Wednesday, March 30, 2011

అధర్వ వేదం - ఆరవ కాండం - 17 వ సూక్తం

అధర్వ వేదం - ఆరవ కాండం - 17 వ సూక్తం
 
యథేయం పృథ్వీ మహీ భూతానాం గర్భ మాద్ధే
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం  సవితరే
 
యధేయం పృథ్వీ మహీ దా ధార ఇమాన్ వనస్పతీన్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం  సవితరే
 
యధేయం పృథ్వీ మహీ దా ధార పర్వతాన్ గిరీన్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం సవితరే

యధేయం పృథ్వీ మహీ దా ధార విష్టితం జగత్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం సవితరే
 
శుభ కామనలతో
జిలేబి.

నీ కడుపు చల్లగా, పసి పాపను, కని, పెంచ వమ్మా !

నీ కడుపు చల్లగా పసి పాపను కని పెంచ వమ్మా !
సర్వభూతాలను ఇముడ్చుకుని
సర్వ వనరులను తనలోనే పెంపొందించి
గిరి పర్వతాలకు ఆలవాలమై వెలుగొందే భూమాత లా
సర్వ జంతు జాలాలకు జగన్మాత వై న పుడమి తల్లి లా
నీ కడుపు చల్లగా -
పసి పాపను కని, పెంచ వమ్మా !


శుభ కామనలతో
జిలేబి.

(ఆధారం - అధర్వ వేదం - ఆరవ కాండం , పదిహేడవ సూక్తం - భావానువాదం - టూకీ గా - ఈ సూక్తం - గర్భిణి స్త్రీ కి ఆశీర్వచన సూక్తం )




PS: సంస్కృత సూక్తం చదవదలిస్తే ఇక్కడ లింక్ నొక్కండి

Friday, March 25, 2011

మా తాతయ్య - మావయ్యలు అమెరికానించి వచ్చారోచ్ !

బఫ్ఫెట్ (వార్రెన్) తాతయ్య మా మావయ్య బిల్ తో కలిసి ఇండియా రావడం

మా దేశం లో ని బడా బాబూలతో నూ - ఖుషీ ఖుషీ లక్ష్మీ పుత్రులతో మీటింగ్ లు పెట్టుకొని - చందా లివ్వండి - అందరం కలిసి చారిటి చేద్దాం అనడమూ చూస్తె నాకు మరీ ముచ్చట వేసింది.

బంగారం తాతయ్యలు - ఊరికే రారు.

అదీ మావయ్యని వెంట బెట్టుకుని నిజం గా నే ఊరికే రారు.

వారికి మెకన్నాస్ గోల్డ్ ఎక్కడ ఉందొ నిర్ధారణగా తెలిస్తే గాని రారు.

వచ్చారు కాబట్టి - మన దేశం లో ఖచ్చితం గా వారికి బంగారు గనులు (ఘనులు సుమండీ) కనబడి ఉంటాయి.

మరి భారత దేశం - భావి తరం లో - ప్రకాశవంతం తప్పక అవుతుందనడం లో సందేహం లేదు. !

బంగారం ఘనులు - మా తాతయ్య, మావయ్యలతో కలిసి మంచి పనులు చెయ్యండి. - ఈ పెట్టు 'బడి' తో - దేశాని కి ఇంకా కాస్తా విద్యా 'ధనాన్ని' ప్రసాదించండి !

చీర్స్
జిలేబి.

Sunday, March 20, 2011

హమ్మయ్య - బతికి పోయాం - ఎట్లాంటి గండం లేకుండా!

హమ్మయ్య -

మార్చ్ పొంతోమ్మిది - సూపెర్ చంద్రుడు గట్రా 'మానసిక వత్తిడి' వార్తా మాలికల నుంచి బయట పడి పొయ్యాను!

భూలోకం ఏమి కాకుండా యదా తదం గా - సూర్యుడు తెల్లారే పొద్దు పొడిచాడు. నిన్న రాత్రేమో - చందురూడు - మరీ సోయగాలు పోతూ మురిపించాడు.

బ్లాగోదరులార - నా మాట వినండి. నిత్యం పేపర్లు చదవండం మానేయ్యండి. మన జీవితాలు బాగు పడతాయి. మన బీపీ లు, మన టెన్షన్ లు వాళ్లకి నిత్యా హారం (నిత్య ఆహారం ) ! మనల్ని ఎంత బెదిరిస్తే వాళ్లకి అంత మృష్టాన్న భోజనం !

'న్యూస్ 'డప్పు' చేసి పప్పు కూడు ' తినరా ఓ మీడియా వాడా - 'డప్పు లేకుంటే నీ జీవితం లేదురా మీడియా వాడాఅని పాడి వాళ్లకి నమో నమః అర్పించుకుంటూ-

చీర్స్ అంటూ మరో మారు -
జిలేబి.

Thursday, March 17, 2011

మార్చ్ 19 న ఏమి జరగ బోతుంది?

చాల మంది ఇప్పుడు జరుగుతున్న వైపరీత్యాలకి - సూపర్ మూన్ కి లంకె గురించి చదివే ఉంటారు.

మార్చ్ పంతొమ్మిది న ఏమి జరగ వచ్చు?

అన్నదాని గురించి ఎవరైనా ఆలోచించి జూస్తే - మొట్ట మొదట గా అనిపించేది - సూర్యుడు తూర్పున ఉదయిస్తా డోచ్అని సింపుల్ గా చెప్పేయ వచ్చు !

ఇది గా క ఇంకా ఏమి విశేషాలు ? అంటే - ఆ రోజు - పౌర్ణిమ అని చెప్పుకోవచ్చు. పౌర్ణిమ అంటేనే - సముద్రం అలలు గుర్తుకి వస్తాయి. మరి - సముద్రం అలలు అంటే - వీటి పోట్లు ఎక్కువయ్యే అవకాశాలు ఉండవచ్చు.

