Wednesday, May 3, 2017

కంద గర్భిత శార్దూల విక్రీడితము - ఒక పరిశీలనకంద గర్భిత శార్దూల విక్రీడితము - ఒక పరిశీలన


ఈ మధ్య చిత్రకవితా ప్రపంచం వారి బ్లాగులో చదివిన కంద గర్భిత శార్దూల విక్రీడితమ్ (శార్దూల పద్యం లో కంద పద్యం యిమిడి ఉండటం) ఉదాహరణ చదివాక కొంత జోష్ కలిగింది; ఎట్లాగూ శార్దూలం కందం సమాంతరంగా ఔత్సాహికంగా సాధన (అనుకుంటా :)) చేస్తున్నాం కాబట్టి రెండింటిని కలిపి గట్టి కావేటి రంగా అందా మనుకుని మొదలెడితే కొన్ని జిలేబులు తయారైనాయి. వాటినన్నిటి ని  ఒక్క చోట పెడదామనే చిరు ప్రయత్నం.


శార్దూలం లో కందం ఇమడాలంటే -

మొదటి, మూడవ  పద్య పాదం లోని మొదటి అక్షరం నించి మొదటి మూడవ పాదం కందం వస్తుంది.
రెండు, నాలుగు పద్య పాదం లోని రెండవ అక్షరం నించి రెండు మూడు పాదం కందం వస్తుంది  (గుడ్డి గుర్తు :))

ఉదాహరణ

ఏలన్ బో రుచిరమ్ములౌ పురమునన్నేలన్ భళారే యనన్
గీ లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్లటన్ గానకన్
నేలన్ కాలటు జారనౌ పడతుల్ నేజెల్ల! నవ్వుల్ గనన్
బో,లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్ రొ దుర్యోధనా!

---

ఏలన్ బో రుచిరమ్ముల
లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్ !
నేలన్ కాలటు జారన
లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్


చీర్స్
జిలేబి


 

94 comments: 1. క గ శా వి

  ధారాళంబుగ జేయ సిద్ధి బడయన్ ధామంబిదేనమ్మ నో
  రారా రావము జేయు సూవె రసికా రావే శుభమ్ముల్గనన్
  ఏరాలంబు జిలేబు లూర వరమై పేరోలగంబుల్ భళీ
  రా రారాయని బిల్చు నిన్ను రమణీ రావే శుభాంగీ చెలీ !


  --

  ధారాళంబుగ జేయ సి
  రా రావము జేయు సూవె రసికా రావే !
  ఏరాలంబు జిలేబులు
  రారాయని బిల్చు నిన్ను రమణీ రావే !

  జిలేబి

  జిలేబి

  ReplyDelete
 2. జిలేబీగారు,
  మీ‌ ప్రయత్నాలు అభినందనీయం. కాని ప్రతిప్రయత్నమూ‌ ప్రచురణార్హం కాదన్న సంగతి మీరు గుర్తెరగాలని నా ఆకాంక్ష. ఒక సారి ఎవరో విశ్వనాథవారిని అడిగారు - ఇప్పటికి మీరెన్ని పద్యాలు వ్రాసి ఉంటారూ అని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. ప్రచురించిన ఒక నలభైవేలుంటాయేమో. వ్రాసి చింపేసినవి మరొక యభైవేలపైననే ఉంటాయి అని. ఆయన ఎందుకలా అన్నారో/చేసారో ఆలోచించి గ్రహించ ప్రార్థన. సామెత చెప్పినట్లు ఏదివ్రాసినా ఎక్కడో అక్కడ అచ్చేసి వదిలేయటం సరైన విధానం కాదు. అభ్యాసదశలో వ్రాసినవన్నీ నిజానికి హెచ్చుభాగం సిల్లీగా ఉంటాయి. పెద్దల సహాయంతో తప్పులు దిద్దుకోవటం ద్వారా పురోగతి కలుగుతుంది. అక్షరాలను గణబంధాల్లో ఇరికించటమే కవిత్వం అని భావించే పక్షంలో ఎవరికీ ఎవరూ ఏమీ చెప్పలేరు. స్వస్తిరస్తు.

  ReplyDelete


 3. ధన్యవాదాలండీ శ్యామలీయం వారు

  ఈ టపా పెట్టిందందుకే నెనర్లు

  బ్లాగున్నది దేనికయా
  ఓ గురుడా మజ జిలేబు లూరన్ గదయా !
  మాగూడిది పద్యములన్
  సాగింపగ యత్నముల్ పసగన తలమహో !

  జిలేబి

  ReplyDelete

 4. క గ శా వి

  ఓమా శ్యామల రాయ రస్తు మకరందోత్సాహమంతే! ధమా
  కా! మామత్తమిదేనయా సుమములై గానన్నిటన్ పద్యమున్
  స్వామీ యత్నమిదౌ; మరింత గరిమన్ సాధింపగన్నౌ సయా
  టా; మేమిచ్చట జేయ సూవె మెకమాటంబై జిలేబుల్ గనన్ !

  ---

  ఓమాశ్యామల రాయర!
  మామత్తమిదేనయా సుమములై గానన్
  స్వామీ యత్నమిదౌ మరి
  మేమిచ్చట జేయ సూవె మెకమాటంబై !

  ஜிலேபி

  ReplyDelete

 5. క గ శా వి

  సాహోరేయని సాగు ముచ్చటగనన్ సాహిత్యమౌ పాడియా
  వౌ! హాహుండటదేవదూత హవణీ ! పారించుమా పాదముల్
  బాహాటమ్ముగ వచ్చు నున్నతి భళా పద్యంబులై సాగు న
  మ్మా!హాహారవముల్ జిలేబి హసనమ్మౌనౌ సఖీ వీడుమా !

  ---

  సాహోరేయని సాగుము
  హాహుండటదేవదూత హవణీ ! పారన్
  బాహాటమ్ముగ వచ్చును
  హాహారవముల జిలేబి హసనమ్మౌనౌ !

  ಜಿಲೇಬಿ

  ReplyDelete


 6. క గ శా వి


  పుంసాంమోహన రూప ముత్యపు జిగిన్ పుంఖానుపుంఖమ్ముభా
  సీంసంసక్తితదేవరూప సఖుడై సీతా సమేతంబుగా
  సంసారస్థితుఁడై, యతీశ్వరుడు పూజా భాజనుండయ్యెడు
  న్నంశాంశాశ్వతుడౌ వృషాంక సమమై నాడౌ రమానాధుడున్

  ---
  పుంసాంమోహన రూపము
  సంసక్తితదేవరూప సఖుడై సీతా
  సంసారస్థితుఁడై, యతి
  శాంశాశ్వతుడై వృషాంక సమమై నాడౌ !

