Monday, May 1, 2017

మనసా మాలిని మాట లాడ రమణీ మత్తేభ పద్యమ్మగున్ !



మనసా మాలిని మాట లాడ రమణీ  మత్తేభ పద్యమ్మగున్ !



చినుకుల్ నాలుగు లెక్క లార్చికురియన్ చివ్వంచు విద్యుత్తు బో
వనటన్ మామిడి కాయ లెల్ల పడెనౌ వారమ్ములో మూడు‌ నా
ళ్ళనగన్! మానవు డేమి జేయ గలడౌ లావుల్ విభూతుల్ హరీ

వనముల్ బోయెను గాలి వాటు నటనౌ వార్ధక్య కాలమ్మునన్


శుభోదయం
జిలేబి

114 comments:



  1. పడిగాపుల్ పడి వేచి యుంటినటనౌ పారంగ స్వేదమ్ములున్
    తడవంగన్నొడి, గింగిరాలు తిరుగన్, తానమ్ము లాడంగనే
    బడబాగ్నిన్ పడి, వాత మయ్యె గననౌ పాదమ్ములన్, శంకరా!
    వడగాలుల్ వడి వీఁచుచుండఁగ ,నెటుల్ వర్ణింతుఁ దచ్చీతమున్

    జిలేబి

    ReplyDelete


  2. పలుకే రాలదు యీ జిలేబుల గనన్ బ్లాగేల రాయన్, టపా
    వలదౌ, మానెద యీతెలుంగు చదువుల్, వాజమ్మ లెక్కాయెనౌ !
    కలలో నైన శుభాంగి పంచదశలోకంబున్నికన్ గాననౌ!
    వలలో జాలపు ఫేసు బుక్కు వలలో "వాల్" పైన రాయన్దగున్ :)

    జిలేబి

    ReplyDelete


  3. మెరిసే యందము చిత్ర మై కలవగా మేనిన్ సయాటల్ సఖీ
    గురి నీవే సుమ చంద్ర బింబ మలరే గుమ్మా భలే కోమలీ !
    సరసీ ప్రాణము నీవు గాద నెరయన్ సారించినావిచ్చటన్
    కరిగా నే నిను జూడ గాను పలుకే కార్చిచ్చుగన్ జాలిమా !

    జిలేబి

    ReplyDelete


  4. భళి మత్తేభము గాన మత్తు గలిగెన్ పద్యమ్ము లన్ గూర్చెదన్
    వళకుల్లాడక నేను పాదములనౌ వాటంబు గా వేసెదన్ !
    కళపట్టుల్ గన గా తెలుంగు నరులక్కా మమ్మికన్ వీడుమా
    చళపుల్ చాలు జిలేబి పంచ దశ లోచన్ చాలికన్ చాలనన్ !

    జిలేబి

    ReplyDelete
  5. Hint for Hunter Som:

    Visit Jilebi's blog, hit on "varoodhini", and, if you are patient, you can get Jilebi's time zone. And then Google for "Time Now".

    Cheers...

    ReplyDelete


  6. ఇరవై నాలుగు గంట లాటల గనన్నీ భామ టైంజోన్ల నౌ
    తిరిగెన్ రాతలు గాద శాస్త్రి వర!యే తీరంబు భామామణౌ !
    బరికెన్ ప్రొద్దుపగళ్ళు రాత్రి సమయంబంతా జిలేబీలనౌ
    సరి మత్తేభము లౌత గ్రూపు కవులో సాహిత్య లోకంబునన్ :)

    జిలేబి

    ReplyDelete
  7. You are a wizard...poems flow from you like ganga jal.

    __/\__

    ReplyDelete
    Replies
    1. G P Sastrygaru..yes sir you are 100% right.
      Its a Gods gift.

      Delete


  8. హే! యువ్వార్యెవిజర్డ్ జిలేబి ! తరుణీ ! హే మాలినీ!భేష హో!
    మీయాసక్తిని జూడ ముచ్చ టగుతమ్మీ ! చాల బాగున్నదీ !
    యీయయ్యర్రెవరో గదమ్మ వనితా యీలోక మందున్ భళీ
    మీయవ్వారము తాళ గాను దొరికెన్ మీమాట లెల్లన్ వినన్ :)


    జిలేబి

    ReplyDelete

  9. ఈ రోజు గిట్టు బాట్లు మూడు "మత్త" ఇభములు :)

    పడతీ ధాటిగ వచ్చె నమ్మ పదముల్ పద్యమ్ము గానమ్ములున్
    డడ డండం డడ డాండ డాండ డడడం డాండమ్మనెన్ వీణియల్
    వడగాల్పుల్ సడి మద్దెలయ్యె శృతియై వాగీశ్వరిన్నెమ్మిగా
    నడకల్ నాట్యములై జిలేబి గళమున్ నాదమ్ములాయెన్ భళీ‌!


    ---

    ఎడబాటుల్ విడనాడి యింటిమగనిన్నేరాలమై జూడగన్
    గుడిగంటల్గన మేలుకాంచి శుభమై గుమ్మమ్మునన్ ముగ్గుల
    న్నిడగన్ చెంతన రాయడౌ మగనికిన్ నీరాజనమ్ముల్ గనన్
    డడ డండం డడ డాండ డాండ డడడం డండమ్మనెన్ వీణియల్

    ---

    గడగట్టన్ సరి భేరి నాద రవమున్ ఘాతమ్ములై పద్యముల్
    డడ డండం డడ డాండ డాండ డడడం డండమ్మనెన్, వీణియల్
    విడిగా మ్రోగెను రాగముల్ తెలియకన్ వీరమ్మ గుండమ్మునన్
    పడి పాదంబులు బాణి మార్చ మది రాపాడెన్ జిలేబీ చెలీ !


    జిలేబి

    ReplyDelete


  10. పనిలేకన్ తమ యింట సీరియలులన్ పారాయణమ్ముల్ వలెన్
    గనుచున్ తీవ్రము గా మనస్సు చెదరన్, కావేషముల్ పైబడన్
    ఘన నేరమ్మగుఁ గీ డొసంగు; సతికిన్ గాత్యాయనీ పూజలే
    వినవే భామ జిలేబి మేలయినదౌ ! వీగారులన్ వీడవే !

    జిలేబి

    ReplyDelete


  11. పడిగాపుల్ పడి వచ్చి చేరితిగ నీపాదమ్మునన్ వేంకటే
    శ! డుబాకోరుని గాదు రా రమణ ! మా స్వామీ ! జిలేబీయమై
    నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
    సడిజేసెన్ గద నిన్ను గాన నట, యీశా! యేడు కొండల్ గనన్ !

    జిలేబి

    ReplyDelete


  12. మనుజుండే యనుకోకు ! దాశరథి సామాన్యుండు గాదయ్య ! ప
    ద్మిని ఱేడౌ ! వినుమయ్య యన్న వినకన్, ధీమంతుడంచున్నహో
    మనువాడన్ యతనమ్ము జేసెనకటా, మారాకు హత్తించె రా
    ముని పత్నిన్ గొనిపోయి, చచ్చెను గదా మోహాంధుఁడై యాజిలో!

