Saturday, February 4, 2017

మహిత హితంబగు జిలేబి మాలిక లిడుదున్ !



మహిత హితంబగు జిలేబి మాలిక లిడుదున్
 
 
 
సహనము, నేర్పుగ   యత్నం
బహరహము గనుచు పదమ్ము పలుకు మధురిమల్ 
నిహతంబై, వాణిశ్రీ!
మహిత హితంబగు జిలేబి మాలిక లిడుదున్
 
 
శుభోదయం 
జిలేబి 

198 comments:



  1. భళి! మురళీధర రావుల్
    జిలేబి బీలేజి నడుమ సిద్ధ విలోమం
    బులగనిరి శుభాంగి నమ
    స్సులు యేల్చూరి కవివర్య ! సోహం హంసో !

    జిలేబి

    ReplyDelete


  2. ఈ హర్మ్యము లీతురగము
    లీహేమము లీభుజిష్య లీధాన్యము లీ
    దేహము నాతో వచ్చునె ?
    యూహింపగ పుణ్య కర్మ మొక్కటి దక్కన్ !

    కాశీ ఖండం

    ReplyDelete


  3. పయ్యెద ముసుంగు బాలిండ్ల బ్రాకనీరు
    తరచు పూయుదు రోల గంధంబు బసుపు
    బందికత్తెలు సురతప్రసంగ వేళ
    గంచి వ్రేతలు కుసుమాస్త్ర ఖడ్గ లతలు !

    కాశీ ఖండం

    ReplyDelete


  4. హరినామ కీర్తనంబును
    హర నామ జపంబు నెవ్వ డాత్మ బఠించున్
    నరక మహావేదన య
    న్నరునకు బ్రాపింప కుండు నయతత్త్వ నిధీ !

    కాశీ ఖండం

    ReplyDelete


  5. ప్రతి దినంబును బ్రాత రారంభ వేళ
    నిర్ణిబంధన నిరుపాధి నిరవ గాధ
    నిర్నిరోధ నిరాఘాట నిరుపమాన
    భక్తి సంభజియింతు రీ పద్మ బంధు !

    కాశీ ఖండం

    ReplyDelete


  6. ఉపనిషత్తుల కంటెను నూర్ధ్వ పదవి
    మంత్ర రాజంబు గాయత్రి మహిమ గాంచు
    ప్రణవ మను క్రేపుతో గూడి పాడి బిదుకు
    నవని సురులకు గాయత్రి యనెడి సురభి !

    కాశీ ఖండం

    ReplyDelete


  7. విమల విజ్ఞాన దీపంబు వెలుగుచుండ
    శాంతి ధారా జలంబుల జలక మార్చి
    భవుని బూజించె భావపుష్పముల భక్తి
    నతి విశుద్ధ మనోవృత్తి యాజ్ఞ దత్తి !

    కాశీ ఖండం

    ReplyDelete


  8. చేయని ఘనకార్యంబున
    కై యొనరిచిరిట జిలేబి కరతాళములన్
    సాయమ్మొచ్చె లలితయున్
    మాయ యెవరిదో ఫలమ్ము మాకొచ్చెనహో !

    జిలేబి

    ReplyDelete


  9. మాయా నగరమ్మిది లలి
    తా! యొజ్జల పలుకులన్ని తాళింపు లహో !
    మా యిరువురికిన్ మామూ
    లౌ యొకరిన్నొకరు గిచ్చు లౌక్యంబంతే :)

    జిలేబి

    ReplyDelete


  10. అందరి కోసం బొక్కరు
    బంధమ్మైనెరయ నొక్క రందరి కోసం
    డెందం బరయ జిలేబీ
    గంధం బూయవలెనమ్మ కష్టే ఫలికిన్ !

    జిలేబి

    ReplyDelete


  11. సుముహూర్తమొకటి కుదరం
    గ మన మనువట తపియించి కరిగి కలిసినా
    క మదితెలిసినాక తనువు
    లమరచి వలపమెరనమ్మ లవ్లీ మైనా :)

    జిలేబి

    ReplyDelete


  12. అమ్మయు నిజము మనవరా
    లమ్మియు యప్పచ్చులున్ను లలితా యుద్యో
    గమ్మున జేరుటయు నిజము
    కమ్మని తెమ్మర జిలేబి కరుణయు నిజమౌ !

    జిలేబి

    ReplyDelete


  13. గణములు సరిపడు పదముల
    గుణములు చందము యతిగతి గురువులు లఘువుల్
    కణిక జిలేబీ ప్రాసల్
    గణగణ గునగున సొబగగు గరగరి శాస్త్రీ !

    జిలేబి

    ReplyDelete


  14. నిండు మనసున మెచ్చుచు నిర్మ లమగు
    పండు వెన్నెల కురిపించె భాస్కరుండు 
    సుదతివి జిలేబి యొజ్జల శూకమున్ను
    బొందితివిగాదె శుభదిన మందు సూవె !

    జిలేబి

    ReplyDelete

  15. తాకింగౌ లలిత సుమా !
    మీ కందరికీ తెలిపెద మిన్నా తరహా
    లో కొసరు నామములు గల
    నాకథ నాదైన తీరునవిను జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  16. మత్తేభ జిలేబీ ! నీ
    యత్తారిల్లమెరికా సయాటంబో ? హా!
    బెత్తము గొనెనౌ ట్రంపూ
    చిత్తము గను రీతి బోయె చిటపట యనుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  17. సార్థక 'కేశ ' వు డతడౌ !
    యర్థంబులనాడలేదు యమకీటకముల్
    వ్యర్థంబులవ్వన సహా
    యార్థం జీవన విధాన యానము గాంచెన్ !

    జిలేబి

    ReplyDelete


  18. యమకీటక సంహారము
    సముచిత ముగ జేతురోయి సార్థక రావుల్
    గమనిక ! ప్రభాత కాలము
    న మందు నిత్తురట గోకవరమున మేలౌ !

    జిలేబి

    ReplyDelete


  19. చంద్రన్న నుపాధ్యాయులు
    కేంద్రంబుగ గనుచు నాడు కేండ్రించిరటన్!
    యాంధ్రా కై తా నెంతగ
    యింద్రియ నిగ్రహమొనరిచె యిటనుడివెన్బో !

    జిలేబి

    ReplyDelete


  20. చెలికత్తె చెళ్ళు మనిపిం
    చి లబ్ధి గాంచెను జిలేబి చిన్నమ్మగనన్
    నలుదెసల జనుల యచ్చెరు
    వుల యమ్మణి రాజ్య మేలు "వున్నతి" గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  21. సంకర సమాసములతో
    బింకము గా చాకిరేవు పిటపిట లాడన్
    టెంకాయ చిప్ప పగులన్
    వంకన చను పండితుండు వాటము గాంచెన్ :)

    జిలేబి
    ~పరార్~

    ReplyDelete


  22. లలితా ! జిలేబి బుట్టన
    సులభముగా బడితి వీవు సూక్షిని గనవే,
    పొలతి, యమాయకురాలా
    కలహంసిని నారదీయ కమలనయనియౌ :)

    జిలేబి

    ReplyDelete
  23. అమ్మ, ఈవాళ కాశీఖండపు పన్నీటీజల్లులు కురిపించడానికి గల కారణమేమి? కొంత అర్థం అయ్యి కొంత అర్థం కాకుండా ఉంది.

    ReplyDelete
    Replies

    1. అన్యగామి గారు,

      మనం చదివి 'పారేస్తున్నామని' పదిమందికి తెలియాలి కదుటండీ ! జేకే !

