Sunday, September 16, 2018

గడుసు పెండ్లాము - ఆదర్శ కోడలు 'సర్టిఫికెట్టు' :)



గడుసు పెండ్లాము :)








గడుసు పెండ్లము కలవారి కష్టములను
చెప్ప వ్రాయగ పూర్తిగా చేత గాదు
కాని స్మరణకు వచ్చిన వాని వ్రాయ
బూను సాధులు మది కోప మూనరెపుడు :)
 
 
 
గడుసు పెండ్లామె దయ్యంబు కాద జగతి
గడుసు పెండ్లామె రక్కసి  కాద భువిని
గడుసు పెండ్లామె యమదూత కాద జగతి
గడుసు పెండ్లాము  దేవుడా వలదు వలదు !
 
 
కలవి లేనివి కల్పించి కలహమునకు
గాలు దువ్వుచు మగడు పోట్లాడెననుచు
హోరు హోరున నేడ్వగా బారువెట్టు
గడుసు పెండ్లాము పోకల నుడువ వశమె !
 
కాపురంబున కేనాడు కాలు పెట్టు
కొంప కానాడె తిప్పలు కూడ బెట్టు
కోడలు గృహప్రవేశ మౌనాడె యత్త
గారు గంగాప్రవేశ మౌ గాదె యనగె !
 
 
వీరి జుట్టును వారికి వారి జుట్టు
వీరికిని ముడి పెట్టుచు వేడ్క జూచు
వీలు గల్గిన జివ్వకు గాలు దువ్వు
గడుసు పెండ్లాము దేవుడా వలదు వలదు !


మల్లాది అచ్యుత రామ శాస్త్రి వారి
వంద సంవత్సరముల మునుపు మాట :)
 


వంద సంవత్సరముల కాలము లో :) కాలేజీ సర్టిఫికెట్టు కాలము :)


ఆదర్శ కోడలు సెర్టిఫికేట్టు :)

https://timesofindia.indiatimes.com/city/bhopal/now-bhopal-varsity-to-make-ideal-brides/articleshow/65803214.cms


ఆదర్శ కోడలులవన్
పైదలులకు శిక్షణయట! పడతుల్లారా
ఖేదము వలదత్తలతో
రోదన తగ్గుముఖమగు విరోధము తగ్గున్ :)


జిలేబి




 

1 comment:

  1. “ఆదర్శ కోడలు” గా వ్యవహరించడానికి ఆ యూనివర్శిటీ వారు సర్టిఫికేట్ కోర్స్ నిర్వహిస్తున్నారటగా. ఆ స్ఫూర్తితో “గడుసు పెండ్లాము” గా తయారవడానికి కావలసిన కిటుకులు బోధించడానికి మీరు ఒక సర్టిఫికేట్ కోర్స్ ప్రారంభించరాదూ? డబ్బుల వర్షం కురుస్తుంది 🤑 👍.

    ReplyDelete