Wednesday, February 22, 2017

మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్ :)


మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్ :)

గత దిన (దివగత :)) తెలుగు మాతృభాషా దిన మహోత్సవ వేడుకల సందర్భం గా, అచ్చ తెనుగు మాచన , హిందీ తెలుగు బండి వారలు జరిపిన "పాటల్ రాయ గలరా జిలేబి" అన్న చాలెంజ్ గీతా సారము గ్రహించి , జిలేబి చేసిన చిరు 'అల్ ఇన్ తెలుగు' పాట !

అరవం వాడు తమిళ్ (ழ) మొళి (ழி) అని వాడి సొంత మైన ఒక అక్షరాన్ని పేర్చి  అందంగా తనదైన తమిళం లోను , 'భాష' కున్ను అద్దేసు కున్నాడు ఎవ్వరూ చెయ్యలేని విధంగా.

ఆంగ్లం వాడేమో ముచ్చట గా మదర్ టంగ్ అని అనేసుకున్నాడు.

తెలుగు వాడు ఆరేసుకో బోయి మాతృభాష అన్న సంస్కృత భూయిష్ట మైన పదాన్ని అరువు తెచ్చేసు కున్నాడు.

భాషను అచ్చ తెనుగులో ఏమందురు ? అనెడి నారదోపాసన తో నేటి జిలేబి 'ఆల్ ఇన్ తెలుగు పాట; దీనికి మూలం అరవం పాట అని చెప్పాల్సిన అవసరం లేదను కుంటా :)

****

గూగుల్ గూగుల్ చేసి చూసా
వీడి లాంటి పుల్లాయ్  పుట్టిందే లేదూ !
యాహూ యాహూ చేసి చూసా
ఎక్కడాను వేరోక్కడు దొరక లేదూ
 
డేటింగ్ అంటే వాచీ చూసి ఓకే చెప్తాడే
షాపింగ్ అంటే ఈబేయ్ లో కుదేస్తాడే 
మూవీ అంటే యూట్యూబ్ అండ్  పాప్కార్న్ అంటాడే
చూస్తే వీడూ అయ్యో పాపం అమ్మేస్తడే ఊర్కే ఊర్నే
 
మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్
మై స్మార్ట్ అండ్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్
మై స్మార్ట్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
 
గూగుల్ గూగుల్ చేసి చూసా
వీడి లాంటి బడుద్దాయ్ పుట్టిందే లేదూ !
యాహూ యాహూ చేసి చూసా
ఏ గ్రహము లోనూ వేరొకడు దొరకలే

వీడి డేటింగ్ డిన్నర్ కెళ్తే స్టార్టర్ నేనే లే
తనతో షాపింగ్ కెళ్తే హ్యాపీ  ట్రాలీ నేనేలే
మూవీ కెళ్తే కన్నీళ్ళ సీన్ కర్చీఫ్ ఔతాలే
చూట్టానికి ఇలా ఉంటాడే కాని ఆలా అలా
 
మీట్ మై మీట్ మై గార్ల్  ఫ్రెండ్
మై హాట్ అండ్ స్పైసీ గార్ల్  ఫ్రెండ్
మీట్ మై మీట్ మై గార్ల్  ఫ్రెండ్
సో హాట్ అండ్ స్పైసీ గార్ల్ ఫ్రెండ్
 
హే గైస్ మై గార్ల్స్ ఇంట్రో టైం
యిది ఎవత్తో చెబ్తా విన్కో
దూదిపింజ అంటే పంజా విసురుద్ది
హెల్మెట్ వేస్కో   సేఫ్టీ సేఫ్టీ
హే షుగర్ ఫ్రీ, హే హే హే
హే షుగర్ ఫ్రీ పలికితే స్వీటూ
దీని ఫేట్ ఫ్రీ ఒంట్లో టన్స్ ఆఫ్ ఫేటూ
నవ్వితే నగ్మా కసిగా చూస్తే కాష్మోరా
అందానికి తనే ఫార్ములా ఐ లవ్యూ డా :)
 
