Saturday, October 27, 2018

ఆకాశవాణి - సమస్యా పూరణ - కార్యక్రమం - 27th Oct 2018 - నిర్వహణ - శ్రీ కంది శంకరయ్య



జిలేబి పద్యము - కంది వారి గళము - ఆకాశవాణి సౌజన్యము :)
 
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 27th Oct 2018
 
నిర్వహణ - శ్రీ కంది శంకరయ్య గారు
 
 
సౌజన్యం - ఆకాశ వాణి  హైదరాబాదు
 
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !
 
 
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్
 
 
 
అరయన్ పార్వతి, దుర్గ, శారదయు, మా యార్యాణి శర్వాణి యా
సురసన్ కర్వరి కొండచూలి గిరిజన్ శోభిల్లు మా శైలజన్,
వరమాలన్ మనువాడినట్టి శివుడా భద్రేశుడౌ చంద్ర‌శే
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్!


శుభాకాంక్షలతో
 
జిలేబి

114 comments:

  1. వహ్వా!

    ఇది జిలేబీయం కానే కాదు...అమ్మగారి కత్తికి ఆరు వేపులా పదునే!

    ReplyDelete
  2. గురువు గారికి నమస్కారములు శుభాకాంక్షలు

    ReplyDelete
  3. గురువు గారికి నమస్కారములు శుభాకాంక్షలు

    ReplyDelete
  4. కేవలమామెగూల్చునని కృష్ణుడు సత్యకుజెప్పడయ్యె దే
    వీ! వరమెట్టు లీ నరకువీరుని గాచుట మర్చితీవొ దీ
    పావళి పండుగన్ జరుపనౌగద;పున్నమి నాటి రాతిరిన్
    కావరమణ్చె నాత్రిపురకాపుల శంభుడు కార్తికమ్మునన్

    ReplyDelete
  5. దీపావళి పండుగను లోకకంటకుడైన భూమాత కొడుకును తన తల్లే(సత్యభామ భూదేవి అవతారం)చంపితే తప్ప చావడన్న వరగర్వంతో &త్రిపురాసురలు తమ మూడు పురములు ఒకేచోటికి చేర్చికూల్చితేతప్ప చావొద్దన్న గర్వంతో త్రిపురపూర్ణమి/కార్తీకపున్నమి నాడు శివునిచే చంపబడుటచే దీపావళి&పున్నమి పండుగలు జరుపబడుతాయనీ పురాణం లో చెప్పబడింది

    ReplyDelete
    Replies

    1. ఏ పురాణము లోనండి ?

      జిలేబి

      Delete

    2. ఏ భాగవతంలో ఎన్నో స్కంధములో వివరములు తెలుపగలరు

      Delete
  6. 'నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !'

    శ్రీకరము గౌరవ మిది , జిలేబి రూప
    పండిత కవుల , కిదియు నేపాటి ? యింత
    కన్న ఘనత లెన్నేనియున్ గాంచ గలము ,
    బుధ సుమాలలో దారంబు బొసగు నటుల .


    ReplyDelete


  7. లక్కాకుల కవిరాయా
    చక్కగ నుత్సాహములను సదనంబున మీ
    రిక్కడ చేర్చగ నవియే
    మిక్కుటముగ నిచ్చె నూత మీకు నతులయా !


    జిలేబి

    ReplyDelete


  8. చందురురుడు తెలగాణని
    చందురుడాంధ్రమ్ములోన జగనుడ, కలరోయ్
    యెందెందువెతికినను నీ
    కందరొకనిలోన నొక్కడందరిలోనన్

    జిలేబి

    ReplyDelete


  9. నడిరేయిన్ గాంచెను రవి
    వడినేదేదో తెలియదు ప్రస్తుత మీ యం
    శుడు గాంచి నవ్వె భళివి
    చ్చెడునుత్పలముల జిలేబి జేజే యనవే :)

    జిలేబి

    ReplyDelete
  10. kavanasarma.wordpress.com
    బ్లాగర్ డాక్టర్ ప్రొఫెసర్ శ్రీ కవన శర్మ గారు (కందుల వరాహ నరసింహ శర్మ గారు) గతనెల 25 న స్వర్గస్ధులయ్యారని ఆన్లైన్లో వార్త చదివాను 👇. చాలా విచారకరం.

    కవన శర్మ గారి మృతి

    ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5.30కు హైదరాబాద్ దోమలగూడలో హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో శ్రీ కవన శర్మ గారి స్మారకసభ అని పుస్తకం డాట్ నెట్ లో వార్త :- 👇

    కవన శర్మ గారి స్మారకసభ

    బెంగళూరులోని Indian Institute of Science లో Professor గా పని చేసి రిటైర్ అయ్యారు. చక్కటి హాస్యకథల రచయిత. 1970లలోనో / 1980లలోనో ఒక వార్తాపత్రికలో సీరియల్ గా వచ్చిన … బ్రెయిన్ డ్రెయిన్ అను అమెరికా మజిలీ కథలు … చాలా సరదాగా వ్రాశారు, చాలా ప్రాచుర్యం పొందాయి.

