పాపం కవి రాట్ :)
గిట్టని వారటంచు గిరి గీసుకొనన్ మది రాక బిల్వ గా
చట్టని వెళ్ళినాను కవి సత్కృతి జన్మ దినమ్ము మీకనన్
తట్టక పోయెనయ్య యిది తంత్రము హేళన చేయ నన్ను! హా!
పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే!
జిలేబి
గిట్టని వారటంచు గిరి గీసుకొనన్ మది రాక బిల్వ గా
చట్టని వెళ్ళినాను కవి సత్కృతి జన్మ దినమ్ము మీకనన్
తట్టక పోయెనయ్య యిది తంత్రము హేళన చేయ నన్ను! హా!
పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే!
జిలేబి
ReplyDeleteపాపం కవి రాట్ :)
గిట్టని వారటంచు గిరి గీసుకొనన్ మది రాక బిల్వ గా
చట్టని వెళ్ళినాను కవి సత్కృతి జన్మ దినమ్ము మీకనన్
తట్టక పోయెనయ్య యిది తంత్రము హేళన చేయ నన్ను! హా!
పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే!
జిలేబి
గిట్టని వారంటూ ఎవ్వరూ లేరు...మన అనుకుంటే :)
ReplyDelete
Deleteగిట్టని వారంటూ లే!
పట్టమ్మా!పద్మనయన పల్కుల రాణీ
చట్టని వచ్చితివీవే
గట్టిగ చెప్పితివి గాద కరుణామాయీ :)
జిలేబి
"నోట్లో కరక్కాయ" అనే మాటకి సరైన ఉదాహరణ 👇😀. హైదరాబాద్ లోని కూకటపల్లి ప్రాంతంలో జరిగిన మోసం.
ReplyDelete(క్షమించాలి, ఇటువంటి సోకాల్డ్ "బాధితులు" అంటే నాకు సానుభూతీ బొత్తిగా ఉండదు. అందుకని నా నవ్వుల స్మైలీలు )
కరక్కాయ మోసం
Deleteవారెవ్వ!కరక్కాయా!
భారీ వ్యాపా ర "మాయ" బాగుందయ్యా!
ఘోరము గా మోసము సా
హోరే యని ఆడవాళ్లు హొంతయు గనిరే :)
జిలేబి
ReplyDeleteఆకము చూపు చెల్వుడట నగ్నిక ణంబుగ ధూముధామనున్
దాకొను రేయి రాగ సయి దగ్గిర చేరుచు చిన్న పిల్లవా
డై కయి మోడ్పులన్ గద! కడాణిని మీరగ సాధ్యమౌనకో?
చీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్!
జిలేబి
ReplyDeleteరమేశా! కమాలు చేసినావయా :)
సాకు కుటుంబమున్ తను బసాలుగ నింతియు దీపవృక్షమై
సాకెడు వాడు పాలుషికి స్వామియు దైవము చండరుక్కుడై
దాకొనగా నిశిన్ వెలుగు ధామము గానతడే రమేశుడై,
చీకటి లోన సూర్యు గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్!
జిలేబి
ReplyDeleteచేడియ భారతాంబ ముద్దుబిడ్డ
కూకటి వేళ్ళ దుర్నయము, క్రుంగెడు భారత భూమి దుస్థితిన్,
పాకుడు రాళ్ళ జీవితపు భారము వైదొల గింప నేతయై
కాకవెలుంగు మోడి భళి గాన్పడి దేశవి దేశముల్ నెగ
డ్తై కడకన్ గనెన్ నసదు డంబము లేదు! జిలేబి! యాతనిన్
చీకటి లోన సూర్యు గని, చేడియ, నవ్వె మనోహరమ్ముగన్!
జిలేబి
ReplyDeleteకావు మటంచు కాళ్ళ పడి కామితముల్ నెర వేర ప్రార్థనల్
బావు కొనంగ లేనపుడు బాంధవుడా నతడంచు పృచ్ఛలున్
కేవల మీ జిలేబి బతుకేలనకో యని యీసడించుచున్
దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా!
జిలేబి
ఆహా హిట్లర్ కు, అరబ్బులకూ యూదులంటే ఎందుకు పడదో నాకిప్పుడు బాగా అర్థమైందండోయ్ (వేరే ఒక బ్లాగ్ పోస్ట్ చదివిన పిమ్మట) ☺.
ReplyDelete
Deleteఆహా ఏమి విన్నాణము :)
జిలేబి
😌
Delete
ReplyDeleteగాలిబు గారికి నీవే
ఓ లవ్లీ యేకలవ్యు శ్రోతవు పోవే !
మూలాల నెదిరిచితి వీ
వే లావుగ కవితల నిలిపితివి జిలేబీ !
జిలేబి
ReplyDeleteఎందుల కిన్ని బాధల సహింతువు ఛందపు పద్యమే సదా
డెందము కోరె నంచు మరి ఢీకొనుటేలనకో జిలేబి నీ
వందము గాన పల్కులను వాకము లో తెలుపంగ రాదుటే?
కొందలమంద నేల సఖి కోమల మైనది మాట మంతియే
జిలేబి
ReplyDeleteసుబ్బారావు గారే మాకివ్వాళ మార్గ దర్శకులు :)
పోగయి నాము పొందికగ పూరణలన్ భళి జేయ శంకరా!
జోగుచు పొద్దు పూట మరి జోరుగ స్వాదము గాంచినారకో?
హేగురు!యేమి చెప్పితిరి! యెక్కడ సుమ్మి జిలేబి పోకడన్
సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ?
జిలేబి
ReplyDeleteరమేశా వారి భావనకు
దాగిన నుప్పు నోరగని త్రాగుట కై సరి జేసి సాంద్రమున్
బాగుగ జేసి రిజ్రయిలు భారత భూమికి వారు ప్రోదిగా
చేగలవారి కైపులన చేవయు గూర్చెద మంచు చేయగా
సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ!
జిలేబి
ReplyDeleteDisclaimer
ఈపూరణలో మీకు నారాయణ! కనిపించినా అనిపించినా జిలేబి పూచీ యే మీ లేదు - :)
సూర్యకుమారు డాతడయ ,సుందరి భర్త!నిదర్శనం బిదే!
వర్యపు గౌరవమ్మగును? పారవ బోవదు తప్పుగా సుమీ?
పర్యటనాస్థలిన్ నదము పారము లెల్లగనంగ భార్యపై?
భార్యనుఁ జూచినంతఁ ;బరభామినిపై; మనసాయె భర్తకున్!
జిలేబి
ఆహా, ఇంతవరకు సినిమావారు ముఖ్యమంత్రులవడం / అవుదామనుకోవడం చూశాం. ఇక ముందు క్రికెట్ ఆటగాళ్ళు కూడా బరిలోకి దిగే సూచనలున్నాయి. మన జ్ఞాతుల దేశంలో ఏకంగా ప్రధానమంత్రే అవబోతున్నాడుగా. దాన్నుండి స్ఫూర్తి పొందరా?
ReplyDeleteWell it has started అవధరించండి 👇.
Deletehttps://deccan chronicle.com/sports/cricket/280718/cricketers-can-be-great-leaders.html
Cricketers can be great leaders (article in Deccan Chronicle / Hyderabad Chronicle of 28-07-2018)
కానివ్వండి ... వాళ్ళల్లో ఏ నిగూఢ సామర్ధ్యాలున్నాయో?
నెపోలియన్ ను వాటర్లూ (Waterloo) యుద్ధంలో ఓడించిన ఆంగ్లేయుడు డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ (Duke of Wellington) గారు The battle of Waterloo was won on the playing-fields of Eton అన్నారని ప్రతీతి.
సరే, దాన్ని ఉదహరిస్తూ 19 శతాబ్దపు ప్రసిద్ధ ఆంగ్ల కవి మాధ్యూ ఆర్నాల్డ్ "Matthew Arnold, in an essay 'An Eton Boy’, published in the Fortnightly Review of June of that year, wrote:
The aged Barbarian [ie: a member of the English upper classes] will, upon this, mumble to us his story how the battle of Waterloo was won in the playing-fields of Eton. Alas! disasters have been prepared in those playing-fields as well as victories; disasters due to inadequate mental training - to want of application, knowledge, intelligence, lucidity." అని కూడా అన్నారటలెండి, అది వేరే సంగతి.
చూద్దాం రాబోవు కాలంలో ఏం పరిణామాలు వస్తాయో !
సవరణ :- సవరించిన లింక్ 👇
DeleteCricketers can be great leaders (article in Deccan Chronicle / Hyderabad Chronicle dt 28-07-2018)
Deleteక్రికెటర్లిక రాజులయెద
రు కొట్టెదరు సిక్సరులను రువ్వగ బంతుల్
చకచక ఒన్ డే మ్యాచులు
వికసింపన్ ట్వంటి ట్వంటి వీధుల లోనన్ :)
జిలేబి
మన దేశంలో క్రికెటర్లు దేవుళ్ళే అయ్యారు. ప్రధాని కావడంలో వింతేం ఉందీ ?
Delete
Deleteచప్పట్లు :)
జిలేబి
ReplyDeleteమాతకు కప్పుటైదువకు మాలిని గుబ్బలిపట్టియా జగ
న్మాతకు అగ్నివక్త్రునకు నాత్మభవుండు కపర్దికిన్ సఖీ
చేతనుడా త్రినేత్రునకు జీవనుడా మదనారి యంధకా
రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్!
జిలేబి
మహత్తరమైన కార్టూన్ ఒకటి వాట్సప్ లో వచ్చింది 👇.
ReplyDelete—————————-
“మరణం తరువాత కూడా ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ చూడాలనుకుంటున్నారా ..!! నేత్రదానం చేయండి !!
Eye Bank —>
—————————-
😀😀. At the same time ప్రస్తుత టెక్నాలజీ వెఱ్ఱి మీద సరైన విసురు కదా.
