Wednesday, January 23, 2019

కొండలు గాలి తాకిడికి కొట్టుకు పోయె :)



కంది వారి సభలో "కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!" సమస్యా పాదాన్ని ఇస్తే,
అబ్బే ఇదేదో తెలిసిన పాదం లా వుందే అనుకుని చట్టని కొట్టు కొచ్చి ఇలా పూరించా :)

భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తి ....

అబ్బ! ఇక్కడి దాకా బాగుంది :) ఇంక ఎట్లా ఫిట్టింగు పెట్టడటం సమస్యా పాదానికి అనుకుని ఆలోచిస్తా వుంటే ,  తాళ్ళ పాకవారి పద్య పాదం  (అని అనుకున్నా కాని క్షేత్రయ్య అని ఆంధ్ర భారతి ఉవాచ ) "సఖియ నీ చన్గవలు సంగటి కొండలందురుగాని కొండలైతే-కోట తలుపులేవే" అన్నది గుర్తు కొచ్చి ఆహా ఇదేదో ఫిట్టించేస్తే బాగుంటుందనుకుని, ఆ పై అసలే పండిత సభ కాబట్టి కొంత బెరుకు పుట్టుకుని మార్చేసు కుని రాసి వేసేసా :)


ఘటుండు రాము డా
మండప మందు విల్లు తునుమాడగ నాదము పిక్కటిల్లగా
కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!

పూర్తి గా :)

భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తిఘటుండు రాము డా
మండప మందు విల్లు తునుమాడగ నాదము పిక్కటిల్లగా
కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!

కొట్టు కొచ్చినవి రెండు పాదాలు (దాశరధీ కరుణా పయోనిధీ :) సమస్యా పాదం ఒకటి, మన కిట్టింపు పాదం ఒకటి వెరసి వాహ్ క్యా బాత్ హై వృత్తం తయార్ జిలేబి తయార్ అనుకున్నా :)

దీని పై కంది శంకరుల వారు :-

జిలేబి గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ఇది మీరు వ్రాసిందేనా? సందేహమే! అంటూ ఒక స్మైలీ పెట్టేరు :)

సరే అందుకని మరో ఉత్పలము రుబ్బి నాము :)

ముట్టగ కైపదంబొకటి ముంగట శంకరుకొల్వులోనటన్,
కొట్టున కొట్టుకొచ్చె తను కొంచెమకో? భళి రెండు పాదముల్!
కట్టె జిలేబి పాదము ను గట్టిగ నొక్కటి యుత్పలంబవన్
చట్టని వేసె కొల్వున సజావుగ నాల్గన వృత్తపాదముల్!
అని - మొదటి ఉద్దేశం గురించి ఇలా అన్నా :)

కంది వారు,

మండప మందు విల్లు తునుమాడగ జానకి చన్నుగుబ్బలా కొండలు... అని రాస్తా మనుకున్నా ! అసలే పండితుల సభ యేమంటారో అని భయపడి కొంత నాదపు పిక్కటిల్లుతో సర్దేసా! ( తాళ్ళపాక వారి చన్గవలా సంగటి కొండలు పాదము గుర్తు కొచ్చి)

****

దీనికి పోచిరాజు వారు వచ్చి -

జిలేబి గారు కుచ సౌందర్య వర్ణన లేని కావ్యము సంస్కృ తాంధ్ర వాఙ్మయ ప్రపంచములోనే లేదు. అతిమాత్రము వర్జనీయము.  మీ రొక తమిళ పద్యమును తెనుఁగు లిపిలో వ్రాసి తదనువాద పద్యము ప్రకటించిన చూడాలని యుందండి.

తస్సదియ్య సవాలే విసిరేరు గా అనుకుని కన్డే న్ సీతయై అన్న కంబ రామాయణ పద్యాన్ని అరవంలో చదివి మన కిష్ట మైన కందం లో కిట్టించి వేయడం జరిగినది ఆ పై పోచిరాజు వారికి 'హమారీ ఫర్మాయిష్ ' తెలిపి నాము :)

పోచిరాజు వారికి నమో నమః


పూర్తిగా సరిగ్గా అని చెప్పలేను గాని కొంతవరకు నావల్లయినంత వరకు :) ( కందంలో నాకు వీలైనంత ఫిట్టు చేయగలిగినంత వరకు :))



కనుగొంటిని సచ్ఛీలపు
మణి సీతను లంకని!తడుమనయున్ దుఃఖం
బును విడుమయ్యా! రామా
హనుమంతుడ డింగరుడ సహాయకుడనయా!

కంబరామాయణము-

கண்டனென், கற்பினுக்கு அணியை, கண்களால்,

தெண் திரை அலைகடல் இலங்கைத் தென் நகர்;

அண்டர் நாயக !இனி, துறத்தி, ஐயமும்

பண்டு உள துயரும்’என்று, அனுமன் பன்னுவான்;

**

కణ్డేన్ కర్పిణిక్కు అణియై కణ్ణాల్
తెన్ తిరై అలై కడల్ ఇలంగై తెన్ నగర్

అణ్డర నాయగ ఇని తురత్తి, యైయముమ్

పన్డు ఉళ్ తుయరుమ్, యెన్డ్రు అనుమన్ పణ్ణువాన్ !



ఫర్మాయిష్ అబ్ ఆప్ సే యహ్ హై కి ఊపర్ పద్య కీ‌ అంగ్రేజీ తర్జుమా (see below) సే ఆప్ కీ టెల్గు పద్య ఇదర్ దేఖ్నే కా‌ :)

ధన్యబాద్ !


I saw ,

the jewel of chastity,

with my own eyes

in the southern city

of Lanka

on the clear twirling wavy ocean,

lord of gods

from now on

relinquish doubts and

all your sufferings.’

said Hanuman

and continued with his details.


Awaiting your marvellous vrutta sir

పై దానికి పోచిరాజు వారి (అద్భుతః ) శైలి లో ఉత్పల మాల : -

జిలేబి గారు ధన్యవాదములు. నా ప్రయత్నమును జూచి కంబ రామాయణ పద్య భావము స్ఫురించినదో లేదో చూడండి.

చూచితి స్వీయ నేత్రముల శుద్ధ చరిత్ర వసుంధరా సుతన్
వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
ద్రోచన తీర లంక నిఁకఁ దూర్ణము వీడుమ శంక నిర్జరుల్
కాచ సమర్థులం చనియుఁ గాదిలి హన్మయె పల్కెఁ గ్రమ్మఱన్

అద్భుత మైన అనువాదం - "వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
ద్రోచన తీర లంక " -  తెన్ తిరై అలై కడల్ ఇలంగై తెన్ నగర్ - in the southern city of Lanka on the clear twirling wavy ocean !

( తెలుగు అనువాదం - పూతల పట్టు శ్రీ రాములు రెడ్డి గారు -
వారి అనువాదం - ఇలా వుంది (క్రింది లింకులో రెండవ భాగం లో సుందర కాండ లో ) మత్త కోకిల

కాంచినాడ సతీత్వ భూషను గణ్యవర్తన జానకిన్
గాంచినాడ మదీయ దైవము గన్నులారగ లంకలో
గాంచినాడను శంక వీడుము కాంచుమా మది నెమ్మదిన్
గాంచితిన్ మరి మాటలాడితి గ్రమ్మరిల్లితి రాఘవా !

పూతల పట్ట్టు శ్రీరాములు రెడ్డి గారి - కంబ రామాయణం తెలుగు అనువాదం లింకులు :

భాగము - 1

https://archive.org/details/in.ernet.dli.2015.385206

భాగము - 2

https://archive.org/details/in.ernet.dli.2015.385207


కొండలు గాలి తాకిడికి కొట్టుకు పోయె ! మొత్తము మీద ఇప్పటికి ఇక్కడ ఆగింది :) ఇంక చూద్దాం ఏమేమి వస్తాయో అని !


చీర్స్
జిలేబి

205 comments:

  1. Scholarly! కంబ రామాయణంలో వర్ణన మనోహరంగా వుంటుందని ఎవరో చెప్పగా విని తమిళ్ నేర్చుకుని ఎప్పటికైనా చదవాలని బోల్డంత ఆశ పడ్డాను, కానీ అదెప్పటికి వీలవుతుందో, అసలు కుదురుతుందో లేదో కూడా నాకు నమ్మకం లేదు. ఇవాళ మీ బ్లాగ్‌లో రాసిన ఒక్క శ్లోకం అన్నా చదవగలిగిందుకు చాలా సంతోషంగా వుంది.

    ReplyDelete
  2. "ఎక్కడ దొరుకుతాయండీ ఈ పదాలు మీకు?"

