Thursday, January 9, 2020

పదేన్వేలు అక్కౌంటులో పడినాయ్ ( అను విశ్వరూపము )


జై జగనన్నా ! 

పదేన్వేలు అక్కౌంటులో పడ్నాయ్ (ట)





చేయు నతడె చెప్పంగన్ !
మాయా మర్మము లెరుగని మనిషి జగనుడోయ్!
చేయూత నిచ్చె తల్లుల
కే యావత్తు జనులున్ సుఖీభవ యనగా !


జాల్రా
జిలేబి

208 comments:



  1. వైయెస్సారు తనయుడోయ్
    మాయా మర్మము లెరుగని మంచి మనీషోయ్
    చేయూత నిచ్చె తల్లుల
    కే యావత్తు జనులున్ సుఖీభవ యనిరోయ్


    జాల్రా
    జిలేబి

    ReplyDelete


  2. నేతంటే జగనన్నే
    రా! తవణింపంగ చేర్చెరా పదిహేన్వేల్
    ఖాతాలోనన్! చల్లగ
    నా తల్లులె దీవెన లిడినా రీనాడే!


    జిలేబి

    ReplyDelete


  3. చెప్పేడంటే చేస్తా డంతే
    మామయ్యంటే మావాడేరా
    ఇస్తానంటే ఇచ్చేస్తాడ్రోయ్
    తల్లుల్లంటే ప్రాణమ్మౌరా


    జిలేబి

    ReplyDelete
  4. అమ్మ ఒడి
    ఇంగిలీషు బడి
    మురిసెను గుడి
    తిరుగును సుడి
    బాగుపడును బతుకు బండి

    చిల్లు పడిన బడుగు బతుకులలో కొత్త ఆశలు చిగురుస్తూ నేటి పిల్లలే రేపటి మేటి పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర పథకానికి అంకురార్పణ జరగడం శుభదాయకం.

    బాలానాం సుఖినోభవంతు. ఈ పథకం దేశానికే ఆదర్శం కావాలి. Hats off to the great vision of the scheme's architect YS Jagan.

    ReplyDelete
  5. అమ్మ ఒడి కాదు, మమ్మీ ఒడి అట ఎవరో ప్రతిపక్షనాయకుడు అంటున్నాడు.

    15000 బాంకులో పడితే ఆంధ్రలో 2 వీలర్ల డీలర్లకి పండగే పండగ. చూస్తూ ఉండండి.

    ReplyDelete
    Replies
    1. తులసీ రెడ్డి ఎన్నికలలో పోటీ చేసిన దాఖాలాయే లేదు కనుక "విశ్లేషకుడు" అనడం బెటర్. ఎటుతిరిగీ ఈ పథకాలన్నీ "కిరస్తానీకరణ శుద్ధి కొరకే" అని పచ్చ బావుటాలు రానే రాసాయి.

      మొదటి సంవత్సరం కనుక హాజరీ నియమం సడలించారు, వచ్చే ఏడాది గట్టిగా పాటిస్తే ద్రోపౌట్ రేషియో తగ్గుతుంది వేచి చూద్దాం.

      2 వీలర్లు బీదవారి వాహనాలే లెండి.

      Delete
  6. // “మమ్మీ ఒడి” //
    😁😁. ఇంగ్లీషు మీడియమా మజాకానా 😁😁?

    ReplyDelete
    Replies
    1. మరేనండి, అసలే కిరస్తాన దేవుని బిడ్డలు ఇక్కడ! తెగులు తర్జుమా బైబిళ్ళతో తంటాలు ఇంకెన్నాళ్లు?

      Delete

    2. నాయనా జై గొట్టి

      మా ప్రభువుని తూలనాడుదువేల ?


      జిలేబి

      Delete
  7. డాక్టర్ జి.ఎ.పూర్ణచందు గారు కొన్ని వందల యేళ్ళ క్రీతమే కూచిమంచి తిమ్మకవి గారు చెప్పిన పద్యమొకటీ ఆధారంగా తమ బ్లాగులో "దొరతనం" అనే టపా వ్రాశారు. ఈనాటి పాలకులకు / పరిస్థితులకు కూడా అక్షరాలా వర్తిస్తుంది అనిపిస్తుంది. నాకు చాలా నచ్చింది. మరింత మంది చదివితే బాగుంటుందనీ, బ్లాగర్ డాక్టర్ గారికి అభ్యంతరం ఉండదనే ధైర్యంతోనూ, వారి బ్లాగ్ టపా లింక్ ఇక్కడ ఇస్తున్నాను👇.

    "దొరతనం"

    ReplyDelete
    Replies


    1. లంకె టపా చాలా బావుంది

      ముఖ్యంగా ---+ అందలం అందరికీ అందేది కాదు. దానికోసం అర్రులు చాచేవారు కూడా కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఎవరో ఒకరికే అవకాశం దక్కుతుంది ----+

      ఈ వాక్యాలు శ్రీ క చ రా వారికి ఏప్ట్ !



      జిలేబి

      Delete
    2. ఎంతయినా ఆగడాల ఆ గడీల దొరలు కదండీ!

      Delete


  8. ఫేమస్ సింగర్ కి అరుదైన వ్యాధి

    దేశంలో ఎంతో మందిని వదిలి పెట్టి ఎక్కడో కెనడాలో వున్న మడిసి మీద టపా కట్టినారు ఎంత దయార్ద్ర హృదయులో వీరు !



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పొరుగింటి పుల్లకూర ..............

      Delete


    2. ఎంత దయార్ద్రహృదయులో
      చెంతని దేశమ్ములోన చింతల పాలై
      కొంతయు రక్షణ లేకన్
      వింతగ జనులుండగాను బీబరు చింతల్ :)


      జిలేబి

      Delete


  9. నన్నయ శ్రీమదాంధ్రమహాభారతము
    ఆదిపర్వంలోని ఈ పద్యం చూడండి-

    శకుంతల దుష్యంతునితో అన్న పద్యం ఇది-

    నుతజలపూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
    వ్రత యొక బావిమేలు మరి బావులు నూరిటికంటె నొక్క స
    త్క్రతువది మేలు తత్క్రతుశతంబుకంటె సుతుండు మేలు త
    త్సుతు శతంబుకంటె నొక సూనృతవాక్యముమేలు చూడగన్
    (శ్రీమదాంధ్రమహాభారతము - ఆది - 4- 96)

    సత్యవ్రతముకల ఓ రాజా!
    మంచినీటితో నిండిన చేదుడు బావులనూరిటికంటె
    ఒక దిగుడు బావి మేలు కాగా అలాంటి బావులు నూరిటికంటె
    ఒక మంచి యజ్ఞము మేలు, అటువంటి నూరు యజ్ఞాలకంటె
    ఒక కొడుకు మేలు, అలాంటి నూరుగురు కొడుకుల కంటె
    ఒక సత్యవాక్యం మంచిది - అని భావం.

    దీన్ని నన్నయగారు చంపకమాలలో వ్రాయగా
    అనంతామాత్యులుగారు ఇదే భావంగల పద్యం
    కందంలో ఎంత చక్కగా ఇమిడ్చారో చూడండి -

    శతకూపాధికదీర్ఘిక
    శతవాప్యధికంబు గ్రతువు శతయజ్ఞ సము
    న్నతు డొక్క సుతుడు దత్సుత
    శతంబున కెక్కు డొక్క సత్యోక్తి నృపా!
    (భోజరాజీయము - 6-92)

    From AV Ramana Raju's Blog

    ReplyDelete


  10. ఏడుపుగొట్టులకెప్పుడునూ శోకమే :)


    సుఖమున్న దాని వెనుక ప్ర
    ముఖమ్ము గా దుఃఖము తరుముకొనుచు వచ్చున్
    సుఖము సుఖము కాదోయీ
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్


    జిలేబి

    ReplyDelete


  11. సుఖమెక్కడనోయీ భ్రాం
    తి! ఖలు మనకు వేదన సుదతీ! చెప్పెద నే
    ను ఖవాలీని జిలేబీ
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!


    జిలేబి

    ReplyDelete


  12. అబ్బే We see only negative :)


    ముఖవాద్యమ్మును చూడు గుంతలె సుమీ ముద్దేమిరా యందులో!
    సుఖమేమున్నది దుఃఖమే వెనుబడున్ జుమ్మంచు వెన్వెంట నా
    యఖమై పోటగునే జనాళికి సమాయత్తమ్ముగా‌ సోదరా!
    సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్!


    జిలేబి

    ReplyDelete


  13. సుఖము సుఖముకాదోయి! వి
    ముఖతను చూపంగదగును! మూర్కొన కోయీ
    సుఖమనెడు నెండమావిని!
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!

    శతకానికి సైయందామా :)


    జిలేబి

    ReplyDelete


  14. సుఖమగు రాముని సన్నిధి
    సుఖమనునది వేరు లేదు సుద్దుల వినవే
    సుఖమసుఖమగు తతిమ్మా!
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!


    జిలేబి

    ReplyDelete


  15. యా అల్లా లఖవాహ్!


    సఖి! వెతుకుచు తిరిగితి నే
    సుఖమెక్కడ యని! లభింప సుఖమే, వచ్చెన్
    ముఖపక్షవాతమదియే!
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!


    జిలేబి

    ReplyDelete


  16. ఇంద్రుని పదవి ! యెప్పడూడుతుందో తెలియదు !

    సుఖమనెడా నులి వెచ్చని
    మఖమలు పరదాయె సత్యమనుకొన కోయీ
    మఖవంతుని పదవి వలెన్
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!

    జిలేబి

    ReplyDelete


  17. మఖవంతజాలమహిమా
    దిఖలుసువర్ణమిళితబృహదితిగణితమహా
    ర్నిఖిలద్యోతకమయినన్
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!


    జిలేబి

    ReplyDelete


  18. తేటగీతి పాద గర్భిత కందము :)


    అలివేణులకు "పురిటి నొ
    ప్పులు తప్పవు పూరుషులకు" బ్రువ్వట బాబా
    పలువిధముల తిరుగుడు తి
    ప్పలున్ను కల్యాణ చక్రవర్తి వినవయా!


    జిలేబి

    ReplyDelete


  19. అరయన్ పొందెదరెప్పుడున్ సుడిని కల్యాణంబుకాగన్ సుమా
    పురుషుల్; పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్ప దీభూమిపై
    గరితల్ పెండ్లియె కాగ జీవితములో కర్పూరగన్ధీ జిలే
    బి!రహస్యమ్ము విధాత రాత యిది శోభిల్లంగ భూస్పృక్కులే!


    జిలేబి

    ReplyDelete


  20. జీపీయెస్ -
    వాట్సప్ సమూహములో పండితుల ఆజ్ఞ:
    (కంది సారు పట్టించుకొనరు )


    పద్య పూరణ చేయుచు పాట్లు పడుచు
    కథలకా జిమిక్కులు సమకట్టు చేసి
    యాఖరుని పాదమదె శోభలలర చేయ
    పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు!



    జిలేబి

    ReplyDelete


  21. పాదాంతము గా కైపదము కావాలన్న జీపీయెస్ వారి " ఆజ్ఞ " ననుసరించి స్వల్ప అడ్జస్ట్ మాడి :)


    గరితల్ కాదని త్రోయ వీలగునకో కర్పూరగన్ధీ జిలే
    బి!రహస్యమ్ము విధాత రాత యిది శోభిల్లంగ నారీమణుల్
    కరుణా మూర్తులు తల్లులై వెలుగగా కల్యాణమై, తోడవన్
    పురుషుల్, పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్పదీ భూమిపై!



    జిలేబి

    ReplyDelete
  22. “జిలేబి” గారి వ్యాఖ్యను ఒక బ్లాగర్ తన బ్లాగ్ నుండి తొలగించుటయా! అహో, ఇది గదా విధివైపరీత్యమన !😒

    ReplyDelete
    Replies

    1. ఎవరు వారు
      ఎచటి వారు
      ఇటు వచ్చిన కొత్తవారు
      ఔరా ! ఏమాయెన్ మా ఇలాకా :)



      జిలేబి

      Delete
    2. You are incorrigible, “జిలేబి” గారూ☝️.

      Delete


  23. సకార' ప్రయోగం లేకుండా
    సంక్రాంతి పర్వదినాన్ని గురించి
    స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

    ****

    సంక్రాంతి శుభాకాంక్షలందరికీ !



    మకరమ్మున కాలిడె నరు
    ణకిరణుడిదె పబ్బ మాయెనమ్మ జిలేబీ
    ప్రకృతికి వందనములతో
    డు కరుణ చూపమని కోరెడు హరిమ యిదియే!



    ***

    క్రోధపు ద్వేషపూరితపు గొబ్బియ లెల్లెడ కాన్పడంగ మా
    వీధిని గంగిరెద్దు తన వీపుని మోయుచు కాన రాలె! నా
    వేధయు దాగె మబ్బులను వీడక పబ్బపు వేళ నైన నా
    రాధన మీయ వయ్య యని రాకుని వేడెద మీ దినమ్మునన్!


    శుభాకాంక్షలతో
    విశ్వము దేశము రాష్ట్రము సుభిక్షమవుగాక


    జిలేబి

    ReplyDelete


  24. ఆహా! శార్దూలమా ! నువ్వొస్తానంటే నేవద్దంటానా :)


    సారంబొప్పెడు రీతి నాకనుచు మాస్టారూ దయన్ చూపి రే!
    కారాడింప ప్రభాకరుండు మెలపున్ కర్కాటకంబందహో
    ప్రారంభంబగు దక్షిణాయనము, సంక్రాంతిన్ ముదం బొప్పగన్,
    సారూ!మేల్మిని నుత్తరాయణమగున్ సంభావనీయంబుగా


    జిలేబి

    ReplyDelete


  25. తేటగీతి పాద గర్భిత కంద పూరణ

    కమనీయము కందమిది! "క
    నుమ! నీ కనుమానమా? కనుమ కనుమ" మరిం
    త మరింతగాను తీయం
    గ మారు నభ్యాసమున జగతిని జిలేబీ




    కనుమ శుభాకా‌ంక్షలతో
    మాకంద జిలేబి :)

    ReplyDelete


  26. పద్మార్పిత విరహ వేదన :)


    తనివారంగను గోముచేయ వలవంతమ్మాయె రావయ్య రా!
    మునిమాపున్ మరి వచ్చి కౌగిలినటన్ ముద్దాడుతా నంటివే
    కనుమా వెన్నెల వేడి తాళ కుదురన్ కాలేదు పద్మార్పితన్
    కనుమా నీకనుమానమా కనుమ నన్గాంచంగ జాగేలనో!

    నారదా!
    జిలేబి

    ReplyDelete


  27. సమరమ్మునకు తయారు! క
    నుమ నీ కనుమానమా కనుమ కనుమల చే
    రి మునుకడన్ సైన్యమ్ము దు
    నుమాడగన్ మోహరించెను సుమా గనుమా

    జిలేబి

    ***

    కంది వారి విశ్లేషణ -

    మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
    ఈ పద్యాన్ని ఒక మిత్రునికి ఫోనులో వినిపించి ఛందస్సు చెప్పమన్నాను. మరోసారి... మరోసారి... అంటూ నాల్గు సార్లు విన్నాడు. అయినా చెప్పలేకపోయాడు... చివరికి కందపద్యపు రిదంతో వినిపిస్తే చెప్పాడు. దటీజ్ జిలేబి


    జిలేబి జవాబు :)

    ఆహా! పొగడ్తయా ! లేక లెగ్ పుల్లింగా :) ఏదో పొగడ్తే అనుకుంటా :)

    నెనరుల్స్ సహిత జిలేబీయము మీకై :)


    మాయమ్మే! ఇంత జిలే
    బీయమకో! కందమా తవికయా ! తెలియన్
    సాయము కోరగ మిత్రుం
    డాయనకున్ సందియమ్మరరె అమ్మణ్ణీ :)


    జిలేబి

    ReplyDelete


  28. టెంకాయ దాని తోడుగ
    వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుడగుఁ గదా
    బొంకెడు వారల పల్కులు
    వంకలు వాగులనుదాటి వారిధి చేరున్


    జిలేబి

    ReplyDelete


  29. పింకూబాయి, జిలేబియున్ బెరయుచున్ పీహెచ్డి పట్టమ్ముకై
    టెంకాయన్ సయి వంగకాయ పయి ధాటీచేసి స్థాపించి రీ
    శంకాతంకములేని రీతి, పడతుల్ జాగ్రత్త గా వండుడీ
    వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే భ్రష్టుండగున్ వేగమే!


    జిలేబి

    ReplyDelete


  30. అద్భుత పాకోపగీత అను మహా కావ్యము లో

    టెంకాయమ్మ ఉవాచ -


    వెంకాయమ్మా మేలగు
    వంకాయను దిన్న నరుఁడు, భ్రష్టుఁ డగుఁ, గదా
    రంకాయలన్ కలుపగా
    రంకెలు వేసి దరిచేరు రతగురువగునే!


    జిలేబి

    ReplyDelete


  31. టెంకాయను తినకండీ
    వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా!
    స‌ంకటమే గోంగూరయు!
    వంకల విదురులు వెతికిరి పరిపరి విధముల్ :)


    జిలేబి

    ReplyDelete

  32. దేశంలో ఇంట్లో సమస్యేలే చాలదా అనుకుంటే లేని సమస్యలను సృష్టించుకుని పరుగులెత్తి వాటిని సాల్వు చేసుకొను విదురుల చోద్యమే చోద్యము ! నారదా !

    పనిలేని బార్బరులిలని
    మన కగు పడుదురకొ ! గొరుగు మార్జాలమునై
    నను పని కల్పించుకొని! స
    దనమ్ము లోని కవివరులుదాహరణ సుమీ :)


    నారదా!

    జిలేబి



    పనిలేని బార్బరులిలని
    మన కగు పడుదురకొ ! గొరుగు మార్జాలమునై
    నను పని కల్పించుకొని! స
    దనమ్ము లోని కవివరులుదాహరణ సుమీ

    ReplyDelete


  33. పవనుండదిగో సైయనె
    జవరాలా భాజపాకు సరసము లాడన్
    ప్రవచించునింక మనకు నె
    లవు మోడీయే యనుచు భళారె భళారే!


    జిలేబి

    ReplyDelete


  34. ఛిద్రమవన్ తలపులు చి
    న్ముద్రని ధ్యానమ్ము చేయ నునుపారంగన్
    రౌద్రము, తురీయ జాగృత
    నిద్రాసక్తులకు, దక్కు నిఖిల విభవముల్!