ReplyDeleteఆ.బ.కందము :)
వీతి తడుపుదాలుపుగా
వేతన భత్యముల పొంది వేడుక తోడై
కాతరి సయాట ధ్వాంతా
రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సు, రల్ :)
జిలేబి
ReplyDeleteఫాస్టింగ్ కిడ్స్ :)
ఫ్రైడు చికెన్లను తినుచున్
సైడు హరిమల చిరుతిండి సైదోడవగన్
గాడోన్లీ సేవ్ ఫాస్టింగ్
బోడికలను రామకృష్ణ పుణ్యము గానన్ :)
జిలేబి
ReplyDeleteపొంతన వుండదు ప్రశ్నల
దొంతరల జిలేబులెల్ల దొరలు వెసవెసన్
కొంతైన వినదు మాటల
కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్!
****
పంతము చేయుచు తా రా
ద్ధాంతములన్ చేయుచున్ సదనమున తానొ
క్కింతయు చూపదు గరువము
కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్
***
కొంతైన వినడు పల్కుల
శాంతమసలులేదు భార్య సైగల నర్థం
బెంతయు గానక దెప్పును
"కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్"
***
శాంతముతో పరికించుచు
సంతసముగ దిద్ద వలెను సారు పదములన్,
కాంతుడు సుమ్మీ, కాదయ
కాంతయె మూలమ్ము గాదు, కలహమ్ములకున్ :)
***
కొంత సమయమ్ము చిక్కిన
సంతసముగ మెడ్చెలనుచు చక్కగ బోవున్
ఇంతిని నన్జూడడు! యే
కాంతయె మూలమ్ము గాదు కలహమ్ములకున్?
(శంకరాభరణ బ్లాగ్కాంత ఉబోసు )
జిలేబి
ReplyDeleteవింత జిలేబి తీరులయ వెంబడి రాదు సయాట సల్పదే!
పంతము లాడుచుండును సభాస్థలి లో గరువమ్ము చూప దే
కాంతము లోన నెట్టు నరె! కద్దమి యర్మిలి చూపదే! రమా
కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్!
జిలేబి
ReplyDeleteమైలవరపు వారికి రిటార్టు :)
చెంత జిలేబులూర సయి చేరడు సేవల చేయడే సఖీ
వింతగ జూచు సేలకొన విన్నపముల్ తెలుపన్ మగండు,తా
సంతస మందు కైపదము చక్కగ పూరిచినంతయేను యే
కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్?
జిలేబి
ReplyDeleteతెమ్మర కమ్మతెమ్మరగ తీరము జేర్చెడు సేతకమ్ముగా
నిమ్మహి యూతకోల గను నీమముతో, ప్రణవమ్ము గా మదిన్
నెమ్మది జేర్చి తల్లి వలె నెవ్వలు దీర్చెడు సర్వ వేదసా
రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్
జిలేబి
ReplyDeleteశ్రీ గురు వాక్య మిద్ది విను శ్రేయము పేయము గూర్చు మాలినీ
సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్,
వాగులు వంకలన్ని యును పారుచు పారుచు చేరు రీతిగా
బాగరి! సర్వ దేవతల ప్రాంజలి యీశుని చేరు సర్వదా!
జిలేబి
ReplyDeleteరమేశా వారి భావనకు :)
జేగురు రంగు కల్మషము చేర్వ హరిత్తు గృహంపు వీకముల్
సాగర మబ్ది తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్
వాగఱతన్ క్రమించి మన భాగ్యవిధాత భువిన్ గ్రసించగా
రేగడి మన్ను గాపృథవి రివ్వున మార్పును గాంచు చుండె పో !
జిలేబి
లంచం ఇవ్వడం నేరంటండీ, జైలు శిక్ష పడుతుందిట ... అక్కడకి, లంచం ఇవ్వడానికి ఎవరి బలవంతమేమీ లేనట్లు. దీనిమీద నిన్నటి (02-08-2018) డెక్కన్ క్రానికల్ (Hyd) పేపర్లో మొదటిపేజ్ లో వచ్చిన Counter Point అనే కార్టూన్ చూడండి .. ఈ క్రింది లింక్ లో.
ReplyDeleteలంచం ఇస్తే జైలుశిక్ష
Deleteలంచం పుచ్చుకుంటే నేరం కాదని వారి ఉద్దేశ్యం అయ్యుంటందంటారా విన్నకోట వారు ?
జిలేబి
ఏమో మరి “జిలేబి” గారూ, ట్యూబ్ లైట్ వెలగడం లేదు 😉.
Delete
Deleteచోక్ ప్రాబ్లమేమో చెక్ చేసేరా ? :)
జిలేబి
స్టార్టర్ కూడా మార్చానండి, ప్చ్ 😑
Delete
Deleteఅప్పుడు లైటే డమాలయ్యుంటుందేమో ?
బల్బు మార్చి చూడండి :)
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteఓ అప్పుడు led ట్యూబుల్ కూడా డమాలా ?
జిలేబి
ReplyDeleteసిగ్గు లేనిదేను జిలేబి చెప్పి నారు
పండితులు సూవె నెలతుక! పట్టు పట్ట
రాదు పట్టి విడువరాదు రకరకములు
జీవితానుభవపు వెల్గు జీరలుగద !
జిలేబి
// "... బ్రాహ్మడు బకరా అయ్యే :" //
ReplyDeleteఆవుమీద వ్యాసం ... కథ తెలుసుగా ☺.
Deleteచర్వితచర్వణము :)
జిలేబి
ReplyDeleteసందర్భము - కంది వారు వెంకటాద్రి యెక్స్ప్రెస్ ప్రయాణములో ట్రైను డిలే కారణంగా చికాకు తో వున్నారు. ఇప్పుడే పాకాల స్టేషను దాటుచున్నారు. ఆ సందర్భములో చికాకు వల్ల పలువిధమైన విషయములు కలగాపులగమై ఒక అద్భుత సమస్య తట్టినది అదెట్లన
జాలము వీడి పోయెదను సత్పుర విఘ్నవినాయకున్ గనన్
గోల జిలేబి, శాస్త్రులును గూర్తుర దెట్లు సమస్య నేడు కై
పాలల కత్తిరింపగ సభాస్థలి లో గమనింతు నేను! పా
కాలను దాటినాను గనుడయ్య సమస్యయు తట్టె నిప్పుడే!
వాలినిఁ జంపె యుద్ధమునఁ బార్థుఁడు కంసుఁడు గాంచి మెచ్చఁగన్!
జిలేబి
ReplyDeleteకర్మఫలమ్ము కారణము కష్టము నష్టము లెల్ల గుంపుగా
నిర్మల మానసమ్ము నట నింకిరి జేయుచు తీక్షణంబవన్
ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టివానికిన్,
మర్మపు జీవితంబిదియె మాన్యులు పారులు బద్ధులేసుమా !
జిలేబి
ReplyDeleteఇవ్వాళ కంది వారు సెలవా ! వామ్మో యేమి ప్రాస యిది !
పఙ్క్తిని మర్కటమ్ములట పంతును బొందెను గాంచ నెవ్వరిన్?
పఙ్క్తికి పఙ్క్తి గానిలచి పౌషము లోన పలాశు లెల్లరిన్
పఙ్క్తిగ కొట్టి రావణుని పట్టుగ కొట్టిన వీరుడెవ్వడో ?
పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె; రాముఁడే!
జిలేబి
ReplyDeleteమ్రొక్కెను కవ్యవాహనుని మోహము తీరగ పంచ పాతులన్
మ్రొక్కిరి ద్రష్ట లెల్లరును మోదము తోడుగ స్వామి సేవకై
మ్రొక్కులు తీర కర్మ ఫల మొప్పగ దక్కగ జన్మ శేషమై,
ఒక్కఁడె భర్త ద్రౌపదికి, నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్!
జిలేబి
ReplyDeleteఆకాశ వాణి వచ్చే వారం సమస్య
రెక్కలు రాని పక్షి యెగిరెన్ విను వీధిని రివ్వు రివ్వనన్
లెక్కలు పోలె ఛందమును లెస్సగ శంకరు కొల్వు లోన నెం
చక్కగ వ్రాసి పద్యముల సాధన జేయుచు కైపదమ్ములన్
మక్కువ తోడు గాంచి పలు మార్లటు పంపుచు రేడియోలకున్
రెక్కలు రాని పక్షి యెగిరెన్ విను వీధిని రివ్వు రివ్వనన్ !
జిలేబి
ReplyDeleteమోహము తీర మానవుడు మోదముతో సులభమ్ము గా విభున్
సోహము సోహమంచు భళి శోభల కొల్వగ సిద్ధులన్ గనన్
సాహస మున్గొనున్,నపుడె సాధ్యము మోక్షము సూవె, యెట్లనన్
దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్!
జిలేబి
ReplyDeleteఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు చెప్పెద రమ్మ పో కలం
డిక్కడ యెక్క డైన నని డింగరు లెల్లరు కల్ల యో నిజం
బెక్కడ యుండె నో తెలియ వేలకు వేలన వత్స రమ్ములెం
చక్కగ దాటి పోయె సఖి సాధ్యము కాలె జిలేబి గాన్పడన్ !
జిలేబి
ReplyDeleteమూలకు బోకు ! శక్తి నిడు! ముద్దుగ నీకని తెచ్చి నాను మా
టేల ! జిలేబి యిద్ది ! హెరిటేజుది ! వేగమె రమ్ము గైకొనన్ !
బేలగ కన్ను లార్చి, నను విన్నదనమ్ముల జూచి, గిన్నెలో
పాలనుఁ జూచి, పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్ :)
జిలేబి
మా హెరిటేజ్ :)
ReplyDeleteస్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి? సెప్పుదున్,
స్వేచ్ఛ జిలేబి పోలిక !కుసీదిక జీవులుగా జనాళి, వావ్!
స్వేచ్ఛ భలే యటంచు నిల శీతకు లై తిరుగాడ రాదు సూ !
స్వేచ్ఛ ధురంధరత్వముగ సింహపు ఠీవిగ కై గొనంగ నా
స్వేచ్ఛ, ప్రతిష్ఠ జేర్చు సయి సేతువు గా కడతేర్చు దేశమున్ !
శుభాకాంక్షల తో
జిలేబి
ReplyDeleteఅమ్మి! జిలేబి యేలనొకొ యంతగ దారుణ వర్ష పాతముల్?
కిమ్మన కుండ ధాత్రియు వికీర్ణము లెల్లను తాళు కొంచు తా
నెమ్మిగ జూచె నెల్లపుడు! నేరము లగ్గల మైన వేళలో
నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే!
