Wednesday, May 16, 2018

నిర్ధారిత సమయ సర్వ దర్శనము :)



నిర్ధారిత సమయ సర్వ దర్శనము :)


లచ్చిందేవి కాళ్ళొత్తే టప్పుడు స్వామి వారు అరమోడ్పు కనులతో తననే చూసే వారను కునేది .

అదేమిటో ఈ మధ్య అరమోడ్పు కనుల చూడటం మానేసేరు స్వామి వారు. ఛ ! తన పై యక్కర తగ్గిందే స్వామి వారికి అనుకున్నది దేవేరమ్మ.


ఏండ్ల తరబడి నిలబడి వున్నా, ఉస్సూరనక, వచ్చే లక్షలాది భక్త జన సమూహం లో తప్పీ 'తవరీ' ఎవరైనా ఓ నిజ మైన భక్తుడు వచ్చేస్తాడే మో , వాణ్ణి తాను చూడ కుండా జోగేస్తానే మో అన్న బెంగ తో యోగ నిద్ర లో ఉన్నా , అరమోడ్పు కన్నులైనా తెరిచి చూసే కొండల రాయుడు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చు కున్నాడు నిర్ధారిత సమయ సర్వ దర్శనం అంటూ తనని చూడ టానికి ఆధారు కార్డు తో సహా రిజిస్టరు చేసు కొని 'స్లాటడు' సమయం లో నే యిక భక్తులు వస్తారని తెలుసు కునేక!


ద్వార పాలకుల ని పిల్చి ఆ రిజస్ట్రీ చూసి ఎవడైనా నిజమైన భక్తుడు వస్తే చెప్పండే అని ఆర్డరు వేసారు స్వామి వారు.

అప్పటి నించి తీరికే తీరికయి పోయింది. ఇప్పటి దాక జయ విజయులు ఒక్క కేసు కూడా తన ముందు పెట్ట లే :)

హమ్మయ్య అరమోడ్పు కనులవసరం లే !

నిజమైన భక్తుడు వస్తే ఎట్లాగూ జయ విజయులు తెలియ చేస్తారు ముందస్తే .కాబట్టి తానిక అరమోడ్పు కనులతో జాగారం చేయాల్సిన పని లే భక్తి కోటి కై !

సో, ఆ షెడ్యూల్డ్ టైం, అప్పాయింటడు టైం లో  కొంత కండ్లు తెరిచి ఆ వచ్చే భక్తుణ్ణి చూసేస్తే సరి అనుకుని స్వామి వారు మళ్ళీ కునుకేసారు.


లచ్చిందేవి కాళ్ళొత్తు తూ ఉండి పోయింది విచారంగా. కొండ పైనే మో స్వామి వారు నిలబడి పోయేరు హాయిగా .


జై శ్రీ మద్రమారమణ గోవిందో ! హరీ !


జిలేబి

 

82 comments:



  1. సమయ సీమిత సర్వ దర్శనము భక్త
    జనుల కిక శేష శైలవాస !తిరు వేంక
    టాద్రి నిలయ వాసుడ మా కటకట లెల్ల
    తీర్చి నావయ్య కొండపై తీరు గాను !

    జిలేబి
    Slotted Sarva Darshan

    ReplyDelete

  2. అమావాస్య వచ్చె దుర్ఘటనలొచ్చె జ్యోస్యము వచ్చె :)


    నిన్న అమావాస్య గదా!
    నిన్నటి దుర్ఘటనల గమనించేరా ? వా
    టన్నిటి కి నమావాస్యయె
    మిన్నగ కారణమయ! వినుమీ జ్యోస్యమయా !

    జిలేబి

    ReplyDelete


  3. గుండె లో నుండి కడుపునకు వెడలెడు క
    నబడని నరము నెవరో మనకు తెలియక
    లాగి వేసినట్లయె పద్మ ! లావు సడలె
    నమ్మ మాకు జిలేబియ ! నమ్ము మమ్మ :)

    జిలేబి

    ReplyDelete


  4. హృదయా వేదన నిచ్చెన
    ను దిగనటంచున్ జిలేబి నూతిన్ బడెనే!
    సుదతీ పద్మా జాగ్ర
    త్త! దామినిగ నిలువనేల తరమిది కాదే !

