Monday, November 6, 2017

కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)



 
 
కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)
 
నీ మదిని తరచి చూడడ
మే మగువా శోధన! విను మేధా జీవీ !
నీ మది సాధన జేయన్
కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)



జిలేబి
 
 
 

207 comments:


  1. పతి పతి పతి పతి పతి యని
    యతింప నభవుడు సరిసరి యనిపల్కంగ
    న్నతివకు నైదుగురన ధీ
    మతులు పతులు సయి శుభాంగి మనసు రమింపన్ !

    జిలేబి

    ReplyDelete



  2. కందము కట్టిన వాడే
    డెందంబరయన్ జిలేబి రెపరెప లాడున్
    విందైన కైపుల పదము
    లందున సొగసు వికసింప లాహిరి యగునే !

    జిలేబి

    ReplyDelete



  3. స్వాడబ్బాల్ వల దోయీ
    బాడబ పలుకుల వినుము సొబగు పడతి లేజి
    బీ ! డగ డగబండినటన్
    గాడిని లాగించుటేల కంద జిలేబీ !

    జిలేబి

    ReplyDelete



  4. ఆముద ములోన పారుడు
    ఆ, ముదమును గాంచెనోయి, యాము గడియలో,
    యేమగునో తెలిపెనహో
    భో! మా యొజ్జ భళి భళి ప్రబోధ జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  5. కందము రాయంగల కా
    మందులు తామే జగమున పండితు లనుచు
    న్నందరి ముందర రోసె క
    బంధము వలెగద సుజనుల బాది జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  6. జిలేబీ వారి కాలజ్ఞానమ్ :)


    ప్రాస యతుల గోలలలో
    సోసలు మీడియ జిలేబి సొమ్మసిలును సు
    మ్మీ! సత్యమిదియె నమ్మీ
    మీసములన్ ద్రువ్వుచున్ శ్రమించెదరు భళా :)

    జిలేబి

    ReplyDelete


  7. ఆగ్మెంటెడ్సాఫ్ట్వేరుల
    ఫ్రాగ్మెంటుల కైపు కంద పాదమ్ములకున్
    యుగ్మము గానున్ భళిభళి
    యుగ్మలి గనవే జిలేబి యుగళము గలుపన్ :)

    జిలేబి
    The matrix of 64 :)

    ReplyDelete


  8. ద్రౌపదికి తొల్లి జేసిన తపసు జేత
    పతులు గల రైదుగురు; సాధ్వి భానుమతికి,
    యన్న వరుసయ్యె యవనారి, యాశ్వినేయు
    డయ్యె ధవుడు,వప్రుడు భానుడగు జిలేబి !

    జిలేబి

    *కృష్ణుని తండ్రి వసుదేవుని తమ్ముడగు భానుని కూతురు భానుమతి పెనిమిటి సహదేవుడు (ఆశ్వినేయుడు)

    ఆంధ్రభారతి ఉవాచ :)

    ReplyDelete


  9. కందోత్సవ సొబగుల మక
    రందోత్సవముల మధురిమ రసగుళికలనన్
    బిందాసుగ పద్య రవళి‌
    సందోహమ్ములను జేర్చు సారంగంబై !

    జిలేబి

    ReplyDelete


  10. కన్నియల గుండె చప్పు
    ళ్ళన్నాడు హరిగనెనట! భళాబాబు సుమీ
    యిన్నాళ్ళకుగాంచె సఖీ
    చిన్నోడినెవరు కెలికిరి చెకుముకి యనుచున్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అప్పుడే చూసేసావా జిలేబీ:-)
      తప్పులు లేవు కదా ఈసారీ:-(

      Delete

    2. బెత్తపు మాస్టారు గారొచ్చి మీకు నాలుగు మొట్టిక్కాయలు వేస్తే అన్నీ సర్దు కుంటాయి అవి‌అవి‌ వాటి‌వాటి స్థానం లో :)

      సరిదిద్దండి

      ఛందస్సు సాఫ్టువేర్ లో సరి చూడండి

      లింకు

      http://chandam.apphb.com/?chandam


      జిలేబి

      Delete



    3. చూసేసావా యపుడే ?
      ఓసీ పాసంగమేన ? ఓమైనా త
      ప్పా? సెప్పు సుమి జిలేబీ !
      మా సక్కా వచ్చెనయ్య మాహరి బాబూ :)

      జిలేబి

      Delete
    4. Thank you jilebi!
      Corrected with Chandam:-)

      Delete
    5. అయితే మీ సానరాయి ఈ సాఫ్టువేర్ అన్నమాట. సరే చూద్దామని ఓ రెండు పద్యాలు - మీ పద్యాలేనండోయ్ 😀😀 - ఈ సాఫ్టువేర్ లో వేసి తిప్పాను. ఛందస్సులో పాస్ అని చెప్పింది 👏. కాబట్టి, Carry on Jeeves అన్నట్లు, ఆ రకంగా ముందుకు పోతున్నారన్నమాట 👍.

      Delete

    6. @Haribabu

      Welcome. You will definitely appreciate it once you see the amount of rules that would have gone to build it

      Cheers
      జిలేబి

      Delete


    7. మీ సానరాయి యిదియా!
      పూసల గుచ్చన్ జిలేబి పూవిల్లదియే :)
      మాసటి వోలెన్ కుస్తీ
      దోసిట గానన్ పదముల దోస్తీ యదియే :)

      జిలేబి

      Delete
    8. సానరాయి మీద అరగదీస్తేనే పద్యాలలా ఉన్నాయి :)

      Delete
    9. Touch stone=గీటు రాయి.
      సాన రాయి కాదు బాబోయ్!

      Delete



    10. నికషోపలమున కట మరి
      యొక యర్థము సానరాయి! యొజ్జా ! వేరొం
      డగు గీటురాయి ! రాదీ
      య గురువులను దీనికి సరియగు పదమిదియే :)

      జిలేబి

      Delete


  11. కవనమ్మది! పదముల బే
    ర్చు వరుసలనుకొంటివా ! బురుబురుయనంగన్
    జవరాలి కంటి కన్నీ
    రువలెన్నురుకుల పరుగుల రొప్పించవలెన్ :)


    జిలేబి

    ReplyDelete
  12. మగువ మనసుని చూడ మహామహులకే అసాధ్యామాయె...తమరు ఎటుల గాంచితిరో?

    ReplyDelete
    Replies


    1. అవి పాట తో నేను నుంచి కొట్టు కొచ్చిన పదాలండి :)


      చీర్స్
      జిలేబి

      Delete


  13. గ్రుడ్ల మిటకరించవలదు!
    వడ్లను దంచుము జిలేబి వడివడిగానన్
    లాడ్లీ, ఫలహా రమన
    న్నిడ్లీలే చాలు మనకు నితరము లేలా?

    జిలేబి

    ReplyDelete

  14. మరిసా క్రియేటివిటి! సా
    మిరంగ! అంత కెళవు ఉపమితి అవసరమా !
    దరిదాపులలో లేవా !
    పరిస్థితి యిది మనదాయె !పై సృజనవలెన్ ?