హే కమాన్ గర్ల్స్ ఇట్స్ ఇంట్రో టైం
వీడెవడో చెబ్తా చూస్కో

హేండ్ షేక్ చేస్తే అమ్మాయిల్ వస్తారే
బులెట్ లా ఆమడ దూరం దూస్కెళ్తాడే
మిలట్రీ కటింగ్ స్టైల్ ఓ మిల్లీ మీటర్ స్మైల్
ఆల్మోస్ట్ ఎవరే ఊర్లో ఎవరే
వీడిలా వీడిలా గుడ్డీ గుడ్డీ గుడ్డీ 
 
మీట్ మై  మీట్ మై బాయ్ ఫ్రెండ్
మై స్మార్ట్ అండ్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్
మై స్మార్ట్ అండ్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
 
నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోడే
నా స్టేటస్ మార్చమని పోరెట్టడే
దాపుకొచ్చి హాయ్ అంటే ట్విట్టర్ లో తల పెట్టేస్తాడే
ఇస్తాడే స్వీట్ కిస్సూ సైడ్ లో ట్వీటూ 
రోమాన్స్ కొంచెం, థ్రిల్లర్ కొంచెం
గాలిలో తేలేను మై మై మదియేను
 
తను ఓహో తను ఓహో తను ఓహో ఇదీ ఓహో !
దాని సెల్ఫోన్ రెంట్లోనూ కాల్సే కాల్సూ
బాక్అప్ బాయ్ ఫ్రెండ్స్ ఫోర్ అండ్ ఫోరూ
గొంతంతా అసూయా పేరేమో అనసూయా
నా కేమో ఇస్తుందీ జిలేబీల్  యా :)

అమ్మాయిల నంబర్ నా ఫోన్లో చూస్తే
సైలంట్ గా గోకేస్తుందీ  రాకీస్తూంది పీకేస్తుందే
టౌన్ ని ఫ్రీ సైట్ కొడితే దుమారం లేపేస్తాదీ
లిమిట్  కిక్కూ లిమిటెడ్ ఫైరు
నా గుండె డబ్ డబ్ డబ్ డబ్
 
మీట్ మై మీట్ మై గార్ల్  ఫ్రెండ్
మై హాట్ అండ్ స్పైసీ గార్ల్  ఫ్రెండ్
మీట్ మై మీట్ మై గార్ల్  ఫ్రెండ్
సో హాట్ అండ్ స్పైసీ గార్ల్ ఫ్రెండ్
 
గూగుల్ గూగుల్ చేసి చూసా
వీడి లాంటి పుల్లాయ్  పుట్టిందే లేదూ !
యాహూ యాహూ చేసి చూసా
ఎక్కడాను వేరోక్కడు దొరక లేదూ
 
డేటింగ్ అంటే వాచీ చూసి ఓకే చెప్తాడే
షాపింగ్ అంటే ఈబేయ్ లో కుదేస్తాడే 
మూవీ అంటే యూట్యూబ్ అండ్  పాప్కార్న్ అంటాడే
చూస్తే వీడూ అయ్యో పాపం అమ్మేస్తడే ఊర్కే ఊర్నే
మీట్ మై  మీట్ మై బాయ్ ఫ్రెండ్

మై స్మార్ట్ అండ్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్
మై స్మార్ట్ అండ్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
 
 
చీర్స్
జిలేబి
పరార్ నారదా!
అం కిం టం :)
బండన్న మాచన్న వారలకు  
 
 
 

48 comments:

  1. ఓలమ్మ ఓలమ్మ ఆ పెద్దాయన ఇనుకోకుండా, అనుకోకుండా గీకి గోకీసినాడు.
    పైగా ఆయమ్మసలే సాఫ్టూ అనుండే, ఇప్పుడాయమ్మ తానా బాయ్ఫ్రెండ్ నేసుకొచ్చింది, హాట్ అండ్ సెక్సీ రుక్సానాగా. మనమైతే ఏదో రత్తాలు ముత్యాలతో సర్దీసుకునుండీ వాల్లం. ఇప్పుడేటైనది! సిరిగి సాటైనది. పెరిగి పాటైనది. బారెడు ఊటైనది. అక్కడికీ నాను సెప్పీసినాను ఆయమ్మ బొత్తం నొక్కేసుద్దని. మరదే! ఇనుకుంటేనా!? బొత్తం పెట్టీసినాది, నొక్కీసినాది, ఇసిరీసినాది. ఇకిద్గిదీ!
    :) __/\__ ...