      చీర్స్
      జిలేబి

      Delete
    2. కాశీఖండం తరవాత పాండురంగ మహాత్మ్యం చదవండి. నిగమ శర్మ అక్కపాత్ర చాలా గొప్పగా ఉంటుంది.

      Delete

  24. మూర్ఖత్వంబన నేమోయ్ ?
    కార్ఖానాకవిత బేర్చి కామెంటులనన్
    చెర్ఖా లాడించటమే
    కర్ఖత్ పదముల జిలేబి గావించడమే :)

    జిలేబి

    ReplyDelete


  25. చతురత తాతా "కాదో"
    యి! తురగ వేగము చెవులవి యిట పని గనలే !
    కత 'కాదిది', వచ్చెను శో
    ష, తరుణ చెవిపోటు సూవె ! సలహా వలయున్ !

    జిలేబి

    ReplyDelete


  26. జీవి కిన్న రుండు ! జీవము సత్యము
    వలయు వారుణి యిట వలయు సోమ
    పాన మట, జిలేబి, పారవలెను రెండు
    త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త

    జిలేబి

    ReplyDelete


  27. మాయాడువారి మాటల
    తాయా రమ్మల జిలేబి తరుణుల పలుకుల్
    మాయా జాలము లరయ
    న్నాయొజ్జకు, ధరణి యందు నలవియవునటే :)

    జిలేబి

    ReplyDelete


  28. ఇచ్చ లేకుండినను నగ్ని నెట్లు గాల్చు
    దన్ను నంటిన వారిని దాహ శక్తి
    నిచ్చ లేక క్రుంకినను దహించు నట్ల
    తైర్థికుని బొంది యున్న పాతకుము గంగ !

    కాశీ ఖండం

    ReplyDelete


  29. ఓ యమ్మో ! నీ వ్యాఖ్యల
    తోయములను విన్నకోట తోడిరి షెర్లా
    క్సే యమ్మో జర జాగ
    ర్తా! యేమో యెవరికెరుక రక్ష జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  30. ముంబయి వెళ్తా వంటే !
    గుంభనగా యమెరికాయు , గునగున బెంగ్లూ
    ర్యాంబ! తమాష కుసుమ జగ
    దంబా! మాచన డిటెక్టి వౌ ! హుష్ కాకీ :)

    జిలేబి

    ReplyDelete


  31. భామాప్సరా ! జిలేబీ !
    నీమోము గని మనసునుగని నీప్రాణంబుల్
    మామదిని తాకె పద్మ
    మ్మా! మము విడువకు విడువకు మా నయగారీ :)

    జిలేబి

    ReplyDelete

  32. తేటగీతి
    -----+

    తేట గీతిని జూడగ నేను గంటి
    యైదు యేడును యైదును యగును హైకు
    తెలుగు పద్యపు మహిమను తెలుసు కొనుడు
    పద్య మనెడు జిలేబులు పరిఢ విల్ల !



    హైకు
    జిలేబి

    ReplyDelete


  33. అనసూయ ! సుమ! జిలేబీ!
    వినురో యీయమ్మలార ! విపరీతం బా
    యెనుబో మీ యైటము సాం
    గ్సను పద్యముల మళయాళ గానము లున్నూ !

    జిలేబి

    ReplyDelete

  34. తేటగీతి! హై! కూల్ !



    చెక్కు వెనుతిరి గిందట చిన్న బోయి
    పక్క తడిపెను బాబు సపర్య కోరి
    నిగ్గు దేల్చగ నిజమగు నేత వచ్చె
    పెగ్గు లాగుచు పటమట పెండ్లి యాడె

    జిలేబి

    ReplyDelete

  35. దేహత్యాగము దానము
    దేహనిపాతంబు దపము ధృతి బరికింపన్
    దేహ వియోగ మయోగం
    బాహా ! కాశీ పురీకృతావాసులకున్ !


    కాశీ ఖండం

    ReplyDelete


  36. సౌమ్య రూపంబు వహియించు సజ్జనులకు
    బాపమతులకు వికృత రూపంబు దాల్చు
    పింగళాక్షుండు దీర్ఘ గంభీర మూర్తి
    చండికాపతి ప్రియథుండు దండపాణి !

    కాశీ ఖండం

    ReplyDelete


  37. ఆలింగనమ్ము సేసెం
    బాలిండ్లను ముట్టె వదన పద్మము తావుల్
    గ్రోలె మగ డనగ నెవ్వం
    డా లనగా నెద్ది ? భర్త యతడే నాలిన్ !

    కాశీ ఖండం

    ReplyDelete


  38. వర్ణముల లోన బ్రాహ్మణ వర్ణ మెక్కు
    డాశ్రమంబుల లోన గార్హస్థ్య మధిక
    మనఘ ! లక్షణవతి యైన యాలు సూవె
    తగిన యవలంబనంబు తద్ధర్మమునకు !

    కాశీ ఖండం

    ReplyDelete


  39. ఆత్మ దప్పించి యెరుగ డన్యంబు నెవ్వ
    డాత్మ సంతుష్టు డెవ్వడహర్నిశంబు
    నాత్మ నాత్మనె కను నెవ్వ డాత్మ మిథును
    డెవ్వ డాతండు యోగ లక్ష్మీశ్వరుండు

    కాశీ ఖండం

    ReplyDelete


  40. ధర్మ నిర్మల హృదయ ! శ్రోతవ్య మాత్మ
    తారకబ్రహ్మ నిష్ఠ ! మంతవ్య మాత్మ
    సర్వ శాస్త్ర ప్రవీణ ! ద్రష్టవ్య మాత్మ
    దంభ రహిత ! నిదిధ్యాసితవ్య మాత్మ !

    కాశీ ఖండం

    ReplyDelete


  41. ఉడ్డి యాన ముద్ర యును మహా ముద్రయు
    మూల బంధ గగన ముద్రికలును
    సారతర వివేక ! జాలంధరంబును
    ననగ యోగముద్ర లైదు సుమ్ము !

    కాశీ ఖండం

    ReplyDelete


  42. ప్రాణాపానవ్యానో
    దానసమానములు తృప్తి దలకొన జేయం
    గా నోపెడు నది యన్నము
    ప్రాణం బన నన్న మనగ పర్యాయంబుల్ !

    కాశీ ఖండం
    * ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన

    ReplyDelete


  43. కోయిల దిరుమల బెరుమా
    కోయిల దిరుపతుల గుంభ కోణాదికపు
    ణ్యాయతనంబుల మాయం
    బై యెక్కడ బోయెనొకొ మురాంతకు ప్రతిమల్

    కాశీ ఖండం

    ReplyDelete


  44. కదలకుండును మది నెంత కాలమేని
    ధర్మ మతి సుకరంబయి కర్మ సాక్షి !
    యంత గాలము నరునకు నావహిల్ల
    దే యపాయంబు నీ సూక్ష్మ మెరిగి కొనుము !

    కాశీ ఖండం

    ReplyDelete


  45. ఆత్మజుడ వన్న మిత్రుండ వన్న భటుడ
    వన్న సచివుండ వన్న నా కెన్న నీవు
    నిన్ను నెబ్భంగి వర్ణింప నేర వచ్చు ?
    గంఠపీఠాగ్రకరి రాజ ! డుంఠి రాజ !

    కాశీ ఖండం

    ReplyDelete


  46. సిద్ధి వినాయకు గెడ వర
    సిద్ధి ద్రిసంధ్యంబు సేవ సేసిన నెరయన్
    సిద్ధించును మానవునకు
    శ్రద్ధావంతునకు విభవసంపత్సిద్ధుల్ !