జిలేబి
ReplyDeleteకెసీఆర్ గారి ఉత్పలమాల
https://youtu.be/KnvHcMN8kgc
నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్త వృద్ధికిన్
దివ్వెలు కొన్ని నవ్వులిట తేలవు కొన్ని విషప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమ రసమున్ విరజిమ్ము విశుద్ధమైన లే
నవ్వులు సర్వ దుఃఖ దమనమ్ములు వ్యాధుల కున్మహౌషధీ !
క. చ.రా.
జిలేబి
Delete*వ్యాధుల కున్మహౌషధుల్
వాట్సప్ లో తిరుగుతున్న మన జీవితాల్లో తప్పించుకోలేని నిజం 👇🙁
ReplyDelete“కొడుకు బర్త్ సర్టిఫికెట్ కోసం నాన్న లంచం ఇస్తే ... తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం కొడుకు లంచం ఇస్తాడు”
ReplyDeleteపోతన కావ్యమందు రస పోషణ, సుంతయుఁ గానరా దయో
మీ తరహా పదమ్ముల సుమీ! విను మమ్మ జిలేబి పద్యముల్
కోతలు కావు నీదు పలుకుల్ మది తాకవలెన్ జనాళి హా
హా! తమకమ్ము చెందవలె హాసిక పొందవలెన్ సదా సఖీ !
జిలేబి
ReplyDeleteఖాతరు జేయ నేల ములుగర్రన ద్రోలెద వారి నెల్లరిన్ !
కీతపు మాట లాడు బుచికీలకు గౌరవ మీయ నేలన
బ్బా!తవణించుచున్, శ్రమము పాటిగ చేయగ, రేపు లేక మా
పో,తన కావ్యమందు రస పోషణ సుంతయుఁ గానరా దయో ?
జిలేబి
పోతన కావ్యమందు రస పోషణ సుంతయు గానరాద ? యో
Deleteతీతువు పిట్ట ! నీ బ్రెయిను తిన్నగ లేద ? యిదో సమస్య యా ?
పోతన తెల్గు తోటకడ పున్నెపు ప్రోవుగ నాటె భాగవత్
శ్రీ తరువున్ , రసా లొలుకి చిప్పిలు చున్నవి , త్రాగు దోసిటన్ .
Deleteలక్కాకుల వారు
మీ పూరణ ప్రశస్తము గావున్నది.
నీ గోర్దము తిన్నగ లేద అంటే బాగుంటుందేమో ?
నారాయణ
జిలేబి
కుదరదు ✊
Deleteరాజారావు గారు,
Deleteపిడక కావాలా ? పిడికిలి సరిపోతుందా ?
పిడికిలి అలవాటు . ఉపాధ్యాయుణ్ణి కదా !
Delete✊😅
Deleteవడి లక్కాకుల రాజును
గడగడ లాడింతు నేను కంద జిలేబిన్
లొడలొడ వాగిన వేసెద
పిడికిలి గుద్దుల ధనధన పిరియపు వేటున్ :)
జిలేబి
పిడి గుద్దులు కాదు హితా !
Deleteబడి రోజులు స్మృతికి రావ ? పంతులు చేతన్
నడినెత్తి మొట్టికాయల
జడి గుర్తుకు రాద ? కంద సామ్రాజ్య బుధా !
ReplyDeleteమల్లి! విచిత్ర మైన దిది! మారగు పుట్టుక కల్గదోయి! యే
పిల్లి జనింపఁగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ నొప్పు? నా
తల్లియె తల్లడిల్లు సుమి ! తండ్రివ లెన్ తన బిడ్డ లేడటం
చల్లల నాడు కాడ్పడుచు ! చంద్రకి భేలము కోరు నెప్పుడున్ !
జిలేబి
ఈలొల్లి ఎప్పుడాపుతావే తల్లో ! దిమాగు చెడగొడ్తావే ముసల్దానా
ReplyDelete
Deleteవురేయ్ బుచికీ యెవడ్రా నువ్వు
జిలేబి
మీ ఇంటికి పాడి సమృద్ధిగా ఉందా ఏమిటి నీహారిక గారూ? ఊఁ అంటే, ఆఁ అంటే పిడక అంటుంటారు 😠 ☺.
ReplyDelete
Deleteపాడి పరిశ్రమ దండిగ
మేడము గారింటకలద ? మేటరు వెసగా
పేడా పిడకల కడ తిరు
గాడుచు నాట్యంబులాడు కంద జిలేబీ :)
జిలేబి
నారాయణ
ఒకానొక గోదావరి జిల్లా బ్లాగర్ ఒకానొక పోస్టులో "పిడకిచ్చుకు కొడితే మొఖం పగిలిపోతుంది" అనేది వారి చెల్లెలు ఊతపదం అని వ్రాసారు. నాకు నచ్చినవాటిని నా సొంతం చేసుకుంటా కదా ? పోస్ట్ లింక్ మాత్రం అడక్కండి...గుర్తులేదు.
Delete
ReplyDeleteచేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు, కా
మేశుని మాట యిద్ది విను మేలును గాంచ జిలేబి యా సదా
యీశుని నామ మున్ మదిని నిండుగ కొల్చుచు నీదు కార్యమున్
చేసిన తప్పదెట్లగును చేసెడు వాడు సదాశివుండవన్!
జిలేబి
ReplyDeleteచిత్రము, అంబరాంబరుని స్వీకృతి యాద్యపు చెట్టపట్టు! వై
చిత్రి సుమా జగజ్జనని చింతయు జేయగ నాది భిక్షువున్,
మైత్రిని పొంద వచ్చె దరి , మైకొనెనాతడు, కొండరాయుడిన్
పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్!
జిలేబి
ReplyDeleteజాలము లోన పద్యముల చక్కగ చూచుచు నేర్పు గాంచుచున్
కోలకుతెచ్చి వాక్యముల కొంగున గట్టుకొనంగ రమ్యమై
పాలకి నెక్కు పద్యముగ, పంకజ నేత్ర ! జిలేబి పాకమై
తేలును, ముద్దులాడి, యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ!
జిలేబి
ReplyDeleteతుంగన దొక్కెదన్ కవుల తొంగొన నివ్వరు పద్య మాలలన్
చెంగున వ్రాసి ముంగటన చేర్చి భళారె యిదేను శంకరా
వింగడమందురా నిదియె వీరికి క్లిష్టపు కైపదంబగున్
"అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్"
జిలేబి
ReplyDeleteజంకకు చెప్ప వే పడతి చప్పున బూటక మైన వాక్యమున్
పొంకము లేక యెల్లరికి బుద్ధిని మందము చేయగాదగున్
శంకర వర్యు లున్ బెదిరి సాజమనంగ! జిలేబి చెప్పె బో
"లంకను పోరులో గెలిచి లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్"
జిలేబి
ReplyDeleteఆ పరమాత్మ కృష్ణునిగ నామతిలెన్ గద యేయుగంబులో ?
నా పరమాత్మ మత్స్య ముగ నారయ వేదము, కూల్చె నెవ్వరిన్ ?
నా పదియర్లజోదు నట నామమడంచెను బ్రోవ జానకిన్ ?
ద్వాపరమందు; సోమకవధం బొనరించెను; రాముఁ డుద్ధతిన్!
జిలేబి
ReplyDeleteచోద్యము! చిత్ర సీమన సుశోభిల ఖ్యాతిని గాంచ గా భళా
మద్యము ద్రాగు వారలనె మాన్యులుగా నుతియింత్రు !సజ్జనుల్,
సేద్యము లెంత జేసినను చేరక బోయిన మందు భాయిగా
నాద్యపు పేరు గాన సయి నమ్మిక నొందగ వీలుకాదయా!
జిలేబి
ReplyDeleteమేధము లెల్ల నాదుకొని మేవడి గాధిజు నభ్యనుజ్ఞగా,
రాధన మొంద భూసుతయు, రాముడు ధన్వము నెక్కిడెన్! భళా
వీధులు రాచవాడ సరవిన్ సొబగుల్ గన, పర్వుపాసనా
రాధను పెండ్లియాడె రఘురాముడు దేవత లెల్ల మెచ్చగన్!
జిలేబి
ReplyDeleteకాముక ! రావణా ! వినుమ! "కాదిది మేలగు కార్యమౌ సుమా !
సోముడ ! వాలి పుత్రుడ! సుశోభిత సీతను నప్ప జెప్పుమా
రాముఁడు నాకు దైవమని!" రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా
"రామునిదాడి నొడ్డెదను ! రమ్మను మ్రుక్కల చేసె దన్ సుమా ! "
జిలేబి
ReplyDeleteమతిలేకన్ తన మాట మీరుచు సదా మైకమ్ము లో తూలుచున్
సుతరామూ పని పాట లేక మగతన్ శుండాలమై యాడెడా
గతకాలమ్మున వ్రాసి నట్టివి సు ! మాకందంబనన్ తీరుగా
పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేతురే!:)
జిలేబి
ReplyDeleteసోముడు వాలి యంగజుడు సొంపుగ చెప్పెను కౌసలేయుడా
రాముఁడు నాకు దైవమని, రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా
రాముడు నీకు దేవుడన రాజధరుండగు నాకు దైవమౌ
రా! మును ముందు యుద్ధమున రాముడ లేక శివుండ చూసెదన్ !
జిలేబి
జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సోముడు, రాజధరుండు'...?
Zilebiసెప్టెంబర్ 17, 2018 11:13 AM
సోముడు - వానరుడు
రాజధరుడు - శివుడు
ఆంధ్ర భారతి ఉవాచ
సరియేనాండి కంది వారు ?
జిలేబి
కామేశ్వర రావు పోచిరాజుసెప్టెంబర్ 17, 2018 11:55 AM
జిలేబి గారు! సోముఁ డను పేరున నొక కోతి కలదు కాని సోముఁ డంటే కోతి యని కాదు.
Zilebiసెప్టెంబర్ 17, 2018 1:16 PM
కోతి కి పర్యాయపదం సోమము అని చూపించె :)
సోమడ అంటే బావోదని సోముడ అన్నా !/సోమడ అంటే సరిపోతుందాండి ?
కామేశ్వర రావు పోచిరాజుసెప్టెంబర్ 17, 2018 4:36 PM
ధర్మసంకటములో పడ వేశారు.
