Monday, October 30, 2017

సమస్యా పూరణ -అసభ్యత - అశ్లీలము



సమస్యా పూరణ -అసభ్యత - అశ్లీలము


నిన్న 'నే కవిని గాను' అంటూ మా నరసన్న వారు శంకరాభరణం లో ఓ సమస్య ని చూసి (తండ్రితో రతికేళినిఁ దనయ కోరె) 'చదవడానికే జుగుప్సగా ఉంది నా మటుకు'. అన్నారు.

అంటే అన్నారు పొండి.

వివరాల లోకి వెళితే , కొన్ని సంవత్సరాల మునుపు, (అప్పట్లో 'కంద' జిలేబి లేదు :)) 'సీతమ్మ మా యమ్మ' శ్రీరాముడు మా తండ్రి' అంటూ త్యాగయ్య కీర్తనలతో మురిసి పోతున్న రోజులలో - సమస్యా పూరణ అంటూ సీతమ్మ వారి శీలం మీద 'తప్పుగా' కనిపించేలాంటి ఓ సమస్య చదివి కుతకుత ఉడికి పోయి ఏమోయ్ కవీశ్వ రా మీకు సభ్యత లేదా ? సీతమ్మ వారి మీద ఇంత అవాకులూ చెవాకులా ? అనేసా మండి పోయి !

అప్పడు కంది వారు వివరంగా చెప్పేరు - సమస్యా పూరణ అంటే ఇట్లా ఉంటుంది అంటూ ...


"పృచ్ఛకుడు అడిగిన ' సమస్య ' యొక్క భావం చాలా అసంగతంగా, అసంబద్ధంగా, అసందర్భంగా, ఒక్కొక్కసారి అశ్లీలంగా కూడా వుంటుంది. కవి తన ప్రతిభతో దానిని సభ్యతాయుతంగా, అసంభవాన్ని సంభవంగా నిరూపిస్తూ పూరించాలి" .

ఈ విషయం మీద ఆలోచించి వరుసగా కొన్ని దినాలు సమస్య లను గమనించడం మొదలెట్టా ! మాలిక అగ్రిగేటర్ లో మొదటి వాక్యం మాత్రం 'చదవ' గానే ఔరా ఏమిటీ 'పర్యయము' అనుకుంటూ 'వీళ్ళ నోట్ల బండ బడ అనుకున్నా !

ఆతరువాత పూరణ లని చూసేక ఔరా అని దాంతో తలే ఉంగలీ దబాయా ! పూరణ ల లో ఆ అశ్లీలత గాని, అసంబద్ధత గాని కనిపించక హుష్ కాకీ అయిపొయింది :)

ఓహో ! సమస్య ని చదవ కూడదు . సమస్య ని సమస్య గానే చూడాలి. దాన్ని విడ గొట్టాలి అన్నది అర్థ మయ్యింది.

ఆ తరువాత నించి (ఛందస్సు లేకుండా ) మనకిష్ట మొచ్చిన శైలిలో రాయటం మొదలెట్టా ఆ సమస్య లని సమస్యలు గానే చూసి ; ఎవరో ఓ పెద్దాయన అబ్బుర పడి తల గోక్కొని, నేనెన్నో ఛందస్సు లను చూసేను గాని ఈ జిలేబీ వారి ఛందస్సు ఏమిటి ? ఏ ఛందస్సు లో పూర్తి చేసే రని ప్రశ్నించేస్తే ,  దానికి కీర్తిశేషులు పండిత శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారు శ్రీ జిలేబి గారిది జిలేబి ఛందస్సని 'విట్టేసారు' :)

ఆహ్ జిలేబి ఛందస్సు అనుకున్నా :)

ఆ తరువాత ఛందస్సు సాఫ్టువేరు కనిపించి ఔరా ఇట్లా కూడా ఓ పరికరం ఉందా అనుకుంటూ 'పిచ్చి పిచ్చి గా' పదాలను గుచ్చేసు కుంటూ , అర్థం ఉందో లేదో, చదివే వాళ్లకు అర్థం అవుతుందో లేదో మనకేమిటి ? అనుకుంటూ,( 'గొంగళి లో తింటూ వెంట్రుక లేరు కోరు అని శ్యామలీయం వారు మొత్తు కునే దాక :)) యడాగమాలు, సంధులు,  సమోసా' లు మనకు జాన్తా నై, ఖాతర్ నై అనేసు కుంటూ , పంచ దశ లోకపు జనాలు జుట్టు పీక్కునేటట్టు 'జిలేబీ' ఫ్యాక్టరీ  పద్యాలు మొదలెట్టే సా :),

వెంకట రాజారావు గారు ఊ అంటే మనం సయ్యంటూ పద్యాలు లాగేసు కుంటూ, కొత్త పదాలకు, జాతీయాలకు, సామెతలకు,  కార్ఖానా అయిన కష్టే ఫలే వారి బ్లాగు ని ఫాలో అయిపోతూ, పాటల తో అలరిస్తున్న పాట తో నేను లో సినీ పదాల ని గమనిస్తూ వాటిలో ని ఛందసు గమనిస్తూ ...

ఇదెంత దాకా పోయింది అంటే, తనకంటూ ఓ స్టాండర్డ్ ఉన్న 'ఈమాట' లో జిలేబి 'సమోసా' గా , జిలేబి చందస్సు ఎ.తె. ఛందస్సు గా మారి కథా రూపమై , బ్లాగ్ లోకం పై ఓ సెటైర్ గా మారి పోయేంత గా అన్న మాట :)

నిజం చెప్పాలంటే ,సమస్యా పూరణ ఇచ్చిన వాళ్ళు మొదట్లో నే దానికి సరియైన సమాధానం పెట్టు కునే ఇస్తారు, కవి ఇది కుదరదు పూర్తిచేయడానికి అంటే, అబ్బే ఇట్లా చెయ్యోచ్చండి అని చూపించ టానికి (ఎక్సెప్షన్ - నాకు తెలిసినది -  మా లలిత గారు, గిరీశానికి మధుర వాణి ని అమ్మాయి గా చేసేసి, చంపక మాల లో నరాల వారికి సమస్య నిచ్చి , వారు ' అమ్మాయ్ - దీనికి పూరణ నీ దగ్గర ఉందా అంటే , బిక్కమోగం పెట్టేసేరట :)

