Thursday, October 29, 2015

అమ్మకానికో బ్లాగిల్లు - కొనడానికో ....

అమ్మకానికో బ్లాగిల్లు - కొనడానికో ....

మొత్తం మీద మరో అగ్రిగేటర్ డమాల్ ! బ్లాగిల్లు మూట కట్టే సారు మా 'స్టారు' శ్రీనివాసు గారు.

అదేమిటో ఈ తెలుగు బ్లాగు లోకాని కొచ్చిన ఖర్మ !

ఒక్కటొక్కటే బ్లాగులు మూత పడి పోతా ఉంటె , దానితో బాటు అగ్రిగేటర్ లు కూడా మూట కట్టేయ్యటం !

బ్లాగిల్లు శ్రీనివాసు గారు ఇచ్చిన కారణం - బ్లాగిల్లు కి అంత 'రెస్పాన్స్' రావటం లేదు అని .

బ్లాగులు వ్రాసే వాళ్ళు ఎందుకు వ్రాయటం లేదు అంటే ... అబ్బే అంత 'రెస్పాన్స్' రావటం లేదండీ అని.

ఇట్లా ప్రతి ఒక్కరు చూస్తా ఉంటె మిగిలిన వాళ్ళ కోసమే వ్రాస్తా ఉన్నట్టు ఉన్నారుస్మీ ! జేకే !

(ఈ మధ్య శ్యామలీయం వారి బ్లాగులో కామెంటి జేకే అంటే - జేకే అంటే ఏమిటి అని అడిగారు శ్యామలీయం వారు - అబ్బే జేకే తెలీక పోవటమేమిటి వీరి కి అనుకున్నా ! జేకే !)

ఏమండీ బ్లాగిల్లు శ్రీనివాసు గారు, కూడలి, మాలిక గట్రా వాళ్ళు ఏమి ఆశించి ఇంకా తమ అగ్రిగేటర్ లని నిలబెట్టి ఉన్నారు ?

మరో ఆలోచన వస్తుంది - అగ్రిగేటర్ ల ని పెట్టిన వారు - అగ్రిగేటర్ ని మరీ 'పెర్సనల్' గా చూస్తూ న్నారేమో అని ! బ్లాగులోళ్ళం మేమైతే బ్లాగులకి కామింటులు వచ్చాయా లేదా అని ఆతుర పడుతుంటాం గాని అగ్రిగేటర్ లు 'క్లిక్కులు' వచ్చేయా లేవా అని రోలు కర్ర రూలు కర్ర పట్టుకుని లెక్కెయ్యడం జేసి అగ్రిగేటర్ ని మత పెట్టేస్తే  ఇక మా లాంటి బ్లాగులొళ్ళ కి వ్రాసే టపాల కి ఎక్కడ ప్రచారం ఉంటుంది ?

సో  బ్లాగిల్లు శ్రీనివాసు గారు మీరు మళ్ళీ మీ అగ్రిగేటర్ ని త్వరతిం గా నే తెరవండి .

ఆ కామింటు ల సెక్షన్ ని హారం లా తయారు చెయ్యండి (exactly like 'haram' comment section) అప్పుడు చూడండి మీ అగ్రిగేటర్ కి వచ్చే హిట్లని :)


చీర్స్
జిలేబి
 

Monday, October 19, 2015

ప్రతి తెలుగు వాడు తప్పక చదవాల్సిన పుస్తకం - ఇదండీ మహాభారతం !

ప్రతి తెలుగు వాడు తప్పక చదవాల్సిన పుస్తకం - ఇదండీ మహాభారతం !

తెలుగు వారి కి సులభ శైలి లో మహా భారతాన్ని రంగనాయకమ్మ గారు అందించారు.

ఇందులో కథా పరం గా , అక్కడక్కడా వారి వ్యాఖ్యానాన్ని అందిస్తూ మూల మహాభారతానికి అతి దగ్గిరగా అచ్చ తెనుగులో మహా భారతాన్ని వీరు అందించారు .

దరిదాపుల్లో నాలుగు వందల పేజీ ల లో మహా భారతాన్ని ఎట్లాంటి 'భేషజాలు' , ఉత్కృష్ట ఉపమానాలు  లేకుండా కథ ని కథావస్తువు ని యథార్థం గా అందించారు.

వారు అక్కడక్కడ కొట్టిన సెటైర్ నవ్వు తెప్పించ వచ్చు.

కొండొకచో వెటకారం గా అని పించ వచ్చు.

కూసింత వెగటు కలిగించ వచ్చు.

వీటన్నిటి ని పక్క న బెట్టి, ఒక మామూలు సాధారణ జన సమాజానికి ఈ మహా భారత కథ ఏమన్నా విలువల్ని అందిస్తాయా అని వారు ఎక్కు బెట్టిన బాణం మనల్ని ఆలోచింప జేస్తుంది.

వారి సైడు కామింటు లని పక్క న బెట్టి మహా భారతాన్ని ఆస్వాదించ వచ్చు.

సైడు కామింటుల తో సహా చదివితే తల తిరిగ వచ్చు. దానికి వారిని బాధ్యులని చేయ రాదు. 

మహా భారతాన్ని ఇట్లాంటి కోణం లో నించి కూడా చూడ వచ్చు అనడానికి రంగనాయకమ్మ గారి పుస్తకం ఒక సర్వోత్క్రుష్ట మైన ఉదాహరణ.

