Wednesday, September 19, 2018

పతి తో పోరెడు సతులకు వందన మిదియే :)



పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
 

 


స్తుతమతులైన జిలేబుల
కుతకుత లెవరికి తెలియును కొందల పడుచున్
తితిభము వలె కష్ట పడుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
 
***
 
అతివయె కాదందురుబో
పతితోఁ బోరాడిన! సతి వంద్య యగుఁ గదా
పతిసేవనతరియింపన్
స్తుతముల తోడుగ జిలేబి సుమతీ వినవే :)
 
***
 
"అతుకుల బొంత మన బతుకు
గతి వసతియు లేదు! పిల్లకాయలు వలదే!"
పతి చెప్పగ కావలెనని
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
 
***
 
అతివల సమూహమును చే
రి తరుణి పాఠమ్ము నేర్చె రీతిగ సుమ్మీ
"మతిబోవునట్లు మొట్టుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!"

 
(లేడీస క్లబ్ లెగ్గోపాఖ్యానం :)
 
***
 
సతతము తానట చరవా
ణి తంత్రుల బిలువన నెత్తని పెనిమిటిన్ బ
ట్టి తిరగ మోతల వేయుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
 
***
 
సుతిమెత్తగ వాయింపుల
వి తెలియని విధముల వాత వేసి జిలేబీ
గతి తప్పగా  గబుక్కున
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా
 
***
 
పతి, మోఘపుష్పమన, భా
మితి బందకి వృషలి యనుచు మిక్కుటముగ న
త్త తనదు నాడపడుచులన
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
 
***
 
భలే మంచి చౌక బేరము :)

అతివల కందము చీరయ
గు! తరముగా కొ‌నమనంగ గుంగిలియౌ సే
ల తనకు తెచ్చి చవుకయను
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!


 

శుభోదయం
జిలేబి





152 comments:

  1. జొన్నలగడ్డ స్వరాజ్య లక్ష్మి గారూ,బావున్నారా?
    ఇట్లు
    ఆకుల ధన ఉదయ లక్ష్మి!

    ReplyDelete
    Replies

    1. ఏమి బాగో ఏమి బాగో గోదారోళ్ళను‌ కృష్ణలంక లోకి తోసేసి జంజాటంలో పడేయిస్తిరి :)



      జిలేబి

      Delete
    2. ఆఁ,అదెంత దూరంలే జిలేబీ!
      ఒక గంతు అటూ ఒక గంతు అటూ, అంతే కదా!
      పేరు దాచిన తీరు దాగునా?
      జ్ఞానమైనా ధాన్యమైనా ఒకటే -
      అందినంత నొక్కుడే,
      ఇవ్వకుంటె దంచుడే!


      - జై లతెంగాణ!

      Delete

    3. హేవిటో!

      హరిబాబు గారి టపాలే కావు వారి కామింట్లు కూడా ఈ మధ్య రాను రాను అర్థం కావట్లేదుస్మీ‌ :)


      జిలేబి

      Delete
    4. అక్కడికి మీ పద్యాలేవో మాకు అర్థమయినట్టు...

      Delete

    5. ఔరా! బోనగిరి గారు కూడా అప్పోజిషన్ కెళ్ళిపోయారా! హతవిధీ ;)


      జిలేబి

      Delete
    6. ఎప్పుడూ మీ పార్టీనే, మీరు పిలిచి పార్టీ ఇవ్వట్లేదు కాని...

      త్వరలోనే జిలేబి అభిమానసంఘం ఏర్పాటు చేద్దామనుకుంటున్నాము.

      Delete
    7. మిమ్మల్ని తెలివిగలవారిగా గుర్తించినందుకా ?

      Delete
    8. జిలేబీ అభిమాన సంఘమా...సూపర్.బ్లాగర్లందరునూ కెలికి మరీ ఉత్తేజ పరిచే జిలేబీగారికి సంఘం లేకపోతే ఎలా? :)

      Delete
    9. తయ్యారే నేనిక ఘన లోకొద్దారక శ్రీమాన్
      అయ్యరు మామి తెగ భజన సేయ, ఎంచక్కా మీ
      రియ్యగ మనసు పడి కరుణతో నాకో చిన్న
      హయ్యరు పదవి జుజుబీ భజన సంఘమందు !

      భజన చేసే విధము తెలియండీ బ్లాగ్సదనులారా
      తన భజన తోటే శక్తి మనకండీ మా(త) భక్తులారా ముక్తి మనకండీ ...
      జుజుబీ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు ...
      హరి ఓం టట్సట్ ...
      😊😊😊

      Delete
    10. మీలాంటి వీరభక్తుడికి పదవి ఇవ్వకపోతే ఎలాగ, బండివారూ 😀? మీరు, బోనగిరి గారు, “కిచకిచానంద” నామధారయిన శ్రీనివాసు గారు ... మీరే ముఖ్య పదవీగ్రహీతలు. ఆల్ ది బెస్టూ 👍.

      Delete


    11. మీలాంటి వీర భక్తులు
      బాలము బామ్మలకు జాల్ర వాయించన్ సం
      ఘాలకు కొదవగు నయ్యా !
      మ్రోలన్ ముంగట జిలేబి ములుగై వెలుగున్ :)


      జిలేబి

      Delete
  2. పరిపక్వత లోపించిన ప్రేమవివాహాల గురించి గుంటూరు వెస్ట్ డి.ఎస్.పి. గా పనిచేస్తున్న సరిత గారి ప్రసంగం వినండి 👇.

    ప్రేమవివాహాలు :: పోలీస్ ఆఫీసర్ సరిత గారి ప్రసంగం

    ReplyDelete
  3. “K.V.లింగం” అంటే ఎవరో చెప్పగలరా “జిలేబి” గారూ ? 😀 😎
    (ఒక బ్లాగ్ లో ఒకరి వ్యాఖ్యలో ఈ పేరు గురించి విమర్శగా అన్నారు)

    ReplyDelete
    Replies


    1. లింగం
      లిమః గమయతీతి లింగం : అంతము అంటే లయముతో ప్రారభంయ్యేది లింగము.

      లిం గమయతీతి లింగం : అంటే సృష్టి తో మొదలై లయము చెందేది లింగము.

      గణితము ప్రకారము రెండు బిందువుల గుండా ఓకే వృత్తము పోగలదు.

      అంటే సృష్టి లయము రెండు బిందువులయితే వాటిని కలిగినదే ఈ జగత్ స్థితి.

