Thursday, November 2, 2017

ప్రియతము డతడే జిలేబి విభుడున్నతడే !ప్రియతము డతడే జిలేబి  విభుడున్నతడే !సంతానము పెద్దదయా !
చింతల దీర్చ చిననాటి చెలిమరి నెరవు
న్నింతి యొలయుమని వేడె
న్నింత చిపిటములను మూట నిడి భర్త నటన్ !


పిరియపు చిపిటములను చెలి
మరి తెచ్చెననుచు ముచుటిని మరిమరి యొలయన్
సిరి, యవనారిని విడువన్
సరిహద్దు నిడెనట చాలు "చపలత" యనుచున్ !


పయిపంచెన చిపిటములన్
సయించు హృది , బాల్యమిత్ర సాయము యవనా
రి యెలమి యాదరువులనన్
ప్రియతము డతడే భళిభళి విభుడున్నతడే !


శుభోదయం
జిలేబి

నిషిద్ధాక్షరి
అంశము - కుచేలుని వృత్తాంతము
నిషిద్ధాక్షరములు - కకారము (క - దాని గుణితాలు, అది సంయుక్తంగా ఉన్న అక్షరాలు)
ఛందస్సు - మీ ఇష్టము.

44 comments: 1. పన్నారి వారి తురగవల్గన రగడ

  సాదరమున దార సాద మునట వేదన జేయుమని
  యాదరముగ సాగనంపె ముడుపు నిడుచు సుదామునిన్
  ఉదారుడౌ వాసుదేవుడు సంతుష్టుడవన్ యెలమి
  గ దయ గొన ప్రసాదము మిహిగ చెలుమరి ప్రసాదన సుమి

  ReplyDelete
 2. అటు ఇటు ఎటు చూసినా అతడే...అంటారా :)

  ReplyDelete


 3. డియర్ - కేన్ యు హెల్ప్ మి
  ఓహ్ ! ఇయాం వెరీ వెరీ బిజీ :)


  వేలకు వేలు గలరయా
  పూలను ధరియింపఁ గోరు పొలఁతులు, గలరే
  వాలయము, మగండ్లు భువిన్
  చాలుబడిగ కొప్పు నందు చక్కగ జొనుపన్ ?


  జిలేబి

  ReplyDelete


 4. మాలతి చోదకు రాలయె!
  పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే!
  వీలే లేదయ ! రయ్యన
  ఓలా కారు నడపవలె నొప్పదు సుమ్మీ !

  జిలేబి

  ReplyDelete


 5. కోలముఖమ్ములు లేవయ
  గోలతనమ్ము కన రాదు గూగుల్ రమణుల్!
  వాలు జడలులేవు! చెవుల
  పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే!

  జిలేబి

  ReplyDelete

 6. నా నిరసన తెలిపేస్తు
  న్నా నండీ పద్మ , సజ్జ నత్వపు పలుకుల్
  కానే కావివి సుమ్మీ !
  మీ నాలుక యింత మంద మెప్పుడు జేర్చెన్ ?

  జిలేబి

  ReplyDelete


 7. నా నిరసన తెలిపేస్తు
  న్నా నండీ పద్మ , సజ్జ నత్వపు పలుకుల్
  కానే కావివి సుమ్మీ !
  మీ నాలుక యింత మంద మెప్పుడు జేర్చెన్ ?

  జిలేబి

  ReplyDelete


 8. మౌనముగ తెలుపుతున్నా
  నా నిరసనను! విను పద్మ! నాలుక మందం
  కానే కాకూడదహో!
  యేనాడైన పడతీ యయెను గల్గకుమా !

  జిలేబి

  ReplyDelete


 9. అయె యేలనే జిలేబీ ?
  వయసొచ్చినకుర్రవాళ్ళు పండ్లూ డిన పె
  ద్ద యెదవలు కులుకన వలయు
  పయిదలి పరువమ్ము సోకు పాజము చూపన్ !

  జిలేబి

  ReplyDelete


 10. గట్సున్న పద్మ వమ్మా
  ఫిట్సొచ్చేటట్టు కొట్టి ఫిట్టింగెట్టేవ్
  చేట్సుల్లో నీ చర్చే
  బీట్సుల్వేసెన్ జిలేబి వీరవనితవోయ్ !

  జిలేబి

  ReplyDelete


 11. ఇది దమ్మూ పట్టున్న క
  విత! పద్మార్పిత భుజముల వెలయు తుపాకీ
  సదనమ్మునకొక హెచ్చరి
  క! దామిని నిరసన నెలతుక సవాలు సుమీ !

  జిలేబి

  ReplyDelete


 12. చదువన్ పగిలెను గుండె!ప
  యిదలి కవితయె పిడిబాకయి మదిని గుచ్చెన్
  కదనమ్మును సాగించుము
  వదులక పద్మార్పితా! గవాక్షము తెరిచేవ్ !

  జిలేబి

  ReplyDelete


 13. ఏమమ్మ కండకావర
  మేమిటి పద్మార్పితా త్వమేవాహమన
  మ్మా మగరాయుండ్లే మై
  నా మీ తొత్తుల జిలేబి నలిగెదవమ్మా !