    జిలేబి

    ReplyDelete


  5. ఈ కల వరమ్ములున్ సయి
    నీ కన్నీళ్లున్ జిలేబి నెమ్మి పలుకులున్
    నీ కిక వత్తాసు పలుక
    దే కరుడున్ గట్టె గుండె దిరిసెన పువ్వా !

    జిలేబి

    ReplyDelete


  6. వగచుచు కన్నీరేలా
    పగలున్ రేయిని జిలేబి పద్మార్పిత! నీ
    కు గరిక పాటియు లాభమి
    క గలుగ దే నమ్ము మమ్మ ఖచ్చిత మిదియే !

    జిలేబి

    ReplyDelete


  7. మనసున్ దోచే వుగదా
    వనితా పద్మా జిలేబి వయ్యారపు భా
    మ! నవీ నకవిత లకు నీ
    వునాణ్య మైన నికషమ్ము ! ఉవిద భళిభళీ !

    జిలేబి

    ReplyDelete


  8. ఎప్పుడు మొయ్యా లో మరి
    యెప్పుడు తొయ్యవలెనో స్టయిలుగా భయ్యా
    గప్పున తెలుసుకొనుమయా
    తప్పక మేలగును పచ్చ దవురు జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  9. మనసు పొరల పద్మా గా
    ట్లన గురి చేస్తున్నవమ్మ టాక్ ఆఫ్ దిటవున్
    గ నిలిచినావు కద! జిలే
    బి!నా మదిని తొలిచివేసి పిప్పిని చేసేవ్ !

    జిలేబి

    ReplyDelete


  10. మౌనము వీడిరి గురువులు
    మానసమున్కొందలపడ మహిని జిలేబీ!
    స్థానము తప్పెడు తితిదే
    హీనపు పనులకిక శిక్ష హేరాళంబే!

    జిలేబి

    ReplyDelete

  11. దత్తపది- దేవకి - యశోద - సుభద్ర - రాధ
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
    రామాయణార్థంలో

    రారా! ధరణిజ రమణా!
    నీ రాకకు మనసు, భద్ర, నిమ్మళము గనెన్
    మీరలు యశోదయులయా !
    కీరము లివియేను దేవ ! కింకరిని ప్రభూ!


    జిలేబి

    ReplyDelete


  12. రామ! రారా! ధరణిజవర! గుడిసె యిది!
    దేవ!కింకరి సేవ యిదేనయ ఫల
    ముల యశోదయడ గొనుమ! మోదమాయె
    మనసు! భద్ర! శబరినయ మదియు నిండె!

    జిలేబి

    ReplyDelete


  13. భజన పరుల దేశమ్మున
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్,
    సుజనుల పైనెగి రెనయా
    యజమాని తొడుగుల నక్క యగుచున్ తితిదే!

    జిలేబి

    ReplyDelete


  14. అరరె! రిసార్టుల లో దా
    చిరి కర్నాటకము నందు చికుబుకు లాట
    ల్లరరె మొదలికన్ చూతమ
    య రాజ కీయ వరవిక్రయమ్ముల రేట్లన్ :)

    జిలేబి

    ReplyDelete


  15. కొబ్బరి చిప్పల దేవుడి
    కబ్బబ్బో టోకరా టకాల్మని వేసే
    రబ్బో, కర్నాటకమం
    దబ్బోడా టోకరుకిక తగ్గెదరబ్బా ?

    జిలేబి

    ReplyDelete
  16. పేరు గాంచిన పోలీస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా “జె.డి. లక్ష్మీనారాయణ” అనే అంటారేవిటో? (ఇప్పుడే ఒక “సరస .... “ బ్లాగ్ లోని పోస్ట్ లో చూశానులెండి). జె.డి. వారి ఇంటిపేరు కాదు. డెప్యుటేషన్ మీద సి.బి.ఐ. లో చాలాకాలం జాయింట్ డైరెక్టర్ (జె.డి) గా పని చేస్తున్నప్పుడు మన మీడియా వారు జె.డి. లక్ష్మీనారాయణ అంటుండేవారు. చివరికి అదే శాశ్వతం చేసేసారు, జనాలకీ అలవాటు చేసేసారు .... మీడియా వారు. ఆయన సి.బి.ఐ. నుండి తన పోలీస్ శాఖకు తిరిగి వెళ్ళిపోయిన తరువాత కూడా అదే వరస, పాపం 🙂. మన మీడియా వారి మహిమలెన్నెన్నో కదా !🙂.