    ReplyDelete
    Replies

    1. బండి వారు,
      పజ్జాలైపోనాయా! పాటల్లో దిగిపోనారూ

      ''సిరిగి సాటైనది.
      పెరిగి పాటైనది.
      బారెడు ఊటైనది.
      అక్కడికీ నాను సెప్పీసినాను ఆయమ్మ బొత్తం నొక్కేసుద్దని. మరదే! ఇనుకుంటేనా!? బొత్తం పెట్టీసినాది, నొక్కీసినాది, ఇసిరీసినాది. ఇకిద్గిదీ!''

      Delete
  2. పజ్జం ముదిరి పాటయినట్లుంది శర్మ గారు 😀.
    మరోసారి బండివారి ఐడెంటిటీ బట్టబయలు. వారు ఉత్తరాంధ్రులని తెలిసిపోయింది 😀.

    ReplyDelete
    Replies
    1. ఇది ముదిరి మరేం కాకుండా ఉంటే అదే పదివేలు :)

      Delete
  3. మొత్తానికి పాట వ్రాసి ఛాలెంజ్ కి సమాధానం ఇచ్చిన "జిలేబి" గారికి అభినందనలు. Atta lady 👏.

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారంటే ఏమనుకున్నారు, ఇలా ఛాలెంజీలు విసిర్తే అలా దిగుతారు రంగంలోకి అదీ సంగతి :)

      Delete
    2. ఔను గురూ గారూ,
      నేను ఉత్త ఆంద్రుణ్ణే. మాది
      కిష్ణా సీక్కులం దగ్గిరి.
      :)

      Delete
    3. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ."ఉత్త ఆంధ్రుడు" ఎలా అవుతాడు స్వామీ? మొత్తానికి మీది కూడా మన కిష్ట్నా యే నన్నమాట. బాగుంది 👍.

      Delete

    4. విన్న కోట వారు

      Atta lady అంటే ఏమిటండీ ?

      జిలేబి

      Delete
    5. నా ఇంటిపేరు విడగొట్టనంటే చెబుతాను (అయినా అర్ధం మీకు తెలియదనుకొమ్మంటారా!) ☝️🙂.

      Delete

    6. మీ ఇంటి పేరు విన్నకోట కాదూ? విడగొట్టనంటే ఎప్పుడయ్యిందండీ ?

      జిలేబి

      Delete
    7. విన్నకోట నరసింహా రావుగారు,
      Atta lady
      నిజంగానే తెలియదు,చెబుదురూ!

      Delete
    8. అభినందన, మెచ్చుకోలు, ప్రోత్సాహం తెలియజేసే వ్యావహారిక పదం, శర్మ గారు. సాధారణంగా (చిన్నవారిని) atta boy, atta girl అంటారు. జిలేబి గారు ఛాలెంజ్ కి సై అని వెంటనే పాట కట్టి చూపించారు కదా. మెచ్చుకోవాలిగా. అయితే వారిని ఇంకా girl అంటే గౌరవానికి తగినట్లుండదని నా సొంత కవిత్వం వాడి atta lady అనే పదం తయారుచేసానన్నమాట 🙂.

      Delete


    9. హి దటీజ్ ది లేడి ! యూనో!
      హి దేర్ షి గోస్!యట్ట లేడి! హీ దట్జ్ హర్ ! యై
      సీ ! దేర్ ద డెవిల్ గోస్ ఓహ్ !
      దేర్ దేర్ షీ గోస్ ! జిలేబి దైనేమ్ లేడీ !

      జిలేబి

      Delete
    10. మరచితిని శర్మ గారు. atta girl పూర్తి రూపం "that's a good girl". ఇది కాలానుక్రమంగా "that a girl" అయ్యి దాన్నుంచి "attagirl" అయ్యింది(ట). అలాగే attaboy కూడా. దాన్ని అనుసరించి జిలేబి గారి గురించి నేను attalady పదం తయారుచేశాను (పాత "మాయాబజార్" సినిమాలో ఘటోత్కచుడి స్ఫూర్తితో 🙂).
      తనకు తెలిసుండి కూడా ఆ పదానికి అర్ధం ఏమిటని జిలేబి గారు సరదాకి అడిగారని నాకు తెలుసు. ఇప్పుడే తను ఓ పద్యం కట్టేసి దాంట్లో "దటీజ్ ది లేడి" అని తనే అన్నారు చూశారుగా 🙂. ఎంతైనా well-read వ్యక్తి గారు కదా.

