Wednesday, January 10, 2018

పదమూడన్న భయమ్మదేల రమణీ :)



పదమూడన్న భయమ్మదేల రమణీ ప్రార్థింపు మా యీశునిన్


అదేమో గానండి న్యూమరాలజీ, వాస్తు, సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్యం, 'దుష్ట తిథి' గట్రా లను చూస్తే , వాటి విషయం చదివితే వెంటనే ఓ కామింటు ఉల్టా వేయా లని పిస్తుందండీ :)

క్రితం రోజు మన దీక్షితులు గారు త్రయోదశి గురించి టపా రాస్తే టట్ అని వెంటనే 'తాత పల్కుకు సవాలు వేయము' అని ఓ డిండిమ కట్టేసా :)

అదేదో మరీ నారదాయ నమః అయి పోయినట్టుంది; శర్మ గారి మనసు నొచ్చేసు కున్నట్టుంది . తిట్టి నట్టు న్నారు సుమా జిలేబి గారు అనుకున్నారు !

అబ్బే ! మన యొజ్జ గారిని తిట్టడమా ! అనపర్తీశు ని తిట్టడమా ! అదిన్నూ మా గోజీ ల వారిని తిట్టడమా ! నెవర్ ! నో ! నో ! నో !


భట్టి తన భట్టి కావ్యము లో (రావణవధ) లో మొదటి పద్యాన్ని పదమూడు అక్షరాలున్న రుచిరమన్న రేర్ వృత్తము తో ప్రారంభించేడు ! సవాలే సవాలన్నట్టు త్రయోదశ పదము లతో :)

అదిన్నూ ఈ రుచిరము లో మొదటి గణము జగణము (మరీ జిలేబి ) :)

అభూనృపో విబుధ సఖా ! పరం తపః అంటూ  దశరథుని గుణ గణా లతో రుచిరమన్న పదమూడు అక్షరాలున్న వృత్తము తో ప్రారంభిస్తాడు :) అది గుర్తు కొచ్చి సవాలు వేసా :) అంతే నన్న మాట !

ఏమండీ దీక్షితుల వారు సరియా ?

అభూనృపో విబుధ సఖః పరంతపః
శ్రుతాన్వితో దశరథ ఇత్యుదాహృతః ! !

చీర్స్
జిలేబి

బిలేజి పద్యములవి భీతిగొల్పెనే :)
(రుచిరము)

27 comments:

  1. అందుకేనా ఈరోజు శంకరాభరణంలో రుచిర వృత్తంతో పూరణ చెప్పారు. భేష్!

    ReplyDelete


  2. కందివారు నమో నమః

    అవునండి

    జిలేబి

    ReplyDelete


  3. నిబద్ధ తన్గలిగెను నెయ్యుడున్గదా!
    సభాస్థలిన్ నిలిపెను సంతసమ్ముగన్
    సెబాసు !శంకరుడయ! చేర్చెనెల్లరిన్
    గుభాళి తావి విరియ గొమ్మిపుష్పముల్!

    జిలేబి

    ReplyDelete


  4. విపన్ను లన్ననుమడ! వీక్షచేయుచు
    న్నపారమౌ కరుణల నాదరించి క
    న్నుపొందు వారలకట నొప్పు రీతి ద
    న్నుపాటి గన్నిదురను నూకు చెన్నుగా!


    కలావతీ(రుచిరము)
    జిలేబి

    ReplyDelete
    Replies


    1. * దత్తపది కన్ను మిన్ను చెన్ను పన్ను

      Delete


  5. చిటారు కొమ్మ చిలుక చిక్కెగా రిటై
    ర్డు టాపు బూటుల సయి రూపసుల్లటన్
    మిటాయి పొట్లము మజ మించెనే బడా
    యి! టక్కు లాడి రమణి యీసురో గురో :)

    జిలేబి

    ReplyDelete


  6. ఉదుంబరావతి నట నూరికావలన్
    కదంబరంబుగ గన కాస్త చిత్రమై
    ముదావహంబుగ నిడె ముందు చూపు వా
    రు! దాఖలాయిది గద రూఢిగాసుమా :)

    జిలేబి

    ReplyDelete
  7. ఈ టపా ఎలాగో నా దృష్టి దాటిపోయింది. నాకు కోపమేం లేదు.

