జిలేబి పద్యము - కంది వారి గళము - ఆకాశవాణి సౌజన్యము :)
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 27th Oct 2018
నిర్వహణ - శ్రీ కంది శంకరయ్య గారు
సౌజన్యం - ఆకాశ వాణి హైదరాబాదు
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్
అరయన్ పార్వతి, దుర్గ, శారదయు, మా యార్యాణి శర్వాణి యా
సురసన్ కర్వరి కొండచూలి గిరిజన్ శోభిల్లు మా శైలజన్,
వరమాలన్ మనువాడినట్టి శివుడా భద్రేశుడౌ చంద్రశే
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్!
శుభాకాంక్షలతో
సురసన్ కర్వరి కొండచూలి గిరిజన్ శోభిల్లు మా శైలజన్,
వరమాలన్ మనువాడినట్టి శివుడా భద్రేశుడౌ చంద్రశే
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్!
శుభాకాంక్షలతో
జిలేబి
వహ్వా!
ReplyDeleteఇది జిలేబీయం కానే కాదు...అమ్మగారి కత్తికి ఆరు వేపులా పదునే!
గురువు గారికి నమస్కారములు శుభాకాంక్షలు
ReplyDeleteగురువు గారికి నమస్కారములు శుభాకాంక్షలు
ReplyDeleteకేవలమామెగూల్చునని కృష్ణుడు సత్యకుజెప్పడయ్యె దే
ReplyDeleteవీ! వరమెట్టు లీ నరకువీరుని గాచుట మర్చితీవొ దీ
పావళి పండుగన్ జరుపనౌగద;పున్నమి నాటి రాతిరిన్
కావరమణ్చె నాత్రిపురకాపుల శంభుడు కార్తికమ్మునన్
దీపావళి పండుగను లోకకంటకుడైన భూమాత కొడుకును తన తల్లే(సత్యభామ భూదేవి అవతారం)చంపితే తప్ప చావడన్న వరగర్వంతో &త్రిపురాసురలు తమ మూడు పురములు ఒకేచోటికి చేర్చికూల్చితేతప్ప చావొద్దన్న గర్వంతో త్రిపురపూర్ణమి/కార్తీకపున్నమి నాడు శివునిచే చంపబడుటచే దీపావళి&పున్నమి పండుగలు జరుపబడుతాయనీ పురాణం లో చెప్పబడింది
ReplyDelete
Deleteఏ పురాణము లోనండి ?
జిలేబి
భాగవతంలో
Delete
Deleteఏ భాగవతంలో ఎన్నో స్కంధములో వివరములు తెలుపగలరు
'నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !'
ReplyDeleteశ్రీకరము గౌరవ మిది , జిలేబి రూప
పండిత కవుల , కిదియు నేపాటి ? యింత
కన్న ఘనత లెన్నేనియున్ గాంచ గలము ,
బుధ సుమాలలో దారంబు బొసగు నటుల .
ReplyDeleteలక్కాకుల కవిరాయా
చక్కగ నుత్సాహములను సదనంబున మీ
రిక్కడ చేర్చగ నవియే
మిక్కుటముగ నిచ్చె నూత మీకు నతులయా !
జిలేబి
ReplyDeleteచందురురుడు తెలగాణని
చందురుడాంధ్రమ్ములోన జగనుడ, కలరోయ్
యెందెందువెతికినను నీ
కందరొకనిలోన నొక్కడందరిలోనన్
జిలేబి
ReplyDeleteనడిరేయిన్ గాంచెను రవి
వడినేదేదో తెలియదు ప్రస్తుత మీ యం
శుడు గాంచి నవ్వె భళివి
చ్చెడునుత్పలముల జిలేబి జేజే యనవే :)
జిలేబి
kavanasarma.wordpress.com
ReplyDeleteబ్లాగర్ డాక్టర్ ప్రొఫెసర్ శ్రీ కవన శర్మ గారు (కందుల వరాహ నరసింహ శర్మ గారు) గతనెల 25 న స్వర్గస్ధులయ్యారని ఆన్లైన్లో వార్త చదివాను 👇. చాలా విచారకరం.