    కాశీ ఖండం

    ReplyDelete


  47. ఉద్దాలక తీర్థంబున
    నుద్దాలక నామ ధేయు డుడుపతి మకుటం
    డుద్దండ దండ ధర మద
    భిద్దోఖట్వాంగు డుండు బ్రియ మెసలారన్ !

    కాశీ ఖండం

    ReplyDelete


  48. నైన వదనంబు దెరచి బ్రహ్మాండ పిండ
    కబళన మునకు జేసాచి కాళ రాత్రి
    కాశి శుష్కోదరీ దేవి గదల కుండు
    జర్మ ముండకు జెలికత్తె శైలదమన !

    కాశీ ఖండం

    ReplyDelete


  49. హితము సెప్పితి విన నిచ్చ యేని లెస్స
    జగము బాధింప కుండుట చాలు మాకు
    దుహి నగరి కన్య యానతి ద్రోచి తేని
    యీడ్చికొని పోదు వెండ్రుక లిరియ బట్టి !

    కాశీ ఖండం
    (మొదటి రెండు పాదాలు జిలేబి కి వర్తిస్తుందా ? :)

    ReplyDelete


  50. అవిముక్తం బవిముక్తం
    బవిముక్తం బనుచు బ్రాత రారంభ ములం
    దవధాన పరత నెవ్వం
    డు వచించును వాడు ధన్యుడు మునిప్రవరా !

    కాశీ ఖండం

    ReplyDelete


  51. పాడి మెచ్చించె నొక యింతి పంజళమున
    నాడి మెచ్చించె లేమ లాస్యమున నోర్తు
    పొగడి మెచ్చించె నొక్క లే జిగురు బోడి
    కరుణ గలవాడు కాశి నోంకార భర్త !


    కాశీ ఖండం

    ReplyDelete


  52. మా మనవరాలి చిత్రము
    లౌ! మా నందిత జిలేబి లాస్యము లమ్మీ !
    ఓమాచన సీ తాకో
    కా ! మా పలుకు వినవమ్మ గజ్జెల రమణీ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  53. అండ దండలు గానగ యమ్మి శశియు
    దండిగను తమిళమ్మగ దస్క ములను
    గాంచె కోరెనొకొ పదవి, గడగడ యని
    బెండ చెట్టుకుఁగాచెను బీరకాయ :)

    జిలేబి

    ReplyDelete


  54. చదువుకు సంస్కారమునకు
    కుదురదు సంబంధమున్ను కూచి జిలేబీ
    చదువన చదువన బోయెను
    మదియు, వివేకము, మతియును మానవ విలువల్

    జిలేబి

    ReplyDelete


  55. బెదురక సమస్యల గన
    న్నెదురిం చవలెను జిలేబి నిబ్బరముగనన్
    కుదురై నజీవితంబను
    నది మిథ్య! గనవలె శక్తి నమ్ముచు నీశున్

    జిలేబి

    ReplyDelete


  56. తగు మనవరాలు ! చేయి తి
    రిగిన కళాకారిణి పసిడి యొలుకు చిత్రం
    బుగనన్ మీపో లిక యౌ
    యగుపించెను సౌష్టవంబు యనపర్తీశా !

    జిలేబి

    ReplyDelete


  57. నా పిచ్చి నాదహో ! సిని
    మా పిచ్చి వదల జిలేబి మనసే రాలే :)
    ఆ పిక్చరులో యేముం
    దో పర్తీశా ! విడువ నదో మనసేలే :)

    జిలేబి

    ReplyDelete


  58. మాయమ్మ! తల్లుల పలుకు
    లే యమ్మ జగత్తునేలు లేపమ్ము జిలే
    బీ! యన్నియు తెలిసిన తరు
    ణీ! యనపర్తీశు తెలిప నేయమ్మ వినౌ :)

    జిలేబి

    ReplyDelete
  59. దత్తపది


    ధార్మిక మనస్వి సద్గురు
    ధర్మము నెరిగిన తపస్వి తన భాషణతో
    నిర్మల వచస్వి జగతీ
    మర్మంబెరిగిన యశస్వి మమ్మున్ బ్రోచున్ !


    గరికపాటి

    ReplyDelete


  60. ఓ యమ్మో! చిన్నమ్మా !
    మాయమ్మ జయల లలితను మాటయడిగితిన్ !
    న్యాయమ్ముగాన పన్నీ
    రూ యుద్ధముజేయమనెను, రుంజాయింతున్ :)


    జిలేబి

    ReplyDelete


  61. ఏంటోయ్ ! యెంగిలి పీసూ !
    యింటెల్ వాడుకనిబెట్టె యిడియట్ యిన్ సైడ్ !
    చింటూ జిలేబి బిల్చెన్ ,
    కం టెల్ మీ గాడ్ది గుడ్డు ! కంకర పీచూ !

    ReplyDelete


  62. ఏమయ్య చాకిరేవూ !
    శ్రీ మాచన లాంటివారు చిన్నగు ఫాంట్లన్
    మీ మిణుకు మిణుకు చెణుకుల
    తామెట్లాగయ్య చదువుతారు జిలేబీల్ :)

    జిలేబి

    ReplyDelete


  63. కొంప గూలె కోట్ల కొలది రొక్కములకు
    కాళ్లు వచ్చు నయ్య కంది వరద !
    యెన్నిన జను లెల్ల యేమారి రయ్యరో
    ట్రంపు చేష్ట లేవగింప ? యింప ?


    జిలేబి

    ReplyDelete


  64. మురిపెంపు తెలుగు వాళ్ళకు
    సరిముంపుగ చర్నకోల ఝాటీ ట్రంపౌ !
    మరి సొంపులమ్మ లకికన్
    సరిజోదగు యింపులీను సౌధంబేదౌ :)

    జిలేబి

    ReplyDelete


  65. సినిమా కెళ్తామ్మామోయ్
    మునిమాపున రమ్మ నన్ను మురిపెంబాడన్
    గనెదమ్ము నీవు నేనౌ
    జనరంజక చిత్రమునిక చట్టని రమ్మా :)

    జిలేబి

    ReplyDelete

  66. వలయును జిలేబి మేలగు
    తులసీదళము మనకు, విషతుల్యమ్ము గదా
    యలకల కొలికికి జీవగ
    తులనివ్వని తోరమల్లి దురిముడి పూవుల్ !

    జిలేబి

    ReplyDelete


  67. ఓ శార్దూల జిలేబీ !
    ఓ సరసీ! తేటగీతి! ఓలమ్మమ్మో !
    నో! సారి! దుల జిలేబీ !
    వేసారితిమమ్మ వేణి వెతవెత తోడన్


    జిలేబి

    ReplyDelete


  68. తానెయ్యి గిన్నె గొనుచున్
    మానెయ్యంబందు యజ్య మావిడ వెయ్యు
    న్నో! నే బోతా మాచ
    న్నా! నా దారిన, జిలేబి నారద యదిగో :)

    జిలేబి

    ReplyDelete


  69. కామేశ్వర రావు పోచిరాజు

    పితృ సద్వచన చయ మనో
    వితృప్త సంతప్త చిత్త వివశాత్మ కృతా
    వితృహీనునిం దృణీకృత
    పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్

    శ్రీ పోచిరాజు కామేశ్వరరావు

    ReplyDelete

  70. తమాష కుసుమ ! అంబే ! జగదంబే ! పాహి పాహి :)



    అసలే పందుం తడిసిన
    మిసి ముప్పందుంబగున్ను మిరియాల జిలే
    బి! సఖుండా రాజన్నా !
    రుసరుస రమణియిటువచ్చు రుంజాయింపన్ :)


    జిలేబి

    ReplyDelete


  71. పద్యరచనకు గణ,యతి ప్రాస లేల
    రా మదిని చిలుకనవచ్చు రాగ భావ
    తాళముల జత పదములు తన్ను కొనుచు
    నవి యగును మాలికవలెను నాదముగను !