చదవండి . ఆలోచించండి. అన్నింటినీ యధాతధం గా (వారి 'కిక్కుల'ని కూడా) తీసు కోవాల్సిన అవసరం లేదు.


 
 
చీర్స్
జిలేబి

 

Thursday, October 15, 2015

జబ్బు పడి లేస్తే దాని హాయి యే వేరు :)

జబ్బు పడి లేస్తే దాని హాయి యే వేరు :)

ఈ మధ్య అదేమి విష్ణు మాయయో , గ్రహాల 'పాట్లో' ప్లాట్లో తెలీదు గాని సీనియర్ సిటిజెన్ అయిపోయారు గా ఇక ఇట్లాంటి జబ్బులన్నీ మామూలే అని జిలేబి కే రిటార్టు ఇచ్చె లా ప్రియ బాంధవులు తయారయ్యేరు !
 
అబ్బా ! జబ్బు పడి లేస్తే దాని మోజే వేరు !
 
ప్రశాంతత అనగా నేమి ! అని తెలియ వలె నన్న, అయ్యరు గారి తో సేవలు చేయించు కోవాలె అన్నా జబ్బు పడితే నే తెలుస్తుంది !
 
దేశం లో మళ్ళీ మొన్న వచ్చిన అమావాస్య పాట్లు గ్రహపాట్లు గురించి మళ్ళీ టపా వచ్చేసింది కూడాను మా బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి నించి . కాబట్టి నేను సరి కొత్త గా కొట్టాల్సిన టపా కూడా ఏమీ లేదు :)
 
ఇక భారద్దేశం లో చాలా మంది తమ తమ అవార్డులను (కాగితా ల ముక్కలను, పథకాలను ) తిరిగి ఇచ్చ్చేస్తున్నారు . కాబట్టి నేను కూడా నాకు బ్లాగు లో ళ్లు ఇచ్చిన పథ కాలను అన్నిటినీ తిరిగి ఇచ్చేయా లను కుంటున్నా :)
 
ఇప్పటి కి టపా కబుర్లు ఇంతేస్మీ :)
 
చీర్స్
జిలేబి

Wednesday, September 16, 2015

నేనిప్పుడు భవిష్యత్తుని చదవగలను - చూడ గలను - జిలేబి భవిష్యపురాణం :)

నేనిప్పుడు భవిష్యత్తుని చదవగలను - చూడ గలను - జిలేబి భవిష్యపురాణం :)

శిష్యా !

గురూ

ఇవ్వాళ్టి న్యూస్ పేపర్లన్నీ వచ్చేయా ? న్యూస్ ఛానల్ అన్నీ సమీక్షించావా ?

చేసేసాను గురూ !

లేక్ఖెంత ?

జపానులో పెను తుఫాను - మూడు శాల్తీలు లేచి పోయేయి

హు; శని మూడో గళ్ళ లో ఉన్నాడు .

సౌదీ లో వందమంది క్రేను క్రింద నుజ్జ్జు

సహస్రాణాం మయా సృష్ట్యాం రాసుకో . రాహువు కేతుని చూస్తున్నాడు .

ఇంకా ?

అమెరికా లో స్కూలు బస్సు ఆక్సిడెంటు - ఇద్దరు పిల్లలు

బాలార్కుని మార్కు ఇది రాసేసుకో .

ఇండో నేషియా లో ఖాండవ దహనం గురువర్యా

రాసుకో - అగ్ని దేవుడు నెయ్యి కోసం చూస్తున్నాడు .

లెక్ఖ లయ్యేయా ?

ఓ లెక్ఖ బకాయి గురూ !

ఏమిటోయ్ ?

అమెరికా వాడు వడ్డీ రేటు పెంచు దామా వద్దా అని ఆలోచిస్తున్నాడట ....

హు హు హు ! వాడి శ్రాద్ధం దరి దాపుల్లో కి వచ్చేస్తోంది - అమెరికా ఎంబసీ వాడు తనకు వీసా ఇవ్వక పోవడం గుర్తు కొచ్చే స్వామీ వారికి - రాసుకో - మిధునం లో మిడి మిడి పాటు తప్పదు . ధనుస్సు లో శని ప్రవేశిస్తున్నాడు . అయ్యిందా లెక్ఖ ?

ఓ మోస్తరు అయినట్టే గురువు గారు !

ఓకే ! వీటన్నిటిని మన రీసెర్చ్ విభాగానికి పంపి తీక్షణం గా గ్రహ గతుల్ని వీటి కనుగుణం గా సంశోధించు !

అట్లాగే గురువరా !

రాబోయే కాలం లో ఏమి జరుగును గురువరా ? ఎనీ క్లూ ?

బిడ్డా ! రాబోయే కాల రహస్యం శ్రీవిద్యా రహస్యం ! అది అందరికి చెప్ప బడదు ! కాలం దాట గానే పేపర్లో వచ్చె అన్ని బ్యాడ్ న్యూస్ లు సంకలనం చేసుకుని రా నా దగ్గిరికి వాటన్ని టికీ మూలాలను గ్రహ గతులనించి నీకు లాగి చూపిస్తా :)

గ్రహ గతులు అన్నింటి నీ నిర్దారిస్తాయ్ అవన్నీ నీకు అర్థం కావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది - మొన్న అమావాస్య వచ్చింది చంద్రుణ్ణి చూసేవా ?

