Wednesday, August 8, 2018

కరుణానిధి - బై బై


కరుణానిధి - బై బై 
 
The Last in the Row
 
Bye Mr Karuna




కరుణానిధి !
 
నివాళి

కరుణానిధి! తమిళుల"మా
బెరుం కళై న్యరు"లకట కుబేరుని తలద
న్న రయముగ పయన మైనా
ర, రడారుడిగ హరివాసరమున జిలేబీ !

ఏకాదశి కి ముహూర్తం బెట్టుకున్నావా సామి!

ఇండ్రు పోయి నాళై వా !
 
హ్యాపీ ట్రావెల్ ఎహెడ్ 

జిలేబి
 

206 comments:


  1. జీవితమంటే యింతేరా ! వాత్సాపు వేదాంతం :)


    94 సంవత్సరాల వయసు
    80 సంవత్సరాల రాజకీయ జీవితం
    50 సంవత్సరాలు ఒక పార్టీకి అధ్యక్షుడు
    13 సార్లు ఎమ్మెల్యే
    5 సార్లు ముఖ్యమంత్రి
    చివరికి 6x3 అడుగుల కోసం కోర్టు అనుమతి .
    లైఫ్ అంటే ఇంతే....

    ReplyDelete
  2. “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్” బ్లాగర్ బొందలపాటి గారు కరుణానిధి గారికి జనాల నివాళి మీద బ్రిలియంట్ పోస్ట్ వ్రాశారు. అదేమాట వారి బ్లాగ్ లోనే చెబుదామనుకుంటే వారు కామెంట్ల పెట్టె తీసేసినట్లున్నారు, ప్చ్.

    ReplyDelete

  3. ఎక్కడండి టపా కనిపించలేదు


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆశ్చర్యం, టపా కనిపించలేదా? బొందలపాటి వారి wordpress blog లో “కొత్త టపాలు” సెక్షన్లో “కరుణానిధి” అనే Aug 8 వ తేదీ టపా చూడండి.

      bondalapati.wordpress.com

      Delete

    2. మరీ టపా ' చిక్కి పోయి ' రష్యా క్యూబా వెనకాల పోయె :)

      టపా బాగుంది గాని ఆ మడిసి కై అన్ని మంది‌ వచ్చేరు కదా నివాళుల నివ్వటానికి దాని కేమంటారు ?:)


      జిలేబి

      Delete
    3. 95 సంవత్సరాల మనిషి చనిపోతే పడీ పడీ ఏడవనక్కరలేదు అనిన్నూ, ఆత్మకి చావులేదు కదా మళ్ళీ పుడతారులే అనిన్నూ, 80 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం సాధించాడనిన్నూ ఆయన ఉద్దేశ్యం అయిఉంటుంది.

      Delete

    4. సూపర్ :)


      జిలేబి

      Delete
    5. ఎన్నా ఇండ్రు ఎన్నా నాళై?
      యారు కాగే యారు కాగే?
      ఏది రష్యా ఏది క్యూబా?
      ఎవరు స్టాలిన్ ఎవరు కాస్ట్రో?
      ఎక్కడ గిండీ ఎక్కడ మరీనా?
      ఎప్పుడు ఏకాదశి ఎప్పుడు అమావాస్య?
      ఎందుకు సమోసా ఎందుకు జిలేబీ?

      Delete

  4. బై ది వే విన్న కు కోట కు మధ్య స్థలం వదిలితే గుర్రంటారుగదా మీ వంశ చిహ్నము నకు అర్థమేమిటి ? :)


    జిలేబి

    ReplyDelete
  5. జిలేబీ గారూ:

    ఈ నెల IIT Kharagpur Home Page Slide Show (bottom left) లో Prof G. P. Sastry (gps) photo ఉన్నది...మీరు చూడాలనుకుంటే...

    http://www.iitkgp.ac.in/

    ReplyDelete
    Replies

    1. అయ్య బాబోయ్!

      జీపీయెస్ గారు మీరు ఉస్తాద్ బడే మియాఖాన్ లావున్నారు ! సీనియర్ ఫాకల్టీ యున్న మాట!


      నేనేదో సరదాగా అప్పుడప్పుడు మీపై పేర డీ లను వేసేస్తున్నా!


      క్షమార్పణలు


      జిలేబి

      Delete
    2. 😊

      ముప్ఫై యేళ్ల క్రితం నా క్లాసులో కూర్చొన్న చంద్రలేఖా సింగ్ (బీహారి) ఆకస్మాత్తుగా నన్ను తలచుకొని నా పేరున సరి క్రొత్తగా ఒక Student Excellence Annual Award (Rs 50,000 per year for the best poor student) స్థాపించినది కొద్ది రోజుల క్రితం. ఉలుకూ పలుకూ లేకుండా. ఆవిడకు ధన్యవాదాలు చెప్పడానికి ఆమె e-mail id Google నుంచీ సంపాదించ వలసి వచ్చినది. ప్రస్తుతం ఆవిడా ఆవిడగారి అమెరికన్ భర్తా University of Pittsburgh లో Professor లు...

      ఈ వార్త తెలిసి మా iit friends అందరూ నాతో మాట్లాడడం మానేశారు :)

      ఆడువారు ప్రళయాంతకులు...

      Delete

    3. నమో నమః


      జిలేబి

      Delete
    4. అభినందనలు gps గారూ. మీ పూర్వ విద్యార్థి మీ పేర అవార్డ్ నెలకొల్పారంటే మీపట్ల, మీ బోధన పట్ల ఎంత admiration ఉందో తెలుస్తోంది. ఇది ఒక అరుదైన గౌరవం కదా 👏.

      IIT.KGP వారి హోమ్ పేజ్ లో ఈ వార్త వ్రాస్తూ “in the memory of” అని వ్రాశారు 🙁. దాని బదులు in honour of అంటే సబబుగా ఉంటుంది కదా. వారికి మెయిలిచ్చో ఫోన్ చేసో చెప్పరాదూ ? ఓహో, మీ ఫ్రెండ్స్ మీతో మాట్లాడడం మానేశారు అన్నారు కదా పైన 😀. మరెలాగ సవరణ చేయించడం 🤔?

      Delete
    5. అయ్యా విన్నకోట వారూ:

      ధన్యవాదములు. ఆ శుభ వార్త నాకు తెలిపి నన్ను ఈ Foundation Day Award Function కి ఆహ్వానించిన Alumni Dean గారికి నేనింకా ఈ భూలోకంలో బ్రతికి ఉన్నానని తెలుసు. కానీ ఏమి చేయగలరు వారు...అది ఒక కీకారణ్యం. Home Page తయారు చేశే వారు వేరొకరు. ఆమెకు ఏమి చేయాలో తోచలేదుట...నాతో పాటు ఈ "గౌరవాన్ని" అందుకున్న మందాకిని మజుందార్ గారేమో ఎప్పుడో స్వర్గస్థులైరి...

      పోయినదేమున్నది...నా పింఛన్ నాకు నెల నెలా వస్తూనే ఉన్నదిగా...

      😊

      Delete
  6. If this is an indicatipn of the type of behaviour on the part of their staff then hereafter better think twice before booking your ticket on this airline.

    బ్రిటిష్ ఎయిర్వేస్ వారి స్టాఫ్ ప్రవర్తన

    ReplyDelete
    Replies

    1. బుద్ధి లేని మేధా జీవులు


      జిలేబి

      Delete

    2. ఆ బుడుగు కి -విశుద్ధ కుంద నిభ పాండిమ వర్ణ విరాజమాన మా
      ర్జాల మనోభిలాష ఘన రంజన దుగ్ధము తాపించి బొజ్జోయించి వుంటే అయి పోయే దానికి ఇంత సీన్ క్రియేట్ చే సా రా బ్రిటీష్ ఏర్వేస్ వారు ?


      జిలేబి

      Delete
    3. అహంకారం అయ్యుంటుందండీ, అహంకారం.

      Delete
    4. మీలాంటివారే స్కూల్లో మాకో టీచర్ ఉండేవారు. ఆయన్ని ఏమన్నా అడగాలంటే ... పిల్లి అంటే ఏమిటి సర్ అని అడిగితే మార్జాలం అని అర్థం చెబుతారని ... విద్యార్థులు జంకేవారు 🙂 .

      Delete
    5. అసలు ఇటీవలి కాలంలో చాలా ఎయిర్ లైన్స్ లో స్టాఫ్ - ముఖ్యంగా ఫ్లైట్ లో స్టాఫ్ - ప్రవర్తన చాలా దురుసుగా తయారయింది. యునైటెడ్ ఎయిర్-లైన్స్ (అమెరికా కంపెనీ) వారి ఉదంతాల గురించి వినే ఉంటారుగా. Safety in the skies అనే మిషతో ప్రతి చిన్న విషయానికీ ప్రయాణీకులతో వాదన, కిందకు దింపెయ్యడం / ఈడ్చెయ్యడం. మనదేశపు ఇండిగో వారి అనుచిత ప్రవర్తన గురించి కూడా విన్నాం కదా (గ్రౌండ్ మీద అనుకోండి. కానీ ఏదైనా అమర్యాద అమర్యాదే). ఎదురు డబ్బిచ్చి వారి చేతుల్లో అవమానం పొందడంలా అనిపిస్తుంది ... అటువంటి వార్తలు విన్నప్పుడల్లా.

