Friday, July 12, 2019

మిత్రత్వ వచస్శ్రీయుత చతుర వినోదపు పాయసమ్ము :)





మిత్రత్వ వచస్శ్రీయుత చతుర వినోదపు పాయసమ్ము :)


వావ్ ! మరీ జిలేబీయమే యిది :)


ఎంజాయ్ మాడి :)


జిలేబి

208 comments:



  1. మిత్రత్వ వచస్శ్రీయుత చతుర వినోదపు పాయసమ్ము :)


    వావ్ ! మరీ జిలేబీయమే యిది :)



    ఎంజాయ్ మాడి :)


    జిలేబి

    ReplyDelete
  2. మిత్రత్వ వచస్శ్రీయుత చతుర వినోదపు పాయసమ్ము :)
    VNR గారూ, meaning మాడి :((

    ReplyDelete
    Replies
    1. మిత్రులు వచ్చినపుడు శ్రీమతి చతుర పుస్తకం చూసి పాయసం చేసింది. తింటూ వినోదం పంచుకున్నాం అని. అంతేగా!

      Delete
    2. హ్హ హ్హ హ్హ, బాగానే ఉంది కానీ ఆ వాక్యంలో "పుస్తకం" గురించేమీ ఉన్నట్లు లేదే. అలాగే "చతుర" అంటే చతుర పుస్తకం కన్నా చతుర సంభాషణ అనేమో? 🙂

      ఇప్పుడు గుర్తొచ్చింది. పై వాక్యం వ్రాసినది లక్కాకుల వెంకట రాజారావు మాస్టారనుకుంటాను. తాత్పర్యం కూడా వారే చెబితే బాగుంటుంది.

      Delete
  3. నాకు అర్థమై 'పూడి'స్తేగా ఇతరులకు మీనింగ్ 'మాడడానికి'. ఇది మరీ "జిలేబీయమే" అని "జిలేబీ" గారే తల పట్టుకున్నారుగా పైన. ఇక మనమెంత?

    ReplyDelete
    Replies
    1. VNR గారూ,
      వైఎసార్ బ్రతికి ఉన్నపుడు కూడా వెర్రి నవ్వు నవ్వడం, వెన్నుపోటు అంటూ దెప్పిపొడవడం ఆనవాయితీగా వస్తుంది. జగన్ కూడా అలాగే నవ్వుతున్నాడు. చంద్రబాబు గారు విసిగిపోయి అసెంబ్లీకి రాకుండా చేయాలని 40 ఇయర్స్ ఇండస్ట్రీ, పెద్దమనిషి, రాక్షసుడా ....ఇవీ ఒక ముఖ్యమంత్రి మాటలు....హుందాతనం అనేది ప్రజలు ఇస్తే రాదు. జన్మత: సంక్రమిస్తే వస్తుంది.మనం అసెంబ్లీ సమావేశాలు చూడడం మానేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అంతకు మించి ఆ'షి"స్తే అత్యాశ అవుతుంది.

      Delete
    2. లెస్స పలికితిరి నీహారిక గారూ. నిజం, హుందాతనం ఓట్లతో రాదు. అందుకే నేను ఆ స్కూల్ చదువు ప్రస్తావన తెచ్చింది. పోనివ్వండి. మీరన్నట్లు మన కాలపు భావాలతో ఇప్పటి వారి ప్రవర్తన మీద ఆ'ష' పెట్టుకోవడం అనవసరం.

      Delete
    3. విన్నకోట వారూ, రామారావు ఆ కాలం వాడే కదండీ మరి ఆ కుక్క మూతి పిందెలు భాషేమిటి? ప్రధాన మంత్రిని, అందునా మహిళను, పట్టుకొని ఎన్ని దుర్భాషలు ఆడాడు. అదంతా ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ చలవేనంటారా కొంప తీసి.

      Delete
    4. ఆ కాలపు భావాలు అందరిలోనూ ఉండాలనేం లేదుగా? సరే, మనిద్దరం యుగాంతం దాకా ఇలా వాదించుకుంటూనే ఉండచ్చు. నా అభిప్రాయం స్పష్టంగా చెప్పలేకపోయానేమో. ఆఖరిసారిగా ప్రయత్నిస్తాను.

      అలనాడు రామారావు అలా అనలేదా, తర్వాత రాజశేఖరరెడ్డి ఇలా అనలేదా, చంద్రబాబు మాట్లాడినదేమిటి .... ఎల్లకాలం ఇలాగే అనుకుంటూ కూర్చుందామా? ఆనాడు వాళ్ళు అన్నారు కాబట్టి ఇప్పుడు నేనూ అలాగే మాట్లాడతాను అనే సమర్థింపుతో అదే అన్-పార్లమెంటరీ పద్ధతినే ఆనవాయితీగా కొనసాగిద్దామా? సరే, అలనాడు వాళ్ళలా మాట్లాడారు అనుకున్నా ఈ రోజు నాయకులు అవన్నీ తవ్వుకోకుండా ఫ్రెష్ స్టార్ట్ తో ఆదర్శప్రాయంగా నిలబడవచ్చుగా (జీరో బడ్జెట్ లాగా అనుకోండి ... ఒక రఫ్ పోలిక చెప్పాలంటే). ఇప్పటి వాళ్ళు సంస్కారవంతంగా మాట్లాడవచ్చుగా? ఎక్కడో ఒకచోట పాతవన్నీ కప్పెట్టేసి కొత్త ఒరవడి మొదలుపెట్టచ్చుగా? ప్రజలందరూ హర్షిస్తారు.

      ఇదీ ఈ విషయంపై నా కామెంట్లలోని కవిహృదయం.

      Delete
  4. వీ ఎన్ ఆర్ గారూ ,
    భుట్ జొలోకియో బ్లాగ్ ఎవరు వ్రాస్తున్నారో గుర్తుపట్టారా?

    ReplyDelete
    Replies
    1. ఆ పదానికి అర్థమే తెలియడం లేదు, ఇంకేం డిటెక్టివ్ పని చేస్తాం? అయినా మీరడిగారు కాబట్టి మరోసారి ఆ బ్లాగ్ లోకి వెళ్ళి చూశాను. వ్రాస్తున్నది హరిబాబు గారంటారా?

      Delete

    2. నాకు తెలిసిపోయిందోచ్ :)

      నా ఫీలింగ్ ఏంటంటే .... :)



      జిలేబి

      Delete
    3. హరిబాబుగారు కాదు....గెస్ చేయండి...వ్రాసిన విధానం చూస్తే ఈజీగా తెలిసిపోతుంది.

      Delete
    4. >>>>ఇక్కడ నిజాయితీగా ఒక విషయం చెప్పుకోవాలి నేను. మేడం క్యూరీ, నా ఫేవరిట్ సైంటిస్టుల్లో ఒకరు. ఆడవారు సైన్సులో అద్బుతాలు సాధించడం మీద నాకు ఎలాంటి వ్యతిరేకతా లేదు. నేను వాల్లను మనస్పూర్తిగా అభినందిస్తాను కూడా ! కాకపోతే వచ్చే చిక్కంగా “ఫెమినిస్టులు పూసే మసాలాల” తోనే !>>>>

      ఈ పేరా చదివితే ఈజీగా గుర్తుపట్టేయవచ్చు.

      Delete
    5. @ బహుశా 498 శ్రీకాంత్ అనుకుంటా.

      Delete
    6. బ్లాగుల్లో ఉన్న ఏకైక స్త్రీ వాది ప్రవీణ్...ఆ బ్లాగ్ ప్రవీణ్ ది కాదు....ప్రవీణ్ తెలుగు బాగా వ్రాస్తారు.
      బ్లాగుల్లో ఉన్న ఏకైక (masculinist )భార్యా భాదిత సంఘ అద్యక్షుడిదే ఆ బ్లాగ్...ఇన్ని హింట్ లు ఇచ్చినా కనుక్కోలేకపోయారు. మిమ్మల్ని పాఠక సూపర్ స్టార్ పదవి నుండి తొలగించవలషిన సమయం వచ్చేసినట్లుంది.
      Winner is Mr.Surya.

      Delete
    7. నా కిరీటాన్ని సూర్య గారి తల మీద పెడుతున్నాను. అభినందనలు మిస్టర్ సూర్య 💐.

      ఆ శ్రీకాంతుడెవరో నేను చదివినట్లు గుర్తు లేదు. వారికి ఈ మిరపకాయ్ బ్లాగ్ కాక వేరే బ్లాగేమన్ళా ఉందా? ఉంటే లింక్ ఇవ్వండి. (ఆ "498" ఏమిటి?)

      Delete
    8. VNR గారూ,
      మీరు వచ్చేనాటికి బ్లాగ్ వ్రాయడం తగ్గించారు. శుక్రాచార్యుల నామధేయము. నేను కమెంట్స్ డెలిట్ చేస్తున్నట్లు వారు బ్లాగులు డెలిట్ చేస్తుంటారు. రాయలసీమ మిర్చి ఘోటక బ్రహ్మచారి. ఆడవాళ్ళు అన్యాయంగా వేసే 498 కేసులపై వాదిస్తుంటారు.

      మీరేమిటీ రాహుల్ గాంధీ గారిలా పదవీత్యాగం చేసేసారు ? వెళుతూ వెళుతూ మరొకరిని మీరే నియమిస్తారా ? ఇది అన్యాయం కదా ? బ్లాగర్లు పాఠక సూపర్ స్టార్ ని ఎన్నుకుంటారు. మీకు సదరు మిర్చీ గురించి తెలియదు కనుక చెప్పలేకపోయారు కాబట్టి మరికొంతకాలం మీరా పదవిలో కొనసాగగలరని ఆశిస్తాను.

