Tuesday, November 8, 2011

చేత వెన్న ముద్ద - మాలికా హార కూడలి పూదండ!

చేత బ్లాగు

పెట్టుకుని

ఎవడైనా

పత్రికల లో

ప్రచురణల కోసం

పుస్తక ప్రచురణ కోసం

దేవుర్లాడ తారా ?


మాలికా కూడలీ హారములు

చెంగల్వ పూదండ ఐ

ఉండ

వేరొక ప్రచురణ అవసరమా

చెప్పమ్మా బ్లాగిణీ ?

 చీర్స్
జిలేబి.

పీ.ఎస్: ఇది బులుసు గారి కి వర్తించదు.

Sunday, November 6, 2011

హారం లో నాకిష్టమైనది

హారం లో

నాకిష్టమైనవి

 వ్యాఖ్యలు


హా , అవి 

 నాకు రమ్మ్!

అసలు రాతలకన్న

ఈ కొసరు కామెంటులు

కొత్తావకాయ  లా  

నోరూరించే కారమ్ !

మరో పెగ్గుకి పిలుపులు !


రెండో పెగ్గుకి

చీర్స్ చెబుతూ

మీ
జిలేబి.

సందేహం ఏల జిలేబి - వాడు నీవాడే

సందేహం ఏల జిలేబి ?

'some' దేహం కొసం?

'sum' గా దేహాన్ని వదిలిపెట్టు


వాడు నీవాడే

కమల నయనుడు

కరుణార్ద్ర హృదయుడు

య ఏవం వేద !


చీర్స్
జిలేబి.

ఇది  దరి చేరిన పుష్పం కి సీక్వెల్

శ్రీ శర్మ గారి - కాలజ్ఞానం - 4- గురించి - నాకు తోచినది

ఆలోచనాతరంగాలు శ్రీ సత్యనరాయణ శర్మ గారి కాలజ్ఞానం నాలుగు వెలువడింది.

దీని గురించి నా వివరణ నాకు తోచినది -

వీరు ధర్మం నిద్ర లేస్తున్దంటారు. కాలజ్ఞానం నాలుగు లో.

కాలజ్ఞానం రెండు లో

విలాసపు మోజులో పడిన ధర్మం
కళ్ళు మూసుకుని ఊరుకుంటుంది
 
అంటారు.
 
ఒక దానికి ఒకటి contradictory గా ఉన్నట్టున్నాయి.
 
కాలజ్ఞానం నాలుగు లో నాకైతే ఎట్లాంటి ప్రత్యేకతలు కనిపించడం లేదు. ముప్పై సంవత్సరాలకొక సారి సామాన్యుడికి బలం వస్తుంది అంటారు . ఒక generation మారడానికి కాలపరిమితి ముప్పై సంవత్సారాలు అందాజగా.  అంతకు మించి ఎట్లాంటి విశేషం వారు సూచిస్తున్నారో తెలియదు.
 
చీర్స్
జిలేబి.

Saturday, November 5, 2011

దరి చేరిన పుష్పం


ప్రభూ


నమస్సులకీ


ప్రార్థనలకీ


నమాజులకీ

మౌన ధ్యానాలకీ


నీకూ నాకూ

మధ్య


వేరొక్కరు లేక
 
దరిచేరనీయి

 
నమస్సులతో
జిలేబి.

Friday, November 4, 2011

గోబీ మంచూరియన్ - అనబడు గ్లోబలైజేషన్

జర్మనీ వాడి వోక్స్ వాగను

జపాను సూషి

ఇటాలియన్ కట్లేరి

చైనా వాడి యూజ్ అండ్ త్రో ప్లేటు

ఇద్దరు ఇండియన్లు

గోబీ మంచూరియన్ సెర్వింగ్

వాచింగ్ కొరియన్ టీవీ

యూసింగ్ అమెరికన్ ఐఫోన్

స్థలం - యుంగ్  ఫ్రౌ కొండలు - స్విజేర్లాండ్

వెరసి

గ్లోబలైజేషన్

ఇవ్వాళ కాదేది కుదరక పోవటం

అయినా ఎందుకో జీవితం లో వెలితి అంటారు

నిజమా ? కలా ?

చీర్స్
జిలేబి.


Wednesday, November 2, 2011

సిద్ధార్థుని ఒంటరి పయనం


ఆకాశాన

ఒక నక్షత్రం నేల వైపుగా వచ్చింది.

ఓ శుభ నక్షత్రాన ఓ తల్లి ఓ బిడ్డని కన్నది.


ఒక నావ ఈవల తీరాన్ని విడిచింది.


నది వేగం జల వేగం కి ఎదురీతగా

పయనం సాగించడానికి ఆయత్తమైనది

సిద్ధార్థుని ఒంటరి  పయనం మొదలైంది.


చీర్స్
జిలేబి.

ఇది నది దాటిన నావ కి సీక్వెల్


Tuesday, November 1, 2011

నది దాటిన నావ

ఓ నది ఓ నావ ఓ మనిషి

మనిషి లంగరు తీసాడు

తెడ్డు వేసాడు
 
నావ  నదిని దాటింది.

నావ ని తిరిగి చూడకుండా

సిద్ధార్థుడు వెళ్లి పోయాడు


నావ నవ్వింది తీరం చేరబడి

 నది తన మానాన తాను సాగిపోయింది.



చీర్స్
జిలేబి

Monday, October 31, 2011

ఐ హేట్ జిలేబి

ఒక అవ్వ జిలేబీలు అమ్మేది


ఆ దరిదాపుల్లో ఎగిరే కాకి ఒకటి

అప్పుడప్పుడు జిలేబి వాసనల్ని పసిగట్టేది


కాకి కి అవ్వ వేడైన వడలు వేసిన కథలు తెలుసు  కానీ

జిలేబీలు చుట్టే అవ్వ దగ్గిర నించి జిలేబి లు ఎలా


లాగాలో తెలియలేదు.



అవ్వా అవ్వా, ఐ హేట్ జిలేబీలు అంది కాకి


పోనీలే అమ్మీ, జిలేబి లు వంటికి , పంటికి , కంటికి


మంచిది కాదులే అని ఓ మాంచి వేడైన జిలేబి ని


పక్కన పెట్టి నిద్ర పోయింది అవ్వ .


కాకి వేడైన జిలేబి ని ముక్కున కరుచు కొని పైకేగురుతూ


కావు కావు మన్నది.


ఇంకే ముంది జిలేబి జారి   పడ్డది.


నేనప్పుడే చెప్పాను గా జిలేబి పంటికి మంచిది కాదని అంది


అవ్వ  నిదుర మాని.


నిజం, ఐ హేట్ జిలేబి అంది  కాకి ,

నాట్ బికాస్ ఐ లవ్ వడ, బట్

కాలం మారినా  కథలు మార కూడదు, అందుకని.



కథ కంచికి , మనమింటికి.


చీర్స్
జిలేబి.

పీ ఎస్: ఇది ఫకీరు లడ్డు కి సీక్వెల్

Saturday, October 29, 2011

వరూధిని జిలేబి ఒక్కరేనా? - ఒక వివరణ

బ్లాగ్ భాన్దవులారా,

Disclaimer Statement

 

ఏదైనా అపోహలు ఉంటె వాటిని తొలగించడానికి ఈ టపా పునః  టపా కీ కరణం.  దయచేసి గమనించగలరు. 

ఈ బ్లాగుల్లో రాస్తున్న వరూధిని , జిలేబి ఒకరే వ్యక్తీనా లేక ఇద్దరనా అన్న సందేహం కొందరికి వస్తున్నది.

వరూధిని అన్న పేరుతొ నేను ఈ బ్లాగు మొదలెట్టాను. ఈ పేరెందుకు పెట్టానో నా మొదటి టపా లో తెలిపాను .

 ఆ పేరుతోనే మరి ఒక బ్లాగోదరి ఉన్నారని వారు కూడా ప్రముఖ బ్లాగు రైటర్ అని ఆ తరువాయి నాకు తెలిసింది.

కొంత మంది జిలేబి పేరు ఏమిటి ఈ విడకి ? - ఈ విడకి జిలేబి లంటే మరీ ఇష్టమా అని కూడా సందేహ పడి పోయారు

ఇందు మూలకం గా వచ్చిన సందేహాలకి సరి ఐన సమాధానం ఇవ్వ వలసిన భాద్యత నా దని భావించి  దీని మూలకం గా అందరికీ  తెలియ జేసు కోవటం ఏమనగా - బ్లాగ్ బాన్ధవులార- నా బ్లాగు పేరు మాత్రమె వరూధిని - నా పేరు జిలేబి. ఈ విషయాన్ని గ్రహించగలరు !

ఇట్లు
చీర్స్
చెప్పుకుంటూ
మీ వరూధిని, కాని జిలేబి.
మీ వరూధిని కాని జిలేబి.

పీ ఎస్: ఆ వరూధిని గారెవరో వారు కూడా నా లాగ ఒక Disclaimer ఇవ్వగలిగితే బెటరు !

Friday, October 28, 2011

ఫకీరు లడ్డు

ఫకీరు కి లడ్డు తినాలన్న

కోరిక కలిగింది

మనసు - ఆ హా

ఇంకా జిహ్వ చాపల్యం

వదల్లేదే అంది


బుద్ధి పొతే పోనీలే -

అంతా వాతాపి జీర్ణం

అని కానిన్చేయ్ అంది

ఫకీరు లడ్డు

లాగించి

బ్రేవ్ మన్నాడు

ప్రాణం గాలి లో కలిసి పోయింది



చీర్స్
జిలేబి

దీపావళీయం చదవదలచుకుంటే కింద లింకు నొక్కండి.

Thursday, October 27, 2011

గరమ్ నరం బేషరం !

పెళ్ళికి మునుపు
నేను షరం
తను గరమ్

పెళ్ళయ్యాక

నేను గరమ్
తను నరం

పరిష్వంగం లో ఇప్పుడు

ఇద్దరం మమేకం
గరమ్ నరం విడచి బేషరం !

చీర్స్
జిలేబి

దీపావళీయం చదవదలచుకుంటే కింద లింకు నొక్కండి.

ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే - ముఖాముఖి విత్ బులుసు సుబ్రహ్మణ్యం !

Wednesday, October 26, 2011

దీపావళీయం - ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే-బులుసు గారితో బ్లాగ్ముఖీ

బ్లాగ్ లోకానికి దీపావళి శుభాకాంక్షలతో - మీ జిలేబి సమర్పించు

ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే

బ్లాగ్ముఖి

ముఖాముఖి విత్ బ్లాగర్ 'బులుసు సుబ్రహ్మణ్యం'
(నవ్వితే నవ్వండి - వారి బ్లాగ్)

 


స్నిప్పెట్స్ :


మీకు నచ్చిన వంటలు ?

ఆహా! ! ఏమి గుర్తు చేసారండి. వంకాయ పచ్చడి ఉప్పిడి పిండి, పెసరట్టు ఉప్మాకి అల్లం పచ్చడి OK కానీ పుల్ల మజ్జిగ కలిపిన కొబ్బరి పచ్చడి ఓహ్, మరీను !


మీ పెళ్లి కలలు  ?