      Delete

    6. టికెట్టు బుక్ చేసేటప్పుడే రిజెక్ట్ ఆప్షన్ పెట్టుకుంటారేమో వాళ్ళిక :)


      జిలేబి

      Delete


    7. ఇట్లాంటి ఇంసిడెంట్లు నాలుగైదు అయితే మన మహారాజా ఏర్ లైన్స్ వారికి గిరాకీ ఎక్కువై పోతుంది :) ఏమంటారు ?

      జిలేబి

      Delete
    8. బుడ్డోడు అంత గట్టిగా ఏడుస్తుంటే రేసిజం అని ఎలా వ్రాస్తారండీ ?

      Delete
    9. అవ్వాలి కూడా. మహారాజా గారి స్టాఫ్ కి కూడా అహంకారం, నిర్లక్ష్యం తక్కువపాళ్ళేమీ కాదు. కానీ
      ప్రయాణీకులు ఆ అవమానపడేదేదో ఇంటివాళ్ళ చేతుల్లో అవమానపడడం నయం కదా, హ్హ హ్హ 😀😀.

      Delete
    10. బుడ్డోళ్ళు ఏడవడం సహజమండీ నీహారిక గారూ, విమానప్రయాణం, క్లోజ్డ్ స్పేస్, బంధించినట్లున్న సీట్ (బుడ్డోడి దృష్టిలో) ... ఇటువంటి రకరకాల భయాల వలన ఆ టైములో చిన్నపిల్లలు ఏడవడం ఆశ్చర్యమేమీ కాదు. అంతమాత్రాన కిటికీలోంచి బయటకు విసిరేస్తాను అన్నాడన్న ఆ ఎయిర్-లైన్స్ ఉద్యోగి ప్రవర్తన పూర్తిగా అసంబద్ధమైనది. ఆ బుడ్డోడే గనక తెల్లవాడయ్యుంటే ఆ ఉద్యోగి మాట వేరే రకంగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ ఆ కుటుంబం శ్వేతేతరులు కాబట్టి ఆ ఉద్యోగి చేసిన పనిని రేసిజం అనే అంటున్నారు.

      Delete

    11. - బుడ్డోళ్ళు ఏడవడం సహజమండీ నీహారిక గారూ

      ఈ విషయం నీహారిక గారికి తెలియక పోయి వుండచ్చంటారా విన్నకోట వారు ?


      నారదా!
      జిలేబి

      Delete
    12. పుల్లమ్మా....

      బుడ్డోడు ఏడ్చిందుకు గాదు ఆవిడ బాధ....విమానం నుండి దింపేసినందుకు కూడా కాదు....డబ్బులు వాపస్ ఇవ్వలేదని రేసిజం అంటగట్టింది.ఆవిడ కూడా కేసీఆర్ లాంటిదే.....ఆంధ్రా వాళ్ళవల్లే మేము బాగుపడటం లేదు అని ఏడవలా ?

      Delete
    13. >>> కిటికీలోంచి బయటకు విసిరేస్తాను అన్నాడన్న ఆ ఎయిర్-లైన్స్ ఉద్యోగి ప్రవర్తన పూర్తిగా అసంబద్ధమైనది>>>
      ఛ...ఊరుకోండి సార్, మీరు గాసిప్ వార్తలు భలే నమ్మేస్తారు.ఆ విమానంలో అంతమంది ఉంటే ఆ మాట అన్నందుకు ఊరుకుంటారా ?
      నేను ముందే చెప్పినట్లు మీరు ఇంకా 1947 లోనే ఉన్నారు.బయటికి రండి సర్ !

      Delete
    14. // “ ...... అ మాట అన్నందుకు ఊరుకుంటారా ?” //

      ఊరుకోక ఏం చేస్తారట, అహ ఏం చేస్తారని? జనాల మనస్తత్వం గమనించలేదా? ఎక్కడన్నా గొడవ జరుగుతుంటేనూ / రైల్లోనో బస్సులోనో ఒక ప్రయాణీకుడిని(...రాలిని) ఆ ఉద్యోగో మరొకరో సతాయిస్తుంటేనూ ... పక్కనున్నవారు కల్పించుకోవడం ఎన్నిసార్లు చూశారు మీరు? అందులోనూ విమానంలో .. తామేదో చాలా హైక్లాస్ అనుకునే ప్రయాణీకులే ఎక్కువగా తగులుతుంటారు. ఇప్పుడు ఆ ప్రయాణీకుడికి జరిగినది రేపు మనకు కూడా జరగచ్చు అనే ఆలోచన ఆ టైములో రాదు.

      మీరు కూడా 1957 ప్రాంతంలోనే ఉన్నట్లున్నారే ?! 😀😀

      Delete
    15. "జిలేబి" గారికి "పుల్లమ్మ" అని భలే పేరు పెట్టారే నీహారిక గారూ 👌. చాలా apt పేరు 😅😅.

      Delete


    16. పుల్లమ్మాయని పేరునిచ్చి తగుకైపున్ గౌరవమ్మిచ్చిరే
      యెల్లోరుమ్ యిని పోట్రి వాழ்తిడ యిదో యెన్ సీయెమాన్ వృత్తముమ్
      పల్లాండాయిర కాలమిద్ది నిలువన్ పాండిత్యలోకంబులో
      మల్లాగుల్లల చేసి చూడ కవులున్ మా పద్యమర్థంబవన్

      ಜಿಲೇಬಿ

      Delete
    17. స్వయం ప్రకటిత నారదులవారని వారే సెలవిచ్చిన తరువాత ఇంతకన్నా మంచిపేరు తట్టలేదు :)

      Delete
    18. పండిత వృషభాల దండి మన్నన లొంది
      తెలుగు పద్యమందు వెలుగుచున్న
      బుధుల నిట్లు పిచ్చి పుల్లమ్మ యని బిల్చి
      నారదీయ మనుచు నగెద రేల ?

      Delete
    19. అబ్బే, నవ్వడం కాదు రాజారావు గారూ, వారిని సరిగ్గా గుర్తించడం.
      నారదుల వారి స్ఫూర్తి నిండా నింపుకున్నవారు "జిలేబి" గారు. గురుభ్యోన్నమః అని అభివాదం చేసినట్లే వారు నారదులవారిని స్మరించుకుంటారు ☺

      Delete
    20. @వెంకట రాజారావు . లక్కాకుల

      ఇది మరీ బాగుంది...మీరే పిచ్చి తగిలించారు.ఆవిడే అందరినీ గేలి చేస్తూ నవ్వుకుంటారు.మాకు అంత సీనుందా ? వృషభాలే ఆవిడను ఆపగలరు కానీ ఆంధ్రభారతిలో ఆవిడ వ్రాసే పదాలకు అర్ధాలు వెతుక్కునే మేము అంతటి సాహసం చేయగలమా ?

      Delete
    21. కుఠార మంటే గొడ్డలి . చెట్టు అనే అర్థంలో ప్రయోగించి ఆంధ్రభారతిని చూపించారు .
      అహింసనూ - హింసనూ ఒకే పదానికి
      కట్టేశారు . అమేయ ధిషణా ధురీణులైన
      ' అక్కడి ' కవి-పండిత వృషభాలే జుట్లు
      పీక్కున్నాయి . అంతటి ' నవ నవోన్మేష
      ప్రతిభా భాంకార భేరికా డాండ డడాండ
      డాండ నినదాండ చండ కవి ప్రచండ పండిత
      ప్రకాండులకు ధిక్కారమా ? ' యని ..... ఇంచుక మది కలంచె . (Jk)

      Delete

    22. ఈ కుఠార మే దో మా పై కుట్రలా వున్నది :)
      లింకు ఇవ్వండి :)

      జిలేబి

      Delete
    23. "నవ నవోన్మేష ప్రతిభా భాంకార భేరికా డాండ డడాండ డాండ నినదాండ చండ కవి ప్రచండ పండిత
      ప్రకాండులకు ధిక్కారమా ?"
      👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
      👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
      👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
      👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
      👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
      👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
      👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌

      Delete
  7. జిలేబీ గారూ:

    పిట్ట కొంచెం తోక ఘనం: 👇


    *****************************

    Sastry Ji : My heartiest congratulations on your being recognised and honoured.for an illustrious life as a great teacher of IITKGP.

    With warm regards
    KL Chopra

    Prof (Dr) K. L. Chopra (Padamshri)
    FNA, FASc, FNASc, FNAE, D.Sc.(hc)
    Former Director, IIT Kharagpur & Former Professor & Dean, IITDelhi
    President , Society for Scientific Values
    Distinguished Honorary Professor,IITD,IITKGP,IITBhb,NITP,IIEST and NCU
    Res : M-70, Kirti Nagar, New Delhi-110015
    Tel :25154114; (M) 9213433266
    E-mail : choprakl@gmail.com

    ReplyDelete

  8. మంచి కాలము చోప్రా గారికి తెలుగు తెలియక పోవడం :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు.... చోప్రాగారికి చెప్పేస్తాను.