    జిలేబి

    ReplyDelete


  72. అనగననగ నెమ్మి యతిశయ మగుచుండు
    తిరగ తిరగ వేణి తిమ్మి రెక్కు
    మీదు మెప్పు బడసి తినదియె మేలయ్య
    విశ్వ దాభి రాజ, విదుర యొజ్జ !

    జిలేబి

    ReplyDelete


  73. దశరథుడు కైకతో కోపగృహంలో అంటున్న మాటలు:
    సీ.
    చిదిమినపాల్గారు చెక్కుటద్దములపై
    జిలిబిలి చిరునవ్వులొలయువాడు
    కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లుమనంగ నం
    దరి కనుల్ చల్లగా తిరుగువాడు
    బుడిబుడినుడువుల పూర్వ భూపాల గా
    ధల నేను నుడువుచో పలుకువాడు
    రాఘవా! ముద్దీయ రా! యన్న ఎగిరి గం
    తిడుచు హాయిగ కౌగెలించు వాడు
    అట్టి పదునాలుగేడుల బొట్టెనెట్టు
    లసురభీకర వనసీమ కంపువాడ
    ననుచు ఏడ్చితి నెపుడో యపుడు, మరల
    నిపుడునీ మూలమున నట్టు లేడ్చుచుంటి!

    పానుగంటి

    ReplyDelete


  74. ఓయీ ఘృతాచి ! మరి యే
    మాయెను మావ్యాఖ్యలన్ని ? మన్నింపవలెన్
    మాయయ్యలార స్పామున్
    బాయెన్ మీ చిరుబురులు సభాసదులారా !

    జిలేబి

    ReplyDelete
  75. ఈ పద్యం తేలికగా అర్ధమయిందండోయ్ 👌.

    ReplyDelete


  76. వృత్తం బేదో యర్థము
    బొత్తిగ గాలే జిలేబి బోవే బామ్మా !
    గుత్తుగ పదముల బేర్చిన
    బెత్తము గొనెదను లతాంగి బెహతరు గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  77. గోదావరి నీళ్లాయే
    మేధా దేవిల లితమ్మ మెరిసే తారల్
    సాదా సీదా కాదోయ్
    గౌతమి తీరపు రమణులు గౌరీ మాతల్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీ అమ్మకడుపు చల్లగా, అత్తకడుపు చల్లగా ఉన్నమాటన్నారండీ. చూశారా అందుకే పద్యం అంత సొగసుగా కుదిరింది. :)

      Delete


  78. ప్రస్తుతమున యత్నము గొన
    మస్తుగ రాబోవు కాల మందున పుణ్యం
    గిస్తరు యూపర్ వాలా
    బిస్తరు పరచుచు ఫలముల బీజం వోలెన్ !

    జిలేబి

    ReplyDelete


  79. మీయమ్మ కడుపు చల్లగ
    నోయమ్మో చెబితివీవు నొప్పారెను బో !
    మాయమ్మ జిలేబికి తా
    నై యిత్తును పదపు సొంపు నరయ జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  80. శివుడు దాత భోక్త శ్రీ మహాదేవుండు
    సర్వమును హరుండు శాశ్వతుండు
    శంభు వేరు సేసి సాగింప వచ్చునే
    క్రియలు? వెర్రి బేల వయితి ? చెపుమ !

    కాశీ ఖండం

    ReplyDelete


  81. అణచునది దంభ ముజ్జగించునది యీర్ష్య
    యుడుగునది రాగ లోభ గర్వోదయములు
    శాంతి దాంతి తితిక్షా నృశంససత్య
    నిరతు డగునది కాశిలో నిలుచు నరుడు !

    కాశీ ఖండం

    ReplyDelete

  82. దత్తపది- నిధనము - శవము - పాడె - చితి


    నీలాంబరి ! తెరిచితివి మ
    నో లావణ్యముల, పాడెనొక కోయిలటన్,
    మాలిని, ధనమిక పతియే !
    కాలపు శైశవము విడుము కాత్యాయినివౌ !

    జిలేబి

    ReplyDelete


  83. కమలలోచన ! కిన్న రాంగనవె నీవు
    నీవు గంధర్వ భామ వే నీలవేణి ?
    యప్సరస్త్రీవె నీవు బింబాధరోష్టి ?
    రమణి ! నీవు విద్యాధర రాజ సుతవె ?

    కాశీ ఖండం

    ReplyDelete


  84. సేసినను కాశికా భర్త శివుడు విశ్వ
    నాయకుడు లక్ష్మి యిచ్చు దీర్ఘాయు వొసగు
    బ్రాభవంబు బ్రసాదించు భక్తతతికి
    శ్రీ విశాలాక్షి కృప సేయు జింతితములు

    కాశీ ఖండం.

    ReplyDelete


  85. తాతా! ఫాంట్లవిబాగుబాగు ! గనలేదాకళ్ళ చెక్కప్ సుమా

    ఫాంట్ల ప్రాబ్లెమ్ కాదండీ
    మీ బ్రౌజర్ లో వ్యూ శాతం ౧౨౫ చేయండి :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete

  86. ఎరుడైటు వంట వమ్మా
    యెరుకలసానీ జిలేబి యేమన్నా నీ
    గరిమే వేరమ్మా ! తం
    పు రావడుల రాములమ్మ పున్నెం కొలదీ :)

    జిలేబి

    ReplyDelete

  87. ఉన్నాడంటున్నారే !
    యెన్నటి కైన కనిపించి యేకం సత్యం
    బన్నాడా యేలికయౌ ?
    యెన్న యెచటగలడు విభుడు యెవరికి తెలియున్ !

    జిలేబి

    ReplyDelete


  88. అవనిన్ జనులందరు యిహ
    భవ సుఖముల నాడువారు‌‌ బాంధవ్యగతిన్
    గవనముగ జూడ గలరే
    యవనారినిగన తపించు యతిభూషణులున్ !

    జిలేబి

    ReplyDelete


  89. మాటుగా నటు నెవ్వరు మాట జెప్ప
    క నటు కళ్ళటు ముంతను గాంచ గాను
    గునగున జిలేబి గుప్తమగుచును, యడుగు
    తాటి, తోపులోఁ బాలను ద్రాగవలెను !

    జిలేబి

    ReplyDelete


  90. బంగారు గనివట!జిలే
    బింగార్చు నవనవ వజ్ర భింగంపు గనీ !
    చెంగున చెంగురులను దీ
    ర్చంగను కందంబు గూర్చి రవళించు సుమా !

    జిలేబి

    ReplyDelete


  91. అంతర్నేత్రము నటు ర
    వ్వంత గ న విభుడటు యెంత వటువో తెలియున్
    గొంతయు లేడు యనంతుడు
    వింతగ పేస్మేకరు,తను విచ్చిన సూక్ష్మం !

    జిలేబి

    ReplyDelete


  92. రొంబో రొంబో సరిదా
    తంబీ పన్నీరు సెల్వ తంబి జిలేబీ !
    యేంబా యినిక్కి చొల్వా
    రాంబ గవర్నరు డమాలె ఢమ్మాలే దా :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నల్లతంబి సమస్య:


      తప్పని తల్లిని తిట్టియు
      చెప్పులు దోచెగద తంబి ఛీఛి జిలేబీ!