      సృష్టింపబడినది లయించ వలసిందే,లయమమైనది సృష్టింప బడవలసిందే

      K.V. అనగా కిలో వోల్టు.


      ఇట్లు
      కె.వి.లింగము గారి అనుయాయిని

      జిలేబి

      Delete
    2. గణితం ప్రకారం 1. రెండుబిందువుల ద్వారా ఒకే సరళరేఖ పోగలదు. 2. మూడు బిందువులద్వారా ఒకే వృత్తం పోగలదు.

      Delete
    3. హ్హ హ్హ హ్హ ఎక్కడికో వెళ్ళిపోయినట్లున్నారు (నిగూఢార్థం ఏమన్నా ఉందా 🤔🙁 ?).

      కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుని ఒక మహానుభావుడు K.V. లింగం గా వ్రాసాడని శ్యామలీయం మాస్టారు ఆవేదన చెందుతూ ఒక వ్యాఖ్యలో అన్నారు. అదన్నమాట సంగతి.
      (పొన్నాడ మూర్తి గారి “తెలుగు వెలుగు” బ్లాగ్ లో 26-09-2018 నాటి “చిలకమర్తి లక్ష్మీ నరసింహం” అనే పోస్ట్ క్రింద”).👇

      https://ponnadamurty.blogspot.com/2018/09/blog-post_26.html



      Delete

    4. సరళరేఖ పెద్ద వృత్త ము లో ఒక భాగము


      జిలేబి

      Delete
    5. రేఖాగణితం ప్రకారం 'సరళరేఖ పెద్ద వృత్త ము లో ఒక భాగము' అన్న అవగాహన పొరపాటు. సరళరేఖ నిర్వచనం y=mx+c (m,c లు స్థిరవిలువలు). కాని వృత్తం నిర్వచనం (x – h)2 + (y – k)2 = r2 (h,k,r లు స్థిరవిలువలు). సరళరేఖ నిర్వచనంలో x,y విల్వలు మొదటిడిగ్రీలో ఉంటే, వృత్తం నిర్వచనంలో అవి రెండవడిగ్రీలో ఉన్నాయి. ఇచ్చిన ఏ రెండు బిందువులగుండా ఐనా ఒకేఒక సరలరేఖ ఉంటుంది. ఇచ్చిన ఏ మూడు బిందువులగుండా ఐనా ఒకేఒక వృత్తం ఉంటుది. అందుచేత ఏవైనా రెండు బిందువులతో సరళరేఖ ఖచ్చితమైన నిర్వచనాన్నీ, మూడుబిందువులతో వృత్తం యొక్క ఖచ్చితమైన నిర్వఛనాన్నీ సాధించవచ్చును. (సాధించటం అంటే నిర్వచనంలోని స్థిరాంకాల విలువలను తెలుసుకోవటం అన్నమాట.) ఇవన్నీ రేఖాగణితంలో ప్రాథమికవిషయాలు.

      Delete


    6. ఓ !

      భూమి గుండ్రము గా వున్నది. నేను నడచు దారి సరళరేఖ గా వున్నది.


      జిలేబి

      Delete
    7. పద్యములు మాత్రము అర్ధం కాకుండా ఉన్నవి.:)

      Delete
  4. “ఉత్పలము” తరువాత ఉత్పాతమా అండీ?

    ReplyDelete
    Replies


    1. :) అంతే కదా మరి :)

      మెడబట్టి తోసేయాల్సిందే :).

      ఆ పై చంపకమాల, చంపకే మళ్ళీ మళ్ళీ అని మగవాడు పాడుకోవాల్సిందే, ఆడువారు‌ శార్దూలమై గాండ్రించాల్సిందే :)


      జిలేబి

      Delete
    2. దీనినే ఆంగ్లమున శాడిజం అందురు ☝️.

      Delete


    3. శాడిజమందురు దీనిని
      పాడియె గాదు మనువాడ బాచిలలరులన్
      ప్రోడుల నుసిగొల్పెదవ
      మ్మా డూడూ బసవలవగ మగవారలు పో :)


      జిలేబి

      Delete
    4. @ జిలేబి ...
      'భూమి గుండ్రము గా వున్నది. నేను నడచు దారి సరళరేఖ గా వున్నది' ...

      ఎలగెలగ ... !
      అలగెలగ ... ?

      అప్పు తచ్చడినట్లుగా ఉంది ఓ పాలి చూసుకొండి -
      ఇలాక్కదా ఉండాలి ...

      భూమి సరళముగా వున్నది. నేను నడచు దారి గుండ్రముగా వున్నది.
      😊😊😊

      Delete


  5. గాంధీయమ్ము జిలేబి యై కనబడెన్ కాదయ్య వైవీ మరే
    గాంధేయంబన బాగు సోదరుడ! వ్యాఖ్యానింప బిల్తున్ మరే
    సంధాయింపగ శ్యామలీయులను తస్సాదియ్య పోటీ మరే
    రంధిన్ జూడగ వత్తురయ్య జనులున్ రంధ్రమ్ము లన్ తోడగన్


    జిలేబి

    ReplyDelete


  6. గలదోయి బుచికి నీ బు
    ర్రలోన మైల మరి దాని రగడల మలిన
    మ్ముల నెట్లు తీసెదవురా
    పొలతుల మైలయు బృహత్తు పొత్తువు నొకటే!


    జిలేబి

    ReplyDelete


  7. మైల మైల యనుచు మానకు పరమాత్ము
    ని భజనను జిలేబి నిశ్చలుండు
    దాని కావలగల దైవమతడు సూవె
    పడడు మైల మైలవాయు గొల్వ!

    జిలేబి

    ReplyDelete


  8. మేక పాలు త్రాగి మేధయు పడసెను
    మాట కట్టి బెట్టి మాన్యుడాయె
    సత్యమును బలుకుచు స్వాతంత్ర్యమను తర
    కలు కుడుచన నేర్పె గాంధి తాత!


    జిలేబి

    ReplyDelete


  9. అలగా జనులారా! రా
    హులు పల్కుల మీరు వినుడి! హుంకారంబుల్
    వలదర్రా! పీకక యీ
    కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్!

    జిలేబి

    ReplyDelete


  10. పిలిచెను జనాళిని బలిమి
    కలిగిన దేశమిదియనుచు కదలిక తెచ్చెన్
    విలువైన స్వతంత్రపు తర
    కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్!


    జిలేబి

    ReplyDelete


  11. తలకడచుచు నాటి శ్రవణు
    ని లసితమగు శాంత్యహింసనీతములన్ మీ
    రిలగాంచి హరిశ్చంద్రు న
    కలు, సేవింపుఁడని, గాంధి ఘనయశ మందెన్!