    ఆకాశంబున నుండి వ్రాలు గదరా హైరాన జేయంగనన్
    చీకాకుల్ పడజేయునట్టి పదముల్ జీలేబి దోసిల్లలోన్
    నాకోసంబని వచ్చెనేమొ విడువ న్నాంధ్రమ్ము భాషన్ను నే
    కోకల్ సిల్కువి పట్టు చీర లిడుదున్ కోపేశ్వరీ! నీకు నేన్

    🙏

    ReplyDelete
  3. చిన్న సవరణతో:
    చూచితి స్వీయ నేత్రముల శుద్ధ చరిత్ర వసుంధరా సుతన్
    వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
    ద్రోచన తీర లంక నిఁకఁ దూర్ణము వీడుమ శంక నిర్జరుల్
    కాచ సమర్థులం చనియు గాదిలి హన్మయె పల్కెఁ గ్రమ్మఱన్

    “యంచనియు గాదిలి”

    ReplyDelete


  4. అధమునిగా శక్తియు లే
    క ధనధన మనుచు పరుగిడకయె గుర్రమహో !
    విధిగా కబళము వలయును
    విధ, వారమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies


    1. విధ - గుర్రపు దాణా ( అట - ఆంధ్ర భారతి ఉవాచ )
      గుర్రపు దాణా కూర్పుగ కోరె సతి :)
      ఆ ప్రేమ గుర్రము పై పతి పై కాదని గమనింప వలె :)

      వారు - కూర్చు

      Delete


  5. సుధలొల్కగ నే కొమరా
    ల! ధరణిలో వేరొకరు గలరకో పూబో
    డి ధగద్ధిగమనగ ? యనుభ
    వి! ధవా !రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్

    జిలేబి

    ReplyDelete


  6. అధకిమ్? నీకై వేచిన
    మధురాధరములివి సూవె! మహజరదేలా!
    సధవయు చేసెడు సేవలి
    వి! ధవా !రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!


    జిలేబి

    ReplyDelete


  7. చంద మామవలె సొబగు సక్క గుండె
    నందమూరి యందము గాన! నవ్య మైన
    రీతి గా తన రారె నరె యతడి కని
    కట్టు తెలుగునేలపయిన గట్టి గాను :)

    జిలేబి

    ReplyDelete


  8. ఈ మూవీ చూసినపుడు
    మా మది‌ గోదావరియయె మాత ! జిలేబీ !
    మైమరుపునుగనుచున్ తా
    సామజ వరగమన యనెను సఖియా వినవే :)


    జిలేబి

    ReplyDelete


  9. నిజమున్నచో జిలేబీ
    ప్రజలంగీకారము తెలుపవలెన్ ! లేకు
    న్న జలకడగాలె వాస్తవ
    ము జల్ది వెలుగును గనన్ సముచితముగ సుమీ

    జిలేబి

    ReplyDelete


  10. గురుదేవా వందనములు!
    తరగతి లో మీరు నేర్పు తర్ఫీదునకున్
    సరిచక్క దిద్ది నేర్పెడు
    తరహాకున్ కవి వర ప్రణతంబుల గొనుడీ !

    జిలేబి

    ReplyDelete


  11. నా లాప్టాప్లో కాఫీ
    లా లావుగ నుండెనయ్య లావా లా సు
    మ్మీ! లెఫ్టండు రయిటు‌ కూ
    పీ లాగితి నయ్య నిపుడె భీతిల‌ జనులున్:)

    జిలేబి

    ReplyDelete


  12. చక్కని దౌ పూరణ‌ నెం
    చక్కని భావపటిమయు పసందగు పదముల్
    చుక్కెట్టి ముద్దు గా సరి
    తక్కెడ లోతూకముగన తరముగ నిలుచున్‌:)


    జిలేబి

    ReplyDelete


  13. ఓటును యథేచ్చగా అ
    మ్మేటోళ్ళ స్వదేశమాయె ! మేల్గానమనన్
    చేటుకు పట్టమిడు జనుల
    బేటా వీలగునకో తబీయతు త్వరగా ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. విధినేమందును ? మదనుని
      కధలల్లి యనేక గతుల గమకించిననూ ,
      బుధుడివి , కళ లెరుగని కవి
      వి , ధవా !ర ' మ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!

      Delete


    2. :(


      విధి!మదన కామ రాజుని
      కధలల్లి యనేక గతుల గమకించిననూ ,
      బుధుడ ! సరసమెరుగని కవి
      వి , ధవా !రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!

      జిలేబి

      Delete
    3. విధినేమందును ? మదనుని
      కధలల్లి యనేక గతుల గమకించిననూ ,
      'బుధకవి' ననుకొనెడు జడుడి
      వి , ధవా !ర ' మ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!

      Delete


  14. ఎవరికి లభ్యంబయ్యెడు
    లవణపు తిండి భళివారు లాగించెదరోయ్
    పవలూ రాత్రి యనక నా
    నువెజ్జు లాగించడము మనుజుల బెడగయెన్


    జిలేబి

    ReplyDelete


  15. హైజాకాయెను బో సౌ
    మ్యాజీ మీ బ్లాగు !తెలుగు మాస్ స్టార్ లు భళా
    రే జప్తీ చేసుకొనిర
    కో? జర జాగ్రత్త గనుడి కోమలవళ్లీ‌ :)


    జిలేబి

    ReplyDelete


  16. అసలైన హోస్టు పత్తా
    యసలే కనరాదు ! మనము యాహూ అంటూ
    గుసగుస లాడేస్తున్నా
    ము సక్క గా గెస్టులని సముచితంబిదియో ?


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పసగల ఘన హితులందరు
      విసవిస నొకచో పసందు విందు భుజింపన్
      కసిమసగి కుళ్ళుకొందురు
      రసనాగ్రపు సొళ్ళు దీర రాలేని హితుల్ .

      Delete
    2. కసకసమని నవలగ గసగసాల్ నిండిన మసాలా కోడి కూరా
      లసలసమని వదులవవే పస ఉడిగిన ముసిలి చివుళ్లకటా !
      కసుబుసు మని ఈ రుసరుసలేల పసగల ఓ గురువరా
      నసనసల రావులందరి విసవిసల్బుసల్ విన తొడగొట్ట నదేల అనఘా !

      ... ఏదో ఊరుకుండలేని నస గురువు గారూ ...

      Delete
    3. బెజవాడనుండి వచ్చిరి
      సుజనులు మా బండి దొరలు సోకులు మాడన్
      గిజ గిజ లాడిరి పాపము
      నిజము దెలిసి కోడి కూర నెందును గనకన్ .

      Delete


  17. చర్చంటూ మొదలెట్టగ
    పర్చీ మనదగ్గిరుండు ప్రశ్నే లేదోయ్
    తర్చెడు కమింటు దారుల
    యర్చన తప్పదు జిలేబి‌ యాహూ గూగుల్ :)

    జిలేబి

    ReplyDelete


  18. ఏ లాగుననిను పొగిడెద?
    యే లాగేసుకొననేమి యెందుకు పొగడా
    లా? లాగున్నా లేకు
    న్నా లక్షణములిక మారునా చెప్పుమయా !

    జిలేబి

    ReplyDelete


  19. ఆవల శూర్పణఖ ముదము
    తో వరియించు మనుచుండె ! త్రోయంగనరే
    కైవల్య పదము ఖాయము!
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా!

    జిలేబి

    ReplyDelete


  20. కైవల్యపదము చేరగ
    నావగ జీవితము నడిపినాను విభునికై !
    యేవపు తలపుల బడితిన్
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా!

    జిలేబి

    ReplyDelete


  21. పాపం పిచ్చోడు :) వెంట తగులుకున్న భామను వలదను వాడు :)


    అరె! వెస బ్రహ్మ చారినని యందెల చప్పుడు చేసి బిల్వ నే
    ల రమణి ! వెంట రావలదు ! లంపటపెట్టకు ! లాగు లాడ నే
    ల!రసికురాల! మాయని కలన్ సయి భావన చేయజాలనే !
    మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్!


    జిలేబి

    ReplyDelete


  22. అరె! ప్రవరాఖ్యుడన్ ! పడతి! యమ్మవు నీవు సుమా వరూధినీ !
    పరుగిడ నీకు నీ మదిని భావన చేయకు తప్పు దారులన్
    కురుచపు బుద్ధి వీడుమిక కొంగుముడిన్ దిగ జార నీకుమా !
    మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్!


    జిలేబి

    ReplyDelete


  23. బావా బావా పన్నీ
    రూ! వారిజలెల్లరున్ మరుగుగా తన్నే
    రూ! విలుకాడు విడువగన్
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా!

    జిలేబి

    ReplyDelete


  24. సందర్భమేమి లేకయు
    నందరి నీరమ్మటంచు నడ్డివిరుగగా
    విందు కటంచు బిలువ మీ
    యందరి వలెపని మరేమి యమ్మికి లేదా :)


    జిలేబి

    ReplyDelete
  25. కోటి గిద్యాల వ్రతమెప్డు కోమలాంగి !
    పూర్తి చేసెదరో ? తమ పుణ్య వశము
    న , రసనకు నెప్డు తుప్పు తునక లగు నని ,
    ముసిలి ముచ్చట్లు తెగ లాగి మురియు చుండ్రు.

    ReplyDelete


  26. ఔర! కోటికి చేరున కౌక్ష మందు
    పద్య గిద్యములు జిలేబి వారిదిచట?
    చదువరుల తాట వొలుచున చక్కగాను ?
    చూచెదము పోకడనిక కచోడి పూరి :)

    జిలేబి

    ReplyDelete
  27. వడ కచోడి పూరి దడ దడలకు , పద్య
    గిద్య విద్యలకును , గిల గిలమని
    కొట్టుకొని మడియు బకులిట లేరు విహిత !
    గట్టి పిండములను గాంచ నగును .

