Saturday, May 20, 2017

కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !



 
కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !
 

ధనజాతకమునకు జిలే
బి, నవనవ యనియటు కాసు బిరబిర వచ్చున్ !
గనవమ్మా నీవున్నటు
కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !
 
 
జిలేబి




211 comments:



  1. కష్టేఫలే శర్మగారి సాయిన్సు తేట గీతి - ట్వీటు ట్రీటు :)

    బిందె నీటిని తలకిందు బెట్టి చక్క
    గాను పలుచని వస్త్రము గట్టి కొంకి
    నసరి గట్టి దానిచలువ నతల నిడిన
    మండు వేసవిలో చలి మెండు సుమ్ము


    జిలేబి

    ReplyDelete


  2. భీముని పలుకులు చంద్రశ్రీ వృత్తము

    ప్రకోపమ్ముల్గూడున్, రణమున పారింతు రక్త
    మ్మకో! శాపమ్ముల్ తీర జనుల మారాటముల్ ప
    న్నుకో! పాపమ్ముల్ పండగ మిము నూర్చంగ నిక్క
    మ్మకో! తాపమ్మున్ తీర్చనిక సమాఘాతమే కో !

    జిలేబి

    ReplyDelete


  3. జిలేబీ! పద్యమ్ముల్ చదువను చింతించ లేనౌ!
    భలే! పన్నుల్ వేయన్ తగుదువు భాసించ వమ్మా!
    చలాకీ ! నీ భాగ్యమ్ము గద సొసాయించ లేద
    మ్మ లాఠీదెబ్బల్లన్ గురువులు మాసక్క గానౌ :)

    జిలేబి

    ReplyDelete

  4. ఓయమ్మా! ప్రాసలకై
    న్యాయమ్మా యిటుల మమ్ము నాదమ్ములతో
    వేయించడము జిలేబీ !
    సోయగముల నోలలాడు సొగసరి వలదే !

    జిలేబి

    ReplyDelete


  5. కోయంటే కొల్లలుగా
    నేయగ పదముల జిలేబి నేతరి వోలెన్
    మేయము లాయెన్ పద్యము
    లౌ యతి గణముల జతగని లావుగ నిచటన్ !

    జిలేబి

    ReplyDelete


  6. కలికి! కౌగిలి ప్రాణాంతకారి గాదె,
    పలుకుల కొలికి! నెలతుక! పదముల వలె
    నను పిడినిడుచు పట్టుగ నలిపి పిండి
    జేయ వలదు జిలేబియ! చేవిడు చెలి :)

    జిలేబి

    ReplyDelete


  7. కోపము నషాళమున కం
    టే! పాగల్పన్ జిలేబి టేటే పలుకుల్ !
    సాపాటు రాయుల టపా
    మా పై తోసితివి గాద మర్కట రమణీ :)

    జిలేబి

    ReplyDelete


  8. ధారా ళంబుగ గాధల
    నేరాలంబుగ జిలేబి యెన్నిటి నో శ
    య్యై రాసెన్నందులనన్
    శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్!

    జిలేబి

    ReplyDelete


  9. పద్యలక్షణాల గురించి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన “అనుభవాలూ – జ్ఞాపకాలూను” పుస్తకంలో ఇలా అన్నారు (రెండవ భాగంలో 23వ అంకం/Chapter లో) :-

    ” ఛందస్సు తెలిస్తే కవే అయివుండనక్కరలేదే దెవరయినా కట్టెయవచ్చు పద్యాలు.

    అయితే, అవి కమ్మెచ్చున లాగినట్టు నడిపించడం వొక విశేషం.

    కొలతలు తప్పకుండా సమపాళాల్లో బొమ్మ గియ్యడం యెలాంటిదో, వ్యాకరణ దోషాలు దొర్లకుండా రచన చెయ్యడం యెలాంటిదో, నడక చెడకుండా పద్యం కట్టడమూ అలాంటిదే. పద్యాని కుండవలసిన యోగ్యతల్లో మొదటి దిది.

    నడక అంటే యెగుడు ల్లేకపోడం మాత్రమే కాదు, రెయిలు పెట్టెలకు లాగ అనుస్యూతత యేర్పడాలి.

    ఏమంటే?

    ఎంత నేర్పుండినా యిటుకలు పేర్చినంతమాత్రాన గోడ కాదు, బెందడీ – సున్నమూ – లేక సిమెంటూ వంటి బంధకాలుండాలి, యథోచితంగా.

    అలాగే, గణయతిప్రాసలు సరిపుచ్చి మాటలు బిగించినంతమాత్రానా పద్యం కాదు, ఆ మాటలకు పొందికా, బిగువూ ఏర్పడాలి, విశిష్ట సంధానంతో.

    అలా చెయ్యగలగడానికి చాలా సాధన చెయ్యాలి, ప్రత్యేక శ్రద్ధతో.


    గురువుల మాట గురుతెరిగి పలుకౌ :)

    జిలేబి

    ReplyDelete
  10. రావాడ కృష్ణ గారని ఒక హైస్కూలు మాష్టారు గారుండేవారు. ఆయన నాకన్నా చాలా పెద్ద వారు. కాని నాపై ఎంతో స్నేహాభిమానాలు కలిగి ఉండేవారు. అప్పట్లో నాకింకా హైదరాబాదులో ఉద్యోగం‌ కాలేదు. కొంతమంది పిల్లలకి కాలక్షేపానికి ట్యూషన్‌లు చెప్పేవాణ్ణి. అందులో సీఐగారమ్మాయి కూడా ఉండేది. ఒకనాడు నాదగ్గర పాఠం చెప్పించుకొని వెడుతూ కృష్ణగారిని చూసి మాష్టారూ‌ నా బొమ్మవేయరా అని బ్రతిమాలింది.

    అన్నట్లు ఆయన మా ప్రక్కవాటాలోనే ఉండేవారు. పైగా చాలాపేరున్న చిత్రకారులు. ఆ అమ్మాయి బ్రతిమాలితే అలవోకగా నాలుగ్గీతల్లో ఆమె బొమ్మ వేసేసారు! పోలికలు నూటికి నూరుపాళ్ళూను!

    అయన బాగా చేయితిరిగిన కళాకారుడు కనుక ఆయన అలా కొద్దినిముషాల్లో కాసిని గీతల్లో ఆమెచిత్రం గీయగలిగారు.

    లలితకళల్లో దేనిలోనైనా అటువంటి స్థాయి ఒకటి తప్పక ఉంటుంది. అలా అలా సులువుగా బొమ్మగీసేయగల ప్రజ్ఞ ఎలాగో అతి ధారాళంగా పద్యం చెప్పగలిగే‌ ప్రజ్ఞకూడా అటువంటిదే.

    మొదట కళ అన్నది పుట్టుకతో కొంత వస్తుంది. సాధన వలన మరింత మోరుగవుతుంది. పెద్దలవద్ద మెళుకువలు గ్రహిస్తే అది మహోన్నతమైన దశకు వెడుతుంది.

    గళ్ళుకట్టి బొమ్మలు వేసే దశ ప్రాధమికం. అలాగే గణాల్లో అక్షరాలు పేర్చుకుంటూ వ్రాయటం‌ కూడా ప్రాథమికం. గళ్ళుకట్టివేసిన బొమ్మను అంతర్జాతీయప్రదర్శనకు ఎవరూ ఎలా పంపరో - గణాల్లో అక్షరాలుపొదిగి కిట్టించిన పద్యాలవంటి వాటిని అందరిముందూ ప్రదర్శించటమూ ఎవరూ చేయకూడదు సుమా అని విజ్ఞులు గ్రహించగలరు.

    ReplyDelete
    Replies

    1. సృష్టి సమస్తము జిలేబియే గద !
      సృష్టి విలాసము జిలేబియే గద !

      చీర్స్
      జిలేబి

      Delete

    2. హరి ఓం తత్సత్ !

      జిలేబి

      Delete


  11. తమ కలహ యత్నములికన్
    గమనించదగును జిలేబి గట్టేరదు సూ
    వె! మదియు రాపాడ తగదు
    సుమముల కురిపించవమ్మ సుందరి నీవున్ :)

    జిలేబి

    ReplyDelete


  12. కలయైన జీవితమున
    న్నిలకడ లేని మదికోరె నిచట నలుగురిన్ !
    నలుగురి కోసము పాపము
    వలలో చిక్కిరి జిలేబివరులిచటగదా !

