నమస్కారం 'సుబాల సుబ్రహ్మణ్యం' గారు,
చాలా రోజులుగా మీ టపాలు పంచ దశ లోకం లో కనిపించడం లేదు. అసలు కామెంట్లలో కూడా కూసింత నవ్వుకుందా మంటే అసలు కనబడడం లేదు మరి !
పునర్దర్శనం తో మళ్ళీ దసరా కో దీపావళీ కో మరో మారు టపా వేయ వలెను.
అయ్యా, ఏమిటి మాయమై పోయారు ? టపాలు అసలు రాయడం లేదు ?
అంతా కుశలమేనా ?
జిలేబి.
నా గొడవలో పట్టించుకోలేదు, ఎక్కడ చెప్మా?, నాకూ కనపడలేదండోయ్! తెలిసినవరు చెప్పరూ
ReplyDeleteనాకు మాత్రం తెలియదండి బాబు...
ReplyDeleteమీ అభిమానానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
ReplyDeleteఅంతా కుశలమే.
కనిపించక పోవడానికి కారణం... కొంచెం బద్ధకం కొంచెం చెప్పుడు మాటలు వినడం.
ఆ మధ్యన మా నయన తారడు (కళ్ళ వైద్యుడు) ఏదీ గుచ్చి గుచ్చి చూడకు అని సలహా ఇచ్చాడు. అమ్మాయిలనే కాదు అక్షరాలను కూడా అని టీకా తాత్పర్యం కూడా చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు వినాల్సిందే నని అర్ధ శరీరం అట్లకాడ నొక్కి మరీ వక్కాణించింది.
అదియునుం గాక నేను వ్రాస్తే నవ్వే వాళ్ళకన్నా, నవ్వుకునే వాళ్ళే ఎక్కువయారేమో నని కూడా ఒక అనుమానం.
అందుకని కొంతకాలం అప్రకటిత విరామం. సంక్రాంతి కి తిరిగి వచ్చేస్తాను...దహా.
ఉదయమే పూనా నుంచి శ్రీ ఫణి బాబు గారు,ఓ అర గంట క్రితం శ్రీ శర్మగారు (కష్టే ఫలి) ఈ టపా గురించి చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు.
ఉదయమే గుంటూరు వెళ్ళి ఒక గంట క్రితమే తిరిగి వచ్చాను. అందుకని ఆలస్యం అయింది.
మరోమారు ధన్యవాదాలు.
హమ్మయ్య వచ్చేసారుగా.....కాస్త తీరికచేసుకుని దసరా రోజైనా నవ్వించండి మరి:-)
Delete