    జిలేబి

    ReplyDelete


  15. భాష్యము చెప్పెను పారుడు
    వేష్యము వోలె ప్రవహించె వేడుక గానన్ !
    కాష్యూ నట్ వలె నములుము
    డిష్యూం డిష్యూం జిలేబి డిగనురు కులనన్ :)

    ReplyDelete


  16. హ! బి డారమ్ముల వాసం
    తి బిలేజి,గుడారమున్ జతియతుల గాంచెన్ !
    సభికుల మనస్సు దోచెన్ !
    గుబగుబ మనె యయ్యవారు గూడ జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  17. మనసంతర్ముఖము గనన్
    మనుజని మది మత్తిల వలె మాన్యము గానన్
    తనదారిని తానుగనుచు
    కనకన లాడక నిలకడ గలిగి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  18. కంపనమొనర్చగ జనాళి కంద పద్య
    సొంపులనునేర్చి, కవివర సొబగు గాను
    యింపగు జిలేబులందించి యిచ్చట గల
    సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ!

    జిలేబి

    ReplyDelete


  19. మీ తలపైనన్ చదువుల
    కై తంబి నలభయి వేలు కట్టితి మోయ్ లె
    ఖ్ఖా! తెలగాణపు శ్రీహరి
    ఖాతా చూపిరి జిలేబి గట్టిగ నేడౌ :)

    జిలేబి

    ReplyDelete


  20. జేజేలు హరి ! పదములను
    రాజేసిరి కంద పద్య రాపిడి తోడన్
    భాజాభజయింత్రులతో
    తాజా హాట్ హాట్ జిలేబి తరమై జేర్చెన్ !

    జిలేబి

    ReplyDelete


  21. పద్యం బాగుందండీ !
    చోద్యంబేమన జిలేబి చురుకే చురుకూ :)
    వాద్యారు మామి గాదా
    సాధ్యంబావిడ కు సూవె చక్కగ యన్నీ :)


    జిలేబి

    ReplyDelete


  22. నా మాటలన్ని ఛందం
    బే మామి జిలేబి ? యొజ్జ , బేజారాయెన్ !
    సామీ యేమాటైనా
    మామికి ఛందంబు సూవె మాటలు జతియై :)

    జిలేబి

    ReplyDelete


  23. చెప్పండి! నిజము కందం
    బప్పా ? మాచన యడిగిరి భామా ! నిజమే
    యప్పా యందువ ? లేకన్
    చప్పున వృత్తం బనెదవ ఛంద జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  24. కలికాలమండి ! యేమం
    దు! లిప్త కాలంబున ప్రకృతులు మారెనయా!
    చెలిమరి శాస్త్రిజి ! పోరచి,
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్!

    జిలేబి

    ReplyDelete


  25. రూపంబన్నిట యున్నది
    ఆపరమాత్ముడు గద హరి బాబూ! వేర్వే
    రై పలికిన పలుకుల కల
    రూపు ముసి యనుట జిలేబి రూఢము గాదోయ్ !

    జిలేబి

    ReplyDelete


  26. సుగుణా! శ్రీకంది కవీ !
    భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్
    జగతిని యనసరి యగునా ;
    పగవారికి గూడ యిట్లు పాఠము వలదోయ్ !

    జిలేబి

    ReplyDelete


  27. తమరంత వారు కారో !
    నిమిషము లోన పకుల నటునిటు మార్చుదురే !
    తమకపడుచటన్ రాయం
    గ మురిసిరి గదా జిలేబి కవనపు రాణీ :)

    జిలేబి

    ReplyDelete
  28. జగతియె 'కృష్ణం వందే
    జగద్గురుమ్మని వలుక , విచార్యమ్మిది - ఆ
    జగతీ నాధుడు చెప్పిన
    భగవద్గీతయె ... భారత భూమిన్ .

    ReplyDelete


  29. దేవుడు నాస్తిక మతమును
    తావాంఛించున మనుజులు తామసు లగుచున్
    కావరమున నొకరినొకరు
    రూపడచి మురియ జిలేబి రూక్షము తోడన్ !

    జిలేబి

    ReplyDelete


  30. నాకే ఛందము రాదే !
    సోకుల్మాడగ పలుకులు శోభిలె యెటులన్
    మాకే తెలియదు యందం
    బై! కాణాచి గద యొజ్జ పలుకుల రేడై :)

    జిలేబి

    ReplyDelete


  31. ఇరుకూ,యి రికించడములు
    సరిజోదట నీకు సూవె చక్కని చుక్కా :)
    బిరబిర కుఱగలి యొరుస
    ల్లుఱిదిగ విరుచును మనసును లుకలుకల గనన్ :)

    జిలేబి

    ReplyDelete


  32. ఆముకొను సేన ననఘా
    భీముఁడు చెలరేగి చంపె; భీష్ము రణమునన్,
    తా ముంచెత్తెను శరముల
    తో మఘవ తనయుడయా యితోధికముగనౌ !

    జిలేబి

    ReplyDelete


  33. మీరేదో మసి బూసే
    స్తారండీ! తెలియదండి ఛందము లేవీ !
    పారుడు జనాళి ని గనన్
    జారెను యతులు, జతులు సరి చక్కని ప్రాసల్ :)

    జిలేబి

    ReplyDelete



  34. కమ్మెచ్చులోన చక్కగ
    బామ్మోయ్ కందపు జిలేబి "బారుల" వేసే
    రామ్మా ! బిరబిర వచ్చెన్
    కమ్మని పద్యము లనఘ!సుఖకరంబుగనన్ :)

    జిలేబి

    ReplyDelete


  35. మీరవధానము జేయం
    డీ! రావడియగు తెలుంగు డీలా పడుచున్ :)
    మా రాజా రావులు గల
    రా రంగులరాట్నమునకు రాజేయగనన్ :)

    జిలేబి

    ReplyDelete


  36. ఇటుకల కట్టుబడి భయము !
    కొటికాడి నవుతను ! విన్నకోట నరసరా
    య టిగియకు నన్ను సుమ్మీ !
    పటిమయు లేదయ్య నాకు పద్యములరయన్ :)

    జిలేబి

    ReplyDelete


  37. అవధాని జిలేబి యటన్
    రవరవ లాడుచు పదముల రవళిన్ దేలున్ :)
    కువకువ లాడుచు యినుడట
    జవనిక తీయన్ బిరబిర జావళి జేర్చున్ :)

    జిలేబి

    ReplyDelete



  38. హ! బలే నెట్టే స్తారం
    డి!బామ్మ మనపై యురుకుచు డీడీ యనుచున్ !
    రబసము లాడెడు జవ్వని
    గబగబ తను వచ్చె బో, భగభగ యనంగన్ :)

    జిలేబి

    ReplyDelete


  39. పద్యముల లోని భావము
    గద్యము లో తెలియగాను గలదా సాఫ్ట్వేర్ !
    వేద్యం బగు నరసన్నా
    విద్యార్థియవన్ భళిభళి వివరము లన్నీ !

    జిలేబి

    ReplyDelete



  40. నికషోపలమున కట మరి
    యొక యర్థము సానరాయి! యొజ్జా ! వేరొం
    డగు గీటురాయి ! రాదీ
    య గురువులను దీనికి సరియగు పదమిదియే :)

    జిలేబి

    ReplyDelete



  41. మీసాన రాయి రాయని
    రోసము లన్జెంది రాసి రోసిరి గాదే
    వాసిగ నాడు కవులటన్
    ఓసి జిలేబి చదువంగ నొక్కరు గలరే ?


    జిలేబి

    ReplyDelete


  42. కార్తీక మాసమున్నన
    పర్తీశులు చక్కగాను పాటించిరిటన్ !
    వర్తుల రమణుల పండుగ
    చిర్తకుడగు యొజ్జ గారి చిత్రము లహహో !