      Delete
    9. నీహారిక గారు,
      ఆ "శుక్రాచార్యుల" వారెవరో వ్రాయడంతగ్గించారా లేక తన బ్లాగ్ జెండానే ఎత్తేశారా? మీరే ఒక Deletion Queen అనుకుంటే మిమ్మల్ని మించినవారున్నట్లున్నారే ?

      మనం పుట్టిపెరిగిందే త్యాగధనుల దేశంలో. రాహుల్ గాంధీ స్ఫూర్తి అవసరం లేదు. అయినా, // "మిమ్మల్ని పాఠక సూపర్ స్టార్ పదవి నుండి తొలగించవలషిన సమయం వచ్చేసినట్లుంది." // అని మీరే అన్నారుగా. ఆ అవకాశం మీకెందుకివ్వాలని అనుకుని ముందే తప్పుకున్నానన్నమాట.
      // "వెళుతూ వెళుతూ మరొకరిని మీరే నియమిస్తారా ? ఇది అన్యాయం కదా ? " //. నేను కూర్చోబెట్టినది pro tem గా అన్నమాట☝️. పర్మనెంట్ పదవి ఎవరికివ్వాలో మీరు తేల్చుకుని / ఎన్నుకుని ఆ .ప్రకారం "ముందుకు వెళ్ళండి" 👍.
      // "మీకు సదరు మిర్చీ గురించి తెలియదు కనుక చెప్పలేకపోయారు కాబట్టి మరికొంతకాలం మీరా పదవిలో కొనసాగగలరని ఆశిస్తాను." // నహీఁ. చెప్పలేకపోతే పదవి నుంచి తీసెయ్యాలి గానీ మరికొంత కాలం కొనసాగించడానికి ఇదేమన్నా ఏలినవారి కులానికి సంబంధించినవారికిచ్చే పదవా?

      Delete

    10. వీయెన్నార్ గారిని లోక్ సభాద్యక్షులు‌ గా వేసి వుండాల్సింది :)

      అన్యాయంగా కాంప్లయెన్సు సెల్లు లో పెట్టి నాన బెట్టిరి బ్యాంకాసుములు :)



      జిలేబి

      Delete
    11. లోక్ సభాద్యక్షులు అంటే పిడకల వేట భరించాలి. విన్నకోటవారిది కాగ్ వ్యవహారం. you are incorrigible అంటూ అక్షింతలు వేసే పని. కాగ్ అక్షింతలు వేస్తే ఎవరు పట్టించుకుంటారులెండి ?!

      Delete
    12. // " అక్షింతలు వేస్తే ఎవరు పట్టించుకుంటారులెండి? " //

      ఇది కరక్ట్ నీహారిక గారూ. ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు,

      Delete
  5. Agree with you sir. Jagan should set an example by talking in a dignified manner. Still చంబా పచ్చసోదరులతో కలిసి కోడి కత్తి పార్టీ అని, క్రిమినల్ అనీ రాక్షసుడు అనీ అవహేళన చేసినప్పుడు తిట్టించినప్పుడు ఎందుకని ఎవరూ మాట్లాడలలేదు. పచ్చ అనుకుల మీడియా విషం కక్కినప్పుడు మీవంటి వారు ఖండించలేదే. సబబులు చెప్పలేదు.

    ReplyDelete
    Replies
    1. కోడికత్తి ఘటన జరిగింది కాబట్టి కోడికత్తి పార్టీ అయింది. క్రిమినల్ అని సీబీఐ నే అంటోంది. ఆ విషయం ఇంకా తేలలేదు. ఇక రాక్షసుడు అనడం తప్పు. దానికి బదులుగా ఇవతలి వారుకూడా నారాసుర పదప్రయోగం చేశారు కాబట్టి చెల్లు.

      Delete
    2. @ Surya garu,
      రాక్షసుడు అని అన్నది జగన్....నారాసుర అని కూడా అన్నారు

      Delete
    3. మరింకేం? మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్లుంది (సామెత, సామెత 🙂).

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. Correction please:

      సామెతలు సత్తుబండలు సడే సంబడం!

      మొగుడు కొట్టినందుకు కాదు ఏరాలు పళ్ళికిలించినందుకన్నట్టు ఎన్నికలలో పరాభవం కంటే
      పరాచికాలు పెరిగినందుకు బాధ ఎక్కువయినట్టు అగుపిస్తుంది.

      నాయుడోళ్ల ఇంటికాడ నల్ల తుమ్మ చెట్టు నీడ ...

      Delete
    6. ఇప్పటికీ జగన్ నేరస్థుడిగానే కనపడుతున్నాడు. 18 నెలలు జైలులో ఉండి ముఖ్యమంత్రి అయినవారు ఎవరన్నా ఉన్నారా ? కాస్త హుందాగా ఉంటే అయ్యో అనవసరంగా అనుమానించామే అన్న బాధ అయినా ఉండేది.

      Delete
    7. "18 నెలలు జైలులో ఉండి ముఖ్యమంత్రి అయినవారు ఎవరన్నా ఉన్నారా"

      https://www.business-standard.com/article/current-affairs/from-vajpayee-to-jaitley-leaders-who-fought-against-1975-emergency-118062600433_1.html

      గమనిక: ఇది పాక్షిక చిట్టా మాత్రమే. ఎవరెవరు ఎన్నెన్ని రోజులు జైళ్లలో ఉన్నారు & వారిలో ఎవరెవరు ఏయే పదవులు అనుభవించారు వగైరా వివరాలు కావాలంటే గూగులమ్మ సాయం తీసుకోవచ్చును.

      న్యాయస్థానాలు నిర్ధారిస్తే తప్ప (ఉ. లాలూ ప్రసాద్) ఎవరూ నేరస్థులు కారన్నది ప్రాధమిక సూత్రం. అక్కరలేదు నేనే తీర్పు చెప్తానంటే సంవిధానం ఒప్పుకోదు.

      Delete
    8. Ha ha ha జై గారు, మీరిచ్చిన లింక్ బాగానే ఉంది. అయితే దానిలోని సమాచారం అంతా ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ సందర్భంగా జైలులో పెట్టబడిన ప్రముఖ నాయకుల గురించి.

      నీహరిక గారి ప్రశ్న లోని కవిహృదయం వేరే అనుకుంటాను. నీహారిక గారి తరపున వకాల్తా తీసుకోవడం లేదు గానీ వారి ఉద్దేశం ఆర్థిక నేరాలు, ఇతర నేరాలు చేసి జైలుకు వెళ్ళిన వారిలో తరువాత రోజులలో ముఖ్యమంత్రి అయినవారు ఎవరన్నా ఉన్నారా అని అడగడం అని నాకు తోస్తున్నది (నేరస్తుడుగా తర్మానించవలసినది కోర్టే లెండి, సందేహమేమీ లేదు. వారంటున్న నేరస్తుడు అనేది broad గా wide గా తీసుకోవాలేమో ఇక్కడ చర్చ నిమిత్తం?). కాస్తో కూస్తో దగ్గరగా వచ్చేది లాలూ ప్రసాద్ యాదవ్ ఉదాహరణ ... కాకపోతే ఆయన ముందు ము.మం. గా చేశాడు, తరువాత జైలుకు వెళ్ళాడు.

      అలా అంటే ఒక పాత జోక్ గుర్తొచ్చింది. What is the difference between a criminal and an Indian politician? అని అడిగితే A criminal commits the crime first and then goes to jail; an Indian politician goes to jail first and then commits the crime అని జవాబిచ్చారట ఎవరో.
      ఈ జోక్ బ్రిటిష్ వారి వలస పాలన అంతం అయిన కొత్తలోనిది, బ్రిటిష్ వారి హయాంలో జైలుకు వెళ్ళిన కాంగ్రెస్ నాయకుల గురించి అనిపిస్తుంది. కానీ విచిత్రంగా 70 ఏళ్ళ తరువాత ఇటీవల కాలంలో ఇండియన్ పాలిటిక్స్ లోకి అటువంటి వారు ప్రవేశించట్లలేదని గట్టిగా చెప్పలేమేమో?

      Delete
    9. గురువు గారూ, మీరు "ఇతర నేరాలు" అన్నారు కాబట్టి బరోడా డైనమైట్ కేసు జార్జ్ ఫెర్నాండెస్ ఉదాహరణ సరిపోతుందేమో. డా. సుబ్రహ్మణ్యం స్వామి విదేశాలకు "వేంచేసారు" కానీ ఆయన మీద ఉన్నవీ క్రిమినల్ కేసులే.

      లాలూ ప్రసాద్ నేరాలు నిరూపించబడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన పార్టీతో చేయి కలిపేందుకు రాహుల్ నుండి చంద్రబాబు దాకా వెంపర్లాడారు.

      నవజ్యోత్ సిద్ధు, జమ్మలమడుగు శివారెడ్డి, రేవంత్ రెడ్డి, కనిమొళి: ఇట్లా చెప్పుకుంటే పొతే వేలాది ముద్దాయిల పేర్లు. అవేవీ వద్దు "మనవాళ్ళు" చెప్పింది మాత్రమే నమ్ముతాము అంటే చేయగగలింది లేదు.