    జిలేబి

    ReplyDelete


  35. ఆకాశవాణికి పంపినది


    అదురక, చేయు కార్యమున నచ్చము గా మది పొందు చేయుచున్,
    కుదురుగ నిత్యముక్తుడిని కోరిక లేవియు లేక మ్రొక్కి, చే
    బదులుగ జీవితమ్మునిక బ్రహ్మణి యిచ్చిన రీతి పోచి,యా
    నిదురను మున్గు వారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్!


    జిలేబి

    ReplyDelete


  36. ప్రేయస్సును గాన భళి
    శ్రేయస్సునుకై నిడదగు శ్రీకర మైనన్
    సాయమ్మొనర్ప రాన్ సరి
    యాయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్!


    జిలేబి

    ReplyDelete


  37. చెట్టు పైన మహావాక్యము :)

    యేసు దేవుడు నీ ప్రాణంను కాపాడును !


    ఆ యేసుదేవుడే నీ
    కై యిలని శిలువను మోసె కరుణామయుడై
    చేయుము ప్రార్థన ప్రభువా
    మాయందా యెలమి చూపుమా యని సుదతీ !



    ఆమెన్

    జిలేబి

    ReplyDelete


  38. అచ్చంగా తెలుగు :)


    హెచ్చుగ మనభాషనరే
    మెచ్చిరిటాలియను భాష మేల్మి గలదనన్
    అచ్చంగా తెలుగునరే
    బుచ్చబ్బాయిలు పలుకుడి పుష్పింపంగన్!


    జిలేబి

    ReplyDelete


  39. కారణ జన్ముడు మా మోదీ !


    కారణ జన్ముడు మా మో
    దీ! రాజ్యమునేలుచుండె దీవెనలే తో
    డై రేయింబవలు‌న్ వి
    స్తారమ్ముగ ప్రగతి భారతావని గానన్


    జిలేబి

    ReplyDelete


  40. చికుబుకు చికుబుకు రైలే
    యిక మన పండితులకింక యీ రచనలతో
    డు కిసుకిసులాడ! మేలు ల
    బకు లబకూయనుచు గుండె పరుగెత్తు సుమీ


    జిలేబి

    ReplyDelete


  41. ఆస్ట్రేలియా లో నీళ్లెక్కువ తాగేస్తున్నాయని ఐదు వేల ఒంటెల్ని కాల్చేసేరంట గవర్నమెంటు!


    తాగేస్తున్నా యొంటెలు
    వేగిర నీళ్లను ! వలదిక వీటికి ప్రాణాల్
    మ్రోగిస్తామిక బుల్లె
    ట్లే గట్టిగ చంపి వేయుటే మార్గముగా


    జిలేబి

    ReplyDelete


  42. నాగావళి నెక్కామం
    డీ! గోప్యముగ గురువుల కుడివయిపు బోగీ
    లో గాసిప్పుల తోడున్
    పాగా వేసితిమి మేము భళిభళి సుమ్మీ :)


    జిలేబి

    ReplyDelete


  43. గడగడ లాడించి తెలుగు
    నెడపక, బొంకెదరు రాణ్మహేంద్ర పురజనుల్
    నుడువుచు భళి మర్యాదన్
    వడివడి మీవలె నొరిమని పల్కగ లేమే!


    జిలేబి

    ReplyDelete


  44. చులకన చేయరెవ్వరిని; సూటిగ ఘాటుగ దెప్పరెవ్వరిన్;
    పలుకరు లొల్లినేదియు ; సభాస్థలి నప్రియ మైన వాటినే
    పలుకరు; రాణ్మహేంద్ర పుర వాసులు సత్యము నెన్నడేనియున్
    విలువలు కోలుపోక ముడి వేయుచు గట్టిగ కాచుకొందురే

    జాల్రా
    జిలేబి :)

    నాగావళి లో గానము చేయుచు ఏలూరు దాటి గోదావరి దాటుదాము రావె :)

    ReplyDelete


  45. ఆహా నాగావళి స్పీడు సౌండు :)


    పిడివాదము చేయుచు తా
    మెడపక బొంకెదరు రాణ్మహేంద్ర పురజనుల్
    వడియైనను నాగావళి
    సడిచేయదరనిరి ట్రైను సౌండదిరెను పో!


    జిలేబి

    ReplyDelete


  46. ఊహల సైతంబితరుల
    నాహా తాళుట కుదురని నామోషీలన్
    ఓహో రామాయనుచున్
    బాహాటమ్ముగ కొలువగ బ్రహ్మంబగునో !


    నారదా ఎక్కడున్నావయ్యా!

    జిలేబి

    ReplyDelete


  47. బాగా చదివిన జనులే
    పాగల్గాళ్ళై కులమత పరిధిని మీరన్,
    కైగుగ నాలోచింపక
    పోగాలము దాపురింప ఓట్లేసిరి సీ!


    జిలేబి

    ReplyDelete


  48. సాయంత్రం వేళ ప్రియత
    మా యమహో సూర్యకాంతమై చంపకుమా
    ఓ యమ్మి జిలేబీయము
    గా! యావత్తుగ వడి సుడి గాలివి నీవే


    జిలేబి

    ReplyDelete


  49. చైంచిక్ ! జాల్రా :)



    శర్మాజీ! శాస్త్రీజీ
    వర్మా జీ! రెడ్డి గారు! బంధువు లారా!
    అర్మిలి యెరిగిన వారమ
    ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా



    జిలేబి

    ReplyDelete


  50. Ball back to the court :)


    మర్మము లేదు! కల్లయు సుమా మన వారికి లేదు! శంకరుల్
    హర్మిక మున్ కవీశులకు హార్దము పేర్మియు మేళవింపగా
    నర్మిలి తోడు కట్టిరి! సనాథుఁల మైతిమి! చక్రవర్తి! యే
    ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే?



    జిలేబి

    ReplyDelete


  51. తీర్మానముగ సనాతన
    ధర్మమ్మును నాఱఁగట్టు దండధరులమై
    నర్మటు కాంగీయులమై
    ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా!



    జిలేబి

    ReplyDelete


  52. చదివించ లేక పిల్లల
    మదిని కలవరపడు వారి మన్నన గొనెనోయ్
    పదికాలమ్ముల బాటుగ
    కుదురుగ జగనన్న వారి గొడివెల తీర్చెన్!


    జిలేబి

    ReplyDelete


  53. అందరు చూచిరయా పసి
    కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్
    కొందలపడుచున్ మదియే
    సుందరులది వెన్నెపూస చువ్వన కరుగున్


    జిలేబి

    ReplyDelete


  54. అసురుల్ దూరిరి మారు వేషముల నాహాకార ముల్చేయుచున్
    కసితీరంగను పేలె బాంబులకటా కార్పణ్యమేహెచ్చగాన్
    మసియై బూడిద యై జనాళి చెదరన్ మాగన్ను కన్మోడ్పులో
    పసికందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్!


    జిలేబి

    ReplyDelete


  55. పేరు రాజుగారయ్యెను! వేష్టితముగ
    కొలువు దీరియుండుననుచు కోరి పెండ్లి
    యాడె! చూడగా భావరాజాయె నరరె
    పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థు డనుచు!

    జిలేబి

    ReplyDelete


  56. మగరాజైనట్టి పతి య
    నఁగ నర్థ మిడె సతి, వ్యర్థు డనుచు భళారే
    జగడములకు కాణాచి! గ
    డగడయనుచు నారుదూఱు డంకతనముతో!


    జిలేబి

    ReplyDelete


  57. Before and after :)


    స్థితిపదుడంచు కాలుపడి శ్రీమతియై పలు మార్లు వందన
    మ్ము తనకు జేయు తొల్లి దినముల్! కొమరుండొకడే జనించగా
    మతికలదాయటంచు పదిమార్లను శ్రీపతికైన తప్పదే!
    పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే!


    జిలేబి

    ReplyDelete


  58. జైగొట్టిముక్కలయ్యా
    మీ గళమునదె తెలగాణ మించారంగన్
    సాగించండయ్య ప్రగతి
    మా గట్టిగ నెలకొనంగ మాపై నేలా :)


    నేనన్లే !


    జిలేబి

    ReplyDelete


  59. ఓడలు బండ్లగు! బండ్లున్
    చూడగ నోడలగు నయ్య చువ్వన జనులే
    గాడిద లై ఓట్లేయన్
    మోడీ జగనుండిపుడు నమో ! రేపెవరో !

    జిలేబి

    ReplyDelete


  60. నేనెఱిగిన దెంతయ్యా
    నీ నగు మోమొక్కటె యిలని తెలుసు నయ్యా
    నీనామంబొక్కటె రా
    మానా కెఱుక ! మిగిలినది మా జైగొట్టే


    అవినాభావ సంబంధము :)



    జిలేబి

    ReplyDelete


  61. పూజిస్తాడోయ్ రాళ్లని
    నాజూగ్గా యెగసి తన్నునాతడె చూడన్
    బాజారువీధిని జిలే
    బీ! జర భద్రంబు సూవె పిచ్చోళ్ల భువిన్


    జిలేబి

    ReplyDelete


  62. పూరింపవలసిన సమస్య ఇది...
    "సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్


    పూరణ

    వినుమా జిలేబి పుణ్యము
    సనుకొనుచు గడింప మడియు సంస్కారము లే
    ని నరుఁడె సత్పురుషుఁ డగున్
    పనుపడు సమయమ్ము కుంటు వడనీకింకన్


    జిలేబి

    సనుకొను - పూనుకొను

    ఆంధ్రభారతి ఉవాచ

    కంది వారి కామింటు :)

    దుష్కరప్రాసకు 'టిట్ ఫర్ టాట్' వంటి పూరణ. బాగున్నది. అభినందనలు.
    'సనుకొనుచు'?


