తేనెటీగలు - చెట్టు బుగ్గలు
=================
ఏవో వాక్యాల తేనెటీగలు
పెదవుల మీద ఎగురుతుండగా
ఓ సౌందర్య మూర్తి
అద్దంలో మునిగింది స్నానం చేద్దామని
వెనక నేను కవిత్వం మీటుతున్నా
హృదయంలోకి స్నానం చేద్దామని
***
చెట్టు బుగ్గలు పూరించి రెండు శాఖలతో
ఓ పువ్వు పుచ్చుకుని
షహనాయీ వూదుతోంది
ఒక్క రాగం విసిరేసి బుల్ బుల్
తోటనంతా తన చిన్ని రెక్కల మీద
ఎగరేసుకు పోయింది !
***
శేషేంద్ర
శేషేంద్ర జాలం
ఆంధ్రప్రభ వార పత్రిక
07- Aug-1985.
ReplyDeleteనల్లకలువల అందాన్ని
కొల్లగొట్టిన కళ్ళు
దొండపండు ఎర్రదనాన్ని
దోచుకున్న పెదవులు
ముత్యాల ముక్కెర ముక్కు
వంకర ముంగురుల టెక్కు
నల్లని నూగారు నిక్కూ
పిడికెడైన నడుము తక్కూ
ఎదలో సన్నాయి నొక్కూ
రాసిన రోమియో ఎవరో తెలియదు :)
పక్వానికి వచ్చి ఇప్పుడేమి తిండాట్టముల పడుతున్నాడో :)
జిలేబి
ReplyDeleteబామ్మా జిలేబి తమరే
లేమ్మా ఆ తీపి మాకు లెస్సగ తెలుసోయ్
గుమ్మాలెంబడి తిరుగుచు
చుమ్మా చుమ్మా కమింట్ల షూ షూ అంటవ్ !
జిలేబి
ReplyDeleteపైట తీసి పరుపు వార్చినీ పొంగుకు
మావ వేగు చుంటి మంచి మగడ
రార దరిని రమ్మ రాసకేళి రసమ
యంపు వేళ పద్మ యామిలముగ!
రామ రామ ఇదేమి తెగింపు పద్మా!
జిలేబి
ReplyDeleteఅరయగ తప్పనిదగు నా
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
తరలిక కష్టమ్ములపడ
క, రోగములులేక పోవ కాటికి సుమ్మీ
జిలేబి
ReplyDeleteతరుగుట తప్పదా కలిమి దారిని పుట్టిన వారికిన్, సఖీ
యరయగ తప్పదమ్మి నరులా సుడుగాడుకు బోవ తీరగన్
తరలిక, భోగభాగ్యముల దందడి! రోగపు లేమితోడుతన్
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై!
జిలేబి
ReplyDeleteఅరకొర తెలివిడి వలదని
మరణమ్మును, గోరుకొంద్రు మానవులెల్లన్
చిరకాలమ్ము బతుకగా!
పరమార్థకవి పలికె సెలవా మరణమ్మే!
***
పరుగిడి కోరుకొనుమ యొరి
మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
సరియైనదికాదది విను
మ! రణమ్మును గోరుచుట్టు మచ్చుగనుమికన్!
***
పరుగుపరుగుల నెపుడు ధన
ము రొప్పుచు ములుగును చూచి ముచ్చటపడుచున్
పరపతి తోడుత గొప్పగ
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
***
సరిసరి జిలేబి కోరకు
మరణమ్మును! గోరుకొంద్రు మానవులెల్లన్
జరలేని బతుకు! కోరుకొ
ను రవంతయు నీవదియె మనుగడయె సాగన్!
***
యోగవాశిష్టము
"మరిమని" వశిష్టుడనె, "రా
మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
శరణాగతి జీవితమున
నరయగ మేలగునయా వినాశమ్మీగన్"!
***
పరిపరి విధముల కోరిక
ల రహస్యముగ తలదాల్చి లాభము కొరకై
పొర కనుల కట్టగా కా
మ రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
***
అరె ప్రెసిడెంటవగ, యొబా
మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
నెరపితి వీవెగ శాంతిని!
పరిగ్రహించుకొనుమింక ప్రైజిదె నోబెల్!
***
ప్రత్యక్ష ప్రమాణము - మిలాల్ :) వుంటే వద్దంటామా ? :)
అరె! ణిసిధాత్వర్థముగా
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
పరమాత్మునికొలువందు క
లరూపు తధ్యమనగా! మిలాల్ లేదు కదా:)
***
జీపీయెస్ వారి మరియు యితర కవుల ఐఫోను ఆండ్రాయిడు ఫోనుల కంకితము :)
విరివిగ పొద్దుపొడువ శం
కరాభరణమందు విడువక టకాల్మనుచున్
చరవాణి నొక్కి కైపద
మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
***
నరకమ్మె లేదు! స్వర్గం
బరయగ తధ్యము జనాళి ప్రభువుని చేరం
గ రయము రారండన సం
స్మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
***
Modi no to RCEP agreement signing
అరె! ఆర్. సి.ఇ.పి.వలదయ
త్వరితము చైనా దినుసులు తలమించునికన్
విరివిగ! దేశపు వృద్ధికి
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్?
***
దొరలుచు దుముకుచు కాదం
బరి కౌగిలిని కరుగుచు సఫలమనుకొనుచున్
మురుగప్పా వైన్సు కెడని
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
***
మురుకులు జిలేబి లడ్డులు
కరకర యంచు నములుచు ప్రకాశము గా వీ
రరసమ్మిదె యనుకొనుచున్
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
జిలేబి
తెరువంగనె కనులు , నులిమి
ReplyDeleteమరి మరి చూడంగ గంటి మాలికలోనన్ ,
హరి ! హరి ! యీ యేడ్పేమిటి ?
' మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్ '
Deleteసరిసరి హితుడా మాకవి
వరుడా! కనులకు పనులిక వలదయ్య మరీ
ను!రవంత "శంకరుని" సం
స్మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
నారాయణ :)
జిలేబి
వర ' రాజా ' వినుత ! వినుడు ,
Deleteపరమాత్మను వదలి , పతిత పండిత సేవన్
యెరుక గలవారు నడువరు ,
సరి బోలునె కుటజ సుమము సరసీ రుహమున్ ?
Deleteపరమాత్మ వేరు జనులిక
మరివేరని భావన మన మది లోనేల
న్న! రుచియునరుచియు వేర్వే
రరయంగ పదార్థమొకటె రాజా వినుతా!
నారదా!
జిలేబి
' అందాల రేలు ' ఖండిక
Deleteవిందుగ నిరవొంద నొకటి వెలయించితి , ఆ
విందారగించి , యటువలె
పొందుగ నందాల రచన బొనరించు , హితా !
ReplyDeleteహరోంహర !
వరలెడు త్రిశూలమలరగ
హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా
హరిహస్తమందు! శిక్షిం
చు రావడి సలుపు కఱటుల చువ్వన నెపుడున్!
జిలేబి
ReplyDelete"హరిహరులందు భేదము మహాశయ లేదు సుమీ" హితుండనన్
వరలెడు కైపదమ్మును సవాలుగ వేయుచు నేర్పు తోడుతన్
"సరె! హితుడా!సమస్యయిదె! చక్కగ నింపుము" శంకరుండనెన్
"హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"
జిలేబి
ReplyDeleteహరి! విష్ణువు! శ్రీపతి! అ
క్షరుడు!అనంతుడు!కపిలుడు!కమలాక్షుడు! పు
ష్కరనాభుడు!భరిమ!మనో
హరుని కరము నందు చక్ర మలరారు గదా
జిలేబి
ReplyDeleteతతియై సంతతి వృద్ధికి
రతి మూలము, సర్వధర్మ రక్షణ కొఱకై
మతి మూలము!పరమాత్ముని
స్థితి మూలము మన మనుగడ తిరముపడుటకున్!
జిలేబి
ReplyDeleteసతియే మూలము గేస్తుడన్ని విధులన్ సాధింప సం పూర్తిగా
తతియై సంతతి వృద్ధిగాన, ధరణిన్ దార్ఢ్యమ్ముతోవెల్గగా
పతి ధర్మమ్మును వీడకన్, గృహిణి చేపట్టై నిధానమ్ముగా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్!
జిలేబి
ReplyDeleteమతి సమ్మతి సన్మతి యభి
రతి, యవిరతి కొఱతలేని ప్రతికర్మముగా
యతికాని విధముగా నను
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!
