Monday, July 15, 2019

చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ జై :)



చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ జై :)
 
 
 
"స్వామీ మిత్రత్వ వచస్శ్రీయుత చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ " ఓ భక్త పరమాణువు ఊపందు కున్నాడు !
 
మరో భక్తుడు జై జై జై అంటూ నినాదాలిచ్చేడు!
 
దాంతో భక్త పరమాణువుల సంఘం జోషందు కుంది.
 
ఆ పవిత్ర కృష్ణా తీరాన ఆకాశం దద్దరిల్లింది !
 
ఇరు రాజ్యాల రాజులతో మహా పొత్తు గల్గి స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్న నానుడి కి ప్రతీక గా ,  మారు పేరుగా మిత్రత్వ బిరుదాంకితు లైన స్వామీ జీ తమ రఫ్ పెప్పర్ గెడ్డం తడి మేరు !
 
అనుగ్రహ సంభాషణం మొదలెట్టి నారు !
 
జనాలు తండోప తండంబులు గా వేంచేసి ఉన్నారు ! ఇవ్వాళ మీ కందరికీ జిలేబీ ప్రసాదం గా అంబాళ్ కు  నైవేద్యంగా సమర్పించు కున్న ఖీరు తో బాటు స్వీకరించి గాని మీరు వెళ్ళ కూడదని "కట్టళై " పెట్టి నారు స్వామీ వారు !
 
వారి పరమానంద శిష్యుడు మరో మారు ఊపందు కున్నాడు ! జై బోలో స్వామీ ....
 
వారు చతురులు ! ప్రస్తుతం రేపటి నుంచి చాతుర్మాస్య వ్రతం లోకి వెళ్ళ బోతున్నారు ! అందుకే "చాటురా" నందా బిరుదాంకితు లై , భక్త జన సందోహం చేత 'చతుర' స్వామీ జీ గా పేరు గడించినారు !
 
ఎక్కువ గా ఆయాసం ఆయన్ని పట్టి పీడించేది ! అదిన్నూ పాయసం తాగేక మరీ ఎక్కువయ్యేది ! దాంతో వారు బెనారెస్సు కెళ్ళి పాయసాన్ని త్యజించినారు ! అప్పటి నుంచి వారికి పాయసానంద బిరుదు కూడా దక్కింది !
 
 
వారి మాటే ఒక వినోదం! వారు మహా వినోదానందులు ! ఆనందం ఫాస్టు ఫుడ్డేతి వ్యాజనాత్ అని వారి ఆశ్రమం  ఛాయలలో జిలేబీ  ఫాస్టు ఫుడ్డు స్టాల్  ప్రముఖ స్థానం కల్పించి వినోదానంద స్వామీ బిరుదును గాంచి నారు !
 
 
ఇట్లా ఎన్నెనో బిరుదులు గలిగిన మా స్వామీ వారికి, పాతకులారా ! సారీ,  పాట(ఒత్తు ట) కులారా ! చదువరులారా ! మీరు కూడా ఓ మారు జై కొట్టు డీ !
 
స్వామీ మిత్రత్వ వచస్ శ్రీయుత చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ !
 
జై
జై జై
జై జై జై !
 
 
 
చీర్స్
 
జిలేబి
 

13 comments:

  1. ఏవిటో "జిలేబి" గారు, ఒకరొకరు బ్లాగులకు దూరంగా జరుగుతున్నట్లున్నారు. లేటెస్ట్ గా శర్మ గారు తన "కష్టేఫలి" బ్లాగ్‌స్పాట్‌లో వ్యాఖ్యల పెట్టె తీసివేశారు.

    దురదృష్తకరం :(

    ReplyDelete


  2. మా యాంధ్రా బ్యాంకరరే
    మాయంబగు కాలగతిని మా కోడలె తా
    చేయూత నివ్వగ జిలే
    బీ! యీ మాంద్యమిక హెచ్చి వేరూనునకో ?


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రులకు బ్యాంక్ కూడా మిగలలేదు చివరికి ఆంధ్రరాష్ట్రాన్ని బట్టలిప్పి వీధిలో నిలబెట్టారన్నమాట.😟

      Delete
    2. వీలు వెంబడి ఆంధ్రా జిల్లాలను ప్రక్క రాష్ట్రాల్లో విలీనం చేస్తే పీడా పోతుంది.

      Delete
    3. స్టేట్ బాంక్ అఫ్ హైదరాబాదు, మైసూర్ వగైరాలు విలీనం అయినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పినట్టు లేదు.

      Wahre andhrawale tussi great ho!

      Delete
    4. మీరెందుకు మాట్లాడలేదు? ఎస్.బి.హెచ్. గురించి "అభ్యంతరం" చెబితే గిబితే మీరే చెప్పాల్సి ఉండింది.

      Delete

    5. అబ్బే సేటుబ్యాంకు స్టేటు బ్యాంకు కాదండి :)
      అది సెంట్రలోరిది :)



      జిలేబి

      Delete
    6. గురువు గారూ, ఆర్ధిక విధాన నిర్ణయాన్ని ఆ కోణంలోనే చూడాలి కనుక ఎవరూ మనోభావాలు గట్రా ఇతరత్రా విషయాలతో అభ్యంతరం చెప్పలేదు. Let us analyze & criticize fiscal policy decisions on economic grounds instead of dragging in extraneous unrelated points.

      మొగుడు కొట్టినందుకు కాదు ఏరాలు నవ్వినందుకు అన్నట్టు బాంక్ అఫ్ మహారాష్ట్ర రద్దు కాలేదని కొందరు "ఆంధ్ర వీరులు" సామాజిక మాధ్యమాలలో తెగ ఆయాస పడుతున్నారు!

      Delete


    7. ఆర్థిక విధాన నిర్ణయ
      మర్థించెదనయ దరిసన మావిధముగనే
      స్వార్థమ్ములేవి లేకన్
      పార్థక్యపు పల్కు వీడి పఱచుడి రాయా!



      జిలేబి

      Delete
    8. ఎస్ బి హెచ్ బాయె నిజాముదీ
      ఆంధ్ర బ్యాంకు బాయె పట్టాభిదీ
      ☹️

      Delete


  3. పీడా విరుగడవునికన్
    తోడై జిల్లాల కూడ "తుండుల" జేయన్
    జాడయులేక కలుపగా
    జోడుగ సరిహద్దు వారి తోడు జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete