Thursday, May 25, 2017

కష్టే ఫలి వారికి - వెడ్డింగ్ డే గ్రీటింగ్స్ !


 
కష్టే ఫలి వారికి - వెడ్డింగ్ డే గ్రీటింగ్స్ !
 

 
 
ధామ మది మమతలబడి తమ్మికంటి
సుమతి యిల్లాలి చలువగా శుభము బడసె
గోదమాయమ్మ కరుణమ్మ గోము గాంచి
మాచనార్యుల చల్లగ మాలిమి గను !
 
 
 
చీర్స్
జిలేబి

Saturday, May 20, 2017

కనకన లాడెను లతాంగి కామెంటులటన్ ! 
కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !
 

ధనజాతకమునకు జిలే
బి, నవనవ యనియటు కాసు బిరబిర వచ్చున్ !
గనవమ్మా నీవున్నటు
కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !
 
 
జిలేబి
Saturday, May 13, 2017

సామాజిక స్పృహ లేని చిత్రం - బాహుబలి - 2


సామాజిక స్పృహ లేని చిత్రం - బాహుబలి - 2


ఈ మధ్య ఆహా ఓహో సాహోరే అంటున్న మహా చిత్ర రాజం - బాహుబలి !

జిలేబి కూడా సాహోరే అంటూ శార్దూలాల పొగిడేసిన చిత్రం - చిత్ర రాజ మౌళి :) - బాహుబలి !సిన్మా చూసాక అనిపించినది సామాజిక స్పృహ లేని ఓ మా బోరింగు చిత్రం . ఈ చిత్రం ఫీవర్ తగ్గాక చూద్డా మని వెయిట్ చేయాల్సిన పని లేదు . చూడక పోయినా జీవితంలో లాస్ ఏమీ లేదు

భారతం లో ఏముంది బొంకు తప్పా అన్నట్టు ఈ బాహుబలి లో ఏముంది సినిమాటిక్ ట్రిక్కులు తప్పా అనాలి అంతే.

ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోట్లాట వీరాంగనలు , వీరులు బ్లా బ్లా బ్లా అంతే.

ట్రిక్కులు డిజిటల్ మాజిక్కులు దీనివల్ల జన సామాన్యానికి ఒరిగే స్పృహ ఏమిటి ?

జన బాహుళ్యానికి కలిగే మేలు ఏమిటి అన్నది ఆలోచిస్తే పూజ్యం అంతే.

సో , బాహుబలి మరో బాగు బలి .

బాక్సాఫీసు హిట్టు ; ఓకే; దాని వల్ల జనానికి బొక్క అంతే :) ఆస్కార్లు నంది అవార్డ్లు గట్టా వస్తే ఇండియా గ్రేట్ ; తెలుగోడు గ్రేట్ అనేద్దాం ; అప్పటి దాకా


జిలేబి
సైనింగ్ ఆఫ్
బీ లేజీ.

Thursday, May 4, 2017

తేటగీతి - హైకూలు - ఒక పరిశీలన


తేటగీతి - హైకూలు - ఒక పరిశీలనఆ మధ్య శంకరాభరణం లో శ్రీ జీ పీ యెస్ గారు ఎందుకో హైకూ ల ప్రస్తావన తెచ్చారు ; అబ్బా తెలుగు ఛందస్సు లో లేనివి ఏమైనా ఉంటాయా అనుకున్నా.

సరే ఈ హైకూలేమిటో అని గూగులిస్తే మొత్తం మీద తేలిందేమి టంటే అదీ ఓ మోస్తరు చందమే :)

మరీ చాలా సరళమైనది తేట గీతి లో ఒక వాక్యాన్ని విడ గొట్టితే మూడు పాదాలు గా హైకూ రెడీ అని పించింది.

(కొంత భావగర్భితం గా ఉండాలి - 'ఎంత ఎక్కువ కన్ఫ్యూషన్ ఉండి, ఎంత ఎక్కువ పరేషాన్ చేస్తే అంత మంచి హైకూ :) జేకే :)-

చదివిన ప్రతి వారి కీ వేరే వేరే భావాలు అర్థం అయితే మరీ మంచిది (జిలేబి మాటల్లా అన్న మాట :)

సరే
ఇప్పుడు తేట గీతి ఏమిటి ? హైకూ ఏమిటి అన్నది చూద్దాం

తేటగీతి  - ఒక సూర్య రెండు ఇంద్ర రెండు సూర్య గణాలు (మూడు , నాలుగు,నాలుగు,మూడు మూడు మాత్రలు సరళం గా అర్థం చేసు కోవటానికి.  -

3+4+4+3+3 = 17

తేటగీతి
పద్య లక్షణములు:
  1. 4 పాదములు ఉండును.
  2. ప్రాస నియమం లేదు
  3. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  4. ప్రతి పాదమునందు ఒక సూర్య , రెండు ఇంద్ర , రెండు సూర్య గణములుండును.

