Sunday, January 14, 2018

సంక్రాంతి శుభాకాంక్షల తో !



 
బ్లాగ్ వీక్షకుల కందరి కీ
 
సంక్రాంతి శుభాకాంక్షలు !
 
మైలవరపు వారి సంక్రాంతి వర్ణన
 
కొక్కొరోకో యను కోడికూతకు లేచి
నిత్యకృత్యమ్ముల నెఱపి యంత ,
క్రొత్త బట్టలు గట్టి కూరిమి బెద్దల
పాదమ్ములకు మ్రొక్కి పాలు త్రాగి ,
గోమాత నుదుటను కుంకుమదీర్చియు
భోగిమంటను జేరి మోదమంది ,
ముంగిట దీర్చిన రంగవల్లిక జూచి
పులకించి , నెమ్మది పొంగి , మురిసి ,
హరిలొ రంగా యను నాలాపనము విని
పరుగెత్తుకొని వచ్చి పలకరించి ,
గంగిరెద్దులవాని గమనించి పాతదౌ
పట్టుచీరనొకటి వానికిచ్చి ,
బుడబుక్కమని చేతిమునివ్రేళ్లతో డప్పు
వాయించు వానికి బట్టలిచ్చి ,
వంటింటి ఘుమఘుమల్ వడ్డింపగా దిని
మేలు మా యమ్మంచు మెచ్చి మెచ్చి ,

నవ్వు పువ్వుల రువ్వి యానందమంది ,
దాన ధర్మమ్ములొనరించి ధన్యత గొన ,
పదుగురొకచోట జేరుట పండుగ యగు !
తెలుగు లోగిళ్ల కొంగ్రొత్త వెలుగులమరు !! 

               శ్రీ  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

205 comments:



  1. అంబ నడపు మంగళమున్!
    అంభోభృత్పథ విహారి యానందంబున్
    దంబర! అందరికి మజ క
    దంబింపన్ వేళ వచ్చె దవథువు తొలుగన్!


    అందరికి
    " సమ " క్రాంతి శుభాకాంక్షలతో
    జిలేబి

    ReplyDelete
  2. మైలవరపు మురళీ కృ
    ష్ణాలాపిత పద్య రవము చాలా ఘనమై
    కాలానుగుణము చాలక
    లీలగ నలనాటి వేడ్క లీనుచు నుండెన్ .

    ReplyDelete

  3. ఇంత అమోఘంగా చంపకమాల రాయటమంటే రాజారావు గారికే చెల్లును !

    అదురహో !

    చంపకమాల వృత్తము

    అనఘులు శర్మగార్కి , మహితాత్ములు శ్యామల రావుగార్కి , కం
    ద నుత జిలేబి గార్కి , విబుధాంబర వీథి విహారి విన్న కో
    టి నరసరాయ మిత్రులకు , డిగ్గున వచ్చి మనోజ్ఞ గీతముల్
    వినిచెడు బండిరావులకు , వేడుక గూర్చెడి వైవియారుకున్ .....

    ReplyDelete
    Replies
    1. వారి పద్యమాల నిరాడంబరంగా, అందంగా చాలా బావుందండి. ఎప్పటిలాగే ఆలస్యంగా అందరికి పండుగ శుభాకాంక్షలు.

      Delete
    2. అన్యగామి గారూ ,
      దన్యవాదాలు మరియు నమస్సులు .

      Delete


  4. మరియు తక్కిన బ్లాగు సంబంధ హితుల
    కందరకు - వినమ్ర తర ప్రగాఢ హార్ది
    క గతి - సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపెద ,
    ఆయురారోగ్యములు పొంది యలరు కొఱకు ."


    శ్రీలక్కాకుల రాజారావు గారు

    ReplyDelete
  5. జిలేబిగారు! మీకు, మీకుటుంబానికి మకరసంక్రాంతి శుభకామనలు !

    ReplyDelete
    Replies


    1. లలితమ్మాయ్ !

      శుభాకాంక్షలు మీకున్నూ !

      జిలేబి బామ్మాయ్ :)

      Delete


  6. పాయసమున్ సూత్రికతో
    సాయింపగ గైకొనంగ చక్కని కొమరుల్
    ఆయింతులుబడసిరయా
    వాయించిరి వాద్యములను వర్ధిల వారున్ !

    జిలేబి

    ReplyDelete


  7. గురువతడు లఘువగుచు న
    క్షరముల గాన్పడు జిలేబి, కాంతిగ నతడే
    పరమాత్మ తల్లి తండ్రియు
    శిరమును వంచుచు నమస్సు శ్రేయస్కరమౌ !


    జిలేబి

    ReplyDelete


  8. భేషౌ ! భారత పద్మవి
    భూషణ ! ఓ ఇళయ రాజ! భూరిగ జేయన్
    ఘోషల్ వాయిద్యములన్
    పోషించావు సినిమాను పుష్టిగ నీవే !

    జిలేబి

    ReplyDelete


  9. పడికెట్టు రాళ్ల గూర్చుచు
    పిడివాదమ్ముగ పదముల పిండు జిలేబీ
    గడినుడి కాదే పద్యము
    పిడిబాకై హృదయము నులివెట్టవలెనకో !

    జిలేబి

    ReplyDelete


  10. చాన్సు దొరికితే చాలు రొ
    మాన్సుగ పదముల జిలేబి మాపై పారిం
    చన్సుమ వెనుకాడరు ! "న్యూ"
    సెన్సేషన్నై తవికల చెక్కిరి సెహబాష్ !

    జిలేబి

    ReplyDelete


  11. మన దేశము కోశమయా
    జినుగుల పాశమ్మును విడజిమ్మగ నరుడా !
    మనవులు చెప్పితి నాశము
    మన రీతియు గాదు సూవె మహిలో సఖుడా !

    జిలేబి

    ReplyDelete


  12. బెందడి యిటుకలు చాలదు
    సందడి పదముల జిలేబి చాలదు సుమ్మీ !
    విందారగింపు తూకపు
    చందము గావలయునమ్మ చక్కగ నిలువన్ :)

    జిలేబి

    ReplyDelete


  13. సాబిత్ జేసె జిలేబియు
    బైబిలుఁ బరికించి, వ్రాసె భాగవతమ్మున్,
    కాబిలగ గాంచి కందము,
    శోభిల్లు విభుడు ప్రకృతియు సొబగుల నొకటే !

    జిలేబి

    ReplyDelete


  14. గురువనెడు పదము గలదే
    విరజాజి నిఘంటువందు విదురుడడిగెనే !
    పరుగున రమ్మ జిలేబీ
    పరచన్ కందంబునొకటి పాజము గానన్ !

    జిలేబి

    ReplyDelete


  15. గ్రేడుల్జేర్చిరి గురువుల్
    మాడర్న్ కాలేజిలో సమస్యల కెల్లన్
    గాడిన్ బెట్టుచు పూరణ
    లే డమడమ జేయగాను లేమ! జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  16. యోచన చేయడు లలనా
    కీచకుఁ డైనట్టి గురువు ; కీర్తి గడించున్
    రాచందముగా శంకరు
    లాచికొని చదువులగరపి లావై యిలలో !