కవన శర్మ గారి మృతి
ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5.30కు హైదరాబాద్ దోమలగూడలో హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో శ్రీ కవన శర్మ గారి స్మారకసభ అని పుస్తకం డాట్ నెట్ లో వార్త :- 👇
కవన శర్మ గారి స్మారకసభ
బెంగళూరులోని Indian Institute of Science లో Professor గా పని చేసి రిటైర్ అయ్యారు. చక్కటి హాస్యకథల రచయిత. 1970లలోనో / 1980లలోనో ఒక వార్తాపత్రికలో సీరియల్ గా వచ్చిన … బ్రెయిన్ డ్రెయిన్ అను అమెరికా మజిలీ కథలు … చాలా సరదాగా వ్రాశారు, చాలా ప్రాచుర్యం పొందాయి.
వారి కుటుంబానికి నా సంతాపం తెలియజేసుకుంటున్నాను 🙏.
Sorry, సవరణ :-
Deleteకవన శర్మ గారి బ్లాగ్ కు సరైన లింక్ 👇
కవన శర్మ గారి వర్డ్-ప్రెస్ బ్లాగ్
ReplyDeleteబంగారు రోజులను న
చ్చంగ కనులముందరన్ సజావుగ నిల్పెన్
రంగుల కలలన్ తేల్చుచు
చెంగలువ కథల సయిన్సు చేర్చె కవనుడై!
With Deep condolences
To
Kavana Sarma Hi
జిలేబి
Delete// "..... ఒక వార్తాపత్రికలో సీరియల్ గా వచ్చిన ... " //
సవరణ:-
.... ఒక వారపత్రికలో ....
Sorry.
Jilebi jee:
ReplyDeleteBefore I forget...
I am stunned by the depth and breadth of your knowledge and tolerance.
You are a GENIUS!
నిస్సందేహంగా ప్రొఫెసర్ గారూ 👌.
DeleteTake a bow "జిలేబి" గారూ 👏.
Deleteఇద్దరు "ప్రొఫె" సర్ లకు
నమో నమః
జిలేబి
ReplyDeleteపండుగరోజుకైన చేరుతామని ఫ్లైటెక్కి డిలే యై వచ్చిన పెనిమిటితో :)
మావా! ఫ్లైటు డిలేతో
నీవొచ్చితివయ! జిలేబిని! కనులు కాచెన్
రావయ్యా! నీకని దీ
పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్ :)
జిలేబి
ReplyDeleteఆ విల విలయేడ్పులు నీ
మోవివిరుపు పారిజాతములకై ? విడుమా
రావమ్మ సత్య! సయి దీ
పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్ :)
జిలేబి
ReplyDeleteవిలుకాడతడు జిలేబీ
యలుపెరుగని వీరుడతడు యమగండడహో
కలకలమనంగ కోలా
హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్!
జిలేబి
ReplyDeleteएकं सत्
ఏతావాతా జగతికి
మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతు,వా
ణీ! తల్లులెల్లరు సుమా
జోతల నొకరే గదా ప్రచోదకుల వలెన్!
जिलेबी
ReplyDeleteజోతల నిడవే విరివిగ
చేతుల మోడ్చి వివిధముగ సేవల తోడన్
మాతకు మాతకు మాతకు
మాతలు మువురైన నొక్క మాత గొలుతువా?
జిలేబి
ReplyDeleteఅరరే! యేసోబు! నిజము
పరమాత్ముడొకండు చూడ ప్రభువత డేరా
పరుగిడి రమ్మ శరణనగ
తిరుమల రాయడు విభుండు దేవుడు "గాడే" :)
జిలేబి
ReplyDeleteమాత గలదోయి మమతగ!
మాతయు గలదుత్తరమ్ము మాయావతిగా!
మాత గలదోయి సోనియ!
మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా?
జిలేబి
ReplyDeleteదరసల్ మరమర ఆమా
ద్మి! రహస్యమిదియె జిలేబి త్రీథౌజండ్ టూ
హరువులు గలవమ్మ జనులు
సరసర తప్పించుకొనగ స్వాతంత్ర్యమునన్
జిలేబి
ReplyDeleteదీపావళి శుభాకాంక్షలతో
సత్య భామ తోడు సమితిని కృష్ణుడు
నరక హంతకుండు, గరళగళుఁడు
కొండచూలి తోడు గుబ్బలివిలుకాడు
మదనరిపువు గాదె మదిరనయన!