    జిలేబి

    ReplyDelete


  12. అల యక్టోబరు రెండున
    నిలబుట్టి పురుషులతోడు నిల్చుచు నాంగ్లే
    యులతో పోరుచు నమ్మ
    క్కలు సేవింపుఁడని, గాంధి ఘనయశ మందెన్!


    జిలేబి

    ReplyDelete



  13. నేనేమీ చేయకనే
    తానై వర్డ్ప్రెస్స్ మహత్తు తాండవ మాడెన్
    నేనాటిన లింకూ! వి
    జ్ఞానము భళిభళి జిలేబి‌ చందంబాయెన్ :)


    జిలేబి

    ReplyDelete


  14. "మనదీ సొసైటి పర్మిసి
    వను మార్గము బట్టుచుండె" బ్లాగ్కామింట
    ర్లను నుద్దేశించిరిగా
    మన నరసన్నయు‌ భళి తన మన్ కీ బాత్ గా :)

    జిలేబి

    ReplyDelete


  15. ఏమోయ్బ్లాగ్నిర్వాహకు
    లూ మీ బ్లాగుని రవంత లోపము లేకుం
    డా మానిటర్గనండ
    య్యా మాటలు దాటె కోట యావత్తు సుమా :)


    జిలేబి

    ReplyDelete
  16. @ Zilebi ...
    "జ్ఞానము భళిభళి జిలేబి‌ చందంబాయెన్" ...
    సెందర్బాబ్గార్లా ఇది కూడా మీ ఖాతాలోనే అన్న మాట ...
    wow రెవ్వా ... :)

    ReplyDelete


  17. క్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్తవులకు
    మాత్రమేను జిలేబి సమాజమునకు
    భువిని నెల్లరకున్ను తా పూజనీయు
    డమ్మ ప్రేమమార్గమున నడచెనతండు

    జిలేబి

    ReplyDelete


  18. సన్నిహితుల మండి మనము
    దన్ను నొకరు మరియొకరికి తరియింపగ యీ
    మన్ను సుమా వైవీయార్
    నన్ను క్షమించండనుచు యనవలదు‌ హితుడా


    జిలేబి

    ReplyDelete


  19. భిక్షాందేహి యని యెందరనలే అయినా
    దేని కన్నా భారతమే కాబట్టి :)


    ఇలలో న బ్రహ్మ రాతను
    కలలో నైన సఖి మార్చ గలమే సుదతీ
    యల ధర్మేంద్రుండాతడు
    కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్!


    జిలేబి

    ReplyDelete


  20. ఇలలో రాజై నెక్కొన
    వలసిన గౌతముడటన్ భవములను వీడెన్
    తలగొరిగె తలపుల గొరిగె
    కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్!


    జిలేబి

    ReplyDelete


  21. అల స్విట్జర్లాండున భళి
    గలదనె కోట్లు మన మోడి గానర్రా దు
    డ్డిలరాక విదేశమ్ముల
    కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్‌ :)


    జిలేబి

    ReplyDelete


  22. ములుగు జిలేబీ పేరట!
    యిల చేతిని డబ్బు లేదు! యిడ్లీ సాంబా
    రులకై తిరుగుచు భళిభళి
    కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్!

    జిలేబి

    ReplyDelete


  23. సందేహము బుట్టె మొదలు
    సందోహముగ చిరుజీవి చట్టని పుట్టెన్
    కొందల పడుచుండెల్లపు
    డందరి నీ ప్రశ్నవేసి డమడమ యనుచున్ :)


    జిలేబి

    ReplyDelete


  24. గురుడంట మారు చుండెను
    నరె రాశిని ఫలితములు మన గురువులట నొ
    క్కిరి చెప్పిరే జిలేబీ
    పరిస్థితులు మారునమ్మ పరిపరి విధముల్ :)


    జిలేబి

    ReplyDelete


  25. పాపడి వలె ఫోజులటా!
    రూప విభవలోలుడంట ! రుబ్బును కరవో
    కే పాటల బండినటా
    సూపరు మిత్రులట వారు సుదతి జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  26. కదనపు రాజ కవివరుం
    డ! దిక్తటోద్దీపకుడ! నడదివియలము సూ
    వె!దిశాగజములు మీర
    య్య! దుంకుడు జిలేబులమ్మయా మేము సఖా:


    జిలేబి

    ReplyDelete


  27. గమనించే చూపు గనుక
    రమణీ మనకున్నచో పరంధాముని,బ్ర
    హ్మమును సముచితముగానన్
    సమవేతగ గానవచ్చు సముదాయమునన్!

    జిలేబి

    ReplyDelete


  28. గోల్మాలాయె జిలేబులు
    మేల్మియు వారాంతమందు మేడదిగెనుగా
    బాల్మా! యేమాయెన్బో
    చల్మోహనరంగి చల్ బజారున కగెయెన్ :)

    జిలేబి

    ReplyDelete


  29. పనిలేని రొచ్చు బండన
    వినయమును నటించు చౌద్రి, వివరము లరయం
    గ నటించెడు చిరుజీవుల
    తనకల ప్రశ్నలు మొదలయె తరుణి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  30. పేరగు నంటన్ మైత్రికి
    పేరగు నరసింగమంట పేర్మికి పేరై
    జోరగు వ్యాఖ్యలకున్ కిం
    గై రీసెర్చులకు పేరు గాంచి వెలిగిరే !



    జాల్రా
    జిలేబి

    ReplyDelete


  31. భగవానుడు తన వాహన
    ముగ తానమ్ము? శివలింగమును తన తలపై
    న గనెనెవడు?నరుడుగొనెన్?
    ఖగపతి కిడె; రావణుండు; గాండీవమ్మున్;


    తెగని సమస్య గలద శా
    స్త్రి గుబ్బెతల చేతిలోన తిరికలు పడగన్ :)


    జిలేబి

    ReplyDelete


  32. పోరంబోకుల రగడల్
    ప్రారంభము రొచ్చు బండ బాచ్చిని గుట్టున్
    జోరుగ సూర్యుడు భళిభళి
    నేరుగ కొట్టగ జిలేబి నేర్పన నిదియే !

