Sunday, February 26, 2017

మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిలయే సుమా




మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిలయే సుమా
 
మెత్తగానిట మెత్తగానిట మేలురీతిని గాంచితిన్
పొత్తమేలర పొద్దుగూకుల పొత్తుగానుర మంచిదే
చిత్తరీతిని రాయరాయగ చేర్పుగూర్తురు కోవిదుల్ !
మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిలయే సుమా



చీర్స్
జిలేబి





113 comments:



  1. పాయసమ్మును తీయగానటు పాయబారుచు గానవే
    సోయగమ్ముల శబ్దమెల్లను సోకులాడుచు వచ్చునే
    వేయవేయను వేణి యుల్లము వేడిగానుచు దోచునే
    వాయుభుక్నకులమ్ము రీతిని వాదులాటలు మానవే :)

    జిలేబి

    ReplyDelete


  2. సేరిగాడిటువచ్చు తీరుగ సేద్యముల్గన రయ్యనన్,
    దోరగించి శుభాంగి చూడక దోచుకొమ్మ జిలేబి, నే
    డే రసమ్ము లతాంగి గాంచెను రెండుకాయల కూడికై
    బీరతీగకుఁగాచె మెండుగ బెండకాయలు చూడుమా !


    జిలేబి

    ReplyDelete


  3. దేవభాషను నేర్వగోరెను జేసుదాసుడు గానవే
    భావగీతము రాగతాళము పక్కపక్కల బోవునే
    చేవజేర్చును మేలుగూర్చును చెంతజేరగ వెంటనే
    జావళింపుల జాజిమల్లియ జక్కగానిట నేర్వవే !

    జిలేబి

    ReplyDelete

  4. షావుకారు గుమాస్తగానటు సాగరమ్మున దేలితీ
    జీవితమ్మున నేర్చుకొంటిని జీవగర్రల నెన్నియో
    రావుగార్లట సాహచర్యము రాటుదేల్చగ, భోగినీ
    భావమెల్లెడ మేలుజేయు సుభాషితమ్ముల గాంచితీ !

    జిలేబి

    ReplyDelete


  5. రెండువందల మత్తకోకిల రేసుగానుచు జేయవే
    బండిబాటన చక్కగానగ భావమెల్లను గూర్చవే
    గుండెమాటున దాయగానవి గూడిరావలె నేయిట
    న్నండదండగ గావుమమ్మిట నందయంతివి గావవే !


    జిలేబి

    ReplyDelete


  6. శిల్పిగోరెను స్కార్ఫు మోడిని చింతలేకయు పంపెనౌ
    సెల్ఫితీసెను యమ్మణీ తన ట్విట్టరందున ట్వీటులౌ
    కుల్ఫిగానటు లైకులెల్లరు గుండుగుండుగ జేసిరౌ
    వేల్పుగానటు యాదియోగియు వేణువాదుడు మోడియౌ


    జిలేబి

    ReplyDelete


  7. జీవభాషను ముచ్చటించుచు జీరబోయెను గాదుటే
    యావటంబగు రీతిగాంచుచు యాసలన్నియు నేర్చనే
    మావగారటు మేలుజూచిరి మంచియత్తయు గాదుటే
    మావితానము కార్యమొప్పగ మాకులంబులు యడ్డహో !

    జిలేబి

    ReplyDelete


  8. బండిబాటన పాట చూడగ భక్కు భక్కు మనేనుగా
    గుండెనిండిన యేకగీతము డ్యూయెటాయె భళాభళా !
    పిండివేయగ రొట్టెదేలెను బీటుగానుచు మేళమూ
    గుండుగుండుగ మత్తగీతము గూడ్సుబండిగ వచ్చెనౌ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పిండి రొట్టయ్యిందంటారు!
      బండి గూడ్సయ్యిందంటారు!
      ఈ గండు మేళం బీటెంటబ్బా!!!
      (దయతో బుర్ర గోక్కునే ఇమోజీ
      ఎక్కడ దొరుకునో చెప్పగలరు...)
      :)

      Delete


  9. సోమవారము యట్టెబోయెను సోకులమ్మియు జూడగా
    రామబాణము సాగిపోయెను రాశికన్నియ లాటగా
    జామురేతిరి జాజిమల్లియ జాగురూకత కోరెనౌ
    సాములోరికి సాగరానికి సాహసమ్మటు వచ్చెనౌ :)

    జిలేబి

    ReplyDelete


  10. చెప్పలేముగదా!జిలేబి కచేరి బెట్టుచు గిచ్చునో !
    గుప్పుగుప్పని గుండుమామియు గుచ్చునోమరి పద్యమున్
    డప్పుడప్పుల గొట్టితానిట డాముడామని బేల్చునో!
    చప్పుడేమియు జేయకుండగ చల్లగాను పరారహో !

    జిలేబి

    ReplyDelete

  11. గొంతునచ్చగ మాటలాడెను గోడులన్నియు ఊసులౌ !
    చెంతబోవగ తానుగాంచెను చెంగుచెంగని కౌముదిన్
    కొంతగాదుర నెంతయేనియు కోమలమ్ములు లేనిదౌ
    వింతగానుడు జంటగట్టెను వీరిగాడికి బామ్మయౌ !

