పతినై !
    ‍ధైర్యంబు వలయు జోర్హా
    ట్వర్యా, పద్మావతి కెరటమ్ముల కెదురా !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "జోర్హాట్వర్యుల" (ప్రద్యుమ్నుడు) వారి ధర్మపత్ని "ప్రభావతి" గారేమో 🤔 ?పేర్లు మార్చేస్తే గొడవలైపోగలవండి 🙂. అసలే ప్రద్యుమ్నుడు గారు కష్టాల్లో ఉన్నారు 🙂.

      మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు జిలేబి గారు (belated) 🌹🌹.

      Delete


    2. @విన్న కోట వారు,

      జోర్హాట్వర్యుల కి పద్మావతే సబబు :)

      జిలేబి

      Delete
  9. అయిపోయిన పెళ్ళికి బాజాలు కాదూ!

    నూతన వత్సర శుభకామనలు
    WiSh you happy New year
    नयासाल मुबारक

    ReplyDelete
    Replies

    1. @శర్మ గారు,

      ధన్య వాదాలండీ !

      జిలేబి

      Delete
  10. మాతాశ్రీ,
    మీకు అయ్యర్ వాళ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    ఈ నూతన సంవత్సరం మీ కుటుంబానికి అన్ని విధాలా
    అనుకూలంగా, ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా,
    శుభప్రదంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
    __/\__ …

    ReplyDelete
    Replies

    1. @మల్లన్న గారు,

      ఔమల్ల ! నెనర్లు !:) మీకున్నూ శుభాకాంక్షలు !

      చీర్స్
      జిలేబి

      Delete


  11. మన వంశ వృక్ష మదియౌ
    ఘనమై వెలుగంగ గట్టిగా పట్టిని పె
    ట్టిన మేలౌను జిలేబీ
    నినుగూర్చితెలిసి కొనుటకు నిశ్చయ మార్గం !

    జిలేబి

    ReplyDelete


  12. సత్యము కాలము జేసెన
    సత్యపు రోజులు జిలేబి సాధ్యము గాదే
    గత్యంతరమును కను గొను
    పైత్యము వలదు మన కాల పరిధులు వేరౌ !

    జిలేబి

    ReplyDelete

  13. ఊరేగింపైనను తన
    యూరెరిగింపైన నేమి యూరికి విభునిన్
    పారులు తెలుపగ యత్నము,
    యారంబ మదియె గదా జయజయ యనంగన్!


    జిలేబి

    ReplyDelete


  14. బ్లాగుల్లో యేముందం
    డీ! గూబ పగుల జిలేబి డిష్యూం డిష్యూం,
    వాగుడు కాయల కాలము
    పోగాలపు రోజులోయి పోకిరి పిల్లా :)

    జిలేబి

    ReplyDelete


  15. బ్రాకెట్టాటల కబురులు
    పాకెట్స్విచ్చులన యొజ్జ పరిణితి యౌరా
    గోకిన కొలదీ బుర్రన,
    తాకీ దివ్వంగ వచ్చు తరుణి జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  16. గుజరాతున మోడీ తిరి
    గి జిలేబీలనట బేర్చు గిడ్డంగులటన్
    ప్రజలకు యర్పిత మిడునట
    బిజీ దినములిక మొదలగు బిజినెస్సులకున్

    జిలేబి

    ReplyDelete


  17. మాలతి గారక్కడ తూ
    టా లాగారిక జిలేబి టప్పున యెచటన్
    కోలాటము చెల రేగు
    న్నో లవణీ తెలుపుమమ్మ నొకపరి యిచటన్ :)

    జిలేబి

    ReplyDelete
  18. ఒకే ఇంటి నుంచి రెండు "కుంపట్లు" తెచ్చుకోవడం ఎందుకనేమో? 🙂

    ReplyDelete
    Replies

    1. విన్న కోట వారు


      కుంపట్లంటే స్టేట్మెంట్ :)

      జిలేబి

      Delete


  19. నేనే ములాయముని నే
    నే నేనే బాసునోయి నేతను నేనే !
    కానివ్వను కొమరుండై
    నా నా పదవి యతనికిక నానొల్లను బో !

    జిలేబి

    ReplyDelete


  20. గర్భము దాల్చెను పురుషుడు
    యర్భకు డటు మారగాను యమ్మణి యై తా
    నిర్భయము గా పురిటినొ
    ప్పార్భటముల తెలిపెనోయి ఫారెను సరకూ :)


    జిలేబి

    ReplyDelete


  21. జీవితమే వలసల మయ
    మూ! వివరములరయ జీవమూ వలసమయం
    బై విభుని వీడి యిలలో
    తా వెలసెను గద జిలేబి తమకం బేలన్ !

    జిలేబి

    ReplyDelete


  22. ఎట్లా యిలా లలిత గా
    రెట్లా రాసిరి జిలేబి రేణువు లూరన్
    గట్లా నదియై వరదై
    మాట్లాడిన పలుకులెల్ల మధురిమ గాంచెన్ :)

    ಜ಼ಿಲೆಬಿ

    ReplyDelete


  23. మత్తేభ మర్కట కథల
    కొత్తగ న్యాయము జిలేబి కోమలి దెలిపెన్
    చిత్తపు పోకడ తెలియక
    బిత్తరు బోయె సిరిలేని భిక్కువు గదవే !

    జిలేబి

    ReplyDelete


  24. జనవరి న పూత ! ఫిబ్రవ
    రిన పిం దెయు మార్చిరాగ రివ్వున కాయల్,
    గన వచ్చు జూను జూలై
    లన పండ్లను, మామిడి కథ లావణ్య మిదీ :)

    జిలేబి

    ReplyDelete

  25. అనునిత్యపు ముద్దుల మరు
    వను వీలగునా పుడమికి వాస్తవ మిదియే,
    మనువాడుచు ధరణి యనం
    తుని నాకాశంబుగా స్తుతించె జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  26. వాసంతంబొచ్చెగదా
    మీ సన్నిధిలో జిలేబి మీచిరునవ్వై !
    కూసింత సమయము గనుడు
    వేసవి వచ్చును గబగబ వేయింపు యనన్ :)

    జిలేబి

    ReplyDelete


  27. హేమంతంలో వాసం
    తీ! మహిమాన్విత మయంబు తియ్యగ గాంచె
    న్బో మాచనవర్యులట
    న్నోము ఫలమ్ములవియేను నోచిన వారల్ !