      Delete

    2. మీకు భాషలు రావచ్చండి . చెప్పనూ వచ్చండి . ఆయన కర్థమయ్యే టట్లు చెప్పటం మీ వల్ల అవుతుందంటారా ? :)


      జిలేబి

      Delete
    3. మీరెవరినైనా కదిలించగలరు. మీ శక్తిసామర్ధ్యాలు మాకు తెలియనివా ? నా మీద కంపైంట్ చేసి నా బ్లాగు పీకించిన ఘనత మర్చిపోతానా ? రచ్చబండ బ్లాగులో జరుగుతున్న రచ్చ కనబడడం లేదా ? ఆగ్రిగేటర్లలో అంత పొడుగు కమెంట్లతో నిండిపోతావుంటే మీరు కూడా చేరి గుప్పెడు పేలాలు వేస్తున్నారే ! నీహారిక ఒక్కతే ఏం పుణ్యం చేసుకుందీ?

      Delete
    4. ఔరా! మీ బ్లాగును ఎవరో పీకించటం ఏమిటి నీహారిక గారూ?
      మీ రమ్యంగాకుటీరాన> బ్లాగు నిక్షేపంగా కనిపిస్తూనే ఉందిగా అందరికీ?

      మీ రన్నట్లు ఆ రచ్చబండ బ్లాగు ఒక బురదగుంట మాదిరిగా ఉంది. అటువైపు వెళ్ళకపోవటమే అందరికీ క్షేమం అనుకొంటున్నాను. అక్కడ పేలాలు కాదండీ బాబూ కంకర్రాళ్ళు ఎగురుతున్నాయిలా ఉంది.

      Delete

    5. ఏ ప్రొఫైలు నీహారిక అంటున్నారో
      ఏ ప్రొఫైలు నీహారిక బ్లాగులు పోయేయో
      ఏ ప్రొఫైలు ఇక్కడ నీ గారి కో

      ఔరా ! ఎవరికెరుక !


      అంతా విష్ణు మాయ విష్ణు మాయ


      జిలేబి

      Delete
    6. నా బ్లాగుని మాలిక ఆగ్రిగేటర్ నుండి తీయించారు అని అంటున్నాను.మీకు ఏమీ తెలియనట్లు నాటకాలా ? పిడకిచ్చుకు కొడితే నీహారికెవరో బాగా గుర్తుంచుకుంటారు.ఆ రోజు కోసం వెయిటింగ్ ఇక్కడ (ఖైదీ నం 150 చిరంజీవి స్టైల్ లో)

      Delete
  9. విన్నకోట వారూ:

    మీ సూచన ననుసరించి IIT KGP వారు వారి Home Page Website లో తగిన మార్పు చేశారు...నా ప్రమేయం ఏమీ లేకయే 😊👇

    http://www.iitkgp.ac.in/

    ReplyDelete
    Replies
    1. వరూధిని బ్లాగు చదివిరి కాబోలు :)

      Delete
    2. How nice శాస్త్రి గారూ. సవరించిన హోంపేజ్ చూశాను. ఇప్పుడు సొంపుగా ఉంది 👌.

      IIT.KGP లో ఎవరో ఒకరు (తెలుగువారు) “వరూధిని” బ్లాగ్ చదివే ఉండే అవకాశాలు లేకపోలేదు. చాలా పాప్యులర్ బ్లాగ్ కదా 🙂.

      Delete

    3. :)

      జీపీయెస్ వారికి యెక్కడ లింకు పెడితే యెక్కడ అంటుకుంటుందో తెలుసు కామోసు :)


      జిలేబి

      Delete
    4. ఇక్కడ దాచిన సవరణ
      యెక్కడికో పోయి పోయి యింపుగ వ్రాలెన్
      చక్కని జిలేబి తీపును
      మక్కువతో పంచుకొనుడు మగువలు పురుషుల్!

      Delete

    5. :)

      అంతా విష్ణు మాయ :)


      జిలేబి

      Delete


  10. వాజపేయుడు వెడలెను వసుధ విడిచి
    భరత మాత యు కోల్పోయె వ్యాహృతీశు
    ని! తన వంతుగ భాజ్పాకు నిగనిగమను
    రూపు చక్కదీర్చినవాడు రూఢి గాను !


    జిలేబి
    RIP Vajpayee Ji

    ReplyDelete
    Replies
    1. అవునండి. గొప్ప వక్త, కవి, రాజకీయ పరిణితి కలిగినవాడు, ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చినవాడు, స్టేట్స్-మన్ శ్రీ వాజపాయి గారు.
      నిండైన జీవితం గడిపినవారున్నూ. వారి ఆత్మకు సద్గతి కలగాలి 🙏.

      Delete
    2. కాశ్మీర్ పాకిస్థాన్ అంతర్భాగమని అంటే "పాకిస్తాన్" భారత్ అంతర్భాగమని అన్నందుకు నాకు నచ్చి
      బీజేపీ లో "వాజ్‌పేయి" గారికోసం ఒకసారి ఓటు వేసాను.

      Delete
  11. మనుమరాలు ఏతెంచిన స్మృతులు:


    శంకరాభరణం పద్య రచన - 1038
    కవిమిత్రులారా!
    “కలయో వైష్ణవమాయయొ...”
    ఇది పద్యప్రారంభం.
    దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.


    కలయో వైష్ణవమాయయొ
    తిలకించగ నెల క్రితమిది తెలియక నెచటో
    నిలలో కానగ రాకయె
    కిలకిల నరచుచును నేడు కేరింతలిడెన్

    (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

    https://kandishankaraiah.blogspot.com/2015/10/1038.html?m=1

    ReplyDelete


  12. కలయో వైష్ణవమాయయొ
    తెలిసీ తెలియక జిలేబి తెలుగున నేర్వన్
    జల జల రాలెను కందం
    బులు పంచదశపు జగమున బుధుల తల తినన్ :)

    జిలేబి

    ReplyDelete
  13. శిఖరసమానమైన వ్యక్తిత్వం కలిగిన వాజపాయి గారు నిన్న గతించారు, ఈ రోజు సాయంత్రం వారి అంత్యక్రియలు ముగిశాయి. ఆణిముత్యంలాంటి ఒక రాజకీయవేత్తను కోల్పోవడం దురదృష్టకరం.
    అయితే ఆ విచారంలో, ఆ హడావుడిలో మరొక ప్రముఖ వ్యక్తి (వాజపాయి గారంత కాదు కానీ ఈయన కూడా చాలా పాప్యులర్) కూడా ముందు రోజున కాలం చేశారన్న సంగతి వెనక్కు వెళ్ళిపోయింది. వారే అజిత్ వాడేకర్ ... ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్. 1960 దశకం చివరిలోనూ, 1970 దశాబ్దం మొదటిలోనూ విదేశీగడ్డపై మొదటిసారిగా మనకు విజయాలు సాధించిపెట్టిన కెప్టెన్. ఎడమచేతి వాటంతో సొగసుగా ఆడిన బ్యాట్స్-మన్. స్లిప్స్ లో మంచి ఫీల్డర్. అన్నిటినీ మించి ఒక జెంటిల్మన్ క్రికెటర్ - ఆటవికపు ఎక్ప్రస్పరెషన్లు పెట్టి కంపరం పుట్టేట్లు ఫీల్డ్ లో ప్రవర్తించే ఇప్పటి ఆటగాళ్ళ మాదిరి కాదు. ఆనాటి ఆ వాడేకర్ కు కూడా నా శ్రద్ధాంజలి.

    ReplyDelete
    Replies
    1. కొన్ని నెలల కింద ఇండియా టుడేలో రాజదీప్ సర్దేసాయ్ క్రికెట్ పుస్తక ఆవిష్కరణ సభ చూపించారు, సభకు వాడేకర్ కూడా హాజరు అయ్యారు. రాజదీప్ ప్రసంగంలో తన తండ్రి మాజీ క్రికెటర్ దిలీప్ సర్దేసాయ్ గారికి గవాస్కర్, వాడేకర్ లాంటి వారికి ఉన్న స్నేహాన్ని ప్రస్తావించారు.

      ఇవాళ్టి ఇంగ్లాండు టెస్ట్ మాచిలో వాడేకర్ మరణం & ఇమ్రాన్ ప్రధాని పదవి రెంటి గురించి కామెంటేటర్లు చర్చిస్తారేమో చూడాలి.

      Delete
    2. చర్చించే అవకాశాలు లేకపోలేదు జై గారూ. కామెంటేటర్లలో గవాస్కరో, సంజయ్ మంజ్రేకరో ఉంటే గనక కనీసం ప్రస్తావన అయితే వస్తుంది. ఇతరులు వాడేకర్ కంటే ఎక్కువగా ఇమ్రాన్ గురించి చర్చించినా చర్చించవచ్చు .... ప్రధానమంత్రి అయిన ఒకప్పటి గ్లామర్ బోయ్ ప్లేయర్ కదా 🙂.