    జిలేబి

    ReplyDelete


  33. సన్నాయి నొక్కులన్ చౌ
    ద్రన్నయు వాయించు చుండె డ్రామా గానన్
    పన్నాగములు తెలిసె యిది
    మిన్నాగుల రొచ్చు కూటమి గద జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  34. సన్నాయినొక్కులవిగో
    మిన్నాగు చవుదురి బాయి మిడిమిడి చేతల్
    పన్నాగమున కెదురు హరి
    తన్నగ నో తన్ను బలె కుతకుత ఉడుకులే :)


    జిలేబి

    ReplyDelete


  35. చూడ్రా హరి కొండన్నను
    చూడ్రా ఆ శ్యామలులను చూడ్రా జనులన్
    కడ్రాయరులను లాగకు
    రా! డ్రామారాయులరరె రంధిపడిరిగా :)


    జిలేబి

    ReplyDelete


  36. అదిగో బ్లాగ్సీయైడీ
    లదిగో నమ్మా జిలేబులను పట్టుకొనన్
    చదరంగములో దిగిరే
    పద పారుచు పొమ్మ పట్టు బడకుండగ పో :)


    జిలేబి

    ReplyDelete


  37. రచ్చ బండ డమాలయె రాసు కొనెను
    సొంత బ్లాగున చౌదరి సోది‌ యరరె
    వింత యిదిగాదె యెక్కడి విప్ మరెక్క
    డ తగిలెనకో చిరంజీవు డబడబయన !


    జిలేబి

    ReplyDelete


  38. ఓలమ్మో కామెడియట
    మాలావుగ చేస్తవంట మాడమ్ గనవ
    మ్మా లొల్లాయిపదాలను
    బుల్లోడరె చవుదరీ సబూతు జిలేబీ :)



    జిలేబి

    ReplyDelete


  39. కొత్తగ సిమ్ముల కాధా
    రత్తా వలదంట చవుదరన్న పలికె పో !
    గుత్తగ న్యూ‌ న్యూ సిమ్ముల
    నత్తరి బ్లాగింగు చేయు నకొ బాయి యికన్ :)


    జిలేబి

    ReplyDelete


  40. మా రొచ్చుబండ వేదిక
    పో రంబోకుల వినూత్న పోడియము సుమా
    దారి నెవరినై నన్ తి
    ట్టే,రావడిగుంపు మాది టెంకణమిడుమోయ్ :)


    జిలేబి

    ReplyDelete


  41. చిరుజీవి దున్న పోతువి!
    హరి కూడా దున్నపోతు యరె దూడనురా
    బరికిరి గా చేరుచు చవు
    దరిబాయికి కనులనీరు ధారగ బోయెన్ :)


    జిలేబి

    ReplyDelete


  42. ఆమూల నక్కినోడట
    తా మూలపు గ్రంధముల కతల తాటవది
    ల్చే మానవుడట! లకలక
    యే మానవుడికి సతతము యిమ్మగు నంటా :)

    జిలేబి

    ReplyDelete


  43. పాములు కప్పలు బాగుం
    డే! మీ ఫోటోలు సందడే “సన్ డే” యే
    గోమాతలు గలవాండీ
    యేమైనా కనబడంగ యెట్టండొహ టీ 🙂


    జిలేబి

    ReplyDelete


  44. I know not your thoughts
    My dear friend
    Lovers of Nature think too much
    That’s what I can say

    For me its my food
    For some day I become
    To some one else

    To be fit for consumption
    I survive
    Having been fit for consumption
    My friend frog survived thus far

    Humans say we evolve
    I know not
    Humans say karma
    I know not
    Humans say up above the sky
    The lord watches
    I know not

    All I know is I am caught in
    Your blog in a time frame
    For posterity.

    If I come back as thou
    Let me see I recollect
    As my self

    Thyself
    A small serpant

    ReplyDelete
    Replies
    1. అదరహో! సర్ప మనోగతజ్ఞ విదుషీ
      జిలేబి నామాంకిత పద్య శేముషీ
      అయ్యరువారి వామార్ధభాగ-She🙏
      జయహో ఆంగ్లాంధ్ర కవితా పట్టమహిషీ

      Delete

    2. ధన్యవాదాలండీ వైవీయార్ గారు

      మీ కొత్త బ్లాగును మా మాలికలో చేర్చండి.

      కొత్త పోస్టులు వచ్చినప్పుడు తెలుస్తాయి.



      చీర్స్
      జిలేబి

      Delete
    3. పాము కప్పను బట్టె మామి సామికి తట్టె
      గోట కెలికెను తుట్టె సారొవ్యి'యారో' !

      తేనె మునిగెను రొట్టె నోట పదమును బెట్టె
      మురిసి రాయను బట్టె సారొవ్యి'యారో' !

      ఆంగ్ల పద్యము కట్టె ఆంధ్ర జనమును కొట్టె
      అంధకారము చుట్టె సారొవ్యి'యారో' !

      బ్లాగు జనులను కొట్ట బుసగొట్ట రేపెట్ట
      మనసాయె మీకెట్ట సారొవ్యి'యారో' !

      కందిరీగల తుట్టె కొట్టగా మీరిట్టె
      ఏమి భాగ్యము పట్టె సారొవ్యి'యారో' !

      ఏమి మోదము ముట్టె మాది ముంచగ పుట్టె
      న్యాయమా మీకిట్ట సారొవ్యి'యారో' !

      donno what's come off me
      donno what's become of me ...
      :)

      మా కూనలమ్మ మామికి ప్రేమతో ...

      Delete
    4. ఆరుద్ర గారి తరవాత మీరేనండి బండిరావు గారు 👏

      Delete


    5. ఆరుద్ర గారి వారిస్
      మీరే బండ్రావు గారు మీరే చక్రం
      బారించిరి టా , టాయని
      సారెట్టోరెట్టయనుచు చక్కగ సుమ్మీ :)


      జిలేబి

      Delete
    6. హేవిటో ! గాని , శ్రీ బండిరావు గారి
      కింత యభిమాన మేలొకో ! వింత గొలుపు ,
      మామి ! మామీ ! యనుచు పలు మాట లల్లి
      పాట లొకటా ! రెండ ! యీ పాటు లేల ?

      Delete
    7. //ధన్యవాదాలండీ వైవీయార్ గారు
      మీ కొత్త బ్లాగును మా మాలికలో చేర్చండి. 
      కొత్త పోస్టులు వచ్చినప్పుడు తెలుస్తాయి.//
      జిలేబిగారు, ఇంగ్లీష్ బ్లాగ్ కదా అని చేర్చలేదు.లింకు టపాలు పోస్టు చేస్తాలెండి.👍

      Delete

    8. అందులో తెలుగు కనబడుతోంది కదండీ ?