      Delete
    11. మీ మాట ముత్యాల మూట.అర్ధం తెలుసుకున్నా! కొత్త మాట పుట్టించారనమాట. అమ్మవారివి బహు చిన్నెలు

      Delete
    12. అట్టి లేడీ బట్టుక ఆట్టాలేడీ యని తలపెట్టుచు, యన బట్టుచు తాడట్టుక సాకెట్టు నటు
      నిట్టు లూపి తల తట్టి ఆ బొట్టిని రేపెట్టుట ఏ మట్టుకు పై మెట్టుకు గురువా!
      గట్టిగ ఊకొట్టి చిట్టి తానొప్పుననియా మీ మట్టుకు సందియము! వలదు, ఒట్టేసి చెప్పెద ఓ
      బొట్టెట్టుక జుట్టారబోసి చూపెట్టు నమ్మ(డు) విరాట్టు రూపు, నమ్ముడు యొజ్జా! హైసర బజ్జా!

      :) లోల/గోల ...

      Delete


  4. షాకోలాడెవలెన్ కమాలు గనుచున్ షాకింగు లైకింగులన్
    మీ కోసం గనవచ్చెనయ్య భళి రా మాగాయ రించోళి గ
    న్నాకాశంబున భాస్కరుండు భువిలోనౌ బండి రావుల్ జిలే
    బీ కోటల్ గన రండునేడు కవితై బీటుల్సు పాటల్సు లై
    :)

    జిలేబి

    ReplyDelete
  5. అమ్మ పాట రాసి అంకిత మిచ్చిరి
    బండి రావు గార్కి భాస్కరులకు
    కృతికి బహుమ తిచ్చు కతలున్న వరయుడు
    ఘనముగా నొసంగ గలరు గాత !

    ReplyDelete
    Replies
    1. మూన్నాళ్లన్నా లేదు ఆ సంబడం!
      చంద్రిక గారు ఆ ముచ్చటేదో చెప్పేశారుగా!
      https://www.youtube.com/watch?v=cZOCZuChyfU
      అవ్వ అవ్వ ! అవ్వ దింత మోసమా !?
      ఆ మధ్య కేంద్రం మీద అలకొచ్చి అందరిలో
      కొందరు అవార్డులు విసిరేసినట్లు నేను కూడా
      బహుమతి కృతిని వెనక్కు ...
      హవ్వా !!! అవ్వా !!!!
      :) లోల్ ... అ ... అ ...
      ( (pk స్టైల్) ...

      Delete
    2. అవును - అవ్వ! అంతే మోసం - మోసమంతే. ఇక్కడ తమిళ-మూలపు లిరిక్స్ వున్నవి చూడుడి - https://www.youtube.com/watch?v=gO_z94SFhL8

      Delete
    3. అయ్యో !
      అమ్మా పొరబడితిని. రిఫరెన్స్ న మీ పేరుకు బదులుగా చంద్రిక గారి
      పేరును ప్రస్తావించాను. ఇరువురూ ఆ నా స్థితికి మన్నించగలరు.

      అవును గాక అవును. మోసమంతే. మీరు మోసకారనుక్కు
      మోసక్కారన్ వేషం గట్టి కృష్ణ గారిలా విషయం బయట పెట్టకుంటే ఆవిడ
      నాన్-మోసక్కారన్ గానే చలామణీ అయి ఉండేవారు. మీకు జేజేలు.
      కొలవెరి కొలవెరి ఢీ ...
      (అర్ధం మాత్రం అడగొద్దు)...
      :)

      Delete

    4. బండి రావు గారికి

      చంద్రిక యిచ్చిన లింకు అని లలిత గారి లింకు నిచ్చి ఆ తెలుగు వెర్షన్ పాట తెలిపినందులకు నెనర్లు !