జిలేబి
ReplyDeleteచీరల పంపకమదిగో
భారీ జవుళీ అమేథి ప్రజలకు భళిరా
జోరుగ సాగెను రాహుల్
గారూ కాస్త గమనింప గా మేలు సుమా :)
జిలేబి
ReplyDeleteపవనకుమారా ! సరియే
యవధానము ప్రజ్ఞ యనుట, యనృతము సఖుఁడా,
కవులకు నేడది మెండుగ
చవులూరింప గలదనుట చందము గానన్
జిలేబి
ReplyDeleteబందా బహదూర్ సింగ్ లా
యెందరు వీరులు కలరు? మయిని పూసిరిగా
తొందరగా మేధావులు
చిందర వందర చరిత్ర చేర్పుల తోడన్
జిలేబి
ReplyDeleteకరముల మోడ్చి నమస్సుల
భరతుఁడు రామున కొసంగెఁ, బాదుక లెలమిన్
శరణనుచు తలపయినిడుకొ
ని రాజ్యమును గాచి రాముని పదముల నిడెన్ !
జిలేబి
ReplyDeleteఅరయన్ గైకొని తా పా
దరక్షలను నేలెనతడు దయతో రాజ్య
మ్మరయ, తిరిగిరాగ వెసన్
భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్!
జిలేబి
ReplyDeleteఆటవెలదుల సయాటల
నేటి కతల తేటగీతి నేర్పుల వృత్తా
ల్ధాటిగ వేసిరి కందపు
ఝాటీ అయ్యైటి గురువు శాస్త్రీజి ! నమో!
***
జీపీయెస్ మన నేటి గాధల భళా జీరాడు వృత్తంబులో
చాపాచార్యుని మేటి శైలిని తమాషాచూడ రండీయనన్
స్థాపించారు! జిలేబులివ్వి! సరదా సాహిత్యమై,వేడిగా
తాపీగా మన దేశ నేతల సదా తాకెన్ సుతారమ్ముగా!
***
ఆటవిడుపుల, సయాటగ
నేటి కతల, భరతదేశ నేతల వృత్తా
ల్ధాటిగ భళీ పసందుగ
ఝాటీ ఝుళిపించిరి ప్రొఫెసరు శాస్త్రీజీ!
***
ఆటవిడుపుల, సయాటగ
నేటి కతల, భరతదేశ నేతల వృత్తా
ల్ధాటిగ భళీ పసందుగ
ఝాటీ ఝుళిపించిరి ప్రొఫెసరు జీపీయెస్!
జిలేబి
ReplyDeleteవాడు సర్కసు లనువేసి పధ్ధతిగను
చెల్లి కిన్ పెండ్లి చేసెను చేరు వైన
బావ ధనమోహముగనుచు భార్య తోడు
చేరి చంపెనతడిని ! కచేరి యయ్యె !
తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె!
జిలేబి
ReplyDeleteసత్వరముగ జనులు సత్యము గాన, జి
లేబి, మదిని భళి చిలికి పయి గల
తత్ప రమును గాన, తరముగ నాతని
లయమె శాంతిఁ గూర్చు నయముగాను!
జిలేబి
ReplyDeleteఅబ్బు రమగు తావు నాంధ్ర దేశమరయ
కప్పను గని పాము కలఁతఁ జెందె,
నిర్భ యమ్ము గాను నివసించె నవి రాజు
లెల్ల నాదరింప లెస్స గాను
జిలేబి
ReplyDeleteరాఘవ లారెన్సట తా
జాఘని కి సవరము జేర్చి సదనములోనన్
లాఘవముగ చెప్పెను పో!
"మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్"!
జిలేబి
ReplyDeleteపాలు పోసి పోసి పడతులు పెంచగ
సోమరి తనమున నుసూరు మనుచు
పిరికిపంద యయ్యె! బెకబెక కూతల
కప్పను గని పాము గలత జెందె!
జిలేబి
ReplyDeleteకందివర శంకరార్యా!
సందియ మా లేక ప్రశ్న సంధింపులకో?
దందడి బీజాక్షరమా
"పం", దినిఁ, గని, శంకరుండు పార్వతి నెంచెన్!
* ఆంధ్ర భారతి ఉవాచ -
పం - విషాలను విరిచే శక్తి కలిగిన, విషాలను హరించ కలిగిన, మంగళకర బీజాక్షరం.
శుభోదయం
జిలేబి
ReplyDeleteశంకరుడు అనే అబ్బాయి పార్వతి అనే అమ్మాయి పెండ్లి చూపుల లో టిఫిను ఊతప్పం తిని :)
అందాలమ్మణ్ణిని తా
డెందంబరయంగ చూచి డిగనురుకులతా
తొందరగా భళి నూత
ప్పం దినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్!