  జిలేబి

  ReplyDelete


 14. కవి కాళిదాసు వర్ణన
  తవికల్లో గాన వచ్చె తరముగ సుమ్మీ
  మవురిని జేర్చెను బుచికీ
  జవరాల జిలేబియా సజావుగ సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 15. నీహారిక మాటలు,సయి
  వాహకత నెలతుక చెల్ల వగ్రారమునన్
  సాహసమగునే ఫత్వా
  బాహాటమ్ముగ నిడన్ సభాస్థలినందున్ :)

  జిలేబి

  ReplyDelete


 16. బుచికి అన్న మాట పూర్తిగ సరిపోవు
  నా స్వభావమునకు నాకు బుచికి
  బుచికి గ యనిపించు పూర్తి సీరియసునె
  స్సయ్య తస్స దియ్య సారు వినుమ

  జిలేబి

  ReplyDelete


 17. మూగ బోయె మనసు ముసురొకొనియె భార
  మమ్మ మదిని పద్మ మంచి కవిత
  చదువ గాను హృదిని జల్లనుచు జిలేబి
  పిండి చేసె మీదు పిప్పిగాన !

  జిలేబి

  ReplyDelete


 18. దత్తపది - చెవి ముక్కు నోరు కన్ను అన్యార్థంలో భారతార్థం లో

  ఏకుచు విరిచె విసపరిని
  వాకముగ దుముక్కుల మజ వలలుండతడే
  తా కుత్తుకన్నులుముచున్
  తేకువ తో నోరుచు సతి తెవ్వన జూడన్!

  జిలేబి

  ReplyDelete


 19. అడుసు తొక్కనేల హరి హరిబాబయ్య
  పడుచు కుర్ర వాడ ? పండితుండు
  గాదె ? కొండ నెదురు కొనగోర నేలయ
  విశ్వదాభి రామ వినుర శ్యామ !

  జిలేబి

  ReplyDelete


 20. కురిపించేవు కణితలన్
  మరులన్న మరుతురు పద్మ మగవాళ్లెళ్లన్!
  కరుకైన పదమ్ములతో
  పరుగెత్తించేవు గుండె పగులన్ సుమ్మీ !

  జిలేబి

  ReplyDelete


 21. ఆవేదన నాజ్యంబుగ
  గావించేవమ్మ పద్మ గాండ్రించితివే
  కావరము వీడ మనుచున్
  ఓ వనితా! కణ్ణగి! పువుబోడి ! జిలేబీ !


  జిలేబి

  ReplyDelete


 22. తప్పెను మతియు గిర్రున తరుణి తిరిగె
  తలయు నీ కవిత చదువ! తాడనమ్ము
  జూడ వేడ్కగ నుండె బుజుర్గు లెల్ల
  భీతి నొందుదురు జిలేబి బిఱిస బిఱిస!

  జిలేబి

  ReplyDelete


 23. A marriage of happiness :)


  కంభారిని గట్టిరి సం
  రంభము మొదలయ్యె పెండ్లి రయ్యన ముగిసెన్
  శంభము గూర్చెడు సతి,యా
  రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్!

  జిలేబి

  ReplyDelete


 24. పదునైన పదమ్ములతో
  హృదయమ్మును తూట్లుపొడిచి హృత్సారముతో
  సదనమ్మున నిలిచిరి ప
  ద్మ! దామినుల రోజువారి తనకలి యివియే!

  జిలేబి

  ReplyDelete


 25. హృదయపు బాధ అగాధము
  గద పద్మార్పిత ! తనకలి కథలన్ తెలిపే
  వు ధుమధుమల విష్వక్సే
  న దామిని!పడతి! విధాత నలివెట్టెగదా!

  జిలేబి

  ReplyDelete


 26. సరిదిద్దు కొమ్మని పలుక
  పరిహాసమ్ములకటా ! సభామర్యాదన్
  మరిచిరి గాదె జిలేబీ !
  చిరాకు లెత్తింప తిట్టి ఛీ పో యనరే :)

  జిలేబి

  ReplyDelete


 27. కామాంధులకు భళా షా
  కే! మాడమ్ పద్మ! బందుకే వారికి సు
  మ్మీ! మారెదరో పురుషుల్ ?
  కైమా చేసేరు వార్ని కసకస యనుచున్ !

  జిలేబి

  ReplyDelete


 28. తెలివి మాట్లాడు నయగురో! తెగులు చూప
  నేల జ్ఞానమున్నదనుచు! నెత్తి పైన
  వేతు రయ్యమొటిక్కాయ వెంగళివలె
  తలచి! అనువుగాని తలము తర్క మేల !

  జిలేబి

  ReplyDelete


 29. మరిమరి నిన్నే యనుచున్
  పరుల వయిపదేల చూపు పరగడుపునయా !
  పరమాత్ముడ నా కార్యమ
  ది రసమయజగత్తునాది దివియున్ భువియున్!

  జిలేబి

  ReplyDelete


 30. ఊరికె సలహా లేలా!
  పారుడ! హరిబాబు వినుమ పారిందల్లా
  జోరుగ మనదే కాదోయ్
  నోరుచు కొనవలయునయ్య నోర్మిని గనుచున్ !