ఎలా ఐనా నా పెళ్ళికి బంగారు రోలూ, బంగారపు కట్లేసిన పగడపురోకలితో పసుపు దంచాలని కలలు కనేవాణ్ణి...హిహిహి.

 
దీపావళీ శుభాకాంక్షలతో

చీర్స్
జిలేబి.

Tuesday, October 25, 2011

ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే - ముఖాముఖి విత్ బులుసు సుబ్రహ్మణ్యం !

బ్లాగ్ లోకానికి దీపావళి శుభాకాంక్షలతో - మీ జిలేబి సమర్పించు

ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే

బ్లాగ్ముఖి  

ముఖాముఖి విత్ బ్లాగర్ 'బులుసు సుబ్రహ్మణ్యం'
(నవ్వితే నవ్వండి - వారి బ్లాగ్)


నమస్కారంబులు సుబాల సుబ్రహ్మణ్యం గారూ!


హతోస్మి ! నా పేరుకి మరో కలికి తురాయి !


మీ పరిచయం ?


హిహిహి నేనే.
రీజినల్ రీసెర్చి లెబోరేటరీ, జోర్హాట్ లో సైంటిస్ట్ గా పనిచేసాను. ఇప్పుడు 'Retyred'!


మీ పేరు కి మరో కలికి తురాయి అన్నారు ఎందుకు ?

వీరి వీరి గుమ్మడి ప౦డు వీరి పేరేమి ? పేరులో  ఏము౦ది అని తీసిపారే్సేవారు చాలామ౦ది అయితే, పేరులోనే పెన్నిధి ఉ౦ది అని నమ్మేవాళ్ళలో నేనొకడిని. సుబ్రహ్మణ్య౦ అని స రి గ్గా నోరారా ఎవరైనా పిలిస్తే పలకాలని ఒకకోరిక..

ఇ౦ట్లో సాధారణ౦గా ఒరేయ్ సుబ్బిగాఅని, ఎప్పుడైనా కొ౦చె౦ ప్రేమగా సుబ్బయ్యా అనో పిలిచేవారు.

ఆనర్సు చివరి స౦వత్సర౦లో ఒక చైనీయుడు ఇ౦గ్లీషులో పి.జి. చెయ్యడానికి వచ్చాడు.వాడు ఇ౦గ్లీషు ప్రొనౌన్సియేషన్ కి నానా త౦టాలు పడే వాడు.మహా దుర్మార్గుడైన మా మిత్రుడొకడు వాడికో సలహా పాడేసాడు. నాపేరు స్పష్ట౦గా పలకగలిగితే ఏ భాషనైనా సరిగ్గా ఉచ్చరి౦చ వచ్చును అని.

ఓ సాయ౦కాలము సమావేశ౦ ఏర్పాటు చేసాడు.వాడు ఉత్సాహ౦గా నా నామస్మరణ మొదలు పెట్టేడు. ’సు’ ని ’శు’ ని ఒకదాని మీద ఒకటి పెట్టి, ’శు’ కి౦ది మెలికని, ’సు’ పైకొమ్ముని ’జు’ తో లాగుతూ కుడికాలుని మడిచి ఎడ౦చేతితో ఒక పెదవిని పైకి లాగుతూ కుడి చేతివేళ్ళతో స్వర పేటిక నొక్కుకు౦టూ ఒక్కమాటుగా నోట్లో౦చి, ముక్కులో౦చి గాలి వదిలాడు.

అస్సా౦లో ఉద్యోగ౦లో ఉన్నప్పుడు నన్ను వివిధ రీతులలో పిలిచేవారు. ఒక మణిపూర్ ఆయన సుభ్ రామ్ అనే వాడు. ఓ బె౦గాలీ బాబు, సుబ్బొరోమొనియామ్ తో మొదలుపెట్టి సుబ్బొరోమ్ కి కత్తిరి౦చేసాడు.

ఇ౦కో కన్నడ సోదరీమణి సుభరమన్య౦ అనేది. బర్ అని, భర్ అని, బొర్ అని ’బ్ర’ ని పెట్టిన పాట్లు ఆహా చెప్పనలవి కాదు. ’హ్మ’ అనే అక్షర౦ నా పేరులో ఉ౦దని నేనే మరచిపోయాను.

చిత్రమైన విషయం ఏమిటంటే సంస్కృతం వచ్చిన త్రిపాఠి లు, చతుర్వేది లు కూడా నా పేరు ముక్కలు చేసేవారు.

బులుసు మాష్టారి అబ్బాయి గా అవతరి౦చి, శ్రీలక్షమ్మగారి భరతగా ఎదిగి, సిరి కా పాపా గా పరిణామ౦ చె౦ది, చివరకు స౦జన తాతగారి లా మిగిలిపోయాను.

ఒక బ్లాగరైతే ఏకం గా నన్ను - "ప్రియమైన సఉబరహమణయమఉ గారికి సాదర ప్రణామములు" అన్నాడు !


 

మీ వయసు ?


చాలా  పురాతనమైన వాడిని.నా వయసు ఇంకా అరవై ఆరే.

 

రిటైర్ అయ్యాక మీరేమి చేస్తున్నారు ?


గత మూడేళ్ళుగా రిటైరయ్యి ఇంట్లో కూర్చున్నప్పటినించీ నేను జ్ఞాని నయిపోతున్నా ఈ మధ్యన తెగ జ్ఞానం సంపాదించేస్తున్నానేమోనని అనుమానం డౌటు కలిగింది. ఎడా పెడా, కుడీ ఎడమా, రెండు చేతుల తోటీ జ్ఞానం అర్జించేస్తున్నానని నమ్మకం కూడా కలిగిపోతోంది.

ఇంత జ్ఞానం ఇల్లా సంపాయించేస్తుంటే బ్రహ్మజ్ఞానిని అయిపోతున్నానేమోనని అనుమానం వచ్చేస్తోంది.

 మొన్నోకల కూడా వచ్చింది. బాసింపట్టు వేసుకొని, కళ్ళు తెరిచి నేను తపస్సు చేసుకుంటున్నాను. రెండు కళ్ళకి ఎదురుగా రెండు టీ.వీ లు, చెరోపక్కా రెండు చెవులకి ఇంకో రెండు టీ.వీ లు (చెవులకి టీవీ లు ఎందుకు? రేడియో చాలదా అని ప్రశ్నలు వేయకండి.నా కల, నా ఇష్టం)


 

మీ శ్రీమతి గురించి .... ?

కొంతమందికి ఊత పదాలుంటాయి. కాని మాఆవిడకి ఊతవాక్యాలే ఉన్నాయి. నో పదమ్సు, ఓన్లీ వాక్యమ్స్ అన్నమాట.

పెళ్ళికి ముందు మాఆవిడ నాఫొటో చూసింది కాని నాకు ఆభాగ్యం కూడా కలుగలేదు.నో పెళ్ళిచూపులు. మారేజి లుక్స్ పెళ్ళిలో తెరతీసిన తర్వాతే నన్నమాట.

“ మీ మొహం, మీకేం తెలుసండి” అని. ఇవి మాఆవిడ నాతో మాట్లాడిన మొదటి మాటలు, ప్రేమ సంభాషణ, తొలి పలుకులు, లవ్ నతింగ్స్, మొహబ్బతికి బాతేం.

“మీర జాల గలడా నాయానతి సతీ ద్రౌపదీ పాక మహిమన్” అని పాడు కుంటూ పొద్దుటి నించి నన్ను తిండి పోతు ని చేసి నీరసం వచ్చేలా చేసిందంటే నమ్మండి !

భరించువాడు భర్త అంటారు. కాబట్టి ఆవిడ ఏమన్నా భరించక తప్పుతుందా. పెళ్ళైన తర్వాత ఆడువారికి జ్ఞానం పెరుగును, మగవారికి తరుగును అని ఓ సన్యాసి నాకు  చెప్పాడు.


 

మీ ఆవిడ చేసే తప్పులకి మీరెలా స్పందిస్తారు ?

 

సాధారణంగా మాఆవిడ చేసే తప్పులు రోజుకి నాల్గైదు అయితే క్షమించేస్తాను. అంతకు మించితే ఆగ్రహిస్తాను. ఆగ్రహించి చేసేదేమీ లేదు కనక ఇల్లాంటి రోజులు నాలుగు లెఖ్ఖ పెట్టుతాను. మరుసటి రోజున మౌన నిరసన వ్రతం చేస్తాను. ఎదో విదంగా మరి నా అసమ్మతి తెలియచెయ్యాలి గదా. ఉద్యమిస్తే పోయేది భార్య కాదు. ఆమె చేతిలో మన మానప్రాణాలు!

 

ఆహా భార్యావిధేయుడనని చెప్పుకుంటూ, ఆవిడ మీద వ్యంగ టపాలు రాస్తారని పురుషహంకార ఆభిజాత్య కుట్రలు.?

 

ప్లీజ్ మాఅత్తగారికి, మాఆవిడకి అసలు చెప్పకండి. పెద్దవాడిని ఉపవాసాలు ఉండలేను.



మీ పక్కింటి పంకజాక్షి గురించి నాలుగు ముక్కలు ... ?

 

రిటైర్ అయిన మరుసటి రోజు నేను మృదు మధుర శాంత స్వనంతో మా ఆవిడని ఉద్దేశించి “ దేవీ శ్రీదేవి, ఆర్యపుత్రీ, ఓ కప్పు కాఫీ కావాలి” అని దీనంగా అభ్యర్ధించాను.

 మాఆవిడ విందో లేదో నాకు తెలియదు కాని మా పక్కింటి పంకజాక్షి వినేసింది.

ఆవిడ కు ఉన్న ఏకైక పని మాఇంట్లో దూరదర్శన్, దూరశ్రవణ్ ప్రసారాలను monitor చేసి పున:ప్రసారం చేయడం. నామాట వినడం, వాటికి ఇంకో రెండు విశేషణాలు జోడించి, వాటిని తన మొబైల్ లో SMS చేసెయ్యడం జరిగిపోయింది.

అదేదో వల పని(Net working) ట ఒక నొక్కుతో పాతిక మందికి పంపవచ్చుట.

ఈవిడ మూడు నాలుగు నొక్కులు నొక్కిందనుకుంటాను. అంతేకాదు లాండ్ లైను, మొబైలు ఉపయోగించి ఇంకో అంతమంది కి ’అడక్కుండానే సమాచారం మీచెవిలో’ స్కీము లో ప్రసారం చేసేసింది.

ఒక పావు గంటలో ’ఆల్ నెట్ వర్క్స్ ఆర్ బిజి’ అయిపోయాయి. మా ఆవిడ మొబైలు వెరీబిజి. SMS లు శరవేగంతో వచ్చేసాయి. నా పాట్లు ఇంకా చెప్పాలంటారా ?

 

బుద్ధి, జ్ఞానం మీద మీరు రిసెర్చ్ చేసారట ?

 

బుద్ధి, జ్ఞా న౦ మీద మాస్నేహితుల౦దర౦ చాలా తీవ్ర౦గా పరిశోధనలు చేసా౦.

