Wednesday, September 19, 2012

జిలేబీల గణపతయ్య



కుడుముల గణపతయ్య అని రాయక ఇవ్వాళ జిలేబీల గణపతయ్య అంటే ఎట్లా అండీ ?
 
ఏమిటో మరి.
 
ఇవ్వాళ సెలవు వచ్చింది కాబట్టి జిలేబీలు చుట్ట టానికి తీరిక చిక్కింది మరి.
 
అందుకే కుడుముల గణపతయ్య కూడా జిలేబీల గణపతయ్య అయిపోయినాడు.
 
బ్లాగ్ లోకం లో అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు !




యే యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం !
 
జిలేబి.

Monday, September 17, 2012

తేనె తుట్ట - వలపు పంట-మానేజ్మెంటు తంటా !

ఏమండీ తెలీక అడుగుతా మానేజ్మెంటు ఎందు కంత కష్ట మైన పని అడిగా ఉసూరు మంటూ.

'Only an activ bee can create honey' మా అయ్యరు గారు సీరియస్ గా జవాబిచ్చేరు.

 అసలు ఎవడూ మన మాట పట్టించు కోడే మరి అంటే అసలు మన మాట మరొక్కడు ఎందుకు పట్టించు కోవాలి అని మరో ప్రశ్న వేసేరు.

అదీ మంచి ప్రశ్న కూడా ను అన్నా జవాబు తెలీక.

వలపు పండితేనే కదా వలపుల పంట మరి ?

అవును కదా ?

ఎక్కడైనా లేజీ బీ హనీ సృష్టించ గలుగు తుందా మరి ?

జవాబు లేదండీ మరి

so only an active bee can create honey మా అయ్యరు గారు వాక్రుచ్చేరు.

సరే అండీ, మరి, అంత కష్ట పడి  తేనే టీగ  తీయని మధురాన్ని కలిగిస్తే మరి దాన్ని అనుభవించే వాడు వేరే ఎవరో కదా ?

అదీ సృష్టి ధర్మమే మరి

అలా ఎందుకు ఉండాలి అండి మరి అయ్యరు  గారు అంత కష్ట పడి మధురాన్ని గ్రోలి తేనె తుట్టను  క్రోడిస్తే  మరొక్కడు ఎవడో దాన్ని తన్నేసు కోవటం మరి ఎట్లా సృష్టి ధర్మం అవుతుందం డీ?

అంటే జిలేబీ, వలపుల పంట మన అబ్బాయి ఎల్లప్పుడూ మనకే సొంతమం టావా ?

ఆలోచించా. సరి కాదు కదా ? ఇప్పుడు అబ్బాయి మరో వలపుల పంట కి హోత.

సృష్టి ధర్మం లో కాల చక్రం లో ప్రతి ఒక్కరికి కొంత సమయం వారి వారి ప్రజ్ఞా పాటవాలను స్ప్రష్టీ కరించ డానికి అవకాశం అంత మాత్రమే .

గీత లో ఏం చెప్పారు ? మా ఫలేషు కదాచన, అంతే కదా ? అంటే, తేనే టీగ  కి తేనె  తుట్ట ని చెయ్యడం వరకు దాని ప్రజ్ఞ, ఆ చెయ్యడం లో మధువుని గ్రోలడం వరకు దాని కాల చక్రం. ఈ తుట్ట నాదే సుమా అని అతుక్కుని పోయిన సమయాన మరో ప్రజ్ఞ కలవాడు వచ్చి తుట్టని కొట్టి తేనెను తీసుకుని ఉడాయిస్తాడు . కథ అక్కడే ఆగదు  మరి వాడికీ ఒక కాలచక్రం ఉండటం మనకు తెలిసినదే కదా మరి ?

మంచి మాటే , ప్రజ్ఞ, కాలచక్రం ! మా ఫలేషు కదాచన !

శుభోదయం.

చీర్స్
జిలేబి.

Tuesday, September 11, 2012

వేణు వైన పుష్ప రాగం

వేణు వైన పుష్ప రాగం 
 
గాలి వాటున సాగి పోయిన 
పుష్ప రాగం 
ఓ సారి నిలబడి 
తిరిగి మళ్ళీ వచ్చింది.
 
వేణువై న నాదం 
పుష్ప రాగాన్ని పలకరించి 
కుశల మడిగింది.
 
నాదం రాగం కలిసి 
మనో వీధిలో విహంగమై 
ఎగిరి పొతే 
మనసు గత  స్మృతులతో 
ముద్దాడింది.
 
కాలం వెను తిరిగితే 
గతం మధురం కామోసు !
 
చీర్స్ 
జిలేబి.

Sunday, September 9, 2012

ఆడ why తమ్ ! అద్వైతం !

ఈ మధ్య కష్టే ఫలే వారు అద్వైతం గురించి రాసారు.
 
అది చదివాక ,
 
ఆడ,
why   
 
తమ్  ?
 
సో,
 
ఎక్కడ 'తమ్' లేదో మరి అది అద్వైతం ?
 
జిలేబి.

Wednesday, August 29, 2012

అంకోలం నిజబీజసంతతి , మరి అవకేడో తత్వాని గురించి ఏమంటారు ?

అంకోలం నిజబీజసంతతి , మరి అవకేడో తత్వం గురించి ఏమంటారు ?

మా బ్లాగ్ గురువులు జిలేబీ శతక కర్త శ్రీ శ్యామలీయం వారు శంకర భగవత్పాదుల వారి శ్లోకం ఒకటి ఉదహరించారు.

