Saturday, April 28, 2018

కలువాయి బ్రహ్మ జ్ఞానము :)



కలువాయిబ్రహ్మజ్ఞానము :)


మొన్నేదో ఆశారామ్ భాయి ని జైలు లోకి నెట్టే సే రంటే , ఆహా బ్రహ్మజ్ఞాన పదార్ధం ఇంత గొప్పదా ! ఇంత రక్షణ ఇస్తుందా అని దాంతో తలే ఉంగలీ దబాయీ :)

సరే, ఆంధ్రభారతీ ! జ్ఞానం ప్రసాద అని తలుపు తడితే కలువాయి బ్రహ్మ జ్ఞానం అన్న ముద్దొచ్చే పదం కనపడింది.

పదం కనబడితే ఏమి చేయవలెను ? దాని గణములు ఏ చందము లో ఫిట్టగునో అందులో పెట్టేసి ఓ పద్యం కట్టేయ వలెను :)

కాబట్టి వెంటనే పేరిస్తే, ఫిట్టేస్తే ,

కందం ఒక్కటి తయారయ్యింది :) (ఇదేదో జిలేబి హాంఫట్ తయారి ఇన్స్టంట్ ఎం టీ ఆర్ జిలేబి తయార్ లా అన్నమాట :)

కలువాయిబ్రహ్మజ్ఞా
నుల పల్కుల నెల్ల వినుచు నూతిన్ బడిరే
జలకమ్ము లాడి రే జను
లు లబ్జుగా భళి జిలేబు లూరన్ సుదతీ :)

ఇంతలో బ్లాగ్వైవీయారులు ఓ టపా పెట్టేరు 'సేద్య గురువుల గురించి :) ఆహా టపా ఒచ్చే ముందే కామింటు తయారు గా ఉందే (మా కామింటు ముందొచ్చే, ఆ పైనే బ్లాగ్ జ్యోతిష్యుల టపా - బ్రహ్మ జ్ఞానం గురించి, ఆ పై, వైవీయారు వారి టపా సేద్య గురూస్ గురించి :)) - అంటే జిలేబి వారికి బ్రహ్మ జ్ఞానం ఉన్నట్టే లేక్కన్న మాట :) టపా కన్నా ముందే కామింటు రెడీ చేసేసాం కాబట్టి :) జేకే :)

కట్ షార్ట్ :) - ఈ కామింటు పెట్టేక  కలువాయి అంటే ఏమని శ్రీ మాన్ విన్న కోట వారి పృచ్ఛ :)

నిజం చెప్పా లంటే తెలియదు :)

ఎవరైనా తెలిస్తే చెప్ప గలరు

కలువాయి అంటే ఏమిటి ?


శుభోదయం

జిలేబి

 

38 comments:

  1. పదం వాడిన మీకే దాని అర్థం తెలియదంటారా? అలా ఎలాగండి?

    సరే, కొంత పరిశోధన మీదట కలువాయి అనునది నెల్లూరు జిల్లాలోని ఒక ఊరు అని తెలుస్తోంది. ఆ ఊరి జనాలకేమన్నా జ్ఞానం అధికమేమో మరి? ఆ విధంగా “కలువాయి బ్రహ్మజ్ఞానం” అనే పదం తయారైందేమో?

    నెల్లూరు మాండలికం అయ్యుంటుంది కాబట్టి నెల్లూరు జిల్లా వాస్తవ్యులైన లక్కాకుల వెంకట రాజారావు మాస్టారు ఏమన్నా చెప్పగలరేమో? 🤔