సో, ఈ నేపధ్యం లో - ప్రతి క్షణం రేపట్నించి - చాలా ముఖ్యం గా అనిపించవచ్చు.

మన తెలుగు రచయితలూ ఈ మధ్య ఎవరు ఇట్లాంటి కథలు - సీరియల్స్ గట్రా రాయటం లేదు. ప్చ్ ఏమి చేద్దాం. ? యండమూరి గాని మల్లాది గాని మళ్ళీ రాయాల్సిందే - క్షణం క్షణం లాంటి టైటిల్ పెట్టి !

ఇది ఏమి అల్లా టప్పా టపా కాదు సుమండీ. దీని వెనుక పెద్ద విషయం ఉంది. ఆలోచించి చూడండి. మీకే తడుతుంది.
తట్టకుంటే- పంతొమ్మిది దాక వెయిట్ చెయ్యండి. అంతా తేట తెల్లన అయిపోతుంది!

చీర్స్
జిలేబి.

Monday, March 14, 2011

నా కర్తా హరిహి , అహం కర్తా!

నా హం కర్తా, హరిహి కర్తా అన్నది పెద్దల వాక్కు.

ఇప్పుడు మన భూమండలం లో జరుగుతున్న ప్రకృతి విపరీతాలు, దేశ దేశాల లో కానవస్తున్న కలవరాలు చూస్తూంటే - నా కర్తా హరిహి , అహం కర్తా అని పించక మానదు.

మానవుడు మేధస్సు పెంపొందించాడు. ప్రకృతి కి దీటుగా సాయిన్సు సాధించాడు. మరెన్నో విషయాలలో విపరతీమైన వేగాన్ని, ఉన్నత శిఖరాలని అధిగమించాడు. ఇన్ని మార్పులు చేర్పులతో ప్రభంజనం లా సాగిపోతున్న మానవ జీవనం లో - కోరికలని అదిగమించ లేక పోవడం విచారకరం. ఆ పై పదవీ వ్యామోహం, ధన మోహం, నాయకుల అరాచక ప్రవృత్తి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న కలవరాలకి కారణం అని చెప్పలేమా?

దీనికి తోడూ ప్రకృతి విలయ తాండవం - జాపాను అసలు రూపాన్ని పూర్తి గా మార్చి వేస్తోంది. మాన వ నిర్మిత అణు కేంద్రాలు - భస్మాసుర హస్తంలా - విలయ తాండవం చేస్తోంది.

నాహం కర్తా, హరిహి కర్తా అని ఖచ్చితం గా దీనికి చెప్పలేము. ! నా కర్తా హరిహి, అహం ఎవ కర్తా అనిపించకమానదు. !

మానవ జాతి మనుగడ మున్ముందు మంచి దిశల వైపు సాగాలని మనసారా ఆకాంక్షిస్తూ -

జిలేబి.

Tuesday, March 1, 2011

సేను - సెక్సు- ఢిల్లీ బావ- ముంబై మరదలు !

నిన్న ఢిల్లీ బావ - మూత పెట్టిన పెట్ట తో కనబడ్డాడు -
ముంబై మరదలు - పెట్టలో బావ - బంగారం పెట్టి ఉన్నాడని ఆశ పడ్డది.
పెట్ట తెరిసే ముందు -మరదలు - పైటని విస్తారం గా సారించి పై పై ఇంకా పై పై కి ఎద పొంగేలా నాట్యం చేసింది !
మరదలు అందం చూసి - జనాలు రెచ్చి పోయారు - వారెవ్వా అనుకున్నారు -
బావకు తెలియదా మరదలు పిల్ల గురించి?
పెట్ట ఆ సాంతం తెరిచి - మరదలా - మరదలా - కొంత వేడి తగ్గు అన్నాడు. !
ప్చ్ ! మరదలు సేను, సెక్సు మరిచి, ముడుచుకు పోయింది !


చీర్స్
జిలేబి.

బావా మరదల సరసం

మాయన్ -క్యాలెండరు - 12-12-12 - సారూప్యతలు !


మాయన్ క్యాలెండరు గురించి జరుగుతున్న పరిశోధనలు గురించి మీలో చాలామంది చదివే ఉంటారు.
దీనికి సంబంధించి కొంత చదివాక సరే - మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏమైనా ప్లానెటేరి పొసిషన్స్ కనిపిస్తున్నాయా అని ఆ రోజు కి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి , రెండు వేల పన్నెండు కి చక్రం గీస్తే నాకైతే ఎలాంటి విశేషాలు కనిపించలేదు చార్ట్ లో.
సరే - ఇంత గగ్గోలు అవుతోంది కదా - ఈ మాయన్ కాలెండర్ సబ్జెక్టు అని కొంత ముందు వెళ్లి డిసెంబర్ పన్నెండో తేది ,(కాకుంటే పదమూడో తేది ) రెండు వేల పన్నెండు కి చార్ట్ చూస్తె - ఓ పాటి విలక్షణమైన జ్యోతిష చార్ట్ కనిపించింది. అంటే - రెండు ప్లానెట్ లు తప్పించి, ( మంగళ, శని గ్రహాలూ తప్పించి మిగిలిన వన్ని కల గట్టుకుని ఎదురెదురు గా కనిపించడం, ఆ పై డిసెంబర్ పదమూడో తేది అమావాస్య కూడా కావడం లాంటివి నాకు తట్టిన విశేషాలు. ఇంకా ఇందులో నిష్ణాతులైన వాళ్ళు దీని మరింత విశ్లేషించవచ్చు.
అంతె కాకుండా - పదమూడో తేది అమావాస్య కాబట్టి - డిసెంబర్ ఇరవై ఒకట వ తేది నవమి. ద్వాపర యుగ కర్త శ్రీకృష్ణుడి జన్మం అష్టమి లో. త్రేతాయుగ కర్త శ్రీ రాముని జననం నవమి లో. కలి యుగ కర్త ( ఎవరు? ) తెలియదు, నాకైతే - కలి ప్రభావం అనుకుంటే - శ్రీ కృష్ణ పరమాత్లు , ఈ కలి యుగానికి కూడా కర్త గా అనుకోవచ్చు. సో, ఈ రీతిలో ఆలోచిస్తే - సప్తమి రోజున ఏదైనా విశేషం ఉండవచ్చా? అంటే ఈ డిసెంబర్ పన్నెండు నించి ఇరవై ఒకటి లోగా ఏదో విశేషం జరగవచ్చు అని ఊహించవచ్చా? మీ ఉద్దేశాలు తెలుపగలరు.
చీర్స్
జిలేబి.