    జిలేబి

    ReplyDelete


  43. జైమిని నాస్తికుడు ! జిలే
    బీ మించారెను గదా సుభిక్షము గానన్ !
    రాముని కథ, జాబాలిన్
    ఓ మారు గనవలె సూవె ఓహో యనగన్ !

    జిలేబి

    ReplyDelete


  44. లింగ వచన వస్తువులు
    న్నంగట భావములు లేని నాట్యమయూరీ !
    చెంగట రబసల్లేలా !
    డింగిరి డాంగిరి జిలేబి డీకొన మాకోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  45. వెరవకు విమర్శలకు లే
    మ! రయ్యనుచు వత్తురోయి మరిమరి వేటా
    డరహమున నిన్న హరహము
    పరిపరి విధముల జిలేబి పరిగొని సువ్వీ !

    జిలేబి

    ReplyDelete


  46. జైమినులెందరు సామీ ?
    మామికి తెలుగొచ్చునా? సమాధానము సు
    మ్మీ! మిడతంబొట్లవలెన్
    నీమాటలు గలవు సూవె నీరజ నేత్రీ !

    జోజో
    జిలేబి

    ReplyDelete


  47. పనిలేని బామ్మ యకటా
    పనిగట్టుకుని పదములను పద్యంబులవన్
    తను గూడుకట్టు కొనుచుం
    డెనుగద భళిభళి యనంగ డెందంబరయన్ :)

    జిలేబి

    ReplyDelete


  48. కష్టపడనేల పిరియపు
    సాష్టాంగముల విభుని గొలుచన్ చక్కగ, నీ
    నిష్టయె జిలేబి, కాదోయ్
    దుష్టాచారములె, ముక్తి దొరకొనఁ జేయున్!

    జిలేబి

    ReplyDelete


  49. ఉత్తర కొరియా ! జూడ
    న్నత్తరి వచ్చెనుగ ట్రంపు ! నభసపు మేఘా
    లొద్దన కుదరక బోయెన్
    కుత్తుక మీదొచ్చునో కుకూలము నీకున్ !

    జిలేబి

    ReplyDelete


  50. కమనీయంబని సేవిం
    చి,మదిరనయనా జిలేబి చిక్కున పడితిన్ !
    రమణీ ణిసిధాత్వర్థ
    మ్మమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో?

    జిలేబి

    ReplyDelete


  51. ఆముని కుమారుని, పరశు
    రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్
    తామస మింతయు లేకన్
    రాముని కౌగిలి గనుచు శరాసనమిచ్చెన్ !

    జిలేబి

    ReplyDelete



  52. జ్యోతిష్కులార ! తీర్పరి
    కాతరు చేసె మిము! యెన్నికల ఫలితములన్
    మీ తౌలమందు తెలియ
    న్జేతల్ కూడదయ మొదట నే యనిరి గదా!

    జిలే‌బి

    ReplyDelete

  53. Venkata Apparao @ శ్యామలీయం-

    "షడ్జామడ్జ... శ్లోకం యొక్క భావం తెలియజేయగలరు."

    ఈ లంకె చూడగలరు ఉపయోగపడుతుందనుకుంటా


    http://varudhini.blogspot.com/2017/08/blog-post_21.html?m=1

    జిలేబి

    ReplyDelete


  54. వాత్సాపు గాధ లందున
    పత్సలము లెరుక గదా ! కపటమైనటి చి
    త్రోత్సవములును జిలేబీ !
    ఉత్సుకత గొలిపెను గాని ఊకర కతయే :)


    జిలేబి

    ReplyDelete


  55. కీబోర్డు గొల్పు బాధలు
    గాబర యింతింతగాదు కవివర గానన్,
    రాబోడి కైన తప్పదు
    కాబోలు తికమకలున్ను కంద జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  56. కొట్లాటకు వచ్చితి నే
    నెట్లా నమ్మగలనోయి ! నీ వీరంగం
    బెట్లా తాళన కో? యే
    ముట్లుడిగిన రాధ కిపుడు మూడవ నెలరా?

    వి.కో.న :)
    గారి కోసం :)

    ReplyDelete
    Replies
    1. నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి - నాకేం “సంబంధం” లేదు 😉

      Delete


  57. రఘురామ! రాజ్యసభన అ
    నఘా! తమరి కొరకు సీటు, నచ్చిన రమ్మా !
    పగలా ఆమాద్మీ హై ?
    బఘావొ యిస్కో జిలేబి బయటకు యిపుడే !

    జిలేబి

    ReplyDelete


  58. కందమ్మా! యెందులకా
    క్రందన లమ్మా ! జిలేబి రావడి జేసె
    న్నెందెందు వెతుక నన్నున్
    బిందెల కొలదిగ పదముల భీకరముగనన్ :)


    జిలేబి

    ReplyDelete


  59. రామా! నిను విడచెను బో
    యీ మానవుడు మరలపడె యీ భువి లో, ఆ
    హా! "మేధ మే" టికు గదా !
    సామీ ! నీలీల గాన చాలదు సమయం !

    జిలేబి

    ReplyDelete


  60. కందమన భయమనె! అహి
    ర్బాంధవుడట లెక్కల గని రాధనముగనెన్ !
    బృందావనమున తిరిగెడు
    వందారుడు మజ గణితపు పరువడి బోయెన్ !

    ఆహా! మేధాదేవీ జుషమానా ....

    జిలేబి

    ReplyDelete


  61. అలసిరి సొలసిరి విషయము
    ల లబ్జుగ గనుచు జిలేబి ! లవలేశంబై
    న లకుచము జేర్చి యిసిఱిం
    తల కాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్ !

    జిలేబి

    ReplyDelete


  62. మరణంబదియె మనుజుల క
    కరణమ్మంతఃకరణము గాన్పడని యలం
    కరణమ్మధిపురుషుని యధి
    కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ !


    జిలేబి

    ReplyDelete


  63. మరిమరి రాయన్ ,మేలౌ
    సరిజూడన్ ప్రాస, యతుల, ఛందం సాఫ్ట్వేర్,
    కరవాణిని,యాధునికీ
    కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ !

    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  64. కొరియా తీరుల జూడన్
    సరిసరి వచ్చెనట ట్రంపు! చైనీయులకున్
    సరిజెప్పె జిలేబీ, యధి
    కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ !

    जिलेबी

    ReplyDelete


  65. మా గోదారమ్మాయిలు
    జాగర గట్టుల్ జిలేబి జాణలు సుమ్మీ !
    యే గాడిన యెట్లు బడవ
    లే, గాబర బడక జూచి లెస్సంగట్లే :)

    జిలేబి

    ReplyDelete


  66. విరిబోణులు తై తక్కల,
    సిరిమువ్వలు మురిపెమునకు సింగారులహో
    మిరియములు, నరసరాయా,
    సరిగానక బోవ బుసబుస బుడిపి తలపై :)

    జిలేబి :)

    ReplyDelete


  67. స్పెషలండీ గోదావరి
    స్పెషలండీ యతివలున్ను చెకుముకి రాళ్ళూ :)
    మిష యేదైనను గాంచుచు
    శషబిషల జిలేబులౌ వసంతద్రుమముల్ :)

    గోదారియా మజాకాయా :)
    వేయవలేన్ జిలేబులు :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete



  68. మాదీ గోదారేనం
    డీ! దారెంట నరసన్న డిగనుఱుకులవ
    చ్చే, దబదబ మాదిన్నూ :)
    పోదారీ గోద జతకు పోరి జిలేబీ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  69. నోటితో వాగుము జిలేబి ! నోరు నొక్కి
    చేతి తో రాయి నట బట్టి చేవ గాంచు
    జీవి తమ్మున బేజారు చేరదు సుమ !
    బండి వారి పలుకులవి పసిడి పలుకు :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నోటితో ఆగునా జిలేబి ! నోరు నొక్కి,
      చేతితో రాయి బట్టి, గొట్ట తోవ గాంచు,
      జీవి తమ్మున కైజారు వీడదు సుమ !
      నిండు పలుకులివి కనగ, దండి పలుకు :)
      JK?JF ...