      నిన్నటికి నిన్న టీడీపీ పార్టీలో "గుళ్ళో కొబ్బరిచిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి,కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకి, పైరవిదారుల" ఉన్నారని సొంత ఎంపీ గారే సెలవిచ్చారు.

      (Excellent example of debating courtesy)

      https://twitter.com/kesineni_nani/status/1150374182842011648

      జగన్ నేరగాడని, పైగా కడప గూండా అని, ఇంకా ముఖ్యంగా దేవుని బిడ్డడని బోలెడు ప్రచారం జరిగింది, కొనసాగుతూనే ఉంది. స్టేలు తెచ్చుకుంటూ మచ్చ లేని నాయకుడిగా పేరు మోసిన వ్యక్తి "ప్రశాంతమయిన గోదావరి జిల్లాలలో పులివెందుల రౌడీలు కావాలా తమ్ముళ్లూ" అంటూ దండోరా వేసాడు: జనం ఇచ్చిన జవాబుకు అవాక్కయ్యాడు.

      Delete
    10. తెగులు తమ్ముళ్ల కొట్లాటలో ఇంకో "సున్నిత" స్పందన:

      "దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ"

      "ఒకే నంబర్ పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగ"

      https://twitter.com/BuddaVenkanna/status/1150397562546868224

      ఇవండి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో అలనాటి పగటి వేషగాడి "కుక్కమూతి పిందెల" వారసులు వాళ్ళ మీద వాళ్ళే వాడుకునే సుభాషితాలు. కొత్త ఒరవడి & ఫ్రెష్ స్టార్ట్ అడిగారు కనుక మొదలెట్టినట్టున్నారు.

      Delete
    11. నిన్న గాక మొన్ననే కదండీ //కొత్త ఒరవడి & ఫ్రెష్ స్టార్ట్// అని అడిగాను, అప్పుడే మొదలెట్టేశారా? Compliance level గట్టిగానే ఉన్నట్లుందే?

      Delete
    12. డా. సుబ్రహ్మణ్యం స్వామి విదేశాలకు "వేంచేసారు" కానీ ఆయన మీద ఉన్నవీ క్రిమినల్ కేసులే.
      link please.

      Delete
    13. జై గారూ,
      నేను అడిగింది హుందాతనం గురించి...నేరాల గురించి కాదు. మీరు కూడా మరీ దిగజారి 40 ఇయర్స్ అంటూ కమెంటనవసరం లేదేమో ? మీరు కూడా చిన్నపిల్లవాడేమీ కాదు కదా ? ఇతరులను అవమానించకుండానే చెప్పదలుచుకున్నదాన్ని విన్నకోటవారు సూటిగా చెపుతున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి అభిమానులెవరూ లేరు. మీరు గమనిస్తే మీకే మంచిది.

      Delete
    14. @నీహారిక:

      "link please"

      https://www.thequint.com/news/india/the-masters-of-disguise-during-emergency

      "Quick on the heels of an arrest warrant with his name on it, Subramanian Swamy, disguised as a Sikh, escaped to Chennai, then Sri Lanka – and finally to the United States where he became a spokesperson for the Jan Sangh"

      Also see:

      https://rajyasabha.nic.in/rsnew/privileges_digest/priv-19.pdf

      Delete


  6. ఏదైనా మా జగను బాబు వల్లే :)


    వైకాపా ఘనతండీ!
    మాకందంబాయె ముఖ్య మంత్రి చలువగా,
    డ్వాక్రా మహిళలు వేయగ
    కాకర, తీఁగలకు నల్లకలువలు పూసెన్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "ఉందిలే మంచికాలం ముందు ముందునా" 😇

      Delete


  7. తొలకరి జల్లు మీదపడి తొయ్యలి మేనియు తూగగానటన్
    నలతను తీర్చగా సతికి నమ్మిక గొల్పుచు మోజు తీర్చ సై
    చెలువము మీరగా పతియె చెంగట చేరుచు ముద్దులీయగా
    కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ!


    జిలేబి

    ReplyDelete
  8. బుచికి గారు,
    సంస్కారరహితంగా ఎవరు మాట్లాడినా నేను హర్షించను. నేనెప్పుడూ ఆ అభిప్రాయంతోనే ఉంటాను .... ఆనాడు రామారావు, చంద్రబాబులయినా, ఈనాడు జగన్ అయినా. ఇక అప్పుడెందుకు సబబులు చెప్పలేదంటారా .... ఖండిస్తూ చెప్పడం నా సాధారణ అలవాటే. చెప్పే ఉంటాను అనుకుంటున్నాను, కానీ సరిగా గుర్తు లేదు ... వయసు పెరుగుతుంటే జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది కదా, కాబట్టి యువతరం వారికున్నంత గట్టిగా గుర్తుండకపోవచ్చు. ఒకవేళ అప్పుడు ఎందుకు స్పందించలేదు అంటే ఇప్పుడు కారణాలు చెప్పలేను, గుర్తు లేదు, ఇతరత్రా కారణాలేవో ఉండి ఉండచ్చు.

    అభిప్రాయభేదాలున్నప్పటికీ, ఎంత రాజకీయాలైనప్పటికీ మాటతీరు సంస్కారవంతంగా లేకపోతే జుగుప్స కలుగుతుంది. ముఖ్యంగా చట్టసభలలోను, సమావేశాలలోను, పబ్లిక్ వేదికల మీదనూ హుందాగా మాట్లాడడం అవసరం. అసలు ఆ మాటకొస్తే ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ... పబ్లిక్ గా, ప్రైవేట్ గా ... అదే మర్యాదపూర్వకమైన పద్ధతి అవలంబించడం ఉత్తమం అని నా నమ్మకం.

    ఎప్పుడూ సంస్కారవంతమైన మాటపద్ధతినే అనుసరించాలి అనే సందర్భంగా ఇది గుర్తొస్తుంటుంది నాకు --> George Bernard Shaw గారి నవల "Pygmalion" ఆధారంగా 1960లలో తీసిన హాలివుడ్ musical hit "My Fair Lady" లో (Act Two, Scene 5) ముఖ్యపాత్ర Prof.Henry Higgins మరొక ముఖ్యపాత్ర Eliza Doolittle తో అంటాడు --> "The great secret, Eliza, is not having bad manners or good manners or any other particular sort of manners, but having the same manner for all human souls." దీనికి at all times అని మనం కలుపుకోవచ్చు కూడా.

    ఇకనైనా మన నాయకులు ఈ అన్-పార్లమెంటరీ భాషకు ఫుల్ స్టాప్ పెట్టి, ఎల్లవేళలా సంయమనంతో మాట్లాడుదాం అని సంకల్పించుకుని ముందుకు వెడితే బాగుటుంది.

    ReplyDelete
    Replies

    1. మధ్యలో బుచికీ ఎక్కడినుంచి వూడిపడ్డాడు ?/ :)


      జిలేబి

      Delete
    2. "బుచికి Jul 13, 2019, 12:48:00 AM
      Agree with you sir. Jagan should set an example by talking in a dignified manner"
      అంటూ పైన కనిపిస్తారు చూడండి "జిలేబి" గారూ ☝️
      (btw, వారి కామెంట్ నా వ్యాఖ్యకు స్పందనే అని నేను ఫీలయిపోయి నా ప్రతికామెంట్ పెట్టానన్నమాట🙂)

      Delete
  9. "Idiprapancham ఇదీ ప్రపంచం" బ్లాగ్ లో sistla వారు " "ఆంధ్రా తెలంగాణా రాజకీయాలు పరిపాలన గమనిస్తుంటే అసలు తెలుగు జాతి అంటేనే రోత పుడుతోంది" అని వ్యాఖ్యానించారు. నాదీ అదే అభిప్రాయం. ఈ సందర్భంగా ... భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి జరుగుతున్న బిల్లు చర్చలో బ్రిటిష్ మాజీ ప్రధాని సర్ విన్స్టన్ చర్చిల్ (Sir Winston Churchill) బ్రిటిష్ పార్లమెంట్ లో అన్నారని చెప్పే వారి ఈ అభిప్రాయం గుర్తొస్తుంటుంది.

    “If Independence is granted to India, power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre and men of straw. They will have sweet tongues and silly hearts. They will fight amongst themselves for power and India will be lost in political squabbles. A day would come when even air and water would be taxed in India.” "

    నేనేమీ తెల్లవాడి ఆరాధకుడిని కాను గానీ చర్చిల్ గారి ఆ దూరదృష్టి మాత్రం చాలా పాళ్ళు నిజం అనిపించక మానదు .... ఆంధ్రా, తెలంగాణా మాత్రమే కాదు దేశంలో పలు చోట్ల ఇలాగే ఉంది.

    ReplyDelete
    Replies
    1. @విన్నకోట నరసింహా రావు:

      మీకు కెసిఆర్ & జగన్ (బహుశా మోడీ, ప్రశాంత్ కిషోర్, నరసింహన్ కూడానేమో) ఇష్టం కాదు. అంత మాత్రాన దేశం మీద విరక్తి పుడితే ఎట్లా?

      ఉప్పు మీద సైతం కన్నేసి పన్నేసినోళ్లు వాళ్ళు మనకు స్వతంత్రం ఇవ్వడం ఏమిటి గురువు గారూ? కుదిరినప్పుడు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అంటూ విర్రవీగారు, ఎదురు తిరిగినప్పుడు తోక ముడిచారు. నల్లోళ్లు ఎళ్ళగొట్టారు అన్న వాస్తవం ఒప్పుకుంటే జనం ఛీకొడతారని "స్వతంత్ర చట్టం" అంటూ తలతిక్క చిత్తూ కాగితాలు పుట్టించారు.
      పోగాలం ముంచుకొచ్చినప్పుడు పిల్లి శాపాలు పెట్టారు.