      Delete


    2. తప్పని తల్లిని తిట్టియు
      చెప్పులు దోచెగద తంబి ఛీఛి జిలేబీ !
      పప్పులుడకలే దయ్యా
      కప్పులు సాసర్లికకడు గవలెను శాస్తీ :)

      జిలేబి

      Delete
    3. నిప్పులు జెరిగెడి టెండలొ
      ఛుప్పున నడిచేటి రాము జూసిన వాడై
      తప్పని తల్లిని తిట్టియు
      చెప్పులు దోచెగద తంబి ఛీఛి జిలేబీ!

      Delete


  93. మనసన్నది రాలేదో
    యి, నాపదములటు సయాట యిసుమంత గనన్
    మనరాముని పదముల పలు
    కును పలుక తగు సమయంబు కుదురన వీలౌ !

    జిలేబి

    ReplyDelete


  94. వారటు జెప్పిరి జెప్పిరి
    వీరటు పలుకుల చమక్కు విదురుల పలుకుల్
    సారము గాంచితి వటవే
    పారమ్యంబున్ స్వకీయ పాకము గానన్ !

    జిలేబి

    ReplyDelete


  95. ఆవొక్కటి తెలియగనన్
    బావుణ్ణనుకొనెనుగాద పారుడు జూడన్
    తా వలచిన చిత్సత్యము
    నావన్ గ్రమ్మెను జిలేబి నాకము వోలెన్

    జిలేబి

    ReplyDelete


  96. తెలియదు తెలియదనుచు నిటు
    ల లలితముగ యుండ నెట్లు లభ్యంబగునౌ
    ఫలములు నరసింహన్నా !
    కలకలముల లేపవలె సకలము తెలియనౌ :)


    జిలేబి

    ReplyDelete


  97. బండన్నా! కిను కేలర
    గుండమ్మయెడల జిలేబి ఘుమఘుమ లెడలన్ :)
    గండమ్మికవచ్చు సుమా
    చెండా డెదమిక గణగణ చెకచెక తోడన్ :)

    జిలేబి

    ReplyDelete

  98. పన్నీరాయెను పళనీ !
    కన్నీరే మిగిలెను శశికళకు జిలేబీ !
    మున్నెప్పుడు కనరాని స
    మున్నయ మిది!తమిళనాడు ముందే మగునో :)

    జిలేబి

    ReplyDelete


  99. అంతయు నొకటే నండీ !
    యంతయు బంగా రమేను ! యసలిది యేనౌ
    వింతగ గాజులు గొలుసులు
    కొంత ధనము దస్కమున్ను కుసుమ జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete
  100. మీ బ్లాగుని ఏం చేసేరు? ఫాలో అప్ కామెంట్లు రావటం లేదు?

    ReplyDelete
    Replies


    1. ఫాల్ అప్ కామెంటులు అనగా ఏమి ?

      జిలేబి

      Delete
    2. Follow up comments of posts

      Delete
    3. It appears the google is not sending follow up comments of any blogger.

      Delete


    4. అంతా విష్ణు మాయ గా ఉంది : ఎక్కడికి sending అండీ ?

      జిలేబి

      Delete


  101. పుట్టక మును పుట్టినదో
    పుట్టిన తరువాత బుద్ధి పుట్టినదో రా
    పట్టికి శ్రీహరి పదముల
    పట్టు విడువనట్టి భక్తి ; భాగ్యము గాదే !

    బృందావనము వేంకటపార్వతీశ్వర కవులు

    ReplyDelete


  102. కమలనిభచరణ కోమల
    కమలకుసుమపాణి, కనక కమలానన, యి
    క్కమలదళ నయన నిజముగ
    కమలామల గేహ యైన కమలయె సుమ్మీ !

    బృందావనము

    ReplyDelete


  103. నడచునెడ నిలచు నెడలన్
    గుడుచు నెడల ముడుచు నెడల గూర్కొను నెడలన్
    గడయైన మఱచి యైనన్
    విడువదు రాకన్నె కృష్ణ విగ్రహ మెపుడున్

    బృందావనము

    ReplyDelete


  104. బాలా యెంతటి బేలవె
    యాలోక విభుండు సులభుడని యెంచితివే
    లీలా మయుడాతని యి
    ల్లాలగు భాగ్యంబు మానవాంగన కగునే !

    బృందావనము

    ReplyDelete


  105. ఫాలోయప్పు కమింట్లు బోయె గదవే భామా జిలేబీ గనన్ :)

    జిలేబి

    ReplyDelete


  106. జీవితపు సింహ భాగము
    లో విస్మృతి కిప్పటి వలె లోనవ లేదోయ్ !
    యీ విపరీతము గానన్
    మావే బంగరు సమయము మహిలో లలితా :)

    జిలేబి

    ReplyDelete


  107. కొచ్చెను పేపరు టప్ఫుగ
    యిచ్చిరి గురువర్యులకట ! యివ్వవ లెన్ మా
    కిచ్చట గ్రేస్మార్కులనన్
    మెచ్చుచు పద్యము లనయ్య మీరు, భళిభళీ :)

    జిలేబి

    ReplyDelete


  108. ఓకన్ను వేసి తెలుపుడు
    మా కందంబమరెనో సమాసము సరియో !
    శ్రీ కామేశ్వర రావుల్
    మాకున్ తెలుపుదురుగాక మా విన్నతియౌ!

    జిలేబి

    ReplyDelete


  109. కంచంబులోన యన్నము
    కొంచెము లేదు సరి తీరు కోరిక లన్నీ
    దంచిరి గాద కథలనుచు
    పంచాంగము చూచి బసిని పక్కున నవ్వెన్

    జిలేబి

    ReplyDelete


  110. కిట్టించితినయ్యా రే
    రాట్టు గగనమణిని శంకరాభరణమునన్
    పట్టువిడువను సుమా స
    మ్రాట్టును విదురుల సదనపు మణిని జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  111. శశికళ ! సుధాకర ! యిళవ
    రసి!పన్నీర్సెల్వ! పళని ! రాజ్యం బేలన్
    కసకస పుసపుస లాడిరి
    పొసగుట లేదౌ జనులకు పోరామిగదా !

    జిలేబి

    ReplyDelete
  112. శంకరాభరణమదొక సర్కసవగ
    తెర తెరువగ బఫూనోడు పరుగునొచ్చు
    అందమైన యువతులింత గంతులేయ
    లయను టేమరు కొరడతో భయము లొలక!

    ...సరదాకు వ్రాసితిని...

    ReplyDelete
    Replies


    1. ఏక్ కలి బెలగ్ బెలగ్ పత్తియా :)

      జిలేబి

      Delete


  113. మంచునధిగమించెను తె
    ల్లంచులనూ సూర్యుడు కమ లాప్తుని పత్రం
    కుంచెను సాగించెనుగద
    వింజోవి విరియ జిలేబి విశ్వవినోదం !

    జిలేబి

    ReplyDelete


  114. కరుణ! కరుణ ! వలయునురా
    యరుణోదయ భాస్కరన్న! యన్యాయముగా
    దుర ! సామీ ! నాపైనన్
    సురటీ యూదంగతగును సూర్యాత్మజనౌ !

    జిలేబి

    ReplyDelete


  115. ఉండే వారు నిజానికి
    గుండెలదురు చురుకుచొరవ గుమ్మలు నాడౌ
    నిండుగ జిలేబు లయ్యిరి
    మెండుగ పతులెడ మురిపెము మీరన్ లలనా !