    జిలేబి

    ReplyDelete


  13. సీరియలుల గనన్నట చిత్ర మెల్ల
    మానసమ్మును చెట్టగ మంకిపట్టు
    నేరమగుఁ, జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము
    మేలగు జిలేబి విడువమ్మ మేరమీఱ!

    జిలేబి

    ReplyDelete


  14. ఇటుకల పేర్పుల పద్యము
    లటుగావు వినవలెనమ్మ లకుమికి పిట్టా !
    దిటవుగనవమ్మ యీ పలు
    కు టమారమ్ముల సడి సణుగుడు మన కేలా !

    జిలేబి

    ReplyDelete


  15. మాంచెస్టరు మారణ హో
    మం!చెట్టగు విధము గాద మనుజుల తీరుల్ !
    సాంచహు లోచిక్కిరిబో
    బాంచెను జనులటు జిలేబి బద్మాష్ గాళ్లై !

    జిలేబి

    ReplyDelete


  16. మాంచెస్టరు మారణ హో
    మం!చెట్టకు కారణంబు మా జ్యోతిష్యం
    టంచను గా గాంచెనహో !
    సోంచా యించిరి జిలేబి సోకుడుబుడుగుల్ !

    జిలేబి

    ReplyDelete

  17. రగడల దినముల పదముల
    పగడము గడగడ సరియగు పసగుల గననౌ
    సగపడ, కవనపు పలుకుల
    బిగువుల గురుడటు నెలకొన బిరబిర వచ్చెన్ !

    జిలేబి

    ReplyDelete

  18. పునర్జన్మల్ మీదన్ గురుడటు పూచీగ తాన
    య్యెనమ్మా !మాయాజా లమిదనియే యేసు జెప్పె
    న్ననెన్ ! యేమా యెన్బో యమెరిక! నాగాడుచుండెన్!
    సునాయాసంబౌ ధ్యానము మనసున్నన్ ఫలించున్ !

    జిలేబి

    ReplyDelete


  19. హా!తల్కము! దాశరథికి
    సీతను బెండ్లాడి, శివుఁడు శిశువుం గనియె
    న్నా తామసి పెనిమిటియై,
    లేతరి కమ్మన జిలేబు లేమరి యేనౌ !

    జిలేబి

    ReplyDelete


  20. శయ్యాసౌభాగ్యంబుల్
    వయ్యా రపునడక పద్య వాగ్ఝరి బాగుం
    దయ్యా మీ మధురగతియు
    సయ్యాటగ సాగెనయ్య శ్యామల రాయా !

    జిలేబి

    ReplyDelete


  21. మనదేశమునన్ ప్రాచీ
    న, నవ్య కథయౌ ధరణిజ నాగటిచాలున్
    తనుబుట్టెను,పెనిమిటి రా
    ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్!

    జిలేబి

    ReplyDelete


  22. హ! తు పా కులబెది రించి నె
    లతుకను పెండ్లాడెనుగద లాపర్వాహీ
    వెతలు తొలగ పడతి తిరిగె
    బతుకున్నీడ్చన్ ‌జిలేబి బార్డర్ వాగ్వా !

    జిలేబి

    ReplyDelete


  23. బుడతా బడికొస్తావా?
    పెడతా బువ్వను జిలేబి పేర్మిని గూడన్
    సడిజేస్తో ఆడుకొన
    మ్మ డమడమల యాడు వయసు మరియిదియేనౌ !

    జిలేబి

    ReplyDelete


  24. పెళ్ళికి ముందే తల్లై
    కళ్ళెము వేస్తా జిలేబి కన్నడి కనుచున్
    భళ్ళన కుండను కొట్టెను
    చెళ్ళని హాసనుడి పిల్ల చెకుముకి రాయీ‌ :)

    జిలేబి

    ReplyDelete


  25. ఓ! వైవీ ! యీ రాత
    న్నేవో మారెక్కడో గనేనుగ ద? జిలే
    బీవోలెవున్న దే ! య
    బ్బీ! వూ రేదో ? విషయము బిగిబిగి తెలుపన్ :)

    జిలేబి

    ReplyDelete


  26. ఎక్కడి కథలన్ పట్టితి
    వక్కమ్మా ! మజ జిలేబి వార్చితివిగదా
    చిక్కుల్ బడితిని సుమ్మీ
    తక్కిడి జేయంగ వాడు తప్పే వెదుకున్ :)

    జిలేబి

    ReplyDelete


  27. అమా వాస్యా ! నీవే సుమ జన భారమ్ము లెల్లన్
    సమానమ్మై జేయన్ కడియము సంజోకమున్ జే
    సి మా ప్రాణమ్ముల్లాగితివి మసిన్ బూసి! ఓ చం
    ద్రమా ! మా పాడెన్గట్టితివి సుతారమ్ము గానన్

    జిలేబి

    ReplyDelete


  28. ణిసిధాత్వర్థము కోరగ
    ముసిముసి నవ్వుల జిలేబి ముగ్ధగ నిలువన్
    మిసుకుల తడబాటుల పడి
    పసదనములను తొలగింప పతి దరి జేరెన్ :)

    జిలేబి

    ReplyDelete


  29. అర్నాబదిగో మళ్ళీ
    చర్నాకోల గొనివచ్చె సందడి జేయన్
    ధర్నాలన్ జేయన్నం
    తర్నగరమునన్ జిలేబి తాటన్వొల్చున్ :)

    జిలేబి

    ReplyDelete

  30. మానవుడు మనసు పెట్టిన
    కాని పని యని యిల నేది గలదు జిలేబీ
    ఆ నింగి నీది యత్నము
    పూనించగ నీవు సృష్టి పుట్టించెదవోయ్ !

    జిలేబి

    ReplyDelete


  31. సమసంఘనోటు ఫైవున
    జమగట్టి మనుజుడు చిత్ర చామర వీచన్
    గమనింపవచ్చి గురుడొక
    సమస్యను కెలికె జిలేబి సహచరుడుగదా :)

    జిలేబి

    ReplyDelete


  32. కొండలచట మునులవలెన్
    నిండుగ వినయముగ నిలిచె నిర్మల జలమున్
    మెండుగ యర్ఘ్యంబిడనౌ
    చండాంశునికిన్ జిలేబి చక్కటి చుక్కా !

    జిలేబి

    ReplyDelete


  33. కాఫీ త్రాగుచు కందము
    సాఫీ గా తేటగీతి చంద్రశ్రీల
    న్నాఫీసులోన సరసీ
    యే ఫీచరునైన లేమ యెక్ రంగీలా :)

    జిలేబి

    ReplyDelete


  34. టీకా తాత్పర్యములన్
    బాకా జేయుచు జిలేబి బాగుగ జేసెన్ !
    మా కాలపు మడిసి గదా !
    రాకింగుల వైవి సూవె రంగం జాలం !

    జిలేబి

    ReplyDelete


  35. మెండుగ జిలేబి వేడగ మెచ్చె కపుడు 
    మండు టెండలో కురిసెను మంచు జల్లు
    యండగొట్టక చల్లని యాశుగమ్మె
    చండ రుక్కటు దాగెను జలధరమున ! 

    జిలేబి

    ReplyDelete
  36. ఏమయ్యారండీ జిలేబి గారు !! మీ పద్యాలని మిస్ అవుతున్నామండీ :)

    ReplyDelete


  37. బాబాయని నమ్మ జిలే
    బీ_ బా యని బిల్వ నతడు, బిత్తరు బోయెన్,
    తోబాయని రమణియు ఠా
    ణా పోలీసును బిలచెను నలుగులు బెట్టన్ :)

    జిలేబి

    ReplyDelete


  38. మాతా! యేటైమ్ జోన్లో
    ఖాతా లోనన్ జిలేబి కబురుల మా కం
    తా తాయిలంబు గానౌ
    నాతతముగ తెలి యజేయు నాట్యంబిదియౌ :).