    వారి అసలు పేరు వి.వి.లక్ష్మీనారాయణ.

    ReplyDelete
    Replies


    1. ఎవరండీ ఈ లక్ష్మీ నారాయణుడు ?

      ಜಿಲೇಬಿ

      Delete
    2. మీరీ ప్రశ్న సీరియస్ గానే అడుగుతున్నారా, “జిలేబి” గారూ 🤨? ప్రముఖ IPS ఆఫీసర్ లక్ష్మీనారాయణ పేరు వినలేదంటారా? ఓహో, మీరు ప్రవాసులు కదా, అందువలనేమో?

      పలు పెద్ద పెద్ద అవినీతి ఆరోపణల కేసుల విచారణ నడిపించిన ఆఫీసర్ .... మచ్చుకు .... గాలి జనార్ధన రెడ్డి (ఓబులాపురం మైన్స్), రామలింగరాజు (సత్యం కంప్యూటర్స్), అన్నిటి కన్నా ప్రాముఖ్యత సంతరించుకున్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేసు .. వగైరా. ఇంత హై ప్రొఫైల్ కేసుల ఇన్వెస్టిగేషన్లు నడుస్తున్నంత కాలం z-category సెక్యూరిటీ ఇవ్వబడిన ఆఫీసర్. నిజాయితీకి పేరు గాంచినవాడు. రాష్ట్రపతి పోలీస్ మెడల్అం దుకున్నవాడు. మహారాష్ట్ర పోలీస్ శాఖలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. సంఘసేవ చేస్తానంటూ మొన్నీ మధ్యే రాజీనామా చేసినవాడు (అలనాడు సీనియర్ IAS ఆఫీసర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ రాజీనామా చేసి లోక్ సత్తా పార్టీ పెట్టినట్లేమో 🙁🙁). ముఖ్యంగా తెలుగువాడు 👍.

      ఇప్పుడు తెలిసిందాండీ?

      Delete


    3. When you hear straight from Horse's mouth దాని మజాయే వేరు :)


      జిలేబి

      Delete
    4. ములగ చెట్టు, ములగ చెట్టు ... 🙄

      Delete


  17. ములగ చెట్టు పైన ముదిత, నెక్కించకు
    ముదిమి వయసు వారము వినుమా జి
    లేబి ! తెలియ గాను లెస్సగ చెప్పినా
    జేడి కథను విను కచేరి నందు :)

    జిలేబి

    ReplyDelete
  18. ప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు (80) ఈ రోజు ఉదయం విజయవాడలో కాలం చేశారని తెలిసింది. వారు మాకు లయోలా కాలేజ్ లో లెక్చరర్ కూడానూ 🙏.

    వారి ఆత్మకు శాంతి చేకూరుగాక 🌼🌼.

    ReplyDelete
    Replies


    1. RIP

      ఇంగువ కథ పూర్ణాహుతి!
      భంగ పడిన నల్పజీవి పాత్రల ములుగుల్
      సింగారవేలు,తిరుపతి!
      రంగమదియె పెద్ది భొట్ల రచనలకు గదా !

      జిలేబి

      Delete
    2. సింగారవేలు కీ కొళందవేలు కీ తేడా ఏమన్నా ఉందా “జిలేబి” గారూ?

      Delete

    3. సింగార వేలు - సుందర వేలు - సుందర సుబ్రహ్మణ్యుడు
      కొళంద వేలు బాల వేలు - బాల సుబ్రహ్మణ్యం


      జిలేబి

      Delete


  19. పసయున్ లేక జిలేబీ
    వెసయున్ లేక నరరే కవివరుల పదముల్
    గెస పోసెడు కూర్పైన య
    రసమయకావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్.

    జిలేబి

    ReplyDelete


  20. మరో ప్రభంజనం వస్తోందా ?