Friday, February 25, 2011

గుడుబు - ల్చీబా - చ్చిమ్మకోతికో

ఈ శీర్షిక తలకిందులైంది.

కారణం - మూడేళ్ళ మునుపు నాకు రెండేళ్ళు -(రెండు ఏడులు ) - డెబ్బై ఏడవ ఏటిని అంత చమత్కారం గా చెప్పి, తన ఎనభైవ ఏట - వెయ్యి పౌర్ణిమలు దగ్గిరికి వస్తూన్దనగా - బాల్చి తన్నేసిన బుడుగు కర్త - బ్రహ్మ పాదాన్ని కడగడానికి అనంతం వైపు పయనం సాగించడం. ! ఎనభై లో ఎనిమిది ని అడ్డం గా రాస్తే - ఇన్ఫినిటీ ! అనంతం- ఆ అనంతం లో కి దూసుకెళ్లిన మా బుడుగు - అక్కడా చిరునవ్వుల వెన్నల చిందిస్తూ - మిగిలి పోయిన వెయ్యి పౌర్ణిమల ని ఆస్వాదించాలని కోరుకుంటూ-

గుడుబు - ల్చీబా - చ్చిమ్మకోతికో ?

నివాళులతో -
జిలేబి.

Monday, February 21, 2011

' బ్లాగు బోతులు' !!

ఇదేదో తిట్టనుకునేరు సుమా!

తాగే వాళ్ళని తాగు బోతులు అనగా లేనిది, బ్లాగే వాళ్ళని బ్లాగు బోతులు అన కూడదా ఏమిటి?

తాగినవాడు మైకం లో ఉంటాడు. బ్లాగినవాడు కూడా మైకం లో ఉంటాడు.
తాగిన వాడికి లోకం తల కిందుల ఉంటుంది. ( ట) !

మారిన బ్లాగిన వారికి మాత్రం లోకం నేరుగా ఎక్కడుంది?

ఈ మధ్య బ్లాగులోకం లో జరుగుతున్న దూషణలు , చెడ మడా విసురుకునే విసుర్లు- రివర్స్ విసుర్లు - చూస్తుంటే - బ్లాగితే ఉంటుంది మజా - తాగితే ఉంటుంది మజా అన్నంత తీరు లో ఉంది !

మధ్యలో - బ్లాగు అగ్రిగేటర్ లు కూడా - అప్పుడప్పుడు నీ వేమిటి నీ సత్తా ఏమిటనే లెవెల్ లో రంగం లో కి దిగటా నికి తయార్ !

తెలుగు బ్లాగు లోకమా - మేలుకొమ్మ ! బ్లాగులు - బాగోగులు - కొంత సున్నితం గా సాగనిద్దామా ?

చీర్స్
జిలేబి.

Tuesday, February 15, 2011

ప్రేమికుల దినం - సమత్వ దినం !

ప్రేమకు ప్రాణం అమ్మాయి ఐతే
ఆ ప్రేమకు అబ్బాయి ప్రాణ వాయువు లాంటి వాడు.
ప్రాణం నిలవాలంటే - ప్రాణవాయువు ఉండాలి.
ప్రాణం లేకుంటే - అసలు ప్రాణ వాయువుందని ఎలా తెలుస్తుంది?
కాబట్టి - ప్రేమికుల్లార- ఈ దినం మీ ఇద్దరి దినం! అమ్మాయి అబ్బాయి సమత్వ దినం !
శుభమస్తు!

చీర్స్
జిలేబి.

Monday, February 14, 2011

హారం ఎందుకు డౌన్ అయ్యింది? ఇదీ అసలు కారణం !

నిజం గా నాకు సత్యప్రమానం గా - పచ్చ నాకు సాక్షి గా - నా కు వచ్చిన
సమాచారం ప్రకారం - హారం ఎందుకు డౌన్ అయ్యిందంటే -
దీనికి కారణాలు తెలుసుకోవాలంటే - వెంటనే ఈ లింకు ని నొక్కండి.


http://chiruspandana.blogspot.com/2011/02/why-haaramcom-is-down.html

చీర్స్
జిలేబి.

Friday, February 11, 2011

తిరపతయ్య బోడి గుండు కథ - ఆఖరి (మూడో) భాగం

బోడి గుండు చీఫ్ బాల్చీ తన్నే క - అప్పటికే మరో నియో బోడి గుండు సంఘం వాళ్ళు కొండ దేవరతో మొరలేట్టారు , ఘీమ్కరించారు - మా బోడి గుండు సంఘం కి కుంపటి వేరేగా పెట్టి తీరాల్సిందే అని.

కొండ దేవరకైతే - మరీ చీకాకు పుట్టింది. బాపతు లో వెళ్తూంటే తన పరపతి కే మోసం వచ్చేట్టు ఉందని అనిపించింది కొండ దేవరకి. పోను పోను అసలు జనాలు బోడి గుండు కొట్టుకోవటానికి తనని కొలవడానికి అసలు కొండ కి వస్తారా అన్న సందేహం కూడా వచ్చేసింది.

ఇట్లా అతలాకుతలం అవుతున్న తరుణం లో తిరపతయ్య తీవ్రం గా అలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇక తాను తన నిజ స్వరూపాన్ని చూపించాల్సిందే అని.