హైకూ ? - వికి పీడియా ప్రకారం ->  గమనిస్తే పది హేడు అక్షరాలు (వారి ప్రకారం)

3+4+4+3+3 = 17 = 5+7+5 = 17

The best-known Japanese haiku[15] is Bashō's "old pond":
古池や蛙飛び込む水の音
ふるいけやかわずとびこむみずのおと (transliterated into 17 hiragana)
furu ike ya kawazu tobikomu mizu no oto (transliterated into rōmaji)
This separates into on as:
fu-ru-i-ke ya (5)
ka-wa-zu to-bi-ko-mu (7)
mi-zu-no-o-to (5)
Translated:[16]
old pond
frog leaps in
water's sound
ఇప్పుడు ఒక తేట గీతి రాసి దాన్ని విడగొడితే హైకూ ఎట్లా వస్తుందో చూద్దాం : )

 (జిలేబి కి అన్నీ విడ గొడితే గాని అర్థం కాదు మరి :)

తేటగీతి

రోడ్డును డివైడు చేస్తోంది రొష్టు గీర
బొడ్డు అందాన్ని తిరగేసె బోడి గుండు
మెట్ల పైనించి బొమ్మలమ్మి తిరిగింది
గిట్ల రాయి హైకూలను జిగి జిలేబి‌

హైకూలు :)రోడ్డును
డివైడు
చేస్తోంది
రొష్టు గీర

**
బొడ్డు
అందాన్ని
తిరగేసె
బోడి గుండు

**
మెట్ల
పైనించి
బొమ్మలమ్మి
తిరిగింది

*"
గిట్ల
రాయి
హైకూలను
జిగి జిలేబి‌
**

చీర్స్
జిలేబి
నారదాయ నమః !

 

Wednesday, May 3, 2017

కంద గర్భిత శార్దూల విక్రీడితము - ఒక పరిశీలనకంద గర్భిత శార్దూల విక్రీడితము - ఒక పరిశీలన


ఈ మధ్య చిత్రకవితా ప్రపంచం వారి బ్లాగులో చదివిన కంద గర్భిత శార్దూల విక్రీడితమ్ (శార్దూల పద్యం లో కంద పద్యం యిమిడి ఉండటం) ఉదాహరణ చదివాక కొంత జోష్ కలిగింది; ఎట్లాగూ శార్దూలం కందం సమాంతరంగా ఔత్సాహికంగా సాధన (అనుకుంటా :)) చేస్తున్నాం కాబట్టి రెండింటిని కలిపి గట్టి కావేటి రంగా అందా మనుకుని మొదలెడితే కొన్ని జిలేబులు తయారైనాయి. వాటినన్నిటి ని  ఒక్క చోట పెడదామనే చిరు ప్రయత్నం.


శార్దూలం లో కందం ఇమడాలంటే -

మొదటి, మూడవ  పద్య పాదం లోని మొదటి అక్షరం నించి మొదటి మూడవ పాదం కందం వస్తుంది.
రెండు, నాలుగు పద్య పాదం లోని రెండవ అక్షరం నించి రెండు మూడు పాదం కందం వస్తుంది  (గుడ్డి గుర్తు :))

ఉదాహరణ

ఏలన్ బో రుచిరమ్ములౌ పురమునన్నేలన్ భళారే యనన్
గీ లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్లటన్ గానకన్
నేలన్ కాలటు జారనౌ పడతుల్ నేజెల్ల! నవ్వుల్ గనన్
బో,లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్ రొ దుర్యోధనా!

---

ఏలన్ బో రుచిరమ్ముల
లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్ !
నేలన్ కాలటు జారన
లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్


చీర్స్
జిలేబి


 

Monday, May 1, 2017

మనసా మాలిని మాట లాడ రమణీ మత్తేభ పద్యమ్మగున్ !మనసా మాలిని మాట లాడ రమణీ  మత్తేభ పద్యమ్మగున్ !చినుకుల్ నాలుగు లెక్క లార్చికురియన్ చివ్వంచు విద్యుత్తు బో
వనటన్ మామిడి కాయ లెల్ల పడెనౌ వారమ్ములో మూడు‌ నా
ళ్ళనగన్! మానవు డేమి జేయ గలడౌ లావుల్ విభూతుల్ హరీ

వనముల్ బోయెను గాలి వాటు నటనౌ వార్ధక్య కాలమ్మునన్


శుభోదయం
జిలేబి