Monday, May 21, 2018

మండోదరి తనయ సీత మహిని జిలేబీ (ద్రవిడ రామాయణం ) :)




జిలేబి వారి ద్రవిడ రామాయణం
 
 
వామ్మో సీత మండోదరి కుమార్తె యా అని దాంతో తలీ ఉంగలీ దబాయీ :)
 
ఏమండీ ఈ కథ కు మూలం మరీ అవాల్మీకీయం గా ఉందంటే అద్భుత రామాయణం అని చెబ్తే
 
చూద్దారి ఈ 'అద్భుత' రామాయణం అని గూగ్లించి ,
 
ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో ఓ సో కాల్డ్ సంస్కృత హింది అద్భుత (' అత్యాద్భుత :))
 
రామాయణాన్ని తీసి చదివితే
 
వ్యాక్  అని వాంతి చేసు కోవాల్సి వచ్చింది !
 
కత మరీ జిలేబీయం ఇంతా అంతా కాదు నూటికి నూరు పాళ్ళు పుక్కిటి పురాణమే అన్నట్టు అనిపించింది.
 
హమ్మయ్య ఈ రామాయణం రంగనాయకమ్మ గారి కళ్ళ బడకుండా ఉండి పోయింది కదా అని సంతోష పడి పోయా !
 
లేకుంటే వారి కళ్ళ బడి ఉంటే మజా యే మజా మరో దుమారం రామాయణ జిలేబి వృక్షం అని మరో పొత్తం వచ్చేసి ఉండేది :)
 
 'గొలుసు' నవలలు  వచ్చేవి. ఓ రచయిత విడిచిన భాగాన్ని ఊహా పూర్వకం గా మరో రచయిత అందుకుని కథ సాగించడ మన్న మాట :) అట్లా అతుకుల బొంత ఈ అద్భుత రామాయణం (మధ్య లో పదకొండో సర్గ లో ఎవడో మహాను భావుడు సాంఖ్య యోగాన్ని రాములోరి చేత హనుమంతుడి కి ఉపదేశం కూడాను :))
 
అక్కడక్కడా దొరికిన పేజీ లకు ముందూ వెనుకా కథ ల గట్టి మరీ ఓ నవల రాస్తే ఎట్లా ఉంటుంది ? అలా ఉంది.
 
ఈ సీత జన్మ వృత్తాంతం ఎనిమిదవ సర్గ లో వస్తుంది ఈ పుస్తకం లో . దానికి ముందు యేడు సర్గ లు వారెవ్వా ఏమి కథ రంజు గా కట్టే రండీ బాబోయ్ :)
 
ఒక్క సర్గ ముందు మా నారదుల వారు , శ్రీ కృష్ణ పరమాత్ములు, రుక్మిణి, సత్యభామ జాంబవతి కూడానూ రామాయణం లో పిడకల వేట కై వస్తారు :)
 
ఇప్పుడు వీటిని చదివేక నేను ద్రవిడ జిలేబీ రామాయణం రాద్దా మనుకుంటున్నా :)
 
ఇప్పుడు రాబోయే కాలానికి జిలేబీ రామాయణం కత టూకీ గా :)
 
 
(సందులో సడే మియా ద్రావిడ సీత కత తయార్ :) - ఈ రామాయణాన్ని కూడా రాబోయే కాలం లో వాల్మీకి ప్రణీత అని చెప్పేస్తారన్న ఆశయం తో :))
 
 
 
ఓ రోజు మండోదరి కళ్ళ నీళ్ళు బెట్టు కుంటూ రావణుడి దగ్గరకు వచ్చి ఫ్లాషు బ్యాకు చెబ్తుంది  -
 
స్వామీ ! మునులను జయించి , విజయసూచకముగా, వారి రక్తాని పూర్వం ఒక భాండం లో పెట్టేవు.
 
ఆ భాండాన్ని అంతకు మునుపు వంద కొడుకులున్న కత్స్నమదుడనే బ్రాహ్మణుడు తన యిల్లాలి కోరిక యై, లక్ష్మి తన యింట పుట్టాలని కోరుకుంటూ పాలను చేరుస్తూ, ప్రార్థిస్తూ వచ్చిన భాండము.
 
అందు మునుల రక్తముం గలిపి, యది విషమని, దానిని దాయుమని నీవు నాకిచ్చేవు. ఆ పై నువ్వు సందులో సడే మియా అన్నట్టు కన బడ్డ అప్సరసల వెంట పోయేవు.
 
నా కపకార మొనర్చుచున్నా వనుకుని , బలవన్మరణ మందుటకై, యా భాండమందలి ద్రవమునుం ద్రావఁగా, నాకు గర్భమైనది.  నీవే మో పర కాంత ల వైపు వెళ్లి ఓ సంవత్సర మైనా యింటి పట్టున ఉండక పోతివి . ఇప్పుడు గర్భ మాయె ! యెట్లా అని చింతించి
 
ఆ విషయమును నీకు దెలుప వెఱచి, తీర్థయాత్రలకుం బోవు నెపమున వెడలి,కురుక్షేత్రం లో గర్భ వినిష్కృత్య
చేసు కుని అక్కడ భూమిలో పాతేసా !
 
 సంతాన ప్రాప్తి  కై  జనకుఁ డా భూమిని దున్నఁగా నా బాలిక పేటికనుండి లభించెను.
 
భగవత్ప్రసాదముగా భావించి జనకుఁ డా బాలికను పెంచి పెద్దచేసెను. ఆ బాలికయే సీత. 
 
ఇప్పుడెక్కడుందో ! ఏమిటో అంటూ కళ్ళ నీళ్ళు కావేరి లా కారి పోతోంటే , రావణుడు అయినదే మో అయినది నాకు కూడా కుమార్తె లు లేరు కదా ( నాకైతే తెలియదు రావణుని కి కుమార్తె లు ఉన్నారా లేదా అని మన కత కు ఇప్పుడు కొంత స్ట్రాంగ్ పాయింట్ కావాలి కాబట్టి :)) ఈ సీత ఎక్కడుందో తెలుసుకొని రమ్మందాము  మన యింటికి తెచ్చేసు కుందాం ; మండోదరి సంతోషమే తన సంతోషం అనుకుని తన చెల్లె లైన చుప్పనాతి ని పంపిస్తాడు వెళ్లి సీత ఎక్కడుందో ఏమి చేస్తోందో కనుక్కుని రా అని.
 
శూర్పణఖ వెళ్లి సీత ను కని బెడుతుంది దండ కారణ్యం లో.
 
అమ్మాయ్ నీకు నేను మేనత్త వరుస నవుతా. నీ తల్లి మండోదరి నాకు వదిన. నీకు తమ్ములు గట్రా ఉన్నారు . రా వెళ్లి చూద్దారి అని పిలుచుకు వెళ్తూ వుంటే సాదరంగా, లక్ష్మణుల వారు రాముల వారు కోపం తో , తన భార్య విడిచి పోతోందే అనే కారణం తో ఆవిడ ముక్కూ చెవులూ కోసి , ఓసీ ద్రవిడ పడతీ ! మా ఆర్య పుత్రి మీ యింటి అమ్మాయా ? కత లంటా వా అని తరిమి కొడితే , శూర్పణఖ వెళ్లి, అన్నతో మొర బెట్టు కుంటే, సాధువైన రావణుడు వచ్చి సీత ను స్వయంగా గౌరవంగా తన పుష్పక విమానం లో తొడుక్కుని వెళ్లి పోతాడు.
 
అక్కడ లంక లో సీత తన మాత తో సుఖం గా ఉంటూ ఉంటె, ఇక్కడ ఆర్య పుత్రులు కక్ష గట్టి రావణుడి పై యుద్ధానికి వెళతారు.
 
ఆ పై మీకు కత తెలుసు.
 
అంటే ఇది అల్లుడు అత్తా మామ ల పైన చేసిన దండ యాత్ర ! ఆత్తారింటికి దారేది అని వాపోతూంటే దారి లో హనుమాన్ అనే ముసల్మాన్ తోడై .....
 
ఈ కత ని మార్చి వాల్మీకి ఆర్యుల వైపు నించి లాక్కొచ్చి రావణుడిని దుష్టుడి ని చేసి పారేసాడు.
 
 
అబ్బో కత ఇంకా మరీ పెద్దదై పొతుందండీ !
 
కాబట్టి యిప్పటి కింతే :)
 
 
పిండా కూడు కతల మజ
దండిగ దట్టించిరి భళి ర్మపెబువులున్
ఖండిత గర్భంబకటా
మండోదరి తనయ సీత హిని జిలేబీ
 
 
జిలేబి
 

212 comments:



  1. అద్భుత రామాయణం లింకు :_


    https://archive.org/details/AdbhutRamayanWithHindiTranslationBhuvanVaniTrust

    జిలేబి

    ReplyDelete
  2. డబల్ వ్యాక్ 🤮. సోమవారం పొద్దున్నే ఏవిటీ ఓఘాయిత్యం.
    మొత్తానికి ద్రవిడులు👺 అనిపించుకున్నారు.

    ఏమైనా ఇప్పటి సినిమా కథలకేమీ తీసిపోలేదు లెండి. సినిమా కథారచయితగా మీకు మంచి భవిష్యత్తు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ... ప్రయత్నించరాదూ 👍.

    ReplyDelete
  3. ట్రిపుల్ వ్యాక్....

    రావణుడు లేకుండా మండోదరికి గర్భమా ?

    త్రేతాయుగం ముందా ? ద్వాపర యుగం ముందా ?

    ద్వాపర యుగం నుండి త్రేతాయుగంలోకి వెళ్ళగలిగితే కలియుగం నుండి త్రేతాయుగానికి లింక్ పెట్టేయవచ్చు కదా ? మన కధ మనిష్టం అనుకోండి.