కొండ దేవర కూడా తీవ్రం గా అలోచించి తన కొండ పై జరుగుతున్నఈ సమస్యలకి ఓ సమాధానం కాకుంటే సర్దుబాటు చెయ్యాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేడు.

అల్కెమిస్ట్ పుస్తకం లో రచయిత పోలో కోఎల్హో ఒక చోట అంటాడు - ఒక మనిషి తాను కోరుకున్నది ఎట్లాంటి పక్షం లో నైన జరిగి తీరాలి అనుకుంటే - ప్రపంచం మొత్తం ఆతని ఆలోచనలకి సప్పోర్ట్ ఇస్తుందని. ఇదేమి కొత్త విషయం కాదు. యతో కర్మః తతో ఫలః అన్నదాన్ని కొద్ది పాటి మార్పులతో చేర్పులతో సుందరం గా ఇలా కూడా చెప్పవచ్చు. అంతే. !

ఇలా తిరపతయ్య , కొండ దేవరల ఆలోచనలు ఓ కొలిక్కి వస్తూనే - ఓ ఓ రోజు భారీ గా ప్రెస్ మీట్ కొండ దేవర సమక్షం లో తిరపతయ్య పెట్టి - జనాలకి షాక్ ఇచ్చాడు. - తన బోడి గుండు దుకాణం కట్టేస్తున్నాని - ఇక మీదట జనాలు కొండ మీది బోడి గుండు సంఘం వారి తో నే బోడి గుండు కొట్టించు కోవాలని - అంతే గాకుండా - తా ను కూడా తన యావద్పరివారంతో బాటు - బోడి గుండు సంఘం లో చేరి పోతున్నాని - తన దగ్గిర ఇక బోడి గుండు కొట్టించు కోవాలని ఆరాటపడే వాళ్ళు - ఇక మీదట తనని బోడి గుండు సంఘం వాళ్ళ ద్వారానే సంప్రదించాలని కూడా వాక్రుచ్చాడు.

ఆ ప్రెస్ మీట్ లో ఓ వెధవ రిపోర్టర్ ఎకసక్కం గా అడిగాడు - " తిరపతయ్య - మొదట్లో నీ కేమి సత్తా ఉందని బోడి గుండు దుకాణం పెట్టేవు ? ఇప్పుడు ఏమి క్వాలిఫికషన్ ఉందని బోడి గుండు సంఘం లో చేర్తున్నావు " అని - ఈ ప్రశ్న కి సమాధానమే - ఈ కథ కి అంతం కూడా. -

తిరపతయ్య - అప్పటిదాకా - సిని ప్రపంచంలో గాని - పబ్లిక్ ప్రదర్శనలలో గాని చూపించని నిజాన్ని సవినయం గా చూపాడు- తన తలపైనున్న విగ్గు ని ఊడ బెరికి - నునుపైన , సొంపైన , నిగ నిగ మెరిసే తన బోడి గుండు ని టీవీ వాళ్లకి , ప్రెస్ వాళ్లకి సవిస్తారం గా చూపి - ఇంతకన్నా ఏమి క్వాలిఫికేషన్ కావాలి నాకు బోడి గుండు దుకాణం పెట్టడానికి, కాకుంటే - బోడి గుండు సంఘం లో చేరడానికి అని ఎదురు ప్రశ్న వేసాడు తిరపతయ్య. !

శ్రీమధ్రమానంద హరీ ! హరిలో రంగ హరి ! ఈ తిరపతయ్య బోడి గుండు కథ పరిసమాప్తం ఇంతటి తో ! ఈ కథ చదివిన వారికి , విన్న వారికి , బ్లాగ్ లోకం లో కామేన్తినావారికి - అందరికి ఆ కొండ దేవర మా తిరుమలేసు ఆశీర్వాదాలు సకల వేళల ఉండాలని - మా తిరపతయ్య లా నిజాయితీ గా వాళ్ళంతా వర్ధిల్లా లని కొండ దేవర ని కోరుకుంటూ !!

(సమాప్తం)

చీర్స్
జిలేబి.

Thursday, February 10, 2011

తిరపతయ్య బోడిగుండు కథ - రెండో భాగం

తిరపతయ్య బోడిగుండు దుకాణం ప్రారంభోత్సవం తరువాయి అతనికి చాల చాలా మెప్పులు మన్నెనలు దీవెనెలు కొండొకచో 'జాగ్రత్తగా ఉండాలి సుమా' అన్న హెచ్చరికలు కూడా వచ్చేయి.

వేటూరి మావైతే - "తిరపతయ్యా ఇలా బృందవానాన్ని వదిలి బెట్టి అలా దండకారణ్యం లో వెళ్లి బోడిగుండు చేస్తానంటా వేమిటయ్యా " అని చింతించాడు కూడా.

దానికి తిరపతయ్య నవ్వి - దండకారణ్యం ఐతే ఏమి మావా - దాన్ని బృందావనం గా మార్చేస్తా అన్నాడు.

'అబ్బీ- నేను కలకత్తా పురి - యమహా నగరి అని పాటరాసిన మాట వాస్తవం. కాని వాస్తవాలకి కలలకి చాల వ్యత్యాసం ఉంది ' అని ఊరుకున్నాడు.

కొండ దేవరకి బ్రహ్మోత్సవాల సీసన్ వచ్చింది. ఇక తన బోడిగుండు దుకాణం ఎడతెరపి లేకుండా సాగి పోతుందని తమ్ముడు చెప్పాడు తిరపతయ్య కి.

బ్రహ్మోత్సవం అంటే మాటలా మరి? కాణీ కర్చుకాకుండా దేవేరి లక్ష్మమ్మ నగర సందర్శనం అవుతుందా? ఖర్చులకి జంక కుండా తన బోడి గుండు దుకాణానికి ప్రకటనలు ఇచ్చాడు తిరపతయ్య.