      Delete
    3. ఎవరైనా చర్చించారా జై గారూ? నేను టెలీకాస్ట్ చూడలేదు.

      Delete
    4. ఈ రెండు విషయాలు కూడా చర్చకు రాలేదండీ. గవాస్కర్ & మంజ్రేకర్ కామెంటరీకి రాలేదు.

      Delete
    5. ఆ తెల్ల కామెంటేటర్లయినా ప్రస్తావన తీసుకొచ్చుండచ్చు. ఏమిటో, ఇదివరకటి మర్యాదలు మాయమైపోతున్నాయి 😔.

      Delete
  14. "మాలిక" పట్టీలో ysrcp బ్లాగ్ లో కుయ్ కుయ్ లు రాత్రుళ్ళు వద్దట అనే టపాలో ఇచ్చిన ఈ లింక్ చూడండి.

    ఇదే గనక నిజపరిస్ధితి అయితే ... మేరా భారత్ మహాన్. మనమూ, ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటూ నిర్లక్ష్యపూరితమైన ప్రైవేట్ సంస్థలకు కూడా పెద్దపీట వేసే మన ధోరణీనూ ... ఏదీ మరొక్కసారి -> మేరా భారత్ మహాన్.

    108 ambulances

    ReplyDelete
    Replies


    1. పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్ :)


      జిలేబి

      Delete


    2. విన్నకోట వారి న్యూసు 108 ఇక మీదట లిమిటెడ్ సర్వీస్ :) ఇవ్వాళ సమస్యా పూరణకు సరిపోయె :)


      నిశ్చయముగ చెప్పండి న
      భశ్చక్షువుని సమయమ్ము వరకే డ్యూటీ
      పశ్చాత్తు యాంబులెన్స్ నో!
      పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్!


      జిలేబి

      Delete


  15. అనఘా! షట్రిపువులనడ
    చినవా డున్ పుట్టువడుగు చినవాడుగదా
    తనకలి యయ్యె నెటులనో
    హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్?

    జిలేబి

    ReplyDelete


  16. హీరో హనుమంతు :) గాలి కన్న వేగము

    సాజాత్యములు కనబడిన జిలేబి పూచీ లేదు :)


    మనసైనది నాకు దొరుకు
    ననుచు మసకమసక రేయి నాట్యము లాడన్
    వెనుకల బడుచున్ హీరో
    హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్ !

    జిలేబి

    ReplyDelete


  17. నేటి భార్యాబాధితుడు :)


    వినుమా జిలేబి‌ హరికథ
    హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్
    తనఖా పెట్టిరి నతడిని
    మన సేటంగటిన సూవె మనుగడ లేకన్ :)


    జిలేబి

    ReplyDelete

  18. బులుసు వారి అమ్మాయే మొదటి మహిళావధాని అవధానము చేయటం అనుకంటా చిత్తూరులో


    కణ్ణను కాలేజీలో
    క్షుణ్ణముగా చేసిరి బులుసు అపర్ణ భళా
    మన్నిక గానవధానం
    బన్నా!మొదటి "తడవ" యగు వనితయు జేయన్ !

    జిలేబి

    ReplyDelete


  19. భావాల వరదలో సా
    మీ వారికి తెలియకుండ మించారు పదా
    లే! వాహినిగా నరస
    న్నా! విదురుల పల్కులెల్ల నవనవ సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  20. ఓ తరుణి జిలేబీ ! యా
    పోతన కావ్యమ్మున రసపోషణ, లేదే
    మీ తరహా పద్యంబుల
    లో? తరమై వ్రాయరాదె లోకము మెచ్చన్ :)


    జిలేబి

    ReplyDelete


  21. ఏతంబెత్తు వివిధముల
    పోతన కావ్యమ్మున రసపోషణ, లేదే
    మోతాదు మించు పదములు
    జాతము తో వచ్చినట్టి సాంకవముగదా!


    జిలేబి

    ReplyDelete

  22. మల్లి! చెప్ప కోయి మాట తప్పగు సుమా !
    పిల్లి పుట్టెఁ బులికి వింత యగు! నె
    పుడు సజాతి తత్వపు జననంబగు! పిల్లి
    పిల్ల పిల్లి పులికి పిల్ల పులియె !


    జిలేబి

    ReplyDelete


  23. కుడియెడమాయె జిలేబీ
    వడివడి గా వచ్చెనోయి వరుసగ కామిం
    ట్లు డిగనురికి మాలికలో
    గడగడ యికనే కమింట్ల కందము గూర్తున్ :)

    జిలేబి

    ReplyDelete


  24. ఇడుములు వచ్చును పోవును
    విడువకు నీశుని జిలేబి విభుడాతడు నీ
    కడుగడు నగుపడు దృష్టిని
    సడలింపక గాన సూవె చక్కగ తోడై !


    జిలేబి

    ReplyDelete


  25. చదివానండీ కథ! ఆ
    సదనంబందున కమింటు చట్టని నిడితిన్
    పదయమ్మి చూసుకొనుడచ
    ట దరిమిలా నాదు తలపు టాకాఫ్ది టవున్ :)


    జిలేబి

    ReplyDelete


  26. హరిబాబు తెలుగోడు తమిళనాట ముఖ్యమంత్రి‌నైపోతా అని సలహా అడిగేరు‌ :)


    పంచ దశలోక మందు టపాల వేయు
    హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె
    తాను మంత్రియైవెలయగ తమిళ నాట
    సభికుల తలపుల తెలుప సాయమడిగె :)



    జిలేబి

    ReplyDelete


  27. జననీ జనకుల పదములు
    వనితా విడువక జనులు గవ‌నముగ గానన్
    మనుగడ ప్రగతిని గాంచును
    వినుమా విదురుల పలుకుల విని సల్పు పనిన్!


    జిలేబి

    ReplyDelete


  28. మంట లెగయగ మసియయ్యె మనుగునొందె
    కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ, గాలయముఁడు
    చిన్న వాడని చూడడు చీటి‌ చింప
    గాను చిత్రగుప్తుడచట గాలమేయు !

    జిలేబి

    ReplyDelete


  29. పిరియపు పలుకులకు రవం
    త రుచికరపు కటు పలుకుల తరుణము గానన్
    పరచుచు పలుకన్ చేరును
    మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే!

    జిలేబి

    ReplyDelete


  30. ప్రాఙ్నగము! తూరుపుకటకి!
    ప్రాఙ్నగ శృంగంబనశిఖరంబు జిలేబీ
    ప్రాఙ్నగము తెలిసెనకొ? యే
    ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్?

    జిలేబి

    ReplyDelete


  31. తిండాడుదు యెన్ వుళ్ళమ్
    కొండాడువు దర్కు నీ రుకుమణి జిలేబీ
    యేండీ పక్కత్తుల వర
    ముండాక్కై పోట్టుకుణ్ణు ముణుముణుకిర చొల్ :)


    జిలేబి

    ReplyDelete


  32. గుట్టుగ వంటల వండుచు
    పట్టుగ తనునింట నుండి పనియే హముగా
    చట్టన తన మాటకు ఊ
    కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్ :)

    జిలేబి

    ReplyDelete


  33. ఓరయ్యోనామగడా
    నీ రతిని జిలేబిని యివి నీకై యనగా
    సారము లేనట్టి రసము
    కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్.

    జిలేబి

    ReplyDelete


  34. ఓరయ్యోనామగడా
    నీ రతిని జిలేబిని యివి నీకై యనగా
    సారము లేనట్టి రసము
    కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్.

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఓరయ్యో బంగారుసామీ, ఓరబ్బీ బంగారుసామీ .........
      మెచ్చకేం జేస్తాడు? 😀

      Delete
    2. @V N R గారూ,

      >>>దేశంలోకెల్లా అత్యధిక విడాకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఇవ్వబడ్డాయట. కారణం, విడాకులు తీసుకుంటే, రెండు యూనిట్ల కింద లెక్కేసి ఎక్కువ భూమి ఆ కుటుంబానికి ఉంటుంది.>>>>
      http://oomencartoons.blogspot.com/2018/09/blog-post_1.html?m=1


      ఈ వ్యాఖ్య నిజమేనా ? మీ అభిప్రాయం చెప్పండి.

      Delete


  35. దామము వలె తిరిగె వరుగు
    పామునుఁ దినఁ గోరి, కప్ప బారెఁడు సాగెన్
    చీమను తినగోరి, నరుడు
    నీమము వీడి మనుజుని తిని బతుక నేర్చెన్ !

    జిలేబి

    ReplyDelete
  36. // “ఈ వ్యాఖ్య నిజమేనా ? మీ అభిప్రాయం చెప్పండి. “ //

    నిజమే అయ్యుంటుందండీ నీహారిక గారూ, కృష్ణాజిల్లావారు బహు తెలివైనవారు కదా 🙂.
    ఏమైనప్పటికీ భూసంస్కరణల రూల్స్ నుంచి తప్పించుకుని ఆస్తి కుటుంబంలోనే ఉండేటట్లు చూసుకోవడానికి కనిపెట్టిన మార్గం.