ఎదురి౦టిలో పరికిణి, జాకెట్టు వేసుకుని తిరిగేది అమ్మాయి అని తెలుసుకోవడ౦ బుద్ధిఅని, ఆఅమ్మాయి జోలికి వెళ్తే పళ్ళు రాలతాయని తెలుసుకోవడ౦ జ్ఞా న౦ అని.

ఆ తర్వాత ఈవిషయ౦లో నేను సమగ్ర పరిశోధన చేసి, యూనివర్సిటి వదిలేటప్పటికి వెధవ పనులు ఎలా చేయడమో్ తెలుసుకోవడ౦ బుధ్దిఅని, ఆపై తిట్లు, తన్నులు తప్పి౦చుకోవడ౦ జ్ఞా న౦ అని కనిపెట్టాను.

ఉద్యోగ౦లో చేరి౦తర్వాత పని చేయకు౦డా తప్పి౦చు కోవడ౦ బుద్ధి అని, అ౦తా మనమే చేసినట్టు కనిపి౦చడ౦
జ్ఞా న౦ అని నిర్ధారణకు వచ్చేసాను.

ఏమీ తెలియకపోయినా అ౦తా తెలిసినట్లు ఎదుటివారిని నమ్మి౦చడ౦ జ్ఞానానికి పరాకాష్ట అని గ్రహి౦చాను.


 

మీకు జ్యోతిష్యం మీద నోబెల్ బహుమతి వస్తోందటగా?

 

జ్యోతిషం మీద కాక పోయినా, బొందాక్సైడ్ మీద చచ్చేటట్టు పరిశోధనలు చేసినందుకు, నోబులు బహుమతి వచ్చేస్తోంది.

 

తెలుగు మీద, మీ మాస్టర్ల మీద మీ అభిప్రాయం ?

 

తెలుగుమీద ఇప్పుడు బోలెడు అభిమానం ఉన్నా, చిన్నప్పుడు తెలుగంటే నాకు చాలా భయం ఉండేది. మా మాష్టార్లు, ఒకరిద్దరు తప్పితే, మాకు టిఫిన్లు బాగా పెట్టేవారు. పెసరట్టు, మినపరోస్ట్ వీపుమీద, కొంచెం లైట్ గాపడితే పెసరట్టు, అరచేతి ముద్రలు కూడా ముద్రిస్తే మినపరోస్ట్ అని అర్ధం. తొడమీద గిల్లితే పకోడి అనీ, మెలిపెట్టి గిల్లితే పునుకులు అనీ, బుగ్గమీద పొంగిస్తే బూరెలు అనీ, అరచేయి వెనక్కి తిప్పి ముణుకులు వాయగొడ్తే కజ్జికాయలు, మైసూర్ పాక్ అనీ అనేవాళ్ళం.

క్లాసులో అందరూ ఐన్ స్టీన్ లే ఉండరు. నాలాంటి మిడతంభొట్లుగాళ్ళు కూడా ఉంటారు. మాగురువులు అంటే మాకు అభిమానం, గౌరవం. మాగురువులు మాకు పాఠాలు. నేర్పారు, I repeat, నేర్పారు , అవసరమైతే ఓ దెబ్బవేసి. చదువు దాని ప్రాముఖ్యత గురించి, మా తల్లి తండ్రుల కన్నా మాగురువుగార్లే ఎక్కువగా చెప్పారు. బహుశా వాళ్ళు మామీద అంత శ్రద్ధ తీసుకోక పోతే, ఈనాడు ఈమాత్రమైనా మేము ఎది్గేవారం కాదు..


 

మీది ఒంగోలా? అయితే ఒంగోలు శీను తెలుసా ?

 

నాకు ఒంగోలు గిత్త తెలుసు. దానిపేరు చీను అని తెలియదు,శీను గారి గురించి నాబ్లాగులో ఎందుకు వెతుకుతున్నారో నాకు అర్ధం కావటంలేదు. వారు మీకు త్వరలో దర్శనమివ్వాలని కోరుకుంటున్నాను.

 

మీ జీవితం లో ముఖ్యమైన రెండో మనిషి ?

 

నాజీవితంలో ముఖ్యమైన రెండో మనిషి, ఎప్పుడూ నన్ను విమర్శించే మా బాసు గారు, ఏపనీ సరిగ్గా చేయవేమోయి శంభులింగం అనీ, అసలు నీకు చేతనైన పని ఏదైనా ఉందా శంకరనారాయణా అనీ, నాకు అధికారాలు లేవుకానీ, ఉంటే నీకెప్పుడో ఉద్వాసన చెప్పేసేవాడిని సింహాచలం అనీ, అనేవాడు. నా ప్రమోషను కాగితం పట్టుకొని, పదిహేనేళ్ళు ఒకే సీట్లో కూర్చున్నవాళ్ళందరికి ఇవ్వాలని రూలుండబట్టి నీకు ఇవ్వాల్సివచ్చింది భజగోవిందం అని విచారించాడు. నన్ను ఎవరూ ఆదర్శంగా తీసుకోకూడదని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్ధించి, రెండు నిముషాలు మౌనం పాటించి మరీ ప్రమోషను ఆర్డరు చేతికి ఇచ్చాడు.

మీరు ఎప్పుడు బ్లాగటం మొదలెట్టారు ?


జూన్ 12, 2010 న బ్లాగు మొదలు పెట్టాను. 14 న మొదటి టపా వేశాను. సంకలినులు ఉన్నాయని అప్పుడు తెలియదు. రెండు టపాలు వేసిం తరువాత  జూలై 1 న కూడలి లో చేర్చాను.  ఆ తరువాత మాలిక, జల్లెడ లలో చేర్చాను  15-20  రోజుల  తరువాత. హారం లో నా బ్లాగు లేటు గా చేర్చాను.  8  టపాల తరువాత అనుకుంటాను.  అన్ని సంకలినుల నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.  నా బ్లాగులో మొదటి కామెంటు    శ్రీలలిత గారు  పెట్టారు. 21 టపాలకీ సుమారు గా 570 కామెంట్లు వచ్చాయి.  శ్రీలలిత  గార్కి  హృదయ పూర్వక  ధన్యవాదాలు చెప్పుతున్నాను.  నా మొదటి టపాకు  ఒకే ఒక్క కామెంటు  తార గారిది.  మొదట్లో  బ్లాగుల గురించి అంతో ఇంతో నేను తెలుసుకున్నది తార గారి ద్వారానే. వారికి నా కృతజ్ఙతా పూర్వక ధన్యవాదాలు.  కామెంట్లు పెట్టిన వారందరికి హృదయపూర్వక కృతజ్ఙతాభి వందనములు.


అదేమీ పేరు బ్లాగుకి - నవ్వితే నవ్వండి అని ?

మీరంతా నవ్వుతారా, నవ్వి పోతారా, ముత్యాలు దొర్లిస్తారా, లేదా అనే నా  ఆదుర్దా నాది. నా హాస్య చతురత సామాన్యమే. మీ అందరి అభిమానమే నాకు శ్రీరామ రక్ష.



మిమ్మల్ని లేపెస్తామన్నవాళ్ళూ, కిడ్నేప్ చేస్తామన్న వాళ్ళూ ఉన్నారంట ?

నన్ను లేపేస్తానన్నవారు ముగ్గురు నలుగురు ఉన్నారు. గీతాంజలి లో లాగైనా లే...చి..పో..దా..మా. అన్న వారూ ఉన్నారూ  సంతోషం, అల్లాగే తప్పకుండా. కానీ ఒక చిన్న చిక్కు ఉంది. నాది కొంచెం భారీ శరీరం. దాన్ని లేపాలంటే ఓ crane కావాలి. అది పట్టుకొచ్చారంటే నన్ను లేపుకుపోవచ్చు.

అయినా నన్ను కిడ్నాప్ చెయ్యడానికి ముఠాలు, ప్రణాళికలు, అనవసర హైరానా ఎందుకు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వచ్చేస్తాను. కానీ మళ్ళీ నన్ను వదుల్చుకోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి మరి. జాగ్రత్త.


మీ టపాలు చదివి మలక్పేట్ రౌడీ లాంటి వాళ్ళే భయపడ్డారట !?

 

ఎంత పోరినా, హత్యలు చేసినా, ఎంత రౌడీ అయినా, భార్యా బాధితుడే కదండీ మరీ !

 

మీరు పరభాషా చిత్రాలు చూస్తారా ?

 

నేను జోర్హాట్ లో ఉద్యోగంలో చేరిన కొత్తలో ఓ ఆదివారం, తెల్లవారు జామున అంటే సుమారు 8.30గం మా సమరేంద్ర నాధ్ సేన్ గారు భళ్ళున తలుపు తోసుకొని వచ్చి నన్ను కంగారు పెట్టేసాడు. లే లే ఇంకా పడుకున్నావా. టైము అయిపోతోంది అంటూ. విషయం అర్ధం కాకపోయినా నేను తయారయి రాగానే నన్ను సైకిలు మీద ముందు కూర్చోపెట్టి రయ్ రయ్ మని రొప్పుతూ రోజుతూ తొక్కేస్తున్నాడు.

నేను ఎక్కడికి అనగానే ముయ్ నోరు అన్నాడు. నేను నోటితో పాటు కళ్ళు కూడా మూసుకొన్నాను. కళ్ళు తెరిచి చూసేటప్పటికి నేనో సినిమా హాల్లో సుఖాసీనుడనై ఉన్నాను. సరిగ్గా టైము కి వచ్చామని సేను గారు ఆనం దించి నన్ను కూడా దించమన్నాడు.

తెర మీద మనకి అర్ధం కాని భాషలో, అక్షరాలో, అంకెలో కూడా తెలియకుండా వచ్చేసి, సినీమా మొదలై పోయింది. ఏమీ అర్ధం కావటం లేదు. అయినా అల్లాగే చూస్తున్నాను

ఓపది నిముషాల తర్వాత సినిమాలో ఓ కాకి వచ్చింది. కావ్, కావ్, కావ్, కావ్ మని నాలుగు మార్లు కావుమంది. మా సేనుడు వహ్వా, వహ్వా అన్నాడు. ఇంకో కొంతమంది కూడా వహ్వా, శభాష్, బ్యూటిఫుల్, అని ఆనంద పడిపోయారు. నేను కూడా కొంచెం ఆలోచించి లేచి నుంచుని వహ్వా అనబోతుండగా సేన్ గారు నా చేయిపట్టి లాగి కూర్చోపెట్టాడు.

తెరమీద సీను మారిపోయింది. ఇప్పుడు ఒకాయన ఓ పంచను రాతి కేసి కొట్టేస్తున్నాడు. ఉతుకుతున్నాడన్నమాట. మా సేను కళ్ళలో విషాద నీరు. నాకు కోపం వచ్చేసింది. ఏంజరుగుతోంది, ఆ కాకి ఎందుకు కావ్ మంది అని అడిగాను.

 కాకి కావ్ మనక భౌ భౌ అంటుందా అని కోప్పడ్డాడు సేను గారు. అపుడు నాకేమీ అర్ధం కాక, పూర్తిగా అయో మయావస్థలో, బెంగాలీ సినీమాల్లో అందులో సత్యజిత్ రే సినీమాలో, కాకులు ఎందుకు భౌ భౌ మన వని పెట్టిన కొచ్చెను మార్కు మొహం..

