Tuesday, December 18, 2012

పారి పోయిన పరువం

 
పారి పోయిన పరువం - ఇది ఒక సామాజిక స్పృహ కలిగిన కవిత


ముందో వెనుకో కాదు, నన్ను నడిమధ్య కాల్చి 
భారమైన ఇసుక పాతర వేసి నాకు నువ్వు చేసిన ద్రోహం 

నా కనుల కన్నీళ్ళ లో ఈదులాడే భావాలని 
మది తెలిపే వ్యధ గా నీకు వినిపిస్తున్నా దుష్మన్,  నీ కోరిక పై 

వణికే పెదవులు చలికి కొరికే సు కుంటూ 
చెప్పనా వద్దా అన్న సంశయం లో నేను 

చిట్లిన పెదవుల పై కారప్పొడి అద్దాలని నువ్వు 
నడుమ నగ్న చలి దూరి కట్టని కరిచేస్తూం టే 

 నువ్వే నా దుష్మన్ అయినా వన్న ఎద రొదలు 
చెప్పకనే చెప్పిన పోలీసు జులూం లై చెవిని కోయగా 

అది ఎరిగిన నువ్వు హత్యావేశం తో  పెను మంటై రగిలి 
ఎల్ల లెరుగని కోపానికి హద్దులు ఏమీ లేవంటే 

ఒక వైపు నిరాకరించే మనసుకు 'కాముణిజాం ' వచ్చి 

సుదూర మృత్యు తీరాలకు నే పారి పోవాలంటే 
ఆలోచిం చంటూ  తీరని వ్యధలు వెనక్కు లాగ

తెర వెనుక నగ్న బోమికనై నేను బోరు మంటూంటే 

నా నిస్సహాయతను నువ్వు నడి రోడ్డున నిర్వీర్యం గావిస్తే 
సంఘం బట్ట బయలైన పరువం గా గుసగుసలాడగా

బంధించే ఈ భాధ్యతలేలని తెంచుకుని పారి పోనా 
తెగించి  కాదని కట్టుబాట్లచెరసాలలో పుప్పోడై పోనా ?

ఛ ,రాస,
ఛీ లే, బి.

6 comments:

  1. అర్ధం కాలా :)

    ReplyDelete
  2. నాకర్ధమైంది. ఏమిటీ ఇలా ట్విస్ట్ ఇచ్చారు? ఓహో.. !!!!!!!!!

    ReplyDelete
  3. తెలిసింది. చట్టం కలిగినవారి చుట్టం కదా!

    ReplyDelete
  4. Naakoo ardam ayindi. nijame ippati ssmaajaaniki idi spruhe... emi cheppanu meru ilaa vaddinchinanduku

    ReplyDelete
  5. ఇది వడ్డించడం కాదేమో మేరాజ్ గారు, జిలేబి గారు విజ్ఞతతో తెలియచెప్పటం ఏమో! ఇలా కూడా రాయచ్చు అని. నాకైతే ఒక గురువు గారిలా కనపడుతున్నారు జిలేబి గారు. :)

    ReplyDelete
  6. జలతారు వెన్నెల గారు మీ వ్యాఖ్య బాగుంది.మేరాజ్ గారికి అర్ధమైన వడ్డించడం అంటే కూడా ఇదే అనిపిస్తుంది.

    వ్రాసేవాళ్ళకి ఉన్న భాధ్యతని,ఇల్లు దాటి బయటకి వెళితే ముంచుకొచ్చే ప్రమాదాలని,మృ గ్యమవుతున్న మానవ విలువలని జిలేబీ గారు గుర్తు చేసారు. శారీరక సృహే కాదు మానసిక సృహ కూడా పెంపొందాలి కదా!

    ఇందుకే మళ్ళీ వ్యాఖ్యానించడానికి వచ్చాను .

    ఎప్పటిలాగే అర్ధమవకుండా వ్రాస్తే ఎలా జిలేబీ ..జీ! మట్టి బుర్రలు అర్ధం చేసుకుని కాస్త సామాజిక సృహ పెంచుకోనివ్వండి.

    ReplyDelete