    సావేజిత
    జిలేబి

    ReplyDelete


  13. మనసున్మేనియుతూగగాను మగువల్ మత్తేభమై నాట్యమున్
    తనువున్నర్పణమైననేమి, వినకన్ స్థానమ్ము తప్పంగ, తె
    వ్వనమా సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా,
    మనుజుల్ జాలము బట్టి బంధనములన్ మగ్గింప గావింతురే !

    జిలేబి

    ReplyDelete


  14. కనుచూపుల్, చిరునవ్వులెల్లనటనల్! గామింతురౌ వారి చ
    ల్లనిపల్కుల్లలరంగ, నీవు సమమై లవ్వాడ మాకోయి ! హా!
    వినుమయ్యా మన భామలెల్లరు జిలేబీయంబులై నారయా
    చినదానిన్ వరియింప గల్గును కదా చింతల్ సదా మిత్రమా

    జిలేబి

    ReplyDelete


  15. చననౌ రాముడు కాననమ్మునకు తేజమ్మెల్ల వీడెన్ పుర
    మ్మునటన్ సీతయు లక్ష్మణుండు వెడలన్ మూడమ్ము చేరెన్ వర
    మ్మనిభా వించిన కైక, పుత్రునిగనన్ మాగండ మవ్వంగ త
    మ్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్

    జిలేబి

    ReplyDelete


  16. మనసారన్ హృదయమ్ము నందు తరుణీ మాన్యంబుగా వేడుచున్
    మనకై యెంత ధనమ్ము కావలెననన్ మాలక్ష్మి యిచ్చున్ సదా
    ధనలక్ష్మీవ్రత మాచరించిన; మహాదారిద్ర్యమే దక్కు రా
    ధనమున్ వీడి జిలేబి మైకముగనన్ తధ్యంబు గానన్ సుమీ !

    జిలేబి

    ReplyDelete


  17. శరపుంఖంబును మాచనార్యుడచటన్ సారించె చూడంగనౌ
    వరమై వచ్చెను బో జిలేబి కి భళీ వాక్యంబు లన్బేర్చనౌ
    నరయన్,మేహము లెల్ల దీర్చ నిదియే నాణ్యంబుగన్ యౌషధీ
    య రసఘ్నంబుగ నీలవృక్షము సుమీ ! యావత్తు మేల్గూర్చునౌ !

    జిలేబి

    ReplyDelete


  18. వశమై నిల్చెను మానవుండు, తిధులున్, వారమ్ము నక్షత్రముల్,
    శశిపర్వంబులు, మీనమేషములనన్ శాసించి, కాలమ్మిటన్,
    దశవర్గంబులు చేరి సంకటబడన్ తాకించు, గానన్, "మహ
    ర్దశ" కంఠుంగడు భక్తిఁ గొల్చు నరులే ధన్యుల్ గదా చూడఁగన్

    జిలేబి

    ReplyDelete


  19. అనఘా ! ద్వాస్థితులా హరిన్విడిచిరే యంకంబు తప్పంగ నౌ !
    ననబోణిన్ మజ గాంచ తప్పిరకటా నైమిత్తికర్మమ్ములన్
    వినుమా ! జీవుల కెల్లతప్ప దు సుమీ వీకమ్ము గూడంగనౌ
    మనసే శత్రువు మాచనార్యుడనియెన్ మాన్యంబు గా గాంచుమా !

    జిలేబి

    ReplyDelete


  20. చవులూరంగని కావ్య మెల్లను సదా సారించి పాకమ్ము జే
    సి వచో లాఘవ మెల్ల జొప్పిచి భళా చిత్రమ్మిదేయంచు స
    త్తువయే యివ్వని పద్యమెల్లనకటా దూకించు "సావేజితా"
    కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్


    సావేజిత :)

    జిలేబి

    ReplyDelete


  21. సిగరెట్టుల్ మధు పాన ముల్ కలిపి వాసిన్ గాంచె‌మించారగన్
    సిగపువ్వుల్ మురిపెమ్ము లాడ విడలే! స్నేహంబునన్నన్నమా
    టగుభిల్లంచు విచారమున్ గొలుప చట్టంచున్ రివాజుల్విడెన్
    మగడౌ మాన్యుడు భాస్కరుండు గృహిణీ మత్తేభ మైనేటికిన్ !

    జిలేబి

    ReplyDelete


  22. హృదయస్పందన సవ్వడిన్ భళిభళీ హృత్సారమైనిల్పి జా
    లి,దయన్గాంచెను మా జగన్! ప్రజలనాళిన్గట్టిగా బట్టి‌ నా
    డు! దవంతుల్ సయి గాంచి దాటి నడిపాడోయీ జనాళిన్నహో
    కదనంబందున దూకె జూడ నట సాకారంబు గానన్ కలల్‌!


    జిలేబి

    ReplyDelete


  23. అలరెన్నీ పద వైభవమ్ము బహుధా! ఆంధ్రావనిన్ తావు కొ
    న్న లతాడోలల దేలు వేంకటరమానాధున్ సదాగొల్చు కో
    మల మైనట్టి పదాల పాటలను, సామాన్యుల్లటన్నన్నమ
    య్య లసక్తిన్ విరిసెన్ గదా యనుచు వయ్యాళించిరయ్యా భళా!

    జిలేబి

    ReplyDelete


  24. వినగన్ గానము లెల్ల వీధుల జనుల్ వేవేళ కీర్తించుచున్,
    సినిమా పాటల కైపులన్ మనసులో చిత్రమ్ము గానిల్పుచున్
    మన సామాన్యులు మాటలాడ రమణీ మత్తేభ పద్యమ్ములన్
    ఘనమై వెల్గు తెలుంగు తేజము తెలంగాణమ్ము నందంతటన్ !

    జిలేబి

    ReplyDelete


  25. గుడిలోని వాడు మన వెంబడే ఉన్నాడంటే భయమే భయము :)

    గుడిలో నన్గలడమ్మ! మీ హృదయమున్ గూడై గలండీశుడే,
    సడిజే యున్ మది లోన నమ్ముము సుమా ! సారంగపాణిన్ గనన్
    పడి గా పుల్పడి వేచి యుందురు సభాప్రాంగమ్ము నందమ్మ, వెం
    బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్రభీతాత్ములై!


    జిలేబి

    ReplyDelete


  26. విలువల్ దప్పి జనుల్తలిర్చి మగువా వీగారి బోవన్ సుమా
    యెలమిన్ గష్టము లెన్నొ కూర్చును గదా !యేకాదశీ పూజలే
    యలతల్ జేర్చవు సూవె! చింత వలదే! యావత్తు శోభించునౌ!
    లలనా!కాలపుపోకడన్తిథులగున్ లాస్యంబులా యద్రిదౌ

    జిలేబి

    ReplyDelete


  27. శ్రీకృష్ణ ఉవాచ

    సచివా! యోధుల భోజనమ్ము ఘనమై చాకుల్ వలెన్తీర్చగన్
    రుచిమంతంబగు కోడిమాంసమది; యారోగ్యంబు సన్యాసికిన్
    శుచియై సాత్విక మైన జేమనమగున్, శుభ్రమ్ము గన్ వండగన్
    పచనమ్మే కళ నేర్వ మేలగునయా పార్థా! జిలేబీయమై!