చంద్రుడు ఒట్టేసి కనబళ్ళేదు గురూ :)

శిష్యా ! నాకు నువ్వు తగిన పరమానందయ్య శిష్యుడవే !

జై బోలో గురు మహారాజ్ కీ ! జై జై జై! విజయీ భవ ! రాబోయే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏమి జరుగును గురు మహారాజ్ !

గుండు గురువు బవిరి గడ్డం తడివేరు ! - ఇరవై తొమ్మిదో తేది చెబ్తా నీకు ఆ రహస్యం :)


చీర్స్
జిలేబి 

Monday, September 14, 2015

చెట్టు కొమ్మన కోతి - చెరువులో చందమామ !

చెట్టు కొమ్మన కోతి - చెరువులో చందమామ !
 
చెరువులో చందమామ కనిపిస్తే 
చెట్టు కొమ్మన కోతి 
లబక్కున చెరువులోకి దూకింది 
చందమామని చుట్టే ద్దా మని !
 
చెరువు కల్లోలమై చందురూడు  
ప్రతి నీటి బొట్టు లోనూ కరిగి పోతే 
చెట్టు మీది కోతి 
ప్రతి బిందువు నీ ముద్దాడు దామని 
మునకలు వేసింది . 
 
 
ఆకాశం లో ఓ కారు మేఘం 
చందురుణ్ణి కప్పేసింది -
మళ్ళీ కోతి చెట్టే క్కే సింది !
 
 
శుభోదయం 
జిలేబి 

Friday, September 11, 2015

ప్రత్యభిజ్ఞాత్ హృదయం - ప్రత్యభిజ్ఞాత్ హృద్యం !

ప్రత్యభిజ్ఞాత్ హృదయం - ప్రత్యభిజ్ఞాత్ హృద్యం !

కశ్మీరీ శైవ సంప్రదాయం లో - సంక్షిప్త మైన సూత్రీకరణ కాబడ్డ  ప్రత్యభిజ్ఞా హృదయం  -అభినవ గుప్తుని శిష్యుడైన క్షేమ రాజ క్రోడీ కరించిన కృతి .  అభినవ గుప్తుడి కాలం పదవ శతాబ్దం అని ఒక నిర్ధారణ . ఆ ప్రకారం చూస్తే ఈ క్షేమ రాజ ఆ కాలపు వాడై ఉంటాడు .

చిన్ని చిన్ని పదాలతో మేరు సమాన మైన భావాన్ని ఈ పుస్తకం లో చూడ వచ్చు .

కామెంటరీ లేకుండా చదవటం నా వరకైతే బెటర్ .

కాని అందులోని 'nuances' ని తెలుసుకోవా లంటే వ్యాఖ్యానం/భాష్యం  చదవకుండా అర్థం కాదేమో . బ్రహ్మసూత్రముల లా ఇదీ సూత్రీ కరించ బడిన పుస్తకమ్.

ఆ కాలం లో అన్నీ సూత్ర రూపం లో చెప్పడం ఆనవాయితీ !

(దానికి భాష్యం/వ్యాఖ్యానం/వ్యాఖ్యానం పై మరో వ్యాఖ్యానం  చెప్పు కోడా నికి వేరు వేరు కాలం లో వారి శిష్యులు మళ్ళీ మళ్ళీ పుడతా రనుకుంటా వాటికి అర్థం తెలుసు కోవడానికి, అర్థం చేసుకోవడానికి,, పరమార్థం  చెప్పు కోడానికి . జేకే ! (అంతా కాలమహిమ ! విష్ణు మాయ యాయే మరి !)  -

మొదటి సూత్రం తో నే మతి పోతుంది ; certainly you will be taken to a different dimension later on !
Enjoy!

చితిహి స్వతంత్రా విశ్వసిద్ధి హేతుహు !

ప్రతి - ప్రత్యక్ష
అభి - ఇప్పుడే (హిందీ లో अभी ఇందులో నించే వచ్చిందే మో )
జ్ఞాన - జ్ఞానం
హృదయం - The heart of 

ప్రత్యభిజ్ఞ - Recognition
(The heart of (secret of)  'Recognition')

ప్రత్యక్షం గా ఇప్పటి కిప్పుడే జ్ఞానమైన హృదయం .  An Heart that has realized in the 'Now'.

 ప్రత్యభిజ్ఞహృదయం లింకు ఇక్కడ

శుభోదయం 
చీర్స్ 
జిలేబి
 

Thursday, September 10, 2015

అద్దం లో ముఖం !

అద్దం లో ముఖం !
 
 
ముఖమల్ మీద
పడు తూం టే 
అద్దం లో ముఖం
పలచ నై పోయింది !
 
పోనీ అద్దాన్ని తుడిస్తే 
తా తళుక్కు మని 
మెరిసింది కాని 
ముఖం కనిపించ లేదు !
 
అబ్బా ముఖమల్ 
తీసేద్దా మంటే 
ఎందుకో బెరుకు 
బెరుకుతో సరకు 
దొరుకు తుందా ?
 