కాబట్టి ప్రతి సమస్య కు  ఓ లానే గాకుండా, ఎన్నో విధాలు గా జవాబు లుంటాయి. (దీని ద్వారా నేర్చు కోవలసినది ఇది అన్నది గరికి పాటి వారి ఉవాచ )

టు కట్ షార్ట్  (ఈ వాక్యం ఎవరదో చెప్పుకోండి చూద్దాం బ్లాగ్ లోకం లో :)) ,

నేర్చు కున్న దేమి టంటే సమాజం లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. (సమస్య ని చదివితే చెడు లా అనిపిస్తుంది) . చెడుని పక్కకు తోసి మేధస్సు కు పదును పెడితే మంచి ని దాన్నించి లాగొచ్చు . అట్లాగే సమస్య ని చదవ కుండా, సమస్య గానే స్వీకరించి, మేధో మధనం చేస్తే, బ్రెయిన్ వేవ్స్ స్ట్రాంగ్ గా మారి ఈ 'బామ్మ' కాలం లో శరీరపు చురుకు దనం తో పాటు, మేధస్సు కూడా చురుకు గా ఉండే రీతి గా మనల్ని మనం మార్చేసు కోవచ్చు అన్నది కనుక్కున 'రహస్యం' (జిలేబీ రహస్యం :)) - మన పుస్తకాలన్నీ రహస్యం అనే పేరు పెట్టు కునే లా అన్న మాట :) - మన బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి జ్యోతిష్య రహస్యం, ఆ రహస్యం, ఈ రహస్యం లా అన్న మాట :))

కొసమెరుపు - ఇంతా రాసింది ఎందుకంటే, విన్నకోట వారు కూడా పద్యాల్ని రాయటం మొదలెట్టా రంటే కొన్నాళ్ళ కే సమస్య లని చదవటం మానేస్తారని :)

రెండో కొస మెరుపు - అక్కడ ఫణి అనే వారు, "ఈశ్వర నిందకు కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ గురునిందకు లేదు అని శాస్త్రము. గురువుగా ఒకరిని భావించిన తరువాత వారి తప్పొప్పులను ఎంచు అధికారము శిష్యులకు లేదు. ఈనాటి కవి మిత్రులందరికీ గురునిందాదోష పరిహారము కావలెనని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను."

ఇట్లాంటి మూఢ నమ్మకాలు పెట్టేసు కున్నందు వల్లే దేశం లో గుండు గురువులు ఎక్కువై పోతున్నా రనుకుంటా !

గురువైనా , శిష్యుడై నా, మనమందరము ఒక పరిధి లోని వారమే .

కాబట్టి ఇట్లాంటి గుడ్డి నమ్మకాలు వేష్ట్ !

విద్యాధికులే ఇట్లాంటి నమ్మకాలు పెట్టేసు కుంటే, ఇక  మిగిలిన వారి గురించి చెప్పాల్సిన అవసరం అసలు లేదు.

తప్పక మ్యూచ్యువల్ రెస్పెక్ట్ ఉండాలి. అంతే కాని అది మూఢ నమ్మకం గా మారి పోకూడదు.


చీర్స్
జిలేబి
హమ్మయ్య ! చాన్నాళ్ళకి మేటరు దొరికె
'రాసు' కోవటానికి :)

Saturday, October 21, 2017

మృచ్ఛకటికం – రూపక పరిచయం- బ్లాగాడిస్తా రవి గారి అద్భుతః !



మృచ్ఛకటికం – రూపక పరిచయం- బ్లాగాడిస్తా రవి గారి అద్భుతః !
 


ఉపోద్ఘాతం - నిన్న శంకరాభరణం సమస్యా పూరణం లో శకారుని మాటలంటూ శ్రీ కంది శంకరయ్య గారు
"రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుఁడే" అన్న పూరణ చేయడంతో ఎడ్డం టే తెడ్డు లా గున్న ఈ పూరణ చూసి , ఏమీ అర్థం గాక దీని అర్థం ఎట్లా చేసు కోవాలో చెప్పండంటే గుర్రం సీతా దేవి గారు, ఆ ముందు పలుకులు (శకారుని మాటలు ) గమనించండి అన్నారు.

సరే అర్థం కాకపోతే ఆంధ్రభారతే శరణ్య మానుకుని శకారుడు అని వెతికితే ఆంధ్ర భారతీ వారు జాన్తా నై అనేసారు.
మళ్ళీ అర్థం కాలే అంటే, మధ్యలో జీపీయెస్ వారు ఈ క్రింది లంకె నిచ్చారు  శకారుడు అంటే ఏమిటో అర్థం చేసు కోవడానికి. !   ఓహో "శకారు" కూడా మరో జిలేబి యే యని దాంతో తలే ఉంగలీ దబాయా !


మృచ్ఛకటికం – రూపక పరిచయం- బ్లాగాడిస్తా రవి గారి అద్భుతః !


బ్లాగాడిస్తా రవి గారు విరివిగా పంచ దశ లోకం లో టపాలు రాసేవారు ! ఈ మధ్య మానుకున్న బ్లాగుధీర మంతుల లో మరొక్కరు వీరు కూడా :) జేకే !

http://blaagadistaa.blogspot.com/  వీరి ప్రైవేటు బ్లాగై పోనాది :)

సరే వారి పూర్తి నిడివి వ్యాసం పొద్దు లో పై లింకు లో చదవ వచ్చు !

ఈ టపా ఎందుకంటే - ఈ టపా చూస్తే వారు మళ్ళీ బ్లాగు తెర తీస్తారని ఆశ తో :) - విన్నపాలు వినవలె వింత వింతలు !

వారి వ్యాసం నించి కొన్ని -

సంస్కృత భాష సౌందర్యం గద్గద నదీప్రవాహ ఝర్జరిత గాంభీర్య ప్రాధాన్యమయితే, ప్రాకృత భాష సొగసు మలయమారుత స్పర్శిత కిసలయోద్భూతమైన సౌకుమార్యం.