    హనుమాన్ "ముసల్మాన్" అనడం మాత్రం తెగ నచ్చేసింది.ఇకనుండి కొబ్బరిచిప్ప బ్యాచ్ అని అననుగాక అనను.

    జిలేబీ మీద ఒట్టు !

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. ఇవన్నీ మనకెందుగ్గానీ జిలేబిజీ ఆవకాయ గురించి వాట్సాపు లో దొర్లుతున్న ది నాకొచ్చింది. మీ బ్లాగులో ఉంచుదామని తహ తహ - పద్యాలు రాస్తారు కదా అని అంతే.

    ఇంతకీ రావణాసురుడికి సీత పుడితే అవిడ రక్త గర్భా? లేకపోతే పాల గర్భా? ఈ రామాయణం రాసినోడే ఈ వాట్సాప్ ఆవకయ పద్యాలు కూడా రాసాడని నా అనుమానం. ఒక్కోచోట మితిమీరిపోయి, గోవిందా అంటే గోవు+ఇందా అని చెప్పుకుంటున్నారు వాట్స్ ఆప్ లోనే. విదర్ గోస్ మై కంట్రీ?

    ఆనందించండి.

    ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం
    ఆవకాయలో ఎరుపు--- "రవి"
    ఆవకాయలోవేడి, తీక్షణత---"కుజుడు"
    ఆవకాయలో వేసే నూనె, ఉప్పు---"శని"
    ఆవకాయలో వేసే పసుపు,మెంతులు---"గురువు"
    మామిడిలో ఆకుపచ్చ---"బుధుడు"
    మామిడిలో పులుపు---"శుక్రుడు"
    ఆవకాయ తినగానే కలిగే అలౌకికానందం---"కేతువు"
    తిన్న కొద్దీ తినాలనే ఆశ---"రాహువు"
    ఆవకాయ కలుపుకునే అన్నం---"చంద్రుడు"

    ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే,
    సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్.

    శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,
    టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
    ఇష్టముగ ఆవకాయను
    సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

    ఊరిన ముక్కను కొరకగ,
    ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
    కూరిమితొ నాల్గు ముక్కలు
    నోరారా తినని నోరు నోరవ్వదుపో!

    బెల్లము వేసిన మధురము,
    పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
    వెల్లుల్లి వేయ మధురము,
    పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!
    〰〰〰〰〰〰

    ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:
    చెక్కందురు, డిప్పందురు,
    ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
    డొక్కందురు,మామిడి
    పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!
    〰〰〰〰〰〰

    ఆవకాయ ఉపయోగాలు:
    ఉదయమె బ్రెడ్డున జాముకు
    బదులుగ ఇదివాడిచూడు బ్రహ్మాండములే,
    అదియేమి మహిమొ తెలియదు,
    పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

    ఇందువలదందు బాగని
    సందేహము వలదు;
    ఊట సర్వరుచిహరం ఎందెందు కలపి చూసిన,
    అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!
    〰〰〰〰〰〰

    ఆవకాయ అవతరణ:
    “చప్పటి దుంపలు తినుచును,
    తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో గొప్పగు మార్గం బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

    ముక్కోటి దేవులందరు
    మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
    చక్కనిది ఆవకాయన
    ముక్క తిననివాడు కొండముచ్చై పుట్టున్!!!

    చారెరుగనివాడును,
    గోదారిన తా నొక్కమారు తడవని వాడున్,
    కూరిమిన ఆవకాయను
    ఆరారగ తిననివాడు, తెలుగువాడు కాడోయ్!!!

    ReplyDelete
    Replies
    1. అద్భుతంగా వ్రాశారు DG గారూ 👌. గురజాడ వారినీ, జొన్నవిత్తుల వారినీ కలిపి చదివినట్లుంది 🙂.

      Delete
  6. ఓసీ జిలేబీ!

    నువ్వు చావు దాకా వెళ్ళి బతికొచ్చానండీ అంతే జాలిపడ్డాము!
    ఇట్లాంటి రాతలూ మరీ భయంకరమైన్ అకందపజ్యాలతో వాయిస్తావనూంటే
    అందరితో పాటూ "ఎందుకు బతికిందిరా బాబూ!ఈ కిల్లాడి ముసల్ది!"
    అనుకోవాల్సి వస్తంది.

    జేకే:-)

    ReplyDelete
  7. “జిలేబి” గారూ, ఆశ్చర్యం ఆశ్చర్యం, యద్దనపూడి సులోచనారాణి గారి గురించి మీరు టపా వ్రాయకపోవటమేమిటి? ఆ తరాన్ని ఉర్రూతలూగించిన రచయిత్రి కదా. ఆ రోజుల్లోనే ఆవిడ ఒక సెలెబ్రిటీ గా వెలిగారు .... అప్పటికి సెలెబ్రిటీ అన్న పదం ఇంకా వాడుకలోకి రాకపోయినా కూడా ఆవిడ ఖ్యాతి ఆ లెవెల్లోనే ఉండేది (ఇప్పుడేముంది లెండి, టీవీ లో వంటల ప్రోగ్రాముల యాంకరిణులు కూడా సెలెబ్రిటీలమని ఫీలయిపోతున్నారు).

    మరి మీదైన శైలిలో .. ఆవిడతో మీకేమైన ప్రత్యేక జ్ఞాపకాలుంటే వాటిని కూడా నెమరు వేసుకుంటూ .. ఒక నివాళి వ్రాస్తే బాగుంటుంది కదా.

    ReplyDelete
    Replies

    1. వారణాసి వారిది చదవండి

      https://vanalakshmi.blogspot.com/2018/05/blog-post_22.html


      జిలేబి

      Delete
    2. Thanks. వారణాసి నాగలక్ష్మి గారి టపా ఆల్రెడీ చదివేసాను, థాంక్స్. “పండూరు చెరువు” గట్టు వారి టపా చదివాను, థాంక్స్. “శోధిని” వారి టపా చదివాను, థాంక్స్. “కబుర్లు కాకరకాయలు” వారి టపా చదివాను, థాంక్స్. బాగున్నాయి.

      అందరికన్నా ముందే వచ్చిన “నెమలికన్ను” మురళి గారి అద్భుతమైన నివాళి చదివాను, థాంక్స్.

      నేనడిగింది మీ సంగతి.

      ఆ మాట కొస్తే మీరు, “బోల్డన్ని కబుర్లు” లలిత గారు, “కొత్తావకాయ” గారు, నీహారిక గారు ప్రభృతులు .. నివాళి తప్పక వ్రాస్తారనుకున్నాను ... ఎంతైనా యద్దనపూడి వారి సాహిత్యంతో పరిచయం బాగానే ఉండే ఉంటుంది అనుకుని.

      Delete
    3. నీహారికకేమి తెలుసు నిమ్మకాయ పులుసు....నేను పుస్తకాలు చదివింది చాలా తక్కువండీ....మీలాగా చదివి ఉంటే నేను కూడా పే....ద్ద రచయిత్రిని అయిపోయి ఉందును.
      జిలేబీగారిని నన్నయ వ్రాసిన రామాయణం గురించో వాల్మీకి వ్రాసిన భారతమో అడగాలి కానీ సులోచనా రాణి గారు వ్రాసిన కీర్తి కెరటాల గురించి అడిగితే ఏం లాభం ?

      లలితగారు రాస్తారని నేను కూడా ఎదురు చూస్తున్నాను.

      Delete


    4. ఈ మధ్య ఓ ఆర్నెల్లుగా నివాళులు ఎక్కువై పోనాయండీ ! మరీ బిక్కచచ్చిపోతున్నా :) ఊహూ ధైర్యము లే :)


      ఇచ్చితి తిలోద కములన్
      గ్రుచ్చ నివాళులను విన్నకోటవరుండా!
      చచ్చితి భయమ్ము తోడుగ
      వచ్చునకోనెప్పుడైన వగచను వగచన్ :)

      జిలేబి

      Delete

    5. BTW, నిన్నే ఓ మానవుడు "ఎందుకు బతికిందిరా బాబూ!ఈ కిల్లాడి ముసల్ది!" అన్నాడు కూడాను :)

      కాబట్టి మన క్షేమం కోరి చుప్ చాప్ :(


      జిలేబి

      Delete
    6. సో, మొత్తానికి ‘నివాళి వైరాగ్యం’ పట్టుకుందన్నమాట. అయినా “వగచను” అన్నారుగా, మరెందుకు భయం?

      Delete

    7. కొంత ఫ్యూచర్ సేఫ్ గా వుందామని . బుద్ది పుట్టి ఏదన్నా నివాళి రాస్తే ఆయ్ అని మీరనకుండా వుండటానికి :)


      జిలేబి

      Delete
  8. “పాాాాాధణంంమ” ..... దీని భావమేమి తిరుమలేశ? మీకేమైనా తెలుసునా “జిలేబి” గారూ? 🙁

    ReplyDelete

  9. మీరసలే పాఠక సూపర్ స్టార్ నరసింహారావ్ గారు :) ఎక్కడ ఏమి చదివేరో :) రామ రామ :) హరీ :)

    తెలియ దండీ లింకెట్టండీ చదివి చెబ్తా :)


    జిలేబి

    ReplyDelete


  10. ఆమె బతికి వున్న శవము
    ఆమె హృదయ మతడి హృదిని నారాధించెన్
    ఆ మమకారపు జ్యోతికి
    ఆమె నిదర్శనము ఆమె ఆమెయె పద్మా :)

    జిలేబి

    ReplyDelete


  11. గడుసరియనుకోనా ? వె
    ర్రి డవులని యనుకొననా? సరి సరి జిలేబీ
    లొడలొడ యేడుస్తావే ?
    బడబాగ్నిని విడువ మేలు పద్మార్పితయా !