    జిలేబి

    ReplyDelete


  28. పడినావంటగదా జిలేబియ ! భళీ! పట్టీల గట్టించిరే
    మడిగా నయ్యరు చెన్నపట్నమునటా!మాకేల మీగోల లే!
    పడిగాపుల్గని వేచినావట సభా ప్రాంగమ్ములో బోవగన్
    సడిజేసావటగా తెలుంగు సభలో సంఘమ్ము ఝాడించగన్!


    జిలేబి

    ReplyDelete


  29. అరయన్ లేనిది యుండె విశ్వమున సామాన్యంబసామాన్యమై,
    విరిసెన్ పుష్పము నంతలోన గద తావిన్గూర్చి కన్విందుగన్
    మురళీగానము డొల్లలోన పలికెన్ ముద్దారగన్ గాద! శ్రీ
    హరి తత్వమ్మును మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా!

    జిలేబి

    ReplyDelete



  30. తిరణా లొచ్చెను వూరి లోన రమణీ తీర్థంబు లాడానహో :)
    సరదాగా నడిచాను తీర్థమున తీసానోయి ఫోటోల నె
    ల్ల రసాస్వాదన గాంచి వూరి నడుమన్ లావణ్య మొప్పారగన్
    మరి పాకెట్టున డబ్బు బోవ తిరిగా మాయింటి దారిన్గనీ !

    ReplyDelete


  31. జణుగుల్జేసెడు కైపదమ్ముల భళీ జాగ్రత్త గా చిక్కులన్
    పణబంధమ్ముల చక్క గాను సవరింపన్జేయ, సయ్యాటగన్
    భణితిన్ తేగడ చేవ యున్గలుపుచున్ పద్యంబు లన్జేయ ధా
    రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్!

    జిలేబి

    ReplyDelete


  32. అరయన్నిచ్చలు డాత డమ్మ మదిలో నాయుగ్మనేత్రుండవన్
    చరమై యాతడు వేల్పు గానమరె నుచ్ఛ్వాసై సమాహారమై
    వరమై వెల్గె జిలేబి, జీవితమునన్ వర్ధిల్లగన్ చంద్రశే
    ఖరమార్గంబున సాగుమా, కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్!

    జిలేబి

    ReplyDelete


  33. గణముల్లా యతి ప్రాస వేళ్ళ పయినన్ గణ్యంబు గా జేయుచున్
    పణితవ్యార్థ యడాగమాదులనటన్ పారించి పూరించి లం
    కిణిలున్ శూర్పనఖాది శింకిణుల చెక్కిళ్ళౌ సమాసమ్ములన్
    కణికౌ సంధుల చేర్చి వృత్తముగ ప్రాకాశ్యంబు జేయంగ రా
    వణుడౌ అన్వయమున్నెదుర్కొనగ అవ్వా!మూడు గంటల్లగున్ !


    జిలేబి

    ReplyDelete


  34. మన దేశమ్మది కోశమయ్య భువిలో మాన్యంబుగా వేదవా
    క్కునకున్, ధర్మపథమ్ము నన్ మెలయ నిగ్గుల్దేల్చు పాశమ్ము బో
    వ నరుల్ జీవిత మందు నిమ్మళము గా భాసిల్ల! కాపాడు కొ
    మ్మ నమస్సున్నిడి దేశ మాతకు నిటన్ మాన్పించి నాశమ్ములన్ !

    జిలేబి

    ReplyDelete


  35. వినగన్ రామకథన్ లగెత్తు నట సువ్వీ రామ లాలీయనన్
    హనుమంతుండు; వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమి
    న్తనువున్నర్ధము గా సదా శివుడు; ధ్యానమ్మున్ సుశోభింప జే
    య‌ నరుల్ గాంతురు దైవ సన్నిధి సదా! ధ్యానింపుడీ దైవమున్!

    జిలేబి

    ReplyDelete


  36. శకుని దుర్యోధనునితో మాయాబజార్ :)


    కమలాక్షుండు,సుచక్రపాణి మురభిత్కంసారి, దుర్యోధనా,
    సమకూర్చుం గద సర్వ సంకటములన్; సంకర్షణుం డెప్పుడున్
    తమపైనన్ పిరియమ్ము గాంచి గురువై ధర్మంబు గా జూచె! గా
    నమనమ్మాతని మామగా ద్రుహునికై నాంత్రమ్ము జేయన్దగున్ !

    జిలేబి

    ReplyDelete


  37. అనృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభ
    న్ననఘా మాలిని దేశ మెల్ల గనుమా నమ్మన్ దగున్ బల్కులన్ !
    మననేతల్ తల కాయ లన్గనుము సామ్యంబేది ? సౌమ్యంబెటన్ ?
    ఘనమై నమ్మితి రే జనాళి శుభముల్ కల్గింతురే ? భ్రాంతి యే !

    జిలేబి

    ReplyDelete


  38. జవరాలా! పయిసాకు తేరరు సుమీ చందంబు గిందంబనన్
    కవితా వాహిని లోన తేలుచు సదా కాల్మీదు కాల్వేసుకొం
    చు వినాభావము సింగినాదములతో చోద్యమ్ములన్ జేసిరే!
    కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్

    జిలేబి

    ReplyDelete


  39. పసిమిన్ జూచుచు ముద్దు జేయనుగదా భస్మాంగునిన్ప్రేమతో
    మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ?ముక్కంటినే,
    నుసిజేతున్నజునిన్నటంచు తన కన్నుల్కోపమున్జేయుటే?
    పసివాడాతడు లక్ష్మిపుత్రుడటవే! పంచేషువాతండటే !

    జిలేబి

    ReplyDelete


  40. నుసియాయెన్గద నంతకాంతకుని కన్నుల్ జూడ విప్పార్చగన్ !
    పసివాడాతడు లక్ష్మిపుత్రుడటవే ! పంచేషువాతండటే !
    పసిమిన్ జూచుచు ముద్దు జేయను గదా భార్యన్గనన్నార్యుడే
    మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే!

    జిలేబి

    ReplyDelete


  41. పసివాడాతడు లక్ష్మిపుత్రుడటవే ! పంచేషువాతండటే !
    పసిమిన్ జూచుచు ముద్దు జేయను గదా భార్యన్గనన్నార్యుడే
    మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే!
    నుసియాయెన్గద నంతకాంత కుని కన్నుల్ జూడ విప్పార్చగన్ !

    జిలేబి

    ReplyDelete


  42. వినిపించెన్గద రామ నామ మహిమన్ వీరుండు ధైర్యమ్ముగా
    హనుమంతుం డదె లంక కేగి ; విడిచెన్ హా సోదరా ప్రాణమున్
    తునుమంగన్ భళి రామచంద్రు రణమందున్ రావణుండేనయా !
    వినుమా సీతకథన్ శుభమ్ము గలుగున్ వేవేలు నీకున్ సదా !