కవిత్రయాది మహా కవిసంచయ ప్రయోగ విశేష శబ్దార్థము లనన్య లబ్ధములు నిజాంధ్ర నిఘంటువున నిబిడీకృతము జేసిన పర్యాయ పద రచనా పారంగతుఁడు ప్రజ్ఞాశాలి యైన యాచార్య గోళ్ళ నారాయణ స్వామి రెడ్డి గారు సూచించిన సోమపు టర్థము నెట్లు కాదన గలము?
వానరమును వానరుఁ డని పల్కునట్లు సోమమును సోముఁ డనుట సమంజసమే యగును.
సంస్కృతమున సోమ సంబంధమైన యను నర్థమున సౌమ యని వాడ వలసి యున్న పదము “సోమ” గా వాడుకలోకి వచ్చియుండ వచ్చును. సంస్కృత నిఘంటు వొకటి యిదియే చెప్పు చున్నది.
“సాహాయ్యము” నకు “సహాయము” వాడుక లోనికి వచ్చి నట్లు.
వానర ముఖ్యుఁ డైన సోముని జాతిగా చెప్పునపుడు సౌమ్యుఁ డనఁ దగును.
వ్యాకరణ బద్ధ పదము సౌముఁడే యగు నని నా యభిప్రాయము.
గురువు గారు మఱింత వివరణ మీయ గలరేమో
***
తేలని సమస్య :(
జిలేబి
ReplyDeleteరామ! జిలేబి చెప్పెనయ ! రావము జేయుచు గండు చీమలున్ ,
సీమ టపాసు పై చనెను! జిమ్మగ వేడి, భళారె తాళకన్
చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱె! నే
భామితి పల్కు నమ్మితిని పద్యము బేర్చితి నుత్పలమ్ముగా !
జిలేబి
ReplyDeleteభాగ్యము పొందగా సుదతి బాధ్యత నేర్వవలెన్ జనాళి! దౌ
ర్భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి! యన్నిఁటన్
యోగ్యత పొంద గోర, వినియోగపడన్ జను లెల్లరున్, సఖీ
భోగ్యము లన్ప్ర జోన్నతికి పొంకిచి కీర్తిని పొంద గాదగున్ !
జిలేబి
ReplyDelete"నీ కను లాయె నీలమణి! నీవె సుమా మరి ముద్దు" తల్లి లుం
ఠాకము ముద్దులాడ తను టంకము నొందుచు కాకజాతమై
తా కల గాంచి "బాపురె సుతారము నాగళ మంచు" సూత్రియౌ
కోకిల కావుకావుమని కూసెను రమ్య వసంత వేళలన్!
జిలేబి
ReplyDeleteCause and effect :)
మగువా! భూరిజమందు కర్మ మన సామర్థ్యమ్ములన్ జేర్చుచున్
తగురీతిన్ ఫల మున్నొ సంగును సదా దావానలమ్మై ! సఖీ,
జగడంబుల్ సయి కక్ష లన్ విడువకన్, జాప్యమ్ము లేకన్జనుల్
పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్?
జిలేబి
ReplyDeleteఒకచో గిల్లును నారదావహ గతి , న్నొక్కొక్కచో హాస్యమున్
గికురించు , న్నొకచో విశేష ధిషణా గీర్వాణమున్ జూపుచున్
సకలామోదము కూడగట్టు , నొకచో సాగించు కొట్లాట , యి
ట్లొకటా రెండ యనేక చేష్టిత ఘనుల్ , రూపేది , పేరేమిటో ?
లక్కాకుల రాజారావు గారు
ReplyDeleteఅగ్నిమీళే పురోహితం !
అగ్ని పురోహితమ్మగు! సుమాంజలి! వంద్యపు మూల మంత్రమై
మగ్నమ వంగ నందు మన మానస మందు వెతల్ తొలంగు, తా
భగ్నము చేయు నర్మిలిని ! భారము తీరగ చేతనమ్ము తా
నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్!
జిలేబి
ReplyDeleteరాజులే ఆదరణ నివ్వక పోతే బాస కేగతి జిలేబీ !
త్రోసె, జిలేబి తెల్గు వలదోయి యటంచు ప్రభుత్వమే!నదే
బాస నశించెఁ; గారణము పండితులే కద తెల్గునేలపై
బాస యొకింతయైన తను భవ్యత వీడక నెక్కొనన్, సఖీ,
దోసిలి బట్టి తాము కనుదోయిని నిల్పగ నెల్ల వేళలన్!
జిలేబి
“జిలేబి” గారూ, మీరు బహుభాషాకోవిదులు కదా, “beaten dring” అంటే అర్థం చెప్పండి / కనుక్కోండి.
ReplyDeleteతెలియట్లేదా? మందు కొట్టాడు అని అర్థంట (drink చేశాడు అని). ఒక తెలుగుబ్లాగ్ లో ఒక పోస్ట్ హెడింగ్ 😳.
నాకు తెలిసిన వ్యక్తి ఒకరు He is drinking cigarette అనేవాడు. cigarette “తాగుతున్నాడు” అన్న తెలుగు మాటకు ఆంగ్లానువాదం అన్నమాట 🙂.
DeleteHeardFort Human Lion Don't come
,లానాండీ ? :)
జిలేబి
మరే. Queen Town, Mind Town / Fallen Town లాగా 🙂.
Delete
ReplyDeleteమల్లియ లన్ తురుంభమున మానగురీతిని తీర్చి భామినీ
పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ
బల్లులు పిల్లికూనలుశుభాంగిజిలేబియ నెత్తి రాతలన్
కొల్లగొనంగ లేవు విను కోమలవల్లి వినంతి యిద్దియే!
జిలేబి
ReplyDeleteఏ వనితల్ మముం దలప నేమి పనో యిట మౌనమూనినన్
సేవలు సేయగా హృదయ సీమ ద్రవించిన దేమొ శ్యామలా
కావలె మారుమాటయన కాస్త జిలేబుల జేర్చి దానితో
త్రోవన దీర్ఘదర్శులకు ధూపము వేయుచు నారదాయనన్
శ్యామలీయం మొదటి పాదము
లక్కాకుల రెండవ పాదము
మూడు,నాల్గు జిలేబి పాదములు
జిలేబి
ReplyDeleteఇదేమి సమస్య రా బాబోయ్ :)
రాముని గాధ వెల్గె పలు రాజ్యములన్ జన నాడిలో కతల్
పాముకొనంగ మారె పలు పాటకచేరుల నట్టి గాధయే
తామరతంపరై తెలుగు తాతకు లభ్యమవన్ జిలేబి,"యా
భీముని భార్య తార" యని వేమన వ్రాసెను భారతమ్మునన్!
జిలేబి
Deleteక్మేర్ కంబోడియా రామాయణాన్ని చదివి చూడండి :) సమస్యా పూరణలకు మా బాగా పనికొస్తుంది :)
https://archive.org/details/ReamkerCambodianVersionOfTheRamayanaJudithJacobM.KuochHaksreaRoutledge_20180220_1521/page/n0
Especially the second part :(
జిలేబి
ReplyDeleteవంకలు వాగు లన్నియును స్వామి!యహర్పతి చూచినాను నీ
వింకను వ్యోమ మార్గమున వింతల చూపగ బిల్వ లేదనన్,
డొంకెన నొత్తి పట్టి భళి డోమిణి వాడివలెన్ సెబాసు మా
శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్!
జిలేబి
ReplyDeleteఎవరు చూసొచ్చేరు రాసుకుంటూ పోవడమే :)
ఇంకను నింక పైకనుచు నింతియె కోరన మోదమొందుచున్,
శంకరుఁ డెత్తె మంచుమల, శైలజ భీతిలి కంపమొందఁగన్,
బింకము వీడి కౌగిలిని పింగళుడాతడి సైకొనంగ నా
వంకన ముద్దులీను తన భార్యకు తోడుగ నాట్యమాడెగా
జిలేబి
ReplyDeleteరమేశా వారి భావమునకు చిరు ప్రయత్నం
శంకరుడాశుతోషుడట!చండుడు చంద్రకళాధరుండటన్
డొంకెన చేత బట్టి చను డొంకల వాగుల తిక్క వాడటన్
నింకయు చెప్ప గాను విని నివ్వెర బోయి భళా త్రిశూలమున్
శంకరుడెత్తె, మంచుమల, శైలజ భీతిలి కంపమొందగన్!
జిలేబి
ReplyDeleteపంకిల గాము మేమనుచు భారత దేశము మాది యంచు మీ
కింక వికాస మేయనుచు కింకరు లంచు జిలేబు లౌచు మీ
చంకన లంకెబిందెలని, చట్టన మార్పిక తధ్యమంచు ఓ
వంక నయోధ్య మందిరపు వాదకులై మన నేతలయ్యిరే :)
జిలేబి
ReplyDeleteవేడుక ముచ్చటల్ గనెడు వేదిక గా నడి రేయి నావలో
జోడుగ యీడుగా మగని, జొప్పిలు మోహన రూపు పెన్మిటిన్
తోడగు జీవితమ్ము సయి, తూగెడు మంచము, ముద్దులాటలున్,
వాడిని పూవులే తగును భామలకున్, బ్రతుకమ్మఁ బేర్చఁగన్
జిలేబి
ReplyDeleteమాలిని !నందయంతి! సతి! మాతృక !కౌశికి కొండచూలి చం
డాలిక ! నీలలోహిత! మృడాని ! జయంతి ! భవాని! సౌమ్యయున్,
కాలక! అన్నపూర్ణ ! ఉమ! కాళిక! పార్వతి ! శక్తి యా సినీ
వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్!
జిలేబి
ReplyDeleteదానము చేసె నెల్లరకు తాను సహాయము చేసె నెప్పుడున్
గానము చేసె నీశుని సకాలము నందు జనాళి మానమున్
ప్రాణము గావ శక్తి తన పాలిటి చేయగ; డంబు టెక్కు, య
జ్ఞానము లేనివాఁ డిల యశమ్మును బొందెను జూడు సత్సభన్
జిలేబి
ReplyDeleteతోడుగ మానసాంబుధిని దోచెడి వాడు మగండవన్ సఖీ
నీడగ వెన్క బోవుచు పునీతపు జీవిత మందు, కొమ్మ! క్రీ
నీడల నాతడిన్ వశము నీవుగనన్ మధురోహలన్ వెసన్
వాడిన పూవులే తగును భామలకున్, బ్రతుకమ్మఁ బేర్చఁగన్!