      చరిత్రలో ఇటువంటివి సహజం. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఆధిపత్య పీఠం చేజారిన నరపతులు après moi, le déluge అని నిష్టూరాలాడారు. బూర్బాన్ (రాజరికం, విస్కీ కాదు) చెత్త బుట్టలో కలిసి రేపు (జులై 14) 230వ బాస్టిల్ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు.

      తెలంగాణా ఏర్పడితే హైదరాబాదులో ఉన్న ఆంధ్రులను తరిమి కొడతారని, మతకల్లోలాలు పేట్రేగుతాయని, దేశం మళ్ళీ 565 ముక్కలవుతుందని, చీకటి రాజ్యం అవుతుందని, ఇంకా ఏమేమో అనర్థాలు జరుగుతాయని మన బ్లాగుల్లోనే కొందరు "మహనీయులు" నోటికొచ్చిన శాపనార్తాలు పెట్టారు.

      అక్బర్ ఇలాహాబాదీ అన్నట్టు:

      हम आह भी करते है हो जाते है बदनाम
      वो खाटल भी करते है तो चर्चा नहीं होता

      Tiocfaidh ár lá

      Delete
    2. ప్చ్ ఏం చేస్తొం జై గారూ, కొందరికి కొందరంటే పడదు, మరికొందరికి మరికొందరంటే పడదు 🙂.

      (అంత మాత్రాన నేను ఏదీ ఒప్పుకుంటుంన్నట్లు కాదు సుమా)

      Delete


  10. నేనను కున్నది చెప్పే
    సానంటే కోపము నను చంపదిక జిలే
    బీ! నేనాపై చట్టని
    నేనుడివిన దాన్ని వెంటనే తొలగిస్తా :)


    నేనన్లే :)


    జిలేబి

    ReplyDelete


  11. ఎవడోయీ శ్రీకాంతుడు ?
    ఎవడాతండు నరసన్నకే తెలియక వా
    డెవడోయీ ! యెచ్చటివా
    డు? వాడి కులగోత్రముల కడుగుడు వెసవెసన్ :)



    జిలేబి

    ReplyDelete
  12. పిడకలవర్షం కురిసినట్టు ఈ చైనా భాష పద్యాలు ఎందుకు జిలేబీ గారు. పుత్తడిబొమ్మ సినిమాలో సుత్తి వీరభద్రరావు తవికలు తలపిస్తున్నాయి.

    ReplyDelete
    Replies

    1. భడవాయ్ ! గుమ్మడి కాయ దొంగెవర్రా అంటే నేకాదన్నాట్ట వెనకటి కెవడో ! ఆ కత గుర్తుకొచ్చె :)

      శ్రీకాంతుడి మీద పద్యము కడితే బుచికీ వచ్చెనేమిటి :)


      ఇది నా ఫీలింగు మాత్రమే స్మీ :)

      జిలేబి

      Delete


  13. ఏల జిలేబీ బుచికీ
    లేలా ! మా తల తినంగ నేలా పూబో
    డీ !లావొక్కింతయు లే
    దే! లలనా!కరుణ జూపు తెలుగుని‌ కావన్ :)


    జిలేబి

    ReplyDelete


  14. పిడకల వర్షంబువలెన్
    గడగడ లాడించు రైలు గాడీ వలె నీ
    లొడలొడ పద్యమ్ములతో
    భడభడ మాపై జిలేబి వాలంబేలా :)


    జిలేబి

    ReplyDelete

  15. లాలించుము నీవా గో
    పాలుని ముదమారగాను బాలకుమారీ !
    కాలేయము కుంటువడెను
    లేలే నా రాజ యనిన లేవఁడు రాణీ!


    జిలేబి

    ReplyDelete


  16. సువిశాలమ్ముగ నా తెలు
    గు విభుండా రాయలు తెరగున పద్యముల
    ల్లి వరలిన నేల! బుచికీ
    కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్!


    జిలేబి

    ReplyDelete


  17. సువిశాలమ్ముగ పద్యముల్ తెనుగులో శోభిల్ల రాజ్యంబు నే
    లి వధాన్యుల్ సదనమ్ములోన వరలన్ లెస్సంగ పోషింప ము
    న్ను విరాజిల్లుచు కృష్ణరాయలె సుమా నొప్పారగాలేని యే
    కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మున
      న్చవుగాముల్ గనలేక పల్కెదరు , లేనా నేను , గ్రామీణ భా
      ష వకాల్తా గొని , యెల్ల వారలును రాజా వారి పద్యాలు తె
      ల్గు వెలుంగుల్ వెల్గ , భాసిలు ననన్ ఘోషించుటల్ తెల్వదా ?

      Delete

    2. తెలుసును తెలుసును రాజా
      పలికితిమి తెలియక నయ్య పండిత సభలో :)


      జిలేబి

      Delete
    3. ఉలుకూ పలుకూ తెలియని
      బలు పండిత మన్యులకు సభా గౌరవమా ?

      Delete


  18. పిడకల్నేయడము, జిలే
    బి డమడమల కందము గడిబిడి లేకన్ వ్రా
    యడము సులభమ్ము కాదోయ్
    విడువక యత్నమును చేయ విరివిగ వచ్చున్ :)


    జిలేబి

    ReplyDelete


  19. యానమ్మది నిలువంగను
    మానమ్మది దక్కె సూవె మా యిస్రోకున్
    యేనాటికైన సత్యం
    బే నిలుచు జగత్తులోన బేలా వినవే !


    జిలేబి

    ReplyDelete


  20. ఎంతసొగసుగా నుడివిరి
    వింతగ బుచికీ జిలేబి విధములనరె మీ
    రెంత సొబగుగా చెప్పిరి
    పుంతలు తొక్కెను కమింటు పువుబోడియ పై :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఒక తీపి వంటకానికి వెన్నుపూస మీద కాలు పెట్టు తొక్కినంత తేలిక.😐😊"
      Super....

      Delete
  21. నీహారిక గారు,
    మీ ప్రొఫైల్ బొమ్మ మార్చినట్లున్నారే. ఆ ముగ్థ రైతువనిత బొమ్మ బాగుందనుకున్నాంగా, కానీ మార్చారే?

    ఈ కొత్త బొమ్మ కూడా బాగుంది. ఇది మీ ఇంటి ఫొటో అని నా అంచనా, మీరు ఏమంటారు?

    ReplyDelete
  22. మా "రమ్యంగాకుటీరమే" vnr గారూ

    ReplyDelete


  23. అనిపించిందండీ మా
    కనిపించిందండి చూడ కనులారన్ మా
    కనిపించెను నీహారిక
    మణుగులు పొదిగిన కుటీరమనుచు జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  24. అదిగో మళ్లీ వచ్చే
    రదె నోరు తిరగని పదము రాయా మాక
    వ్వి! దరిమిలా మా కర్థం
    బదికాలె! జిలేబిమయపు పదసంపదయో !


    జిలేబి

    ReplyDelete


  25. అనవసరమైన నసుగు
    ళ్ళనాదరించె మన మీడియా యజ్ఞాన
    మ్మన నిదియె జిలేబీ! వీ
    ధిని పడి కొట్లాడుకొనెడు తింగరి బుచ్చీల్!


    జిలేబి

    ReplyDelete


  26. పదము లేలేక పద్యము పారె వేగ
    ముగ జిలేబి వ్రాయ వరుస ముత్య మల్లె
    తలపు మంచిదైన హరిమ, తరము గాను
    మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె


    జిలేబి

    ReplyDelete


  27. ధ్యానమ్ములోన ధ్యానము
    జ్ఞానమ్మున జ్ఞానమున్ విచారింపంగన్
    పానీయములో దాగిన
    తేనీరువలె బతుక దగు తీరము చేరన్ !


    జిలేబి

    ReplyDelete
  28. హుందాతనానికి మరో చక్కని ఉదాహరణ:

    https://twitter.com/realDonaldTrump/status/1150381394234941448

    So interesting to see “Progressive” Democrat *Congresswomen*, who originally *came from* countries whose governments are a complete and total catastrophe, the worst, most corrupt and inept anywhere in the world (if they even have a functioning government at all), now loudly......

    https://twitter.com/realDonaldTrump/status/1150381395078000643

    ....and viciously telling the people of the United States, the greatest and most powerful Nation on earth, how our government is to be run. Why don’t *they go back* and help fix the *totally broken and crime infested places* from which *they came*. Then come back and show us how....

    PS: emphasis added by Jai

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. @ Jai Garu,VNR Garu,

      హుందాతనానికి మరో చక్కని ఉదాహరణ:
      https://www.youtube.com/watch?v=vP9JAFTUPhE

      Delete

    3. ఏమండీ నీహారిక గారు

      స్పెసిఫిక్ గా జైగొట్టి వారిని‌ వుద్దేశించి ఈ‌ లింకు ఇవ్వడంలో ఏమైనా స్పెషల్ వుద్దేశ్యముందా ?



      జిలేబి

      Delete
    4. నీహారిక గారూ,

      నేను మామూలుగానే వీడియోలు చూడను, ఇది మరీ పొడుగ్గా ఉంది కనుక నా వల్ల కాదు.