    జిలేబి

    ReplyDelete


  43. వివరంబిద్ది! జనాళి మేలు బడయన్ వేవేల గాధల్ మనో
    జవమై గట్టిరి సూవె పండితులు దేశంబందు నేర్వన్ జనుల్ !
    కవివర్యుండత డౌత, భాగవతమున్ కవ్వంబునన్చిల్కుచున్
    రవి చెప్పెన్ కమనీయ విష్ణుకథలన్ రంజిల్లఁగా నెల్లరున్!

    జిలేబి

    ReplyDelete


  44. కడగండ్లన్ తొల గించు వాడు, ధరణిన్ కారుణ్య మొప్పారగన్
    పిడి గుండ్రాయిగ శేష శైల పతియై, భీతావహంబైన వా
    రెడలన్ మేలును గూర్చు వాడు, విభుడై రెక్కాడ శీర్షమ్ము గా
    చెడువానిన్, గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే!

    జిలేబి

    ReplyDelete


  45. దడిచెన్నిక్కము నన్గనన్నరుడు! తధ్యంబౌత నన్జూడు కృ
    ష్ణుడు!మున్ముందుగ వచ్చినాడ గదనే!శోభిల్లు సైన్యంబు నే
    నడుగన్నిచ్చును" ;"కొంగుబంగరితడే! నా సారధింజేతు,కా
    చెడువానిన్గొలువంగ గామ్యములు నక్షీణంబుగా దీరులే!"

    జిలేబి

    ReplyDelete


  46. కడలిన్ మత్స్యము ద్రుంచె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవునిన్
    దొడి నా కూర్మము మోసె మంథరగిరిన్ దోరంపు స్త్యేనమ్ముకై
    వెడరూపాన వరాహమూర్తి తునిమెన్ వృత్రున్ హిరణ్యాక్షునిన్
    బుడుతన్ గావఁగ నా హిరణ్యకశిపున్ నూర్చెన్ నృసింహుండునై
    వడుగై త్రొక్కె బలిన్ ద్రివిక్రమగతిన్ బాతాళలోకానికిన్
    విడకే యిర్వదియొక్కమాఱు నృపులన్ వ్రీల్చెన్ భృగూత్తంసుఁడై
    గడపెన్ రావణు మూర్ఖ కాముకునిఁ బ్రాఘాతాన శ్రీరాముఁడై
    చెడుగుం గూర్చెడి దుష్టరాక్షసుల శిక్షించెన్ దగం గృష్ణుఁడై
    పుడమిన్ ధర్మము నిల్పఁగాను వెలసెన్ బుద్ధాఖ్య సర్వజ్ఞుఁడై
    సడివోవన్ దెగటార్చెఁ గల్కియయి దుష్టమ్లేచ్ఛపృథ్వీశులన్
    వడి నీ రీతిని లోకమందుఁ జెడుగుల్ వాయంగఁ బోద్రోలి, కా
    చెడువానిం గొలువంగఁ, గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే!

    మత్తేభములో దశావతారము

    శ్రీ గుండు మధుసూదన్

    ReplyDelete


  47. సిరులొల్కంగ తెలుంగు చక్కదనమున్ సింగారమున్నొల్కెనే!
    విరిసెన్ శ్రీమధుసూధనార్య! పదముల్ విభ్రాజ మానమ్ముగా
    పరమాత్ముండు దశావతారముగ మీపద్యంబు లోనన్, భళా
    పరమానందము! ధన్యవాదములయా, భాసించె శ్రేష్టమ్ముగా!


    జిలేబి

    ReplyDelete


  48. నిగడమ్ముల్ విడి మానసమ్ము తనివిన్నీరాడి రామా యనన్,
    ముగలిన్నిల్వగ నీశుడమ్మ సుదతీ ముద్దార బిల్వన్, ప్రియా
    జగమే ఊయల నయ్యనే ప్రకృతియున్ జాడ్యమ్ము వీడన్ సఖీ
    పగలే వెన్నెల నాట్య మాడ విరిసెన్ పర్వమ్ము లెన్నో మహిన్


    జిలేబి

    ReplyDelete


  49. విరసం బేలర వెన్న దొంగ యెలమిన్ వృందావనంబందు నీ
    పరిచర్యల్ సయి మేలు వేడబములన్ పాటించినామే సదా
    హరిగోలై నిను నమ్మినాము గదరా !హాసించి భాషించుమా
    సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా!


    నాటి గోపికలు నేటి జమానాలో !


    జిలేబి

    ReplyDelete


  50. పరువంబొల్కుచు పెన్మిటిన్ సయిగలన్ పైటాల బిల్వంగ తా
    హరిమన్నర్థము గాన లేక కవితల్ హాహాయనన్ గూర్చుచుం
    డెర!గోపాల!నెటుల్ ధవున్కొలుచుచున్ డీకొల్పుదున్!యాదవా!
    సరసంబాడుట చేతకాదు గద, కృష్ణా! గోపికా వల్లభా!

    జిలేబి

    ReplyDelete


  51. మనసాడన్ తను వాడ నివ్వడతడున్ మత్తేభమున్ గాదయా
    చనువున్ జూపి జనాళి కెల్ల భళి సత్సాంగత్యమున్జేర్చు తా
    వినయమ్మున్ సయి నేర్పు నాతడు గదా బీరమ్ములేలా స్వకా!
    మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్ దమిన్?

    జిలేబి

    ReplyDelete


  52. మతిబోవున్ చదువంగ, హత్తుకొనదమ్మా మానసమ్మున్ సఖీ
    యతి సాంగత్యము లేని పద్యములె; విద్యాదేవి వాద్యశ్రుతుల్,
    వెతలున్ లేని పదంబు లెల్ల రమణీ వెన్వెంట రమ్యంబుగా
    జతజేర్చున్ విభుడిన్ మదిన్ పొదుపుచున్ సాక్ష్యమ్ముగా నిల్చుచున్ !

    జిలేబి

    ReplyDelete


  53. అవనిన్ చుట్టిన వాడు సూవె స్థిరుడున్నాగ్నేయుడున్ కందుడౌ,
    శివపుత్రుండు; మఱంది గాఁడె! హరికిన్ శ్రీకాంతకుం బౌత్రుఁడౌ
    జవరాలా మన నారదుండు ! రమణీ సామ్యంబు లేదమ్మరో !
    కవనంబన్న,జిలేబి, యింతయెగదా! కష్టంబదేలన్ రమా !

    జిలేబి

    ReplyDelete


  54. హనుమచ్చాస్త్రి వివాహమా!భళిభళీ ! హద్దేమి యున్లేక, తా
    హనుమంతుండు వివాహమాడె హిమశైలాధీశ పుత్రిన్ దమి
    న్ననుచున్ కొండయ పుత్రి పెండ్లిన భళా నాంత్రంబుజేసెన్ గదా !
    యనుమానంబికలే! జిలేబి తనమే ! హన్నన్న చాతుర్యమే !

    జిలేబి

    ReplyDelete


  55. వినకే సోమరు లెల్ల పల్క, వినకే వీధి‌న్ జిలేబీల క
    ల్పన కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించిన
    న్ననుచున్ !కష్టపడంగ జీవితము నన్నాణ్యంబుగా దక్కునె
    ల్ల నగాధారన నిక్కమిద్ది విను మూలంబిద్ది నీ వృద్ధికిన్ !