    వారి కుటుంబానికి నా సంతాపం తెలియజేసుకుంటున్నాను 🙏.

    ReplyDelete


  11. బంగారు రోజులను న
    చ్చంగ కనులముందరన్ సజావుగ నిల్పెన్
    రంగుల కలలన్ తేల్చుచు
    చెంగలువ కథల సయిన్సు చేర్చె కవనుడై!


    With Deep condolences
    To
    Kavana Sarma Hi

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. // "..... ఒక వార్తాపత్రికలో సీరియల్ గా వచ్చిన ... " //

      సవరణ:-
      .... ఒక వారపత్రికలో ....

      Sorry.

      Delete
  12. Jilebi jee:

    Before I forget...

    I am stunned by the depth and breadth of your knowledge and tolerance.

    You are a GENIUS!

    ReplyDelete
    Replies
    1. నిస్సందేహంగా ప్రొఫెసర్ గారూ 👌.
      Take a bow "జిలేబి" గారూ 👏.

      Delete

    2. ఇద్దరు "ప్రొఫె" సర్ లకు

      నమో నమః


      జిలేబి

      Delete


  13. పండుగరోజుకైన చేరుతామని ఫ్లైటెక్కి డిలే యై వచ్చిన పెనిమిటితో :)



    మావా! ఫ్లైటు డిలేతో
    నీవొచ్చితివయ! జిలేబిని! కనులు కాచెన్
    రావయ్యా! నీకని దీ
    పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్ :)


    జిలేబి

    ReplyDelete


  14. ఆ విల విలయేడ్పులు నీ
    మోవివిరుపు పారిజాతములకై ? విడుమా
    రావమ్మ సత్య! సయి దీ
    పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్ :)


    జిలేబి

    ReplyDelete


  15. విలుకాడతడు జిలేబీ
    యలుపెరుగని వీరుడతడు యమగండడహో
    కలకలమనంగ కోలా
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్!

    జిలేబి

    ReplyDelete


  16. एकं सत्

    ఏతావాతా జగతికి
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతు,వా
    ణీ! తల్లులెల్లరు సుమా
    జోతల నొకరే గదా ప్రచోదకుల వలెన్!


    जिलेबी

    ReplyDelete


  17. జోతల నిడవే విరివిగ
    చేతుల మోడ్చి వివిధముగ సేవల తోడన్
    మాతకు మాతకు మాతకు
    మాతలు మువురైన నొక్క మాత గొలుతువా?

    జిలేబి

    ReplyDelete


  18. అరరే! యేసోబు! నిజము
    పరమాత్ముడొకండు చూడ ప్రభువత డేరా
    పరుగిడి రమ్మ శరణనగ
    తిరుమల రాయడు విభుండు దేవుడు "గాడే" :)


    జిలేబి

    ReplyDelete


  19. మాత గలదోయి మమతగ!
    మాతయు గలదుత్తరమ్ము మాయావతిగా!
    మాత గలదోయి సోనియ!
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా?

    జిలేబి

    ReplyDelete


  20. దరసల్ మరమర ఆమా
    ద్మి! రహస్యమిదియె జిలేబి త్రీథౌజండ్ టూ
    హరువులు గలవమ్మ జనులు
    సరసర తప్పించుకొనగ స్వాతంత్ర్యమునన్

    జిలేబి

    ReplyDelete


  21. దీపావళి శుభాకాంక్షలతో



    సత్య భామ తోడు సమితిని కృష్ణుడు
    నరక హంతకుండు, గరళగళుఁడు
    కొండచూలి తోడు గుబ్బలివిలుకాడు
    మదనరిపువు గాదె మదిరనయన!


    జిలేబి

    ReplyDelete


  22. చీరల పంపకమదిగో
    భారీ జవుళీ అమేథి ప్రజలకు భళిరా
    జోరుగ సాగెను రాహుల్
    గారూ కాస్త గమనింప గా మేలు సుమా :)

    జిలేబి

    ReplyDelete


  23. పవనకుమారా ! సరియే
    యవధానము ప్రజ్ఞ యనుట, యనృతము సఖుఁడా,
    కవులకు నేడది మెండుగ
    చవులూరింప గలదనుట చందము గానన్


    జిలేబి

    ReplyDelete


  24. బందా బహదూర్ సింగ్ లా
    యెందరు వీరులు కలరు? మయిని పూసిరిగా
    తొందరగా మేధావులు
    చిందర వందర చరిత్ర చేర్పుల తోడన్

    జిలేబి

    ReplyDelete



  25. కరముల మోడ్చి నమస్సుల
    భరతుఁడు రామున కొసంగెఁ, బాదుక లెలమిన్
    శరణనుచు తలపయినిడుకొ
    ని రాజ్యమును గాచి రాముని పదముల నిడెన్ !