జిలేబి
ReplyDeleteఅతుకుల బొంతయగు బతుకు
న తరుణి తీరంగ సేద నాకిక దిక్కై
సతియై నావమ్మా భా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!
జిలేబి
ReplyDeleteరతినిర్వేదము పోగొ
ట్టు తెంపుగల స్వాతియే కిటుకుగా వేమూ
రి తెలుగునాట నిలిచె! "గిరి",
"రతి" మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!
నారదా!
జిలేబి
ReplyDeleteసతతము దేవళమందు వి
నుత! పరమాత్ముని కెడన్ తనువు మైమరపున్
స్మృతిని తలపించునా భా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!
జిలేబి
ReplyDeleteమతిపోయిన "జీవుల"కే
రతి మూలము; సర్వధర్మ రక్షణ కొఱకై
మతమేదైనను విదురులు
హితమును కోరెదరు ప్రజలహీనులు గాకన్!
జిలేబి
ReplyDeleteఅలపద్మహస్త వికసిత
పు లపనసఖి చంద్రముఖి కపురపు పిసాళ
మ్ముల ణిసిధాత్వర్థమ్మున
చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!
నారదా!
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది :)
అలకొలకొల్కియె వలచుట
వలదని త్రోయంగనరె దవదవానలమై
వలపది మీరగ మగనికి
చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!
జిలేబి
ReplyDeleteగాడిదల తోలుకోండ
ర్రా డింగరులార యనుచు ప్రాజ్ఞులు తెల్పం
గా డిగనురుకుల పరుగిడి
గాడిద మాలచ్చి గనిరి కష్టేఫలిగా !
జిలేబి
ReplyDeleteబెంగుళూరు, చెన్నై మార్గమున,8th Nov 2019 రాత్రి పలమనేరు మొగిలి ఘాటు రోడ్డు ఘోర ప్రమాదము
పగిలెను గుండె చూడ జనవాసము దాటుచు ఘాటురోడ్డులో
మొగిలి సమీపమందు వెస మోదగ ట్యాంకరు మారుతిన్ తటా
లు గివురి దారితప్పుచు పెళుక్కున, మాంసము చిమ్మరేగగా
తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్.
నివాళి.
ReplyDeleteతొలగును ముకద్దమాయిక
తెలవారగ; మదిని చట్టు తీవ్రతరముగా
పలుమార్లు నాటి తలపుల
చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!
జిలేబి
ReplyDeleteఅలుకయె తోడు జిలేబులు
కులుకుల సరసమ్ముల రతగురువుల కాల్చన్
తెలుసుకొనవె చెలికాళ్ళకు
చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!
జిలేబి
ReplyDeleteగిజగిజ లాడి మాలికని గీరుచు పద్యమటంచు యత్నముల్
గజగజ కందపద్యమని కట్టుచు పేర్పుడు రాళ్ళ పాదముల్
జజజజ లన్ ఫెడేల్మనుచు ఛందపు రీతులటంచు మోదుటల్!
ప్రజలు దృణీకరించిరఁట పద్యకవిత్వము వద్దటం చయో!
జిలేబి
ReplyDeleteగజిబిజి జిబిజిగ జిజిగన
రె! జిలే బివిడువక తుంటరి పదములట ను
గ్గజ గజ లాడింపంగన్
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే!
జిలేబి
పజిలుల వలె పదముల నస
ReplyDeleteహజముగ పూరించుచు , కవితావేశపు త్రో
వ జిగి బిగి పస గనమిచే ,
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే .
ReplyDeleteమాలోకపు పిచ్చి తెలుగు
బాలాగుల కొరకు రామ పారాయణమున్
గాలికి వదిలి గురుడు బే
లా లెక్కల గణితమునకు లావుగ దిగె పో :)
నారదా!
జిలేబి
ReplyDeleteనిజమిదె!పత్రికల చదువ
ప్రజలెల్లరు రోసిరయ్యొ! పద్యమ్ములనే
సుజనులు వెలయింపంగ స
హజముగ చదువ త్వరపడిరి హస్తపు తొడియై!
జిలేబి
ReplyDeleteతన పురమును వీడి దమ్మిడి కొరగాడు
ప్రతిభ లేనివాఁడె, పండితుండు
పేరు గాంచు నెల్ల పేట లందు ధరణి
లోన! విద్యయే ములుగు జిలేబి!
జిలేబి
ReplyDeleteమతమేదైనను సమ్మతిన్ పగటుచున్ మానావ మానమ్ములన్
ప్రతిపక్షమ్ముగ చూచి మట్టముగ నాపాదించి వాగీశుడై
మతితో కూర్పుగ సౌష్టవమ్ము సయి ప్రామాణ్యమ్ములన్ చూపుడ
ప్రతిభా శూన్యుఁడె, మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్!
జిలేబి
ReplyDeleteవాదనలోన జిలేబీ
మాదిరి సాక్ష్యమ్ములే సమంబగు నోయీ
దీదీగిరితగదు సుమీ
సోదాహరణము వలయును సొంఠికరక్కాయ్!
జిలేబి
ReplyDeleteతెలుగు నభివృద్ధి చేయుడి తేనెలూర
ననిన వేళన రరెనొక్క రైన నోరు
విప్పలేదు మౌనము వహించిరి! జిలేబి,
మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు
ననిన వేళని హైరాన హైలెస లెస!
జిలేబి
ReplyDeleteమనుగడ తీరు కైవలయు మా పిల వాండ్లకు దేశమెల్లెడన్
మన బడులందిఁకన్ జదువు; మానుటె యొప్పగు మాతృభాషలో
తనరదు సూవె విద్యయను తప్పగు నమ్మిక! రాజకీయముల్
మనమిక కట్టిపెట్టెదము మన్నిక తోడుత వృద్ధి గాంచగన్!
జిలేబి
ReplyDeleteపనిలేనివారు మండలి
తనూరహమ్మును బెరికిరి తరుణము గానన్
కొనుగోలులేని యంగడి
ని నలుదెసల చూడ దక్కునే ఫలితమ్ముల్!
జిలేబి
ReplyDeleteప్రభువుని బిడ్డల్లారా!
శుభములు లభియించుఁ గాక! చోర విటులకున్
రభటిల్లు రీతి దేవుడు
లభించు సత్యంబు పాపులకు సై ! ఆమెన్!
పరలోకంలో ఉన్న మా యేసు భూ లోకమంతటికి వెలుగు
ఆమెన్!
జిలేబి
ReplyDeleteసభకు జనుల్ జపమ్ములకు సాదరమై తరలండి జెచ్చెరన్!
ప్రభువుని బిడ్డలెల్లరికి భాసిలు కైవడి యేసునాధుడిన్
శుభములు గల్గు గాక! ఖల చోర విటాళికి శిష్టు లౌననన్
నిభముగ దక్కు, నిక్కముగ నెల్లరు పాపులకున్ తరాకుగా!
యేసునాధుడె తీర్థము !
జిలేబి
ReplyDeleteతెలపండీ లెక్కలనిక
ములుగులలో బంగరులకు మూలమ్మేదో!
వలవేసి పట్టెదమికన్
జిలేబులన్ దాచు వార్ని చెండాడి మరీ :)
తాత గారి వద్ద బంగారమెంతుందో ! వామ్మో వామ్మో మనవరాలా గుట్టుగ లాగేయ్ :)
జిలేబి
ReplyDeleteపదిలంబవగా మదిలో
చదివిన దెల్లను విరివిగ సభ్యత తోడై
చదువంగ రాని దానిని
చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్!
జిలేబి
ReplyDeleteకుదురగ మానసమ్ము భళి కూడగ జ్ఞాపక శక్తి, సూక్ష్మముల్,
వదిగొను విద్య లన్ని విరివాఱుచు చెంగట వచ్చి ధాటిగా
పదిలమవంగ నా మదిని వర్ధిలి, కూడని వాటినెప్పుడున్
చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్!
జిలేబి
ReplyDeleteశ్వాసగ మారును భక్తియె
యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్
బాసటగానీవాతని
ప్రాసాదమ్మును బడసి శుభమ్ముల బడయన్!
జిలేబి
ReplyDeleteసెల్ఫ్ డబ్బా జిలేబి
ఔరా యెవ్విధి నమ్ముదు
నౌరౌర! జిలేబి పద్య మంచు! పదునుగా
తారాపథమును చేరెన్
జీరాడు పదముల తోడు సెమ్మెపు కాంతుల్!