  జిలేబి

  ReplyDelete 7. క గ శా వి


  ఆకాశమ్మున మబ్బులన్ గనుచు స్వప్నావస్థ లో యేలన
  మ్మో! కాకమ్మ కబుర్ల నీవు గయినన్ ముంతన్విడంగన్తగు
  న్నౌ కీలాలము లొల్కయమ్మ రమణీ? నాట్యమ్ము లేలన్ సుధా
  ర్నాకో! కావకమౌ జిలేబి కొమరారౌనో ?మదాలాపి లే !

  ---

  ఆకాశమ్మున మబ్బుల
  కాకమ్మ కబుర్ల నీవు గయినన్ ముంత
  న్నౌకీలాలము లొల్కయ
  కో! కావకమౌ జిలేబి కొమరారౌనో ?

  జిలేబి

  ReplyDelete


 8. క గ శా వి

  కౌసల్యాయని వీరుడున్ననుజుడున్ కాకుత్స్థ వంశస్థుల
  గ్గో!సాసుళ్ళట యూతగాన సరసన్ క్రోతుల్లటన్రాళ్ళ నె
  ల్లా శంఖిన్నురుకన్ సరాతి వలెనౌ లాగించె లంకేశ! రా
  జా! సాసేతును గట్టి నారు ఝకటా సాగున్నికన్గానురా !

  ---

  కౌసల్యాయని వీరుడు
  సాసుండట యూతగాన సరసన్ క్రోతు
  ల్లా శంఖిన్నురుకన్ సర
  సా!సేతువు గట్టి నారు ఝకటా సాగున్ !


  జిలేబి

  --

  శ్రీ కంది శంకరయ్య ఉవాచ

  కంద గర్భ వృత్తాన్ని బాగానే వ్రాశారు. కాని చదువుతుంటే ఇది తెలుగు కాక మరేదో భాష అనిపిస్తున్నది. పద్యం అర్థమయితే ఒట్టు! :)

  మొత్తము జిలేబి మయము :)

  ReplyDelete
  Replies

  1. కౌసల్యాయని - శ్రీరాముడు
   వీరుడు అనుజుడు లక్ష్మణుడు
   కాకుత్స్థ వంశస్థులు
   అగ్గో -అదిగో
   సాసుడు - విలుకాడు
   ఊత - సాయం
   శంఖి - సముద్రము
   ఉరుకన్ - దాటన్
   సరాతి - ఒక తెర లా ( వానరులు రాళ్ళని ఒక తెరలా వేసి ) సాసేతువు - సేతువు లాంటిదానిని

   ఝకటా - జగడము

   రాముని, లక్ష్మణుని సాయంతో వానరులు రాళ్లతో వారధి కట్టి యుద్ధానికి బయలు దేరారు
   ( ఈ పాటి ఒక వాక్యం వ్రాయడానికి అంత తల క్రిందుల తపస్సు చేయాలా ! జిలేబి కమాల్ హై ;))


   జిలేబి


   Delete
  2. కం. పద్యం బగు గద్యంబగు
   హృద్యంబుగ నుండవలయు నెంతే శ్రమతో
   పద్యంగణంబుల పదముల
   విద్యావిలసనము పేర పేర్చ దగదయా.

   Delete


 9. విద్యారంభము జేయ వీడుట జిలేబీవల్ల గాదోయ్ కవీ
  సద్యోగంబిదియే సుమా సరసనే సాహిత్యముల్నేర్వనౌ !
  పద్యంబైనను మాటలైన గురుడా పంకావలెన్ ద్రిప్పుచున్
  హృద్యంబైనటి రీతిగాన నుడులన్ నృత్యంబులాడించెదన్ :)


  జిలేబి

  ReplyDelete


 10. క గ శా వి

  హా సీతా! యన రావముల్ వనపు హాహాకారముల్ గానుమ
  య్యా, శాసించెను గోముగాను శరమై యా రన్, పతిన్ రోయ గ
  న్నా సౌమిత్రిని వాసిటన్ననుజుడా, నాధున్గనన్ వెళ్ళు మ
  య్యా సాసించుము కమ్ముదెంచు సధియై యావద్బలమ్ముల్ గనన్

  ---

  హా సీతా! యన రావము
  శాసించెను గోముగాను శరమై యార
  న్నా సౌమిత్రిని వాసిట
  సాసించుము కమ్ముదెంచు సధియై యావన్

  జిలేబి

  ReplyDelete
 11. నిన్న లక్కాకుల వారిచ్చిన శార్దూల కిక్కు,
  హరిబాబు గారిచ్చిన కందపు జోషు లతో
  హుషారొచ్చి, చాన్నాళ్ళ తరువాయి

  క గ శా వి !


  శార్దూలవిక్రీడితము

  చానా బాగుగ యుండెనయ్య గనుమీ సాహిత్య జిజ్ఞాసల
  న్నా నానా విధ యత్నముల్గన హరీ, నారిన్ సమాళింపనౌ,
  తానాడన్ మది యాడునయ్య పదముల్ తావిన్ గుభాళించు తా
  మై, నానాటి సయాటలన్ గనవయా మాయాద్యుతిన్నీవిటన్ !

  ****

  కందం

  చానా బాగుగ యుండెను
  నానా విధ యత్నముల్గన హరీ నారిన్
  తానాడన్ మదియాడును
  నానాటి సయాటలన్ గనవయా మాయన్ !


  చీర్స్
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. అమ్మో ! అమ్మో ! అమ్మో !
   అమ్మోరి హుషారు చూడ , ఆగదు , శార్దూ
   లమ్మున కందం బిరికె గ
   దమ్మా ! ఈ కళలు గూడ తవరికి కలవా ?

   Delete


 12. ఏరుల్ పారని యూరు మా రువణమున్ రేకంటు మాడ్చన్ సదా
  కోరన్ పల్లెల వైభవమ్ము నకటా గూర్తున్నెటు‌ల్ పద్యమున్ ?
  చేరెన్ రైతు సిటీని భాగ్యమను గోచీ గాన నీనాడు తా
  మారెన్ గాదయ కూలినాలి బతుకున్ మాన్యంబుగా జూచుచున్ !