ప్రకటనల పేపర్లు చదివి ఆహా ఓహో అన్నారు జనాలు. ప్రకటనలే బోడి గుండు కొట్టినట్టుందని తెగ మెచ్చుకున్నాడు ఓ ప్రవాస భారతవాసి . తానూ బ్రహ్మోత్సవాల లో పాల్గొంటే తప్పకుండా తిరపతయ్య బోడిగుండు దుకాణం లో నే బోడి గొట్టించు కుంటా అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కూడా.

బ్రహ్మోత్సవాల సీసన్ భారీ గా జరిగింది . తిరపతయ్య దుకాణం మున్డునించే చాల మంది తరలి వెళ్ళారు.

కంట తడి పెట్టిన జన సందోహం, బోడి గుండు తిరపతయ్య దుకాణం లో కొట్టిన్చుకోవడానికి నామోషి పడ్డారు.

అధునాతనం గా ఉంది సెలూన్. అంతా ఫ్రెష్ బ్లడ్ - స్మార్ట్ గా ఉన్న సేవకులు - రా రమ్మని పిలచే రామ చిలుకలని మరిపించే సంగీత వాయిద్యాల స్వరాలూ వస్తున్నాయి దుకాణం నించి. అయిన ఎందుకో జనాలు నామోషి పడ్డారు తిరపతయ్య దుకాణం లో బోడి గుండు కొట్టిన్చుకునేదానికి.

ముగిసన బ్రహ్మోత్సవాల తరువాయి లెక్క చూసుకుంటే తిరపతయ్య తల గిర్రున తిరిగింది. చేసుకున్న ఖర్చు గురించి తను బాధ పడలేదు గాని - తిరపతయ్య అని పేరుండి కూడా తన దుకాణం లో ఈ జనాలు ఎందుకు బోడి గుండు కొట్టించు కో కుండా వెళ్లి ఆ బోడి గుండు సంఘం వాళ్ళనే నమ్మారు ? అన్న సందేహం అతన్ని వదలలేదు.

ఇట్లా బ్రహ్మోత్సవాలు రెండు మూడేళ్ళు సాగాయి. మూడో బ్రహ్మోత్సవానికైతే - బోడి గుండు దుకాణం లో తల వెంట్రుకలు కింద కనిపిస్తే ఒట్టు అన్న స్తితి కి వస్తే - తమ్ముడు 'అన్నయ్యా - సెలూన్ లో హెయిర్ ఒకటైన కనిపించ కుంటే ఎట్లా ? ' అని వాపోతే - మచ్చుకకి తన జుట్టునే ఓ పారి లాగి కింద పడేసి - ఇది బోడి గుండు దుకాణమే సుమా ' అని చూపించు కోవాల్సిన పరిస్థితి కి వచ్చింది తిరపతయ్య గ్రహచారం.

ఈ మూడేళ్ళలో తిరపతయ్య బోడి గుండు దుకాణం గురించి చాల బాగానే ప్రాక్టికల్ గురించి కూడా తెలియ జేసుకున్నాడు.

ఏదైనా ఫీల్డ్ లో దిగితినే దాని లోటు పాటు లు, లోతుపాతులు, తెలిసి వస్తాయి అన్నది తిరపతయ్య కి తెలియని విషయం కాదు.

అందుకే చాలా సీరియస్ గా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టి తను బృందావానాన్ని వదిలే ఆలోచన లేదే లేదని అట్లా అని దండ కారణ్యం లో బోడి గుండు దుకాణాన్ని బంద్ చెయ్య బోవడమూ లేదని ఓ మెగా స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని తో ప్రెస్ వాళ్లకి మసాల సమాచారం దొరికి వాళ్ళ రాతలకి - వాళ్ళ పేపర్ల డిమాండ్ కి కొరత లేకుండా పోవడమూ , దాని తో బాటు తెలుగు బ్లాగర్ల కి రాసుకోవడాని కి కొత్త టాపిక్ దొరకడమూ ఈ కథ కి సంబందించని విషయం. !

ఈ మధ్యలో - కొండ దేవరలని కొలిచే బోడి గుండు వాళ్ళ సంఘం - ఎందుకైనా మంచిదని - కొండ దేవరకి కొన్ని ఐడియా లు ఇచ్చారు. తిరపతయ్య బోడి గుండు దుకాణం సరిగా జరగక పోయినా - తను మా సంఘం లో లేదు కాబట్టి ఎప్పటికైనా అపాయమే ! అందుకే తిరపతయ్యని కొండ దేవర బోర్డు కి కుర్చీ మనిషి గా అయినా నియమించి అతన్ని కట్టి పడేయాలి లాంటి ఉపాయాలు కూడా పన్నారు. అవన్నీ ఓ కొలిక్కి రాలేక పోయాయి కూడా.

మధ్యలో - బోడి గుండు సంఘం వాళ్ళ చీఫ్ ఎవడికో షేవింగ్ చెయ్య బోయి - భస్మాసుర హస్తం స్టైల్ లో తన ప్రాణాన్ని ఆకాశ గంగలో వదిలిపెట్టడమూ, వాడి కొడుకు - తానె బోడి గుండు సంఘానికి వారస నాయకుడి నని చెప్పు కోవడమూ జరగటం - దానికి కొండ దేవర - అభ్యంతరం తెలిపి -

నీకన్న పెద్దలైన వయోవ్రుద్ధులైన బోడి గుండు తాతాశ్రీలు - నిజమైన బోడి గుండు తో వెలుగొందుతూ ఉంటే - నువ్వు అర్భుకుడివి - అదీ ఫుల్ క్రాప్ ఉన్న వాడివి - నువ్వెలా బోడి గుండు సంఘానికి చీఫ్ అవుతవోయి - అని తీసి పారేయ్యడమున్ను -

ఆ కుర్ర కుంక - తట్ - నే నేమి తక్కువ తిన్న వాణ్ని కాను సుమా అని జన సందోహం లో కలయ దిరిగి బోడిగుండు చీఫ్ గురించి చీఫ్ చేసిన త్యాగాల గురించి చెప్పుకోవడమున్నూ, ఏడుపులూ పెడబొబ్బలూ పెట్టడమున్నూ కూడా జరిగేయి.

