Friday, March 10, 2017

సరసిజనాభ సోదరికి సాటి జయంతి, జయంతి యే గదా !


 
రసిజనాభ సోదరికి సాటి జయంతి, జయంతి యే గదా  
 
 
వెడలగ శంకరుండతని వెంటన దక్షిణభారతమ్మునన్
బడబడ లాడి పద్యములు పారుచు నాడుచు బోవగన్ , భళీ
చెడుగుడు పూరణమ్ములను చెంగని చూడన, వేకువన్ గనన్
పడమటఁబొంచి చూచెనఁట భానుఁడుషోదయకాంతు లీనుచున్ !


శుభోదయం
జిలేబి 

27 comments:

 1. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు గానీ ఇక్కడే ఓ చోట ఈ క్రింది వాక్యాలు (ఓ "లెక్చరర్" గారు వ్రాసిన మాటలు) కనిపించాయి. చదివి మిక్కిలి విచారించాను జిలేబి గారూ 😩!

  "now I'm worked as lecturer in ......... I was applied for degree lecture."

  భావమేమిటో 🤔🤔??

  మరీ ఇటువంటి ప్రాథమిక తప్పులున్నది కాదు గానీ ఇంగ్లీష్ వాక్యనిర్మాణం గురించి ఓ ఉదాహరణ ఇదివరలో ఓ ICS ఆఫీసర్ గారి ఆత్మకథలో చదివినది గుర్తొస్తోంది. మద్రాస్ యూనివర్సిటీ స్ధాపించడానికై ప్రతిపాదనలు జరుగుతున్నప్పుడు ఇండియన్ గుమాస్తా గారు సంబంధిత ఆఫీస్ నోట్ లో The Chancellor of Madras University shall be the Governor of Madras అని వ్రాశాడట. నోట్ అప్పటి మద్రాస్ గవర్నర్ గారి పరిశీలన కొరకై వెళ్ళిందిట. దాంట్లో పై వాక్యం చదివి అక్కడే మార్జిన్ లో Please send me an English translation of this అని గవర్నర్ గారు వ్రాసి వెనక్కు పంపించారట 😀. (గుమాస్తా గారు వ్రాసిన పై వాక్యం రివర్స్ లో ఉండాలి, లేకపోతే మద్రాస్ యూనివర్సిటీ ఛాన్సలర్ గారే మద్రాస్ గవర్నర్ గా ఉంటారు అనే విపరీతార్థం వస్తుంది 😀)

  ఇది గుమాస్తా గారి ఇంగ్లీషు, అది లెక్చరర్ గారి ఇంగ్లీషు ☹️.

  ReplyDelete
  Replies
  1. గుమాస్తాగారి ఇంగ్లీషుకు శిక్షించచ్చు, అక్కడ జరిగింది పొరపాటు. లెక్చరర్ గారిది.....ఈయన లెక్చరర్ గనక శిక్ష ఏముండాలి? :)

   Delete


 2. మనుషులు మానవత్వమును మంచిదనమ్మును వీడినారిట
  న్ననుచు జిలేబి తత్వముల నాడుచు బోవగ నేలనౌ సదా
  కనుబొమ లెల్ల నీరునటు కార్చుచు నేడ్చుచు జీవితంబున
  న్ననుశృతి గాంచకన్ పయ నమెల్లను వీడుచు బోవనేలవే !

  జిలేబి

  ReplyDelete


 3. ఘనమగు తాత ! మీకథను గానగ గుర్తుకు వచ్చె నయ్యరో !
  వెనుకటి కాలమందునట వేలికి దారము గట్టి బంపగన్
  తను పని కేగి గాంచెనట దారయు దారము నేల గట్టెనో
  యనుకొని బుద్ధిమంతుడగు యార్యుడొకండు జిలేబులొప్పగన్
  !

  జిలేబి

  ReplyDelete
 4. "మాలిక" బిగుసుకున్నట్లుందే ?