    జిలేబి :)

    ReplyDelete


  116. వసవస లాడెడి వయ్యా
    రి సయాటలనన్ జిలేబి రింజిమ్ రింజిమ్
    మిసిమిసి పూబో డియ రూ
    పసిబాలునిఁ బెండ్లి యాడెఁ బ్రౌఢ ముదమునన్ :)

    జిలేబి

    ReplyDelete


  117. పోషక రూపంబల్లుడు
    భేషౌ విష్ణువన జామి పెద్దమ్మయునౌ!
    ఆశీస్సుల కోరి పదము
    లాసాంతము కడుగుదురు యిలతయేనులిడన్ !

    జిలేబి


    జిలేబి

    ReplyDelete


  118. బుధజన సాంగత్యము వల
    యు, దుండికిన్ రాజు వారి యుక్తియు వలయున్
    సదరము బండి బతుకు తెరు
    వు ధరణి లో నారద దరువులును జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  119. అలుపెరుగని యెవరెడివీ
    జిలేబి పొగిడిన దినముల చిక్క పొగిడితిన్
    పలుకుల దునుమాడుట వల
    దు, లలన, బండినడువ వలె ధుమధుమ వలదోయ్ :)


    జిలేబి

    ReplyDelete


  120. భూతద్దము బెట్టుకొనుచు
    వాతలు వేయగ డిసైడ వంగ జిలేబీ,
    తాతన్నాపనెవరితర
    మౌ! తొయ్యలి కుంతి పాపమా కర్ణుండౌ !

    జిలేబి
    పరార్

    ReplyDelete


  121. కామెంటు పెట్ట రాదే
    యేమరుచును పెట్టగాను యెప్పటి కిన్నీ
    తామై వెనుకాడ వలదు
    యీ మాటవినవె జిలేబి యిక్కట్లుండవ్ :)

    జిలేబి

    ReplyDelete


  122. చెన్నై లోనున్నారా !
    పన్నీ ర్కన్నీ రు తుడువ పట్టణ మొచ్చే
    రన్నది తెలిసెన్ బండికి
    విన్నా వంటే జిలేబి విదుషీ రమణీ :)

    జిలేబి

    ReplyDelete


  123. నడినెత్తికొచ్చె నౌ సూ
    ర్యుడు గడగడ నడకలన చురుక్కు జిలేబీ
    సడుగుడు లాడన వచ్చె గు
    రుడిని గనంగ నొకటిచ్చె రుంజాయింపౌ :)

    జిలేబి


    ReplyDelete


  124. రీటయి‌రుడుబండ్లకిటన్
    రోటీ కపడా మకాను రొక్కము లివ్వన్
    చీటికి మాటికి మహిలో
    కూటికి వచ్చును టికాణ గువ్వల చెన్నా :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. "ప్చ్...

      గుట్టు చప్పుడు లేక, ఉట్టి దాపెట్ట తెలియక
      నట్టు జారి గుట్టు రట్టు చేయడ మెంత
      పుట్టి ముంచెర, అకటా పుట్టు జగడపు
      పట్టి మొట్ట చేతికి చిక్కి వట్టినై పోతిరో వినుమురన్నా!
      :)"

      Delete

  125. పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు గట్టి గాను గొట్ట చట్టు బూమురాంగగునుర బండి యన్న, వినుము
    గుట్టు తెలుప రాదు తెలుప చిక్కు గట్టి గొచ్చు, గిట్ల గొట్ట గాంచు సరి జిలేబు లొచ్చు ఖతరునాకు గనుము
    విట్టు వేయ వచ్చు జోడు విట్టు నిట్టు బట్టు బట్టి వీలు గాను విజయమంగళ రగడ వోలె గండమ్ము
    నెట్టు మీద నెక్కు నెట్టి వేయ జూడు మయ్య రావు నేటి రీతు లివియె గాద నెట్టు లోన నిజము నమ్ము !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. కొట్టియో తిట్టియో గిల కొట్టియో జగడము బెట్టియో గొంతెత్తున పనిముట్లను పెట్టున విసిరెట్టియో
      గొట్టాము నెత్తిన గొట్టియో గట్టిగ దూరము నెట్టియో పై పట్టున గూట్లోని బెట్టును ఫట్టున నెట్లోన బెట్టియో
      రట్టు జేయుచు నిట్లన ఆరట్లన విట్లన బొట్టిని నట్టువాడించియో ఫిట్లొచ్చ చిట్లి నవ్వ నదేమి జెట్టీ!
      ఛట్! ఇదె బెట్టరు, చట్టున తట్టా బుట్టల పట్టి చెట్టూ పుట్టల దారట్టి బోయెద రాతలిక గుట్టుగ కట్టివెట్టి

      ...హ్ హ్ హ్ ...
      లోల...

      Delete


    3. సంసారి సన్యాసమా :)

      జేకె

      చీర్స్
      జిలేబి

      Delete


  126. మబ్బులు తొలగె గగనమణి
    యబ్బురము గదా జిలేబి యందము గానన్
    నెబ్భంగిని వీలగునౌ
    కబ్బమున వినురతనమ్ము కథను తెలుపగన్ !

    జిలేబి

    ReplyDelete


  127. కలజూచె మహా రాణి, స
    కల భోగముల కలహంసి కనుకొలకులన
    న్నెలవు చెలిని, చిలుకల పలు
    కుల, టంగని పిలిచి సీత కురు లల్ల మనెన్ !

    జిలేబి

    ReplyDelete


  128. భార్యామణి నప్పు నడుగు
    కార్యంబగు భమిడిపాటి ఘనుడు జిలేబీ
    యార్యుల సలహా సరి చా
    తుర్యంబన యిదియె యిచ్చి పుచ్చుకొనదగున్ :)

    జిలేబి

    ReplyDelete


  129. చీకటిలో మగ్గు జిలే
    బీ! కనిపించదు గద సురభిత హిందూత్వం !
    శాకిని ! ఢాకిని హాంఫట్ !
    బాకా నూదెదను మూల పథమది మాదే !

    జిలేబి

    ReplyDelete


  130. అమ్మ వారికి మక్కువ యాడ పిల్ల
    లనగ వత్తురు కసబుస లాడుచు నిట
    గాంచుదురు నేడు బండన్న, కాచు కొనుడు
    యెక్కు వగునౌ జిలేబమ్మ లెంప కాయ :)

    జిలేబి

    ReplyDelete


  131. అయ్యో మాచన గారూ
    సయ్యా టలనగ కమింట్లు సారీ కాదం
    డయ్యా మీపై చంద్రిక,
    నెయ్యపు తొయ్యలి జిలేబి నెరజాణలపై :)

    జిలేబి

    ReplyDelete


  132. చాలెంజులు వలదన్నా
    జిలేబి బటనొక్కటి గని జిలిబిలి పాటల్
    గలగల లాడించు ను సూ
    వె! లవణి తీరుగని వాయి వేగము గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  133. రాజ శేఖరుడనెనోయి రత్నసువున
    హిందువులు, యేసు ప్రాఫేటు లందరున్ను !
    లెస్స! గనెనోయి కతల జిలేబి , మేలు
    చర్చిలో సంధ్యవార్చెను సాయబయ్య.

    జిలేబి

    ReplyDelete


  134. ముసలావిడాయెను జిలే
    బి! సయాటల మరిచెనోయి బీలేజీ బీ !
    కసకస బుసుబుస లాడెడి
    రసజ్ఞ నిదురో యెనోయి రావడి బోవన్ :)

    జిలేబి

    ReplyDelete


  135. సద్దు మణుగు చుండె సభికులు డస్సిరి
    గిట్టు బాటు లేని గీర లేల !
    పొద్దు బోయె నమ్మ బోవ దగు జిలేబి
    ఫేసు బుక్కు గాడ భేషు గాన :)

    జిలేబి

    ReplyDelete


  136. పెళ్లాముల కోసము గా
    దల్లా కొరకై యహమ్మదనుయాయులు బి
    స్మిల్లా హిర్రహమానన
    ముల్లోకములు పొగుడంగ మూలంబాయెన్ !