జిలేబి
ఆ సందర్భంగా ఫలానావాటితోనే ఆతిథ్యం ఇవ్వాలని రూలేమీ లేదనుకోండి. అయినప్పటికీ
Deleteపెళ్క్షిచూపుల్లో ఊతప్పాలూ, దిబ్బరొట్టెలూనా మరీనూ 😩 ?
Deleteఊతప్పమును అంత తక్కువగా అంచనా వేయరాదుస్మీ విన్నకోట వారు :)
అందులో ఊత వుంది ; అప్ప వుంది :) అం వుంది :) రాబోవు కాలమునకు మగడా ఊ , తప్ప ఇంకేమీ మాట్లాడుటకు నీకు హక్కు లేక పోవును అనడానికి నర్మగర్భ సూచన వుంది :)
ఇట్లాగే అయ్యరు వారికే మేము టోకరా వేసి బుట్టలో పడేసాము ఆ కథా కమామీషు జిలేబి బుట్టోపాఖ్యానములో గలదు :)
ఇట్లు
బామ్మ
జిలేబి
ఊతప్పము దినెనా ఆ
Deleteభూతాధిపు , డందు నెయ్యి పోశావా లే
దా ! తురిమి యల్ల ముల్లియు
మాతా ! కటు పర్చి మిర్చి మండించావా !
Deleteఊతప్పమిదండీ చీ
సూతప్పము రండి రండి శుభ్రము గా మి
ర్చీతో వేసినదండీ
పోతే రా దండి యిదియె పోకడ సుమ్మీ :)
జిలేబి
తప్పము మీరేశారా ?
Deleteతప్ప దనుచు నయ్యరోరు తానేశారా ?
అప్పా ! ముప్పే మొదవద ?
నిప్పు నుదుటి జంగమయ్య నివు రొలికేనా ?
Deleteఎవరేసిననూ క్రెడిటిక
జవరాండ్రులకే ను రాజ ! సత్యంబిదియే
కువకువలాడు జిలేబుల
నెవరెదిరింపగలరయ్య నెమ్మిని సుమ్మీ :)
జిలేబి
கலுவாயி பயணம்
துகாநா பம்த் ஃபார் சம் டேச் :)
மீன்டும் சம்திக்கும் வரை பைபை :)
ஜிலேபி
ReplyDeleteJapan Bechara weds hologram :)
కొందయటన్! హాలో గ్రా
మందమటన్! పెండ్లి యాడె మదిలో నెంచెన్
సుందరి బొమ్మైనను! పా
పం, దినిఁ, గని, శంకరుండు పార్వతి నెంచెన్
https://www.ndtv.com/world-news/2d-characters-cant-cheat-age-or-die-japanese-man-marries-a-hologram-of-hatsune-miku-1945838
జిలేబి
మరే, దానికి తోడు "ఇవన్నీ అమ్మాయే చేసింది, వదిన గారూ" అంటూ ఓ పక్క నుండి అమ్మాయి తల్లి సన్నాయినొక్కులు. బుట్టలో పడేసే కార్యక్రమానికి తన వంతు సహాయం అన్నమాట 😈.
ReplyDelete
Deleteకాదా మరి :) ఇంతా అయ్యాక పెండ్లయ్యాక అయ్యరు గారి చేతికి గరిటందింవేసి మనం కందం బందంబని టైంపాస్ చేసేసుకోవడమే :)
జిలేబి
మీ కందాబచ్చలి కూర మ్రింగుట కష్టమా
Deleteమీ కందపద్యాలు వినుట మిక్కిలి కష్టమా
ఏ కష్ట మెటువంటిదొ యెవ్వరి కెఱుక
లోక మెంత గిలగిలొ మీకే మెఱుక
Deleteఅది మీప్రాబ్లెమయా మా
సొదల నెవరు చదువమనిరి సొబగుల రాయా
కదనంబుల కందము మా
సదనంబున వేసి వేసి చంపెద మయ్యా :)
జిలేబి
ReplyDeleteకర్కంధువునకు దిగకోయ్!
మర్కటు డే చొక్కునీరు మత్తున పల్కన్
తర్కంబదేల నొప్పును
మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్!
జిలేబి
ReplyDeleteఆర్కాడు నవాబడుగన్,
బర్కత్ఖాను కథనల్లె పద్ధతి గానన్
తుర్కీ దేశంబున నా
మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్!