    జిలేబి

    ReplyDelete


  26. అరయన్ గైకొని తా పా
    దరక్షలను నేలెనతడు దయతో రాజ్య
    మ్మరయ, తిరిగిరాగ వెసన్
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్!

    జిలేబి

    ReplyDelete


  27. ఆటవెలదుల సయాటల
    నేటి కతల తేటగీతి నేర్పుల వృత్తా
    ల్ధాటిగ వేసిరి కందపు
    ఝాటీ అయ్యైటి గురువు శాస్త్రీజి ! నమో!

    ***

    జీపీయెస్ మన నేటి గాధల భళా జీరాడు వృత్తంబులో
    చాపాచార్యుని మేటి శైలిని తమాషాచూడ రండీయనన్
    స్థాపించారు! జిలేబులివ్వి! సరదా సాహిత్యమై,వేడిగా
    తాపీగా మన దేశ నేతల సదా తాకెన్ సుతారమ్ముగా!

    ***

    ఆటవిడుపుల, సయాటగ
    నేటి కతల, భరతదేశ నేతల వృత్తా
    ల్ధాటిగ భళీ పసందుగ
    ఝాటీ ఝుళిపించిరి ప్రొఫెసరు శాస్త్రీజీ!


    ***

    ఆటవిడుపుల, సయాటగ
    నేటి కతల, భరతదేశ నేతల వృత్తా
    ల్ధాటిగ భళీ పసందుగ
    ఝాటీ ఝుళిపించిరి ప్రొఫెసరు జీపీయెస్!


    జిలేబి

    ReplyDelete


  28. వాడు సర్కసు లనువేసి పధ్ధతిగను
    చెల్లి కిన్ పెండ్లి చేసెను చేరు వైన
    బావ ధనమోహముగనుచు భార్య తోడు
    చేరి చంపెనతడిని ! కచేరి యయ్యె !
    తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె!

    జిలేబి

    ReplyDelete


  29. సత్వరముగ జనులు సత్యము గాన, జి
    లేబి, మదిని భళి చిలికి పయి గల
    తత్ప రమును గాన, తరముగ నాతని
    లయమె శాంతిఁ గూర్చు నయముగాను!


    జిలేబి

    ReplyDelete


  30. అబ్బు రమగు తావు నాంధ్ర దేశమరయ
    కప్పను గని పాము కలఁతఁ జెందె,
    నిర్భ యమ్ము గాను నివసించె నవి రాజు
    లెల్ల నాదరింప లెస్స గాను

    జిలేబి

    ReplyDelete


  31. రాఘవ లారెన్సట తా
    జాఘని కి సవరము జేర్చి సదనములోనన్
    లాఘవముగ చెప్పెను పో!
    "మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్"!


    జిలేబి

    ReplyDelete


  32. పాలు పోసి పోసి పడతులు పెంచగ
    సోమరి తనమున నుసూరు మనుచు
    పిరికిపంద యయ్యె! బెకబెక కూతల
    కప్పను గని పాము గలత జెందె!

    జిలేబి

    ReplyDelete


  33. కందివర శంకరార్యా!
    సందియ మా లేక ప్రశ్న సంధింపులకో?
    దందడి బీజాక్షరమా
    "పం", దినిఁ, గని, శంకరుండు పార్వతి నెంచెన్!


    * ఆంధ్ర భారతి ఉవాచ -


    పం - విషాలను విరిచే శక్తి కలిగిన, విషాలను హరించ కలిగిన, మంగళకర బీజాక్షరం.


    శుభోదయం
    జిలేబి

    ReplyDelete


  34. శంకరుడు అనే అబ్బాయి పార్వతి అనే అమ్మాయి పెండ్లి చూపుల లో టిఫిను ఊతప్పం తిని :)



    అందాలమ్మణ్ణిని తా
    డెందంబరయంగ చూచి డిగనురుకులతా
    తొందరగా భళి నూత
    ప్పం దినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆ సందర్భంగా ఫలానావాటితోనే ఆతిథ్యం ఇవ్వాలని రూలేమీ లేదనుకోండి. అయినప్పటికీ
      పెళ్క్షిచూపుల్లో ఊతప్పాలూ, దిబ్బరొట్టెలూనా మరీనూ 😩 ?