  ReplyDelete
  Replies


  1. ఎక్కడున్నారండీ లక్కు పేట రౌడీ గారు

   విన్నకోట వారి కంప్లయింటు కూసింత చూద్దురూ :)

   జిలేబి

   Delete
  2. మాలిక పాక్షికంగా బిగిసిందా? కొన్ని బ్లాగులే ప్రచురింపబడటం లేదో!

   Delete
  3. అలాగే ఉంది శర్మ గారూ. అలా కనబడకున్న బ్లాగులలో మీదొకటి. మీ "రాజు గారి కుక్క" టపా "మాలిక" లో రాలేదు.

   Delete
 5. మాలిక కాదు వదన బిగిసినట్టుంది :)

  ReplyDelete
  Replies


  1. అయ్యో పాపం :)

   వదన కూడానా :)

   జిలేబి

   Delete


 6. కవితల రాయు డెవ్వరిని గానక వేచెను సూవె బ్లాగున
  న్నవి చదువంగ వెంబడి ధనాయనుచున్ లలితమ్మ మెచ్చగన్
  తవికల రాణి యా గడుసు తార విహారి కమింట్ల వేయగన్
  కువకువ లాడి వచ్చె పద కూర్పుల పద్య చతుష్కమున్గనన్ !

  జిలేబి

  ReplyDelete


 7. ఘనమగు విల్లు నాతడటు కంకవలెన్గని కైగొనంగనౌ
  క్షణమున కూలగన్, రమణి కన్నులనవ్వుల గాన నయ్యరో,
  యినకుల తేజుడా విభుని యీగడ లారగ జూచి నౌర! స
  జ్జనకుడటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్

  జిలేబి

  ReplyDelete


 8. నిజమును నిర్భయంబుగను నిగ్గులదేల్చిరి విన్నకోట రా
  య! జమ గనంగ వచ్చె గదయా సుకవీశులు యొజ్జ దీక్షితుల్ !
  సుజనుల పల్కు సృష్టియగు సూక్ష్మమిదే నరసింహ, గానగన్
  మజగొని వచ్చె పద్యమిట మానవ! చంపకమాల వృత్తమై‌!

  జిలేబి

  ReplyDelete


 9. నిగనిగ లాడు గుండునటు నింగిని సూర్యుడు కాల్చ, తారల
  న్నిగలిసి నాట్య మాడగను నిండుగ చుక్కల రీతి నెత్తిపై
  పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
  సెగలను దాచి మానవుని సేనము చట్టన సేద దీరనౌ !

  జిలేబి

  ReplyDelete


 10. పరుగున వచ్చెనమ్మ మన పాటల రాణి జిలేబి సాహితీ,
  గరుడుఁడు భీతినొందె, నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్
  పరుగిడె పాకుచున్నటను, పద్య మహత్యము గానవే చెలీ
  వరమిది సారసత్వమగు వాణి శుభాంగి లతాంగి సర్వదా!

  జిలేబి

  ReplyDelete


 11. పడతుల మానభంగములు, పాగెములేక జనావళిన్ని పో
  నడచుట హానికారక మనాగరకం బగు మానవాళకిన్
  విడదగునయ్య విప్లవము వీకొనుమా!హజరత్ సలామతౌ !
  జడతల భారతమ్మునకు జాగృత!యుత్తిగ మేలుకోవయా !


  జిలేబి

  ReplyDelete


 12. వరముగ వచ్చె యోధుడట, వారిజ జూడ ముదంబు గానగన్
  పురుషుని, కంఠమం దపుడు పుస్తెను గట్టెను చాన వేడ్కతో
  పురజను లెల్ల మెచ్చ పతి! పూవిలుకాడి యవాయి మత్తులో
  న రమణి యా జిలేబి సరి నాధుని గూడె శుభాంగియై భళీ !

  జిలేబి

  ReplyDelete


 13. అరయగ తండ్రి యానయన కానన మేగెను,యక్కు జేర్చెనౌ
  భరతునిఁ, జంపె రాఘవుఁడు భామినికై సురలెల్ల మెచ్చఁగన్
  హరణము జేయ రావణుని, హా!శరణమ్మనగన్ విభీషణు
  న్నిరతము కాపుగాచెను సనీదమునన్ సుగుణాభిరాముడై !


