Saturday, October 27, 2018

ఆకాశవాణి - సమస్యా పూరణ - కార్యక్రమం - 27th Oct 2018 - నిర్వహణ - శ్రీ కంది శంకరయ్యజిలేబి పద్యము - కంది వారి గళము - ఆకాశవాణి సౌజన్యము :)
 
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 27th Oct 2018
 
నిర్వహణ - శ్రీ కంది శంకరయ్య గారు
 
 
సౌజన్యం - ఆకాశ వాణి  హైదరాబాదు
 
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !
 
 
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్
 
 
 
అరయన్ పార్వతి, దుర్గ, శారదయు, మా యార్యాణి శర్వాణి యా
సురసన్ కర్వరి కొండచూలి గిరిజన్ శోభిల్లు మా శైలజన్,
వరమాలన్ మనువాడినట్టి శివుడా భద్రేశుడౌ చంద్ర‌శే
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్!


శుభాకాంక్షలతో
 
జిలేబి

39 comments:

 1. వహ్వా!

  ఇది జిలేబీయం కానే కాదు...అమ్మగారి కత్తికి ఆరు వేపులా పదునే!

  ReplyDelete
 2. గురువు గారికి నమస్కారములు శుభాకాంక్షలు

  ReplyDelete
 3. గురువు గారికి నమస్కారములు శుభాకాంక్షలు

  ReplyDelete
 4. కేవలమామెగూల్చునని కృష్ణుడు సత్యకుజెప్పడయ్యె దే
  వీ! వరమెట్టు లీ నరకువీరుని గాచుట మర్చితీవొ దీ
  పావళి పండుగన్ జరుపనౌగద;పున్నమి నాటి రాతిరిన్
  కావరమణ్చె నాత్రిపురకాపుల శంభుడు కార్తికమ్మునన్

  ReplyDelete
 5. దీపావళి పండుగను లోకకంటకుడైన భూమాత కొడుకును తన తల్లే(సత్యభామ భూదేవి అవతారం)చంపితే తప్ప చావడన్న వరగర్వంతో &త్రిపురాసురలు తమ మూడు పురములు ఒకేచోటికి చేర్చికూల్చితేతప్ప చావొద్దన్న గర్వంతో త్రిపురపూర్ణమి/కార్తీకపున్నమి నాడు శివునిచే చంపబడుటచే దీపావళి&పున్నమి పండుగలు జరుపబడుతాయనీ పురాణం లో చెప్పబడింది

  ReplyDelete
  Replies

  1. ఏ పురాణము లోనండి ?

   జిలేబి

   Delete

  2. ఏ భాగవతంలో ఎన్నో స్కంధములో వివరములు తెలుపగలరు

   Delete
 6. 'నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !'

  శ్రీకరము గౌరవ మిది , జిలేబి రూప
  పండిత కవుల , కిదియు నేపాటి ? యింత
  కన్న ఘనత లెన్నేనియున్ గాంచ గలము ,
  బుధ సుమాలలో దారంబు బొసగు నటుల .


  ReplyDelete


 7. లక్కాకుల కవిరాయా
  చక్కగ నుత్సాహములను సదనంబున మీ
  రిక్కడ చేర్చగ నవియే
  మిక్కుటముగ నిచ్చె నూత మీకు నతులయా !


  జిలేబి

  ReplyDelete


 8. చందురురుడు తెలగాణని
  చందురుడాంధ్రమ్ములోన జగనుడ, కలరోయ్
  యెందెందువెతికినను నీ
  కందరొకనిలోన నొక్కడందరిలోనన్

  జిలేబి

  ReplyDelete


 9. నడిరేయిన్ గాంచెను రవి
  వడినేదేదో తెలియదు ప్రస్తుత మీ యం
  శుడు గాంచి నవ్వె భళివి
  చ్చెడునుత్పలముల జిలేబి జేజే యనవే :)

  జిలేబి

  ReplyDelete
 10. kavanasarma.wordpress.com
  బ్లాగర్ డాక్టర్ ప్రొఫెసర్ శ్రీ కవన శర్మ గారు (కందుల వరాహ నరసింహ శర్మ గారు) గతనెల 25 న స్వర్గస్ధులయ్యారని ఆన్లైన్లో వార్త చదివాను 👇. చాలా విచారకరం.