    జిలేబి

    ReplyDelete


  28. మా వేదికలో మీబ్లా
    గున్వీక్షణ జేసితి నలుగురు జూడగనౌ !
    రావే శిఖ దక్కెను మా
    క్కావలసిన మేటరున్ను కబ్జా జేయన్ :)


    జిలేబి

    ReplyDelete


  29. చంద్రన్న చెప్పెనుగదా
    రంధ్రము వలదే మొబైలు రయ్యన జేర్చూ
    చంద్రముఖీ లావాదే
    వ్యాంధ్రా బ్యాంకున్న స్టేటు బ్యాంకున జేయన్ :)

    జిలేబి

    ReplyDelete


  30. షోమీ ఒన్పొలిటీషన్
    హూ మే బీస్టేట్సుమేను ! హూ!యెస్! మోడీ !
    ఓ మై గాడ్నేపోటిస్ట్ !
    హే ! మై హీరో! జిలేబి, హెక్యూ , గెట్ లాస్ట్ !

    జిలేబి

    ReplyDelete


  31. పదిమందిలో పడిన పా
    ము దిమ్మ బోదు రమణీ తెములుకొను మోయీ !
    ముదితా! బ్లాగ్జ్ఞానము లౌ
    క్య దివాకరుని పలుకులవి, కాకవెలుగులై !

    జిలేబి

    ReplyDelete


  32. శ్రీరంగవల్లులద్దెను
    మా రంగి యిచట వసంత మాసంబదిగో
    తా రయ్యన సిద్ధము వ
    య్యారము గనుమిక జిలేబి యవ్వని గానన్

    జిలేబి

    ReplyDelete


  33. మీ పల్లెలేల వేగము
    గా పయనించెను జిలేబి కష్టంబైనన్
    మా పద్ధతి మార్చు విభుని
    శాపము ననుకూలముగను సాధన గూడన్

    జిలేబి

    ReplyDelete


  34. సినిమా పేర్ల సమాసము
    ల నడుమ సమరసము గన సులభమగు నోయీ
    మన తెలుగు చంద్రశేఖర,
    మన తెలుగు సినీమతల్లి మనదే కాదోయ్ !

    జిలేబి

    ReplyDelete


  35. గొంగడి మాష్టారొచ్చే
    రంగట బెత్తము చకచక రయ్యన దూసెన్
    బెంగేల నోయి సినిమా
    రంగపు దారిద్ర్య తెలుగు రాతలు కోతల్ !

    జిలేబి

    ReplyDelete


  36. పండుగ లన్నీ యొకటే
    మెండుగ జూచు సినిమాల మేట్నీ రాత్రుల్
    దండగ చేతురు బతుకులు
    నిండుగ వెలుగరు జిలేబి నిదురయు లేకన్

    జిలేబి

    ReplyDelete


  37. మేడింటి వైభవములకు
    తా డుమ్మా గొట్టి నగర దారుల బోయెన్
    వేడుకలు తీర యెంకడి
    గాడీ తప్పెను జిలేబి గౌరవమున్నూ !

    జిలేబి

    ReplyDelete


  38. హరిదాస సాంప్రదాయము
    ల రివాజుల వదుల లేక లక్ష్యము గానన్
    పరుగిడిరినెలవులకటన్
    మరువక యేటా జిలేబి మన్నిక గానన్

    జిలేబి

    ReplyDelete


  39. ఓ నెగటివు రక్తపు బా
    బూ! నీ బ్లడ్గ్రూపు మేలు పుణ్యము కొలది
    న్నూ! నీవు యూనివర్సలు
    డోనారువి! దొరుక సాటి డొక్కయు కష్టం !

    జిలేబి

    ReplyDelete


  40. మెచ్చెడు గుణంబు లకటా
    చచ్చెను గదవే జిలేబి చవటల వలనన్
    గిచ్చిరి జనుల నటునిటుల
    గుచ్చుచు గుండెల గునపము గురిజూచి మరీ !

    జిలేబి

    ReplyDelete


  41. పండుగ పండుగ కున్నూ
    పండగ జేసేసుకున్న పద్మార్పిత పై
    గండర గండ ! రసికుడా
    చెండులు మరివేయ మాకు చెంతకు రారా :)

    జిలేబి

    ReplyDelete


  42. మా వీరుళ్ళమ్మ జిలే
    బీ, వీరము శాంతముగొని బిడ్డల వోలెన్
    మా వూరిని గాపాడుచు
    తా వరమై వెలిసెనిచట తాయారమ్మై !

    జిలేబి

    ReplyDelete


  43. పో పో రా యన్వేషూ !
    శాపమ్మిదియె హరిబాబు శాంపిలు గనురా
    నీ పైరవీలకు బెదురు
    లోఫరు సెక్యూలరనెడి లోగయి గామ్రోయ్ !

    జిలేబి

    ReplyDelete


  44. కాఫీ! సువాసనే మరి
    కాఫీ! వేడిగ జిలేబి కాచిన కాఫీ !
    తోఫా యక్షరముల మేల్
    సాఫీ కందమున కూర్పు సామీరి గనన్ !

    జిలేబి

    ReplyDelete


  45. శ్రీరాముడిచ్చె నోయీ
    కారపు మిరియా ల డోసు, కన్నయ్యోరో
    మా రాజు చిరంజీవికి
    హారతి గని తమరికేల హాహా రవమౌ :)

    జిలేబి

    ReplyDelete


  46. శైలిని జూసెను పారుడు
    గోలీ వేసెను జిలేబి గొల్లున పడెనోయ్
    వాలకము జూడ శిష్యుడు
    లోలక మను యన్యగామి లోక విదురుడౌ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఏమీ అరదం కాలా ,
      మామీ శైలీయపు పరమార్థంబేదో ,
      మేమేమో ట్యూబ్లయిటుల
      మేమో ! మరి శర్మగారు మాట విడుతురా !

      Delete


  47. మా రుబ్బురోళ్ళ జూడుడు,
    యోరబ్బో సన్నికళ్ళు , యొజ్జల పలుకుల్ !
    పారుని కథలెల్ల జిలే
    బీ, రంజైనవి గదోయి బిరబిర చదివేయ్ :)

    జిలేబి

    ReplyDelete


  48. నీ వెవరో తెలుసు జిలే
    బీ! వివరముల తెలుపను సభికులకు సుమ్మీ!
    మా వూరమ్మణివి లతాం
    గీ,విదురుడు మాట తప్పి గీరడు సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. కధకు వాడదు చిగురు
      ఆది పర్వము కుదురు
      మది వలదు ఏ బెదురు
      విదురుడో మునివరుడు ...


      jk / jf
      లోల :)

      Delete


  49. మా సత్తిబాబు సలహా
    కూసింత విను హరిబాబు కోపము వలదోయ్
    దోసెలు వేయగ సుయ్యను
    రోసము నిక్కము జిలేబి రుసరుస వలదోయ్ !