అదీ ఎక్కడ ఉదహరించారంటారు మరి? శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగు లో .

వారు చెప్పినది ఇక్కడ మళ్ళీ పొందు పరుస్తున్నాను. (కాపీ యే అనుకోండీ, అయినా మంచివి అన్నీ మనం రాయాలంటే మరి కుదరదు, కాబట్టి అప్పుడప్పుడు 'కాఫీ' ఆయ నమః !)

కోట్:

శ్రీశంకరభగవత్పాదులవారి శివానందలహరిలో యీ అంకోలం ప్రసక్తి వచ్చే శ్లోకం ఒకటి ఉంది.

అంకోలం నిజబీజసంతతి రయస్కాతోపలం సూచికా
సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధుహ్ సరిద్వల్లభం
ప్రప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యచ్చతే.

తాత్పర్యం: అంకోలం అంటే ఊడుగ చెట్టు. దాని విత్తనాలు ఆ చెట్టును వదలి పోవట, సూది అయస్మాంతాన్ని అంటుకు పోతుంది వదలదు. పతివ్రత భర్తను అంటిపెట్టుకునే ఉంటుంది. లత చెట్టును వదలి ఉండదు. నదులు సముద్రం కోసమే పరుగులు పెడతాయి. అలాగే మనసు కూడా నీ పాదాలను చేరి ఉండటమే భక్తి అని చెప్పబడుతుంది.
అసలీ శ్లోకం భక్తికి మంచి నిర్వచనం.

అన్ కోట్ !

ఆ మధ్య అవకేడో (దీనికి తెలుగు వాచకం నాకు తెలియదు. ఎవరైనా చెప్ప గలరు)  గురించి చదివా. అవకేడో బీజాలు దాని దరిదాపుల్లో నో కాకుంటే ఆ అవకేడో ఫలం ఉన్న గదిలో ఉంచితే నే చాలట, ఆ అవకేడో తన మృదుత్వాన్ని, తన
తాజా దనాన్ని పోగొట్టు కోకుండా ఉంటుం దట. .

వాటి బీజాలు అవి ఫలాన్ని చేరి ఉండక పోయినా ఆ ఫల తాజా దనాన్ని నింపి ఉంచు తాయట.

ఈ నేపధ్యం లో , అంకోల బీజాలు ఒక విధమైన పరిణితి గలిగి ఉంటే, ఈ అవకేడో బీజాలు మరో విధమైన పరిణితి గలిగి ఉన్నాయి.

సృష్టి లో విచిత్రమైన ది మనకు అంతగా కంటికి అగుపించక పోయే ఇట్లాంటి మరిన్ని వింతలు ఉన్నాయో మరి !

శుభోదయం అందరికీ !

అంకోలా అవొకేడో అం అః !
అహంత్వా సర్వ భూతేషు ....

చీర్స్
జిలేబి.  

Thursday, August 23, 2012

జిలేబీ ట్విట్టరింగ్ !

ఈ మధ్య
ఒకటే సొద, రొద

ఎవర్ని చూసినా
కేకెయ్యాలని పిస్తుంది !

మీద పడి 
రక్కెయ్యాలని పిస్తోంది !

జాడూ తో
జాడించేయా లని పిస్తోంది.

సబ్బాటికల్ సణుగుళ్ళు
పిస్తోలు గుళ్ళ కంటే
సూటి కాబోలు !

ఏమిటో మరి
ఈ 'తిట్ల' పర్వం !

దీనినే 'ట్విట్టరింగ్'
అంటారు కామోసు !

చీర్స్
జిలేబి.

Wednesday, August 22, 2012

'దారూ' భాయ్ పటేల్ వెర్సెస్ జిలేబి

ఈ మధ్య నేను చూడు నేను చూడు నేను బ్యాంకు వారు పొలోమని ఐరోపా మీద పడ్డారు.

ఐరోపా వాడు ఏమి చేద్దుమురా నాన్నా, ఈ ప్రస్తుత రిసెషన్ సమయం లో అని ఆలోచిస్తా ఉంటే, ఓ జిలేబీ బ్యాంకుకి ఓ బ్రహ్మాండ మైన 'అవిడియా' వచ్చింది.

దేశం లో కోట్లాది మంది దారూ భాయ్ లు ఉన్నారు. అసలు గాంధి పుట్టిన దేశమా ఇది అన్నంత గా మన దేశం లో  దేశ రాష్ట్ర కోశానికి దారూ మూలం ఇదం కోశం అయిపోయింది.

ఇట్లాంటి దారూ భాయ్ లో అన్ని వర్గాల వారూ ఉన్నారు మరి. అంటే, కూటికి తక్కు వైనా దారూ కి డాంభికానికి తగ్గని వారి దగ్గరి నించి దారూ 'జమే బినా' దిన్  టిక్తా నహీ భాయ్ ల వరకు.

అంతే కాక దారూ ద్రవ్యంబు లకు ద్రవ్యంబు అయిపోయింది.

కాబట్టి జిలేబీ బ్యాంకు వారు , అయ్యలారా, అమ్మలారా, జర్మనీ దేశం వెళ్దాం పదండి, వాళ్ళు అక్కడ వైన్ ఎట్లా సేవిస్తారో చూద్దురు గాని నేర్చుకోండి మరి అని పిలుపు నిచ్చారు.

కాబట్టి, బ్లాగ్ భాన్దవుల్లారా, రాబోయే కాలం లో మన రాష్ట్ర దేశం లో ఐరోపా వైన్ మళ్ళీ 'సోమ పానము ' గా వచ్చే అవకాశాలు ఎక్కువగా అని పిస్తున్నాయి మరి!
వైనతేయ సోమం పిబ అని ఆకాలం లో వేదం లో చెప్పేరు.