    జిలేబి

    ReplyDelete


  12. ఎలుకలగుచుండు నపుడపు
    డులావుగా నసురుల వలె డుండుకలగుచున్
    బలముగొనుచు నొకమారొక
    యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్!

    జిలేబి

    ReplyDelete


  13. మా కన్నడ రాష్ట్ర కథ

    గెలిచెన్ తాకొన్నియెనట
    బలమివ్వన్ కాంగిరేసు పట్టెన్ పదవిన్
    బిలబిల గుంపును జేరుచు
    యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్!

    జిలేబి

    ReplyDelete


  14. అదురహో ' మౌసు ' :)
    జీపీయెస్ వారి ఐడియా :)
    జిలేబి కందం కొంత ఫిట్టింగు :)



    బలహీనుడైన భటుడే,
    చలచల్లగ ప్రాకుచుండి చదరంగములో
    నల నంకోపరిని, జరుప
    నెలుకయె, కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్



    జిలేబి

    ReplyDelete


  15. మా "జీపీయెస్" మీరే!
    శ్రీ జి. ప్రభాకర ! జిలేబి చిరుకానుకగా
    యీ జిలుగు తెలుగు కందము
    పాజము జేర్చంగ వాట్సపార్యుడ మీకై!

    జిలేబి

    ReplyDelete


  16. బామ్మల కు "విట్టు" బాబుల
    కమ్మమ్మో "వేవులెంతు" కలువన్నొకటై
    ఝుమ్మను డిస్నీ కార్టూ
    న్లమ్మమ్మో శంకరునికి నట్టుగు లాయెన్ :)

    జిలేబి

    ReplyDelete


  17. తెలుపుము పిల్లికి కబళము?
    వలపున నెటులు విజయమ్ము వచ్చు జిలేబీ ?
    * అల మావటి వాడినకట !
    ఎలుకయె; కడు విక్రమించి; యేనుఁగుఁ జంపెన్!


    *తిరుచ్చి సమయపురంలో ఏనుగు మావటి వాడిని (వాడి పేరు గజేంద్రుడు :)) చంపిందని హిందూ వారి వార్త.

    జిలేబి

    ReplyDelete


  18. గడుసరి బామ్మయు వడ్డన
    గడగడ జేయగ నటునిటు కాస్తైన భళా
    యుడుకువ లేక జిలేబుల
    వడదెబ్బకు వృద్ధుఁ డొకఁడు వహ్వా యనియెన్ :)

    జిలేబి

    ReplyDelete


  19. ధారణ తో చట్టను నయ
    గారము తో మెరుపుల కల కలల జిలేబీ
    సారముతో భళిభళి మమ
    కారముతో నాముదాల కవి యలరారెన్!

    ***

    పరువైనవారు సుమ్మీ
    తిరుపతి పురవాసులెల్లఁ, దిర్యగ్జడముల్,
    పరులెవరో! రమణు సిసులు
    కరుకుగ మాట్లాడలేరు కవన జిలేబీ :)

    ***

    చెలి!విను మానవ యత్నము
    చెలియలికట్టను కడచుచు చెలరేగంగన్
    ఫలితంబుగాన్పడు సుమా
    తల వ్రాతను మార్చ బ్రహ్మ తరమే ధరలో!

    ***

    విత్తము దండిగ గలవా
    డత్తఱి జన్మదినమున లడాయీ జేయన్
    హత్తము తోచాక్లెట్టుల
    కత్తులఁ గని బాలుఁ డొకఁడు కరకర నమిలెన్

    ***


    పిండగ జిలేబులనటన్
    గుండమ్మకు హాయి హాయి గురుడా! తానై
    దండగ గుచ్చుగ పదముల
    నెండలు మండుటయు నిచ్చు నెంతో హాయిన్


    ***

    జోతల నిడుచు జిలేబియు
    తాతల కాలంపు నోకు తడుమగ నహహో
    పాతాళ భైరవి చలువ
    రాతిరి సూర్యుండు నంబరమునన్ దోఁచెన్ :)

    ***

    గలగల పద్యము కందపు
    ములుగుల రాయంగవీలు ముప్పిరి గొనునీ
    "తలమున" !జిలేబి వినవే
    కలదే యిలలోన హాయి కైవల్యమునన్ :)

    ***

    తనదగు విధముల జిలేబి తకధిమి యని
    తాళమున్వేయగ భళిరా దద్ద రిల్లె
    నుర్వియునకట! శబ్దపు నుక్కటగని,
    చెవిటి నర్తించె సంగీతము విని, సభను

    జిలేబి

    ReplyDelete


  20. పల్లవుల యేరు తళుకుల
    నుల్లము పొంగెడు పదముల నుత్సాహముతో
    మల్లారమ్ముల పద్యము
    లల్లు పలమనేరు సుకవుల కివే జోతల్ !

    జిలేబి

    ReplyDelete


  21. భావా లింతగ పద్మ
    మ్మో!వామ్మో!బాధ సలిపి ముంచేస్తాయా !
    సావాసం వలదు జిలే
    బీ వారి మమతల తొడుగు భీతిగొలిపెనే !

    జిలేబి

    ReplyDelete


  22. ఏదో లోటు కవితలో
    లేదా చిత్రమున పద్మ ! లెంబిని తకరా
    రేదో కనిపిస్తోంది సు
    మా !దిరిసెనపూవుబోడి మదిని కలతలో?

    జిలేబి

    ReplyDelete


  23. రామ రామపాహియనుచు రాయుచుండె
    గుండె లవియు తీరు జిలేబి గుణిని తెలియ
    వింట విడిచిన బాణము వివరము లెవ
    రికి తెలియునమ్మ పూబోడి రివరివవలె!

    జిలేబి

    ReplyDelete


  24. చాడి! అపత్నీ వ్రతుడట!
    చీడపురుగలే జిలేబి చెప్పుదురిటులన్
    కోడిని బట్టుచు నీకల
    లోడుచు లాగెదరు సూవె లోకమున చెలీ :)

    నారదా!
    జిలేబి

    ReplyDelete
  25. “కష్టేఫలి” బ్లాగ్-స్పాట్ లో శర్మ గారు తిరిగి సైలెంట్ అయిపోయారే? 🤔

    ReplyDelete
    Replies
    1. @ *,
      సమస్యలు లేనిచోట కూడా మీరు గిల్లడానికే చూస్తుంటరేవిటండీ? రోహిణీ కార్తె కదా కాస్త కునుకు తీస్తున్నాడల్లే ఉంది.మీరు ఆట్టే ఆలోచించకుండా గురజాడ "కన్యాశుల్కం" తీసి మళ్ళీ చదువుకోండి.

      Delete
    2. దాన్ని గిల్లడం అనరు, కుశలం అడగడం అంటారు ... ఎంతైనా మిత్రులు కదా.

      అవును రోహిణీ కార్తె కదా... కొంతమంది కునుకు తీస్తారు. కొంతమంది నీళ్ళ ఒడ్డున గడ్డిలో కూర్చుని చెంబెత్తి నీళ్ళు తాగుతారు. ఎవరి కేది సౌఖ్యంగా ఉంటే అది.

      “కన్యాశుల్కం” గురించి మీ సలహాకి థాంక్స్, బట్ నో థాంక్స్. ఆ నాటకం కంఠోపాఠమే. చదివుండకపోతే మీరు చదవండి .. అసలే పుస్తకాలు చదవింది తక్కువ అని నాలుగైదు రోజుల క్రితమే ఒక కామెంట్లో వాపోయారు కదా. ఎండాకాలపు మధ్యాహ్నం సత్కాలక్షేపం. మీ ఫేవరైట్ విరోధి బ్యాచ్ మీదే విమర్శలు ఆ నాటకమంతా, కాబట్టి మీకు తప్పక నచ్చుతుంది.

      * 😎⭐️

      Delete


  26. చాపంబదియె జిలేబీ
    నీ పెంపునకు భువిలోన నీరజనేత్రా!
    సోపాల జేరి విద్యా
    దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్


    జిలేబి

    ReplyDelete


  27. ఓ రయ్య జిలేబీ ప
    ద్యారవముల విడచుచు సరదాగా చూడం
    డీ రసవత్తర సినిమా
    సారూ ఫామిలి తిరగలి సర్కసు రండోయ్


    జిలేబి

    ReplyDelete


  28. కందపు సమస్య మిస్సవడమా ! ఓహ్ ! నో నెవర్ :)



    బాలా చెప్పెద నీకై
    స్త్రీలోలుఁడె సజ్జనుఁడని; చెప్పెదరు బుధుల్
    మాలోకపు జనులు, జిలే
    బీ, లావుగ దుర్జనులని, వినకే బాలా !


    జిలేబి

    ReplyDelete


  29. జామ్మంచు చెట్టపట్టాల్,
    జుమ్మంచు జిలేబులన్ సజుఘులకు నిడెడా
    దమ్మున్న జిలేబిని నా
    నమ్మా యని పిలిచినంత నాగ్రహమందెన్ :)

    జిలేబి

    ReplyDelete


  30. "అప్పల్రాజెవరయ్యా?"
    తిప్పలు తిండాటములు మదిని విడువన్ తా
    దప్పర గా ధ్యానము, చే
    దప్పక నొనరింప బౌద్ధ ధర్మంబాయెన్!

    జిలేబి

    ReplyDelete


  31. అప్పల్రాజననెవడో?
    తిప్పలు తిండాటములు మదిని విడువన్ తా
    దప్పర గా ధ్యానము, చే
    దప్పక నొనరింప బౌద్ధ ధర్మంబాయెన్!