    జిలేబి

    ReplyDelete


  50. గోదావరి రంగయ్యా !
    మా దొంగమ్మణి జిలేబి మాత ముసుగులన్
    చేదించుమయ్య ! వేడెను
    సాదరముగ బండిరావు సామజ గమనా !

    జిలేబి

    ReplyDelete


  51. వద్దొద్దులెద్దురూ మన
    పెద్దమ్మకథ మనకేల బేజారేలన్
    వద్దే వద్దీ రంధీ
    ముద్దుగ మన దారి మేలు ముత్యపు బండీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. హబ్బబ్బ ఏం సెప్తిరేంసెప్త్రి ...

      రెబ్బా కులు లేని శారు
      ఎబ్బే యనిపించు నోరు
      ఏబ్బా అది ఏమి తీరు
      ర(అ)బ్బా తెలియకనె మీరు ...

      :) లోల్

      Delete


  52. డోనాల్డూ నీ జాతక
    మీనాడే చూసెరోయి మేల్జ్యోతిష్కుల్
    చానా గందర గోళమ
    టా నీ పరిపా లన జర టాక్ లెస్ ట్రంపూ :)

    జిలేబి

    ReplyDelete


  53. రండ్రా యని ముద్దుగనుచు
    కొండ్రాళ్ల కవిత జిలేబి గూర్చి వినండ్రా
    బండ్రాళ్లు కరుగు యనగన్
    గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్

    జిలేబి

    ReplyDelete


  54. లోలకు నిఘంటువున య
    ర్థాలను గనెనన్యగామి రావడి గాదే,
    మా లోల బండి రాపిడి
    లో లబ్జుగ వచ్చెనోయి లోలాక్షి గనన్

    జిలేబి

    ReplyDelete


  55. నీ మున్నాలే పోనా
    నా మిన్నల్ మారి వారె నాడాళుమ్ మో
    డీ ; మానిలమే యోసీ
    యేమారాదే జిలేబి యేమారాదే :)

    జిలేబి

    ReplyDelete

  56. చాలా చౌక జిలేబీ !
    డాలరుకిక రెండు మా గుడారములకు రం
    డూ! లడ్డుగ గొనుడీ నా
    డే ! లబ్ధి గన జనులార డెంకణమిడితిన్ :)

    జిలేబి

    ReplyDelete


  57. అందరమీ రచ్చన యా
    నందము బొందుచు గునగున నలుగురి పైనన్
    డెందం బరయగ చెణుకుల
    విందుగ జేయు నడయాడు విదురులముగదా :)

    జిలేబి

    ReplyDelete


  58. సంపాదించక తప్పదు
    నింపాదిగ జీవితమున నిశ్చలము గనన్
    కొంపల గూల్చ నవసరము
    చంపా దానికి వలదు, సుచరిత వలయునౌ !


    జిలేబి

    ReplyDelete


  59. చిన్నమ్మ వెనుక పడరా
    దన్నా! తా వెనుక యుండి తరుణము గనుచున్
    మన్నికగా మన వెంబడి
    యున్న సుఖముగద ! విదురుని యుక్తి సెభాషూ !

    జిలేబి

    ReplyDelete

  60. పరిశోధకుండ టా !త
    న్నెరిగిన వారెవరు జీవనే నరసింహా !
    మరిమరి జూడ జిలేబీ
    సరసాంగీ, వలదు సుమ్మి సఖునికి తెలియున్ :)

    జిలేబి

    ReplyDelete


  61. జల్లిక్కట్టును నలిపిన
    యుల్లము జల్లనుచు పొంగు యుర్విజనులకున్ !
    గిల్లీ దండా నిలిపిన
    యెల్లరు నేర్తురు క్రికెట్టు యెగబడి మీదన్ :)


    జిలేబి

    ReplyDelete


  62. సరసాంగి మనసు తెలియని
    పురుషుని నిందించు, సతినిఁ బూజింతురిలన్
    విరసము సరసము సమపా
    ళ్ళ రంగ రించగ జిలేబి లావణ్యవతీ !

    జిలేబి

    ReplyDelete


  63. సమరస స్వర్గయానం :)

    పతివెనుక సతి మురిపెమది
    సతతము సన్మతి శుభాంగి సమరసముగనన్
    వెతుకగ దొరకున యిటువం
    టి తరుణి యిలలోన పెనిమిటికి మాచన్నా !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete

  64. పదముల నటునిటు మార్చుచు
    కుదురుగ బేర్చె లలితమ్మ కుంకుమ భరిణీ !
    పదిలము జేసిన కామిం
    టదియే చదువన జిలేబి టక టక వచ్చెన్ :)

    జిలేబి

    ReplyDelete

  65. తలయో మొలయో మధురా
    నిలయే కన్నడి జిలేబి నిప్పులు రేపెన్
    కలయో వైష్ణవ మాయో
    యిల పలుకులటులిటులైన యిక్కట్టు మరీ !

    జిలేబి

    ReplyDelete


  66. ఎందుక లాయంటే యే
    మందును మహిలో జిలేబి మనుగడ గానన్
    కొందరికి కొన్ని వేళలు
    యందము చిందు మరికొన్ని యాంత్రిక మగునౌ !

    జిలేబి

    ReplyDelete


  67. మది గదిలో పద్మార్పిత
    పదిలంబాయె, ప్రియసఖుని పరువపు మోహం
    బది తేటగీతి గానన్,
    కుదేలు మనె గాద మేని కోమలమగుచున్ :)

    జిలేబి

    ReplyDelete

  68. ట్రంపాశీర్వచనములన్
    నింపాదిగ బడయవలయు నీవు జిలేబీ !
    సంపాదన గడు ముఖ్యము
    కొంపను నిలబెట్టుటకు చకోరీ వినవే :)

    జిలేబి

    ReplyDelete


  69. కొత్వాలొకండు మత్తున
    ఫత్వా లిచ్చె వగలాడి పక్కకు రావే
    హా!త్వరగా రావే! యాం
    ధ్రత్వము ముత్యాలొలుకగ తరుణీ రావే :)

    జిలేబి

    ReplyDelete

  70. రెండున్నర డాలర్లకు
    నిండుగ కర్మ ఫలమొందు నిక్కము ఫార్వార్డ్
    భాండా గారము నింపుచు
    దండిగ పుణ్యముల దేలు తరుణి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete

  71. శర్మ పలుకుల వివరముల
    మర్మంబుల నరయ శక్తిమంతులు గామే !
    హార్మో నియమును జేర్చితి
    మార్మోగగ యన్యగామి మరిమరి రాజా :)

    జిలేబి

    ReplyDelete


  72. తానాడేనాట్యమయూ
    రీ నాల్గేరోజులోయి రివ్వున బోవున్
    మీనముల బేర్చి ముచ్చట
    గానౌ మ్రుగ్గున జిలేబి గావించెనుబో !