 

పెళ్ళికి మునుపటికి తరువాయి కి వ్యత్యాసం ?

 

అప్పటి కింకా పెళ్ళి కాలేదు. ’అయినా’ నాకు ముగ్గురు బాసులుండే వారు." పెళ్ళైతే ఒకే ఒక్క బాసు అని పెళ్ళైతే కానీ తెలియలేదు.

 

మీరు యోగా నేర్చుకున్నారటగా ?

 

ఆత్మ ప్రభోధానుసారం, యోగా నేర్చుకుందామని అనుకున్నవాడనై, మా కాలనీలో యోగా నేర్పువారి కోసమై గాలించితిని. మా కాలనీలో ముగ్గురు యోగా గురువులు ఉన్నారని తెలిసింది.

ఇద్దరు మగ గురువులు, ఒక ఆడ గురువు. సహజ ప్రకృతి దోష ప్రభావమున, పరస్పర అయస్కాంతాధారిత విజ్ఞాన సూత్రాదేశముల వలనను, మొదటగా రెండవ వారి దగ్గర నేర్చుకొనవలనను ఉత్సుకత కలిగినది.

ఓ శుభ సాయం సమయమున, పిల్లలు ట్యూషనుకు వెళ్ళు వేళ, ఆటో వాళ్ళు మీటరు మీద పది రూపాయలు అడుగు వేళ, గృహంబునకు అరుగు దెంచు శ్రీపతులకు, శ్రీమతులు ఆలూబొండాలు, బజ్జీలు వేయు వేళ, సువాసనలను ఆఘ్రాణించుచూ ఆడగురువు గారి గృహాంగణమున అడుగు పెట్టినవాడనైతిని.

నా రాకను మాగురువుగారి పుత్రశ్రీ ఇంటిలో సమాచారము ఇచ్చినవాడయ్యెను. ఒక పది నిముషములు అతి భారముగా గడిచిన పిమ్మట, ఓ మధ్య వయస్కుడు, సుమారుగా నలభై ఏళ్ళ వయసు గలవాడు నా ఎదుట ప్రత్యక్షమైనాడు. "I am Sailajaa naath, What can I do for you ?"అన్నాడు.!


నా కాలి క్రింద భూమి కంపించెను. ఆకాశమున ఫెళ ఫెళా రావము లతో ఉరుములు, మెరుపులు గర్జించెను, మెరిసెను. సముద్రమున అలలు ఆకాశమున కెగసెను. పర్వతములు బద్దలయ్యెను.

 

మా ఏడుకొండలవాడి గురించి మీ అభిప్రాయం ?
 

శ్రీవెంకటేశ్వర స్వామి ఒక విధమైన నిద్ర మత్తు లో ఉంటున్నారు రాత్రి 12.30 గం నిద్రపుచ్చి నట్లే పుచ్చి, 1.30 గం లకు సుప్రభాతం పాడుతున్నారు. వారికి విశ్రాంతి, నిద్ర రెండు నూ లేవు. వారి వంటిమీద, వారి ఖజానాలోనూ యున్న ఆభరణములు మాయమైననూ వారికి తెలియ లేదు. బ్రహ్మ, శివ, దేవేంద్రాది దేవతలు పెద్ద పెద్ద గొంతుకలతో స్తోత్రము చేసిననూ వారికి వినిపించుట లేదు. నేనెంత, నాగొంతు కెంత, నా అభిప్రాయాలకి విలువెంతంటారు జేకే గారూ ?



మీ 'నేను ఎందుకు రాస్తున్నాను " టపా మీద చెలరేగిన దుమారం, విమర్శకి లోనయ్యిందని వినికడి ?



ఈనాటె బ్లాగు పోకడల గురించి సరదాగా, నవ్వుకోవడం కోసం వ్యంగంగా రాసిన వ్యాఖ్యానం “నే నెందుకు వ్రాస్తున్నాను” అన్న నా రచన. ఇందు కోసం అలనాటి పురాణ రచయితలని, కధలు చెప్పిన వారిని , గురించి కొంచెం సరదాగా, హాస్యం కోసం రాయడం జరిగింది. అంతే తప్ప వారిని, తద్వారా పురాణాలని కించపరచడం నాఉద్దేశ్యం కాదు. ఒక వేళ ఎవరైనా అల్లా అభిప్రాయపడితే వారికి నా క్షమార్పణలు చెప్పుతున్నాను.
పురాణాల గురించి, మతం గురించి కాని చర్చించే టంతటి జ్ఞానం నాకు లేదు. అది ఈ బ్లాగులో నా ఉద్దేశ్యం కాదు. సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

నేను పురాణాలు ఆట్టే చదవలేదు. కాబట్టి వాటి గురించి చెప్పే అర్హత నాకు లేదు. ఏపురాణమైనా, మతమైనా మనిషి ని సన్మార్గంలో నడిపించడానికి, సత్ప్రవర్తన అలవర్చుకోవాలని బోధిస్తాయి. అది అందరూ చెపుతున్నారు. మళ్ళీ ఈ విషయం మీద నాబ్లాగులో చెప్పాల్సిన అవసరమూ లేదు.

 

ఉజ్వల భట్టాచార్య తో మీ  అఫైర్ ?


నావలో కూర్చుని “లాహిడ్ లాహిడ్ లాహిడ్ లూల్ జంగమే హుయాళా హుయలా” అని పాడేస్తోంది అనుకున్న నాకు షాక్- ఉ.కృ.నా.మీ అయితే రెండు రోజులు తేరుకోలేదు.

మరి ఇలియానా మాటో ?

  
ఎవరూ, రంగమ్మ గారా?  లిఫ్ట్ లోకి అడ్డంగా కానీ వెళ్లలేని ఆవిడా ? చాలా కాస్ట్లీ అఫైర్ అది. జేబు చిల్లు పడింది ఎక్కువ. చమురు వదిలిందీ ఎక్కువే ! చమురు ఎంత వదిలినా ఆరోగ్యమే మహా భాగ్యము కదా.
ఎప్పుడు అవకాశం వస్తుందా అపార్ధం చేసుకోవటానికి అని ఎదురు చూస్తున్నారా మీరు. దొరికి పోయానా ? 

ఈ విషయం అమ్మగారికి చెప్పమంటారా ? 


ప్రతిదీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లతానంటారు. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారా ఏమిటీ?

మీరు కొత్త ఫిట్టింగ్ లు ఏమి పెట్టకండి. ప్రభావతి గారు ఎప్పుడూ దుర్గాదేవి లాగా కళకళ లాడుతూ కనిపిస్తుంది ప్రద్యుమ్నుడికి.  

మీకు  బ్లాగ్ లోకం లో  జంధ్యాలగా,  ముళ్ళపూడి గా  గుర్తింపు ?

 

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. ఏమిటోనండి సీరియస్ గా గంభీరంగా రాద్దామనే ప్రయత్నిస్తాను. మరి అందులో కూడా హాస్యం చూసే సహృదయులు మీరు.

ఒక బ్లాగరి  జంధ్యాలగారి లా అన్నారు. కొందరి కి పానుగంటి వారిలా రాసాని అనిపించింది. మరి కొందరికి చిలకమర్తి జ్ఞాపకాని కొచ్చారు . (ఎవరూ బులుసు లా రాసేరాని మేచ్చుకోరేమిటి చెప్మా? )

వారి స్థాయిలో కనీసం ఓ 10-15% అందుకున్నా ధన్యుడిని అయినట్టే అనుకుంటాను. దానికే నా జీవిత కాలం సరిపోతుందా అని అనుమానం. కానీ వీరిద్దరి కన్నా నేను ముళ్ళపూడి గారిని అబిమానిస్తాను. వారు చేసే మాటల గారడీ మరెవరు చేయలేరనిపిస్తుంది నాకు. థాంక్యూ.

 

మీ బ్లాగుకి వచ్చిన వందలాది కామెంట్లు చదివి మీరెలా ఫీల్ అయ్యారు ?

 

కామెంట్లు రాసిన వారందరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, థాంక్యూ.
మావుల గుంపులందు మధుమాసములన్
వికసించు కోకిలారావము వోలె (వేదుల)
వినిపించాయి మీ సుమధుర వ్యాఖ్యలు!

మీ బ్లాగు దర్శకులకి మీ ఆహ్వానం ?


స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను
ఆ పరిచిన పూల మీదుగా ఇలా నడిచి రండి
ఆ సింహాసనం అధిష్టించండి
ఈ పూలగుచ్చం స్వీకరించండి
ఈ గజమాల వేయనీయండి
ఈ పట్టుశాలువా స్వీకరించండి
ఈ కానుకలు స్వీకరించండి
నేను విసురుతున్న వింజామరనుంచి
వీచే మలయమారుతాన్ని ఆస్వాదించండి
పళ్ళు ఫలహారాలు భోంచెయ్యండి
మీకోసం ప్రత్యేకం గా తయారుచేయించిన
జున్నుపాల పరమాన్నం ఆరగించండి


మీ ఇంటి లాండ్ లేన్ నెంబర్ ఇస్తారా ?


నా జీవితం తెరిచిన BSNL వారి హైదరాబాదు టెలీఫోను డైరక్టరీ. అనవసర విషయాలు ఎక్కువ, అవసర విషయాలు నిల్. చిన్న చిన్న అక్షరాలలో Dr. B. Subrahmanyam, South End Park అన్న చోట ఉండే నంబరు నాదే నాదే. మీకు లావుపాటి కళ్ళద్దాలు ఉంటే అందులోంచి చిన్న అక్షరాలు కనిపించవు ఆనుకుంటే 040 24122304 కి టెలిఫోన్ చేసి చూడండి. ఆపైన మీ అదృష్టం.

Concept by  Zilebi
జేకే - JUST KIDDING !
ABN - Active Bloggers Network 
- ఆంద్ర జిలేబి - ఇంకెవరు నేనే !

చీర్స్
జిలేబి.

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే - ఎవరా బ్లాగరు - బ్లాగ్ముఖిలో రాబోయేది ?

మీ పేరు ?

పేరులో ఏము౦ది అని తీసిపారే్సేవారు చాలామ౦ది అయితే, పేరులోనే పెన్నిధి ఉ౦ది అని నమ్మేవాళ్ళలో నేనొకడిని

ఓ "ఫన్ ఆర్ట్" విత్ జేకే

బ్లాగ్ లోకపు ప్రధమ సర్జరీ

 
వేచి చూడండి - దీపావళి స్పెషల్

బ్లాగ్ ముఖా ముఖీ - బ్లాగ్ముఖీ !

ఇది ఒక ABN ఆంధ్రా జిలేబి సహ సమర్పణ !


చీర్స్
జిలేబి.

Monday, October 24, 2011

కామెంటిన కనకాంగి కోక కాకి ఎత్తుకు పోయిందని ....

నా కలలో పండిన ' బ్లాగ్వెతలు' !

కామెంటిన కనకాంగి కోక కాకి ఎత్తుకు పోయిందని ....

టపా టప టప టైపాడిస్తే చాలదు , కామెంట్లూ పండాలి

జగమెరిగిన బ్లాగరునికి సంకలిని ఏల ?