జిలేబి
ReplyDeleteవేడుక ముచ్చటల్ గనెడు వేదిక గా నడి రేయి నావలో
జోడుగ నీడుగా మగని, జొప్పిలు మోహన రూపు పెన్మిటిన్
తోడగు జీవితమ్ము సయి, తూగెడు మంచము, ముద్దులాటలున్,
వాడిని పూవులే తగును భామలకున్, బ్రతుకమ్మఁ బేర్చఁగన్
జిలేబి
ReplyDeleteపరలోకమున ఉన్న తండ్రీ గావుమయా ! ఆమెన్ !ఆదివారము 14.10.18
సత్యము యేసునాధుడనె ! సాధ్యము ప్రేమసుధారసంబునే
నిత్యము గ్రోలుచున్ జనులు నేయపు మార్గము లో ప్రయాణమై
జాత్యపు రీతిగా నడత జాదుకొనన్ గమకమ్ము జేయగా
మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్!
జిలేబి
ReplyDeleteAccept or perish
సత్యమిదే! ఖుదాయొకడె! సాగిలబెట్టుటదేల, మూర్తులన్
నిత్యమటంచు! భీతిలక, నివ్వెర చెందెడు రీతి అల్ యి లాహ్
ముత్యపుకాంతి యైనిలువ, ముంగట మ్రొక్కన, కుత్తుకల్ గొనన్
మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్!
జిలేబి
ReplyDeleteమూపుపయిన్ రమా మణి దుముక్కని చేతిని దుడ్డు కర్రతో
సాపుగ వేసి మొట్టి తన స్థానము తెల్పుచు కీచు లాడుచున్
వేపుడు మాదరింపులన వేకువ జామున తిట్టి పోయగా
కాపురమున్ గ్రమించు నరకమ్మొక టున్నదె యెంచి చూడఁగన్!
ఇవ్వాళ డమాలే డమాలు :)
ReplyDeleteఅల్లన యోగమాయ పలుకంగన నాకస వీధిలోన, మే
నల్లునిఁ జంపగాఁ దలచెఁ నాహవమందున మామ కృద్ధుడై,
పిల్లల నెల్ల చంప తను వీధుల వాడల నంప, రక్కసుల్
మల్లెల మాలలన్ తురిమి మల్లిక లై చనిరమ్మ పల్లెలన్
జిలేబి
ReplyDeleteమన్నిక గాను వ్యాక రణ మంతయు ప్రోదిగ శిల్ప మాయెనా
చిన్నయసూరి చేత; మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే
యెన్నగ నాంగ్ల భాష పయి యెంతయొ మోజును గాన నెల్లరున్
మిన్నగ నిప్పు డైన మరి మేటిగ నేర్వుడు తెల్గు లెస్సగన్ !
అరవ మామి
ఉవాచ :(
జిలేబి
ReplyDeleteఒకాయనేమో వ్యాకరణమిచ్చి చంపేడు
పండితులేమో దూరము దూరమని భాషలోనికి క్రొత్త పదాలకు తడకట్టు (అన్యదేశ్యము :)) వేసి చంపుతున్నారు . :)
సో హౌ ? :)
చిన్నయసూరి చేత, మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే,
పిన్నలు నేర్వుడీ యనుచు పెన్నిధి ఋక్థమటంచు నివ్వ నో
రన్న పదానుశాసనము! ప్రాజ్ఞులు దూరము దూర మంచు నో
రన్నరొ! యన్యదేశ్యముల రాపడనివ్వక నాంధ్ర భాషలో!
జిలేబి
ReplyDeleteస్పష్టము గాను తెల్పి తిని శాంభవి శంకరి పూజ చేతురే
యష్టమి నాడె, యట్లతదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్
స్ప్రష్టము లెల్ల బోవ పతి చక్కగ నేళ్ళును గూడి తోడుగా
వేష్టము గాన నేడె!అలివేణి ! జిలేబి ! శుభాంగి తొయ్యలీ !
జిలేబి
ReplyDeleteఅరయన్ పార్వతి, దుర్గ, శారదయు, మా యార్యాణి శర్వాణి యా
సురసన్ కర్వరి కొండచూలి గిరిజన్ శోభిల్లు మా శైలజన్,
వరమాలన్ మనువాడినట్టి శివుడా భద్రేశుడౌ చంద్రశే
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్!
జిలేబి
ReplyDeleteపరమాత్ముండు జిలేబి తాగలడుగా పద్మంబులోపంకలో
నరయంగన్ గల డాత డెల్ల జగతిన్ నామంబు రూపంబులే
క! రహస్యంబులు లేవు గానగలవే గ్రామ్యాశ్వమందున్ వెసన్
ఖర పాదార్చన మొక్కటే హితము గల్గం జేయు ముమ్మాటికిన్
జిలేబి
ReplyDeleteఅరె! దస్కంబులు దండిగాను దొరుకున్ నమ్మంగ గ్రామ్యాశ్వ దు
గ్ధరసంబున్!పరుగెత్తు వాటినిగనన్ దంబంబు వీడన్ దగున్
ఖర పాదార్చన మొక్కటే హితము గల్గం జేయు ముమ్మాటికిన్,
వరమైగానగ వచ్చు నీవు రమణీ వార్ధక్యమందున్ సుమా :)
జిలేబి
ReplyDeleteఅందడ తండు! కాని కల డందురు ! చూడక పోయినన్ సుమా
డెందము చెప్పు చుండుగద డెంకణ మున్ సలుపంగ మేలు! తా
తొందర పెట్టు చుండు సఖి, తొయ్యలి, నీ పరి ణేత యంచు! తా
నందఱిలోన నొక్కఁ డగు నందఱు నొక్కనిలో వసింతురే !
జిలేబి
ReplyDeleteవేడిరి వేంకటేశ్వరుని వేదిక నెక్కిరి, పెండ్లియాడగన్
బాడబ లేమ, రెడ్డిని, వివాహము గాంచిరి!కొందరచ్చటన్
కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె, శ్రోత్రియుల్,
పోడిమి గాంచు మామిడిని ప్రోక్షణమున్ గొని నారగింపగా!
జిలేబి
ReplyDeleteకష్టము లన్ జిలేబి విను గట్టిగ చేర్చును నీకు తొయ్యలీ,
యిష్టము నాకటంచు మరి యీహగ, మెక్కకుమా! రమామణీ
తుష్టియు దుష్టి యే !సరసి! ,తొందర పాటున చెప్పకేనెటుల్
పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట పుర్వుల మందుల మ్రింగ మే లగున్?
జిలేబి
ReplyDeleteపోవలె నమ్మ నౌకరికి పోవలె నమ్మ జిలేబి నేవెసన్!
తావిని జేర్చ వచ్చితి సుతారముగా పువుబోడి !రావె! నా
భావిని!కోపమేల! సఖి! ఫ్లైటుడిలేయయె! రమ్మ!కొమ్మ!దీ
పావళిపండుగన్జరుపనౌగద,పున్నమినాటిరాతిరిన్ !
జిలేబి
ReplyDeleteఆ వనజోదరుండు నరకాసురుడిన్ మడచంగ సూవె, దీ
పావళి పండు గన్జ రుప నౌఁగద!, పున్నమి నాటి రాతిరిన్
భావిని! దివ్వె లన్నిటిని బారుగ దీర్చుము కార్తికంబునన్,
కోవెల వెల్గు జేర మన కోశము లెల్ల సుదీప్తి గాంచునే !
దీపావళి
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteపావన మైన వేళ! విడు పట్టిన పట్టును సత్య! మానవే
నీ వలుకన్ శుభాంగి! పరిణేతను! తెచ్చెద పారిజాతమున్
నీ వన మందు నాటెదను!నిత్యము కొప్పున గూర్తు! రమ్మ! దీ
పావళి పండు గన్జ రుప నౌఁగద పున్నమి నాటి రాతిరిన్!
జిలేబి
ReplyDeleteజోతల గొల్వు మూర్తులను జోతల గొల్వుము వారి చక్కియన్
మాతలు గాను శక్తిగ సమస్తము కాచుచు నిల్చిరే సదా
సేతలు వారివైనను విశేషము లేమియులేవు యొక్కరే
మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే!
జిలేబి
*చక్కియ - ప్రక్కన by their side
ReplyDeleteమైలవరపు వారి అద్భుతమైన పూరణ
జీతముఁ గోరి పద్మజను , సేమము గోరుచు నద్రిపుత్రికన్
బ్రీతిగ విద్యలన్ గొన విరించిసతిన్ గొలువంగనేల ? నీ
వాతతభక్తి గొల్వ ముగురమ్మలమూలపుటమ్మ జాలురా !
మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
***
మైలవరపు వారికి జిలేబి రిటార్టు :)
Distribution of labour :)
హా! తేర్చగ వేగిరముగ
వేతల చెప్పెడు జనాళి వేదనలన్, గా
దే,తల్లులు మువ్వురయిరి!
మాతలు మువురైన నొక్క మాత గొలుతువా?
జిలేబి
ReplyDeleteతప్పిన చిన్ని బల్లి తన దారిని, భీతిని గాంచె దగ్గిరన్
కప్పనుఁగాంచి, పాము వడఁకం దొడగెన్ గడు భీత చిత్తయై
చప్పుడు లేక దగ్గిరిని చాకువలెన్ దిగి ముక్కుతోడుగా
గప్పున పట్టి లాగగను గ్రద్ద! స్వభావము సంభవమ్ముగాన్
జిలేబి
ReplyDeleteప్రకామాఘము -
ప్రకామ -అధిక
అఘ - దుఃఖము
ప్రకామాఘము - అధికమైన దుఃఖము
ఋతువులు మారి పోతే దుఃఖదాయకమే
అలాంటి అధికమైన దుఃఖము సంక్రమించినది.
జాఘనిరాయుడంట మన జానకి మాతను గాంచె లంకలో!
మా ఘన సార్వ భౌమ! వినుమా!అనుమానమదేల సీతయే
రాఘవ! రావణాసురుని రచ్చకుదీయుచు చంపుమీ! ప్రకా
మాఘము సంక్రమించినది మార్గ శిరంబునఁ గార్తికం బనన్!