  జిలేబి

  ReplyDelete


 13. ఓ మోడీ!వినుమయ్య! పొత్తులకికన్ గోరీలుతప్పవ్ సుమీ
  మీ మోసంబిక సాగదయ్య భజనల్ మించారగన్ సేయమ
  య్యా!మీదారిక మీది! తెల్గు ప్రజ సాయంబట్టరయ్యా !జయ
  మ్మౌ మాదే యిక! భాజపా కిక సవాల్మారాష్ట్రమే కాచుకో

  జిలేబి

  ReplyDelete


 14. అక్కా! తెల్లని తల్లి భారతి సభా ప్రాంగమ్ము మారెన్గదా !
  పక్కాపచ్చని రంగు బోయె నెచటన్? భామా ! జిలేబీ ! అరే !
  టెక్కుల్హెచ్చెను శంకరాభరణమున్ టెంప్లేటు లే మారె! నెం
  చక్కా కొత్తగ వచ్చె యామికగ సంచారమ్ము జేయన్ గదా :)


  చీర్స్
  జిలేబి

  ReplyDelete


 15. కుండల్బ్రద్దలు గొట్టి చెప్పెదనయా కూపస్థమండూకమా
  కుండీలోనయ మర్రిచెట్టు? గనుమా కుందాపనన్ మానవా
  బండన్గట్టుచు చావగొట్ట తగునా వాంఛింప నిట్లన్నకో
  నిండైనట్టి సజీవమైన నుసురున్? నీపాశగూలా యిలా

  జిలేబి

  Say no to Bonsai :)

  ReplyDelete


 16. విత్రాసమ్మది మానసమ్ము కుదుపన్ వేసారి బోవన్ మది
  న్నాత్రించున్ కలతల్ వెతల్! కుదురదే నాధ్యానముద్రల్ ! భువిన్
  చిత్రంబైనది జీవితమ్ము ! మదిలో చింతల్ సమాళింపగన్
  పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్!

  జిలేబి

  ReplyDelete


 17. క్షేత్రంబవ్వగ భార్య భర్తకునటన్ క్షేమంబుగా నిమ్మదిన్
  పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా,పోఁగాలమే వచ్చినన్
  తత్రత్యుండట పైన దీవెనలిడన్!తంకమ్ము వీడన్ దగున్
  యాత్రల్జేయగ తీరునయ్యనలతల్ యానమ్ము సాగింపుమా!

  జిలేబి

  ReplyDelete


 18. మూడంతస్తులసొంత మేడ!భళి! సొమ్ముల్జేర్చినావా! జిలే
  బీ! ఢంఢంబను గుండు మామి! గలరే బింబోష్ఠి లోకమ్ములో
  నీ డాంకారపు సాటి ! వేల్పువు గదా! నెక్కొల్పి నావే మజా!
  జోడిన్గట్టెద నీకు వృత్తములతో జొత్తిల్ల వేడిన్ సుమా !


  చీర్స్
  జిలేబి

  ReplyDelete


 19. శంఖమ్మయ్యెగ శంకరాభరణ కాసారమ్ము !మేల్గాంచగన్
  తంఖీహ్లన్గని సారమొప్పు పదముల్ తట్టంచు వేయన్నిటన్,
  పుంఖాపుంఖముగాను పద్యములనే పూరింప నేర్చానయా
  పంఖానైతిని నేను శంకరవరా! ప్రారబ్ధపుణ్యమ్మునన్!


  జిలేబి

  ReplyDelete


 20. క్లోనింగన్న నదేల భీతి ! నరుడా! కోతిన్, భళా హిట్లరున్
  నానా రీతి జిలేబులన్ సృజన‌ చానా చేతురో?బుద్ధుడిన్
  తానే జేయగలండతండు గదరా! ధైర్యమ్ముగా‌ బొమ్మురా!
  యేనాడైనను దిక్కు దేవుడుగదా యెవ్వారికైనన్ హరీ!


  జిలేబి

  ReplyDelete


 21. ఏరాలమ్మగుచిత్రమందున నటించెన్ తార! శ్రీబాపు! గా
  నీ రామయ్యకు భార్య గాను నటిగా నిల్పేవు! సీతమ్మ తా
  నై రామయ్యగ బాలకృష్ణ సరసన్ నైపుణ్య మున్గాంచి నో
  రారా రమ్మని పిల్చె సీత, యెలమిన్ రాధాప్రియుం జెచ్చెఱన్!!


  జీరాడెన్ నయనంపుతారగ సుమీ జివ్వాజి ! శ్రీరామరా
  జ్యారాజ్ఞీయముగన్ జిలేబి వెలిగెన్ ! జవ్వాడి సీతమ్మ తా
  నై రామయ్యగ బాలకృష్ణ సరసన్ నైపుణ్య మున్గాంచి నో
  రారా రమ్మని పిల్చె సీత, యెలమిన్ రాధాప్రియుం జెచ్చెఱన్!!


  చీర్స్
  జిలేబి

  ReplyDelete


 22. అంసమ్ముల్ పయి భారమౌను మన చింతల్ గాని, యేకాంగికిన్
  హంసోయా యను సందియమ్ము సయి సోహంబున్ గదా చూడగన్
  సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ!
  సాంసిద్ధమ్ము జిలేబి దైవ కృపగన్ సంద్రమ్ము దాటన్ సుమీ !

  జిలేబి

  ReplyDelete


 23. ఇచ్చట చచ్చినోళ్ళ జాతకము చూడబడును :)  చచ్చిందయ్య గురో జిలేబి! సిసువా చక్రమ్మిదే చూసుకో!
  మెచ్చంగన్ జనులెల్లరున్ నటిగతా మేరున్ తలంపించురా
  వెచ్చించున్ ధనమెల్ల ముక్కు నెఱికై వేవేల కోట్లున్ సదా
  అచ్చంగా తన కూతురున్నుఱిదిగా సాక్షాత్కరించున్ సుమా!

  జిలేబి

  ReplyDelete


 24. ఇచ్చట చచ్చినోళ్ళ జాతకము చూడబడును 2


  మాగండమ్ముల నొడ్డి ధాటిగ నసామాన్యంబుగాపోరురా
  జేగంటన్నిలుపున్ మఠమ్మున జనుల్ చేరంగ వేవేల రా!
  సాగించున్ యతనమ్ములన్ సమసమాజంబైన రీతిన్ గనన్
  యోగంబన్నయిదేర శిష్య! శివ సాయుజ్యంబునొందెన్ గదా!

  జిలేబి

  ReplyDelete


 25. నీమంబున్విడి యోగి రూపమున తా నేమార్చి గొంపోయె, నీ
  వా మారీచుని లేడిగా తరుమ తా వాపోవ హా లక్ష్మణా!
  కామాంధుండయి రావణుండవనిజన్ కార్కశ్యమున్జూపుచున్!
  రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్

  జిలేబి

  ReplyDelete


 26. వాతల్ బెట్టిరిగాద నేతలు, జనుల్ భారీగ నష్టమ్ములన్
  కోతల్గాన జిలేబులే యనుకొనన్; కోటల్భళాగట్టిరే
  యేతావాత జనాళి నమ్మ గనహో; యెంకన్న సత్తెమ్ముగా
  పోతోందండయ దేశ మేగతి గదా పోగాలమై నేడిటన్!