      Delete


  70. మనుజుడ! తెలిసిన నిజమును
    మనసున తిరగేసి చూడ మనునది నిజమై !
    మనసే యద్దమగు జిలే
    బి, నమ్ము మదియే బిలేజి బింజింప గనన్ !


    జిలేబి

    ReplyDelete


  71. బట్టతల గుండు గానుం
    డెట్టెట్టా బుర్రలోన డెందముచూలిన్
    గట్టిగ జిలేబి గననట !
    పట్టిరి గుండు రమణుల సెబాసను ఫోటో :)

    జిలేబి

    ReplyDelete


  72. చవులూరని కవనము, స
    త్తువలేని పదయొదుగుబడి తొంగలి గొనలే
    ని వడియు లేని, జిలేబుల,
    కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్ !

    జిలేబి

    ReplyDelete


  73. ఔరా జిలేబి పాకము
    నోరా రన్ గానలేని నొబ్బులదేలా!
    పోరి విరివిగన్ దొరికిన
    చో రేత్రమునకు విలువయు చోనము లేదౌ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నొబ్బులు , రేత్రము , చోనము
      అబ్బబ్బా ! ఈ పదముల కర్థంబేమీ ?
      సిబ్బితి 'కందం' చమడాల్
      సుబ్బరముగ నూడదీసి సోకులు పేర్చెన్ .

      Delete


  74. ఎంజాయ్ మాడి :)

    క్రీడాభి రామం

    https://archive.org/details/kridabhiramamu00vinusher

    ReplyDelete
    Replies

    1. This has better readability. Enjoy

      క్రీడాభిరామము శ్రీనాధుడు

      https://archive.org/details/in.ernet.dli.2015.333901

      చీర్స్
      జిలేబి

      Delete



  75. బ్రిట్నీ గుండుల యందము
    రాట్నము లన్ద్రిప్పుచుండు రమణి జిలేబీ
    చట్నీ లున్నకటకటా !
    మాట్నీ షోలయ్యె సూవె మాచన దాపున్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  76. సమస్యా పూరణ

    *మబ్బులలో తెలుగు బాస మ్రగ్గుచు నుండెన్ !

    గుబ్బెత యై వెలిగెను వెలి
    మబ్బులలో తెలుగుబాస; మ్రగ్గుచు నుండెన్
    తబ్బిబ్బుల సంసృతమయ !
    జబ్బల్గట్టి గనవలెను జయజయ యనుమోయ్ !


    జిలేబి

    ReplyDelete
    Replies


    1. శ్రీ జీపీయెస్ వారి పూరణ

      క్లబ్బులలో పబ్బులలో
      తబ్బిబ్బుగ కులుకుచుండి తడబడి యువతల్
      గబ్బరు డైలాగు లొలుకు
      మబ్బులలో తెలుగు బాస మ్రగ్గుచు నుండెన్ !

      జీపీయెస్

      Delete


    2. సమస్యా పాద సృష్టికర్త పద్యం‌ శ్రీ లక్కాకుల రాజారావు గారిది

      నొబ్బులు , రేత్రము , చోనము
      తబ్బిబ్బుగ ఆంధ్రభారతమ్మ నడిగియే
      రుబ్బితిరా కందంలో
      మబ్బులలో తెలుగుబాస మ్రగ్గుచు నుండెన్ .

      Delete


  77. రేత్రము! నొబ్బక నోరున్!
    క్షేత్రము ! చోనము జిలేబి జేజే యనగన్ !
    వేత్రము బట్టిరి గురువులు
    హాత్రంబయ్యెను తెలుంగు హావళి గాంచెన్ !

    జిలేబి


    ReplyDelete


  78. పణతుక జిలేబి యంబర
    మణి చిహ్నపు పార్టి జేరి మాటాడంగన్
    కణిమొழி ని బిల్వ యా " పె
    న్మణి" తెలుగున బల్కె ప్రజల మనములు పొంగన్ :)

    ஜிலேபி

    ReplyDelete


  79. నేనా! యువకుడి నా! యొ
    జ్జా! నా చిననాటి గురుతు జ్ఞానంబిదియౌ!
    యేనాడో చదివినద
    య్యా! నేటికి టప్పనుచు సయాటగ వచ్చెన్ :)

    జిలేబి

    ReplyDelete


  80. కందమ్మా! వలదే యా
    క్రందన లెల్లన్ ! జిలేబి రావడి జేయన్
    బిందాసుగ వాయించుము
    వందారనవలెను నీకు వాద్యార్మామీ :)

    జిలేబి

    ReplyDelete


  81. ఆరనీకు మమ్మ అంతఃకరణమందు
    అగ్ని శిఖగ వెలుగ వలెను, మేలు,
    మింటి కెగయవలెను మిక్కిలి తేజమై
    నీవు శోభ గాన నీరజాక్షి !

    జిలేబి

    ReplyDelete


  82. రామ రామ యనుచు రాత్రింబవలు భువి
    ని తిరిగెను జిలేబి నిర్మ లముగ !
    ఆఖరి సమయమున తనను విడువక గ
    నుమయ రామ ! మదిని ఊత నిచ్చి !

    జిలేబి

    ReplyDelete


  83. జనబాహుళ్యపు నాల్కన
    మనుజుడ పుట్టెను పలుకులు, మహిత హితంబై
    మనుగడ కొరకై భాషయు
    కనుక గొలుసున చెఱబట్టకయ కవి దానిన్ !

    జిలేబి

    ReplyDelete



  84. నేనేమీ చదువును కొన
    లే! నాకింపైన భాష లెస్సగ తెలుగే !
    చానా భయకృత్తు గద
    బ్బా నాకు యిటుకల కట్టుబడి కవివర్యా !


    జిలేబి

    ReplyDelete


  85. చూడాలని వుందండీ !
    చూడామణి యప్సరసల చుట్టూ తిరగా
    లే! డంబముకాదండీ !
    గూఢము లన్ తెలుపుడోయి గురువా నాకున్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  86. తెలుగే తెలియని వారమ
    య! లబ్జుగన్నిప్పుడే నయా నేర్చుట ఓ
    పలుకుల రాజా ! వృషభువు
    ల లుకలుక మరియు జిలేబు లన్ గన గలమే ?

    జిలేబి

    ReplyDelete


  87. మాన్యుణ్ణి చేస్తి రే సా
    మాన్యుణ్ణి నమో నమో ! సుమధుర కవీశా,
    అన్యతరము మాత్రమ్మే
    విన్యాసముల విదురుండ విరివి టపాలన్ :)

    జిలేబి

    ReplyDelete


  88. ఏమని చెప్పుదు సుకవీ !
    మా మాటను తిరగవేసి మామి యిటన్ కం
    దామృతముగ మార్చెనుగా !
    ఏమో మా పదముల గతి యే కందంబో !