      మరే ఇక్కడున్న తెలుగు బ్లాగులలో తెలుగుందంటారా :)


      జిలేబి

      Delete
    9. @ వెంకట రాజారావు . లక్కాకులOct 9, 2018, 10:36:00 PM ... "హేవిటో ! గాని ...

      ఎటూ అననే అన్నారుగా ... కాచుకోండి ...
      https://nmraobandi.blogspot.com/2018/10/duet-karaoke-compatible.html

      Delete


  45. నీదు తలపులు తెలియవు నేస్తమా! ప్ర
    కృతిని ప్రేమించు వారలు కాస్త హెచ్చు
    గాన ఆలోచనల జేయ గాంచి నాడ
    నాక దివ్వాళ ఘాసమ్ము నౌత నేను
    కూడ నొకనాడె వరలకో కూడు గాన


    జిలేబి

    ReplyDelete


  46. మరి యొకరికి బతుకునివ్వ మదము గూడి
    బతికి నాడ! నేడయ్యె కప్ప యుదరమున
    నాకు! రేపగు నెవరికి నాదు తిత్తి
    మనికి క్రమ వికాసమనెను; మది! తెలియదు!
    మనికి కర్మ నాదనుచుండు! మది! తెలియదు!
    మనికి సర్వజ్ఞుడరయు నమసృతి యనును
    మది! తెలియదయ! తెలిసె నమరితి నీదు
    కాల చక్రపు తలమున కాంతి తోడు!
    నేను నీవు గాన కలుగునే తెలివిడి
    చిత్ర మైతి నాడనుచు సచిత్రమరయ!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇచ్చ టేదియో వేదాంత హృదయ వికచ
      పద్మపు పరీమళాలు ప్రభాస మయ్యె ,
      నెవ్వ రేమి యేరీతి యూహించి వ్రాయ
      బట్టిరో వాయ గొట్టంగ బట్టిరోను .

      Delete


  47. కరుణాంతరంగడయ చవు
    దరి! పరులనుతిట్ట తాను తావివ్వడు సూ
    హరిబాబు నేర్చుకొను మీ
    తరహా లొల్లాయిల బెహతరుగానన్ పో :)


    ఆహా యేమి సంబడపు నొక్కులు :)

    జిలేబి

    ReplyDelete


  48. అరయగ శరణార్థిని నా
    యరకొర తెలివిడి జిలేబి యయ్యె !వినతి గాం
    చి రహిని జేర్చుచు హరశే
    ఖర! మా జీవనమునన్ సుఖంబుల నిడుమా!


    హరశేఖర - గంగానది

    మా గంగే జ్ఞాన్ జగాయే ! మోక్ష దిలాయే


    జిలేబి

    ReplyDelete


  49. చిరుజీవులు చౌద్రీలూ
    పరుగెత్తండ్ర! హరిబాబు వదలడు మిమ్మ
    ల్ని! రయముగ లగెత్తండ్రోయ్
    పరిధుల దాటిన విడువడు పంతము పట్టన్ :)

    జిలేబి

    ReplyDelete


  50. అరయ బతుకాయె నీవలె
    ఖర! మా జీవనమునన్ సుఖంబుల నిడుమా
    హర యని యనుదినమున్ శం
    కరునికి నుతిజేసితి మయ! సఖుడ ఖరుండా


    జిలేబి

    ReplyDelete


  51. భాయికి చెప్పే వంటా
    ఓయీ మాడ్రేషనెట్టు మోయీ యనుచున్
    ఓయబ్బో మనవడ! రౌ
    డీ యీ బాయి కతన బురిడీ యెంతోయీ :)



    మనవడా నిదుర లేచేవా !
    మానాన్నే నిజమాస్మీ :)


    జిలేబి

    ReplyDelete


  52. నను వేదిస్తోందీ శూ
    ర్పణఖా యనుచున్ జిలేబి, రాముండంటే
    మన మీడియాని న్యూసుగ
    మనగల్గున ? బాంగ్ల పిల్ల మాటలె చెల్లున్ :)

    జిలేబి

    ReplyDelete


  53. చౌకీ దారుడయా మో
    డీ! కేకల రాహులుడు పెడేల్మనె అంబా
    నీకేనంటా ! భళిరా
    జోకులనగ నీదె బాబు చోద్యపు పప్పూ :)


    జిలేబి

    ReplyDelete


  54. మా లక్కు పేట రౌడ
    న్నా! లావై నిను దలచిరి న్యాయము జేయన్
    నీ లాపుటాపు చూడ
    న్నా! లాపాయింటు తీసి నంగిడి నాపన్ :)


    జిలేబి

    ReplyDelete


  55. ఆనంద నందన వనం
    బానందము నొందినాము ప్రాజ్ఞుడ! రాజా
    మీ నందన వనమగు దే
    వా! నగజాతకు కదంబవనముగ రాజా!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తమ యాశీర్వాద బలము
      న , మాతృ వనము దినదినము నభివృధ్ధి గనున్ ,
      సుమ ఫల తరచాయలతో
      రమణీయం బగుత ! హితుడ ! లలిత వనంబై .

      Delete



  56. ఇందు మూలముగా సకల బ్లాగ్జనులకు తెలియ చేయడమేమనగా-

    హరిబాబు గారి బ్లాగు చీడ పురుగు
    కాదు.

    ఢంకా భజాయించి చెబ్తున్నాము.

    చీడ పురుగు కాదండోయ్
    మా డంకా మీదు బ్లాగు మా గట్టిదయా!
    తాడనము చేయు తకరా
    రే డైనా,చేయగనెవరేని కిరికిరీ !