    జిలేబి

    ReplyDelete


  17. మనమేం జేస్తే అదియే
    మనునోయ్ రమణియ జిలేబి మహిలో సుదతీ !
    కనకనలాడిరి యొజ్జయు
    వినవే భామా వినువిను వినదగు పలుకుల్ :)


    జిలేబి

    ReplyDelete


  18. ఇచ్చానోయ్ గ్రేడ్ సీ ఒన్
    మెచ్చాననుకోకు సూవె మేధా జీవీ !
    బొచ్చెపు పదముల పేర్పుకు
    బచ్చన నిచ్చితి మరి మము బలిజేయకుమా !

    జిలేబి

    ReplyDelete


  19. సుఖము నొక విధముగ తెలుసుకొనదగును
    దుఃఖమే! స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు
    మగడు తనచెంత నుండగ మనసు తోడు
    వాటి ననుభవించెడు మహద్భాగ్యము గద!

    జిలేబి

    ReplyDelete


  20. శిశిరమ్మిదిగో చూడుడు
    యశమును చేకూర్చ విష్ణు యంశంబై వ
    చ్చె శశి యునదిగో పూర్ణము
    గ శక్తిని సమీకరించె గగనపథమునన్ !

    జిలేబి

    ReplyDelete

  21. రాముని బంటట వచ్చెను
    ఆ మోచర్ల కత నటక హాయిగ చేరెన్
    కామోసు చదువు బ్లాగ
    ర్లేమాత్రములేక బ్రోచ లెస్సగ సుమ్మీ !


    జిలేబి

    ReplyDelete


  22. తాతా! తగునా మీకున్
    బూతు పురాణమ్ముఁ జదువఁ ? బుణ్యం బబ్బున్
    సాతానుకథల చదువన్ ?
    జోతల్ చేయుమయ విభుని ఝుమ్మన హృదియున్!

    జిలేబి

    ReplyDelete


  23. రేపేదో వుందనుకో
    కూ! పాతదినీది కాదు కొకబికగా నే
    డూ బాకీ లేదోయి జి
    లేబీ ! మధుపాత్రహొ మిగిలిందదొకటహో !

    జిలేబి

    ReplyDelete


  24. రాముని బందీని సుమా
    శ్యామల రాయునికి నతడు చక్కగ బందీ !
    ఈ మా బంధము కాలము
    లో మార్పును చెందనిది బలోపేతంబై !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మైత్రియందు బంధమన్నది యుండదు
      బంధమందు మైత్రి వలనుపడదు
      బంధమేమి రామభద్రున కుండును
      బంధ మేడ రామభక్తునకును

      Delete


  25. ఆ కుంభకర్ణుడి కథన
    భీకర తుమ్ముల చరితము బిగువుగ చెప్పెన్
    శ్రీకర మత్తేభమునన్
    స్వీకరిచి సమస్యను మజ చిత్రము గానన్ !

    జిలేబి

    ReplyDelete


  26. మా బ్లాగ్జ్యోతిష్యుల వారి టపా కై మా ముందు పద్యః !


    చంద్ర గ్రహణమట జిలేబి చంపు నుగ్ర
    వాది వలె జనులట భయ పడిరట రహ
    ములను జేయ! అరరె!మును ముందు హరణ
    ములకు సూచన గా పద్య మొప్పె గనుము !

    జిలేబి

    ReplyDelete


  27. గ్రహణ మమ్మరో!యివ్వాళ గ్రహములాగ్ర
    హముగ జూచునట! జిలేబి హవన పోహ
    ణముల జేయదగున్ స్ఫురణగొనుచు; చణ
    ము గనెను దినము మన మనము నట రయము !

    జిలేబి

    ReplyDelete


  28. విన రామకథను పరుగిడు
    హనుమంతుఁడు; పెండ్లియాడె నద్రితనూజన్
    కనగన్ ధ్యానమున శివుడు;
    మనస్సునన్ ధ్యానము గనుమమ్మ జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  29. గతిలేని పేదరికమది
    మతిబోయిన నాగరికత మనది జిలేబీ
    స్తుతిమతుల మాట వినవ
    మ్మ తరముగ వెలుగన పద్మ ! మన్నిక గానన్ !

    జిలేబి

    ReplyDelete


  30. హేగురు ! వృత్తంబేదో
    ఓ గుర్తును పెట్టుడయ్య! ఓపిక లేదోయ్
    ఆగురు లఘువుల గణలను
    చేగల జేయన్ డిమాండు చేసె వటువటన్ :)

    జిలేబి

    ReplyDelete


  31. చేగల నిచ్చెడు ప్రభువౌ
    బాగుగ నీవయ్య రామ పాహి! నమస్సుల్!
    నీ గుణ గణంబు లవియే
    మా గానమ్ములు మరిమరి మర్యాదగనన్ !

    జిలేబి

    ReplyDelete


  32. తా క్ష్మాను విడువ ఊర్మిళ
    లక్ష్మణుఁ బెండ్లాడె; సీత రాగాన్వితయై
    యా క్ష్మావరుడా రాముని
    తా క్ష్మా భారమును తీర్చ తరియించె గదా !

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. క్ష్మా - నిదుర
      క్ష్మావరుడు రాజు
      క్ష్మా - భూమి క్ష్మా భారము - భూభారము

      జిలేబి

      Delete


    2. తా క్ష్మాను బొంద నూర్మిళ
      లక్ష్మణుఁ బెండ్లాడె; సీత రాగాన్వితయై
      యా క్ష్మావరుడా రాముని
      తా క్ష్మా భారమును తీర్చ తరియించె గదా !

      జిలేబి

      Delete


  33. కాలపు గతి సంగతి యున్
    జాలంబందునట మీరు చక్కగ చెప్పన్
    మా లావుగ తెలిసెనయా !
    ఈ లీలన్ గాంచ సూవె నించితి ఫోటో !

    జిలేబి

    ReplyDelete


  34. మాస్టారు లీవులో బో
    యే! స్టాక్టేకింగెవరకొ ? యెవరికి వారే
    రోస్టరు వేసుకొని తతి
    మ్మా స్టారుల పూరణల విమర్శల జేయన్ !

    జిలేబి

    ReplyDelete


  35. ఇకపోతే పద్యానికి
    తకతక యను గణపు లెక్క తక్కెడ లేలా!
    చకచక హాయిగ చదువుచు
    పికపిక లాడదగునుగద బీలేజీయై !

    జిలేబి

    ReplyDelete


  36. తమిళ తరుణీ మణులట
    న్నమితముగా పేర్మి గ యవనారిన్ చిత్రిం
    చి మధురముగా గొలిచిరే
    మమత సమతల నెలవు వనమాలి జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  37. సెన్సారోళ్చూస్తే న్యూ
    సెన్సని కేసడెదరమ్మ సెక్సీ ప్లెక్సీ
    నాన్సెన్సనుచు జిలేబీ
    మన్సే దోచావుగాద మాలిని పద్మా :)

    జిలేబి

    ReplyDelete


  38. మీ వాళ్ల ఫోను నెంబరు
    భావుకతల రాజ, నాకు పరిచయ మివ్వం
    డీ! వారితో నుడివెదన్
    మీ వైఖరి మార్చ మనుచు మిస్టర్ బ్లాగర్ :)

    జిలేబి

    ReplyDelete


  39. ఈ మధ్య మత్త కోకిల
    ఓ మా మియట మజ బాగు గ్రుచ్చెనటన్ రా
    జా! మీ రేమన్నా చూ
    సే మెఱవడి జేసినార చేవయు గలదే ? :)

    జిలేబి

    ReplyDelete


  40. సారూ సింహం వలె బ
    డ్డారే వెనుక! కనబడను రా నా సామే !
    వారగ బోయెద కొట్టిం
    చే రావడి వలదయా !కచేరియు వలదోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  41. భేషైన మాట మాస్టా
    రూ! సక్కగ రెస్టును గొనుడూ! మేలౌ మీ
    కే సుమ్మీ ! రాజన్నా
    మా సదమున కవసరమయ మంచిగ మీరున్ !