      ప్రతిపక్షానికి "రిజర్వ్" అయిన పీఏసీ పదవి దక్కించుకోవడంతో పయ్యావుల "కసబ్" అదృష్టం పండింది. అమెరికా తందానా కులసంఘ ఉత్సవాల మహిమ కాబోలు.

      https://twitter.com/realDonaldTrump కు సాటిగా హుందాతనంలో నూతన ఒరవళ్లతో పోటీ ఇవ్వగల మరో నాయకుడు నిన్ననే గద్దెనెక్కాడు.

      https://twitter.com/BorisJohnson

      Delete
    5. జిలేబి

      @జిలేబి గారూ
      జై గారిని కెలికితే విష(o)యాలు తెలుస్తాయి కదా అని అడిగాను. జై గారు పాజిటివ్ విషయాలని కూడా ఎంత నెగటివ్ గా తీసుకుంటారో చూసారుగా ?

      Delete


  29. విలువైన నాభరణ మీ
    వె! లతాంగీ! పద్మ నయన వీవు సుమా నీ
    కులకుల కేల నగలు గో
    లల మధ్యన వెలిగెడు సుమలావణ్యవతీ !


    జిలేబి

    ReplyDelete


  30. గంత గనపు పాపంబే
    మంతగ చేసితివె పద్మ మగరాణీ నీ
    వింతగ వయ్యా రమ్ముల
    పుంతలు తొక్కంగ మరిచి పూబోడివిగా :)


    జిలేబి

    ReplyDelete


  31. మనసుని తడిబార్చెను ప
    ద్మ! నీపదమ్ములు ! జిలేబి ! తరుణీ ! పువుబో
    డి! నెలతుక ! కురంగనయన !
    పనితనమన్న నిదియే సుభాషిణి ! రమణీ !


    జిలేబి

    ReplyDelete


  32. ఈ ఘను లైన మానవుల యీర్ష్య దురాశల కారణమ్ముగా
    మేఘము లన్ని యున్ పుడమి మీదు నిదానము లేక బోవగా
    శ్రీఘను డాతడే కరుణ చేర్చి తపస్సుని ధారవోయగా
    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే?


    జిలేబి

    ReplyDelete



  33. ఎట్టెట్టా ! కవి రాట్ మీ
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో?
    గిట్టని వాళ్ళయ్యుంటా
    రట్టాంటి మడుసుల గోల రాభస గోలే !


    జిలేబి

    ReplyDelete


  34. గిట్టని వాళ్ళక టకటా !
    దట్టించుచు ముక్కుపొడిని దండిగ నాపై
    పట్టదు వారల కయ్యా
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో!


    జిలేబి

    ReplyDelete


  35. చట్టని చెప్పుచు జనులే
    పుట్టిన దినమంచును, బొరిపొరి యేడ్చిరయో,
    గిట్టుట మొదలయ్యెనుగా
    తట్టదిదెప్పుడు జనులకు తద్దినముగనే!


    జిలేబి

    ReplyDelete


  36. కవితల్లో తిడు తున్నా
    ర,విస్మయమ్ముగ పొగుడుచు రారా యన్నా
    ర, విశారద! పద్మా తెలి
    య విదురులము కాము తల్లి! యమహో చిత్రాల్


    జిలేబి

    ReplyDelete


  37. తిరుమల లో వీయైపీ
    పరివేష్టిత దర్శనముల ప్రాబల్యము త
    గ్గు! రయము గా వెంకన్నను
    మరి చూడగలమట! అరె సుమతి జరుగునకో ?


    జిలేబి

    ReplyDelete


  38. అల్లుడ వైనావే మే
    నల్లుడ! పెండ్లమ్ముగా కనకనయనెడు మా
    పిల్లను గైకొని నావే
    ఇల్లరికమ్మేఁగ దోష మెట్లగు జగతిన్!


    జిలేబి

    ReplyDelete


  39. వచ్చిన‌ అల్లుడితో మామయ్య :)

    అల్లరి పిల్ల పెన్మిటిగ నయ్యరొ వచ్చతి వీవు ! రార మే
    నల్లుడ! నావలెన్ కుదిరి నమ్మిక గా గృహ మందు నెక్కొనన్
    మెల్లగ మేధి గా నిలిచి మెల్తుక నేలుకొనన్ బసాలుగా
    ఇల్లరికంపు టల్లుఁడుగ నేఁగుట యెట్లగు దోష మిద్ధరన్!



    జిలేబి

    ReplyDelete


  40. పలుచటి శవమ్ము వలె నా
    కలి గొన్నట్టి పిలకాయ కైగొని మహిళన్
    కలబురిలోచూసా నే
    ను! లకలకయె! దెయ్యమా కనులముందరగా?


    జిలేబి

    ReplyDelete


  41. కోరగ కొనమని బంగరు
    పారును మగడున్ జిలేబి వనమున కిపుడే
    తీరిక గా బువ్వెట్టుచు
    మారాముగ గోముగన్ సుమా అడుగవలెన్‌:)


    జిలేబి

    ReplyDelete

  42. కరుణాపయోనిధి కాడా? కనరాకూడదేమి‌ చిరునవ్వు ?


    మారాజు బిడ్డ డైనను
    నోరారగ బిల్చుచున్ మనోభీష్టములన్
    కోరికల తెలుప చిరునగ
    వా రాముని మోము చాయవాఱద యేమీ‌?


    జిలేబి

    ReplyDelete



  43. అలిమేలుమంగవకొ! నా
    చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో
    ములుగువకొ! జిలేబివకో
    యిలలో సర్వస్వమున్ పయిదలి చలువయే!


    జిలేబి

    ReplyDelete


  44. అలిమేలమ్మవొ!ఆమ్రపాలివకొ! నీవార్యాంబవో! శారదా!
    లలితాంగీ! సబలా! జిలేబి!కలికీ!లావణ్యమూర్తీ! నమో!
    కలకాలమ్మిల లోన నాయునికికై కైమోడ్చి కాల్మొక్కెదన్!
    చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో!


    జిలేబి

    ReplyDelete


  45. ఏ పని కైనా సిద్ధము
    గా పనితనమును జిలేబి గా మార్చి సదా
    యోపిక తో శుభ్రత తో
    డై పరిపరి విధములమర డంగై పోవన్ !


    జిలేబి

    ReplyDelete


  46. మా జగనుడి రాజ్యములో అమ్మ ఒడి :)


    పలకా బలపము చేర్చుచు
    పిలకాయల బడిని వేయ ప్రేరణ యిదిగో
    నెలకింతని దస్కమికన్
    చెలివో తల్లివొ వదినవొ జేజమ్మ వొకో!


    జిలేబి

    ReplyDelete


  47. లలితా యటంచు పిలువన్ ?
    లలితమ్మాయని పిలువ? కలకలయనగ ను
    జ్వల గృహమున? పలుకుపడతి?
    చెలివో? తల్లివొ? వదినవొ? జేజమ్మవొకో?


    జిలేబి

    ReplyDelete


  48. పరిపరి విధముల జనుల క
    సురుచు పదండిక పదండి చూచిరి చాలం
    చు రుసరుల తిరుమలలలో
    పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇది కరక్ట్. అచటకు పోనేల, వారితో కసిరించుకోనేల / తోయించుకోనేల?

      Delete


    2. పోనేల జిలేబి ? కసుర
      గా నీ పై చింత పడుచు కన్నీళ్ళేలా !
      కోనేటిరాయు డేమై
      నా నా తలమిదొకటే పునాదియనేనా ?


      జిలేబి

      Delete
    3. వీ ఎన్ ఆర్ గారూ,
      మీరు తిరుమల వెళ్ళరా ?

      Delete


  49. ఆకాశవాణి కి పంపించినది


    అరయన్ పుణ్యము కలుగును
    పరమాత్ముని సేవఁ జేయఁ ,బాపమె కల్గున్
    సరసీ జనులను హింసిం
    ప! రహివలయు జనుల యెడల ప్రభువుని గానన్!



    జిలేబి

    ReplyDelete
  50. తట్టలు చీపురుల్ గొనుచు దండుగమారి జనాలు వెంటరాన్
    గట్టిగ స్వచ్ఛభారత ప్రగాఢ నినాదము హోరులెత్తగా
    నెట్టన రాజకీయ ఘన నేతలు గుట్టల పుట్టలన్ వెసన్
    చుట్టగ లక్ష్యసిధ్ధి గని చోద్యముగా తిలకించి రందరున్ .

    ReplyDelete
  51. This comment has been removed by the author.

    ReplyDelete


  52. చూపేమైనా మంద
    మ్మా? పాపమ్మా జిలేబి మసకల్ బారే
    నా? పని గట్టుకొనెచ్చే
    వా? పద యేడగలవే బువా!చెప్పమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  53. ఆషాడంబాఫరిదే
    సోషల్మీడియ జిలేబి సొబగుల్ చూడా
    లే!షాదీహోనాతో
    భేషగు నిరుపత్నులే సుబేహ్ ఔర్ షామ్ కో :)



    జిలేబి

    ReplyDelete
  54. నీహారిక గారు,

    మీ "రమ్యంగాకుటీరాన" బ్లాగ్ "నైస్ బ్లాగ్ అండి. భలే బావుంది." 🙂

    "శోధిని"లో మీ బ్లాగ్ "బ్లాగులు" లిస్ట్ లో కనబడుతుంది కానీ వచ్చిన వ్యాఖ్యలు కనబడవు. "మాలిక"లో రెండు సెక్షన్లలోనూ కనబడదు. "ఎందుకలాగ"?