    జిలేబి

    ReplyDelete


  32. జడకుచ్చు లెక్కడ గలవు
    పడతులకీనాడు! కవులు పద్యములన్ గ
    ట్టి డమడమల్లాడించి ప
    గడంపు తలబిళ్ల నిడిరి గాదె జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  33. అచ్చొత్తింతురు పొత్తము
    లచ్చచ్చో వాల్జడల్ భళారే యనుచున్
    కుచ్చుల్ గలవే రమణీ
    తెచ్చిచ్చెదరు జడబిళ్ళ తీరుగ గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  34. బుద్ధుని జన్మ దినమ్ము ! ని
    బద్దత తో కొలిచినాము! పండగ వేళన్
    పద్ధతి గా బిర్యానీ !
    శుద్ధము గా వెజ్జు బువ్వ సుమనోహరుడా !


    జిలేబి

    ReplyDelete
  35. “శంకరాభరణం” పద్యాల బ్లాగ్ లో మీరంతా మాట్లాడుకుంటున్న “జడ శతకం” ఏవిటో నాకు తెలియదు (జడ సొగసుల మీద పద్యాలల్లడమా?🤔) కానీ దగ్గర పేరున్న ఒక పాత పుస్తకం గుర్తొచ్చింది.

    జడల గురించి కాదు గానీ ఆ కాలంలో రకరకాల అంశాల మీద వివిధ పత్రికలలో అచ్చైన పద్యాలు / కవితలను సేకరించి 1925 లో ఒక సంకలనంగా ప్రచురించారు .. మహానుభావుడు రాయప్రోలు సుబ్బారావు గారు. ఆ సంకలనం పేరు జడకుచ్చులు .

    ఆ పుస్తకం మొదటి పేజీల్లో రాయప్రోలు సుబ్బారావు గారు ఈ విధంగా అంటారు 👇.

    కం. పాయలు పాయలుగా విడి
    పోయిన నా తెనుఁగుకన్నెముంగురులకు వే
    ణీ యోగ్యాభరణముగా
    నీయెడ జడ కుచ్చు లల్లి యిచ్చితిఁ బ్రీతిన్.

    ఈ పుస్తకం మా తండ్రిగారి దగ్గర ఉంటే చూశాను నా చిన్నతనంలో. ప్రస్తుతం కావాలంటే ఈ క్రింది లింక్ లో ప్రయత్నించవచ్చు (కాపీరైటు సంగతి నాకు తెలియదు).

    https://ia801600.us.archive.org/6/items/in.ernet.dli.2015.373348/2015.373348.Jadakucchulu.pdf

    ReplyDelete


  36. టెంకాయననమృతమ్మును
    వంకాయను చెఱకురసము, వడియుచునుండెన్,
    బింకము తో భామయునట
    లంకెల లంకెల పదమ్ములన్ గూర్చగనే !

    జిలేబి

    ReplyDelete


  37. సరిసరి యనునెల్లపుడున్
    మరిరాదిక నీకు తంట మహిని జిలేబీ
    గురువులు చెప్పిరి వినవే
    సరే యనెడు మంత్రమేను సరియౌ జగతిన్!

    జిలేబి

    ReplyDelete


  38. ఎండకు ఆవిరియాయెన్
    గుండెని తడియున్ జిలేబి కొంచెము సేద
    న్నిండుగ గొనుమా మేలౌ
    మెండు బతుకుబండి సాగు మించారంగన్ !

    జిలేబి

    ReplyDelete


  39. సంపూర్ణమైన శరణము
    నింపాదిగ దక్కు నీకు నీరజనేత్రా
    యింపైన గృహస్థపు కస
    రొంపిని నంట వినవమ్మ రోజారమణీ :)

    జిలేబి

    ReplyDelete

  40. జ్ఞాపిక లుమరువ లేనివి !
    ఓ పద్మార్పిత! జిలేబి ! మోదంబాయెన్
    మీ పద కవితలు చదువన్
    మా పిడికెడు గుండె గుబులు మరిమరి తొలగెన్ :)

    జిలేబి

    ReplyDelete


  41. జ్యోతిష్యము వలదనెనో?
    కోతలు కట్టంగనేల, కుయ్యోమొర్రో!
    వాతలు బాగుగ వెట్టిరి
    జోతలిడు జిలేబి బ్లాగు జోతిషులకటన్ :)

    జిలేబి

    ReplyDelete


  42. గనుడీ పౌర్ణిమ నాటన్
    జనులా రా,హా! మదిని సజావుగ నిలుపన్
    మునులకయిన సాధ్యమవదు
    గనుడీ రుజువు శ్లికువునకు కాలగతియనన్

    జిలేబి

    ReplyDelete


  43. నరసన్నా చిన్ముద్రల
    బరబర గీకన్ జిలేబి భామకు నేర్పన్
    బిరబిర రమ్మా నిపుడే
    గురుతుల్ టపటప యనంగ గూర్చన్నిపుడే!

    జిలేబి

    ReplyDelete

  44. అయ్యొ సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు
    నీ జిలేబికి! యాత్రల నీవు బోవ
    నేది దారి యనుకొనుచు నెట్టు లోన
    మెయిలు నంపె పడతియు సుమేధసునికి !

    జిలేబి

    ReplyDelete


  45. సందర్భము - పెనిమిటిని జిలేబి జీవన చక్రము (పయ్య) పెద్దదెట్లగును అని అడిగితే ఆ మగడు సుకవి చెప్పిన సమాధానము అవధరించుడు - గడు - పెద్ద పయ్య - చక్రము ; బండిగాలు - చక్రము :)


    జిలేబి యు గుండు చక్రము గుండు వృత్తము గుండు గుండులోనే గలడు గుఢాకేశుడు కావున


    "అయ్యొ సుకవీశ్వరా! గడు పయ్యె నెట్లు?"
    ఆటవెలది నీ వైనావు భావ మైతి
    నేను! తేటగీతి వవంగ నేర్పు గా సు
    గంధమైనాను గద! బండిగాలు నటులె!


    జిలేబి

    ReplyDelete


  46. చిన్ముద్రల శిక్షణయయె!
    మున్ముందేమేమి చిత్రములగు పడునకో
    కన్ముందరన్ గదా యీ
    షణ్మాత్రపు కినుక కలుగ షంటింగులతో :)

    జిలేబి
    నారదా!

    ReplyDelete
    Replies
    1. వీఎన్నార్ సార్ మీ పద్యం చూశాకే ఇచ్చార్లెండి శిక్షణ. 'కాలిక్యులేటెడ్'రిస్కే 😀

      Delete
    2. వైవీఆర్ గారు సరిగ్గా ఊహించారు, థాంక్యూ.

      Delete
    3. మీరంత కంగారు పడనక్కరలేదు. నాకు రాలేదు నిశ్చింతగా ఉండండి. మీలాంటి గురువులుంటే ...

      Delete
    4. "కాలిక్యులేటెడ్ రిస్క్" అని వైవీఆర్ గారు అననే అన్నారు 😑.

      Delete


  47. దేవుడు కళ్ళూ ముక్కును
    లావుగ నోరును సయి చెవులనదేలన్ని
    చ్చే వనితా మూసు కొనమ
    నో!వా! నో ! నో ! జిలేబి నొక్కెయ్యకుమా :)

    జిలేబి

    ReplyDelete


  48. ఈమోజీలను నేర్వుడి
    ఓ మదిరాక్షీ జిలేబి ఓపిక తోడన్
    మీ మదియాహ్లాదముగా
    మా మీద విసుర గలరు సుమా పువు బోడీ :)

    జిలేబి

    ReplyDelete


  49. టపటప యనుచున్ టైపా
    టి పదములన్ జేయగా పటిష్టత జేకూ
    రు,పడతి, జిలేబి నుపయో
    గపడునకో దేనికైన గరిమయు లేకన్ :)

    జిలేబి

    ReplyDelete


  50. పదముల నత్తొచ్చించున్
    సదనంబున తిరుగుచున్ వెసవెసగ వేయం
    గ దరువుల జిలేబులను గ
    లదే తరుణి ఫలము? గలగల గులక రాళ్ళే :)

    జిలేబి

    ReplyDelete


  51. దోమల సందోహం :)


    "యుక్తము కుట్టుము మనుజుల
    శక్తి కొలదిగా జిలేబి ! సఖి, నా దోమా !
    ఫక్తుగ నినువెను కాడుచు,
    రక్తముఁ ద్రాగెదను చెలియ" రమ్మనెఁ బ్రియుఁడే :)

    జిలేబి

    ReplyDelete


  52. మశకమశక పూరణలోన మా జిలేబు
    లమ్మి మాగట్టిదయ్య గలగల యనుచు
    తిరుగు చీకటీగవలెను తీరుగాను
    విశ్వదాభిరామ వినుమ విట్టుబాబు !

    జిలేబి

    ReplyDelete


  53. శక్తికి, యుక్తికి, రక్తికి
    ముక్తికి, భక్తికి శుభాంగి ముప్పొద్దులటన్
    భుక్తికి జిలేబి, నీయను
    రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే!



    జిలేబి

    ReplyDelete


  54. నిదుర పట్టదు గురువర నేమి చేతు
    నయ్య పూరణలను వేతు నయ్య శక్తి
    కొలదియు! పురాణముల కత కొంచె మైన
    తెలియదయ చేతు నెట్లవి తేట గీతి :)

    జిలేబి

    ReplyDelete


  55. పాగల్ఖానాన జిలే
    బీ,గట్టిగ లాగగాను బిగువును వీడెన్
    బేగడ రాగము తోడన్
    తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్:)

    జిలేబి

    ReplyDelete


  56. హోరాహోరిగ పోరితి
    పోరా నే రానుపనికి పోరుల సేయన్
    జోరు ముసుగెట్టి తొంగుత
    నారోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్!