(మిగతా మూడో భాగం లో)

చీర్స్
జిలేబి.



Wednesday, February 9, 2011

తిరపతయ్య బోడిగుండు కథ

తిరపతయ్య సిని రంగం లో అడుగు పెట్టేటప్పుడు చేతిలో 'కాలణా ' లేదు అని చెప్పుకోలేడు గాని . ఆ పై అదృష్టం కలసి వచ్చింది. స్వయం కృషి తో పై పై కి ఎదిగాడు. విలన్ గా, హీరో గా , క్యారెక్టర్ ఆక్టర్ గా ఇలా ఇదంటూ లేకుండా అట్లా మాస్ హీరో గాను ఇట్లా క్లాస్స్ హీరో గాను పేరు గాంచాడు.

తన జీవితం మొత్తం ఈ కళామ తల్లికేనా ? తన పేరు సార్థకం అయ్యేదేలా? అన్న సందేహం అతనికి ఓ రోజు కలిగింది. తిరపతయ్య అని తన వాళ్ళు ఊరికే పేరు పెట్టి ఉండరని అతని మనసుకి తట్టింది. ఆలోచించాడు. కొండ పైన దేవర కోసం అందరికి బోడిగుండు కొట్టేందు కు చాలామంది ఉండనే ఉన్నారు. కాని నిజం గా వీళ్ళు 'త్రికరణ శుద్ధిగా అందరికి క్షవరం చేస్తున్నారా ? అబ్బే లేదే అని వాపోయాడు.

ఆ రోజు తెల్లారి లేస్తూనే తన తమ్ముణ్ణి పిలచి - 'ఒరేయ్ అబ్బిగా నేను అందరికి బోడి గుండు కొట్టాలని అనుకుంటున్నాను రా ' అన్నాడు. తమ్ముడు గాలి కన్నా వేగం ! అన్న ఆ అంటే తమ్ముడు సై అనే రకం !

' అన్నోయ్ - దానికేముంది బ్రహ్మాండం గా మనమే ఒక బోడిగుండు దుకాణం పెట్టేద్దాం ' అన్నాడు. అనడమే కాదు - వెంటనే కార్య రంగం లో కి దిగాడు. త్రికరణ శుద్ధి గా ఎవరెవ్వరు అందరికి బోడి గుండు కొట్టాలని అనుకుంటూ న్నారో వాళ్ళంతా తనని వెంటనే కలవాలని తనకో మెగా ప్లాన్ ఉందని చాటేశాడు.

అక్కడ కొండ పై ఉన్న బోడి గుండు సంఘం వాళ్లకి బెరుకు పుట్టిన మాట వాస్తవం . అయినా వాళ్ళు బింకం వదలలే.

'ఆ వీడు పేరుకే తిరపతయ్య - బోడిగుండు కోడతానంటే అందరు వీడి దగ్గరికి ఎందుకు వెళతారు? తర తరాలు గా కొండ దేవరకి 'తల' 'నీలాలు' అర్పించుకున్న అర్భకులు ఇవ్వాళ కొత్త సెలూన్ వస్తే దానికి వెళ్తారా ఎవరైనా? ' అని నిబ్బరం గా ఉన్దామానుకున్నారు.

అందులో తల పండినవాళ్ళు కొంత మంది ముందాలోచన చేసి ఎందుకైనా మంచిది - ఈ మధ్య కొండ దేవర పేరు చాల దిగ జారి పోతోంది - కాబట్టి - ఈ తిరపతయ్య ని వలలో వేసుకుని వాణ్ని తమ బోడి గుండు సంఘం లో నే చేరి అందరికి బోడి గుండు కొట్టు కో రా అబ్బిగా - నీకు ముందస్తే ఎలాంటి అనుభవం లేదాయెను - బోడి గుండు కొట్టడం అంత సులువైన పని కాదు - దానికి మెలుకువలు తెలియాలే - కొండ దేవర దీవెనలు ఉండాలే ' అని బుజ్జగించి చూసేరు. !

చత్ - బోడి గుండు కొట్టడానికి అనుభవం దేనికి - నాకున్న పేరు చాలు - తిరపతయ్య బోడిగుండు కొట్ట లేక పోవటం ఏమిటి? ' నా దుకాణం మీ కొండ మీదే కాకుంటే - కొండ కిందే పెడతాను ' అని శపథం చేసి - తమ్ముడు దుకాణానికి నాంది పలుకు ' అన్నాడు తిరపతయ్య.

తమ్ముడు నాంది వాచకం పలికాడు. దేశం లో ' బోడిగుండు' తాతయ్య ల ఫోటో లు వెతికి వెతికి పాపులర్ అయిన బోడిగుండు తాతయ్యని సూపెర్ మెగా లెవెల్ లో సెంటర్ లో పెట్టి 'తిరపతయ్య బోడిగుండు దుకాణం కనీ వినీ ఎరుగని తీరులో ప్రారంబించాడు.

ఇసుక వేస్తె రాలని జనం 'రంభోత్సవానికి' వస్తే - తస్స దియ్య ఇంత మంది బోడి గుండు కొట్టు కోవడానికి వేచి ఉండడం అతనికి కంట నీళ్ళు తెప్పించింది. 'అనాధ భాష్పాలు ' చూసి జనాలు కూడా ' ఆ హా మాకు బోడిగుండు కొట్టే దానికి కొత్త దుకాణం తయార్ ' అని కంట నీళ్ళు చిందించారు.

(మిగతా రెండో భాగం లో )

చీర్స్
జిలేబి.

Wednesday, February 2, 2011

బావా మరదల సరసం !