జిలేబి
ReplyDeleteగాడిద మాలచ్చి :)
కలయో వైష్ణవమాయయొ
ములుగుని బంగారమెల్ల ముద్దుగ చేరెన్
తలపండిన ఆసామియె
తెలుపగ గర్దభపు పాల తెవ్వను బిజినెస్ :)
జిలేబి
ReplyDeleteకలయో వైష్ణవమాయయొ
తెలిసీ తెలియక జిలేబి తెలుగున నేర్వన్
జల జల రాలెను కందం
బులు పంచదశపు జగమున బుధుల తల తినన్ :)
జిలేబి
ReplyDeleteఅర్మిలి తోడై వేదపు
మర్మము లెల్లతెలుపుచు సమాజహితముగా
పర్ముని నుపయోగించెడ
ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్
జిలేబి
ReplyDeleteరఫేలు తీర్పు తరువాయి ప్రసాద్ ఉవాచ :)
పర్ముని వేటు కోర్టదె నివారణ చూపెను! కాలధర్మమా
ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును! శాంతి సౌఖ్యముల్
నిర్మల మై ప్రభుత్వమును నీతియు న్యాయము తోడు చేయగా
నర్మిలి చూపి మోడివలె నాటని నెక్కొను నిక్క మిద్దియే
జాల్రా
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది ( చదువ బడెనట !)
అర్మిలియే సురక్ష ! వినుడయ్య వినాశము విస్తృతమ్ముగా
ధర్మము వీడు వారలకు తప్పక గల్గును; శాంతి సౌఖ్యముల్
నిర్మల మానసమ్మున పునీతపు చింతన తోడు ప్రేమయే
వర్మము గా సదా జనులు వర్ధిల సల్పగ దక్కు నిక్కమై!
జిలేబి
ReplyDeleteభార్యా విధేయుడాతడు!
భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!
తూర్యపు మంగళనాదము
పర్యాప్తిగ చేరగ చెవి పరితుష్టిగనెన్ :)
జిలేబి
ReplyDeleteవార్యోకమువలె పట్టిన
నార్యుని విడువననెడు నళినాక్షి జిలేబీ!
ఆర్యా! స్వాభావికమే!
భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!
జిలేబి
ReplyDeleteఆర్యా సత్యము పల్కిరి!
భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!
వర్యము! సమస్య యెక్కడ?
ఆర్యకుడ! సమస్య సారసాక్షియె సుమ్మీ !
జిలేబి
ReplyDeleteచర్యాతీతియు సర్వో
పర్యాసీనసమవేతపాదాంగుష్ఠిన్
వర్యముగానాడించెడు
భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!
Its elementary my dear Watson :)
జిలేబి
ReplyDeleteకారణం తాత గారి యోచన సుమా కంది వారు :)
మనుజుని సృష్టి చేసెదను, మాలిని తొంటిని, వాడు కర్తయౌ
నను తలవంగ నెప్పుడు, త్సునామి సమానముగా జిలేబిగా!
మునుగడ తాత యోచన సమున్నత కారణమాయె శంకరా
కనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై!
జిలేబి
ReplyDeleteకొంచెం భయంతో కొంచెం భక్తితో మోడీ పై ఇవ్వాళ్టి ఆంధ్రజ్యోతి కృ.తి. యోపాఖ్యానము :)
ఆర్యా ! కవివర ! కందివ
రార్యా! కొంచెము భయమ్ము, రవ్వంతగనౌ
నార్యా భక్తి! కనుకనే
భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్ :(
జిలేబి
ReplyDeleteకార్యాలయమున సింహము!
పర్యంకమ్మున హిహకము! పదతాడనమే
మర్యాదగతలచునతడు!
భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్
జిలేబి
ReplyDeleteమత్సరముల మత్తుగొనును
కుత్సితుఁడైనట్టివాఁడె, గురువన నొప్పున్
పత్సలము చూపి, విద్యల
వాత్సల్యమున గరిపెడయవారె జిలేబీ
జిలేబి
ReplyDeleteమత్సరముల్ మదిన్ గొనుచు మద్యపు తూగుని బోవ దుష్టుడా
కుత్సితుఁడైన వ్యక్తియె తగున్; గురువై జన సంస్తుతుల్ గొనన్
పత్సలమున్ వినీతులకు వర్ధిల చూపుచు విద్య లన్నిటిన్
వత్సల భావ వీచికల వారికి నేర్పగ నౌత గాదుటే!
జిలేబి
ReplyDeleteఅరయగ ధైర్యము తోడై
మరణమ్మును కదురుకొనుచు మహిమాన్వితుడై
చురుకుగ నుప్పొంగుచు నా
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
జిలేబి
ReplyDeleteఅరయగ సాహసమ్మును సహాయము గాగొని దావరీడుడా
కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో
విరివిగ నూచమట్టుగొని బెట్టుగ చువ్వన ద్రోలి ద్రోహులన్
తిరముగ దేశభద్రతను తీరుగ నిల్పె ప్రభాతవేళలో!
ಜಿಲೇಬಿ
ReplyDeleteఅరరే శకార సాయ
మ్ము రమ్మ కైపద మునే సముచితము పూరిం
ప రవంత జిలేబులమర
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
జిలేబి
ReplyDeleteఎట్లా పూరించాలో తెలియని వాడు రివర్స్ కత్తుల దూసెన్ :)
సరిసరి మీరేమన్నను
సరిసరి యే గురువరా! పసందుగ పూరిం
ప రచయితలు వత్తురు! పరి
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్!
జిలేబి
ReplyDeleteపరిపరి విధముల వేడెను
కరములు లేనట్టివాఁడు, కత్తుల దూసెన్,
శరణుశరణనిన వినకన్,
చరిత్ర హీనుడు క్రమించె సంగరమందున్
జిలేబి
ReplyDeleteమహా" మాయ :) ఎప్పుడు తొలగునో :)
అరె! కాంగ్రెస్సెన్సీపీ
కరములు మేలనగ కంచుకంఠపు టజితుం
డరె యెన్సీపీ నేనని
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
జిలేబి
ReplyDeleteఎట్టెట్టా నీవేమన
నట్టట్టేను! తలయూపి నమ్మకమునకున్
పెట్టని కోటయగుచు ఊ
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్
జిలేబి
ReplyDeleteగుట్టుగ వంటల వండుచు
పట్టుగ తానింట నిలచి పనివాడివలెన్
పట్టమ్మాళ్ మాటకు ఊ
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్ :)
జిలేబి
ReplyDeleteచవటల్ చప్పున పూర్తి చేయు విధమై సాధారణంబైన రీ
తి, వధాన్యుల్ తమ స్థాయి క్రిందిదని వాదింపంగ సందర్భమి
చ్చు విధానమ్ముగ, పూరణమ్ములిక చచ్చుల్గాను తోచంగనా
యవధానమ్ముల నుండరా దనె సమస్యాపూరణం బెన్నడున్!
జిలేబి
ReplyDeleteతాతకు మిత్రుడు కైపద
మాతరుణమున ప్రచురింప మదిమది సరదా
కైతల పూరణ చేయన్
రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై
రాతిరి తాగిం దింకా
ReplyDeleteభ్రాతా ! దిగలేద ? లేక భ్రమ గొన్నావా ,
యే తీరున కనిపించెను ?
రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై"
Deleteవామ్మో :) ఇంత రివర్స్ గేరా :)
దండాలయ్యా దండాలయ్య :)
రాతిరికి ముందు భాస్కరు
డేతా వాతా పడమట డేరా దిగుచుం
డే! తెల వారి, కనుమరుగ
రాతిరి, భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై!
:)
జిలేబి
జిలేబి
ReplyDeleteకోతల కోసి బువ్వగొని గుప్పెడు పాన్పుని పవ్వళింపగా
జోతల చేసి నిద్దురని జోగొని కొంతయె వేళ దాటెనా
రాతిరియందు, భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్
స్తోత్రపు సర్వమూషకము చువ్వన వచ్చెను లెమ్ము మిత్రుడా!
జిలేబి
ReplyDeleteనారదా!
కాతరు లేదా గృహమన?
వేతన మెచ్చట గలదిక వెచ్చము సేయం
గా తెమ్మ తల తినగ సతి
రాతిరి, భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై
జిలేబి
ReplyDeleteప్రశ్న :)
ఓ తరుణీలలామ! విభుఁ డొంటిగ నిన్ విడి కార్యమగ్నుఁడై
చేతము దల్లడిల్లఁ గడచెం గడు దూరము, వాని రాకకై
నీ తనువెల్లఁ గన్నులుగ నిల్చి ప్రతీక్ష నొనర్చుచుంటివా
రాతిరియందు; భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్.
