Saturday, September 22, 2018

మధ్య తరగతి మానవుని జీవిత చరిత్ర



మధ్య తరగతి మానవుని జీవిత చరిత్ర


పెద్దోళ్ళ జీవిత చరిత్ర చదివితే నే గొప్పా ?
 
 
మధ్య తరగతి మానవుల జీవిత చరిత్ర చదివితే ఏం గొప్ప ?
 
 





అభినందనలతో

జిలేబి

Thursday, September 20, 2018

కృష్ణా తీరం - మల్లాది రామకృష్ణ శాస్త్రి



కృష్ణా తీరం ! - మల్లాది రామకృష్ణ శాస్త్రి
 
 
 
 
ఈ మధ్య బ్లాగ్బాంధవులు కృష్ణా తీరాన్ని తట్టి లేపేరు :)
 
 
 
చీర్స్
జిలేబి


Wednesday, September 19, 2018

పతి తో పోరెడు సతులకు వందన మిదియే :)



పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
 

 


స్తుతమతులైన జిలేబుల
కుతకుత లెవరికి తెలియును కొందల పడుచున్
తితిభము వలె కష్ట పడుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
 
***
 
అతివయె కాదందురుబో
పతితోఁ బోరాడిన! సతి వంద్య యగుఁ గదా
పతిసేవనతరియింపన్
స్తుతముల తోడుగ జిలేబి సుమతీ వినవే :)
 
***
 
"అతుకుల బొంత మన బతుకు
గతి వసతియు లేదు! పిల్లకాయలు వలదే!"
పతి చెప్పగ కావలెనని
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
 
***
 
అతివల సమూహమును చే
రి తరుణి పాఠమ్ము నేర్చె రీతిగ సుమ్మీ
"మతిబోవునట్లు మొట్టుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!"

 
(లేడీస క్లబ్ లెగ్గోపాఖ్యానం :)
 
***
 
సతతము తానట చరవా
ణి తంత్రుల బిలువన నెత్తని పెనిమిటిన్ బ
ట్టి తిరగ మోతల వేయుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
 
***
 
సుతిమెత్తగ వాయింపుల
వి తెలియని విధముల వాత వేసి జిలేబీ
గతి తప్పగా  గబుక్కున
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా
 
***
 
పతి, మోఘపుష్పమన, భా
మితి బందకి వృషలి యనుచు మిక్కుటముగ న
త్త తనదు నాడపడుచులన
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
 
***
 
భలే మంచి చౌక బేరము :)

అతివల కందము చీరయ
గు! తరముగా కొ‌నమనంగ గుంగిలియౌ సే
ల తనకు తెచ్చి చవుకయను
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!


 

శుభోదయం
జిలేబి





Tuesday, September 18, 2018

"ఇయ్యాల" - కాపీ రైటు ఓనర్షిప్ :)



"ఇయ్యాల" - కాపీ రైటు ఓనర్షిప్ :)


ఇందు మూలము గా సకల జనులకూ తెలియ జేయట మేమనగా

"ఇయ్యాల" కు కాపీ రైటు సంపూర్ణము గా జిలేబి వారి వద్ద వున్నది

"ఇయ్యాల" అన్న పదాన్ని న్యూసు పేపరు కు పెట్టుకున్న చో హాటు కేకు లా , హాటు హాటు జిలేబీ లా న్యూసు పేపరు అమ్ముడు పోవును

ఆ పై ఈ పదం మా నల్గొండ జిల్లా పదం కాబట్టి తెలగాణ వారు దీన్ని రాష్ట్ర ప్రాతినిధ్య పత్రిక గా పరిగణిస్తూ ఇయ్యాల్రేపట్లో  హుకుమత్ ఇవ్వడానికి ఆస్కారాలు, ఆస్కారవార్డులు పొందడాని కవకాశాలు వున్నాయి.

కాబట్టి జనులారా ! వేగిర పడుడు

ఆలసించిన ఆశా భంగం

భలే మంచి డిమాండు బేరము !

పేరు కాపీ రైటు తమకు కావలసిన వాళ్ళు వెంటనే వంద పై ఇరవై శాతం ప్రీమియం ఆఫర్ తో బిడ్డింగు మొదలెట్ట వచ్చు :)



ఇట్లు

కాపీరైటు దారులు
జిలేబి
పంచ దశ లోకం
 

Sunday, September 16, 2018

గడుసు పెండ్లాము - ఆదర్శ కోడలు 'సర్టిఫికెట్టు' :)



గడుసు పెండ్లాము :)








గడుసు పెండ్లము కలవారి కష్టములను
చెప్ప వ్రాయగ పూర్తిగా చేత గాదు
కాని స్మరణకు వచ్చిన వాని వ్రాయ
బూను సాధులు మది కోప మూనరెపుడు :)
 
 
 
గడుసు పెండ్లామె దయ్యంబు కాద జగతి
గడుసు పెండ్లామె రక్కసి  కాద భువిని
గడుసు పెండ్లామె యమదూత కాద జగతి
గడుసు పెండ్లాము  దేవుడా వలదు వలదు !
 
 
కలవి లేనివి కల్పించి కలహమునకు
గాలు దువ్వుచు మగడు పోట్లాడెననుచు
హోరు హోరున నేడ్వగా బారువెట్టు
గడుసు పెండ్లాము పోకల నుడువ వశమె !
 
కాపురంబున కేనాడు కాలు పెట్టు
కొంప కానాడె తిప్పలు కూడ బెట్టు
కోడలు గృహప్రవేశ మౌనాడె యత్త
గారు గంగాప్రవేశ మౌ గాదె యనగె !
 
 
వీరి జుట్టును వారికి వారి జుట్టు
వీరికిని ముడి పెట్టుచు వేడ్క జూచు
వీలు గల్గిన జివ్వకు గాలు దువ్వు
గడుసు పెండ్లాము దేవుడా వలదు వలదు !


మల్లాది అచ్యుత రామ శాస్త్రి వారి
వంద సంవత్సరముల మునుపు మాట :)
 


వంద సంవత్సరముల కాలము లో :) కాలేజీ సర్టిఫికెట్టు కాలము :)


ఆదర్శ కోడలు సెర్టిఫికేట్టు :)

https://timesofindia.indiatimes.com/city/bhopal/now-bhopal-varsity-to-make-ideal-brides/articleshow/65803214.cms


ఆదర్శ కోడలులవన్
పైదలులకు శిక్షణయట! పడతుల్లారా
ఖేదము వలదత్తలతో
రోదన తగ్గుముఖమగు విరోధము తగ్గున్ :)


జిలేబి




 

Saturday, September 15, 2018

మమతల బడి - నివాళి



మమతల బడి - నివాళి









ధామ మది మమతలబడి తమ్మికంటి
సుమతి యిల్లాలి చలువగా శుభము బడసె
గోద మాయమ్మ కరుణమ్మ గోము గాను
జూసె, చల్లగాను నిలిపె జోత లివియె !
 
జిలేబి




Thursday, September 13, 2018

ఒంటికొమ్ముదేవర! నమో ! నమో !



వినాయక చవితి శుభాకాంక్షల తో



 
 
 
ఏనుగు మొగమయ్య! గణప
తీ! నిను తలచెద, జిలేబి తీయందనముల్
జ్ఞానము నొసంగు శాంకరి,
యీనాటి చతుర్థి నీది హేరంబ ! నమో !

జిలేబి
 

Monday, September 3, 2018

శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ !




శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో



చిత్రం కర్టసీ : http://kamadenu.blogspot.com/  -   
Shri Keshav of The Hindu Fame


జిలేబి