 
 
 
శుభోదయం 
జిలేబి 

Monday, September 7, 2015

ఆత్మ ఉందా లేదా ? సరి ఐన సమాధానం చెప్పండి చాలెంజ్ పే చాలెంజ్ !

ఆత్మ ఉందా లేదా ? సరి ఐన సమాధానం చెప్పండి చాలెంజ్ పే చాలెంజ్

చా, మరీ ఇట్లా అడ్డ దిడ్డ మైన ప్రశ్న వేస్తే ఎట్లా జిలేబి అంటారా ?

లేకుంటే ఏమిటండీ ?

పురాతన కాలం నించి ఈ ప్రశ్న వేధిస్తో నే ఉంది . వేధిస్తో నే ఉంది ; ఇంకా ఒక ఒకే నిర్ధారణ కి రాలే !

ఆత్మ ఉందంటూ కొందరు , లేదంటూ ఇంకొందరు వాదిస్తూ నే ఉంటున్నారు .

దీనికి తోడు జోదు ఆ సో కాల్డ్ 'పరమాత్మ :) కలడు కలండనే వాడు కలడో లేదో అంటూ సందేహం వెలిబరుస్తూనే మహా భాగవతం రాసి మన మొఖాన పడేసి కుదేసి టా టా చెప్పి తా చక్కా పోయాడు పరంధాముని సన్నిధికి అంటూ ఒక పుణ్యాత్ముడు :) మళ్ళీ ఇక్కడా ఆత్మే పుణ్యాత్ముడు , పాపాత్ముడు గట్రా :)

ఆత్మ కి అసలు రూపం లేదు ; ఎక్కడ ఉంది అని మన కష్టే ఫలే వారి లా వివేక చూడామణి ని పట్టు కు ఈది, (ఇదేమన్నా గోదావరి యా ఈ తటం కని పిస్తే , ఖచ్చితం గా ఆ వైపు మరో తటం ఉందని అనుకోవడానికి :)) ఈది కోశాల కోణాల ని కొన లని పట్టు కోవడానికి 'బాహుబలి' ప్రయత్నం చేస్తున్నారు !

మరి కొందరేమో యోగః అంటూ జోగాడుతూ ఆ సో కాల్డ్ ఆత్మా వారిని సందర్శించ డానికి శీర్షాశనాలు వేస్తున్నారు .

మరి కొందరేమో , స్వామీ వివేకా నందా వారికీ జెయ్ అంటూ మన నరేంద్ర మోడీ వారి లా (ఈ నరేంద్ర మోడీ పేరు ఎందుకు జిలేబి అంటే , బ్లాగార్పీ రేటింగు కోసం అని బ్లాగ్ రీడర్లు చెబుతారు కాని జిలేబి అది ఒప్పుకోదు  !) దరిద్ర నారాయణ్ సేవ లో కర్మ యోగం లో మునిగి తేలి ఆత్మ దర్శనాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు .

మరి కొందరేమో , హూ యాం ఐ అంటూ తల గోక్కుంటూ బుర్రె తడుముకుంటూ దీర్ఘాలోచనలో పడి ఆత్మా ఎక్కడ ఉన్నావా అసలున్నావా అంటూ బవిరి గడ్డం తడివేసు కుంటున్నారు.

వీటి మధ్య లో నగర జీవనం లో క్రిందా పైనా పడి నోటి బువ్వ కి చేతి పని కి ఏమైనా పొత్తు కుదురుతుందా అంటూ సగటు మానవుడు ,తనకున్న కొద్ది పాటి సమయం లో గణపతి బప్పా మోరియా అంటూ రెండు చెంపలు వేసేసుకుని , గుంజిళ్ళూ తీసేసు కుని వచ్చేస్తోంటే , సో కాల్డ్  'శాస్త్ర పారంగతులు ' అసలు శాస్త్రం లో విగ్రహారాధన ఉందా అంటూ తర్కించి తర్కించి శుష్కించి శుష్కించి అలసి సొలసి నిదుర పోయి లేసి ఆహా కల గంటిని అంటూ ఇదియేరా పరమాత్మ తత్త్వం అంటూ సెటిల్ అయి పోతున్నారు .

ఏమిటో , జిలేబి నాకు ఒక్క ముక్కా అర్థం కావడం లేదంటారా !

అంతా మాయ ! విష్ణు మాయ ! అంటూ జిలేబి చక్కా వెళ్లి పోతుంది !

అబ్బబ్బా , ఈ ఆత్మా వారికి అంత టెక్కు ఎందుకో ? ఉంటె , ముందుకొచ్చి నేనే అని జేప్పోచ్చు గా ?

ఊ హూ ! చస్తే  రాడు, రాదు  - చస్తే గాని రాడు, రాదు, ముందుకి అదే ఏమి చావడం  అంటే వెతుక్కో జిలేబి  ఏది చావాలో అంటూ ఉపనిషత్తుల వారు (వీరు డైరెక్ట్ గా చెప్పరు గాక చెప్పరు - ఉపనిషత్తుల వారిది ఎప్పుడూ ఇండైరేక్ట్ మార్కెటింగ్ టెక్నీక్ :) ముక్తాయించి ఆయ్ ఇక మరో ఉపనిషత్తు కి వెళదామని చక్కా వెళ్లి పోతారు !