ఇప్పుడు మనం 'జిలేబీ ఐరోపా వైన్ పిబ' అని దారూ వేదం చెప్పు కుందాం మరి !

ఇవ్వాళ్టికి ఈ టపా తో శుభోదయం మరి. అబ్బా, పొద్దుట లేచిందే, ఈ దారూ గొడవ ఏమిటం టారా, దారూవాలా , దారూ భాయ్ పటేల్ ల దేశామాయే మరి మనది.

ఏమండీ మన మొహనుల వారూ, గమనిస్తున్నారా మీ ఫైనామ్షియల్ లిబెరలైశేషన్ పాలిసీ ఓ పదిహేనేళ్ళ లో ఎట్లాంటి కొత్త పుంతలు తొక్కుతోందో మరి ?

చీర్స్
జిలేబి.

Sunday, August 19, 2012

నేనివ్వాళ టపా కట్టేశాను, మీరు చదవాల్సిందే మరి !


అబ్బా, ఈ మధ్య సబ్బటికల్ పోయి ఉద్యోగం లో వచ్చినప్పటి నించి అసలు మస్సాంతి లేకుండా పోతోంది.
సబ్బాటికల్ రోజుల్లో ఎంత హాయిగా టపా కట్టే వాళ్ళం. ఎంత హాయిగా కామెంటే వాళ్ళం

మరి ఇప్పుడో అసలు టపాలు చదవ టానికే సమయం దొరకడం లేదు మరి.

ఛ, ఛ, అసలు బుద్దుంటే ఎవరూ సబ్బాటికల్ మానుకుని ఉద్యోగం లో చేర కూడదు సుమీ.

ఎవరైనా మీలో మరి సబ్బటికల్ తరువాయి ఉద్యోగం లో చేరాలనే నిర్ణయం తో ఉంటే అది మనసులోకే రానివ్వ మా కండి మరి.

సో, ఇవ్వాళ అందుకే ఎట్లా గైనా టపా కట్టేద్దామని నిర్ణ యించి ఈ టపా కట్టేశాను మీరు చదివి తీరాల్సిందే సుమీ అని తీర్మానించు కునేసా.

ఇంతకీ టపా విశేషం ఏమిటం టారా ?

అబ్బే, మన టపాల్లో విశేషాలు ఏమీ ఉండవు సుమండీ అంతా ఉట్టి టీం పాస్ అండ్ టైం పాస్ అంతే మరి.

జోక్స్ అపార్ట్ ఈ మధ్య నాకో సందేహం వచ్చిందండీ . దాని గురించి మీకు చెప్పాలని అనిపించి ఈ టపా

మాయా బజార్ చిత్రం చూసా రాండీ ? 

ఛ ఛ మాయా బజార్ గురించి మీరు మాకు చెప్పాలా అంటారా ?

నాకు అందరికీ తెలిసిన విషయాలే తెలుసండీ మరి ఎం చేద్దా మంటారు ?

ఇంతకీ మాయా బజార్ మాట ఎందుకం టారా ?

నాకో సందేహం. మాయా బజార్ లో సావిత్రి పాత్ర పేరు ఏమిటీ ? ఎవరైనా ఖచ్చితం గా తెలిస్తే తెలియ జెయ్య గలరు.

అదీ అన్నమాట సందేహం

ఎందుకంటే అభిమన్యు ప్రేమించిన అమ్మాయి ఈవిడ. ఈవిడ పేరు ఏమిటబ్బా అని ఆలోచిస్తూంటే అసలు ఆ అమ్మాయి పేరు ఎక్కడైనా చిత్రం లో ఉదాహరించారా అన్న సందేహం నాకు కలిగే. అందుకే ఈ ప్రశ్న మరి. !

చీర్స్
జిలేబి.

Wednesday, August 15, 2012

స్వాహా తంత్రం శుభా కాంక్షలు!


చదువు కొనుడు బ్లాగు అయ్య లారా
అమ్మలారా , అక్కలారా చెల్లా లారా.

ఇవ్వాళ మాకు విడుదలోత్సవం.

స్వాతంత్ర్యం వచ్చి
షష్టి అబ్ది పూర్తీ పై బడ్డ సమయం.

కాలం గడిచే కొద్దీ, స్వాహా మంత్రం
పెరిగి పోతున్న రోజులివి.

అందుకే, జై కొట్టి చెబుతున్నాం,

తంత్రంబునకెల్లనాధారభూతంబులగు
గుటకాయ స్వాహా తంత్ర ములకు
శుభాకాంక్షలు! జేజేలు చప్పట్లోయ్ తాళాలోయ్ !

ఇండిపెండెన్స్ అంటే,
'ఇన్, డిపెండెన్స్ '   ఫార్ ఎవర్ ?

శుభోదయం !

'చెరసా' 
జిలేబి.

Saturday, August 11, 2012

కాలక్షేపం కబుర్లు - కన్నయ్య విజిట్ !

మీర జాలగలడే నా యానతి సత్యా పతి అని మురిసిపోతున్న సత్యభామ అదిరి పడింది. స్వామీ వారూ చెప్పా పెట్టకుండా బయలు దేరారు.

ఏమండీ ఎక్కడికి ప్రయాణం ? సత్యకున్ చెప్పక, మురళి యున్ చేత పట్టక పరధ్యానం లో స్వామీ వారు వేగిర పడ్డారు.

ఊహూ జవాబు లేదు. కన్నయ్య టపీ మని మాయమయ్యి అనపర్తి లో దీక్షితుల గారింటి ముందు నిలబడ్డాడు పొద్దున్నే.

తెల తెలవారి - శుభ భ్రాహ్మీ ముహూర్తం. లోపల టప టప మని శబ్దం వస్తోంది.

కన్నయ్య తలుపు తట్టాడు.

ఎవరూ అంటూ బ్లాగ్ గాంధీ బయటకు వచ్చేరు.

'నన్ను కన్నయ్య అంటారు.  నన్ను తలిచారు మీరు '

కన్నయ్య ?

అవును

చేతివంక చూసారు దీక్షితులు గారు.

మురళీ లేదే మరి ?

సిరికిన్ చెప్పక పద్యం మీరే ఎన్నోమార్లు బ్లాగ్ టపాలో రాసేరు కదా శర్మ గారు ? స్వామీ వారి పృచ్చ!

శర్మ గారు తలూపారు.

లోపలి రావచ్చా ?

అప్పటికి తెప్పరిల్లి శర్మ గారు, 'క్షమాపణలు స్వామీ మీరు వచ్చిన రీతిన కలిగిన దిగ్భ్రాంతి ఇంకా నన్ను వదల లేదు. ఇది మీ గృహం. మీకు అనుమతి కావాలా... దయ చేయండి, చెంపలేసు కున్నారు శర్మ గారు.

స్వామీ వారు వచ్చేరు.

ఏమయ్యా ఇది.

బ్లాగు అంటారండి. టపా ఒలిచి స్వామీ వారి చేతిలో పెట్టి శర్మ గారు, కీబోర్డు చేత పెట్టు కున్నారు.

స్వామీ వారు టపా లని మూషికా ధారి అయి అంకోపరి నించి ఆ నాడు కుచేలుడు తెచ్చిన అటుకులు లాగించి నట్టు లాగిస్తున్నారు.

సత్య భామ భయ పడ్డది. ఇలా స్వామీ వారిని వదిలి పెడితే ఇక బ్లాగు లకే అంకితం అయి పోతారేమో స్వామీ వారు. ఆ పై సత్యాపతి, బ్లాగ్పతి అయిపోతాడేమో మరి అనుకుంటూ.

శర్మ గారు, ఈ బ్లాగు బహు బాగు అన్నారు స్వామీ వారు.

మీరు నేర్చుకుంటారా స్వామీ ? శర్మ గారికి మహదానందం స్వామీ వారే వచ్చి బ్లాగుని మెచ్చు కుంటే ఇక వేరే ప్రశంశలు కావాలా మరి ?

నేర్పిద్దూ...

సత్య ధామ్మని వచ్చి, 'ఇదిగో, శర్మగారు, ఇది మీకు తగదు, మీ శ్రీమతి మీకెన్ని మార్లు చెప్పేరు అలా షికారు కెళ్ళి రండి ' అని మాట మార్చింది.

అమ్మ్మో, ఇక్కడా జిలేబీ యే మరి అని శర్మ గారు మౌనం దాల్చేరు.

సత్యా ఈ బ్లాగు నువ్వు కూడా నేర్చుకో రాదు మరి ?

ఎందుకు ?

అప్పుడప్పుడు మనమిద్దరం బ్లాగ్ లోకం లో ముచ్చట్లాడు కోవచ్చు గా ?

'అవునండీ మా బ్లాగ్ లోకం లో భమిడిపాటి  శ్రీ వారు శ్రీమతి వారు ఇట్లాగే ముచ్చట్లాడు కుంటుంటారండి ' శర్మ గారు ఉప్పందించేరు.

మురళీ ధారి శ్రీ కృష్ణుల వారు మూషికాధారి అయ్యేరు.

సత్య పక్కాల నిలబడి, కొలిచే!

కథ కంచికి మనమింటికి !


శ్రీ కృష్ణం వందే జగద్గురుం!

చీర్స్
జిలేబి.

Thursday, August 9, 2012

జిలేబీ లు చుట్టడం ఎలా ?

"డబ్బులు సంపాదించడం ఎలా " అనే పుస్తకం రాద్దామను కుంటున్నా నండీ అయ్యరువాళ్" అన్నా మా అయ్యరు గారితో.

"ఇదిగో జిలేబీ , జిలేబీ లు చుట్టడం ఎలా అని టపా రాస్తే చదువుతారు గాని డబ్బు సంపాదించడం ఎలా అని నువ్వు రాస్తే ఎవరన్నా చదువుతారా? అదీ గాక, నువ్వు డబ్బులు సంపాదించే సత్తా గల భామిని (బామ్మ అన బోయి మనకెందుకు తంటా, చిక్కు అని నాజూగ్గా భామిని అని నట్టు ఉన్నారు ) వైతే ఇట్లా బ్లాగులు టపాలు రాస్తూ కూర్చుంటా వా ?" అని మా అయ్యరు గారు ముసి ముసి నవ్వులు నవ్వేరు.

"ఏమండీ, దేశం లో , ఎంత మంది డబ్బులు ఎలా సంపాదించడం అనడాని పై ఎన్నెన్ని పుస్తకాలు రాస్తున్నారు ? వారంతా డబ్బులు సంపాదించాక రాస్తున్నారా ? లేక డబ్బులు సంపాదన కోసం ఆ పుస్తకాల్ని అమ్మితే వచ్చే డబ్బుల కోసం రాస్తున్నారం టారా ?" అన్నా.

రెండు రకాల జనాభా వున్నారనుకో అన్నారు మా అయ్యరు గారు.

"భర్త బాధితుల్లారా ఏకం కండీ అని ఎవరైనా నా పుస్తకం రాస్తే దాని అర్థం ఏమిటి మరి ? రాసిన వాళ్ళు  మొగుడి  బాధ, తంటా భరించలేక తన బాధను వెళ్ళ గక్కేం దుకు రాస్తున్నట్టే కదా అర్థం. దానితో బాటు ఏదైనా డబ్బులు రాలితే గీలితే గిట్టు బాటు  కూడాను" అన్నా.

'అబ్బా, ఈ 'ఆండోళ్ళు' ఏ టాపిక్ పై రాసినా మొగుళ్ళని రచ్చ కీడ్చనిదే ఊరుకోరు సుమీ' అని ఉసూరు మన్నారు మా అయ్యరు వాళ్.!

ఇంతకీ ఏ డబ్బులెలా సంపాదించడం అన్న పుస్తకం మాట ఎందుకంటారా ? ఈ మధ్య మళ్ళీ సబ్బాటికల్ తరువాయి ఉద్యోగం లో కి రావడం తో మొఖం మొత్తింది. యాధృచ్చికం గా పన్నెండు నెలల్లో రిటైరు ఎలా అవ్వటం అన్న ఒక పుస్తకం కనబడ్డది. ఔరా, మనకి కావాల్సిన పుస్తకమే మరి ఇది అని ఆశ పడి డబ్బులు వదిలించు కుని పుస్తకం కొని చదివితే రామ రామ, అంతా అరగ దీసిన ఇరగ దీసిన సమాచారమే అందులో.

'బాగా కష్ట పడండి. డబ్బు ఒక గోల్ గా పెట్టుకోమాకండి. డబ్బు అన్నది ఒక మాధ్యమం మాత్రమే. మీకు నచ్చినదేదో దాన్నే చేస్తూ ( నచ్చినదేదే దాన్నే చేస్తూంటే ఉన్న ఉద్యోగం కూడా హుష్ కాకీ అయ్యేటట్టు ఉన్నది మరి!) అందరికి సహాయ కారి గా ఉండండి..... లాంటి జిలేబీలు ఈ పుస్తకం లో చదివి, ' ఛా, ఈ పాటి పుస్తకం మనం కూడా రాయ లేమా అని ఓ ధైర్యం వచ్చేసి,

దానికి ఓనమాలు గా ఈ జిలేబీలు చుట్టడం ఎలా అన్న జిలేబీ చుట్టా నన్న మాట !

మొత్తం మీద మీరు కూడా జిలేబీలు చుట్టడం మొదలెట్టండి మరి !

చీర్స్
జిలేబి.

Monday, August 6, 2012

బ్రహ్మానందం వెర్సస్ జిలేబీ !

బ్రహ్మానందం వెర్సస్ జిలేబీ

శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మానందం మిస్టర్ జిలేబీ గా రాబోవు చిత్రం లో హాస్య పాత్ర ధారి గా వస్తున్నారని తెలిస్ సంతసం చెందితిమి. ఔరా జిలేబీ ఇంత గా హాస్య వాహిని అయిపోయినదా అని మనంబున ఆనందోత్సాహాలు కలిగెను.

వీటికి మాతృక అయిన జిలేబీ ఏమి పుణ్యము చేసెనో !

బెనారసు నగరమున వేడి పాలతో కూడిన జిలేబీ తిందురట.

బ్లాగు లోకమున జిలేబీ టపాలు వేడి వేడి 'ట' పాలు' చేరి ఆనందోత్సాహాల సమాహారం అయినవని అగుపించెను.

బ్లాగు లోకం 'బాహు' బలము ఇప్పుడు సినీ లోకమునకు విస్తరించిన దని తెలిసి మరీ సంతోషము చెందిన వార మైతిమి.

ఇక బ్రాహ్మీ  మిస్టర్ జిలేబీ ఏమి ఏమి వెరయిటీ  తెచ్చునో వెండి తెర పై వేచి చూడ వలెను కామోసు !
అయినను ఓ పండు ముదుసలి అయిన జిలేబీ కి పోటీ గా ఒక బ్రాహ్మీ రావడం ఏమైనా సబబా ?

హత విధీ కలి కాలమహాత్మ్యము అనగా ఇదియే నేమో కదా మరి.

పోనీలెండు, ఈ బ్రాహ్మీ మిస్టర్ జిలేబీ  బ్లాగు జిలేబీ కి మరిన్ని వన్నెలు తెచ్చునని ఆశించెదము!

చీర్స్
జిలేబి.

Wednesday, August 1, 2012

సరదా శారదా లాస్య భావ బ్లాగ్విభావరి!

రాగాల 
స మయ
దాకంచు టపా ల

శాకపాకములు
మణీయ మనోహర
దానిస్తా దానిస్త్ !

లావణ్య వయ
స్య భావ వి
భావరుల
య్యారి

భ్లాగ్ భామాకలాపం వా
గ్వివాదాల వ్యాఖ్యా
భావ వీచికా
క్తస్ ఫక్తస్  
రియాలిటీ షో !

వెరసి

మా బ్లాగ్ లోకం

సరదా శారదా లాస్య భావ బ్లాగ్విభావరి !

చీర్స్
జిలేబి
(ఈ టపా కి ప్రేరణ, జ్యోతిర్మయీ గారు-
సో వారికే ఇది అంకితం!)

Tuesday, July 31, 2012

నేనెందుకు రాస్తున్నాను ?

నేనెందుకు రాస్తున్నాను ?

ఈ ప్రశ్న అడిగితే, టపీ మని ఇవ్వగలిగే సమాధానం - మా ఖర్మ కాలిన కొద్దీ అని వేడిగా, వాడిగా చెప్పేస్తారు మా అయ్యరు గారైతే.

ఇంతకీ అప్పుడప్పుడు ఇట్లాంటి మనో ప్రేరిత సంక్లిష్ట అసమాధాన ప్రశ్నలు ఎందుకు ఉదయిస్తాయి చెప్మా అని ఆలోచిస్తే, అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు మన రాతల వల్ల బాగు పడ్డ వాళ్లె వారైనా ఉన్నారా అని.

రాతల్ చదివి తలరాతల్ మారుతాయా అని అడిగితే, తప్పక ఉంటుందను కుంటాను. ఉదాహరణ కి స్వామీ వివేకానంద వారి సంభాషణలు, పుస్తక రూపేణా చదివి ఎంత మంది ఉత్తెజితులవటం లేదు ఇప్పుడు కూడా?

అంటే ఈ రాతలు మనస్సు అట్టడుగు పొరల్లో నించి, వస్తే వాటికి  ఆకర్షింప బడే వాళ్ళు  ఖచ్చితం గా ఉంటారని పిస్తుంది.

సో, మన మనస్సులో జరిగే సంఘర్షణ లకి మరో వ్యక్తీ వాక్కులో, లేక రాతల లో వాటి ప్రతిధ్వని వినిపిస్తే వాటికి మనం ఆకర్షితులవుతామని అనుకోవచ్చా?

ఈ ఆలోచనని ఇంకొంచం పొడిగిస్తే, ఐరన్ ఫైలింగ్స్ కి అయస్కాంతం, అయస్కాంతానికి ఐరన్ ఫైలింగ్స్  ఒకటి కి మరొకటి సహాయ కారి లా ఉన్నట్టు భావ సారూప్యం కలవిగా ఉన్నట్టు ఉన్న రెండు మనస్సుల కలయిక ఐన రాతలు వాక్కులు దగ్గిరైనప్పుడు వాటికి మధ్య ఓ అవినాభావ సంబంధం కలిగేటట్టు అనిపిస్తుంది.

అబ్బా , నేను కూడా ఓ థీసిస్ ప్రతిపాదించేసా ! 

చీర్స్
జిలేబి
తిరగేస్తే 'బీ లేజీ' !

Saturday, July 28, 2012

ప్రణబానందుని ప్రసవ వేదన

భాగం ఒకటి


'ఆండోళ్ళ  కే ప్రసవ వేదన ఉండా  లా '? ఏం  మగరాయుళ్ళకి  ఎందుకు ఈ ప్రసవ వేదన లేదు? ఎందుకు లేదు ? అని బ్రహ్మ ని నిల దీసింది సరస్వతీబాయ్.

బ్రాహ్మ్స్ మౌనం గా ఉన్నాడు

'బ్రాహ్మ్స్, దిజ్ ఈజ్ టూ మచ్, నేనడు గు తున్నా, సమాధానం చెప్ప కుండా ఉన్నావ్' మళ్ళీ డిమాండ్ చేసింది సరస్వతీ బాయ్.

'ఏం  చెయ్య మంటావ్ సరసూ' బిక్క మొగం పెట్టి అడిగాడు బ్రాహ్మ్స్.  ఈ ప్రకృతి చేసే మాయలో మరీ ఈ ఆండాళ్ళు లిబెరల్ థింకింగ్ వాళ్ళయి పోయేరు అనుకుంటూ.

'నిక్కచ్చి గా చెబుతున్నా, వచ్చే రోల్ అవుట్  నించి మగోళ్ళ  కే ప్రసవ వేదన ఉండేలా చేయి' ఆర్డర్ డిమాండ్ చేసింది సరస.

'ప్రసవ వేదన మాత్రమె నా ?' క్లారిఫికేషన్ అడిగాడు బ్రాహ్మ్స్ .

'అవును పరధ్యానం లో అన్నది సరస్వతీ బాయ్.

స్పెసిఫికేషన్ ఫ్రీజ్ చెయ్య మంటావా ? అన్నాడు భ్రాహ్మ్స్.

దిజ్ ఈజ్ మై స్పెసిఫికేషన్. ఐ యాం గివింగ్ మై సైన్ ఆఫ్' చెప్పింది సరస్వతీ బాయ్.

'నోటేడ్ ' బ్రాహ్మ్స్ బగ్ ఫిక్స్ కొట్టాడు.


భాగం రెండు

ఓ సక్కూ బాయ్ కి తొమ్మిదో నెల.

పురిటి నొప్పులు రావటం లేదండీ అన్నది.

ప్రాణ పతి ప్రణ బా నందు నికి పోద్దిటి నించీ కడుపులో దేవుతోంది. వికారం గా ఉన్నది అదే చెప్పాడు సక్కూ బాయ్ తో.

ఇద్దరూ డాక్టరు దగ్గిరకి పరిగెత్తేరు.

డాక్టర్ జిలేబీ  ప్రేగ్నంట్ స్పెషలిస్ట్ తల తిరిగి పోయింది, ఈ కేసు చూసి

సక్కూ బాయ్ ఓ బెడ్డు మీద, పతి  ప్రణ బా నందుడు మరో బెడ్డు మీద.

ప్రణ బా నందుడు మెలికలు తిరిగి పోతున్నాడు. ప్రసవ వేదన ఎక్కువై పోతోంది. కాని ఫలితం ఏమీ కాన రావడం లేదు.