    జిలేబి

    ReplyDelete

  39. కొలగారమ్ముల సరసన
    పలుకుబడులు ముత్యమాయె పంతుల కథలన్
    కొలవెరి కాలంబిదియౌ
    కొలతలు తీయన్ జిలేబి కోపుల్ గలవో :)

    జిలేబి

    ReplyDelete


  40. తక్షణమటుకుల వడ, సతతము జాంగ్రి,
    వలయు నన్న పదముల సువాసనల జి
    లేబి, గర్మా గరమ్ముగ లెస్స ! తెలుగు
    భక్ష్యముల నా? ముదము తోడ వండ దగును :)

    జిలేబి

    ReplyDelete


  41. రెండద్దంబుల తోడన్
    డండం బనుచున్ జిలేబి ఢమరుక పదముల్
    గుండము లో రుబ్బెనహో
    భాండాగారమ్ములోన పద్యపు కవటల్ :)

    జిలేబి

    ReplyDelete


  42. పందికి వేయుదు రంటా
    జందెము పండుగ దినంబు జరజాగ్రత్తా
    పందియు వరాహ మూర్తిగ
    అందరి పూజలను గైకొన వెలయు తంబీ :)

    జిలేబి

    ReplyDelete

  43. ఓసోసీ రమణీ నీ
    వేసము మాకు తెలియదని వేడుక వలదోయ్ :)
    జాసూసీ తాతల్ బా
    జా సూవె జిలేబి నీకు జాతర యికనోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  44. ఎంత వారలైన జిలేబి, యీడు నందు
    కాంతకై తపింతురు, వార్ధకమున మిగుల
    వింతగానగుపించును విషయ మెల్ల
    కొంత కాలపు సరదాలు కోతి పుండు :)

    జిలేబి

    ReplyDelete


  45. అనిసా కథలన్ పారుడు
    సునిశితముగ లొసుగుల గని సూక్ష్మము బట్టెన్ !
    వినియోగదారులెవరో
    కనిబెట్టి సరసన జేరక పరుగిడుదురో :)

    జిలేబి

    ReplyDelete
  46. // అనిసా కథలన్ పారుడు....//
    👌👌👌 😊

    ReplyDelete


  47. నిను తెలుసుకొనగ లేదని
    మనుజుండా చింత యేల మదిలో! సతతం
    నిను వీడకయున్నా మరి
    నను నీవటు చూడలేక నకనక లేలన్ !

    జిలేబి

    ReplyDelete


  48. పద్యము వ్రాసిన యేమిటి
    చోద్యం బందురు జిలేబి జోజో బజ్జో :)
    ఆద్యులు పారులు గదవే
    సేద్యము జేయుచు పలుకుల సేవధి బేర్చున్ :)

    జిలేబి

    ReplyDelete


  49. సెల్ఫోనుదండ కంబును
    కుల్ఫీ వోలె కవివరుడు కూర్పుగ జేసెన్!
    జల్పంబుల దేవి గదా
    బల్, "ఫం"బులతో నమనము బంహిమ జేయన్ :)

    జిలేబి

    ReplyDelete


  50. కాలేజీ ధర్మాత్ముల
    మేలగు రీతుల్, విధవల మేల్మిని గను! యీ
    కాలము లోను విరివిగ వి
    శాలంబగు హృది జిలేబి సాధ్యము గనవే !

    జిలేబి

    ReplyDelete


  51. ఇది యందమైన కథ యని
    పదిలము గా విశ్వనాథ భాషా సరణిన్
    సదనము నందున దాఖలు
    కుదురుగ జేసెను గురుండు కుహుకుహు యనుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  52. ప్రజలటు మరువరు దేశపు
    సుజనుల రీతుల జిలేబి శోభిల్లగనన్
    నిజమౌ ! భారత భూమియు
    యజకము యజరామరంబు యవనిన్ భామా !

    జిలేబి

    ReplyDelete


  53. రామా ఫలము జిలేబీ
    లేమా ! సీతాఫలమ్ము లే మాకిచటన్ !
    ఈ మారు లక్ష్మణ ఫలము
    కై మేము వెతికెదమమ్మ ! కైమోడ్పు గొనూ !

    జిలేబి

    ReplyDelete


  54. అసలైన మాటకారి గ
    ద సుదతి యని గురుడటు పలుదఫ పలికిన హా,
    మిసమిస బోకు జిలేబీ !
    కసకస కోయును నిను మరి కామాక్షీ భో :)

    జిలేబి

    ReplyDelete


  55. పద్మార్పిత గారండీ!
    బద్మాష్బ్లాగ్లో కమందు పాదమ్మూనన్
    యిద్మాన్ చేయన తమ కర
    పద్మముల కమలకు నాంది పలుకగ రండీ :)

    నేను సైతం మరో సమిథ నయ్యెద
    కమలముగ విరిసెద పంచదశ లోకమందు :)

    జిలేబి

    ReplyDelete


  56. శుభమగునుగాక యెల్లరు సుఖము గాను
    క్రతువుల నిట చేతురు గాక! కలిమి చెలియ
    వాహినిగ వెలయవలయు వరము గాను
    రండి! రారండి ! కొల్వగ రక్ష రక్ష!


    శుభాకాంక్షలతో
    జిలేబి"

    ReplyDelete


  57. అదిగో దుర్యోధనుడు
    న్నిదిగిదిగో శకుని మామ యింగ్లీషున చీ
    ల్చి దుమారము గావించిరి
    గద! రావయ్య యభిషేకు గప్పున రమ్మా :)

    జిలేబి

    ReplyDelete

  58. మా యొజ్జ దీర్ఘదర్శి ! స
    మాయత్తంబై జిలేబి మాణీకంబై
    సాయంబు జేసెనుగదా
    రాయంచవలెన్నితరులు రమణించగనౌ !

    జిలేబి

    ReplyDelete


  59. ప్రేమ నొలక బోసారా ?
    ఓమా పద్మార్పితమ్మ ! హోయని తిట్టా
    రా? మావా యని బిల్చా
    రా? మాటలు మూగబోయె ! రమణీ యబలా !

    జిలేబి

    ReplyDelete


  60. కేసేస్తా న్రోయ్ ! యభిషే
    కూ!శూరుడ! సూరనేని ! కూసిన వంటే
    నీ సైటును లాగించే
    స్తా! సూస్కోర!హరిబాబు సై యంటే సై !


    జిలేబి

    ReplyDelete

  61. హరిబాబునిర! నిను వదల
    నుర! ముష్టాకు!యభిషేకు ! నుయ్యో గొయ్యో
    బిరబిర చూస్కోర! సవా
    లుర! నడిరోడ్డున పడెదవు లుకలుక యనుచున్ !

    బస్తీ మే సవాల్
    జిలేబి

    ReplyDelete


  62. పదునెనిమిది యధ్యాయము
    ల దుమారంబు హరిబాబు లబ్జుగ జేసెన్
    సదనంబందున దాఖలు
    చెదపురుగుల కిట సవాలు చెకుముకి రాయీ !

    సెహభాషోయ్ !
    జిలేబి

    ReplyDelete

  63. రామానుజాచార్య ఉవాచ (యట)

    1- గురువుకు -శిష్యుడికి ఉన్న తేడా.
    మనము గురువులము కాబట్టి ఇతరులకు జ్ఞాన బోధ చెయ్యడానికి దేశాలు పట్టుకు తిరగాలి. వాళ్లకు అటువంటి బాధ్యత లేదు కాబట్టి ఒక్క చోటనే ఉండి, ప్రపంచ బాధ్యతలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా భగవంతుణ్ణి ధ్యానిస్తుంటారు.

    2 - ఒక పుణ్య క్షేత్రానికి ఇతర క్షేత్రాలకు ఉన్న తేడా.
    వాళ్లు ఒక్క చోట ఉండి ఒక క్షేత్రం లో దేవుడ్ని పట్టుకొని నిశ్చిత గా ఉంటారు. మనం దేశాలు తిరుగుతూ చాలా మందిని ప్రార్థిస్తూ ఉంటాము. చివరకు మనకు మిగిలేయిది సంశయమే నిశ్చింత కాదు.

    3 - ఇతర ఆళ్వార్లకు భక్తులకు - విష్ణు చిత్తులకు (పెరియ ఆళ్వార్) కు ఉన్న తేడా.
    మనం ఇతర ఆళ్వార్ల లాగా కొన్ని సార్లు దేవుణ్ణి దూషిస్తుంటాము కూడా. వాళ్లు (పెరియాల్వార్లు) "విష్ణు చిత్తుల" లాగా ఎప్పుడు దేవుణ్ణి సంశయ బుద్ధి తో చూడరు .

    4 - సముద్రము- తీరానికి ఉన్న తేడా.
    మనము సంసారం అనే సముద్రం లో ఉన్న నావ లాగా ఒడిదుడుకులు లోనవుతుంటాము. . వాళ్ళు తీరంలో ఉన్న నావ లాగ దేవుణ్ణి పట్టుకొని నిశ్చింత గా ఉంటారు

    5 -అణువు - పర్వతం లాంటి తేడా
    మనం మన కులం, గోత్రం, జాతి లాంటి వాటి లో ఇరుక్కు పోయి ఉంటాము. వాళ్ళు భగవంతుని పట్ల భక్తి వల్ల తమకు భగవంతునికి ఉన్న సంబంధం , భక్తి యొక్క ఆచరణ నే తమ జాతి, కులం అని అనుకుంటారు.