      Delete

    2. ఊతప్పమును అంత తక్కువగా అంచనా వేయరాదుస్మీ విన్నకోట వారు :)

      అందులో ఊత వుంది ; అప్ప వుంది :) అం వుంది :) రాబోవు కాలమునకు మగడా ఊ , తప్ప ఇంకేమీ మాట్లాడుటకు నీకు హక్కు లేక పోవును అనడానికి నర్మగర్భ సూచన వుంది :)


      ఇట్లాగే అయ్యరు వారికే మేము టోకరా వేసి బుట్టలో పడేసాము ఆ కథా కమామీషు జిలేబి‌ బుట్టోపాఖ్యానములో గలదు :)


      ఇట్లు
      బామ్మ
      జిలేబి

      Delete
    3. ఊతప్పము దినెనా ఆ
      భూతాధిపు , డందు నెయ్యి పోశావా లే
      దా ! తురిమి యల్ల ముల్లియు
      మాతా ! కటు పర్చి మిర్చి మండించావా !

      Delete


    4. ఊతప్పమిదండీ చీ
      సూతప్పము రండి రండి శుభ్రము గా మి
      ర్చీతో వేసినదండీ
      పోతే రా దండి యిదియె పోకడ సుమ్మీ :)


      జిలేబి

      Delete
    5. తప్పము మీరేశారా ?
      తప్ప దనుచు నయ్యరోరు తానేశారా ?
      అప్పా ! ముప్పే మొదవద ?
      నిప్పు నుదుటి జంగమయ్య నివు రొలికేనా ?

      Delete


    6. ఎవరేసిననూ క్రెడిటిక
      జవరాండ్రులకే ను రాజ ! సత్యంబిదియే
      కువకువలాడు జిలేబుల
      నెవరెదిరింపగలరయ్య నెమ్మిని సుమ్మీ :)


      జిలేబి

      கலுவாயி பயணம்
      துகாநா பம்த் ஃபார் சம் டேச் :)

      மீன்டும் சம்திக்கும் வரை பைபை :)


      ஜிலேபி

      Delete


  35. Japan Bechara weds hologram :)


    కొందయటన్! హాలో గ్రా
    మందమటన్! పెండ్లి యాడె మదిలో నెంచెన్
    సుందరి బొమ్మైనను! పా
    పం, దినిఁ, గని, శంకరుండు పార్వతి నెంచెన్


    https://www.ndtv.com/world-news/2d-characters-cant-cheat-age-or-die-japanese-man-marries-a-hologram-of-hatsune-miku-1945838


    జిలేబి

    ReplyDelete
  36. మరే, దానికి తోడు "ఇవన్నీ అమ్మాయే చేసింది, వదిన గారూ" అంటూ ఓ పక్క నుండి అమ్మాయి తల్లి సన్నాయినొక్కులు. బుట్టలో పడేసే కార్యక్రమానికి తన వంతు సహాయం అన్నమాట 😈.

    ReplyDelete
    Replies


    1. కాదా మరి :) ఇంతా అయ్యాక పెండ్లయ్యాక‌ అయ్యరు గారి చేతికి గరిటందింవేసి మనం కందం బందంబని‌ టైం‌పాస్ చేసేసుకోవడమే‌ :)


      జిలేబి

      Delete
    2. మీ కందాబచ్చలి కూర మ్రింగుట కష్టమా
      మీ కందపద్యాలు వినుట మిక్కిలి కష్టమా
      ఏ కష్ట మెటువంటిదొ యెవ్వరి కెఱుక
      లోక మెంత గిలగిలొ మీకే మెఱుక

      Delete


    3. అది మీప్రాబ్లెమయా మా
      సొదల నెవరు చదువమనిరి సొబగుల రాయా
      కదనంబుల కందము మా
      సదనంబున వేసి వేసి చంపెద మయ్యా :)


      జిలేబి

      Delete


  37. కర్కంధువునకు దిగకోయ్!
    మర్కటు డే చొక్కునీరు మత్తున పల్కన్
    తర్కంబదేల నొప్పును
    మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్!

    జిలేబి

    ReplyDelete


  38. ఆర్కాడు నవాబడుగన్,
    బర్కత్ఖాను కథనల్లె పద్ధతి గానన్
    తుర్కీ దేశంబున నా
    మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్!