    భారమును నెత్తి కెత్తితి వయ్య! మోడి!
    శిష్టులను నీదు సభలోన చిరు వడియును
    దూరమున నుంచగఁ దగదు ; ధూర్తజనుల
    కెడవు నన్బెట్టవలయును కీడు బోవ!

    జిలేబి

    ReplyDelete


  21. ఆరు నెల్ల సావాసముంటే వారు వీరవుతారని వూరికే అన్నారా :) జిలేబి పైకూ లను చదివి చదివి నీహారికకు కూడా వాక్యాలకు వాక్యాలు తేటగీతి లో యిమిడి వచ్చేస్తుండాయి :) జిలేబీ సెబాసో :)


    అహపు నడ్డుగోడలు తొలగాలనిన జి
    లేబి మరల జన్మించ వలె విను మమ్మ
    పద్మ నీహారికయు భళి పల్కె తేట
    గీతి పాదపు వాక్యము గీర యంటె :)

    జిలేబి

    ReplyDelete


  22. దూరమున నుంచగ దగదు ధూర్తజనుల
    నెప్పు డైనను! మనపక్కనే నిడుకొన
    వలెను నొకకన్ను వేసి గవనము సల్ప
    వలె జిలేబి, వారిని దొక్కు పాగెమదియె:)

    జిలేబి

    ReplyDelete


  23. పైకూ పద్యముల చదువ
    గా కపికందుకము వేడి గాంచె జిలేబీ
    మా కేలనకో బాధయు
    నీ కర్మయుచుట్టె మమ్ము నీరజ నేత్రా!

    జిలేబి

    ReplyDelete


  24. నాటి తప్పటడుగుల పొన్నారియ సరి
    దిద్దు కొనవీలగునటే? పదిలము గాంచె
    నీదు మదిలోన ముద్రలు నిన్ను వీడు
    నా జిలేబి ? సాధ్యంబగునా శుభాంగి !

    జిలేబి

    ReplyDelete


  25. అక్కా! మీ భావమకో
    చక్కా విడిబోవ మరల సయ్యాటలకో ?
    పక్కల పైన చెలిమియు
    న్నిక్కము గా వీడదా? పునీత జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  26. మీరెట్లాచెయ్యమనిన
    ఓరయ్యోశర్మ బ్లాగు జోతిష్కుడ, చే
    స్తా, రయ్యన కావుమయా !
    పోరా పింజారివెధవ పోరి కులుకులున్ :)

    జిలేబి

    ReplyDelete


  27. జెనివా లోతిరుమల రా
    యుని నగ వేలమ్ము బోయె యుక్తియెవరిదో!
    గునిసె, రమణదీక్షిత వ
    ర్యుని తుదమడచ, తితిదే!తిరుమలేశా సీ !

    జిలేబి

    ReplyDelete


  28. శ్రీ వారి నగలకు జిలే
    బీ! వా! కాళ్ళొచ్చె నమ్మ వేలము బోయెన్
    బావాజీ కాలపు కథ
    యీ వేళ మరల తిరుమల యితిహాస‌మునన్ ?

    జిలేబి

    ReplyDelete


  29. ప్రేమ సాగరమున నీది విడివడుచు జి
    లేబి మరల‌ కలుసుకొన లేవు పద్మ !
    సాధ్య మిది కాదు కదవే ! వెసపడ నేల
    పోరి ఊహకు అందక పోతి వమ్మ :)

    జిలేబి

    ReplyDelete


  30. వృద్ధాశ్రమమున నమ్మను
    పెద్దల బాధ్యతగ నుంచ వెరచన్నేలా ?
    ముద్దుగ మెచ్చిరి వారిని
    సుద్దుల కై యమెరికాకు చువ్వని‌ బోవన్ !