    6 -చెరుకు - చక్కర లాంటిది
    మనం వేదాలనే చెరుకును నమలడం లో ఇరుక్కు పోయి ఉంటాము. వాళ్ళు భగవంతుని పట్ల శరణాగతి అనే చక్కెరను సులువుగా ఆస్వాదిస్తూ ఉంటారు.

    7 -భూమి- ఆకాశం లాంటి తేడా
    మనం భూమిమీద ఉన్న జంతువుల లాగ అన్నిటికీ భయపడుతూ , అయోమయం లో ఉంటాము. వాళ్ళు ఆకాశం లోని పక్షులలాగా నిర్భయంగా నిశ్చింతగా ఉంటారు.

    8 -రాత్రి -పగలు లాంటి తేడా
    మనం వేదములు అనే రాత్రి లో దారి తెలియక తడుము కుంటూ ఉంటాము. వాళ్ళు భగవద్గీత లో కృష్ణుడు చెప్పినట్టు అయన శరణాగతి వల్ల భగవద్భక్తి అనే పగటిపూట వెలుగు లో సరియైన దారి లో సంచరిస్తుంటారు.

    9 -సామాన్యమయిన రాయి - రత్నానికి ఉన్న తేడా
    మనము రోజుకు మూడు సార్లు గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తుంటాము. వాళ్ళు రత్నం లాంటి శరణాగతి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు.

    10 - జార లక్షణం ఉన్న స్త్రీకి -మంచి స్త్రీకి ఉన్న తేడా
    మనం ఒక జార లక్షణం ఉన్న స్త్రీ లాగా రకరకాల దేవుళ్లను ప్రార్థిస్తుంటాము. వాళ్లు మంచి స్త్రీలాగా పరమాత్ముడిని తప్ప వేరే ఎవ్వరిని లెక్క చేయరు.


    ఏకం సత్ విప్రాః బహుధా వదంతి

    జిలేబి

    ReplyDelete


  64. సంధ్య వేళ లందు సహృదయత గనుచు
    సర్వ జనుల హితము శాంతి గోరి,
    హృదయ మాదిలక్ష్మి గృహమను చును యగ్ర
    మాంస మిష్టపడు సుమా ద్విజుండు

    సర్వేజనాః సుఖినోభవంతు
    జిలేబి

    ReplyDelete


  65. ప్రేమా? తల్లా? కామం
    బా! మనుజుల తీరు మారె పచ్చటి చిలకా!
    భామలు మారిరి కాలపు
    నీమము తప్పుచు జిలేబి నిలకడ తప్పెన్ !

    జిలేబి

    ReplyDelete


  66. రావట మే ఆహా! బా
    డ్కోవని బలుపులకు తీట డొక్కలు చీల్చెన్
    ఈ వనిత ఫైరు బ్రాండుగ
    దే! వరుసగ వచ్చు చెప్పు దెబ్బలును మరీ :)

    జిలేబి

    ReplyDelete


  67. నాబోటి నిశాచరులకు
    పూబోడీ ! యర్ధరాత్రి పువ్వారు సమ
    స్యా పూరణలౌ సుమ్మీ,
    రాభస్యము శంకరాభరణ కొల్వుననౌ :)

    జిలేబి

    ReplyDelete


  68. కందంబౌ మూలమిదం
    బృందా వనమందు లేమ, బృందిష్టముగన్
    విందార గింప శంకరు
    డందంబగు రమ్యమైన రంగమొనర్చెన్ !

    జిలేబి

    ReplyDelete


  69. బాధా తప్తుల గాచుచు
    మాధవుఁడే కీర్తి నందె, మదనాంతకుఁడై
    శోధన జేసె నసురులకు
    రాధనమును జేర్చి, యౌర ! రన్తృ విభుండే!

    జిలేబి

    ReplyDelete


  70. అష్టమి దినమది జిలేబి యహిరిపువున
    కు, మన రాముని జన్మము కుదిరెనమ్మ
    నవమినాఁడు; రక్షాబంధనమ్ము వచ్చు
    పున్నమి దినపు శ్రావణ పుణ్య వేళ!


    జిలేబి

    ReplyDelete


  71. ఆహా ! వకార పంచక
    మా! హార్నీ మీ సొబగులు మాచన గాంచెన్
    ఓహో! వడ్రంగి కథన
    జోహారులు యిల్లుకట్టి జూచిన చవియో:)

    జిలేబి

    ReplyDelete


  72. ఆరాటమ్మును వీడెన్
    శ్రీరామునిఁ గని యహల్య ! శిలగా మారె
    న్తూరుపు దొర రన్తృవవన్
    కోరికలే గద జిలేబి కుంపటి గాల్చున్

    జిలేబి

    ReplyDelete


  73. వ్యాసుడుచ్చరింపగ యాఖు వాహనుండు
    ఘంటముగ దంతమునుగొన గణుతి కెక్కె
    భారతము; వ్రాసి వాల్మీకి వాసికెక్కె
    రామ చరిత సీతకథను రమ్యముగను !

    జిలేబి

    ReplyDelete


  74. మనుషుల్లా బతికెదమ
    మ్మ! నోటి కొచ్చిన పలుకులు మానన్ తగునౌ !
    వనమిది బృందావనమిది
    జనవాహిని వివిధములు సుజనులై ఉందాం !

    జిలేబి

    ReplyDelete


  75. పాక్షిక చంద్రగ్రహణం !
    సాక్షి యిదే చూడుడిచట సాయిన్సు జిలే
    బీ! క్షీణించు, పెరుగున
    మ్మా ! క్షమతగ ప్రకృతి తీరు మాలిని గనుమా !

    జిలేబి

    ReplyDelete


  76. వేదనలకు దగ్గరగా
    సాధించగ మేల్కలయిక సాధ్యంబగునౌ
    శోధింపని మమతా, ప్రే
    మాదరణలు నెలతుకకు సమాశ్రయమగుచున్ !

    జిలేబి

    ReplyDelete


  77. మసక మసక చీకటిలోన మల్లె తోట
    వెనుక మాపటి వేళన వెక్కి వెక్కి
    కర్మ కారణ మనియేడ్చు కామనీయ
    రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అందమైన ఆ కాంచన పాటిట
      కందములో దూరిపోయి
      ఛందముగా డాన్సు జేయ,ఆ
      నందము కలిగెన్ 😀

      Delete
    2. అందమైన ఆ కాంచన పాటిట
      కందములో దూరిపోయి
      ఛందముగా డాన్సు జేయ,ఆ
      నందము కలిగెన్ 😀

      Delete

    3. వైవీ యార్ గారు

      అది ఆరుద్ర గారి గొప్పదనము (బై ది వే పైది తేటగీతి కందము కాదు) - ఆరుద్ర వారు పలికితే చందం జాలువారుతుంది ; యిక సినిమా కంటే చెప్పాలా !

      నెనర్లు
      జిలేబి

      Delete
    4. అందమైన ఆ కాంచన పాటిట
      కందములో దూరిపోయి
      ఛందముగా డాన్సు జేయ,ఆ
      నందము కలిగెన్ 😀

      Delete
    5. జిలేబిగారు,వివరణకు థాంక్యూ!🙏
      ప్రాసప్రయాసలో కందాన్ని పద్యానికి పర్యాయపదంగా వాడేశాను.అలాగని అది తేటగీతి అనేది తెలుసని కాదనుకోండి.😀

      Delete


    6. వైవియారు గారు

      బాగు బాగు ! రేపట్నించి శంకరాభరణ అడ్డా లోకి వచ్చేసేయండి :) - கலன்து உரயாடலாம் :)

      చీర్స్
      జిలేబి

      Delete


    7. *கலந்து உரையாடலாம் :)

      Delete

  78. తమిళుల చతురుత మంకుత
    నము మన కెట్లొచ్చునమ్మ నాస్తికు లనుచున్
    తమ తమ యిండ్లన దేవు
    ళ్ళ ముదముగ నిలిపి డియెంకె లవలవ యనెనౌ :)

    జిలేబి

    ReplyDelete


  79. మైండు "చెదల" గొట్టె పదపు
    సౌండుల పంచదశలోక సామ్రాజ్ఞిగదా !
    బెండులు తీయగ భయపడి
    గుండులు తడిమిరి జనులట గురువిట పలికెన్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  80. మన్నించాలి
    మీరు వ్రాసిన
    పద్యాలు
    కొన్ని అర్థమై
    మరికొన్ని
    అర్థం కాకున్నవి.