    ఒక డౌట్ అనుమానం భట్టిగారు, పదమూడక్షరాల, పదమూడు పదాల అరుదైన వృత్తం ఎంచుకోవడం, అందునా రావణ వధ ను వర్ణించడానికుపక్రమిస్తూ, విశేషం ఏంటో చెప్పండి. పద విభాగంలో పదమూడు పదాలు కనపడలేదు, పొరబడ్డానా? ఎలా పద విభాగం చెప్పండి.

    ReplyDelete
    Replies

    1. పదమూడు అక్షరములు సరి
      రెండవది పదములు అన్నది తప్పు :) శ్యామలీయం వారు పట్టని లా పాయింట్ మీరు పట్టేసేరు :) నెనరుల్స్ !

      పదమూడు అక్షరాలు - ఉదాహరణ

      బిలేజి పద్యములవి భీతిగొల్పెనే :)


      చీర్స్
      జిలేబి

      Delete
    2. ఏవో నాకంటబడిన వాటిపై అపపుడు స్పందించటమే కాని గొంగడిపై వెంట్రుకలవలె మీతప్పులెన్నటంపై నాకాసక్తిలేదు. నావ్యాపకం నాకున్నది చాలు.

      Delete

    3. శ్యామలీయులను గోకుటయే జిలేబి వారి వ్యాపకము :(


      జిలేబి

      Delete
  8. ఫిబ్రవరి లేక మార్చి లో మీ ఊరు రావలసొచ్చేలా ఉంది, ఓ మనవరాలి పెళ్ళికి, తప్పేలా లేదు. టిక్కట్టులు తీసి పంపుతానంటోంది, ఏం చేయాలో తోచటం లేదు...ఎలా రావాలి మీ ఊరూ....

    ReplyDelete
    Replies

    1. రండి రండి మద్రాసు వచ్చి అక్కడినుంచి వేలూరు బండెక్కితే దిగడం అంతే


      జిలేబి

      Delete


  9. గొంగడి పై వెంట్రుకలను
    చెంగట కూర్చొని వరుస ఖుషీగా నెంచన్
    ముంగట పనిలేని నరుడి
    భంగిని కనిపించితినకొ బామ్మ జిలేబీ ?

    జిలేబి

    ReplyDelete


  10. అరకొర తెలివిని నడిగిన
    వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా,
    శరణాగతియే సరి యని
    కరుణాకర మార్చరాద గతి భక్తులదౌ ?

    ***

    అరె! వాక్కు! ప్రకృతి యొసగిన
    వరమది! భక్తులను మిగుల వంచించెఁ గదా
    సరియైన సమయమున శం
    కర! మాయని త్రోసి వేసి ఖాతికని బడన్ !

    ఖాతిక - అగడ్త

    ***

    పరిణయ మాడితి బతుకిక
    నరకంబాయె ననుకొనకు నరుడా! లెమ్మా!
    అరరే! వగపేల విభుని
    వరమది! భక్తులను మిగుల వంచించెఁ గదా!

    ***



    తరితీపుల చూపు రమణు
    ల రతగురువుగ మనుజుడ కలని గాంచితి వీ
    వు రయముగా లెమ్మా నర
    వర! మది భక్తులను మిగుల వంచించెఁ గదా!


    జిలేబి


    ReplyDelete


  11. చేయు పనులెల్ల కలిగించె చేటునమ్మ
    చూడ నాశ్రమమున వసించు మునివలె! దు
    రాగతముల కంతేలేదు! రాలుగాయి!
    సాధువని మెత్తుమే దురాచారు నౌర ?