ఇక మిగిలింది ఈ కాలపు స్వామీ వారలు, మహారాజ్ లు , వీళ్ళు కాలాని కి తగ్గట్టు ఏది కావాలో అది చెప్పుకుంటూ టైం పాస్ టీం పాస్ చేసి వారికి తగిన జ్ఞాన బోధ ఇంకొంచం గట్టి వారైతే తరుణో పాయ మంత్రం జెప్పి నీ తంటాలు నువ్వు పడవోయ్ జిలేబి అని చక్కా ఆ హిమాలయాల కేసి తిరిగి దండం పెట్టేసు కుంటారు !

ఇక హిమాలయాల మాట అంటారా ? 'కాలా కాలం' గా వీటన్నికి సాక్షీ భూతం గా (ఈ సాక్షీ భూతం ఏమిటి మధ్య లో !) నిలబడి గంగై , సుగంగై , ఆకాశ గంగై , సాగరమై , మేఘమై, నీలి మేఘమై , ఘనీ భూతమై ( మళ్ళీ భూతం ) , హోరై, జోరై , వానై వరదై , మళ్ళీ హిమమై , మళ్ళీ ......


శుభోదయం
జిలేబి
(కష్టే ఫలే వారి వివేక చూడామణి టపా శర పరంపరలు చదివేక )

Wednesday, September 2, 2015

హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులోళ్ళు అంటే నే నాకు భయ్యం :)


హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులోళ్ళు అంటే నే నాకు భయ్యం :)
 
 

అక్కడక్కడా చెదురు ముదురు గా తెలుగు బ్లాగు లోకం లో టపాలు రాద్దామని, వీలైతే తమకు తెలిసిన దానిని నలుగురుకి షేర్ చేసుకుందామని గట్రా 'సద్భావన' తో ఉన్న బ్లాగు మణులు, మాన్యులు బితుకు బితుకు మని నేటి టపా రాద్దామా వద్దా అని డైలమా లో పడి సరే పోనీ ఈ దురద వదిలితే పోయేదా ఏదో ఒకటి రాద్దా మని నిర్ణయించు కని కీ బోర్డ్ పట్టేరు , టపా రాసి హమ్మయ్యా ఇవ్వాల్టికి మనం రాసే సాం - ఏడుకొండల వాడా వెంకట రమణా నా టపాలు 'హ్యాక్' కాకుండా చూడు సామీ అంటూ పెరుమాళ్ళ కి నమస్కారం పెట్టి పబ్లిష్ బటన్ నొక్కేరు .

అంతలో బ్లాగు భూతాలూ , పెను భూతాలూ, లిటిల్ రాస్కేల్స్, బిగ్ 'భ్రాతర్స్' , టైనీ 'త్విట్టర్స్' ఆవులింతలు బెట్టి ముసుగు తన్ని నిదుర పోదామా లేక బ్లాగు లోకం మీద పడి కస మిస కామింట్ల తో కుదేద్దామా అని మళ్ళీ ముసుగులు పెట్టు కునేయి .

అంతలో వాళ్ళ బాస్ అందర్నీ 'జర నిద్ర లేవండహే' అని  అదమాయించి తానూ టపాలకి కామెంట్లు బరకడానికి సంసిద్ధురా లయ్యింది.

అగ్రిగేటర్ ల లో కామింట్ల వరదలు తయారయ్యేయి .

కుక్కా !

నక్కా !

నంగ నాచి

ఓసీ శూర్పణఖ !

బద్మాష్ !

ఆంద్రోళ్ళ ఆగడాలు

తెలంగాణా తిట్లు

నువ్వా  నేనా

సై అంటే సై



బ్లాగు భూతాలూ, రాస్కేల్స్ గుంభన గా నవ్వు కునేయి . టపాలు రాస్తారర్రా :) చూడండి మీ టపాల కన్నా పెద్ద పెద్ద కామింట్లు పెడతాం అంటూ 'బద్మాష్' అంటూ అరిచేయి .

వాళ్ళ బాస్ అందరికి ఆర్డర్ పడే సింది - ఒరేయ్ బడుద్దాయిలు, అందరూ ఓ పదో పరకో పేర్లు పెట్టు కొండర్రా మీలో కొందరు పొగుడుతూ రాయాలి . మరి కొందరు తెగుడుతూ రాయాలి . మరి కొందరు బండ 'బూట్ల' తో తల తన్నేలా కామింటా లి .

సై అంటే సై అనేయి కామింటు కామినులు, భూత ప్రేత పిశాచాలు :)

హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులో కామేంటోళ్ళం టే నే నాకు భయ్యం :)

శుభోదయం
చీర్స్
జిలేబి

Friday, August 28, 2015

శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ! -పద్య రచన- శ్రీ గుండు మధుసూదన్!

శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ! 

పద్య రచన- శ్రీ గుండు మధుసూదన్!

నేడు శ్రావణ మాసమునందు  పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మీ శుక్రవారము. పరమ పవిత్రమైన పండుగ రోజు.

ఈ సందర్భముగా శ్రీ గుండు మధుసూదనరావుగారు రచించిన వరలక్ష్మీ  వ్రత మాహాత్మ్యము కథను పద్యములలో చదివి ఆనందించండి.

శ్రీ గుండు మధుసూదన్ గారికి
అభినందనల తో జిలేబి 
 

పద్య రచన. శ్రీ గుండు మధుసూదన్! 
ఆ.వె.
సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు! (1)
ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)
కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్! (3)
తే.గీ.
మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)
కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)
తే.గీ.
“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)
ఆ.వె.
అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ;
చారుమతియు లేచి, సంతసించి,
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి,
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)
కం.
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)
తే.గీ.
అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి,
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)
కం.
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్! (10)
తే.గీ.
“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి!
దేవి! నారాయణప్రి యాబ్ధితనయ! నమ”
మనుచు వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)
తే.గీ.
తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)
తే.గీ.
పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)
కం.
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్న మఱియుఁ జదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత మనవరతమ్మున్! (14)
(ఇది వరలక్ష్మీ వ్రతమాహాత్మ్య కథ)

Thursday, August 27, 2015

కాళిదాసు చెల్లెలి మావ భలే మంచోడు :)

 
కాళిదాసు చెల్లెలి మావ భలే మంచోడు :)
 
కాళిదాసు చెల్లెలు
కవిత చెబ్తే 
మావ మెలితిరిగి
వంకర్లు పోయేడు 
 
 
 
జేకే !
 
జిలేబి 

Tuesday, August 25, 2015

నా జేబులో డబ్బులు పోయెను - రామా హరే ! కృష్ణా హరే !


చైనా డమాల్ - గ్లోబల్ జాటర్ డమాల్ :)

చీని చీనాంబరాలు ధరించి అని ఆ కాలం లో గొప్ప గా చెప్పే వాళ్ళం. ఈ మధ్య గ్లోబలైజేషన్ గోల లో చీని చీనాంబరాలు ఎక్కడ చూసినా అక్కడ .

పాపం చీనా వాడు కొంత ఇల్లు సర్దు కుంటామని ఇల్లు కొంత సర్ది తే , ఆ సేతు హిమాచల పర్యంతం అన్నట్టు అటు జప్పాను వాడి నించి ఇటు అమెరికా వాడి దాకా అందరి జాటర్ డమాల్

కొందరు మానిక్ మండే అంటే , మరి కొందరు బ్లాక్ మండే అని గీతాలాపన చేసేరు .

బ్లడ్ బాత్ ఆన్ దలాల్ స్ట్రీట్ అంటూ మా హిందూ 'వార్' చెప్పేరు .

ఒక్క రోజులో వెయ్యిన్ని ఆరు వందల పాయింట్లు జాటర్ డమాల్ అవడం ప్రపధమం . ( అంటే, ఇకమీదట ఎప్పుడైనా జాటర్ డమాల్ అయితే దీనికి పై బడే అన్నీ పడతాయని అనుకోవాలేమో మరి :) బెంచ్ మార్క్ ?)

ఏడు లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులో హుళు హుళు క్కి అయి పోయిందట :) ఇంతకీ ఈ దస్కం ఎవరి జేబులో కెళ్ళి ఉంటాయి ? అమెరికా వాడి ఇంటికి మళ్ళీ చేరి పోయి ఉంటాయా ? సమాధానం లేని ప్రశ్న :)

సరే మన జైట్లీ వారేమో అబ్బే , మన దేశం సర్దేసు కుంటుంది అని వాక్రుచ్చేరు .

మా ఆర్ బీ ఐ రాజన్ గారేమో జిలేబి చీర్సు చెబితే చెప్పును గాని నేను మాత్రం చీర్స్ చెప్పనే చెప్పను అనేసేరు - రీజేర్వ్ బ్యాంక్ చీర్ లీడర్ కాదోయ్ అంటూ .




సందులో సడే మియా అంటూ వడ్డీ రేటు మార్పు కి కొంత కామా పెట్టేరు .

ఈ స్టాకు మార్కెట్టు గోలలో మామూలు విషయమై పోయిన ది - కమాడిటీ మార్కెట్ - పదహారు సంవత్సరాల ప్రాయం కోల్పోయింది :) (పదినారు వయదినిలే అంటూ ఇక మనం పాట పాడేసు కోవచ్చు )




మధ్య లో రూపాయి భేతాళుడు నాదారి ఎడారి నా పేరు బికారి అంటూ మళ్ళీ మొదలెట్టేడు !



వీటన్నిటికి కారణం గ్రహ పరిస్థితులే అని నొక్కి వక్కాణిస్తూ న్నారు బ్లాగ్ జ్యోతిష్యులు :)




రాబోయే సెప్టెంబర్ 'మహీ'నా లో 'మహీ' మీద గామా రేస్ విపరీతం గా వస్తున్నాయంటా ; దానికి ముందస్తు గా ఇవన్నీ 'శుభ' సూచకాలు కని పిస్తున్నాయ్ (అట :)

జిలేబి మొన్న స్వామీ వారితో సెల్ఫీ మేళ మాడేవు కదా దాని పర్వ్యసానమే ఇది అని మరి కొందరు 'మెట్టియల్' విరిచేరు కూడన్నూ :)

జిలేబి ఇప్పుడు కూడా చీర్సేనా అంటే ఏమి చెప్పడం

జాటర్ డమాల్ అయినా చీర్సు చీర్సే :) జిలేబి జిలేబి యే !

చీర్స్
జిలేబి
 

Friday, August 21, 2015

శ్రీ వారి "సెల్ఫీ" సేవ !

శ్రీ వారి "సెల్ఫీ" సేవ !
 