    జిలేబి

    ReplyDelete


  73. చిల్లర దేవుళ్ళ పలుకు
    మెల్లగ గనవే జిలేబి మెంగెపు మాటల్ !
    పుల్లాయి సాములోరుల
    కెల్లా దేశము సలాము కేల్మోడ్చెన్బో !

    జిలేబి

    ReplyDelete


  74. సర్వసహజముగదా యీ
    యుర్విన్ జనులకు జిలేబి యుక్తాయుక్తం
    బర్వణి పూర్ణిమ వోలెన్
    చేర్వకు వచ్చి సమపాళ్ళ చెక్కిలి తడుమున్ !

    జిలేబి

    ReplyDelete

  75. మరువం దవనంబులు మే
    మరువంబమ్మా జిలేబి మరువం మరువం !
    మురిపెముగా బెంచితి మీ
    సరసన నిలదొక్కగాను సాధ్యము గాలే !

    జిలేబి

    ReplyDelete


  76. వలపుని వీడుము వాస్తవ
    ము లోనికి గునగున రావె ముద్దుల పద్మా !
    కలవర మేలా బేలా
    సలసల కాగుచు గడుపుట సబబే కాదే :)

    జిలేబి

    ReplyDelete


  77. బ్రాడిండికేషను జిలే
    బీ డమడమలాడుచు శని‌ బీటలు దీయున్ !
    వాడెదరు మల్లియలవలె
    గాడెద్దులవోలె భద్ర కాళీ లగుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  78. ముక్కూ ముఖమెరుగడు హరి
    టక్కుటమారముల గాంచి టకటక రిప్లై
    నొక్కుచు హైరానా పడి
    యొక్కండై పోరు సల్పు యోధుడు సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  79. నీకవితలు జీవిత స
    త్యాకర్షణలై నిలచెను తరుణి జిలేబీ !
    పాకమ్మున పడి ముదిరెను
    పాగల్పన్ను వినవమ్మ బతుకున మేలౌ‌ :)

    జిలేబి

    ReplyDelete


  80. యెందెందైన యిమడగల
    దందురు మాయయ్యరు ననుదహరించి మరీ !
    సంధులలో విందులలో
    కందము లో కంది వారి కవితా సభలో :)

    జిలేబి

    ReplyDelete
  81. కంద గదాదండ ప్రహర
    సుందర పద్యా విహార శూరా ! విహితా !
    వందారు జిలేబి మహిత !
    మంద మతిని సన్నుత బుధ ! మరచితి బొగడన్ .

    ReplyDelete


  82. మనుషులలో యహము పెరిగె
    మన మంచి పలుకుల వినెద మను సంస్కారం
    బనునది జిలేబి యసలే
    గనలేమే ! మన సమాజ గతి యేమగునో !


    జిలేబి

    ReplyDelete


  83. ఎవరూ చూడని సమయము
    గవాక్ద మేమిగనెనోయి గమనించగన
    న్నెవరూ చూడని దర్పణ
    మెవరిని చూపించెనోయి మేధా దేవీ !

    జిలేబి

    ReplyDelete


  84. శతమానంభవతిని వెతి
    కి తరించిరి విన్నకోట ! కిరికిరి గూగుల్
    జతగను సెర్చింజను మా
    య తెలియ గలవారమే సయాట జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  85. ఏమో నే గననప్పుడు
    యేమిటి తా జూసెను మరి యెవరికెరుక త
    ల్లీ! మిరు మిట్లుగొలుప రా
    సా మేటరు వెంటనే యొసంగ జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete



  86. చాగంటి పలుకులను మే
    లౌ గానక కుల మతమ్ములను దెచ్చి జిలే
    బీ గౌరవ మిసుమంతయు
    లేక రుసరుస బుసబుసలు లేపిరి గాదే !

    జిలేబి

    ReplyDelete


  87. మనుజుం డెట్లు బతుకవలె
    ఘనమగు రీతిన్ జిలేబి గట్టిగ తెలుపం
    గ నరయగల మోయి రమణి
    తను విచ్చుచు సరి సహాయ తరము గనవలెన్ !

    జిలేబి

    ReplyDelete


  88. కాలమహిమ యిది యాకలి
    కాలపు కాలమహిమై యకాలముగా పో
    గాలంబుగాను వేళయు
    చాలని కాలమిది సంధి సమయంబిదియౌ !

    జిలేబి

    ReplyDelete


  89. మనుజులలో మార్పసలే
    గనలేముగద పిసరంత గాను జిలేబీ
    జనుల మనంబున కలవర
    మనునది పరిపరి విధములు మహిలో సుమతీ

    జిలేబి

    ReplyDelete


  90. నడిరేయి వేళ గబగబ
    దడదడ లాడుచు సమస్య 'దంగల్ ' యనగన్
    గడగడ గణముల పదముల
    సుడిగుం డమువో లె వేయుచుంటిమి సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  91. చెప్పవలయుచల్లగ కబు
    రప్ప, జిలేబీ ! సమయము రాగన తెలియున్,
    గొప్పగ యున్నటి కబురై
    నప్పటికి తరాజులోన నమ్మబలుకులౌ ?

    జిలేబి

    ReplyDelete


  92. అదిగో కామింట్వీరుడు
    చదరంగపు టాటలోన చక్కగ నిమిడెన్
    కదనోత్సాహంబాయెన్
    సదనంబున యన్యగామి సయ్యాటగనన్ :)

    జిలేబి

    ReplyDelete


  93. జవ్వని జాకెట్మీద
    న్నవ్వ! జిలేబి కవి కండ్లు నాట్యము జేసెన్
    హవ్వా ! డిసెంబరు నెలన్
    పువ్వుల కెంత మహిమ గద పుత్తడి బొమ్మా :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రంగు రంగు పూల రైకతో వాసంతి
      భాస్కరన్న తోట పై నిలిచెన
      యన్న తీరు దోచె యా డిసెంబరు పూలు
      ఆకు పచ్చ పైన నద్భుతముగ .

      Delete


  94. అభినందనలండీ సౌ
    రభ వాసంతి మధురిమలు రైకలు కోకల్
    శుభకరమై తావియలూ
    ర భవ్య కవితా లతాంగి రాజుని దోచెన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రస సారస్యము లద్దిరి
      రసమయ కవితా లతికకు రాజసమొప్పెన్
      అసమ శరుని మాస దెసల
      పస దెలిసిన వారు మంచి భావకులండీ .