  కవన శర్మ గారి మృతి

  ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5.30కు హైదరాబాద్ దోమలగూడలో హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో శ్రీ కవన శర్మ గారి స్మారకసభ అని పుస్తకం డాట్ నెట్ లో వార్త :- 👇

  కవన శర్మ గారి స్మారకసభ

  బెంగళూరులోని Indian Institute of Science లో Professor గా పని చేసి రిటైర్ అయ్యారు. చక్కటి హాస్యకథల రచయిత. 1970లలోనో / 1980లలోనో ఒక వార్తాపత్రికలో సీరియల్ గా వచ్చిన … బ్రెయిన్ డ్రెయిన్ అను అమెరికా మజిలీ కథలు … చాలా సరదాగా వ్రాశారు, చాలా ప్రాచుర్యం పొందాయి.

  వారి కుటుంబానికి నా సంతాపం తెలియజేసుకుంటున్నాను 🙏.

  ReplyDelete


 11. బంగారు రోజులను న
  చ్చంగ కనులముందరన్ సజావుగ నిల్పెన్
  రంగుల కలలన్ తేల్చుచు
  చెంగలువ కథల సయిన్సు చేర్చె కవనుడై!


  With Deep condolences
  To
  Kavana Sarma Hi

  జిలేబి

  ReplyDelete
  Replies

  1. // "..... ఒక వార్తాపత్రికలో సీరియల్ గా వచ్చిన ... " //

   సవరణ:-
   .... ఒక వారపత్రికలో ....

   Sorry.

   Delete
 12. Jilebi jee:

  Before I forget...

  I am stunned by the depth and breadth of your knowledge and tolerance.

  You are a GENIUS!

  ReplyDelete
  Replies
  1. నిస్సందేహంగా ప్రొఫెసర్ గారూ 👌.
   Take a bow "జిలేబి" గారూ 👏.

   Delete

  2. ఇద్దరు "ప్రొఫె" సర్ లకు

   నమో నమః


   జిలేబి

   Delete


 13. పండుగరోజుకైన చేరుతామని ఫ్లైటెక్కి డిలే యై వచ్చిన పెనిమిటితో :)  మావా! ఫ్లైటు డిలేతో
  నీవొచ్చితివయ! జిలేబిని! కనులు కాచెన్
  రావయ్యా! నీకని దీ
  పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్ :)


  జిలేబి

  ReplyDelete


 14. ఆ విల విలయేడ్పులు నీ
  మోవివిరుపు పారిజాతములకై ? విడుమా
  రావమ్మ సత్య! సయి దీ
  పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్ :)


  జిలేబి

  ReplyDelete


 15. విలుకాడతడు జిలేబీ
  యలుపెరుగని వీరుడతడు యమగండడహో
  కలకలమనంగ కోలా
  హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్!

  జిలేబి

  ReplyDelete


 16. एकं सत्

  ఏతావాతా జగతికి
  మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతు,వా
  ణీ! తల్లులెల్లరు సుమా
  జోతల నొకరే గదా ప్రచోదకుల వలెన్!


  जिलेबी

  ReplyDelete


 17. జోతల నిడవే విరివిగ
  చేతుల మోడ్చి వివిధముగ సేవల తోడన్
  మాతకు మాతకు మాతకు
  మాతలు మువురైన నొక్క మాత గొలుతువా?

  జిలేబి

  ReplyDelete


 18. అరరే! యేసోబు! నిజము
  పరమాత్ముడొకండు చూడ ప్రభువత డేరా
  పరుగిడి రమ్మ శరణనగ
  తిరుమల రాయడు విభుండు దేవుడు "గాడే" :)


  జిలేబి

  ReplyDelete


 19. మాత గలదోయి మమతగ!
  మాతయు గలదుత్తరమ్ము మాయావతిగా!
  మాత గలదోయి సోనియ!
  మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా?

  జిలేబి

  ReplyDelete


 20. దరసల్ మరమర ఆమా
  ద్మి! రహస్యమిదియె జిలేబి త్రీథౌజండ్ టూ
  హరువులు గలవమ్మ జనులు
  సరసర తప్పించుకొనగ స్వాతంత్ర్యమునన్

  జిలేబి

  ReplyDelete


 21. దీపావళి శుభాకాంక్షలతో  సత్య భామ తోడు సమితిని కృష్ణుడు
  నరక హంతకుండు, గరళగళుఁడు
  కొండచూలి తోడు గుబ్బలివిలుకాడు
  మదనరిపువు గాదె మదిరనయన!