    ReplyDelete


  12. జోగిజోగియు పొత్తుగాంచిరి జోరుగానొక బ్లాగులో
    వేగవేగముగా యనామక వేడిగానొక వ్యాఖ్యనౌ
    సాగదీసెను దిక్కుమాలిన సామెతన్నట వేయుచున్
    పారుడొచ్చిరి పట్టిగొట్టిరి పళ్ళుబోయె యనామకా :)


    జిలేబి

    ReplyDelete


  13. గోగుపువ్వుల కొంటెచూపుల గోవమీఱెడి కోటరీ!
    మేఘమాలిక తాకగానట మేనిజల్లన మారెనౌ
    సాగరమ్మున సాగిపోవుచు సాధనమ్మును జేయుచున్
    రాగయుక్తపు పద్మమాలిక రాగమాలిక గూర్చెనౌ :)

    జిలేబి

    ReplyDelete


  14. తే, టమాటను తెమ్మనిచ్చట తేరగానిక రాగనౌ
    ఘాటుఘాటుగ చారుకాచగ కమ్మగాను రుచించుచున్
    మేటిగానగు వత్తురిచ్చట మెచ్చరెల్లరు నిన్నహో
    బాటబోవుచు జూడగానిట బాగుగాను జిలేబినిన్ !

    జిలేబి

    ReplyDelete

  15. మంచిలౌక్యులు శర్మగారును మాటయాయువు సత్యమే
    యంచునాడెను విన్నకోటకు యర్థమాయెను సామెతై
    కొంచమేనియు బుట్టలోబడ కుండబోయెను గాదుటే
    పంచచేరుచు నేర్వగానగు పాఠమెల్ల జిలేబి బో :)

    జిలేబి

    ReplyDelete


  16. పొర్లుదండము గుజ్జువేలుపు బొజ్జదేవ వినాయకా !
    యర్లమర్లన చేరినానిట యయ్యవార్ల సమూహమున్
    సర్లిగానగ గావుమమ్ముల చక్కగానగ పద్యముల్
    యిర్లగొంగడి కంటెముందర యిచ్చగానగ వత్తు నే :)

    జిలేబి

    ReplyDelete


  17. బ్యాంకువైపున చూడబోకుర ఫైనులంచును వేతురౌ
    సుంకమెల్లను గట్టిగానటు సుర్రుసుర్రన వచ్చునౌ
    యంకతంత్రము యేమితెల్వని యంపబంపుల బిల్లుల
    న్నింకజూచిన గుండెజల్లను నింగిముట్టును బ్లడ్ప్రెషర్ :)

    జిలేబ్

    ReplyDelete
    Replies
    1. WhatsApp లో తిరుగుతున్న ఓ కార్టూన్ (హిందీలో ఉంది):-

      बैंक में पडे़ पैसे
      को याद भी किया
      तो स्मरण टैक्स
      लगेगा ।

      స్వేచ్ఛానువాదం :-
      బ్యాంక్ లో ఉన్న నీ డబ్బు గురించి తలుచుకున్నావంటే కూడా "స్మరణ రుసుము" పడుతుంది.
      😀😀😀😀 హాస్యంలా అనిపిస్తోంది కానీ దురదృష్టకర ధోరణి. పబ్లిక్ రంగంలో కూడా కార్పొరేట్ ఆలోచనా విధానమా? 😡. పాత "తోడికోడళ్ళు" సినిమాలో "టౌను పక్కకెళ్ళద్దురో డింగరీ" పాట అలవరసలో "బ్యాంక్ పక్కకెళ్ళద్దురో డింగరీ" అని పాట కట్టుకోవాలేమో! (nmrao bandi గారేమన్నా ప్రయత్నించగలరేమో? 🙂

      Delete


    2. యస్య స్మరణ మాత్రేన జనమ్ ధనమ్నాత్ విముచ్యతే :)

      జిలేబి

      Delete
    3. గురువు గారూ మీరలా అన్నాకా ...
      ఇదిగో ... ఇలా ...
      http://nmraobandi.blogspot.in/2017/03/bank-charges.html

      :)

      Delete
    4. పని తప్పక జరగడానికి ఎవరి మీద భరోసా పెట్టుకోవాలో తెలుసండి - ఉద్యోగంలో నేర్చుకున్నాం 🙂. అయితే మీరు ఇంత వేగంగా డెలివరీ ఇవ్వడం మరింత సంతోషం. పాట చూశాను, చాలా బాగా కుదిరింది 👍. మాట నిలబెట్టినందుకు డబల్ థాంక్స్ 🙏.

      Delete


  18. https://youtu.be/lizzQ2v_V3o


    అబ్బురమ్ముగ యోరుగల్లున నామ్రపాలి జిలేబి మా
    సుబ్బులక్ష్మి కలెక్టరమ్మగ శోభగాంచెను జూడ నో
    రబ్బ చప్పున గుర్తుకొచ్చెను రాహుకాలము బోయెనౌ
    పబ్బ మీ దినమమ్మ మేలగు పల్లవోష్ఠుల కెల్లనున్ !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "సుబ్బులక్ష్మి" కి ఇంకా కుర్రతనం వదిలినట్లు లేదు 🙂.

      Delete
  19. మీకు 'వేడి టీ' దొరికినట్లు లేదే పాపం ! 😉

    ReplyDelete
    Replies

    1. విన్నకోట వారు

      నేటికి హాట్ హాట్ జిలేబి యే :)

      త్వరలోనే హాట్ హాట్ చాయ్ పే చర్చా ;)


      జిలేబి

      Delete
    2. చాయ్ పే చర్చా
      యా
      కాఫీ పే కామెంటా
      యా
      జిలేబీ పే ఝగడా
      యా

      ఇట్లు,
      బాగ్ పే బెకబెకానంద.

      Delete


  20. సూర్యయంత్రము వేసిరచ్చట స్తోత్రమెల్లను జెప్పుచు
    న్నార్యులెల్లరు గూడిరచ్చట నాదగానము జేయ నా
    చార్యులెల్లరు చాలచక్కగ సామవేదము జెప్పగన్
    కార్యకర్తలు జూడముచ్చట గట్టి భాగ్యము గాంచిరౌ !