    జిలేబి

    ReplyDelete


  31. మధు కలశము చేతిని బ
    ట్టి ధుతపు బాణము వలె మజ టింగుగ యెంచ
    క్క ధిగధిగ చమక్కులతో
    మధించినావు గద‌ మదిని మసలాడివి బో :)

    జిలేబి

    ReplyDelete


  32. అపరిచితుల మవుదామో
    యి! పరిచయంబయ్యెదము పయిదలి మరొకమా
    రు! పరువపు తేరు నెక్కెద
    ము! పరుగు లన్విడువక మజ ముందుకు పోదాం :)

    జిలేబి

    ReplyDelete


  33. ప్రజలు మూర్ఖులు! గెలిపింప పాలకులను
    నాట లాడుచుండిరి 'కర ' నాట 'కమల '!
    రాజకీయము మనదయ్యె రాజ భోజ్య
    ముగ జిలేబి జనుల తోడు ముద్దు గాన :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మల రాజకీయం చేసిన గవర్నర్ ని కరం తో కాదు చెప్పుతో కొట్టాలని ఉంది.

      Delete


  34. పిండా కూడు చదువుల
    న్నిండా చదివితివకో? పనియు పాటాలే
    కుండా తిరిగితివే? యే
    మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్ ?

    జిలేబి

    ReplyDelete


  35. మండెను నెండలు లవిసెను
    గుండెలు! బడెను వడగళ్ళు గూటిన్ చేరెన్
    దండిగ జనాళి, కలువన్
    మండూకము, గర్భమందు మనుజుఁడు పుట్టెన్ !

    మండు - జ్వలించు ; ఉకము - ఆహ్లాదము మండూకము - జ్వలించు ఆహ్లాదము :)

    నారాయణ :)
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. // “మండూకము - జ్వలించు ఆహ్లాదము :) ” //

      ??? 42 డిగ్రీల ఎండాకాలంలో చెప్పండీ మాట 😨.
      అయినా అలా రెండు భాషల మాటల్ని కలపకూడదట కదా 🤔 ?

      Delete

    2. సభలో ఆ కలువాయికి అబ్జెక్షన్ రాలేదండీ కాబట్టి సరియే అనుకుంటా :)

      BTW రెండు పదాలు సంస్కృతంలో ఉన్నాయి :)

      కాబట్టి కలువాయి కాదేమో :)

      జిలేబి

      Delete
    3. “మండు” కూడా సంస్కృత పదమాండి?

      Delete

    4. ఇవ్వాళ మీరు తాడో పేడో తేల్చుకోవాలని‌ డిసైడ్ అయిపోయినట్టున్నారే :)

      రెండూ తెలుగు ఆంధ్ర పదాలనుకుంటా :)


      జిలేబి

      Delete
    5. రాజకీయ సలహాదారు, నా చిరకాల మిత్రుడు డి.ఎ.సోమయాజులు ఈ రోజు మరణించాడనే విచారంలో ఉన్నాను. సో ... ఇవాళ్టికి ... నో తాడు, నో పేడు.

      Delete


  36. నిండెన్నలుబది యేండ్లున్
    గుండమ్మకు పిల్ల లింక గూడక‌ బోవన్
    మెండుగ కాచిన చారవ
    మండూకము గర్భమందు, మనుజుఁడు పుట్టెన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. చారవ ???
      మండూకము meaning ???

      Delete

    2. మండూకము కాచిన చారు (సూప్) అవగ - కాచిన చారవ మండూకము

      Frog soup :)

      జిలేబి

      Delete
    3. అక్కడ మండోదరికి సీత పుట్టిందన్నారు....ఇక్కడ గుండమ్మకి మనుజుడు పుట్టెన్ అన్నారు..."నార"ది వ్యాఖ్యలు దేనికి సంకేతమో ????

      "నారా" యణ !

      Delete


  37. ఈ పాటికి పైకూలకు
    నీ పుర్రె పగులగ లేద ! నే నమ్మను బో
    రాపాడిరి శర్మయు భళి
    గోపిక యాడికి వెడలెను గోవర్ధనుడా :)

    జిలేబి

    ReplyDelete


  38. వ్యాసులను యనానిమసులు
    రాసే వారంట నాడు రాతల నెల్లన్
    కోసేరు కతల కేతను
    లా సక్కయనానిమస్సు లగుచు జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete
  39. పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథల సంకలనాలు ఆన్లైన్ లో ఎక్కడ దొరుకుతాయో ఏమైనా చెప్పగలరా ప్లీజ్?

