నందనోద్యోగభ్రాంతులు :)
అదిగో మానవుడు
బ్యాకు పేకును
భుజాల మీదేసుకుని
బయలుదేరాడు !
వాడే నందనోద్యోగభ్రాంతి !
రేతిరి పగలనక
జీవిత మంతా
కర్మవీరుడిలా !
హృషీకేశా !
కర్మసిద్దాంత మార్తాండా !
ఈ భ్రాంతి ని క్రాంతి గా
చేసి నీ పథము
చేరే దెట్లా ?
శుభోదయం !
జిలేబి
జిలేబిగారు, సృష్టి పుట్టినప్పట్నుంచీ బాక్-పాక్ వేసుకుని రేతిరి పగలనక తిరుగుతున్నా మార్తాండుడికే తీరలేదు"నందనోద్యోగభ్రాంతి", మానవుడికేం తీరుతుంది చెప్పండి? jk 😊
ReplyDeleteవైవీ యార్ గారు
ReplyDeleteలా జవాబ్ హై ఆప్కా అదురహో కామెంట్ !
రేతిరి పగలనక తిరుగు
ఆదిత్యునికే తెలియదు ! ఆఫ్ట్రాలు ,జిలే
బీ దబదబ పరుగుల బో
యే తెలి మెకమెట్లెరుంగు యేగడములబో :)
చీర్స్
జిలేబి
నందనోద్యోగభ్రాంతి
ReplyDeleteనందన+ఉద్యోగ+భ్రాంతి
నందనుని / నందన విషయంలో ఉద్యోగానికి సంబంధించిన భ్రాంతి -అంటే-
కొడుకు / కూతురు నకు ఉద్యోగం వస్తుందనే బ్రమలో
బతకడం గానీ , సదరు విషయాన్ని బ్రమగా భావించడం
గానీ అని మాబోటి సామాన్యులకు అర్థమౌతుంది .
' చేసే ఉద్యోగంలో ఆనందం లేకపోడం ' అనే అర్థం
నా మట్టి బుర్రకు ఏమాత్రం పొసగడం లేదు .
ఐనా , ఒజ్జలు అసామాన్యులు కదా !
ఎంత పొద్దుటే లేచినా చింతలగుంట దగ్గరే తెల్లారిందని నానుడి. మీరు చెప్పింది కరక్ట్, ఉల్ఫా గా తిరిగే కొడుకు ఉద్యోగం చేస్తున్నాడనుకునే భ్రాంతి పడటం, నందనోద్యోగభ్రాంతి
Delete
Deleteమృత్తిక సుఖంఘుణంబౌ !
యెత్తకు వచ్చిన పదముల యే రాలముగా
గుత్తుల కొలదిగ గుండ
మ్మత్తయు బేర్చన్ జిలేబి మయమాయెన్బో :)
జిలేబి
తివిరి ఇసుకన తైలంబు తీయవచ్చునేమో గానీ కొందరి పద్యాల్లోని అర్ధం పిండుకోవాలనుకోవడం దుస్సాహసం. అందుకే నేను ప్రయత్నించను 😀.
ReplyDelete
ReplyDeleteతివిరి యిసుకలోనన్ తై
లవర్ణమున్ గానవచ్చు లబ్జుగను ! జిలే
బి విధవిధ పద్యములలో
కవి, గనగలమే ఖరారుగా యర్థములన్ :)
జిలేబి