    ReplyDelete


  37. ఫర్వా లేదు జిలేబీ
    తర్వాయి కతలను చెప్పు తరగతి లోనన్
    కర్వలి కబురులు కాదోయ్,
    అర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్ :)

    జిలేబి

    ReplyDelete


  38. బొట్టెట్టుకొనక బోవగ
    చట్టని నద్దెకు నెవరును సరసన జాగా
    పట్టుగ నివ్వక బోయిరి
    కుట్టి కిరస్తానియకొ? దిగులు బడిరిగదా :)


    జిలేబి

    ReplyDelete
  39. దత్తపది -

    హర - శివ - భవ - కపాలి
    అన్యార్థంలో
    శ్రీకృష్ణుని స్తుతి

    శ్రీకృష్ణం వందే జగద్గురుమ్


    వెన్న దొంగ :)



    కృష్ణ ! పరమాత్మ ! భవహర ! కేలు మొగువు
    యాదవ కరుణారాశివయ! నిను మేము
    లవము ధ్యానించి నంతనే లయము గాన
    చిత్తమేకాగ్ర మగునయ! చిద్విలాస!
    మమ్ములనిక పాలించుము మైందహనుడ!


    (ఎక్కడో చదివినట్లుందే :)


    జిలేబి

    ReplyDelete


  40. సిల్కు రోడ్డు వృద్ధి చీనిచీనాంబర
    ములవి చిక్కు బడెను ముందు చూపు
    మొహతిరు మొహమదుని మొండాటమయ్యె జ
    వాబు అడ్డు కట్ట వంకకత్తి‌ !

    జిలేబి

    ReplyDelete


  41. కన్నడు రామారావుని
    సన్నగ తలపించుచుండె సరియేనా ఓ
    రన్నా వైవీయారుడ!
    మిన్నగ కిత్తాత్తమిన్ కమితముగ గనిరే :)

    జిలేబి

    ReplyDelete


  42. అదె! రొచ్చుబండ వచ్చెను
    సదనంబునకు సుమి కొత్త సత్తా తోడన్
    యెదురొడ్డునకొ అహమదు చ
    వుదరిని తరుముచు బిరబిర వురుకుచు సుమ్మీ‌:)


    జిలేబి

    ReplyDelete


  43. దండిగ యెన్నిక లొచ్చిన
    పండగ యందరికి సూవె పప్పూ సాంబార్
    పండగ లప్పుడు పనులవి
    ఆండోళ్ళకుయెక్కువయ్య హద్దరి బన్నా :)

    జిలేబి

    ReplyDelete


  44. అనఘా ! సామ్రాజ్ఞి యగజ
    వనరాజుకు, మూషికమ్ము వాహన మయ్యెన్
    తన కొమరునకు, జిలేబీ,
    వనమే మూలము ధరణియు వర్దిల్ల సుమీ !

    జిలేబి

    ReplyDelete


  45. కంది వారి మన్ కీ బాత్ :)


    అనుమాన మేమియునులే!
    నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్,
    పనిలేని జిలేబీ పూ
    రణల చదువ కర్మ కలిగె రసనయు బోయెన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కంది వారితో బాటు ఇది మరెంతోమందికి కూడా “మన్ కీ బాత్” అండీ 😀.
      (jk 🙂)

      Delete


    2. ఔరా! నాపద్యంబుల
      ఘోరంబనిరిగద విన్నకోటపు నరసిం
      హారావులున్‌ సమస్యా
      పూరణలన్ కష్టపడుచు పూరించంగన్‌ :)

      జిలేబి

      Delete
    3. పుచ్చు సమస్య లెన్నొ తమ పూరణ ధాటికి నిల్వజాలకన్
      రచ్చల క్రంతలన్ బడియె , ప్రాజ్ఞులు మీరు పరిష్కరించుటల్ ,
      మెచ్చని వార లుండుటలు మేదిని గల్గునె ? ' విన్నకోటి ' యున్
      మెచ్చిరి , పండితుల్ కవులు మెచ్చిరి నచ్చి , జిలేబి మిత్రమా !

      Delete


    4. పుచ్చిన నేమి అనుదినము
      తెచ్చిరి సభలో ఉరవడి తెలుగున కయ్యా
      మెచ్చితిమి యనవరతముగ
      పచ్చగ కళకళల దేలు బ్లాగును గానన్ :)

      జిలేబి

      Delete


  46. కమితమను కొత్త పదము తి
    రముగ తె లిసెనోయి నాకు రయముగ నిపుడే
    ఘుమఘుమ కందం బొక్కటి
    సమూహమునవేసెదన్ పసందుగ సుమ్మీ :)


    జిలేబి

    ReplyDelete


  47. మాట వినని వలపిదియే
    తూటాలా గుచ్చె మదిని తుమ్మెద గొలుసై
    ఆటాపాటల కాలము
    టాటా చెప్పగ జిలేబి టాంటాం మిగిలెన్ !


    జిలేబి

    ReplyDelete
  48. ఒక సోషల్ మీడియా ‘గ్యానం’👇

    Arguing with a woman is like reading the Software Licence Agreement. In the end you ignore everything and click “I agree”.

    😀

    ReplyDelete
    Replies


    1. సాఫ్టువేరు లైసెన్సుల సన్నిభృతము
      లెన్ని మార్లు చదివినను లెస్సగ మన
      కర్థ మవక సమ్మతి సంతకమును పెట్టి
      నట్లు పొలతుల తోడు పెనకువలయ్య !


      జిలేబి

      Delete


  49. గుణములను తెలుపుచు గూఢములన్ కుదు
    రుగ తెలియబరచుచు రూఢములను,
    దేవమాయ నడచి, తెరగుల మనకెల్ల
    వరము గా తెలుపు సవరణముగను !


    జిలేబి

    ReplyDelete


  50. కనుదోయిలోని బింబము
    మనసున మనసైనవాడు మహిని జిలేబీ!
    అనుకుని ప్రేమించేదని
    యనుకో నే ప్రేమయన్న అంబుజ వదనా !

    జిలేబి

    ReplyDelete


  51. వాడే అహ్మదు చౌదరి
    వాడేనయ్య అభిలాషు వాడే డుండుం
    గాడూ వాడె చిరంజీ
    వీ డప్పాకొట్టు చుండు వీధిన బడుచున్‌:)

    ReplyDelete
    Replies
    1. మీరు కాస్త నోరు మూస్తారా ? రొచ్చు పోయిందని అనుకుంటుంటే మళ్ళీ మీరు మొదలెట్టారా ?

      Delete


    2. బండబూతుల రచ్చబండలు బ్లాగులోకము వీడెగా
      చండశాసను డైన మాలికు చాకిరేవుల సాఫుగా
      పిండిపిండిగ జేసివేసెగ పిప్పిపీ టక డుంటకా
      నిండుగా మన బ్లాగులెల్లను నీటుగా కనుపించుగా !

      జిలేబి

      Delete


  52. ఛందస్సుల పద్యంబుల
    భందిలముల కోరుగాని పద్మార్పిత తా
    కొందల పడదు సుమీ మేల్
    కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

    జిలేబి

    ReplyDelete


  53. ఆపిలు పండును తినగన్
    నీపై యవ్యాజమైన నెమ్మిక తోడై
    తా పదుగురి లో శిలువను
    వీపున మోసెను జగతికి ప్రేమను పంచెన్!

    జిలేబి

    ReplyDelete


  54. కనియెన్ రా ! ముడుకులపై
    వనితా మణి నొప్పి నంట వంగిన నడుమై
    గునగున నడవను శక్తియు
    కనకనలాడ సయి లేక కష్టపడెనుగా !

    జిలేబి

    ReplyDelete


  55. సత్కార్యమ్ముల చేసిన
    సత్కార్యంబులను నెంచ సద్గతి కలదోయ్
    సత్కారముకై చేసిన
    సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. 👌.
      సరళంగా ఉన్న ఈ పద్యం అర్థమయిందండీ 🙂. బాగుంది కూడా.

      Delete
    2. విన్నకోట వారూ ఈ పద్యానికి అర్ధమూ తాత్పర్యమూ వివరింపుడూ ?
      🤓

      Delete
    3. పద్య భావ మేమొ పలుమార్లు చదివినా
      బోధ పడుట లేదు పూర్తిగాను
      విన్నకోటి వారు విశద పరచు కొఱకు
      విన్నవింతు మరియు సన్నుతింతు .

      Delete

    4. హై చక్కా :)

      జిలేబీ నీక్కూడా భాష్యకారులు‌ వచ్చేస్తున్నారోచ్ :)

      రాబోవు కాలము లో జిలేబీ కందములు ( విన్నకోటి వారి భాష్యంతో ) అన్న పొత్తంబొచ్చినా బొచ్చొచ్చు‌:)


      జిలేబి

      Delete
    5. ఎంచక్కా తమ పద్యభావమును తామే వ్రాసి చంపొచ్చుగా ,
      దించొద్దీ ఘనకార్య భారమును సాధించంగ వేరెవ్వరిన్ ,
      కాంచన్ లే రితరుల్ కడున్ , గనక , టీకా టిప్పణుల్ తామె వా
      యించన్ మేలగు క్రింద , పాఠకులు నందించంగ కందాంబుధీ !