    జిలేబి

    ReplyDelete


  21. వేడివేడిగ టీనిగానక వేగమెల్లను బోయెనౌ
    మోడియిచ్చును కిక్కుజేర్చుచు ముందురోజుల గాననౌ
    జోడుగాంచిన జోడుకుంకలు జోకరవ్వగ బోదురో
    జాడుఝాటిగ జామ్నగర్నకు జక్కబోయని ద్రోలురో !

    జిలేబి

    ReplyDelete


  22. చాయి తాగుచు చక్కగానటు చర్చజేయుచు తూగగన్
    మాయతో సిరిలేనివాసుడు మామిగానగ వచ్చెనౌ
    సోయగమ్ము జిలేబిలూరెడి సుబ్బులక్ష్మియు గాంచెనౌ
    వాయువేగము గానుతానటు వృత్తమొక్కటి బేర్చెనౌ :)

    జిలేబి

    ReplyDelete


  23. ప్రశ్న చిన్నది మా జవాబగు పద్దుపొత్తము మిత్రమా
    పృశ్నికాంతుల నేర్వమేలగు పట్టుబట్టుచు పొద్దుల
    న్నస్నసాయము గాంచిమీరటు నాడిమంత్ర నిగూఢమున్
    పృశ్నులచ్చట గూడివత్తురు పాఠమెల్లను నేర్పగన్ !

    జిలేబి

    ReplyDelete


  24. స్మార్టుఫోనవుతాను నేనిక సాహచర్యము జేయగన్
    హార్టులేకను బోయిరమ్మయు నాన్నలున్ను జిలేబులై
    పార్టుపార్టుగ వాట్సపుల్లన బాతఖానియు జేయుచు
    న్నర్టిగానుచు జీవితమ్మున నచ్చికమ్ములు గానుచున్ !


    జిలేబి

    ReplyDelete


  25. పంగనామము దీక్షగానటు భక్తులయ్యిరి నేటికిన్
    బెంగతీరగ రాష్ట్రమందున బెష్టుగాన రిజల్టులన్
    చొంగగార్చుచు టీవిముందర చోద్యమెల్లను జూడగన్
    యంగలార్చుచు హోళిహోళి సయాటగానగ వీరులౌ :)

    జిలేబి

    ReplyDelete


  26. బ్రహ్మచారుల కాలమొచ్చెను భారతమ్మున సోదరా
    జహ్మముత్తర దేశమందున చక్కగానటు దోచె తా
    జిహ్మగమ్ముగ మేలుగావగ చిత్రమైయటు గాంచనే
    యహ్మదీయులు తస్మదీయులు యస్మదీయ జిలేబులై !

    జిలేబి

    ReplyDelete


  27. మొల్లవాసన లేనిపువ్వగు మొత్తనేలన కోరికల్ ?
    కొల్లగొట్టను లేదుకోరగ కోకబట్టెను గాదుటే ?
    చల్లకొచ్చిటు ముంతకేలన చాకచక్యము కోమలీ
    మల్లయుద్ధము లేల నో మరి మల్లెపువ్వుల కిచ్చటన్ :)

    జిలేబి

    ReplyDelete


  28. రుబ్బురోలును జూచి చక్కగ రుబ్బగాను జిలేబి యై
    సుబ్బులక్ష్మికి పద్యమొక్కటి సుందరమ్ముగ వచ్చెనౌ
    యబ్బురమ్ముగ నుండగన్నట యయ్యవారలు మెచ్చిరౌ
    మబ్బువీడగ ముద్దుగుమ్మయు మత్తులోనటు తూగెనే :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. సుబ్బు శాస్త్రియు సుబ్బలక్ష్మియు చూడనొక్కర సూర్యుడా ?
      మబ్బు దొల్గగ మాయ వీడగ మాకు సత్యము విప్పరా
      అబ్బ యీ మిడిమేళ మేమని అయ్యలందరు గిచ్చరా
      రుబ్బురోలును పొత్రమూ మరి రోకలీ యొకటే గదా .

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. సుబ్బరముగ పదాలల్లు గురువర్యుని కాయె
      నబ్బురము! కలిగె నొక మాయా సందేహము
      సుబ్బూ! యన పువ్వుబోడియా! మగ'బా(లా)డి'యా!
      నిబ్బరముగ నొక యొజ్జ చెప్పరె! ఆ సిగ్గరి మొగ లక్ష్మియో! ఆడు శాస్త్రియో!?

      :) jf ...

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. గటగటా చెంబెడు నీళ్ల త్రాగి చల్లగాను అ
      కటా పతా దెల్వక లేఖ బట్టుక అల్లిబిల్లి గాను
      అటూ ఇటు దిరిగితి చూపుల 'మెల్ల' తోను
      ఇట తోచదాయె! పత్రము మగోనికో! మగనాలికో!?

      Delete


  29. సబ్బులేల సుమా, ముఖంబున చక్కగా పసుపున్ సదా
    రుబ్బవమ్మ జిలేబి గట్టిగ రూపుమారు లతాంగికి
    న్నిబ్బరమ్ముగ గానవచ్చును నిమ్మళంబగు మేనియు
    న్నబ్బురమ్ము సువాసనల్గొను నమ్మవమ్మ మృణాలినీ !


    జిలేబి

    ReplyDelete


  30. రాసలీలల మత్తుదేలగ రండుగోపిక లార మీ
    యాసతీరన చిన్నికన్నడు యావదాస్తిగ వచ్చి తా
    నూసులాడుచు దోచుచుండె వినూత్నరీతిని యోగమా
    యాసఖుండిట ముక్తికాంతల యన్నివేళల గావగన్ !