మృచ్ఛకటికం - మృత్ + శకటికం, మృచ్ఛకటికం అయింది. శకటం అనకుండా శకటికం అన్నారు కాబట్టి, (మృత్) శకటానికి సంబంధించిన లేదా “చిఱు శకటం” అని వ్యుత్పత్తి చెప్పుకోవాలి.

శకారుడి గురించి-

విధవిధాలుగా అపభ్రంశపు ఉపమానాలు చేస్తుంటాడు. ఉదాహరణకు –

◾రావణుడికి కుంతిలాగా నువ్వు నా పాలబడ్డావు.
◾రాముడికి భయపడ్డ ద్రౌపదిలా భయపడకు.
◾విశ్వావసువు సోదరి సుభద్రను హనుమంతుడు అపహరించిన రీతిలో నేను నిన్ను అపహరిస్తాను.
◾అడవికుక్క లాంటి నేను పరిగెడుతుంటే, ఆడునక్కలా నువ్వు పారిపోతున్నావు.

మృచ్ఛకటికం కథ టూకీ గా (రవి గారి మాటల్లో )

పాలకుడనే రాజు ఉజ్జయినీ నగరం రాజధానిగా అవంతీ రాజ్యాన్నిపరిపాలిస్తుంటాడు. ఆ రాజొక దుష్టుడు. శకారుడు – రాజు గారి బావమరిది. శకారుడు మూర్ఖుడు, అవకాశవాది, కౄరుడు. నగరంలో చారుదత్తుడనే బ్రాహ్మణశ్రేష్టుడు నివసిస్తుంటాడు. ఇతడు దానధర్మాలు చేసి దరిద్రుడయిన వాడు, సుందరుడు, సచ్ఛీలుడు. ఇతడికి ధూతాంబ అనే భార్య, లోహసేనుడనే పుత్రుడూ ఉంటారు. వసంతసేన ఆ నగరంలోని గణిక ప్రముఖురాలు. ఈమె చారుదత్తుడిపైన మనసు పడుతుంది. వసంతసేనను రాజశ్యాలుడు – శకారుడు మోహించి వెంటబడతాడు. ఓ ఘట్టంలో అతణ్ణుండి తప్పించుకుందుకు వసంతసేన చారుదత్తుడి ఇంట్లో జొరబడుతుంది. తననో దుష్టుడు నగలకై వేధిస్తున్నాడని, ఆ నగలను దాచమని చారుదత్తుడి కిస్తుంది. చారుదత్తుడు ఆ నగల బాధ్యతను తన సహచరుడు మైత్రేయుడికి అప్పజెపుతాడు.

ఈ రూపకం యొక్క కథాసంవిధానం గురించి పండితులు ఎన్నో రకాల ఆసక్తికరమైన వివరాలు చెప్పారు. ఎన్ని రకాలుగా చెప్పబడినా, తిరిగి ఇంకొక విధంగా, మరో కోణంలో ఆవిష్కృతమయే విలక్షణ కథాసంవిధానం ఈ రూపకం సొంతం.

శర్విలకుడనే చోరుడు ఓ రోజు రాత్రి చారుదత్తుడి ఇంటికి కన్నం వేసి, ఆ నగలను అపహరిస్తాడు. ఈ శర్విలకుడికొక ప్రేయసి ఉంటుంది. ఆమె ఎవరో కాదు. వసంతసేన పరిచారిక అయిన మదనిక. ఆమెను దాస్యవిముక్తి చేయడం కోసమే శర్విలకుడు చౌర్యానికి పాల్పడ్డాడు. అపహరించిన నగలను తీసుకుని శర్విలకుడు వసంతసేన ఇంటికి వెళ్ళి, మదనికను కలిసి, జరిగింది చెబుతాడు. మదనిక భయపడి, ఆ నగలు తన యజమానురాలివేనని, ఆమే స్వయంగా వాటిని చారుదత్తుని వద్ద దాచిందనీ చెప్పి, చౌర్యారోపణ పాలుబడకుండా “చారుదత్తుడే తనను పంపినట్టుగా వసంతసేనతో చెప్పి, నగలను ఒప్పజెప్ప”మని శర్విలకుడికి ఉపాయం చెబుతుంది. చాటునుంచి వసంతసేన ఈ సంభాషణ వింటుంది. శర్విలకుడు మదనిక చెప్పమన్నట్టుగా తనను, చారుదత్తుడు నగలను అందజేయడం కోసం పంపాడని, నగలు తీసుకొమ్మని వసంతసేనకు అందజేస్తాడు. వసంతసేన అతని సద్బుద్ధికి మెచ్చి, మదనికను శర్విలకుడితో సాగనంపుతుంది. శర్విలకుడు మదనికను తీసుకుని ఇంటికి వెళ్ళే సమయంలో, తన స్నేహితుడు ఆర్యకుడు రాజు పాలకుడిచేత బందీ అయినట్టు తెలుసుకుంటాడు. మదనికను ఇంటికి పంపి, ఆర్యకుడిని కారాగారం నుండి విడిపించడం కోసం పథకం రచిస్తూ బయలుదేరతాడు.

సంవాహకుడనేవాడు చారుదత్తుడి వద్ద పరిచారకుడిగా ఉండి, చారుదత్తుడి ఐశ్వర్యం క్షీణించిన తరువాత పొట్టకూటికై తపిస్తూ, జూదవ్యసనపరుడయి పరిభ్రమిస్తుంటాడు. ఇతడు ఓ జూదంలో పది సువర్ణాలను ప్రత్యర్థికి బాకీపడి, అవి చెల్లించలేక, పారిపోతూంటాడు. పారిపోతున్న తనను జూదంలో నెగ్గిన ద్యూతకుడనే మరొక జూదరి పట్టుకుని చితకబాదుతాడు. దెబ్బలకు తాళలేక పారిపోతూ, సంవాహకుడు ఓ ఇంటిలో జొరబడతాడు. ఆ ఇల్లు వసంతసేనది. ఆమె వివరాలన్నీ తెలుసుకుని, ధనం ఇచ్చి సంవాహకుణ్ణి విడిపిస్తుంది. ఆ సంవాహకుడు విరక్తి చెంది, బౌద్ధ శ్రమణకుడవుతాడు.