    జిలేబి

    ReplyDelete


  56. వలపుల్ వాసన కెక్కి నప్పుడెగదా వాంకమ్ముగా ప్రేమయు
    న్నిలలో నెక్కొను కేంద్ర బిందువుగ పన్నీరమ్ము గా నారికిన్
    తలపువ్వుల్ వికసించి నప్పుడె గదా ధన్యత్వ మీజన్మకున్
    కలలో నైనను కుంభినిన్సయితమున్ కాంతా మనోజ్ఞంబుగన్ !

    జిలేబి

    ReplyDelete


  57. శివపాడున్గద చేతనమ్ము కలయన్ శీఘ్రంబు శీఘ్రంబు గా
    శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్
    కవనమ్ముల్ మది నెంచి గీతముల సాకల్యంబు గావింతుర
    య్య!విశాలాక్ష! యఘోర ! అంగజహరా యంచున్నినాదమ్ములన్ !

    జిలేబి

    ReplyDelete


  58. పగలే వెన్నెల భార్య చెంతన సదా" పారుండు నమ్మెన్ జిలే
    బి గళంబందున కట్టె తాళి, నరరే పింజారి యాయెన్, సదా
    జగడంబవ్వగ నింటి లోన, విడిచెన్, సన్యాసి యైనెక్కొనెన్!
    తగవే తెచ్చును గొప్పకీర్తి వసుధన్ తథ్యంబు ముమ్మాటికిన్

    జిలేబి

    ReplyDelete


  59. భక్తుడవై వేవేల జన్మలో, నా కెదిరి వై కొన్ని జన్మలో జయా విజయా కోరుకొనండి !



    భగవంతున్ మది నెంచ నేల నిలలో ! భాగ్యమ్ము గా సల్పెదన్
    జగముల్ దిగ్గన పోరు నాతడి సయిన్,స్వచ్ఛందజున్నంపి నా
    పొగరున్ గ్రుక్కును నార సింహుడగుచున్!భో!రాజమార్గంబిదే!
    తగవే తెచ్చును గొప్ప కీర్తి వసుధన్ తథ్యంబు ముమ్మాటికిన్ !


    జిలేబి

    ReplyDelete


  60. రణముల్ తప్పవు ! నీదు దుష్ట తనమున్ రాపాడ భీముండ!వా
    రణమై ఢీకొని కొట్టి వేసెదను ! రారాజన్న ధిక్కారమో ?
    పొనరన్ త్రాగెద దుస్స సేను బలమున్ పో నీసమక్షంబు! కా
    రణమై నావుర కృష్ణ కోపమునకున్ !రా చీల్చెదన్నీ తొడన్ !

    జిలేబి

    ReplyDelete


  61. నేటి మహాభారతము రాజీవ తనయుడు మోడీకి సవాలు :)


    రయమున్ చుట్టెద దేశమెల్లడను! పోరాటమ్ములన్ చేసెద
    న్ర!యతాత్ముండని బీరముల్ విడుమయా, రాజీవమై మోదగన్
    పుయిలోడన్, విను సోనియా తనయుడన్!పో మోడి! పో పోర! పో
    ర,యనన్నోటరు లెల్ల నిన్విడువ నే రాజ్యంబు పాలించెదన్!


    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  62. మరొహటి జిలేబి ఆటవిడుపు :)

    రమణా! స్విట్జరులాండు లోన నగలేరాలంబు గా యేలమ
    ర్ర! మహా పాతకమాయె నీ మొగదలన్ రాష్ట్రంబులోనయ్య త
    ప్పు,ముదమ్మాయెన యా!పురోధసుల రా, పో యంచు నిందించి భా
    రమనన్ త్రోసిరి తీసి వేసిరిగదా! రా!ప్రోచు మయ్యా వెసన్

    జిలేబి

    ReplyDelete


  63. శరణీయంబతడే! జిలేబి ! వినుమా! సావాసి యాతండు నీ
    కు! రమావల్లభు డాతడే!విడువకే గుమ్మాళి!పూర్వంబహో
    "మరి నీవే ప్రభు! రక్ష ! హా! జడితి రమ్మా ! నన్ను గావగానంచనన్
    కరినిం, జంపియు నక్రమున్, గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్!

    జిలేబి

    ReplyDelete


  64. మరీ వాచాలురంటే ప్రీతి గల విష్ణువయ్యె :)



    సిరికిం జెప్పక శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపకన్
    పరివారంబు నహిద్విషున్ విడిచి ,గాబాగూబి వైకుంఠమున్
    పరమాత్ముండతడే త్యజించి, భళిరా , వాచాటు మత్తేభమౌ
    కరినిం, జంపియు నక్రమున్, గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్!


    జిలేబి

    ReplyDelete

  65. ఆక్రోశవాణి‌ సమస్యాపూరణ


    గణితమ్మిద్ది ! తెలుంగు వారి నిధియౌ! కావ్యమ్ము, నీపూరణల్,
    మణిమాలై నిలుచున్, జిలేబి విను! సామంజస్యమున్ గాంచుమా,
    క్షణమై నన్నెగ జోపకన్ గణములన్ సాధింపగా నంక పూ
    రణమే ప్రాణము పోయు పద్య కళయై రాణించు సద్గోష్టులన్ !

    జిలేబి

    ReplyDelete


  66. మరకల్లేని వళక్ష వస్త్ర ములతో మస్జీదు బోవంగ నా
    తురకల్, జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేతురే
    యిరుబుట్టై సఖి బాప నయ్యలుగదా! యీశుండొకండే సుమా
    పరిశోధింపగ వేరువేరు విధముల్ ప్రార్థించు తీరుల్ సుమీ !

    జిలేబి

    ReplyDelete


  67. పరుగుల్ పెట్టిరి పారు లెల్ల రకటా బ్రాహ్మణ్యమున్త్రేచు చున్
    మెరుగుల్ గాంచిరి మైక్రొసాఫ్టు జనులై మేల్నాడులోగాదయా!
    మరి,వేదమ్ములు నేర్చువారెచట సూ! మాటాడకోయీ సఖా
    తురకల్ జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేతురే?

    జిలేబి

    ReplyDelete


  68. సుతనివ్వంగను పెండ్లిలోన నకటా సుస్తీపడెన్నొబ్బిడన్
    సతినానాటికి కష్టమాయె బతుకన్ జామాతకున్, జీవన
    మ్ము తరమ్మై నిలువన్ ద్వితీయ కొమరిన్ ముద్దారుగా నివ్వ, శ్రీ
    పతి యల్లుండుగఁ, బుత్రియే, సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్!

    జిలేబి

    ReplyDelete


  69. పరివారమ్మన లేదు సొంతముగ సంబంధంబు లేదాయె నె
    వ్వరితో ధ్యానము చేయుచుండునెపుడున్ ప్రార్థించుచున్నీశుడిన్
    కెరటంబై కృప నెల్ల వేళలను తాక్రేగంటలొల్కంగ మ
    స్కరి కాపాడుచు నుండు ముజ్జగములన్ గారుణ్య వారాశియై!