    జిలేబి

    ReplyDelete


  57. మీ భావలహరి నీదం
    గా భారీగా జనాళి కాళ్లన్ బడిరే
    ఓ భామా ! పద్మార్పిత!
    నీ భారముభారమనెడు నేడ్పుల వేలా!

    జిలేబి

    ReplyDelete


  58. తవికలు సామాన్యులవని
    చవులూరెడుపద్యములు రచనలు జిలేబుల్
    కవిరాజులదను దర్పము,
    కవిసమ్మేళన మనంగఁ గడు భయ మగురా :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీ గారూ,
      నాకు పద్యాలు వ్రాయడం నేర్పిస్తారా ?

      Delete


    2. శంకరాభరణ బ్లాగులో రాస్తూ వెళ్ళండి. తానంతట అదే వచ్చేస్తుంది బామ్మలే నేర్చేసుకుంటా వుంటే మీకేమండి సుళువుగా నేర్చేసుకుంటారు


      జిలేబి

      Delete


  59. పంచ పాండవులు - శ్రీకృష్ణుడు ;
    నేను కావాలో నా సైన్యం కావాలో తేల్చుకో అర్జునా !


    మా మది లో నిలిచితి వ
    య్యా! మురళీధర! కొలుతుమయా! రా ! మవ్వం
    పై మావైపు సకా! మము
    నీ మది శోభామయముగ నిల్పుకొనుమయా !

    జిలేబి

    ReplyDelete


  60. మధురానగరి సకా ! మది,
    యధరములున్వేచెనయ్య యవనారీ రా !
    మదన! సభామర్యాద గొ
    ను! దవళముగ మా మనసున నురికె కవనముల్ !

    జిలేబి

    ReplyDelete


  61. కారము లేక రసంబున్,
    సారము లేని కవనమ్ము చక్కర లేకన్
    క్షీరాన్నము వండుచు,హా!
    దారము లేకుండ పుష్పదామము లల్లెన్

    జిలేబి

    ReplyDelete


  62. అత్తా! సభరన మయవల్
    మత్తేభమునకు గణములు, మసజసతతగల్
    సత్తెము శార్దూలంబగు
    నత్తా! పండిత సభ జతనము వలయునుగా

    జిలేబి

    ReplyDelete
  63. ఈ క్రింది లింక్ లోని వార్త (Deccan Chronicle (Hyd) 31-May-2018 page.9) చదివితే .... ఆధార్ కార్డ్ లేని జనాలు ఇప్పుడైనా చేయించుకోవడం మంచిదనిపించడంలా? ఎప్పుడు ఎక్కడ అవసరమవుతుందో ఈ కార్డ్ చెప్పలేం. ఆ వార్తలో పేర్కొన్న ఊళ్ళో జరుగుతున్నది దేశంలో వేరే ప్రాంతాలకు కూడా వ్యాపించడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు కదా? ఆధార్ కార్డ్ లేకుండానే గతించిన వారికి విముక్తి ఎలాగో మరి 🤔? మేరా భారత్ మహాన్.

    నిన్న డయాగ్నస్టిక్ లాబ్ కు వెడితే సీనియర్ సిటిజన్ డిస్కౌంట్ ఇవ్వడానికి ఆధార్ కార్డ్ కావాలన్నాడు (వయసు కూడా చూపించే ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డ్ కాదు). వెంటనే పై వార్త గుర్తొచ్చింది, ఇక్కడ వ్యాఖ్యగా పెడుతున్నాను. క్షవరం చేయించుకోవడానికి కూడా ఆధార్ కార్డ్ చూపించాలంటాడో హేవిటో మా సెలూనుడు ... కనుక్కోవాలి 🙁.

    http://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=10777029

    ReplyDelete
  64. మీలో చాకచక్యం ఒక పాలు ఎక్కువే, “జిలేబి” గారూ 👏 🙂.

    ReplyDelete
    Replies

    1. మీ పితూరీకి నెనరులు :) ఇంతకీ సందర్భమేమిటండి ?


      జిలేబి

      Delete


  65. పుంస్త్వము పుంస్త్వంబనుచున్
    పుంస్త్వంబు నటతెగనాడ పుణ్యము గలదే?
    పుంస్త్వము కోరి విభుని దయ,
    పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్!

    జిలేబి

    ReplyDelete


  66. అముల్ బట్టరులాంటి మగడు ప్చ్ :)



    "అములు నవనీత" మైన
    ట్టి మగడు! పనిలేనివాడు! ఠీవియు లే! పుం
    స్త్వములేని భర్త యవుఁబో !
    కొమరున్ సతి గాంచె నెట్లొకో గడుసరియే :)

    జిలేబి

    ReplyDelete


  67. చూసానోయ్ ప్రశ్నను నే
    చూసా!సావిత్రిదేను సూవె చనవరీ !
    మోసాల్జేసిరి సినిమా
    ఘోషాలో కతల మార్చి ఘోరము సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  68. పంద్రుండ్రు, శశమును గనిరి
    చంద్రునిలో, లేడి తినెను‌ జగతిని తృణమున్,
    మంద్రము గా గానంబట
    కంద్రీగవలె చెవి తొలిచె కవన జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  69. సతిపతులకు,సర్వజనుల
    కు,తరముగ జిలేబులకు జకుటపు యజిరమై
    జతగూడునదియె గానన్
    రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్!

    జిలేబి

    ReplyDelete


  70. అసమంజసమైన విషయ
    ము! సాహితీ సేవయనుచు ముంగురుల పయిన్
    కసబిస పద్యము లల్లి ర
    భసల సరస్వతిని కొల్చు పండితులయిరే !

    జిలేబి

    ReplyDelete


  71. నిట్టూర్పులవేడికి హా!
    పట్టమ్మా! పద్మనయన ! పట్టులు తప్పెన్!
    చెట్టాపట్టాలేసుకు
    గట్టునకూకొని మురిపెముగా లాలిస్తా :)

    జిలేబి

    ReplyDelete


  72. శృంగారభావ ముట్టిప
    డంగా చెలియా జిలేబి డంగై పోయా
    చెంగట రావే చిలకా
    బంగరు మొలకా సరసపు పల్కులు రాలన్ :)

    జిలేబి

    ReplyDelete


  73. అబ్బే ! నా లో సగం !

    నేను చూసి బావుకునే దేమిటి ? :)


    అచ్చెరువు!తన లో నర్ధ మాయె నంట !
    చూడ గా నతనిని తన చూపు లోన
    సగము గానుండు! ఈపాటి సామి యేల?
    అభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి!


    జిలేబి

    ReplyDelete


  74. అరె! మనువయి మూన్నెల్లయినా నవలె ! భ
    వాని మగడు సభాపతి భార్య ముద్దు
    తీర్చె! మామిడికాయపై తీపి బోయె !
    అభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి :)


    జిలేబి

    ReplyDelete


  75. మొదట చర్చలు వలదని మొండి, కోప
    గించు కొనె! పిదప బిలిచి గిట్ల వలదు
    మాట లాడద మనె ట్రంపు ! మాట వినవె
    కనక! కశిపుఁ బూజయె కాఁచుఁగద జగమును!

    కశిపు -కోపము గలవాడు :) మన ట్రంపు లా అన్నమాట మొదట నో తరువాత యెస్:)


    జిలేబి

    ReplyDelete

  76. ఉత్సాహ వృత్తము

    ప్రహ్లాదుని గురువు పిల్లలతో


    వినుడు వినుడు పిల్ల లార ! వీరు డౌ హిరణ్యమౌ !
    మనుగడ మనకతని వలన మారు బల్క రాదుగా!
    మనసునన్గొలుచుడతనిని మాన్యుడాతడే సుమా !
    కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్!

    జిలేబి

    ReplyDelete

  77. ఉత్సాహ వృత్తము

    ప్రహ్లాదుని గురువు పిల్లలతో


    వినుడు వినుడు పిల్ల లార ! వీరు డౌ హిరణ్యమౌ !
    మనుగడ మనకతని వలన మారు బల్క రాదుగా!
    మనసునన్గొలుచుడతనిని మాన్యుడాతడే సుమా !
    కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్!

    జిలేబి

    ReplyDelete


  78. ఉత్సాహ వృత్తము పంచచామర ఫ్లేవర్ :)

    పంచ చామర ఫ్లేవర్ :)



    వినుడు మీరు పిల్ల లార ! వీరు డౌత రేడురా
    మనకు నాత డేను దిక్కు మారు బల్క రాదుగా!
    మదిని గొల్వ మేలు గాను మాన్యుడాతడే సుమా !
    కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్!


    జిలేబి

    ReplyDelete


  79. సందర్భానికి తూగుచు
    చందముగా నున్నదండి చక్కటి కవితై
    డెందము నింపుచు మాకను
    విందుల గొల్పె సరసమ్ము వినువీధినిటన్ !

    జిలేబి

    ReplyDelete


  80. వేదన యొక్క నిమేషము
    వేదాంతము మరి యొక తృటి వెలిగెన్ గాదే
    మీ దరువులలో పద్మా
    జీ దమ్మున్న కవితలకు చిరునామాయై!

    జిలేబి

    ReplyDelete


  81. ప్రతి మనిషికీ రహస్యము
    లు తీరుగ గలదు జిలేబి లుకలుక యన నా
    శ తిరముగ గలదె పద్మా !
    బతుకున్నంతవరకిదియె పరమపదమగున్!