      Delete


  95. శాపం బాయె జిలేబీ
    పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్
    లోపాయికారి గానౌ,
    కౌపీనంబులకు గూడ కాలొచ్చెను బో !

    జిలేబి

    ReplyDelete


  96. పువ్వుల పేరులు తెలియవు
    జవ్వని కడియంపు యంద చందములు సుమీ
    తవ్వగ పాత టపాలను
    కవ్వించుచు గనపడెనవి కస్టే ఫలమౌ :)

    జిలేబి

    ReplyDelete


  97. లక్ష్మత్తా ! మంచి పలుకు
    సూక్ష్మంబై వెలిగి మదిని సుచరితము గన
    న్నాక్ష్మాధరంబు వోలెన్
    సూక్ష్మాత్ముని మక్కళించు శుభకరముగనన్

    జిలేబి

    ReplyDelete


  98. నే చెప్పలే! జిలేబికి
    మాచెడ్డగ మతి చెడింది మాటలు గోల్గోల్
    గాచారం బా వోలే
    తాచెడిన మరకటమొకటి ధరణికి సలహా :)

    జిలేబి

    ReplyDelete


  99. ఉరికిన గంగయనంగ
    న్నురుకుల పరుగుల జిలేబి‌ నురుకుచు వచ్చె
    న్నరెరె ! గయా! నా ఫాల్సూ !
    బరబర గూర్చెనిట కంద పద్యంబును బో :)

    జిలేబి

    ReplyDelete


  100. పచ్చని మేని సొబగు నులి
    వెచ్చగ గుచ్చు కవనంబు వెనువెంటగనన్
    "నెట్ చెలి" పద్మార్పిత సరి
    తచ్చట లాడిరి జనులిట తరుణి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  101. మేము రచయిత్రులము సు
    మ్మీ ! మా మీటింగులోన మిన్నగ యీటిం
    గూ మన్నికగా చాటిం
    గూ మా ట్రేడ్మార్కులమ్మ గుండు జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete

  102. మరుగేలరా మనసులో
    న రుసరుస బుసబుస లేల నాదరి రారా
    మరిమరి కోరె జిలేబీ
    ము రిపెము తోరమ్ము ముద్దు మురిపెము లిమ్మూ :)

    జిలేబి

    ReplyDelete


  103. అండ పిండ బ్రహ్మాండము నందు విశ్వ
    భండనమ్మునఁ బాఱెను భార్గవుండు,
    చంద్రుడు జిలేబి, తారలు సర్వ జీవ
    కోటి సంద్రములు నదులు కొండలున్ను !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నెనరులు పదమును వెదకుచు
      పనిగట్టు కొనుచును నేను పచ్చడి యవగా
      ధనియాల ఘాటు చారుతొ
      కొనియాడగ లేని కంద కూరల గంటిన్!

      Delete

    2. శ్రీ జీ పీ ఎస్ గారు !

      నెనర్లు అన్న దాని మీద పాత టపా వెతికి మళ్ళీ ఇవ్వాళ ఇచ్చాను మీకోసం :)

      చీర్స్
      జిలేబి

      Delete


  104. శ్రీగంగ యెక్కడైనను
    తా గల గలయను నదీమ తల్లి జిలేబీ !
    బాగా జవాబు చెప్పిరి
    గా గురు వర్యా గవనము గా జూచితిమీ :)

    జిలేబి

    ReplyDelete


  105. క్రమశిక్షణలో సుఖమ
    న్న, మా పలుకులను వినుమనె నంటిని, నా తో
    టి మడిసి తాగుడు మానక
    సమసెను జీవన గమనపు సాయము గనకన్

    జిలేబి

    ReplyDelete


  106. నెనరుల నెడి పద సంపద
    మనయచ్చ తెలుగు జిలేబి మధురిమ లూరన్
    గనవచ్చు జాల మందున
    ఘనంబు గా తగువులాడి గాల్చిన పలుకౌ :)

    జిలేబి

    ReplyDelete


  107. మీరు క నబడ నవసరము
    పోరీ పద్మార్పితా కపోలమునకు లే
    దౌ ! రివ్వున సాగు కవిత
    లే రాజకుమా రి మీ క లేజా తెలుపున్ :)

    జిలేబి

    ReplyDelete


  108. నీ మోము చూడ తపియిం
    చామోయీ పద కవిత్వ చారుమతి, కుమా
    రీ, మరకత పద్మార్పిత !
    మామాట విను దరిసనము మాకిమ్మ జరూర్ :)

    జిలేబి

    ReplyDelete


  109. దాగిరి ఫేస్బుక్కులలో
    మూగిరి గుంపుగ జిలేబి మూకుమ్మడిగన్ !
    హా! గిరి కీ కొడుచు లతాం
    గీ గోడలపై న మాట గిరిగీసుకునెన్ :)

    జిలేబి

    ReplyDelete


  110. అందాలతో కవిత కా
    ద్యంతంయభ్యంగనాల దరువుల గని క
    వ్వింతల పద్మార్పితవై
    విందుల జేర్చితి వి గాద వింజామరవై !

    జిలేబి

    ReplyDelete


  111. అందాలతో కవిత కా
    ద్యంతంయభ్యంగనాల దరువుల గని క
    వ్వింతల పద్మార్పిత! హా !
    విందుల జేర్చితిమి మేము వింజామరలై :)

    జిలేబి

    ReplyDelete


  112. పోరీ పద్మార్పితవై
    మా రిమ్మ తెగులు విదిల్చి మాయాం బైనా
    వా! రాజకుమారీ ! రా
    వే రావే మసక వీడి వేగిర రావే !

    జిలేబి

    ReplyDelete


  113. రావే రావే రమణీ
    రావే, రావే జిలేబి రావే రావే !
    పోవే పోవే తరుణీ
    పోవే, పోవే లతాంగి పోవే పోవే :)

    జిలేబి

    ReplyDelete


  114. అదిగో యన్వేషుండు ద
    బదబయని కమింట్ల హోరు బదలా యించెన్
    సదనము మారిన నేమీ
    చెదలుగనిన బుద్ధి కోరు చెరుపుదలగదా !


    జిలేబి

    ReplyDelete


  115. పానీయంబుల్ద్రావుచు
    వాణిన్మధురిమలు దేల వరసగ లెక్క
    ల్గానట్టి పదములన్నా
    ర్యా నర్తింప యొనరిచితి యత్నంబంతే :)

    జిలేబి

    ReplyDelete

  116. రామాయణ భారతముల
    నోమారైన వినుమోయి నొప్పారు విధం
    బై మానసికప రిణితి న
    సామాన్యంబుగ జిలేబి సాధించెదవూ !