జిలేబి
ReplyDeleteశంకరుడనే అబ్బాయి పెండ్లి చూపులో బుట్టలో పడిన వైనంబనెడు వృత్తము :)
సుందరి చారులోచన! కుచోన్నత కుంకుమరాగ శోణితా
యిందుముఖిన్,జిలేబి సయి యింపుగ పద్యములల్లు చుండెడా
నందిని, గుబ్బలాడి యిడియాప్పము వేయగ నాశతోడు నొ
ప్పందినిఁ, జూచి, శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై!
నొప్పందిని - ఒప్ప తిని liked, ate, fell prey :)
జిలేబి
Deleteఇడియాప్పము తినాలంటే నాయరు హోటలు కెళ్ళ వలెన్ బహు పసందుగా వుండును :)
http://www.telugufoodrecipes.com/food/recipedetails/2117/idiyappam-kerala-style-recipe.html
జిలేబి.
ReplyDeleteతల్లి లేని పిల్ల తల్లీతండ్రియై పరిధిని దాటి పెళ్ళి చేసి ఓ అయ్య చేతిలోపెట్టి
తెమ్మర వీవు రమ్మ పరిధిన్ సయి దాటుచు పెండ్లి చేసినా
నమ్మ జిలేబి క్రమ్ముకొను నాధుని మేల్కొని జీవితేశుడిన్
కమ్మగ మార్చుకొమ్మ ! సుడిగాలివలెన్ పతి సేవయేతగున్
రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱఁగన్!
జిలేబి
ReplyDeleteశ్వాసయు వీడు దాక భవ సాగర మందున తప్పదే సఖీ
కాసుల గోల! నీ వలన కాదది! సాధ్యముగున్ జిలేబియా
మోసముఁ జేయువారలకె; మ్రొక్కఁ దగున్, సుజనుల్, హితార్థులై
వేసము వేయకన్ తమ చవిన్ సయి చూడని సాటివారికిన్!
జిలేబి
ReplyDeleteపిల్లల తోడు మైమరిచి భీకర మౌ జలపాతమందు నే
నల్లన బోవ కింద పడి నా వపువెల్లను గాయమయ్యె! హా!
చల్లని నీటిచే నొడలు సర్వము గాలె, నదేమి చిత్రమో
యుల్లము నందు కొంచియపు యుత్తలపాటది లేదు చూడగన్!
జిలేబి
ReplyDeleteTop to toe you know we make you up with same color :)
కల్లయె కాదు ! మేకపు దుకాణము లే కనకాంగు లెల్లరిన్
తెల్లగ నల్ల గాను సయి తీర్చగ, ఫేషను సారసాక్షులన్
మెల్లగ మార్చి వేసె నయ ! మేచక మెల్లెడ గాను తీర్చగా
నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్
జిలేబి
ReplyDeleteఆ ముక్త మాల్య దగా :)
జిలేబి ఆటవిడుపు
జీపీయెస్ వారికంకితం :)
అల్లన ముక్తుడైన ఘనుడా విజయుండు, జిలేబి, మాల్య తా
చల్లగ నుండ గా నతడి చక్కని కింగ్ఫిష రిచ్చటన్ భళా
పల్లకిసేవ పొందెగద! భారత దేశపు రాజ్య లక్ష్మి, హా!
నల్లఁగ నున్న మల్లెలను, నాతి, ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్!
జిలేబి
ReplyDeleteమరో ఆటవిడుపు
మాల్య పింకి లాల్వాణి వివాహము :)
మల్లియ లార! నా విజయ మాల్యుడు దేశము వీడెనంచు మీ
రెల్లరు దుఃఖమొందిరకొ? రెక్కల విప్పక వాడిపోయిరో
నల్లగ? లాల్వణీ వధువు నాగజమున్ ధరియించి జోడుగా
నల్లఁగ నున్న మల్లెలను, నాతి, ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్!
జిలేబి
ReplyDeleteఆహా ! ఇవ్వాళ ఆటవిడుపులే విడుపులు :)
కౌలు బాపడు - రాహులుడు :)
అల్లన కౌలు బాపడు, సనాతన ధర్మపు వారసుండటన్
నుల్లము పొంగ జంద్యమును నోములుపండునటంచు గోత్రమున్
తెల్లగ తేటతెల్లముగ తెల్పగ భాజప బిక్కవోవగా
నల్లఁగ, నున్న మల్లెలను, నాతి, ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్!
జిలేబి
ReplyDeleteపరలోకములోని ప్రభువా!
అంతా నీ దయ!
అన్నుల మిన్న జీససుని హార్దపు సాచివిలోకితమ్ముగా
తిన్నగ లేచి మెల్ల నడతెంచిరి పావర లేనివారలే
కన్నులు లేని వారలు నిఖార్సుగ చూచిరి లోకమంతయున్
చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్!
జిలేబి
ReplyDeleteపిన్నలు ఫీల్డు ట్రిప్పునకు వెళ్ళిరి చూడగ మిల్కు ఫాక్టరిన్
వన్నియ గాన నాబసిని వర్ణపు భాండములందు పాలు,నో
తిన్నడు త్రిప్ప గొట్టమును తీరుగ పారగ క్షీరమున్!భలే!
చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్!
ಜಿಲೇಬಿ
ReplyDeleteచాటుగ సూటిపోటి యుపచారము లేలనకో మనోన్మణీ
మోటుగ కుమ్ముటే విరసమో సఖి యేమియు నాకు తెల్వదే!
చోటిది నీది గాదె నరె! చోద్యము గానను తిట్టుటేలనో
దాటను నీదు గీతను సదా నిను గొల్తు జిలేబి నమ్మవే!
జిలేబి
ReplyDeleteమొక్కగ దేవు డౌత వినుమోయి జిలేబియ నమ్మకన్ భళా
తొక్కగ రాయి యౌను గద తొయ్యలి జీవిత సత్యమిద్దియే
చక్కగ చెప్పినారు మన శర్మయు జైయని పద్యమున్ వెసన్
తక్కెడ లోన వేసుకొను తస్సదియా మన మాటగా సుమా :)
జిలేబి
ReplyDeleteఓ మై బాయ్ పోతన గో బ్యాక్ లార్న్ ఇంగ్లీష్ అండ్ వ్రైట్ భాగవత్ - లార్డ్ క్రిస్ ఆర్డర్డ్ :)
ఆంగ్లము నేర్చి రయ్య మన యాంధ్రులు ! నీవిక జన్మ నొంది యా
యాంగ్లము నేర్వ గావలయు నప్పెడు భాగవతమ్ము వారికై
యాంగ్లము లోన వ్రాయవలె నానతి గాంచగ భాగ్యవంతుడై
యాంగ్లమునందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో!
జిలేబి
ReplyDelete"జంగ్లి జనాళి మీరని ప్రచారము చేసితి మయ్య! బ్రౌను మా
యాంగ్లపు వాడు తెల్పె ఘనమైన తెలుంగని! మీదు కావ్యముల్
యాంగ్లపు వార లెల్ల చదువంగను మేలగు" కోరగా సుమా
యాంగ్లపు మాతృభాష దొరలందరు, సాచివిలోకితంబుగా
యాంగ్లమునందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో!
జిలేబి
ReplyDeleteకామము, నీతిబాహ్యమగు కార్యము, దోపిడి దుష్టచర్యలున్
రాముని రాజ్యమందుఁ గనరావు గదా! శ్రుతి ధర్మపద్ధతుల్,
సామము హెచ్చుగా జనులు సత్యము శాంతము యజ్ఞయాగముల్
నేమము గాంచిరౌర, భళి నెమ్మికి మారగు పేరు నేటికిన్ !
జిలేబి
ReplyDeleteనీమము తప్పి నాయకుల నేరుగ తిట్టుచు చూపె దర్పమున్
కామము తోడు మూసుకొని కన్నుల చేసెను తప్పులెన్నియో
ప్రేమయొకింత లేదరరె! పేరుకు మాత్రము రాముడైన నా
రాముని రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్!
జిలేబి
ReplyDeleteఉల్లపు కోరికల్ చెలికి నొప్పవు! పెట్టుకొనంగ కొప్పులో
మల్లెల నోకరింతయగు! మాడ్రను గర్లు జిలేబి, సోదరా!
పల్లెల కెప్పుడైన మరి భామిని పోయెనకో ?గుభాళిగా
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే!
జిలేబి
వెల్కం ' బెక బెక ' యని నే
ReplyDeleteబల్క జిలేబీను గాను , బాగున్నారా !
మేల్కలుగును మీ కార్యా !
పల్కెద ప్రియమార శుభము భద్రము గదురన్ .
Deleteమీవూరొచ్చితిమయ రా
జా! వురుకుల మిమ్ము కలిసి జాగ్రత్తగ మా
తావు తెలుపక వెడలితిమి
తావిని జేర్చిరిగదా సుతారముగ సుమీ !
జిలేబి
ReplyDeleteవృద్ధుల దేశమాయె గద వృద్ధిని గాంచగ వద్దు పిల్లలే
వద్దన గాను! రోసిరి వివాహము లన్ సహ వాస మాయె పో
ముద్దుగ పేర్మిగా జనుల మూర్ఖత, చావగ కాలరీతిలో
శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్!
జిలేబి
ReplyDeleteజీపీయెస్ వారి తేటగీతికి ఉత్పలము :)
యుద్ధమిదేను! భామల పయోధరముల్ మరి వీడలేమికన్
సిద్ధము మేము! బ్యాచులరు చింతల తాళుట మా తరంబకో!
బుద్ధిగ బ్రహ్మచర్యమును, పొల్తుక కైగొని, చంపి, శూరులే
శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్!
జిలేబి
ReplyDeleteమన తెలగాణ చంద్రుడు :)
బింద్రను వాలె కాదితడు! భీతియు కొంతయు లేని వాడురా!
సంద్రపు పొంగు మాటలు పసందుగ గ్రామ్యపు భాష తోడుగా
తంద్రితులెల్ల నిద్దురను తన్నుచు వీడి శుభమ్ముగానగా
చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్!