    జిలేబి

    ReplyDelete



  42. మాటల్లేవండీ మీ
    హాటైన టపాకు పద్మ హాట్సాఫండీ !
    ఘాటుగ మురిపించేరం
    డీ టాక్ ఆఫ్ది టవునై సుడి తిరిగెనదియే :)


    జిలేబి

    ReplyDelete



  43. నీ మత్తకోకిల జిలే
    బీ మా బాగుందనడము వికటించెన్బో
    వే! మామీ చెప్పనిక
    న్నీమాటన్ భళి యననిక నీకున్ బోవే :)

    జిలేబి

    ReplyDelete


  44. మదిమది సయి జేర్చి మత్తున దేల్చుచు
    హృదయ కుహుర మందు హృణి తొలగిచి
    మదిని హత్తు కొనెడు మధువుగ మేధను
    చేదు, తెలుగు గొప్ప చెప్ప గలమె!

    జిలేబి

    ReplyDelete


  45. తహతహ తో తడి‌పొడి తప
    న హత్తుకొను తాళమాయె నానాటికి ప
    ద్మ! హమేషా మీ చిత్రా
    లు హడల గొట్టెను చలిని పలువిధములు గనన్

    జిలేబి

    ReplyDelete


  46. సుమసౌరభ కెరటమ్ముల
    గమకము తో మదియు నిండగ కెడయు వలపున్
    సమపాళ్ళపుటాశ నిడుచు
    రమణపు లేపనము లాయె రవళి జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  47. కౌగిళ్ళ పందిట వలపు
    సాగిల బడి వాయనముల చక్కగ సాటన్
    దాగని రసికత రాపిడి
    తో గిలిగింతల నగవులతో గుచ్చావే ! :)

    జిలేబి

    ReplyDelete


  48. సుద్దులు చెప్పెడు వారల్
    బుద్ధిగ నడచుకొను నాడు పుంఖితమగుచు
    న్నొద్దిక గా వెలుగున్నే
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్!

    జిలేబి

    ReplyDelete


  49. రాపిడి నీయ తడి మనసు
    కై పద్మార్పిత రచనలు కవితలు మేలౌ !
    కోపము శాంతము పిరియపు
    చాపము మదిలో కలతలు చక్కగ నవియే :)

    జిలేబి

    ReplyDelete


  50. అప్పణముగ రావమ్మా
    తప్పక తనువు నిచులముగ తరుణి జిలేబీ
    కప్పేయి శరీరాన్నిక
    చెప్పకు వేరొక్క మాట చెంతకు రావే !


    జిలేబి

    ReplyDelete


  51. నా బాకీయిది! యిదిగో
    తోబా! బువ్వలను బెట్టి తోడై నావే
    కాబో లే జన్మ రుణము?
    నీబోంట్లకు తీర్చినాను నీకున్ తోడై !

    జిలేబి

    ReplyDelete


  52. బతికి చెడినవాడీతడు
    అతుకుల బొంతలవశేష మాయె బతుకు నీ
    డ్వ తుదకు శక్తియు బోవన్
    గతుకుల బండిని మనుజుని గమనంబవగన్ !

    జిలేబి

    ReplyDelete


  53. బర్మా బజారు షాంపూ
    ఖర్మయు కాలి కొనినాను కష్టంబాయెన్
    చర్మజము మొద్దు బారెన్
    దుర్మార్గము గాదు "గురుల" దూషించినచో ?

    జిలేబి

    ReplyDelete


  54. అర్మపు నివర్తి కొరకై
    దుర్మార్గము గాదు, గురుల దూషించినచో
    అర్మిలితో విశ్రాంతిని
    పర్మాయించుచు జిలేబి పట్టుగ సుమ్మీ :)


    జిలేబి

    ReplyDelete


  55. మరులన్ గొల్పెడి పదములు
    విరియన్ మీ పద్యమందు విద్యల దేవీ!
    కురులన్ గురులన్ జేసిరి
    తరుణుల్ తమకెవరు సాటి తరుణి జిలేబీ!

    విట్టుబాబు గార్కి జై :)

    ReplyDelete


  56. పద్దుకు సాయం బట్టిరి
    పొద్దు గడవలేనినాడు పొట్టకు సాయం
    బద్దిరి జిలేబి నేర్వుము
    సుద్దుల జీవన గమనపు చుక్కాని గనన్!

    జిలేబి

    ReplyDelete


  57. ఈయన దేవుడు సామీ !
    మాయమ్మే ! రెండు గంట లా! టీ వీయా !
    భాయి దవాఖానన్ చే
    రే యోగంబిక వదులదు రేపకు మంటన్ :)

    జిలేబి.

    ReplyDelete


  58. వ్రాసిన టపాకు గురుడా
    కాసిని వ్యాఖ్యలను కోరె కామింట్రాయుల్
    మా సిత్రపు కథలన్ జే
    ర్చే సిన్నయ్యా! భళిభళి చేగను జేర్చన్ :)


    జిలేబి

    ReplyDelete


  59. ధన్యుడవయ్యా విఠలా !
    మాన్యులు వేసిరి కొసరుకు మార్కుల సుమ్మీ !
    శూన్యము దక్కెను నసలుకు
    విన్యాసంబన్న నిదియె వినుమ కవివరా !

    జిలేబి

    ReplyDelete


  60. బతికి చెడినవారిని సి
    గ్గు తరుము, అభిమానము సణుగుచు తరుమునయా
    వెతల సమయమందు సదా
    జతగన్ దారిద్ర్యము సయి జాఱుడుబండై !

    జిలేబి

    ReplyDelete


  61. పద్దుల లెక్కలు బెట్టితి
    నొద్దిక గా నాడు నేడు నోర్మిమి ని గనన్
    మద్దతు నిచ్చితి సాయం
    బద్దుచు నాదైన రీతి పధ్ధతి గానన్ !

    జిలేబి

    ReplyDelete


  62. తలుపుకు గొళ్ళెము వేసిరి
    తలపుల గొళ్ళెము ను తీసి తరియించిరి గా
    వలపుల వేదిక పైనన్
    సలసల మేని కరిగించి చక్కగ నిపుడే !:)

    జిలేబి

    ReplyDelete


  63. హాటకగర్భుడటన్ తన
    పాటవ మున్జూపగాను పలుకుఁజెలియ వా
    కాటున్ ద్రుంచగ, నొసటన్
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్!


    जिलेबी

    ReplyDelete


  64. ఆటంకపరచ తా "వా
    కాటు" కగ ధరించె నింతి, కారము నెలమిన్
    మాటల రూపము గానన్,
    ఝాటించుచు జాణులనట జంకింపగనన్ :)


    జిలేబి

    ReplyDelete


  65. చూడ "కుండ లేను", చూచిన కొలది శో
    భలలరు మజ మధుర భాండములుగ
    వాహిని వలె దుముకు పరవళ్ళు పద్యముల్
    వ్యాఖ్యల నిడ బిలిచె వార జూపు :)



    జిలేబి

    ReplyDelete


  66. చిలిపిగ మురిపెపు పలుకుల
    గిలిగింతల బెట్టి సయి మగిడినూదుచు మా
    బలిమిని నీ వైపున మా
    ర్చి లబ్ధవర్ణులను చీల్చి చెండాడితివే :)

    జిలేబి

    ReplyDelete


  67. ఎవరి బలహీనతలు వా
    రివే గదా! గురువు గారు ! రించోళులలో
    వివరములను తెలుసుకొనక
    యువతపడెడుపాట్లు జూడ యుక్తంబేదో !

