Friday, March 2, 2018

బర్నాలు ఎలా చచ్చేడు - ఫ్లాష్ ఫ్లాష్ - ఇన్సైడ్ స్టొరీ



బర్నాలు  ఎలా చచ్చేడు - ఫ్లాష్ ఫ్లాష్ - ఇన్సైడ్ స్టొరీ


బర్నాలు ఓ ప్రముఖ పాత్రికేయుడు. వాడి ప్రశ్నల్లో పదునుంటది. వాడి ప్రోగ్రాం చూస్తా వుంటే మన హార్ట్ బీటు లబ్బు డబ్బు లబ్బు డబ్బని వేగం గా కొట్టేసుకుంటుంది.

అట్లాంటోడు ఓ రోజు అకస్మాత్తు గా బాత్రూం లో కాల్జారి బాల్చీ తన్నేసాడు.

వాడి చానల్ కి పిచ్చి పట్టి నట్టయ్యింది. చానల్ మొత్తానికి వాడే ఏకాకి బెస్ట్ కాకి.

వాడి అరుపులు లేకుండా చానల్ శూన్యం అయి పోవడం తో , వేరే ఏం చెయ్యాలో పాలుపోక చానల్ వారు ,

వాడి స్టైల్ ల్లో నే బర్నాలు ఏల చచ్చేడు? ఎలా చచ్చేడు ఫ్లాష్ ఫ్లాష్ ఇన్సైడ్ స్టొరీ అంటూ కథనం సాగిస్తామని ప్లేన్ వేసుకుంది.

వాడి స్టైల్ వాడి జూనియర్ లకబ్బ లే.

ఏదో ప్రోగ్రాం చేసేద్దామనుకుని చేసేసేరు . అడ్వర్టయిజ్ చేసేసేరు.

అయినా బిక్కు బిక్కు మంటోనే వుంది వారికి. బర్నాలు స్టైల్ మనకు రాలేదే అనుకుంటూ.

ప్రోగ్రాం మొదలెట్టేరు.

లైవ్ ఫ్రం హరిశ్చంద్ర ఘాట్ :) ఓ కెమరా ఘాట్ లో బర్నాలు శవం మీద ఫోకస్ మరిన్ని కెమరా లలో
వేర్వేరు చోటా మోటా వ్యక్తులు డిబేట్ మొదలెట్టేరు.


టీ ఆర్ పీ పడి పోవడం మొదలెట్టింది  ముంబై స్టాకు మార్కెట్టు లా !

చానల్ వాళ్ళు తల పట్టు కోవటం మొదలెట్టేరు.

లైవ్ లో కెమరా మరో మారు హరిశ్చంద్ర ఘాట్ లో బర్నాలు పై తిరిగింది.

ఆవేశం ఆపుకోలేక బర్నాలు దబ్బున లేచాడు. ఐ మీన్ శవం లేచింది.

అక్కడున్న విలేఖరి మైకు ను లాక్కుని శవం శివమై ఊగటం మొదలెట్టింది. ఫ్లాష్ ఫ్లాష్ శవమే ఇన్సైడ్ స్టొరీ ఇక చెబ్తుంది.

టే ఆర్ పీ ధన ధన పెరిగింది :)


చీర్స్
జిలేబి

 

10 comments:

  1. There is no like button here for the convenience :)

    ReplyDelete
  2. Where are you Zilebi గారు? మీ మాట / పద్యం వినబడక బ్లాగులోకం డీలాగా ఉంది నాలుగైదురోజుల నుంచీ. కుశలమే కదా? ఎండల తాపమా? ఆరోగ్యం జాగ్రత్తండి.

    ReplyDelete
  3. హ్హ హ్హ హ్హ, ఈ రోజు ఒక పద్యాల బ్లాగులో “బుచికి” గారు “తదీముక్షళ సార్ ఈ అక్షరాలకు అర్థమేంటో చెప్పి పుణ్యం కట్టుకోండి. పెతిరోజు ఈ చిత్ర విచిత్ర అక్షరాలు ఏమైనా కోడ్ భాషా” అని అడిగారు. అదే బ్లాగులో ఆ మధ్య సరిగ్గా అటువంటి ప్రశ్నే నేనూ అడిగాను. జవాబు లేదు. పైగా, ముందు ప్రచురించబడినప్పటికీ తరువాత బ్లాగు వారిచే నా వ్యాఖ్య డిలీట్ చేయబడింది🙁. ఇపుడు “బుచికి” గారు, పాపం ఏమగునో 🙂 ?

