Wednesday, March 28, 2018

సరదా మాటలు :)



సరదా మాటలు :)

బ్లాగు అగ్రిగేటర్ లో ప్రముఖం గా కనిపించేవి టపా హెడ్ లైన్లు !

అప్పుడప్పుడు వేగం గా హెడ్ లైన్లు మాత్రమే చదివేస్తూం టాం .

ఆ ఫ్లో లో పక్క పక్క నున్న కొన్ని బ్లాగు హెడ్ లైన్లను కలిపి చదివేస్తూండటం కూడా కద్దు.

అట్లాంటి సమయాల్లో కొన్ని టపా ల హెడ్ లైన్లు కలబోత గా నవ్వు ని తెప్పించేస్తూం టాయి. ఇట్లాంటి వి కొన్ని ఇంతకు మునుపు రాసినట్టు గుర్తు.

అట్లాగే ఇవ్వాళ కనబడినవి కొన్ని :) ఎన్జాయ్ :)


వనజవనమాలి :   గోదావరిలో రాయికి నోరొస్తే ..
చిత్రకవితా ప్రపంచం :   చచ్చిన దానికి కడుపొచ్చింది


గోదావరిలో రాయికి నోరొస్తే .. చచ్చిన దానికి కడుపొచ్చింది

పాటతో నేను :   అబ్బనీ తియ్యనీ దెబ్బ...
Eco Ganesh :   మధర్ సూక్తి


అబ్బనీ తియ్యనీ దెబ్బ...  మధర్ సూక్తి


కష్టేఫలి :   కలిగినవారింటి దిష్టిబొమ్మ
ఒక్కమాట :   యశస్వి||దిశ మొలతో తిరిగే వాడికి సిగ్గేసినప్పుడు..||


కలిగినవారింటి దిష్టిబొమ్మ -- దిశ మొలతో తిరిగే వాడికి సిగ్గేసినప్పుడు


Sakshyam Magazine :   రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొర
ఆపాత మధురాలు :   చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ 

రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది - చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ 

Sakshyam Magazine :   రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొర
ఆపాత మధురాలు :   చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ 


శ్యామలీయం :   దేవుడు రాముడు దేహాలయమున జీవుడు రాముని పూజారి
DATHA RAMESH :   రజనీకాంత్ సినిమాలలోని టైటిల్ కార్డ్స్ !

దేవుడు రాముడు దేహాలయమున జీవుడు రాముని పూజారి  - రజనీకాంత్ సినిమాలలోని టైటిల్ కార్డ్స్



చీర్స్
మీకూ ఇట్లాంటివి కనిపిస్తే కామింటండి :)

జిలేబి


 

Tuesday, March 27, 2018

అదేమి పదమో పులుసు- హు హు సాంబారన్న సాధువైన పదముంటేనూ !



అదేమి పదమో పులుసు !
 హు హు  
సాంబారన్న సాధువైన పదముంటేనూ !



మరీ ఇట్లాంటి అసాధువైన పదమేమిటి పులుసట పులుసు .

అబ్బే వినడానికే మరీ ఎబ్బెట్టు గా లేదూ ?

సాంబార ని శుభ్రమైన సలక్షణ మైన సుందరమైన సులభమైన ముచ్చటైన   పదముంటే అట్లా పాత కాలపు చింత కాయ పచ్చడి లాంటి పులుసు గిలుసు లాంటి పదాలేమిటో ?

అబ్బే కొంచెం కూడా అర్థం కాదే వీళ్ళ కోతలు కోటలు గట్టే మాటలు ?


మరీ తెలుగు వారి పులుసు కాకుంటే పులుసు ని పట్టుకుని సాగ దీయట మేమిటో ?

సాంబారు లో పప్పు వుంటుంది . పులుసు లో ఉంటుం దా ?

అబ్బే ! ఏమిటో భేషజాలు.

సాంబారు అన్న పదం ఎంత ముద్దొచ్చే పదం కదండీ ?