    జిలేబి

    ReplyDelete
  82. కిన్నెరసాని కవితలా లేక ఎంకి-నాయుడుబావ పాటలా?
    (వేరే బ్లాగ్ లో మీరు వ్రాసిన వ్యాఖ్య గురించి

    ReplyDelete
    Replies

    1. విన్నకోట వారు

      మీ ప్రశ్న చూసాక నాకూ సందేహం వస్తోంది. మీరే సరి అనుకుంటా. ఇంతకీ పత్రికా ప్రభా లేక భూమి యా దేంట్లో వచ్చిందో గుర్తు రావట్లే :)

      ఓల్డ్ ఈజు గోల్డు :) ఓల్డ్ టైమర్స్ మెమొరీ పాకెట్స్ అక్కడక్కడా గాన్ మిస్సింగ్ అలాస్ :)


      జిలేబి


      Delete


  83. సరసావేశంబన గడ
    సరి పిల్లా పద్మ నయన సరిసరి‌ నీదే
    అరె!శృంగార వినోదము
    మరి తేనియలూరె సూవె మా మంచిగనూ :)

    జిలేబి

    ReplyDelete


  84. జరిగిన విషయముల తలచి
    మరియు జరుగ బోవు దాని మదినెంచి జిలే
    బి, రకరకములగు చింతల
    వరవడి విడువుమిక పద్మ, వలదే యేడ్పున్ !

    జిలేబి

    ReplyDelete

  85. శీర్షిక లోనే తప్పులు !
    హర్షింపన్ మనసు రాలె ! హా! హా !తెలుగే?
    వర్షము గా కన్నీరయె!
    మర్షము బోయెను చదువను, మనసే రాలే !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రభారతి లో పదేపదే వెదకడానికి కూడా "మర్షము" అవసరం, "జిలేబి" గారూ 😕.

      Delete


    2. ఆర్షయుడివలెన్ పదములు
      వర్షించును విన్నకోట వర్యా వినుమా !
      కర్షణ జేయంగ సుమా
      తర్షణ తీరును శుభముగ తరముగ మీకున్

      జిలేబి

      Delete


  86. పువ్వులతో పిల్లలతో
    నవ్వు ముఖమ్ముల రమణుల నయిసు నయిసుగా
    కవ్వించు జిలేబులతో
    లవ్వాడింప దగు యువకుల దుడుకు తగ్గన్ :)

    జిలేబి

    ReplyDelete
  87. లవ్వాడించినంత మాత్రాన దుడుకు తగ్గదండీ, పెళ్ళయ్యాక తగ్గుతుంది (అనగా ... దుడుకు తగ్గి చతికిలబడును ... అని) 😀.

    ReplyDelete
    Replies

    1. ఎక్స్పీరియెంసుడు పెర్సనాలిటి మీరు :)
      కాదనగలమే :)


      జిలేబి

      Delete
    2. ఎక్స్పీరియెన్స్ లేనివారెవరులెండి ☝️🙂.

      Delete


  88. అన్యథా శరణంనాస్తి యనగ గాంచి
    కరినిఁ, జంపి యమ్మకరినిఁ, గాఁచెను హరి!
    శరణు గొనుమ జిలేబి వెస విభుని! నత
    డే సుమా యీప్సితముల నీడేర్చు నెప్డు !

    జిలేబి

    ReplyDelete


  89. సున్ననరసున్నలన్ గనె
    నన్నా తెలుగోడు నాడు నమ్ముడు నేడా
    యెన్నతడు గుండు సున్నా !
    యెన్నగ మనుజుడు జిలేబి యే మహిని గదా !

    జిలేబి

    ReplyDelete


  90. నాయుడు బావను మరిపిం
    చే యుక్తిగల మగరాజు చెంతన నుండం
    గా యువతికి దిగులేలా !
    సాయంబతడేను పద్మ సరసము లాడన్ :)

    జిలేబి

    ReplyDelete


  91. ఈ నిట్టూర్పులకిక ప
    ద్మా! నెలతుక ఆఖరు పదమంజీరంబుల్
    గానుమ ! జిలేబి వినవే
    నీ నయగారమ్ములే యునికి, మర్యాదౌ!

    జిలేబి

    ReplyDelete


  92. ఖండన మండన జేయుచు
    భండన భీములమటంచు భారీ పదముల్
    దండిగ దట్టింపు,బుసము
    పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్?

    జిలేబి

    ReplyDelete


  93. హర్మ్యంబు శంకరయ్యది
    హర్మ్యంబిదియే మనసుకు హాయిని జేర్చన్,
    హర్మ్యంబు కవిత్వమునకు
    హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్

    జిలేబి

    ReplyDelete


  94. వేదాంతంబిదియె జిలే
    బీదీ పూర్ణముగ గుండు విరివిగ నుండున్
    కాదేదియు కష్టమ్ము సు
    మా దీకొను దేనినైన మహిలో సుమతీ :)

    జిలేబి

    ReplyDelete


  95. సై యంటే పిల్లా సై
    సై యంటానే జిలేబి చక్కటి చుక్కా
    మాయా మోహిని పద్మా
    మాయందరికిన్ జిలుజిలు మసలాడివిబో :

    జిలేబి

    ReplyDelete


  96. ఏందమ్మ గిట్ల చేస్తివి?
    విందును గొల్పెడు జిలేబి విరివిగ యూరే
    డెందము గుబులెత్తించే
    సుందరి వయ్యావు పద్మ! చూపుల హాట్ హాట్ :)

    జిలేబి

    ReplyDelete


  97. యాడ దాస్తివి ప్రియుని సయాటలాడ
    గిట్ల నీవు పరేషాను గింగురుమను
    కైపు లెక్కించు రీతి సక్కంగ సేసి
    నావు గద!జిలేబి ముదిత! నాదు పద్మ :)

    జిలేబి

    ReplyDelete


  98. పోతాడే పడి పోతా
    డే తరుణీ మన్మథుండు డెందము తూలం
    గా తా ళలేడు పద్మా
    మీ తాకిడికి రమణీ తమీజ్కోల్పోవున్ :)

    జిలేబి

    ReplyDelete


  99. వారిది ప్రేమవివాహము !
    చేరగ నొకరికి నొకరుగ చెంగట, మజ మిం
    చారంగ జిలేబీ, పూ
    జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్

    జిలేబి

    ReplyDelete


  100. సాహిత్యంబయ్యెనుగా
    యే హితమున్ జేర్చనట్టి యెక్ రంగీలా
    జాహిరి వ్యాపారంబుగ
    లాహిరి లేదే జిలేబులకు మార్కెటయ‌న్!


    జిలేబి

    ReplyDelete


  101. ఓలమ్మో పద్మార్పిత
    నీ లెవలే వేరు సూవె నీరజ నేత్రా
    నీ లవ్వులోన ఓసోస్
    నే లైటయి పోయినాను నెలతి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  102. చిత్తూరు పాలకోవా
    మెత్తని యొడలు కులుకున్న మేని జిలేబీ
    మత్తున దేల్చేవుగదా
    చిత్తరువున్ చూడ మాకు చిగురిచె యాశా!

    జిలేబి

    ReplyDelete


  103. నా యెంట్రీపద్యంబది
    ఆ యతి గణములు పదముల అవకతవకలన్
    హేయము గా చూడక మా
    సాయమొనర్చిరి గురువులు చల్లగ సీతా!

    జిలేబి

    ReplyDelete
  104. ఒకరి ప్రతి కవితకి మళ్ళీ మీ పద్యాలతో భాష్యమా, “జిలేబి” గారూ? మీ బ్లాగ్ మీ ఇష్టం అనుకోండి, కానీ దీన్నే double jeopardy అంటారనుకుంటాను (చదువరులకు) 🙁.

    ReplyDelete
    Replies


    1. ఒకరి ప్రతి కవితకున్ మీ
      రు కందములతో జిలేబి రుబ్బుటదేలా
      సకియ, జియోపార్డియగు వి
      ను, కిరికిరి వలదు ప్రియ సుజనులపల్కులకున్


      జిలేబి

      Delete


  105. బాజారుపాలయెన్నప
    రాజితుడున్ శైలజయు పరంధాముడు నౌ
    రా జిజ్ఞాసువుడా మిము
    మా జిల్లా వెంకటేశు మంచిగ గావన్ :)

    జిలేబి

    ReplyDelete
  106. చిత్తూరు పాలకోవా ప్రసిద్ధా అండీ? చిన్నప్పటి నుండీ తెలిసినది ... పాలకోవాకు గోదావరి జిల్లా పేరుగాంచినదని. కర్ణాటక వారికి ధార్వాడ్ పేడా.

    చిత్తూరు పాలకోవా గురించి నా మటుకు ఇప్పుడే వింటున్నాను. మీ స్వంతజిల్లా కదా. ఎంతయినా మీ బ్లాగ్ అభిమానిని కావున ఓ కిలో తాజా పాలకోవా నాకు పార్సెల్ పంపవలె సుమండీ. నాకు ఇమెయిల్ పంపితే నా చిరునామా తెలపగలను. వేగిరం ... వేగిరం ప్లీజ్.

    ReplyDelete
    Replies

    1. వేగిరం‌ అంపించేసానండి

      జిలేబి

      Delete
    2. థాంక్సండీ. సో నైస్ ఆఫ్ యు 🙏. “అంపించింది” పాలకోవానా, ఇమెయిలా 🤔?

      “కన్యాశుల్కం” లో అన్నట్లు “ఠస్సా” బాగానే చెప్తారండీ మీరు 👌. పద్యాల బ్లాగ్ పుణ్యమాని మీరు ఏ ఊర్లో ఉంటున్నారో నాకు తెలిసిపోయింది ☝️. అది చిత్తూరు మాత్రం కాదు 🙂.