      Delete

    6. :)

      ఏదో ఉత్సాహ పడినారు అర్థమయిందని ఔట్ సోర్స్ చేసేసాం :)


      జిలేబి

      Delete
    7. @విన్నకోట వారు,

      >>>సరళంగా ఉన్న ఈ పద్యం అర్థమయిందండీ 🙂. బాగుంది కూడా.>>>>

      మీకేమి అర్ధమయిందో తెలుసుకోవాలని ఇక్కడ తెలుగు మాష్టారితో సహా వెయిట్ చేస్తున్నాం. మాక్కూడా గ్యానాన్ని ప్రసాదించండి.

      Delete
    8. వారి కేమర్థ మాయెనో , పద గతముగ
      అసలు పద్యార్థ మేవిటో , అందున గల
      కొసరు పరమార్థ మేవిటో గూడ దెలియ
      రావుగారికి , కవికి ప్రార్థనలు సేతు .

      Delete
    9. “ఉత్సాహ” పడిన కారణమేమి - “ఆంధ్రభారతి” తిరగెయ్యవలసిన అవసరం కలగలేదని, అంతే 🙂.
      ఇక పోతే “ఔట్ సోర్స్” లు ఫ్రీగా జరగవు. పాత “మిస్సమ్మ” చిత్రంలో రేలంగి గారు చెప్పినట్లు “తైలం” చేతిలో పడాలి. అటువంటి అవకాశమేదన్నా ఉంటుందంటే మాట్లాడుకోవచ్చు 🤑.

      Delete
    10. నీహారిక గారూ,

      తెలుగు మాస్టారు వేచి చూస్తున్నారనేది పూర్తిగా మీ అతిశయోక్తి. స్వయంగా వారే పండితులు. ఇక నాలాంటి పామరుడి చేత భాష్యం చెప్పించుకోవలసిన అవసరం వారికేమిటండి? ఏదో సరదాగా ఆటపట్టించడానికి అడిగారనేది తెలిసిపోతోంది కదా 🙂.

      మీ సంగతంటారా? వ్రాయక వ్రాయక అంత తేలిక పదాలతో “జిలేబి” గారు ఇన్నాళ్ళకొక పద్యం వ్రాస్తే దానికి అర్ధం తెలుపమని విద్యాధికులైన మీరు కూడా అడిగితే ... ఏమనాలి 🙁? “తెలిసియు( తెలియని నరు( దెల్ప బ్రహ్మదేవుని వశమే?” అనడం తప్ప 😀😀 ? (jk jk 👍).

      అసలు ఆమాటకొస్తే “జిలేబి” గారి ఆ పద్యంలో అంత అర్ధంకాని భావమేముందండీ, పాపం? పూలదండలూ, శాలువాలూ, పొగడ్తలూ, బిరుదులూ, సన్మానాలూ ఆశించి చేసే పనుల కన్నా మంచి కోసం చేసే మంచిపనులు శ్రేష్ఠం .. అనే కదా ఆ సుభాషితం (నాకు అర్థమైనంత వరకు సుమా ☝️).

      అయినా ఇన్నాళ్ళకి వారి పద్యమొకటి ఆట్టే కష్టపడనక్కరలేకుండా అర్థమైంది కదా అని నేను సంతోషిస్తుంటే మీరొచ్చి నీళ్ళు చల్లుతారా? పైగా ... సరిగ్గా చల్లానో లేదో అని మీకే అనుమానమొచ్చినట్లుంది ... మళ్ళా తిరిగొచ్చి రెండోసారి చల్లడం ... హన్నన్నా వెరీ బాడ్ 🙁.

      ఇట్లు,
      📘⭐️😎

      Delete


    11. ఇదిగో పడవలె తైలము
      పదిలముగా చేతిలోన భాష్యము వ్రాయన్
      పదహారణాలయిన లే
      నిదే కుదరదోయ్ జిలేబి నీరజ నేత్రా :)

      జిలేబి

      Delete
    12. @ 📘⭐️😎,

      రోజూ శంకరాభరణం లో తిరుగుతూ ఉంటే మీరూ పద్యాలు వ్రాసేస్తారనుకున్నాను.ఏకంగా పద్యాలకు భాష్యాలే వ్రాసేస్తున్నారే !
      మీ భాష్యానికి పదహారణాల రేటు కూడా కట్టేసారీ గడసరి....పదహారణాలంటే ఎంతా ?

      సూపర్ స్టారా మజాకా ?

      Delete
    13. సత్కార్యమ్ముల చేసిన
      సత్కార్యంబులను నెంచ సద్గతి కలదోయ్
      సత్కారముకై చేసిన
      సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్!

      పూలదండలూ, శాలువాలూ, పొగడ్తలూ, బిరుదులూ, సన్మానాలూ ఆశించి చేసే పనుల కన్నా మంచి కోసం చేసే మంచిపనులు శ్రేష్ఠం .. అనే కదా ఆ సుభాషితం

      పై జిలేబీ గారి పద్యానికీ , క్రింది విన్నకోటి వారి
      భాష్యానికీ పొంతన కనబడటం లేదు . భాష్యమంత సుళువుగా పద్యమేమీ అవగతం
      కావట్లేదు . నా మట్టి బుఱ్ఱ కవగాహన లేమి
      కారణం కావచ్చు .
      సత్కార్యమ్ముల పట్ల చేసిన సత్కార్యమ్ములను
      ఎంచితే సద్గతి కలదోయ్ ?
      ఎంత గింజుకున్నా అన్వయం గానీ , ఫలితార్థం గానీ ఈ మట్టిబుఱ్ఱ కందడం లేదు .
      ఇక , సత్కారమునకై చేసిన సత్కార్యముల ఫలము సంతాపములట !
      ఏమిటో , మాయ !
      కవయిత్రి గారైనా వివరిస్తే తెలుసుకుని మేమూ
      సత్కారాలు పొందడానికో , సత్కార్యాలు చేయడానికో ఉద్యుక్తులౌతాంగా .

      Delete
    14. 🙌 ఇక over to you “జిలేబి” గారూ 👍.

      Delete
    15. నేనేదో స్థూలంగా చెప్పాను. అది సరిపోయినట్లు లేదు కాబట్టి మీ కవిహృదయమేమిటో విపులంగా మీరే చెప్పండి 👍.

      Delete


    16. భాష్యమంత సుళువుగా పద్యమేమీ అవగతం
      కావట్లేదు

      ఇట్లా అందరికీ సుళువుగా అర్థమయ్యేటట్లు రాసేస్తే భాష్యకారులు, వ్యాఖ్యాతలు విశ్లేషకులు, సమీక్షకు లు, విమర్శకులు బతికేదెట్లా?/

      అందుకని .....

      తత్పర పరాత్పరాత్పర
      మత్పర చిత్పరముగాన మహిలో రాజా
      సత్పుర జిలేబి సన్నిధి
      తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్ !


      జిలేబి

      విన్నకోట వారి భాష్యము సరి

      Delete
    17. కవి హృదయమునకు కడు డగ్గరగ జేరు
      ఘనులు గద ! విన్నకోట వారు , నతు లిడుదు ,
      తలలు బద్దలు కొట్టినా తట్టనట్టి
      పద్య భావాన్ని సుళువుగా పట్టినారు .

      Delete
    18. // “..... పదహారణాలంటే ఎంతా ? “ //

      వాట్, సీరియస్ లీ నీహారిక గారూ 🤔??

      సరే కానివ్వండి. 1957 లో భారతప్రభుత్వం నాణాలకు metric system కు మారి నయాపైసలు NP (తరువాత తరువాత “నయా” అనే విశేషణం తీసేసారు లెండి) ప్రవేశపెట్టేంత వరకు ... పైస, కాణీ, అర్థణా, అణా, బేడ (రెండు అణాలు), పావలా (నాలుగు అణాలు) వగైరా నాణాల పద్ధతి ఉండేది.

      ఇంతకీ మీరడిగిన ప్రశ్న కు జవాబు ... ఒక రూపాయికి పదహారు అణాలు (దాన్నించే పదహారణాలా తెలుగమ్మాయి లాంటి పదప్రయోగాలుండేవి 🙂).

      సో, “జిలేబి” గారు కట్టిన వెల ఒక రూపాయన్నమాట. చూశారా ఎంత పిసినారితనమో? అయినా కళని సత్కరించే వదాన్యులు అరుదైపోతున్నారండీ 🙁.

      ఇట్లు,
      📘⭐️😎

      (పైన నేను చెప్పినదంతా నిజంగా మీకు తెలియదా? లేక నన్ను పరీక్షించాలని అడిగారా? 🙁)

      Delete
    19. తెలుసుకోవలసిన మరొక విశేషం. బ్రిటిష్ పాలనలో అణా నాణెం మీద ఉన్న ఐదు భాషల్లో తెలుగు కూడా ఒకటి. నాణెం మీద “ఒక అణా” అని తెలుగులో కూడా ముద్రించి ఉండేది. ఆ కాలంలో తెలుగుభాషకు దక్కిన గౌరవం.