జవాబు :)
లే! తయినాతియై భళి లెస్సగ చెంపను గొట్ట వేచితిన్
రాతిరియందు; భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్
ReplyDeleteఅనమానములేదు సుమా
నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్
పనిలేక యనుదినమ్ము స
దనమున పూరణలచేసి తరియించితినే :)
జిలేబి
ReplyDeleteజట్పటు నేర్వ నాంగ్లమిక చాలిక చేరును! మీదు వారికా
రాట్పడు లెల్ల తీరు! మన రాష్ట్రపు పిల్లలు వృద్ధి గాంతురే
విట్పతి నైతి మార్చెద! సువీజిక గంధము లేని పువ్వుపై
షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్!
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteఈ మానవాత్మలు
ReplyDeleteచల్లని సైకతసీమల కింద, వెచ్చని రాతిబండల కింద,
వేనవేల మైళ్ళు
దిగజారి దిగజారి భూమి పొరల కింద,
జన్మల జన్మల నుండి పేరుకుపోయిన పాతపగలతో,
కుతకుత ఉడుకుతున్న కొత్తపగలతో,
కుట్రలతో, వ్యూహాలతో, రాజకీయాలతో
ఒకేలా కనిపించే అనేక ముఖాలను తగిలించుకుని తిరగటం
దేనికోసం?శాంతి కోసమా!
దారిద్య్రంతో, అజ్ఞానంతో, అనామకుల వలె,
గ్రహాంతరవాసుల వలె,
చీకటిలోకి, గుహలలోకి, ద్వేషంతో
నిలువెల్లా తగలబడిపోతూ,
దుఃఖంతో గుండెలు బాదుకుంటూ,
ఎవరూ లేని ఏకాంతం కోసం
తవ్వుకుంటూ తవ్వుకుంటూ
భూమి కేంద్రం వరకు పోతున్నది
దేనికోసం?
తమ దేహాల్ని ముక్కలుముక్కలు చేసుకుని,
కణాలుగా, పరమాణువులుగా, ఎలెక్ట్రాన్లుగా, ప్రోటాన్లుగా న్యూట్రాన్లుగా విడిపోతూ
నిరంతరం శిధిలమౌతున్నది
దేనికోసం?మోక్షం కోసమా!
Deleteకాదు కాదు కాదు.
బ్లాగులాడుకోటానికోసము .
సత్యం వద
జిలేబి
ReplyDeleteశరషట్పద వృత్తము :)
భలే బాగుంది. నో యతి నో ప్రాసల ఝంఝాటపు ఝంకృతి :)
తెలుగు సీమలో "మొదల్ మురయాగ" జిలేబీయపు శరషట్పద :)
షట్పద మొనరిం
చునొక్కొ ఝంకా
రమ్మున్ జిలేబి శరషట్పద
మిదియె సుమా సుల
భమైనది నేర్వ
గా ప్రాసయతులు లేవు సుమా
ఆహా యెంతహాయి
రాసుకుంటా పోవచ్చు :)
రెండు నాల్గు మాత్రలు
రెండు నాల్గు మాత్రలు
మూడు నాల్గు మాత్రలు ఒక రెండు మాత్రలు :)
రిపీట్ మాడి
జిలేబి
ReplyDeleteకొంచెము తూగుచు, జోగుచు
కొంచెము, జారుచు మరింత కొంచెము మంచెం
బంచున సర్రున నరరే
మంచము క్రిందన్ జొరఁబడె మానధనుండే!
జిలేబి
ReplyDeleteపంచెను లాగి కట్టి తనువంతయు నివ్వెరపాటుతోడుగా
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై
కొంచెము భార్య చిట్టెలుక కొత్తది దూరెను క్రింద పట్టు మా
యంచును పెట్టగాపనిని హద్దరి బన్న విశేష మిద్దియే!
జిలేబి
ReplyDeleteశరషట్పద వృత్తము
మంచము క్రిందన్
జొరఁబడె మానధ
నుండే చిట్టెలుకను బట్టన్
పెండ్లాము జిలే
బి యానగా భీ
తిలి జలదరింపుల తోడుగా!
జిలేబి
పిట్ట కొంచెము కూత గొప్ప :)
శర షట్పద పద్య లక్షణములు
జాతి(షట్పదలు) రకానికి చెందినది
4 నుండి 14 అక్షరములు ఉండును.
6 పాదములు ఉండును.
ప్రాస నియమం లేదు
గణ లక్షణాలు :
ఒకటవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
రెండవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
మూడవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
నాలుగవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
ఇదవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
ఆరవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
***
ఆహా యెంతహాయి
రాసుకుంటా పోవచ్చు :)
రెండు నాల్గు మాత్రలు
రెండు నాల్గు మాత్రలు
మూడు నాల్గు మాత్రలు ఒక రెండు మాత్రలు :)
రిపీట్ మాడి
ప్రాస యతుల ఝంఝాటము లేదోయ్ :)
జిలేబి
శర షట్పద పద్య లక్షణములు
ReplyDeleteజాతి(షట్పదలు) రకానికి చెందినది
4 నుండి 14 అక్షరములు ఉండును.
6 పాదములు ఉండును.
ప్రాస నియమం లేదు
గణ లక్షణాలు :
''''ఒకటవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
రెండవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
మూడవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.''''
నాలుగవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
ఇదవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
ఆరవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
Explain matter in inverted comas
ReplyDeleteకష్టేఫలి శ
ర్మ గారు ఉదాహ
రణ యిదియె తెలుసు కొనుడీ సార్
పిల్లి అంటే బిడాలం అన్నట్టుంది
Delete
Deleteపిల్లి అనగా బి
డాలమ నినట్టు
కలదండి జిలేబీ గారూ
జిలేబి
సూత్రం వివరిం చ
Deleteవమ్మా యనగ వి
నక ఇదేమి రచ్చ జిలేబీ
Deleteసూత్రం వివరిం
చవమ్మ యనగ వి
నక రచ్చ యిదేమి జిలేబీ
:)
జిలేబి
Deleteఅబ్బా! ఉదాహరణ లు
కాదు యిలా ఏందుకు మార్చాలో
చెప్పాలి అదిగడా వివరణ.
Deleteకొంటె డవిలాగు
లను వ్రాయడాని
కైతే మరీను వేగమ్మే
Deleteకాస్తా కూస్తా
కంపిది కాదం
డీ ముక్కులు బద్దలయేటం
తటి కంపు సుమా
ఏపి పొలిటిక్కు
చూడన్ కళ్లు తిరిగె నండీ :)
Deleteతమరూ గురువులే :)
ఆకలేస్తే రోకలి మింగండి
వివరించవమ్మా కొంటే జిలేబీ
Deleteఅబ్బా! ఉదాహ
రణలేల? యిలా
ఏందుకు మార్చాలో చెప్పం
డీ! అది కదా వి
వరణ జిలేబీ
గారండీ వినరెందుకనో ?
ReplyDeleteతమరున్నూ గురు
వులె! ఆకలి వే
యన్ రోకలి మింగండంటా
రేమీ? వివరిం
చుడి కొంటె జిలే
బీ వెంటనే యిపుడే వెసన్
ReplyDeleteమహాప్రభో! తెలి
యదు మాకు సుమా
పేర్చితి మంతే సరిబోవన్
మాత్రలు గణములు
పదముల విరుచుచు
నటునిటు కోతివలె గెంతుచున్ :)
జిలేబి
ReplyDeleteకాచి దరి యట్లకాడని
సాచి చురచురయని చూచి జ్వాలపు వేగం
బై చరచుచున్ జిలేబీ
నాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా!
నారదా!
జిలేబి
ReplyDeleteఓసోసి ఉల్లిపాయ! వి
కాసిత మఖగంధకమ్ముగా తాంబూలము
గా సెహ భేషుగ నర్హత
నే సాధించితివి నేర్పు నీదే సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteవారెవరో యెవిరికెరుక!
ఎవరోయి జిలేబీ తా
నెవరోయీ ? మదిని తొలుచు నేస్తంబై ని
ల్చు విరాట్టెవరోయీ? రె
డ్డి, వివరములరయగ బాపురే మన తరమా
జిలేబి
ReplyDeleteనోటిని పండ్లే లేవోయ్
చాటెద వంకాయకూర చకచక చేయన్
వాటముగా "నెట్లో" నా
మాటామంతియిది నేటి మగువల్లారా :)
జిలేబి
ReplyDeleteమేని సుఖములకు భోగియె
సానిన్ ముద్దాడె, యోగి సద్గతిఁ బొందన్
కాననమున ముద్దాడెను
ధ్యానమ్మును, మది నడతని దాని ఫలితముల్!