వసంతసేన నగలు పోయిన తర్వాత, ఆ నగలు తనే దొంగిలించాడని ప్రజలు చెప్పుకునే అవకాశం ఉందని, తన దారిద్ర్యానికి తోడు అపవాదూ వచ్చి పడబోతున్నదనీ చారుదత్తుడు క్రుంగిపోతాడు. భర్త పరిస్థితి గమనించి ధూత, ఆ నగలకు పరిహారంగా వసంతసేనకు తన రత్నాల హారాన్ని ఇచ్చి బదులు తీర్చేసుకొమ్మని చెబుతుంది. ఆ రత్నాల హారాన్ని తన సహచరుడి చేతికి ఇచ్చి అతని ద్వారా వసంతసేనకు అప్పజెబుతాడు చారుదత్తుడు.
తన నగలు తనకు ఇదివరకే ముట్టాయని, జరిగిన విషయాలన్నిటినీ విశదీకరించే ఉద్దేశ్యంతో, వసంతసేన శర్విలకుడి ద్వారా తన వద్దకు చేరిన నగలను, చారుదత్తుడు పంపిన రత్నాల హారాన్నీ తీసుకుని చారుదత్తుడి ఇంటికి ఓ సాయంత్రం పూట వెళ్తుంది. ఆ రాత్రి ఆమె చారుదత్తుడి ఇంట విశ్రమిస్తుంది. మరుసటి రోజు ఉదయం చారుదత్తుడి ఇంటిలో బాలుడు రోహసేనుడు ఓ మట్టిబండితో ఆడుతూ, తనకు సువర్ణశకటం కావాలని మారాం చేస్తూ ఉంటాడు. వసంతసేన ఆ బాలుణ్ణి ఊరడించి, ఈ నగలతో నువ్వూ సువర్ణ శకటాన్ని కొనుక్కోవచ్చని, నగలను ఆ మట్టిబండిలో పెట్టి పిల్లవాడిని సముదాయిస్తుంది.

ఆ తర్వాత –

శకారుడి బండిని చారుదత్తుడు తనకోసం పంపిన బండిగా పొరబాటు పడి వసంతసేన పుష్పకరండకమనే ఉద్యానవనానికి బయలుదేరుతుంది. నిజంగా చారుదత్తుడు పంపిన బండిలో కారాగారం నుండి తప్పించుకున్న ఆర్యకుడు ఎక్కుతాడు. అక్కడ ఉద్యానవనంలో శకారుడు వసంతసేనను తన బండిలో చూసి ఆశ్చర్యానందాలకు లోనవుతాడు. ఆమె తన చేతికి చిక్కిందనుకుంటాడు. తనను వరించమని వసంతసేనను హింసిస్తాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో, ఆమె గొంతు నులుముతాడు. వసంతసేన స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఆమె చనిపోయిందని తలచి శకారుడు – ఆమెను హత్య చేసినది చారుదత్తుడని న్యాయాధిపతుల వద్ద అభియోగం మోపుతాడు. చారుదత్తుడి వద్ద, వసంతసేన తాలూకు నగలు దొరకడంతో న్యాయనిర్ణేతలు అతనికి కొరత శిక్ష విధిస్తారు. కొరత శిక్షను అమలు జరిపడంలో భాగంగా, అతడిని పుష్పమాలాలంకృతుణ్ణి చేసి, వధ్యశాలకు తీసుకొని వెళుతుంటారు.

ఇక్కడ ఉద్యానవనంలో స్పృహ తప్పిన వసంతసేనను ఓ బౌద్ధ శ్రమణకుడు (ఇదివరకటి సంవాహకుడే) రక్షించి, ఉపచర్యలు చేసి బయటకు తీసుకువస్తాడు. చారుదత్తుడికి కొరత విధించబడే సమయానికి వసంతసేన అక్కడ చేరి, న్యాయాధికారులకు విషయం వివరించి అతడిని విడిపిస్తుంది. శకారుడికి జనం బుద్ధి చెపుతారు. ఈ లోగా ధూతాంబ అగ్నిప్రవేశం చేయబోతుంటే, చారుదత్తుడు వచ్చి, ఆపుతాడు. నేపథ్యంలో ఆర్యకుడు పాలకుడిని చంపి రాజవుతాడు. చారుదత్తుడిని, మరో నగరానికి రాజును చేస్తాడు ఆర్యకుడు. వసంతసేనను చారుదత్తుడు రెండవ భార్యగా ధూత అనుమతితో స్వీకరిస్తాడు.


ఆనందో బ్రహ్మ !

సావేజిత
జిలేబి


 

Friday, October 20, 2017

బండెనక బండి కట్టీ :)




 
 
బండెనక బండి కట్టీ
గుండెల నిండుగ జిలేబి ఘుమఘుమ లాడన్
చెండుల విసురుచు చకచక
వండుము పదముల మధురిమ వనితా రమణీ !
 
చీర్స్
జిలేబి
 

 

Monday, October 16, 2017

దీపావళి శుభాకాంక్షలు !

 
 
బ్లాగు జనులందరికి,
 
 
దీపావళి శుభాకాంక్షలతో
 
 
 
 
జిలేబి

Friday, October 13, 2017

రౌడీ రాజ్యపు మాలికుండు భళిరా రయ్యంచు వచ్చెన్ గదా!



రౌడీ రాజ్యపు మాలికుండు భళిరా రయ్యంచు వచ్చెన్ గదా!


మా లక్కు పేట రౌడీ
చాలా నాళ్ళ తరువాయి‌ ఝంపాకంబై
కోలాహలముగ వచ్చెను
బేల! పటాలంబఖిలము వెంటదగులునో :


రౌడీ రాజ్యంబదిగో
కేడీ లకు బుద్ధి జెప్ప కీశము గన్ బ్లా
గ్వాడకు జిలేబి వచ్చెన్,
బోడీ ! యాహ్వానము తెలుపుమ వెనువెంటన్ :


రౌడీ రాజ్యపు మాలికుండు భళిరా రయ్యంచు వచ్చెన్ గదా!
బోడీ! బ్లాగుల కున్ జిలేబులగుచున్ బొంకప్ప లెల్లన్నికన్
గాడీరూటుల మార్చివచ్చు హరిమల్ గాన్పట్టు చుండెన్ గదా !
మేడాటంబులకున్నికన్ భళిభళీ మేగాపు లున్వత్తురే !



పంచదశ లోక మేగాపులకు 
వెల్కమ్ కిచ కిచ !

చీర్స్
జిలేబి  

Wednesday, October 11, 2017

భాషాయోషకు మరియొక పవళమ్మిదియే !




భాషాయోషకు మరియొక పవళమ్మిదియే !




భేషౌ ! లలితా జిలేబి పెంపెక్కెన్బో :)
పేషానీ యై వెలిగిరి 
భాషాయోషకు మరియొక పవళమ్ము వలెన్ !


చీర్స్
టు లలితా
జిలేబి
 

Tuesday, October 10, 2017

రండి ముతక సామెతలు, జాతీయాలు లోకోక్తులు నేర్చుకుందాం :) - 1


రండి ముతక సామెతలు, జాతీయాలు లోకోక్తులు  నేర్చుకుందాం :)


బ్లాగ్ వీక్షకులారా !
మీ మనసు దిటవు పరచు కొనుడు.

ముతక సామెతలు, జాతీయాలు, లోకోక్తులు, జనబాహుళ్యము లో ని వి. వాటి ని మీరు నిరసిం చుకున్నా , చీ యని ఛీ కొట్టినా వాటికి వచ్చే నష్టము లేదు.


సామాన్య జన పలుకుల్ని రత్తాలు రాంబాబు ద్వారా రావి శాస్త్రి పలికించాడు విపరీతం గా. ఎంత గా అంటే అవి నిఘంటువు ల లో కెక్కేటంత గా.

ఆ కాలం లో రత్తాలు రాంబాబు చదవని వారంటే వెర్రి వెధవాయిలే.

కావాలంటే మా పనిలేని డాటేరు బాబు గారిని అడగండి. వారు రావి  శాస్త్రీ యాన్ని వడ గట్టి, ఎండ గట్టి గట్టి కాఫీ కింద తాగిన వారు. (ఈ మధ్య ఫేసు బుక్కు కే వారంకితం అయిపోయేరు - జైలు ఖానా లో ఖైది అయిపోయారన్న మాట ) :)

సరే విషయానికి వస్తే వేమన తాత ఏమన్నా తక్కువా ? ముతక పదాల్ని ఆట వెలది లో చందం లో ఇమడ్చ డానికి ?
(బ్రహ్మయ్య లను ఎండ గట్టేడు కాబట్టి తాత ఐపోయేడు. లేకుంటే ఐలయ్య లా పలికి ఉంటె తన మీద జనాలు ఎగ బడి ఉండే వారేమో ? ఊహ మాత్రం అంతే - లేకుంటే

పిండములను జేసి పితరుల దలపోసి కాకులకు బెట్టు గాడ్డెలార ! పియ్య తినెడు కాకి పితరు డెట్లాయెరా అని దమ్ము గా అని వుండే వాడా ?

సరే నేటి ముతక సామెత - ఇది కొట్టు కొచ్చినది . ఎక్కడి నుంచి ? కనుక్కోండి చూద్దాం.

అంటూ సంటూ లేని కోడలు దాని మేనమామ కొడుకు చిక్కుడు చెట్టు క్రిందికి పోయి పక్కలు ఎగుర వేసి నారట !


ఇవ్వాల్టి కథా కమామీషు
పరి సమాప్తము

ఇట్లు

జిలేబి


 

Monday, October 9, 2017

ఆంధ్రా కాఫీ ఉల్లాస ప్రదమైనది :)



ఆంధ్రా కాఫీ ఉల్లాస ప్రదమైనది :)


 కర్టసీ - ఆంధ్ర పత్రిక - ౧౯౬౫ స్వర్ణోత్సవ సంచిక


కాఫీ తో
శుభోదయం :)
చీర్స్
జిలేబి

Tuesday, October 3, 2017

ముతక సామెతలు !



ముతక సామెతలు !
 
ధారావాహిక గా అతి త్వరలో
ముతక సామెతలు,
వాటి కథా కమామీషు వచ్చును.
 
ఈ బ్లాగును మీరు బుక్ మార్క్ చేసి బెట్టు కొనుడు.
 
బస్తీ మే సవాలే సవాలు .
 
ఇట్లు
నారదీయ
శిష్య పరమాణువు
 
జిలేబి

Saturday, September 30, 2017

అత్త మామల చంపు స్త్రీ లక్షణములు :)


అత్త మామల చంపు స్త్రీ లక్షణములు :)
 

ఈ మధ్య శ్రీ వై వీ యారు గారి ఓ టపా లో కామెంటు పెడుతూ నాభి అన్న పదానికి వేరే పదం కొంత జిలేబీయం గా ఏదన్నా ఉందా అని చూస్తే ఉదరావర్తము అని కనిపించి వాడేసా !


అదురహో ! అమరావతి!
అదురహో వనవాటికా రాజధాని

 అదురహో ద్రాక్షతోటల రంగుచీరల ఉదరావర్తము!

 అదురహో బాగ్ బలి 🙂
 అదురహో వైవీయార్ 🙂


ఈ వైవీ యారు గారు మరో మెట్టు ఎక్కి ఆంధ్ర భారతి లో  ఉదరావర్తము అన్న పదానికి మొదటి వ్యాఖ్యానం చూసి అబ్బుర పడి OMG అని నోరు వెళ్ళ బెట్టేసారు :)

ఆంధ్ర భారతి ఉవాచ :

ఉదరావర్తము : ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953   

•అత్తమామలను జంపెడి లక్షణములు గల కన్యకయొక్క గుఱుతు. మామను చంపుదాని కుండునట్టి గుఱుతు : చూ, లక్షణము.1-౧

వైవీయారు ఉవాచ :

/ఉదరావర్తము// జిలేబిగారూ, ఇప్పుడే నానార్ధాలు చూశాను. మొదటిది ఇక్కడ అప్లై అవదు కానీ, అదేంటి అంత షాకింగ్ & సంచలనాత్మకంగా వుంది? అత్తామామలని చంపేవాళ్ళు ఆ గుర్తులు వేసుకుని మరీ పుడతారా? OMG!!!

వారి OMG చూసి అదిరి పడి ఏమయినా కొంపలు మునిగి పోయే లా పరిస్థితి వచ్చేసిందే మో అనుకున్నా :)

ఈ మధ్య బ్లాగులో తాళింపుల తాలి బన్లు ఎక్కువయ్యారని విన్నకోట వారంటేనూ , మనకి కూడా తాళి బన్నుల తాకీదు వచ్చేస్తుందే మో అనుకున్నా :)

ఆ తరువాయి హమ్మయ్య అని ఊరట పడి పోయా :)


అత్తా మామల చంపే స్త్రీ ల సాముద్రికా లక్షణాల మీద ఇంత మక్కువ ఉందా :) అని కొంత గూగిలించి తే
బృహత్ సాముద్రికా లక్షణ శాస్త్రం పుస్తకం కనబడింది. ఎందుకో యిందులో ఉండొచ్చేమో అనుకుని నాభి లక్షణా లలో చూస్తే ఏమీ సీరియస్ గా కనిపించ లేదు.

అర్థం కాలే ఎందుకు ఉదరావర్తానికి మామ గార్ని చంపడానికి నాభి కి లింకు పెట్టేరో అని.

ఆ తరువాత ఎందుకో కొంత సందేహం వేసి ఇదేమన్నా ఉదర లక్షణ మా అని మరో మారు ఆ పుస్తకాన్ని తిరగేస్తే ఉదర లక్షణాల లో ఒకటి గా ఇది కనబడింది :)


ఆంధ్ర వాచస్పత్యము, ఆంధ్ర భారతి వారి ఓపిక కి మెచ్చు కోవాలి అవన్నీ పట్టి తమ లిస్టు లో పెట్టేసు కోవడానికి :)

బృహత్ సాముద్రికా లక్ష్మణ శాస్త్రం ప్రకారం  ఉదర లక్షణా లలో ఒకటి ఇట్లాటిది; కానీ దానికి ఆంధ్ర భారతి వారెలా ఉదరావర్తానికి లింకు పెట్టారో తెలియదు ; (వారికి ఉదర + ఆవర్తము - అన్న అర్థం లో తోచి ఉండ వచ్చను కుంటా :) ఆవర్తము - శరీరమందలి సుడి )

బృహత్ సాముద్రికా లక్షణం - ఉదర లక్షణం


"ప్రలంబజఠరా హంతి శ్వశురం చాపి దేవరం" !


(మావయ్య + బావమరిది పాపం వీడూ డమాలే :)

For those to read the full bruhat samudrika shastra refer to the book (ఎంజాయ్ మాడి :)
https://archive.org/details/bruhatsamudrikas035840mbp

( మన దేశవాళి కన్నీ బృహత్ ఉండాలి :) - ఆ తరువాయి లఘు అని ఎవరైనా వ్రాయాలి - ఆ తరువాత దానికి భాష్యాలు వ్రాయాలి ; ఆ తరువాయి టీకా "టాట్" పర్యాయాలు వ్రాయాలి అప్పుడే విశదీకరణ అవుతుంది ; ఆ పై ఏ అమెరికా వాడో ఐరోపా వాడో దాన్ని ఆంగ్లం లోనో ఐరోపా భాషల్లో నో తర్జుమా చేసేసుకుని, పేటంటు రైటు కొట్టేసు కుని మరో కొత్త తెక్నీకు కన్బట్టేస్తాడు :)

బై ది వే, ఈ పదాన్ని అంటే ఉదరావర్తము అన్న పదాన్ని గూగిలిస్తే నేనే ఆది భాగ్యురాలిని అంతర్జాలం లో ఈ పదానికి :)  మీరూ ఈ పదాన్ని తెలుగులో గూగులించి అంతర్జాలానికి జిలేబి సాయమ్మునకు చీర్సు చెప్పుదురు గాక :)

ఈ పదానికి కందం అర్పించు కోవడానికి అర్హత ఉన్నవాడు మా సినీ దర్శకుడు ప్రస్తుతానికి మా జిల్లా వెంకన్న కి ఎస్వీ బీ సీ ద్వారా తన సేవల నందిస్తున్న సినీ రాఘవేంద్రుడు మాత్రమే :) కాబట్టి వారికో కంద కితాబు :)


ఉదరావర్తము పైన ద
గదగయని జిలేబు లాడగన్ చిత్రమ్ముల్
కుదిరిన చోటన్నామ్లెటు,
రదచ్చదము, రాఘవేంద్ర రావుని కైపుల్ :)



ఇంతటి తో బోటి జిలేబీయము
సమాప్తము.

ఈ జిలేబి ముద్రికా సౌష్టవము చదివిన వారికి మా పద్మావతీ దేవేరి సమేత వెంకన్న సకల ఐశ్వర్యముల నిచ్చు గాక :)


విజయదశమి శుభాకాంక్షలతో
జిలేబి

Friday, September 29, 2017

మా జొళ్లెము మాదిగాన మధురమ్ముగనన్ !





మా జొళ్లెము మాదిగాన మధురమ్ముగనన్ ! 
 
మా జన్మ హక్కు వ్యాఖ్యల్
రాజేయుట! ఓ జిలేబి రగడల్ గిగడల్
సాజము మాకౌ ! విడువము
మా జొళ్లెము మాదిగాన మధురమ్ముగనన్ !
 
 
 
జిలేబి 

Monday, September 25, 2017

ఓ మై గాడ్! మియ కల్పా !




ఓ మై గాడ్! మియ కల్పా !




ఓ మై గాడ్! మియ కల్పా !