    జిలేబి

    ReplyDelete


  117. అరమోడ్పు కళ్ళ పద్మ య
    ధరంబు లెంత మధురమ్ము ధరణిన్, రాదే
    మరల నిటువంటి తరుణియు
    దొరకదు సరి పువ్వుబోడి దొరసాని సుమీ :)


    జిలేబి

    ReplyDelete


  118. శతమానం భవతి జిలే
    బి, తరమగుపలుకు ల బేర్చి విశ్వంబందున్,
    సతతము వెలుగొందును లె
    స్స తరము గాను మహిలోన సంతసము గనన్

    జిలేబి

    ReplyDelete


  119. వీవెనుడా! ట్రిక్కులదుర
    హో ! వర మైవచ్చెనౌ సహోదరి గానన్
    రోవర్వోలె టపాలిక
    రావలె తూలిక సొబగుల రాణి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  120. నెనరుంచరా తిరుపతి గు
    రు నను విడువక పెరుమాళు రూపంబై దే
    వ! నిను విడువను విడువనౌ
    యనపర్తీశా జిలేబి యమహో యమహా :)

    జిలేబి

    ReplyDelete


  121. వాకింగు గూగులు లలిత !
    మాకందరికీ తెలియన మరలా బిందా
    సౌ కొసరు నామములు గల
    నీకథ మాకు వినిపించు నీరజ నేత్రీ :)

    జిలేబి

    ReplyDelete


  122. ఏమాయెనో జిలేబీ
    మా మాచన యొజ్జ యడవి మర్మ కథలన
    న్నోమారుతలచె నోయీ !
    రామా ! యేనుగు తయారు రథమెక్కగ ,రా :)

    ReplyDelete


  123. వామ్మో ! బ్యాక్సిక్స్పేకర్స్ !
    జామ్మని యగుపించితీవు జాకెట్లేకన్ !
    యమ్ముల పొదవయ్యారీ
    బొమ్మా నీవెవత వే సపోటా వోలెన్ :)

    జిలేబి

    ReplyDelete


  124. వాట్సాపు జిలేబిని గని
    హాట్సాఫనిరి మొదట మది హాసం బడయన్ ,
    చాట్సుల తో తల తిరుగగ
    బూట్సుల తలగొట్టు కొనిరి బుద్ధిగ మారీ :)

    జిలేబి

    ReplyDelete


  125. రాగంబు మార్చ మనినన్
    బాగుందా చెప్పు, యెవరి బాదుళ్లు జిలే
    బీ గుట్టుగ వారివి బొ
    మ్మా గుమ్మా ముద్దుగుమ్మ మార్చను బోవే :)

    జిలేబి

    ReplyDelete


  126. ఆర్యా మీ బ్లాగునిట
    న్మా ర్యాకున జేర్చి పంగ నామము తోడ
    న్మా ర్యాంకు నిచ్చెదము యం
    గార్యపు కుప్పన జిలేబి గావన్ మేలై :)

    జిలేబి

    ReplyDelete


  127. సంతసము మాకు మీ బ్లా
    గ్చెంతయు జేరె నిక మెయిలు గేట్వే జైల్బ్రే
    క్కొంతయు జేయన్ వీలౌ
    చింత గొనుడు రమణులార చిక్కెను పిలకా :)

    జలేబి

    ReplyDelete


  128. కనబడ వలెననుకొన ప
    క్కన కనబడెదను జిలేబి గా మీ యెదుట
    న్నని చెప్ప రాద ,:పద్మా
    మిణుగురు వలె సంతసమున మిడిసెద మమ్మో :)

    జిలేబి

    ReplyDelete


  129. అబ్బాయే యబ్బురముగ
    పబ్బపు బడ్జెటు యనంగ బావమరదల
    బ్బబ్బా కాంగ్రేసోళ్లటు
    దొబ్బిరి గాదే జిలేబి దోపిడి యనుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  130. నీహారిక ! నిను జూడన్
    బాహాటముగ తపియించె భాయి యొకడటన్
    నీహాల్మార్కామింట్లకు
    జోహారులిడెనట వచ్చి జూడుము రమణీ :)

    జిలేబి

    ReplyDelete


  131. మరుజన్మ తల్లి కి నమ
    స్సు! రూఢిగ జననము నాది సుందర గోదా
    వరి తీరమున జిలేబీ !
    పరిపక్వపు పలుకులివ్వి పారుని పలుకుల్ !

    జిలేబి

    ReplyDelete


  132. బాహుబలి-౨ యనుష్క నడుము!
    జోహారులివే జిలేబి జోరై నిలచె
    న్నోహో యనంగ పోస్టరు
    లో హాలికుడౌ ప్రభాసు లోయర్ధంబై :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీ ఈ పద్యం కూడా ఆ సినిమా లాగానే అర్ధం కాలే 😕. ఈ పద్యం ఇప్పుడు వ్రాయడానికి ట్రిగ్గర్ ఏమిటో?

      Delete


  133. రేమండ్ షెపర్డు రేఖల
    నామూలాగ్ర పరిశోధనల జేసిరి వే
    ణూ ! మీ పరిచయ మిచట న
    సామాన్యము మీదు ప్రతిభ సామర్థ్యంబౌ !

    జిలేబి

    ReplyDelete


  134. తెలియ పరిష్కారంబును
    సలుపుము కార్యము జిలేబి చకచక యనగన్
    తెలియక బోవ పరిష్కృతి
    యలవోకగ మరిచి బోయి యత్నము విడుమా :)

    జిలే‌బి

    ReplyDelete


  135. కండీషన్సిడ కోయిల
    నిండు మనసుతో జిలేబి నిమ్మళముగనౌ
    గుండెల నిండుగ పాటను
    మెండై నటువంటి బాణి మేలౌ గనునో ?

    జిలేబి

    ReplyDelete


  136. సరిపోవు యందము గనన్
    సరసపు సామ్రాజ్య రాణి సయ్యాట గనన్
    బిరుసుల గన నయనంబులు
    సరిపోవు సుమా ద్వయంబు చక్కని చుక్కా :)

    జిలేబి

    ReplyDelete


  137. వీలుగ నామము బెట్టెడి
    కాలము నౌ యొజ్జ వీలు నామా రాసెన్
    జాలపు బిట్సండ్బైట్సుల్
    బాలా వేచెను ఖుషీగ పంపకమునకై :)

    జిలేబి

    ReplyDelete


  138. అమెరికను కార్పొరేట్లటు
    తెమిలిరి ట్రంపుకు నిరసన తెలుపుచు మేలౌ
    తమ వంతుగ శరణార్థుల
    కు మద్ధతు నిడుచు కుదేలు గూగులు గూడన్ !