    జిలేబి

    ReplyDelete


  31. భక్తిమార్గపు మత్తులోనటు భామలెల్లరు తూగిరీ
    ముక్తిగోరుచు ముద్దుగుమ్మలు మోసగాళ్ళను నాడిరీ
    రక్తికోరుచు సాములోళ్లటు రాసలీలల దేలిరీ
    యుక్తిబోవ జిలేబులందరు ఓటికుండల బోలిరీ !

    జిలేబి

    ReplyDelete


  32. నేతిగిన్నెల పక్కబెట్టుచు నేపరాలును మోపకే
    కోతిమూకలు చట్టువచ్చును కొట్టగానిటు కాదుటే
    జాతివైరము గాదె యెల్ల బజారు మాయ జిలేబి, యీ
    రీతియగ్గిని పెట్టమాకు మరింతగానిట నారదీ :)

    జిలేబి

    ReplyDelete


  33. స్పాము పెట్టెను చూడవే మన సారు గారి క మింట్లనౌ
    జాము రేతిరి వేయగానటు చక్కగా ప్రచురించవే !
    నోము నోచిరి బ్లాగువద్దని నోటిమాటల రాయలే !
    రీమురీముల వ్యాఖ్య లేళ్ళను రీతిగానటు ద్రోలురే :)

    జిలేబి

    ReplyDelete


  34. నానిగారు జిలేబివారిని నమ్మ సారని బిల్వగన్
    పూనికొచ్చె లతాంగి మేనికి పుట్టుకొచ్చెను సూటిగన్
    బోణిజేయన మత్తకోకిల పొద్దుకాడికి నేటికిన్
    మేనితూగగ రాగమాలిక మేల్మి గాననిటన్ భళా !


    జిలేబి

    ReplyDelete


  35. బెంగళూరు జిలేబులూరగ భేషుగానటు డాన్సులన్
    కొంగుచూపుచు కోడెనాగుగ కోరిగిచ్చుచు పాటలన్
    చెంగుచెంగన చేరవచ్చుచు చేతికందక బోవుచున్
    శృంగభంగము జేయమాకె విశృంఖలంబుగ కాటుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  36. బెండగిల్లిరి యేరులెండగ బిక్కుబిక్కని బోవుచున్
    దండకోలను గట్టిగూనుచు దమ్ముబోవగ కూలికై
    కుండపోతగ వర్ష మీయర కోర్కె తీర్చి యపాంపతీ
    బండగైన మనస్సు విచ్చన భాగ్యరేఖల ఛత్రమై !

    జిలేబి

    ReplyDelete
  37. ఆశ్చర్యం, ఉదయం నుండీ "కష్టేఫలే శర్మ" గారి దర్శనం లేదు ��.

    ReplyDelete


  38. కష్టేఫలే గురువట
    న్నిష్టగ వత్తురు వుదయము నేడాశ్చర్యం!
    పోష్టులు గూడన్లేవూ
    గెష్టగు మనవిన్నకోట గిరగిర తిరిగెన్

    జిలేబి

    ReplyDelete


  39. జీవితమ్మున ధూమపానము జేయకుండ జిలేబులై
    కావితాలుపు జీవిమల్లెన కాలవాహిని బోవగన్
    జోవపాటల జోరుగానుచు చొప్పదంటుల ప్రశ్నలన్
    గావుగావుయ నంగ వేయుచు గాడిదప్పుదురిచ్చటన్ :)

    జిలేబి

    ReplyDelete


  40. నీలివార్తల గాలిమాటల నేమనిష్ఠలు లేదుగా
    వాలి బోకుము జూడగా మరి వాటినక్కడ నీవట
    న్నాలులేదుర చూలులేదుర నమ్మబోకుర సోమరిన్
    గోలుగోలున గోకుచుందురు గోడమాటు జిలేబు లౌ :)

    జిలేబి

    ReplyDelete


  41. దీపంబునకన్యాయం
    బోపను ! తప్పక జిలేబి పొద్దుట వేతు
    న్నోపిక గాంచి మరియొక ట
    పా పాడెద రా మనామ పదకవితలనౌ !

    జిలేబి

    ReplyDelete


  42. ఓయమ్మ జిలేబీ ! మీ
    రా యతి గణ పద్యముల విడచుచు పలుకరో !
    ఓయమ్మ !మీదు సదభి
    ప్రాయము లటు మాకు తెలియ రావడి యయ్యెన్ :)

    జిలేబి

    ReplyDelete


  43. కుట్రలేమియు లేదు రాజ చకోరి మాటల రాణియౌ
    వట్రువందున చిక్కెతానట వాడిమీరగ బోవుచున్
    తొట్రగిల్లుచు తమ్మికంటిని తోమగన్నిటు వచ్చితిన్
    చట్రమొక్కటి తిప్పి జూచితి జాబిలమ్మను గాననౌ :)

    జిలేబి

    ReplyDelete


  44. ఝంపెతాళము వేయగానటు జాగుచున్నది తూగెనే
    ముంపుజేయుచు యింటిచుట్టున ముచ్చటాడుచు పాడెనౌ
    అంబలమ్ముల బుజ్జిజింకకు యమ్మనిద్రన నేర్పెనౌ
    బింబమొక్కటి తానుగాంచె కభీకభీయ ఖయాలలన్ :)

    జిలేబి

    ReplyDelete


  45. అప్పుజేయుచు పెళ్ళిజేయగ యప్పణమ్ముగ టాక్సులన్
    నొప్పిగల్గున వైద్యశాలకు నొక్కమాటున దస్కముల్
    చెప్పగానటు మంచిమాటల చేర్చియిత్తురు కిక్కులన్
    దొబ్బిరమ్మ జిలేబిమీరగ దొమ్మిజేయుచు దేశమున్ !