"ఫ్రీ" మీ సెల్ఫ్ ! ఆహ్! జిలేబి పిస్త్రిక్స్ ! పిస్త్రిక్స్ !

మామా మియా యుతిలె దు

ల్సీ! మెలి యోరా! వయోల !సెంపర్ ఫోర్టిస్ :)


జిలేబి

Thursday, September 21, 2017

రసనిష్యందిని -ఇమం శ్రీ రామభద్రం అస్మపుత్ర ఇతి త్వం - అహం వేద్మి



రసనిష్యందిని - Rasanishyandhini-रसनिष्यन्दिनी - 100 verses-Grandeur of Lord Rama 
 

రసనిష్యందిని - Rasanishyandhini-रसनिष्यन्दिनि - 100 verses-Grandeur of Lord Rama , takes one through many of the greatest qualities of Lord Rama as seen by the visionary Sage Viswamitra.

Enjoy Reading.

The Scene - Dasaratha is reluctant to send young Rama and Vishwamitra answers all the inhibitions of Dasaratha in a very assured way while extolling the virtues of Lord Rama through the key words
"AHAM VEDHMI"

Original Sanskrit by Paruthiyur KrishnaSastri ( 1855-1911)
English translation with original Sanskrit verses included .


ఇమం శ్రీ రామభద్రం అస్మపుత్ర ఇతి త్వం !
అయం జగత్పిత్యేహం వేద్మి !


లింక్

https://archive.org/details/rasaniShyandinii


శుభోదయం
జిలేబి

Wednesday, September 13, 2017

కడవన్నెల నాణ్యము గద కాదంబరిదౌ !



 
కడవన్నెల నాణ్యము గద కాదంబరిదౌ !
 
 
వరమై వచ్చె జిలేబీ !
సరి యేనోయీ  జవాబు చక్కగ గనుమా
సరిబోవున్ప్రాస ర డ ల !
కడవన్నెల నాణ్యము గద కాదంబరిదౌ !
 
 
చీర్స్
జిలేబి  

Tuesday, September 12, 2017

జయ జయ హో నిఫ్టీ ! మార్కెట్ ఊంఛా హమారా :)




జయ జయ హో నిఫ్టీ ! మార్కెట్ ఊంఛా హమారా :)
 
దీనార టంకాల తీర్థ మాడినారు ముంబై స్టాకు సోదరులు
 
నిఫ్టీ ఇండెక్స్ పదివేల వరహాల కు పై బడి ముగిసిన
 
శుభతరుణము !

రారండోయ్ రారండి ! మోహన మోడీ రాగం

పాడేద్దాం :)

శుభాకాంక్షల తో


 
NSE-Snapshot-courtesy NSEINDIA.COM
 
 
చీర్స్
జిలేబి

Thursday, September 7, 2017

Map of India With Older Names!


Map of India With Older Names





 
 
 
చీర్స్
జిలేబి

Wednesday, September 6, 2017

ఒక అద్భుతమైన ఆలోచన !


 
ఒక అద్భుతమైన ఆలోచన !
 
ఒక
అద్భుతమైన
ఆలోచన
వచన కవిత లో
వయ్యారాలు పోతా వుంటే ,
ఛందం లో చచ్చి సగమై
బిక్క మొగమేసి
నిలబడుతోంది !
 
 
శుభోదయం
జిలేబి

Monday, September 4, 2017

బుచికో యమ్మ బుచికీ :)



బుచికో యమ్మ బుచికీ !
 
వచన కవితలకూ
కాలం చెల్లిందా !
అబ్బ! తెలుగదేల యన్న !
 
ఏది రాసినా
ఈ అనాని ముచ్చు లకు
నచ్చక బోయెనే
 
బుచికో యమ్మ బుచికీ !
 
తెలుగు బ్లాగ్ లోకమా వర్ధిల్లు (తావా?) :)
 
 
బుచికోయమ్మ బుచికియా !
మచర్చిక కవిత లనానిమసు వెగచుటయా !
వచనమ్ములకును సుదతీ
కిచకిచ యను నరులు వచ్చి కీసర యనిరే !
 
చీర్స్
శుభోదయం
జిలేబి

Friday, September 1, 2017

జిలేబి వారి జాంగ్రీ :)


జిలేబి వారి జాంగ్రీ :)
(కాపీ పేష్టస్య కాపీ పేష్టుహు)
చాలా కాలం గా అదేమి ఈ పేరు జిలేబి . వీరికి జిలేబి అంటే అంత ఇష్టమా జిలేబి అని పేరెట్టు కున్నారు అని అనుకున్న వారూ ఉన్నారు !

సరే , జిలేబి వారు జాంగ్రీ వేస్తే ఎట్లా ఉంటుందో మరి !?

జాంగ్రీ కి జిలేబీ కి వ్యత్యాసం ఉందంటారా ? రెండూ స్వీట్లే !  . ఎక్కువైతే వెగటే . జిలేబి + జాంగ్రీ ఒక్కరే వేస్తే , అదే బాణలి లో వేసారను కొండి అప్పుడు ఇది జిలేబి యా జాంగ్రీ యా అన్న సందేహం కూడా రాక పోదు మరి .

జాంగ్రీ కొంత మంద పాటి . జిలేబి సన్నపాటి . ఇదీ ఒక వ్యత్యాసమేనా ? నాలుగైదు జిలేబి లను కలిపేస్తే ఇక జాంగ్రీ అయిపోదూ ? ఆ పాటి దానికి స్పెషల్ గా జాంగ్రీ వేయాలా అన్న మాటా రాక మానదు !

పూర్వ జమానాలో రాయచోటి లో పని జేసే టప్పుడు ఓ సాయిబు వేసే జాంగ్రీ అంటే పడి చచ్చి కొని తినే వాళ్ళం . ఈ జాంగ్రీ ని ఆ సాయెబు కోవా జాంగ్రీ అని అమ్మే వాడు . అప్పటికే అతను అరవై సంవత్సరాల పై బడి ఉన్న వాడు . ఇప్పుడు వారి సంతతి ఏమైనా ఆ కోవా జాంగ్రీ ని వేస్తున్నారేమో మరి .

