Tuesday, April 24, 2012

एक कलि दो पत्तिया

एक कली
अपनी दो पत्त्यियों से बोली,

मेरे बिन तू नाही

पत्तियां मुस्कुराके बोली

ना पत्ती बीज नाही, ना बीज तुम नाही !

माली आया, पत्ती और कली को खींचा 
थैली  में लगाया और चल बसा !


चीर्स
जिलेबी.  

Sunday, April 22, 2012

బామ్మోయ్, నాకు లాప్ టాప్ ఇచ్చారు !

మా మనవరాలు మద్రాసు నించి ఫోను జేసి, 'బామ్మోయ్ నాకు లాప్ టాప్ ఇచ్చారు కాలేజే ఫైనల్ డే రోజున అంది.

ఎందుకే అన్నా.

'అదేంటి ఎందుకు అంటా వేమిటి ? మా 'పురచ్చి తలైవి తెలివి ఐనది. అందుకే అందరికి తెలివి ఎక్కువవ్వాలని లాప్ టాపు ఇచ్చింది ' అంది మనవ రాలు.

వామ్మో, పక్క రాజ్యం చాలా ముందుకు పోయిందన్న మాట అనుకున్నాను.

సరే మనవరాలా, లాప్ టాప్ తో ఎం చేస్తావేమిటి ?

అదేమిటి బామ్మా, నువ్వు బ్లాగాడటం లేదూ, అలాగా మేమూ చేస్తాం, అంది మనవరాలు.

సరే లేవే, ఇంటర్నెట్ కావాలి కదా ? అన్నా

దానికేమి నాన్నారి తో చెప్పి వై ఫై కనెక్షన్ తీసు కొమ్మని చెబ్తా అంది.

సర్లేవే, మద్రాసు లో ఎన్ని గంటలు కరంటు ఉంటుం దేమిటి ?

అదేమీ బామ్మా , ఎప్పుడు కరంటు ఉంటే అప్పుడే ఉపయోగిస్తా లే అంది  మనవరాలు, దానికి ఖచ్చితం గా తెలీదు కరంటు మద్రాసు లో  ఎప్పుడు ఉంటుందో అని !

'సర్లేవే, లాప్ టాప్ తో ఎం చేస్తావ్ ? '

పాటలు పెట్టుకుని వింటా బామ్మా, కొత్త కొత్త డీవీడీ లు కూడా చూడ వచ్చు, ఆ పై ఫేస్ బుక్ లో మా ఫ్రెండ్స్ తో చాట్ చెయ్య వచ్చు. యు ట్యూబ్ లో పిక్చర్లు చూడొచ్చు. సినిమా టికట్లు ఆన్ లైన్ లో నే కొను క్కోవచ్చే !'

భంసు !

ఒక ముక్క వేసి వేలాది చేపలని పట్టటం అంటే ఇదన్న మాట  !

టోకరా లాప్ టాప్ ఉచితం. దాంతో మా మనవరాలి ఖర్చులు అధికం.

జమా ఎంతో తెలీదు. పాపం మా అబ్బాయి !

అమ్మాయి పెళ్ళికని కూడ  బెడుతున్నాడు.

ఆల్రెడి ఆ జమా సంచి కి పెద్ద  బొక్క  ఇన్ఫ్లేషన్ ఉండనే  ఉంది.

ఆ పై ఇప్పుడు కరెంటు అకౌంటు ఖర్చులు !

చీర్స్
జిలేబి.

Saturday, April 21, 2012

వయ్యారాలు పోయిన బ్లాగరిణి!

పొద్దుట లేచి పోదారి, ఓ టపా ఇవ్వాళ కడదామని బ్లాగర్ లో లాగిన్ అయితే ఏదో అంతా కొత్త గా అనిపించింది.

వామ్మో, బ్లాగరిణి ఇవ్వాళ ఇంత వయ్యారాలు పోతోంది అని తీరిగ్గా ఒక్కో ఫీచర్ చూస్తూంటే వామ్మో, వామ్మో, లోపలి మేటరు ఒకటే అయినా పై పై మెరుగులు చాలా దిద్దాడే సుమీ అని పించింది.

ఒల్డు వుమన్ని మళ్ళీ ఉద్యోగం లోకి పిలిస్తే, జిలేబీ సింగారించుకుని ఉద్యోగం లో కి వెళ్ళడానికి తయారైన వైనం లా అనిపించింది ఈ బ్లాగరిణి!

అంతా అమెరికా వాడి మాయ ! సరే పోనీ లెద్దూ అనుకున్నా.

ఆ పై టపా రాయడానికి వస్తే సరికొత్త ఎడిటర్ కనిపించింది. హమ్మయ్యా , ఇన్ని రోజులకి కొంత బెటర్ గా టైపు జాడించడానికి వీలు గా ఉంది సుమీ అని ముచ్చట పడి పోయా !

మొత్తం మీద గిట్టు బాటు ఈ ఎడిటర్ మాత్రమె సుమీ ఇందు లో.

అంతా విష్ణు మాయ. గూగులోడు ఎప్పుడు బిచాణా కడతాడో ఏమో తెలియదు. బర బారా మనమందరం లాగించేస్తున్నాము బ్లాగరు లో మన బుర్రల్ని , వేడైన కామెంటు శర పరంపరలని !

అక్షయ తృతీయ లో బంగారం కొనుక్కుంటే బోలెడు లాభమట. ఏమైనా కొందారి అనుకు ని , కొంత ముందే వెళ్లి మా నంద్యాలం శ్రేష్టి గారి తో మాట్లాడ దామని వెళితే , 'రండ, రండ జిలేబీ గారు... బహుకాల దర్శనం అన్నారు.

ఏమండీ, 'పొంగలు' కే కదా, మీ కొట్టులో గాజులు చేయించినవి అంటే, 'అదేమిటండీ కొత్త వత్సరానికి ఏమీ చెయ్య కుండా పోయారు' అన్నారాయన.

హమ్మో, ఈ శ్రేష్టి గారు అనుకుంటే మన చేతుల్లో డబ్బులు డైలీ కూడా లాగేసుకుని బంగారాన్ని మన కి తలకి కట్టెయ్య గలరు అనుకున్నా.

ఏమండీ శ్రేష్టీ గారు ఎట్లా ఉంది ధర అంటే,

వెల గురించి మీకెందు కండీ జిలేబీ గారు, తరువాత చూసుకోవచ్చు, ఇప్పటికి ఏమి చేయిద్దా మంటారు చెప్పండి అని, 'కూల్డు డ్రింక్ పట్టుకు రావోయ్ అని పనబ్బాయిని పురమాయిం చారు.

హమ్మో, ఈ శ్రేష్టి గారు ఇవ్వాళ మన పర్సు కి కోత పెట్టె ప్రయత్నం లో నే ఉన్నారు సుమీ అనుకున్నా

ఏమండీ, అక్షయ త్రితీయ కి వస్తే ఏమన్నా డిస్కౌంటు ఎక్కువ ఉందా ' అన్నా, అడ్వర్టైజ్ మెంటు కాగితం చూపెట్టి.

జిలేబీ గారు, అవన్నీ, మిగిలిన వాళ్లకండీ, దానికి పై బడి మీకు ఇవ్వాళే డిస్కౌంటు ఇస్తా మొదట ఈ కూల్డు డ్రింక్ జమాయించండి , ఎండన పడి వచ్చారు అన్నాడు.