  జిలేబి

  ReplyDelete


 27. మీ సంఘంబున కొత్తవాడిని గురో! మీరే సుమాదిక్కు మా
  కాశంతమ్మిలలోన మాచనవరా! కష్టేఫలంబై జనుల్
  మీసాంగత్యముకోరిరయ్య కవిరాట్! మించారగన్ బ్లాగులో
  కోశాగారము గట్టిరే కథల సోకుల్ కైపు జవ్వాదియై!


  జిలేబి

  ReplyDelete
 28. ఆహా, “జిలేబి” గారు తిరిగి బ్లాగు ప్రవేశం; వెల్కం బాక్ 💐. హమ్మయ్య మళ్ళా కళకళలాడిపోతోంది 🤓.

  ReplyDelete


 29. ఖాళీలేదుర చెయ్యి ! పోయనిన పోకన్ నిల్చినావేలరా ?
  భోళా శంకరు కాదొరేయ్ ! హరినిరా! పో చేయి ఖాళీగ లే !
  గోళాకారముగాను త్రిప్పుచు కథల్ గోరీల గట్టావు రా?
  వేళాకోళముచేయ మార్జనినికన్ వేగంబుగాబట్టెదన్ !


  జిలేబి

  ReplyDelete


 30. ఆశ్వాసమ్మతడే జిలేబి వినుమా ఆగాత్యమే మేలహో !
  విశ్వాసమ్ము గొనమ్మ దుష్టుడయినన్ వేంచేపు చేయన్ దగున్
  విశ్వంబంతయు నమ్ము రీతి పలుకున్ వేణీ శకారుండహో !
  "అశ్వత్థామను జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్"


  చీర్స్
  సావేజిత
  జిలేబి

  ReplyDelete


 31. నార్వేలో బసయా! టపా అదురహో! నచ్చింది‌‌ సుమ్మీ భళీ
  ఫర్వాలేదయ మీకు వీలు గలుగన్ ఫ్యార్డ్లన్ సమీక్షించుడీ!
  హర్వుంబెల్ల సచిత్రరూపకముగా హత్తించు రీతిన్నిడన్
  పర్వంబౌనయ రావుగారు పఠియింపన్మాకు క్రొంగొత్తగన్

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. హేవిటో "జిలేబి" గారూ, ఈ పద్యరత్నాన్ని ఆ "మన'సు'లో మాట" బ్లాగ్ లో upendrao.blogspot.in కూడా పెడితే ఆ బ్లాగర్ కుర్రవాడు మరింత సంతోషించేవాడుగా.

   Delete


 32. స్మగ్లింగా ? ప్రయివేటు స్కూళ్ళన యదృచ్ఛా ఫీజులన్ చూచుచున్
  పగ్లాయైవెలుగొందు మాన్య ప్రభుతల్! పబ్లిక్కురేట్రేసు లన్
  హా! గ్లస్తంబయినారు పిల్లలకటా!ఆశ్చర్యమేముందయా!
  ఈగ్లానిన్ జనులెల్ల థగ్గులుగ, సీ! పిండారి గామారరే ?

  జిలేబి

  ReplyDelete


 33. ఈ కేసూ మరి దీర్ఘసూత్ర రహదారిన్ బోవునేమో గదా !
  సోకుల్బోయెడు ఖాను జైలు ఒడిలో సోండెల్ భుజించున్? నెవర్!
  కాకల్దీరిన అడ్వకేట్లు వరుసన్ కాపాడగా నిల్తుర
  య్యా!కారుణ్యము జూపు జడ్జిని సునాయాసమ్ముగా కొందురే!

  జిలేబి

  ReplyDelete


 34. ఆహాహా యని జోతలెల్ల నిడగన్నాంధ్రుల్ త్సునామీ వలెన్
  బాహాటమ్ముగ తెల్గుదేశము సెభాష్పాటల్గుభాళించునే!
  సాహిత్యమ్ములతోపనేమి గలదోయ్ సారంబులేలన్ సినీ
  మా హిట్టవ్వ జిలేబులెల్ల జొనుపన్ మాలావు పాటౌనయా

  జిలేబి

  ReplyDelete


 35. నీవేనే సఖి నా జిలేబివి సుమా ! నీనీడయేజాడయున్
  కోవా! నీ దరి చింత లేక నిలువన్ కొంతైనతీరున్‌ వ్యధల్!
  బావాజీ లవలెన్నిరాశ వలదే బద్మాషు గాళ్ళమ్ము కా
  మేవయ్యారియ! మేము నీయనుగుకై మెండాడి నామే ప్రియా!

  జిలేబి

  ReplyDelete


 36. జంభాల్గొట్టుటగాదు చూపెదను నాశక్తిన్ వశిష్టున్ వలెన్
  జంభారాతియుభీతినొందె తపమున్ శల్కంబొనర్పన్,హ! వి
  స్రంభన్ గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై,
  స్తంభింపన్ హృది మేనకన్ గని మనోదండమ్ము దారిన్ గనన్!

  జిలేబి

  ReplyDelete


 37. దోగాడే పిలకాయతో గురుడ పందుంపుల్ల సంవాదమే
  లా!గాఢమ్ముగ వాళ్ళతోపరుగులేలా!రామనామంబు నీ
  వేగా లావుగ బల్క వీడితివయా! బేజారవన్నేలయా!
  బాగోగుల్మనవన్నియున్మనదయా!బాంగ్రూలనన్ జూతురే

  జిలేబి

  ReplyDelete


 38. అప్పాయింట్ మెంట్ నో :)


  రారా చంద్రుడ!ఆంధ్ర దేశ ప్రభువా ! రారమ్మ! భాజ్పాయనన్
  ధారాళమ్ముగ దస్కమెల్ల దొరకున్ దారెంబడిన్నన్కొనన్
  హేరాఫేరి! తలాకు లిచ్చి వెడలెన్ హేరాలమై పోరుకున్ !
  తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ!

  సంద్రము - దామోదర్ దాసు :)


  జిలేబి

  ReplyDelete


 39. రారా! ఖమ్మము ! తేల్చెదమ్ము నిజమున్ ! రావంబిదే బాబు నే
  నేరాళమ్ముగనమ్మినాను డయటున్నెవ్వారికైనన్ వెసన్
  ధారాళమ్ముగ నేర్పెదన్ ! వినుమయా దమ్మున్న రమ్మా వురేయ్
  దారిన్బోయెడు కుక్కలెన్ని మొరుగన్ త్రాసంబగున్నద్రికిన్?