    జిలేబి

    ReplyDelete

  139. దేవుడు కంటున్న కలయి
    దే విశ్వంబై వెలిసెను తేజో మయమై !
    నీవూ నేనూ మనమం
    తా విష్ణుని గరిక పాటి తకిట జిలేబీ !

    స్పూర్తి
    నేటి నవజీవన వేదం
    జిలేబి

    ReplyDelete


  140. ఓ బోడిగుండు తాతా !
    నీ బొమ్మను నోట్ల పై గనిన కారణమై
    మా భారతదేశ కరె
    న్సీ బరువే తగ్గెనంట! నిజమా ధాతా !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రెండాకులెక్కువ తె(బ)లిసిన హరియాణా అ నిల్ వీజీ
      రెండొందల శాతమెక్కువగ నమ్మబలికె, 'వలదిక గజిబిజి
      గుండు తాతే రూకల గుండు నిండుగ గీసెన'టంచు విప్పి పజిల్
      రండహో నమ్ముడు, ఇక మోది నేత గుండేయడు తుండు సుమీ?
      :)

      Delete


  141. తెలియ పరిష్కారంబును
    సలుపుము కార్యము జిలేబి చకచక యనగన్
    తెలియక బోవ పరిష్కృతి
    యలవోకగ మరిచి విడువు యత్నము విడుమా :)

    జిలేబి

    ReplyDelete


  142. పదముల తూకము చక్కగ
    కుదిర్చి కొత్తావకాయ కుంకుమ నిడెనౌ !
    చదువన నుత్సాహంబగు
    సదనంబదియే జిలేబి సమతుల్యంబౌ !

    జిలేబి

    ReplyDelete


  143. నిన్నను మొన్నన విడచుచు
    మిన్నగ ముందుకు జిలేబి మేటిగ చనవే
    పెన్నిధి యై జీవనమున
    యున్నతిని గనెదవు బండి యురవడి వోలెన్ :)

    జిలేబి

    ReplyDelete


  144. పదిరోజులుగా కనబడ
    మదిలో నిర్లిప్తతత సమస్యగ యుండెన్
    కుదిరెను కాలే నటునిటు
    చదువుచు కామింట్లిడ చక చక సింహంబై :)

    జిలేబి

    ReplyDelete


  145. భారత దేశీయులకు
    న్నో రాజు నిరంకుశుండు నోమా రైనన్
    తా రా వలె ధర్మాత్ముం
    డై రట్టడి జేయ యముడై రావలెనౌ !

    జిలేబి

    ReplyDelete

  146. కాటమ రాయుండై యిక
    పాటల రాయుడు జిలేబి పవనుడు బిందా
    సాటల గాన్పడు పంచెన
    మేటిగ తమ్ముళ్ళకట సుమేరువు వోలెన్

    జిలేబి

    ReplyDelete


  147. అన్నియు యర్థం బైన మ
    హోన్నత పదసంపదల నహో గన వీలౌ ?
    యెన్నగ మిన్న కవివరా
    యున్నత మగు పోచిరాజు యుక్తుల నేర్వన్ !

    జిలేబి

    ReplyDelete


  148. ఓరీ ట్రంపూ వేసేయ్ !
    పోరలు మాట వినకున్న పోటుగ వేసేయ్ !
    హోరా హోరీ నన్ సం
    హారము లేకున్న నగు మహాప్రళయమ్మే !

    ReplyDelete


  149. తెలిసున్న పదమ్ములను స
    రళముగ రాయన జిలేబి రచనా కౌశ
    ల్య లయగతుల నేర్వ నవ న
    వలాడు పక్వత గనగల వారెవ్వరహో !

    జిలేబి

    ReplyDelete


  150. పండెను పద్మార్పిత యౌ
    గుండెల జీల్చెడి కవితల గుచ్చుచు, జనులౌ
    మెండగు చిత్రము లకు పూ
    దండ గుభాళింపులద్ద దాసోహమనెన్ !

    జిలేబి

    ReplyDelete


  151. కోయిల పలుకుల కుహుకుహు
    వై యిట పద్మార్పితమ్మ వై వెలిగితివీ
    వే ! యమ్మో మా బ్లాగుల
    లో యందంబగు కవితలలో వెలిగితివీ !

    జిలేబి

    ReplyDelete


  152. ఏ గూటి పలుకు లక్కడ
    నే కూవవలెను శుభాంగి నేర్పన యదియే !
    నీ కవితలెల్లె డల య
    మ్మో కవ్వింతలు గద నగుమోము జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  153. తమదైన ప్రపంచములో
    కుముదిని మహరాజపోషకులు శంకరు కొ
    ల్వు ముదురు కవివరులే బ్లా
    గు మల్లియలగుచు కమింట్ల ఘుమఘుమ లిడిరీ !

    జిలేబి

    ReplyDelete


  154. ఆనాటి భాగ్యములు సమ
    సేనోయీ బ్లాగు లోక సేనానులు గూ
    డా నేడైరి జిలేబీ
    నానాటికి తీసికట్టు నాగం భొట్లూ :)

    జిలేబి

    ReplyDelete


  155. సుపరిచిత పదములను మా
    ర్చు పద్మ! డిఫరెంట్ గ రాయి సుమనోహరి, ప
    ద్మ పలుకు లీయవలె మదను
    ని పరా కాష్టను జిలేబి నిర్భయముగనన్ :)


    జిలేబి

    ReplyDelete


  156. గురువుల లో మొదటి గురువు
    పరమేశ్వరుడవు విభుడవు బతుకున మదమున్
    పరిగొన వచ్చిన వాడవు
    హరహర దేవర ! వరమ్ము హరియించగనన్ !

    జిలేబి

    ReplyDelete


  157. మంచి ముహూర్తము రాలే
    దంచు యనుచితమగు వారి దాష్టీ కంబౌ
    కించితు బుద్ధియు లేనటి
    కంచెను దాటిన కమింట్ల గాన విడిచిరో ?

    జిలేబి

    ReplyDelete


  158. నను కాలిబంతి వలె యా
    టన నటు నిటు లాగి తన్నె టక్కరి పార్టీల్,
    జనులార, యెన్డియే భా
    జ్ప! నమ్మి తిని మోసబోతి జర జాగ్రత్తౌ :)

    జిలేబి

    ReplyDelete


  159. ట్యాబున వాట్సపు‌ బెట్టితి
    బాబోయ్ బతుకే బజారు పాలాయెన్ బో !