    జిలేబి

    ReplyDelete


  39. శర్కరన మృకండు బడసె
    మార్కండేయుని కొడుకుగ, మారుతి పుట్టెన్,
    నర్కుని కెడ వేదంబును
    తర్కపు శాస్త్రములనేర్చె తరుణి జిలేబీ :)



    శర్కరన - చక్కెర లాంటి
    శర్కర - చక్కెర :)
    శర్కరి‌‌ - కలము :)
    జిలేబి

    ReplyDelete


  40. చిని చిన్ని కోరికలవే
    ల!నన్నయామాత్యునివలె లక్షణముగ పే
    రును పొందవలెను మరుజ
    న్మని మీరు ప్రభాకర యవనాశ్వ కవీశా :)


    జిలేబి

    ReplyDelete


  41. అరె! చెల్లు బాకి కథలో
    నరరే మరువక జిలేబినట తలచిరిగా
    దె! రమణి తెలుపుము నీవు నె
    నరుల గురువులకు మదిమది ననతేనియలన్

    జిలేబి

    ReplyDelete


  42. లోకము పలురకములు గా
    దే కంజముఖీ జిలేబి దేనికదే సూ
    నీకు తగినట్లది నడువ
    దే! కాస్తైనా విషయము తెలుసుకొన తగున్


    జిలేబి

    ReplyDelete


  43. కలవంటనెల్లెడల ఓ
    జిలేబి సర్వోపగతివి చింకకనుల లే
    మ!లలన! గురువులకు తెలుపు
    సలాము నెనరుల శుభాంగి శర్కరి భామా :)


    జిలేబి

    ReplyDelete


  44. అణుకులు కవీశులనఘా
    చెణుకుల పదముల చమక్కు చేవలతిగ నా
    గణముల ప్రాస యతులతో
    రణములె కద పండితులకు రమ్యక్రీడల్!

    జిలేబి

    ReplyDelete


  45. ఓ రామచంద్ర ! రారా!
    యేరాలమ్ముగ జిలేబులే వేసిరయా
    సారంబొప్పారుచు సీ
    తారామా లక్ష్మణ సహితమ్ముగ రారా !


    జిలేబి

    ReplyDelete


  46. వచ్చె నీశునాన పక్కన చచ్చెను
    కబళ మునట సన్నికర్షణమున
    గాన గా జిలేబి, గట్టిగ నాయలిం
    బకమునుఁ గబళించు బల్లిఁ గనుము!


    జిలేబి

    ReplyDelete


  47. తహతహ లాడుచు నెల్లరి
    ని హటాత్తుగ తాకుచుండు నేర్పులు తోడై
    యహముల్ జిలేబి మదిని న
    సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్!


    జిలేబి

    ReplyDelete


  48. అమ్మా ! నీహారిక! రా
    రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్,
    చెమ్మగిలిన కన్నుల, పతి
    తిమ్మని కి శుభాంగి కమ్మతెమ్మర గానన్!


    బస్తీ మే సవాల్
    జిలేబి పరార్


    జిలేబి

    ReplyDelete


  49. కూతు- వీధి భాగవతము :)

    కూతు లో అప్పుడప్పుడు డోల్బీ ఎఫెక్ట్ కోసం శాకినీ‌ డా కి నీ లను పిలిచే తండ్రి :)


    అమ్మా కర్ణపిశాచీ
    రమ్మా యని పిలిచెను నిశి రాత్రిని రాలే
    దమ్మ! వటయక్షిణీ రా
    రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ 'గూఁతున్'

    ఈపేర్లెక్కడివంటే నాకు తెలియవు :)


    జిలేబి

    ReplyDelete


  50. నిన్నటి కందం :)



    అమ్మడి మగడా రారా
    రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్
    చెమ్మగిలినకన్నులతో
    తిమ్మా రావు సరసన్ సతిగ నిలుపనటన్


    జిలేబి

    ReplyDelete


  51. లాహిరి లాహిరి లాహిరి లో ...

    రసపట్డున భగ్నము కూడదు :)


    ఆ రుచి తెలియని వారెవ
    రో? రస పట్టున పదిలుడు రుంకము గనడ
    మ్మా! రతగురువయ్యేడు క
    దా! రుక్మిణి! ఆరుమూడు తప్పు! పదపదా!


    జిలేబి

    ReplyDelete


  52. అహనా పెళ్ళియట! పదిగు
    డహహో లక్ష్మణకుమారుడట!మూడును పో
    తహతహ, నేడుగడయు వెలు
    గు, హడల గా నారుమూడగును పెండ్లియు పో!


    జిలేబి

    ReplyDelete


  53. ఆ పని చేయడ మిష్టము
    లే!పద! పదవే జిలేబి లేమా పదవే
    మా పలుకుల వినరెందుక
    నో పండితులకటకట! వినోదయ చిత్తమ్ :)


    జిలేబి

    ReplyDelete


  54. చెప్పారు కాదు ! లింక్ ప్లీజ్!
    చప్పున తెలుపండి మాకు చాంద్నీ బ్లాగున్
    టప్పున వేసెద మయ్యా
    తప్పని సరిగా కమింట్ల తాకుచు నిపుడే !