      Delete
    20. ఒక్క రూపాయి వెలకట్టి వెక్కిరించి
      తవరి భాష్యాన్ని మివుల తక్కువగ జేసె
      ' గడసరి 'యనిరి ' వారు ', మీ కర్థమగు , తె
      లియని వారెవ రిందులో , లేరు , విబుధ !

      Jk

      Delete
    21. అణా, కాణీకి కొరగాని దాన్ని ...నిజంగా తెలియదు.😭😭😭

      Delete
    22. ఒక్క రూపాయిని తక్కువగా చూడకండి.ఆవిడ వ్రాసిన పద్యాలు వేలల్లో ఉన్నాయి.
      నేనొక రూపాయి బాకీ మీకు....రుణం ఉంచుకోకూడదు. మళ్ళీ వచ్చే జన్మలో కలుసుకోవలసి ఉంటుంది.

      Delete
    23. కలుసుకుందాం నీహారిక గారూ 👍. అందుకని ఆ రూపాయి బాకీ (?) అలాగే ఉండనివ్వండి 🙂.

      Delete
    24. // “అణా, కాణీకి కొరగాని దాన్ని” //

      మీ విలువ మీకు తెలియడం లేదు. Cheer up 👍.

      Delete
    25. // “కవి హృదయమునకు కడు డగ్గరగ జేరు
      ఘనులు గద ! విన్నకోట వారు ,” //

      ఏదో ఫ్లూక్ మాస్టారూ. మీ పాండిత్యానికి నేనెక్కడ సరితూగగలను?

      Delete
    26. మరో జన్మలో కలుసుకోడానికి వీలుపడదు..నాకీ జన్మ చాలు ....బాకీలన్నీ తీర్చెయ్యాలి

      Delete

    27. వ్యాపార లావాదేవీలు వచ్చే జన్మ దాకా సాగేయే

      భేషు భేషు


      జిలేబి

      Delete


  56. అల్లుకుని పోవు నైజము
    కల్లాకపటంబెరుగని కన్నడు భళిరా
    సల్లాపంబుల వచ్చెను
    చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్!

    జిలేబి

    ReplyDelete


  57. ప్రేమను పంచడ మన్నద
    దేమియు గొప్పవదు సూవె తిరిగి నిను జిలే
    బీ మక్కువతో పిరియము
    గా ముద్దాడు మగవాడు గలడా చెప్మా :)

    జిలేబి

    ReplyDelete


  58. కలఁ డందురుడీశుని తా
    కలడో లేడో తెలియదు కలయో నిజమో
    తెలియదు తెలిసీ తెలియని
    కులంభరుడగుచు హృదయపు కుహురము దోచెన్!

    జిలేబి

    ReplyDelete


  59. కుస్తీ పడు కందముతో
    మస్తీ గానన్ మరిమరి మధురిమ లూరన్
    దోస్తీ గను పదములతో
    నేస్తములగుచున్ జిలేబి నేర్పుగ నమరన్ !

    జిలేబి

    ReplyDelete
  60. వేరే బ్లాగ్ లో మీ వ్యాఖ్యలో “కల్లు పోతాయ్ ....” అన్నారేవిటి మీరు 😡? కొంతమంది టీవీ ఏంకరిణులలాగా మీకు కూడా ‘ ళ ‘ పలకదా ఏం? ‘ ణ ‘ గతి కూడా ఇంతేనా?

    ReplyDelete


  61. తావిరి యించెను భట్టియు
    రావణ వధయను చు సూవె రమ్యము గానౌ
    పావన రాముని చరితము
    "రావణు కథ", లేక వ్రాసె, "రామాయణమున్"

    జిలేబి

    ReplyDelete


  62. పిడికిలి లో బట్టు నడుము
    లడుగడుగున గాన కృష్ణ ! లయమై నినుగూ
    డ డుబుక్కున స్లిమ్ లైనరు
    నడుముగ గీచితనయా!మనసున గనకుమా :)

    జిలేబి

    ReplyDelete


  63. సతి పుట్టింటికి నేగిన
    వెతపడ కన్నా ! గునగున వెంబడిపొమ్మా
    కతచెప్పి యత్త గారికి
    జత తీసుకుని వెనుతిరుగు జగణ జిలేబిన్‌ :)


    జిలేబి

    ReplyDelete


  64. సతి పుట్టింటికి నేగిన
    పతి సాపాటుకు టికాణ పరగడ పస్తే
    గతి! కావున మరి సీతా
    పతి, కందము గూర్చుచు పదపదరా మెస్సూ !

    సావేజిత
    జిలేబి
    Zilebiజనవరి 21, 2016 4:06 [AM]

    ReplyDelete


  65. అదె! హిమాలయము జిలేబి యచట కలదు
    సూవె కైలాస మది వారి సుందర గృహ
    ము! అచట నటనమున సమున హిమవంతు
    పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను!


    శుభోదయం
    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు

    G P Sastry (gps1943@yahoo.com)సెప్టెంబర్ 07, 2018 5:46 AM
    👏👏👏

    అదిరింది పద్యం!

    మూడవ పాదం యతిమైత్రి బోధ పడ లేదు...


    Zilebiసెప్టెంబర్ 07, 2018 5:49 AM


    సీక్రెట్ :) కనుక్కోండి చూద్దాం :)


    జిలేబి

    తొలగించు

    కామేశ్వర రావు పోచిరాజుసెప్టెంబర్ 07, 2018 11:53 AM
    జిలేబి గారు ఛందో దైత్యు వలలో పడ్డారు. అతఁ డన్ని వేళల సత్యముఁ బలుక నేరఁడు.
    మీ పద్య తృతీయ పాదములో “ము అచ” – “నహిమ” లో ప్రాస యతి (ముఅ-నహి) యని భ్రమ పడ్డాడు.
    గృహము + అచట = “గృహ మచట” యవుతుంది. అప్పుడు గణ యతి భంగములు.
    అ – హ లకు యతి మైత్రి యున్నను ప్రాస మైత్రికి పనికిరావు. అంతే గాక పద మధ్యము నందు నచ్చు లుండ నేరవు. కనుక ప్రాస గా నచ్చులు రావు.

    నటనమున సమున ? నటనమున సమను హిమవంతు పుత్రిని.


    Zilebiసెప్టెంబర్ 07, 2018 2:51 PM


    పోచిరాజు వారికి నమో నమః

    సరియేనాండి సవరణ.



    అదె! హిమాలయము జిలేబి యచట కలదు
    సూవె కైలాస మది వారి సుందర గృహ
    మదియె! నృత్యపులాటయమ్మ, హిమవంతు
    పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను!

    జిలేబి

    ReplyDelete


  66. భద్రము కొడుకో ! చేయదు
    హృద్రోగము మేలు,సేయు నెల్లజనులకున్
    ఛిద్రము జీవితమును! శ్రీ
    మద్రామాయణము చదువుమయ పుణ్యమగున్ !


    జిలేబి

    ReplyDelete


  67. జనగణమనోధినాయక
    మనమంతా కలిసిమెలిసి మహిలో దేశం
    బును మేలగు రీతిగ ని
    ల్పి నలుగురు పొగుడగ భళి మలిచెదము రమ్మా !


    ஜிலேபி

    ReplyDelete


  68. జిలేబి వారు రాళ్ళకు పద్యాలు నేర్పెద అనగా

    తీండ్రింప చేతు రాళ్ళను
    వేండ్రపడవలెనవి నాదు వేదముగానన్
    రండ్రా నేర్పెద ననగా
    గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్.


    జిలేబి

    ReplyDelete


  69. ఏలిక వారి దురాయిగ
    చాలిక పేర్పులు జిలేబి, సరసము గానన్,
    మేలుగ వ్రాయన్ పాకము
    తేలును, ముద్దాడి పల్కు తేనియ లూరన్!

    జిలేబి

    ReplyDelete


  70. అవియివి యని యన్నియు సూ
    వివాద నిలయములు! విశ్వవిద్యాలయముల్,
    కవిరాట్ వాటికి మూలము
    చెవియొగ్గి వినదగనివయ చెకుముకి పలుకుల్:)

    జిలేబి

    ReplyDelete


  71. గదిలో కూర్చుని గూగులు
    ను దిప్పగ టకటక మారెను వరుసగ జిలే
    బి,దెసయటునిటు భళిభళీ
    యదిగో ద్వారక యనఁ గననయ్యెను ఢిల్లీ

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. గూగుల్ ను తిప్పితే తిప్పుకోండి గానీ ఢిల్లీ నగరంలో ద్వారక అనే పేరు గలిగిన ఒక కాలనీ / లొకాలిటీ / నివాసప్రాంతం ఉంది కదా. చాలా పెద్దది కూడానూ. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ సమస్యాపూరణ ప్రయత్నించరాదూ 👍?

      Delete


    2. మీరడిగితే కాదనట మెట్లా నరసన్న గారు !