    ReplyDelete
    Replies

    1. మధు గారికి

      కొన్నైనా అర్థమయ్యాయన్నారు చూసారు, దానికే పదివేల నెనర్లు :)

      రాసాక నాకే కొన్ని అర్థం కావు :)

      జిలేబి

      Delete


  81. కలయో నిజమో యనుచు
    న్నిలలో తహతహ జిలేబి నీలుగుడేలా!
    వలలో పడినావు గదా
    సలసల కాగెడు చమురిక సరి సరి మనకే !

    జిలేబి

    ReplyDelete


  82. ఓ బ్రహ్మచారి ! కోతుల
    తో బ్రాహ్మణుడు నినుబోల్చె తొకతొక వలదోయ్ !
    హా! బ్రామిక లే తెలియని
    యేబ్రాసి బతుకు జిలేబి యెవరికి వలయున్ :)

    జిలేబి

    ReplyDelete


  83. మరువకు మరువకు మావా!
    పరువపు పడుచును నలిగితి పానుపు మీదన్
    పరిమళ మంతా పరచుకొ
    ని,రాధనము గోరుచుంటిని, సఖిన్ రమ్మా !

    జిలేబి

    ReplyDelete


  84. అవకతవక పద్యముల ని
    ట వడ్డనగ సల్పమాకు టంకుటమారీ !
    గవనము వలయును గురుడని
    కువకువ లాడకు జిలేబి కుమరిప్పెణ్ణే :)

    జిలేబి

    ReplyDelete


  85. గురుడిని గోకన్నేలా
    పరుగుల బిరబిర జిలేబి పద్యము తోడన్!
    విరసములో సరసమ్మా!
    చరచర పేర్చుము పదముల చక్కని చుక్కా:)

    జిలేబి

    ReplyDelete


  86. నిర్దయ గా నన్ను విడువ
    నర్దన ! పూర్వస్మృతులిట నను తాకెనుగా!
    వర్దా! నీ యూసుల తో
    పర్దా లై యార్ద్రమయ్యె పద్మార్పితమై !

    జిలేబి

    ReplyDelete

  87. గోకగ గోకగ గురువుల
    బాగౌ విన్నాణమున్ను పద్యములు జిలే
    బీ! కావున గోకవలయు
    బాకా యూదుచు మరిమరి పారుల వార్నీ :)

    జిలేబి

    ReplyDelete


  88. గుర్రము మీదన్ స్వారీ !
    బర్రున జేసిరి జిలేబి పారులు గనవే !
    చర్రున వ్రాయన్ భళిభళి
    గిర్రున తిరుగవలె తలయు గిరికీ గిరికీ :)

    జిలేబి

    ReplyDelete


  89. వేంకట రమణుండాతని
    శంకటముల తిమిరము నిను చప్పున వీడన్
    చెంగట యైన హృదయమున
    తంకము వీడుచు జిలేబి తరముగ నమ్మూ !

    జిలేబి
    స్వస్తి

    ReplyDelete


  90. వడవడ వణుకుచు చచ్చిరి
    పడు రాళ్ళధ్వనికి గారె భటులౌ! పూరిం
    ప, డుగుడు డుగుమని నాదము
    గడగట్టగ, యరి సెగలుగ గర్జన చేసెన్ !

    సావేజిత
    జిలేబి

    ReplyDelete

  91. వెంకయ్యనాయుడు భళీ!
    జంకును బింకమును లేక ఝాడించెను తా
    రంకాడు మీ డియా నటు
    యాంకల బోవగ జిలేబి యా రాజ్యసభన్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  92. తానే తానని తానము
    తానట గ్రహియించెనోయి తనకుపడుచహో!
    తానవము తెలియ గురుడట
    తేనుకొనుట వీడెనోయి తిరముగ సుమతీ

    జిలేబి

    ReplyDelete


  93. నమ్ముము! నిను వరించిన నల్ల వాడు
    తమ్ముని కొడుకు! పెండ్లికిఁ దగదు చనగ,
    పిండి, పప్పుబెల్లములని బేర మిచట
    వరునికి వలయు కట్నము వస్తుచయము !

    జిలేబి

    ReplyDelete


  94. మెయిలయ్య మాలతమ్మను
    చయమున ఝాడింపబోవ చప్పున ఢామ్మం
    చు యయేవ కరోతి సయే
    వ యనుచు తిక్కను కుదిర్చె వనిత జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  95. అంతర్నేత్రము తెరిచిన
    నంతర్భాగము న వెలయు నలతలు కలతల్
    వింతగ తొలంగి సత్యము
    శాంతంబై యాత్మ కాంతి చక్కగ నెలయున్

    జిలేబి

    ReplyDelete


  96. జ్ఞానత్రిపుటియు లేదని
    లేనే లేదేదియనుచు లేదను పాటల్
    గానమ్ములు, పద్యమ్ములు
    మాను జిలేబీ! విభుడు సమముగని నిలుపెన్ !

    జిలేబి

    ReplyDelete


  97. మోహాంధకారుల, జిలే
    బీ, హానిని జేయు జనుల, భీకరులగుచున్
    సౌహార్దృత విడు సంఘపు
    ద్రోహుల, శిక్షించుట ఘనదోషము గాదే.

    జిలేబి

    ReplyDelete


  98. నెనరుల్ జిలేబి గారికి !
    పనసతొనల పదముల నొక పద్యంబున, హా!
    ఘనముగ పేర్చుచు కవనం
    బును గూర్చు చతురులు సూవె! బొరుగుల్ వోలెన్ :)

    జిలేబి

    ReplyDelete


  99. పైవా రుల్, మన వారుల్
    నీవారుల్ నా జనులని, నెరనమ్ముము రా
    జీవా! యేవారైనా
    నావారే ! భేదము మరి నాలో లేదోయ్ !

    జిలేబి

    ReplyDelete


  100. ఆజ్ఞాపిస్తున్నారా?
    విజ్ఞాపనయా! జిలేబి వివరింపదగున్ !
    యే జ్ఞానంబై న గురుడ
    యజ్ఞానంబే విభుని లయమ్మును తప్పన్ !

    జిలేబి

    ReplyDelete


  101. మీమా అనాత వరపు క
    మామిషు గ లలలితనే సుమా! హ! జిలేబీ!
    యీ మాలిని యూరందరి
    కీ మా బాగా తెలిసిన క్షేత్రము సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  102. శాంతము! ధర్మజుడు సుమా
    కుంతీపుత్రుఁడు! వినాయకుఁడు గద శిష్యా
    యంతకహరునికి, నంబకు
    నెంతయు ముద్దుల తనయుడు! నెరనమ్ముమురా!

    జిలేబి

    ReplyDelete


  103. కొందరు రంధ్రాన్వేషణ
    డెందంబరయన జిలేబి రేయింబవలున్,
    కొందరు పదముల సొబగు
    ల్లందం బులగనిరిట నుబలాటంబులనన్ !

    జిలేబి

    ReplyDelete


  104. కమ్మటి తెలుగండీ! మీ
    తెమ్మర గానన్నిటొచ్చి తేలితి మయ్యా
    అమ్మ చలువన కవీశ్వర,
    నెమ్మది యటమటములవిడి నెలకొనెనయ్యా!

    జిలేబి

    ReplyDelete


  105. ఈనా తెలుగున్ గననౌ
    హా! నెట్ జనులు పరుగిడిరి ! ఆనందంబౌ
    మానవతీ ఓ లలితా!
    మా నస మందు పరితుష్టి మాటయనిరిగా!

    జిలేబి

    ReplyDelete


  106. మరికొంచెము తూగులకై
    సరిజేయగ రమ్యమై పసగను పదమ్ముల్
    మరిమరి జేయన లలితా
    మరియొక నెలతుక జిలేబి మాదిరి యగునౌ :)

    జిలేబి

    ReplyDelete


  107. సన్నిధి సన్నిధి యనుచున్
    పెన్నిధి యై వెలయు భువిని పేరోలగము
    న్నెన్నక నిలచితివి గదా
    కన్నడి లోకము జిలేబి కాన దగనిదో ?