    జిలేబి

    ReplyDelete


  89. అట్లా కష్టే ఫలముల్
    యెట్లాంటి పరిస్థితులనయిన యెదురుకొనన్
    తట్లాటల సరిజేయన్
    కొట్లాడెన్ గొంతులోన గుండెగ సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  90. కందను కూరగ దింటిని,
    కందము వర్షముగ మారి, కందా యనుచున్
    కందము నే పన్నంగన్
    చందము పన్నారి గయ్యె చక్కని కందం!

    ReplyDelete


  91. అరువది నాలుగు మాత్రల
    గురువుల లఘువుల బరచుచు గూర్చగ వచ్చున్
    పరుగుల యందము కందము
    విరివిగ బేర్చన్ జిలేబి విధవిధము గనున్ !

    జిలేబి

    ReplyDelete


  92. ముప్పై రెండుకు రెండై
    గప్పున నుప్పొంగుచు శశి కళలవలెన్ తా
    చప్పున వచ్చెడు కందము
    మెప్పగు రీతుల బడయగ మించారు సుమీ !

    జిలేబి

    ReplyDelete


  93. అరువది నాలుగు కళలను
    మరులు గొలుపు కందమే సుమా మకరందం
    బు రచనలకు పన్నారీ
    విరివిగ జేయ లలితముగ వికసించు సుమీ !

    జిలేబి

    ReplyDelete


  94. మాట్రిక్సాఫ్ సిక్స్టీఫోర్ !
    లో ట్రిక్స్ గలవమ్మ లేమ లోగన్నున నీ
    వా ట్రాక్సును గన వచ్చున్
    బెట్రాండ్రస్సెల్ ఫిలాసఫీ ల జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  95. హమ్మయ్యా! యిన్నాళ్ఖకి
    బామ్మ జిలేబి యిట పద్య పాదము తోడన్
    క్రుమ్మక యనానిమసుకై
    తెమ్మర వలె పలికెనోయి తేట తెలుగునన్ :)

    బుచికో యమ్మా బుచికీ
    కిచకిచ లాడెన్ జిలేబి కెవ్వనుచునిటన్ :)


    చీర్స్
    జిలేబి

    ReplyDelete

  96. సమస్యా పూరణ

    పొడియొనర్చు వాని పొగడ తరమె !

    ***

    మొక్క సృష్టి జేసి పూవుల బూయించి
    పసిడి రేకులెల్ల వరుస గూర్చి
    సృష్టి జేయు పూల వృద్ధి కోరుచును పు
    ప్పొడి యొనర్చువానిఁ బొగడ వశమె

    ఫణికుమార్ తాతా

    ***

    మైలవరపు వారి పూరణ

    విశ్వ సృష్టి విధాత.. 🙏

    మొగ్గ పాప నవ్వ , మోము విప్పారగా
    నోట చొంగ తేనెనూరఁ జేసి
    అందమనెడి రంగునలది , రాగంపు పు..
    ప్పొడి యొనర్చు వానిఁ బొగడఁ దరమె !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    అదురహో ;

    ఏకంసత్ విప్రాః బహుధా ...

    అద్భుతః ఫణి గారికి మురళీకృష్ణ గారికి ఆ విభుని లీలగ ఒకే తలంపు !


    మురళీ కృష్ణుండొకరౌ !
    హరిపుత్రుని పేరుగల యొకరు! యిరువురికిన్
    వెఱుగొందు కైపుగ విభుని
    పరిణామపు గతి తలంపు పద్యంబయ్యెన్ !

    జిలేబి

    ReplyDelete


  97. భుగభుగమని పొగవదిలెను
    ఖగరాజై బ్లాగులోన కష్టే ఫలియై
    బిగువగు టపాల బేర్చెన
    ట గురువుగా మాచనార్యు డందంబుగనన్ !

    జిలేబి

    ReplyDelete


  98. వనభోజనముల్ జేయుచు
    ఘనమౌ స్ట్రెస్సుల గురించి జ్ఞానమును గడిం
    చి, నలుదెసల కలయ తిరుగ
    మనసుకు నచ్చినటి చిత్ర మయె కహ్వమటన్ !

    జిలేబి

    ReplyDelete


  99. జిహ్వకు వనభోజనముల్
    లహ్వోలబ్బుల జిలేబుల కథల గానన్
    వాహ్వాహ్హనుచున్నచటన్
    కహ్వంబయ్యెనట బంది కందము లోనన్ :)


    జిలేబి

    ReplyDelete


  100. వారెవరో యేదో య
    న్నారని గ్రాంధిక పదముల నాట్యంబుల తా
    నాడ విడచునా నరస
    న్నా రమణి జిలేబులమ్మి నారద సకియా!


    నారదాయ నమః
    జిలేబి

    ReplyDelete


  101. త్వమేవాహం త్వమేవాహం 🙂
    తానా అంటే తందానా యనాలె 🙂

    కలరే వైవీ యారు వ
    లె లక్షణంబుగ జిలేబు లెల్లన్ వేయన్
    కలరే యుర్విన్ కలకల
    కలముల బ్రహ్మ కమలముల కనికట్టుగనన్ 🙂

    జిలేబి

    ReplyDelete


  102. నీ సుత్తి భరించన్ గా
    లే! సకల కళామ తల్లి లేమ! జిలేబీ !
    వేసవి కాలపు యెండై
    కీసర బాసర పదముల కిట్టించితివే :)

    జిలేబి

    ReplyDelete


  103. ఓ గురువుగారు ! మీరూ
    బ్లాగు జిలేబీ గుసగుస బాసల యేదో
    కాగళి కలన్త్వమేవా
    హా గమకములన్ జిగిబిగి హాహా గనిరే :)

    జిలేబి

    ReplyDelete


  104. కాగళికల్ వాయించుచు
    మా గట్టి జిలేబి బామ్మ మధురంబుగనన్
    జాగారమ్ముల జోగుచు
    వేగము వేగంబుగా కవితలన్ దీర్చెన్ :)

    జిలేబి

    ReplyDelete


  105. రాణ్ణరసా! వ్యాఖ్యాశ్రీ !
    విన్నాణపు విన్న కోట విదురా ! ప్రగడా!
    క్షుణ్ణము గా బ్లాగ్లోకము
    లన్నీ చుట్టుచు జిలేబులన్ గను సింహా !

    జిలేబి

    ReplyDelete


  106. కందా బచ్చలి కూర ప
    సందగు జీవన విధాన సారంబులనన్
    విందుగొలుపు గరగరికల్
    సంధానము మాచనార్య చక్కటి పలుకుల్ !

    జిలేబి

    ReplyDelete

  107. సంకట పరిస్థితుల, సిరి
    చెంగట గల దేవదేవు చేమొగుపులనన్,
    వేంకటపతిని గనన్ తిరు
    వేంకటమున పట్టపగలు వెన్నెల విరిసెన్!

    జిలేబి

    ReplyDelete


  108. నిజమైన మిత్రుడివలెన్
    కజాతుని వలె పదములను కైపదముల జే
    సి జనాళికి ముదము గొలుప
    విజయేశా!పట్ట పగలు వెన్నెల విరిసెన్!