    ReplyDelete


  28. గట్టి పిండములము మేము కంద పద్య
    దురద గొండియాకు జిలేబి దువ్వ గాను
    భయము గాంచము చదువుచు వల్లె వేయు
    వార మమ్మ తెలుసుకొను వారిజాక్షి :)

    జిలేబి

    ReplyDelete


  29. పదియవ పొత్తంబొచ్చెను
    సదమలమగు యంతరంగ చక్కదనముగా,
    అదిగో హస్తోదకమది
    గదిగొ కరతలామలకము కష్టేఫలియై!

    జిలేబి

    ReplyDelete


  30. మీ లెక్క తప్పి నట్లుం
    దే? లాతము బుచ్చుకొనిరదేను జిలేబీ
    బేలా నీహారిక? రం
    గీలా సదనపు రమణి బిగిలు నూదెనుగా :)

    జిలేబి

    ReplyDelete


  31. రానే రాను సుమా విం
    దైన వదులుకొందునే పద పదమ్మ పదా
    నేనేదో నాగోలే
    దో నామానాన పడెద! తొంగలి పట్టన్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. విందులు బందు , కోడి పదవే యిక , వాపసు , కూత కూయగా ,
      కందొవ విందుగా , షరతు గట్టిరి , కంద జిలేబి కోటితో ,
      విందుకు నేను రాననిరి , వేసరి ముందట నన్ను మర్చినా
      రందరటంచు నల్గిన మహాత్ములె , రావులు ! అందరందరే .

      Delete
    2. మిత్రులు రాజారావు గారు, మన్నించాలి. కంద కోటితో విందుకు నేను రానూ అననండి. కందాలు కందాలవలె ఉంటే మహదానందం కదా. కాని గణాల్లో అక్షరాలు పొదిగే విన్యాసాలూ వాటికోసం నిఘంటువులను దున్నటమూ, అన్వయమూ శైలీ సుభగతా వంటివాటిని అస్సలు పట్టిచుకోకపోవటమూ నాకు మింగుడు పడవండి. పోనీండి. చాదస్తుణ్ణి. మీకు నొవ్వు కలిగిస్తే మన్నించాలి.

      Delete
    3. మీరలా అంటే ఎలాగండీ ? జిలేబీ గారి గిద్యాల కంద పుస్తకానికి ముందుమాట మీరే వ్రాయాలి. డొక్కా సీతమ్మ తర్వాత ఆవిడే అని పొగడాలి. చివరిమాట వీ ఎన్ ఆర్ గారో, వై వీ ఆర్ గారో వ్రాస్తారు. మా అన్నగారు నాలుగు పద్యాలు వ్రాస్తారు. మీరంతా తలో చేయి వేస్తే పుస్తకావిష్కరణ ఘనంగా చేసేయవచ్చు.


      Delete
    4. # నీహారిక గారు
      నన్నొదిలెయ్యండి మహాతల్లీ. నేను పద్యాలు కాదు గదా గిద్యాలూ కట్టలేను, పద్యాల పుస్తకానికి చివరిమాట / ముందుమాట / ఏమాటా వ్రాయలేను. పాత మాయాబజార్ సినిమాలో "అతడికి మీ తెలివేదీ, అతడికి మీ సుళువేదీ" అంటారు చూశారా, నేను ఆ అతడు బాపతు అన్నమాట. థాంక్స్.

      బైదివే, డొక్కా సీతమ్మ గారు పెద్దచెయ్యి కలిగిన అన్నదాత గానీ కవయిత్రి కారు.

      Delete
    5. ముందు మాటలు వ్రాసిరి , బుధుల వలన
      మెప్పు వడసిరి , వలపక్షమేల యిపుడు ?
      చులకనయ జిలేబీ కందములన ? పండి
      తులకు - సమదర్శనత నుండి , తొలుగ తగదు .

      Delete
    6. భూనభాంతరమందు భానుమండన దీప్తి
      యొప్పారు విబుధుల మెప్పు వడసి
      ఘన మహా గర్జన గళ ఘళం ఘళలతో
      కందాల ఠేవల గజ్జ గట్టి
      సాహితీ సమరాంగణా హుంక్రియద్భాంకృ
      త కవిశేఖరుల జోతలు గొనకొని
      సంస్కృ తాంధ్రాంగ్ల విస్తార పరిఙ్ఞాన
      సురుచిర రసన భాసురత గలిగి

      ఆంధ్రభారతికి జిలేబి యండయో , క
      నంగ నాంధ్రభారతియే తనకొక యండ
      గా నిలిచెనో యనంగ దిగ్గజము రీతి
      జెలగు మాత జిలేబీకి జెట్టి యెవరు ?

      Delete
    7. భూ నభోంతర
      నభాంతర టైపు పొరపాటు

      Delete
    8. బృందపాకం కదా అని డొక్కా సీతమ్మతో పోల్చాను ఖర్మ గాంధీ తో పోలుస్తారా మీరూ ?

      Delete


  32. కొండాట్టము బోయె భళా
    తిండాట్టము పోయె కోటి తీయ పవనమున్
    బండియు కోటయు రాజును
    చండామార్కులు వలదన సరదా పార్టీ ‌:)


    జిలేబి

    ReplyDelete


  33. కన్నడగునౌ జిలేబియ కదనమందు
    నర్జునున కాప్తమిత్రుఁడౌ నంగరాజు
    శల్యు డామాద్రి తమ్ముని సారథిగ కు
    దుర్చు కొననయ్యె నతడె మృత్యువుకు దూత!

    జిలేబి

    ReplyDelete


  34. కందములు కందములవలె
    యందము గా నుండవలె సయాటగ రాజా
    పొందిక లేక నిఘంటువు
    నందు పదముల కలబోతలా కన రాదోయ్ !

    జిలేబి

    ReplyDelete


  35. చేయంగవలదు దూరము
    తోయంగవలదు జిలేబి తోడ్పాటిదియే
    సాయముగా కామింటిది
    గో యయువు వలెపరుగిడుచు గోలీ లాడన్ :)


    జిలేబి

    ReplyDelete


  36. నన్నొది లేయండమ్మా
    మున్నెపుడూ‌ పద్యగిద్యముల రాసిన రా
    యణ్ణేకానమ్మా ! నర
    సన్నను సాదా మడిసిని సరసిజ నేత్రా :)


    జిలేబి

    ReplyDelete


  37. నష్టంబెపుడు జిలేబీ
    శిష్ట జనాళి కనిపించి చింతను జేర్చున్
    కష్టముల గాన దోచున్
    దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్!


    జిలేబి

    ReplyDelete


  38. కష్టము లన్ భరి యించుచు
    నష్టము లెల్ల తలదాల్చి నకనక యనుచున్
    భ్రష్టుపడి పోవనా ని
    ర్దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్!

    జిలేబి

    ReplyDelete


  39. తవిలించితివోనన్ మా
    నవుడా ? యట్లైన నన్ను, నాదారిని వీ
    డి వితత మవనేలనయా?
    సవడించి సతతగతి వలె చాగనదేలా ?


    జిలేబి

    ReplyDelete
  40. This comment has been removed by the author.

    ReplyDelete
  41. మిత్రులు రాజారావు గారు,

    చులకనయ జిలేబీ కందములన? అన్నారు మీరు. క్షమించాలి, నా అభిప్రాయం సూటిగానే చెప్పాను. కందములు ఆవిడ వ్రాసిన పక్షంలో నాకేమీ అక్షేపణ ఉండదు. కాని ఆవిడ జిలేబీగారు వ్రాస్తున్నవి కందాలూ కావు అవి ఏమాత్రమూ లక్షణంగానూ లేవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.

    మీకు ఆవిడమీద అఖండమైన గౌరవాభిమానాలుండటాన్ని తప్పక గుర్తించి గౌరవిస్తాను. కాని ఆవిడ వ్రాస్తున్న మీ-దృష్టిలో-కందాల పట్ల నాకు తీవ్రమైన అసంతృప్తి ఉండటాన్ని కూడా మీరు అర్థంచేసుకోగలరని ఆశిస్తున్నాను. మీరెలా అవి ఆమోదిస్తున్నారని నేను ఆక్షేపించటం లేదు - అవి మీకు నచ్చటం మీ యిష్టం. నాకు నచ్చకపోవటం తప్పు అని మీరు దయచేసి తప్పుబట్టవద్దని ప్రార్థన - అవి నాకు నచ్చకపోవటం కేవలం నావ్యక్తిగతం.

    నాకు తోచిన కారణాలు నేను చెప్పుతున్నాను నచ్చకపోవటానికి. మీకు తోచిన కారణాలు మీరు చెబుతున్నారు మీకు నచ్చటానికి. నాకేమీ ఇబ్బంది లేదు. ఎవరినీ వ్యక్తిగతంగా చులకన చేయటం లేదు. నాకు నచ్చనిది నచ్చలేదంటున్నాను, ఎందుకు నచ్చలేదో కూడా చెబుతున్నానంతే.

    ఆవిడ ఆకాశమూ నేను పాతాళమూ అని మీరు భావించినా మరొకరు భావించినా నాకు చింతలేదు. ఐతే నా అభిప్రాయం వ్యక్తపరచటం వలన పెద్దలకు ఇబ్బంది కలుగుతున్నపక్షంలో అలా చేయటమూ క్రమంగా మానుకుంటాను.

    ఈ కారణజగత్తులో నేను ఎవరినుండీ ఏమీ అశించటం లేదు. మన్నించాలి.

    ReplyDelete
    Replies
    1. రాజారావుగారు మిమ్మల్ని ఉద్దేశ్యించి అనలేదు.వీ ఎన్ ఆర్ గారి ని ఉద్దేశ్యించి వ్రాసారు. మీరు అలగడం బాగాలేదు.