    ReplyDelete
    Replies
    1. ఆ పద్యాల బ్లాగు నాది కాదనుకుంటా... ఎందుకంటే బుచికి (జిలేబీ) గారు నా బ్లాగులో సమస్యకు పూరణ మాత్రం పెట్టారు. ఈ 'తదీముక్షళ' గురించి అడగలేదు. అడిగినే నేనైతే చెప్పలేను.

      Delete
    2. మీ బ్లాగ్ కాదులెండి శంకరయ్య గారూ 🙂.

      అక్షరాల్ని చిత్రవిచిత్రంగా కూర్చిన (ఒక్కోసారి చివరి అక్షరం పక్కన వరసగా రెండు సున్నాలు కూడా కనిపిస్తాయి 🙁) టపా హెడింగ్ ఉండే బ్లాగ్ పేరు “శోధిని” లో కనిపిస్తుంటుంది (బహుశః “మాలిక” కు అనుసంధానించలేదనుకుంటాను). ఆ బ్లాగర్ కూడా మీ బ్లాగ్ లో సమస్యాపూరణం చేస్తుంటారు.

      ఇంతకీ “జిలేబీ” గారే “బుచికి” గారని మీరు పైన వ్రాసిన వ్యాఖ్య చదివితే తెలుస్తోంది 🙂.

      Delete


    3. ఇక్కడ యేమియో సూక్షి జరుగుచున్నది !

      ఏమండీ విన్న కోటవారు కంది వారు మీరిద్దరు ఏదో కోడ్ భాషలో మాట్లాడుకుంటున్నారు ?



      జిలేబి

      Delete
    4. @జిలేబి,
      బర్నాలు ఎలా చచ్చేడు అని పోస్ట్ వ్రాసి మాయమయిపోతే బాల్చీ తన్నేసేరేమో అనుకున్నాను.పద్యాలు వ్రాసే బెస్ట్ కాకి కుశలమేనన్నమాట !

      Delete
  4. కోడ్ భాష .. “గురించి” .. మాట్లాడుకున్నాం. ఎటూ తెగక ... వదిలేసాం.

    ReplyDelete
  5. కేర్-ఫుల్ నీహారిక గారూ.

    వేరొక ప్రముఖ బ్లాగర్ విషయంలో గతంలో నేనూ మీలాగే పొరబడ్డాను. తన ఒక టపాలో తెల్లగా కనిపిస్తున్న ఒక పేజ్ బొమ్మ మీద ఇంతే సంగతులు అని వ్రాసి, కింద లైన్లో తన పేరు వ్రాసారు. ఇంకా ఆ పేజ్ పైభాగంలో ఎడమ మూల తన ఫొటో - మబ్బుల్లోంచి చూస్తున్నట్లు - పెట్టారు. అదంతా చూసి నేను కాస్త ఆందోళన చెంది స్నేహభావంతో వ్యాఖ్య పెట్టాను. దాన్ని గురించి తీవ్రంగా తన నిరసనతోను, నన్ను హెచ్చరింపులతోనూ కూడిన తన వ్యాఖ్య మాత్రం వేసుకున్నారు ఆ సీనియర్ బ్లాగర్ - నా వ్యాఖ్య ప్రచురించకుండా. అప్పట్నుంచీ ఆ బ్లాగ్ వైపు చూడడం మానేశాను; చూస్తే ఎప్పడో ఒకప్పుడు - మనకి సరైనదే అనిపించిన వ్యాఖ్య - మర్యాదపూర్వకంగానే - వ్రాస్తూనే ఉంటాము కదా; ఎందుకొచ్చింది, నాకీ స్టేజ్ లో ఇటువంటివి అవసరమా అనిపించింది.

    కొన్ని సంవత్సరాలుగా చదువుతున్నందు వలన యేర్పడిన అభిమానంతో, అవసరమనిపించినప్పుడు మన ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంటాం. దాన్ని కూడా సీరియస్ గా తీసుకుని అంత టచీ గా ఉండే వారికి దూరంగా ఉండడమే మంచిదని నాకనిపించింది. మీరు కూడా అటువంటి పరిస్ధితి రాకుండా చూసుకోమని నా ఉబోస.

    ReplyDelete