సక్కూ బాయ్ నిమ్మళం గా ఉన్నది. కడుపులో చల్ల కదల కుండా పడు కొని ఉన్నది.

ఇదిగో అమ్మాయ్, ఇక పై ఏమీ చెయ్యలేం, ఆపరేషన్ చెయ్యాల్సిందే ' డాక్టర్ జిలేబీ చెప్పింది

కత్తి  కస్సు మంది. బిడ్డ కెవ్వు మన్నాడు.

మరో ప్రణ బా నందుడు ఉదయించాడు.

బెడ్డు మీద ఉన్న పతి  దేవుడు నిమ్మళం చెందాడు.

ఆపరేషన్ అయి సక్కూ బాయ్ నీరసం గా బెడ్డు మీద 'రెష్టు' తీసు కుంటోంది.

భాగం మూడు 

ఇదేమిటీ ఇట్లా అయింది సరస్వతీ బాయ్ బ్రాహ్మ్స్ ని అడిగింది సూటిగా చూస్తూ.

అదేమీ సరస్ నువ్వేగా అలా కోరేవు? ' బ్రాహ్మ్స్ వచ్చే నవ్వుని ఆపెట్టు కుంటూ అన్నాడు.

సరస్ కోపం తో రుస రుస లాడింది .

'రివర్ట్ బేక్ ' చెప్పింది.

'ప్రొడక్షన్ రోల్ అవుట్ రోల్ బెక్' బ్రాహ్మ్స్ ఆర్డర్ ఇచ్చాడు.

'నిద్దర నించి బయట పడి  , బాక్ పాక్ బకరా బాబు ధమ్మని బెడ్డు మీంచి  కింద పడ్డాడు.

నిద్దర మత్తు వదిలింది.

రాత్రి ప్రొడక్షన్ రోల్ బేక్  గట్రా ఆలోచనల తో నిద్దర పోతే ఇట్లాంటి కలలు  గాక ఇంకా ఎట్లాం టివి వస్తాయి అని మళ్ళీ ముసుగు దన్ని పడు కున్నాడు, అబ్బా, ఈ కలల్లో కూడా ఈ జిలేబీ ల దాష్టీకం ఎక్కువై పోతోందే మరి అని ఉసూరు మను కుంటూ.

కథ కంచికి మనం వారాంతానికి !



చీర్స్
డాక్టర్ జిలేబీ,
ప్రసవ స్పెషలిస్ట్

(ఐటీ లోకం లో అన్నిటికి ఒక స్పెషలిస్ట్ ఉంటా రట   మా మనవడు చెప్పాడు, డాక్టర్ల లోకం స్పెషలిస్ట్ లా వీళ్ళ కీ బుర్ర మోకాలి లో ఉంటుం దట , ఏమిరా అబ్బీ అంటే , ఒక స్పెసిఫికేషన్ ఇచ్చారంటే దాని పూర్వా పరాలు పూర్తీ గా ఆలోచించక స్పెసిఫికేషన్ ఇస్తారట. అక్కడి నించి 'నాలుగు స్థంబా లాట మొదలు, ఫైనల్ గా ప్రొడక్షన్ ప్రాబ్లెం, రోల్ బెక్ అంటా  రని  చెప్పాడు.. ఈ బ్లాగ్ లోకం లో బ్రాహ్మ్స్ అండ్ సరస్వతీ బాయ్స్ చాలా మంది ఉన్నారను కుంటా. సో, వారి కందరికీ ఈ టపా అంకితం.)

Friday, July 27, 2012

కోతకి పెరిగిన పైరు


రైతన్న నారు పోసి నీరు పోసాడు 

పైరు గాలికి ఉల్లాసం గా తల లూపు తోంది.

పైరు కోత  కొస్తోంది రైతు సంతోష పడ్డాడు.

పైరు మరింకా సంతోషం తో తలూపుతోంది.

తలవొగ్గని పైరు కి ప్రకృతి లో పరిపూర్ణత్వం లేదు.

ప్చ్.. ఈ మానవుడు మేధావి అనుకుంటున్నాడు 

తలవొగ్గని మానవుడికి ప్రకృతి  లో పరిపూర్ణత్వం ఉందా 

ఈ మేధావి కి ఆ పైరు కున్న పాటి నిశ్చింత ఉందా?




చీర్స్ 
జిలేబి.

Thursday, July 26, 2012

వయ్యారాలు పోయిన వరూధిని ప్రవరాఖ్య !

అమ్మాయి వరుడి ముందు బుట్ట బొమ్మలా ఉన్నది

వరుడు అమ్మాయి తలెత్తి చూస్తుందేమో అని వేగిర పడుతున్నాడు

అమ్మాయి సిగ్గు మొగ్గై ఉన్నది.

మనసు ఆరాట పడు తోంది, తల పైకెత్తి చూడొచ్చు గా?

ఊహూ.. సంకోచం ఆందోళన కలగలసిన చూపుల సమయం

అమ్మాయ్ ఓ మారు తలెత్తి చూడవమ్మా అబ్బాయి నీ వైపే చూస్తున్నాడు , ఓ ముత్తైదువ ఉవాచ.

ఊహూ.

సీతా కల్యాణం అయిపోయింది.

పందిరి మంచం మీద అమ్మాయి చుబుకం పైకెత్తి అబ్బాయి కనులలో కనులు కలిపాడు.

వరూధిని వయ్యారాలు పోయింది!