    ReplyDelete
  2. ఆంధ్రభారతి
    కలువాయిబ్రహ్మజ్ఞానంpermalink
    కలువాయి బ్రహ్మజ్ఞానం : మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970 Report an error about this Word-Meaning
    చూ. కలువాయి వేదాంతము. [తెలంగాణము]
    కలువాయిబ్రహ్మజ్ఞానం : మాండలిక పదకోశం (తె.అ.) 1985 Report an error about this Word-Meaning
    చూ. కలువాయి వేదాంతం [తెలంగాణం]
    కలువాయివేదాంతంpermalink
    కలువాయివేదాంతం : మాండలిక పదకోశం (తె.అ.) 1985 Report an error about this Word-Meaning
    ఆచరణ శూన్యమైన నీతులు, అట్టి నీతిని బోధించటం [దక్షిణాంధ్రం]
    కలువాయివేదాంతముpermalink
    కలువాయి వేదాంతము : మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970 Report an error about this Word-Meaning
    మెట్టవేదాంతము, నీతులుమాత్రం చెప్పి ఆచరణ లేని మాటలు; కలువాయి నెల్లూరు మండలములో వెలిగొండలదగ్గర ఉన్న పెద్దగ్రామము; కలువాయి శతకమని ఒక శృంగారశతకము గలదు; కలువాయి బ్రహ్మజ్ఞానము. [నెల్లూరు]

    ReplyDelete
    Replies

    1. లక్కరాజు వారికి

      ఆ పదం ఆంధ్రభారతి నించే కొట్టుకొచ్చేనండి . విన్నకోట వారి ప్రశ్న కలువాయి కి అర్థమేమిటి అని.

      నాకైతే తెలియదు

      జిలేబి

      Delete


  3. పోచిరాజు కామేశ్వర రావు గారు

    కలువాయి సమాసము.
    కలు = ఱాయి, కల్లు (మద్యము);
    వాయి = నోరు
    కలువాయి = ఱాతి నోరు ( దృఢమైన నోరు)
    కలువాయి = కల్లు త్రాగిన నోరు
    గా భావించ వచ్చును.

    కంది శంకరయ్య గారు

    "కల్లు ద్రాగిన నోరు" సరైన అర్థం కావచ్చు. కల్లు ద్రాగినవాడే కదా మెట్ట వేదాంతం పలికేది. ఱాతినోరు అసలు పలుకనే పలుకదు.

    గుండు మధుసూధన్ గారు


    కలువాయి శతకములోని యొక పద్యము:
    సీ.
    సిగ్గింతయును లేక చెల్లెలికై తాను
    గుంటెనకాఁడైన కొంటె యితఁడు
    తన మేనమామను దయ యింతయును లేక
    ద్రుంచివైచిన గొప్పద్రోహి యితఁడు
    జనకుని తోఁబుట్టుఁ జెనక రాదనక యా
    రాధను బొందిన వ్రాత్యుఁ డితఁడు
    కులసతీమణు లింటం గోరి చరింపఁగాఁ
    బరభామల బొందు పాపి యితఁడు
    గీ.
    అనుచుఁ జెప్పుట నిజమయ్యె నతివలార
    యిట్టికఠినాత్ముఁ డిఁక నన్ను నేఁచడఁటరె
    చెలియ నీ వేఁగి కలువాయి చిన్ని కృష్ణుఁ
    దోడుకొని వేగ రాఁగదే తోయజాక్షి!

    -"కలువాయి శతకము" నుండి
    (రచయిత పేరు తెలియదు)

    ***

    సీతాదేవి గారు

    నెల్లూరు జిల్లాలో కలువాయి అనే ఒక ఊరు ఉంది!


    ReplyDelete


  4. కులగోత్రములు రూపు గుణము మానము లేని వానికి న న్నియ్యవచ్చునఁటరె
    నీటుగఁ బాముపై నిద్రించుమాయల వానికి న న్నియ్యవచ్చునఁటరె
    యెల్లజోగుల మనం బిల్లుగాఁ దిరిగెడు వానికి న న్నియ్యవచ్చునఁటరె
    వావివర్తన బంధువర్గంబు లేనట్టి వానికి న న్నియ్యవచ్చునఁటరె

    ఇట్టివానికి మావార లిచ్చినపుడె వడ్లతోఁ దట్ట యెండఁగా వలసివచ్చె
    చెలియ నీ వేఁగి కలువాయి చిన్ని కృష్ణుఁ దోడుకొని వేగ రాఁగదే తోయజాక్షి!