ఈ బొంబాయి స్టాక్ మార్కెట్ కి 'మన' గోల్డ్ మార్కెట్ కి ఏమి అవినాభావ సంబంధం ?

వాడు పద్దెనిమిది వేలంటే 'ఈవిడ' కూడా పద్దెనిమిది వేల దాక పెరిగి ఆ పై ఇంకా పెరిగి పంతొమ్మిది వేలదాక వెళ్లి నన్ను తాకితే షాక్ అన్నట్టు కూర్చుంది?

బొంబాయి మార్కెట్ బావ ఐతే బంగారం మరదలా ఏమిటి ? బావ మరదలు చెట్ట పట్టాలేసుకుని చెట్టెక్కి ' కోటీ బావకు పెళ్ళంట ' అని పాడేసుకుంటూంటే బంగారం మోజు ఉన్న భారత వనితల గతి ఏమి గాను?

స్టాక్ మార్కెట్ బావ గారి మీద ఆధారపడి బతుకుతున్న భారత మాహారాజుల గతి ఏమి గాను?

'అవునంటే కాదని లే - కాదంటే అవునని లే - అన్నట్టు - ఈ బావా మరదల సరసం మా బానే ఉంది ! విరసం లో ఎప్పుడు పడతాయో వేచి చూడ వలసినదే! అయినా విరసం లో సరసం ఉండనే ఉంది. !

చీర్స్
జిలేబి.

సేను - సెక్సు- ఢిల్లీ బావ- ముంబై మరదలు !

Friday, January 28, 2011

చిక్కు ప్రశ్న - టక్కుమని సమాధానం కావాలి !

రిపీట్ -
అప్పుడప్పుడు తెలివి మోకాలి లో ఉంటె ఇలాంటి తిక్క ప్రశ్నలే పుడతాయి
కొద్దిగా విసదీకరించండి బాబులు - నా కైతే తలా తోకా అర్థం కావడం లేదు -

ప్రశ్న-

యోగం - శుభ యోగం, సిద్ధ యోగం, అమృత యోగం - ఇట్లాంటి వి గ విభజించి ఉన్నారు. వీటి కి గల వ్యత్యాసం ఏమిటి? ఒక శుభ యోగం సిద్ధ యోగమా లేక అమృత యోగమా ఎట్లా గణించడం? ఎవరికైనా ఖచ్చితం గా తెలిస్తే చెప్పగలరు దయ చేసి
చీర్స్
జిలేబి.

Sunday, January 23, 2011

వోటు హక్కు మీ కిస్తామోయ్ !!

ఎన్నారై లకి వోటు హక్కు ఇస్తారంట!

ఆహా నా పెళ్ళంటా - ఓహో నా పెళ్ళంటా - టాం టాం టాం ! అన్న రీతిలో ఉంది ఈ వోటు హక్కు ల ప్రహసనం !
దేశం లో ఉన్న వాళ్ళే వోటెయ్యడానికి మొహమాట పడతా ఉంటె - మినిస్టర్ వోళ్ళు - ఎన్నారై ల కి వోటు హక్కు ఎందుకు ఇస్తారంటా ? మీ కేమైనా సమజయ్యిందా?

బ్లాగు చదివితే జిలేబి ఉచితం అని నే రాసిన తీరులు ఉంది ఈ - వోటు హక్కు ఇవ్వడాలు ! - ఎన్నారై లు మీకు వోటు హక్కు కల్పిస్తా ఉండా - కొండకోచో మా స్కాం ల లో మీకీ వాటా కల్పిస్తా అన్నట్టు - స్కాండియా అని మన దేశానికి పేరు మార్చాలని నా కోరిక ! ఎందుకంటీ - ఈ ఎన్నారై ల వోటు హక్కుల వెనుక ఎ స్కాం దాగి ఉందో మా తిరుమలేసునికే ఎరుక! వేచి చూడ వలసినదే! మీకేమైనా తెలిస్తే- తడితే - చెప్పగలరు.

చీర్స్
వోటు హక్కుల మారాణి జిలేబి.

Saturday, January 22, 2011

బ్లాగు చదివితే జిలేబి ఉచితం

సరి కొత్త ఆఫర్ !

కార్లు, మోటర్ బైక్ లు కొంటె ఉల్లిపాయలు ఉచితం గా ఇవ్వ లేనిది - బ్లాగు చదివితే జిలేబి ఉచితం అని నేను ప్రకటనిస్తే ఎవరైనా ఈ బ్లాగు చదవకుండా ఉంటారా? అట్లీస్ట్ జిలేబి కోసం ఆశ పడి అయినా నా బ్లాగు చదవకుండా (మినిమం ఈ టపా అయినా చదవకుండా ) ఉంటారంటారా ?

రోజుకో కొత్త టెక్నిక్ తో ఈ సమయం లో ఉల్లిపాయలు మన గవర్నమెంట్ ని ఉండనిస్తుందా ఊడ కొడుతుందా ? వేచి చూడవలసినదే ! ఆ పై మన సింగు గారు వరల్డ్ పాపులర్ కాని మన దేశం లో మాత్రం మన మీడియా ఆయనకీ మంచి పట్టం ఇవ్వడానికి నామోషి పడుతుంది. మొన్నటి కి మొన్న న్యూ యార్క్ టైమ్స్ వాడు మన సింగు గారి గురించి గొప్ప గా రాసాడు. అందులోనే మన మీడియా వాళ్ళు ఆయన్ని సరిగా గుర్తించడం లేదని కూడా వాపోయాడు. !

మీడియా మహారాజులు - మన దేశం లో మసాల న్యూస్ ల కే పట్టం కడతానంటారు - ఏమి చేద్దాం ? మీడియా వాళ్లకి జిలేబి ఫ్రీ ఆఫర్ ఇవ్వాల్సిందే ! !

చీర్స్
జిలేబి.

Wednesday, December 29, 2010

మాలతి పెళ్లి

మాలతి పెళ్లీడుకి వచ్చింది.