    జిలేబి

    ReplyDelete


  46. గాలిలోనటు కాపురమ్ముల కావుకావని జేసిరీ
    మేలుగాన సిటీల నాడిరి మెచ్చులాడన జీవితం
    గాలిబోవగ లైఫులోనటు కావుకావని ఏడ్పులన్
    జోలబట్టి విదేశమేగిరి జోరుగానగ జీవనం !

    జిలేబి

    ReplyDelete

  47. నాటి యుద్ధము లోడిజూసిరి నాడిబట్టుచు యొజ్జలౌ !
    నేటి కాలము జూడగానిట నేర్పుగాంచెను దేశముల్
    నోటి మాటల రాయడాతడు నొక్కిజూడ నమేరికా
    వేటగాళ్ళటు బోవుచుండిరి వేగమైన జిలేబులై !

    జిలేబి

    ReplyDelete


  48. భవ్యమైనటి వృత్తిలోనటు బాగుజేసిరి రోగులన్
    దివ్యమైనటి తేజపుంజము తీరుగానగ నేర్పుతో
    నవ్యరీతిని పోరుజేసిరి నాడుచున్నటు దస్కముల్
    సవ్యమార్గము గాంచమేలగు చక్కగాను జిలేబులై

    జిలేబి

    ReplyDelete


  49. మూడుకందము లారువృత్తము ముద్దుగానుచు జేయవే
    జీడిపప్పుల పాకమెల్లడ జివ్వు జివ్వున లాగుచున్
    వేడిగాల్పుల ద్రోలుచున్నటు వేగ వేగము గానముల్
    పాడవమ్మ జిలేబి పద్యము పారవశ్యము గానగన్ :)

    జిలేబి

    ReplyDelete


  50. పద్యరూపము జేయగానటు పారుడయ్యె జిలేబి యై
    విద్యలన్నియు నేర్చి "అన్నును" విశ్వమెల్లన గాంచగ
    న్నాద్యుపాంతము జూచి చట్టని నాట్యమాడుచు పద్య నై
    వేద్యమున్ సమగూర్చె యొజ్జ నివేదనన్ "అ" వ ధానియై!

    జిలేబి

    ReplyDelete


  51. గండుతుమ్మెద ఫేసుబుక్కుల గాన, కోయిల ట్వీటులన్
    మెండుగాంచన వేరుబోయిన మేటిలోకము గాదయా
    నిండుకుండల ఓటికుండల నీటిమాటల కాలమౌ
    కుండమార్పిడి యన్నయేమిటి గూడుగట్టవలెన్ టపా!

    జిలేబి

    ReplyDelete


  52. భోగభూమియు యోగమార్గము బోవ మేలనె యోగియౌ !
    శ్రీగురో!యని కాళ్ళు గానన చిన్నవారలు వేచిరౌ
    జోగితో మజ గానరండిటు చోక్షమౌనిక మేధయౌ
    సాగిపోదము రాజమార్గము సన్నిధానము గాననౌ !

    జిలేబి

    ReplyDelete


  53. కారుతాళము దారి తప్పగ కర్ణమందు పిశాచి తా
    జోరుగానటు కుండలిన్ గని జోకులేయుచు చెప్పెనౌ !
    హోరశాస్త్రము జూడగా పులిహోరజేయన నేర్తురౌ
    ఔర! పోరి! సెబాసు గుండుగు రౌర! జొప్పె జిలేబులన్ :)

    జిలేబి

    ReplyDelete


  54. వాలెగాలిన చెట్టు, బోయెను వారిమామిడి యింటనౌ !
    రాలుగాయిని జూడ పారుడు రాజ్ఞిగారిని పృచ్చగన్
    గోలుమాలుగ భారతమ్మును కోవతీయన గాథనౌ
    రాలుగాయిగ ధార్తరాష్ట్రుని రాటుదేలుల గాంచెనౌ !


    జిలేబి

    ReplyDelete


  55. బుగ్గకార్లకు మంగళమ్ములు బోరుబోరున యేడుపుల్
    తగ్గునోమరి ట్రాఫికెల్లెడ తప్పిదమ్ములు బోవగన్‌
    సిగ్గులాడుచు పక్కదారుల సీనియర్లటు బోదురో
    పగ్గమేయిది రాష్ట్రనేతల పాటిగానగ జోతలై !

    జిలేబి

    ReplyDelete


  56. మీటపాలటు ఫేసుబుక్కున మిక్కుటంబుగ గోలుమాల్
    కేటుగాళ్లటు కొల్లగొట్టిరి కెవ్వుకేకల జేయుచున్
    పోటుసుందరి శ్వేతపూజల బొట్టుకాటుక పెట్టెనౌ
    చాటుమాటుగ చేవబోవగ జాణ కాపియు జేసెనౌ !

    జిలేబి

    ReplyDelete


  57. సౌరసెల్లుల గూర్చిరచ్చట సాండువిచ్చుగ జామును
    న్నౌర ! మేధన గుజ్జుగాన దనాదనాయెను నైపుణీ !
    సారమున్నటి కుర్రకుంకలు "సౌర" భమ్ముల జేర్చిరౌ
    భారతీయుల బుర్రయేనయ బామురవ్వతు‌‌ బుర్రయౌ !