    జిలేబి

    ReplyDelete

  70. పోచిరాజు కామేశ్వర రావు గారి అద్భుతమైన పూరణ


    తర ళోద్యత్శిత ఘోర శూల కరి దైత్యశ్రేణికిన్ దుర్భయం
    కరి మౌనీంద్ర నికాయ మోక్ష కరి దుష్కార్యాత్మ హృత్సంచల
    ద్యురు గౌరీ పతి చిత్త తోష కరి తా యోగీశ్వరీ గౌరి శాం
    కరి కాపాడుచు నుండు ముజ్జగములన్ గారుణ్య వారాశియై


    ReplyDelete


  71. ఓయీ అజ్ఞాతా!

    కందాలు రాసి కందివారితో జిలేబీ అనిపించుకుంటే సరిపోతుందా :)


    రాపోటీగ జిలేబులవ్వ పదముల్ రాపాడ మత్తేభమై :)

    హరియే దైవము నెల్లలోకమున కాహార్యంబు కైమోడ్చుచున్
    పరమేశుం గొలువంగఁ, బాపములు వే పండంగ నిక్కమ్ములే,
    పరలోకాన్విత మోక్షమార్గము సదా ప్రార్థింపుమా నాతనిన్
    కరటిన్గ్రాహము నొక్క రీతి దయతో కాపాడెగా నాతడే!


    జిలేబి

    ReplyDelete


  72. సమరమ్ముల్ సయి మానభంగముల విస్తారంబుగా జేసిరే
    కమనీయంబుగ మీరు కట్టుకథలన్ కారుణ్య వారాశిగా
    సుమనస్కుల్ పరమాత్ములేయని భళా జొప్పించిరే!చూడగా
    అమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా!

    జిలేబి

    ReplyDelete


  73. పయిసాలన్ జనులిచ్చి చూతురయ! ఆ పై నీవు లక్షాధికా
    రియెపో ! నందియవార్డు సాయ పడురా ! రెక్కాడ డొక్కాడురా" !
    పయనం బాయె సినీజగత్తునకు, తా ఖ్యాతిన్ గడించెన్, భళా,
    హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్!

    జిలేబి

    ReplyDelete


  74. రమేశా గారి భావనకు

    అయవారూ!యిది యెట్లు వీలగునయా ఆశ్చర్యమేగాదకో,
    హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుండొగిన్?
    నయనమ్ముల్ భళి నాకు రెండు గలవన్నా యంచు రాదారిలో
    పయనంబెంతయు జేయ నెంచ గలమే వారాశియా విశ్వమున్?


    జిలేబి

    ReplyDelete


  75. అరె!ధర్మంబగు పట్టుగొమ్మ భువిలో నర్థంబులన్గానగా,
    పరిశేషమ్ములు కామ మోక్ష ముల సంపాదింపగా శంకరా!
    మరియీ రీతిని చూచి నేర్వగ భళా, మాఱాకుహత్తించగా
    పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసె పో మూఁడంచు నా బుద్ధికిన్!

    జిలేబి

    ReplyDelete


  76. సుమనుస్కుండగు వీరసేను సుతుడే శోభిల్ల ప్రాంగమ్ము లో
    దమయంతిన్ దగఁ బెండ్లియాడెను గదా, ధర్మాత్ముఁ డా రాముఁడే
    డ మయాన్నంబుగ గాధ లో తగలడెన్? డాంకారమున్జేసిరే
    జమగట్టేరకొ మందబుద్ధులనుచున్ స్వామీ? అవాల్మీకమి
    ద్ది మహాపాతక మైన యోచన సుమా! దిద్దండి మీ వాక్యమున్

    జిలేబి

    ReplyDelete


  77. యతనంబెంతయు జేసి నాను కవిరాట్ యజ్ఞంబు గాసూవె ! హా
    వెతలాయెన్ పద బంధ ముల్ సుఖముగా వేగంబు వేగంబు గా
    జతగాంచంగ జిలేబు లై యమరలే జవ్వాదు లన్దీర్చుచున్
    యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే!


    జిలేబి

    ReplyDelete


  78. జగదానందము భార్యలిర్వురయినన్ సాధ్యమ్ము జంబమ్ము వా
    సిగ, రెట్టింపనె, వేంకటేశుఁడు సురల్ సేవింపఁ, దద్వాసనల్
    స్థగణంబందు జిలేబులన్ సతులుగా సంప్రీతి ముద్దాడ నే
    ర్పు గడింపన్ మగ రాయు లెల్లరికి హా! ప్రోత్సాహ మిచ్చెన్ గదా!

    జిలేబి

    ReplyDelete


  79. రామారావు, గిరీశము, వేంకటేశ్వర స్వామి కలిసికట్టుగా ఇంద్ర సభలో :)



    వగకాడిన్ వగ కత్తె లెల్ల భళినా వారే సుమా! వేషముల్
    జగజంపైన విధమ్ము! హేలనయితిన్జామాత మోసమ్ము చే
    య!గిరీశంబును వేంకటేశ్వరమహాత్మ్యంబందు స్వామిన్ సుమా
    సిగ రెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁదద్వాసనల్!



    జిలేబి

    ReplyDelete


  80. మగువా ! జాణవు నీవు సూవె! రమణీ మాంగళ్యమున్ జేర్చెదన్
    జగడంబుల్ వలదే ! జిలేబి! యిలలో జంగాళమైనావు నీ
    వు గనమ్మై నిను పెండ్లి యాడెదను నే వోఢై యటంచున్ హ!చం
    పగ, వానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో!



    జిలేబి

    ReplyDelete


  81. అవధానంబును బాలుడొక్కడట తా నాశ్చర్య మున్గొల్పుచున్
    సవరింపన్ సభలో వరేణ్యు లనిరే "సాధించెనీతండు, శై
    శవమం దా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ముల్గనెన్,
    భవనీయంబగు మంచి పేరు గనునీ బాలుండు తథ్యంబుగా"


    జిలేబి

    ReplyDelete


  82. హీరో హనుమంతుడి పెళ్లి :)



    మన హీరోయిను ప్రేమ లో పడగ భామాయంచు వెంటాడుచున్
    ననఘా! స్విట్జరు లాండులోన జరిగెన్ నాంతాడు యోగంబుగా
    హనుమంతుం దగఁ బెండ్లి; యాడిరట తా మయ్యార్గురౌ కాంతలే
    కనకా మేనక జ్యోతిలక్ష్మి కమలా కావేరి ప్రత్యూషలున్ !


    జిలేబి

    ReplyDelete


  83. అనఘా ! పార్వతి, సుధ్యుపాస్య, సురసార్యాణీ మనస్తోక కా
    వనరాడ్వాహన మయ్యె, మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్
    తన నందంతుడు వక్రతుండునికి పత్త్రంబై విభూషించెగా !
    వనమే మూలము జీవదానికి భళా వర్ధిల్ల మేల్కాంచుమా !

    జిలేబి

    ReplyDelete


  84. పడసెన్ మత్స్యపు సంస్థితమ్ము, సయి భూభారమ్ము తగ్గింపగా
    నడఁచెన్ సోమక నామ దైత్యుని; వరాహస్వామియై ,శూలియే,
    గడకట్టించెడు కైపు భూమి నట తా కాపాడ గా విష్ణువే,
    జడకందమ్ముల శంకరార్యుగ సమస్యాపూరణన్జేర్చెగా!