ఎండకి, చల చల్ల గా కూల్డు డ్రింకు తాగి మొత్తం మీద పర్సు ఖాళీ !

ఈ ఆండో ల్లకి ఈ బంగారం మోజు ఎప్పుడు తీరునో అని మా అయ్యరు వారు వాపోయారు. మా ఆండో ల్లకి ఈ మోజు ఉండ బట్టే గదా, అప్పుడపుడు ఇలా చేర్చి బెట్టిన బంగారం, ఇప్పడు మంచి వెల బలుకు తోంది అన్నా.

బ్యాంకు వాడు గ్రాముకి అప్పట్లో కొన్న ధరకన్నా ఇప్పటికి లోను ఎక్కువ ఇస్తున్నాడుగా ' అన్నా.

అదేమిటీ, అప్పట్లో కొన్న బంగారాన్ని తాకట్టు పెట్టి, ఆ రొక్కం తో మళ్ళీ కొత్త బంగారం కొందామని అనుకుంటున్నావా ' అన్నారు జంబూ వారు.

అదీ, మంచి ఐడియా లా ఉంది స్వామీ వారు అన్నా. ' శ్రేష్టి గారు చెప్పేరు, బంగారం ఇంకా 'వేలేక్కువ ' అవుతుందట మరి '

'మీ బంగారం కాకులెత్తు కు పోనూ, ఏదో మాట కి అంటే , వెంటనే ఐడియా పెట్టేస్తారే మరో మారు బంగారం కొను క్కోవడానికి మరి ' అన్నారు కృష్ణ స్వామీ వారు.


'పోదురు లెండి, కేరళ లో చూడండీ, మీ  నామధేయులు, పద్మనాభ స్వామీ వారు , ఎంత బంగారం కూడ బెట్టి ఉన్నారో ! ఆ పై మన కొండ దేవర పెరుమాళ్ళు వారు చూడండీ, కుబేరునికి బకాయి అని కబుర్లు చెప్పి ఎంత బంగారం కూడ బెడుతున్నారో !ఆ పాటి మనం కూడా చెయ్యాలి కదా మరి !"


చీర్స్ ఫార్ అక్షయ త్రితీయ !

జిలేబి.

Friday, April 20, 2012

అగ్ని మీళే పురోహితం !


సంసమిధ్యువసే వృషన్నగ్నే విశ్వాన్యర్యా ఆ !
జయహో భారత్ !

Thursday, April 19, 2012

గోవిందా గోవిందా గోవిందా !

గోవిందా గోవిందా గోవిందా !

ఒక వైపు చెవులు పోటెత్తే టట్టు భక్తుల భక్తి పరవశ ఘోషలు.

మరో వైపు, ఘంటసాల వారి భగవద్గీత - పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వారికి....

ఇంకో వైపు, పండితుల వేద పారాయణం - 'సహస్ర శీర్షాః పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ....

అక్కడ , వెంకటేశ్వర సుప్రభాతం -

ఇక్కడ గోవిందా గోవిందా ఓం ఓం ఓం అంటున్న ఘంటా నాదం

మరో వైపు బస్సుల కి పరుగెడుతున్న భక్త జనవాహిని

ఇంకో వైపు సరికొత్త పెళ్ళైన జంట  మరో వైపు ప్రేమ పక్షులు ... ఆ వైపు  షష్టి పూర్తి చేసుకుంటున్న దంపతులు

ఒక వైపు ఉర్రూత లూగించు పవనాలు

మరో వైపు వేడి తాకిడి

ఇంకో వైపు భోజనాల హడావిడి

పుస్తక ప్రచురణల అంగడి

దైవ దర్శనం కోరి వేచి ఉన్న లక్షలాది భక్త జన వాహిని

దేవస్థానం వారి ఆఫీసు బిళ్ళ బంట్రోతు

స్వామీ వారి ఉత్సవ తేరు

ఒక వైపు భక్తి బృందం గోవిందా మరో వైపు పూజారుల మంత్రాల జోరు

వడ్డీ కాసుల వసూలు లెక్కలు ... బంగారం గ్రాముల కొలతలు .... జమా ఖర్చులు ...

వంటా వార్పూ... అన్నదాన పర్వం...

వీటన్ని మధ్యా నిశ్శబ్దం గా నిలబడి,   జనావళి  కి ఇంత పని బెట్టి , నిశ్చేతనం గా   గమనిస్తున్న మా ఏడుకొండల పెరుమాళ్ళు !

ఏడు కొండల వాడా, వెంకట రమణా,

గోవిందా గోవిందా గోవిందా
 
జిలేబి.

Wednesday, April 18, 2012

లవణీ తీగలు వారు ఫాయలే హకీకీ


లలామ
వనిత , పూబో
ణీ వాసం

తీ  మల్లె తీ
గ  వా
లు జడ
 
వారిజ
రుక్మిణి

ఫాతీమా
యవన
లేగ దూడ

హంస లేఖ
కీరవాణి
కితాబు



(కొంత కాలం మునుపు లవణీ తీగలు వారు ఫాయలే హకీకి అంటే ఏమిటని అడిగినవారికి !)

చీర్స్
జిలేబి.

Tuesday, April 17, 2012

తారా, 'సో' దరి !?

మేధ ను తారిస్తే
ఇండియా షైనింగ్
ఐటీ బిజ్

బాడీ ని తారిస్తే
ప్చ్, వ్యభిచార్

'చౌ' దరి ,
'సో', దరి ,
'ఏ'  దరి ?

ఒక తార నేలన పడి
బట్ట బయలయ్యింది
లోకం నేరమన్నది
ఇది నేరమన్నది

ఆకు ముళ్ళ మీద పడ్డా,
ముళ్ళు ఆకు మీద పడ్డా
ఆకు కే నష్టమట

ఈ సమీకరణం లో
ఆకులే సాక్షి

ఫిఫ్టీ ఫిఫ్టీ సమీకరణం
లో ఒక ఫిఫ్టీ ఎప్పుడూ
మరొక దానికన్నా
తక్కువే. 



జిలేబి. 

Monday, April 16, 2012

దేశ భాష లందు దేవ భాష 'లెస్సు' !

గుళ్ళోని దేవుడికి ముచ్చెమటలు పోసేయి.

పూజారి అల్టిమేటం ఇచ్చేడు.

' సామీ, రేపట్నించి గుళ్ళో పూజలు నీకు తెలిసిన భాషలో ఉండవు. కొత్త మంత్రి వచ్చాడు. అంగ్రేజీ అన్ని చోటా ఉండాలట. ఇక మీదట పూజా కార్యక్రమాలన్నీ కూడా అంగ్రేజీ లో నే'  చెప్పాడు పూజారి.  

ఆ మధ్య అరవ దేశం లో పూజలన్నీ అరవం లో నే ఉండాలని రూలు పెట్టేడు ఓ గుడ్డోడు. వాడి ఆర్డరు తో గుళ్ళోని దేవుడికి అరవం నేర్చుకోవడానికి తంటాలు పడాల్సి వచ్చే ! అరవం అంత సులభమైన భాష గాదు సుమీ అని వాపోయాడు ఓరియంటేషన్ కోర్సు కి వెళ్లి వచ్చి న దేవుడు.

'ప్రియ సఖీ' అన్నాడు కాళ్ళ వద్ద ఉన్న లక్ష్మీ దేవిని గమనించి.

'స్వామీ' అన్నది దేవేరి.