జిలేబి
ReplyDeleteమా నారా చంద్రబాబు వారు :)
మా జిల్లా ఆసామి కాబట్టి తెలగాణ చంద్రుడి కన్న కొంత ఎక్స్ట్రా ఫిట్టింగు పెట్టక పోతే బావోదు :)
జై ఆంధ్ర :)
కేంద్రము కాలదన్నగ, వకీలు జయిట్లి సహాయమివ్వకన్
చింద్రము కాగ బొక్కసము, చివ్వునలేచి సజావు చేయుచున్
సంద్రము లెల్ల దాటి తన చాతురితో నమరావతిన్ భళా
చంద్రపు కాంతులీనగను చక్కగ నెక్కొన సింగపూరు పా
రీంద్రము తోడు సైయనుచు రెక్కలు చాపుచు రిక్కదారిలో
చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్!
జిలేబి
ReplyDeleteఅక్షర మొక్క టైన వనితా, సరి నేర్వక వంశవృక్షముల్
చక్షువు కానలేదకొ ? పిశాచుల, దైత్యుల కాశ్యపేయులన్
వక్షము లోన బెట్టుకొని ప్రార్థన జేసితివా? జిలేబి, యే
రాక్షస గర్భమందు రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై?
జిలేబి
ReplyDeleteమోక్షము దండహస్తులకు ముంగమురాముగ నిచ్చె విష్ణువే!
దక్షత గాన జన్నము, ప్రదక్షిణ చేయగ, పాయసమ్మటన్
భక్షణ మై ప్రసాదముగ పంక్తిరథున్ రమణుల్ గొనంగ వై
రాక్షస గర్భమందు రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై!
వైరాక్షస - రాక్షసులకు వైరము గా నుండు , గర్భము నందు ? సరియేనా ?
జిలేబి
జిలేబి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సరియేనా?' అంటే 'సరియే కాబోలు!' అంటాను!
కంది వారు
ReplyDeleteజంబపు మాటలాడు పరిచారకుడాతడు గట్టి గా కథన్
తంబళ తిక్క తోడు వెస తాడుకు బొంగర మేమి లేక యున్
సంబరమించుచున్ పలికె చక్కగ యుత్పలమాలలోనిటుల్
"యంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్"
జిలేబి
ReplyDeleteచక్కగ నింటికాపు తను చల్లగ బిస్కతు లెల్ల మ్రింగునా
కుక్కలు, పచ్చగడ్డిఁ దిను గోవులు, మ్రింగును పచ్చి మాంసమున్
మిక్కిలి మోదమానముగ మెక్కొని వ్యాఘ్రము లెల్ల సోదరీ
చక్కిల ముల్ జిలేబుల పచారము వెళ్లి బిరాన తెమ్మరో
మెక్కెద మింక పూరణను మిక్కిలి చక్కగ చేయ పట్టు గా!
జిలేబి
ReplyDeleteకోడలు పిల్ల చూడగను, కొత్తడి లేమల కెవ్వుకేకలన్
తేడరిలంగ బుద్ధులు కుదేలుమనంగ వివేకమున్, భళా
బోడల బోలు వేడుకల, బ్రువ్వను బ్రువ్వను కైపు మాటలన్
మూడును మూడు మూడు ననె మూర్ఖుల చిత్తము నొచ్చునట్లుగా!
జిలేబి
ReplyDeleteToday's parents and teachers on students
పాపలు బాలురెల్లరును భావితరమ్మున మేలుగాంచగా
నోపిక లేకపోయినను నొప్పి భరించుచు పుస్తకమ్ములన్
దోపుచు గంపెడంత తమ దోర్బలసాయము పోవలెన్ సుమా!
పాపము! లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్
జిలేబి
ReplyDeleteరావె!జిలేబి! మల్లె లివి రాగిణి నీకని తెచ్చినాడ! రా
వే వెల పూజ్యమేను కొనవే సరసమ్ముగ తోటలోనివే!
కోవెల కెళ్ళి కన్నడికి కోరిక తీరగ మాల వేయగా
రావె!శుభాంగి! పద్యముల రాశుల కుప్పగ పోయు మమ్మరో !
జిలేబి
ReplyDeleteభండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తిఘటుండు రాము డా
మండప మందు విల్లు తునుమాడగ నాదము పిక్కటిల్లగా
కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!
జిలేబి
ReplyDeleteముట్టగ కైపదంబొకటి ముంగట శంకరుకొల్వులోనటన్,
కొట్టున కొట్టుకొచ్చె తను కొంచెమకో? భళి రెండు పాదముల్!
కట్టె జిలేబి పాదమును గట్టిగ నొక్కటి యుత్పలంబుగా
చట్టని వేసె కొల్వున సజావుగ నాల్గన వృత్తపాదముల్!
జిలేబి
ReplyDeleteసదనపు కైపదమ్ములకు చక్కగ భారత గాధలన్ సదా
మదిని మధించి వ్రాయవలె మాదిరి యై నిలువన్ జిలేబులూ
ర! దవగడైన చెత్తయు, వరానన డాంబిక మున్ డమారమౌ
పదములు లేక సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్!
జిలేబి
ReplyDeleteఇవ్వాళ్టి 'ఆడ' విడుపు :)
కోపము తోడు పెన్మిటిని కోమల వళ్లి జిలేబి త్రోయగా
తాపము వీడ లేని పతి తంకము తంకము గాను చేరగా
సీపెపు ముత్తెమై వెలుగు శ్రీమతి చువ్వన వేడి గాన నా
దీపముపైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా!
జిలేబి పరార్
ReplyDeleteసోరణి దివ్వె వెల్గుల సుశోభిత రాశి జిలేబి నయ్యరున్
చేరగ నెమ్మి మీరగ సిసింద్రి శుభాంగిగ తమ్మికంటియై
మారుచు జీవితమ్మున సమావృతవల్లభుడాతడే యనన్
నీరజమందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్
జిలేబి
ReplyDeleteబల్పుకొనంగ సంపదల బాధ్యత లేకయు కూడగట్టి తా
తల్పుల మూసి వేయుచు ప్రధానుడు గా తిరుగాడు వాడినే
నల్పునిఁ జెప్పగాఁ దగు; మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్
కల్ప ద్రుమంబు గా మదిని గాంధివలెన్ సఖి దోచు వాడినే !
జిలేబి
ReplyDeleteసాగెను జీవితమ్ము! మనసా! పరమాత్ముని సన్నిధానమున్
నే గన నెట్లు వీలగును? నెంజిల తీర్చు మహాత్ముడెవ్వడో?
సాగెను యత్నమాతనిది!స్వామియె వచ్చెను! భక్తి గాంచి సం
యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై!
జిలేబి
ReplyDeleteమ్రోగెను భేరి యచ్చట సమున్నత వేదిక పైన మోడియే
తా గురు వై జనాళికి ప్రధానిగ సద్గురు జగ్గి వాసుదేవ్
సై గరి జూపి రాజునకు సాధ్యమటంచును కర్మయోగిగా
యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుడై!
జిలేబి
ReplyDeleteపెద్దల మాట మీరితి గుభిల్లుమటంచు జిలేబిదక్కెనే
సుద్దుల త్రోసిపుచ్చి తన శూలపు పల్కుల కాల్చుచుండెగా !
ముద్దుగ మాటలాడెడి ప్రమోద శుభాంగియు ధర్మపత్నులై
యిద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్
జిలేబి
ReplyDeleteహే గురు! కంది శంకర సహేతువు గానగు పించలేదయా
యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై?
భోగికి యన్న పోవు సరి పోవు కవీశ్వర! యిట్లు మార్చితిన్
భోగికి యోగి యోగ్యమగు భూతదయన్ గరిపెన్ సయోగ్యుఁడై!
జిలేబి
ReplyDeleteవిద్య విలాసి దాయెను! ప్రవేశమమూల్యము పేర్మి తోడుగా
హృద్యము గావలెన్ పలుకు హృచ్ఛయుడిన్ తలపించి కైపుగాన్
సద్యము ప్రేయసీప్రియులు సన్నిధిసేయ మధూళికల్ తృటిన్
పద్యము వ్రాయఁగన్, యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా!
జిలేబి
ReplyDeleteతర్జన బర్జనేల వసుధన్ మన శత్రువు చేర్చు ధీమతన్,
ఘర్జన చేయ గానతడు గట్టిపడున్ మన ధైర్యమున్ వె సన్
కర్జము పెంపునొందు క్షణకాలములో! మరి యావిధంబుగా
నర్జున మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్!
జిలేబి
ReplyDeleteశిష్టుల వీడడమ్మ పరిశీలన చేయగ లోతుగా సఖీ
కష్టము గాదు నమ్ము, నిను గావ సుమీ విభుడాడు నాటకం
బష్ట మదమ్ము లెల్ల భళి వాడి కృశించుచు వీడగానటన్
దుష్టులకే పరాత్పరుఁడు దోడ్పడుచుండును, ధర్మరక్షకై !
జిలేబి
ReplyDeleteభంగును త్రాగినాడతడు బారుగ నేలను తాకినాడు తా
చెంగున లేచినాడు తన చేతిని చాపుచు తాళమేయుచున్
తింగరి బుచ్చి యొక్కడు కుదేలుమనంగ భళారె చెప్పెగా
"సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్"
ఇవ్వాళ్టికి కత సమాప్తం :)
జిలేబి
ReplyDeleteరక్కసి ప్రేయసిన్ సయి ఘరాన జిలేబిని తీసుకొంచు నీ
రెక్కల విప్పి గాలి వలె రివ్వున సాగి భళారె తప్పకన్
మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్,
మక్కువ మీరగాను చెలి మాధురి తోడుగ నిన్ను గావగా
***
చక్కగ తెల్లవారగను చక్కటి బొట్టును దాల్చి నేరుగా
మిక్కిలి గౌరవమ్ము గ మమేకము గా నిడిమట్టు ధోరణిన్
మ్రొక్కగ నొప్పు ప్రేమికుల రోజున నొజ్జల పాద పద్మముల్
దక్కును దక్కునమ్మ వసుధన్ మన కన్నియు మేలుగా చెలీ!
జిలేబి
ReplyDeleteకంసుని బుద్ధి యేల ? మనకయ్యది చేయదు మంచి, సర్వదా
హంసవలెన్ జిలేబి విను హాకపు రీతిని నేర్పుగావలెన్!