      Delete

    3. తస్సాదియ్య ! డిటెక్టివ్ నరసన్న :)

      నెనరుల్స్

      రెండున్నూ :)


      జిలేబి

      Delete
  107. కుర్రాడు మరీ వయోలెంట్‌‌గా వున్నాడు. వీడికి పువ్వుల్నీ, అమ్మాయిలనీ చూపించండ్రా!!

    http://manognaseema.blogspot.com/2011/02/blog-post_27.html?m=1

    ReplyDelete


  108. చోరులకు రేడు కొండడు
    గౌరమ్మ కొమార్తె! మరియొక హరికుడే కా
    గా రాధారమణుడు, కయి
    జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్!

    జిలేబి

    ReplyDelete
    Replies


    1. హరికుడు
      హరికుడు : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
      n.
      A thief, a gambler. తస్కరుడు, ద్యూతకారుడు.

      Delete


  109. విట్టుబాబు గారి కోసం జారులు మెచ్చిన కన్యను‌ "పేరువు" అనేవాడి పుత్రిక ను హరి యనే రారాజు లవ్వాడి మనువాడె :)


    పోరాడగ వెడలెను హరి
    రారాజు! తరుణియొకతె సరాగము లాడెన్
    పేరువు పుత్రిక యనుచున్
    జారులు నుతియింపఁగ, హరి శైలజఁ గూడెన్.

    ***

    పోరాడగ వెడలెను హరి
    రారాజు! తరుణియొకతె సరాగము లాడెన్
    "మారాజుకు తగ్గ రమణి",
    జారులు నుతియింపఁగ, హరి శైలజఁ గూడెన్.

    జిలేబి

    ReplyDelete


  110. బాజారుపాలయెన్నప
    రాజితుడున్ శైలజయు పరంధాముడు నౌ
    రా జిజ్ఞాసువుడా మిము
    మా జిల్లా వెంకటేశు మంచిగ గావన్ :)

    జిలేబి

    ReplyDelete


  111. నా యెంట్రీపద్యంబది
    ఆ యతి గణములు పదముల అవకతవకలన్
    హేయము గా చూడక మా
    సాయమొనర్చిరి గురువులు చల్లగ సీతా!

    జిలేబి

    ReplyDelete


  112. పారుడ! చదివిన వాటిని
    జోరుగ నాచరణలోన జొప్పించక నీ
    వీ రీతి బెకబెక యనగ
    భారత రామాయణములు వ్యర్థములు గదా!

    జిలేబి

    ReplyDelete


  113. శ్రీవిద్య యధర్వంబున
    తావిగ గలదోయ్ జిలేబి తరముగ గనుమా
    కోవిదులు తెలిపిరిగదా
    ఓ వనితా వినుమ వేద బోధన నిపుడే !

    జిలేబి

    ReplyDelete


  114. మన కత లివియె జిలేబీ,
    కనుగట్టు చదువుట తెలియకన్ చదువంగన్
    విను మార్యాణిని, హిమగిరి
    తనయను జెల్లెలిని, హరుఁడు దారలుగఁ గొనెన్

    జిలేబి

    ReplyDelete


  115. ఠస్సా బాగా చెబ్తరు
    తస్సాదియ్యా జిలేబి తవరెప్పుడునూ
    బుస్సుల కతలు తెలియవో
    మిస్సూ మాకు? సరి వింటిమిక బో మీకై :)

    జిలేబి

    ReplyDelete


  116. అంగజహరు శిరసు విడిచి
    గంగానది యుప్పునీరు గలదై పాఱెన్
    బంగాళాఖాతములో,
    చెంగలి శివుని విడువంగ చింతయె సుదతీ !

    జిలేబి

    ReplyDelete


  117. గోదారి గట్టు సైయను
    జాదరలాడెడు జిలేబి సరసము వలయున్
    సోదర! అంతే కానీ
    వేదాంగము లీ జగతికి విషతుల్యమ్ముల్ :)

    జిలేబి

    ReplyDelete


  118. సైయంటే చీర్సంటడు
    గాయం జేస్తడు నను సుడి గాలిగ కమ్మే
    స్తూ యెంకిబావ ముద్దె
    ట్టే యోచనచేస్తడు పయిటెగరేస్తాడే :)

    జిలేబి
    పరాార్ :)

    ReplyDelete
    Replies
    1. 🤦‍♂️ మీరు మారరు. కాబట్టి “పరార్” మీరు కాదు, మేము.

      Delete


  119. గలదోయ్ బుర్రా నాకున్
    గలగల లాడిస్త నేను కలము జిలేబీ
    వలదన్న వారిని బిరబి
    ర లాగి పారేస్త నేను రౌడీ రాణిన్ :)

    జిలేబి

    ReplyDelete


  120. విలువలు పతనంబాయెను
    పలువిధముల దోపిడి మనవాళ్ళు బడిరి శ్యా
    మల రాయ పనికి రాదు జ
    నుల కమెరిక కార్పొరేటు నునుపారులయా!

    జిలేబి

    ReplyDelete


  121. ఇంటి పేర్ల నడుమ విడువమాకు తలము
    విన్నకోట వారు విక్కి విక్కి
    యేడ్తు రమ్మ రమణి యేలనే తలనొప్పి
    తలము వీడ కమ్మ తమ్మికంటి :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మేము “వెక్కం” (రాయుడా, మజాకా?) కాబట్టి ... చిర్రుబుర్రు లాడ్దె రమ్మ ... అని మార్చండి (ఛందస్సు గట్రా మీరు చూసుకోండి).

      Delete


    2. మీకోరిక :)


      ఇంటి పేర్ల నడుమ విడువమాకు తలము
      చిర్రు బుర్రు లాడి చితక బొడ్తు
      రమ్మ విన్న కోట రాయలు, కావున
      తలము వీడ కమ్మ తమ్మికంటి :)

      జిలేబి

      Delete
    3. బాగానే ఉంది కానీ మళ్ళీ “తలము” (??) వదిలారుగా. Incorrigible.

      Delete

    4. సరిగానే తలము వదిలామండి,
      విన్న - వినగ కోట రాయలు :)



      జిలేబి

      Delete

    5. బైదివే విన్నకోట అంటే అర్థం చెబ్దురూ ?


      జిలేబి

      Delete


  122. ఇంటి పేరు తప్పైనచో నీరజాక్షి
    కిక్కు లిత్తురమ్మ జిలేబి కిరికిరి వల
    దమ్మ చెంపలేసుకొనుమ తమ్మికంటి
    బుద్ధి గాను నడచుకొను పూవుబోడి :)

    జిలేబి

    ReplyDelete


  123. వెక్క మమ్మ మేము వీరులమూ రాయ
    లము జిలేబి విను కలమ్ము మార్చి
    రాయ వమ్మ పడతి రాచఠీవి జనుల
    మమ్మ రాంగు బోవ మాకు సకియ!

    జిలేబి

    ReplyDelete


  124. పెద్దల మాట జిలేబీ
    చద్దన్నపు మూట నీకు సరిజేర్చుకొనన్
    సుద్దులు నేర్వంగవలయు
    బుద్ధి పెరుగునపుడె సూవె పుత్తడి బొమ్మా :)


    జిలేబి

    ReplyDelete


  125. ఒడ్డె నిల్లాపె జూదరి,యొక్క భర్త,
    పంపె నడవికి మరియొక భర్త లోకు
    ల కొరకై ! చూడ గాను లలనల లేమి,
    ద్రౌపదియు సీత లొకతండ్రి తనయ లు గద!

    జిలేబి

    ReplyDelete


  126. నయిమాలూమెవడో గా
    ని యైదరాబాదులోన నిక్కచ్చిగ గొ
    ప్ప యివపుగుబ్బలి గాడే
    నయ చక్కగకట్టినాడు నవ్యత గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  127. మా పక్కింటావిడయే
    ద్రౌపది తన చెల్లి సీత ! దరిమిల నొక తం
    డ్రే పద యిరువురికి జిలే
    బీ పద్యము గట్టినాను వినుమోయ్ గనుమోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  128. సుమధుర రసవత్తరముగ
    గమకము తోడుగ జిలేబి గావించేరం
    డి, మనసు దోచిరి పద్మా
    నమస్సుమాంజలి గొనండి ననబోడి భళా!

    జిలేబి

    ReplyDelete


  129. ఏడిస్తే వర్షములో
    చూడండీ నిజముగాను చుక్కై నా పూ
    బోడీ, కనబడదండీ!
    వేడిని తాళండి మీరు వినుడీ మాటన్ !

    ReplyDelete


  130. మీరే భావాన్నైనా
    పోరీ హత్తుకొనునట్లు పొడిచేస్తారం
    డీ!రా! మా లక్ష్మీ ! ప
    ద్మా! రా వమ్మా జిలేబి దర్శన మిమ్మా !

    జిలేబి

    ReplyDelete


  131. పాలేటి రాచ కన్యయు
    కోలాహలము కలిగించు గోమిని లక్ష్మిన్
    బాలకుమారా కొల్చుచు
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!

    శుభం !