జిలేబి
ReplyDeleteశర్కరన మృకండు బడసె
మార్కండేయుని కొడుకుగ, మారుతి పుట్టెన్,
నర్కుని కెడ వేదంబును
తర్కపు శాస్త్రములనేర్చె తరుణి జిలేబీ :)
శర్కరన - చక్కెర లాంటి
శర్కర - చక్కెర :)
శర్కరి - కలము :)
జిలేబి
ReplyDeleteచిని చిన్ని కోరికలవే
ల!నన్నయామాత్యునివలె లక్షణముగ పే
రును పొందవలెను మరుజ
న్మని మీరు ప్రభాకర యవనాశ్వ కవీశా :)
జిలేబి
ReplyDeleteఅరె! చెల్లు బాకి కథలో
నరరే మరువక జిలేబినట తలచిరిగా
దె! రమణి తెలుపుము నీవు నె
నరుల గురువులకు మదిమది ననతేనియలన్
జిలేబి
ReplyDeleteలోకము పలురకములు గా
దే కంజముఖీ జిలేబి దేనికదే సూ
నీకు తగినట్లది నడువ
దే! కాస్తైనా విషయము తెలుసుకొన తగున్
జిలేబి
ReplyDeleteకలవంటనెల్లెడల ఓ
జిలేబి సర్వోపగతివి చింకకనుల లే
మ!లలన! గురువులకు తెలుపు
సలాము నెనరుల శుభాంగి శర్కరి భామా :)
జిలేబి
ReplyDeleteఅణుకులు కవీశులనఘా
చెణుకుల పదముల చమక్కు చేవలతిగ నా
గణముల ప్రాస యతులతో
రణములె కద పండితులకు రమ్యక్రీడల్!
జిలేబి
ReplyDeleteఓ రామచంద్ర ! రారా!
యేరాలమ్ముగ జిలేబులే వేసిరయా
సారంబొప్పారుచు సీ
తారామా లక్ష్మణ సహితమ్ముగ రారా !
జిలేబి
ReplyDeleteవచ్చె నీశునాన పక్కన చచ్చెను
కబళ మునట సన్నికర్షణమున
గాన గా జిలేబి, గట్టిగ నాయలిం
బకమునుఁ గబళించు బల్లిఁ గనుము!
జిలేబి
ReplyDeleteతహతహ లాడుచు నెల్లరి
ని హటాత్తుగ తాకుచుండు నేర్పులు తోడై
యహముల్ జిలేబి మదిని న
సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్!
జిలేబి
ReplyDeleteఅమ్మా ! నీహారిక! రా
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్,
చెమ్మగిలిన కన్నుల, పతి
తిమ్మని కి శుభాంగి కమ్మతెమ్మర గానన్!
బస్తీ మే సవాల్
జిలేబి పరార్
జిలేబి
ReplyDeleteకూతు- వీధి భాగవతము :)
కూతు లో అప్పుడప్పుడు డోల్బీ ఎఫెక్ట్ కోసం శాకినీ డా కి నీ లను పిలిచే తండ్రి :)
అమ్మా కర్ణపిశాచీ
రమ్మా యని పిలిచెను నిశి రాత్రిని రాలే
దమ్మ! వటయక్షిణీ రా
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ 'గూఁతున్'
ఈపేర్లెక్కడివంటే నాకు తెలియవు :)
జిలేబి
ReplyDeleteనిన్నటి కందం :)
అమ్మడి మగడా రారా
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్
చెమ్మగిలినకన్నులతో
తిమ్మా రావు సరసన్ సతిగ నిలుపనటన్
జిలేబి
ReplyDeleteలాహిరి లాహిరి లాహిరి లో ...
రసపట్డున భగ్నము కూడదు :)
ఆ రుచి తెలియని వారెవ
రో? రస పట్టున పదిలుడు రుంకము గనడ
మ్మా! రతగురువయ్యేడు క
దా! రుక్మిణి! ఆరుమూడు తప్పు! పదపదా!
జిలేబి
ReplyDeleteఅహనా పెళ్ళియట! పదిగు
డహహో లక్ష్మణకుమారుడట!మూడును పో
తహతహ, నేడుగడయు వెలు
గు, హడల గా నారుమూడగును పెండ్లియు పో!
జిలేబి
ReplyDeleteఆ పని చేయడ మిష్టము
లే!పద! పదవే జిలేబి లేమా పదవే
మా పలుకుల వినరెందుక
నో పండితులకటకట! వినోదయ చిత్తమ్ :)
జిలేబి
ReplyDeleteచెప్పారు కాదు ! లింక్ ప్లీజ్!