శ్రీ మన్మధ నామ సవంత్సరే
దక్షిణాయనే వర్ష ఋతౌ
శ్రావణ మాసే శుక్ల పక్షే

....


విచ్చేసిన వారందరికీ శుభోదయం. ఈ కళ్యాణ సేవ తదుపరి స్వామీ వారితో సెల్ఫీ సేవ ప్రారంభ మగుతుంది .

మీ మీ మోబైళ్ళ తో  పద్మావతీ మంగ తాయారు సమేత  స్వామీ వారితో సెల్ఫీ దిగాలనుకున్న వాళ్ళందరూ తలో వెయ్యిన్నూట పదహార్లు కౌంటర్లో చెల్లించి రశీదు పుచ్చుకోవాల్సిందని మనవి .

ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా అంటూ భక్త జనవాహిని కౌంటరు మీద పడింది .

కౌంటరు కలెక్షను మొదలయ్యింది :)


ఆ హా ఒకా నొక కాలం లో మీ మోబైళ్ళు కి నో ఎంట్రీ . ఆ పై స్విచ్ ఆఫ్ మోడ్ ; ఆ పై సైలెంట్ మోడ్ ;

The current trend is "selfie" mode :) Mod "I" ndia :)


స్వామీ వారు , అమ్మ వారలు కూడా మరింత సింగారించు కునేరు. సెల్ఫీ లో మనం బాగా కనబడాలి కదా మరి :

స్వామీ వారి తో సెల్ఫీ దిగండి . మీ జీవితాన్ని  శుభకరం గా మలచు కోండి .

మీకు మొబైలు లేదా ? no problem.

పక్కనే సామ్సంగ్ వారు 'స్వామి సంఘ్' అనే సరికొత్త మేడ్ ఇన్ ఇండియా 'ఇండీ' మొబైల్ షాప్ కూడా తరిచేరు . అందులో కొనుక్కోవచ్చు . స్టేటు బ్యాంకు వారి  పన్నెండు నెలల ఇంట్రెస్ట్ ఫ్రీ ఇంస్టాల్ మెంట్ ఆఫర్ కూడా ఉంది .

అట్లాగే ఐఫోన్ వారి 'ఐపద్మిని' అనే సరి కొత్త ఇండీ మొబైల్ కూడా ఉందండోయ్ .

ఆఫర్ ఆఫర్ ఆఫర్ !

బై ఒన్ గెట్ ఒన్ ఫ్రీ మేడ్ ఇన్ ఇండియా మోబైళ్ళు కూడా ఉంది

ఆలశించిన ఆశా భంగం. భలే మంచి చౌక బేరం

రారండోయ్ రారండోయ్
పిల్లా జెల్లా రారండోయ్ !


శుభోదయం
చీర్స్
జిలేబి
(Mod "I" ndia )

Monday, August 17, 2015

జ్యోతి లక్ష్మి చీర కట్టింది జిలేబి సినిమా ప్రవచనం

జ్యోతి, లక్ష్మి, 'చీర కట్టింది' జిలేబి- సినిమా ప్రవచనం
 
అకాల చరాచర అండ పిండ బ్రహ్మాండములో ఉండు అమ్మ ఎవరు ?
ఆవిడ ఏ రూపం లో ఉంది ?
అదియే పరతత్వ మైన జ్యోతి రూపం లో మనకు కానవచ్చును .
 
శివ పురాణం లో లక్ష్మీం 'చీర' రాజ  తన్హాయీ ' అని చెప్ప బడి ఉంది .
 
అట్లా  జ్యోతి, లక్ష్మి ,చీర కట్టింది ఎవరిని ?
 
అండ పిండ బ్రహ్మాండ లోకంలో ఉన్న
ద్విపద చతుష్పద జీవరాసులన్నీ 
ఆ  చీర ఒడుపులో నించి ఊడి పడి,
ఆ మాత 'క్షీర' ఉడుపుల్లో పెరిగిన 
ఆ మాత ఇచ్చిన  వరాల బిడ్డలే  కదా !
 
జిలేబి అనగా ఎవరు ?
 
బ్లాగ్మాత
 
పంచ దశ లోక పరమాణువు .
 
సినిమా అనగా నేమి ?
 
ఆది శంకరుల వారి - దృక్ దృశ్య వివేకావివేక  'చూడ ' , (ర) మణీ, మనీ !
 
ప్రవచనం అనగా నేమి ?
 
ప్రస్తుత వచనం . ప్రసంగ వచనం 
అది అప్రస్తుత మైతే, అప్రసంగం అయితే 
 తపాళ్ టైటిళ్ళు తిట్లు గా పరిడ విల్లును .
 
ఇంతటి తో జ్యోతి, లక్ష్మి, 'చీర కట్టింది జిలేబి' సినిమా ప్రవచనం పరి సమాప్తం .
 
ఈ ప్రవచనాన్ని చదివిన వారికి , చదివి వినిపించిన వారికీ
ఆ కొండ పైనున్న మా పెరుమాళ్ళు
రెండు రెట్లు 'వడ్డెనలు'
వాయించునని తెలియ జేసుకుంటో
 
"ఐ యామ్ వేద" !
 