    ReplyDelete


  40. కప్పలకు పెండ్లి జేసిరి
    యప్పల రేపులకు దోసి యయయో దేశం
    బప్పా వేదములకు వే
    రప్పా ! కర్మఖగవతి బిరాదరి యిదియే !

    జిలేబి

    ReplyDelete


  41. అందము దేశమునకహో
    కందములను వ్రాయు కవులు; గాడిదలు గదా
    కొందళపడుయజ్ఞాతలు
    ఛందము మేధస్సునకు పసందు జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete
  42. // “Frog soup :)” //

    ఆగ్నేయాసియా ప్రాంత వంటకమా “జిలేబి” గారూ? యక్ 🤨.

    ReplyDelete


  43. పరువున్ బోవ నిహతి సతి !
    మరియెక్కడ బోయెదనని మరలమరల ఢ
    క్కిరవణుడు వెక్కి యేడ్చుచు,
    నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్!

    జిలేబి

    ReplyDelete


  44. మరుగున బోవన్వేదము,
    పురడింపక బోవగాను బుద్ధుని మార్గం
    బరయుచు శంకరు డై భళి
    నరుఁడయి, జన్మించె ఫాలనయనుం డలుకన్!

    జిలేబి

    ReplyDelete


  45. ధర పద్యపు ప్రభ నిలుపగ
    నరుఁడయి జన్మించి, ఫాలనయనుం డలుకం
    గ రసమయ పద్యముల, భళి
    పరుగుల శంకరుని కొల్వు పాటిగ చేరెన్ :)

    జిలేబి

    ReplyDelete


  46. గురుడతడు! గౌడ పాదుని
    సరసన్నద్వైతమున్ వెస గరచి వెలుగై
    పరమాత్వ తత్త్వము తెలుప
    నరుడయి జన్మించె ఫాలనయనుండలుకన్!

    జిలేబి

    ReplyDelete


  47. పొద్దనక రాత్రనక రాసి పూరణలను
    నలత బడిన కండ్ల నులిమి నాను నిదుర
    ముంచు కొచ్చె! 'అయినకల' ! ముద్దు గాను
    నన్నయాదులు మెచ్చిరి నా కవితను :)

    జిలేబి

    ReplyDelete


  48. చాలును నీదు జిలేబీ
    గోలలు జీవనములోన గొప్పల కున్ బో
    నేల? పడతి మన సారా
    మేలగు భజియింపహరిని మేధాజీవీ !

    జిలేబి

    ReplyDelete


  49. రబ్బరు బుగ్గల పువుబో
    డబ్బబ్బో రాంసిలక ! మడతెడత లబ్డబ్
    డబ్బను గుండెకు లోపల !
    లబ్బరు లాలవ్వులోన లావై పోయా :)

    జిలేబి

    ReplyDelete

  50. అంశము - మహాభారతంలోని ఏదైనా సన్నివేశం.
    ఛందస్సు- మత్తేభము (లేదా) తేటగీతి
    న్యస్తాక్షరములు...
    నాలుగు పాదాలలో యతిస్థానంలో
    వరుసగా రా - రా - పో - రా ఉండాలి.

    రపరప మొదలు ! భీముడ! రార దుష్ట !
    రమ్మ ! తొడలుకొట్టి తివిగ రా! విరిచెద!
    పొలతి నీడ్చితివి సభను! పోరి తొడ న
    రముల బట్టి లాగెద నీదురా!ప్రతిజ్ఞ!

    జిలేబి

    ReplyDelete


  51. వలదు వలదు రణమిక వలదు అర్జున ఉవాచ కిషన్ జీ సే :)


    రణమిది వలదు యవనారి రాలగొట్టు
    రావడియు వలదయ కృష్ణ! రాజిలదయ
    పోరును విడుతు కుదరదు పోయెదనిక
    రాజ్యము వలదు శాంతియె రాధనమయ!

    జిలేబి

    ReplyDelete


  52. రాత్రి లక్కాగృహమ్మిక రాలిపోవు!
    రయమునన్నందరిని ధర్మ రాజు తంబు
    భుజములపయినిడుకొనుచు పోయెనట సు
    రంగ మార్గము భళిభళిరా యనుజుడ!