    "కలువాయి శతకము"

    ReplyDelete
    Replies

    1. Source

      http://mallapragadaramakrishna.blogspot.com/2016/02/blog-post_4.html

      Delete

  5. జిలేబి

    గుండు వారు కలువాయి పద్యం లో

    చెలియ నీ వేఁగి కలువాయి చిన్ని కృష్ణుఁ
    దోడుకొని వేగ రాఁగదే తోయజాక్షి!


    ఇందులో కలువాయి చిన్నికృష్ణుడు - కలువాయి వూరి చిన్నికృష్ణుడనుకోవచ్చా ?

    ఈ శతకం‌ మొత్తం పీడీఎఫ్ లింకు ఏదన్నా వుందాండీ ?


    గుండువారు

    మీ ఊహ సరియైనదేనండీ జిలేబీ గారూ!

    పై పద్యం దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు ప్రకటించిన thepictame.com Online Instagram Posts Viewer నుండి సంగ్రహించాను. మీరూ క్లిక్ చేయండి.

    ***

    కలువాయి అంటే కలువల బావి ఉన్న ఊరేమో నని నా అనుమానం. కలువల బావి వద్ద గల ప్రదేశంలో ఎవరైనా యోగి ఉండేవాడేమో. ఆతడందించిన జ్ఞానం కలువాయి వేదాంతమనీ, కలువాయి బ్రహ్మజ్ఞానమనీ పిలువబడేదేమో! పరిశోధించాలి...వాకబుచేయాలి...తెలిసినవారినుండి.

    ReplyDelete
    Replies

    1. Instagram link

      http://www.thepictame.com/share/Bdh43Ppnygb

      Delete
  6. నా ఉద్దేశంలో
    నీతులుమాత్రం చెప్పి ఆచరణ లేని మాటలు;
    చెప్పే వారిని కలువాయి వేదాంతులు లేక కలువాయి బ్రహ్మజ్ఞానులు
    అంటారనుకుంటాను.

    ReplyDelete


  7. సై అనే కలువాయి, అవిశలగల యిల్లు జూపే కలువాయి, బిళ్ళకుడుము మాదిరి రూపాయి తట్టేసి బిగిసికునే కలువాయి.

    సామెతలు 93

    Source

    http://dsubrahmanyam.blogspot.com/2012/03/93.html

    ReplyDelete

  8. కలువాయి వేదాంతము - వావిలకొలను సుబ్బారావు ( వాసుదాసుడు)/ఒంటిమిట్ట వారి హిలేరియస్ నెరేషన్

    శ్రీ భక్తి సంజీవిని మే 1929 పత్రిక


    http://sribhakthisanjeevani.org/sbs/1929/may.pdf&ved=2ahUKEwj4uIyAgt3aAhUMPI8KHV6wBHg4RhAWMAl6BAgDEAE&usg=AOvVaw0qIupwo6IElE_DA-ZUPdUQ


    జిలేబి

    ReplyDelete
    Replies


    1. http://sribhakthisanjeevani.org/sbs/1929/may.pdf

      Delete
  9. కలువాయి అనేది తప్పు. కలవాయి అనాలి. కల+వాయి అన్నమాట. కల అంటే డ్రీం. వాయి అంటే జిలేబీలు వేసే మొదటి వాయి, రెండో వాయి అలా అన్నమాట. మొదటి వాయిలో సరిగ్గా రావు అలాగే చివరిలో నూనె మాడిపోయి బాగుండదు. అందువల్ల కల వాయి అంటే డ్రీం వాయి - డ్రీం జాబ్ లాగా.

    నేను మేధావిని. నేను చెప్పేదే నిజం. ఇంక ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకండి.