    జిలేబి

    ReplyDelete


  57. వార గణన సూత్రము


    వారగణన సూత్రం
    సంవత్సరం + సంవత్సరం/4 + నెలకు ఇండెక్స్ + తేదీ - - 2 x ( శతాబ్దిని 4తో భాగించితే వచ్చే శేషం) -1

    Index for month

    జనవరి 0
    ఫిబ్రవరి 3
    మార్చి 3
    ఏప్రిల్ 6
    మే 1
    జూన్ 4
    జూలై 6
    ఆగష్టు 2
    సెప్టెంబరు 5
    అక్టోబరు 0
    నవంబరు 3
    డిసెంబరు 5

    Easy remembrance


    0336, 1462, 5035

    Now calculate for 10th Oct 2018

    2018 - 10 - 10

    Year + Year/4 + index for month + date - 2(reminder of century when divided by 4) -1 (1 is fixed value)

    Then divide the obtained value by 7 get reminder. Reminder is the day of the week (0 is Sunday )


    Year 18
    Year/4 = 18/4 = 4 ( quotient)
    Index - for Oct = 0
    Date = 10

    2(reminder of century when divided by 4)

    2( 20/4 reminder = 0) 2*0 = 0

    So
    18+4+0+10-0-1 = 31

    31/7 reminder = 3 so Wednesday

    Source

    http://syamaliyam.blogspot.com/2018/10/2.html

    బుర్రంటే యి దే గా !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ప్రతి పాఠ్యభాగానికి గైడ్ లాగా మీరు నా టపాలను ఇక్కడ లఘురూపంలో ప్రచురించేసారు. అయ్యల్లారా అమ్మల్లారా, సూత్రం ఇక్కడా కనిపిస్తోంది. కాని అదెల్లా అంటే మీరు నా టపాలను దయచేసి చదువుకోండి.

      Delete

    2. *reminder :) remainder :)


      శ్యామలీయం‌ వారికి,

      మీ టపా ఇంగ్లీష్ లో కూడా పోస్ట్ చేయండి.
      So it gets wider exposure and useful to many.

      Cheers
      Zilebi

      Delete


    3. Can we make these three components together and simplify further ?

      Month index
      Fixed value - 1
      ?

      Some idea

      Add month to the formula and subtract to create a different month index ?

      Month index - month - 1 = new month index



      Define the formula as

      YY+MM+DD + quotient (yy/4) + remainder(century/4) + new month index ?


      Zilebi


      Delete

    4. New month index
      Jan to Dec

      -1 2 2 5
      0 3 5 1
      4 -1 2 4



      జిలేబి

      Delete

  58. Now calculate for

    0000 - 01 - 01

    00 + 00 +0 + 01- 0 - 1 = 0.

    So Sunday

    AD January 1st 0000 is Sunday.

    కమాల్ కీ బాత్ హై

    జిలేబి

    ReplyDelete


  59. వందనాలు తల్లీ .....
    -------------------
    ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
    కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
    ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
    కాచి రక్షించునో కనుల నిండ
    ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
    చరియించ పాప సంహరణ చేయు
    ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
    జ్యోతుల నందించి యునికి నేర్పు

    ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
    ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
    అంతటను నిండి తనయందె అంత నిండి
    వెలుగు మూలపు టమ్మకు వేల నతులు ."


    లక్కాకుల రాజారావు గారు.

    ReplyDelete


  60. హరిహరులొకరె జిలేబీ
    తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే
    మరులుగొలుపునుత్సవములు
    మరల మరల రమ్మటంచు మనలను బిలుచున్ !

    బీలేజి అన నేమి జిలేబి అననేమి అన్నియు గుండు సున్నాలే
    హరి యన నేమి హరుడన నేమి అన్నియు తానే
    గోవిందా గోవిందా గోవిందా !


    జిలేబి

    ReplyDelete


  61. వేస్తున్నామండయ్యా
    మస్తుగ బాలాత్రిపురకు మన్నికగా మే
    మేస్తున్నామయ వేషము
    వస్తారాండిమరి ? రాను పదరా శిష్యా :)


    జిలేబి

    ReplyDelete


  62. వరదుడు వేంకటరమణుడు
    తిరుమలలో వెలసినట్టి దేవుఁడు, హరుఁడే
    యరయగ కైలాసంబున
    గిరిజకు భర్తగ వెలసెను కిదుకులవేలా !

    ***

    మరియిందరు గూడి యరే
    మరిమరి యనృతంబులాడ మహిలో‌ సుమతీ
    సరియగు సత్యంబగునా
    తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే? :)


    జిలేబి

    ReplyDelete


  63. మాలికనుచూడ సామీ
    చాలిక అనిపించె నాకు చదువను కాలే
    మాలావు బండి వరులే
    గోలల తట్టుకొనలేక గొల్లుమనిరిగా !

    జిలేబి

    ReplyDelete


  64. బీగము రొచ్చుకు వేయన్
    పాగల్కానా జనులకు భండారయ్యల్
    ఆగారంబయిరిగదా
    పోగాలంబొచ్చె సూవె పోకిరి ప్రజకున్

    జిలేబి

    ReplyDelete


  65. సురకల్లు తాగి వేటకు
    చిరుజీవి బయలు వెడలెను ఛీఛీ యనుచున్
    పరుగెత్తునిక లగెత్తుకు
    కిరికిరి జేయుచు సదనపు కితవార్భకుడై :)


    జిలేబి

    ReplyDelete


  66. తాటవొలుస్తాను జిలే
    బీ! టాంటాంచేస్త నీదు పిండాకూడున్
    తూటాతో కొడతానే
    కోటల్దాటె చిరుజీవి కొక్కర కో కో !

    జిలేబి

    ReplyDelete


  67. లింకు లేసు కొనుచు లింగులిటుకనుచు
    బిచ్చ మడుగు చుండె పిచ్చి వాడు
    కిరికి రీల మడిసి కీసర బాసర
    చదువ రండు రండు సదన మందు :)


    జిలేబి

    ReplyDelete


  68. కోతి కలల చూడండీ
    రాతల కోతలను చూడ రండీ రారం
    డే!తల మాసిన టాపి
    క్కే! తైతక్క తకతక్క కితవార్భకుడే :)


    జిలేబి

    ReplyDelete


  69. గ్రంధాలను త్రిప్పితిరా
    సంధానముచేసినార ? సారా గొనిరా
    అంధుల్లారా! రండ్రా
    గంధము పూయ చిరుజీవి గబ్బును నడచన్ :)


    జిలేబి

    ReplyDelete


  70. గుమ్మడి కాయల దొంగో
    డమ్మోయ్ తా భుజ ములను బడబడ‌ తడుము‌చుం
    డమ్మోయ్! తనకని పించున్
    బామ్మోయ్ యెవరేమనినను బలిరా తననే :)

    జిలేబి

    ReplyDelete


  71. అరె! త్రిప్పెను వేదమును ప్ర
    ఖర, పదము పరిగ్రహించి కననగు ముక్తిన్‌
    పరుగున జూచెను దానిని
    తరవణి కుడిచి చిరమేహి తలయంటుకొనెన్ !

    జిలేబి

    ReplyDelete


  72. ఎవరేమన్నను తననే
    చవటా యను చుండ్రి యనుచు సదనంబున నా
    కవమానమటంచు తిరిగె
    నవనాగరికుడరరె భువనమున జిలేబీ

    జిలేబి

    ReplyDelete


  73. భారతదేశంబనగా
    మీరను కున్నట్టు దైవమేలెడు భాండా
    గారా మన్నద దెప్పటి
    దో రాణించునది నరుడ దురితపు పుడమీ!