జిలేబి
 
 

Friday, August 14, 2015

కన్నీటి కలువ

కన్నీటి కలువ 
 
ఒక కలువ
విరుచు కోవాలని 
ఆకాశం వైపు చూసింది 
 
చినుకుల కన్నీళ్లు 
కలువ ని తాకితే 
 
కన్నీటి కలువ 
కాలువ లా పెల్లుబుకింది 
 
 
జిలేబి 


 

Monday, August 10, 2015

బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి - దక్షిణామూర్తి స్తోత్ర ప్రసంగం

బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి - దక్షిణామూర్తి స్తోత్ర ప్రసంగం
 
వారి ప్రసంగ వేగం రైలు స్పీడు ...
సో కొంత స్పీడు తగ్గించి వినాలను కుంటే
Audacity సాఫ్ట్వేర్ ద్వారా తగ్గించి వినవచ్చు .
(Its clarity is better at 90% Change Speed)
 
 
 
 
 
cheers
zilebi

Thursday, August 6, 2015

స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి స్వామీజీ మహారాజ్ కీ జయ్ హో !

 
స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి  స్వామీజీ మహారాజ్ కీ జయ్ హో!!!

స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి  స్వామీజీ మహారాజ్ కీ జయ్ హో బ్లాగు వేణీ వేణులు గొంతెత్తి ఓహో ఆహా అని స్వామీ వారిని కొనియాడు తూంటే స్వామీజీ వారు తమ బవిరి గడ్డం తడుము కుంటూ తమ భక్త బ్లాగు జనవాహిని ఆసాంతం గమనించి , తలయాడించి తమ సంతోషాన్ని వెలుబరచి చిరు నగవు చిందించేరు .

బ్లాగు భక్త జనవాహిని 'ఆనంద' డోలికలో తూగు లాడేరు .

భక్తులారా ! స్వామీ వారు గొంతు సవరించు కునేరు .

వెంటనే జనవాహిని స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి  స్వామీజీ వారికి జయ్ అంటూ మరో మారు గళం ఎత్తింది .

స్వామీ వారు చేయి ఊపేరు - జనవాహిని నిశ్శబ్దం గా స్వామీ వారి వైపు ఆతురత తో చూసింది .

బ్లాగ్ భక్తులారా ! మీకు ఇవ్వాళ నేను జ్ఞాన బోధ చేయడానికి ఉపక్రమిస్తున్నా . చెప్పేరు స్వామీ వారు .

"భగవంతుడు భక్త జన మందారుడు అంటారు కదా ! అసలు ఆ భగమంతుడు కి భక్తుడి కి అసలు సంబంధం కలిగించే వారు ఎవరు " స్వామీ వారు ప్రశ్నించి నిదానించేరు .

వెంట నే బ్లాగు భక్తుల గుసగుసలు, రుస రుసలు మొదలయ్యేయి . టప టపా  చేతులు తట్టేయి . స్వామీ వారు ముదావహం గా తలూపేరు .

బ్లాగ్ 'భక్తులూ' కానివ్వండి ఇక మీ కామింటులు ! స్వామీ వారు చేయి పై కెత్తి గాలి లో ఊపేరు .

భక్తులు తమ తమ లేపుటాపు లను తెరచి తాపము తో కామింట డటం మొదలెట్టేరు .....

అవి ఎట్లన .....


చీర్స్
జిలేబి

 

Friday, July 31, 2015

కాలమ్ కలాం కాలం - జిలేబీయం

కాలమ్ కలాం కాలం - జిలేబీయం
 
నివాళి
 
ఒక అబ్దుల్ అజరామరుడయ్యేడు
ఒక యాకుబ్ తన కర్మఫలం పొందేడు
 
భరత భూమి
పుణ్య భూమి
కర్మ భూమి
 
నమామి సతతం కాలం !
 
సరి జోదు లేరెవ్వరు నీకు !
దేవాంశ నైనా, ఆసురాంశ  నైనా
క్షణం లో క్షరం చేసి
జిలేబి మాయ జేస్తావు !
 
నివాళి .
 
జిలేబి

Tuesday, July 28, 2015

ఆకసాన చందురూడు !

 
ఆకసాన చందురూడు 
 
తలెత్తి చూస్తే 


ఆకాశాన చందురూడు !


అబ్బ ! ఏమి చమ్కీలు !
తారలు గుస గుస లతో 
మొహనమీ ప్రకృతి !
 
పూర్ణ చందురూడు 
ముస్తాబవు తున్నాడు !
 
తారల తట పటాయింపు !
మరీ ఈ చందురుడు !
అబ్బ సిగ్గేస్తోంది సుమీ !
 
 
చీర్స్ 
జిలేబి 

Wednesday, July 15, 2015

చెట్టు క్రింద రాయడు !

చెట్టు క్రింద రాయడు !
 
 
రాయడు చుట్ట వెలిగించేడు
చప్పున చెట్టు ముడుచు కుంది
 
రాయడు తలెత్తి చూసేడు
టప్పున టెంకాయ తల మీద పడింది
 
రాయడు హమ్మా అన్నాడు నొప్పితో
గప్పున చల్ల గాలికి చెట్టు గాలి నిచ్చింది
 
రాయడు హమ్మయ్య అంటూ సేద దీరాడు
మెప్పున చెట్టు గుస గుస లాడింది
 
 
శుభోదయం
చీర్స్
జిలేబి