'డబ్బులు ఏమైనా ఇస్తావా '

ఎందుకండీ

ఆ అంగ్రేజీ ఏదో కొంత నేర్చుకుని తగలడతాను. 'పూజారి చెప్పాడు, వెంటనే నేనెళ్ళి ఏదైనా ఇంగ్లీషు కోర్సులో చేరి పోవాలాట '

స్వామీ

చెప్పు దేవేరి !

ఈ వయసు బడ్డ కాలం లో కొత్త భాష నేర్చుకుని ఏమి చేస్తారు

'ఎం చేద్దామంటావు ! ఇప్పటిదాకా తెలిసిన భాషలో ఆ పూజారి ఏదో చెప్పుకుంటూ వెళ్తూంటే , కర్ణాభ్యాం భూరి విశ్రువం ' అని ఆ సంగీతం లో  జోగుతూ ఉండి పోయా. ఇవ్వాళే ఆ కొత్త భాష వినిపించాడు. ఒక్క ముక్కా అర్థం కాలేదు. బెరుకు పుట్టు కుంది ' చెప్పాడు  గుళ్ళో దేవుడు.

ఎట్లాగూ వీళ్ళు మనల్ని రాళ్ళలో బంధించారు గదండీ స్వామీ వారు' లక్ష్మమ్మ అన్నది.

ఆవును దేవేరి

పోనీ లేద్దురు, రెండు చెవుల్లో కూసింత పత్తి పెట్టేసుకుంటే సరి ! ఎట్లాంటి సమస్యా లేదు. 'ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ' అని వాడెవడో ఒక కవి పాడి పోయాడు. మరో వాడు నీ చెవులు మూసుకున్నాయా అని పాడి పోతాడు అంతే గదా ' చెప్పింది ఐడియా ల రాణి హృదయేశ్వరి.

'ఆ ! ఇదీ మంచి ఆలోచనే ' స్వామీ వారు కొంత సమాధానపడి నిద్దురలోకి జారుకున్నారు.

అమ్మవారు స్వామీ వారి కాళ్ళు మెల్లిగా వత్తుతూ తానూ నిద్దురలోకి జారుకుంది.

చీర్స్
జిలేబి.

Saturday, April 14, 2012

బుజ్జి పండు తెలుగు చదువు - శ్రీ భాస్కర విజయం - 2

హంగేరీ - బుదాపెస్ట్ మహానగరం.
బుదా, పెస్ట్ రెండు నదుల మధ్య ఐరోపా లో సుందరమైన నగరం గా పేరు గాంచినది.
మే నెల వచ్చేస్తోంది. చలి కాలం పోయి, వాసంతం వచ్చి, సూరీడు కిరణాలు వేడిని చలి కి వెచ్చ గా ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.

హంగేరియన్ ఆయుర్వేద ఫౌండేషన్ ఆఫీసు సెమినార్ హాల్ ముందు  ఫోక్స్ వాగన్ బీటల్ కారు ఆగింది.


సెమినార్ హాల్ ముందు వేచి ఉన్న హంగేరియన్ ఆయుర్వేదా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గేబై కారు నించి దిగుతున్న శ్రీ భాస్కర శర్మ గారి కి స్వాగతం పలుకుతూ నమస్తే శర్మాజీ అన్నాడు రెండు చేతులూ జోడించి, "మంచి వేళ ఇవ్వాళ ! ఎప్పుడూ మా దేశం లో కరెంటు పోదు. అయితే ఇవ్వాళ కరంటు పోయింది ఇక్కడ ! ఇవ్వాల్టి కార్యక్రమం ఎలాగబ్బా అని ఆలోచిస్తూంటే, మీ రలా రావడం, కరెంటూ ఒక్క రెండు నిమిషాల ముందే రావడం అంతా సవ్యం గా కానవస్తోంది నాకు " అన్నాడు.


పంతొమ్మిదివందల ముప్పై ప్రాంతాలలో ప్రారంభించ బడ్డ ఫౌండేషన్ హంగేరీ లో చాలా మంచి పేరుని గాంచింది. ధీటైన రిసెర్చ్ సెంటర్ గా మారిన ఫౌండేషన్ ఆయుర్వేద రిసెర్చ్ లో ప్రముఖ స్థానాన్ని వహించడం ఆ దేశం వారి కృషికి నిదర్శనం.


ఆయుర్వేద ఏ ఒక్క జాతి కో మతానికో చెందినది కాదు. ఐదు వేల సంవత్సరాల పై బడ్డ మానవ మేధో సంపత్తి అది. అట్లాంటి ఆయుర్వేద తా పుట్టిన దేశం లో అల్లోపతీ సుడిగుండం లో కొట్టుకు పోతూంటే , ఐరోపా లో పునరుద్ధరణ కి సంసద్ధ మవు తోంది.


సెమినారు హాలు లో చిర్రావూరి దీక్షితులు గారిని పరిచయం చేస్తూ , గాబై మాట్లాడాడు. శ్రీ శర్మ గారిని ప్రస్తుతిస్తూ వారు రాసిన 'పరహిత వైద్యం' గురించిన విషయాలను ఉటంకించాడు. 


ఆ పై శర్మ గారు గాబై ఆహ్వానంతో ఆ నాటి అతిధి ఉపన్యాసాన్ని మొదలెట్టేరు.


"సభకు నమస్సులు. మీ ఫౌండేషన్ పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతం లో ప్రారంభింప బడ్డది. మా నాన్న గారు పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతాలలో ఈ పరహిత వైద్యం చేసేవారు " చెప్పారాయన .


ఫౌండేషన్ చప్పట్లు చరిచింది. హంగేరీ వాసులకు సారూప్యతలు నచ్చుతాయి. అంతే గాక ఈ సారూప్యతలకి ఖచ్చితం గా
ఒక లింకు ఎక్కడో అక్కడ ఉండే ఉంటుందని వారి నమ్మకం. 


పరహిత వైద్య విధానం దక్షిణ భారత ఆయుర్వేద వైద్య విధానం. ఈ విధానం పేరుకు తగ్గట్టు పరుల హితం కోరి చేసేది. ఇందులో స్వలాభోపేక్ష కి తావు లేదు. ఈ వైద్య విధానాన్ని స్వీకరించేవారు నియమ నిబద్ధతలకి కట్టు బడి ఉండే వారు. లోకాః సమస్తాః సుఖినో భవంతు అన్నది వేద వాక్కు. శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. అంటే సర్వ జంతు జాలాలు శాంతి గా ఉండాలి. ఒక్క మానవ మాత్రుడు మాత్రం ఆరోగ్యం గా సంతుష్టుడై ఉంటే చాలదు. సర్వ జంతు జాలాలు కూడాను.
 
ఆయుర్వేద మానవులకూ, సర్వ జంతు జాలాలకు సంబంధించింది. నా వర కైతే నేను గమనించింది మా తండ్రి వారి గురించి విని ఉన్న పరహిత వైద్యం. " శర్మ గారు తేట తెల్లమయ్యే లా సవివరం గా చెప్పు కొచ్చేరు పరహిత వైద్యం గురించి.
 
వారి ఒక గంట పాటి ప్రసంగం అలా అలవోకగా గోదావరీ పరవళ్ళు లా బుడా నదీ ప్రాంతం లో సాగి పోయింది. ఫౌండేషన్ అతిధులు శర్మ గారి వాక్ ప్రవాహానికి మంత్ర ముగ్దులై అలా వింటూ ఉండి పోయారు.
 