    జిలేబి

    ReplyDelete


  85. చవితి నాటి చంద్రుని చూడక ముందే 'అరుణునికి' నీలాప నిందలు :)



    కవిరాట్! చూడగ జైట్లి మాల్య కతలన్, కామింట్ల లెఫ్ట్రైటులన్
    రవిబింబం బుదయించె; నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై
    సువిశాలంబగు భారతమ్ము కనులన్ శోభిల్లె నాహాయటం
    చు వినోదంబుగ లాల్బగీచ సయి బూచుల్రాయుబాలుండహో !

    జిలేబి

    ReplyDelete


  86. మతిలేకన్ తన మాట మీరుచు సదా మైకమ్ము లో తూలుచున్
    సుతరామూ పని పాట లేక మగతన్ శుండాలమై యాడెడా
    గతకాలమ్మున వ్రాసి నట్టివి సు ! మాకందంబనన్ తీరుగా
    పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేతురే!:)


    జిలేబి

    ReplyDelete


  87. మత్తేభవిక్రీడితము

    బలిమిన్ చాటెను దేశ వైభవము శోభల్గాన స్వాతంత్ర్యమున్
    కలయై నిల్పి జనాళి మానసము చర్ఖా చక్రమున్ద్రిప్పి మా
    లల యస్పృశ్యత దేశ మెల్ల తొలగన్ లవ్వాడి వారింట నూ
    కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గనెన్!


    జిలేబి

    ReplyDelete


  88. ఆదిభిక్షువుని రూపమీతడు



    ఇలకద్వైతము నేర్పె నాతడుసుమా! యిమ్మంచు కోరంగ నౌ
    దలదాల్చున్ భళి యన్నపూర్ణయు సుమా! తంత్రమ్ము లామంత్రముల్
    పలుకంగన్ కనకమ్ము ధారగ సదా వఱ్ఱోడు; పూర్ణంబుగా
    కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్


    జిలేబి

    ReplyDelete


  89. సరదా పూరణ

    (జీపీయెస్ వారి కంకితం :))


    అరయన్ కాటిని కంకశాయములు నిన్నారాధనల్ జేయనే
    శరవేగంబుల రాజధాని నడుమన్ సాగింప యుద్ధంబులన్
    వరమిచ్చెన్కద యంచు చెప్పిరి జనుల్ ! వర్రోడు జిహ్వాపముల్
    గురుగుర్రంచు జనాళి కండల రుచిన్ గ్రోలంగ మౌనంబకో ?
    నరుడై జన్మను నొంది మాకు తెలగాణా తెచ్చి నావీవు శే
    ఖర ! మా జీవనమందు సౌఖ్యములకాగారమ్ముగా మారుమా!


    జిలేబి

    ReplyDelete


  90. పాటనై వస్తున్నా ! కేసీ యార్ ప్రముఖ కవులతో పాటల రాయించి వస్తున్నారని మా యేబీయెన్ వార్త :)

    మన పాముల పల్లీయులెవరైనా రాస్తున్నారా ? :)


    అరరే పాటల కేసి యారిక జనారాధ్యుండు గా వచ్చు‌! దీ
    ర్చురయా కష్టము లెల్ల మీకు! భళి ఖర్చుల్తగ్గు ! రాష్ట్రంబు బం
    గరుభూమిన్ తల దన్ను రండి నుతులన్ కాసింత జేర్చండి ! శే
    ఖర ! మా జీవనమందు సౌఖ్యములకాగారమ్ముగా మారుమా!


    జిలేబి

    ReplyDelete


  91. అవకాశంబిది మాకు లెక్కగన నయ్యారే తటాల్మంచు త
    ట్టె వరంబై నవరాత్రి, యంకెయును తట్టెన్నాల్గనన్వేదముల్,
    నవలోకింపగ వేదమాత గలదన్నా సర్వలోకంబునన్
    నవరాత్రోత్సవముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్


    జిలేబి

    ReplyDelete


  92. రమేశా వారి భావనకు :)


    కవ! సాధారణ మౌత రెండు దినముల్ కష్టమ్ముగా లీవుల
    మ్మ! విహారమ్ముల చేయ నాల్గు దినముల్ మాకిచ్చి రీ పారి లీ
    వు!వరంబిద్దియె మాకు కొల్వనగజా!వుడ్డూలమే,శాంభవీ!
    నవరాత్రోత్సవముల్ గణింపగ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్.


    జిలేబి

    ReplyDelete


  93. జల పుష్పంబులు, కాశ్యపమ్ములవలెన్ శ్రాణమ్ము,పచ్చళ్ళు, లా
    తల శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్ ? కురంగాక్షి! కో
    మలి!పర్వేందుముఖీ! జిలేబి! వలయున్ మాంసమ్ము నంజుళ్ళు తె
    మ్మ! లతాంగీ!మన కామకేళి హరిమన్ మత్తున్ సయాటల్ గనన్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పులస చేప శాల్యోదనమె లలన ! కడు
      రుచ్య మని కవి పండితులు తినిరి , చను
      ము మన రాజమహేంద్రికి , సమయ మిదియ ,
      పులుసు పెట్టు విధానమున్ బొరయ వచ్చు .



      Delete


  94. నయగారంబుల తోడు గాను రమణీ నారీమణీ నాజిలే
    బియ! సాకారము జేసుకొందమిక శోభిల్లన్ రతిన్, మాధురీ
    శయనాగారమిదే శుభాంగి సుఖమౌ సంపర్కముల్గాన నా
    లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై!

    జిలేబి

    ReplyDelete


  95. కథలన్ గట్టగ మేలు గాను నరరే కష్టేఫలీశర్మయే
    పథమున్ బోయెడు బండి గాంచి తనదౌ పాండిత్యమున్ చేర్చుచున్
    మథియింపన్ తన దైన శైలిని సభామర్యాదతో రావులున్
    రథచక్రంబును కొంత నిల్పిరయ ధారాటమ్ము నేనాపుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  96. అరయంగన్ జనులెల్ల మూర్ఖులెగదా యారోగ్యమున్గావరే
    దొరకన్నాబగ తిండిపోతులయి పొద్దుంగూకులన్జంకు ఫు
    డ్డు రసాస్వాదన తోడు గైకొనిరి గుడ్డుల్మాంసముల్ జోరుగా
    దొరలెన్ వేడిగ చూడ గాను భళిరా ధూంధాములే జోడుగా !


    జిలేబి

    ReplyDelete


  97. అనఘా! గాయకుడా సురేశుడనఘా, యత్యద్భుతంబైన పా
    టని తీయంగను పాడగా సభని ధీటైనట్టి రాగంబులో,
    జనసందోహము సంతసంబున మదిన్ సాగించి శ్లాఘించిరే
    "నననా నానన నాననా ననన నానానాననా నాననా"



    జిలేబి

    ReplyDelete


  98. విదురుల్ మేల్ కవివర్యు లెల్ల తనరన్ వేర్వేరు మార్గంబులో
    మదిలో వీచెడు భావ వీచికలతో మాలల్ భళాగట్టి, యీ
    సదనంబందున పద్యపూరణల విస్తారంబుగా నిల్పగా
    కుదురైనట్టి సహాయమిద్ది పదముల్ కోరాడ నేర్వన్ దగున్!