  జిలేబి

  ReplyDelete


 31. రారా సరసకు రారా
  రా రమ్మని బిల్వ రామ రామయనుచు తా
  పారాహుషారుగన్, హా !
  తారాధిపు భీతి నబ్ధి, దాఁగె నణువునన్ :)


  ఇంతకు మించి రాస్తే పన్,డిట్ సభ వాయ గొడతారు కాబట్టి నో వ్యాఖ్యానం ఫార్ దిజ్ :)


  జిలేబి

  ReplyDelete


 32. చంపుచు సమాధి చేస్తవు చల్లగాను
  పద్మ ! పడిపడి చదువుత పదము లెల్ల
  పదునగుచు గుచ్చె మదిలోన పదిలముగ జి
  లేబి ! హీరోయినువు నీవు లెస్స గాను !

  జిలేబి

  ReplyDelete


 33. భయమా ? గౌరవమమ్మ! వి
  నయమ్ము గా చెప్పిరిగద; నరసింహారా
  వయ!మంచి మనసు గలవా
  రయ మీరు జిలేబి వచ్చె రయ్యన మెచ్చన్ !

  జిలేబి

  ReplyDelete


 34. ఎన్ని మంచి విషయముల నెన్న గాను
  చెప్పి రయ కవిరాయ! నచ్చెనయ! మీకు
  వందనమ్ము లివియె సూవె వచ్చె లలిత
  మైన పల్కులు! సంతోష మయ్యె గాద !

  జిలేబి

  ReplyDelete


 35. నీవో బాబూ శ్యామల
  రావో దమ్మున్న రండి రా ఖమ్మమున
  న్నీ విషయము తేల్చెదమో
  యీ! వేగిర నేర్చుకొని సయికముల రండ్రా!

  జిలేబి

  ReplyDelete


 36. చదువన్రాయే బ్లాగూ
  పదపద నీబ్లాగు గొప్ప పరులకు చెప్పన్
  కుదరదు కతల్వినగ సూ !
  యదిరె జిలేబీ జవాబు హద్దరి బన్నా :)

  జిలేబి

  ReplyDelete
 37. “garam chai” తరవాత అలుపెరుగని ప్రచారకర్త “sam”. అదే “మారి” (మాదిరి) ఇప్పుడు “Movie Masthi”, “GKR Channel”, “instv”. ఈ వెల్లువలో అగ్రిగేటర్ లో వ్యాఖ్యలు వెతుక్కోవాల్సి వస్తోంది 🙁. “..... two grains of wheat hid in two bushels of chaff: ..... “ అని Bassanio అంటాడు చూశారా షేక్‌స్పియర్ గారి The Merchant of Venice నాటకంలో, అలా అయ్యింది పరిస్ధితి. ఈ వరద ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో ఏవిటో? 🙁

  ReplyDelete


 38. నీయీ పదాల ధాటికి
  ఓయీ పద్మ మగజాతి మొత్తంపైనన్
  ఛీయన నసహ్యమేస్తోం
  దే! యెదవలను కొనకమ్మ తిట్టకు సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 39. నారా వారి దీక్ష


  అదిగో మెదలెట్టెన్ దీ
  క్ష! దీకొనుచు చంద్రబాబు ! కాలున్ దువ్వెన్
  కదిలెన్ తెలుంగు తేజము
  వదులరికన్ వేద సమర వారిజమిదియే!

  జిలేబి

  ReplyDelete


 40. చంద్రన్న దీక్ష! మద్దతు
  సంద్రంబుప్పొంగెనే! వి జయమిక మనదే
  కంద్రీగతుట్టె కదిలె! న
  రేంద్రుడ దిగిరమ్మ భువికి రిమ్మను విడుమోయ్


  జిలేబి

  ReplyDelete


 41. మా లక్కుపేట రౌడీ
  కూలంకషముగ విషయము గూర్చి తెలుసుకో
  వాలని రంగము లోదిగె
  జాలంబిక ధుమధుమయని జాగృతమగునో :)

  ****

  ఆహా కీటో డయటూ
  ఓహోయన పుణ్యమెల్ల పొందితివి గదా
  బాహాటమ్ముగ వచ్చిరి
  సాహోరేయనుచు రౌడి చక్కగ సుమ్మీ :)


  జిలేబి

  ReplyDelete


 42. హమ్మయ్య నేటి జావళి అయిపొయింది :)


  అవనత సుబ్రహ్మణ్యుడు
  శివపుత్రుఁడు, మఱఁది యగును శ్రీనాథునకున్
  శివుడు గద కందివర్యా
  జవకట్టి కొనుమయ పద్య జావళి నొకటిన్ !

  జిలేబి

  ReplyDelete


 43. గుర్తు పట్ట లేక గునగున జూడన
  గొట్టి ముక్క లయ్య గోరి వ్యాఖ్య!
  అరరె! సొంత పలుక? యందుకే వింతగ
  యుండె నా జిలేబి ఊరగాయ :)

  జిలేబి

  ReplyDelete