    జిలేబి

    ReplyDelete


  63. ఇంతా అంతా కాదు ! మరీ దుంపతెంచే సంస్కారంబగు ప్రాసయే కవివరా చాటేసెదన్ డప్పుతో :)


    సంస్కారంబును నేర్వగా దగును విస్తారమ్ముగా మేల్మిగాన్
    సంస్కారం బిసుమంత లేని నరుఁడే! సత్పూరుషుండై మనున్
    సంస్కారమ్మును నేర్చి నెయ్యపు మదిన్ సౌశీల్యుడైనెక్కొనన్
    సంస్కారమ్మునకాతడే పుడమిలో స్కంభమ్ముగా నిల్చురా!



    జిలేబి

    ReplyDelete


  64. మనసారా తెలిపెదె నా
    దు నమస్కారముల మన విదురులకిపుడె సూ
    వె నుతుల తోడు జిలేబీ
    పనుపడి తెలిపెదను ధన్య వాదములివియే


    జిలేబి

    ReplyDelete


  65. No holidays get to job my hubby



    గుండమ్మా! సెల వీయవె
    వండను నేనొక్కనాడు పతినే! వినవే!
    మెండుగ వేడంగ పతియె
    పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్!



    జిలేబి

    ReplyDelete


  66. పిండిని రుబ్బినాడను ప్రవీణత చూపుచు పొద్దుగూకులన్
    దండిగ వండి వార్చితి నిదానము గా రుచిగాను రుచ్యుడన్!
    భండిలుపై దయన్ గొనుమ! ప్రార్థన చేయగ త్రోసివేయుచున్
    పండుగనాఁడు వండనని భామ వచించెను ఖచ్చితమ్ముగా!


    జిలేబి

    ReplyDelete


  67. పిండిని రుబ్బుటెట్లు :)


    మయిలే! పూంగుయిలే! జిలేబి! అరుగిల్ మాందోప్పు సింగారియే!
    వయనాట్టిన్ మళయాళపెణ్మణి! సఖీ! వాల్తేరు కార్మేఘమా!
    సయిఫాబాదు షకీల! కన్నడ రమా! జాల్రాకుమారీ! మిఠా
    యి! యిదే పద్దెము! వ్రాయగాను వరదై యీప్రొద్దు మత్తేభమౌ


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఒక్క ముక్కా అర్థం కాలేదు గానీ “మళయాళం” కరక్ట్ కాదు, ఆ భాష పేరు “మలయాళం”. చాలా మంది ఈ పొరపాటు చేస్తుంటారు. ఆ భాష లిపిలో മലയാളം అని వ్రాస్తారు ... రెండవ అక్షరానికి (ല = ల) చివరి అక్షరానికీ ( ളം = ళం) తేడా గమనించండి. మీకు తమిళ లిపితో బాగా పరిచయం ఉంది కాబట్టి మీరు సులువుగా గ్రహించగలరు 👍.

      Delete

    2. వినరా వారు,

      మలయపర్వతము చుట్టుపట్టు దేశము మళయాళము. మళయాళపు‌ భాష మలయాళము . :)


      మరీ జిలేబీయమే :) తెలుగులో రాయవచ్చు మళయాళమని :)

      జిలేబి :)

      Delete
    3. అలాగాండీ? “మలయ” సంబంధిత పదాల్లో “ల” శబ్దం “ళ” గా మారిపోతుందాండీ 🙄? మరి “మలయానిలము” / “మలయమారుతము” పదాల్లో అటువంటి రూపాంతరమేమీ జరుగుతున్నట్లు లేదే 🤔? ఏదోలెండి, భాషాజ్ఞానం బొత్తిగా లేనివాళ్ళం, మీ ముందరేం కుప్పిగంతులు వేస్తాం 😩?

      అసలు మీ కలానికి అడ్డేముంది? కానివ్వండి 🙏.

      Delete

    4. స్వామీ!

      అది నా మాట కాదు :) ఆంధ్ర భారతి పరిశీలించుడీ :)



      జిలేబి

      Delete


  68. కొక్కొరకోయని చెవిలో
    చుక్కాయమ్మా చిలిపిగ సుహితముగా యెం
    చక్కగ మేలుకొలుపుటకు
    పక్కన కొస్తావు నీవు పడతి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  69. భాయీ గ్లాసుల కొలదిగ
    పాయసమున్ త్రాగినావు! భళి జబ్బదె రా
    దోయీ? పడుకోవోయ్ ! నీ
    ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్


    జిలేబి

    ReplyDelete


  70. ఆకాశవాణి కి పంపినది

    ప్రేయస్సునుగానగ భళి
    శ్రేయస్సునుకై నిడదగు శ్రీకర మైనన్
    సాయమ్మొనర్ప రాన్ సరి
    యాయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్!


    జిలేబి

    ReplyDelete


  71. అల్తాఫ్ హుసైను యునానీ డాక్టరు ఉవాచ !


    భాయీ! పాయసమున్ గ్రసింప జనులే పాల్కోవ,జాంగ్రీలతో
    మాయారోగము దాపురించు! తృటిలో మాన్పంగ మార్గంబిదే
    ఆయాసమ్మను నామయమ్మును సునాయాసమ్ముగా తీర్చగా
    నాయుర్వృద్ధికి రోగి కివ్వఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్!


    జిలేబి

    ReplyDelete


  72. నేనొక త్ర్యక్షరి వ్రాసితి
    ప్రాణాలిస్తా చదువగ పదపడి‌ రండోయ్
    మోనాలీసా తెలుసా ?
    మానానమ్మ మరియా ? కమాన్ ! తెలుపండోయ్


    జిలేబి

    ReplyDelete


  73. జాబిలిలాజిలిజిలిబిలి
    లాబిజిలీలాజిలేబిలాలబలబలా
    లేబిజిబిజిజుజుబీలా
    బాబాబాజాబజబజబాజాలాలా :)

    జిలేబి

    ReplyDelete
    Replies


    1. జాబిలిలా జిలి జిలిబిలి
      లా బిజిలీలా జిలేబిలా లబలబలా
      లే బిజిబిజి జుజుబీలా
      బాబా బాజా బజబజ బాజా లాలా :)


      జిలేబి

      Delete


  74. నెమలికి అందము కన్నుల
    య! మన నెమలికన్ను కందమయ పరిచయముల్
    సుమనోహరమగు పొత్తము
    లు, మనుజులు వికాసమున్ పలువిధముల గనన్!


    జిలేబి

    ReplyDelete

  75. http://telugupadyam.blogspot.com/2008/05/blog-post_25.html


    అల్లసాని వారి అల్లిక జిగిబిగి


    అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
    పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
    స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
    గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్


    ReplyDelete


  76. గణగణ గంటలు మ్రోగగ
    గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్,
    వణికెడు చలిలో తృటిలో
    జనగణ మనయనెడు పాట జగతిని మ్రోగున్


    జిలేబి

    ReplyDelete


  77. కలతలు లేని మానవుల క్షాంతిని చూచుట సాధ్యమౌనకో?
    పిలిచిన వేళ తీరునదె వేంకటనాథుని నోరచూపుల
    న్గలతలు; రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్
    తలచిన నాటి నాయకుల త్యాగమునే, కలతల్ జనాళిలో!


    జిలేబి

    ReplyDelete


  78. బాహ్లిక పారశీక శకధారా ఆరట్ట ఘోట్టాణ దేశాలనుండి తెప్పించిన గుర్రాలు...

    వామ్మో! ఏ దేశాలండి‌ ఇవి‌?/



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వివరణ వచ్చినట్లు లేదు ఇంకా. హేవిటో మీ ప్రశ్నకు జవాబు వస్తే మేం కూడా ఆ వివరం తెలుసుకోవచ్చు అనుకున్నాను. సర్లెండి ఆ బ్లాగరు గారికి వారి ప్రాధాన్యతలేవే వారికుంటాయి కదా.

      జవాబు వచ్చేలోగా మన ఊహాగానం మనం చేద్దాం. నా పరిమిత పరిజ్ఞానం ప్రకారం ... ఇవన్నీ భారతగేశానికి పశ్చిమ దిక్కునున్న మధ్యప్రాచ్య దేశాలేమేనని తోస్తోంది. పై పేర్లలో “పారశీకం” మనకు పరిచయమే కదా .... Persia or modern day Iran, ఇక “బాహ్లిక” అంటే ఇప్పటి బలూచిస్తాన్ అయ్యుండచ్చేమేనని అంచనా. తతిమ్మావి నాకు అందడం లేదు. ఏమైనప్పటికీ ముఖ్యంగా ... మేలుజాతి గుర్రాలు ఎక్కువగా ఆ వైపు దేశాలకే చెందినవని ప్రాచుర్యంలో ఉన్న folklore కదా. అరేబియా గుర్రం అంటారు కదా.

      ఎలా ఉంది నా ప్రయత్నం 😎?