    ReplyDelete


  137. సినిమా పైత్యం బెక్కువ
    గనవచ్చెగదా జులాయి గాళ్లందరిలో
    ఘనుడౌ మాచన విశ్లే
    షణలన్ చదువవలెనోయి చక్కని చిలుకా :)

    జిలేబి

    ReplyDelete


  138. మొసలాయె ముసలిగ జిలే
    బి! జాము వేగు దరిగా‌న భీతిల్లగన
    న్నసలే వలదౌ! బండి యి
    రుసులటు నిటు దిప్పి వేయు రొంజుడు లాడన్ :)

    జిలేబి

    ReplyDelete


  139. తనయింటి పేరు మధ్యన
    తన కొప్పదు ఖాళి జాగ, తరుణి జిలేబీ
    వినవే విదురులు నిన్జూ
    చి నేడు కాపీల జేయ చిరుచిరు చిరులే :)

    జిలేబి

    ReplyDelete


  140. బొత్తాముల నొక్క మరిచి
    చిత్తంబు లలర జిలేబి చీర్సు టపానున్
    కొత్తగ వేయ మరిచితిన్,
    చిత్తము, ముదుసలి సమయము చిక్కుల దేల్చెన్ :)

    జిలేబి

    ReplyDelete


  141. హౌ క్యూట్ టపా యిది గదా !
    పెక్యూ లియరు తెలుగోళ్ళు పెద్దచదువుల
    న్నైక్యూ లన్గాంచి తమ య
    నూక్య మగు తెలుగును మరిచి నోడిరి యిలనౌ !

    జిలేబి

    ReplyDelete


  142. ముసలై పోయి మరిచి పో
    యి చల్ల నౌ మజ్జిగ సరి‌ యించితి నయ్యా !
    విసిరెద టపాను మరునా
    డు జిలేబమ్మ‌ కతలెల్ల డుమ్మా గావన్‌ :)

    జిలేబి

    ReplyDelete

  143. అరవం వాడు మొళి ( ఆ ழி అరవానికే సొంతం) అన్నాడు
    ఆంగ్లేయుడు మదర్ టంగ్ అన్నాడు)

    తెలుగు వాడు సంస్కృత పదమైన భాషను అరువు తెచ్చుకున్నాడు!

    భాషను తెలుగులో ఏమందురు ?



    భాషకు సరిపడు తెలుగు పదము లేదు
    యుత్సవము లేల యన్నరో యున్న తెలుపు
    డచ్చ తెనుగున భాషకు ఢంక బేర్చి
    జరుప తగు దినోత్సవముల చక్క గాను

    జిలేబి
    నారదా !

    ReplyDelete

  144. హైకూలు :)



    రోడ్డును
    డివైడు
    చేస్తోంది
    రొష్టు గీర

    **
    బొడ్డు
    అందాన్ని
    తిరగేసె
    బోడి గుండు

    **
    మెట్ల
    పైనించి
    బొమ్మలమ్మి
    తిరిగింది

    *"
    గిట్ల
    రాయి
    హైకూలను
    జిగి జిలేబి‌
    **
    తేటగీతి

    రోడ్డును డివైడు చేస్తోంది రొష్టు గీర
    బొడ్డు అందాన్ని తిరగేసె బోడి గుండు
    మెట్ల పైనించి బొమ్మలమ్మి తిరిగింది
    గిట్ల రాయి హైకూలను జిగి జిలేబి‌

    జిలేబి

    ReplyDelete


  145. పండితోత్తముడను పేరు పడసినాడు
    దేవదేవుని సత్కథల్ తెలిపినాడు
    దాసనారాయణాఖ్యను దనరినాడు
    అట్టి మద్గురువును భక్తి నభినుతింతు !

    శ్రీవేంకటేశ్వర కర్ణామృతము
    సోమయాజుల సూరదాస కవి

    ReplyDelete


  146. ఏమి చేయుదు దినములు నెగిరిపోయె
    నింకనేమౌదునో యను శంకలాయె
    నిన్ను గానక కన్నులు నిలిచి పోయె
    విమలగిరి వాస తిరుపతి వెంకటేశ !

    సోమయాజుల సూరదాస కవి

    ReplyDelete


  147. రాముడవు నీవె శ్రీ బలరాముడవును
    కృష్ణుడవు నీవు శ్రీమహావిష్ణు వీవు
    నీవులేనిది లేదెందు నీరజాక్ష
    విమలగిరి వాస తిరుపతి వెంకటేశ !

    సో సూ దా క

    ReplyDelete


  148. నవరసంబుల కందని నల్ల వాడ
    వెన్ని జేసితివని వ్రాతు నెరుక తోడ
    మూడుకన్నుల వేల్పైన జూడగలడె
    విమలగిరి వాస తిరుపతి వెంకటేశ !

    సో సూ దా క

    ReplyDelete


  149. హరహర శంభో‌ శంకర
    వరహా రంబై జిలేబి వరుసగ జపియిం
    చు రవాళి, చంద్రమశ్శే
    ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్!


    జిలేబి

    ReplyDelete


  150. మందమతి భార్యలు సదా
    తొందర బెట్టుచు రమణుని తోలెదరు సుమీ !
    యిందువదన! పెనిమిటి నీ
    డెందపు రీతి పనిజేయ రెచ్చల యేలన్ :)

    జిలేబి

    ReplyDelete

  151. ఏమండోయ్ లక్కుపేట రౌడీ గారు కుశలమేనా :)
    (మత్తు వదలరా నిద్దుర మత్తు వలదురా :))

    మాలికన నా మనో డై
    రీ లావై టాపు గాంచె రించోళీనన్ :)
    మీ లాజిక్కులు మళ్లీ
    యేలా చిక్కెను జిలేబి యేమరు లేలా :)

    చీర్స్
    జిలేబి
    నారదా !
    బ్రేవ్ ! ( తెలుగు బ్రేవ్ )

    ReplyDelete


  152. నకులము వలె యన్నానిమ
    సు కిరికిరి వలదు జిలేబి సూపరు సుమ్మీ !
    యెకసక మాడుచు కిసిమిసు
    లకుముకి చెకుముకి సురసుర లాడన్నేలా :)

    జిలేబి

    ReplyDelete


  153. వాత్సాయనుడు జిలేబీ
    వాత్సాపై వచ్చెనోయి " వాగేశ్వరు" లా
    దిత్సుల దీర్చన్, వలదే
    వత్సల! మనకసలు వలదు వాత్సాపు సుమా !

    జిలేబి

    ReplyDelete


  154. హరహర శంభో శంకర !



    ఈశాన! శంభు ! ఆనం
    దా! శంకర! శివ ! మహేశ! దహనాంబక! దే
    వేశ! దిగంబర ! ధూర్జటి !
    కాశీనాథా! కపర్ది ! ఖట్వాంగధరా !

    జిలేబి

    ReplyDelete

  155. ఆషా మాషీ కాదోయ్,
    ఆషీమా యేమి చెప్పె ? ఆవిడ చెప్లే :)
    ఘోషలు చేసిరి తెలుగును
    ఘోషా నించి విడుదలకు గోజీ గోష్టీ :)

    ReplyDelete


  156. కందము డెందపు చందము
    చందన గంధము జిలేబి సారము లద్దన్
    నందన వనమున పద్యము
    కెందమ్మియతావి గూడి కెంపులు జేర్చున్

    జిలేబి

    ReplyDelete


  157. ఒళ్లంత బూడిద భయద!
    యిల్లట నౌ వల్లకాడు యీశుడ వంట
    న్నుల్లము పొంగెను దేవా
    చల్లగ చూడుము కపర్ది! శంకర ! శంభో !