జిలేబి
ReplyDeleteమేని సుఖమ్ములన్ బడయ మేలములాడుచు భోగి నెయ్యమిన్
సానిని ముద్దుపెట్టుకొనె, సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్
కాననమందు దీక్షని వికారము లెల్లతొలంగ చిత్తమున్
ధ్యానము నందు నిల్పె; మది దారిని దాని ఫలమ్ము జీవికిన్!
జిలేబి
ReplyDeleteమేనక తిలోత్తమలు మన
సా నిన్ ముద్దాడె! యోగి! సద్గతిఁ బొందన్
దేనికి లొంగక నీవా
ధ్యానమున నిమగ్నమై సదా యుంటివిగా!
జిలేబి
ReplyDeleteచానలతో సరసమె "ని
త్యానంద" మటంచు రసికతయె మార్గముగా
పానుపు పై పవళింపుల
సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్!
జిలేబి
ReplyDeleteగృహస్తాశ్రమ ధర్మము
మీనా కుమారి సుదతిని
మేనిని తా నిడుకొని పరిమితపిలఱేడై
ధ్యాన పథము విడువక దొ
ర్సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్!
జిలేబి
ReplyDeleteఎవరోయి జిలేబీ తా
నెవరోయీ ? మదిని తొలుచు నేస్తంబై ని
ల్చు విరాట్టెవరోయీ? రె
డ్డి, వివరములరయగ తెల్పుడీ మన తరమా :)
జిలేబి
ReplyDeleteకవి' పదంతో నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం
కవిగొన కోరెద బావా
కవిదల లో సంగ్రహీతగా నాకై యా
కవియము బట్టి నను నడుప!
కవియించుమయా విజయుని గా సార్థకతన్!
జిలేబి
ReplyDeleteజీపీయెస్ వారి తరపున వారి ఫేవరెట్ రాహులయ్య నేటి భారతం :)
కవిదల యెన్నికలన్ జో
క విడివడుచు రాహులయ్య కాంగ్రెస్సునరే
కవికన్ విడిచిన హరివలె
కవియించెడు థాయిలాండు కై పరుగులిడెన్!
జిలేబి
ReplyDeleteసందింటి జగనుడీతడు
సందియము వలదిక జనుల సంక్షేమమ్మే
డెందపుటానందముగా
పొందిన "లా నేస్తుడు" మన పుడమిదొర భళా :)
జిలేబి
ReplyDeleteసహనమ్ము కిరీటమ్మగు
బహుసుందరముగ మనుజులు పరిణితి చెందన్
విహరింతురు జనుల మదిని
నహరహమున్ పేరుగాంచిన ప్రభువు లగుచున్
జిలేబి
ReplyDeleteఒకవైపు నీతులున్ మరి
యొక వైపిక బూతులున్ పయోధరముల తూ
గు కథల్, టిట్బిట్సుల నే
వకమ్ము మా స్వాతి సపరి వారంపు ప్రతిన్ :)
నారదా!
జిలేబి
ReplyDeleteతెలుసు కొనవె జిలేబీ మితియె నెరవుగ
రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గా దె
పుడు జనులకు! మేలు కలిగె పుణ్యమనగ
సుఖము లెల్ల విరివిగాను శోభలలర!
జిలేబి
ReplyDeleteవెతుకను మచ్చుకైన కనువిందగు వారలు కానరారు! భ
వ్యత యొక యెండమావి గ సవాలుగ జీవులకెల్ల కాన్బడెన్
అతుకుల బొంత జీవితమనాదరణల్ నిలువెత్తు! యేమిరా
బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్!
జిలేబి
ReplyDeleteయువతులాటవస్తువులయి యూతలేక
మానభంగములకు గురి! మచ్చుకైన
న్యాయ మన్నది లేదె! వినాశమేను
రామ! రాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె?
జిలేబి
ReplyDeleteవంకాయమ్మను యుమ యని
నింకను శంకరునిసతియనిపిలుతురయ! ఆ
వంకాయమ్మమొగుండగు
శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్
జిలేబి
ReplyDeleteఆకాశవాణి కి పంపినది :)
ఖంకరమును సరిజేసెను
శంకరుడుమకొరకు, పారిజాతము తెచ్చెన్
కంకిణిగా, దేవేంద్రుడు
రంకెలు వేయంగ నడచి వ్రజవల్లభుడే!
జిలేబి
ReplyDeleteఅంకిత మైన భర్త యగు నాతడు పెండ్లము కోర్కె మేర లో
వంక భుజమ్ము లానతిని వంకలు బెట్టక వేగవేగమై
డొంకల వాగులన్ వెదికి డుండుభమొక్కటి దారి చూపగా
శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్!
జిలేబి
ReplyDeleteEnjoy Maadi :)
జీవితమున సంతసింప వెరవకు! కా
యమున కగును బూది యగుట యెపుడొ
దాని చింత వలదు ! దమ్ముబట్టి యనుభ
వించు నరుడ యెల్ల వేళలందు
జిలేబి
ReplyDeleteఘుమఘుమ లాడ జీవితపు గుల్యము గాఢముగా సుఖమ్ములన్
తమకము తీర పొందవలె! దమ్మును బట్టుచు సాగిపొమ్ము! కా
యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్
చిమచిమలాడు యోచనల చిక్కిన కాలము వట్టి చేయకోయ్
జిలేబీయం :)
జిలేబి
ReplyDeleteఆటవెలది పాద గర్భిత కందము
బాదరబందియె నిజమని
మోదనములవేలనొకొ! ప్రమోది జిలేబీ!
సోదరి! కా"యమున కగును
బూది యగుట యెపుడొ" పడకు బూకని వినుమా!
జిలేబి
ReplyDeleteచాముండేశ్వరి యనెడా
క్షామ నివారణపు నాటకమున జిలేబీ
మా మిత్రులు నటులు ! భళా
కాముండే దున్నపోతు గణపతి కపియౌ!
జిలేబి
ReplyDeleteనీమము గా జనాంతమున నెమ్మిని బాసట చూప మిత్రులా
క్షామ నివారణంపు సహకారపు ద్రవ్యము సేకరింప మా
గ్రామము నందు నాటకము "రాముడు భీముడు" వేయగానట
న్కాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్!
జిలేబి
ReplyDeleteసోమరి వలె పని లేని స
కాముండే దున్నపోతు, గణపతి! కపియౌ
వేమారులటునిటు తిరుగు
సామర్థ్యమ్ముకలవాడు సాధించుటలో!
జిలేబి
ReplyDeleteభామల మది కెలుకునెవడు?
స్వామి యముని వాహనమెది ? శంకరి తనయుం
డో? మదిని రాముని నిలిపె?
కాముండే; దున్నపోతు; గణపతి; కపియౌ.
జిలేబి
ReplyDeleteచూడగా తల తిరిగె బుసుబుసటంచు
మేడ నెక్కఁగ, దిగవలె మూఁడు మెట్లు
దిగి మరల యెక్కుడీ ముప్పదియని వ్రాసి
యుండి రచ్చట! యిదియెట్లు యుక్తమౌత!
జిలేబి
ReplyDeleteచూడగ సూచనొక్కటిని, చొక్కుని తేలెను బూదకాయమే
మేడనుఁ జేర, "రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్
పాడుచు నేసునామమును ప్రార్థన చేయుడు మీకు మేలగున్"
పాడితి వేడుచున్ దిగితి ఫాదరు మెచ్చిరి దక్కె ముత్తియే
జిలేబీయము
ReplyDeleteఒక శయము చేయు దానము నొక కరమున
కు తెలియక చేయు మనుజుడె కోమలాంగి
దాత యనఁబడు; దాత తాన్ దాత గాఁడు
దాత ననుచు దంభనముల దాపరింప
జిలేబి
ReplyDeleteఓ పరలోకములో నున్న తండ్రి ఈ పాపుల క్షమింపుము
చేతుల నెత్తి మొక్కుము సచేతను డాతడె యేసునాధుడే
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ; దాత గాఁడు పో
నీ తవిషిన్ మరెవ్వడు! వినేతృని గా మన జీవితమ్మదే
పాతకమార్గమున్విడువ భారపు కొఱ్ఱుని నెక్కి నిల్చెగా
జిలేబి
ReplyDeleteపీతల మంగపు కతలన్
మా తాతయ్య ప్రచురించె మరల జిలేబీ
యేతావాతా యేదై
నా తాత్పర్యము కలదకొ నాతుక తెలుపన్ :)
జిలేబి
ReplyDeleteఆటవెలది పాద గర్భిత కందము :)
సహనమ్ము లేని మనుజుల
బహణెని చూడగ క్షణమున భగ్గను కణికల్!