చప్పున తెలుపండి మాకు చాంద్నీ బ్లాగున్
టప్పున వేసెద మయ్యా
తప్పని సరిగా కమింట్ల తాకుచు నిపుడే !
జిలేబి
ReplyDeleteశ్యామా చూడండయ్యా
శ్రీ మాచనవరు సమస్య శీఘ్రము గానన్
యేమార్చుచుండెను జిలే
బీ మామియు జెర్రి వెర్రి విపరీతముగన్
జిలేబి
ReplyDeleteయా అల్లా!
అల్లా! యేమందునయా
సల్లాపముల నిను మరచి సాగించితినే
నుల్లాసముగా బతుకును
చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్!
జిలేబి
ReplyDeleteసత్యము పలుక వలె నమ్మ సరసి, కాని
సత్య మైన నప్రియమును సాటి వారి
మేలు కొరకు తెలుపక జమిడిగ నైన
మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును!
జిలేబి
ReplyDeleteజగదాంబయ? జడదారియ?
జగత్కిలాడియకొ? రమణి సరస రమణుడో?
మగరాయుడకొ మగువయకొ?
భగినియ? భ్రాతయ? జిలేబి వాస్తవ మేదో ?
జిలేబి
ReplyDeleteకనబడదసలే ! వుందో
మన కసలే తెలియదయ్య మహిని జిలేబీ !
తను తిరుగుచుండు గిరగిర
మనమున్ భళి తిరుగుచుంటి మయ్య గిరగరన్ :)
జిలేబి
ReplyDeleteకుక్కకు దొరుకగ ముక్కయు
టక్కున వంతెను పయి చని ఠారెత్తెను తా
నక్కడ నీటిని కుక్కను
ముక్కనుగని మొరుగ నోటి ముక్కయు పాయెన్ :)
జిలేబి
ReplyDeleteచోద్యము కాదె కవివరా!
విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్?
పద్యపు పూరణ కై తగు
నద్యత్వపుకాలమునకు నప్పదు సుమ్మీ !
జిలేబి
ReplyDeleteమెల్లగ మార్ద్వీకమ్మను
కల్లున, ప్రియమగు సురభిని కల్యపు మధువై
సల్లాపముల కుకభమను
చల్లని నీరమున నొడలు సర్వముగాలెన్ :)
నారదా!
జిలేబి
ReplyDeleteవిద్యలవేల మనకనకు !
విద్యను నేర్వని మనుజులు వింతపశువులౌ!
మద్యము గైకొని యంటివొ
విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్?
జిలేబి
ReplyDeleteకందమునకు నీవే యర
విందా! పర్యాయపదము, వెణద జిలేబీ!
బిందాసుగనల్లుము మా
కందమ్ముల నను దినమ్ము కలశస్తనియా!
జిలేబి
ReplyDeleteఅనిరే బ్లాగ్లోకమ్మున
జనాళి మాకందములవి చవులూరగతా
మనిరే చూడగ విరివిగ
కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్!
:)
జిలేబి
ReplyDeleteచైనా సామెత యేనం
డీ నరులకు నేర్పదగు వడిగ పట్టుట నె
ట్లోన, నెటులన నరసరా
యా! నేడు వలయును సూవె యందరు నేర్వన్
జిలేబి
ReplyDeleteపిల్లియన బిడాలమనెడు
లొల్లి వలెకలదు జిలేబి లుకలుక పద్యం
బల్లిన విధము సుమా! కవు
లెల్లరె లాతాళిరో బలియగుచు నరరే !
జిలేబి
ReplyDeleteకల్పవృక్షము రామాయణము
మునిగిరి రాముని నామ
మ్మున తనరుచు కల్పవృక్షమున నా సీత
మ్మను మదిని గొలుచుచు భళా
కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్!
జిలేబి
ReplyDeleteపజ్జాల కర్థము తెలియక బిక్కమొగాలతో జన సందోహమ్ము :)
అనఘా! జనాళి సభలో
కనిపించిరి కోఁతుల వలెఁ, గవివరు లెల్లన్,
ధనధనమని పద్యమ్ముల
తనరుచు పాడగ, తెలియక తాత్పర్యములన్!