ఆ పై ప్రశ్నల పర్వం మొదలయ్యింది
 
"శర్మ గారు, ఇంత మంచి వైద్య విధానం అలా ఒక తరం తో ఆగి పోవటం పాశ్చ్యాత వైద్య విధానం మీ దేశం లో త్వరిత గతిన పెంపొందడ మే నంటారా ?"
 
అది ఒక కారణం. ఆ పై ఈ వైద్య విధానం కాలగతిన తరువాయి తరానికి పట్టక పోవడం కూడా మరో కారణం. ఉదాహరణ కి మా తండ్రి తరువాయి నాకు ఆ భాగ్యం దక్క లేదు "
 
"భారద్దేశానికి ఈ కర్మ సిద్ధాంతమే, భాగ్యం , అభాగ్యం మీద నమ్మకాలే ఒక నెగటివ్ పాయింట్ అనిపిస్తుంది మాకు " మరో మెంబర్ చెప్పాడు.
 
"కావచ్చు. ప్రయత్నే ఫలే . కష్టే ఫలే. కాని మరో కోణం నించి ఆలోచిస్తే జన సాంద్రత కి ఈ కర్మ సిద్ధాంతమే ఓ పాటి మనః శాంతి ని కలిగిస్తూ, దేశం నానా విధాలా అసంతృప్తి కి లోను కాకుండా కాపాడుతోందని అనిపిస్తుంది కూడాను. ధర్మ మైన సంకల్పం, ధృడంగా అమ్మమీద భారం వేసి, కార్యక్రమం నడిపిస్తే అంతా సవ్యమే, అప సవ్యం సమస్య లేదు. అదే నా అనుభవం" చెప్పారు శర్మ గారు.
 
"ఈ దైవ నమ్మకం ఐరోపా లో తిరోగమన వాదం గా పరిగణింప బడుతోంది " మరో మెంబెర్ చెప్పాడు.
 
"కావచ్చు. మన కన్నా పై నొక శక్తి లేక డిఫరెంట్ డైమెన్షన్ అన్నది ఉన్నది అన్నది వాస్తవం. ఆ మరో కోణాన్ని తమ 'దృష్టి ' తో చూసిన వారు ఋషులు. అందుకే వారు 'దీర్ఘ దర్శులు'. ఆ దీర్ఘ దర్శులు గాంచినదే , తమ మేధో సంపత్తి తో గాంచినదే ఆయుర్వేదం. అంటే వారు వేరే డైమెన్షన్ లో దృష్టి ని సారించి, ఈ వైద్య విధానాన్ని కనుక్కోవడం అంటూ జరుగుతూంది. ఇది ఈ ఒక్క శాస్త్రానికి మాత్రమె సంబంధించినది కాదు. మీరు ఇప్పుడు వస్తున్న ప్రతి 'ఇన్నోవేషన్' వెనుకా దీని మూల భూతులైన వారు తమ పరిధి ని దాటి మేధస్సును ఉపయోగించడం తో టే గదా ఈ సరికొత్త సాధనాలు పరికరాలు మనకు లభిస్తున్నాయి "
 
ఆ నాటి సభా కార్యక్రమం ముగింపు కొచ్చింది. మెంబెర్స్  జోహారు లందించారు శర్మ గారి సంభాషణ కి.
 
గాబై సంతృప్తి గా చూసాడు శర్మ గారి వైపు "మీరు అప్పుడప్పడు మా మెంబెర్స్ ని అడ్రస్ చేస్తూ ఉండాలి' చెప్పాడాయన.
 
"అమ్మ దయ ఉంటే నిరభ్యంతరం గా అలాగే " చెప్పారు శర్మ గారు.
 
గాబై విచిత్రం గా చూసాడు శర్మ గారి వైపు. ఇన్ని సంవత్సరాలు గా భారద్దేశ వైద్య విధానాన్ని గమనిస్తూన్నా కూడా, ఈ దైవ చింతన ఈ దేశ ప్రజలలో ప్రతి విషయం లో అంతర్లీన మై వుండడం వారికి ఎప్పటికి అర్థం కాని విషయం !
 
(ఇంకా ఉంది)

Friday, April 13, 2012

బ్లాగులోళ్ళు వెర్సస్ కామెంటర్లు అసమానత్వం ముర్దాబాద్ !

కొన్ని కొన్ని బ్లాగులోళ్ళ కామెంటు బాక్సు ముందర కొన్ని విచిత్రమైన గొంతెమ్మ కోరికల్లాంటి నోటీసులు కనిపిస్తాయి.

కామెంట్లు తెలుగు లో ఏడవక పోతే మీ కామెంట్లు డెలీట్ !
మీకు ప్రొఫైల్ లేదా అయితే డెలీట్
మీరు టపాకి దూరం గా కామెంటు కొట్టారా డెలీట్ !
మీ కామెంటు నాకు నచ్చ లేదా డెలీట్
మీ సెక్సు చెప్పరా ! అయితే డెలీట్ !


ఇత్యాది అన్న మాట

ఇట్లాంటి సౌకర్యాలు కామెంట్లు రాసేవారికి అస్సలు లేవు.

టపా నచ్చ లేదా ఓ డెలీట్ కొట్టే సదుపాయం అస్సలు గూగులోడు కామెంటర్ల కి ఇవ్వలే ! అట్లా ఓ పది మంది కామెంటర్లు డెలీట్ కొడితే టపా హుష్ కాకి అయి పోవాలి. ఇట్లాంటి సౌకర్యాలు కామెంటర్ల కి లేక పోయెనే !

ఎంత అసమానత్వం !

అంతా సమనానమే అంటారు. మరి కామెంటర్ల పట్ల  ఎందు కింత వివక్ష !

బ్లాగులోళ్ళు వెర్సస్ కామెంటర్లు అసమానత్వం ముర్దాబాద్ !


చీర్స్
జిలేబి.

Thursday, April 12, 2012

జిలేబీ కి తాకీదు వచ్చేసిందోచ్ !

క్రితం ఏడాది జిలేబీ కి ఉద్యోగ పర్వం నించి టాటా చెప్పెయ్యడం తో , ఏమీ పాలు పోక కాలు గాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతూ ఉంటే, జంబూ వారు, 'ఇదిగో జిలేబీ ! అలా ఊరికే కూర్చోక, కాస్తా వంటా వార్పూ చూడరాదు ?' అంటూ అన్నేళ్ళు రాజ్యమేలిన వంట గదిని జిలేబీ తల మీద ధామ్మని పడేసేరు.

చ, చ, అసలు పని లేకుంటే, అందరికీ లోకువే సుమా అనుకుని సరే పోనీ మన జంబూ వారే కదా , ఇన్నేళ్ళు వంటా వార్పు చూసేరు. ఇక ఎట్లా ఉద్యోగం retire అయిపోయాం కాబట్టి, ఈ కొత్త ఉద్యోగం లో retyre అయి పోదామని ఒప్పేసు కున్నా !

వంటా వార్పూ అంత సులభమైన విషయం కాదు సుమా అని అప్పుడే అర్థం అయ్యింది. ! చాన్నాళ్ళ బట్టి అసలు వంట గది వైపు రాక పోవడం తో , వంట ఎలా చెయ్యాలో అస్సలు మర్చి పొతే, 'పోనీ లే జిలేబీ' ఆ లాప్టాప్ పెట్టేసుకుని ఆన్ లైన్ లో నేర్చేసుకో అని అయ్యరు వారు ఓ ఉచిత సలహా పడేసేరు.

దాంతో బాటే, అప్పటి దాకా ఎప్పుడో ఒక్క మారు టపా రాసుకుంటూ ఉన్న బ్లాగ్ లోకం లో కూడా జబర్దస్తీ గా జొరబడి , టాట్, ఇక మీదట డైలీ రాయాలి సుమా అని, అలా ఓ వైపు వంట కార్య క్రమమును మరో వైపు బ్లాగ్ టపా వంట కార్య క్రమాన్ని రెండు చేతుల మీదుగా సాగించడం జరిగింది.


ఖుషీ ఖుషీ గా నవ్వుతూ, చలాకీ చలాకీ లా కామెంట్లు కొడుతూ తీరిగ్గా కాలం గడి పేస్తూంటే, ఆ మధ్య లో మన మోహనుల వారి నించి ఓ కబురందింది

'జిలేబీ , నీకు రిటైర్మెంట్ ఇవ్వడం మా బుద్ధి తక్కువ. నీ వెళ్ళాక, వనారణ్యాలకి కష్ట కాలా లోచ్చెసేయి, అదీ గాక, నీకు రిటైర్ మెంటు ఇవ్వడం, తెలుగు బ్లాగ్ లోకానికి తల నొప్పి అయి పోవడం జరిగింది, నీ రాతలతో . కాబట్టి, నీ రిటైర్ మెంటు కాన్సిల్. వెంటనే నువ్వు జాబ్ లోకి చేరి పో' అని తాకీదు వచ్చేసింది!

చ, చ, జనాలు హ్యాపీ గా ఉండ నివ్వరు సుమా ! తీరిగ్గా, టపాలు రాస్తూ కూర్చుంటాం అంటే వద్దంటారు. సరే ఉద్యోగం లో ఉంటా నంటే, నీకు ఏజ్ అయి పోయింది, యు ఆర్ డిస్మిస్' అంటారు సుమీ అనకున్నా.

'అయ్యరు గారు మీ సలహా ఏమిటీ ' అడిగా.

'ఇదిగో జిలేబీ,  నీ చేతి వంట నాకు దక్కే యోగం లేదన్న మాట ఎప్పటికి ' అన్నారు వారు.

అర్థం అయి పోయింది వారికి కూడాను. సలహా ఏమిటీ అని జిలేబీ అడిగింది గాని, ఆ సలహా పాటిస్తుందా అన్నది సందేహం సుమా ఈవిడ అని !

సో, బ్లాగ్ బాంధవులారా, ఇంతటి తో మీకందరికి బాయ్ బాయ్! టాటా వీడుకోలు !

అప్పుడప్పుడు,వనారణ్యాల లోంచి బయట పడితే, గిడితే, జనారణ్యాలకి వస్తే, గిస్తే, నెట్టారణ్యాలు లభ్య మయితే, మళ్ళీ మీకు ఈ జిలేబీ టపా శిరో వేదనలు తప్పవు.

అప్పటి దాకా, బాయ్ బాయ్ టాటా వీడుకోలు.

చీర్స్
జిలేబి

(పీ ఎస్: ఇది 'తూచ్' టపా !, వీలైనప్పుడు, అప్పుడప్పుడు మళ్ళీ పునర్దర్శనం !)

చీర్స్
జిలేబి
IFS (Retyred)-Indian Fun Service Retyred!

Saturday, April 7, 2012

ఇచ్చట చచ్చి నోళ్ళ జాతకం చూడబడును !


ఇచ్చట టింకరింగ్ చెయ్య బడును 
ఇచ్చట కుట్టు లు, టైలరింగు చెయ్య బడును !ఇచ్చట చచ్చి నోళ్ళ జాతకం చూడబడును ఇచ్చట మొబైలు రిపైరు చెయ్య బడును
ఇచ్చట సైకిలు ట్యూబ్ కు పంక్చరు వేయ బడును

బోర్డు చూసి లోపలి కి కాలు పెట్టాడు అప్పా రావు.


మహార్జ్యోతిష్ శర్మ గారు తలెత్తి చూసారు


ఏమోయ్ ?


మా అయ్య చాలా సీరియస్ గా ఉన్నారయ్యా ! కాస్త జ్యోస్యం చూద్దురు, వారి కి ?


ఇదిగోనోయ్ బోర్డు చూసావుగా , ఇక్కడ చచ్చి నోళ్ళ జాతకం మాత్రమె చూడ బడును


బతికున్నోళ్ళకి చూడ రాండీ ?


కుదరదోయ్


ఓ పదిహేను రోజులు గడిచాయి . అప్పారావు అయ్య మధ్యలో కాలం చెల్లి పైకి పోయాడు. అప్పా రావు శుభం తరువాయి మహార్జ్యోతిష్ శర్మ గారి దగ్గరకు వచ్చాడు.


ఏమోయ్ మళ్ళీ వచ్చావ్ ?


మా అయ్య పోయాడండీ ! జాతకం తెచ్చాను చూద్దురూ.


శర్మ గారు జాతకం చూసారు.


మహార్జాతకమోయ్  ! మొన్న రామనవమి కి వైకుంటం చేరి ఉండాలే !


అయ్యా ! మీరు మనుషులు కానే కారండీ !


శర్మ గారు తీరిగ్గా జాతకాన్ని విశ్లేషించి అప్పా రావు అయ్య జాతకాన్ని చీల్చి చెండాడి , 'మీ అయ్య ఓ పుణ్యా త్ము డోయ్ అని జోస్యం చెప్పారు !


అప్పారావు సంతోషానికి అవధుల్లేవు.


మా అయ్య అంత గోప్పోడాండీ !


అవునోయ్ !


'ఇది ఉంచండి ' అప్పారావు ఖుషీ గా శర్మ గారి ముందు ఓ పుర్రె నుంచాడు


ఏమోయ్ ఇది ?


నా తరపున కానుక అండి మా అయ్యది


చీర్స్
జిలేబి.

Friday, April 6, 2012

కనిపించిన మేఘం


ఒక మేఘం కనిపించింది
గాలి వీచింది
మేఘం సాగి పోయింది

ఒక మేఘం కనిపించింది
సూరీడు సిగ్గు పడ్డాడు
మేఘం బోరు మన్నది

ఒక మేఘం కనిపించింది
చిన్ని పాప నవ్వింది
మేఘం రాగమయ్యింది

ఒక మేఘం కనిపించింది
తాత బోసి నవ్వు నవ్వాడు
మేఘం తుర్రు మన్నది

చీర్స్
జిలేబి.

Tuesday, April 3, 2012

హై 'టెక్కు' మహిళలకు గులాం !

"చ చ చ అసలు ఈ లోకం లో మగ వాళ్లకి అసలు తమకంటూ ఓ స్టేటస్ లేకుండా పోతోందీ, అంతా హై టెక్ మహిళలకు గులాం సలాం అయి పోయింది " విసుగ్గా కనబడ్డ ప్రతి ఒక్క దాన్నీ తన్నేసు కుంటూ ఇంటి లోపలి వచ్చాడు మనవడు.

'ఏమిరా మనవడా, వస్తూ వస్తూ నే ఆండోల్ల మీద పడ్డావు ' గదమాయించాను మనవడి ని.

'ఇదిగో బామ్మా, మీ కాలం నించే ఇది మొదలయ్యింది ' అన్నాడు వాడు.