      Delete
    2. చూచితిరా జిలేబి హిత ! చోద్యము చూచెదరేల ? చాలు? సం
      కోచము లేదు నాకు తమగూర్చి , మహోన్నత పాండితీ ప్రభా
      రోచిషి మీకు సొంతమగు , రూఢిగ శ్యామల రావుగారునూ
      వాచకమున్ వెలార్చిరి భవాదృశ శోభల , శోభిలన్ దగున్ .

      Delete
    3. # నీహారిక గారు
      రాజారావు గారి వ్యాఖ్య నన్ను గురించేనని నేనూ అనుకున్నాను. కానీ అది తన గురించని శ్యామలరావు గారు అనుకోవడం నాకూ ఆశ్చర్యమే.

      Delete

    4. మొత్తం మీద ఈ మహా కన్ఫ్యూషన్ నుండి లలితా సహస్రనామ ఆవిర్భావం జరిగింది.
      పంచదశలోకానికి మరో సరికొత్త బ్లాగు వచ్చింది :)

      శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని వూరికే అన్నారా పెద్దలు

      కుట్టు కుట్టు లోన కుట్టు గలదుసూవె :)


      జిలేబి

      Delete
    5. కందుక క్రీడగా దలచి కందము లల్లును , వ్యావహారికా
      నంద పద ప్రయోగము కనంగ విచిత్రము నాకు , నింతగా
      మంది వచించు పల్కులు రమారమి పద్యములోకి మార్చుటల్
      యెందును గాంచిరా ! ప్రతిభ లివ్వి , జిలేబికి గర్వకారణాల్ .

      జిలేబీ గారి ప్రతిభా పాటవాల నుటంకిస్తూ నాలుగు పద్యాలు వ్రాయవలసినదిగా మా సోదరి నాకప్పగించిన పనిని దిగ్విజయం గా పూర్తి చేశాను .

      Delete
    6. ఆంధ్రభారతికి జిలేబి యండయో , క
      నంగ నాంధ్రభారతియే తనకొక యండ
      గా నిలిచెనో యనంగ దిగ్గజము రీతి
      జెలగు మాత జిలేబీకి జెట్టి యెవరు ?

      ధన్యోస్మి !

      Delete


    7. లక్కాకులయ్య నేర్పగ
      చక్కగ నేర్చెను పదముల చడుగుడు సత్యం
      బిక్కడ యిదియే చదువగ
      నెక్కడ యిన పేర్చె తాను లెక్కగ గణముల్ :)


      జిలేబి

      Delete


  42. చులకన యకో జిలేబీ
    గిలగిల లాడించు పద్య గిద్యములనగా
    భళినే చెప్పెద తప్పక
    కలలో గాండ్రించి నన్ను కలవర పెట్టెన్ :)

    జిలేబి

    ReplyDelete


  43. దిగ్దంతియగు జిలేబీ
    వాగ్దేవినిఁ గొలుచువాఁడు, వ్యర్థుఁడు జగతిన్
    దుగ్దను నొందును గొల్వక
    వాగ్దేవతను, వినుమా నివారణ గనుమా !

    జిలేబి

    ReplyDelete


  44. అమ్మ ఆజ్ఞ యనుకొని ప్రయత్నము సరి
    చేసెదను లలితమ్మా కచేరి లోన
    చేవ జేర్చు యర్థములను చేర్చెదనిక
    కంచి స్వామివారి చలువ గాను నేను!

    జిలేబి

    ReplyDelete


  45. వ్యాఖ్యా వ్యాసంగంబిక
    విఖ్యాతము చేయబోను! వీడెద! బ్లాగ్లో
    కాఖ్యుని శపథంబిదియే !
    ముఖ్యము గా వేరుపనులు ముంగట గలవోయ్ :)


    జిలేబి

    ReplyDelete


  46. నేనే భుజముల తడుముకొ
    నేనకొ? ఏమో ? మదిమది యెవరికి తెలియున్ ?
    కానున్నదిక జిలేబీ
    కానేరక తప్పు నా నికరముగ నమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  47. లలితా సహస్ర నామం
    బుల గాధలివి లలితమ్మ పుట కొత్తది నే
    వెలువరచితిని చదువగా
    పలువురు మేలుబడయంగ ప్రార్థనలివియే !


    జిలేబి

    ReplyDelete


  48. భంగును త్రాగి పలికెదవ
    చెంగున ప్రాంగణము దూకి చెప్పుము భడవా
    తింగరి బుచ్చి, యెచటరా
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్?

    ఇవ్వాళ పెందరాళే ముందే వచ్చేసిందేమిటి :)


    జిలేబి

    ReplyDelete


  49. కొంగున నంగీ దోపగ
    తింగరి మనువాడెనర్ర తివిరి జిలేబిన్
    ఠంగున వచ్చెను తెలివిడి
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్!

    జిలేబి

    ReplyDelete


  50. రంగడి కేళిని నాటక
    రంగంబుగ లోకమాయె! రంగుల కలలో
    హంగులు నావే యనుకొని
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్!

    జిలేబి

    ReplyDelete


  51. బెంగాల్బేనర్జీ తా
    కంగారసలుపడదు తడకట్టు తనకు లే
    దంగట! రాష్ట్రము భోజ్యము!
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్!

    జిలేబి

    ReplyDelete


  52. పోయెను రాముడు లలితయు
    పోయెను వచ్చెను జగనుడు బ్రువ్వట బాబా
    ధ్యేయము వీడెను మార్గము
    మాయా మయమగు జిలేబి మహియే సుదతీ :)


    జిలేబి

    ReplyDelete


  53. అంగజు కేళిని తేల్చగ
    పొంగుచు నయ్యరు జిలేబి పొలతిని వరుడై
    చెంగట, ణిసిధాత్వర్థపు
    సింగము నోటన్ వసించె జిలుక ముదమునన్ !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అంగజు కేళికి జిక్కి , శు
      కాంగన తరుమంగ , మగశుకము భయపడుచున్ ,
      చెంగటగల భీకర ' రా
      సింగము ' నోటన్ వసించె చిలుక ముదమునన్ .

      Delete
    2. ఈ పద్యం అర్ధం కాలేదు 😔

      Delete
    3. ఆడ చిలుకకు మగచిలుక భయపడి రాతిసింహము నోటిలో దాక్కుంది .

      Delete
  54. # రాజారావు గారు
    // “..... నాలుగు పద్యాలు వ్రాయవలసినదిగా మా సోదరి నాకప్పగించిన పనిని దిగ్విజయం గా పూర్తి చేశాను .” //

    👏
    ఇక పుస్తకావిష్కరణకే పూనుకోవాలి నీహారిక గారు. ఆల్ ది బెస్టూ 👍.

    ReplyDelete
    Replies

    1. కొంపదీసి నా పద్యాల్ని అచ్చేయించి ఆవిష్కరణకు నన్ను పిలువబోతున్నారేమిటి :)


      మానాన్నే !

      మాయమ్మే !

      మాయమ్మే


      ఆహా యేమి నా భాగ్యము !

      భాగ్యంబన్న జిలేబి దేగద సభాప్రాంగశాతోదరీ :)



      చీర్సే చీర్సు

      జిలేబి

      Delete
    2. ధన్యవాదాలు సార్ , తమరు వేరొకచోట ....

      ముందు మాటలు వ్రాసిరి , బుధుల వలన
      మెప్పు వడసిరి , వలపక్షమేల యిపుడు ?
      చులకనయ జిలేబీ కందములన ? పండి
      తులకు - సమదర్శనత నుండి , తొలుగ తగదు

      నా ప్రశ్నకు బదులేదీ .....

      Delete
    3. @జిలేబి,
      పుస్తకం అచ్చు వేస్తాము. తమరు ఒప్పుకున్నట్లేనా ? తమరిని కలిసే అవకాశం ఇస్తే తదుపరి చర్చలకు అవకాశం ఉంటుంది కదా ?

      Delete
    4. వీ యన్ ఆర్ సార్ కు విన్నపం .....

      అనఘా ! తామును పట్టు వీడుడు బుధా ! అంతేసి పాండిత్యతా
      ఘనతల్ తెల్గున నాంగ్లమందు నరిసింగన్నా ! తవాధీనముల్ ,
      మన నీహారికనూ , జిలేబి బుధులన్ మన్నింపరాయేమి ? , మీ
      మనసారన్ దగు ' ముందుమాట ' నిడుమా , మన్నింపుమా మమ్ములన్ .

      Delete
    5. # నీహారిక గారు
      // “తమరిని కలిసే అవకాశం ఇస్తే తదుపరి చర్చలకు అవకాశం ఉంటుంది కదా ?” //
      —————————
      హ్హ హ్హ హ్హ, దీన్నే Catch-22 సిచ్యుయేషన్ అంటారు 😀😀.

      Delete
    6. # రాజారావు మాస్టారు Feb 09, 2019 at 4:21 pm; Feb 11 at 10:18 pm; Feb 11 at 11:48 pm
      ———————————————
      వలపక్షం కాదు, చులకన అంతకన్నా కాదు. ముందుమాటో, చివరిమాటో వ్రాయాలంటే సదరు పుస్తకాన్ని చదివి, అర్థం చేసుకోవాలి కదా. వారి పద్యాలు చదివి అర్థాన్ని ఆకళింపు చేసుకునేటంత వైదుష్యం నాలో లేదని నాకు తెలుసు. శ్యామలరావు గారు అన్నట్లు అడుగడుగునా ఆంధ్రభారతిని “దున్నడం” కూడా నావల్ల అవదు. కాబట్టి ఈ విషయంలో నిస్సహాయుడిని. నన్నొదిలేయండి.