జిలేబి
ReplyDeleteచంద్రశేఖరుడు గురువులకు వందనము చేసినప్పుడు తెలుగు మహాసభలలో
అణకువగ చంద్రశేఖరు,
తన గురువుకు వందనమిడ, తాదాత్మ్యతతో
గణగణమని పొగుడుచు భళి
కనిపించిరి కో!, తుల వలెఁ, గవివరు లెల్లన్!
కో!- హుర్రే
తుల వలె- తులారాశివలె
ముఖ్యగమనిక-
ఈ విరుపు లేకుండా మీరు చదివి వేరే లా అర్థం చేసుకుంటే జిలేబి పూచీలేదు
అరసున్న హుష్ కాకి :)
జిలేబి
ReplyDeleteఅల సైరంధ్రి నెవరినయ
పిలిచె? వలచితినని నెవడు భీతిని గొల్పెన్ ?
అలవోకగ భీముడతని?
వలలునిఁ; గీచకుఁడు; సంపెఁ బటు విక్రమునన్!
జిలేబి
ReplyDeleteరాయల వారి పదమ్ముల
పాయలు పాయలుగ పాంగ్సువా తీరమునన్
ఛాయాచిత్రంబుగ వై
వీయారుని లకుముకులవి వీక్షింపుడయా :)
జిలేబి
ReplyDeleteరాయల వారి పదమ్ముల
పాయలు పాయలుగ పాంగ్సువా తీరమునన్
ఛాయాచిత్రంబుగ వై
వీయారు లకిమికరంపు పిట్టలివి సుమా!
జిలేబి
ReplyDeleteకల్ల బొల్లి మాటలనెడు కలువకంటి
తేటగీతిలో పదముల తెక్కరముగ
చేర్చి పద్దియ మల్లెను, చేవలేని
నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె!
జిలేబి పద్దియము :)
జిలేబి
ReplyDeleteఅరరె! వేదముల దునిమి యరరె యర్థ
ములను లాగుచుండిరచట మూల మేమి
టన్నది తెలియక యరరె టంకుతనపు
చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె!
జిలేబి
ReplyDeleteనేటి కత - కన్యాశుల్కము :)
అన్యాపదేశముగ నా
కన్యాశుల్కమని చెప్ప గా నొప్పుకొనన్
పన్యారమువలె మొత్తము
విన్యాసముగ తెలిసిన వివేకిని బాబూ :)
జిలేబి
ReplyDeleteఅన్యాపదేశముగ నా
కన్యాశుల్కమని చెప్ప గా నొప్పుకొనన్
పన్యారమువలె మొత్తము
విన్యాసముగా తెలిసిన "వినరా" ని సుమా :)
జిలేబి
ReplyDeleteఆహా!పల్లె ప్రపంచము
లో హాహాకారముమొదలు ! భళిభళి భళీ
బాహులమున కాజ్యముతో
స్వాహా మంత్రము జపింప సఖుడా రావోయ్ :)
జిలేబి
ReplyDeleteఆడుకొనిరమ్మ పద్మా
యాడుకొనిరె పదములకు సయాటలు తోడై
వేడిని కల్గించె సుమా
పోడిమి యున్న రమణీయపు సరసి వీవే :)
జిలేబి
ReplyDeleteచదువంగ రాదు వేదము
చదువంగను రాదకో విచారము లన్ చే
యదగని వారమకో మే
ము?దుంప తెగుర హరిబాబు ముందర చెప్మా :)
జిలేబి
ReplyDeleteవెతికితి పేజీ పేజీ
ల తిప్పుచు కనబడలే కొలవెరి పదముల
య్య తరచి తరచియు జూడ ఫ
లితమ్ము కనరాదు సూవె లింకూ నో యూజ్ :)
జిలేబి
ReplyDeleteపతి! పతి! పాతి! పతి! జిలే
బి తిరగలిని తిప్పి మగడు భీతిగొనెడు రీ
తి తరుణి గొల్వగ నీ యా
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్:)
జిలేబి
ReplyDeleteకాశ్మీరంబు మనకు మఖ
వాశ్మము మన కుఱగలిని నుపశమిల్లక తా
నాశ్మంతంబాయెనయా
కాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్?
జిలేబి
ReplyDeleteపతి మూలాధారమున ! సు
మతి, స్వాధిష్టానపు పతి, మణిపూరకమం
దతడె యనాహతమున ! నా
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!
***
పతియతడె విశుద్ధిని ప
ద్ధతిగా భృకుటిని సహస్ర దళ కమలములో
సతి శక్తి గా పతి శివుడు!
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!