కానక కానక కామెంటు పెడితే , కరెంటు పోయిందట !

ఈ బ్లాగుకి ఆ బ్లాగు ఎంత దూరమో, ఆ  బ్లాగుకి ఈ బ్లాగు కూడా అంతే దూరం !

కొత్త బ్లాగరు 'కూడలి ' వదలడు, కొత్త బ్లాగిణి హారం వదలదు!

టపాలు రాసి కూడలి లో కామెంట్లకోసం దేబరించే మొహమూ నువ్వూను !

చీర్స్ సరిగ్గా చెప్పలేని  చెంచు లచ్చి , బ్లాగాడటానికి వచ్చిందట
 

చీర్స్
జిలేబి.

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే - బ్లాగ్ లోకపు ప్రధమ సర్జరీ - ఎవరి పై ?

జేకే - మీ పేరు ?

వీరి వీరి గుమ్మడి ప౦డు వీరి పేరేమి ? 

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే
బ్లాగ్ లోకపు ప్రధమ సర్జరీ - ఎవరి పై ? 
 వేచి చూడండి - దీపావళి స్పెషల్
బ్లాగ్ ముఖా ముఖీ - బ్లాగ్ముఖీ !

ఇది ఒక ABN ఆంధ్రా జిలేబి సహ సమర్పణ !

చీర్స్
జిలేబి.

Sunday, October 23, 2011

డైరెక్టర్ జనార్ధన మహర్షి (ధనాధన్) చిత్తూర్లో దేవస్థానం షూటింగ్

ఇద్దరు  కళా అఖండులు - కే విశ్వనాధ్ , ఎస్పీ బాలు ముఖ్యమైన నటులు గా

మా వూరి పొట్టబ్బాయ్ ధనాధన్ అనబడు జనార్ధన మహర్షి  దర్శకత్వం లో - దేవస్తానం అన్న చిత్ర రాజం చిత్తూర్ లో షూటింగ్ ప్రస్తుతం జరుపుకుంటోంది.

ఈ చిత్రం లో ఆమని కూడా నటిస్తోందట !

ఈ పొట్టబ్బాయ్ చాలా పెద్ద వాడే అయ్యాడు సుమీ ! ఏమిటో ఆ కాలపు వెదవాయి అనుకున్నాను సుమీ !



చీర్స్ జిలేబి.

Saturday, October 22, 2011

ఓ "ఫన్ ఆర్ట్ " విత్ జే కే - కౌంట్ డౌన్ బిగిన్స్

ఓ "ఫన్ ఆర్ట్ " విత్ జే కే
బ్లాగ్ లోకపు ప్రప్రథమ వెరైటీ టపా 
దీపావళి స్పెషల్

ఫ్లాష్ ఫ్లాష్
వేచి చూడండీ.
కనీ వినీ ఎరుగని - ఇంతదాకా బ్లాగని వెరైటీ టపా
బ్లాగ్ లోకం లో ప్రప్రథమం !

బ్లాగ్
 లోకపు
పేరు గాంచిన బ్లాగర్ తో
ఓ ఫన్ ఆర్ట్ విత్ జే కే - వెరైటీ షో !
ఇది ఒక ABN ఆంధ్రా జిలేబి దీపావళి స్పెషల్ !

జేకే చేత 'ఓ ఫన్ ' ఆర్ట్ సర్జరీ చేసుకో బోయే వారెవరు ?
జే కే ఎవరు ?
ABN ఎవరు ?
ఎవరా మొదటి బ్లాగర్ ?

కౌంట్ డౌన్ బిగిన్స్  

చీర్స్
జిలేబి.

చకు చకు చమకుల బండి - నమ్మ మెట్రో అండి!

చకు చకు చమకుల బండి
లంఖణాల బండి
పదిహేను రూపాయల బండి
నమ్మ మెట్రో అండి!
చల్ చల్
విద్యుత్ బండి
సైలెంటు బండి
కుదుపులు లేని బండి
మన మెట్రో బండి

జోడురైల్ల బండి
వెళ్ళేది ఆకాశం లో
జూమ్మనేది గగనం లో
చకు చకు చమకుల బడి
మన మెట్రో అండి !

చీర్స్
జిలేబి.

Friday, October 21, 2011

ఓ ఫన్ ఆర్ట్ విత్ JK - బ్లాగ్ లోకపు ప్రప్రథమ వెరైటీ షో - దీపావళి స్పెషల్

ఓ "ఫన్ ఆర్ట్ " విత్ JK 

బ్లాగ్ లోకపు ప్రప్రథమ వెరైటీ షో - దీపావళి స్పెషల్

ఫ్లాష్ ఫ్లాష్

వేచి చూడండీ.

కనీ వినీ ఎరుగని - ఇంతదాకా బ్లాగని వెరైటీ షో !

బ్లాగ్ లోకం లో ప్రప్రథమం !

వెరైటీ షో

ఓ ఫన్ ఆర్ట్ విత్ జే కే - వెరైటీ షో !

ఇది ఒక  ABN ఆంధ్రా జిలేబి దీపావళి స్పెషల్ !

జేకే చేత 'ఓ ఫన్ ' ఆర్ట్ సర్జరీ చేసుకో బోయే వారెవరు ?

జే కే ఎవరు ?
ABN ఎవరు ?
ఎవరా మొదటి వ్యక్తీ  ?

చీర్స్
జిలేబి.

ఇంటర్నెట్ రే డియో - !

ఇంటర్నెట్ రే డియో !

జ్యోతి గారు ఇంటర్నెట్ రే డియో గురించి టపా రాసారు. పై ఇంటర్నెట్ రే డియో WIFI ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. వేలాది ఇంటర్నెట్ రే డియో చానల్స్ వినవచ్చు. ( కంపూటర్ అవసరం లేదు!) అంతే కాకుండా పై రే డియో FM రే డియో లా కూడా పని చేస్తుంది. !


చీర్స్
జిలేబి

ఇంటర్నెట్ రే డియో

Wednesday, October 19, 2011

బ్లాగని బ్లాగిణి బ్లాగరుని గ్రక్కున విడువ వలె

వ్రాసిన చదువని టపా

 కామెంటిన నప్పని కంటెంటు

'సంకలిని ' చేరని

బ్లాగరు - బ్లాగిణి

బ్లాగని బ్లాగిణి బ్లాగరుని

గ్రక్కున విడువ వలె 

గదవే జిలేబి.

చీర్స్
జిలేబి.

Tuesday, October 18, 2011

చౌ చౌ బాత్ -సెట్ దోస -బై టూ కాఫీ - నమ్మ మెట్రో

బెంగుళూరు మహానగర

చౌ చౌ బాత్
సెట్ దోస
బై టూ కాఫీ


 లాంగ్ వైటేడ్
నమ్మ మెట్రో
బరుత్తదంతా స్వల్ప వె కాల దల్లి


సుమ్మనిరుప్పా -
రాజ్య ముందరిగే  హొగిత్తుదాఇయదే
రాజ్య నాయకరు కంబి ఎన్నుత్తదారే !

నమ్మ మెట్రో - బందే బందు
నోడనే బేకు బెంగుళూరు సొగసే సొగసు

చౌ చౌ బాత్ బై టూ కాఫీ  మాడి
చీర్స్ మాడనే బేకు


చౌ చౌ జిలేబి.

Monday, October 17, 2011

మొబైల్ మానవుడు

పూర్వం మానవుని కి
'mob' ఉండేది

ఇప్పటి ప్రతి మానవుడు
తానో 'isle'

ప్చ్. mob పోయింది
ఇప్పటి 'isle' ల్యాండ్ బతుకు కి
మొబైల్  మొలతాడు

ఇరవై ఒకటవ శతాబ్దం లో మానవుని
మొబైల్ బతుకు , mob లేని -isle బతుకు.

చీర్స్
జిలేబి.

Sunday, October 16, 2011

సిగరెట్టు స్పందనల పొగ సవ్వడి - 3- లంగ్స్ ఇన్ లవ్ విత్ పొగ సెగ

చిన్నప్పుడు సాంబ్రాణి
పొగ పెట్టేరు
వః వః అన్నాను
ఉక్కిరి బిక్కిరి అయ్యి
కొద్ది పెద్ద అయ్యేక
వేడి నీటి సెగ
వహ వహ అన్నాను
సెగ పొగ తో

సుకుమారి,  సిగరెట్టు పొగ
తోడయ్యింది పదహారు లో
వావ్ వావ్ అని దీర్ఘ శ్వాస తీసాను
దుడుకు వయసు, సెగ వదలని పొగ
మది ఎద దమ్ముతో వావ్ వావ్ అయ్యింది.

సుకుమారి 'క్వార్టర్ 'అంగి'
సిగరెట్టు మరో 'క్వార్టర్' అంగి
ఉద్యోగం మరో 'క్వార్టర్' అంగి
మిగిలిన నేను 'క్వార్టర్' అంగి

ఇరవైలో పట్టిన స్నేహం
అరవై అయినా పటిష్టం
వైద్యుడు చెప్పేడు ఇంకెన్నో రోజులు
లేవు నీ లంగ్స్ పవర్ అని

ఇన్ని రోజుల లవ్ విత్ లంగ్స్
త్రుటీల్మని 'బాల్చి' తన్ను తుందంటే
పొతే పొయ్యే
కృష్ణ పరత్మాడు చెప్పనే చెప్పాడు -
'ఆత్మ ' కి ఎ పొగ అంటదని
ఈ శరీరం పోయి మరో శరీరం ఫ్రెష్ వస్తుందట !

ఈ మారు విత్ మోర్ లవ్ లంగ్స్ భర్
పీల్చాను -
సుకుమారి , సిగరెట్టు మాయమై
భటుడు ఒకడు కనపడ్డాడు
ఏమిరా అన్నాను
యముండ అన్నాడు

ఏమంటావ్ ?

పై కెళ్లాలి
ఏముందక్కడ ?

నీకు పొగ పెడతారు

హతోస్మి - అంతే కాలం లో కూడా
పొగ తప్పలేదే !
పొతే పొయ్యే -
ఇప్పటికైనా మరో దమ్ము లాగించనా?

(దమ్ము సిగరెట్ రావు స్ఫూర్తి)


చీర్స్
జిలేబి.

Thursday, October 13, 2011

జ్యోతిష్యం తెలిసిన వారికి ఓ ప్రశ్న - జవాబు తెలిస్తే చెప్పండి

జ్యోతిష్యం తెలిసిన వారికి ఓ ప్రశ్న - 

ప్రశ్న

యోగం - శుభ యోగం, సిద్ధ యోగం, అమృత యోగం - ఇట్లాంటి వి గ విభజించి ఉన్నారు. వీటి కి గల వ్యత్యాసం ఏమిటి? ఒక శుభ యోగం సిద్ధ యోగమా లేక అమృత యోగమా ఎట్లా గణించడం? ఎవరికైనా ఖచ్చితం గా తెలిస్తే చెప్పగలరు - దయ చేసి.
మీ
జిలేబి.

సిగరెట్టు స్పందనల పొగ సవ్వడి-2 - పొగాకు ఆత్మ ఘోష !