    జిలేబి

    ReplyDelete


  68. శృంగారమ్మున్ పద్మా
    అంగాంగమ్ముల పొగడ్త లైనట్టి వడిన్
    జంకాయించు వడిన్నే
    భంగము గానీక మదిని పండించావే !

    జిలేబి

    ReplyDelete


  69. సవరించితి మన్నింపుడు
    కవనంబందునట తప్పు గాన్పడెనయ్యా!
    అవసరమవసరముగ వే
    య వరుసనట తప్పెనయ్య యతియున్నకటా!

    జిలేబి

    ReplyDelete


  70. అభినేత్రియన్న సరియా !
    శుభమ్ము లొలుకు కనుదోయి సుందరి చెప్మా !
    సభలో చూడవలెనికన్
    లభించు చక్కని విషయము లనఘా సఖుడా!

    జిలేబి

    ReplyDelete


  71. కోవూరు కోమలులనట
    తా వలపు విరిసెడు కొమరుదనమున జూడన్
    తావుల నద్దుచు వృత్తము
    గా విరిసెనయ పలుకులనఘా ! సుకవివరా :)

    జిలేబి

    ReplyDelete


  72. హోరన కరవాలముగా
    మారును గఱికయు వినదగు మామాటలనన్
    పారు నెడతెగక రక్తపు
    టేరులు మావూరిలోన టెంకణమిడుమా!

    జిలేబి

    ReplyDelete


  73. బిరాన నేరు పారు చేర పిల్ల గాలి పైరులున్
    సరాబు లంగడిన్ బజారు సాగు చుండు నూరిలో
    విరాజితమ్ము దేవళమ్ము వింగడమ్ము గాను మా
    రు రాత్రి చుక్కలమ్మ లెల్ల రూఢి గాను గాన్పడన్ !

    జిలేబి

    ReplyDelete


  74. నేయన్నైపుణ్యము గల
    దా యింకన్ జనులలోన తాతా చెప్మా !
    కాయస్థులకిది యేనయ
    సాయంబౌ నౌకరి నరసన్నా జూడన్ !

    జిలేబి

    ReplyDelete


  75. పారూ ! ప్రియా సఖీ యని
    నోరారా బిల్చినాను నొకకాలములో :)
    మారగ కాలము కోమలి
    మారెను గుండమ్మగా సుమా హహ్హహ్హా !

    జిలేబి

    ReplyDelete


  76. ఏమోయ్ గవర్నమెంట్లో
    యేమీ రాడికలు మార్పు యేలన్ లేదోయ్ !
    కోమా లో బోయెన్ ప్రజ
    లే మా రాజా జిలేబు లే లేరు సుమా :)

    జిలేబి

    ReplyDelete


  77. ఓ మోడీ ! నీ పైనన్
    ప్రైమరి కంప్లైంటట తమ ప్రభుతన్ లేదే
    యేమీ మార్పుల్ ? కాంగ్రెసు
    లా మగ్గుచునుండె నట గలాసున సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  78. నేనసలు నేను కాదయ !
    మేనియు ప్రకృతి దయ నరయ మెలపున్, ప్రతిబిం
    బానిని మీకందరికిన్
    నేనే జిడ్డును బిలేజిని జిలేబియునౌ :)

    జిలేబి

    ReplyDelete


  79. కనులానందించెనయా !
    తనువు పులకరించెను సతతము మీ పోస్టుల్
    కనులన్ జూడగ రాజ
    న్న! నుడివెద కనులకు విరతి నయ విను‌ వినుమా !

    జిలేబి

    ReplyDelete


  80. ఏమారిస్తివి గాదే
    ఓమాలిని!రమణి! పూవు బోడియ ! సింగా
    రీ !మధు పాత్రే మోముగ
    నే మైకమున బడినాను నెలతుక! పద్మా :)

    జిలేబి

    ReplyDelete


  81. ఎవరే మార్చిన పద్మా
    యువిదా! అస్తిత్వము నెఱి యుక్తమగు విన
    మ్మ వినుమ మారదదియె సు
    మ్మ! వివరముగ తెలిపినావు మహిని జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  82. ఆకళ్ళలోని కాంతి సు
    మా గిలిగింతలు ! నడకలు మాలిని హొయలున్
    హా! కవ్వించెను గా! ను
    వ్వే కద పద్మ! యలివేణి ! వేడుక నాకున్ :)

    జిలేబి

    ReplyDelete


  83. ప్రేమ సెగలు వువ్వెత్తున
    తామసమున్ లేచిపడెను తరుణి జిలేబీ ;
    లేమ! హొయలు వయసు వగలు
    మా మనసు మమతల తాకె మధురమ్ముగనన్ :)

    జిలేబి

    ReplyDelete


  84. ఎద సొగసుల వంపులలో
    పెదవుల ఆ పొంగుల నులి వెచ్చని తలపుల్
    పదపద యని బిల్చు జిలే
    బి దరువులన్ తాకిడి మజ పిరియంపుగనెన్ :)

    జిలేబి

    ReplyDelete


  85. కవితలతో మురిపిస్తా
    వు! వయసు చిత్రాలతో కవుగిలింతల తీ
    పి వలపులను రగిలిస్తా
    వు! విరిసినకుసుమము నీవు వునికివి నీవే :)

    జిలేబి

    ReplyDelete


  86. వలపున చేరగ నిన్నే
    కలయై వలయై జిలేబి కలవరమాయెన్
    కలిసె మనసున మమతలున్
    పలుకుల చెలి కొలికివిగద పద్మార్పితవై !

    జిలేబి

    ReplyDelete


  87. చిరుగాలి తరగలకు ముం
    గురు చిందుల కవితల సొబగుల హొయల జిలే
    బి! రవణములన్ వగల మా
    రి రయ్యనగ వచ్చి నీవు రివ్వున తాకేవ్ :)


    జిలేబి

    ReplyDelete


  88. రసరమ్య ప్రేమ కావ్యము!
    కసికసి బొమ్మల జిలేబి కవితల కవ్విం
    చు సొవసొవ పల్కుల వలపు
    ల సరాగముల విరజాజుల రమణి! పద్మా :)

    జిలేబి

    ReplyDelete


  89. ఆ పొంగుల వెచ్చగ తా
    కే పరువపు తాకిడి పలుకే జవరాలా
    చూపును తిప్పక నీ వై
    పే పిరియముగ కనుదోయి వేగిర జూచెన్ :)

    జిలేబి

    ReplyDelete


  90. పూరీ లుబ్బుచు వచ్చును
    కారకముగ సోడియద్వికర్బనితమ్మున్
    జోరుగ కలుపగ మేలున్
    భారీ యుబ్బసము కొంత పలుచగ జేయున్ :)

    జిలేబి

    ReplyDelete

  91. పాక నేత యొక కళయౌ !పల్లె లన్గ
    లదయ! మేలు వేతురు పెంకులు తమ యింట!
    పల్లె సొబగుల దీర్చును పాటి గాను
    పెంకుటిండ్లుగదా! విన్నపించినాడ :)

    జిలేబి

    ReplyDelete


  92. చక్కా బోవన్ కుదురదు
    పక్కకు రావే జిలేబి పసదనముల నే
    మక్కువగ గూర్తునే బో
    డక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్ :)

    జిలేబి

    ReplyDelete


  93. బస్సు లోన హరేరామ ! పాడు కొనుచు
    బోవదగును జిలేబియ పుణ్యము గలు
    గు నుసురు డుబుక్కుమనగ సుగుణమిదియె పొ
    గడదగిన మాట వినవమ్మ గడుసు దాన !