    ***

    గోలల మనీపరసులో
    లీలలు గలవయ ! జిలేబులీను జిలేబీ
    లే! లక్షణముగ వారికి,
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్

    ***

    చాలా చక్కగ యిస్త్రీ
    చేలల కొనరిచి ధరింప చెప్పెడు పూబో
    డీ లలనలు సతులవుదురు
    స్త్రీలకు మ్రొక్కిన, ధనమును శ్రేయముఁ గల్గున్ :)

    ***

    వేలకు వేల ధనమ్మును
    చాల సమర్థులుగ "యైటి" సంగతి గనిరే :)
    గోలలు వలదువలదనకు !
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


    ***

    బేలలు బేలలనకు ! కర
    వాలము బట్టిరి తుపాకి వాటము గనిరే !
    కేలుమొగువు మానవుడా!
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్

    ***

    చాలమి లే, తిరుగాడిరి
    గోళము లన్తిరిగిరి భళి గూగుల్ లో మీ
    లా లక్షలను గడించిరి
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


    ***

    జోలెలు బట్టిరి మగవాం
    డ్లే !లెస్సగనయిరి మగువలే లబ లబలే
    లా ! లావణ్యవతులయా !
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!

    జిలేబి

    హమ్మయ్య ఉబ్బసం తీరింది :)

    ReplyDelete
    Replies
    1. "ఉబ్బసం" కాదు, కడుపుబ్బరం అనాలేమో కదా ☺ ?

      Delete

    2. అవునండోయ్ మీరే సరి

      జిలేబి

      Delete


  132. ఉబ్బస మా? లేమా కడు
    పుబ్బర మా? తెలుపుమమ్మ పువుబోడీ !నీ
    పబ్బము గడిచెను నేడే
    సుబ్బమ్మా! భళి జిలేబి సుడిగాలిగయే :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కాదేదీ పద్యానికనర్హం ... అన్న పోలసీయా మీది? ఇప్పుడు దీనిమీదో పద్యం వదులుతారు కాబోలు?

      Delete


  133. కాదేదీ పద్యానికి
    మీదు జిలేబుల కనర్హ మీ లోకములో
    రాదయ్యా కందంబున
    కేదియు సాటి భువిలోన కివకివలాడన్ :)

    జిలేబి

    ReplyDelete


  134. కాపులార లెండు కలసి రండు విజయ
    మందు కొనగ నాంధ్ర మాత సంత
    సింప చేవ గల్గి సింహము లై రండు
    రావు గారి పిలుపు రాజిలగను


    చంద్రన్న కే సవాల్ :)
    జిలేబి

    ReplyDelete


  135. విద్యా గంధము లేదని
    పద్యము రాదనెను, గరికిపాటికి, నలుకన్,
    "చోద్యము జిలేబి! రాయగ
    సేద్యంబుగ వేద్యమగును" చెప్పిరి వారున్!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నిజంగా జరిగిన దాని మీదే సమస్యాపూరణం ఇచ్చారుగా. కొన్నేళ్ళ క్రితం ... గరికపాటి వారు కూడా వేదిక మీద కూర్చునున్న ఒక కాలేజ్ ఫంక్షన్లో ... వక్తగా వచ్చిన ఒక తెలుగు సినిమా హాస్యనటుడు తన ప్రసంగంలో గరికపాటి వారి గురించి అమర్యాదగా మాట్లాడాడు (ఆ నటుడు తాగి వచ్చాడని అన్నారు). ఆ సంఘటన గురించి మీరూ / తదితర కవులూ వినే ఉంటారుగా.

      Delete

    2. అవునాండి ? ఎవడా తాగొచ్చిన హాస్య నటుడు ?

      జిలేబి

      Delete


    3. మద్యము సేవించి యొకడు
      పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్
      ఖాద్యంబేమియొ నతనికి
      చోద్యము గా వేదిక పయి జోకులు వేసెన్ !

      జిలేబి

      Delete


  136. వైద్యుడొకడు "మాత్రల" నై
    వేద్యము గా నిచ్చి నాడు, వేదన తోడై,
    చోద్యము "క(గ) ణములు" సరిలే!
    పద్యము రాదనెను గరిక పాటికి నలుకన్!

    జిలేబి

    ReplyDelete


  137. విద్యాబుద్ధులు లేవని
    పద్యము రాదనెను, గరికిపాటికి, "నలుకన్
    గద్యము పద్యము లన్నియు
    వేద్యంబగునే జిలేబి" విదురుడు చెప్పెన్ :)

    జిలేబి

    ReplyDelete


  138. ఆద్యంతములు తెలియవే
    పద్యము రాదనెను, గరికిపాటికి, "నలుకన్,
    నాద్యంబగు దుర్గ దయను
    వేద్యంబగునే జిలేబి" విదురుడు చెప్పెన్ :)

    జిలేబి

    ReplyDelete


  139. బాడబ! కథలేలనయా!
    జోడుగ నంది గలదుగద చొప్పడు? దానిన్
    వీడుచు శాస్త్రీజీ, యే
    గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్?

    జిలేబి

    ReplyDelete


  140. సద్యోగంబిచ్చునకో
    పద్యము? రాదనెను, గరికిపాటికి, నలుకన్,
    విద్యార్థి ; చెప్పిరయ వా
    రద్యత విద్యానులాపి రావంబిదియే !

    జిలేబి

    ReplyDelete


  141. హృద్యంబగుపద్యమదియె
    సద్యఃస్పురణగ రచించె చక్కగ నతడే
    విద్యార్థుడననుచు నతడు
    పద్యము రాదనెను "గరికి" పాటికి, నలుకన్!

    జిలేబి

    ReplyDelete


  142. శంకరార్యుల వారి మాట గా :)

    చోద్య "మరవపాటి" కిదే
    యుద్యోగంబో? విడువదు యుక్తమయుక్తం
    భేద్యము గానదకో యని
    పద్యము రాదనెను, "గరికి" పాటికి, నలుకన్ :)



    జిలేబి

    ReplyDelete


  143. విన్నకోట ఉవాచ

    కొన్నేళ్ళ క్రితం ... గరికపాటి వారు కూడా వేదిక మీద కూర్చునున్న ఒక కాలేజ్ ఫంక్షన్లో ... వక్తగా వచ్చిన ఒక తెలుగు సినిమా హాస్యనటుడు తన ప్రసంగంలో గరికపాటి వారి గురించి అమర్యాదగా మాట్లాడాడు (ఆ నటుడు తాగి వచ్చాడని అన్నారు

    దీని ఆధారంగా

    మద్యము సేవించి యొకడు
    పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్
    ఖాద్యంబేమియొ నతనికి
    చోద్యము గా వేదిక పయి జోకులు వేసెన్.

    జిలేబి

    ReplyDelete


  144. బాడబ! మోడీ యెక్కిన
    గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్,
    జోడుగ, నందిని వీడుచు
    వేడుక చూడన్ జనాళి వీరంగములన్ :)

    జిలేబి

    ReplyDelete


  145. బాడబ! కథలేలనయా!
    జోడుగ నంది గలదుగద చొప్పడు? దానిన్
    వీడుచు శాస్త్రీజీ, యే
    గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్?

    జిలేబి

    ReplyDelete


  146. మనసేదేదో చెబ్తుం
    ది,నమ్మినా వంటె పద్మ దిరిసెన పువ్వా
    క్షణమున నీవే యేమా
    రి నమ్మకము కోలుపోయి రివటవవుతవే !

    జిలేబి

    ReplyDelete


  147. బోల్మేరా అబ్బా జాన్ !
    బాల్మా! చెప్పితి జిలేబి బాగుగ వినవే !
    సల్మాను ఖాను,దరిమిల
    వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా!

    జిలేబి

    ReplyDelete


  148. జుల్ముగ చెప్పిరి కవివరు
    "వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా",
    కల్మషమైన, సరియనెద !
    మల్మల్ నెలతుక జిలేబి మహిళను, కవిరాట్ !

    జిలేబి

    ReplyDelete


  149. పల్మాఱు వందనమ్ములు ?
    కల్మష ముల దీర్చు గంగ కలదెచ్చటనో ?
    అల్మారి రామబాణపు ?
    వాల్మీకికి; రాజమండ్రి; వాసమ్ము గదా!

    జిలేబి

    ReplyDelete


  150. ఆకాశంబు నిలుపద
    మ్మా కజ్జలముల జిలేబి మాన్యత యదియే
    యే కలతయు పడరౌ సు
    మ్మీ కంజదళాయతాక్షి మేటి మనుజులున్!

    జిలేబి

    ReplyDelete
    Replies


    1. The vast sky never impedes the drifting white clouds.

      Uchiyama Roshi

      Delete


  151. ఉల్ముకము బట్టి వెతికితి
    నిల్మెతవారిఖు చదివితి నెచటన్ గలదో
    యిల్మీ చెప్పవె సఖియా,
    వాల్మీకికి రాజమండ్రి వాసమ్ముగ, దా !

    ***

    ఉల్ముకము - కొరవి దీపము

    ఇల్మెతవారిఖ్ - ఇతిహాస విద్య/చరిత్ర

    ఇల్మీ - జ్ఞానము తెలియ జేయుట


    ఆంధ్ర భారతి


    నమో నమః
    జిలేబి

    ReplyDelete


  152. చిక్కటి కాఫీ యిత్తురు
    ప్రక్కన నిలబడి కుశలము ప్రశ్నింతురయా
    మొక్కిన కాళ్లకు దస్కము
    చిక్కును బేడ యరకాసు చింతయు దీరున్ ;)

    జిలేబి

    ReplyDelete


  153. పెద్దల కాళ్లకు మొక్కిన
    ముద్దుగ నాశీసులిడి సముచితము గా మీ
    రొద్దన్నా నిత్తురుగా
    సుద్దులు తో బేడ కాసు శుభముగ రాజా!


    జిలేబి

    ReplyDelete


  154. అసలు కలలు కనడమ్మే
    పస లేని పని కద పద్మ వలదే యవి నీ
    కు సుగంధి నాదు పల్కు మ
    నసున గొనుమ నెలతుకా ! చనవరి! జిలేబీ !

    జిలేబి

    ReplyDelete