ఆకులో ఆకునై అణగి మణగి
నా మానాన ఉన్నదానిని
ఏ కొమ్మకో ఆకై  కాలం ఐపోతే రాలి పోయే దానిని

మానవుడు నన్ను తాకాడు
ఓ పాపిరుస్ ( అదీ నా లాగే ఓ చెట్టో కొమ్మో )
లో నన్ను చెర  బట్టాడు
చుట్ట అని పేరు పెట్టాడు

ఇష్టం వచ్చినప్పుడు అగ్గి తో నన్ను గుగ్గిలం చేసాడు
విలాసం గా పై కేగారేసాడు
రజనీ స్టైల్ లో
హీరో ల స్టైల్ లో పొగ వదిలేడు

నేడు దగ్గు తున్నాడు - ఖల్లు ఖల్లు మని
దీనికి కారణం నేనన్నాడు
చీత్కారం వెటకారం

రాముడు తాకితే రాయి అహల్య అయిందట
నన్ను తాకితే ఈ మానవుడు బుగ్గి అయ్యే నని ఏడ్చాడు
ఎవరి ఖర్మ కి ఎవరు బాధ్యులు ?

ఆకులో ఆకునై అణగి మణగి
నా మానాన ఉన్నదానిని
ఏ కొమ్మకో ఆకై కాలం ఐపోతే రాలి పోయే దానిని

చెరపకురా చెడేవు అని రాసుకున్న మానవుడు
అడుసు తొక్క నేల కాళ్ళు కడగనేల ?


చీర్స్
పొగాకు ఆత్మ ఘోష
జిలేబి సహాకార 'బ్లాగ్విత'

Wednesday, October 12, 2011

సిగరెట్టు స్పందనల పొగ సవ్వడి

సిగరెట్టు మీద బాణం
ఎక్కుపెట్టినారే

పొగ తాగనివాడు
దున్న పోతై పుట్టునని
మాస్టారు చెప్పారే

అగ్గి పెట్ట, కుక్క పిల్ల ,సబ్బు బిళ్ళ
కాదేది కవిత కనర్హం అని
సిగరెట్టూ శ్రీ శ్రీ కలిసి
మనకి రుక్కులు అందించారే!

ఔరా , ఈ సిగరెట్టు స్పందనల్
పొగ సవ్వడుల్
కాల గతి లో కథా, కవితలతో దోబుచులాడాయే

ఏమి ఈ దుర్గతి సిగరెట్టు మిత్రమా నీకు
బులుసు గారు సిగారు తో బాణం ఎక్కు పెట్టి ఈ
బ్లాగు సిగారు లోకాన్ని కాపాడ ఓ కామిక్కు రాయ రారే


చీర్స్
జిలేబి.

Tuesday, October 11, 2011

కాల జ్ఞానం -౩ - రుజువులు


ఒక రెండు వారాల  మునుపు తెలుగు యోగి శర్మ గారి కాల జ్ఞానం మూడు వెలువడింది. అందులో ఈ వాక్యం (జరామరణాలు సర్వ సాధారణం - కాని రాసిన కొలది కాలానికే రెండు పెద్ద మనుషుల నిష్క్రమణం శర్మ గారి కాలజ్ఞానానికి ఒక మచ్చు తునక. )


మేధస్సుకు ఔన్నత్యం పైపూతల అదోగమనం


సాహితీవేత్తల కళాకారుల నిష్క్రమణం

1 . జగ్జీత్ సింగ్ - గజల్ కళాకారుని నిష్క్రమణ - భారత దేశ నేపధ్యంలో
2 . ఆపిల్ స్టీవ్ జాబ్స్ - అంతర్జాతీయ నేపధ్యం లో

ఇట్లాంటి వి రాసేటప్పుడు శర్మ గారు కాల జ్ఞానానికి ఒక 'టైం లిమిట్' అందించి ఉంటె - వాటి ఎఫ్ఫెక్ట్ మరీ క్లియర్ గా ఉండేది. ఇది నా అభిప్రాయం మాత్రమె. ఎందుకంటే ఈ పై వాక్యం ఎప్పటికైనా చెల్లుతుంది - జరామరణాలు సర్వ సాధారణమైనవి కాబట్టి.

చీర్స్
జిలేబి.
(శర్మ గారి బ్లాగులో కామెంట్లు కుదరవు. సో  కామెంటా లంటే వేరే మార్గం ఈ టపా )

Friday, October 7, 2011

ఆపిల్ కోరిన ఆది శంకరుడు

ఒక ఆపిల్ భూమ్మీద పడింది
ఒక న్యూటన్ సిద్ధాంతం పుట్టింది.

ఆ ఆపిల్ చెట్టునించి పడింది.

ఒక ఆపిల్ భూమ్మీద పడింది
డిజిటల్ జీవనం కారణమైయింది

ఈ ఆపిల్ మానవ మేధస్సు నించి.

ఆది శంకరుడు ఆశ పడ్డాడు - ఆపిల్ కోసం !

 తార భువి మీంచి ఆకాశానికి ఎగిరింది.
ఆవల తీరం లో మరో ఆపిల్ పుడుతోందేమో ?

స్టీవ్ జాబ్స్ - కి కొత్త జాబ్ దొరికింది.

నివాళులతో

జిలేబి.

 

Saturday, October 1, 2011

ఓటు నోటు లోటు సాపాటు

ఓటుకి నోటు లంకె
బోటుకి లోటుకి లంకె

ఓటు నోటుకి బలి
బోటు లోటుకి బలి

బోటు లేక నది దాట పాటు
ఓటు తప్పిన సాపాటు పాటు

తెలుసుకోవయ్య జిలేబి తియ్యన
ఎక్కువైన నీ లైఫు లేజి

చీర్స్
జిలేబి.


Friday, September 30, 2011

టపా రాసేసాను తన్నుకు చావండి !

ఈ మధ్య కన్యా శుల్కం సినిమా చూడడం, అందులోని పాపులర్ డైలాగు - తాంబూలా లిచ్చేసాను, తన్నుకు చావండి విన్నాక, ఈ  టపా తిట్లు సారీ టైటిల్ !

ఈ మధ్య బ్లాగ్ లోకం వచ్చే టపాలు చూస్తూంటే , ఈ టపా టైటిల్ వాటికి దీటుగా ఉందని నా ప్రగాఢ విశ్వాసం !

ఆ మధ్య బ్లాగ్ లోకం, బజ్జు లోకం కి మధ్య పోటీ పెరిగి పోతోందని , బజ్జు లోకం బ్లాగ్ లోకాన్ని బజ్జో అని పిస్తోందని చదివినట్టు గుర్తు.
 

నేను బ్లాగులు రాయటం మొదలెట్టి గమనించిన ఈ మూడేళ్ళలో జరిగిన మార్పు - మార్పు లేనిది కూడలి.  స్టాండర్డ్ గా ఉందని చెప్పవచ్చు.

హారం పలు విధాల మార్పు లు చేర్పులు చేసుకుంటూ, ఇప్పుడు, తెలుగు సమాహారం నుంచి ప్రొమోషన్ తీసుకుని, భారత భాషా బ్లాగుల సంకలిని ఐ పోయింది.

మరి మిగిలిన జాలం, జల్లెడ ఓ మోస్తరు మేమూ ఉన్నామని పిస్తున్నై.

తెలుగు బ్లాగు నించి పై కి ఎదిగిన హారం , తెలుగు బ్లాగు లకి ముఖ్యమైన లంకె స్థాయినించి, తగ్గిందోమో అని నా ప్రగాఢ విశ్వాసం. ( గరిష్ట లంకెలు కూడలి నించి అని బ్లాగ్ హిట్ విశ్లేషణలు బ్లాగర్ వారి వి చదివికా|)

సో టపా రాసేసాను, తన్నుకు చావండి !

చీర్స్
జిలేబి.

కాలజ్ఞానం - 3 - వ్యాఖ్య - వివరణ

తెలుగు యోగి శర్మ గారి కాలజ్ఞానం మూడు :



మేధస్సుకు ఔన్నత్యం పైపూతల అదోగమనం

సాహితీవేత్తల కళాకారుల నిష్క్రమణం

రాజుకు పట్టిన దోషం రాజ్యాలకేమో గ్రహణం

త్రిమూర్తుల చూపులతో చెదిరిపోయె వీరత్వం

లేత ఆశలను తుంచుతున్న ఉచ్చు.

తండ్రీ కొడుకుల మధ్యన చిచ్చు

తానింతటి భారాన్ని ఎన్నాళ్ళని మోస్తుంది?

చటుక్కున ఒకసారి కళ్ళు తెరిచి మూస్తుంది.


------
నా వ్యాఖ్య :

భారత దేశం మేధస్సు మళ్ళీ భూమండలం లో విఖ్యాతం అవుతుందా?
౨. సాహితీ వేత్తల కళా కారుల నిష్క్రమణం - చాల సర్వ సాధారణమైన విషయం - గొప్పేమీ అనిపించడం లేదు.

రాజు, గ్రహణం, రాజ్యాలు - మళ్ళీ ఐరోపా ఖండాన్ని సూచిస్తోందా ఇది ?
లేక భారత దేశం లో నే మళ్ళీ ప్రోబ్లెంసా ?

తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు - ఎ తండ్రీ ఎ తనయుడు ? అరవ దేశపు కరుణా నిధి యా ?


చీర్స్
జిలేబి. 

Wednesday, September 28, 2011

'హార్ట్ ' డిస్క్

ఈ జమానా లో మనం రాసే
పిచ్చి గీతలు
బ్లాగ్ టపాలు
కామెంట్లు
ఈ మెయిల్లు

అన్నీ 'హార్ట్ ' లే ని
డిస్కులకి
ఆహారం


విద్యుత్ తటిల్లతలా
స్పురించే ఐడియా లు
చేతి వాటం గా సాగే
కంపూటర్ కథా కమామీషులు

అన్నీ కాల గతిలో
'హార్ట్' లేని
డిస్కులకి
అంకితం !

ప్చ్ ! ' హార్డ్' ఓవర్ హార్ట్'

'Handed over hearts to hard disks"

చీర్స్
జిలేబి.

Saturday, September 24, 2011

కాల జ్ఞానం - రెండు - వ్యాఖ్య - వివరణ



భయంకర సమఉజ్జీలిద్దరు

ఒకరి కోటలో ఒకరు పాగావేశారు

ఇక మొదలౌతుంది ధ్వంసం

విలాసపు మోజులో పడిన ధర్మం

కళ్ళు మూసుకుని ఊరుకుంటుంది

నాకెందుకులే అంటూ

నాలుగు శక్తులూ వేటాడితే

అల్పుడైన మనిషి బ్రతుకెంత ?


నా వివరణ: ఒకరు అమెరికా మరొకరు ఐరోపా - ఒకర్ని ఒకరు 'మట్టం' తడుతున్నారు. (మట్టం తడటం - మా చిత్తూరోళ్ళ భాష - ఆంగ్లం లో చెప్పాలంటే - pulling the others leg !)

ఇక రెండు ప్రధాన కాన్టినేంట్లు ఇలా చేస్తే ధ్వంసం రాక తప్పుతుందా ?