    జిలేబి

    ReplyDelete


  108. కలయట! జగత్తు గనవే
    నెలతుక! యిలలో గురువులు నేర్పిరి సుదతీ!
    వల, యింద్రజాల మిదియే
    కలకల లాడుచు కనబడు కాష్టంబిదియే

    జిలేబి

    ReplyDelete


  109. మూన్నాళ్లముచ్చటాయెగ
    దన్నా శిశువులకు బతుకు ధర్మంబేనా ?
    యెన్నికలలో ! చిదిమెనుర!
    మన్నిక బోయెనుర ప్రభుత మరువన్న్యాయం !

    జిలేబి

    ReplyDelete


  110. ఉసురుల్ బోయె శిశువులకు
    కసాబు వర్తకులు ప్రభుత కర్తృత్వంబై
    పసికూనల యుసురుల్ మిము
    మసిజేయక విడువదు, యిది మదిలో గనుడూ !

    జిలేబి

    ReplyDelete


  111. లంకించుకొనెను హరిబా
    బంకిత మగుచున్ జులాయి బ్లాగుల రాతల్
    సంకుచితంబౌ కోత
    ల్నంకుశమున పొడచి మదముల నడచెను భళీ !

    జిలేబి

    ReplyDelete


  112. ఏకాంతమునట, సీత య
    ధీకారంబు, జితనారిధీ! యవని తనూ
    జాకారంబై! రామా !
    నీ కారుణ్యమగు వరము నిత్యము మాకున్ !


    దత్త పది - కాంత, మగువ, నారి, వనిత

    జిలేబి

    ReplyDelete


  113. స్వాతంత్రంబెట్లోయీ
    మీ దారులవచ్చు సూవె! మేష్టారట వే
    ణీ తనువులతో పలికిం
    చే! తంత్రముల చదువ వగచెనుర కచేరుల్ :)

    జిలేబి

    ReplyDelete


  114. కెలికిరి నీహారికనట
    చెలువపు గురువులు ఫెడేలు చెలియా రమ్మా!
    నలుగులు బెట్టన్ తరుణము
    వల విసురమ్మా జిలేబి వణుకన లోకం :)

    జిలేబి

    ReplyDelete


  115. ఓయమ్మ జిలేబీ! కొరి
    యా, యాపాను రమణుల సయాటల బండిన్
    రాయలు పాడిన గీతము
    లాయెను సూపరు ధమాక లాల్ దుప్పట్టా :)

    జిలేబి

    ReplyDelete


  116. నను పాలింపగ పద్యం
    బను పాలన సాకుచు మురిపాలన్ గురువుల్
    జొనిపారిటన్ జిలేబీ !
    మునిపుంగవుల పలుకులు సముచితము నాకున్ !

    జిలేబి

    ReplyDelete


  117. చిన్నోడీడే మొగుడౌ!
    విన్నాణంబధికమయ్యె విజ్ఞత గలిగెన్
    సన్నాహంబుల జేసితి
    సన్నాసిని నౌత సూవె చక్కని చుక్కా :)

    జిలేబి

    ReplyDelete


  118. మనసున్న మావ, మురిపా
    ల నాకొమరునికి పితరుడి లగ నను మనువా
    డ, నెలతుక! యతని ముద్దుల
    తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో !

    జిలేబి

    ReplyDelete

  119. భామయు చేయగ పూరణ
    "కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్"
    సామి, సరిజేసిరి గదా
    "కాముడు తనను గురి జూడ కాంతయు మెచ్చెన్"!


    జిలేబి

    ReplyDelete


  120. పన్నుల తో పన్ను విరిచి
    మిన్నగ తేల్చ లలితమ్మ మీగడ వోలెన్
    కన్నడు నాపన్నుల గా
    వన్నేడిటవచ్చెనోయి వన్నెలు గూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  121. పద్యము లైనను గద్యము లైనను
    విద్యగ నేర్వన వివరముగను
    నేర్వగ నేర్వగ నెక్కొను నేర్పులు
    చెంగట వచ్చుచు చెలువముగను
    ముంగిట దీర్చిన ముగ్గుల సొగసుగ
    రంగము నందున రసనయుగను
    తిరముగ యత్నము తీరుగ జేయన
    వరముగ నవ్యత వరవడిగను

    జిలేబి

    ReplyDelete


  122. అన్నపు గరిటయు సన్నని గరిటయు
    మనుజులు బట్టిరి మాలిని గను
    లేమలు వచ్చిరి లెస్సగ చూడన
    కన్నుల మిన్నగ గానను భళి !
    మారెను లోకము మార్పును చూడగ
    మగువల పనినిట మనసు గనుచు
    గరిటల వంటకు గానము జేయుచు
    బారులు తీరిరి పారులు సరి :)

    జిలేబి

    ReplyDelete


  123. చదువంటలేదు గానం
    డి! దుముకు డబ్బాయి రైతుడిలలో నయ్యెన్ !
    సదరు నెలతుక కనబడలె
    యిది వినికిడి,హస్తినాపురినగల దనుచున్ !

    జిలేబి

    ReplyDelete


  124. పెద్ద వయసు ముచ్చటలో
    ముద్దుగ ఒద్దుగ జిలేబి మురిసితిమి సుమా !
    హద్దులు లేవుగ దా మా
    సుద్దుల రాతల కును, శుభ సూక్తులకున్నూ !

    జిలేబి

    ReplyDelete


  125. ఆకయింటిలో నడిరేయి యరుగు దెంచె
    విజయసారథి ; జన్మించె విపిన మందు
    భరతుడమ్మ ,జిలేబి, సభను తెలుపుము
    జనులు మెచ్చ వలయునమ్మ చక్కగాను

    జిలేబి

    ReplyDelete


  126. ఇచ్చట దెయ్యము లహహో
    వెచ్చగ నిదురోయి సూవె , వెండితె రలపై
    తచ్చట్లాడి సమర్పణ
    విచ్చల విడిగన జిలేబి విరివిగ జేయున్ :)

    జిలేబి

    ReplyDelete


  127. ఏమిది యేమిది యనుచున్
    మా మారుతిని యడుగంగ మాస్టారూ తా
    నేమయ్య జెప్పును సుమీ !
    భీమా వుంటే జిలేబి బిరబిర బోవున్ :)

    జిలేబి

    ReplyDelete


  128. స్పెయిను! హటాత్తు గ నులికి ప
    డె! యా యిలాహి యని జనుల డెరిజా పైనన్
    కయికట్టుగాంచి బండిని
    భయానకముగ నడిపించి ప్రాణము గొనిరే !

    జిలేబి

    ReplyDelete


  129. ఓయమ్మ జిలేబీ! మా
    ప్రాయపు ముచ్చట్ల నరయ వయసే రా లే
    దాయె సుమా నీకున్, రమ
    ణీ యామపు కబురులమ్మి ణిసిధాత్వర్థం !

    జిలేబి

    ReplyDelete


  130. పరుపుల పైనన్ సుఖముగ
    పరుండు కొని కులుకుచు సరపణుల కెలుకుచున్
    కరపోకరాయి చందపు
    గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!

    ReplyDelete


  131. కొండ మీది పరకామణి కి పోయినా నాలుగు కాసులు గిట్టు బాటవుతాయ్ :)

    పరగడపు పద్యములతో
    గురువుల పదసేవఁ జేయ, గూడదు శిష్యా
    పురట,పరకామణికి వెడ
    ల రయ్యన గలుగును మంగళాశాసనముల్ :)

    జిలేబి

    ReplyDelete


  132. పేరున గలదోయ్ రమణీ
    పేరోలగ రూపములు సుభిక్షము గానన్
    సారధియై వ్యక్తిత్వపు
    వారధి యై నిలచునవి సవాలుగ మనకున్ !

    జిలేబి

    ReplyDelete


  133. అసలు మగవారివే నోయ్
    పసగల్గిన వంట లెల్ల, భామల్లాపై!
    వసుధన్నలభీములు గద
    రసమయ వంటకములకును రాట్టులు రమణీ !

    జిలేబి

    ReplyDelete


  134. సరపణులతో జిలేబీ
    సరసపు సయ్యాటలాడి చయ్యన పదముల్
    వరుసగ వేయన్ కందము
    పరుగుల తేలి దరిజేరి పదనిసలాడెన్ !