    ReplyDelete
    Replies

    1. ఏమోనండీ ! ఈ 'నే మేధావిని ' ఎవరినన్నారండీ ? :)


      జిలేబి

      Delete
  10. కలువాయి అంటే కల్లు తాగిన నోరు అంటేనే కరెక్ట్. సబ్జెక్టు బ్రహ్మజ్ఞాని పూర్వాశ్రమంలో సారా అమ్మినట్టు వికీపీడియా ఉవాచ 😁

    ReplyDelete
    Replies

    1. Please provide source link

      Delete


    2. విన్నకోట నరసింహా రావు

      ఆహాఁ, అది కూడానా YVR గారూ? అవున్లెండి, సారా వ్యాపారి ఓ ప్రముఖ దేవస్థానం బోర్డ్ అధ్యక్షుడుగా చెయ్యగా లేనిది “బ్రహ్మ జ్ఞాని” గా అవతారమెత్తలేడా? “కన్యాశుల్కం” నాటకంలో బైరాగి లాగా.

      “Politics is the last resort for the scoundrel” అన్నాడు బెర్నార్డ్ షా గారో, శామ్యుల్ జాన్సన్ గారో అలనాడు. అది మన దేశానికి ఎలాగూ సరిపోతుంది. దాన్నే కాస్త అటూ ఇటూగా మన గొద్మెన్ కు కూడా అన్వయించుకోవచ్చేమో?"

      Delete


    3. ఎవరండీ ఆ బోర్డు అధ్యక్షుడు ? వైకుంఠం చేరినాయనేనా ?:)


      ఆహా! అదికూడానా ?
      ఓహొ! అవునులెండి ! కల్లు నూరూరా తా
      బాహాటమ్ముగ వెంక
      న్నే హామిగ నమ్మినోడు నెక్కెన్ బోర్డున్ :)

      జిలేబి

      Delete
    4. మీకు సర్వం తెలుసు “జిలేబి” గారు.
      అవునూ, నా కామెంట్ మీ సౌజన్యం తో కనబడుతోందేవిటి?

      Delete

    5. మీకు రిప్లై ఇవ్వబోయి డిలీట్ అయిపొయె; ఆపై మాలిక లోనించి కట్పేష్టు సౌజన్య సౌకర్యం :)


      జిలేబి

      Delete
    6. అప్పిడియా? రొంబ నన్రి 🙏.

      Delete

    7. அடேங்கப்பா என்ன் தமிழ்டாப்பா :)


      ஜிலேபி

      Delete
    8. ??? 🙁🙁🙁
      అయ్యబాబోయ్, నేను అంత ‘అరవ’ లేనండోయ్. అనువాదం ప్లీజ్.

      Delete
  11. తొక్కలో బ్రహ్మజ్ఞానం ఎవడిక్కావాలి?
    కలువాయి ఖయ్యాము అమరుడు కాదటే జిలేబీ!

    ReplyDelete
    Replies


    1. భళిరా! బ్రహ్మజ్ఞానము
      తెలుసా ? పోపో వె భామ దేల మధూళిన్ :)
      కలువాయి ఉమరు ఖయ్యా
      ము లక్షణముగ నమరుండు మూర్ఖ జిలేబీ !

      జిలేబి

      Delete


  12. రాతలో కలువాయ అని ఉన్నా పలుకుబడిలో
    కలవాయి అనే వ్యవహరిస్తారు . నాకు కూడా
    కలవాయి అనేదే సరియైనదిగా తోస్తుంది .
    మా మండలంలో ఈ ఊళ్ళోనే కళావంతులుండేది .
    వీళ్ళల్లో పూర్వం మథుర గాయనీమణు లుండడం
    వల్ల ఈ గ్రామానికి మథుర గాత్రం అర్థంలో కలవాయి
    అనే సార్థక నామం ఏర్పడి ఉండవచ్చు .
    ఇక వీళ్ళ మాయాజాలంలో కలవాయిలో బ్రహ్మజ్ఞానం
    హుష్ కాకి కదా ! అంటే , బ్రహ్మజ్ఞానాలూ ,
    వైరాగ్యాలు వీళ్ళ ముందు ఆట కట్టు ."