  జిలేబి

  ReplyDelete


 22. చీరల పంపకమదిగో
  భారీ జవుళీ అమేథి ప్రజలకు భళిరా
  జోరుగ సాగెను రాహుల్
  గారూ కాస్త గమనింప గా మేలు సుమా :)

  జిలేబి

  ReplyDelete


 23. పవనకుమారా ! సరియే
  యవధానము ప్రజ్ఞ యనుట, యనృతము సఖుఁడా,
  కవులకు నేడది మెండుగ
  చవులూరింప గలదనుట చందము గానన్


  జిలేబి

  ReplyDelete


 24. బందా బహదూర్ సింగ్ లా
  యెందరు వీరులు కలరు? మయిని పూసిరిగా
  తొందరగా మేధావులు
  చిందర వందర చరిత్ర చేర్పుల తోడన్

  జిలేబి

  ReplyDelete 25. కరముల మోడ్చి నమస్సుల
  భరతుఁడు రామున కొసంగెఁ, బాదుక లెలమిన్
  శరణనుచు తలపయినిడుకొ
  ని రాజ్యమును గాచి రాముని పదముల నిడెన్ !


  జిలేబి

  ReplyDelete


 26. అరయన్ గైకొని తా పా
  దరక్షలను నేలెనతడు దయతో రాజ్య
  మ్మరయ, తిరిగిరాగ వెసన్
  భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్!

  జిలేబి

  ReplyDelete


 27. ఆటవెలదుల సయాటల
  నేటి కతల తేటగీతి నేర్పుల వృత్తా
  ల్ధాటిగ వేసిరి కందపు
  ఝాటీ అయ్యైటి గురువు శాస్త్రీజి ! నమో!

  ***

  జీపీయెస్ మన నేటి గాధల భళా జీరాడు వృత్తంబులో
  చాపాచార్యుని మేటి శైలిని తమాషాచూడ రండీయనన్
  స్థాపించారు! జిలేబులివ్వి! సరదా సాహిత్యమై,వేడిగా
  తాపీగా మన దేశ నేతల సదా తాకెన్ సుతారమ్ముగా!

  ***

  ఆటవిడుపుల, సయాటగ
  నేటి కతల, భరతదేశ నేతల వృత్తా
  ల్ధాటిగ భళీ పసందుగ
  ఝాటీ ఝుళిపించిరి ప్రొఫెసరు శాస్త్రీజీ!


  ***

  ఆటవిడుపుల, సయాటగ
  నేటి కతల, భరతదేశ నేతల వృత్తా
  ల్ధాటిగ భళీ పసందుగ
  ఝాటీ ఝుళిపించిరి ప్రొఫెసరు జీపీయెస్!


  జిలేబి

  ReplyDelete


 28. వాడు సర్కసు లనువేసి పధ్ధతిగను
  చెల్లి కిన్ పెండ్లి చేసెను చేరు వైన
  బావ ధనమోహముగనుచు భార్య తోడు
  చేరి చంపెనతడిని ! కచేరి యయ్యె !
  తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె!

  జిలేబి

  ReplyDelete


 29. సత్వరముగ జనులు సత్యము గాన, జి
  లేబి, మదిని భళి చిలికి పయి గల
  తత్ప రమును గాన, తరముగ నాతని
  లయమె శాంతిఁ గూర్చు నయముగాను!


  జిలేబి

  ReplyDelete


 30. అబ్బు రమగు తావు నాంధ్ర దేశమరయ
  కప్పను గని పాము కలఁతఁ జెందె,
  నిర్భ యమ్ము గాను నివసించె నవి రాజు
  లెల్ల నాదరింప లెస్స గాను

  జిలేబి

  ReplyDelete


 31. రాఘవ లారెన్సట తా
  జాఘని కి సవరము జేర్చి సదనములోనన్
  లాఘవముగ చెప్పెను పో!
  "మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్"!


  జిలేబి

  ReplyDelete


 32. పాలు పోసి పోసి పడతులు పెంచగ
  సోమరి తనమున నుసూరు మనుచు
  పిరికిపంద యయ్యె! బెకబెక కూతల
  కప్పను గని పాము గలత జెందె!

  జిలేబి

  ReplyDelete