    జిలేబి

    ReplyDelete


  94. శప్త భూమి! భరతభూమి శాంతి తప్త
    భూమి! వెలసె నిలన తీర్చ పుట్టు గతుల
    జాత కమ్ముల కొరతదీర్చ గతి జేర్చి
    సద్గతిని గన భువిలోన సదన మగుచు !

    జిలేబి

    ReplyDelete


  95. సరదా కాలక్షేపము
    వరుసగ దారెంబడి చదువన్ లారీ పై
    న రుబాయిల వలె పదముల
    పరుగిడు తీరుల జిలేబి పట్టుగ సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  96. త్రీజీ స్కాముల జేసె బి
    లేజి, జిలేబియను జిడ్డు లేమయు సుమ్మీ !
    గోజీ లారా రండిటు
    వాజమ్మకు శాస్తి జేయ వడివడి యిపుడే !

    జిలేబి

    ReplyDelete


  97. అణువు బృహదణువు లనుచున్
    బణువుల పరమాణువుల గభాల్మని గని తా
    క్షణమున మారెడు విషయము
    లణోరణీయాన్ మహిత ఫలముగన్ గాంచెన్ !

    జిలేబి

    ReplyDelete


  98. పెండ్లికి అడ్డుపడే బలరాముడు :)


    బింకము విడువడు మదిలో
    జంకును లేదతనికయ! భుజభలము నందు
    న్నింకెవరుసాటి యయినను
    సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే !

    జిలేబి

    ReplyDelete


  99. మీ మాయలతో చేస్తా
    రే మము ముగ్ధులుగ పద్మ ! రేయింబవలున్
    రోమాంచితమగు కవితల
    తో మజ గొల్పుచు జిలేబి తొన్కిస లాడన్ :)

    జిలేబి

    ReplyDelete


  100. చిత్రమ్ము! బహుత్ ఖూబ్ !గద
    పాత్రౌచిత్యముగ పద్మ పదముల తోడన్
    స్తోత్రమ్ముల జేసితివిగ
    కత్రీనా కైపుల జలకంబుల దేల్చీ :)

    జిలేబి

    ReplyDelete


  101. లైట్లార్పుచు సెల్ఫునిడన్
    పోట్లాటల్వలదు సీట్లు పోరలకిద్దాం !
    పట్లేల టికట్లకొరకు
    రాట్లాటలవేల చిల్లరలకు జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  102. మీరేమి రాసినా నం
    డీ రయ్యన చెప్పగన్ రెడీ వెరి వెరిగుడ్ !
    కోరస్గా వస్తామం
    డీ రక రకమైన గారడీ పేర్ల సుమా :)

    జిలేబి

    ReplyDelete


  103. మీరుండేది విదేశము
    లో! రుంద్రంబగు జిలేబులు భళీ, ఆర్టీ
    సీ రుక్కులనన్ వైవీ
    యారుడ జేర్చిరి గదా! సయాటగ సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  104. వీధి చివర నిలబడి నా
    నే ధీమతి ! వాహనముల నే జూచితి జా
    ణా ధీవరునివలెన్ భళి
    రాధనమున్గాంచితి విజరపు వాక్యములన్ :)

    జిలేబి

    ReplyDelete


  105. శాంతము కన్న సముద్రము
    వింతగ చిన్నదియె సూవె! విదురుల పల్కుల్
    కాంతిమతీ, లారీలన్
    జంతరు మంతరుగ జూచె సదరు జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  106. మీ యక్షరాల లో ప
    ద్మా యెల్లపుడున్ హొయలు సదాబోవున్ ప్రే
    మే యుమ్మీ యనుచున్ గద
    ఓయమ్మమ్మో జిలేబు లో యమ్మ భళీ :)

    జిలేబి

    ReplyDelete


  107. మీరే లేకన్ ఫేస్ బుక్
    ఓరయ్యా ! తిరుమలయ్య! ఓరం బోయెన్ :)
    రారయ్యా మళ్ళీ మా
    కై రయ్యన రమ్మ కోరికన్ మన్నించన్ :)

    జిలేబి

    ReplyDelete


  108. చాలెంజట మోడీగా
    రూ! లెస్సగ చూడుడీ! పరుగులన్ రండీ !
    బీలేజి జిలేబీ దట
    వాలకమును గానుడయ్య వ్యాఖ్యల లోనన్ :)

    జిలేబి

    ReplyDelete


  109. కత్తి పదునులన్ కందం
    బెత్తు గడలతో జిలేబి బెత్తము తోడన్
    మొత్తెను శార్దూలంబై
    గుత్తుగ భాజ్పా నరేంద్రు గూడారమ్మున్ :)

    జిలేబి

    ReplyDelete


  110. ఓహో!అత్యుత్తమమ
    య్యా!హా! మీవివరణల చయముగా తెలిసెన్
    మీ హత్తుకొనెడు పద్యమ
    యా! హాకము మీరు మాకు యాజియు సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  111. పని ఒత్తిడి యెక్కువయే!
    కనుకే బ్లాగున టపాలు కరువాయెనయా !
    మనమే మైన పుడుకుదొడు
    క? నమ్ముమయ్యా భళిర సఖా నమ్ముమయా !

    జిలేబి

    ReplyDelete


  112. మీ పాటల వింటూనే
    మీ పోస్టుల చదవటము సుమీ‌ చాలా యు
    మ్మీ! పాట వినడమూ క
    ర్ణోపేయము కన్నడమ్ము లోనన్ సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  113. మా అయ్యరు గారి సమానులు గలరే భువిలో :)



    ఓ సామీ ! అయ్యరు గా
    రూ ! సత్యము! మా జిలేబి రూఢిగ మీరే !
    వీసము కూడా చేయము,
    మీ, సములన్ గనఁగఁ గలమె మేదినియందున్


    జిలేబి

    ReplyDelete


  114. ఎద్దానికైన గోజీ
    పెద్దల కే సుమ్మి చోటు పేరోలగమున్
    ఖద్దరు కాలము నుండియు
    సుద్దుల జెప్పుచు నిలిపిరి సూక్ష్మంబిదియే :)

    జిలేబి

    ReplyDelete
  115. ”లోలకం” బ్లాగులో ఏడ్ లు అడ్డుపడిపోతున్నాయి,బ్లాగ్ చదవడానికే కావటం లేదు, ఏమిటీ మాయ వివరించుడు.