      నేను రాసింది ఎనభై శాతం సినిమా వారి ఒరిజినల్ లో ఉండటం చూసి నాకు ముచ్చటేసింది -/అబ్బ మనం కూడా రీటైర్డు బండే ( బండ కాదు బండియే) కదా బండి వారలా ఒక పాటల్స్ పచారీ కొట్టు పెట్టుకుని బతికేయొచ్చు అన్న ధీమా వచ్చేసే !

      నా వరకైతే కొన్ని నా లైన్సే సినిమా వారికన్నా బాగుండే యనిపించే :) ( సెహబాష్ జిలేబి :))


      చీర్స్
      జిలేబి

      Delete
    5. అమ్మా నవ్వుల పెద్దమ్మా గారూ,
      మీ నిరంతర ప్రచురణా వనర్లకు నెనర్లు.
      అప్కోర్స్ వాట్ల ఓనర్లు మీరేననుకోండి(!?)
      "ఎనభై శాతం సినిమా వారి ఒరిజినల్ లో ఉండటం చూసి ..."
      కాపీ రైట్ చట్టం మీ వేపే ఉంది. వేసెయ్యండో "లిట్గా" (ఇప్పుడే ఓ
      కొత్త పదం "లిటిగేషన్ కేసు" కు షార్ట్ కట్ గా కనిపెట్టా (ఝట్కా
      లాగన్న మాట) = మిగిలిన ఫార్మాలిటీ చూడగలరు).
      పచారీ కొట్టుకు స్వాగతం.
      మీ లైన్సే సినిమా వారి కన్నా బాగున్నాయేమోనన్న
      ఆనందం లో మేం కూడా తల దూరుస్తున్నాం. తలలో
      దూరుస్తున్నాం. ఎందుకంటే మాకు అరవం రాదుగా...!!
      మీరేం చెబితే మాకదే తెలుగు వెలుగు.
      :)

      Delete


    6. అమ్మా! నవ్వుల గని ! పె
      ద్దమ్మా! వలదే జిలేబి దడదడ లాడె
      న్నమ్మా మా గుండియలిట
      బామ్మా వలదే పదముల బాదుళ్ళికనౌ :)

      జిలేబొ

      Delete


  6. పాటల్లో దిగి పోయెనే మన జిలేబమ్మా ! షకీలా వలెన్
    ఘాటైపోయెను గాద దుండి పలుకుల్ గప్సాలు గప్పాలనన్
    ఝాటీ తిప్పి తుపాకి కుర్ర తనమున్ సారించె బండీశ ! తా
    తా టాటా యని పోదుమయ్య మనమంతా సాగిపోదామయా

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  7. జిలేబి గారు, మీది కూడ బెంగళూరే అనుకుంటాను.
    కన్నడలో "జిలేబి" అని సినిమా వస్తోంది, HOT & SWEET అనే ఉప శీర్షికతో..

    ReplyDelete
    Replies

    1. ఏమండోయ్ బోనగిరి గారు

      When its Hot its Really Cool :)

      మా టాగ్ లైన్ కాపీ కొట్టేసేరండీ వాళ్ళు

      జేకే !

      I think even before Kannada malayalam guys had జిలేబి movie

      I was told professor Brahmanandam garu in some Telugu film had name as జిలేబి‌ ( Don't know how far true)

      Cheers

      Delete
  8. మీ ఈ 'ఆల్ ఇన్ తెలుగుపాట' కి మూలమైన అరవం పాట ఏంటండి?

    ReplyDelete
    Replies

    1. లలిత గారు

      கூகுல் கூகுல் பண்ணி பார்த்தேன் ...

      జిలేబి

      Delete
    2. మీ జవాబు అన్యాయం కదా జిలేబి గారు☝️. మీలో కొంటెతనం ఎక్కువే.

      Delete
    3. https://www.youtube.com/watch?v=gO_z94SFhL8

      :)

      Delete

    4. థాంక్సండి లలిత గారు

      మంచి వీడియో లింకిచ్చారు :)

      జిలేబి

      Delete
    5. ఈ వయసులోనే జిలేబి గారు ఇంత కొంటె గా ఉన్నారంటే కాలేజీ లో చదివే రోజుల్లో ఎలా ఉండేవారో :)

      Delete
    6. మంచి ప్రశ్న 👌. తన కాలేజ్ మేట్స్ ని ఓ ఆట ఆడించేసుంటారు 😀. (jk)

      Delete
    7. మనస్తత్త్వ రీత్యా ఉత్తి సిగ్గరి, ఎదుటపడితే మాట్లాడడానికి నోరు కూడా పెగలని మనిషి. :)
      ఇదంతా నెట్టు మాటే,ఎదుటపడితే ఉట్టి మాటే

      Delete
    8. కట్టెదుట నోరు పెగలని
      చుట్టంబట ! శర్మగారు చూచిరట ! యిటన్
      ' నెట్టు 'పగుల గీపెట్టుట
      జట్టుకు జగజెట్టి యగుట ' సంబడ ' మేనా !