మిగతావన్నీ - నా కనిపించింది - స్వంత కవిత్వం - కాకుంటే ఏ విధం గా అయినా భాష్యం రాసు కోవచ్చు !

చీర్స్
జిలేబి.

కాల జ్ఞానం - ఒకటి - వ్యాఖ్య - వివరణ

కాలజ్ఞానం -- 1

ఒక ఆవిష్కరణ వెలుగు చూస్తుంది.

ఒక విప్లవం గెలుస్తుంది.

ప్రాణాన్ని కాపాడేదే ప్రాణం తీస్తుంది.

హటాత్తుగా పరిస్తితులు మారిపోతాయి.

చీకటి శక్తులు విజ్రుమ్భిస్తాయి.

హింస నాట్యం చేస్తుంది.

అమాయకుల ప్రాణాలు గాలిలో దీపాలు

అధర్మానిదే రాజ్యం

ఈ మధ్య తెలుగు యోగి శర్మ గారు కాలజ్ఞాన సీరీస్ మొదలెట్టారు. అందులో పైది మొదటి ' అ' కాల జ్ఞానం !

ఈ క్రింద ఇవ్వబడ్డ వివరణ నా స్వంత అంచనా.

వివరణ: ఒక ఆవిష్కరణ - విధ్యుత్ శక్తి యొక్క కొత్త మూలం - న్యూ క్లియార్ - తరివాతి సోర్సు -?

ఒక విప్లవం - మిడిల్ ఈస్ట్ విప్లవం ?  కాకుంటే - భారత దేశం లో ప్రజా విప్లవం? సందేహమే !

ప్రాణాన్ని కాపాడేది - ప్రాణాన్ని తీయడం - ఇది కొత్తేం కాదు. సృష్టి కార్యం, సృష్టి రక్షణ , సృష్టి నిర్మూలం అంతా స్వాభావికం ప్రకృతి లో

హటాత్తు గా పరిస్థుతులు మారవు. క్రమేణా మార్పు ఉంటూనే ఉంటుంది. మనం గమనించం అంతే

మిగిలిన వాక్యాలు - అందరూ రాసేవే - ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం ?

చీర్స్
జిలేబి.

యూరో మటాష్ ?

మటాష్ అన్న పదం ఎ భాషో తెలీదు.
యూరో అన్న 'రూపాయి' ఓ పదేళ్లముందు పుట్టింది.
రాజకీయ సమీకరణం లేకుండా , 'రూపాయి' సమీకరణం తో ఏర్పడ్డ యూరో ఇప్పడు కూడలి లో నిలబడి
దిక్కులు చూస్తోందా అని పిస్తోంది.

ఆ మధ్య గ్రీకు , ఇప్పుడు ఇటాలి - ఆ తరువాత ఎ ఐరోపా దేశం? ప్రశ్న మార్కు !

జర్మనీ దేశం , ఫ్రెంచు దేశం - యూరో ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాయి.

సందులో సడేమియా అని అమెరికా వాడు - ' మా దేశం తప్పేమీ లేదు - ఐరోపా వాళ్ళు నిబద్ధత లేకుండా , ఉండటం వల్లే ప్రపంచ ఎకోనోమి దెబ్బ తింటోందని ప్రక్క వాడి పై చెణుకు వేస్తున్నాడు.

మన దేశం ప్రాబ్లం లో ఉంటె - ప్రక్క వాడి వల్లే ఇది ఇలా ఐయింది అనడం సర్వ సాధారణం ! కరప్షన్ సర్వతా ఉంది , ఇది ఇండియా ప్రాబ్లం మాత్రమే కాదు సుమా అని మన నేతలన్నుట్టు ఈ వ్యాఖ్య అమెరికా వాడిది. !

వేచి చూడ వలసినదే - ఐరోపా నా లేక అమెరికానా లేకుంటే ఆసియా నా 'ప్రపంచ' కొంప ముంచేది ?

ప్రపంచ 'కొంప' మునుగుతుందో లేదో తెలీదు గాని, మనం - ప్రజానీకం వీళ్ళ రాజకీయాలతో దెబ్బ తిన కుండా ఉంటామా అన్నది పెద్ద కోస్చేన్ మార్కు !

చీర్స్
జిలేబి.

Sunday, September 18, 2011

సీతా కల్యాణం -1

శ్రీ రామ హరే రామ !

శ్రీ కాంతో మాతురో యస్య జనని
సర్వ మంగళా జనకః శంకరో దేవః
తం వందే కున్జరాననం

జయతి మరకతా భవ్య త్పరం వస్తు సత్యం
నిఖిల నిగమ మ్రుడ్యం రామ నామ్న ప్రతీతం
భవ జలధి నిమగ్న ప్రాణి నౌకాయ మానం
భవతు మమ గతిహి తత్ బాలక్రిష్ణాపి వేద్యం

రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేదసే
రఘునాథాయ నాధాయా సీతాయః  పతయే నమః

బుద్ధిర్బలం యశో ధైర్యం
నిర్భయత్వం  అ రోగతాం
అజాడ్యం వాక్ పటుత్వం చ
హనూమత్ స్మరణాత్ భవేత్


 శ్రీ రామ శరణం మమ శ్రీ కృష్ణ శరణం మమ
స్వస్త్యస్తూ సమస్త సం మంగళాని సంతు
సమస్త ఐశ్వర్య ప్రాప్తి రస్తు

శ్రీమద్ రామాయణే బాల కాండే సీతా రామ వివాహ ఘట్టే
శ్రీ త్యాగరాజ ముఖేన అధ్య వర్తమాన కథా ప్రసంగః

+++++++

రాగ రత్న మాలిక చే రంజిల్లున ట హరి సదా
బాగ సేవించి సకల భాగ్యముల మందు దము రారే !

++++++++
ఈ నవ రాత్రి లో -
నవ రాత్రి అంటే మీ కందరికీ తెలుసు -
తొమ్మిది రాత్రులు -
నవ రాత్రి అంటే తొమ్మిది రాత్రులని తెలవడం కన్నా మనం  ఇంట్లో బొమ్మల కొలువు పెడతామన్నది అందరికీ తెలుసు

 ఇది ఎవరికైనా తెలియక పోతుందేమో నని ఇక్కడ బొమ్మలే  కొలువే పెట్టి ఉన్నారు -

ఈ కొలువు పెట్టడడం స్త్రీ లకి , అమ్మాయిలకి పిల్లలకి చాల ఇష్టమైన విషయం 
కొలువు పెట్టడం ఎక్కడైనా పురాణం లో చెప్ప బడి ఉందా, లేక శాస్త్రం లో చెప్ప బడి ఉందా ?
కొలువు పెట్టక  పొతే ఏమి ?

గమనించాల్సిన విషయం ఏమిటంటే శాస్త్రం లో ఏది చెప్ప బడలేదో, అదంతా తూచా తప్పకుండా చేస్తున్నాం

ఏదైతే శాస్త్రం లో చెప్పారో అదంతా వదిలేసాం

శాస్త్రం లో ఏదైతే చెప్ప బడలేదో దీపావళి - దాన్ని బ్రహ్మాండం గా పటాటోపం  తో కొనియాడుతాం

అట్లాగే ఈ కొలువు పెట్టడం కూడా ఒక ఆనవాయితీ అయిపొయింది.
కొలువు పెట్టడానికి ఒక తాత్పర్యం ఉంది. ఆ భావనతో పెడతారేమో తెలియదు.

అంబ కొలువై ఉంది.  అంబ ఎలా ఉందంటే - తాను నిశ్చలం గా ఉంది , లోకాన్ని నడుపుతోంది. తాను నిశ్చలం గా ఉండడం తో , లోకం లో ఎన్ని మార్పులు జరుగుతూన్న తన దగ్గిరికి అవి రావు.  అట్లా అన్నింటికీ ఆవల ఉన్న అంబ - సర్వ చైతన్య రూపాన్తాం ఆద్యాం విద్యాం చ ధీమహీ బుద్ధిం  ధ్యాన ప్రచోదయాత్ - ఇది అంబ స్వరూపం.

అట్లా చైతన్య రూపిణి ఐన అంబ సర్వ జీవ రాసులలోనూ ఉంటోంది కదా ?  సృష్టి లో వివిధ రూపాలలో ఈ అంబ ఉండడం తో వాటి కి ప్రతీకగా ఇలా మనం బొమ్మల కొలువు పెడుతున్నాం  కొలువు పెట్టడం లో కూడా ఒక పద్దతి ఉంది. ఎవరెవర్ని , ఎవరెవరితో , ఎ   మెట్లమీద పెట్టాలో దానికని ఒక పధ్ధతి ఉంది.

కొలువులో ఒక శ్రేష్టి బొమ్మ పెడితే ఆతనికి సంబంధించిన వాటిని ఆ బొమ్మ ప్రక్క పెడితే అది లక్షణం గా ఉంటుంది.  అలా కాకుండా శ్రేష్టి గారి పక్కన పులి బొమ్మని పెడితే బాగుంటుందా ? కాబట్టి ఎవరి తో ఎవరు కలసి  ఉండాలో అన్న తాత్పర్యాన్ని ఇది తెలుపుతుంది.  వీటిన్నటికి ఎట్లాంటి ఆధారాలు లేవు.

అంబ కొలువై ఉంది. ఎక్కడ ? మన మనసులో. మన జీవం లో.  ప్రతి రోజు అభివృద్ధి చెందుతోంది.

శారదా నవరాత్రి , వసంత రాత్రి అని రెండు నవరాత్రులు.
వసంత రుతువు , శరద్ ఋతువు, రెండు ఋతువులు.

మనకి ఋతువుల పేర్లే తెలియకుండా పోతుందేమో ?

అసలు ఈ ఊళ్ళో పంచాంగం ఉందా అంటే సందేహమే . చాలా మంది ఇంట్లో ఉండక పోవచ్చనుకుంటా ఎవరైనా ఒకరిద్దరి ఇంట్లో ఉంటె  గింటే వారు దాన్ని చూస్తారా అన్నదీ సందేహమే !

వసంత రుతువు - చైత్ర వైశాఖం

మన పిల్లలకి పెద్దలైన మీరే నేర్పాలి

ఇంతకు మునుపే ఇక్కడ ఒకరి తో నేను చెప్పాను. - మన కల్చర్, హెరిటేజ్ ఇవన్ని ధ్యాసతో కాపాడుకోవాలని తపన , మన అమెరిక నించి వచ్చిన భారతీయుల వద్ద ఎక్కువగా చూడొచ్చు. ఇది నేను చూసిన విషయం. వాళ్ళ దగ్గిర శ్రద్ధ ఉంది. సంస్కృతం నేర్చుకుంటున్నారు. చికాగో వెళ్ళినప్పుడు , ఒక చిన్న పిల్లవాడు రుద్రం, చమకం చెప్పడం విని సంతోషం చెందిన వాణ్ని.