    జిలేబి

    ReplyDelete


  109. మిట్టూరోడి కథల, పడి
    కట్టు కథ, జనపద కథల కథనడచు గతుల్
    పట్టుగ చూడ జిలేబీ
    పిట్టకతల పట్టపగలు వెన్నెల విరిసెన్ !

    జిలేబి

    ReplyDelete


  110. భజనల కై యుపయోగము
    సుజనుడి గుణికిన్ మధురిమ సుమనోహరమై
    న జనాళి పద జిలేబులు!
    నిజమును గనుమా శుభాంగి నిమ్మది బడయన్ !


    జిలేబి

    ReplyDelete


  111. చలికందమ్ముల పదములు
    భళిభళి యనుచున్ జిలేబి బాగుగ యుండెన్ !
    కలికాలమ్మున కందము
    ల లబ్జుగగనెడు నెలతుకలకు నమనమ్ముల్ !

    జిలేబి

    ReplyDelete


  112. పారీంద్రులే జిలేబీ ?
    భారీ కథగట్టినారు పద్యంబులతో !
    హోరాహోరీగానన్
    సోరణి దివ్వెల వెలుగుల శోభల్ గనుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  113. లాంగూలధారి యని నా
    చాంగుభళా తోకరాయ, సామీరియనన్
    లంకా దహియనిన, హనుమ,
    అంకతిపుత్రా యనంగ యన్నీ నీవే !

    జిలేబి

    ReplyDelete


  114. వక్కపొడి థూ ! జిలేబీ
    చక్కగ యెంచక్కగాను చమకుల్లదిరెన్
    బక్కటి మనుజుడు కనబడ
    లెక్కలు వల్లించునోయి లెస్సగ సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కొంత గ్రహించాను.

      Delete

    2. ధన్యవాదాలండి సుశ్రీ గారు


      కొంత గ్రహించారదియే
      యింతికి మజగొల్పు నోయి, యిష్టము గానన్,
      వింతగు మీకథ లెల్లన్
      స్వాంతము గాంచెను జిలేబి సారాంశంబై !

      జిలేబి

      Delete


  115. అబ్బీ ! యప్పిచ్చెదమన
    గబ్బా! దొరకత్తె బోయె గద బిరబిరగా
    యబ్బో డబ్బులు! క్రెడిటో
    రబ్బో! రాద్ధాంతమయ్యె రమణికి వడ్డీ :)

    జిలేబి

    ReplyDelete


  116. పైకూ పద్యముల జిలే
    బీ గీరగనానిమస్సు బిత్తరు బోయెన్ :)
    సోకుల్మాడగ వాడెవ
    డే కిరికిరిరాయడమ్మ డేరా వేసెన్ :)



    జిలేబి

    ReplyDelete


  117. పండితుడను కానండీ !
    నిండు మదిని రాముని హృది నిండుగ కొలిచే
    పండిన కాయన్నంతే !
    గుండెల నింపుచు నతండు గూడై వెలయన్ !

    జిలేబి

    ReplyDelete


  118. బాంబే పోలీసచటన్
    సోంబేరి వలె గనపడెను సొబగుల్లేకన్ !
    ముంబై స్కాట్లాండ్యార్డై
    జంబలకడిపంబుగాన చానా మునుపో ?

    ज़िलेबी

    ReplyDelete


  119. దొరబాబచటన్ వెడలిరి
    పరుగుల అప్పులకొరకట వడ్డీ లేకన్
    పిరియపు జపాను దేశపు
    సిరి,డబ్బుకసాల దీర్చ చీకటి దొలగన్ :)

    జిలేబి

    ReplyDelete


  120. అన్నుల మిన్నగు యమ్మికి
    వెన్నెలఱేని వెలుఁగులకు విచ్చెఁ, గమలముల్
    వన్నియ కన్నులు గద ము
    వ్వన్నెలవిల్లు వలె సఖుని పవళింపులటన్ !

    జిలేబి

    ReplyDelete


  121. అదిరెను బో కెలుకుడయా !
    వదిలారయ్యా జిలేబి వరుసల్ సామీ :)
    కుదిరెన్ భళిరా ఫ్లో కూ
    డ ధమధమ యనంగ వత్తు రయ పుర వాసుల్ :)

    జిలేబి

    ReplyDelete


  122. హాకండు యింద్ర జాలికు
    డౌ !కాగళికన్ జిలేబి రమ్యంబుగనన్
    మ్రోగింపగ మురిపెముగన్
    కాకియుఁ గోకిలము గలసి కాఁపుర ముండెన్ !

    జిలేబి

    ReplyDelete


  123. మీరెట్లా రాసిననూ
    ఓరయ్య భళి భళి సూవె ఓరాజన్నా !
    ఆరాటమ్ముల్ మాక
    య్యా రాసిన రాతలెల్ల యాకాణమ్మే ?:)

    జిలేబి

    ReplyDelete


  124. ఎవరో యేదో కూయం
    గ విదురుడా!మాచనార్య కష్టేఫలి ! మా
    చవులూరు పద్య ముల వల
    దు వలదనుట తగున? యెండదొర! దీక్షితుడా! 🙂


    ఓ వైపేమో లైకులు ::)
    మరో వైపేమో పైకూలు 🙂

    వెరసి జిలేబి
    Its really cool when its hot 🙂

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  125. ఈ వయసులోన కుశలము
    లే? వడి వడిగా నడిచిన లెస్స, జిలేబీ !
    రావడి వలదమ్మా పై
    కూ వలదమ్మా పదముల కూర్పూ వలదే :)

    జిలేబి

    ReplyDelete


  126. సినిమా డవిలాగులవెం
    త నిక్కముగ గుర్తుమీకు ! తరమై గనిరే :)
    మనుజుడు సాగర సంగమ
    మును, యిరవై "తూర్లు" చూడ ముద్దుగ గుర్తౌ :)

    జిలేబి

    ReplyDelete


  127. డొక్క చీల్చి కడత డోలు జిలేబియా !
    బక్క చిక్క గాను పట్టు బోవ !
    చక్క గయిసు బాక్సు చాలని యెడమేన ?
    లక్కు పేటి యదియె లబ్జు గాన !

    జిలేబి

    ReplyDelete


  128. కవితామ తల్లి వీవే !
    మవురీ ! పద్మార్పితా! సుమధురిమ లొలుకన్
    నవనవ భావన లెల్లన్
    కవనం బయ్యెను జిలేబి కమలంబువలెన్ !

    జిలేబి

    ReplyDelete


  129. రేతిరి పగలనక తిరుగు
    ఆదిత్యునికే తెలియదు ! ఆఫ్ట్రాలు ,జిలే
    బీ దబదబ పరుగుల బో
    యే తెలి మెకమెట్లెరుంగు యేగడములబో :)

    జిలేబి

    ReplyDelete


  130. నెనరుల్ ప్రోత్సా హమునకు
    కనగన్ కరివెద పదమును "కట్టుబడి" గ జే
    యనవచ్చిన వృత్తము ! పద
    వనరుల్ తక్కువ జిలేబి వరుసల్ కెరలున్ :)

    జిలేబి

    ReplyDelete


  131. అరయగ నెల్లరకు భువిని
    పరమపదము లభ్యమగును ; పాపాత్ములకే
    త్వరితము గావలయు జిలే
    బి,రరాటలిఖితములెల్ల బిరబిర తీరన్ !