సాంబ ! శివుని పిలుస్తా మట్లా !

సాంబరి అంటే హస్త లాఘవము.

సాంబారు లో హస్త లాఘవం ఉంది కదా ! ?

అయ్యరు గారి సాంబారు కు ధీటై న దేది ?

ఏమిటో మరీ చోద్యం !


:)
జిలేబి
బ్రేవ్ !

Friday, March 2, 2018

బర్నాలు ఎలా చచ్చేడు - ఫ్లాష్ ఫ్లాష్ - ఇన్సైడ్ స్టొరీ



బర్నాలు  ఎలా చచ్చేడు - ఫ్లాష్ ఫ్లాష్ - ఇన్సైడ్ స్టొరీ


బర్నాలు ఓ ప్రముఖ పాత్రికేయుడు. వాడి ప్రశ్నల్లో పదునుంటది. వాడి ప్రోగ్రాం చూస్తా వుంటే మన హార్ట్ బీటు లబ్బు డబ్బు లబ్బు డబ్బని వేగం గా కొట్టేసుకుంటుంది.

అట్లాంటోడు ఓ రోజు అకస్మాత్తు గా బాత్రూం లో కాల్జారి బాల్చీ తన్నేసాడు.

వాడి చానల్ కి పిచ్చి పట్టి నట్టయ్యింది. చానల్ మొత్తానికి వాడే ఏకాకి బెస్ట్ కాకి.

వాడి అరుపులు లేకుండా చానల్ శూన్యం అయి పోవడం తో , వేరే ఏం చెయ్యాలో పాలుపోక చానల్ వారు ,

వాడి స్టైల్ ల్లో నే బర్నాలు ఏల చచ్చేడు? ఎలా చచ్చేడు ఫ్లాష్ ఫ్లాష్ ఇన్సైడ్ స్టొరీ అంటూ కథనం సాగిస్తామని ప్లేన్ వేసుకుంది.

వాడి స్టైల్ వాడి జూనియర్ లకబ్బ లే.

ఏదో ప్రోగ్రాం చేసేద్దామనుకుని చేసేసేరు . అడ్వర్టయిజ్ చేసేసేరు.

అయినా బిక్కు బిక్కు మంటోనే వుంది వారికి. బర్నాలు స్టైల్ మనకు రాలేదే అనుకుంటూ.

ప్రోగ్రాం మొదలెట్టేరు.

లైవ్ ఫ్రం హరిశ్చంద్ర ఘాట్ :) ఓ కెమరా ఘాట్ లో బర్నాలు శవం మీద ఫోకస్ మరిన్ని కెమరా లలో
వేర్వేరు చోటా మోటా వ్యక్తులు డిబేట్ మొదలెట్టేరు.


టీ ఆర్ పీ పడి పోవడం మొదలెట్టింది  ముంబై స్టాకు మార్కెట్టు లా !

చానల్ వాళ్ళు తల పట్టు కోవటం మొదలెట్టేరు.

లైవ్ లో కెమరా మరో మారు హరిశ్చంద్ర ఘాట్ లో బర్నాలు పై తిరిగింది.

ఆవేశం ఆపుకోలేక బర్నాలు దబ్బున లేచాడు. ఐ మీన్ శవం లేచింది.

అక్కడున్న విలేఖరి మైకు ను లాక్కుని శవం శివమై ఊగటం మొదలెట్టింది. ఫ్లాష్ ఫ్లాష్ శవమే ఇన్సైడ్ స్టొరీ ఇక చెబ్తుంది.

టే ఆర్ పీ ధన ధన పెరిగింది :)


చీర్స్
జిలేబి

 

Thursday, March 1, 2018

శ్రీ జయేంద్ర సరస్వతి -నివాళి




ఆత్మానాత్మ పదార్థౌ ద్వౌ భోక్తృ భోగ్యత్వ లక్షణౌ
బ్రహ్మైవాత్మా న దేహాదిరితి వేదాంత డిండిమః





అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్
 
జిలేబి