      అసలు ఆ మాటకొస్తే పద్యాలు కట్టగలిగే సామర్థ్యం కలిగిన మీరే పద్యాల పుస్తకాలకు పరిచయవాక్యాలు వ్రాయడానికి ఎంతైనా అర్హులన్నది నిర్వివాదాంశం. అందువల్ల మీరే ఆ పని చేస్తే సొంపుగా ఉంటుంది, ఆ పుస్తకానికి శోభనిస్తుంది. మీ “సోదరి” గారు కోరినట్లుగా మీరు వ్రాసిన ఆ నాలుగు పద్యాలను కూడా మీ ముందుమాటలో భాగంగా చేసెయ్యవచ్చు. కాబట్టి “ఆ రకంగా ముందుకు పోదాం”.

      Delete
    7. జిలేబీ వారు ఎవరేమి మాటాడినా , ఆమాటలను యథాతథంగా పద్యాలలో చెబుతున్నారు . ఏతావత్ ,
      మన మాటలే అవన్నీ . మామూలు మాటలే . కొబ్బరి పీచు వొలవక్కరలేదు . టెంక పగులగొట్టక్కరలేదు .
      ఇక , నేను పద్యాలను కట్టగలను . కాని , తమ వలే ముందుమాట రాయగల భావుకుడిని గాను . అందుకే , ఆ కార్యానికి మిమ్మల్ని న అనుకున్నట్లు న్నారు . అనుభవము గలదు కూడానాయె . పద్యాలింకో నాలుగు రాయమన్నా నేను రాస్తాను లెండి . ఇంతకూ , పాపం జిలేబీగారు తనవాళ్ళెవరో , పెర వాళ్ళెవరో ఇకనైనా .....

      Delete


    8. ఎవరేమి మాటలాడిన
      గవనము గా చూసి దాని గణముల్ లెక్కె
      ట్టి వరుస పద్యంబుల గ
      ట్టి, వాహ్ జిలేబీయముగ తృటిని చెప్పిరిగా :)


      జిలేబి

      Delete
    9. 🦁,
      you can't get people without funding, but you can't get funding without the people there in the first place 👍

      Delete
    10. # నీహారిక గారు
      Catch-22 కు మరొక ఉదాహరణా 🙂😀 ?

      🦁

      Delete


    11. డబ్బులు లేక జనాలను
      సుబ్బా తెచ్చుకొనలేవు సూ! భువిని జనా
      లబ్బో లేకున్న నరే
      డబ్బులు రావయ్యరొ నరుడా‌ విను వినుమా :)


      జిలేబి

      Delete
    12. ఏమిటీ హఠం ఈ వయసులో .... అన్నీ నేనే చూసుకుంటానని రెండ్రోజుల క్రితమూ చెప్పాగా ? అయినా ఎందుకు తాత్సారం ? మిమ్మల్ని కలిసి పుస్తకం గురించి చర్చించే అవకాశం ఎపుడిస్తున్నారు ? రాణీపేటక్కూడా వీసా కావాలా ?

      Delete
    13. 🦁,

      జిలేబీ గారిని catch చేయాలంటే తప్పదుగా 😆

      Delete


    14. అద్భుతమైన కట్ పేష్టుతో మొదలుపెట్టారు. అనేక విషయాలు తెలియపరుస్తున్నందుకు కృతజ్ఞతలు.


      :)


      జిలేబి

      Delete
    15. జిలేబీ గారి రెకమెండేషన్ కదా ? హరికాలం కూడా మొదలయ్యింది పండగ చేసుకోండి.

      Delete


  55. కవితల రాయించిన రా
    ఘవుడే కామింట్ల వేయ కారణమగున
    య్య విదుర! జైగొట్టి పలికె
    ద వచ్చు నట్టి సమయమ్ము దగ్గిర లోనన్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పోతన "పలికించెడి వాడు రామభద్రుడు" అన్నారు కదండీ.

      Delete


  56. మనసున చంద్రుండు కలడు
    కనుబొమ్మనసూర్యుడమ్మ కందజిలేబీ
    కనుబడ, మదియదుపున్ బడ
    నినబింబము పగటిపూట హిమగోళ మగున్!



    జిలేబి

    ReplyDelete


  57. మనసున మనసై తనువున
    తనువై హృదయంబులో హృదయమై గానన్
    మనుగడ రతగురువున్ కెడ
    యినబింబము పగటిపూట హిమగోళ మగున్!

    జిలేబి

    ReplyDelete


  58. మనుజుల్ కాలుష్య నివా
    రణ మదినెంచక బతుక మరణపు మృదంగం
    బనుగీతియై జిలేబీ
    యినబింబము పగటిపూట హిమగోళ మగున్!


    జిలేబి

    ReplyDelete


  59. ప్రోజెక్టుల పైనన్ భళి
    ప్రాజెక్టులనే తెరిచెడు రాయులమయ్యా
    ప్రాజెక్టు క్లోషరనెడు ప్రొ
    సీజరు లేదయ్య డీజి చింతవలదయా :)


    జిలేబి

    ReplyDelete


  60. అవుతా నేనే డాక్టరు
    నవుతా డబ్బులు గలగలలాడ జిలేబీ
    నవుతా షుగరూ బీపీ
    చవుకగ వచ్చెడు బతుకున చకచక ₹పయా :)


    జిలేబి

    ReplyDelete


  61. పరిహాసమకో రాముడె
    తిరమని నమ్మిన జనులన ? దిమ్మ తిరుగున
    ట్లు రయముగా మా రాముడె
    పరుగిడి వచ్చు గడగట్టు భక్తుని గావన్ :)

    జిలేబి

    ReplyDelete


  62. బండి వారటంచు పండితులకనుమా
    నంబదేల కలిగె ? నరస రాయ
    లయ్య పట్ట గాను లబ్మని పాయింటు
    రాజు వారు చెప్పిరచటనరరె :)

    జిలేబి

    ReplyDelete


  63. ఈ యలక లేమిటండీ
    సాయంకాలమ్ము చవితి చంద్రుడు సరదా
    గా యయ్యవారల జిలే
    బీయము గా చూసినాడ విపరీతముగా :)


    జిలేబి

    ReplyDelete


  64. తట్టని దానివలననే
    గట్టిరి మన శాస్త్రి వరులు కంద జిలేబుల్ :)
    కట్టల్ కొలదిగ సిగరెట్
    చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!


    జిలేబి

    ReplyDelete


  65. బండి దొర నొచ్చు కున్నా
    రండయ్యా బుజ్జగింపు రప్చరు నాపన్
    దండిగ చేసితిమయ్యా !
    కొండీలున్ లొల్లియున్ ఖగుడ లేదు సుమా :)

    జిలేబి

    ReplyDelete


  66. నీలాపనిందలండీ!
    నీలమణిన్ కూడ విడువనే లేదుగదా !
    మాలాటివార లేపా
    టీ! లావణ్యవతి ముప్పటిల్లును త్వరగా :)


    జిలేబి

    ReplyDelete


  67. మీ రెకమెండేషను గా
    దే రమణి జిలేబి , హరియు తెరపై వచ్చెన్ ?
    ఔరా ! యిది మా మాయా?
    పోరడ మా లక్కుపేట పోరడ చెప్మా :)

    జిలేబి

    ReplyDelete


  68. చిరునామా లో శ్రీలలి
    త రసమయపు బ్లాగు చూడ తనివారె జిలే
    బి! రకరకాలు సుమా పే
    ర్లరయగ దేవతలకు మరి రహియొకటె సుమా !

    జిలేబి

    ReplyDelete


  69. బ్లాగ్లోకపు ఫత్వాలు :)


    బ్లాగుముఖంగా యేకే
    స్తా గురుడ సహస్రనామ జపపు పదములన్
    ఓ గురుతర బాధ్యతగా
    బ్లాగున వివరించక త్వరపడి యెగ జోపన్‌ :)


    జిలేబి

    ReplyDelete


  70. ఇంతకు యనానిమసెవరు
    కొంతైనా తెలిసెనో ? కకుత్తెవరిదకో ?
    వింతగ వుంది జిలేబీ
    సుంతయు తెల్వక జనులు విసుగునొందిరిగా :)


    జిలేబి

    ReplyDelete


  71. నాకర్థంబయి చావద
    యా కొంతైనన్ జిలేబి యమ్మివి పద్యా
    లే! కోవిద వేదంబిక
    నాకెట్లర్థమయి చచ్చు నయ హరిబాబూ :)


    జిలేబి

    ReplyDelete


  72. వేదాల్లో నరె సైన్సు లేదకొ? మరీవెర్రాయి కామోసు సు
    మ్మీ! దా! నేర్పుత ! సైన్సు, వేదములలో మేలైన శాస్త్రంబొరేయ్
    లేదంచున్ తను ప్రూవు చేయగలదా ? లెక్కెట్టి చూపిస్త రం
    డ్రా దమ్ముంటె ! సవాలిదేను! హరి నర్రా గట్సు హాల్మార్కు రా!