    సరే, మీ బ్లాగులో వచ్చిన వ్యాఖ్యలు మీరైనా చూస్తుంటారా?

    ReplyDelete
  55. VNR Garu,
    నా బ్లాగ్ చూసి మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు. ఇపుడు పెద్దగా వ్రాయాలనిపించడం లేదు. నా బ్లాగ్ శోధినిలో మాత్రమే వస్తుంది. ఎవరైనా కమెంట్స్ వ్రాస్తే అది శోధిని వ్యాఖ్యల విభాగంలో కనిపించవు. వ్యాఖ్యలు కనిపించకపోతే వ్యాఖ్యాతలు వ్రాయరు. నాకే ఇంట్రెస్ట్ లేదు కనుక శోధిని వారిని అడగడం కూడా మానేసాను. ఎపుడైనా ఫోటోలు మాత్రం పెడుతున్నాను. మీ వ్యాఖ్యకి సమాధానం ఇచ్చాను.

    ReplyDelete
    Replies
    1. కానీ "మాలిక" లో అసలు కనబడడం లేదే. ఆ సంకలినికి మీ బ్లాగ్ ని అనుసంధానించారా?

      Delete
    2. This comment has been removed by the author.

      Delete


  56. మాలికలో నుండయ్యా
    బాలాగుని గెంటిరయ్య బద్మాషుల వే
    షాలవియె! విన్నకోట
    న్నా! లెస్సా! మీరు చూసి "నారదె" పదివేల్ :)



    జిలేబి

    ReplyDelete
    Replies


    1. అప్పిడి యాయని యడిగిన
      నప్పిడి దా యనుచు చెప్పి నానప్పా ! నా
      తప్పిదమేమిటి తెలుపం
      డప్పా యన్న యునికియె గడబిడాయెనుగా :)


      జిలేబి

      Delete
  57. అప్పిడియా?
    పెద్ద అర్ధంకానట్లు....

    ReplyDelete


  58. వయసుడి గినట్టి జనులక
    భయమ్ము చేర్చంగ నిలుతు వారికి నావ
    ల్లయినంతగ బువ్వనిడుచు
    పయికంబడుగను నెవరిని పరిధిని‌ దాటన్ !


    జిలేబి

    ReplyDelete

  59. కొంప కట్టి చూచు కొనుటకు, అమ్మాయి
    చదువు కున్ జిలేబి చక్క నమ్మ
    పెళ్ళి కిన్ వరుసని పేరు కొనగ ఖర్చు,
    అప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద!


    జిలేబి

    ReplyDelete


  60. మిస్సన్న గారి బ్యాంకు మినహాయించి :)


    గప్పున బ్యాంకు లో వ్యయపు కార్డును సేంక్షను చేసి బాపురే
    చప్పున నింటి కై ఋణము సాంక్షను చేతుము రండి యంచు పి
    ల్చప్పటి కప్పు డే మనుజులన్ ధన వంతుల చేయ జూతురే!
    అప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్!


    జిలేబి

    ReplyDelete


  61. కవితా జంటకు శోభన
    ము! వసుంధరను విడిచి ష్టధుముడి పయిన జిలే
    బి వరుస లమరంగనహో
    పవిత్ర బంధమ్ము తోడు పద్మార్పితయై!


    జిలేబి

    ReplyDelete


  62. అయ్యిందా? పెళ్లయ్యిం
    దయ్యిందా యింతకీ ? సదనమున తెలుపం
    డయ్యిందా లేదా యని
    అయ్యయ్యో ! యేమి చంద్రయానపు కతయో :)


    జిలేబి

    ReplyDelete
  63. హేవిటో "జిలేబి" గారూ,

    "ఈసురో"మని మనుజులుంటే చందమామేగతి అందునోయీ?

    (గురజాడ వారి స్ఫూర్తితో 🙏)

    ReplyDelete
    Replies
    1. "ఈసురో"మనీ "ఇస్రో" ఉంటే అని అనుకోవచ్చా?

      Delete

    2. ఈసురో ! అదిరింది :)

      జిలేబి వ్రాయాల్సినది వికో‌న వారు రా సేసేరు :)



      జిలేబి

      Delete
    3. కవిహృదయం అదే.
      launching వాయిదా పడిన తరువాత వ్రాద్దామనుకున్నాను, చివరికి ఇప్పుడు వ్రాశాను. కొంచెం లేటు అయింది కదా 🙂?

      Delete
    4. సహవాస దోషమా, మజాకానా "జిలేబి" గారూ 🙂.

      Delete
  64. జిలేబీగారి చేత మార్కులు వేయించుకున్నారు ...ధన్యులు మీరు...పేరిడీలు లలితగారిదగ్గర నేర్చేసుకుంటున్నారల్లే ఉందే ?

    ReplyDelete
  65. థాంక్యూ థాంక్యూ నీహారిక గారూ.

    నేర్చుకోవడానికంటారా? ..... ఎందరో స్ఫూర్తిప్రదాతలు, అందరికీ ధన్యవాదములు 🙂.

    ReplyDelete
    Replies
    1. అంకుల్,
      కిడ్నాప్ చేయడానికి నేనే దొరికానా ? చిన్నపిల్లవాడిని వదిలేయండంకుల్...
      సినిమాల్లోలాగా చిన్నపిల్లలు ఆరిందాల్లాగా మాట్లాడుతుంటే గోజీలు అంతే కాబోలు...ప్చ్...

      Delete


  66. తమదగు మతము పాటింప తగును చూప
    వలె సహిష్ణుత నెల్లరి పట్ల మరియు
    పరమతమ్ముల దూషింప, వలెను సతము
    ఖండన మపుడె మేలు సకల జనులకు!


    జిలేబి

    ReplyDelete


  67. జిలేబి వ్రాతలు కంది వారి మనోన్మణీయము :)


    అరకొర జిలేబి వ్రాతల
    సరిజూచుచు ప్రతి దినమ్ము సదనము లో వే
    సర పడు చుంటిని ! కటకట!
    గరళము లభియించ దకట కత్తియు లేదే!


    జిలేబి

    ReplyDelete


  68. అరరే! వచ్చెను దూదిపింజ వలె తానచ్చచ్చొ నాంధ్రాంగ్లముల్
    వరుసన్ హిందియు సంస్కృతమ్ము కలువన్ వడ్డించెనే తెల్గుతో
    సరిదట్టించి, సమాసముల్ మరిచితిన్ ఛందస్సులే బోయెనే!
    గరళమ్మింత లభించదే యకట ఖడ్గంబైనఁ జేఁజిక్కదే!


    జిలేబి

    ReplyDelete


  69. మా నేటి కర్ నాటకం :)


    అరరే! పదవియు పోయెన్
    సరి యెడ్యూరప్ప కొలువు చక్కగ తీరున్
    వరుమానము తగ్గునికన్
    గరళము లభియించ దకట కత్తియు లేదే!


    జిలేబి

    ReplyDelete


  70. పరిపాటియయ్యె యువతుల
    పరిణయ మాడన్ తలాకు పద్ధతిని సఖీ
    తరుమను! దారిద్ర్యమిదే!
    గరళము లభియించ దకట కత్తియు లేదే

    జిలేబి

    ReplyDelete


  71. అమ్మణ్ణీ యెనిమిదగును
    తొమ్మిదిలో నొకటిఁ దీయఁ, దొయ్యలి! పదియౌ,
    నెమ్మది గ మన మిరువురము
    జుమ్మంచును గూడ రావె సుమనోన్మణియై!


    జిలేబి

    ReplyDelete


  72. అరరె! ఇరాని ! అమేథీ
    నరె మార్చెదనంచు చెప్పి నా తనయుడినే
    మరి ఓటాఱిచి నావే
    గరళము లభియించ దకట కత్తియు లేదే!

    ***

    అరె నా స్వప్నంబయ్యె న
    మరావతిని దేశపు తలమానికముగ ని
    ల్ప! రవంతయు నెఱి లేదే!
    గరళము లభియించ దకట కత్తియు లేదే!


    జిలేబి

    ReplyDelete


  73. కొలతలను కొలిచి పద్మా
    వలయము గా చుట్టిరండు వారిజవైరిన్
    పిలిచిన బిగువటరా యం
    చు లాగుచున్ పెన్మిటిని కుచోన్నతము పయిన్:)


    జిలేబి

    ReplyDelete


  74. ఆ పాదమును విడువకో
    యీ పరమాత్ముని స్మరణయె యిహలోకములో
    సోపానమ్ము మరువ కో
    యీ!పరలోకమ్మున కదియే మార్గమగున్


    ReplyDelete


  75. చూడండి మీ జి మెయిలును
    చూడండీ బ్లాగు కూడ చొప్పారగ ర
    ఫ్ఫాడం డపుడపుడున్ భళి
    వేడుక గా గొట్టి, ముక్క వెన్కన్ బడుచున్ :)


    జిలేబి

    ReplyDelete


  76. తట్టంచు నందుకొని తిరు
    కట్టెను, బుట్టను, బిగించి గట్టిగ నడుమున్
    గుట్టల చెత్తను కరువలి
    చుట్టంబున కాహుతిమ్మ శుచితయు పుట్టన్!


    జిలేబి

    ReplyDelete


  77. నిజమైన స్వచ్ఛ భారత్ అడుగున దాగిన దో నంబరీ‌ దస్కాల్ బయటకు రావడమే !


