Saturday, September 22, 2018

మధ్య తరగతి మానవుని జీవిత చరిత్ర



మధ్య తరగతి మానవుని జీవిత చరిత్ర


పెద్దోళ్ళ జీవిత చరిత్ర చదివితే నే గొప్పా ?
 
 
మధ్య తరగతి మానవుల జీవిత చరిత్ర చదివితే ఏం గొప్ప ?
 
 





అభినందనలతో

జిలేబి

17 comments:

  1. మా అత్తగారూ, వాళ్లమ్మగారూ ఒకేసారి మగపిల్లలని కన్నారు. గోదావరి జిల్లా వాళ్ళేనా కృష్ణాజిల్లాలో ఎవరూ లేరా అని బాధపడిపోతున్నాను.మన జిల్లాలో కూడా మహా మహులు ఉంటే చెప్పుకోవద్దా ? తొమ్మిదో తరగతిలోనే తొందరపడనవసరం లేదు రిటైరయ్యేదాకా ప్రేమించుకోవచ్చు అని పిల్లలకి చెప్పుకోవడంలో సిగ్గుపడనవసరం లేదనే అనుకుంటున్నాను.

    ReplyDelete
  2. ఓహోహోహో, ఇదన్నమాట సంగతి “జిలేబి” గారూ. ఈ పోస్ట్ ఎందువలనో నేను పొద్దున్నుండీ గమనించనే లేదు 🙁. అయితే దీన్ని చూశా దీని ముందరి మీ పోస్ట్ లో (“కృష్ణాతీరం”) నీహారిక గారు అంత చెలరేగి పోతున్నారు 🙂

    కినిగెలోనయినా మీకసలు ఈ పుస్తకం ఎలా మీ కంటబడింది? పోన్లెండి సంతోషం. మీరు, నీహారిక గారు అన్నన్ని వివరాలు చెబుతున్నారంటే పుస్తకాన్ని కొని పూర్తిగా చదివారన్నమాటేగా. థాంక్స్ మీకిద్దరికీ.

    విశిష్టమైన వ్యక్తి మా తండ్రి గారు. వారి జీవితచరిత్ర ఎంత మంది చదివితే మాకు అంత సంతోషం.

    ReplyDelete
  3. నీహారిక గారూ, థాంక్స్.

    అవనిగడ్డ నాకు ఊహ తెలిసిన తరువాత చూసిన ఊరు కాదు. అందువల్ల ఆ ఊరి గురించి నేనేమీ చెప్పలేను. మీ శ్రీకాకుళం (కృష్ణా) దగ్గరలో ఉన్న ఊరు కాబట్టి మీకు ఆసక్తి ఉంటుంది లెండి.

    సంతానం ఎక్కువ మంది అన్నమాటే గానీ మా అమ్మగారు, ఆవిడ అత్తగారు (మా బామ్మ) మీరు పైన చెప్పిన కోవలోకి రాలేదు లెండి. నేను పుట్టే నాటికే మా బామ్మకి 75 సంవత్సరాలు దాటిన వయసు(ట). మా అమ్మగారు, ఆవిడ అమ్మగారు (మా అమ్మమ్మ) కూడా ఆ కోవ కాదు.

    మా తండ్రి గారు చాలా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆ తరంలో కృష్ణాజిల్లా లోనూ, తరువాత తూగోజీ లోనూ తన నిప్పులాంటి నీతీ నిజాయితీకు (ఆయన్ను నిప్పు అనే అనేవారు), సమర్థవంతమైన పనితీరుకూ రెవెన్యూ డిపార్టుమెంటులోనూ, ప్రజల్లోనూ, ఆనాటి రాజకీయ నాయకుల్లోనూ చాలా పేరు, గౌరవమర్యాదలు పొందిన వ్యక్తి. ఎవరి ఒత్తిడులకూ లొంగేవారు కాదు. వారి జీవితచరిత్ర చదివి ఆనందించండి ... వారి మీద కొంటె కామెంట్లు చేయకుండా. థాంక్స్ అగైన్.

    ReplyDelete
    Replies
    1. >>>>వారి మీద కొంటె కామెంట్లు చేయకుండా...>>>>

      ఇది మరీ బాగుంది. మీరు కూడా హరిబాబుగారిలా మాట్లాడుతున్నారే ? నేనింకా జులాయి సినిమాలో అల్లు అర్జున్ రాజేంద్రప్రసాద్ తో అన్న డైలాగ్ వ్రాద్దామనుకుని గౌరవనీయమైన వ్యక్తులు కదా అని వదిలేసాను.

      Delete
    2. >>>పుస్తకాన్ని కొని పూర్తిగా చదివారన్నమాటేగా. థాంక్స్ మీకిద్దరికీ. >>

      ఈ రోజు వంట్లో బాగులేదు.జలుబు వగైరా...జిలేబీ గారి పోస్టు చూసి మొదలెట్టాను.ఆద్యంతం ఆసక్తికరంగా(నాకు) వ్రాసారు.మీరు బ్లాగ్ మొదలు పెట్టవలసిందే ! ఇంగ్లీష్ ఎక్కువగా వాడారు. కొన్నిచోట్ల HS ఎక్కువసార్లు వచ్చింది.

      అన్నట్లు కినెగె లో కొని చదవలేదు.లింక్ చూసి ఫ్రీగా నే చదివాను.కినెగె లో చదవడం ఇదే మొదటిసారి.

