Friday, January 26, 2018

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !
 
 

కందము
 
మన దేశము కోశమయా
జినుగుల పాశమ్మును విడజిమ్మగ నరుడా !
మనవులు చెప్పితి నాశము
మన రీతియు గాదు సూవె మహిలో సఖుడా ! 
 
*****
 
తేటగీతి
 
దేశ మేమిచ్చెననకు నే దేశమునట
నెగడు కోశముగా నిల్ప నీమమున్ గొ
ని పని జేసి వినాశమున్నింకు జేయ
నేమి చేసితి పాశము నేర్వ దగును !
 
*****
 
ఆటవెలది
 
దేశమున్ జనాళి దేవళమ్ముగ జూడ
వలె వినాశ మెల్ల వదుల వలెను!
కోశ మవగ వేద ఘోష జిలేబియ
పాశము గను మేలు బాంధవమ్ము !
 
*****
 
మత్త కోకిల
 
దేశమాయెను భారతమ్ముర దేవభూమిగ వెల్గుచున్
కోశమాయెను వేదవిద్యకు కోరి పుట్టిరి దేవతల్
నాశమయ్యిరి దుష్టులున్ను సనాతనమ్మును గూల్చగన్
పాశమున్ గొని దీటుగానటు పాజమున్ గొ‌న మేలగున్
 
*****
 
ఉత్పలమాల
 
దేశము నీది నాది సయి దేవళ మై వెలి గెన్ జనాళికిన్
కోశము వేద వాక్కునకు, కోరిరి దేవతలున్ ప్రభూతి కా
వేషము లెల్ల తీరగను ; పెక్కు వినాశములన్నెదుర్కొనెన్,
భూషణ చేయు పాశముగ భూరిగ దీటుగ జైజవాన్! కిసాన్!
*****
 
చంపకమాల

చలిమల పైన సైనికులు శాంతిని జేర్చుచు దేశమున్ సదా
వలయము గావ కోశముగ వర్ధిలె భారత భూమియే ధరా
తలమున వేద సారముల తత్త్వము పాశము వీడ నేర్పుచున్
పలికె వినాశముల్ వలదు; పాడదగున్ భళి కీర్తి చంద్రికన్
*****
 
శార్దూలము

నాదేహంబను జాలమున్ విడుమయా! నాదేశ పాశంబు నీ
దై దారుఢ్యమవన్ వినాశముల నీదౌ కైపులన్ ద్రోలుచున్
వేదమ్మే మన కోశమై ప్రజలకున్ విద్యావిధానమ్ముగా
సాధించన్దగు శాంతి సౌఖ్యము నిలన్ శార్దూలమై నిల్చుచున్
*****
 
పంచ చామరము

నినాద మిద్ది దేశ మున్ సనీడ గాను నిల్పుమా
వినాశ మేల పాశ మేల విశ్వ మెల్ల నీదయా !
సనాతనమ్ము భావ మెల్ల సాగరమ్ము, నీదు దే
శ నాడి కోశమయ్య, మేలు జన్మ భూమి నీదయా


మత్తేభ విక్రీడితము

మన దేశమ్మది కోశమయ్య భువిలో మాన్యంబుగా వేదవా
క్కునకున్, ధర్మపథమ్మునన్ మెలయ నిగ్గుల్దేల్చు పాశమ్ము బో
వ నరుల్ జీవిత మందు నిమ్మళము గా భాసిల్ల! కాపాడు కొ
మ్మ నమస్సున్నిడి దేశ మాతకు నిటన్ మాన్పించి నాశమ్ములన్!

 
 
జైహింద్
జిలేబి
 
 


2 comments: 1. ఛందస్సులో గణితాంశములు రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D


  http://eemaata.com/em/issues/201209/1991.html?allinonepage=1


  ReplyDelete


 2. నినాద మిద్ది దేశ మున్ సనీడ గాను నిల్పుమా
  వినాశ మేల పాశ మేల విశ్వ మెల్ల నీదయా !
  సనాతనమ్ము వేద భావ సాగరమ్ము, నీదయా
  జనాళి కోశ మయ్యె మేలు జన్మ భూమి నీదయా !


  పంచచామరము
  జిలేబి

  ReplyDelete