    జిలేబి

    ReplyDelete


  135. అట్లాగేనండీ పెస
    రట్లాంటి శుభాంగి ! చక్కెర తునక ! ర‌మణీ
    యిట్లా రాస్తా వుంటే
    గట్లా తెలుగు బిరబిర సుఖకరంబగునౌ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. <"తెలుగు బిరబిర సుఖకరంబగునౌ!"
      --------------
      తెలుగుభాష గురించి మీరీమాటలు (అసలీ పద్యం) ఏ సందర్భంగా అన్నారో తెలియదు. "పెసరట్ల శుభాంగి" అంటే?? (వేరేవారినుద్దేశ్యించిన మీ పద్యాలు కూడా మీ పర్సనల్ రికార్డ్ కోసం మీ ఈ బ్లాగులో వ్రాసుకుంటున్నట్లున్నారు బాగానే ఉంది. కానీ చిన్నప్పుడు context reference అని ప్రశ్నలడిగేవారు గుర్తుందా, అది మీరు ఇక్కడ కూడా పాటిస్తే బాగుంటుందని మాబోంట్ల మనవి).
      నేను చెప్పేది కూడా భాష గురించే కాబట్టి, ఇక్కడ అతక్కపోయినా, చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతానికి తెలుగు టీవీ ఛాన్నెళ్ళలో కనపించి మనల్ని 'పులకింప' చేసే తెలుగు భాషకు కొన్ని మచ్చుతునకలు చూడండి.

      (1). "జుబిలీహిల్స్ లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్"
      (ఆ నేరం చేసినవారి కోసం పోలీసులు తనిఖీ చేస్తారని భావం?)

      (2). "Contact Dy E.O (Pub & Press)". ఇది తెలుగు కాదులెండి కానీ టి.టి.డి. వారి తెలుగు ఛానెల్లో స్క్రోలింగులో కనిపించి, ఆసక్తికరంగా అనిపించి, చెప్పాలనిపించింది. కనీసం ఆ Pub అన్నది Publicity (అనే వారి భావం అనుకుంటాను) అని పూర్తిగా వ్రాసినా కొంత నయం ��.

      Delete


  136. గుండుకి కూడా యనుమతి
    నిండాలేదోయ్ జిలేబి నిక్కము గనుమా!
    మెండుగ నేలా పదముల
    దండగ గుచ్చుచు మరిమరి ధమధమ లాటల్ :)

    జిలేబి

    ReplyDelete


  137. చెదురగ, షేర్ మార్కెట్టే
    కుదేలు మనె! యిన్ఫొసిస్సుకు తిలోదకముల్
    సదనంబందు విశాలుడు
    పదునౌ వ్యాఖ్యల జవాబు పరుషంబులనన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అతిచేస్తే గతి చెడుతుంది.సిక్కాతో 7% కోసుకుపోయింది.

      Delete


  138. కథలో “లా” చిక్కుల తా
    పథమున బోవుచు జిలేబి పట్టుగ చూడ
    న్నధరపు కోపము తోడై
    విధాత తలపునకు వచ్చె విరివిగ సుమ్మా !

    --

    వక్రంబేమియు గాదయ!
    సక్రమమే! తల్లి నిజము ! సదనంబునకున్
    చక్రంద్రిప్పన తండ్రి ప
    రాక్రమ మువలయు సమాజ రావంబదియే !

    జిలేబి

    ReplyDelete


  139. న్యాయమ్మా!ధర్మమ్మా!
    సాయంబట్టుడు జిలేబి సారము గానన్ !
    ఓయంతర రంగపు సా
    మీ!యిది తెలిసిన విదురులు మీరే మీరే :)

    జిలేబి

    ReplyDelete


  140. తన కంపెనీకి నారా
    యణమూ ర్తి యెసరును బెట్టి యాడుకొనుటయా !
    వనితా ! జిలేబి ! సూక్షిని
    గనవలెను సమరములకు జగడగంటి చెలీ !

    జిలేబి

    ReplyDelete


  141. జల్దు కొనవమ్మ పూరణ చకచకయని
    గాంచి చదువుమమ్మ యితర కవుల కైపు!
    సహృదయుల హత్తుకొను పద్య సౌరభముల
    మత్తుమందు సేవించుట మంచిదె కద !

    జిలేబి

    ReplyDelete


  142. మత్తునట తూగుచు జిలేబి మరువకమ్మ
    యింటి పనులెల్లనాగిపోయెను గదమ్మ !
    వదుల వమ్మ పైత్యములను వంట గదిని
    గాను అయ్యరు ఫిల్టరు కాఫి కోరె !

    బిలేజి

    ReplyDelete


  143. యువతీ! జిలేబి ! సరపణు
    లువలయు ననుచున్ రుసరుస లుకలుక లేలా !
    సవరము బంగారు ధరల
    వివర మెఱుఁగ, లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్:)

    జిలేబి

    ReplyDelete


  144. మతిలేని వారలౌ శ్రీ
    మతులెల్లను పడతి ! సీత! మగవారలటుల్
    నుతిజేయ తమ్ము, తనివిన్
    బతుకుల నీడ్చు సుదతులు శుభాంగీ రమణుల్ :)

    జిలేబి

    ReplyDelete


  145. మౌనము పెదవుల పైనన్
    మానని చిరునగవులే సుమా మానవులన్
    స్థానము తప్పక నిలుపున్!
    ఓ నరుడా వినవలెనుర నోర్మియు గూడన్ !

    జిలేబి

    ReplyDelete


  146. మన బిడ్డయైననన్ నే
    మి! నమ్మి మనసంపదల సుమీ నివ్వకుమా!
    మనుజుడ ! యే కైపుల పు
    త్రుని పెంచితివయ్య దాని రూపము భవితా !

    జిలేబి

    ReplyDelete


  147. తన కంపెనీకి నారా
    యణమూర్తి యెసరును బెట్టి యాడుకొనుటయా!
    మునుగక మునుపే సరిది
    ద్దన నాతని యత్నమయ్య దమ్మున్నోడూ !

    జిలేబి

    ReplyDelete

  148. ఏడిస్తే మీ మదిలో
    భారము తీరంగ వచ్చు పద్మార్పిత ! కా
    నీ రవ్వంతయు కష్టము
    లారవు తీరవు జిలేబి లావుల్ దప్పున్ !

    జిలేబి

    ReplyDelete


  149. ప్రాసల ఊసులు మనకే
    లా! సారూ ! యేడ్పుగొట్టులకు కొదవే లే
    దౌ ! సమరంబున కైనా
    ఓ సామే, సరసపు సరిజోదులు గురువుల్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. గురువుల ' సరిజోదుగ ' మి
      మ్మరయమిచే చేటు వచ్చె , మహితాత్మా ! ఓ
      గురువా ! గురుతెరిగితి , మీ
      గురువుల దరిజేర నాకు గుండె కుదేలౌ .

      Delete


  150. ఆశ్చర్యంగా ఉంది - అభినవగుప్తుని ప్రస్తావన లేకుండా ఛిన్నముండ కథయా ?

    శ్రీ విద్యల గురువులటన్
    తావరుసగ ఛిన్నముండ తాలూకు కథ
    ల్నావిష్కరించె రమణీ
    తావిడిచె యభినవ గుప్త తంత్రంబేలన్ ?

    జిలేబి.

    ReplyDelete


  151. సరికొత్తకోక నిచ్చెను
    మురిపాల మొగుడు జిలేబి ముద్దుల గుమ్మా !
    నెరయన్ గొట్టగ తాళవ
    లె రసికత యిది యనుకొనుచు లెస్సగ లేమా :)

    జిలేబి

    ReplyDelete


  152. కైవార తాత పల్కుల
    తావారమున తెలిపారు తరమై మీరున్
    శ్రీవారి పొత్తమునచట
    యావత్తును స్కాను జేసి యందించండీ !

    జిలేబి

    ReplyDelete


  153. కాననముల పడగొట్టెడి
    మానవుఁడే దానవుఁడును; మాధవుఁ డయ్యెన్
    వేణువు నూదుచు నందరి
    మానసమును దోచు విభుడు మహిని జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  154. మానసములోని యలజడి,
    యానందములన్ జిలేబి యరయగ మహిలో
    హానము, హితముల జేయుచు
    మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్!

    జిలేబి

    ReplyDelete


  155. మరువన్ తగునా యనుచున్
    మురిపెము తో యడిగినారు ముద్దుగ లేమా !
    కరిమింగిన వెలగ కథయు
    గురుతుకు వచ్చెను జిలేబి గుమ్మా గుమ్మా :)

    జిలేబి

    ReplyDelete


  156. మీ పూరణలెల్లను బా
    గౌ ! పాఠకులకు జిలేబి గౌరవ మిమ్మా !
    ఓ పారి తిరిగి చూడ
    మ్మా! పాత రచన లనెల్ల, మాన్యంబేనో ?