    జిలేబి

    ReplyDelete


  55. శ్యామా చూడండయ్యా
    శ్రీ మాచనవరు సమస్య శీఘ్రము గానన్
    యేమార్చుచుండెను జిలే
    బీ మామియు జెర్రి వెర్రి విపరీతముగన్


    జిలేబి

    ReplyDelete

  56. యా అల్లా!


    అల్లా! యేమందునయా
    సల్లాపముల నిను మరచి సాగించితినే
    నుల్లాసముగా బతుకును
    చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్!


    జిలేబి

    ReplyDelete


  57. సత్యము పలుక వలె నమ్మ సరసి, కాని
    సత్య మైన నప్రియమును సాటి వారి
    మేలు కొరకు తెలుపక జమిడిగ నైన
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును!


    జిలేబి

    ReplyDelete


  58. జగదాంబయ? జడదారియ?
    జగత్కిలాడియకొ? రమణి సరస రమణుడో?
    మగరాయుడకొ మగువయకొ?
    భగినియ? భ్రాతయ? జిలేబి వాస్తవ మేదో ?

    జిలేబి

    ReplyDelete


  59. కనబడదసలే ! వుందో
    మన కసలే తెలియదయ్య మహిని జిలేబీ !
    తను తిరుగుచుండు గిరగిర
    మనమున్ భళి తిరుగుచుంటి మయ్య గిరగరన్ :)


    జిలేబి

    ReplyDelete


  60. కుక్కకు దొరుకగ ముక్కయు
    టక్కున వంతెను పయి చని ఠారెత్తెను తా
    నక్కడ నీటిని కుక్కను
    ముక్కనుగని మొరుగ నోటి ముక్కయు పాయెన్‌ :)

    జిలేబి

    ReplyDelete


  61. చోద్యము కాదె కవివరా!
    విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్?
    పద్యపు పూరణ కై తగు
    నద్యత్వపుకాలమునకు నప్పదు సుమ్మీ !


    జిలేబి

    ReplyDelete


  62. మెల్లగ మార్ద్వీకమ్మను
    కల్లున, ప్రియమగు సురభిని కల్యపు మధువై
    సల్లాపముల కుకభమను
    చల్లని నీరమున నొడలు సర్వముగాలెన్ :)


    నారదా!
    జిలేబి

    ReplyDelete


  63. విద్యలవేల మనకనకు !
    విద్యను నేర్వని మనుజులు వింతపశువులౌ!
    మద్యము గైకొని యంటివొ
    విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్?

    జిలేబి

    ReplyDelete


  64. కందమునకు నీవే యర
    విందా! పర్యాయపదము, వెణద జిలేబీ!
    బిందాసుగనల్లుము మా
    కందమ్ముల నను దినమ్ము కలశస్తనియా!

    జిలేబి

    ReplyDelete


  65. అనిరే బ్లాగ్లోకమ్మున
    జనాళి మాకందములవి చవులూరగతా
    మనిరే చూడగ విరివిగ
    కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్!


    :)

    జిలేబి

    ReplyDelete


  66. చైనా సామెత యేనం
    డీ నరులకు నేర్పదగు వడిగ పట్టుట నె
    ట్లోన, నెటులన నరసరా
    యా! నేడు వలయును సూవె యందరు నేర్వన్


    జిలేబి

    ReplyDelete


  67. పిల్లియన బిడాలమనెడు
    లొల్లి వలెకలదు జిలేబి లుకలుక పద్యం
    బల్లిన విధము సుమా! కవు
    లెల్లరె లాతాళిరో బలియగుచు నరరే !

    జిలేబి

    ReplyDelete


  68. కల్పవృక్షము రామాయణము


    మునిగిరి రాముని నామ
    మ్మున తనరుచు కల్పవృక్షమున నా సీత
    మ్మను మదిని గొలుచుచు భళా
    కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్!


    జిలేబి

    ReplyDelete


  69. పజ్జాల కర్థము తెలియక బిక్కమొగాలతో జన సందోహమ్ము :)


    అనఘా! జనాళి సభలో
    కనిపించిరి కోఁతుల వలెఁ, గవివరు లెల్లన్,
    ధనధనమని పద్యమ్ముల
    తనరుచు పాడగ, తెలియక తాత్పర్యములన్!


    జిలేబి

    ReplyDelete


  70. చంద్రశేఖరుడు గురువులకు వందనము చేసినప్పుడు తెలుగు మహాసభలలో


    అణకువగ చంద్రశేఖరు,
    తన గురువుకు వందనమిడ, తాదాత్మ్యతతో
    గణగణమని పొగుడుచు భళి
    కనిపించిరి కో!, తుల వలెఁ, గవివరు లెల్లన్!