ప్రవరాఖ్యుని కౌగిలి లో కరిగి పోయింది.


భాగం రెండు

'హాయ్ ప్రవర్ హౌ ఆర్ యు యార్ '

ప్రవర్ అమ్మాయి పలకరింపుతో బెరుకు పడ్డాడు.

అమ్మాయి కిసుక్కున నవ్వింది.

'నిన్నే పెళ్ళాడుతా తప్పక ' అమ్మాయి అబ్బాయి బుగ్గ గిల్లి వెళ్ళింది.

అబ్బాయి సిగ్గు మొగ్గయ్యేడు.

పట్టు బట్టి, పంతం బట్టి అమ్మాయి అబ్బాయిని స్వంతం చేసుకున్నది.

సీతా కల్యాణం అయింది

పందిరి మంచం మీద అబ్బాయి  చుబుకం పైకెత్తి అమ్మాయి  కనులలో కనులు కలిపింది.

ప్రవరాఖ్యుడు  వయ్యారాలుపోయాడు

వరూధిని కౌగిలి లో కరిగి పోయాడు!

సర్వ భూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే!


చీర్స్
జిలేబి.

Wednesday, July 25, 2012

అమావాశ్య అర్ధ రాత్రి

అమావాశ్య అర్ధ రాత్రి చందురూడు గబుక్కున 
మేఘాల మధ్య నించి బయట పడినాడు 

నిండు వెన్నెలై ప్రియుని కౌగిలి లో 
వాలి పోదామనుకున్న చిన్నది సిగ్గు పడి పోయింది.

పున్నమి వెన్నల నాడు 
చందురూడు మబ్బుల మాటున దాగాడు 

పండు వెన్నెల లో ప్రియుని కౌగిలి లో 
మమేకం అవుదామనుకున్న చిన్నది చిన్న బోయింది.


తారలు చండురూడిని ముద్దాడి ముక్కు పిండి 
లాక్కు వెళ్లి పోయేయి చిన్నదాని వ్యధ గమనించి 

చందురూడు నవ్వాడు ప్రియుడు పరవశం చెందాడు 
చిన్నది చుక్కయై చమక్కు మన్నది పరవశం తో 

కమ్మ తెమ్మర వయ్యారాలు పోయింది
తన ప్రియుని వెతుక్కుంటూ సాగి పోయింది.



చీర్స్ 
జిలేబి.

Tuesday, July 24, 2012

అసూర్యం పశ్య !

ఓ దొరసనాని అసూర్యం పశ్య !

తన మానాన తా బతికేసుకుంటూ కుటుంబాన్ని లాక్కోచ్చేది.

మగడు ఏమి తెచ్చినాడో దానిని బట్టి ఇంటిని సర్దేది. గృహ శోభ తానె అయి , వన్నె తెచ్చింది.

ప్చ్!

కాలగతిన ఓ రాజా రామ మోహన్ రాయ్ ,గురజాడ, సర్వే పల్లి, ఆ గృహ శోభ కి మరింత వన్నె తెద్దామని కొత్త పుంతలకి వరవడి చుట్టేరు.

కాలం మారింది.

ఇప్పుడు ఓ షబనా, ఓ తస్లీమా, ఓ శోభా దే, గృహ శోభ కి మరిన్ని మెరుగులు తెద్దామని సరి కొత్త ఆలోచనలకి పట్టం కడుతున్నారు.

ఓ స్త్రీ నీ నాడు ఒకరు నిర్ణ యించారు . నీ ఈ నాడు మరొకరు నిర్ణయిస్తున్నారు.

మరి నీ మాటేమిటి? నీ రాబోయే కాలం ఎవరి చేతిలో ఉన్నది? అది నీదేనా ?

లేక ఒకప్పటి అసూర్యం పశ్య మళ్ళీ 'అసంపుస్ప్రశ్య   అయి పోతోందా ?

ఎవరీ ప్రశ్న కి సమాధానం చెప్ప గలరు?

జిలేబి.

Monday, July 23, 2012

తప్పు మొగుడి దే అయినా శిక్ష పెళ్ళా నికే !

ఏ జాతి చరిత్ర చూసినా
ఏమున్నది గర్వ కారణం
'శ్రీ' జాతి సమస్తం
స్త్రీ హస్త పరాయణం

ఇది బయటి మాట
మరి अंदर की बात?

తప్పు మొగుడి దే అయినా శిక్ష పెళ్ళా నికే !

ఫిఫ్టీ ఫిఫ్టీ సమీకరణం లో
ఒక ఫిఫ్టీ మరో ఫిఫ్టీ కన్నా
ఎప్పుడూ ఎక్కువే

అని ఆమధ్య ఓ జిలేబీ అన్నది

చరిత్ర పునరావృతం.

భార్యా బాధితులు బాబా లయ్యే దానికి ఆస్కారం ఉన్నది

మరి


భర్త బాధితులు ?

ఈ ప్రశ్న కి బదులేది?

ఈ సమస్య కి కారణం ఎవరు?

ఫైనాన్షి యల్ ఫ్రీడం ఇచ్చింది ఎవరు ? పుచ్చు కున్నది ఎవరు?

చదువు నేర్చుకోమంది ఎవరు? చదువు కొన్నది ఎవరు ?

సమానత్వం లో అసమానత్వమా ?

ఆకు ముళ్ళు సమీకరణం లో ఎప్పుడూ ముళ్ళ కే ఎందుకు గొప్ప దనం ?

ఏమండీ మీ కేమైనా తెలుసా?

జిలేబి.
(జిలేబీ పరార్!)