    జిలేబి

    తంబు - తమ్ముడు ఆంధ్రభారతి ఉవాచ

    ReplyDelete


  53. అదిగో హిందూ గర్జన !
    అదిలా బాదున మొదలయె యజ్ఞంబదిగో !
    పదిలంబాయెను శక్తిగ
    కదిలెను పూర్ణంబహో చకచక యనుచహో !

    జిలేబి

    ReplyDelete


  54. అదిగో పూర్ణానందుడు!
    అదిగదిగో గర్జన భళి అదిలాబాదున్
    సదనంబుగా గొనెనయా!
    పదిలంబాయెను తెగింపు భారత్ కీ జై !


    జిలేబి

    ReplyDelete


  55. పరలోకపు జీసెసు కట
    కరముల మోడ్చిరయ మోడి కాకూడదికన్
    మరియొక మారు ప్రధానిగ!
    దరసల్ లవ్వాలు మోడి తప్ప జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  56. కందెనట మోము చెప్పగ కన్నులార
    నంది యందని యందమే విందొసంగు!
    పందె ములనొడ్డి చూసిరి భామ లనట
    యంది నన్ మేలగున యని యవ్వనులట !

    ReplyDelete


  57. మా అయ్యరు గారి పల్కు :)

    ముద్దు లొల్కు జిలేబిని మొగదలగని
    యంది యందని యందమే విందొసంగు
    నో యని మధనపడి తాళినొకపరి ముడి
    వెట్టి దరిజేర్చి జూడ గుభిల్లె మదియు :)


    జిలేబి

    ReplyDelete


  58. కందంబు తేట గీతిగ
    ఛందస్సులమార్చి జూడ చక్కన గునకో?
    డెందము మారక బోవగ
    నెందెందేదియును మార్చ నేమిఫలితమౌ :)

    జిలేబి

    ReplyDelete


  59. విరిగిన మనసున నలజడి
    పరుగిడె పరిపరి విధముల పడతి జిలేబీ
    కరుణారహితుడయెనతడ
    రరెనిన్విడి పద్మ నయన రత్నాంగి చెలీ !

    జిలేబి

    ReplyDelete


  60. పామరి! భావముల తెలుప
    భామా పరిపూర్ణత సముపార్జింప తరం
    బో?మాలిని నెదుటి జనుల
    నీమముగా నర్థముగను నీ వ్యధ తొలగున్ !

    జిలేబి

    ReplyDelete


  61. అభిమానులార! అక్షర
    పు బిగి పరిచయస్థులార! పువుబోడియ ప
    ద్మ బిలబిలాక్షి కవితలన్
    సభలో అనునిత్యము మజ చదివిరయ నమో!

    జిలేబి

    ReplyDelete


  62. భారతము నాకు తెలుసు! సుభగత!, పూవు
    బోడి, చెప్పవమ్మ జవాబు బుద్ధి మంతు
    డైన వీరుడెవవడోయి, డంక తనపు
    వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు!

    జిలేబి

    ReplyDelete


  63. కౌరవులు వచ్చి పడినను ఖాతరు భళి
    చేయ కుండ ధైర్యము గాను చేతు యుద్ధ
    మనుచు వెడలెనతండు సుమా ! జిలేబి,
    వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు.

    జిలేబి

    ReplyDelete


  64. మునిగోటిరామ శర్మ క
    వి! నమస్సులు గొనుడయా సవినయముగా! న
    చ్చెననుచు మెచ్చుచు తియ్యం
    దనమనిరి! నెనరులివియె యథాశక్తిగనౌ !

    జిలేబి

    ReplyDelete


  65. ఆహా! తియ్యందనమిది
    బాహాటమ్ముగ జిలేబి బ్రాండిది సుమ్మీ !
    జోహారులు శర్మన్! మా
    యాహూ కందము గొనుడు వయనఫలకమునన్

    జిలేబి

    ReplyDelete


  66. పుచ్చ కాయ కథల తోడు బుచికి పాట
    గట్టె మీడియా వారపు కాలమయ్య
    దాని మీదు మీ సొదయిది దక్కె మాకు
    సంపుకు తినిరి మళ్లీ కసబిస యనుచు

    జిలేబి

    ReplyDelete