    కో!- హుర్రే

    తుల వలె- తులారాశివలె


    ముఖ్యగమనిక-
    ఈ విరుపు లేకుండా మీరు చదివి వేరే లా అర్థం చేసుకుంటే జిలేబి పూచీలేదు

    అరసున్న హుష్ కాకి :)

    జిలేబి

    ReplyDelete


  71. అల సైరంధ్రి నెవరినయ
    పిలిచె? వలచితినని నెవడు భీతిని గొల్పెన్ ?
    అలవోకగ భీముడతని?
    వలలునిఁ; గీచకుఁడు; సంపెఁ బటు విక్రమునన్!


    జిలేబి

    ReplyDelete


  72. రాయల వారి పదమ్ముల
    పాయలు పాయలుగ పాంగ్సువా తీరమునన్
    ఛాయాచిత్రంబుగ వై
    వీయారుని లకుముకులవి వీక్షింపుడయా :)


    జిలేబి

    ReplyDelete


  73. రాయల వారి పదమ్ముల
    పాయలు పాయలుగ పాంగ్సువా తీరమునన్
    ఛాయాచిత్రంబుగ వై
    వీయారు లకిమికరంపు పిట్టలివి సుమా!

    జిలేబి

    ReplyDelete


  74. కల్ల బొల్లి మాటలనెడు కలువకంటి
    తేటగీతిలో పదముల తెక్కరముగ
    చేర్చి పద్దియ మల్లెను, చేవలేని
    నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె!


    జిలేబి పద్దియము :)


    జిలేబి

    ReplyDelete


  75. అరరె! వేదముల దునిమి యరరె యర్థ
    ములను లాగుచుండిరచట మూల మేమి
    టన్నది తెలియక యరరె టంకుతనపు
    చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె!


    జిలేబి

    ReplyDelete


  76. నేటి కత - కన్యాశుల్కము :)


    అన్యాపదేశముగ నా
    కన్యాశుల్కమని చెప్ప గా నొప్పుకొనన్
    పన్యారమువలె మొత్తము
    విన్యాసముగ తెలిసిన వివేకిని బాబూ :)


    జిలేబి

    ReplyDelete

  77. అన్యాపదేశముగ నా
    కన్యాశుల్కమని చెప్ప గా నొప్పుకొనన్
    పన్యారమువలె మొత్తము
    విన్యాసముగా తెలిసిన "వినరా" ని సుమా :)


    జిలేబి

    ReplyDelete


  78. ఆహా!పల్లె ప్రపంచము
    లో హాహాకారముమొదలు ! భళిభళి భళీ
    బాహులమున కాజ్యముతో
    స్వాహా మంత్రము జపింప సఖుడా రావోయ్ :)


    జిలేబి

    ReplyDelete

  79. ఆడుకొనిరమ్మ పద్మా
    యాడుకొనిరె పదములకు సయాటలు తోడై
    వేడిని కల్గించె సుమా
    పోడిమి యున్న రమణీయపు సరసి వీవే :)


    జిలేబి

    ReplyDelete


  80. చదువంగ రాదు వేదము
    చదువంగను రాదకో విచారము లన్ చే
    యదగని వారమకో మే
    ము?దుంప తెగుర హరిబాబు ముందర చెప్మా :)


    జిలేబి

    ReplyDelete


  81. వెతికితి పేజీ పేజీ
    ల తిప్పుచు కనబడలే కొలవెరి పదముల
    య్య తరచి తరచియు జూడ ఫ
    లితమ్ము కనరాదు సూవె లింకూ నో యూజ్ :)


    జిలేబి

    ReplyDelete


  82. పతి! పతి! పాతి! పతి! జిలే
    బి తిరగలిని తిప్పి మగడు భీతిగొనెడు రీ
    తి తరుణి గొల్వగ నీ యా
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్:)


    జిలేబి

    ReplyDelete


  83. కాశ్మీరంబు మనకు మఖ
    వాశ్మము మన కుఱగలిని నుపశమిల్లక తా
    నాశ్మంతంబాయెనయా
    కాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్?

    జిలేబి

    ReplyDelete


  84. పతి మూలాధారమున ! సు
    మతి, స్వాధిష్టానపు పతి, మణిపూరకమం
    దతడె యనాహతమున ! నా
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!

    ***

    పతియతడె విశుద్ధిని ప
    ద్ధతిగా భృకుటిని సహస్ర దళ కమలములో
    సతి శక్తి గా పతి శివుడు!
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!