    జిలేబి

    ReplyDelete


  58. రేసిజమ్మును చూసెనౌ భళి రేంజుదాటిన దేశమున్
    వాసిలేనిటి గొప్పమాటలు వట్టిపోయిన స్వాములౌ
    గోసిపాతల లాండు కోసము గోడగట్టిన చేష్టలౌ
    బేసులేనటి సాములోర్లయ బేయసర్ యన మాతలౌ‌!

    జిలేబి

    ReplyDelete


  59. ఊయలాటల కొన్నిపొత్తము లూగగానటు మత్తులో
    సాయమాహ్నపు వేళలోన సుసారముల్నట దేలుచున్
    స్వీయగాధల లోలలాడగ వేసవిన్నటు ద్రోలుచున్
    సోయగమ్ముల మాచనార్యుని శోభలన్నియు గానవే !

    జిలే‌బి

    ReplyDelete


  60. మెత్తవారిని చూడగానటు మేలు మేలున దెబ్బలన్
    మొత్తబుద్ధియగున్ జిలేబియ మోకరిల్లన జేయనౌ !
    కత్తలానిని తొక్కజూడగ కైపుగాంచుదురెల్లరున్
    చిత్తజల్లుగ లోకపోకడ చింకలీకము వోలెనౌ !

    జిలేబి

    ReplyDelete


  61. మేటిబాహుబలీయమైనటి మేటరున్నటి పద్ధతిన్
    తాటిచెట్టును గట్టిలాగగ తాడు ద్రెంచెను రాకెటౌ
    సూటిగానటు రావడిన్ భళి సూత్రమై సడి జేయుచున్
    కోటగట్టిరి గాధలన్నట కోట్ల దస్కము లాభమౌ :)

    జిలేబి

    ReplyDelete

  62. తాతయైనను జేమ్సుబాండును తావుచెప్పెదనానిమ
    స్సౌత గానను యన్యగామిగ సాముజేసిన గూడనౌ
    పాతకాలపు తెక్నికుల్గల పట్టుగాంచిన పారుడన్
    కూతకొచ్చినకోడివోలెను కొత్తవాడిని సుమ్మనౌ :)

    జిలేబి

    ReplyDelete


  63. నోటుబుక్కున గీతగీసెను నోడ వచ్చిరి యెల్లరున్
    నీటుగానటు నీలియార్ముడు నీరజారిని జేరగన్
    తాటికల్లును త్రావినాడు సుతారమైయటు బోవనౌ !
    మాటువేసి జిలేబివచ్చెను మత్త కోకిల గానమై !


    జిలేబి

    ReplyDelete


  64. ఓటికుండయనంచు బాధన నోకలించగ నేలనౌ
    మాటరాదని మందబుద్ధియ మాయకుండన నేలనౌ
    రాటనమ్మున వృత్తమైనటి రాలుగాయివి కాదుగా
    వేటగాడివి గాదు చూడగ వేషగాడివి గాదుగా !

    జిలేబి

    ReplyDelete

  65. చాలా రోజుల తరువాయి మత్తకోకిల కి గిట్టుబాటు ధర పలికింది :)


    అగ్గిపుల్లను గీసినామరి యేమికాదు జిలేబి, హా !
    బొగ్గులాడదు నా కడాన సుబోధినీ మరి తెల్సుకో !
    ముగ్గుపెట్టినపిండి గాదు సమున్నతమ్మగు బుద్దుడన్ !
    జగ్గుజగ్గున రాసెదన్నిక జావళీకథ లెల్లనౌ :)

    ReplyDelete


  66. ఆరుకోతులు పోరుజేసెను యావురావురటంచునౌ!
    మేరుపర్వత విజ్ఞులచ్చట మేలుమేలనగూడిరీ !
    హోరుహోరన స్వేచ్ఛగానట సోయగమ్ముల తూలిరీ
    ఔర! చేరె జిలేబులూరగ అయ్యవారలు గూడనౌ :)

    జిలేబి

    ReplyDelete

  67. కూనలమ్మను బోల్చెరచ్చట కోటరాయలు ఔనటే !
    మానసమ్మున తూగులాడుచు మాటకారులు ఔనటే!
    పానకమ్మున తేలియాడెను పారుడచ్చట ఔనటే!
    మీనమేషములెక్కబెట్టుచు మింటిసుందరి వచ్చెనే:)

    జిలేబి

    ReplyDelete


  68. రంగురంగుల లోకమందున రాజ్ఞులిచ్చట గాలివా
    టంగ కొండల రాయు చెంతన టంకరించుచు భాసిలన్
    చెంగుచెంగున చేవగూర్చుచు చెట్టుపుట్టలు శోభిలన్
    రింగురింగుల భావనమ్ములు లివ్వులివ్వున వీచెనే !

    ఇంతకీ త్వామనురజామి అంటే ఏమిటి ?


    జిలేబి

    ReplyDelete


  69. చాన్నాళ్ళ తరువాయి మత్తకోకిల



    జాగుచేయక ఆంజనేయుడు జానకిన్గనె గాదుటే !
    మాకులెల్లను బీకెనచ్చట మారుతయ్యగ గాదటే !
    బీకుబీకని రాక్షసుల్ మరి బిర్రుబిర్రని కూలిరే !
    తోకరాయుని భక్తిగానుమ తోకచిచ్చుల బేర్చెనే !


    జిలేబి

    ReplyDelete


  70. పాదయాత్రలు ఓట్లనివ్వవు పారబోయకు డబ్బులన్
    పేదవాళ్ళకు‌ పంచిపెట్టుము భేషుగా జనులెల్లరున్
    మీదయన్ బతి కామటంచన మించునయ్యరొ కీర్తియున్
    సోదిజెప్పెను బాగుగానటు సోకులమ్మియు గానుమా :)

    జిలేబి

    ReplyDelete


  71. పత్తి చేలల చూసినాడను భారమయ్యెను గుండెయున్
    మొత్తుచుండెను రైతులెల్లను మోసమైన ప్రభుత్వమౌ
    సత్తెకాలపు రాజశేఖరు సాక్షి పల్కితి, మిమ్ములన్
    క్రొత్తతీరుల కాచెదన్ సరి ఓటులన్మరి వేయుడౌ !