    జిలేబి

    ReplyDelete


  74. పేరు మార్చుకొనుచు పేర్మిగానంగను
    విశ్వ నాథు డగుచు వీధి లోన
    నసుర సురల కతల నాడబోయి మనుజు
    డచట బండ తగిలి డమడమపడె

    జిలేబి

    ReplyDelete


  75. కాలంజరి,కాత్యాయని,
    కాలక,కాళిక,కిరాతి,గౌరమ్మ,జయం
    తీ, లంభ, బాభ్రవి, సినీ
    వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్!

    జిలేబి

    ReplyDelete


  76. పరమాత్ముడొకడే పురుషుడు తతిమ్మా అందరు నెచ్చెలులే

    లోలాక్షి! పురుషుడొకడే
    నే! లోతక్కువ జనులిక నెచ్చెలు లే లె
    మ్మా! లాఘవముగ నడచుచు
    వాలిని, దన సతిగ గొన్న స్వామియె, ప్రోచున్!


    జిలేబి

    ReplyDelete


  77. ఓ యగ్రిగేటరులు ! కౌ
    బాయిలు! దయచూపుడీ! సభన నేనుండా
    లా? యింతే సంగతులని
    మాయా లోకమును వీడి మాయమవుదునా :)


    జిలేబి

    ReplyDelete


  78. రమేశా వారి భావనకు


    మాలిని జగజ్జననియు,క
    పాలిని,యమ్మలకు నమ్మ పార్వతి గట్రా
    చూలి దునుమ నసురుల కర
    వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్


    జిలేబి

    ReplyDelete


  79. లాజిక్కులతో దునిమే
    మేజిక్కులుగల నరుడ! హమేషా డోకొ
    చ్చే జొల్లుకూతలేలా
    బాజారుని శకులి సంత వలెమార్చుటయో?

    జిలేబి

    ReplyDelete


  80. హరి నేమన్నా అనుమోయ్
    మరి దొంగవలె యయిడీల మార్చుచు రాడోయ్
    గురి చూసేడంటే యిక
    సరిచేయువరకు విడువడు సత్యము సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  81. మొక్కలు పదడుగులెత్తుకు
    చక్కగ పెరిగేయి యమ్మ చలువగ సభలో
    పెక్కుటముగ మెచ్చిన నా
    చక్కటి మిత్రుల చలువగ సహజ వనంబై !

    జిలేబి

    ReplyDelete


  82. మమ్మల్ని యెంటరుటెయిన్
    జమ్మంచున్ చేయుడయ్య, ఛందంబులతో
    బొమ్మాళి చావ గొట్టెను
    వామ్మో యనుదినము పద్య వాయింపులతో :)

    జిలేబి

    ReplyDelete

  83. చెవిటి వాడి ముందు శంఖము :)


    నేనేమనుకున్నానో
    ఆ నా పల్కులను మీకు నా తరపును చె
    ప్పేను తరువాత మీ మ
    ర్జీ! నోటిదులకొక హద్దు రీజను వలయున్ :)

    జిలేబి

    ReplyDelete


  84. అసురుల సంబంధీకుడు
    బుసులు నులుము కొనుచు సభకు బూచీ యనుచున్
    గెసపోసుకునుచు వచ్చెను
    వసపడు నాకన్నితెలియు పసయుందనుచున్ :)


    జిలేబి

    ReplyDelete


  85. తాడి తన్ను వారుండగ వారి తలతన్ను వారుందురు !

    సబ్కా మాలిక్ వూపర్ వాలా హై :)


    ఒకచో యైపీలెగురన్
    నొకచో మాలికుడు నొక్క నోబటనునరే
    చకచక మాయా నగరం
    బు కమాలుగ నద్దుకొనెను పూర్వపు శోభల్ :)


    రౌడీనిద్రను వీడ గాను కత యేరాలమ్ముగామారెగా
    (శార్దూలము :)


    జిలేబి

    ReplyDelete


  86. చాడీల్బల్కుచు వీధిలోన బడి గాచారంబులన్ దోడుచున్
    గోడల్దాటుచు హద్దు దాటి నగరిన్ గూడారముల్ లేపుచున్
    జాడాచేయుచు బోవ గాన భళిరా జాటీని చాటంగ మా
    రౌడీనిద్రను వీడ గాను కత ధారాళమ్ముగా మారెగా !


    చీర్స్ టు మనవడు :)

    జిలేబి

    ReplyDelete


  87. వెడలన్ కొల్హాపురికిన్
    సడలని నమ్మకము తోడు జలధిజ దయనే
    బడసితి దర్శనము కలిగె
    వడివడిగాను మదినిండు పదిలంబుగనన్ !


    జిలేబి

    ReplyDelete
    Replies


    1. వెడలన్ కొల్హాపురికిన్
      సడలని నమ్మకము తోడు శాంభవి దయనే
      బడసితి దర్శనము కలిగె
      వడివడిగాను మదినిండు పదిలంబుగనన్ !


      జిలేబి

      Delete
    2. "జిలేబీ నామధారుల కొక పద్యము వినమ్రతతో .....


      ఎంతటి విద్యమానమిది ! యెచ్చట నేర్చితి రండి ! మీరు ? మీ
      రెంతటి విఙ్ఞులైన , నిటు లీ పద పద్య విలోల కేళికా
      మంత మనోఙ్ఞ భూమికను మాయురె ! మోయుట మేము నేర్తుమే !
      బంతుల నాడి పద్యములు , భావములున్ కదన మ్మొనర్తురే !

      Delete


  88. అనువాదము చేయదలచి
    తిని శర్కరిగారు తేట తెలుగుకతల నె
    ల్ల నరవమందు జిలేబిన్
    వినతులివి సవెం‌ రమేశ వివరము లేమీ :)


    ఎన్నాళ్ళకు శర్కరి వారి టపా / బ్లాగు
    కన్నుల పడింది !
    జిలేబి

    ReplyDelete


  89. దాటె జపతపాదుల నెడదన సిరసున
    దాల్చి కర్మమార్గమునందు తాను దిట్ట
    గాంచి భక్తి మార్గమును మది గాన నతడు,
    జ్ఞానశూన్యుండు, పొందె యశమ్ము సభను.