అహ! గడ్డిపోచ చాలు క
లహమునకు జిలేబి రేగు లావుగ మంటల్
బహణె : శాస్త్ర పరిభాష, వ్యవహారిక కోశము (దిగవల్లి వెంకట శివరావు) 1934 Report an error about this Word-Meaning
నెపము; ఉపాయము; Pretence; Excuse; Contrivance; Evasion
జిలేబి
ReplyDeleteతలపుల తప్పు గాదు! తమ దారిని బోవుచు రాజకీయమున్
విలువయె లేని సంగతుల వేడిగ ఘాటుగ చర్చ చేయగా
పలుకులు తిట్లు గా మరలి బాదరబందిని తిట్టుకొంచు నా
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే!
జిలేబి
ReplyDeleteశరషట్పద
సహనమ్ము లేని
మనుజుల బహణెని
చూడగ క్షణమున భగ్గను కణి
కల్! గడ్డిపోచ
చాలు కలహమున
కు జిలేబి రేగు జ్వలనమహో
జిలేబి
ReplyDeleteతెలుగు నాట జనుల తీటయె తీట సు
మ్మీ జిలేబి పాకమేను రగడ!
రాజకీయ మనెడు రచ్చని చర్చింప
గడ్డిపోచ చాలు కలహమునకు!
జిలేబి
ReplyDeleteఉల్లిపాయపైన లొల్లియు హెరిటేజు
నీదనెడు రగడల నెత్తిపొడుపు
రెండు చేతులెత్తి రీతినమస్కృతి
గడ్డిపోచ చాలు కలహమునకు :)
జిలేబి
ReplyDeleteకర్నూలులోన కాఫియు
వర్నా తిరుపతిని లడ్డు వరుసని సెల్ఫీ
డర్నామత్ సాబ్ చెన్నై
మెర్నా బీచిని కలిసెదమీ సారి సుమీ :)
జిలేబి
ఓర్నాయనో! జిలేబీ
కార్నామాల్ సెప్ప కమలగర్భుని వశమే?
కంది శంకరయ్య :)
ReplyDeleteమాయామచ్చీంద్రా విను
మా! యింటింటను విరివిగ మధురిమ లలరన్
తీయని జిలేబులుండగ
పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్?
జిలేబి
ReplyDeleteఓయమ! గేస్తురాల! విను! నోర్మిని నోచుకొనమ్మ గేస్తుడిన్
సాయము బట్టియాతనికి జాంగ్రి, జిలేబులు బాదుషాల్ వడిన్
ప్రాయపు మాయ చేయు మదిరమ్ముగ నీవిక కొల్లగొట్టగా
పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్?
:)
జిలేబి
ReplyDeleteఆటవెలది పాద గర్భిత కందము
కోపపు పల్కుల వలదు సు
మీ పట్టింపులు తగవులు మింకిరి తనముల్
పాప! పగను మున్గ నడఁగుఁ
బాపచయము? వలదె పోరు పడతి విడువుమా!
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది
మిగులన్ దోపరి గాండ్లుగా విడువకన్ మేలంపు కాలమ్ములన్
సెగలన్ గ్రక్కెడు తీక్ష్ణదారముల నిశ్శేషమ్ముగా కుత్తుకల్
తెగగోయన్ వెనుకాడకన్ భగభగా దివ్సాలు దివ్సాలుగా
పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మంబులౌ నెప్పుడున్?
జిలేబి
ReplyDeleteఆయాసమనక తాగును
పాయసమన_, నెవ్వఁ డిష్టపడు నీజగతిన్
సోయాసాసుల గబ్బుని
శ్రేయస్సగు తెలుగు వంట చేవయె వేరోయ్ !
జిలేబి
ReplyDeleteఓయి అమాయకుడ! జనుల
కాయాసము జేర్చునయ్య! గట్టిగ యనక
య్యా! యీ కాలము లోనన్
పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్?
జిలేబి
ReplyDeleteబిడ్డ! మెక్కమాకు ప్రీతిని! విడువుము
మితము గాని తిండి! మేలు సేయు
నెపుడు సంయమనపు నెరియగు బువ్వయె
విను జిలేబి మాట వెంకటేశ!
జిలేబి
ReplyDeleteసుతరామూ సరి కాని మాటయె సుమా సుబ్బన్న! మాంద్యమ్మగున్
మితమే లేక భుజించినన్ జనులకున్; మేలౌఁ గదా చూడఁగన్
హితమై యోగ్యపు బువ్వతీసుకొనగా! హేఠమ్ము కల్గించక
య్య తనాయించెడు రీతి గా కడుపు హయ్యారే విభేదిల్లగాన్
జిలేబి
ReplyDeleteఇది కలియుగ మాయె! యెవరి యిచ్చ వారి
దాయె! యేది నిత్యమగు సత్యమని తెలుపు
మంచిని వినుటకు జిలేబి మనుజులకదె
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు!
జిలేబి
ReplyDeleteబిజి బిజీ మన్ డే మార్నింగ్ లో హైస్పీడు నగరమ్ములో కవిసమ్మేళనమంటే చెవికోసుకునే వారెక్కడండి :)
తెలవారెన్ కవివర్యులింక మహతిన్ తీర్చంగ సమ్మేళన
మ్మిల శ్రీ వేంకట నాథుడిన్ పురములో మించారు సందోహమున్
తిలకింపంగను వచ్చువారెవరకో? తిండాడుకాలమ్ములో
తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteవచ్చిరి బ్లాగ్జ్యోతిష్కులు
గుచ్చిరి జరిగిన కథలను గుచ్ఛముగా తా
విచ్చిరి యారు గ్రహములకు
పచ్చదనమ్ములిక కాలి భగ్గను నంటా :)
జిలేబి
ReplyDeleteఅరరె కవిత్వము పేరిట
వరలెను గా పిచ్చి పిచ్చి పసలేని పదాల్
చురచుర చూచు విమర్శకు
లరరే కనరారు కత్తులను దూయంగన్ !
జిలేబి
ReplyDeleteకానుకయిద్ది యపూర్వం
బైనది మాలాంటి కృష్ణభక్తులకండీ
మానసచోరుండాతడు
వేణువు నూద మది పొంగు వేగము గానన్
జిలేబి
ReplyDeleteకాలము గోధూళి సమయ
మాలయపు వెనుకల పొంచె మరణము వడిగా
చేలను పడి దూకుచు శా
ర్దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్
జిలేబి
ReplyDeleteబాలపు ప్రాయమాయె! పరి వారము తప్పుచు దారిమారి పో
గాలము దాపురించగ నెకాయెకి కాననమందు దూరగా
కాలము పొద్దుగూకె! కెడ కాలయముండట యాననీయ శా
ర్దూలము పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై
జిలేబి
ReplyDeleteసిటీ వాసులకేమి తెలుసు ఏదో ఒహటి రాసి పడేస్తారు :)
కలుహారములకు మరియు క
మలములకున్ తారతమ్య మరయని నగరం
పు లలన జిలేబి పలికెన్
కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్
జిలేబి
RRR కి సూటయ్యే టైటిల్ అడుగుతున్నారట జక్కన్న!
ReplyDelete"రఘుపతి రాఘవ రాజారాం" అయితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా!☺️
Deleteకొంత వివరింపుడి
జక్కన్న యెవరు ?
"జిలేబి" గారు,
Delete"జక్కన్న" యెవరో ఇంత వరకు చెప్పనేలేదా సూర్య? Very bad.
సరే, నాకు తెలిసినది నేను చెబుతా, ఆలకించండి. S.S.రాజమౌళి గారని తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖుడు వెలుగొందుతున్నాడు. "యమదొంగ", "బాహుబలి" లాంటి పాషాణాలను తీసిన దర్శకోత్తముడు. వారు ఒక సినిమాను రూపొందించడానికి ఆ పాషాణాన్ని ఒక శిల్పిలా "చెక్కుతార"ట (ఇతర డైరెక్టర్లు ఎలా రూపొందిస్తారో మరి?) ... ఇంకేం, శిల్పి తో పోలిక తీసుకొచ్చాక అలనాటి "అమరశిల్పి జక్కన్న" గుర్తుకు రావడం ఎంతసేపు? ఇంకా ఆలస్యం ఎందుకు, వారికి "జక్కన్న" అనే పేరు తగిలించేశారు సినిమా వాళ్ళే ఎవరో. ఆ రంగంలో బిరుదులు మీద మోజు ఎక్కువ గదా. ఇవన్నీ ప.కు.మ. ఆనందాలు.