    జిలేబి

    ReplyDelete


  158. కొసమెరుపుల సుశ్రీ! కథ
    కసలౌ ట్విస్టు నటు పెట్టి కప్పెట్టగన
    న్నసలైన దొంగను మరి తె
    లుసుకొను టెట్లౌ జిలేబి లుకలుక విననౌ :)


    జిలేబి

    ReplyDelete
  159. సుశ్రీ గారి కొసమెరుపులు బాగుంటాయి. కానీ ఇబ్బందేమిటంటే వారి బ్లాగ్ లో వ్యాఖ్య వ్రాయాలంటే అంత తేలిక కాదండి. Comments on this blog are restricted to team members అని ఓ హెచ్చరిక కామెంట్ బాక్స్ క్రింద కనిపిస్తుంది. ఏవిటో తెలియదు. ప్చ్, మెచ్చుకుంటూ వ్యాఖ్య వ్రాద్దామన్నా మన బోంట్లకు వీలవదు (ఒకప్పుడు వీలయ్యేది; ఇప్పుడెందుకు restrict చేసారో?) 🙁. ఈ feedback ఇద్దామన్నా వారి బ్లాగ్ లో వీలవదు, అందువల్ల మీ బ్లాగ్ లో వ్రాస్తున్నాను (టాపిక్ వచ్చింది కాబట్టి). సరే వారి బ్లాగ్, వారిష్టం అనుకోవడమే 🙏.

    ReplyDelete

  160. ఆ టీం మెంబర్లెవరో ఎప్పుడూ కామెంట్ పెట్టి చూళ్లే :)

    జిలేబి

    ReplyDelete


  161. శరణాగతి నాడి జిలే
    బి రాముని కొలువ మనము సుభిక్షము గనుచున్
    శరపంక్తి తలపులు తొలగి
    మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్

    జిలేబి

    ReplyDelete


  162. రక్తుడు విరక్తుడాయెన్
    శక్తియు శివమును గురువును సాంఖ్యంబవగన్
    భోక్తయు భుక్తము నొకటై
    భక్తుని దైవమ్మె కొలిచి వరముల నందెన్!

    జిలేబి

    ReplyDelete
  163. భక్తి ముదిరి భోంచేసెను
    భుక్తాగ్రేసరుడు నిధులు , పూజలు లేకన్
    శక్తి దొరగి బ్రతిమాలుక
    భక్తుని దైవమ్ము కొలిచి వరముల నందెన్ .

    ReplyDelete

  164. సప్తాశ్వంబుల సారథి,
    తప్త హృదయ మరువపత్ర తత్వంబులన
    న్నాప్తుని యుషోదయముల
    న్వ్యాప్త మహీతలపు చిత్ర వాసక మరువం !

    జిలేబి

    ReplyDelete


  165. అలకేలరా టపానన్
    వలపుల గర్మాగరమ్ము వయ్యారంబౌ
    పలుకుల చూడ తెరచు కొన
    నలతేల కమింటు బాక్సునకటు జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  166. పరుగున వచ్చెడు భాస్కరు
    ని రసమయ పదముల నియమ నిష్టల రీతిన్
    నిరుడు కురిసిన హిమసమూ
    హ రుక్కులవి, లలితమైన హర్మ్యంబగుచున్ !

    జిలేబి

    ReplyDelete


  167. గోజి వారలము జిలేబి, గొప్ప వార
    మమ్మ! విద్వత్తు, లాలిత్య మలక మెరుపు
    శోభయు గలవారము!యొజ్జ సొబగు గాంచు
    బులుసు రామ గోవింద శాస్త్రులు నిజమరి !

    జిలేబి

    ReplyDelete


  168. తాడిగడప కవి రాయా !
    చాడీకత్తియ జిలేబి చార్మీ గాదోయ్ !
    గూఢముగాన పదమునటు
    రూఢింపగ వాడినాను రుబ్బుచు రోలున్ :)

    ReplyDelete


  169. గోజి వారలము లలిత, గొప్ప వార
    మమ్మ! విద్వత్తును, జిలేబి మలక మెరుపు
    శోభయు గలవారము! యొజ్జ, సొబగు గాంచు
    బులుసు రామ గోవింద శాస్త్రులు, నిజమరి !

    జిలేబి

    ReplyDelete


  170. పనిచేయని టెంప్లేటులు
    మన బండన్న వరులకటు మర్షము నేర్పెన్
    పనిలేని జిలేబమ్మటు
    గునగున వచ్చెను డిలీటు గోళీ లాడన్ :)

    జిలేబి

    ReplyDelete


  171. ఇదియొక కవిసమయము విను
    మ! దగు పదములను సమాసమను పేరిట ది
    మ్మదిరుగు రీతిని బేర్చ న
    లు దిక్కులలరంగ వలయు లూటీ పడుచున్ :)


    జిలేబి

    ReplyDelete


  172. ఇదియొక కవిసమ యము విను
    మ! దగు పదములను సమాసమను పేరిట ది
    మ్మదిరుగు రీతిని బేర్చ న
    లు దిక్కు లటు పిక్కటిల్లు లూటీ పడుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  173. అతడు టమోట కథల నా
    ర్ద్రత జొప్పించినటి సుంక రుడు సుశ్రీ ! విం
    త తళుకులను కొసమెరుపుల
    ను తనకథల మలకమెరుపును సవరన గనెన్ !

    జిలేబి

    ReplyDelete


  174. సాధు వసాధువు లనుచున్
    జోదుల రీతి సిగపట్లు జోరుగ గనుచున్
    బాదుడు కవివరులము మే
    మౌ ! దురదలన నిదియేను మౌనులకున్నూ :)

    జిలేబి
    నారదా!

    ReplyDelete


  175. ఏదో భయంబు గాయు
    న్నది బండన్న, విను, మాచనార్యుల పలుకుల్
    ప్రోదిగను, జిలేబీ యే
    దో దావానల మిటులన దోసెలు గనునౌ ! :)

    జిలేబి

    ReplyDelete


  176. తడబాటును కనవేమిర
    యెడబాటునటు గనవేమి యేమని చెప్పన్
    విడనాడకు నను వీడకు
    జడిముద్దుల ఝరి జలజల జవ్వన మురళిన్ :)

    జిలేబి

    ReplyDelete

  177. ఇది యది కాదోయి జిలే
    బి,దీనికిన్ని మరిదానికి, యెరవు గలదే
    యది వేరిది వేరుగదా
    యదియదియే యిది మరి యిది, హమ్ముల గంటిన్ :)

    జిలేబి

    ReplyDelete


  178. హనుమంతుడే కదా ర
    క్ష నూతనత్వము నొసంగ క్షతగాత్రులకున్
    గన యమెరికాకు మనకు
    న్ను నెల్లరకును గల దిక్కు నున్నతి గానన్

    జిలేబి

    ReplyDelete


  179. బ్లాగు గలాటా మొదల
    య్యే! గుండమ్మయిక కిక్కు లేమిచ్చున్ ? స్వా
    మీ! గురువర్యుల గతియే
    మౌ! గుణికి తెలుపుము నాకు మాచన వినతుల్ :)


    జిలేబి

    ReplyDelete


  180. కారెరుపు నాకు నచ్చును
    దోరగ వేయించినవియు దోసిలి గానన్
    మారంగమ్మత్త జిలే
    బీ రహదారిన తెలిపెను బెహతరు గానన్ :)

    జిలేబి

    ReplyDelete