    ***

    సతి బ్రహ్మరంధ్రమును దా
    టి త్రికూటమ్ములను దాటి టిక్కిని దాటన్
    పతి పెంజీకటి కావల!
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!


    జిలేబి

    ReplyDelete


  85. పతి గణపతి! పతి బ్రహ్మయు
    పతి విష్ణువు! పతి శివుండు! పతిజీవాత్మన్
    పతి పరమాత్మ! జిలేబీ!
    పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!

    ***

    సతి శాకిని!సతి కాకిని
    సతి లాకిని! రాకిని సతి! సతి ఢాకిని మేల్
    సతి హాకిని! మూలంబగు
    పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!

    ***

    సతి రక్తము! పతి పీతము
    సతి నీలము! పతి యరుణము సతి ధూమ్రమగున్
    పతి విద్యుత్కర్పూరము!
    పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!

    జిలేబి

    ReplyDelete


  86. నాది శ్రుత పాండితి సుమా
    యేదో బావుందని కథ యింకొంచెము రా
    జా దన్నుగ నే లాగితి;
    సాదరముగ వందనమయ సరదిద్దిరిగా :)


    జిలేబి

    ReplyDelete


  87. హరి బాబూ! సందేహము
    ను రయము గా దీర్చ రమ్మ నొక్కింతైనన్
    నరసింహారావుల్ వే
    చిరయ్య నాత్రుతన స్వామి చింతావృతుడై !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బహుశః హరిబాబు గారు ఇతరత్రా బిజీగా ఉండుంటారు “జిలేబి” గారూ.

      ఏమైనప్పటికీ, వారు చెప్పిన దానికి సోర్స్ రిఫరెన్స్ ఇచ్చిన తరువాతనే వారి స్టేట్మెంటును పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది ... నా మటుకు.

      Delete


  88. బంగ్లా వాడా టాగూ
    రాంగ్లంబున వ్రాసెఁ, బోతనార్యుండు కృతిన్
    జంగ్లి తెలుగున; విరివిగా
    చాంగ్లా గీతాంజలియె ప్రచారంబాయెన్ !


    జిలేబి

    ReplyDelete


  89. పొరపాటును మా దృష్టికి
    సరియై నసమయములోన చక్కగ తెల్పన్
    సరిచేసెదమయ సవరణ
    గ రయమున నిపుడె నెనరులు కామింటునకున్!


    జిలేబి

    ReplyDelete


  90. ఏతా వాతా తల్లికి
    తా తమ్ముడయే! తనకు రతగురువు! ధవుడా !
    మాతా మహుని యనుంగగు
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్!



    జిలేబి

    సంయుతాసంయుత ప్రాస :)

    ReplyDelete


  91. క్షత్రియుడా! శ్రీ దశరథ
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె, మగనిన్
    చిత్రము గా ముదముగ వై
    చిత్రిగ సంచలనమైన చిత్రము లోనన్ !


    జిలేబి

    ReplyDelete


  92. ఒక సందేహంబయ! స
    న్ని కల్లుని శివునిగ కొల్చు నీమము గలదే
    యిక దానిని తొక్కుటదే
    ల? కాస్త వివరము తెలుపుడి లబ్జుగ నరయన్!

    జిలేబి

    ReplyDelete


  93. అరె! సన్నికల్లు పార్వతి
    కరె, పొత్రంబగు ప్రతీకగ శివుని కయ్యా
    యిరువురు నొకరికి యొకరగు
    దురయా జీవితములో కుదురుగన్ వైవీ :)


    జిలేబి

    ReplyDelete


  94. నరసన్నా మాగోజీ
    పురోహితుల బ్రహ్మయని యెపుడు పిలిచెద మా
    దరముగ! జిలేబులగుచున్
    పురోగతికి వారె గాద భూరిగ కోపౌ :)


    జిలేబి

    ReplyDelete


  95. హృదయపు రాగమ్ముల కౌ
    ముది పిండిగచేయు నమ్మ ముద్దుల గుమ్మా
    ముదనష్టపు జలపాతం
    బది పద్మార్పిత ! జిలేబి పలుకుల కొమ్మా :)


    జిలేబి

    ReplyDelete
  96. నేనూ చాలాకాలం తూగోజీలో నివసించినవాడినే, ప్రజలతో అనుబంధం ఉన్నవాడినే "జిలేబి" గారూ. ఆ సాంప్రదాయం గురించి నాకేమీ సందేహం లేదు కావున "నరసన్నా" అనుకుంటూ దాన్ని గురించి నాకు చెప్పకండి.

    ReplyDelete
    Replies

    1. అబ్బే ఆ మాటలు నావికావండి
      కొట్టుకొచ్చినవంతేను :(



      జిలేబి

      Delete