  జిలేబి

  ReplyDelete


 14. త్రిగుణపు సాధనా పథము తీక్షణ మైన జపమ్ము గూడగన్
  సగుణపు రేడు సూర్యుని, శశాంకుని హృత్తున సత్య మై సదా
  నిగుడు జిలేబి నిక్కము సనీదము గాంచుము సృష్టి నంతయున్
  సుగుణనిధీ కనుంగొనుము చుక్కలనే నడి ప్రొద్దు జామునన్

  జిలేబి

  ReplyDelete


 15. సతతము భూత కాలపు సజావుల చింతనలన్ సవారులౌ
  గతజలసేతుబంధనమె; కల్గగఁ జేయు ననంతలాభముల్
  వెతలను వీడి యత్నముల వేగము జేయ జిలేబి, ముంగటన్
  బతుకును నీడ్వ మేలగును బాధ్యత గాంచి మెలంగ వే సఖీ‌ !

  జిలేబి

  ReplyDelete


 16. పలుకుల తియ్యబోడి ! మజ! పద్యములెల్ల సదా భళాయనన్
  కలికి కవుంగిలింత; కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా
  కలకువ యై జిలేబి సరి కావ్యము ముద్దుగ రాక బోవగన్ !
  నెలతుక యత్నముల్ వలయు నెల్లపుడున్ వికసింప యోచనల్ !

  జిలేబి

  ReplyDelete


 17. వనమున గాంచె లేమనట వాకలువేయ మనమ్ము పెండ్లి యా
  డెను తను రీతిగా మనుజుడేగద! శోభలనొంది చేరగన్
  ముని సహవాసమంది సతి, ముద్దుగ బొందెను పుత్రు లిద్దరన్
  ఘనముగ కొల్వరండిట సగర్వము గాను జిలేబు లై భళా!

  జిలేబి

  ReplyDelete


 18. పృథువిఁ బురూరవుస్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంద్రమ
  త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయున్భగీ
  రథుని మరుత్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం
  బృథుని యయాతి రంతి శశిబిందుని భార్గవు మించవే హరీ!

  ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోని పద్యం
  ఇందులో షట్చక్రవర్తుల పేర్లు,షోడశమహారాజుల పేర్లున్నాయి

  source->

  http://chitrakavitaprapancham.blogspot.com/2017/05/blog-post_72.html

  జిలేబి

  ReplyDelete


 19. పరిణితి గాంచి పాటవము, భావము లెల్ల, జిలేబి, రమ్యమై
  వరముగ తెల్గు లోకమున వారిజ మా లలితమ్మ వచ్చెనౌ
  స్వరముల పాటలెల్ల తను సాజముగా వినిపించెనమ్మరో !
  సరసిజ నాభ సోదరికి సాటి జయంతి జయంతి యే గదా !

  జిలేబి

  ReplyDelete


 20. మలుపుల వేగ వేగముగ మారుతి కైపు జిలేబి బండ్ల, హా!
  కులుకుల తేలియాడి, మజ, గొల్లని కెవ్వు మటంచు బోయెడు
  న్నెలతుక లెల్ల గాంచి, భళి, నేర్చెద నూతన వాహనమ్మనన్,
  ఎలుక వడంకె ,విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్!

  జిలేబి

  ReplyDelete


 21. అనితర సాధ్యమైనటి సదాశివునిన్ ధనువున్నటన్ గొనన్,
  మనుజుల లో మనీషి పరమాత్ముడయోధ్య పురాధినాధుని‌న్
  తనయుఁడు ,భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో
  తనరెడి సీత సుందర వితానపు మోమున గాంచినామయా

  జిలేబి

  ReplyDelete


 22. సరసిజ నాభ సోదరి! విసంచితివే ! గురజాడ పొత్తమున్
  బిరబిర చూచినాను! కనిపించిన వారిని ప్రశ్న వేసితిన్
  "వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా?"
  సరియని చెప్పలేమనుచు సారము దెల్పె, బుజంగికాయటన్!

  జిలేబి

  ReplyDelete