    శ్రీ వెంకట రాజారావు లక్కాకుల

    ReplyDelete

  13. హరిబాబు గారిని కోన్కిస్కాలు బ్లాగులు పెట్టి వాయించుటయా ! బ్లాగ్ రింగ్ లీడర్ గతి యేమి యిట్లాయెనో హతవిధీ !





    చిరుజీవి యిక వదిలివే
    యి రచ్చ బండన చెలంగి యిరగోలన గొ
    ట్టిరి హరి బాబును గద! యిక
    సరికొత్తగ బ్లాగు లోన సాధింపులకో :)



    జిలేబి

    ReplyDelete




  14. మళ్ళీ తప్పిరి మాట మీరు గద! శ్రీ మాన్రావు గారూ! భలే
    బిళ్ళంగోడులలాడు బామ్మ వెనుకన్ పేరోయటంచున్ వెసన్
    సల్లాపంబుల బోయిరే తగునకో స్వామీ! ఢమాలే ఢమాల్!
    పళ్ళెంబొక్కటి బట్టి నామ జపమున్ భాసిల్ల జేయన్ తగున్


    జిలేబి

    ReplyDelete


  15. గోంగూర మటను యుమ్మీ
    రంగీ బాగుంటదే పెరట్లో కాస్తే
    బంగారు పిలుస్తా మా
    తంగీ రాయే జిలేబి‌ తప్పని సరిగా :)

    జిలేబి

    ReplyDelete


  16. మహదానందము శాస్త్రీ
    జి! హహ! తెలుగువారమండి జిలుగుతెలుగులో
    మిహిమిల పదముల బేర్చుచు
    సహిష్ణుత గలిగిన కవుల సముదాయముగా :)


    జిలేబి

    ReplyDelete


  17. మనలో మాట! మునుపు నే
    గనలే దండీ మన కవి కంది వరులలా
    గున సాధుపుంగవుల వే
    మన తాతవలెన్ జిలేబి మన్నిక గ‌నిరే !


    జాల్రా జిలేబి

    ReplyDelete


  18. తప్పులు చేసే స్వేచ్ఛయు
    నప్పెడు రీతిని సమర్థ నగ స్వాతంత్ర్యం
    బప్పా కావలెను మనకు
    చెప్పెను బ్లాగ్భామయే సుశీల జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  19. ఓయి జిలేబీ నీక
    న్నా యెవరున్నారు పెద్ద నామోషీ గా
    ఖాయరు గొట్టం కోన్కి
    స్కాయెవరే ? నీవుకాద సదనంబందున్

    ఆహా! ఎక్కడో తగలాల్సినది వేరే యెక్కడో‌ గుచ్చుకున్నదా ? లేక ఒక బొచ్చే బొచ్చా :)

    అంతా విష్ణు మాయ వీ యై పీ యే :)


    జిలేబి

    ReplyDelete


  20. ఓహో ! యేడుపు యీమో
    జీ! హా హా! చక్కనయిన జీభర్ సాంగ్సా
    యే! హాచ్ యటంచు తుమ్మట
    మే! హాల్టు సుమా జిలేబి మేమ్ సాహెబ హా !

    జిలేబి

    ReplyDelete


  21. ఆడ దోమలే యెందుకమ్మా జిలేబి
    కుట్టు? ప్రశ్నేయిది? భళిర కుట్టటమను
    నది పడతుల కచ్చొచ్చిన నడక మాన
    వాగ్రణీ విల్లు విడిచిన బాణము వలె :)

    జిలేబి

    ReplyDelete


  22. పెళ్ళి చూపుల కొచ్చిరి పెండ్లియైన
    పూవు బోడులు నరసన్న! పొట్టి వాడు
    గట్టి వాడు జిలేబుల కష్ట కాల
    ముతొలగను పారితోషికములను జేర్చె

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వచ్చిన వారు మేజువాణీ పార్టీతో వచ్చే వృద్ధవనితల్లాగా వచ్చారా అయితే ?

      Delete