    జిలేబి

    ReplyDelete


  90. లావొక్కింతయు లేదుర !
    కావుము మము కరుణ తోడ; కాననపు చలిన్
    ఠావుల్ దప్పె "ర" పలుకన్
    లావే యీశ్వల ములాలి లక్షించు హలీ !



    సావేజిత
    జిలేబి

    ReplyDelete


  91. సతతము మాలల తోడుగ
    బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును, వాడిన పూలన్
    జతకట్టి కొమ్మల కెడన్
    లతాంగి విడుమా ప్రకృతి కెల నొదిగి ప్రిదులన్!


    జిలేబి

    ReplyDelete


  92. ఎవ్వార లెవ్వరలకో
    కవ్వము ద్రిప్పుచు నవనిని కదలిక నిడు వా
    రెవ్వారకో! జిలేబీ
    లవ్వాడ తెలియతరమగు?లపితంబంతే !


    శుభాకాంక్షలతో
    జిలేబి

    ReplyDelete


  93. Until liberation get recycled :)


    సత్యంబగు పరమాత్ముని
    ప్రత్యంతము చేరక తమ బతుకుల నీడ్వన్
    నిత్యంబగు మరు జననము,
    మృత్యువు, మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్!


    జిలేబి

    ReplyDelete


  94. సత్యము పల్కితి రయ్యా
    పైత్యము పట్టెను జనులకు ప్రబలం బాయెన్
    నాత్యంతికముగ కొల్వున
    నిత్యముఁ గావలె సమస్య నెమ్మది కలుగన్!

    :) పూరించే లోపలే పాదము మారి పోయెను ;)
    అయినా వదలము వదలము శంకరార్యా :)

    జిలేబి

    ReplyDelete


  95. డెందము నందుగ లండర
    విందుడు, సాక్షియ తడేను వినుమా రమణీ,
    యందరికిన్ నత డే, గన
    నంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్

    జిలేబి

    ReplyDelete


  96. చిందులు వేయుచు కొట్టగ
    నందరొకని,లోన, నొక్కడందరి లోనన్,
    సందుల గొందుల దూరి ప
    సందుగ తరిమె! సినిమా హసనవాయువు పో :)

    బాలకిట్టన్న , రవితేజ, జిందాబాద్ :)


    జిలేబి

    ReplyDelete


  97. कौन ఈ ముదిత :)


    హృదయము గుసగుస లాడెను
    మదియే తూగెను సరసపు మత్తున భళిరా
    మదిమది ! నెలలుతిరిగె, కౌ
    ముది తన పుంసకునిఁ గూడి ,పుత్రునిఁ బొందెన్!


    जिलेबी

    ReplyDelete


  98. అదె! సంతసమొందకనౌ
    ముదిత నపుంసకునిఁ గూడి, పుత్రునిఁ బొందెన్
    కద గాజుమూసలోనన్ !
    వదంతి కాదిది జిలేబి వాస్తవ మమ్మా !

    జిలేబి

    ReplyDelete


  99. వేడిగ తినన్ తదితరులు
    కోడిని, శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్
    పోడిమిగల మాకందము
    బాడబులమ్మాయి, రెడ్డి, పరిణయమాడన్ !


    జిలేబి

    ReplyDelete


  100. పోడిమిగల కామాంగము
    తేడరిలెడు మామిడి గద! తెంపరి గానన్,
    దాడీ చేయగ నాపుచు
    కోడిని, శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్!

    జిలేబి

    ReplyDelete


  101. ప్రేమతో గ్రామస్థు లివ్వగ


    బాడబులమ్ము వలదనగ
    తోడుగ వినతులను జేర్చి దోసిలి గానన్
    వేడిగ తెచ్చిన ప్లేటు ప
    కోడిని, శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్!


    జిలేబి

    ReplyDelete


  102. కష్టంబును పుష్టిగ తా
    రొష్టుగ జేర్చున్ గదా తిరోగతి సూ! నీ
    కిష్టమ నకు!దుష్టి! యెచట
    పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్!

    జిలేబి

    ReplyDelete


  103. కరసేవను చేతుము! రం
    డి రండి నా శిష్యులార డిగనురుకులని
    ప్డె రయము గా భళిభళి స్వా
    ర్థ రహితముగ గురు వుబిలిచి రమ్మ జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  104. బోడులయిన తలలున్ భళి
    బోడులగున తలపులున్? సబూతిదియె సుమా
    వేడుకగా గుమిగూడుచు
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్!

    జిలేబి

    ReplyDelete


  105. వచ్చెదవోప్రచ్ఛన్నము?
    తెచ్చెదవొ జిలేబులన్ పదిలముగ మాకై?
    బుచ్చమ్మ కతల నమ్మకు
    డచ్చము గా కవివరా!లొడలొడయె సుమ్మీ :)


    జిలేబి

    ReplyDelete


  106. ధర్మ్యము కలిగిన మోడి, న
    ధర్మ్యము తొలగింపగాను తలచె పటేలున్
    హర్మ్యము కట్టెను తను! నా
    హర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో!



    జిలేబి

    ReplyDelete


  107. కలవవ లెనన్న కోరిక
    కలదండీ రావుగారు కానీ దైవే
    చ్ఛ,లలాటలిఖితములెలా
    కలవో తెలియవు గదా సఖా రాజన్నా!

    జిలేబి

    ReplyDelete


  108. దశ రసములతో పద్మా
    వశీకరము చేసుకొనగ వచ్చితివి గదా
    దిశయేదో తెలుప దగున్
    మశాణపు బతుకనిపంచె మాకు జిలేబీ‌:)


    జిలేబి

    ReplyDelete


  109. చదివితి నధ్యాయంబెని
    మిది! అయినను అన్యగామి మేష్టారయ్యా
    పదిలంబవలేదర్థము
    కుదురుగ నర్థమును తెలుప కోరితి మయ్యా :)

    జిలేబి

    ReplyDelete


  110. దశరస మనరాదేత
    ల్లి! సవ్యమది కాదు సూవె లిల్లి జిలేబీ
    దశమ రసంబనదగునే
    వశీకరీ ! పద్మ నయన! బాలకుమారీ :)

    జిలేబి

    ReplyDelete


  111. ఒకడేమో సూర్యుండు ! మ
    రొకడు ప్రవీణుడు! భళా బురుబురు యటంచున్
    ప్రకటనలు! పల్లె వాటము
    జకటము లాడగ నరరె! బజారాయెన్ మస్త్ :)


    జిలేబి
    జిలేబి

    ReplyDelete