  జిలేబి
  పరార్ :)

  ReplyDelete


 40. బయ్యా!కొండల రావు వ్యాఖ్యకు భళా ప్రాముఖ్యతన్ జేర్చనే
  లయ్యా! ఓ హరిబాబు వీలగునకో ! లాభమ్ము లేదయ్య రో!
  సయ్యాటల్ విషయమ్ముగాదు డయటున్ సాధించినేర్వన్ గదా
  కయ్యంబేలర కోరుమయ్య శరణున్ కష్టంబుతీరున్ సుమా!

  జిలేబి

  ReplyDelete


 41. పోరాటమ్మిది!ధర్మ దీక్ష! భళిరా పూరించె శంఖమ్ము మా
  నారా వారు తెలుంగు తేజమిదిగో నాలాయకీ వీడి మో
  డీ!రమ్మా!దిగిరమ్మ ! ఆంధ్ర ప్రజలొడ్డేరయ్య చాలెంజు!భా
  జ్పా!రాష్ట్రమ్మునుతీర్చిదిద్ద సలుపన్ సాయమ్ము జైహిందనన్

  జిలేబి

  ReplyDelete


 42. మోడీవారి ప్రభుత్వ మొండితనమున్ మోదెన్ భళా చంద్రుడీ
  నాడే! రాష్ట్రపు ధర్మ దీక్ష యిదియే ! నాణ్యంబుగా జేసి రీ
  నాడే!రండిక చేయి కల్పుదమయా ! నా జన్మభూమీ యనన్!
  వాడా వాడల యెల్లరున్నడువ జావంకమ్ము గా నిల్తురే!


  జిలేబి

  ReplyDelete


 43. వీరావేశము జూపగా నెలతుకల్ వెక్కెక్కి రోదింతురే?
  దారిన్బోయెడు కుక్కలెన్ని మొరుగన్త్రాసంబగున్నద్రికిన్?
  తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు?సూ
  డ్రా!రామక్కను! పూలిడన్ వలదొరేయ్! డ్రామా కతల్చెప్పకోయ్ :)

  జిలేబి

  ReplyDelete


 44. మోక్షంబున్గన విశ్వనాథుడట రామున్కల్పవృక్షంబనెన్
  కక్షల్గట్టుచు రంగనాయకి యొరేయ్ కాఠిన్యమూర్తీ యనెన్
  సాక్షాత్కారము చేసుకున్న దెవరో ? సాధింప సత్సంఘమున్,
  రక్షస్సంఘ మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్!


  జిలేబి

  ReplyDelete


 45. Ramayana and project management :)


  సాక్షీభూతుడు రామచంద్రు కథలో సాధ్యమ్ము మేనేజిమెం
  టే క్షంతవ్యము నేర్వ మేలగునంటం చీక్షించి మోడీ భళా
  దక్షత్వమ్మును పెంచుకొమ్మనగ మేధాజీవులున్నాయకుల్,
  "రక్షస్సంఘ" మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్

  జిలేబి

  ReplyDelete


 46. ఓ కౌంతేయ! కిరీటి! కయ్యమిది! ధర్మోద్ధారణంబైన నీ
  దౌ కర్తవ్యము!మానరాదు వినుమా ! దామమ్ము గా సైన్యము
  న్నా కింశారువు కూల్చ గోరితివయా ! నాదర్పమున్బోయె! బా
  వా!కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్!!

  జిలేబి

  ReplyDelete


 47. ఆరాటంబదియేల మైలవరపయ్యా!యిర్వురున్నొక్కరే
  శ్రీరాముండు, త్రినేత్రుఁ, ! జంపెనుకదా, సీతమ్మకుం బుత్రుఁడై
  స్వారాట్వైరిని దుర్జయున్ కుశుడు! నిస్వార్థమ్ముగా నేలెన
  య్యా రాజ్యంబు కుశస్థలిన్నిలిపెనయ్యా!యింద్రుడిన్కొల్చెనే!

  జిలేబి

  ReplyDelete


 48. ఘోరారణ్యము తానమవ్వ సతికిన్ కుందై స్తుతించంగ నా
  శ్రీ రాముండు,త్రినేత్రుఁ, జంపెను గదా, సీతమ్మకుం బుత్రుఁడై,
  శ్రీరామున్నహమున్, కనుల్ తడియవన్ సీతా!హ!సీతాయనన్,
  శ్రీరామాయణ గానమున్ లవుడు గోసెక్కించి సైదోడుతో !


  జిలేబి

  ReplyDelete


 49. క్షీరాన్నంబును గైకొనంగనొకడౌ! కేదారుడైయొక్కడౌ!
  శ్రీరాముండు! త్రినేత్రుఁ! ; జంపెను గదా, సీతమ్మకుం బుత్రుఁడై,
  శ్రీరామున్నహమున్ కనుల్ తడియవన్ సీతా!హ!సీతాయనన్,
  శ్రీరామాయణసారమున్ లవుడు గోసెక్కించి సైదోడుతో!


  హమ్మయ్య
  కిట్డించాను

  జిలేబి

  ReplyDelete


 50. పేరాయెన్ శివరామకృష్ణ! తగునా వేవేళ గోటేరుతో
  మారామున్ భళి దున్ని కైపదముగన్ మార్చన్! జిలేబీయమే!
  యోరోరీ! కవిరాట్! సయోధ్యయవదే!యోక్త్రంబదెద్దానితో
  శ్రీరాముండు త్రినేత్రుఁ జంపెను గదా సీతమ్మకుం బుత్రుఁడై?

  జిలేబి

  ReplyDelete


 51. చేరన్సంద్రపు తీరమున్ప్లవగముల్ చేయూతనివ్వన్నట
  న్నారాళ్లన్దళపమ్ముజేసుకొనగన్నాంత్రమ్ము జేసెన్ గదా
  శ్రీరాముండు, త్రినేత్రుఁ, ! జంపెనుకదా, సీతమ్మకుం బుత్రుఁడై
  వారాశిన్ సయి దాటి రాత్రిచరులన్ ప్రాభంజనుండే భళా

  జిలేబి

  ReplyDelete


 52. హీనంబై చరియించుదుర్గుణులకున్ హేఠమ్ములన్జేయు వా
  రై నట్టింట జిలేబులై తిరుగుచున్ రావమ్ము తో తర్జనల్
  స్థానంబుల్విడి జేయుమానవులకున్ జ్ఞానమ్ము జేర్చన్, "ఇ"కున్
  హానిన్ జేయని వాడు ధాత్రినెటు దా నాచార్యుడై యొప్పునో ?!


  "ఇ" = కోపము
  జిలేబి

  కంది వారి కామింటు

  'ఇ' శబ్దానికి తెలుగులో వ్యస్త ప్రయోగం ఉన్నదా? చింత్యం!