మన ఇంట్లో పిల్లలైతే రుద్రమా , చమకమా అదేంటి అంటున్నారు.  ఒకసారి చంద్ర శేఖర స్వామీ వారి వద్ద వెళ్లి , ఆచార్యుల వారి వద్ద వెళ్లి - ' మన ఈ తరం అసలు సంధ్యావందనం చెయ్యటం లేదు. మీరు ఒక ఆర్డర్ ఇవ్వాలి - అందరూ సంధ్యావందనం చెయ్యాలని ' అన్నాను. దానికాయన అడిగారు - ఏమిటండి - మీ అబ్బాయి ధోతి అయినా కడుతాడా? "  అసలు ధోతి అయినా కడుతున్నాడా? అదీ ప్రశ్న ! 

మన సంప్రదాయానికి ఈడైనది ఏది ఉంది? మన సంప్రదాయం మనిషి గొప్పతనాన్ని పెంపొందింప చేస్తుంది. మిగిలిన వన్నీ , అసురత్వాన్ని పెంపొందించేవి.

ఒక నెలగా నేనిక్కడ ఉంటున్నాను. మధ్యాహ్న వేళలో టీవీ చూస్తున్నాను. మధ్యాహ్న సమయం లో నాకేం పనీ పాటా లేదు. - "What are you doing? " అని ఎవరైనా అడిగితె - తటాల్మని నా సమాధానం - " I watch TV" !

ఏముంది టీవీ లో? చెప్పిందే చెబ్తున్నాడు. పెట్టిన ప్రోగ్రాం మళ్ళీ మళ్ళీ అదే పెడ్తున్నాడు.  మధ్యలో నాకు advertisement కి  కథకి వ్యత్యాసం తెలియకుండా పోతోంది.  పోనీ advertisement ఏదైనా వెరైటీ గా ఉందా అంటే అదీ లేదు. ఈయన టీవీ లో పని చేస్తున్నారు. తప్పుగా ఏమైనా అనుకో బోతారు.  టీవీ  లో తిప్పి తిప్పి తినే సామన్లనే చూపిస్తున్నాడు.

అందువల్ల నేననుకున్దేమంటే - ఈ అమెరికా వాళ్ళు , మంచి ' భోక్తలు ' - మంచి తిండి తినే వారు కామోసు అని ! .  ఇవన్ని అసుర ప్రాయం , రాక్షస ప్రాయం - ఇవన్నీ చెప్పాల్సిన పనే లేదు. వీటిని నేర్పటానికి ఎ లాంటి బళ్ళూ అవసరం లేదు. ఒక తప్పు కార్యాన్ని చెయ్యడాని కి ఎవరు నేర్పించనక్కర్లేదు.

సులభః  పురుషః  రాజన్  సతతం   ప్రియవాదినః
అప్రియస్య   తు  పత్యస్య  వక్తా  శ్రోతా  చ  దుర్లభః
 
మంచి విషయాన్ని చెప్పేవారు లేరు, చెప్పినా వినే వాళ్ళు లేరు  - మంచి విషయాన్ని ఎవరైనా చెప్పినా ఎవరు వినరు. వారు వినరు కాబట్టి వీళ్ళూ , మనకేంటి అని చెప్పడం మానుకుంటారు.
 
'How is your son sir? "
 
వాడి కేమండి - "I give him full freedom "

full freedom ! అలా చెప్పే మనం మాట దాటేయ్యాలి వేరే మార్గం లేదు.

సులభః పురుషః రాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్య తు పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః

మనం ఆహ్లాదం గా నవ్వుకోటానికి, మనకి ఇంపైన మాటలనే చెప్పడానికి చాల మంది ఉంటారు. ఇది చెయ్యొద్దని చెప్పే వాళ్ళు లేరే లేరంటారు.

కాబట్టి మనకి ధర్మం అంటే ఏమిటని చెప్పే వాళ్లైనా ఉండాలి.

ఓయ్ - ఇది అటామిక్ ఏజ్ , నూక్లియర్ ఏజ్ - ఈ ఏజ్ లో ఇట్లాంటి చాందస భావలేమిటి? మడేమిటి ? ఆచారం ఏమిటి? పుణ్యం ఏమిటి? పాపం ఏమిటి?  అని ఒకాయన నన్నడిగారు. ఇప్పుడు తెలవదండీ మీకు వీటి గురించి. ఎవడైనా రిసెర్చ్ చేసి వాటి గురించి చెబ్తాడు. అప్పడు మీరు నమ్మక తప్పదు. సైంటిఫిక్ రిసెర్చ్ చేసి ప్రతి దానికి వాళ్ళు కారణం చెబ్తున్నారు.  రాబోయే  కాలం లో అట్లా ఎవరైనా రిసెర్చ్ చేసి కారణాలు చెబితే,  మన  ఇండియా దేశంలో ఇవన్ని ఉండే వంటా అని తెలియకుండా పోతుందేమో ?

ఇప్పుడు నేనివన్నీ  చెప్పినంత మాత్రాన ఎవరైనా వెంటనే చేస్తారంటార?  అయినా మన లని మనం కొంతలో కొంత మంచి వైపు మళ్ళించు కోవచ్చు గదా?  మనలో నే ఒక నిర్ణయం, ఒక నిబద్ధత , ఒక discipline' తెచ్చుకోవచ్చు గదా ? ఇట్లా మనల్ని మనమే ఒక మంచి దారి లో మళ్ళించు కోవచ్చు కదా. ?

త్యాగరాజ స్వామీ వారి గొప్పదనం అదే . ఎంత గొప్పవాడై ఉండ వచ్చు ఆయన? ఎంత పెద్ద చక్రవర్తి ఐ ఉండ వచ్చు  ఆయన? ఎందఱో ఆయన కాళ్ళ మీద పడ్డారు.  ఆయన దేనికి తల వొంగలేదు. ఆఖరి దాక నిరుపేద గా నే ఉండి తనువు చాలించాడు. ఆయనకి ఎట్లాంటి ప్రాపర్టీ లూ లేవు. మాన్యాలు కొనుక్కొని ఉండ  కూడదా?
ఎంతో మంది గుళ్ళకి ట్రస్టీ లు గా ఉంటూ మడులు మాన్యాలు వెనకేసుకున్నారు. పెద్ద పెద్ద గుళ్ళకి ట్రస్టీ లవడానికి ఎలెక్షన్ లో పోటీ పడి గెలిచి పదవి లో ఐదేళ్ళు ఉండి అలా రాగానే - ఆయనకేమండి  భూములు , ఇండ్లూ కొనుక్కొని ఉన్నాడు. డబ్బెక్కడి దండి ? గుటకాయ స్వాహా !  మీ దేశం లో ఉండదనుకుంటా. నేను చెబ్తున్నది ఇండియా గురించి. ఈ దేశం గురించి, అమెరికా గురించి చెప్పడానికి నా కేమి అర్హత ఉందీ ? ఇండియా గురించే చెబ్తున్నా.

ఇట్లా తప్పిన మార్గం లో ధన సంపాదన చేసుకుంటూ భేషుగా ఉంటున్న వాళ్ళు ఎంత మంది లేరు? ఇట్లా  త్యాగరాజ స్వామి చేసి ఉండ వచ్చుకదా? ఆయనికి అట్లాంటి అవకాశాలెన్నో వచ్చేయి. ఆయన చేసారా? చెయ్యడాయన. కారణం ఏమిటి? వీటన్ని టికి పై పడ్డ ధర్మం ఆయన వద్ద ఉంది.

ఎ పనికో రామా
జన్మించితి నని ఎంచవలయు శ్రీ రామ

రాముడినే అడుగుతున్నాడు. - ఎ పనికో రామ నను జన్మించితివి? ఎ కారణం కోసం నేను జన్మించాను?  నే నెందుకు  కు జన్మించాను. ?
మనలో ఎవరైనా అడుగుతామా? అట్లా ప్రశ్నించిన వారొక్కరే -రమణ మహర్షి - "who am I" అని ప్రశ్నించు కున్నా డాయన. వేరే వాళ్ళని అడగ లేదు ఆయన. తనలో తనే ప్రశ్నించు కున్నాడు. దానికి ఆయనకి సమాధానం దొరికింది.

ఎ పనికో రామా
జన్మించితి నని ఎంచవలయు శ్రీ రామ

----Shree TS Balakrishna Sastri గారి తమిళ హరికథ కాలక్షేపానికి తెలుగు అనువాదం - by

జిలేబి.

Brahmashree TS Balakrishna Sastri గారి గురించి సంక్షిప్తం గా:



A retired Senior Executive of State Bank of India, Brahmasri T S Balakrishna Sastrigal started learning the wide spectrum of fundamentals required for performing Harikatha at the very tender age of 8 under the guidance of his father, himself a doyen in Puranic Upanyasakams called Brahmasri Sambamoorthi Ganapaadigal. The training included Vedas, Puranas, Sastras, Karnatic Music, and Multiple Languages like Tamil, Telugu, Sanskrit, Malayalam, Kanada and English.

Being a bank employee his virtual induction to performing Harikatha was initiated at the age of 16 by his father in law, himself an exponent in 18 Puranaas called Srivatsa Somadeva Sarama. Spanning over almost 7 decades, the service Brahmashri Sastrigal rendered to the society through his sole stirring Musical Discourses was immense.
His repertoire was spontaneous yet comprehensive, down to earth yet profound, innovative yet authentic, creative thusfresh. His audience felt as though they were literally transported to Ayodhya or Ashoka Vana or Asthinapura or to the battle field of Kurukshetra through his extremely sensitive and dramatic discription of the sequences of Ramayana and Mahabaratha with a reverberating voice and lilting music. While his imaginative unfurling of each of the characters in any epic provided the audience an easy access to truth and reality, his uncanny humorous interludes not only made them laugh their heart out but also think after they laughed.

His portrayals ranged from Valimiki and Kamba Ramayanam, Mahabharatham, Srimad Bhagawatham, Devi Bhagawatham, Skaandham, Naaraayaaneeyam, Naayanmargal charitham and above all his master piece – Thyagaja Charitham. He was a legend in the comprehension of Thyagaraja Krithis and therefore an easy reference point for all the Sangeetha Vidwans who wished to handle any aboorva krithi of Thyagaraja Swamigal. Infact, Brahmashri Sastrigal went on to conceive, design and perform his own version of Ramakatha choreographed with appropriate Thyagaraja krithis popularly known as Thyagaraja Ramayanam. While the great saint Thyagaraja did not himself wrote Ramayana, this Thyagara Ramayana was out and out the brain child of Brahmashri Sastrigal – his method of saluting the first among the Musical Trinities

Saturday, September 17, 2011

దీని రహస్యం ఏమి తిరుమలేశా?

దీని భావం ఏమి తిరుమలేశా?
దీని రహస్యం ఏమి తిరుమలేశా?

ఒకప్పుడు
నువ్వే నేను
నేనే నువ్వు

మధ్యలో ఏమైయ్యిందో
తెలీదు

ఇప్పుడు నేను నేనే
నువ్వు నువ్వే

దీని రహస్యం ఏమి తిరుమలేశా?
దీని భావం ఏమి తిరుమలేశా ?

జిలేబి.

 పోస్ట్ స్క్రిప్ట్:

"ఈ క్రింద ఇవ్వబడ్డ సంస్కృత పద్యానికి భావానువాదం -

यूयं वयं वयं यूयम्
इत्यासीन्मतिरावयोः ।
किञ्जातमधुना येन
यूयं यूयं वयं वयम् ॥