    గుట్టల త్రవ్వగ దేశం
    బట్టడుగున దాగినట్టి స్వచ్ఛత రావా
    ల్తట్టంచు చుట్టను విడిచి
    పుట్టలకొలది జనులెల్ల పొందగ వృద్ధిన్!



    జిలేబి

    ReplyDelete


  78. కెలికిన జై గారిని మా
    కిలలో దొరుకు వివరములు కిరికిరి విషయాల్
    ఫలితము శూన్యంబు సుమా
    కొలికికి రావివి యెపుడును కొంతయు సుమ్మీ :)


    జిలేబి

    ReplyDelete
  79. "జిలేబి" గారు, నీహారిక గారు,
    నేను చిన్నప్పుడు సమయస్ఫూర్తి గురించి విన్న కథ ఒకటి చెబుతాను, సరదాగా అవధరించండి. చివర్లో ఒక ప్రశ్న కూడా అడుగుతానండోయ్, దాని జవాబు మీరు చెప్పాలి. Here goes 👇
    కథ :- నేవీలో ఆఫీసర్ ఉద్యోగానికై వచ్చిన అభ్యర్థిని ఇంటర్వ్యూలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ "అత్యంత సమర్థులైన ముగ్గురు నావికాదళాధికారుల పేర్లు చెప్పు" అని అడిగాడట. సమాధానంగా ఆ అభ్యర్థి "ఒకరు ఫ్రాన్సిస్ డ్రేక్, రెండవవారు నెల్సన్, మూడవవారు .... సర్, మీ పేరు చెబుతారా ప్లీజ్ " అన్నాడట.

    ఇప్పుడు నా ప్రశ్న :- చంద్రబాబు పేరు వినగానే కాలు దువ్వేవారు నలుగురి పేర్లు చెప్పగలరా? మోదీ, కెసిఆర్, జగన్, నాలుగవవారు ........??
    కమాన్ క్విక్ త్వరగా చెప్పాలి 🙂, మీకు తెలుసు మీరు చెప్పగలరు కమాన్ 👍.

    ReplyDelete
    Replies

    1. మాకు తెలుసోచ్ ! వినరా గారు :)



      జిలేబి

      Delete
    2. మీ ప్రశ్నకు సమాధానం తెలిసీ జిలేబీ గారు చెప్పలేదు...నేనిపుడు చెప్పాలా వద్దా?
      మరో అనుబంధ ప్రశ్న వినరా గారికి...జూన్ నెలలో పుట్టిన డోనాల్డ్ ట్రంప్ గారు, బోరిస్ జాన్సన్ గార్ల తరువాత జూన్ నెలలో పుట్టి అధ్యక్షులవబోయే మేధావి ఎవరూ ???

      Delete
  80. "ఎస్పెట్" చేశా, మీరిలా అఃటారని "ఎస్పెట్' చేశా.‌ పైన నేను చెప్పిన నేవీ కథ సమయస్ఫూర్తికీ‌ ఉదాహరణ. అంతేకానీ నా ప్రశ్నకు అదే లాజిక్ వర్తింపజేయమని కాదు. అలా అయితే నా ప్రశ్న అడగడమే అనవసరం కదా? ఆ కధలోని పద్ధతే మక్కికి మక్కీ వాడేటట్లయితే .. నా ప్రశ్నయే "వృధ" యగునండీ 😗.
    కాబట్టి మరోసారి ట్రై చెయ్యండి.

    ReplyDelete

  81. ఓహోహో అటులనకో
    దేహము లేనట్టివాఁడె తేజముఁ బొందున్?
    మీ హామీగొని మేమిక
    యీ హర్మ్యము విడిచెదమిక యీప్సితముగనౌ!


    జిలేబి

    ReplyDelete
  82. అవును నీహారిక గారూ. "జిలేబి" గారికి తెలుసు, తెలియదని కాదు. అయితే వారు 'వెటకారీయులు' కదా, అందుకని అటువంటి సమాధానాలిస్తారు.

    నా ప్రశ్నకు జవాబు మీకు తప్పకుండా తెలుసు, నాకేమీ సందేహం లేదు. In fact బ్లాగులోకంలో చాలామందికి తెలిసే ఉంటుంది.

    ఇక అధ్యక్షులవగలిగే జూన్ "మేధావి" ఎవరంటే ... రాహుల్ గాంధీ కదా? దేశాధ్యక్షుడా అంటే చెప్పలేను గానీ పార్టీ అధ్యక్షుడు అనచ్చు. ఏదో ఒక "అధ్యక్షుడు" 😀. కరక్టేనా?

    ReplyDelete


  83. భగవానుల ఆదేశం
    బుగ మొదలిడి యన్నదానపు తొలి విడత నే
    నగరము లో చేసితి! నా
    దు గరిమ నాదనుకొనను విదురుల చలువయే!


    జిలేబి

    ReplyDelete


  84. వెటకారీయులు వారలు!
    ఘటికులు ! మహిమాన్వితులు! జగణపు జిలేబీల్
    చిటికెని మార్తురు వడివడి
    యటుకుల నటునిటు కలిపి ప్రియాపచ్చడిగా :)


    నారదా!
    జిలేబి

    ReplyDelete
  85. ఒకచోట కనిపించిన బోర్డ్ ..... CHILD BEER. దీనిలో భావమేమయ్యుంటుంది ఎవరైనా చెబుతారా ప్లీజ్?

    ReplyDelete
    Replies


    1. కనిపించె చైల్డు బీరని !
      వనితల్లారా ! తెలుపుడి వరుసెట్లగునో
      వినరా వారికి భళి తెలి
      యని విషయమ్ము గలదే ప్రయాసల్లేలా :)


      జిలేబి

      Delete
    2. అయితే ఎవరినీ ప్రయాసపడవద్దంటారు? వెటకారం 🙁..

      Delete


  86. దురవస్థండీ ! బుచికి! వ
    నరులను మనమెప్పుడైన నాణ్యంబుగ చూ
    సి రవంతైనను శ్రద్ధగ
    కర మోడ్చుచు జీవితమును గడిపితి మయ్యా ?


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అక్కడ దుమ్ము ఉంది, ఇక్కడ దుమ్ము ఉంది అని పేర్లు పెట్టడమే కానీ ఎపుడైనా చేయి వేసి శుభ్రం చేసిన మొఖం కాదు. అన్ని పనులకూ పనివాళ్ళు దొరుకుతున్నారన్నారుగా ? భార్య అయితే ఫ్రీగా చేస్తుంది కానీ గౌరవం ఇవ్వరు. పెళ్ళాం లేకపోతే ఇల్లు పెద్దదిగా కనిపిస్తుంది కాబోలు.
      తెలివికలవాళ్ళు కదా మరీ ? ఖర్మ !

      Delete
    2. సినిమా వాళ్ళ ఊతపదంలో చెప్పాలంటే ... మీరు చాలా "డిఫరెంట్" గా ఆలోచిస్తారండీ 🙁.

      Delete
    3. నేను డిఫరెంట్ గా ఆలోచించలేదు ఆయనే వ్రాస్తున్నారు. ఒకరోజు అన్నిటికి పనివాళ్ళు దొరుకుతున్నారు అని అన్నారా ? పనివాళ్ళు ఊరికే చేస్తారా ? బోల్డన్ని డబ్బులు అడుగుతారు కదా ? ఇపుడు ఇల్లు పెద్దదయిపోయింది అని బాధ పడుతున్నారు. ఆయన వ్రాసేది నాకు అర్ధం అయిపోతున్నది మీకే అర్ధం కావడం లేదు. నేనేం చేయను ?

      Delete
    4. వినరా గారు,
      >>>You are a riot😀😀. >>>

      పై వాక్యం ఉద్దేశ్యపూరితంగానే వ్రాసారా ?

      Delete
    5. // "పై వాక్యం ఉద్దేశ్యపూరితంగానే వ్రాసారా ?" //

      But of course. Any doubt?

      Delete
    6. Riot meaning an occasion when a large number of people behave in a noisy, violent, and uncontrolled way in public, often as a protest.
      అని అనుకున్నాను. ఇంకోలా కూడా వాడతారని ఇపుడే తెలిసింది. ధన్యవాదాలు.

      Delete
    7. 👍 🙂 You are welcome.
      నేను వాడినది ఒక నానుడి. డిక్షనరీ ఏమంటోందో చూడండి 👇
      ------------------------
      riot (ˈrɑɪət)
      n. someone or something entertaining or funny. Tom was a riot last night.

      He is a riot :: idiom :: meaning

      Delete
    8. తెలుగులో "బీభత్సం" అని అంటారు...ఇంగ్లీష్ లో "Riot" అన్నమాట !

      Delete
    9. అవునండీ.
      నేను తెలుగు బ్లాగ్ లోకంలోకి వచ్చిన కొత్తలో గమనించాను ... "అరాచకం" అని వర్ణించేవారు కొంతమంది. అటువంటిదన్నమాట.

      Delete


  87. అయితే మీరెవ రిని కూ
    డ యిక ప్రయాస పడనే పడవలద టంచున్
    కయితల తో వెట కారపు
    పయిదలి కతలన్ పలుకుచు బాదేస్తారా ?



    జిలేబి

    ReplyDelete


  88. చాలా డిఫరెంటుగ మీ
    రాలోచిస్తారెపుడును రాణీ మంగ
    మ్మా లాగున నీహారిక !
    బాలకుమారీ జిలేబి బహుభేషు సుమా :)


    జిలేబి

    ReplyDelete


  89. లల్లీ ! థరోలి ఎంజాయ్డ్
    మళ్ళీ వినిపించినావు మధురిమ తోడై
    ఉల్లము తూగెను సుమ్మీ
    జల్లనెనా నందు వాయ్సు సరిగమల !ఉమా !