    జిలేబి

    ReplyDelete


  157. దేశము పంక్తిగ మారక
    రోశము గా భక్తిగాన రోమాంచితమౌ !
    కోశాగారము నిండక
    మా సాహస శకుని నాయమది మన కేలా :)

    జిలేబి

    ReplyDelete

  158. ఓ "నా " జిలేబి! వినవే !
    యా "ణా" ప్రాసగన సాటి యవ్వదు నీకున్ !
    దీనత్వము వలదు సఖీ !
    వీనుల విందుగ పదములు విరిసెను నీకై :)

    జిలేబి

    ReplyDelete


  159. చంపక మాలలతో మా
    దుంపల త్రెంచవలదమ్మ దూకుడు లలనా!
    గంపల కొలదిగ కందపు
    లంపట మాయె నిక యేల లసితపు వృత్తమ్ :)

    జిలేబి

    ReplyDelete


  160. కథల నెలా చదవాలోయ్?
    విధవిధములుగద జిలేబి విదురుల వ్రాతల్ !
    పథమది యొకటే లేదోయ్
    కథనము మనకైపు కొలది కావాలనకోయ్ !


    జిలేబి

    ReplyDelete


  161. వయ్యారమ్ముగ చదువుగ
    దెయ్యపు కథలను జిలేబి దిమ్మయు తిరుగన్
    సుయ్యను శబ్ధము జల్లన,
    తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్!

    జిలేబి

    ReplyDelete


  162. జల్లనె మేని గుభిల్లన
    యుల్లము కాష్మో ర బిలువ యువతీ రావే
    చల్లగ షికారు కన, యా
    పిల్ల చరచర వెడలె సుమ పిట్టల కాల్చన్ :)

    జిలేబి

    ReplyDelete


  163. అక్త్రము తొడుగవలదు ! యను
    వక్త్రముల కిది సమయంబు వనితా రావే!
    పక్త్రిమ భంగిమలమరగ
    వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే :)

    జిలేబి

    ReplyDelete


  164. ఆ రాహుకేతు వులటన్
    ఆరామంబులను మారినారట గానన్
    ఘోరప్రమాదములకు
    న్నారాటంబులకు కారణమది జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  165. ఆనంతానంతానం
    తానమ్మానంతనంతతానంతానం
    తానమనంతానంతం
    తానంనంతాతనంతతానంనంతా !

    జిలేబి

    ReplyDelete


  166. కథయొకటి రాసెద జిలే
    బి! ధరణి వీడి జనులెల్ల భీతిన్ పరుగె
    త్త ధనా ధన్ననుచు సుమా!
    ప్రధానముగ రేపు వచ్చు పాఠకులకటన్ :)

    జిలేబి

    ReplyDelete

  167. ఓరీ !హరి!యజ్ఞానివి
    రా !రాతల చదవుమోయి! రభసల్లేలా !
    వారో గాబ్రియలుగదా !
    హీరో యనుకోకు బాబు, హిజరత్ కతయౌ !

    జిలేబి

    ReplyDelete


  168. కథకన్న కథనెలా చదు
    వ ధర్మమనునది నరయగ వలెను జిలేబీ !
    విధముల తెలిపిరి వనజయు
    సధర్మపు పలుకుల గనుము చాలా భేషౌ !

    జిలేబి

    ReplyDelete


  169. జగణపు తలాకు కిక స్వ
    స్తి! కాంత లెల్లరకు ముక్తి! స్త్రీ శక్తి యికన్
    వగచక తమ వంతుగనౌ
    సగర్వముగ సమ సమాజ సాపుల గానన్ !

    జిలేబి

    ReplyDelete


  170. కపటపు ధోరణి లేక, య
    క ! పలుకులను తూచ తప్పక వినుచు, మజ, చా
    న పొసగుల యుండెడు పరా
    కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కెలు మించన్ :)

    జిలేబి

    ReplyDelete


  171. ధ్వంసంబగును జిలేబీ
    హింసకుఁ బాల్పడెడివాఁడె; హితమును గూర్చున్
    వంశాభివృద్ధి కటు ని
    స్సంశయముగ మేలుగోరు సజ్జనుడు సుమీ !

    --

    ధ్వంసంబగును జిలేబీ
    హింసకుఁ బాల్పడెడివాఁడె; హితమును గూర్చున్
    శంసల గొను సజ్జనుడౌ
    యంసము పై భార మెల్ల యంశము గనుచున్ !

    ---

    ఓం! సంకల్పము గాంచి య
    హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్
    హ్రీం! సద్భుద్ధిని నివ్వన్
    క్రీం! సమరసములను గాంచి కీర్తిని బడయున్ !

    జిలేబి

    ReplyDelete


  172. మకుటమే దక్కె రాజ్యమ్ము మనకు లేక
    బోయె నమ్మ జిలేబి! సపోర్టు బోవ
    నిలిచి నావమ్మ దేశపు నీడ లోన,
    శకటమే దక్కె నశ్వమ్ము జారుకొనియె!

    జిలేబి

    ReplyDelete


  173. ఓ ప్రశ్నడగొచ్చా రమ
    ణీ! ప్రారబ్దంపు కర్మ నిలదీయంగన్
    ఏ ప్రాణియైన మనలన్
    యేబ్రాసిగ జూడవచ్చు యేమర మాకోయ్ !

    జిలేబి

    ReplyDelete


  174. అడుగక మరియడుగన పర
    గడుపున నెలతుక, వలదనక సరిసరి యనన్
    పిడుగుల పలుకులు,దబదబ
    గడగడ విసురులు మన తలకడచు జిలేబీ :)

    నారదా!

    జిలేబి

    ReplyDelete


  175. ఓ విన్న కోట నరస
    న్నా! విదుషీమణి పలుకుల నసుగుడు నసుగుల్ :)
    ఏవన్నా తప్పే గా
    దా! వినునా మన నొడుగు ముదముద జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  176. కుర్రతనపు పనులవి!మా
    యర్రులు జాచిన మజ మజ యనదగు దినముల్
    గుర్రము లెక్కితి మీ! పై
    కర్రల కై యత్నములవి కష్టే ఫలమై !

    జిలేబి

    ReplyDelete


  177. ఆలోచనలన్దాటుచు
    నీలోని యనుభవములు వినిర్గము గానన్
    ఆ లోకేశుని హృదయము
    లోలోపల నిల్పి వృద్ధి లోనికి రమ్మా !

    జిలేబి

    ReplyDelete

  178. బొంకగ నౌ యతుక వలెను
    బొంగరమువలె తిరుగాడు బొమ్మా ! యెచటే
    సింగారీ తెలుపదగును
    వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్ ?

    జిలేబి

    ReplyDelete


  179. ఓయమ్మ జిలేబీ ! అది
    గో యవ్వారమ్ముల సరి గూర్చన్ శ్యామ
    ల్రాయరు మరి రాలేదే
    సాయం గాంచుచు సమస్య సానల్దేల్చన్ ?

    జిలేబి

    ReplyDelete


  180. సెహభేషౌ! తన రైల్వే
    నహరహ చిక్కులకు చక్క నయ్య వివరణల్!
    కుహనా నేతల నీడన
    నహంకరించుయధికార నటనలకు బలై !

    జిలేబి

    ReplyDelete


  181. శ్యామల రాయా ! స్వేఛ్ఛను
    ధీమా, గన యాంధ్రభారతిన పదమగు ప
    ళ్ళే! మా బ్రౌణ్యంబున కూ
    డా మాస్టారు కనబడలె ! రావడి గాదోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  182. అనగనగా కుర్రాడొక
    డు నాడు, వత్సరములట కడు మునుపు, కవితన్
    తనకై రాసుకొనెనట! న
    మనము తెలిపెనిప్పటి జన మర్యాదలకున్ !

    జిలేబి

    ReplyDelete


  183. మీరీ మధ్యన టీవీ
    పోరుల లోకన బడక కపోణిన్నడ్డే
    సారే? యేలమ్మా నీ
    హారిక? మరదేల నమ్మ హంగులు తగ్గెన్ ?

    జిలేబి

    ReplyDelete


  184. పదముల అతుకుల బొంతను
    మధురాతిమధుర మనిరి సమంచితముగనౌ
    విదురుల సభలో కవివర
    పదివేలదియేను మాకు పబ్బపు దినమున్ !

    జిలేబి

    ReplyDelete