    జిలేబి

    ReplyDelete


  73. మట్టిని కలిసెదవయ్యా
    చుట్టల్ గాల్చిన! లభించు సుఖసంపత్తుల్,
    పెట్టని కోటై మారును
    దిట్టగ నారోగ్యము, వలదీ పొగ పొంకాల్ !


    ***

    ఎట్టెట్టెట్టెట్టా పొగ
    చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్?
    గట్టిగ అనమాకయ్యా
    చట్టని పోలీసు వెన్క చట్టము వచ్చున్ :)

    ***

    నేటి సినిమాలు
    పొగ, మద్యపానం త్రాగటం హానికరం అని statutory warning పెట్టేసి ఫ్రేమ్ ఫ్రేమ్ లో చేతిలో బాటిల్ నోట్లో సిగరెట్ అందరి చేతా పెట్టించేసి హిట్ పిక్చరు తీసి రాజభోగాల్ అనుభవించడం :)


    చట్టము చెప్పెను శిక్షని
    చుట్టల్ గాల్చిన ; లభించు సుఖసంపత్తుల్
    ముట్టవలదంచు పలుకుచు
    నెట్టుకొలుప ఫ్రేము ఫ్రేమునే నద్దానిన్ !


    ***


    బాహుబలి :)

    అనూష్కయే సుఖసంపత్తి :)


    కట్టప్పా! వెస దివిటీ
    చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్,
    దిట్టగ నెద్దుల కొమ్ముల
    గట్టి తరుమగ మనకే యికన్ జయము సుమీ

    ***

    అథ యోగానుశాసనమ్

    యోగః చిత్త వృత్తి నిరోధః



    చట్టని ధ్యానము చేయుము
    పట్టు విడువ వలదు సూవె పద్మాసనమం
    దట్టడుగు చెలగు తలపుల
    చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!


    ***

    చుట్టాల్వచ్చిరి యింటికి
    పట్టమ్మా దస్కముగల బందుగులు సుమీ
    చట్టని తీపి జిలేబీ
    చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!

    ***

    ReplyDelete
  74. నెట్టింట నారదాయిత
    మట్టి మషాణములు హితుల మనసులు కలగన్
    దట్టించి రుచిర కందపు
    చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!

    ReplyDelete


  75. అంతర్జాల ఉషశ్రీ!
    వంతెన ! కష్టేఫలి! ప్రతిభాశాలి కతల్
    వింతైనవి! జీవితపు ప్ర
    శాంత సమయమందు చేర్చె సద్భావనలన్ !


    జిలేబి

    ReplyDelete


  76. దూకుడు మొదలెట్టా బ్లా
    గ్లోకము లోన టపటప యిగోలాగిస్తా
    నా కలమును శక్తికొలది
    పాకము గావేసెదన్ టపాల జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  77. వేదాల్లో నరె సైన్సు లేదకొ? మరీ వెర్రోళ్ళు కామోసు సు
    మ్మీ! దా! నేర్పుత ! సైన్సు, వేదములలో మేలైన శాస్త్రంబొరేయ్
    లేదంటూ తను ప్రూవు చేయగలదా ? లెక్కెట్టి చూపిస్త రం
    డ్రా దమ్ముంటె ! సవాలిదేను! హరి నర్రా గట్సు హాల్మార్కొరేయ్ :)

    జిలేబి

    ReplyDelete


  78. అయినా బిరుదుల నిచ్చుట
    కయినా పుచ్చుకొననైన కార్చిచ్చు కులా
    ల యిసయము లెందు కండీ ?
    వయసాయెనుబుద్ధి మట్టు బ్లాగ్చండీ పో !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "అంతర్జాల ఉషశ్రీ" అనే మాటపై బిరుదుల గురించి నీహారిక గారు ఇక్కడ వ్రాసిన అకారణ scathing వ్యాఖ్య, దానిపై నా స్పందన సంకలినులలో మాత్రం కనిపిస్తున్నాయి గానీ మీ బ్లాగులో కనబడడం లేదేమిటి చెప్మా, ఏం మాయ చేశారు "జిలేబి" గారు 🤔 ?

      Delete
    2. బిరుదుల గురించి నిన్ననొక వ్యాఖ్య వ్రాశాను ఇక్కడ. ఇంకా ప్రచురించలేదే? ఉన్నట్లుండి మోడరేషన్ విధించినట్లున్నారు.

      Delete


    3. పొగరుమోతు పోట్లగిత్తరా
      ఓరయ్య...
      పొగరుమోతు పోట్లగిత్తరా
      ఓరయ్య...

      పాట చూడవలె :)


      జిలేబి

      Delete


  79. ఓరయ్యో పెద రాజ! మోపు తలపై సోకుల్ వయారంపుతో
    జీరాడంగను వచ్చినా కవితకై చిత్రంబుగా నయ్యరో
    యేరాలమ్ముగ నన్ను చూడ తృటిలో యేటో పదాల్ వస్తయం
    టా రాయన్ సరి మూట కట్టుకునినేటాటా యనంటానులే !


    జిలేబి

    ReplyDelete


  80. చేయాలేమో ఫిర్యా
    దేయిక బ్లాగరు కరరె! యిదేమయ గూడున్
    వాయించేస్తుండ్రు సదా
    స్థాయిన్ మించిన పొడలన సౌభాగ్యమకో :)


    జిలేబి

    ReplyDelete


  81. కనుడయ్య యీయెరువుని! మ
    హిని మీ పంటల కిదేను హితమగును ! రసా
    యనికముగ పెరిగి బరువున
    మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్


    జిలేబి

    ReplyDelete


  82. చూడ కళ్ళు పోయె సుందర వదనా జి
    లేబి! కాళ్ళు పోయె లేవ కష్ట
    మాయె!చీకటి బతు కాయె నారాయణా!
    కూచి! వచ్చె హరిమ గూడు బోవ !


    జిలేబి

    ReplyDelete


  83. పొగరుమోతు పోట్లగిత్తరా
    ఓరయ్య...
    పొగరుమోతు పోట్లగిత్తరా
    ఓరయ్య...
    ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది
    ఎనక్కొస్తే ఎగిరి కాలు ఝాడిస్తుంది...
    ఓహో... ఓ... హోయ్...
    ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది
    ఎనక్కొస్తే ఎగిరి కాలు ఝాడిస్తుంది...
    విసురుకుంటూ కసురుకుంటూ
    ఇటూ అటూ అటూ ఇటూ డిర్‌‌‌రరర్‌ర్..
    కుంకిళ్లు పెడుతుంది కుప్పిగంతులేస్తుంది

    హాయ్... పొగరుమోతు పోట్లగిత్తరా
    ఓరయ్య.
    ఓరయ్య...

    అదిలిస్తే అంకె వేయు తిట్టిపోయు గిత్తరా
    అరెరెరెరెరే కదిలిస్తే గంతులేసి కాండ్రుమనే గిత్తరా
    దీని వ్యాఖ్య తీరు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతది
    నడక జోరు చూస్తుంటే నవ్వు పుట్టుకొస్తది
    అహ... అహ అహ అహహ ...


    జిలేబి

    ReplyDelete


  84. కుదిమట్టంబుగ జెట్టిమబ్బుగ మరే గుంజాయిషీ గుబ్బగా
    అదిరేచూపుల తీయగంటి సమ వయ్యారంబు! నిన్జూడగా
    మదిరెండాడక చెప్పి నారు వినవమ్మాపూవుబోడీ జిలే
    బి! దువాడించుచు విన్నకోటవరులే విప్పార్చు నేత్రమ్ములన్ :)

    ReplyDelete


  85. అడ్డదిడ్డము గానుబోవుచు నాంధ్రదేశము చుట్టుచున్
    గడ్డికోసితి మోపుగట్టితి గట్టిగానటు చేలలో
    వడ్డనమ్ము‌ను చేయరండయ వాసిగానగ పద్యముల్
    తెడ్డువేసెడు వారలెవ్వరు తేటగీతిని తోడుగా :)

    ReplyDelete


  86. ఒకటే విషయము కావ
    చ్చు కవివరుడ వివిధములగు సొబగులు వేర్వే
    రు కడలి యలలవలె జనులు
    నికుంభిలను కొలుచు రీతిని సదా నరుడా!


    జిలేబి

    ReplyDelete


  87. భావుకత యసలు లేదే?
    మీ వాక్యంబులు సొబగుగ మించారట్లే
    పై వరుస లోన పెట్టికి
    భావంబేమో జిలేబి పద్మా! తెలుపన్ !

    జిలేబి

    ReplyDelete


  88. ఓయీ! రిబాల్డు! సయి మటు
    మాయ! జిలేబి జర భద్రమమ్మరొ పలుకుల్
    సాయం సమయపు వారల
    కీయవు శోభల్ వినదగు కీసర వలదోయ్ !


    జిలేబి

    ReplyDelete


  89. సంపక తింటావేలా !
    కంపర మెత్తెను నరునికి కంద జిలేబీ
    కుంపటి రగిలెను వేయన్
    నింపాదిగ పొద్దుట నితనెవడో తెలిసెన్ :)


    జిలేబి

    ReplyDelete


  90. కనుడయ్య యీయెరువుని! మ
    హిని మీ పంటల కిదేను హితమగును ! రసా
    యనికముగ పెరిగి బరువున
    మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్


    జిలేబి

    ReplyDelete


  91. కన మందమతులె సుమ్మీ
    మన మేధావులు జిలేబి! మనుగడ యననే
    మని తెలియదు! యెట్లగునే
    మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్?