ఈయన ఇంకా చేయి కోసుకోలేదు. వచ్చే సినిమా ఫ్లాప్ అయితే చెప్పలేము సుమా!
Delete"ప.కు.మ." అంటే ఏమిటి సార్?
జై గారు,
Delete// "ప.కు.మ." అంటే ఏమిటి సార్?"//
--------------
హ్హ హ్హ హ్హ, అది ఎవరికి వారు figure out చేసుకుంటే ఉత్తమం, జై గారు 🙂👍. సరే మీరు అడిగారు కాబట్టి ఒక జోక్ మాత్రం చెబుతాను, ఆస్వాదించండి 😃.
ఒక వ్యక్తిని మేజస్ట్రేట్ గారి దగ్గరకు తీసుకువచ్చాడు పోలీస్. ఏం చేశాడితను అని పోలీస్ ను అడిగాడు మేజిస్ట్రేట్ గారు. ఇతను పబ్లిగ్గా బూతులతో తిడుతున్నాడు, దొరా అన్నాడు పోలీస్. మరి దానికి నువ్వేం చేశావు అని అడిగాడు మేజిస్ట్రేట్ గారు. ఛస్, ఇసుమంటి మాటలు మర్యాదస్తుల దగ్గర మాట్లాడకూడదు. నిన్ను కోర్టుకు తీసుకువెళతాను, ఈ మాటలన్నీ మేజిస్ట్రేట్ బాబు చెవిలో చెప్ఫు అని ఆ పళాన ఈడ్ని మీ దగ్గరకు తోలుకొచ్ఛాను బాబూ ... అని జవాబిచ్చాడు ఆ పోలీసెంకట సామి 😃.
Deleteనెనరుల్స్ విన్నన్న వారికి జవాబులకు !
విన్నన్న! రాజ మౌళియె
మిన్నగ జక్కన్నయా! జిమిక్కుల వాడం
చన్నారా నతడిని జ
క్కన్నాయని ? తేటతెల్లగా విశదమయెన్ :)
జిలేబి
Deleteప.కు.మ! మనుజులెవరండీ
చకచక చెప్పండి ప్రైజు చక్కగ గెలవం
డి!కరకర జిలేబులివిగొ
టకటక లాగించుడీ తటాల్మని రండీ :)
జిలేబి
స్వకుమల విని యుంటిమి , మరి
Deleteపకుమలు కూడా గలరను పలుకుల నిపుడే
సకలాగమ విదులు నరస
వికచాబ్జాక్షులు వలుకగ వింటిమి భళిరా !
Deleteన, రస వికచ అబ్జ అక్షులు :)
సరసులు సరసీరుహ హృ
Deleteత్సరసులు నరసింహరావు సారు , తవ రిలా
విరసములు వలుక తగునా ,
యర విరిసిన పద్మనయన ! హరినీల మతీ !
మీ మంచిమాటలకు, నన్ను సమర్ధించినందుకు ధన్యవాదాలు, రాజారావు మాస్టారు. “జిలేబి” గారి పేరులో మాత్రమే తీపి, మాటలో వ్రాతల్లో మాత్రం వెట”కారం” ఎక్కువ, మనందరికీ తెలిసిన సంగతేగా.
Deleteపొద్దున్నించీ కాస్త నలతగా ఉండడం వల్ల ఇవాళ వాట్సప్ వైపు ఎక్కువ రాలేదు. అందులోనూ ఇవాళ ప్రపంచ ఆధునిక గణిత శాస్త్ర పితామహుడు మన భారతీయుడు Srinivasa Ramanujan, FRS గారి స్మృత్యర్ధం govt ప్రకటించిన National Mathematics Day కూడానూ. దీన్ని గురించి వేరే వ్యాఖ్య వ్రాస్తాను కాసేపటి తర్వాత.
సరే గానీండి, మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు మాస్టారు - కోవిదుడు వగైరా అంటూ. నేను తగనండీ. అసలు అంత “కోవిదుడు” ను అయితే ... ప్రెసిడెంటే అయ్యేవాడినేమో (just joking. ఆయనెక్కడ, నేనెక్కడ?🙏).
అయినా అంత పండితులైన మీకు “ప.కు.మ” అర్ధం కాలేదంటున్నారు అంటే మీ ముందు నేనెలా కోవిదుడను అవుతానండీ 🙏?
(అయినా “ స్వ” తెలుసన్నారు కదా, మరి అదే అలవరసలో “ప” దేన్ని సూచిస్తుందో కనిపెట్టడం మీకు అరక్షణపు పని)
🙏🙏🙏లు నరసింహరావు గారూ ,
Deleteమీరేమిటో నాకు తెలుసు . పైకెత్తడం కాదు .
మా అందరిలోకీ మీరు అన్ని విథాలా మీరు ఉన్నతులు. పకుమ అలవరస అర్థమైంది .
స్వకుమ యూసేజ్ విన్నాను , పకుమ వినలేదే .
Deleteజిలేబి” గారి పేరులో మాత్రమే తీపి, మాటలో వ్రాతల్లో మాత్రం వెట”కారం” ఎక్కువ,
కరకర జిలేబి :)
వామ్మో ! ఇంత బేషింగా మా పై ?
జిలేబి
Deleteపకుమ స్వకుమ అనగా నేమి ?
Deleteతియ్యదనము నామమ్మున
చయ్యను వెటకారమాయె సాటినరులపై
నెయ్యపు పల్కులు కనరా
వయ్యా రాజన్న! గ్రుచ్చు బడిని జిలేబీల్ :)
జిలేబి
This comment has been removed by the author.
Deleteజిలేబి” గారు,
DeleteSrnivasa Ramanujan, FRS గారి గురించి వ్యాఖ్య వ్రాస్తానని నిన్న ఇక్కడే రాజారావు మాస్టారినుద్దేశించి వ్రాసిన నా వ్యాఖ్యలో అన్నాను, గమనించారా?
నిజానికి నా ఈ వ్యాఖ్యలో ప్రత్యేకించి రామానుజన్ గారి గురించి చెప్పడానికేమీ లేదు, నేను చెప్పగలవాడినీ కాదు. నిన్న ఆ మహానుభావుడి జయంతి (డిసెంబరు 22). గవర్నమెంటు వారే డిక్లేర్ చేసిన National Mathematics Day ప్రతి సంవత్సరం. అటువంటి ప్రత్యేకదినం సందర్భంగా ఆ మహానుభావుడిని మన తెలుగు బ్లాగులోకం బ్లాగర్లలో ఎవరైనా తలుచుకోకపోతారా అని రోజంతా ఎదురు చూశాను. కానీ కృష్ణరాయబారం పద్యంలో ... ఒక్కండును, ఒక్కండును, ఒక్కండును ... అన్నట్లు అయింది అనిపించింది 😩 పోనీ పెద్దవారు, తెలిసినవారు మీరైనా ఓ రెండు పద్యాలు సమర్పిస్తారేమో అనుకుంటే మీరేమో కన్నులెన్ని, కుచములెన్ని లాంటి పద్యాలలో బిజీ బిజీగా ఉన్నారు. చివరకు నిన్న దీపాలు పెట్టిన చాలా సేపటికి రెండు మూడు గంటల తరువాత చైతన్యుడు తన “తెలుగోడి రాతలు - కూతలు” బ్లాగులో “జాతీయ గణిత దినోత్సవం” అని ఒక టపా పెట్టారు, సంతోషం అనిపించింది 🙏 .
సరే, తేదీ మారిపోయింది, రాత్ గయీ బాత్ గయీ అన్నట్లయింది. అయినా ఫరవాలేదు, ఇప్పుడైనా ఓ రెండు పద్యరత్నాలు పెట్టండి రామానుజన్ గారి గౌరవార్థం. ఎంతైనా శ్రీనివాస రామానుజన్ గారు మన దేశపు icon లలో ప్రముఖుడండీ, మనమే స్మరించుకోకపోతే ఎలాగ?
https://sskchaithanya.blogspot.com/2019/12/blog-post_22.html?m=1
Deleteవచ్చె నతడనంతము దా
టొచ్చెన నంతము తెలుప పటుత్వపు లెక్కల్
మెచ్చగ లోకంబెల్లను
విచ్చిన పువ్వువలె తావి విరజిమ్మి చనెన్ !