    ReplyDelete
    Replies

    1. గూగులు క్రోమున చదువుడు
      బాగుగ యాడుల ఝమేల భారము లేదోయ్ :)


      జిలేబి

      Delete


  116. భావుకుడై మీరుండగ
    భావుకతకు కొరతయకొ సభాస్థలిలోనన్
    కోవెల దీపపు వెల్గుగ
    కోవిదులుండగ జిలేబి కొదవెక్కడిదే :)

    జిలేబి

    ReplyDelete


  117. ఖద్దరు కాలము మాదే
    విద్దెగ బ్లాగుల హరిమయు ఫేస్బుక్కులునూ
    హద్దన్నదిలేదే మా
    పెద్దరికమునకు జిలేబి బెంగ్లూర్కూచీ :)

    జిలేబి

    ReplyDelete


  118. అందంగా వుందండీ
    కందము తేనియ వలెన్ సుఖకరము గానన్
    డెందము బడసెన్నానం
    దం ధంధం యనుచు కరివెదవలె జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  119. కరివెద కథలన్ మాచన
    పరిచయము భళీ జిలేబి పాఠము నేర్వన్
    కురియన్ వానయు నెలయున్
    పరిమళమగు జీవితమున పబ్బము గానన్ !

    జిలేబి

    ReplyDelete
  120. // "తెలుగు వెలుగు అనగా నేమి ?" // (వేరే బ్లాగులో మీ ప్రశ్న)

    మీరే ☝🌞⚡🌈🍭🌝

    ReplyDelete
    Replies


    1. అందలపు కోతి పిల్ల యీ அரவ மாமி :)


      ஜிலேபி

      :)

      Delete
    2. అందమున కోతి ఈ అరవపిల్ల :) :) :)

      Delete


    3. విట్టేసినా పట్టేసారే :)


      మీ ఏ టపాలో ఈ వాక్యం వచ్చిందో చెప్పుకోండి‌ చూద్దాం :)


      జిలేబి

      Delete
    4. నాకే పరిక్ష పెట్టేరే! ఓడిపోయా మీరే చెప్పండి.:)
      ఈ మాట నాదికాదండోయ్! శ్రీనాథ మహాకవిది.

      Delete


    5. మీరిప్పటి దాకా ఏ టపాలోనూ ఉదహరించిన దాఖలాలు లేవు :)

      ఎట్లా ఇంత చిన్న వాక్యాన్ని మీరు ఏ టపాలోనూ వ్రాయలేదే అని ఓ బాణం వేసా :) సరిగ్గా కనుక్కునేసారు :)

      ఎంతైనా గోజీ లకు గోజీ లేగా సమ వుజ్జీ :)


      చీర్స్
      జిలేబి


      జిలేబి

      Delete
    6. విన్నకోటవారూ! ఇది విన్నారా?
      అహహహ :) :) :)

      Delete


    7. మీరే తెలుగువెలుగు సు
      మ్మీ! రేయింబవలు పద్య మే జీవముగన్
      పారా హుషారనుచు మన
      సారా తెలుగుకు జిలేబి సాంకవమయిరే :)

      జిలేబి

      Delete


    8. విన్నారా నరసన్నా !
      పొన్నారి కథలను గూర్చె పూబోడి జిలే
      బన్నన్న ! యెంత మోసము!
      యెన్నెన్ని నుడుగుల చెప్పి యేమి ఫలమయా :)

      జిలేబి

      Delete
    9. వింటున్నా శర్మ గారూ వింటున్నా, ఈ “అరవ మామి” (పైన “அரவ மாமி”) చమత్కారాలు. గోజీలను పొగుడుతూ పనిలో పనిగా తను కూడా గోజీ అని చెప్పుకుంటున్నట్లా? 🤔🙂

      Delete
    10. మనం మనం తిమ్మనం అనేస్తే ఆహా మాగోజీ అనేస్తారని ఆశ :)
      ఆశ, దోశ, అప్పడం, వడ,
      ఎన్న ముడియాదు, అరవపాటీ :)

      Delete


    11. మనము మనము తిమ్మన యన
      గ నమ్మి మాగోజి వారు గదయని వెర్రో
      ళ్ళనెదరు, మేమనమే యీ
      డన నాశా! దోశ అప్పడమువడ ! రమణీ :)


      ౪ జి స్కాము :)


      జిలేబి

      Delete


  121. వారే వీరూ! వీరే
    వారూ ! వారే యిచట సవాలే లేదోయ్
    వేరే యాడా లేరోయ్
    సారూ యాడే గలరు మిసైలు జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  122. మీసములన్ద్రువ్వుమయా
    వాసిగ సంపెంగినూనె పద్మముఖి జిలే
    బీ సర సముగా రాయన
    మీ సములన్ గనఁగఁ గలమె మేదిని యందున్!

    జిలేబి

    ReplyDelete


  123. జీపీయెస్ వారి శిష్యుల ప్రతిభ !


    మీసము లేకన్ "దువ్విరి"
    కోశా గారపు నిధులకు కొండగ నండై !
    వాసిగ నిల్చిరి రావుల్
    మీ సములన్ గనఁగఁ గలమె మేదిని యందున్!

    జిలేబి

    ReplyDelete
  124. “गम्डुगोल् हुवा नाय्“ అన్నారు మీరు వేరే బ్లాగులో. హిందీలో నుడివారా? దీని అర్థమేమి జిలేబి గారూ?

    ReplyDelete


  125. అసలు జిలేబీ గారిని
    పసగల్గిన పద్యములను పార్లియ మెంట్లో
    నసగల్గించు కయిపు గు
    చ్చి సిగదరగ చదివి వార్ని చించమన వలెన్ :)

    జిలేబి

    ReplyDelete


  126. నిచ్చెనగా నిలిచామట!
    మెచ్చుచు నెక్కిరి పయిపయి మెరవణి తారీ
    ఫిచ్చుచు హైహై నాయక !
    సచ్చితిమి నిలబడుచు మనసార జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  127. వచ్చిరి కొందరు గురువుల
    కిచ్చుచు మర్యాదలెల్ల కీర్తిని బడయన్
    నచ్చగ సౌశీల్యతయు
    న్నిచ్చితిమిగ దీవెనలను నిండుగ సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  128. చప్పట్లు మీకు కరివెద
    గప్పున పట్టిరి పదమును ఘనముగ రమణీ !
    చెప్పితి నే నప్పు డపుడు
    జొప్పించదగును జిలేబి జొళ్ళెము లోనన్ :)

    జిలేబి

    ReplyDelete


  129. నిజమన్నది నిష్టూరము !
    భజన పరుల దేశము గద! వైవీ వినుమా !
    గుజగుజపడు చుందురటన్
    ప్రజలకు తెలియదయ చాటభారతమయ్యా !

    జిలేబి

    ReplyDelete


  130. రుబ్బేస్తున్నారాండీ ?
    నిబ్బరముగ పదములను జొనిపి మా పైనన్ !
    తబ్బిబ్బు సేయకమ్మా
    అబ్బాబ్బా ఆంధ్రభారతావని బామ్మా !

    జిలేబి

    ReplyDelete


  131. అనవసరముగన్ బల్కుచు
    మన తలలన్ దినుచు పనికిమాలిన తలపుల్
    మనమదిలో చేర్చుచు హా!
    యనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ!

    ReplyDelete


  132. అనృతము జేయుము మాటల
    "అనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ!"
    అనృణము నుండి జనాళిన్,
    అనృశంస!నరేంద్ర మోడి ! ఆదుకొనుమయా !



    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  133. అదిగో అబుదాబీ లో
    పదిలము! హిందూత్వము భళి పాతుకొనంగన్
    మదినిండుగ నారాయణు
    ని దివ్య మందిరము వచ్చు నిధి యిదియె నమో !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. స్వామి నారాయణ్ హిందూ దేవుడా ? హిందువులకోసం ఏం (త్యాగం) చేసాడు ?