ఏమిట్రా అన్నా

'ఏమిటి అంటే ఏమిటి ? అసలు మేమంటూ అసలు ఉన్నామా ? మా కంటూ ఒక స్టేటస్ ఉందా ? ' అన్నాడు.

ఏమయ్యిందేమిటి ?

ఎల్కేజీ లో మిస్సు కస్సు బస్సు. ప్రైమరీ లో మేరీ టీచరు అథారిటీ. ఆ పై కాలేజీ లో లేడీ ప్రోఫెస్సర్స్ గదమాయింపు. పోనీ లే అని ఈ 'హాయ్ టేక్' ఐటీ ఉద్యోగం లోకి వస్తే ఇక్కడా ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ లో వుమనేజ్ మెంట్' అన్నాడు వాడు.

ఫక్కున నవ్వు వచ్చింది. అదేంట్రా , ఉమనేజ్ మెంట్ అంటా వేమిటి ?

'అవునే బామ్మా, పెళ్లి అయ్యేంత వరకు ప్రాజెక్టు లో దేశాలెంబడి తిరిగి ఆ పై పెళ్లి అయ్యాక ప్రాజెక్ట్ లీడ్ అయ్యి ఇంటి కుంపటి ని తీరిగ్గా చూసు కుంటూ, క్వాలిటీ మేనేజ్ మేంటూ, మన్నూ మషానం అంటూ,   see, ఎంత బాగా, eye పెట్టి  CMMI V ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అని క్రెడిట్ కొట్టేస్తూ, చ చ చ అసలు మాకు రెస్పెక్ట్ అంటూ ఏదైనా ఉందా అంట ' అన్నాడు

వాళ్ళ అమ్మ వచ్చింది .

కోడలా, మనవడు వయసుకు వచ్చేడు. ఓ మంచి అమ్మాయి ని చూసి కట్ట బెట్టేయి ' అన్నా . 'ఆ వచ్చే అమ్మాయే, వీడి మానేజ్ మెంట్ చూసేసు కుంటుంది కూడాను'

'వాడు వింటేనా ? అసలు ఉద్యోగంకి పోయినప్పటి నించి వాడికి వైరాగ్యం వచ్చేసింది ' అంది కోడలు పిల్ల.

'ఇదే సరి ఐన సమయం చూసి ముడేట్టేయి '

'దేశం లో అమ్మవారి రాజ్యం ! ఇంట్లో  ఆండొల్ల రాజ్యం. చ చ చ ' అన్నాడు మనవడు.

చూడమ్మాయి, వాడు వద్దని చెప్పటం లేదు కదా ! ఓన్లీ కంప్లైంట్ అంతే !

మా అయ్యరు వారు హిందూ దిన పత్రిక నించి ఓ మారు తల బయట పెట్టి, మళ్ళీ పేపర్లోకి తల దూర్చేసేరు.
వారికి పేపరు కనబడితే చాలు, వేరే ఏదీ అక్కరలే మరి. మనమోహనుల వారి పాలిసీ. అన్నీ పాలిసీ మేటరు లోనే ఉండాలి అంతే.


రాజ్యం వీర భోజ్యం ! ఈ జమానాకి, 'రాజ్యమే' హైటెక్ మహిళా భోజ్యం !

చీర్స్
జిలేబి.

Sunday, April 1, 2012

ఇచ్చట మీ ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వ బడును !

'జై స్వామీ యోగి మహారాజ్ గారికి !

జై జై జై ! సభా ప్రాంగణం దద్దరిల్లింది.

స్వామీ యోగీ మహారాజా వారు వేంచేశారు. !తెల్లటి కాషాయ వస్త్రం. (కాషాయ వస్త్రం తెల్లగా ఉంటుందా ? అవును ఇది లేటెస్టు ఫేషను!) నుదిటి పైన నైస్ స్మేల్లింగ్ విభూతి పట్ట !  బవిరి గడ్డం. నిగ నిగ లాడే ఇటాలియన్ షూస్ కాలికి. చేతిలో కమండలం. కమండలం లో నీళ్ళు స్విట్జెర్లాండ్ నిండి ఫ్రెష్ గా దిగుమతి చెయ్య బడ్డది.

"ఇప్పుడు స్వామీ యోగీ మహారాజా వారు మీ ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెబుతారు. మీ ప్రశ్నల తో బాటు పదివేల ఒక్క డాలరు నోటులను స్వామీ వారీ పాదాల చెంత బెట్ట వలెను " బోస్ మైక్రో ఫోన్ నించి అనౌన్సే మెంట్ చేసాడు ఓ స్వామీజీ.

'మొదటి ప్రశ్న' లక్షా వెయ్యిన్నొక్క నూట పద హారు డాలర్ లతో మొదలవు తుంది స్వామీ యోగి మహారాజ్ వారి శిష్య స్వామీ వారని ఖండించి తానె కొత్త వరవడి చుట్టేరు !

'ఆహా ! స్వామి వారి జ్ఞాన దృష్టి ముందు మనది ఏపాటి అని ' ఆ కుర్ర శిష్య స్వామీ ఈ మారు అట్లాగే స్వామీ అని చెంపలేసుకుని, కొత్త అనౌన్సు మెంటు చెప్పాడు ప్రశ్న విలువకి !

'మొదటి ప్రశ్న, ఓ సూటూ బూటూ వేసుకున్న పెద్ద ఆసామీ నిండి వచ్చింది. శిష్య పరమాణువు వాడి వద్దకెళ్ళి మొదట లక్ష పై చిలుకు డాలరు డబ్బులు తీసుకొచ్చి స్వామీ వారి పాదాల చెంత బెట్టేరు. ! స్వామీ వారు గబుక్కున తన కాళ్ళని వెనక్కి లాగేసుకుని ' ఛీ ఛీ' మీరే ఆ పక్క పెట్టండి అన్నారు.

'ఆహా స్వామీ వారికి ఎంత వైరాగ్యం !' అని భక్త పరమాణువు మరో మారు జై జై జై అని ఘోషించింది. !

ఆ సూటూ బూటూ వాడు ప్రశ్న మొదలెట్టేడు..

'స్వామీ ! క్రితం సంవత్సరం నా వ్యాపారం నష్టాల్లోకి పోయింది. ఈ సంవత్సరం ఏమైనా గిట్టు బాటు అవుతుందా "

స్వామీ వారు విచారం గా చూసేరు తన భక్త సూటూ బూటూ బాబుని.

'ఇదిగో, సూటూ బూటూ, విచారించకు. ఆధ్యాత్మిక పరంగా నీకు ఉచ్చ స్థితి ఈ ఉగాది నందన సంవత్సరం లో జరుగు తుంది. కాబట్టి దాంతో బాటే నీ కు వ్యాపారాభి వృద్ధి కూడాను ' అని ఓదార్చేరు !

రెండో ప్రశ్న మూడు లక్షల డాలర్లకి స్వామీ యోగి మహారాజ్ వారు సంత బేరం పాడేరు

మరో సూటూ బూటూ ఆసామి లేచి ఇల్లు విడిచి పారిపోయిన కూతురి 'ఆధ్యాత్మిక' స్థితి గురించి విచారించాడు.

స్వామీ వారు గతుక్కు మన్నారు. ఆ అమ్మణ్ణి  మొన్నే తన ఆశ్రం లో కి , తన ఆశ్రయంలోకి వచ్చి ఉన్నదాయె !

బవిరి గడ్డం తడివి, మరో శిష్యుడి కి సైగ చేసి ఆ అమ్మణ్ణి ని తోలుకు రమ్మన్నారు !