తల్లి -లెక్ఖ ప్రకారం అమ్మాయి పెళ్లి వేగిరం అయి పోవాలి. ఏదో ఒక అయ్యా చేతిలో దాన్ని పెడితే - దాని జీవితం సాగి పోయినట్టే లేక్కః.

అయ్య కి కూడా ఆత్రుత గా వుంది. అమ్మాయి పెళ్లి ఎంత బిరీనగా అయి పొతే అంత మంచిది. ఏళ్ళు పై బడే కొద్దికి అమ్మాయి పెళ్లి తను చెయ్యాలనుకున్నా అయ్యే కర్చులు తనని చెయ్య నివ్వ్వవు

సో, అమ్మాయి పెళ్లి వెంటనే అయి పోవాలి.

' అయ్యా నే పై చదవులకి వెళ్తా అన్నది మాలతి. అమ్మ గుండె బరువయ్యింది. ఈ కాలం పిల్లలో ఇది ఎదురు చూసిందే - కాని తన మాలతి కూడా ఇలా అంటే అమ్మ ' పిచ్చి పిల్లా పై చదువులకి వెళ్లి ఏమ్చేస్తావే. పెళ్లి చేసేసుకో అంది. మాలతి పట్టు బట్టింది. గవర్నమెంటు చదువు చెప్పిస్త నన్నది అంది మాలతి అయ్యతో .

'ఎన్నేళ్ళు ?'

ఓ పాటి నాలుగు అంతే అంది మాలతి.

అయ్య నిట్టూర్చాడు. ఖర్చుల లెక్క ఊహించుకున్నాడు. ' గవర్నమెంటు ఇస్తాది లే అయ్యా' అంది మాలతి

నాలుగు ఏళ్ళు తిరిగాయి. అమ్మాయి పట్నం లో ఇంజనీరింగ్ ముగించింది.

అమ్మాయ్ - ఇప్పుడు చేసేసుకోవే పెళ్లి అంది అమ్మ

'నాకు స్కాలర్షిప్ వచ్చింది అయ్యా' అంది మాలతి ' పై చదువులకి అమెరికా వెళ్తా అన్నది.

'దాని కేమి లే తల్లీ - ఆ పెళ్లి చేసేసుకుని వెళ్ళు ' అంది అమ్మ.

మాలతి నవ్వింది. అయ్య ఏమి జేప్పలేక పోయాడు.

ఎన్నేళ్ళు?

ఓ పాటి నాలుగు అంతే అంది మాలతి.

ఏళ్ళు తిరిగాయి. అమ్మి పై చదువులు అయింది. ఆ పై చదువులకి వెళ్తా అన్నది మళ్ళీ -

ఈ పారైన పెళ్లి చేసుకో అంది అమ్మ. అమ్మ తల నెరవడం గమనించింది మాలతి.

'లేదే - పై చదువులకి అక్కడే ఒప్పుకున్నా' అంది మాలతి ముభావంగా.

ఇంకా ఏమి పై చదువులే అమ్మీఇట్లా చదువుతూ పొతే - నీకు మొగుడు చిక్కాలంటే - నీకన్న పై చదువులు చదివినాడు కావాలి కాదే మరీ? అంది తల్లి.
అయ్యా నువ్వైనా చెప్పు అంది అమ్మ .

ఎన్నేళ్ళు ? అడిగాడు అయ్య.

ఇది పై చదువులు అయ్య- రిసెర్చ్ తో బాటు - ఫెలోషిప్ అంది మాలతి.
మాలతి చెప్పింది తనకి అర్థమైనట్టు తలూపాడు అయ్య.

ఇట్లా జరిగే నాలుగేళ్ల ప్రహసనం లో - ఓ మారు మాలతి తీరిగ్గా ఓ రోజు అద్దం ముందు నిలబడి ఉంటె - ధగ ధగ మెరిసే నెరిసిన తల వెంట్రుక గమనించింది. ఓ మారు ఆలోచింది తన కి ఎన్ని ఏళ్ళు? అని - దాదాపు యాభై పైనే ఉండవచ్చు అనుకుంది.

ఆ రోజు - తనతో బాటు తీరిగ్గా రిసెర్చ్ చేస్తున్న జోసెఫ్ - తనకి ఓ అరవై ఏళ్ళు ఉండవచ్చేమో - తో ' మనమిద్దరం పార్ట్ నర్స్ - అవుదామా అంది. తలూపేడు జోసెఫ్ కూడా- తనకీ ఓ తోడూ ఉంటె మంచిది అనుకున్నాడు.

ఈ మారు అయ్యని అమ్మని కలవడానికి జోసెఫ్ ని వెంటేసు కొచ్చింది మాలతి.

ఎవరే అంది అమ్మ గుస గుసలాడుతూ. నేనితన్ని పెళ్లి చేసుకోబోతున్న అంది మాలతి - లైఫ్ పార్ట్ నర్స్ ని అమ్మకి ఎలా చెప్పాలో తెలియక.
అయ్య చూసాడు - నెరిసిన జుట్టు అమ్మాయి - అంతకి మించి నెరిసిన జుట్టు అల్లుడికి - ఈడు జోడు బాగానే ఉంది కదా అనుకున్నాడు. - తండ్రి మనసు - నిట్టూర్చడానికి తావులేదు- ఇంత కాలం తరువాతైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటా అన్నది కదా అనుకున్నాడు.
అమ్మ - మురిసిపోయింది. ఆవిడ బోసినవ్వు తో - గుస గుస లాడుకుంటున్న వాడ జనాల్ని గదమాయించింది- మా మాలతి కి కాబోయే మొగుడు అని చెబ్తూ.

పదహారులో క ల లు కన్న స్వప్నం అరవైలోనైనా నెరవేరిందని తల్లి హృదయం సంతోష పడింది. ఎంతైనా తల్లి హృదయం కదా మరి. !

చీర్స్
జిలేబి.