      Delete
    2. వినరా వారు,

      బావుందండీ - మంచి కవిత్వంలాగా... భావుకతతో. 🙂🙂🙂

      జిలేబి

      Delete
    3. As usual మీ వెటకారం.
      మీరిక్కడ వ్రాసిన వ్యాఖ్య ఏ బ్లాగులో వచ్చిందో నాకూ తెలుసు. ఆ బ్లాగరు గారికున్న “కవిత్వం, భావుకత” నాలో లేవు లెండి.

      కాబట్టి, మరో మాట చెప్పండి.

      Delete

    4. వి రా వారు,

      మంచి ప్రయత్నం చేసారు, ఊహాగానాలు కూడా బాగా వచ్చాయి 👌. ఏమనుకోకండి గానీ మిగిలిన వాటి గురించి కూడా వ్రాస్తే మరింత బాగుండేదని నా అభిప్రాయం.




      జిలేబి

      Delete
    5. https://te.m.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Himabindu_by_Adivi_Bapiraju.pdf/97

      Delete
    6. థాంక్యూ, థాంక్యూ “జిలేబి” గారు. తతిమ్మావి ఛాయిస్ లో వదిలేశానన్నమాట 😁😁. అసలు సంగతి ఆ మిగిలిన మూడు పేర్లు - “శకధార, ఆరట్ట, ఘోట్టాణ” - మరీ పాతాళభైరవి మంత్రాల్లాగా అనిపించడంతో వాటి జోలికి వెళ్ళలేదు 😳. ఇప్పుడు మిత్రులు నీహారిక గారు అడివి బాపిరాజు గారి గోన గన్నారెడ్డి లింక్ ఇచ్చారు ఇక్కడ (thanks to her). అయితే దాంట్లో ఉన్న అశ్వవర్ణనలో “ఆరట్ట” తగిలింది కానీ “శకధార, ఘోట్టాణ” లేవు.

      “శకధార” ను కందహార్ కు తగిలిద్దామా అనే యోచన చేశాను గానీ ... మళ్ళీ నాకే నచ్చలేదు 🙂😁.

      సరే, ఊహాగానాన్ని మరి కాస్త సాగదీస్తే ... broad గా చెప్పాలంటే ఏ ఆఫ్ఘనిస్తానో, కిర్గిస్తానో, అటువంటివే ఆ దిక్కుగానున్న ప్రాంతపు మరో దేశాలో అయ్యుండవచ్చనిపిస్తోంది. ఇవన్నీ చాలా మట్టుకు పాత Silk Route వెంబడినున్న ప్రాంతాలేమో కూడా, అందువల్ల మేలుజాతి అశ్వాల ఆవశ్యకత మీద గురి పెట్టడానికి అదీ ఒక కారణం అయ్యుండవచ్చేమో ... రౌతులకు, రథాలకు, యుద్ధాలకు పనికిరావడం అనే ముఖ్యోద్దేశంతో బాటు (ఇది పూర్తిగా నా స్వంత పైత్యం సుమండీ, కాబట్టి ప్రామాణికత ఏమిటి అని అడగకండి) ?

      మన ప్రయత్నం, ఊహాగానం సరదాగా మనం చేసినా ... కాలక్రమేణా కొన్ని దేశాల భౌగోళిక సరిహద్దులు చెరిగిపోవడం, ఆక్రమణలు, పేర్లు మార్చెయ్యడం వగైరా చరిత్రలో కనిపిస్తూనే ఉంటుందిగా, కాబట్టి ఆ కాలపు దేశాలకు ఆధునిక పేర్లు ఏమిటి అన్నది పరిశోధకులకు కొట్టిన పిండి అయ్యుంటుంది, ఏమంటారు?

      Delete


    7. ఓ మోస్తరు గా దగ్గరికి వస్తున్నామండోయ్ నా వంతు కైంకర్యము ఆంధ్ర భారతి digging :)


      ఆరట్ట -


      పంజాబులో ఈశాన్యభాగమునకు ఆరట్టమని పూర్వవ్యవహారము. అది గుఱ్ఱములకు ప్రసిద్ధి చెందినది. కావున ఉత్తమాశ్వము ఆరట్టజ మనఁబడుచున్నది.


      ఘోట్టాణము -
      Khutan, a name of Tartary. Rukmang. i.19. Hence, a horse of that country. R. i.86. A. iv.36.

      (Khotan or Khintan in Central Asia);


      శకధార - no clue yet.


      చూద్దాం మన శ్యామలీయం వారో వేరే ఎవరైనా గుర్రం ఫామిలీ నేము వారో ఓ చెయ్యి వేస్తారో చూద్దారి :)


      జిలేబి

      Delete


    8. ఆంధ్రభారతి తవ్వకంలో ఇదేదో కొంత interesting గా వూడి‌పడ్డది :)/మరి‌ యిదెక్కడుందో ఆంధ్రా లో :)


      శకంధర -

      ఆంధ్రదేశమునందలి ఒక సామంత రాజుయొక్క పట్టణము. ఒకానొక దేశము అనియు చెప్పుదురు


      జిలేబి

      Delete
    9. మరింకేం, మూడింటిలో రెండు పరిష్కరించేశారు మీరు, సెహబాసు👏. మొత్తానికి మీ తవ్వకంతో జల పడింది 🙂.

      మూడవది “శకధార” ... దాని బదులు “శకంధర” అనుకుందామనుకున్నా “ఆంధ్రభారతి” వారు కాస్త confusion పెట్టారుగా - సామంతరాజు యొక్క పట్టణమూ అంటున్నారు, ఒకానొక దేశమూ అంటున్నారు🤔. మరి మీరు ఉదహరించిన వారి “నడిరేయి సరదా పూరణ” లాంటిదేమన్నా వస్తుందేమో చూద్గాం 🙂 (jk 🙂).

      Delete


    10. కొత్తావకాయ ఉవాచ -


      మంచి రీసర్చే చేయించారుగా నాచేత. ఇవిగోండి వివరాలు. అంతలేసి దూరాలనుంచి గుర్రాలని ఎలా తెప్పించేవారో!

      బాహ్లిక - Bactria, situated in north of Afghanistan

      పారశీక - పర్షియన్

      శక - Scythian - Middle Eastern

      ధారా - మాళవదేశంలో ఒక భాగం అంటారు. పంజాబు, రాజస్థాను దగ్గర్లో

      ఆరట్ట - ఎక్కువ మాట్లాడేవారు ఉండే దేశమట. పంజాబే మళ్ళీ

      ఘోట్టాణ - Khintan in Central Asia, మంగోలులు


      జిలేబి

      Delete


  79. జారెను సర్రుమనుచు బా
    జారు లొకప్పుడకట కలుచపడి, ప్రభుతయే
    మారుచు, రాన్ మోడీ బా
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే!


    జిలేబి

    ReplyDelete


  80. పారగ దేశమందు విలువల్, మన నేతలు కొల్లకొట్టగా
    కోరి జనాళి యందల‌ము క్రొత్త దునీడుల చేయి చేర్చగా
    మారుచు నా ప్రభుత్వ మసమానముగా తడకట్టు వేయగా
    జారకళావతంసులకు, స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్!


    జిలేబి

    ReplyDelete


  81. ఓ యబ్బో ! వార్లకే బాగా తెలుసు సూవె రాష్ట్రపు గతి ! నీకేమి తెలుసే పూబోడీ :)


    గట్టుని కూర్చొని రమణీ
    వట్టిగ సలహాలతో కవనములతో కొం
    డాట్టములతో దినమ్ముల
    నెట్టితివే రాష్ట్రపు గతి నీకేమెరుకే



    జిలేబి

    ReplyDelete


  82. చలివిడి తోడా పాకుం
    డలనప్పాల ఘుమఘుమలిడన్ చేసిరి నా
    డలవోకగ మా గృహమున
    భళి చేయనిపుడు తినుటకు ప్రజలేరండీ :)


    జిలేబి

    ReplyDelete


  83. నేనొక అనానిమసు; పో
    తాను కవితలను వెతుకుచు తవికల రాస్తా
    లో నసుగుచు నీల్గుచు వే
    స్తా నా కామింటులను కసబిస కసబిసా :)


    జిలేబి

    ReplyDelete


  84. అయ్యరొ వినుడు సరి యైనట్టి వసతి, ర
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు
    కట్టుడు తిరుమాళిగ నిపుడె ముదిమిని
    సాయ మైవెలయు" బసాలు పలికె!


    జిలేబి

    ReplyDelete


  85. A terrific treat between every dip :)


    కవనము, కైపదమ్ములను కాంతలుగా భళి మత్తుదేల్చెడా
    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే
    జవనపు వేగమై నవ వసంతము చేరగ, వర్ణతూలికన్
    దవలిని నద్దు వేళల ప్రదాయిగ ముద్దుల తేల్చు గేస్తుడే!