      Delete


    2. ఔరా ! ఏమి ఈ మాయ !

      నీహారిక ఈ ప్రశ్న వేయుటయా !

      హతవిధీ !


      జిలేబి

      Delete
    3. డిల్లీలో స్వామి నారాయణ్ అక్షరధామ్ చూసేదాకా ఆయనెవరో నాకు తెలియదు. అక్షరధామ్ లో ఎదురుగా స్వామి నారాయణ్ విగ్రహం ఉండి మిగతా దేవుళ్ళందరూ చుట్టూ ఉంటారు. దేవుళ్ళందరి కంటే ఆయన గొప్పవాడన్నమాట ! ఆయన అంత గొప్ప పనులు ఏమి చేసాడో ఇప్పటివరకూ నాకు తెలియనే లేదు.మీకు తెలిస్తే చెప్పండి !

      Delete

    4. మహానుభావుడాయన.

      చెంపలేసుకోండి ఓ ౧౦౮ మార్లు

      హన్నా ?! ఎంత మాట ! ఎంత మాట !


      జిలేబి

      Delete
    5. మంచి ప్రశ్న వేసిన వారిని చెంపలు వేసుకోవాలని చెప్పటం దుర్మార్గం. ఈరోజున మనం సూపర్ దేవుళ్ళని సృష్టించుకుంటున్నా అంటే ఆ మంచీ చెడూ మనకే వస్తాయి. మంచి వస్తే ఆనందమే. కాని చెడు వస్తే మాత్రం ఆ విధంగా మనం దాసస్థానానికి దించిన దేవుళ్ళు కానీ, మధ్యలో మనం ప్రతిష్ఠించిన కొత్తదేవుడు కానీ మనని రక్షించటం జరిగే పని కాదు కదా అని గుర్తించటం మంచిది.

      Delete


    6. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
      న బ్రూయాత్ సత్యమప్రియం :)


      జిలేబి

      Delete


  134. ఔపోసనయా ! రుబ్బడ
    మా! పడతీ చెప్పుమమ్మ మహిని జిలేబీ
    నీ పద్యంబుల దాడికి
    కాపడముల బెట్టుకొంటి కరుణన్ జూపన్ :)


    జిలేబి

    ReplyDelete


  135. పరులే అందరును జిలే
    బి రుసరుస వలదు భజనల బిగువుగ చేయన్
    పరులందరు మన వాళ్ళై
    పరిణామము చెందెదరు సెబాసన రమణీ :)



    జిలేబి

    ReplyDelete


  136. ఢిల్లీ లో దేవళమున్
    తల్లీ చూసే వరకు సదరుగురువు కతల్
    పల్లకి సేవల్ తెలియవు !
    జల్లను హృదయముల గురువు చక్కగ నతడే !


    జిలేబి

    ReplyDelete


  137. మధురకవి గారి పద్యము
    మధురము గా నుండు గుండు మామి జిలేబీ
    వదనమ్మది వికసితమై
    నది చదువుల తల్లి చలువనగదా రమణీ !

    జిలేబి

    ReplyDelete


  138. శివ శివ యనుమమ్మ మనసా శివకవి వలె,
    వర్ధ నుడనాది యోగియు వరము లివ్వ !
    రాధనముల నిచ్చెడు శివ రాత్రి యిదియె
    త్రికరణపు రీతి బడయ ధాత్రి, నిజముగను !

    జిలేబి

    ReplyDelete


  139. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షల తో


    శివశివ యనుమమ్మ మనసా చిగిరిలగ శి
    వకవి వలె! నాది యోగిగ వరము గా వ
    రాకములను గాచునతడు ! రాధనమును
    త్రికరణపు రీతి బడయ నింతి, సయి ధాత్రి !



    జిలేబి

    ReplyDelete


  140. ఓ బీలేజీ ! డిమ్భక!
    జాబిల్లమ్మా మిడిగొను చండునికిన్ ! తా
    బాబా దముకుకు, వేల్పు జి
    లేబీ కి నమస్కృతి నిడు లెమ్మ! శివోహం !

    జిలేబి

    ReplyDelete


  141. అలికాక్షుడి కరుణ బడయ
    గిలకగ పద్యము లనేమి గిట్టుబడియగున్,
    గిలకొట్ట వలె మదిని తా
    శిలయై నదియై పరుగిడ శివశివ యనుచున్ !

    జిలేబి

    ReplyDelete

  142. శివుడే గురువోయ్ గురువే
    శివుడోయ్ ! పాగెము గని శివ శివయను గురువై
    శివుడే నినుగాచు సదా
    శివుడై యలికాక్షుడై వశీకరుడగుచున్ !

    జిలేబి

    ReplyDelete


  143. అలికమన లలాటమయా
    తెలివిగల విదుర! తమరికి తెలియకనా! సు
    ద్దుల నీకడ నేర్చె జిలే
    బి లబ్జు గన్ మాచనార్య, బీలేజీ యై !

    జిలేబి

    ReplyDelete


  144. గేదెయట‌న్ పృచ్చించె న
    యా! దామిణి బడుదురు తనయన్నే బడయన్
    వేదనలేల జనులకున్
    రోదనముల్లాడబిడ్డ రొంటిని బడయన్ !

    జిలేబి

    ReplyDelete


  145. వారిజ నేత్ర జిలేబియు
    కూరిచె మల్లియ లనంట కూర్మిగ తృటిలో
    నారాటపడుచు ఝుమ్మని
    దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్ !


    జిలేబి

    ReplyDelete


  146. వాలైంటేన్డే కేం కా
    వాలోయ్? రింగివ్వరండి ! వాట్ అంతేనా !
    ఓ!లవ్లీ మోబైల్ రింగ్
    చాలా ? ల్యాండ్లైను రింగు సరియా రమణీ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ల్యాండ్లైన్ రింగా !! ప్చ్ ప్చ్, వాలెంటైన్స్ డే ఔత్సాహికులకి ఏం ఆనుతుందండీ? అయినా ఈనాటి కుర్రకారు వాలెంటైన్స్ డే నాడు ఇంట్లో కూర్చుంటే కదా ల్యాండ్లైన్ రింగ్ వినబడడానికి 🙂.

      Delete


  147. ఆడెన్నక్షులతో నా
    టాడే మాచన జిలేబి టాటా చెప్పెన్
    వేడుక పదముల జేర్చెన్
    బోడీ ! విదురుల కెలుకన బోల్డన కబురుల్ :)

    జిలేబి

    ReplyDelete

  148. బాగుందంటే తంటా!
    ఓ గురు బండన్న ! లేదు రోయన యేమౌ
    నో గడ బిడీ ! జిలేబియు
    పాగెము గానన్ బిరబిర వచ్చెన్నిపుడే !

    జిలేబి

    ReplyDelete


  149. అంతొద్దు ! మరీ డాంజరు!
    వింతగు పదముల జిలేబి విరిసెన్ గాదే !
    కొంతయు నేర్చితి మయ్యా
    చెంతన చేరుచు విదురుడ చెకుముకి రాయీ :)

    జిలేబి

    ReplyDelete


  150. ప్రేమికుల దిన శుభాకాంక్షలతో


    స్వైరిత ణిసిధాత్వర్థము
    లే రాజిల జేయగోర లేమయు వలయం
    బై, రయ్యనగ భళా మం
    దారముపై వ్రాలెఁ దేటి త్రాగగ మధువున్!