శంసన చొక్కమేను? ధనుజారి సమర్థన చేయడే యెటుల్
హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్?
జిలేబి
ReplyDeleteడస్సుల కొట్టు బాలుడట డంబము తోడుత బల్కెరా భళీ
బుస్సన నాటొ నెక్కవలె బ్రువ్వన సాగవలెన్ తిరమ్ముగా
కస్సెపు దారి దాటగను కార్పెటు వేసిన రోడ్డులోన నే
ర్బస్సె దుబాయిఁ జేర్చఁదగు వాహన మన్యము లేలఁ గోరఁగన్!
జిలేబి
ReplyDeleteఈ మహిలోన నిక్కమిది యే సుదతీ తన రార నొప్పునా
ప్రేమయె; కీడొనర్చుఁ గద ద్వేషమె; మేలొనఁగూర్చు నిచ్చలున్
నీమము తప్పకన్ విభుని నీహృదయంబున గొల్చి కోరగా
కామము లేక ధర్మ విధి గాను జిలేబి విధాత రాతగా !
జిలేబి
ReplyDeleteఒక నేత మనోవేదన గా !
బద్ధుడ భారతీయతకు ! బద్ధుడ దేశము గావ నేతగా !
విద్ధమయెన్ ప్రజాళి! విను వీధి విమానము లుద్గమించునో
యుద్ధము? శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్
బుద్ధియె! మార్గ మెద్దియిక ? పొంకము చేర్చుము వేడెదన్ ప్రభో!
జిలేబి
ReplyDeleteఆ ఇంట్లో యెవరూ యెవరికి తీసిపోరు :)
"అన్నుల మిన్న! కంజముఖి!అంబుజలోచన! "చీటి" పేర్లతో
మిన్నగ యాడువారలను మీరెటులన్ భళి కొల్లగొట్టిరో "?
"టన్నుల కొద్ది యా గనుల టక్కుటమారిగ దోచి నట్టి వెం
కన్న సుతుండె నా మగఁడు గాఁడె" యటంచన మెచ్చి రెల్లరున్!
జిలేబి
ReplyDeleteభారము కాదు జీవితము బాధ్యత తోడుగ కర్మ మార్గమున్,
సారము నాల్గు వేదముల సర్వము నేర్వగ! భక్తి మార్గమే
తీరము చేర్చు నెల్లరిని దేహపు కాముము వీడ!గాన న
క్రూరుని మార్గమే మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ!
అక్రూరుడు - సౌమ్యుడు
జిలేబి
ReplyDeleteసత్కవి! కంది శంకర! సుసాధ్యము చేయును దేనినైన నా
సత్కవి! కాని నాగఫణి శర్మ వధానముఁ జేయు టెందుకో
సత్కవి వర్య మీకు తెలుసా? భళి శారద వైభవమ్ము తా
నత్కము గాను తెల్పగ జనాళికి తెన్నిడి తేనెలూరగాన్!
జిలేబి
ReplyDeleteరంకెలు వేయ దైత్యులను, రక్తపుటేరుల తేల్చి, చేరుచున్
వంకలు దాటి, గాధిజుని వర్దిని, మండప మందు, నేర్పుగా
పొంకముగా కరమ్మునట పొందికగా నమరంగ సింగిణీ
శంకరు నాజి గెల్చి, జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే
జిలేబి
ReplyDeleteనారాయణ ! పిండముల చేసి :)
మా కుల పెద్ద లంచట నమస్కృతి చేయుచు తద్దినంబుగా
సోకులు మాడ ! పిండముల స్తోత్రము తోడుగ పెట్టి పెద్దలన్
మా కడ చూచి యిట్లనుట మాన్యమకో నరులార ! యెట్లరా
కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్?
జిలేబి
కంద "జిలేబీ" పెడితే కాకులు వస్తాయా ?
ReplyDelete
Deleteచమత్కారంగా బాగుంది :)
జిలేబి
కాకులు రావు గాని , బుధ కాక మహాత్ములు వచ్చి , అందు చీ
Deleteకాకులు బెట్టి , గ్రామ్య మిది , కందపు గిద్య మటంచు వల్కుచున్
కేకలు వెట్టరా , మనసు కించ పడంగ జిలేబి గార్కి , ల
క్కాకుల వారి మాట యిది , కల్లగునే ? పరికించి చూచినన్ .
మీరు వ్రాసిన ఈ పద్యం ఉత్పలమాలేనా ?
Deleteజిలేబీ మీద మీ అభిమానం కాకులెత్తుకెళ్ళా !
అవును .
Delete' జిలేబీ ' ఇష్టంలేదు , స్వీటు . లడ్డంటే ఇష్టం .
జిలేబీని కాకుల కొదిలేద్దాం . లడ్డు నేను లాగించేస్తాను . సరేనా ?
నాకు మిత్రులంటే , లడ్డుకంటే ఇష్టం . అందుకే .....
Deleteనా కిష్టము లడ్డులు సు
మ్మీ! కంద జిలేబి స్వీటు మిక్కిలి యధికం
బౌ! కానవలదు వలదే
నాకిక నీహారికా వినవె నా మాటన్ :)
జిలేబి
>>>కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్?>>>>
Deleteకాకులకి జిలేబీలు, లడ్లు ఎవరైనా పెడతారా ? అవి తింటాయా ? మనిషి చనిపోయినపుడు అక్కరకొచ్చే కాకులు మానవాళికి కలిగించే నష్టమేమిటి అన్నదే ప్రశ్న ! కాకి అరిస్తే జిలేబీ గారు వస్తే మరీ సంతోషం కాదూ ?
ReplyDeleteవత్స! శుభాంగి ప్రాణసము వన్నెల చిన్నది నీదు రాజ్ఞియౌ!
కుత్సిత మేమి లేదు విను కోమలి కంజుని సృష్టియే కదా
వత్సలమున్ సహిష్ణుతను పాణిగృహీతికి చూపకన్ వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్?
జిలేబి
ReplyDeleteగణేశుని శంకరాభరణపు ముచ్చట్లు :)
విఘ్నము లన్నియున్ తొలగ వేకువ జామున లేచి చూడగా
నౌ "ఘ్న" య టంచు ప్రాస! యరె! నచ్చెడు పూరణ నెట్లు చేతునో
విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్
ఘ్నా, ఘ్న, ల తో పదమ్ములరె గట్టిగ గాన్పడె నాంధ్రభారతిన్ !
ఇంకేముంది పూరణ అయిపోనాది :)
జిలేబి
ReplyDeleteUnable to cross beyond పెంజీకటి Lord help me in your name glory!
నా కల కల్లయయ్యె ప్రభు! నాకము భూమియు భ్రాంతియయ్యె! పెం
జీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్న, దే
వా! కనులన్ బడన్ కరుణ భాసిల చేయుము నిత్యముక్త! ఈ
శా! కృప నీదు కావలయు చక్కగ లోకము లోన నాకికన్
జిలేబి
ReplyDeleteమారీచుడు రావణునితో
నీమము తప్పడాతడు! మునీశ్వరు లెల్లరి దీవనల్ సదా
క్షేమము చేర్చు నాతనికి ! కేవలమాతడు మాసి కాడు! మా
యామయ లోక రక్షకుడయా! విడువన్ దగు యత్నమున్ వెసన్!
రాముని రాజ్యమం దెపుడు, రాక్షస! ధర్మమె చెల్లుబాటగున్!
జిలేబి
ReplyDeleteజల్లెడ లాంటి బుద్ధియది! సత్యము నెప్పుడు దాల్చదయ్య తా
నుల్లము లోపలన్, జవురి నొప్పెడు రీతిని గోలుదిప్పుచున్
తల్లికిఁ దిండి పెట్టుట వృథా యని చెప్పును !ధర్మశాస్త్రముల్
కల్లయు నెప్డు చెప్పదయ కాన సవిత్రిని నెట్టబోకుమా
జిలేబి
ReplyDeleteక్షేమము గా నుగాది యిక శ్రీలను గూర్చగ దేశమంతయున్
వేమరు గైన వృద్ధి పృథివిన్ప్రభలొల్కగ భాసితంబుగా
కామన లివ్వి పండితుల కాహక నాదము విస్తృతంబుగా
రేమగడిన్ వళక్షముగ రిచ్చలు సేయవలెన్ సభాస్థలిన్!
జిలేబి
ReplyDeleteఆ మగనాలు ద్రౌపదియె యాశపడంగ భళారె జోరుగా
తామరకంటి కై వెడలి త్ర్యంబకమిత్రుడి కొల్ను గాంచి చెం
దామరలన్ వరాంగమున తానిడి దారిని కూర్కుపాటుగాన్,
చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్!
జిలేబి
ReplyDeleteకె యెల్ సైగల్ - కుందన్ లాల్ సైగల్ - 11 April అతని జన్మదినం
ఆ హొయలున్ సరాగముల హాకము "సైగలు" నాదమయ్యదే
మోహన రాగ గానమది! మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్
వాహక మైన కంఠమును వారుణి సేవల నింపి స్వర్గతిన్
స్నేహిగ కౌగలించుకొని నేవళికమ్ముగ సాగిపోవగాన్!
"Jine Ka Dhang Sikhaaye Ja"
జిలేబి
"సోజా రాజకుమారీ సోజా" పాట పెట్టుకుని ఆనందించండి 🙂. నేనేమో నాకిష్టమైన "హర్ సాథీ ఛూట గయా హమ్ జీకే క్యా కరేంగే" వింటాను 🙂.
Delete---------------
అమర గాయకుడు సైగల్ 🙏.
వివిధభారతిలో ఒకప్పుడు ప్రతిరోజూ ఉదయం 7.30 నుండీ 8.00 వరకు పాత పాటలు (హిందీ) వినిపించేవారు. ఆ కార్యక్రమంలో చివరిపాట ఎప్పుడూ కూడా సైగల్ గారి పాటే వచ్చేది. అంతకన్నా గొప్ప నివాళి ఉంటుందనుకోను.
Deleteఇవ్వాళ తెల్లారి 930 am or night 930 pm देश की सुरीली धडकन आकाशवाणी विविधभारती వినండి ఎన్జాయ్ మళ్ళీ సైగల్ :)
జిలేబి
థాంక్స్.
Delete