    జిలేబి

    ReplyDelete


  132. మృత్తిక సుఖంఘుణంబౌ !
    యెత్తకు వచ్చిన పదముల యేరాలముగా
    గుత్తుల కొలదిగ గుండ
    మ్మత్తయు బేర్చన్ జిలేబి మయమాయెన్బో :)

    జిలేబి

    ReplyDelete


  133. తివిరి యిసుకలోనన్ తై
    లవర్ణమున్ గానవచ్చు లబ్జుగను ! జిలే
    బి విధవిధ పద్యములలో
    కవి, గనగలమే ఖరారుగా యర్థములన్ :

    జిలేబి

    ReplyDelete


  134. పైకూలతో శతముఖి
    న్నే కామింటులుగ మార్చి నేలన్ గూల్తున్
    మీకో ఝలక్కు చూపిం
    చే కాళిక నయ్యెద, సయి చేవ్రాలిదియే :)

    జిలేబి

    ReplyDelete


  135. మరుకము పై పిరియము జడ
    భరతుఁ దునిమె; రాఘవుండు భామిని కొఱకై,
    శరణాగతి గనని యసురు
    ని రణమున దునిమె ; జిలేబిని దునిమె కందం !

    జిలేబి

    ReplyDelete


  136. తిట్టిన తిట్టును తిట్టక
    చట్టని మొట్టుచు జిలేబి‌ చట్టద్రుంచన్
    గట్టిగ పట్టుగ గుట్టుల
    రట్టుల షట్టరు బిగించి రఫ్ఫాడవలెన్ :)

    జిలేబి

    ReplyDelete


  137. అల్లుకొనగ పిరియముగా
    మల్లియతీవియకుఁ గాచె మామిడికాయల్
    మెల్లన విడివడి యుల్లము
    జల్లన మధురిమలతోడ చక్కగ యెదిగెన్ !

    జిలేబి

    ReplyDelete


  138. ఇదిగో బంగరు రోజుల
    పదిపైసల కాలపోడ ! బడబడ అనకోయ్ :)
    కుదురదు! ఒక్క తడవ అను
    మతి ! వేయాలోయ్ కమింట్లు మాకగు కైపున్ :)

    జిలేబి

    ReplyDelete


  139. అబ్బోడి వైద్యమునకై
    డబ్బులు దండిగ వలయును రక్షించన్నా !
    గప్పున చూడ్రా కొండా
    చప్పున డాక్టరును, ఖర్చు "జమిలి కటారీ" :)

    ReplyDelete


  140. అండగ నీవే గద మా
    కండబ లమునీవుగాద! కష్టము లోనన్
    నిండా కాపాడు మయా
    దండిగ ఖర్చులు! జగనుడ! దావంతమయా !

    ReplyDelete


  141. కొండా రెడ్డీ రారా
    అండగ పోరా జిలేబు లన్వేసెదరౌ
    నిండుగ సాక్షి యదేరా
    మెండుగ సాయమ్ముగాన మెత్తురు జనులున్ :)

    ReplyDelete


  142. ఆ కనులు మూడు! నాల్గై

    యా కరముల పుట్టుకగదయా!యద్భుతమౌ
    నాకృతి సరిజేసిన ఆ
    శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే?

    జిలేబి

    ReplyDelete


  143. చిక్కటి కాఫీ ముచ్చ
    ట్లిక్కట్లనుగన జిలేబి టింగున బోయెన్
    ముక్కకు ముక్కా వేయన్
    చక్కగ దర్వాజ బందు! సరిసరి పోదాం :)

    జిలేబి

    ReplyDelete


  144. ఓరోరీ చంద్రన్నా !
    పారించావయ్య మద్య పానమును జిలే
    బీ రంగురంగులన్ వ్యా
    పారమ్ములతో ప్రజలకు బాధే బాధా !

    జిలేబి

    ReplyDelete


  145. పన్నారులనిండుగ మీ
    పన్నుల నింపిరి జిలేబి పన్నా పన్నా
    యన్నుల మిన్నా ! కన్నా
    పన్నాగములన్ మరి మరి పన్నిరి గాదే :)

    జిలేబి

    ReplyDelete


  146. ముసలావిడ కానోయీ
    పసగల్గిన భారతీయ పడతుకనర్రా !
    యశములకు మూలము సుమా
    హసంతులము గాము మాకు హద్దే లేదౌ !

    జిలేబి

    ReplyDelete


  147. చుక్క కనిపించి నాదా ?
    పక్కా గనుమా జిలేబి పరమాత్ముడహో !
    చిక్కుల్ గనుమోయ్ పథమున్
    చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ :)


    జిలేబి

    ReplyDelete


  148. వాడే వీడౌ ! వీడే
    వాడౌ! వీడున్న చోట వాడట లేడౌ !
    వాడున్నచోట వీడికి
    గూడున్వాడే పునాది గూడన్వాడే !


    జిలేబి

    ReplyDelete


  149. కొట్టు కొచ్చెను పదముల కొంగు బట్టి
    పట్టు మామి జిలేబి యప్పా జిలేబి :)
    గట్టి గా భలే పద్యము కంద మాయె
    యెట్టులో తెలియక పాయె యెంకటేశ :)

    జిలేబి

    ReplyDelete


  150. నీబాంచంకాల్మొక్తదొ
    రా! బంజరుభూమి గూడ రవ్వంతయు లే
    దే బతికేదెట్లయ్యా !
    దోబూచుల్వలదు సామి దోచుట వలదోయ్ !

    జిలేబి

    ReplyDelete


  151. ఈవార మనామకముల
    తో వాయింపులటవే యతోధికముగనన్ !
    కావాలని యెవరి టపా
    లో వెళ్ళకుమా జిలేబి లొడలొడ యనుచున్‌:)

    జిలేబి

    ReplyDelete


  152. శతముఖి యననేమి ? జిలే
    బి , తరుణి, సూక్షియ ననో ? సభికులకు చెప్మా :)
    కుతకుత లాడెదరో చె
    ప్పి తముకులన్వేయనేల బీలేజి బెటర్ :)

    జిలేబి

    ReplyDelete


  153. బేలా బోల్నంత సమయ
    మే లాహిరి! బోలినాక మేల్ముసుగేలా !
    బోలమ్మో బోలోయ
    మ్మా లలితమ్మా సుమధురమై కథ సాగెన్ !

    జిలేబి

    ReplyDelete


  154. పంచరు రిపేరు చేయన్
    కించిత్తైనన్ జిలేబి గిలిగిలి లేదే !
    కొంచెంబైనన్నుపయో
    గించితివా బుర్రనోయి గింగిర్లు విడన్ !

    జిలేబి

    ReplyDelete


  155. పోరీ జిలేబి సారీ
    పారాయణమేమిటమ్మ పదముల్ తిరగే
    సారే? వలదే పిచ్చుక
    లా రాస్తూ పోవకమ్మ లాహిరి గనుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  156. కొట్టగ తలపై గట్టిగ
    చెట్టాపట్టాల్ వలదని చెలికత్తెలటన్
    పట్టమ్మజిలేబికహో
    నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే :)

    జిలేబి

    ReplyDelete


  157. "అరచేతి మాణికం"బె
    న్న,"రుక్మిణికి రంగు మోవి" నలమేనిదొరన్,
    "మరులుగొలిపె" పదముల న
    య్య "రంగు మీరు పెనురవ"మయా! అన్నమయా !