'అమ్మణ్ణి వచ్చింది, మొత్తం తెలుపే తెలు పు ఐన నిగ నిగ లాడే చీరలో.

కూతురిని జూసి తండ్రి ఆనంద పడేడు ! ఎట్టకేలకు కూతురు దక్కింది అని. మూడు లక్షల పై మరో లక్ష కానుక గా చెల్లించు కున్నాడు !

ఇట్లా స్వామీ యోగీ మహారాజ్ వారు ఆధ్యాత్మిక ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం అలా భక్త పరమాణువులు ఆ హా ఒహో అని వంత పాడడం మొత్తం మీద అవ్వాల్టి సభ ముగిసింది.

'స్వామీ వారు రేపే స్విట్జేర్లాండు వెళుతున్నారు. కావున వారితో బాటు వెళ్లాలనుకునే వారు ఆశ్రమ ఆఫీసు ని సంప్రదించండి '  అని మరో కుర్ర సన్యాసి నోటేస్సు చెప్పేడు.

పోలో మని జన సందోహం ఆశ్రం ఆఫీసు మీద పడ్డది.

ఇంతటి తో కథ జెనీవా కి ! మనం యధా ప్రకారం మన గూటికి !!


చీర్స్

జిలేబి.
(స్విస్సులో ఓ స్వామీ వారిని కలిసిన శుభ సందర్భాన!)


Friday, March 30, 2012

ఇచ్చట 'బ్లాగు వైద్యం ' చెయ్య బడును


బ్లాగ్ శిఖా 'నాని' బ్లాగ్ జిలేబీ అమ్మ వారు తీరిగ్గా లాఫ్ టాప్ ముందు కూర్చుని తన 'రచనా విరహ తాపాన్ని ' చల్లార్చుకుంటూ ఆన్ లైన్ 'చేట' లో రాళ్లేరుకుంటూ, కామెంట్లలో గోళ్ళు గిల్లు కుంటూ కాలం వెళ్ళ బుచ్చు తోంది.

ఆ దారి వెంబడే వెళ్ళే ఓ అమరికను కన్సల్టంటు జిలేబీ బ్లాగ్ పైత్యాన్ని గమనించి,

'జిలేబమ్మా, జిలేబమ్మా' నీకు ఓ ఐడియా ఇస్తాను దాంతో నీ బ్లాగ్ లోక దురద తో బాటు పైసలూ రాలుతాయి' అన్నాడు.

డబ్బెవరకి చేదు అన్న చందాన జిలేబీ ఆశ పడింది.

'ఏమిటోయ్ ' అంది.

'చూడూ, ఆన్ లైన్ చేట లో రాళ్ళేరు కుంటూ వుంటావు గా, దాంతో బాటు, నీకు తెలిసిన బ్లాగ్ గురించి చేట లో రాళ్ళేస్తూ చెప్పు. ఐడియా కి ఓ డాలరు అను నీకు పైసలు రాల్తాయి'

'నిజంగా నే అంటా వా ?'

'అవ్ మల్ల' అమెరికన్ ఎక్సంట్ నించి ఈ మారు ఆ తెలుగోడు ఆదరబాదర ఎక్సంట్ కి వచ్చాడు !

సరే అని జిలేబీ ఆన్ లైన్ చేట లో 'బ్లాగ్ వైద్యులమ్మ జిలేబమ్మ ' మీ సర్వ రోగముల నివారణ కు ఇచ్చట ఉపాయం చెప్ప బడును ' అని బోర్డు బెట్టు కుని నాలుగు రాళ్ళూ వెనకేసుకుంది !

చదువరులారా ! మీకు ఏమైన్నా రోగము ఉందా ! ఆ రోగము తీరి పోవుటకు వెంటనే చక్కని బ్లాగ్ లింకు తెలుప బడును ఇచ్చట ! మీ రోగం హుష్ కాకి! వెంటనే ఓ డాలరు కామెంటు కొట్టుడు ! మీకు వైద్య సలహా ఇవ్వబడును !

ఇట్లు
బ్లాగ్ వైద్యులమ్మ
జిలేబమ్మ !
(దీనికి స్ఫూర్తి చెప్పాలంటారా! ఈ టపా వారికే అంకితం!)

Thursday, March 29, 2012

భామనే 'నిత్య' భామనే !

భామనే 'నిత్య' భామనే !

మన ముంబై మరదల్ని పలకరించి చాలా రోజులయ్యిందని శ్రీ శర్మ గారు  రాసినప్పటి నించి కొంత ఈ ముంబై మరదల్ని ఓ కన్నేసి చూద్దామని ఓ రెండు వారాలు గా టంచను గా ముంబై మరదలు వారి తెల్లారి సోకు మధ్యాహ్నం 'బాకు' గమకాన్ని, నాట్య విలాసాన్ని గమనించడం మొదలెట్టాను !

ఆ హా ఏమి ఆ నాట్యం !

నాట్య కళా మణులు ఈ ముంబై మరదలు నాట్య కళా నైపుణ్యం  చూసి నేర్చుకోవటానికి ఎన్నో పాయింట్లు ఉన్నాయి సుమా అని పించింది.

ఒకటి జనావళి కి ఓ కిక్కు ఇచ్చి, 'ఇండియా జూమింగ్' అన్న 'బ్రాందీ' భ్రాంతి ని కలిగించి 'శభాష్ ! భువి మండలం లో భారద్దేశమంత మహామహిమాన్విత దేశం మరెక్కడా లేదు సుమీ ' అని పించడం ! ( మధ్య లో నిఫ్టీ ఐదు వేల నాలుగు వందల చిలుకుకి వెళ్ళడం జరిగింది )

రెండు, సాయంత్రం వేళ 'మోహిని ఆట్టం' ! అంటే , జుమ్మంది నాదం , నిప్పు కుంపటి లో నీళ్ళు చల్లితే, 'సోయ్యన్నట్టు ' నీరసం గా ఊగి పోవటం !

మూడు మళ్ళీ పోద్దవగానే, ముంబై మరదలు రాత్రి ప్రియుని చిలిపి చేష్టల సిగ్గు  దొంతరలతో మళ్ళీ ముస్తాబు !

ఈ సరసమైన కేళీ విలాసం లో ముంబై మహానగరం లో ఉండడం అక్కడి జన సందోహాన్ని గమనించడం జరిగింది.

ఈ ముంబై నగర వాసుల వేగాన్ని వర్ణించడం అంత సులభమైన విషయం కాదు సుమీ అని కూడా అనిపించింది

అసలు ఈ నగరం నిద్ర పోతుందా ? లేదనే అనుకుంటాను.

మొత్తం మీద బృహన్ ముంబై మహా నగరం జయహో ! ముంబై మరదలు జయహో !

'భామనే నిత్య భామనే ' అన్న తీరులో ఉన్న వీరి అందం చందం భారద్దేశ జనావళి కి , భారద్దేశ ఎకానమీ దీపానికి ఓ నిత్య నూతన రమణీ నాట్య నటరాజ పాద సుమాంజలి !

చీర్స్
జిలేబి.

Tuesday, March 27, 2012

విడాకుల పర్వం లో పిడకల వేట !

పిడకలు అగ్గి పెట్టడానికి బాగా పనికి వస్తాయి.

అవీ, మా బాగా ఈ ఎండా కాలం లో ఎండిన పిడకలైతే, మరీ బాగు ! సర్రుమని రాజు కుంటాయి. కొంత నిప్పెడితే చాలు.