    జిలేబి

    కందము లో ఇమడనిదే
    ముందిల లోన లలితా ! ఉమా ! బీ లేజీ :)

    ReplyDelete


  90. కలలన్ గనుమోయ్! అబ్దులు
    కలాము చెప్పిరి వినదగు! కలదోయ్ రెక్కల్
    ఇలలో వాటికి ! యెగురన్
    కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్!


    జిలేబి

    ReplyDelete


  91. కాంతి నిండియుండె జిలేబి కవడువాయ
    దివ్వె వెలుఁగెడి గదిలోన, తిమిర ముండె
    జనుల మదిలోన! తొలగెను చక్కగాను
    ధ్యానమును చేయ వారలు ధగధగమన!


    జిలేబి

    ReplyDelete


  92. అవ్వ జిలేబి కాలమయె నగ్నిశిఖమ్మది చేరె గాలిలో
    మవ్వపు మోము తీరుగడ మానస వీధిని గాంచిరెల్లరున్
    నివ్వెరపాటు నొందదు తనెవ్వరి తప్పుల నెంచి చూడదే
    దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్!


    జిలేబి

    ReplyDelete


  93. ఓ తెంపరీ ! వివాహపు
    ఖాతా తెరిచితివిగా !సుఖము సుఖమేనా ?
    యేతావాతా చెప్పెద
    సీతా! పతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!

    జిలేబి

    ReplyDelete

  94. ఆ వల్ల కాటి లో యేం చేస్తావు గానీ మా సభలో కొచ్చేయ్ :)


    అవనిన్ చూడగ కైపులెన్ని కలవో! అబ్బబ్బొ వేగమ్ము గా
    కవనమ్ముల్ భళి వ్రాయ వచ్చు ధృతితో కాఫీ జిలేబీలతో
    శవమా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై
    భువిలో పేరును గాంచ వచ్చునిక సంపూర్ణంబుగా రావె ! రా!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ ఈ శ్మశానస్ధలిన్ కన్నులుమూసిన మందభాగ్యుడొకడున్ లేచిరాడకటా" అని ఏనాడో అన్నాడుగా మహానుభావుడు జూషువా గారు. మీ పద్యాలతో రా రమ్మని ఎంత పిలిచినా .... రాడు. కాబట్టి అక్కడే ప్రశాంతంగా ఉండనివ్వరాదూ (పైగా పంపించినప్పుడు మనమేగా Rest In Peace అంటాం)?

      అయినా ....... జమ్మిచెట్టు మీద దాచిన తమ ఆయుధాల కట్ట కూడా సామాన్యులకు శవం లాగానే కనిపిస్తుందన్నారు పాండవులు. అటువంటి కోణం మీదేమన్నా పద్యం ప్రయత్నించరాదూ?

      Delete


  95. అవని యేను మేలు! హర్మ్యములు గలవు!
    వల్లకాడు చూడ వసతి లేని
    తలము! పోవ నేల? తట్టని చట్టని
    శవమ లేచి రమ్ము సంతసమున!

    జిలేబి

    ReplyDelete


  96. రాయంగవచ్చు కందము
    ప్రాయమ వసరమ్ము లేదు బాలకుమారీ !
    సాయంబివ్వంగను కల
    దోయీ శంకరుని కొల్వు ద్యుతియున్ చేరన్!


    జిలేబి

    ReplyDelete


  97. జైగొట్టి శిష్యు లవ్వా
    లే! గప్పున జ్ఞాన మింక లెస్సగ మీదే
    జాగృతులవంగ తెలగా
    ణా"గదొకటె"సత్యమంచు నమ్మెదరండీ :)


    నారాయణ !
    జిలేబి

    ReplyDelete


  98. అరరె పొతకలాంటి మొగుడ
    రరెపాయెన్ పొన్నకాయ రగడయె మిగిలెన్
    వరుడొచ్చె, జిలేబీయపు
    పరపతి హెచ్చయ్యె తనకు పద్మార్పితగా :)


    జిలేబి

    ReplyDelete


  99. ఇమడంగనులే నిచ్చట
    నమరిక గానెచ్చటయు మనగలనని మరీ
    ను మదిని యనిపించదు ! నా
    దు మాన సంబమెరికా కుదురుకొనదేలా !


    జిలేబి

    ReplyDelete


  100. గడగడ సాగెను చంద్రుడు
    పడమట, నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
    విడువక వెనువెంట సుమా
    చెడుగుడు లాట యిది మదియు చింతన చేయన్ !

    జిలేబి

    ReplyDelete


  101. వడివడి పైకి సాగుచు ప్రభాకరు డేతను క్రుంగె నీదెసన్
    పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్
    వడివడి యా దెసన్! సరసి! వాస్తవ మేది? దెసల్ జనాళికై
    గడబిడ లేక యుండుటకు గట్టిగ కూర్చిన దిక్కులే గదా
    పడమట యన్న నేమి ? మరి ప్రాగ్దిశ యన్నయదేమి?భ్రాంతి యే! :)


    జిలేబి

    ReplyDelete


  102. అడడా! జిలేబి మగడా!
    గుడుంబ త్రాగితివకో? మగోడా! యెట్టె
    ట్ట!డబడబయే యెచటరా
    పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్?

    జిలేబి

    ReplyDelete


  103. ఏమండీ జై గారూ
    యేమేమీ బ్లాకు కాఫి యేనా యెపుడున్ ?
    మీ మిత్రులింటికిక వ
    స్తే మరి బ్లాకేన కాఫి ? సెహభేషండీ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. For the special attention of Vinnakota sir:

      కాఫీలందు బ్లాక్ కాఫీ మేలయా
      దానికన్నా *ఐరిష్ కాఫీ* మిన్నయా
      విశ్వదాభిరామ వినురవేమా

      Delete
    2. A new symbol of inspiration is here.

      Delete
    3. Aha, "Irish coffee" 🤪. Now you are talking జై గారూ 👌. No sugar please 🥺.

      పద్యం బాగుంది. మీకు ఈ విద్య కూడా వచ్చా? ఇక్కడ " ..... వినుర సోమా" అంటే మరింత సొగసుగా ఉంటుందిగా?

      Delete
    4. @విన్నకోట నరసింహా రావు:

      మా మిత్రులలో ఒక స్వయంప్రకటిత "మిశ్రమ పండితుడు" ఉన్నాడు సార్. నేను డీకాఫ్ తాగుతానని చెప్తే "అవన్నీ ఐరిష్ కాఫీ ముందు బలాదూర్" అని సమాధానం ఇచ్చాడు.

      "వినుర సోమా" బాగుంది. ఇంకా సొగసుగా ఉండాలంటే బండి రావు గారే రాయాలి!

      Delete


    5. మా మిత్రుడొకండు కలడ
      సామాన్యు డయిరిషు కాఫి చక్కద నమ్మున్
      సోమరు లై జైగొట్టగ
      సామీ తెలిపిండు ! దాని సరివేరేదీ :)


      జిలేబి

      Delete


  104. బిందాసుగ వ్రాసిరయా
    సందర్భసహితపు బల్పసందగు కైతల్!
    వందనమయ పిట్టాజీ!
    తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్!

    ***

    అందరి కన్న జిలేబియె
    ముందుగ పూరింపగాను ముంచెత్తుచు రాన్
    పందెము పడలేక నహో
    తొందరపడి కైత, పిట్ట, తుఱ్ఱున నెగిరెన్!


    జిలేబి

    ReplyDelete


  105. ఆకాశవాణి కి మించిన దేది కలదు సత్యము చెప్పుటలో :)


    టీవి తెరిచిన చానళ్ళు టింగురంగ
    కల్లలే చెప్పుచుండు, నాకాశవాణి
    చూడ సత్యమేవ జయతే సూక్తి ని విడు
    వక నిబద్ధత తో తెల్పు వార్తలెల్ల !



    జిలేబి

    ReplyDelete


  106. చానళ్లన్నియు కట్టగట్టుకొనుచున్ సత్యమ్ము నేపాతిబె
    ట్టేనాయే మన దేశమందు; జనులట్టేనమ్మకన్ వాటినే
    ఔనౌఁ గల్లలె చెప్పు నందురు గదా! యాకాశవాణిన్ జనుల్
    చానాచక్కగ సత్యమేవజయతే చందమ్ముగాజూతురే!


    జిలేబి

    ఇట్లా వాడుక పదాల్తో వాయిస్తే యెట్లా :)

    ReplyDelete
    Replies
    1. గ్రామ్యం అని తీసిపారెయ్యకుండా వాడుక పదాలతో వ్రాస్తే ... సరళంగా ఉండి మా బోటి పామరులకు అర్థమవుతుంది. అలా లేకపోతే మీ లాంటి పండితులు ఒకరికొకరు పద్యాలు వినిపించుకుని సెహబాసు సెహబాసు అనుకోవడమే.

      Delete


    2. సెహబాసో సెహ బాసని
      అహ మీ పండితులు కూడి యద్భుత మంచున్
      వహవహ అనుకోవాలే!
      ఇహ సామాన్యూలకేమి యింగితమగునో :)


      జిలేబి

      Delete
  107. పిట్టా వారు చనిపోతే పండితులంతా పిట్ట తుర్రుమందని పద్యాలు వ్రాసారు.
    Sportive spirit ....

    ReplyDelete