    నారాయణ!
    వసంత పంచమి శుభాకాంక్షలతో


    జిలేబి

    ReplyDelete


  86. నా కామింటునదేలం
    డీ కనబడనీక దాచిరే బ్లాగులరా
    యా!కత యందేమియులే
    దే కొత్తగ నందుకని పథికుడా పోపో :)


    జిలేబి

    ReplyDelete


  87. ఆటవెలది పాదగర్భిత కందపూరణ జిలేబీయము :)



    మిన్నగ మగడిని కోరుము
    తిన్నగ కట్టుకొనుము వసతిగ పువుబోడీ
    యెన్నగ మేలగు ర "సవతి
    యున్న సతికి సౌఖ్యమబ్బు" ను కదా పుడమిన్


    జిలేబి

    ReplyDelete


  88. మోదీ కన్న జగనుడే
    దీదీ కన్నను జగనుడె దిల్దార్ ఆద్మీ !
    వేదన పడి మండలినే
    పోదారియనుచు తరిమెను పోవె జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  89. ధగ్దంబై యజ్ఞానము
    వాగ్దేవినిఁ గొల్చువాఁడు పండితుఁడగు నా
    వాగ్దేవి కరుణ మీరగ
    స్నిగ్ధత మెరయు పలుకుల పసిడిమెరుగువలెన్


    జిలేబి

    ReplyDelete

  90. వాగ్దేవీ! గను దూరదర్శనులిటన్ ప్రశ్నించిరే శంకతో
    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా?
    వాగ్దేవీ! దయ నీదు గా కుదురదే ప్రావీణ్యతల్ చేయగా
    స్నిగ్ధాముగ్ధముహుర్ముహుర్లుఠితమై శీఘ్రమ్ముగాపూరణల్


    జిలేబి

    ReplyDelete

  91. కంద సమస్యా పాద గర్భిత తేటగీతి :)

    గురుతరముగ వాగ్దేవినిఁ గొల్చు వాఁడు
    పండితుఁడగు నాణ్యత గల్గి భాసిలు భువి
    లోన శంకరాభరణములో కవీశు
    ల వలె యనుమాన మింకవలదు జిలేబి


    జిలేబి

    ReplyDelete


  92. జగడముల వేయ వలసిన
    తగువిధముగ వేసి మీదు తగని తలములన్
    తగవుల సున్నితముగ నా
    పగ, వానికి దాసుఁడగుటె పౌరుషము గదా!


    జిలేబి

    ReplyDelete


  93. విభీషణుడి మాటగా

    మగపంతమ్మును మీరి యోచనగనన్ మాన్యుండు శ్రీరాముడా
    పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా
    తగదీకార్యము! పల్కెదన్ విడువుమా దాక్షిణ్యమున్ చూపుమా
    జగదానందము జానకీరమణుడిన్ సంత్రాణమౌ రావణా!

    జిలేబి

    ReplyDelete


  94. మానాన్నే మానాన్నే!

    పోస్టాఫీసు కత, 2000 రూపాయలు , 2.5 lakhs కత యెంత రక్తి కట్టించినావు సామీ‌ :)

    వచ్చి చూసి మోస పోతినిగా :)



    జిలేబి

    ReplyDelete


  95. తగవులు కూడదు ముష్కరు
    లగాంచి చేయదగు నయ సలాముల కాంగ్రె
    స్సు గరిష్ఠుఁల తీపిపలుకు
    పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా!


    జిలేబి

    ReplyDelete

  96. కరోనావైరస్ అదునుగా చైనాలో మాస్కుల ధర పెంచి అమ్ముతున్నారని ఒక ఫార్మసీకు భారీ జరిమానా

    👆(news item in Deccan Chronicle (Hyd) dt 30-01-2020 page-11)

    I am sooooooooooo happy 👌 . అసలు జైల్లోనే పెడితే పోయేది. ఈ గట్టిదనం మన ప్రభుత్వాలకు ఎప్పుడొస్తుందో గదా 😒 ?

    ReplyDelete
    Replies


    1. అచ్చమైన, స్వచ్ఛమైన, తెలుగుతనానికి ప్రతీకలా
      కామింటేరు వినరా వారు :)


      జిలేబి

      Delete
    2. మరీ దూరదర్శన్ శాంతిస్వరూప్ తో పోలికా? కాస్త ఎక్కువవలా? 🤔

      Delete

    3. ఇరువురి పేర్ల లోనూ నరసింగం వుంటేనూ :) మీరేమో సేఠూజీ వారేమో దర్శన్ జీ :)

      BTW, SBI షేరు మరీ ఢమఢమ లాడించేసేరేమిటి ఇవ్వాళ :) చీఫ్ గారేమో టెలికాం కి ఎగస్ట్రా ప్రొవిషన్ పెట్టలేదూ అంటూంటే స్టాకేమో రేపటికి ఎగబాకుతోంది :)


      నారదా!
      జిలేబి

      Delete


  97. కంద సమస్య పాద గర్భిత తేటగీతి :)

    పోకడ చూస్తావుంటే పూసపాటి వారిలా జిలేబీ ఇచ్చిన ఛందము తప్ప వేరు దాని లోనే పూరించెద నంటూ తయారు :)

    ధరణిలో పగవానికి దాసుఁడగుటె
    పౌరుషముగ దాల్చు తలని వర్ధిలంగ
    సూవె వంగిన చెట్టదె సురకరువలి
    దాటి మీరి నిలుచును కదా జిలేబి!


    జిలేబీయము
    జిలేబి

    ReplyDelete


  98. సోమరులగుచు కూర్చున్న, చురుకుదనము
    లేక నీరసించినను జిలేబి పుడమి
    యందు రాదురాదిక సహాయమ్ము, పైన
    మంచివారికి రాదులే మంచిరోజు


    జిలేబి

    ReplyDelete


  99. ఆకాశవాణికి పంపినది



    ఇంచుకైనను మానవుండిల నీప్సితమ్మును చూపకే
    కొంచెమైనను యత్నమున్నిక కూర్మితోడుత చేయకే
    మంచివారల కెంచి చూడగ మంచిరోజులు రావులే
    పంచుమయ్యరొ దేశమందున భాజనమ్మగు బుద్ధులే!


    జిలేబి

    ReplyDelete


  100. తోడ్పడ డెవ్వరికిన్ తను
    తోడ్పడ డాతడు జిలేబి తొందరపడగా!
    తోడ్పడు తనదగు కైవడి,
    తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్!


    జిలేబి

    ReplyDelete


  101. కంది వారివ్వాళ సెలవా :)


    తోడ్పడడాతడౌ మనము తొందర చేయగ నిక్కమౌ సఖీ
    తోడ్పడడే! ప్రధానముగ తొయ్యలి కావలె మేల్చరిత్రముల్!
    తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్
    తోడ్పడినాడు ధర్మమదె తుండుపడంగ సమంజసమ్ముగా!


    జిలేబి

    ReplyDelete


  102. సలహా యిచ్చిన దెవరు ? శకునియా ?


    అనుమానమేల దుర్యో
    ధన!కృష్ణుని సాయమడుగు తా తోడ్పడఁ డ
    ర్జునునకు హరి దోఁచిన రీ
    తి నుడివెదన్ ఖచ్చితమ్మిదియె వెడలుమికన్!


    జిలేబి

    ReplyDelete


  103. అర్ధ రాత్రి లగనమాయె నన్నపూర్ణ
    పెండ్లి కూతురు! కొమరుడు ప్రేతగోపు
    డౌర! దీనిలో తప్పేమి డప్పు వేయి
    పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి!


    జిలేబి

    ReplyDelete


  104. ఇల పిలవాండ్లుగా జనన మీ శివపాడున పెంపుగాననా
    వలపులు మీరె నిర్వురికి ఫారెను వెళ్ళిరి బుద్ధిజీవులై
    కలయిక కోరె డెందములు కార్డులు వేసిరి ప్రేమమీరగా
    పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్!


    జిలేబి

    ReplyDelete


  105. ఎదని శవమయి నావే జిలేబి మదిని
    ఖననమైనావె పువుబోడి కానవచ్చె
    నగ్నిహోత్రమ్ములట జజ్జినకరినకరి
    పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి


    జిలేబి

    ReplyDelete


  106. నమ్మితి నమ్మితి ననెదవు!
    నమ్మిక యేడయ్య నీకు నాదు సృజనపై
    నిమ్మళమున్ తృటి లోనన్
    వమ్ముపఱచుకొనెదవు భవబంధమ్ములతో


    నేనన్లే

    జిలేబి

    ReplyDelete


  107. రద్దుల వైరస్సులహో
    రద్దగును తెలుంగునాడు రావడి తోడై
    సుద్దుల చెప్పెద వినుడీ
    వద్దండీవీరు మనకు పసలేదండోయ్


    జిలేబి

    ReplyDelete


  108. వలయును సత్యాగ్రహముల్
    వలయు నిరశనములు చూప వలెను స్థిమితబు
    ద్ధులను కనుక యంబటిపర
    కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్!


    జిలేబి

    ReplyDelete

  109. మొగుని మొటిక్కాయలనం
    గ గుబులు పడకే జిలేబి కరుణామయుడా
    భగవంతుడొసంగెడు మం
    చి గూర్చెడు పరీక్షలేను! చింతించకుమా

    అయ్యరువాళ్ ఎక్కడున్నారండీ :)


    జిలేబి

    ReplyDelete


  110. Oh my juicy crispy mouth watering dishes what have you all done to us ! the more we eat the more hungry ghosts we are :)

    కాల మహిమ నెటుతిరుగ కన్నులట క
    నబడె తినుబండముల దుకాణములు! కృష్ణ!
    తిండి తిండికి నడుమ కతికెడు చిన్న
    తిండి మానఁగ నాకలి దీరిపోయె


    జిలేబి

    ReplyDelete
  111. నాలుగైదు రోజుల నుండి మీ మాట వినబడలేదు “జిలేబి” గారూ, ఏమిటి సంగతి ? అంతా కుశలమే గదా ?

