Monday, February 27, 2017

నక్షత్రమాలికల మధ్య నడక

 
నక్షత్రమాలికల మధ్య నడక !
 
నడుస్తున్నా.
ఆకాశంలోని నక్షత్రాలు
దిగి వచ్చేస్తోన్నాయి
 
అరె ! ఇంత దగ్గిరా !
అరె అరె అరె !
 
నా పక్కే ఉన్నాయ్ అన్నీ !
మధ్య లో నే నడుస్తున్నా !
 
అరె ఇంత మధ్య !
అరె అరె అరె !
 
ఓహ్! నక్షత్రాలే అన్నీ
అన్నీ నాలా ఉన్నాయే ! 
నేనెక్కడ ?
 
అరె ఇంత లోనేనా !
అరె అరె అరె !
 
కల చెదిరింది
నక్షత్రాలూ మాయం
నేనూ మటు మాయం !
 
అరె అంతలోనే ?
అరె అరె అరె!
 
 
శుభోదయం
జిలేబి

7 comments:

  1. ఈవిడ జిలేబీనే అంటారా !?

    ఈవిడ జిలేబీ అయితే ఇలా
    అందరికీ ఇంత సులభంగా
    అర్ధమయ్యేట్లుగా వ్రాయడమా !?

    ఈవిణ్ణిలా వదిలేయకండ్రా -
    ఎవరికైనా చూపించండ్రా ...

    ప్లీజ్ ...

    :) jk

    ReplyDelete
    Replies
    1. 'నేనూ మటు మాయం !' ...
      మరో మాట చెప్పండి.
      ప్లీజ్ ...

      మరో మారు చెప్పండి ...
      ప్లీజ్ ...

      శుభోదయం ...
      అందరికీ ...

      :) jf

      Delete
    2. బండివారు
      ఏదో భయంగా భయంగా ఉంది

      Delete

    3. భలే వారండి

      నేనిది చాలా సంక్లిష్టంగా రాసానని అనుకుంటా వుంటే మీరేమో వీజీ గా ఉందనేసారే :)

      @ కష్టే ఫలే గారు

      భయము వలదు అన్నియు కుంభికా కోకిలమే :)


      జిలేబి

      Delete
    4. గురువు గారు,
      నేను కూడా బిక్కు బిక్కే ...
      ఆవిడేదో భక్కు భక్కు మంటున్నారు కూడా!
      :)

      Delete
  2. నేల విడిచి నింగి నేలగా కోరికల్
    చాల గలవు , గాని , తేలి పోయి
    చుక్కల గమి నడుమ చుక్కగా భాసిల్ల
    కలలు గనుట గాక , వలను పడున ?

    ReplyDelete
    Replies

    1. రాజారావు గారు

      ధన్యవాదములు "వలను" పడును :)

      జిలేబి

      Delete