    జిలేబి

    ReplyDelete


  12. కైపదము మారి పోవగ
    నో పడతి మరియొక పూరణోత్సాహము గాంచెన్ :)


    జనుల కెల్ల మేలునుచేయు జంగమయ్య
    లకు జిలేబి వందనమిడి లక్షణముగ
    సాధువుగ గ్రహింతుము! దురాచారు నెపుడు
    దూరముగ నుంచడము మేలు తోయజాక్షి!

    జిలేబి

    ReplyDelete


  13. ఇక ముందుకు దుముకుడి యను
    చు కదమ్ము కదము బడాతె చువ్వ‌న బండిన్
    చకచక నడిపిరి రావ్సా
    బు! కినిగెని పరిచయపరిచి బ్రువ్వట బాబా :)

    జిలేబి

    ReplyDelete


  14. బండివారికి మెచ్చుకోలిడు బాగుగా తన శైలిలో
    చెండుగా మన తాతగారికి చేవ చేర్చిరి రాసిరే
    మెండుగా మన శర్మగారు సుమేరుపర్వతమై! భళా
    కుండపట్టుకు వెళ్ళుమీ సఖి కొంచమైనను దక్కునే :)


    జిలేబి

    ReplyDelete


  15. కాపీ దింపుకు ముందుమాట చదివా! కవ్వించెగా పూర్తిగా
    తాపీగా చదవాలె యింకొక దఫా ! తాత్సారమేలన్ కొనన్
    మీ పొత్తంబును దండిగాను కినిగే మీకిచ్చు డిస్కౌంటు కూ
    డా! పోషించును మీదు మేధనయ రారండయ్య రండీ వెసన్!

    జిలేబి

    ReplyDelete


  16. భూతంబై నను పట్టినావు గద నా భూతాత్మ రామయ్య తం
    డ్రీ! తప్పుల్ కన బెట్టినారు జనులున్ రించోళియున్ కావు మా!
    యేతావున్ గల వయ్య స్వామి త్వరగా యీభక్తుడిన్‌ గావ ర
    మ్మా! తాతా! యిదె వేచినాడ రఘురామా నీకటాక్షంబుకై

    జిలేబి

    ReplyDelete


  17. ఎనిమిదవ పొత్తమొచ్చెను
    కినెగిని మన బండివారు కిర్రుమనుచు లా
    గి నిలుపగ ముందు మాటని,
    జనులెల్లరు మేలుగాన సత్సంగమునన్

    జిలేబి

    ReplyDelete


  18. సరికొత్తగ బకరా వ
    చ్చె! రండి వాయించుకొనగ చెంబు తపేళా
    మరువక తెండి జిలేబుల
    వరుసగ వేయవలెనయ్య పండితులారా :)

    జిలేబి

    ReplyDelete


  19. తలాతోకా కుదిరింద (ట) :)

    జోరుగ సాగుచు మేలుగ
    సారికలుగొనెడు జిలేబి స్వాతంత్ర్యంబౌ
    రా రతగురువే దోచెన్
    నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్!


    జిలేబి

    ReplyDelete


  20. జ్ఞానార్జన పుట్టుకతో
    నే నరుడా రాదు ! నీవు నేర్వగ నేర్వం
    గా నేర్పుగ మారునయా
    చూనాబట్టీ జిలేబి చువ్వన బోదోయ్ !


    జిలేబి

    ReplyDelete

  21. కారణ మేదయ్యును ము
    న్నారయ ' మూన్ ' భూమి పగిలి , అందొక భాగమ్
    వేరై తొలగె - తొలుత , అవ
    నీ రజమున కలువరేని నెలవొప్పారెన్

    ReplyDelete
    Replies

    1. అదురహో మున్, మూన్ :)

      మూన్ మూన్ సేన్ :)


      జిలేబి

      Delete