జిలేబి
నాదీ ఒక పద్యం
Deleteమానుగ విశ్వ మంతయు ప్రమాణముగా గణితాంతరంగమై
పూనికతో చలించునట , మూలము లెక్కలె , శ్రీనివాస రా
మానుజు కీర్తి గొప్పది సుమా గణితాన , ప్రపంచ మంత యెం
తేనియు గుర్తు జేసుకుని ధీనిధికిం గడు గౌరవమ్మిడున్ .
Deleteరామానుజుడని నామ
మ్మా మానవునికిడ మాథమాటిక్సాయెన్
ప్రామాణికమ్ము చూపె న
సామాన్యంబైన ప్రతిభ శ్లాఘింప జనుల్
జిలేబి
ఇది భేషుగ్గా ఉంది, సముచితంగా ఉంది 👏.
Deleteధన్యవాదాలు “జిలేబి” గారు 🙏.
ధన్యవాదాలు రాజారావు మాస్టారు 🙏.
సారీ ! జిలేబి గారే
Deleteసారూ ! తవరికి ప్రధములు సరి రాలే మే
సారీ మేమవ్వారికి
నారయ నెందేని , బుధ వరాన్వయ సరసీ !
ReplyDeleteనారదా! నీహారిక వారెక్కడున్నా శంకరాభరణమునకు వెళ్ళవలె :)
భారీ వాల్పోస్టరులో
చీరలు స్థానము విడువగ చీర్సను కైపుల్
వారిరుహనేత్రయొకతెయు
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్
జిలేబి
ReplyDeleteప్రేరణగా సమ్ముఖిలో
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్
వారిజలోచన యా నీ
హారిక రతగురువు చెంత హాయిగ చేరెన్!
ReplyDeleteదారిని మగనికి కోతుల
నారీమణి యొకతె చూపె నాలుగు; కుచముల్
తీరుగ గోకుకొనుచు వి
స్తారముగా తిరుగ చుండె తరువుల చెంతన్
జిలేబి
ReplyDeleteదర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారనుకొంటే ఏదన్నా సాధ్యమే !
సారామత్తును మీరెడా చమకులన్ సాధించు క్రొంగొత్తగా
భారీచిత్రము దర్శకేంద్రునిది విస్ఫారించు కన్దోయితో
ప్రేరేపించెడు కైపు చూపులమరన్ రేకెత్తగా కోరికల్
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్!
జిలేబి
ReplyDeleteఇల్లరికపు టళ్ళుల్లన
చిల్లర మల్లరయని తలచితిని! ఫణీంద్రుల్
వల్లభులనే సెబాసో
యిల్లరికపు వాండ్లుగ ప్రకటించిరి సుదతీ!
జిలేబి
ReplyDeleteఓరోరీ యేమంటివి?
నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్?
వారెవ్వా బ్రేకింగ్ న్యూ
సా! రవ్వంతయు నరరె విచక్షణ లేదే!
జిలేబి
ReplyDeleteచేరన్ పద్మసరోవరమ్ము తపమున్ చేయన్ కటాక్షమ్ముగా
చేరెన్ లక్ష్మియు నొక్క ఛాతి నలమేల్ చేరంగ వేరొక్కటిన్
తీరైనట్టి ముఖమ్ము స్వామిది సదా తీర్చున్ వెతల్ బ్రోవుమా
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్!
జిలేబి
ReplyDeleteఅలుకను మానుమిక సఖీ
చలిపులిఁ గని; వేవెలుంగు చయ్యనఁ బాఱెన్
నులివెచ్చగ కప్పుకొనెద
నెలతుక రావే సరసకు నెయ్యము బారన్
జిలేబి
ReplyDeleteఅలిగితి వా సఖీ ప్రియతమా! అలుకన్ సరి మానవే వయా
రి! లలిత మైన రాత్రి యిదె రివ్వున నాదరి రా! జిలేబి! నీ
పలుకుల తీపు గాత్రమగు పారునికై చెలి రావె రావె! ఆ
చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్!
జిలేబి
ReplyDeleteఆకాశవాణి కి పంపినది :)
విలవిల లాడి చిక్కగను భీకర కోరల ధాటి చీల్చుచున్
దులుపుచు జూలు గుర్రనుచు దూకగ చట్టని పైన, పారెనా
చలి, పులి పల్కరించగనె, చయ్యన పారె సహస్ర రశ్మియున్
జలజల పారగా కనుల చందిరమయ్యరొ వీడె స్వప్నమే
జిలేబి
ReplyDeleteజగనుడి 47 వసంతాలకు :)
జగనన్న పుట్టిన దినమి
దిగిదిగొ నేతన్నలకు పదిలమయ్యె జిలే
బిగ హస్తమిదిగిదిగొ! రం
డి గహ్వరీపతికి వడివడి తెలుప జేజేల్!
జాల్రా
జిలేబి
ReplyDeleteతెంగ్లీషుమాటలాడెడు
కంగ్లీ జనులార రండు కబళంబిదిగో!
ఇంగ్లీషు మేము సాహిబ
బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్!
జిలేబి
ReplyDeleteఇంగ్లీషేల తెలుంగు చాలు వినుడీ యింగ్లాండు లోసైతమున్
జంగ్లీలెల్లరు మాతృభాషయె ప్రశస్తంబంచు నేర్పింతురే!
కంగ్లావాళ్లవకండి!రండి! నడుమున్ కట్టండి! ఆంధ్రంబనే
బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్
జిలేబి
ReplyDeleteతాతగారి బాలాగు వైరాగ్యము :)
ఆలోచనలు కలిగె పో
బాలాగు టపాని చదువ పారుల కచటన్
మేలైన బతుకెదియనన్
చాలదు గా జీవితమ్మసలు తెలుసుకొనన్
జిలేబి
జిలేబి గారి వెటకారం లో కూడ నాకు మమకారమే కనపడుతుంది.
ReplyDelete
Deleteమా బంగారు కొండ బోనగిరి గారు :)
ReplyDeleteతెలిపిరి అడిగిన క్షణమే
సులభమ్ముగ నర్థము వరసుగుణపు రాయా
కలరా మీవంటి జనులి
లలో జిలేబీయమై కలకలల రేపన్
జిలేబి
ReplyDeleteతేనీటిని సేవించక
నే నా దాహము తొలంగె! నే కతుకకనే
నానా విధరుచులు తెలిసె!
వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్!
జిలేబి
ReplyDeleteఎవరాయన ?
తానొక సిద్ధియోగుడు! సితాగ్రపు తీక్షణ దీక్షతోడుతన్
వీనులవిందు గాత్రమున ప్రేమయె దేవుని కానవాలటం
చా నవబిందువృత్తమును క్షామము తీరగ వేసికొల్వగా
వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే!
జిలేబి
ReplyDeleteచానల్లు త్రిప్పుచునరరె
నేనా పడకని మయికపు నిదురని తొంగొ
న్నా నంతలోన స్వప్నము!
వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్
జిలేబి
ReplyDeleteఆటవెలది పాద గర్భిత కందము
విపరీతపుటాలోచన
ల,పరిస్థితుల పఱిగొని కలకలములను రే
పు,పొలసు పూల వలనఁ జెడె
ను పుష్పవనము భరతమ్మ నుడి సత్యమ్మే!
జిలేబి
ReplyDeleteగెడ్డ మందు గలదు కెంపుకంటి! పడచు
దనము; ముదిమి నాటి తరపు జనులు!
కుర్రకారుల సొబగులెటుల తెలియును
పాత చింతకాయ పచ్చడాయె!
జిలేబి
ReplyDeleteమూకుమ్మడిగా నరుడా
చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిది యే
తేకువయున్ కాదు సుమా
యీ కలి కాలంపు జీవి యిక్కట్ల గనన్
జిలేబి
ReplyDeleteచీకాకులు తొలగును సు
మ్మీ కష్టములే స్థిరమని మీరనుకోకం
డీ! కరుణామయు దయ చన
చీకటియే, వెలుఁగు నిచ్చు జీవిత మిదియే
ఆమెన్
ప్రభువు దయ యెల్లరికీ వుండు గాక
జిలేబి
ReplyDeleteప్రభువా ! అందరిని కాపాడుమా
ఆకస మందు గాన్పడు సమాకలితమ్ముగ వెల్గురేకలే!
మీకిక కష్టముల్ తొలగు ! మిన్నుల మీరు కృపాళు ప్రీతితో
మీకడ గండ్ల తేర్చును సుమీ! యిది క్రిస్మసు వేళ పాఱునా
చీకటియే! వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా!
జిలేబి