      Delete
    3. ఒంట్లో బాగుండక పోతేనే ఇవాళ మీరింత వీరవిహారం చేశారే! అమ్మబాబోయ్.

      HS ఎక్కువసార్లు వచ్చిందన్నారు. మా తండ్రి గారు HS గా పని చేస్తున్న అనుభవాలను వర్ణిస్తున్నప్పుడు సహజంగా ఆ పేరు తరచూ వస్తుంది కదా మరి. HS అనేది “హుజూర్ సిరస్తదార్” కు కురచ రూపం. బ్రిటిష్ పాలన కాలం నుండీ ఉన్న డెజిగ్నేషన్ అది (ఇప్పటికీ ఆ పేరే ఉందో, మార్చారో తెలియదు). కలెక్టరాఫీస్ లో చాలా కీలకమైన పోస్ట్. కలెక్టర్ దగ్గరకు వెళ్ళే ప్రతి ఫైలూ HS ద్వారానే వెళ్ళాలి. సీనియర్ తాసిల్దార్ లలో తగినవారినెవరినైనా కలెక్టర్ ఆ పోస్ట్ కు సెలెక్ట్త్ చేసేవాడు. అప్పటి కృష్ణా కలెక్టర్ మా తండ్రి గారిని కోరి ఆ పోస్ట్ లో వేసుకున్నాడు. అక్కడి నుండే మా తండ్రి గారికి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ వచ్చి తూగోజీ వెళ్ళారు. ఈ వివరాలు మీకు పుస్తకంలో కనిపించే ఉంటాయి.

      Anyway పుస్తకం మీకు నచ్చినందుకు సంతోషం నీహారిక గారూ.

      Delete
  4. జిలేబి గారు, మీ నాన్న గారి జీవితచరిత్ర గురించి కూడా ఏదైనా పుస్తకం ఉంటే చెప్పండి. నిహారిక గారి పని ఈజీ అవుతుంది.

    ReplyDelete
    Replies


    1. కారము బెట్టి పుంగవపు కన్నులు చల్లగ చేసిరెం తయున్ :)



      జిలేబి

      Delete
    2. @ bonagiri garu,
      👌👌👌

      మొండి ఘటం.... అంత తేలిగ్గా చెప్పరు లెండి.

      Delete
    3. నారదులోరి గొప్పలు వినంగ మహోన్నతముల్ , హదేవిటో !
      పేరులు నూరు లందరివి వీరికి కొట్టిన పిండి , వారి పే
      రూరులు దెల్వ దెవ్వరికి , నుధ్ధతి యన్న నిదే , మరందుకే
      కారము బెట్టి పుంగవపు కన్నులు చల్లగా జేసిరెంతయున్ .

      Delete
  5. అద్భుతమైన ఐడియా బోనగిరి గారూ 👏. ఆ ఊపులోనే నీహారిక గారి అబ్జర్వేషన్ కూడా సునిశితమైనదని చెప్పాలి 👌. “జిలేబి” గారా తేలికగా చిక్కేది🙁 ? Slippery customer కదా 😀 (jk).

    ReplyDelete
  6. శ్రీయుత విన్నకోట నరసింహుల వారి విశేషముల్ వెలిం
    దీయు రిసెర్చి గూర్చి , వినుతింతుము చెల్లి ! నిహారికమ్మ ! మా
    ధ్యేయ మిదేమి కాదసలు , తెల్విడిమీరు ముసుంగువీర స్వా
    ధ్యాయము దేల్చగావలయు , తప్పదు , మాస్కు తొలంగగావలెన్ .

    ReplyDelete
    Replies
    1. ఆవిడ ఐ పీ అడ్రెస్ సేకరించి వారి వివరాలు తెలుసుకోవలసినంత అవసరం ఉందంటారా ? వదిలేద్దాం అని డిసైడ్ అయ్యాము కదా ?
      విన్నకోట వారు ప్రమీల అని వ్రాసి గీత దాటారు.
      పేరు చెప్పేవరకూ జిలేబీ గారితో ఎవరూ మాట్లాడకూడదని ఫత్వా జారీ చేద్దామంటే నేను రెడీ ! ముల్లుని ముల్లుతోనే తీయాలి.

      Delete
    2. ప్రమీలారాజ్యం అంటే మీకలా అర్థం అయిందా నీహారిక గారూ 😟?? ఆ పదాన్ని వాడానని “జిలేబి” గారి పేరు ప్రమీల అని నేను అంటున్నానని నిర్థారించేసుకున్నారా 🙂? ఆడో మగో తెలియకుండా పేరు ఎలా ఊహిస్తామండీ? హ్హ హ్హ 😀

      🦁

      Delete
    3. అదీ గాక “జిలేబి” గారి పేరు కనిపెట్టే రిసెర్చ్ ప్రోజెక్ట్ ఆపేశాంగా abandoned . ఆ మాటే ఖాయం 👍.

      Delete


  7. రెండు సినిమాలనరరే
    గ్రాండుగ చూసినను తృప్తి నొందను గాలే
    చెండాడిరే మహర్షిని
    దండగ యనుచు సినిమాను దాక్ష్యమె లేకన్


    జిలేబి

    ReplyDelete


  8. నేనో పీహెచ్ డీన
    ర్రా! నాకీ పూజలెల్ల రాద్ధాంతాల
    ర్రా! నచ్చవు పన్లేని మ
    రీ నాలాయికు జనులు మరీ లోలెవలున్ !


    జిలేబి

    ReplyDelete