Sunday, November 12, 2017

పంచ పండ వుల శంకువు ల పేర్లేమితో మీకు తెలుసా ?



పంచ పండ వుల శంకువు ల పేర్లేమితో మీకు తెలుసా ?  :)
 
(తెలుగు లో టైటిల్స్
ఇట్లాగే వుంటాయి కాబట్టి
మన బ్లాగ్లోకం లో :) జేకే జే ఎఫ్ :))
 
పంచ పాండవుల శంఖముల పేర్లేమిటి ?
 
 
 
అనంత విజయము - ధర్మరాజు
పౌండ్రము - భీముడు
దేవదత్తము - అర్జునుడు
సుఘోష - నకులుడు
మణిపుష్పకము - సహదేవుడు
 
పాంచజన్యము - శ్రీ కృష్ణుడు
 
భగవద్గీత
అధ్యాయం ఒకటి 15-16 శ్లోకములు ఆధారము
 
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః  1-15
 
అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః
నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ     1-16
 
శుభోదయం
జిలేబి

 

6 comments:

  1. “ఎమి తిని సెపితివి కపితము” అన్నట్లుంది మీ ఈ టపా టైటిల్ 😀.

    (అల్లసాని పెద్దన కవిని "అమవస" అనే మాట వాడినందుకు వెటకరిస్తూ తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం) 👇
    ఎమి తిని సెపితివి కపితము
    బెమ పడి వెరి పుచ్చ కాయ మరి తిని సెపితో
    ఉమెతక్కయ తిని సెపితో
    అమవస నిసి యన్న మాట నలసని పెదనా !!
    =================

    మొన్నీ మధ్యనే “కౌన్ బనేగా కరోడ్-పతి” షో లో అమితాభ్ బచ్చన్ - మణిపుష్పకం ఎవరి శంఖం - అనే ప్రశ్న అడిగారు. హాట్-సీట్ లో కూర్చున్న వ్యక్తి బయటకే అనుకుంటూ జవాబు కోసం ఆలోచించడం మొదలెట్టడమే - సహదేవుడు కాదు - అంటూ మొదలెట్టాడు 🙂. బాగా ఆలోచించి చివరకు తప్పు సమాధానమే ఇచ్చాడని గుర్తు.

    ReplyDelete
  2. పాండవుల పేర్లే స్పష్టంగా పలుకలేని అజ్ఞానిని...ఏమి చెప్పెదా? శంఖముల గూర్చి మీరు రాసినవి చదుకోవడం తప్ప.

    ReplyDelete
  3. ఇంతకీ మీరే శంఖం పూరించ దలిచారు?

    ReplyDelete
    Replies
    1. కంద శంఖం కాబోలు...

      Delete

    2. ఎ‌న్నాళ్ళకెన్నాళ్ళకు
      బులుసు వారి దర్శనం!

      శంఖము యింతగా లాగిందా !

      వెల్కం బెకబెక వెనుకే బోనగిరి గారు కూడా!

      జిలేబి శంఖము పేరు

      చతుష్షష్టీవిభ్రాజమానపరివేష్టితాపూర్ణాతిపూర్ణశ్శంఖః:)


      చీర్స్
      జిలేబి

      Delete
    3. zilebi
      "చతుష్షష్టీవిభ్రాజమానపరివేష్టితాపూర్ణాతిపూర్ణశ్శంఖః)"

      hari.S.babu
      అనగా, అరవైనాలుగు గుండుసున్నలని అర్ధము కాబోలు:-(

      Delete