    జిలేబి

    ReplyDelete


  158. మైలవరపు మురళీకృ
    ష్ణా ! లాహిరి లోన దేల్చినారిట జనులన్ !
    బాలాజీ కృప లోనన్
    దేలుమయా వెంకటగిరి దేవుని దయతో!

    జిలేబి

    ReplyDelete


  159. భగభగ సూర్యుడు చంద్రుడు
    భగభగ నారీమణులట భారీ గానన్
    సెగగక్కిరి! ప్రభుతకట, తి
    రుకట్ట వాయింపులిడిరి రుసరుస రమణుల్ !

    జిలేబి

    ReplyDelete


  160. నేననగలనా ఆ మా
    టా! నారద రమణి తప్ప ! ఢాం! ఢాం ! హరి తూ
    టా నీ పై తప్పదికన్
    ఓ నీరజనేత్రి యగ్గి మొహరింపిదియే :)

    జిలేబి

    ReplyDelete


  161. ఏవో నాలుగు ముక్కలు
    కోవా జాంగ్రీ జిలేబి కోరిన వేవో
    సావా సమ్ముగ వేస్కో
    లావై పారును పదములు లావణ్యముగన్ :)

    జిలేబి

    ReplyDelete


  162. పోగా పోగా కందం
    రాగాల్తీస్తున్నవోయి రాయన్ రాయన్
    బాగా కెలుకుడు భేషై
    జోగాడుచు వచ్చునోయి జోరై సామీ :)

    జిలేబి

    ReplyDelete


  163. నేనే నేనే యనుచున్
    ఓనాయన యెగురమాకు ఓమారైనా
    నేనెవరిని, నా యునికే
    లా నాకు తెలియకపాయె లాంటివి గనుమా !

    జిలేబి

    ReplyDelete


  164. గుండు పడతి పెండ్లి గాన గూడ నంపిరెవ్వరిన్,
    బండి వెనుక బండి కట్టి? పట్టు బట్టి తానటన్,
    మొండి పిల్ల యయ్య గారి మోము జూడ యేమయెన్ ?
    పండు ముసలినిన్; వరించెఁ బంకజాక్షి ప్రీతితో!

    జిలేబి

    ReplyDelete


  165. వెండి కొండ విభుడినట వేడ్క తోడ
    నిండు మది తపమొనరిచి, నీలగళుని,
    పండు ముసలిని, వరియించెఁ బంకజాక్షి
    మెండు కొలుపు పెనిమిటిని మేటి గాను!

    జిలేబి

    ReplyDelete


  166. పాకంలో పడుతోందీ
    లాగించండీ జిలేబి లావై వచ్చున్
    మోగించండీ ఘంటము
    సాగించండీ కవిత్వ సారంగాన్నీ :)

    జిలేబి

    ReplyDelete


  167. ఒక రాయికేమి తెలుస
    య్య కవిత్వపటుత్వమకట "యైన్స్టయి న" నక
    య్య! కవియతడు థియరీలన్
    సుకవిగ కనుగొన్నవాడు సుహితుడు సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  168. అమరును తలపైన జిలేబి యందముగను
    రమణికిన్ బూలు; చేటగుఁ బ్రాయమందు
    కమల నయనికి పనిమాలు కల్ల నడత,
    జల్దు కొని మేలుకొనువమ్మ చంచలాక్షి !

    జిలేబి

    ReplyDelete


  169. మాతా! నిదురన్ బోవగ
    రాతిరి, రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్
    హా!తృటిలో పొద్దుపొడిచె
    యాతన జీవితములోని యానంబయ్యెన్ !



    జిలేబి

    ReplyDelete


  170. వీనుల విందయితేనే
    చానా బాగుండునమ్మ ఛందము సీసం !
    ఈ నా యత్నము కొనసా
    గేనిక మీకెల్లరికి జిగేలు జిగేలై !

    జిలేబి

    ReplyDelete


  171. గిల్లి కజ్జాలు వలదమ్మ కిరికిరి యని
    భళ్ళు భళ్ళన వేయకు పద్యములను
    జల్లు జల్లని బెదిరిరి జనులు గద జి
    లేబి విడువిడు మామ్మా బిలేజి యగుచు :)

    జిలేబి

    ReplyDelete


  172. ఇవి యుగళ పద్యముల లే
    క వరుసగా వచ్చు గిల్లి కజ్జా లా! మా
    లవలెన్ బోయెన్ గాదే
    కవాలి జావళి జిలేబి కందంబులుగన్ :)

    ReplyDelete


  173. మతముల గురించి రాసా
    మదముల నణచెద జిలేబి మా, రణ హోమం
    బిదియే కాస్కో రమణీ
    కదనంబున దూకుతాను కంద హరి యనన్ :)

    జిలేబి

    ReplyDelete


  174. చిగురించగ మోహమ్మది
    మగవానికి, గర్భమాయె, మానినిఁ గూడన్
    జగమే ఊయల యై తూ
    గ గాను ప్రకృతికృపగాన, కరుణామయికిన్ !

    జిలేబి

    ReplyDelete


  175. హై ! కూలు!గదా ఓ పై
    కూ! కందజిలేబి మామి ! కుదురుగ వేయీ
    బాకీ పదముల వేగము
    గా కళ కళయని నళినము గావలె నోయీ :)

    జిలేబి

    ReplyDelete


  176. పేరడి బాగుందండీ !
    కూరా కారము మసాల కూర్పుడు గూడన్
    ఊరూరాతిరిగెనహో
    మా రెడ్డిగదా జిలేబి మామంచోడూ :)

    జిలేబి

    ReplyDelete


  177. నీ కిచ్చిన పద్యానికి
    ఓ కంద జిలేబియమ్మ ఓ మారర్థం
    నాకు తెలుపుమోయ్ ఆపై
    నాకీ చాలెంజి యిచ్చినా ఫర్లేదే :)

    జిలేబి

    ReplyDelete


  178. ముసలావిడల వెనుకపడె
    ను సూవె బుల్లోడు పద్య నూర్పిడులన్ జే
    యుచునకట! జిలేబమ్మా !
    కసబిస యను రంగనాయకమ్మకు యెసరే :)

    జిలేబి

    ReplyDelete


  179. ఓ వైపేమో తెలుగే
    నా వీరిదను విధముల అనామతు పదముల్
    ఓ వైపేమో సంధులు
    కావలసిన ప్రాస యతుల కసరత్తులహో :)

    జిలేబి

    ReplyDelete


  180. వీణా పాణికి మంజుల
    వాణికి కమలాసనుండు భర్త, జిలేబీ,
    పాణిగ్రహణమ్మన శ
    ర్వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్!

    ***

    డబల్ ధమాకా సమస్యా పూరణ

    *వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్
    *వాణికి లక్ష్మికి మగండు వనమాలి గదా !

    రెండు సమస్యలూ ఒకే కందంలో పూరణ

    జాణుడు, కంజుడు పెనిమిటి
    వాణికి, దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్
    జాణత,నెరనమ్మిన శ
    ర్వాణికి, లక్ష్మికి మగండు వనమాలి గదా!

    జిలేబి

    ReplyDelete


  181. ఐలయ్యా! హరి వచ్చెన్
    బో! లక లక,నరుడ! నీకపోలంబోగున్!
    నీ లక్కేమగు నోన
    య్యా! లావుగతప్పుకొమ్ము యాడైనానన్ !

    జిలేబి

    ReplyDelete