    సెయింట్ వాలైంటైన్ లాంగ్ లివ్ :)


    జిలేబి
    పరార్ :)"

    ReplyDelete
    Replies


    1. గొర్రెలకట కళ్యాణము
      వెర్రితలలు వేయ యువత వెజ్జరికముగన్
      చర్రను రీతుల జేసే
      రర్రా కర్నాటకమున రమ్యంబుగ బో :)

      జిలేబి

      Delete


  151. విస్సన్నలు చెప్పగ విన
    తస్సా గాళ్ళమ? జిలేబి‌ తరిమెద ! జావో :)
    లెస్స పలికితిరయ! భళా!
    కస్సని సినిమా జనుల పొగరుల నణచుచున్ !

    జిలేబి

    ReplyDelete


  152. కోరితి నయ నీ కృపనే
    ఓరయ్యా రామ నా కపోలపు నడతన్
    మారిచి నీదరి జేర్చితి
    వే రమణ నమసృతులయ్య వేంకట నిలయా!

    జిలేబి

    ReplyDelete


  153. మా తమ్ముడి కవితలయా !
    యేతావాతయిటువంటి యిసయం మీదే
    వాతలు పెట్టేడండీ
    కోతలు కావండి చదువ కోరితి నంతే :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మా తమ్ముడి కవితను మీరు చదివారో లేదో చెప్పలేదు కానీ ఇక్కడ మీరు వ్రాసిన పద్యం మాత్రం బాగుంది (అర్థమైంది కూడా jk 🙂).

      Delete


    2. మా తమ్ముడి కవితల ఓ
      మా తల్లే! చదివినార ? మాటే లేదే?
      కోతల పద్యము బాగుం
      దీ! తల కెక్కగ రవంత దిండురికితి బో :)

      జిలేబి

      Delete


  154. తేటగీతి

    అక్షి! అలికాక్షి ! చపలాక్షి! సారసాక్షి !
    పంకజాక్షి! కువలయాక్షి !చంచలాక్షి !
    అంబుజాక్షి!మీనాక్షి! పద్మాక్షి ! నీర
    జాక్షి!వనజదళాయతాక్షాశకాక్షి !

    జిలేబాక్షి

    ReplyDelete


  155. అదిగో నీహరికయు వ
    చ్చె! దిక్కులిక పిక్కటిల్లు ! చేసెన్ సరదా
    కిదియే సవాలు ధర్మము
    ముదావహంబైనదేది ముద్దుల గుమ్మా :)

    జిలేబి

    ReplyDelete


  156. మారీచుడేమనెను చె
    ప్మా రామాయణములోన! పారుడు బోవా
    లే రయ్యన పరుగులిడుచు
    కారాల్మిరియంపు భామ కంబుగ్రీవా!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. “రామో విగ్రహవాన్ ధర్మః” అంటూ మంచే చెప్పాడుగా మారీచుడు. సందర్భం లేని పోలికలు తీసుకొచ్చే ప్రయత్నం అభాసవుతుంది.

      Delete


  157. వినదగని పల్కు లెల్లయు
    ననలమ్మే సుమ్మి! చల్లనైనది యిలలో
    వినదగు నెవ్వరు చెప్పిన
    వినినంతన్వేగుపడక వివరము గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  158. అనలాక్షి! చంచలాక్షీ !
    త్రినయన! లలితా !శకాక్షి ! త్రిగుణాత్మక క
    ల్పనయై వెలిగెడు జీవపు
    అనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో!

    జిలేబి వారి ట్యాగు లైన్ తెలుగులో కంద పాదమా ? :)
    Postings by Zilebi- When its Hot its Really Cool ™

    ReplyDelete



  159. శ్యామాశాస్త్రిది కాదే ?
    శ్రీ ముత్తుస్వామి వారి సిరి శర్మాజీ !
    భామ! నరసన్ననెరుగని
    దేమీ లేదౌ జిలేబి తెలివి మరీనూ :)

    జిలేబి

    ReplyDelete


  160. శ్వశుర గృహవాసి ! శంభో !
    పశుపతి ! శంకర! త్రినేత్ర! పరమేశ్వరుడా!
    అసమాక్షుడ!ఆదిశబర!
    వసుధారథుడా! విలాసి !వారుడ! హరి ఓం!

    జిలేబి

    ReplyDelete


  161. గుణదోషముల పరస్పర
    మనుభవ పూర్వకముగా సమస్యల పూరిం
    చిన పద్యమ్ముల కొరకై
    వినియోగించుడు! విదుర కవీశ్వరులారా !

    జిలేబి

    ReplyDelete
  162. ఈమధ్య బ్లాగులు చూడాలన్న ఆసక్తి కూడ దాదాపు లుప్తమై పోయింది. చాలారోజులైనది అని ఎలా ఉన్నాయో అని ఒకసారి పరిశీలిస్తే అవే ధోరణులు. గొంగడిలో తింటూ వెంట్రుకలు ఎంచనవసరం లేదన్న సామెత తెలుసును లెండి. అందుకే పెద్దగా చిరాకుపడలేదు కూడా. నాకు బ్లాగులను చదవాలన్న సరదాపైనా , ముఖ్యంగా వ్యాఖ్యలను పరిశీలించాలన్న ఆసక్తిపైనా చావుదెబ్బ కొట్టిన జిలేబీగారి(గిందాల)కి ధన్యవాదాలు. సెలవు.

    ReplyDelete
    Replies

    1. వైరాగ్యము చెందెను గా
      మా రాముని భక్త జనుడు మహిని జిలేబీ !
      మారా మారీ పదముల
      భారీ ఖార్ఖాన గింద పద్యముల గనన్ :)


      కంద పద్య వైరాగ్యము :)

      చీర్స్
      జిలేబి

      Delete


  163. వైరాగ్యము చెందెతి బో
    వేరే పనులు మనకేల వేడెద నేనే
    మా రాముని ! కీర్తనలన్
    మా రామునిపైన చేతు మహిని జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  164. అదిగో ఖార్ఖా నా మొద
    లదిగో ! తెలతెల్ల వారె లంగరు వేసె
    న్నిదిగో పద్యము లన్వ్రా
    యదిగె నదురుబెదురు లేక యామి జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  165. వారిజ నేత్రా ! హేతువు
    శారదయే !బలిగొనెఁ గద జను లెందరినో
    తా రొద రొదపద్యములన్
    మారామారీగ జేసి మహిని జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  166. చర్చల తో నేర్వంగను
    మిర్చీ బజ్జీల వంట మించారున బా
    వర్చీ విన్నాణములున్?
    అర్చన జేయన్ గురువుల నర్భక నరుడా:)


    జిలేబి

    ReplyDelete


  167. కొండల రావు రిటార్టుల్
    చెండుల విసురుచు జిలేబి చేవయు గానన్
    మెండుగ భలే భలేగ
    న్నుండెను గదవే పదములు నునుపారగ బో :)

    జిలేబి

    ReplyDelete


  168. కందివరుల సెలవు దినము
    మందకొడిగ నుండె గా సమస్యా సభయున్!
    కొందరయిన పండితులట
    నందుకొనదగు పరిశీలన విదురులారా !


    జిలేబి

    ReplyDelete


  169. అవునండీ తమిళంలో
    ను వురుకుల పరుగుల బోయెనుగదా సినిమా
    చెవి రింగు రింగు మనుచున్
    శివాణి ఉసిగొల్పు గాత్ర శింఘాణంబై :)

    జిలేబి

    ReplyDelete