    జిలేబి

    ReplyDelete


  160. అవునం‌డి ! తెల్ల గడ్డం
    గవనమునకు లేఖ పంపి గట్టిగ చెబితిన్
    క్షవరంబు మరియొక పరి గొ
    నవలె! జిలేబయ్యె యైడి నాది నలుదెసల్ :)

    జిలేబి

    ReplyDelete


  161. ట్యాబున వాట్సపు‌ బెట్టితి
    బాబోయ్ బతుకే బజారు పాలాయెన్ బో !
    గాభర బోయెన్, వాట్సా
    పే బోవన్ ట్యాబులోన, పీడా బోయే :)

    జిలేబి

    ReplyDelete


  162. నారద భక్తి జిలేబికి
    భారీ గద బండి వర్య ! భళ! యెప్పటి మా
    టో రయ్యన బట్టెను గు
    ట్టే రట్టాయెను గదన్న టింగనుచు మరీ :)

    జిలేబి

    ReplyDelete


  163. చాగంటి ప్రవచనములన్
    బాగుగ వినవలె జిలేబి భవితకు మేలౌ !
    ఆ గురు వర్యుల పలుకుల
    సాగర మధనమ్ము జేసి సత్యంబరయన్ !

    జిలేబి

    ReplyDelete


  164. మౌనము వీడి సనాతన
    యానములను పరిహసించి యపహాస్యములన్
    తానము లాడెడి వారల
    మానము గొన నడుము గట్టి మార్పును దెండూ !

    జిలేబి

    ReplyDelete


  165. అమ్మణి యప్పచ్చుల్లౌ
    జామ్మని బట్టెను జిలేబి చక్కని ఫోటో !
    మామ్మకు విశాల విశ్వము
    కమ్మని కష్టము కబుర్ల కష్టే ఫలియౌ :)

    జిలేబి

    ReplyDelete


  166. కలలో నివసించెడి మన
    కలవారలకున్ గరళము గావలెను సుమీ,
    భళిరా వచ్చెను తంటా
    జలక్కు రొక్కముల మార్పు జలగండమ్మై !

    జిలేబి

    ReplyDelete


  167. రెండు వేలును నిన్నూట రెండు యోజ
    నంబు లర్ధ నిమేష మాత్రంబు నందు
    నంబరంబున బారు తీవ్రాంశు రథము
    నిలిచె బహుకాల మిట్టిదే నియతి మహిమ !

    కాశీ ఖండం

    ReplyDelete


  168. విన్నను కోటను యమ్మో
    యెన్నటి కీ కలిపి యుంచ యేను జిలేబీ
    నిన్ను తరితీపు గానన్
    మొన్నో సుదినమ్ము గోరి మొరలిడితిగదా :)


    జిలేబి

    ReplyDelete


  169. వానా వానా వల్ల
    ప్పా! నడి మధ్యన జిలేబి పారప్పా ! నీ
    వే నీవే గుండమ్మా !
    నేనే రాణి సరి నువ్వు నేత్రివి గదవే :)

    జిలేబి

    ReplyDelete


  170. డెందమును వాక్కు నెవ్వాని నంద లేవు
    కాంతు రెవ్వాని హృదయ పుష్కరము లందు
    పరమ యోగీంద్రు లధిక తాత్పర్య లీల
    నట్టి నీకు నమస్కార మఖిల వంద్య !

    కాశీ ఖండం

    ReplyDelete


  171. కాంతుడు సంతోషించిన
    సంతోషింపంగ వలయు సతి కత డాత్మన్
    సంతాపించిన పట్టున
    సంతాపింపంగ వలయు జలజేక్షణకున్ !


    కాశీ ఖండం

    -------

    అయ్యరు సంతసము గనన్
    సయ్యా టలనతని జేరు సతి కత డాత్మన్
    యయ్యో యని యత డేడ్వన్
    కుయ్యో యని జత గొనవలె గోమతి నీవున్ !

    జిలేబి

    ReplyDelete


  172. భక్తేనా? నారద యను
    రక్తే నా! యీ జిలేబి రావడి తన యా
    శక్తే నా! యే మో తా
    భోక్తే నా ! యెవరికోయి పూర్తిగ తెలుసూ :)

    బిలేజి

    ReplyDelete

  173. మా తాత యింజనీరౌ !
    యైతే నువ్వూ జిలేబి హైటెక్కే, రే
    పే తేవే రెస్యూమే
    బాతాఖానీ కబుర్ల ప్లాట్ఫారమహో !


    జిలేబి

    ReplyDelete

  174. బ్లాగర్లందరికిన్నూ
    బాగౌ నీరసము గదవె ! ప్లాట్ఫారమ్లన్
    పైగా సర్వర్లన్ మే
    లై గావింపను జిలేబి లాభము గలదే ? :)

    జిలేబి

    ReplyDelete


  175. మూర్ఖత్వంబును గనుమోయ్
    చెర్ఖా వోలెన్ జిలేబి చిట్టాడునహో !
    బుర్ఖా వీడి వెదుకగ
    న్యీర్ఖా ద్వేషము తొలంగు నీశుని మహిమన్ !

    జిలేబి

    ReplyDelete


  176. జర జాగర్తన్నా ! మీ
    సరాగముల నెత్తిపోత సంగీత విభా
    వరులై జేయగలుగు లో
    ఫరుగాళ్ళు గలరిట బండి భద్రం మల్లే :)


    జిలేబి

    ReplyDelete


  177. సర్వర్లను మార్చెన్ శ్రీ
    పర్వంబు యుగాదినాడు పట్టము గట్టున్
    సర్వాంగ సుందరముగన్
    కర్వలి బోయిన జిలేబి కాయమునకటన్ :)

    జిలేబి

    ReplyDelete


  178. మెఱసి యుపకార మొనరింప మేలు వచ్చు
    గీడు వచ్చు మనంబులో నోడ వలదు
    వాడు చేసిన ధర్మంబు వాని గాచు
    గీర్తి యొక్కటి చాలదే కేవలంబు ?

    కాశీ ఖండం

    ReplyDelete

  179. నా వర్డుప్రెస్సు కమిం
    ట్లౌ వింజోవిని జిలేబు లాయెన్ గాదే !
    మీ వరుసన జేర్చగ య
    న్నీ వరమగునాకు శోధినీ బ్లాగ్వాసా !

    జిలేబి

    ReplyDelete


  180. కమలనయన ! నీవు కల చోటు సరసంబు
    నీవు లేని చోటు నీరసంబు
    కంబుకంఠి ! నీవు కలవాడు గలవాడు
    లేని వాడు నీవు లేని వాడు !

    కాశీ ఖండం

    ReplyDelete