    ReplyDelete
    Replies

    1. వచ్చె వచ్చె నెనరుల్స్ ఉభయకుశలోపరి
      శర్మ గారితో ముచ్చట్లాడ్డానికే సమయం సరిపోయే :)



      జిలేబి

      Delete
    2. తిరిగి ప్రత్యక్షమయ్యారు సంతోషమే గానీ మీరు చెప్పిన కారణం నిజమేనా (“శర్మ గారితో ముచ్చట్లు”)? శర్మ గారి ప్రస్తావన గనక తీసుకొస్తే నేను శర్మ గారితో cross check చేసుకోగలనని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి ... అదే మాటా, మరో మాటా?

      (jk 🙂)

      Delete

    3. మాట దాటని వారమండోయ్ :)


      జిలేబి

      Delete
    4. ఓకే ఓకే. మేమూ అంతే లెండి 🙂.

      Delete


  112. బ్రహ్మాండముగా చెప్పిరి
    "బ్రాహ్మముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ"
    బ్రాహ్మణుడా! ఓ నా యం
    బ్రహ్మా! జోహారులయ్య పండిత పుత్రా!


    జిలేబి

    ReplyDelete


  113. బ్రహ్మణ్యోజపమాలికాత్కరణకాభ్యాంప్రాణయోర్వ్యాప్తత
    త్బ్రహ్మారాధనచేతనావలయసత్కార్యేణవిస్తారహృ
    త్బ్రహ్మానాంకరుణామహత్వసతియేతాంస్థిత్వసంప్రాప్తితా
    బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా!


    జిలేబి

    ReplyDelete


  114. "కాకి - దాది - పాపి- వావి"
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
    భారతార్థంలో
    నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి

    ***

    శ్రీకృష్ణ ఉవాచ -


    బావా! విధిరాతగ లె
    మ్మా వేదాదిని స్మరించుమధిపా! పిహితం
    బై విజయము కలదయ్యా
    నీవేకాకివనుకొనకు! నివ్వటిలు గనన్!


    జిలేబి

    ReplyDelete


  115. గైజని పిలవవలదు బీ
    లేజి జిలేబీలము వినలేమా మాటన్
    రైజింగు ఓల్డు పీపుల్
    గా జర మము పిలువవమ్మ కంబుగ్రీవా!


    జిలేబి

    ReplyDelete


  116. మీ పూరణ బాగున్నది !
    మీ పూరణ యద్భుతమ్ము ! మించారెనుగా
    మీ పూరణయు! ప్రశస్తము
    గా పూరించిరి విరివిగ కవివరులారా!


    జిలేబి

    ReplyDelete


  117. కలిసె జగనన్న మోదీ
    ని లావుగా రాష్ట్ర వృద్ధిని తలచి కోరెన్
    బలమైన సాయమున్ ప్రో
    ద్బలమ్మును జిలేబి ప్రగతి పథము‌న సాగన్

    జాల్రా
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఈ “జాల్రా” అంటే ఏమయుండనోపు “జిలేబి” గారూ?

      Delete


    2. జాల్రా తెలియదా ? తెలుగు వారేనా మీరు వినరా వారు :)



      జిలేబి

      Delete
    3. మీ ముందు మేమెంతండీ? ఇక్కడే కింద “నాకు కవిత్వము రాదోయీ” అని మీరు ఫణిబాబు గారి మీద కట్టిన పద్యంలో “కవిత్వము” బదులు “తెలుగుతనం లేదోయీ” అని పెట్టి నా మీద పద్యం వ్రాసుకోండి ఇబ్బందేమీ లేదు గానీ ... ఆ “జాల్రా” అర్థం మాత్రం చెప్పండి.

      Delete

    4. :) మీరూ పద్యాలు రాసేస్తున్నారండోయ్ వచ్చేయండి సభాస్థలికి :)


      జాల్రా అనగా చైంచిక్ :)



      జిలేబి

      Delete
    5. పిల్లి అనగా మార్జాలము 😾.

      Delete


  118. నౌకరి బ్యాంక్లోనా ?లా
    రీ కిటికీ నుండి యెక్కి రివ్వున చనినా
    వా కూటము చేరంగన్ ?
    ఓ కొమ్మా! చెప్పవే చిగురుటాకు చెలీ :)


    జిలేబి

    ReplyDelete


  119. పిసరంతయు సందియ మా
    బసిపై వలదు కడిమి గల పసిడి కళుకుతో
    డసలు సిసలైన పిల్లను
    ప్రసవించును బావ, యింకఁ బదిదినములలో!


    జిలేబి

    ReplyDelete


  120. మయికొను తప్పకన్, వలదు మల్లడి యీశ్వరి చేర్చు దార్ఢ్యమున్
    భయమిక లేదు! జబ్బదియు ఫట్టున వీడెను పుంజుకొంచు చే
    వయు తొడరంగ సౌరి యిక బంగరు దూడను సమ్మదమ్ముతో
    నయముగ బావ! యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా!


    జిలేబి

    ReplyDelete


  121. చైనా ట్రావెల్స్ బందంట :) మీకేమన్నా తెలుసా ఎవరికో :)


    ఓయీ కరోన! చైనా
    లో యిలియానా నడుము కులుకులను కున్నా
    మే యిట్లా దేశ విదే
    శీ యానములకరరే మసిని పూసితివే !


    జిలేబి

    ReplyDelete


  122. పులి కన్నం బెవరిడెదరు?
    పలికెనుగా కుర్రవాడు భళి కథకునిగా
    యిలలో వరటిల్లునతడె
    లలితా ! నీహారికయె భళా చెప్పెనహో :)


    జిలేబి

    ReplyDelete


  123. సుళువుగ తీర్పుల చెప్పు జ
    నుల చూడగ నచ్చెర వగును జిలేబీ నా
    కిలలో వారెట్లటుల పు
    యిలోటమే లేకయు పలికెదరో యనుచున్


    జిలేబి

    ReplyDelete


  124. చూసారా టెక్నాలజి
    వేసమ్ముల? వర్కగు విరివిగ నొక‌రికి తా
    వేసమ్ము వేయు మరొకరి
    కై సేవయు చేయకన్ ముకాబల యనుచున్


    జిలేబి

    ReplyDelete


  125. మీ కవిహృదయము మాకే
    మో కూసింతయు విభావము పడదుగ జిలే
    బీ!కాస్త వచనమున చె
    బ్తే కుహరమునొగ్గి వినుచు భేషనెదముగా :)


    జిలేబి

    ReplyDelete


  126. రండి! లవ్వాడుకొనెదము రాధనమిదె
    ప్రేమికుల రోజు; పిండముఁ బెట్టఁదగును
    వలదనిన వారలకిపుడె పడతులార
    యువకు లార వుద్యమముచేయుడి విడువక


    నారదా!
    జిలేబి

    ReplyDelete


  127. ప్రేయసి రాధనమ్మిదియె ప్రేమకు జోహరు పల్కవేసఖీ!
    రోయక నేఁడు ప్రేమికుల రోజని! పిండముఁ బెట్టఁగాఁ దగున్
    చేయకు డీయటంచు మన చేరువ గిల్లు జనాళికంతయున్!
    ధ్యేయము వారి దాయె తియతీపిని ద్రోలుట క్రూరదృక్కులై

    జిలేబి
    నారదా బారయ్యా :)

    ReplyDelete


  128. కలల తమ్మి యమ్మి లలిత :)


    పెట్టితి నుప్మా సింగము
    చట్టని మారంగ సాధుచరితని గానన్
    కొట్టిన చప్పట్లకు, బుజ
    తట్టులకు నెనరులు కలల తమ్మిని లలితన్



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. :) ఉప్మా పెట్టింది పులికండి!సింగానిక్కాదు.

      Delete

    2. దానికేమండీ మార్చేస్తే పోయే :)


      పెట్టితి నుప్మాను పులికి
      చట్టని మారంగ సాధుచరితని గానన్
      కొట్టిన చప్పట్లకు, బుజ
      తట్టులకు నెనరులు కలల తమ్మిని లలితన్ :)



      జిలేబి

      Delete


  129. ఉప్మాభి మాన్యుల్లారా జల్దుకొని కళలెల్ల నేర్చుకొనుడీ :)


    ఉప్మాభిమానముందని
    చెప్మాకోయ్ పూనుకొంచు చేయన్ సేమ్యా
    ఉప్మాయో ఆ నీరు
    ల్లుప్మాయో జీడిపప్పులున్ సుయ్యనగా :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నాకు తోడుగా సేమియా ఉప్మాభినులెవరయినా ఉన్నారా ?

      Delete
    2. నో.
      నో సేమ్యా ఉప్మా / నో అటుకుల ఉప్మా / నో బియ్యంనూక ఉప్మా. ఓన్లీ బొంబాయి రవ్వ ఉప్మా. వేరే రకపు ఉప్మాని ఒప్పం.

      Delete
    3. మా ఇంట్లో కూడా మీలాంటి నియంతలే ఉన్నారండీ ...ఏం చేస్తాం ?

      Delete


    4. బొంబాయి రవ్వ ఉప్మా
      సాంబారున్ తోడు చట్ని సాయించంగన్
      బొంబట్టుగ జుర్రుకొనుచు
      జంబలకడిపంబ యంచు సైయను సింహా :)


      జిలేబి

      Delete
    5. మహత్తరమైన బొంబాయి రవ్వ ఉప్మా మీద పద్యం కట్టినందుకు సంతోషం “జిలేబి” గారూ, బాగుంది👌.

