Wednesday, April 5, 2017

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !


వీక్షకులకందరికీ
 
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !
 
జై శ్రీ రామ్ !
 


శుభోదయం
జిలేబి

 
 

 

7 comments:



  1. ఓ మా రామా! రఘు రా
    జా! మా కౌముది శుభాంగి జానకి రామా !
    శ్రీమాణిక్యంబైనటి
    రామా ! సీతమ్మతోడ రక్షణ నిడుమా!

    జిలేబి

    ReplyDelete

  2. (కాఫీ పేష్టు)

    బ్రహ్మ కొడుకు మరీచి

    మరీచి కొడుకు కాశ్యపుడు.

    కాశ్యపుడు కొడుకు సూర్యుడు.

    సూర్యుడు కొడుకు మనువు.

    మనువు కొడుకు ఇక్ష్వాకువు.

    ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.

    కుక్షి కొడుకు వికుక్షి.

    వికుక్షి కొడుకు బాణుడు.

    బాణుడు కొడుకు అనరణ్యుడు.

    అనరణ్యుడు కొడుకు పృధువు.

    పృధువు కొడుకు త్రిశంఖుడు.

    త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు

    దుంధుమారుడు కొడుకు మాంధాత.

    మాంధాత కొడుకు సుసంధి.

    సుసంధి కొడుకు ధృవసంధి.

    ధృవసంధి కొడుకు భరతుడు.

    భరతుడు కొడుకు అశితుడు.

    అశితుడు కొడుకు సగరుడు.

    సగరుడు కొడుకు అసమంజసుడు.

    అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.

    అంశుమంతుడు కొడుకు దిలీపుడు.

    దిలీపుడు కొడుకు భగీరధుడు.

    భగీరధుడు కొడుకు కకుత్సుడు.

    కకుత్సుడు కొడుకు రఘువు.

    రఘువు కొడుకు ప్రవుర్ధుడు.

    ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.

    శంఖనుడు కొడుకు సుదర్శనుడు.

    సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.

    అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.

    శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.

    మరువు కొడుకు ప్రశిష్యకుడు.

    ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.

    అంబరీశుడు కొడుకు నహుషుడు.

    నహుషుడు కొడుకు యయాతి.

    యయాతి కొడుకు నాభాగుడు.

    నాభాగుడు కొడుకు అజుడు.

    అజుడు కొడుకు ధశరథుడు.

    ధశరథుడు కొడుకు రాముడు.

    ఇది రాముడి వంశ వృక్షమట ...
    ======================

    శ్రీరామనవమి శుభాకాంక్షలు.

    జిలేబి

    ReplyDelete
  3. క్రొత్త విసన కఱ్ఱ కొత్తుగా వడపప్పు
    పరచి పెద్ద చెంబు పానకమ్ము
    ఇంట నింట బిలిచి యిత్తురు శ్రీరామ
    నవమి పర్వ దినము నాడు , నాడు .

    ReplyDelete
  4. పచ్చగా తాటాకు పందిళ్ళు వేయుదు
    రలికి మ్రుగ్గులు వెట్టి యంత వట్ఠు
    శోభాయ మానమై సువిశాల వేదిక
    ల నలంక రింతురు లలితముగను
    పెద్దలు పిన్నలు తద్దయు వత్తురు
    కనులార కళ్యాణ క్రతువు గాంచ
    కల మణి భూషణాదుల కయిసేతురు
    కడు మనోఙ్ఞముగ వధూ వరులను

    వేదికకు చేర్చి శుభలగ్న వీక్షణమున
    కడగి మంగళ తూర్యాల నడుమ కనుల
    పండువుగ జరిపింత్రు మా పల్లెటూళ్ళ
    లో ప్రతేట సీతా రాములోరి పెండ్లి .

    ReplyDelete
  5. మీకందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. జిలేబి గారికి అరవ పోస్టరే దొరికిందా తెలుగు బ్లాగ్ లో పెట్టడానికి ! 😡

    ReplyDelete
    Replies
    1. తమిల్ మామికి తెలుగు పోస్టర్లు ఎక్కడదొరుకుతాయీ :)

      Delete