    జిలేబి

    ReplyDelete


  92. తనరారు గ్రామపు సొబగు
    లనుగని మించారు పొలములను నేపుగ వృ
    ధ్ధినిగాంచుచు ధ్యానంబున
    మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్!


    జిలేబి

    ReplyDelete


  93. వచ్చే వారానికి ఆకాశవాణి సమస్యాపూరణ

    దత్త పది - కరి గిరి దరి సిరి అన్యార్థంలో దేశభక్తి‌ ప్రబోధకముగా


    పుల్వామా సైనికులకు నివాళి‌ -


    పద! రిపువుల నడచంగ ! మ
    న దేశ భద్రత కొరకు మనమళుకరియె కా
    దు!దువాడించుచు పుల్వము
    గ దునిమి గిరికవలె తిరిగి కసి రివ్వుమనన్ !


    వందేమాతరమ్


    జిలేబి

    ReplyDelete


  94. హమ్మయ్య హంసపాదు గట్డెక్కింది :)


    ఏదో శర్మాజీ మీ
    కై దేవి సమభిధల గమకంబాపనయా
    ఆదేశంబొకరైనన్
    నాదరణగ చేర్చినారు నాకది పదివేల్ :)


    జిలేబి

    ReplyDelete


  95. రాములోరు పోయేరరె! రాజ్ఞి లలిత
    మాత వచ్చేను! జోషొచ్చె మంచిగాను
    మేటి అమ్మోరి తలపులో మెండుగాను
    నామ జపమాయె వివరణ నామములకు


    జిలేబి

    ReplyDelete


  96. వాసన పట్టగల నరుని
    నే సుమ్మీ యిది జిలేబి నెగడై గంధ
    మ్మే సూవె! యనానిమసుని
    వేస మెవరిదమ్మ చిలుక వేగిర తెలుపన్ :)


    జిలేబి

    ReplyDelete


  97. హీరోలకు కలరే సొగ
    సై రోడ్డుసయిడభిమాన సంఘాలరరే
    జీరో లయ్యిరి సైనికు
    లే!రాముని కోతిమూకలే మన వీరుల్ !

    జిలేబి

    ReplyDelete


  98. యోగము మేలు! విడుమికన్
    రాగద్వేషమ్ముల! విడరాదు మునులకున్
    క్రేగంటిచూపులు! జిలే
    బీ గట్టి నియమమువలయు పిరియము తోడై!




    జిలేబి

    ReplyDelete


  99. దీనిని‌ భాష్యంబనరం
    డీ! నరసన్నా జిలేబి డింగరి వక్రం
    బేనయ్యా బ్లాగ్బాంధవ!
    బోనగిరి పలికిరి సూవె పూబోడి వినన్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఏమిటో! జిలేబి మాయ? నన్ను కందంలో ఇరికించేసారు. కోపం వచ్చిందో, ఏమో?

      Delete



    2. అబ్బే ! మీ మీద కోపమా ! నెవర్!

      మీ జన్మ ధన్యమయిందండీ బో‌నగిరి గారు .
      చూడండి యెంత అందంగా సునాయాసంగా కందంలో యిమిడి పోయేరు

      జిలేబి

      Delete


  100. అయయో చోరులు ! నా బ్లా
    గయయో యేమాయెనో ! పగలురాత్రీ యే
    మయెనో ! యీమాయను బ్లా
    గయ గూగుల్కంపెనీకి కతగా చెబ్తా :)


    జిలేబి

    ReplyDelete


  101. ఏ కవిరాజింటబతికె
    నో కుక్కబతుకిలని నిపుణుండాయె నితం
    డా కర్మని వాసనలను
    మాకొన నీజన్మ లోన మరి పద్యములన్ !


    జిలేబి

    ReplyDelete


  102. హమ్మయ్య ఒక కందం గిట్టెను :)

    అంకితం మారెళ్ళ వారికి !


    వామనకుమార! సరిలో
    తా ములుగగు బేసిలో సుతారముగ జిలే
    బీ మాదిరి, బేసిని సరి
    లో మునుగును నమ్రతన్ తళుకులీనంగన్ !


    జిలేబి

    ReplyDelete


  103. మానవుడు తెలుసుకున్నది
    ఓ నరుడా యణువు మాత్ర మోయి తెలివి యం
    తేను! తెలియ దైవంబును
    తా నింకను నెంతయో యతనము గనవలెన్!


    జిలేబి

    ReplyDelete


  104. ఔరా ! మాశకారుని హైజాకు చేసేసారే‌ :)/అదురహో


    ఔరౌర విట్టుబాబు శ
    కారుని కాపీ రయిటు సకలము జిలేబీ
    దౌరౌరా చోరముతో
    నారాయణ మంత్ర జపము నరక మొసంగున్


    :)
    జిలేబి

    ReplyDelete


  105. భారములను తొలగించును
    నారాయణ మంత్ర జపము, నరక మొసంగున్
    కోరికలపుట్టయేను ! ము
    రారి పదముల శరణనుము రమణి జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  106. నారాయణ - నార+ అయన

    నార యనంగ పిసినిగొ
    ట్టౌర!అయన మాయె దారి ! టంకంబులకై
    నారాయణయని చేయగ
    నారాయణ మంత్ర జపము నరక మొసంగున్!


    జిలేబి

    ReplyDelete


  107. నోరారంగయనవలెన్
    నారాయణ మంత్ర జపము! నరక మొసంగున్
    హేరాలమ్ముగ తప్పుల
    నౌరా చేయంగ దండన మలకమెరుపై !


    జిలేబి

    ReplyDelete


  108. ఏమండీ యనుచున్ సదా పెనిమిటిన్ నింపాదిగా ముద్దుగా
    నా మందాకిని బిల్వ గా మనుజుడా యర్థంబులేవేరయా
    ఆమృత్యుండట వేచివున్న బిలువన్ నార్యుండ! నన్జూడుమా
    నీమార్గంబు‌న నన్నుకూడ గొనిపో నిద్దానినీయంచు‌రా


    జిలేబి

    ReplyDelete


  109. పలువిషయమ్ముల పరిచయ
    ము, లబ్జుగ ప్రవీణుడవు సముచితముగా నీ
    విలలో మన మతమునటుల్
    చులకన గా చూడగోరు స్టుపిడిటి యేలా :)


    నారదా!
    జిలేబి

    ReplyDelete


  110. వాజమ్మలము గురువరా
    ఈజీ గా గుర్తు గాన నీ నామములన్
    బేజారనుకోక తెలుపు
    డీ జర రెఫరెన్సులయ్య డింగరుడనయా :)


    జిలేబి

    ReplyDelete


  111. మనుజుల మది చీల్చు మతముల మత్తున
    హింస; గల్గఁ జేయు హితము భువికి
    సఖి యహింస మేలు సమసమాజము సుమీ
    విశ్వదాభి భూజ వినవె భామ


    జిలేబి

    ReplyDelete


  112. అరవను సుమ్మీ మేలుగ
    వరుసన మీ సూచనలను పరిశీలింతున్
    మరువక పాటించుటకు కు
    దిరినంత వరకు యతనము దీటుగ చేతున్ :)


    జిలేబి

    ReplyDelete


  113. అమరులయిరే జవానులు
    విమతపు బుద్ధుల మనుజుల వికటాట్టహసం
    బు! మరణ మృదంగమదిగో
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్!


    జిలేబి

    ReplyDelete


  114. పాయెన్ రాముడు ! మనకిం
    పాయెన్ గద రాజకీయ వాచాలత్వం
    బే! యేమి మాయ చేస్తవు
    రా యెంకటరమణ నీవు రాతల మార్చన్ !


    జిలేబి

    ReplyDelete


  115. దేవుడు గలడు గలడనే
    భావన ధైర్యమును చేర్చు ప్రార్థింపంగన్
    నావల కలడు కలండనె
    డా విభుడే వజ్రముగ కడానియగు సుమీ !


    జిలేబి

    ReplyDelete


  116. మతమిచ్చు ధైర్యము జిలే
    బి తరమయినదేనకో ? కుపితుడడిగెనటన్
    పతనంబందరునొందుదు
    రు తరుణి విశ్వాసమొకటె రూఢియు కాదే :)


    జిలేబి

    ReplyDelete


  117. దబదబ బైబిలు చదివితి
    సబలునిగా నిర్బలునిగ, సకలంబున తా
    ప్రబలు నిరాకారిగ మే
    లు బికారిగ పిరియముగ ములుగుగా నతడిన్ !


    ఈపాటి తెలియడానికి బైబిలు చదవాలా ప్రవీణూ :)


    జిలేబి

    ReplyDelete


  118. సరదా గా వున్నాయం
    డి రవణముగ పేరడీలు డిగనురుకె సుమీ
    వరుసగ రాగమయముగా
    పరుగిడు పదములు సొబగగు పరుగులు తోడై :)


    జిలేబి

    ReplyDelete


  119. లోకమ్ముపైన మీదుగ
    లోకుల పైనన్ జిలేబి లోకాచారం
    బై కలదజ్ఞానపు ఛా
    యా కల్మషములు వెరసి భయమునకు తలమై!