పూర్వ కాలం లో (హమ్మో అంత లోపలే పూర్వ కాలం అయిపోయే!) పిడకలతో అగ్గి బెట్టి, వంట కి , వేన్నీళ్ళు కాచుకోవడానికి చేసుకునేవారు (ట) !

మా బామ్మ కి పెళ్ళయ్యే నాటికి , పదేళ్ళు లోపు.

మా అమ్మగారి కాలానికి పదిహేను.

మా కాలానికి ముచ్చట గా, స్వీట్ సిక్స్టీన్ కాక పోయినా, గవర్నమెంటు వారి లెక్కల ప్రకారం పద్దెనిమిది దాటేక !

మా తరం తరువాయి 'ఇప్పత్తైదు' !

ఇప్పుడు థ్రిల్లింగ్ థర్టీ ప్లస్ !

ఇంకా కొంత ముందు కెడితే, మా బామ్మ , బామ్మ అయిన నాటికి, అమ్మాయి పెళ్లీడు కొచ్చును !

సో, ఈ మారుతున్న కాలం లో లేటు 'మ్యారేజీలు ' విడాకుల కి మూల కారణాలా ?

రెండు, మా బామ్మ చదివింది లేదు.

మా అమ్మ మూడో ఫారం .

మా తరం డిగ్రీ (కాఫీ!)

ఈ తరం హాయ్ టెక్ చదువులు !

రాబోయే తరం హాయ్ హాయ్ టెక్ చదువులు

పెరిగిన చదువులకి , విడాకుల సంఖ్యా జోరు కి 'అణు' బాంధవ్యం  ఏమిటే ?

మూడు,

మా బామ్మ 'ఫైనాన్సియల్' జీరో.

మా అమ్మగారి 'ఫైనాన్సు' అయ్య గారి బొక్కసం మేనేజ్ మెంటు మాత్రమె

మా కాలానికి, చేతుల్లో డబ్బులు ! (జాకెట్లలో పర్సులు అని చెప్పాలి కామోసు !)

ఈ కాలానికి, వానిటీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు 'హాయ్ టేక్' ఉద్యోగాలు !

రాబోయే కాలానికి మరీ జూమింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడం !


సో, ఈ మారుతున్న కాలం లో 'లేటు మ్యారేజీలు ' విడాకుల కి మూల కారణాలా ?

పెరిగిన చదువులకి , విడాకుల సంఖ్యా జోరు కి 'అణు' బాంధవ్యం  ఏమిటే ?

పెరిగిన సో కాల్డ్, 'ఫ్రీడం' కి , విడాకుల సంఖ్యా జోరు కి 'అనుమాన' బాంధవ్యం  ఏమిటే ?


మూడు ప్రశ్నలతో పిడకల వేట మొదలు !


జిలేబి.

Monday, March 26, 2012

అమ్మాయి పెళ్లి

ప్రియమైన చెల్లెలు వరూధిని కి -

అక్కయ్య ఆశీర్వదించి వ్రాయునది. ఉభయ కుశలోపరి. 

అమ్మాయి  సౌమ్య పెళ్లి విషయమై మై బామ్మ కాబినెట్ మీటింగ్ ఇవ్వాళ పెట్టింది.

మన ఇంటి పెద్ద మంత్రులు ఐన అన్నయ్యలు హాజారైనారు మీటింగుకి. 

మీ  బావగారు జంబూ వారు నిమిత్త మాత్రులు కాబట్టి బామ్మే మీటింగుని ఖరారు చేసి ఉచిత పీఠాన్ని అలంకరించింది.

మూడోతరం మంత్రులు అంటే చిన్న చితకా కుర్రకారు అందరు క్వాలిటి కంట్రోల్ ప్రోగ్రాం కోసం దేశాల మీద ఉన్నారు కాబట్టి (నిన్నూ చేర్చి) వాళ్ళంతా గైరు హాజారు మీటింగుకి.

దరిమిలా బామ్మ నీ పెళ్లి ఖాతా వెతికి దాని ప్రకారం అమ్మాయి సౌమ్య పెళ్లికి బడ్జెట్ తయారుచేసింది. ఆ లెక్కల  ప్రకారం పెళ్లి ఖర్చులు వెరసి పది రెట్లు ఎక్కువై పోయినాయి.

బడ్జెట్ బ్రతుకులు కాబట్టి బామ్మ బుగ్గలు  నొక్కేసుకుని బావ గారి వైపు చూసింది -

మీ బావగారు ఎలాంటి ఫీలింగు లేకుండా నా వైపు చూడడం నేను ఏమి చెయ్యాలో పాలుపోకుండా మన ఇంటి పెద్ద మంత్రులు వైపు చూడడం వాళ్లు ఏమి చెయ్యాలో తెలియకుండా బామ్మ వైపు చూడడం,

బామ్మ తీక్షణ ద్రిష్టి తో మమ్మల్ని వీక్షించి "ఒరేయి బడుద్దాయిలు - మీరేమి చేస్తారో నా కవసరం. ఎట్లా చేస్తారో నాకనవసరం. అమ్మాయి పెళ్లి మూడు నెలల్లో ఖరారు అయిపోవాలి " అని అల్టిమేటం జారి చేసింది.


ఈ తంతు తో ఇవ్వాల్టి కాబినెట్ మీటింగ్కి బామ్మ వీడుకోలు చెప్పి అందర్నీ పని మీదికి అంటే అమ్మాయి సౌమ్య పెళ్లి పని మీద  పురమాయ్యించడం తో నా మనసు కొంత కుదుట పడింది.

ఈ మీటింగు తరువాయి మీ బావగారు యథా ప్రకారం దిన పత్రిక పడక కుర్చీలో కూర్చుని తిరగేయ్యటం మొదలెట్టేరు !

ఏమి చేతును నా చిట్టి చెల్లీ?

ఇదీ కథ!


బావగారికి నా నమస్సులు. !


ఇట్లు
నీ పెద్ద అక్కయ్య
జిలేబీ.

Sunday, March 25, 2012

నాడు-నేడు ఫ్యామలీ జస్టిస్ !

నాడు

ఏనాటిదో మన బంధం
ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా
ఇది ఇగిరిపోని గంధం

నేడు

ఏనాటి దో మన బాండూ
ఎరుక వచ్చేను అణు బాంబూ !
ఈ యుగములోనే
ఇంకి పోయేను బంధం !

***

ఫ్యామలీ కోర్టు లో జస్టిస్ !

'ఇదిగో రాంబాబు , గీత పై చెయ్యేసి చెప్పు, అంతా సత్యమే చెబుతానని '

'అయ్యా జడ్జీ వారు, నా పెండ్లాము గీత పై ఒక్క సారి చెయ్యేసి నందుకే ఇప్పుడు ఈ బోనులో నిలబడ్డా. మళ్ళీ మరో మారు వెయ్య మంటారా !చస్తే కుదర దండి !'

***

ఆంధ్ర లోకం లో కలకలమైన కేసు !

నాలుగో మొగుడితో మూడో పెళ్ళాం తలాక్ !

***

రూపాయ్ మొగుడు డాలరు పెళ్ళాం
సంచలనాత్మక చిత్రం
నేడే చూడండి
మీ అభిమాన ధియేటర్ లో
డైవోర్స్ సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ స్పెషల్ !


చీర్స్
జిలేబి.