***
సతి బ్రహ్మరంధ్రమును దా
టి త్రికూటమ్ములను దాటి టిక్కిని దాటన్
పతి పెంజీకటి కావల!
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!
జిలేబి
ReplyDeleteపతి గణపతి! పతి బ్రహ్మయు
పతి విష్ణువు! పతి శివుండు! పతిజీవాత్మన్
పతి పరమాత్మ! జిలేబీ!
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!
***
సతి శాకిని!సతి కాకిని
సతి లాకిని! రాకిని సతి! సతి ఢాకిని మేల్
సతి హాకిని! మూలంబగు
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!
***
సతి రక్తము! పతి పీతము
సతి నీలము! పతి యరుణము సతి ధూమ్రమగున్
పతి విద్యుత్కర్పూరము!
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!
జిలేబి
ReplyDeleteనాది శ్రుత పాండితి సుమా
యేదో బావుందని కథ యింకొంచెము రా
జా దన్నుగ నే లాగితి;
సాదరముగ వందనమయ సరదిద్దిరిగా :)
జిలేబి
ReplyDeleteహరి బాబూ! సందేహము
ను రయము గా దీర్చ రమ్మ నొక్కింతైనన్
నరసింహారావుల్ వే
చిరయ్య నాత్రుతన స్వామి చింతావృతుడై !
జిలేబి
బహుశః హరిబాబు గారు ఇతరత్రా బిజీగా ఉండుంటారు “జిలేబి” గారూ.
Deleteఏమైనప్పటికీ, వారు చెప్పిన దానికి సోర్స్ రిఫరెన్స్ ఇచ్చిన తరువాతనే వారి స్టేట్మెంటును పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది ... నా మటుకు.
ReplyDeleteబంగ్లా వాడా టాగూ
రాంగ్లంబున వ్రాసెఁ, బోతనార్యుండు కృతిన్
జంగ్లి తెలుగున; విరివిగా
చాంగ్లా గీతాంజలియె ప్రచారంబాయెన్ !
జిలేబి
ReplyDeleteపొరపాటును మా దృష్టికి
సరియై నసమయములోన చక్కగ తెల్పన్
సరిచేసెదమయ సవరణ
గ రయమున నిపుడె నెనరులు కామింటునకున్!
జిలేబి
ReplyDeleteఏతా వాతా తల్లికి
తా తమ్ముడయే! తనకు రతగురువు! ధవుడా !
మాతా మహుని యనుంగగు
పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్!
జిలేబి
సంయుతాసంయుత ప్రాస :)
ReplyDeleteక్షత్రియుడా! శ్రీ దశరథ
పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె, మగనిన్
చిత్రము గా ముదముగ వై
చిత్రిగ సంచలనమైన చిత్రము లోనన్ !
జిలేబి
ReplyDeleteఒక సందేహంబయ! స
న్ని కల్లుని శివునిగ కొల్చు నీమము గలదే
యిక దానిని తొక్కుటదే
ల? కాస్త వివరము తెలుపుడి లబ్జుగ నరయన్!
జిలేబి
ReplyDeleteఅరె! సన్నికల్లు పార్వతి
కరె, పొత్రంబగు ప్రతీకగ శివుని కయ్యా
యిరువురు నొకరికి యొకరగు
దురయా జీవితములో కుదురుగన్ వైవీ :)
జిలేబి
ReplyDeleteనరసన్నా మాగోజీ
పురోహితుల బ్రహ్మయని యెపుడు పిలిచెద మా
దరముగ! జిలేబులగుచున్
పురోగతికి వారె గాద భూరిగ కోపౌ :)
జిలేబి
ReplyDeleteహృదయపు రాగమ్ముల కౌ
ముది పిండిగచేయు నమ్మ ముద్దుల గుమ్మా
ముదనష్టపు జలపాతం
బది పద్మార్పిత ! జిలేబి పలుకుల కొమ్మా :)
జిలేబి
నేనూ చాలాకాలం తూగోజీలో నివసించినవాడినే, ప్రజలతో అనుబంధం ఉన్నవాడినే "జిలేబి" గారూ. ఆ సాంప్రదాయం గురించి నాకేమీ సందేహం లేదు కావున "నరసన్నా" అనుకుంటూ దాన్ని గురించి నాకు చెప్పకండి.
ReplyDelete
Deleteఅబ్బే ఆ మాటలు నావికావండి
కొట్టుకొచ్చినవంతేను :(
జిలేబి