    జిలేబి

    ReplyDelete


  72. పాదయాత్రల చేయుచుంటిని పల్సుగాంచి జిలేబులన్
    వీధులెల్లన పంచిబెట్టుచు వేగిరమ్ముగ నేనిటన్
    పేదవాళ్ళకు నాన్నగారటు పెన్నిధుల్ సమ గూర్చిరే !
    మీదయన్ ప్రభుతన్ చలాకియు మీరగానటు చేసెదన్ !

    జిలేబి

    ReplyDelete


  73. పాకశాస్త్రము తేల్చిచెప్పిరి పావనమ్ముగ యమ్మియే
    కోకయన్నను చైలమన్నను కొంచమైనను వూహలే !
    రాకరాకను వచ్చినారిట రాణివారలు గాదటే
    మేకతోకకు మేకతోకయు మేకతోకయు గాదుటే :)

    జిలేబి

    ReplyDelete


  74. రాసి పెంచిరి వాసి లేదయె రావుగారటు చూడుడీ !
    మూసగా పద మెల్ల గుచ్చగ ముగ్ధ పద్యమనేరుగా!
    గోసు గోసుల ప్రాస లెల్లను గోల గోలగ వేసిరే!
    కాసువీసపు వార లెల్లరు కంద పద్యము గట్టిరే !

    జిలేబి

    ReplyDelete


  75. చేతికందుచు చిక్కినట్లచు చేరువయ్యెను చంద్రుడే!
    రాతిరయ్యెను రత్నమాలిక రాగమాలిక సాగెనే
    చేతనత్వము చక్కగానటు చేవగూర్చుచు వెల్గెనే
    బాతళించు జిలేబియమ్మయు భావగీతము వ్రాసెనే :)

    జిలేబి

    ReplyDelete

  76. పట్టినారట పట్టణమ్మున పారణమ్ముల మాలికన్
    పెట్టినారిట సంకురాతిరి పేర్మిగానయ వైవియార్ !
    చుట్టినారిట రాజువారలు సోయగమ్ముల పద్యమున్!
    పట్టుమామి జిలేబి వారు జపమ్ము జేసిరి కోకిలన్ :)

    జిలేబి

    ReplyDelete


  77. పాటినోటన తెల్గునీల్గెను పారుడచ్చట చెప్పెనే !
    మాటకైనను తెల్గుబల్కక ఆంధ్రులిచ్చట జోగగన్
    కోటగట్టెను పద్యమాలల గోకిచూడగ పూజ్యమే
    పాటగా అరవంపు మామియు పద్యమొక్కటి జేర్చెనే :)


    జిలేబి

    ReplyDelete


  78. దారితప్పగ నాగరీకులు దారివెంబడి బోవుచు
    న్నారసింహులు వ్యాఖ్య జేయగ నారదాయ జిలేబియున్
    వారబోవక పద్యమొక్కటి వార్చెగాదయ మేలుగన్
    జోరుగానటు చెండు లన్ కయిజోదుగన్ సరి గూర్చుచున్!

    జిలేబి

    ReplyDelete


  79. పెళ్ళిచేయగ జూచిరచ్చట పిల్లలెల్లను శంకతో
    పెళ్ళికాకయు పిచ్చిబట్టగ పీకలోతుల కష్టముల్
    మళ్లుమాన్యము లన్నిబోవును మాకుకోడలు గావలెన్
    ఒళ్ళుచేగగ పిల్లగాడికి రోకలొక్కటె దక్కు బో !

    జిలేబి

    ReplyDelete


  80. జ్ఞాపకమ్ములు ధూళిలా సయి సన్నసన్నగ రాలెనే
    వ్యాపకమ్ములు జీవితమ్మున వాంఛితమ్ముగ బోయెనే
    తాపమిచ్చెడి తారతమ్యత తాటలన్ మరి గూల్చెనే
    శాపమివ్వకు సామిరంగడ సాధనల్ మరి జేసెదన్

    జిలేబి

    ReplyDelete


  81. కుర్రడాక్టరు చేర్చెనచ్చట కూటిదిక్కుకు శాంతమున్
    వెర్రులెత్తిరి పెద్దడాక్టరు బేరమెల్లను బోవగన్!
    అర్రువంచిరి ఊరివారలు అయ్యవారికి జై యనన్
    బర్రెగొడ్డుగ మారిరచ్చట బారుతీరుచు ముందరన్ !


    జిలేబి

    ReplyDelete


  82. మాయజాలపు మార్కెటింగులు మస్తుగన్ మరి జేయుచున్
    కాయకష్టము లేకయున్ మజ కాసులన్ తెగ జేర్చిరే
    సాయమిచ్చిరి సాబులందరు జాలమయ్యెను వైద్యమే
    ఆయువుల్ మరి బోవుచుండె గదా సి! వైద్యుల ధర్మమై

    జిలేబి

    ReplyDelete


  83. నీలిసంద్రము పొంగిపిల్చెను నీటుగానటు చూడగన్
    చాలచక్కగ కౌగలిన్ మరి చందమామయు‌ వచ్చెనే
    గోలగోలగ గాలి గూడను గోముగానటు గోకెనే
    జోలపాడెను మామదిన్ సయి జోరుగానటు తూగుచున్

    జిలేబి

    ReplyDelete


  84. దిష్టిగుమ్మడి కాయగట్టితి దీటుగానిట చూడుడీ
    తిష్టవేయుననానిమస్సుల తిక్కదిప్పను వేగమై
    ముష్టిఘాతపు పద్యపీడన మొండికొర్రల ద్రోలగన్
    పుష్టిచేరన జీవితమ్మున పుంఖితమ్మగు కైపులన్ :)

    జిలేబి

    ReplyDelete


  85. పాకనేయగ చక్కగాంచిరి పారుడున్నట గాదుటే
    మా కనుల్ సయి జూడగానటు మత్తకోకిల పారెనే
    కోకటించుచు పద్యమొక్కటి గూర్చుమమ్మ జిలేబియా
    కాకవెల్గుని చిత్రమయ్యది గానరావగ మాన్యులున్ !