  ReplyDelete
  Replies

  1. పోచిరాజు కామేశ్వరరావు గారి వ్యాఖ్య


   ... జ్ఞానమ్ము గూర్చన్నిభీ / హానిన్... అనండి.

   ఇ భీ హాని = రోష భయముల హాని; ఇ = రోషము [గర్వమను నర్థము సందేహము.]
   వ్యస్త ప్రయోగమంటే సమాసమున గాకుండా విడిగా స్వతంత్రముగా నని యర్థము. మన్మథుఁడు వచ్చెను దీనికి ఇ వచ్చె ననుట సరి గాదు. ఇ = మన్మథుఁడు

   Delete


 53. ఎట్టెట్టా!! అరె! చిట్టిపిట్ట ననఘా మీస్టైలనన్ పొట్టిగన్
  పెట్టేరండిట పద్యమందు? మజ! భేష్! భేష్! మీరు దిట్టే సుమా !
  చట్టంచున్ సయి విన్నకోట వరులున్ సారూ! సలీంఆలియై
  కొట్టెట్టేస్తరటంచు మెచ్చిరిగదా కొండంత యండై భళా!

  జిలేబి

  ReplyDelete


 54. సాదాదోసె మసాల్వడా బకెటులో సాంబారుగా కల్పినా
  రేద్రావంగజిలేబులూర జనులున్! రేకంటు లానింగినన్
  బాధామీటరుగా భళా కొలిచిరే! ప్రార్థించెదన్ మిమ్ములన్
  పాదాలంకితమిచ్చినాను సొబగై భాగ్యంబుగానొప్పగన్!

  జిలేబి

  ReplyDelete


 55. అర్జునుడు - కృష్ణుడు

  ఆహాకారములన్ గనన్ కుదరదయ్యా!నేనశక్తుండ! నే
  నీ హాంత్రమ్ముల చూడలేను విడుతున్నీరంగమున్నిప్పుడే!
  సాహాయ్యంబగుదున్!కిరీటి!నెఱియౌ సారంగమున్బట్టి,సం
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వమేపారగన్ !

  జిలేబి

  ReplyDelete


 56. ఓహోనాదని నీదనన్ జగడముల్ కొట్లాటలేలా ! భళా
  దేహమ్మున్ విడనాడి చూడుముసఖా ధీరత్వమేపారగన్
  నీహర్మ్యంబెట? నీశుడేల నినుతన్నీరమ్ముగాజేసెనో?
  సోహంబో మరి హంసవో? యెరుకయెన్? శోభిల్ల మార్గంబెటన్?

  జిలేబి

  ReplyDelete


 57. సౌహార్ద్రంబును చేగొనంగ వలయున్ సాంగత్యముల్మేలవన్
  మోహంబేలర?మానవా! బతుకునన్ మొండించుమా కోరికల్
  సాహోరేయనజీవితమ్ము జనుడా సాధింపుమానీహృదిన్
  దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వమేపారగన్

  జిలేబి

  ReplyDelete


 58. బేజారాయెను కార్డు స్వైపు సయి బెంబేలెత్తి యాడించెనే
  రోజూ తప్పదు దీని కర్మ మనకున్ రోబోలయే మయ్యరో
  తాజా కూరలకున్ను యన్నిటికి యేతావాత తప్పేట్లు లే
  బాజార్లోమరి దేనికైన నిదియే భాగ్యంబుగా దోచునే :)

  జిలేబి

  ReplyDelete


 59. ఇవ్వాళ సందర్భం రాయాలె :)


  సుబ్రహ్మణ్యుడు ఐటి మానవుడు; మగడు; సదా ఆఫీసే ఇల్లు ఇల్లే ఆఫీసు; చెవిలో ఎప్పడూ బ్లూటూత్ 'జాబ్రా' బ్రాండ్ (ఇది చాలా ఎక్స్ పెన్సివ్ :)) 'ఇన్ ఇయర్' ఫోన్ తో తిరుగు తూంటాడు

  భార్య తో షికారు కు పోయినా ఇన్ యియర్ విడువడు !

  అట్లాంటి మగడి ని ఎట్లా మరి మూడు మార్చేది :)

  నారాయణ ! శేష శైల వాసా !

  నీ దరికి వెళ్లి వస్తే కోబ్రా లు కనబడట మేమి ట యా !

  అంతా విష్ణు మాయ !  జాబ్రాయిన్నియరై సదా తనకు బేజారున్ ప్రచారించు శ్రీ
  సుబ్రహ్మణ్యుని, పెన్మిటిన్ గనుచు,యుస్సూరంచు,చొప్పించగన్
  తా బ్రాంతిన్ తన పైన, బిల్చి, "మగడా ! తాంతమ్ము గానుండె! నా
  కో బ్రా తెమ్మని" కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్!  జిలేబి

  ReplyDelete

 60. ఇదేదో కొంత కిట్టింపే

  తా బ్రాంతిన్,మరులున్ ఘటిల్ల తనతో తాంబూలమున్దూకొన
  న్నాబ్రాజిష్ణువు సంతసమ్ము గనుచున్నారిన్, మహారాణి! యిం
  కో "బ్రా" తెమ్మని కోరె; భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్
  తాబ్రాగబ్బముగామదిన్ తలచి ప్రాతాంబూలమున్దెచ్చెనే‌!

  ప్రా - శ్రేష్టము

  జిలేబి

  ReplyDelete


 61. ఖోప్రా - కొబ్బరి తెమ్మని రాయమంటే పరమానందయ్య శిష్యపరమాణువు కోబ్రా అని రాయటం తో వచ్చిన చిక్కు :)


  "కోబ్రా తెమ్మని కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్"
  ఏబ్రాసీ! నిను రాయమన్నదిదియే? యేమయ్యెరా బుర్రయున్?
  ప్రా "బ్రా" గయ్యెను "ఖో " యయేనుగద "కో"! ప్రాతఃసభాప్రాంగణం
  బే బ్రోచెన్ గద బ్రాను లాగుచుమరీ బెంబేల కోబ్రానిటన్ :)

  జిలేబి

  ReplyDelete


 62. రమేశు గారి భావనకు :)

  ఓఁబ్రాయంపు సతీ ! జిలేబి వినవమ్మో పాము లాటే సుమా
  యీ బ్రాంతిన్ కలిగించు జీవనము!ఓయీ నీవు కీలాల పా
  మై బ్రాకన్నన కొండ నేను! సఖుడా! మైకమ్ములో త్రోసెద
  న్నీ బ్రాకెట్టు కిలంబు నందు!జడియన్నీవున్కొనాలయ్య నా
  కై,బ్రాంచత్యహిరూప కౌను గతిలన్! కయ్యాటలో నోడగన్
  కోబ్రా తెమ్మని కోరె భార్య మగనింగోర్కెల్ పిసాళింపఁగన్!