    జిలేబి

    ReplyDelete


  120. పేరేమో తెలుగాయెన్
    పోరడి వ్రాతాయె నాంగ్లపు కెలుకు బుచికీ!
    సారు నిను పోల్చిరెవరో
    మూరెడు తోకను మడిచి తెములుమయ్య వెసన్ :)


    జిలేబి

    ReplyDelete


  121. మానవతకు, దర్పణముగ
    యీ నాటి మనబతుకులకు, మీకథ నిలిచెన్
    తేనీరువలె రుచికరము
    గా నిమ్మదిని యొనరిచె సకలమున తానై


    జిలేబి

    ReplyDelete


  122. నిత్యము బరకటను, నియతంబుగ తననే
    భజన సేయువాడు భక్తుడగున?
    నిత్య సత్యమును పునీతముగాగాన
    భజన సేయువాడు భక్తుడగున?


    జిలేబి

    ReplyDelete


  123. మత గ్రంధములన్నియు నా
    యతీశ్వరుల మానస వలయములో వెలుగై
    స్మృతియై మతమై సమ్మత
    ము తిరము గాగాంచినట్టి ములుగు జిలేబీ !


    జిలేబి

    ReplyDelete
    Replies

    1. కోశాగారము

      Delete
    2. పలుగూ పాఱా పట్టుక
      నిలు వాలుగ తెలుగు భాష నేలలు త్రవ్వీ
      విలువ గల పదము లేరుక
      ములుగున దాచుంచి రమ్మ ! ముద్దు గదమ్మా !

      Delete


  124. మనుజులకు సంశయమ్మది
    విను తప్పది కాదు సూవె విషయము తెలియన్
    మనికియు శోధింపవలెన్
    తన యునికికి మూలమెద్ది తరమెద్దియనన్ !


    జిలేబి

    ReplyDelete


  125. క్రమబద్ధమైన ధర్మము
    లమరు పదార్థములలోన లావణ్యముగా
    సమవృధ్ధిని గానంగన్
    శ్రమయెవరిదకో? తెలివిడి, శక్తి యెవరిదో ?


    జిలేబి

    ReplyDelete


  126. హోమాలు ఫలించాలం
    టే మనుజుడ వలయు క్లారిటీ!తెలుసు కొనం
    గా మహిని బాగు పడెదవు
    కోమలి నీహారిక పలుకులను వినుమయా :)


    జిలేబి

    ReplyDelete


  127. మదిలోన భక్తి భావం
    బదిలేకన్ పూజలను గబగబ యనుచు చే
    య దరిసెనము దక్కునకో ?
    ప్రదర్శనలతో జిలేబి ప్రభువగుపడునో ?


    జిలేబి

    ReplyDelete


  128. హోమానికి యెక్సుపయిరి
    భామా గలదే జిలేబి! పవనుని పల్కుల్
    కోమలి నీహారిక విన
    వే! మహి లో స్వాములు బతి కేదెట్లే సూ :)


    జిలేబి

    ReplyDelete


  129. కట్టుకథలతో మంచిని
    చట్టని చేయగలవనిన సఖి కాష్మోరా
    పుట్టించే దడతో సరి
    మట్టముగా చేయగలవు మహిని జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  130. పదవీ యోగంబెవరికి
    పద గలదో? స్వామివారి ప్రజ్ఞని కలదో?
    సదనంబున తెలుపువలెను
    మదినొందును సుఖమపుడె కమలనయనికహో !


    జిలేబి

    ReplyDelete


  131. ఇంకా యేవేవో సా
    యంకాలంపు పనులుండు యమహో యమహో
    ఢంకా గాన భజానా
    లింకా వారికి గలవు! జిలేబి తెలుసుకో :)


    జిలేబి

    ReplyDelete


  132. ఫ్యూచరు యోగంబెవరిక
    హో ? చప్పునచెప్పరమ్మ హోన్హార్ స్వాముల్ !
    నే చెప్పితినపుడే గా
    దా చంద్రుల రాజ్యమని ఖుదాసాక్షిగ సూ !


    జిలేబి

    ReplyDelete


  133. ఉత్తుత్తిగ సర్వే మన
    కిత్తరి యేల వలయు మన కిస్మతు పెంచే
    ముత్తెపు కైపుల సర్వే
    సత్తె పెమాణముగ సూవె చంపకమాలా !


    జిలేబి

    ReplyDelete


  134. ఆశయు పుట్టగ మోసము
    పాశము గా మారునోయి ప్రావీణ్యుల్ కూ
    డా శమనము గాన కుదర
    దే శాస్త్రము కర్మవిధి యిదేయనును గదా


    జిలేబి

    ReplyDelete


  135. తెలియని దానికి కట్టుక
    తలకు ప్రవీణు గలదోయి తరమగు తేడా
    యిలలో కాష్మోరా గా
    థల వీరేంద్రుండు వ్రాయ తావిడిచె సుమీ :)


    జిలేబి

    ReplyDelete


  136. దాతలను మీరు నేరుగ
    జోతల నడుగక, స్వయముగ చొక్కదనము రాన్,
    జాతర ఖర్చులకని, తా
    మై తమ వద్దకిక, బంబ మనవలదు సఖా !


    జిలేబి

    ReplyDelete


  137. జంతుబలులు లేవుకద ? ర
    వంతగ సంశయమయ గురువర్యా రాజా
    కొంతయు తప్పది కాదే
    వింత సఖా నరసరాయ విదురా విదురా :)


    జిలేబి

    ReplyDelete


  138. దేవుణ్ణెంతగ నమ్మిన
    నూ వర్షాకాలమందు నూటెక్కుచు ముం
    పై వరదై పుష్పమ్ముల
    తావరలుకొనంగ చంపు దాక్షిణ్యము లే !


    జిలేబి

    ReplyDelete


  139. వామాచారము పాటిం
    చే మర్యాదగలదయ్య శ్రీనరసింహా!
    మీ మాటలకు నెనరులయ
    మా మాటంటే మదిమది మామాటేనౌ


    జిలేబి

    ReplyDelete


  140. దేశభక్తి గలదని ఒట్టి మాటలు చెప్పక
    దామోదరదాసు మోడి వలె ప్రభోదాత్మకంగా
    In action వుండాలి



    మసి రివ్వున చేసెద రిపు
    ని సంహరణ తప్పుకాదు! నెమ్మియు కరికె
    క్క సదయునిగ చేతు గిరిక
    గ సర్వదేశముల తిరిగి కష్టేఫలియై!


    మేరా భారత్ మహాన్
    వందేమాతరం


    జిలేబి

    ReplyDelete


  141. పుల్వామా లో అమరులైన సైనికులకు నివాళి

    పద! రిత్తవడకు! కడపు ! మ
    న దేశ భద్రత కొరకు మన మళుకరియె కా
    దు! దువాడింపన్! పుల్వము
    గ దునుము! గిరికవలె నీదు కసి రివ్వుమనన్!


    వందేమాతరమ్!


    జిలేబి

    ReplyDelete
  142. సోదరి నీహారికయున్
    మేదురముగ పద్యరచన మీద మనస్సున్
    సాదరముగ జేసె లయము ,
    మోదంబిది , పద్య విథ మమోఘము చూడన్ .

    ReplyDelete
    Replies
    1. నీహారికఫిబ్రవరి 23, 2019 6:58 AM
      సాగిలపడవలె దైత్యులు
      యోగులదేశమిక రివటయో యంకసిరిన్?
      దాగిరి ముష్కురులచటన్
      వేగిరపడు బెదిరి నీవు వెనుతిరుగకుమా

      మీరు కాదా ?

      Delete
    2. Where is this comment ? It's not mine.

      Delete
    3. మాలికలో సమస్యాపూరణల బ్లాగుకు సంబంధించినదిగా చూసేను . బహుశః మీపేరుగల ఇంకొక పండిత కవి కావచ్చు . అయితే , నా ప్రశంశ వారికే చెందుతుంది . ధన్యవాదాలు .

      Delete
  143. // "Where is this comment ? It's not mine." //

    హెట్టెట్టెట్టా, మరి "శంకరాభరణం" పద్యాల బ్లాగులో ఈరోజు "నీహారిక" పేరుతో కనిపిస్తున్న ఈ పద్యవ్యాఖ్య ఎవరిదన్నట్లు? Blogger profile లో కనిపిస్తున్న బొమ్మ కూడా మనకు తెలుసున్న నీహారిక గారిదేనే 🤔..
    -----------------
    శంకరాభరణం 23, ఫిబ్రవరి 2019, శనివారం దత్తపది - 154 కరి - గిరి - దరి - సిరి

    నీహారిక ఫిబ్రవరి 23, 2019 6:58 AM

    సాగిలపడవలె దైత్యులు
    యోగులదేశమిక రివటయో యంకసిరిన్?
    దాగిరి ముష్కురులచటన్
    వేగిరపడు బెదిరి నీవు వెనుతిరుగకుమా
    --------------------

    శంకరాభరణం బ్లాగులో నీహారిక గారి పద్యం

    ReplyDelete
    Replies


    1. అదిగో నీహారికయున్
      సదనంబున పద్యమును పసందుగ వేసెన్
      అదియును దత్తపది! జిలే
      బి, దాగిన కళాత్మకత సభికుల నలరిచెన్!


      జిలేబి

      Delete
    2. ప్రొఫైల్ పిక్ ఎవరైనా పెట్టుకోవచ్చు. అది 2018 బ్లాగర్ ప్రొఫైల్.

      Delete