      ఏ ప్రాంతపు రుచులు ఆ ప్రాంతం వారివనుకోండి ... అయితే ఉప్మాతో బాటు చట్నీ ఓకే కానీ “సాంబారు” ☹️? Hmm, ఆలోచించాలి 🙄.

      Thanks anyway,

      Delete


  130. స్వీపింగులో దిట్ట చీపురు కట్టయే !



    చీపురు కట్ట యనుచు ఛీ
    పోపో యనకు కమలమె ప్రబోధమని, జిలే
    బీ,పాయసమంచనుకొన
    కే ప్రజల మనసెవరికెరుకే యిందుముఖీ!



    జిలేబి

    ReplyDelete


  131. You know my favourite Upma :)


    వట్టి అభిమానినా ? నే
    నొట్టేసి చెబుత పసందగు టిఫిన్ లలితా
    గుట్టల కొలదిగ ఉప్మా
    తట్టయు నిండవలె పూర్తి తరముగ సుమ్మీ :)


    నారదా
    జిలేబి

    ReplyDelete


  132. క్రితం వారపు సమస్య దీని అజాపజా యేమన్నా తెలుసా? ఆకాశవాణి విశేషములేమిటో?

    మున్నెవరున్ను తాకుటకు ముంగల రాన్ కుదురంగలేదటన్
    మిన్నతి పోవుటేను సరి! మించరి యాతడు వచ్చి హొన్నుగా
    యన్నుల మిన్న చూపుల హయమ్మును త్రుంచగ నేలకాన్పు రా
    మన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్!


    జిలేబి

    ReplyDelete


  133. రాయండుప్మా పై లలి
    తా యద్భుతము మరియు త్వరితముగ టపా మీ
    ర్రాయక పోయిన రాసే
    స్తా యిక నేనే విడువను తరుణమ్మిదియే :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారు "ఉప్మా క్రానికల్" ఏదో తయారు చేసినట్లున్నారే? వివిధ బ్లాగుల్లోనూ గతంలో వచ్చిన ఉప్మాసంబంధిత పోస్టులను గుర్తు పెట్టుకుని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తున్నారు. Good job, మంచి పని చేస్తున్నారు 👌. ఉప్మా అభిమానుల కృతజ్ఞతలు మీకెల్లప్పుడూ లభించు గాక.

      అసలు "ఉపమా అభిమానుల సంఘం" శాశ్వత గౌరవ అధ్యక్షులవారు మహాకవి కాళిదాసు 🙏. అయితే ఈ కాలానికి తగినట్లు ... ఉప్మా అభిమానుల ప్రపంచ సంఘం యొక్క సౌత్ ఇండియా చాప్టర్ కి అధ్యక్షులుగా "వీరాభిమానులు" అయిన శ్యామలరావు గారిని పెడదాం. మీరు ఉపాధ్యక్షులు. సెక్రెటరీ గా మరో వీరాభిమాని మన బండి ఱావు గారిని నియమిద్దాం. జేరాలనుకునేవారందరికీ స్వాగతం.

      అందరి సహాయసహకారాలతో ఉప్మాద్వేషులను కూడా ఉప్మా అభిమానులుగా మార్చడానికి "conversion" ప్రయత్నాలు విజయవంతంగా చేస్తూ మన సంఘం వర్ధిల్లాలి 👍.

      Delete


  134. నాకు కవిత్వము రాదో
    యీ కందమ్ములు పిరియపు మీ ఛందమ్ముల్
    పై కొంతయు లేదు సుమా
    నాకవగాహన జిలేబి నన్ను విడువవే :)


    జిలేబి

    ReplyDelete


  135. అనుమానమేల కంటికి
    కనుపించని కీటకమ్ము గాలుని మించెన్!
    మనుగడ సార్సువలె‌ నిపుడు
    మనుజుల నూర్ధ్వగతినంపె మహిని కరోనా!


    జిలేబి

    ReplyDelete


  136. కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో
    యనితల పట్టుకోవలదయాకవి వర్యుడ! ప్రేతి వైనమె
    వ్వనికి జగద్వహమ్మున రవంతయు దోచును? వైపరీత్యముల్
    మనుగడ యెన్ని వచ్చె నిల మానవు లన్ దునిమాడె సోదరా!


    జిలేబి

    ReplyDelete


  137. "గణభంగమ్మగునండీ
    వినుడీ శతకంబని నుడివిన సరియగునం
    డి!నెనరులు మీకు సవరిం
    చిన రమణా"యని పలికిరి చీరావివలెన్ :)


    జిలేబి

    ReplyDelete

  138. కత్తి పోయె డోలు వచ్చె :) జాల్రా పోయె జాన్రా వచ్చె :)



    అనినన్ జాన్రా జానర్,
    వినవే యొకటే జిలేబి విదురులు తెల్పం
    గను వినవమ్మా! ఆ ఫ్రాన్స్
    జనులట పల్కుదురటా సుజను లనిరమ్మా‌ :)


    జిలేబి

    ReplyDelete


  139. వెలిసిపోయిన చీరను వెతికి వెతికి
    కుట్టి నగిషీలనద్దుచు కొంటెగాను
    జడ విసిరి లాగె మగడిని జంబలకడి
    పంబ పద్మార్పిత విలాసవతి జిలేబి :)



    జిలేబి

    ReplyDelete


  140. లతిక వచ్చె చేర్చె లావగు నాంధ్రభా
    రతిని కొత్త గాను రండి చూడ
    రండి విదురు లార ట్రాపునెట్టట జాల్ర
    యనగ తెన్గు హింది యాంగ్లమాయె :)



    జిలేబి

    ReplyDelete


  141. కోమల మైన సమయమున
    పాముకొనుచు పేర్మితోడు పరిణేతను, ఆ
    శ్యామల మేని గిరిధరుని,
    భామలు! గలువంగ సత్యభామ, సుతుఁ గనెన్!


    జిలేబి

    ReplyDelete


  142. "ప్రేమకు మారు పేరతడె! పేర్మికి నీయమ ముద్దుగుమ్మయౌ
    కోమలమైన వేళయిదె క్రొత్తడి మారెను తల్లిగా భళా
    శ్యామలు డయ్యె జన్మదుడు" జానుగు లొగ్గుచు మాటలాడిరా
    భామయు భామయున్, 'గలువ బాలుడు' పుట్టెను సత్యభామకున్"



    జిలేబి

    ReplyDelete


  143. "ప్రేమకు పెట్టినపేరగు
    శ్యామలుడాతడె మగండు" జానుగులొగ్గం
    గా మాటలాడు కొనిరా
    భామలు, "గలువంగ సత్యభామ, సుతుఁ గనెన్!



    జిలేబి

    ReplyDelete


  144. కవి కాదంటారు :) కవిహృదయమంఠారు :) హేవిటో :) ఎవరండీ వీరు :)


    నాకు కవిత్వము రాదం
    డీ ! కవిహృదయమ్ము వడివడి పదపడు సుమం
    డీ కావున నాదు తలపు
    లీ కామెంట్లని తెలిపితి లెస్సగ సుమ్మీ :)


    నారదా ఎక్కడున్నావయ్యా :)


    జిలేబి

    ReplyDelete


  145. సినిమాలో నిజ జీవిత
    మున జరుగు విషయములుండు ముక్తసరిగ, త
    ప్పనిసరి గా నిజ జీవిత
    మున సినిమాలోని విషయములు కనబడవోయ్ :)


    జిలేబి



    ReplyDelete
    Replies
    1. కాలేజీలో మా కెమిస్ట్రీ లెక్చరర్ గారు చెప్పారు ......
      All chromium salts are yellow in colour.
      All yellow salts are not necessarily chromium salts.

      Delete


  146. నారదా! ఎక్కడున్నావయ్యా :)


    నాటితి చెట్టుల నేనని
    సాటి కలరకో యటంచు చాటింపుల వే
    లా? టాంటాంలేల విదుర
    మేటిగ కర్తవ్యమిద్ది మిలనపు శ్రమగాన్!


    జిలేబి

    ReplyDelete


  147. మాటలాడువారుగలరు మత్తుదేల్చ!
    మంచి చేతలె నిక్కమై మానవులకు
    శ్రేష్టతరమగు; స్వచ్ఛత, చేవ కలిగి
    మీరు మార్గదర్శకులు సుమీ యువతకు


    జిలేబి

    ReplyDelete


  148. కవి వృషభులున్ను తెరువంగ కన్నుల తమ
    బాధ్యతల పంచు కొనగ వివరము గాను
    వ్రాసి నాడ నరసరాయ పండిన తల
    లలు కదా కొంతయు పలుకుల నరయుదుర?


    జిలేబి

    ReplyDelete


  149. అమ్మయె మూలంబగు నా
    దమ్మును చేర్చి యిటువంటి తరుణములో తే
    జమ్మును పుంజుకొనగ కా
    ర్యమ్ములను భుజముల పయి నిడన్ రాధనమై


    జిలేబి

    ReplyDelete


  150. ఎన్నాళ్ళిట్లు నిరీక్షణ ?
    దన్నుగ రావమ్మ పద్మ తరుణంబాయెన్
    మన్నిక గా వేయుము ద
    మ్మున్న వచనముల జిలేబి ముదితా రావే :)


    జిలేబి

    ReplyDelete