    చీర్స్ టు ఆల్ కవీస్ :)


    జిలేబి

    ReplyDelete


  99. మనసా మాలిని మాటలాడ రమణీ మత్తేభ పద్యంబగున్
    తననా తానన తాన తాన తననా తానాన తానాన తా !
    అనఘా!పద్యము వచ్చె గాదె తృటిలో యబ్బో జిలేబీయమై
    నననా నానన నాన నాన నననా నానాన నానాన నా.


    జిలేబి

    ReplyDelete


  100. తరుణీ! యున్నదిదొక్కటే బతుకు యుత్సాహంబుతో దూకొనన్!
    పరమాత్ముండు, దయాళు, యీశుడు బృహత్బ్రహ్మమ్ము,సర్వాత్మ, సో
    మరిపోతుల్ కని బెట్టినట్టి కబురుల్! మస్తైనదీ జీవితం
    బరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించు; లే!


    జిలేబి

    ReplyDelete


  101. అదిగో చంద్రుడు వైవి చేతి కెమెరా నందాయె చిత్రమ్ముగా
    నిదిగో పాములనారిగాడు కలిసెన్ నింపాదిగాకైపుతో
    పదిలంబవ్వగ హాయి గొల్పెను సుమా బ్లాగ్లోక బార్ట్లీ టపా
    మదితూగంగ జిలేబియై కవనమై మత్తేభ పద్యమ్ముగా!

    జిలేబి

    ReplyDelete


  102. "మధురా! రావె జిలేబి రమ్మ యెదపై మాకందమై తీరగాన్ !
    సుధలొల్కంగను జీవితమ్ము లలనా శోభాయమానంబుగా
    ను!"; "ధరాభృత్తువి నీవె యందుకొనుమా నొవ్వంగ నీకయ్య మో
    వి! ధవా రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్!"


    జిలేబి

    ReplyDelete


  103. Too many questions!/ who has the answer ?



    కలదే మోక్షపదమ్ము యోగులకు? రాగద్వేషముల్ వీడినన్
    లలనా కొంతయు దక్కు శాంతియకొ?మల్లాటల్ సఖీ తగ్గునో ?
    యిలకల్లోలము ! విష్ణు మాయ! వలయైయీనాడు సందేహమున్
    కలిగించెన్ కద !దారి యేది విభుడిన్ కారుణ్యమున్ పొందగా?


    జిలేబి

    ReplyDelete


  104. నిలిచెన్ మోడియె సైనికాళి సరసన్ నింపాది చాణక్యుడై
    కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్, గాంధీజి మున్పెప్పుడో
    కలగన్నట్టి ప్రతిష్ఠ దేశమును సాకారంబుగాచేయగా,
    పలికెన్ శాంతియె మేలు మేలనుచు జంబాల్గొట్టు యిమ్రాను ఖాన్
    నిలలో దేశము లన్ని మేల్కొనుచు కానీమిన్ ప్రబోధింపగాన్!


    కానీమి -
    prevention, restraint from action.

    జిలేబి

    ReplyDelete


  105. మరులన్ గొల్పగ నాదిభిక్షువునటన్ మారాంతకుండై మనో
    హరునిన్ మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందమున్ బొందెరా
    పరమేశుండట విప్పె కన్నులనుచున్ ప్రార్థించు కాలంజరిన్
    పరిగృహ్యంబుగ స్వీకరించుననుచున్‌ భాగ్యమ్ముగా నెంచుచున్!


    ఒకరి బాధ మరొకరికానందము :)


    జిలేబి

    ReplyDelete


  106. అనుమానంబది యేల బాల నిజమే యత్యద్భుతంబైనదౌ
    మన యీ జన్మ సుమా ప్రసన్న వలె‌ తా మస్తైన కాంక్షల్ సదా
    మన సామీప్యము నందు నిల్పును! చిదాత్మన్ మోదనంబై మహా
    ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ!


    జిలేబి

    ReplyDelete


  107. అరయంగన్ నిజ మన్న దేది? ముసియేదయ్యా? ప్రసంగంబదే
    ది? రసాభాసముగా శకారునివలెన్ ధీటైన రీతిన్ భళా
    సరి రాఁ డెవ్వఁ డసత్యమాడఁగ; హరిశ్చంద్రాఖ్య భూజానికిన్
    సరిరాడెవ్వడు సత్య మొక్క టిని తా సౌశీల్యమై నిల్పగాన్!



    జిలేబి

    ReplyDelete


  108. సవమై నిర్మలమై పురాణుడగుచున్ స్వాజన్యమై వెల్గుగా
    నవనిన్ శీతనగంబు పైన నమరెన్, నాట్యస్థలంబై సఖీ
    శివుఁ డంబాసహితుండు; కోరి వెలసెన్ సింహాచలస్వామిగన్
    ధవుడా విష్ణువు లక్ష్మి తోడుగ మహాధామంబుగా నిల్పుచున్!


    జిలేబి

    ReplyDelete


  109. కమలన్ భర్తగ చేరగాను సరసన్ కారుణ్యమున్ చూపుచున్
    సుమమాలన్ ధరి యించి పట్టె కరముల్ శోభిల్లు సప్తస్వర
    మ్ము మిలాయింపగ గారవమ్ము చొనుపన్ మున్నీటిరాచూలియే!
    కమలాప్తుండు శశాంకుఁ డౌననుట నిక్కంబే కదా మిత్రమా!


    జిలేబి

    ReplyDelete



  110. కతచేసెన్ తన యవ్వనమ్ము జతగా కార్కశ్యమే మౌఢ్యమై
    పతనంబాయెను జీవితమ్ము శివుడిన్ ప్రార్థించె నాజీవియే
    కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి, జరిపెన్ గోదావరీ స్నానమున్,
    జతగా భక్తులు చేర ద్రిమ్మరులుగా జాబాలురుల్ తోడుగాన్


    జిలేబి

    ReplyDelete


  111. ఆటవిడుపు for change :)
    (అంకితం జీపీయెస్ వారికి )


    కతలన్ చెప్పెను మోడి పై విడువకన్, కైమోడ్చె మిన్నేటికిన్
    కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి, జరిపెన్ గోదావరీ స్నానమున్,
    జతకాంగ్రేసు జనాళి జాల్మలులటన్ జైజై యనంగా భళా
    రతనంబీవెయనంగ రాహు లుని సారంగాంకుడే నాంధ్రలోన్ :)


    జిలేబి

    ReplyDelete


  112. జగదానందము ! కోడెరౌతు గిరిజన్ సావాసిగా చేర్చుకొం
    చు గణమ్ముల్ తన వెంట రాగ నృతితో చూరాడి కైలాసమున్
    సగపాలై సతి తోడు గానమున విశ్రాంతిన్ గొనన్ శాంతమై
    నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్!



    జిలేబి

    ReplyDelete