  జిలేబి
  హమ్మయ్య కిట్టించా :)

  ReplyDelete


 63. దేవకి - యశోద - సుభద్ర - రాధ
  పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
  రామాయణార్థంలో

  రామా రాధనమాయెరా మనసు ! భద్రా!దేవ! కీరమ్ములి
  వ్వే మీకై ! దయతో యశోదయ గొనన్! వేడెన్పరంధాము, తా
  నే మున్ముందున మంచి పండ్లివియెనో ? నే స్వాదువున్గాంచి నా
  రామున్గై కొన మందు నంచు సయి సౌరస్యంపు పండ్లిచ్చెగా !


  జిలేబి

  ReplyDelete


 64. పిండాకూడయె విద్యలన్ని భళిరా పింజారు లైరే జనుల్ !
  నిండెన్పాతిక యేండ్లు బుద్ధి విరియన్నెక్కొల్ప లేరయ్యిరే !
  భాండాగారపు పొత్త ముల్ చదివిరే !పాగెంబు లేమాయె ? యే
  మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్?

  జిలేబి

  ReplyDelete


 65. జెండర్మార్పిడి :) క్లోనింగు :) సోలారు విద్యుత్తు :) కలువాయి :)

  జెండర్మార్పిడి కాలమందు జనులే జేజేలు పల్కంగ మా
  ర్తాండుండండగ వైద్య విద్యయు మహాత్మ్యంబయ్యె! టెస్ట్యూబులో
  పిండంబుల్కలువాయి చేయ, భళిరా పెట్రేగ మండ్రాటమే
  మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్!

  జిలేబి

  ReplyDelete


 66. వీణా తంత్రుల నాదమై పలుకులున్ వీకాశమై జొప్పిలన్
  నాణెమ్మై నిలువన్ జనాళి వసుధన్ నాంత్రమ్ము నేర్వన్ భళా
  మాణిక్యంబుగ నిల్తురమ్మ భువిలో మాన్యంబిదే నమ్ము, శ్రీ
  వాణీ, ప్రేమ జలంబు గాదె యిహమున్ భవ్యంబుగా దాటగన్!


  జిలేబి

  ReplyDelete


 67. ప్రాణంబై నిలిచేవు సూవె! జలజా! వాల్గంటి!శాతోదరీ!
  జాణా!తొయ్యలియా! జిలేబి మగువా! శంపాంగి!లోలాక్షి!నా
  రాణీ!మంజుల వాణి! భామ ! లలనా !రత్నాంగి ! పూబోడి! శ్రీ
  వాణీ! ప్రేమ జలంబు గాదె యిహమున్ భవ్యంబుగా దాటగన్!  జిలేబి

  ReplyDelete


 68. బాబాయౌతరు! విన్న కోట నరసింహారావు పల్కిద్ది ! కా
  ఫీబాబా! యని పేరు బెట్టి తినయా ! ఫీచర్లతో మీ కతల్
  గాబాగూబిగ సాగు చుండె! జనులున్ కావారి తో కొల్తుర
  య్యా బారాది, గృహస్థ జీవనపు సయ్యాటల్ దిగద్రోచకన్
  రాబోయే రిటయిర్డు లైఫునకిదే రాచందమౌ వైవియార్ !

  జిలేబి

  ReplyDelete


 69. వయ్యారంపు జిలేబి, కంజముఖి,యా వాల్గంటి, శంపాంగి, యే
  భయ్యోయేట పడన్ మగండమెరికా భాగ్యంబు గా బోవగా
  నయ్యయ్యో కడు పయ్యెనేమి! కవినాథా నీకుఁ జిత్రంబుగన్
  సయ్యాటల్లధరమ్ములున్, పదములున్, సంభావ్యమౌకైపులున్ !


  జిలేబి
  పరార్ :)

  ReplyDelete


 70. భయ్యా! భావ జిలేబి! ఓ!చనవరీ! వాహ్వాహ్ సెబాసో సెబా
  సయ్యా! మీ కవితల్ ! పదమ్ములు భళా ! స్వామీ ! జిలేబీల మీ
  వయ్యారంపు కబంధ మందు నిడిరో! వార్నీ ! రమేశా ! గన
  న్నయ్యయ్యో కడు పయ్యెనేమి కవినాథా నీకుఁ జిత్రంబుగన్ !

  జిలేబి

  ReplyDelete


 71. అయ్యారేయని నీ జిలేబులకు సయ్యాటల్ గనన్ ఓసఖా!
  నయ్యయ్యో కడు పయ్యెనేమి! కవినాథా నీకుఁ జిత్రంబుగన్
  వయ్యారంపుకొమార్తె గల్గు ప్రియుడా! వర్ధిల్ల నీకీర్తి మే
  లయ్యాతాళిని గట్టగన్! సుకవి!లోలాక్షిన్ దిగద్రోచకోయ్!

  జిలేబి

  ReplyDelete


 72. మా మత్తల్లిక సత్యసంధకు సభామర్యాద నేజేతురా!
  కామయ్యా భయశీలురైన మనుజుల్ కామయ్య! మా మానినిన్
  నీమమ్ముల్తొలగించి నీడ్చితివిగా! నీరక్తమున్ద్రాగెదన్
  రా!మత్తేభముగా క్రమించెదనురా రావంబిదే! భీముడన్

  జిలేబి

  ReplyDelete


 73. సారీ చెప్పగ మోడియంట విను వైస్చాంస్లర్రుహోదాన, దే
  శారిష్టంబులు కండ్ల ముందగుపడన్ సాధ్యంబయెన్! పౌరులా
  రా రయ్యంచిక నీటికష్టముల ధారాళంబుగా తీర్చు న
  ర్రా రారాజగు మోడి యే! చనవరీ రా వందనాల్జెప్పు, భో! :)

  జిలేబి

  ReplyDelete


 74. వద్దొద్దంచు గులాబులన్ తడుముచున్ వాచాటు లౌతారయా,
  సుద్దుల్నేర్చి జిలేబులౌదురు గదా చోద్యంబిదే నయ్యరో
  మొద్దబ్బాయిలు ముద్దుగుమ్మలకటన్ ముద్దివ్వ బోవంగనే,
  రాద్ధాంతంబుల వీడి జూచుదురయా,రాధమ్మ బుగ్గల్ సదా :)

  జిలేబి

  ReplyDelete


 75. స్మైలీలన్ వెస నేర్చి నామయ !అనుస్వారమ్ము నేర్పుల్ తెలీ
  లే! లీలై యగు పించె మాకు గురువా ! లే! శిష్య! లెమ్మా! భళా
  చాలా యీజి సుమా! జిలేబులవలెన్ చక్కంగ దీర్చన్నదే
  వీలై నీ జత గూడు శాస్త్రి ! వినుమా వేగమ్ము యత్నింపు మా !