      అసలే మా భాష్యకారులు :)



      కుదిరెన్ టాక్సీ వాలా
      పదరా ద్వారక నగరము పక్కన గలదా ?
      అదె! ఫర్లాంగే సుమ్మీ
      యదిగో ద్వారక యనఁ ,గననయ్యెను ఢిల్లీ :)


      జిలేబి

      Delete
    3. బాగుంది 👌. చాలా వేగంగా పద్యం కట్టారు.

      (“తైలం” సంగతి ఇంకా తేలనేలేదు, అప్పుడే మీ భాష్యకారుడిని అంటే ఎట్లా?)

      Delete


  72. ఇది తెలుగు టపా నరుడా
    కుదరదు సూవె యనువాదకులగుచు మీకై
    సదనంబున సాయంబౌ!
    పదపద వయ్యా తెలుంగు బ్లాగిది సుమ్మీ‌ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇది తెలుగు టపా వనితా / ఇది తెలుగు టపా లలనా
      ...............
      పదపద వమ్మా / పదపద మామీ .....

      అనండి 😀.

      Delete

    2. విన్న కోట వారు

      మీకూ కందం బొచ్చేసినట్లే !

      ఖరార్ !

      వెంఠనే శంకరాభరణంలో ఎన్రోలై ఎన్మాసు గా కందసింగము గా మారవలె !



      చీర్స్
      జిలేబి

      Delete
    3. థాంక్స్, అంతేనంటారా 🙂? “కందసింగం” పదం బాగుందండి 👌🦁.
      😎

      Delete
    4. ఇంకో కంద కవీంద్రుల !
      అంకిత మయ్యేర సభకు ! హాహా ! తమరే
      యుంకించి గురివి గారయి
      పొంకముగా దిద్ది తీర్చబోలు మహాత్మా !

      Delete
    5. .

      అంతే అంతే ఉరికేయండి విన్నకోటవారు

      లక్కాకుల వారు

      కంద కవీంద్రులు కాదండోయ్ కంద సింగము !



      జిలేబి

      Delete
    6. శ్రీలంక తమిళ వాసన
      ఫీలింగున ' కందసింగ ' బిరుదము కటువై
      నాలికపై చేదొలికెడు
      లాలితమగు తెలుగు పేరు రాదా విబుధా !

      Delete


    7. పోనిద్దురూ మీరే ఓ మంచి లాలితమగు పేరెట్టేయండి. సింగము మాత్రము ఖచ్చితంగా వుండాలందులో. నరసింహులు కదా ! :)


      జిలేబి

      Delete
    8. పెద్దలకా ! పేరెట్టుట !
      తద్దయు నావల్లగాదు , తప్పుగదండీ !
      పద్దతిగా యని పించదు ,
      యెద్దేవా సేయ తగదు , హేళనయు నగున్ .

      Delete


  73. వేచి చూడుడీ రాబోవు వారము మా అనాలిసిస్‌ :)



    ఈ రోజితర పనులలో
    మారామారిగ జిలేబి మాదిరి గున్నా !
    వారము తరువాయి భళా
    తేరుకొనుచువత్తునయ్య తేకువ తోడన్ :)


    జిలేబి

    ReplyDelete


  74. రానా నటియించు జిలే
    బీ నారా చంద్రబాబు వేషము లోనన్
    శ్రీనందమూరి సినిమా
    లోన భళారే విచిత్ర లోకంబిదియే !

    జిలేబి

    ReplyDelete

  75. లెక్కలకు గొట్టుడీ జై :)

    లెక్కల వీరుండదిగో
    ముక్కల చేసెను టికెట్ల మొత్తము సుమ్మీ
    పక్కా యగున ప్రెడిక్షను ?
    చక్కా రాబోవు కాల చక్రము దేల్చున్ :)



    జిలేబి

    ReplyDelete


  76. నీ చెక్కిళ్ళ నిమర లే
    నే! చక్కగ కాచినావు ణిసిధాత్వర్థం
    బే చిక్కనీక రమణీ
    నా చెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా !

    జిలేబి

    ReplyDelete


  77. ఏలిక వారి దురాయిగ
    చాలిక పేర్పులు జిలేబి, సరసము గానన్,
    మేలుగ వ్రాయన్ పాకము
    తేలును, ముద్దాడి పల్కు తేనియ లూరన్!

    ***

    వాహ్! క్యా రాశి హై :)


    మేలగు రాశుల బోసిరి
    లీలగ యవధానులిచట లెస్స! భళి భళీ,
    లోలాక్షుల కైరాసులు
    తేలును, ముద్దాడి పల్కు, తేనియలూరన్!

    ***

    మైలవరపు రాసులివి! భ
    ళీ! లోలాక్షుల కు రాశులివియె! జిలేబీ
    లై లసితమై మగడి మది
    తేలును, ముద్దాడి పల్కు, తేనియలూరన్!.


    ***

    గోలా! జిలేబి శోభన
    వేళను కొని యాడెదమ్ము వెసవెస రమ్మా!
    పాలు మురిపాలు సరసము
    తేలును! ముద్దాడి పల్కు తేనియ లూరన్!


    జిలేబి

    ReplyDelete


  78. బూతు లేల యన న బూతో న రచ్చకా
    మెర్లు! బూతు వూతు మెలిక వేయ
    మాట లేమి లేకి మాటల పైదెచ్చు
    విశ్వ దాభి రామ వినుర వేమ!

    జిలేబి

    ReplyDelete


  79. జంక బోకు చెప్పు చప్పున నొక నస
    త్యమును దిమ్మ తిరిగి ధమ్మటంచు
    జనులు పడవలెను! సుజనులార వినుడయ్య
    లంక నేలినాఁడు లక్ష్మణుండు


    జిలేబి

    ReplyDelete


  80. చిరుజీవులు హరిబాబులు
    బురుబురు లాడుచు కసబిస బుసుబుసు లాడన్
    దరి పల్లె ప్రపంచం బక
    ట రివ్వున సహా యమివ్వ టపటప లాడెన్‌:)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీ కథల్లోనే ఉందిగా.. చిరుజీవి అని వామనుడ్ని తేలిగ్గా తీసుకుంటే.. బలి పరిస్థితి ఏమైందో.. శుక్రాచార్యుడు సైడైపొయ్యడు, బలి పారిపొయ్యాడు.

      Delete

    2. ఓ వా, మనుడివన్న మాట

      Delete
    3. జిలేబీ గారూ‌‌, బలి పారిపోలేదండీ. భాగవతం చదువకుండా ఏదో అంటే పొరపాటు.

      Delete


    4. సెల్ఫు ప్రొక్లైమ్డ్ బుడత గాడు :)


      Delete

    5. శ్యామలీయంగారు

      పనీపాటా లేని కోన్కిస్కా బుడతల విన్నాణమది‌. యేం చేద్దాం అంతే అను కోవాలె.

      రాదు. తెలియదు.అయినా బరుకతారు.

      పోనీలెండి కుర్ర కుంకలు. మరో పెపంచం లో వున్నారు.



      జిలేబి

      Delete


  81. పల్లె ప్రపంచము వారికి
    బుల్లబ్బాయి చిరుజీవి బూతోపనిషత్
    మల్లియ లార వినండోయ్
    కల్లాకపటంబెరుగని కామింటరహో :)


    జిలేబి

    ReplyDelete


  82. ఒంటరి వానిగ బతికిన
    తంటాలే లేకబోవు తన్ని తగలెడెన్
    గంటల కొలదిగ నరులున్
    జంటగ నెవరు మరి రారె జాల్రా వేయన్ :)

    ReplyDelete


  83. మీ డ్రామా పేరేమం
    డీ? డ్రా మాలోన పురుషుడికి పాత్రయకో ?
    మా డ్రామాపేరండీ
    "గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్"!

    జిలేబి

    ReplyDelete


  84. ఫుల్లాబ్జాక్షి! భగవతీ!
    యుల్లంబందు నినునిల్పి నూతనముగ శో
    భిల్లం బల్కగ వేడెద
    మల్లియ మధురిమ పదముల మరిమరి యిమ్మా

    జిలేబి

    ReplyDelete


  85. నానాటికి జగమాయెన
    యా నాటకము! నదులెల్ల యాలము బోవన్
    పానాదిలోబడి, భళీ
    కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్

    జిలేబి

    ReplyDelete


  86. ఐపీ యడ్రసులన్ హా
    వీపీ యెన్ వెనుక దాచి వీరాంగములా
    డే పీతగాళ్ళ మాటల
    లో పడి పోనేల చల్ చలోరె చలోరే :)

    జిలేబి

    ReplyDelete


  87. కంసుని నుఱిచియాడెను కన్నడెపుడు ?
    విష్ణువు జలపుష్పంబుగ బెండు పరచె
    నెవరి నకొ? రావణుని చంపె నెవరు సూవె ?
    ద్వాపరమున; సోమకుఁ జంపె; దాశరథియె


    జిలేబి

    ReplyDelete


  88. సాపాటుకు గతి లేదు సు
    మా పరమాన్నముల నిత్తు మనిరి జిలేబీ
    మా పాలకులు భళారే
    పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్!

    జిలేబి

    ReplyDelete