    జిలేబి

    ReplyDelete


  86. ఏరుపారుచు సుందరమ్ముగ నేతమెత్తెను పల్లెయు
    న్నూరుపైసల నాణ్యమైన వినూత్నపంటల రీతులన్
    మారుబల్కక దేవళమ్మున మద్దతిచ్చెడు సేవలన్
    సారగంధపు ఛాయలన్ మనసారబిల్చు సపర్యలన్!


    జిలేబి

    ReplyDelete


  87. పక్క మీదట దొర్లుచుండగ పాటపాడుచు భామయున్
    మిక్కుటమ్ముగ పేర్మిగాన సమీరమైన సుమమ్ములన్
    చక్కగా మది తూగుచుండగ చాటుమాటుగ జూడ నా
    యక్కరో, యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే

    జిలేబి

    ReplyDelete


  88. గదిలో పెనిమిటి గానరాలె !

    చక్కనమ్మలు ద్రోయుచుండిరి చాటువుల్ మజ బల్కిరే!
    యక్కరో! యిటురాగదేయని యాలి బిల్చెను, భర్తయే
    పక్కనన్ గది లోనగానక; భారమయ్యె మనస్సటన్
    బిక్కచచ్చెను సిగ్గుతో సయి భీతిగానటు జూచుచున్!


    జిలేబి

    ReplyDelete


  89. మాయ చేసిరి నిందవేసిరి మామపై మరులొల్కుచున్
    ఛాయయై వెనుకాడుచుండిరి ఛాయగా మురిపించిరే
    గాయమయ్యెను మత్తుగానటు గాయినీ మధుశాలినీ
    సాయమీయగ రావె మాలిని శాయశక్తుల పద్మవై :)


    జిలేబి

    ReplyDelete


  90. ఎంతగట్టిగ చేయనోయిక యెవ్వరిన్ మరి జాలరా !
    కొంతగైనను చెప్పవమ్మ పకోడి టీల వయాళులన్
    సంతసమ్మును గాంచి టిక్కెటు సాయమైనను చేతురే
    బంతిపువ్వుల యింతిగా సయి పార్లమెంటుకు బోయెదన్ :)

    జిలేబి

    ReplyDelete


  91. నిశ్చితార్థము జేయకోరిరి నీటు కాసులు బారెనే
    పశ్చిమార్థపు మాఱకమ్ములు ఫాషనాయెను జూడగా
    వృశ్చికమ్ముల రీతిగానటు వృద్ధిపేరిట చీకిరే
    నిశ్చయమ్ముగ ద్రోలవేయగ నిర్ణయమ్ముల జేయరే!

    జిలేబి

    ReplyDelete

  92. ఏమయ్యా మోడీ ఏ తుగ్లకు ఫౌండేషన్ అన్నపేరుకో బబ్లూఖాన్ ఫౌండేషన్ కో యిచ్చి వుంటే పెజ కాంగిరేసు ఇంత కస్సు బుస్సనేదా ? ప్చ్ !


    ఎర్రకోటను తీర్చిదిద్దన నెందుకిచ్చిరి డాల్మియా
    కర్ర నైదన కోట్లకున్ భళి కాంగిరేసులు బుస్సనే
    నర్ర భారతు అన్నపేరుకు నప్పజెప్పుదురే! యహో
    బుర్రలేదు గవర్నమెంటుకు భూరిగానటు కేకలే :)

    జిలేబి

    ReplyDelete


  93. ఇచ్చి చూడుము బుంగమూతిని నిచ్చకత్తె జిలేబియా
    గుచ్చిగుచ్చుచు చూడమాకుము గోలలేలనె జాబిలీ
    మెచ్చు కొంటిని నీదుబుగ్గల మెత్తమెత్తగ నుండెనే
    రచ్చజేతము రావెభామిని రాసలీలల దేలుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  94. కోతి చేతికి చిక్కె నయ్యరొ కొత్తగానొక జఘ్నియే
    రౌతు గుర్రము నెక్కగానటు రయ్యరయ్యని బోవునే
    వ్రాత గాడి కదేదియైనను వాటమై మరి వచ్చునే
    నేతనేయుచు చక్కగానటు నెమ్మిజేర్చుచు వ్రాయగన్

    జిలేబి

    ReplyDelete


  95. పాతఫేనుకు కొత్త ఆయిలు పారులే భళి వేయగా
    మేతగాంచి జిలేబి మామియు మెచ్చుకోలుల జేర్చగా
    జోతజేర్చుచు విన్నకోటయు జోరుగానటు వచ్చి మీ
    పాతపాటకు యర్థమేమది బారుబారది యేలనో
    మాత! మాకు రవంత తెల్పు సుమా యటంచును‌ కోరిరే

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కోరాం మరి. కానీ మీ దగ్గర నుండి వివరణ రావట్లేదే? 😡

      Delete