  జిలేబి

  ReplyDelete


 76. హర్మ్యంబీ భువి! యిందు మానవులటన్ హాకంబు మేమంచు సా
  ధర్మ్యంబున్ వడిగా త్యజించిరి;మనోధర్మంబు మాదంచు, నై
  ష్కర్యంబంచు జిలేబు లై తిరిగిరే ; శాంతమ్ము గోల్పోవుచున్
  హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే?

  జిలేబి

  ReplyDelete


 77. నెట్వర్కింగుల కాలమయ్యె రచనా నేర్పుల్ మరేలా? హయా
  రే ట్వీటింగులు మార్కెటింగులు గదా రేటింగు పెంచున్, సఖీ
  బట్వాడా కరపత్రముల్, గరము టీ పార్టీల తో కుల్కుచున్
  జెట్వేగంబుగ పేరుగాంచుము జగజ్జెట్టీ జిలేబీగవన్!

  జిలేబి

  ReplyDelete


 78. ఆధారంబెవడో? అనాది యెవడో? ఆత్మై ప్రకాశించు మూ
  లాధారంబెవడో? రమేశుడెవడో? లావై బలమ్మై జనుల్
  రాధాకృష్ణులుగా భువిన్ పరిణితిన్ రాజిల్ల వైనంబెవం
  డో?ధర్మంబెవడో?ప్రభాకర! గనన్ డోలాయమానంబహో

  జిలేబి

  ReplyDelete


 79. చాలామంది తెలుంగు బ్లాగరులు సోచాయించకన్ ఫేసు బు
  క్లో లాగించిరహో టపాలనకటా క్లోజ్చేసి బ్లాగ్లోకమున్
  మీలా కొందరు పద్యముల్ కవితలన్ మేల్గూర్చ బోవంగనే
  బాలా! డస్సుచు నాంధ్రులెల్ల రకటా బ్లాగ్లోకమే వీడిరే :)

  జిలేబి

  ReplyDelete


 80. సాయంబివ్వకు వాటినెల్లనిక నిస్సారంబుగా జేయుమా
  సైయంటే సయి సయ్యనన్ నెలతుకా సాతానులా వెన్బడున్
  నీయంతమ్మును చూడు నమ్మ పడతీ నీడై సదా సోదరీ
  పోయే కాలపు బుద్ధులివ్వి వినవే పోనిమ్మ పద్మార్పితా

  జిలేబి

  ReplyDelete


 81. బిడ్డల్నిచ్చెనునాకొకండు విడిచెన్ పీడించి పీడించుచున్
  దుడ్డుల్లేవయ చేతిలో, తడవుగా దూకంగ నేస్తమ్ములు
  న్నడ్డంబుల్తొలగింప లేరు, ధరణిన్ నాయన్నవారేరయా
  వడ్డీలెక్కలజీవనమ్ము చిదిమెన్ వాణిజ్యమైనాను! నా
  కడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్

  జిలేబి

  ReplyDelete


 82. మా నారా వారి పల్కు :)


  విడ్డూరంబిది! స్టేటసిత్తుమని నీవే సోదరా చంద్ర మా
  చడ్డీల్గాచితి వంచు బల్కిరి గదా! సాధ్యంబు కాదిప్పుడం
  చడ్డాల్పల్కుచు కేంద్రమేల గునిసెన్ ? సాగింపనీ పొత్తులన్
  నడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్!

  జిలేబి

  ReplyDelete


 83. ప్రధాని ఆలోచన - కాశ్మీరు

  అడ్డాల్నాడు జిలేబులౌత!రిపులై యడ్డంబడన్పౌరులున్
  గడ్డాల్బట్టుచు వేడనేల నికనో? కాశ్మీర రాష్ట్రంబు లో
  నడ్డంబై నిలువన్ సమున్నతికి నానారీతి నేనొప్ప! నా
  కడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్!

  జిలేబి

  ReplyDelete


 84. రమేశు గారి భావనకు


  బుడ్డీలన్, సయి వోటు నోట్ల భళిరా పోయించి పారించుచున్
  చడ్డీల్దాల్చి రిసార్టులందు భళి వేశ్యారూపులై యాడుచున్
  రడ్డుల్నేలగ హార్సు ట్రేడు గలదర్రా కోపుగా, యేల, మా
  కడ్డం బయ్యెను, ధర్మవర్తనము, కట్టా కార్యసంసిద్ధికిన్!


  జిలేబి

  ReplyDelete


 85. పోరాటంబగు జీవితమ్ము భగవత్ప్రోక్తమ్ము రా మానవా
  ప్రేరేపించిరినాడు శంకరులటన్ పేత్వంపు నద్వైతమున్
  ధారాళంబుగ విశ్వమెల్ల నరయన్ ధర్మంబు మార్గంబుగా
  సారా కంపెని నేడు శంకరుల విస్తారమ్ము తెల్పెన్ గదా!

  జిలేబి

  ReplyDelete

 86. ఛందోబద్దము కాకపోదకొ భళా సాధింప సాధింపగా :)  ఏరాలమ్ముగ నేను నీవు ఒకటే, నెవ్వారికైనన్ సుమా,
  సారాతాగగ విన్నకోటవరుడా సారంబు బోధిల్లు, తా
  నైరాశ్యంబును వీడు నయ్య,వినుమా నద్వైతమార్గంబిదే !
  సారా కంపెని ఆదిశంకరుల విస్తారమ్ము తెల్పెన్ గదా!


  జిలేబి

  ReplyDelete


 87. జాలంబందు జిలేబి చీర్సులగనన్ జంబమ్ము లన్గానగా ?
  కోలాటమ్ముల చేయు బాల యెవరో? కోలంకిపిట్టెవ్వరో ?
  బాలారాజము రాముడెవ్వరి సమాప్తాలుండు చెప్పన్ సఖీ !
  వాలం బొక్కటి తక్కువయ్యె నకటా; వామాక్షి ; సీతమ్మకున్!

  జిలేబి

  ReplyDelete


 88. కాపాడెన్ క్రతువా యహల్యకొసగెన్ కైవల్యమున్, రొయ్యనన్
  చేపట్టెన్ తను కాశ్యపీ తనయ నే సింగాణి ఛేదింపగా
  వప్రుండానగ నేగె కానన‌ము,హా!ప్రాణేశుయే నత్తరిన్
  తాప్లావిన్ గని తెమ్మనన్ వెడల సీతాయంచు నేమార్చెనే

  జిలేబి

  ReplyDelete