      Delete

    9. శర్మగారు

      -~~~ మనస్తత్త్వ రీత్యా ఉత్తి సిగ్గరి :)

      పాపం కర్ణుడు :)

      జిలేబి

      Delete

    10. రాజారావు గారు

      నెనర్లు ! శర్మగారిని ఆల్రెడీ కలిసి ఉన్నా గత మూడు సంవత్సరాల లో రెండు మార్లు ; కాని కలిసింది నేనే నని ఆయనకు తెలియదు :)


      నారద జిలేబి

      Delete
    11. <"శర్మగారిని ఆల్రెడీ కలిసి ఉన్నా గత మూడు సంవత్సరాల లో రెండు మార్లు ; కాని కలిసింది నేనే నని ఆయనకు తెలియదు :) "
      --------------- విన్నారా శర్మ గారు? దీన్ని బట్టే తెలుస్తోంది జిలేబి గారు మీరన్నట్లు "ఉత్త సిగ్గరి" అని. మిమ్మల్ని కలిసినప్పుడు తనే జిలేబి యని చెప్పడానికి సిగ్గు పడ్డారని అనుకోవాలి కదా 🙂.

      Delete

    12. ఓ ! అట్లా ఒక ప్రాబ్లెమ్ ఉందన్నమాట ! కాలికేస్తే మెడకేస్తారండీ విన్న కోట వారు మీరు

      జిలేబి

      Delete
    13. విన్నకోట నరసింహా రావు గారు,వెంకట రాజారావు . లక్కాకులగారు
      అమ్మవారి లీలలు ఏమని వర్ణించనూ :)
      ఎదురుబడితె నోరు పెగలదాయె,
      పలుకే బంగారమాయె,
      దీనినేమందురు తిరుమలేశ
      ధన్యవాదాలు.

      Delete
    14. జిలేబి గారు,
      ''-~~~ మనస్తత్త్వ రీత్యా ఉత్తి సిగ్గరి :)

      పాపం కర్ణుడు :)

      జిలేబి''
      పోలిక దుష్టుగానున్నదే !

      Delete
    15. ఇక్కడ' పాపం కర్ణుడు:) ' = సౌండింజనీర్ అని ధ్వనిస్తోందండీ !

      Delete
    16. "... తనే జిలేబి యని చెప్పడానికి సిగ్గు పడ్డారని ..."

      అలా ఎందుకనుకోవాలి విన్నకోట వారూ! చెబితే
      గురువు గారే సిగ్గు పడతారేమో అని ఆవిడ యొక్క
      సదుద్దేశ్యం అయి ఉండవచ్చు గదా!
      'బెనిఫిట్ అఫ్ డౌట్' ఆవిడకే ...
      ఇవ్వొచ్చు ... గా!?
      :)

      Delete
    17. "మనస్తత్త్వ రీత్యా ఉత్తి సిగ్గరి, ఎదుటపడితే
      మాట్లాడడానికి నోరు కూడా పెగలని మనిషి. :)
      ఇదంతా నెట్టు మాటే,ఎదుటపడితే ఉట్టి మాటే" ...

      ఇదేదో గట్టి మాటలానే ఉంది. తిట్టు మాటా!?
      పోనీ పెట్టు (knittu) మాట గానీనా!?
      తెలియడం లేదు గురువు గారూ ... !!!?
      (బుర్ర గోక్కునే ఈమోజీ ని ప్రసాదించగలరు)
      :) jf

      Delete
  9. " అలా ఎందుకనుకోవాలి విన్నకోట వారూ! "
    ----------
    You are a chivalrous man, బండి వారూ 👏.

    ReplyDelete