ఇంతకీ ఇట్లా తాడూ బొంగరం లేకుండా టపా పెడితే అది జాంగ్రీ అవుతుందా ? లేక జిలేబి అవుతుందా ?

ఇక జిలేబి వారి జాంగ్రీ ఏమిటి అంటారా ?

అసలు జాంగ్రీ వేద్దామా జిలేబి వేద్దామా అన్న సందేహం లో కొట్టు మిట్టాడి మా అయ్యరు గారి ని అడిగా ఏమండీ అయ్యరు గారు ఇట్లా జాంగ్రీ జిలేబి అంటారు గా ? ఇవన్నీ మన భారద్దేశ పిండి వంట లేనా ? లేక 'ఫారెను' వంట లా అని ?

వారికి తోచింది వారు చెప్పేరు - ముసల్మాను లు భారద్దేశం పై దండ యాత్రల కు వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ వారితో బాటు వచ్చిన వంటకాలు అయి ఉండ వచ్చు - కాల గతి లో భారద్దేశ పిండి వంటల లో కలిసి పోయి ఉండ వచ్చు అని .

ఉదాహరణ కి ఈ ముంత మామిడి పప్పు ఉంది చూసేరు - ఇది పోర్చుగీసు వారితో వచ్చింది - ఇప్పటి కాలం లో ఈ జీడి పప్పు వేయని పాకం ఏదైనా మన దేశం లో మరి ఉందా ?

ఇది కాదా మరి భారద్దేశ గొప్ప దనం ? ఆంగ్లం లో అంటారు చూడండి - మెల్టింగ్ పాట్ అని అట్లా దేశం లో కి వచ్చిన ప్రతిది దేశం లో ఇమిడి పోయి మరో సరి కొత్త రూపాన్ని సంతరించు కోవడమే కదా ఈ భరత భూమి గొప్ప దనం !

ఇస్లాము దేశ వాళీ సనాతన ధర్మం తో కలగలిసి సూఫీ - దేశవాళీ సూఫీ అవడం, ఈ రెండిటి మధ్యా ఉన్న మంచి విషయాలను గ్రహించి శిక్కు మతం ఉద్భవించ డం ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు జాంగ్రీ లు ఎన్నైనా వేయ వచ్చు !

మరో ఉదాహరణ - దేశవాళీ తనదై చేసేసు కున్న మొబైలు !

బయలు కెళ్ళినా మొబైలు పట్టు కునే వెళ్ళే వాళ్ళం అయ్యేంత దాకా వచ్చేసా మంటే ఇది మరో మెల్టింగ్ మెగా దేశం కాదూ మరి !



ఈనాటి e-జాంగ్రీ తో
చీర్స్ సహిత
జిలేబి
నేటి నారదుల వారి పని :)  (మన టపా మాలిక లో టాప్ గా ఎట్లా కనబడటం ?)
నేటి నారదీయం - బెడిసి కొట్టిన ఎక్స్పెరిమెంటు :)
మొత్తానికే మోసమొచ్చె :) మాలిక జయహో జిందాబాద్ !

Tuesday, August 29, 2017

కోయంబేడు మార్కెట్లో కూనలమ్మ :)


కోయంబేడు మార్కెట్లో కూనలమ్మ :)
 

ఏమండీ అయ్యరు వారు ఇవ్వాళ కోయంబేడు మార్కెట్ కెళ్దామా? అడిగింది జిలేబి.

అయ్యరు గారు ఓసారి ఎగాదిగా జిలేబి ని చూసారు.

మడిసార పట్టు చీర లో ధగధగ భుగభుగ లాడి పోతూ కనిపించింది జిలేబి.

ఏవిటి ? ఈ లాగే ? మడిసార లోనే ?

ఓసారి తన వైపు చూసుకుంది జిలేబి.  ఏం ఇట్లా వెళ్తే ఏమంటా ?

ఏమీ లేదు లే గొణిగారు అయ్యరు గారు.
 
అయినా జిలేబి, కోయంబేడు మార్కెట్టు కు కాస్ట్యూమ్ కూనలమ్మ మడి సార మామి వేషం బాగోదేమో ? మళ్ళీ సందేహం అయ్యరు గారికి.

వెళ్దాం పదండి - బస్సులో అంది జిలేబి 

ఏంటీ మద్రాసు బస్సులో నా ! గుండె గుభిల్లు మంది అయ్యరు గారికి ఇదేమి ప్రారబ్ధ కర్మ రా బాబోయ్ అనుకుంటూ .

అవునండీ బస్సులో నే !
హతోస్మి !
కోయంబేడు మార్కెట్ లో కూనలమ్మ  దిగబడింది.

చుట్టూతా చూసింది.

జన వాహిని ; జన వాహిని.

కు కు కూ అంది.

వెంటనే ఓ తుంటరి పిల గాడు - విజిల్ వేసి - పాప్పాత్తి అమ్మ వందిరుక్కా డా అన్నాడు .

గుర్రు గా చూసింది కూనలమ్మ !
కత్తిరిక్కా ఎవళో ?

వాడో ధర చెప్పాడు.

అమ్మి మరో ధర చెప్పింది.

మధ్య లో అయ్యరు గారు వద్దే జిలేబి ఎక్కువ బేర మాడ బాక! అన్నాడు భయ పడుతూ.

అయ్యరు గారు అనుకున్నట్టే అయింది.

ఇదో - పొమ్నాట్టీ - వాంగినా వాంగు - ఇల్లేనా .....


వాడి  పై జిలేబి గయ్యమని మళ్ళీ ఎగురుదామను కునే లోపల్నే అయ్యరు గారు డేమేజ్ కంట్రోల్ కోసం జిలేబి కో ణిసిధాత్వర్థం సమర్పించే సు కోవడం తో 

మార్కెట్ ఉలిక్కి పడింది.

పాప్పాత్తి యమ్మా ఎంగయో పోయిడిచ్చు డా అంటూ మూర్చ పోయాడా అబ్బాయి


కోయంబేడు మార్కేట్టా మజాకా :)




చీర్స్
జిలేబి