పనిలేక ... కాలక్షేపం కబుర్లు ... డోంట్ 'బీలేజీ'
సుబ్బు హటాత్తు గా కాలక్షేపం కబుర్లు శర్మ గారిని రోడ్డు పై చూసి అచ్చెరు వొందేడు.!
పంతులు గారూ, మీరు ఇట్లా రోడ్డున పడ్డా రేమిటీ ?
పంతులు గారు టోపీ పెట్టి భుజానికో బ్యాకు ప్యాకు జమాయించి, మంచి సోగ్గుడ్డ , ఉత్తరీయం పంచకక్షం కట్టి కాళ్ళకి ఆడిదాస్ షూస్ తో దర్శనం ఇవ్వడం తో ఈ మాడరన్ మానీషుని గమనించి 'दांतों तले उंगली दबाया'!
'ಅದು ಏನಂತ ರೆ, ನನಗೆ, ಒಂದು ಹೊಸವಾಗಿ ಉದ್ಯೋಗ ಸಿಕ್ಕಿದ್ದು' చెప్పారు శర్మ గారు.
వామ్మో అదేమిటండీ మధ్యలో కన్నడం లో కి మారి పోయేరు ?
అదేమిటోయ్ సుబ్బూ, మన పక్క దేశమే కదా 'కర, నాటకం' ?
అంటే ?
చేతులు ఖాళీ గా ఉంచడ మెందు కానీ, ఓ కొత్త ఉద్యోగం లో చేరి పోయానోయ్, అదే, ఈ 'కర' నాటకం' !
శర్మ గారూ, ఈ వయసులో మీకిది తగునా ?
అదేమిటోయ్, ఆ జిలేబీ గారు ఈ వయసులో 'సబ్బాటికల్ నించి మారి మళ్ళీ ఉద్యోగం లో కి వెళ్ళ గా లేనిది, మరి మేము వెళ్ళ కూడ దంటావా ?
సుబ్బూ కి అసలు ఈ ఫండా అర్థం కాలేదు
సుడిగాలిలా మాయమై మళ్ళీ సుడిగాలిలా పనిలేక కాస్త తీరిగ్గా కూర్చుని ఉన్న డాటేరు రమణ గారి ముందు ప్రత్యక్ష మయ్యెడు.
రమణ మావా కాఫీ , తల తిరిగి పోతోంది.
ఇదిగో, సుబ్బూ, తల తిరిగి పోయేంత పని నీ కేముందోయ్ ?
మావా, ఈ మధ్య రీటైర్ అయిన వాళ్ళంతా బ్లాగ్ లోకాని కి వచ్చి టైం పాస్, టీం పాస్ చేసు కుంటున్నా రా ?
కాదా మరి ఎంత మంది అట్లా లేరు ? అబ్బా , నా కు రీటై ర్ మెంటు దొరికి తేనా , నేను హాయిగా దుప్పటి లాగించి నిదుర పోయే వాణ్ణి
ఈ రీటైర్ మెంటు వాళ్ళంతా ఒక్కరొక్కరుగా మళ్ళీ ఉద్యోగం లోకి వెళ్లి పోతున్నారు మావా !
ఆ మధ్య జిలేబీ అట్లా చెప్పింది . మళ్ళీ ఇప్పుడేవరోయ్ ?
అదే, మన పంతులు గారు లేదూ... కాలక్షేపం వారు వారు కూడా రోడ్డు న పడ్డారు ! మావా ఇదేమి చోద్యం ? హాయిగా రీటైర్ మెంటు వయసులో 'రెస్టు' తీసు కో కుండా ఇట్లా వీళ్ళంతా మళ్ళీ ఉద్యోగం లో కి వెళ్ళటం ?
అదే బెటరోయ్ , డాక్టరు ఉవాచ !
ఎందుకో మరి ?
పని లేక ఉంటే బుర్రలు ఖాళీ అయితే, దాని పీత బాధ లు ఎక్కువోయ్ !
అబ్బా, మావోయ్, పనిలేక పొతే, బుర్రలు ఖాళీ అయి ఉంటే, అన్ని విధాల ప్రాబ్లెమ్స్ ఒస్తాయంటావా ?
కాదా మరి ? An idle man's brain is a devil's workshop!'
సింగపూరు మాజీ ప్రధాని, లీ క్వాన్ యూ ఏమన్నాడో తెలుసా ?
చచ్చేంత దాకా అసలు పని చెయ్యడం మాన కండి . ఎంతో కొంత పని చెయ్యండి, మీరు వయసులో ఉన్నప్పుడు చేసినంత గా కష్ట పడ నక్కర లేదు. కానీ 'పార్ట్ టైం ' పని చెయ్యండి, చలాకీ గా ఉండండి' అన్నా డోయ్ ! అంతే గాక, మీరు చేసే పని వల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుం దని ఆయన ఉవాచ !
సో, కష్టే ఫలే ! డోంట్ బీలేజీ ! 'పని లేక' ఉండ కోయ్ సుబ్బూ.
చీర్స్
జిలేబి
అవునవును, పని లేకపోతే అదేదో గొరగాలి కూడాను.
ReplyDelete
ReplyDeleteఎవరక్కడ, వెయ్యండి, బులుసు వారికి ఓ రెండు వీర తాళ్ళు !
చీర్స్
జిలేబి.
ఎస్టు చెన్నాగి హెలిద్దారే...తుంభా చెన్నాగిదే..
ReplyDeleteపద్దు గారు,
ReplyDeleteధన్యవాద గళు!
జిలేబి.